5, ఏప్రిల్ 2025, శనివారం

గవద బిళ్లలు

 గవద బిళ్లలు ( TANSILS )నివారణా మార్గాలు - 

     

. నోరు , దవడలు క్రింది భాగంలో లాలాజల గ్రంధులు వాచి గవద బిళ్లలు ఏర్పడుతాయి.ఇవి సామాన్యంగా తరుచూ బాల్య తరుణంలో పిల్లల్లో ఎక్కువుగా వస్తాయి . 

          ఇవి వచ్చినపుడు తినడానికి , త్రాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. గొంతు పచ్చి పుండులా మారుతుంది . గొంతుభాగంలో చేతితో తడిమితే ఉబ్బెత్తు స్పష్టంగా తెలుస్తుంది.

  

 గవద బిళ్లలు నివారణా మార్గాలు - 

 

* చల్లపిల్లి గడ్డలు , చారెడు మెంతులు , చారెడు నీటిలో వేసి మెత్తగా పేస్టులా రుబ్బి గొంతు వద్ద పట్టు వేయాలి . 

 

* కలబంద మొక్క ఒక రేక తీసుకుని ఒకవైపు పోర తీసివేసి చిటికెడు మంచిపసుపు చిలకరించి చిక్కటిరసం తీసి గొంతుబాగం మీద వేసి కట్టు కట్టాలి.

 

* రావిచెట్టు ఆకుని తీసుకుని ఆవునెయ్యి గాని , నువ్వులనూనె గాని గోరువెచ్చగా కాచి రాగి ఆకుకి దట్టంగా పట్టించి దానిని గవద బిళ్లల పైన వేసి కట్టుకట్టాలి .


 * దుప్పికోమ్ముని కాల్చి మసిచేసి ఆ చూర్ణాన్ని పూటకు పావు చెంచా మోతాదుగా రోజుకి 3 సార్లు ఇవ్వడం వలన గవద బిళ్లలు శీఘ్రంగా హరించి పోతాయి . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -

      

. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

             కాళహస్తి వేంకటేశ్వరరావు  

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                     9885030034

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  - అష్టమి - పునర్వసు -‌‌ స్థిర వాసరే* (05.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

గిట్టిన వారికి జననము

 *2057*

*కం*

గిట్టిన వారికి జననము

పుట్టిన వారికి మరణము పుడమినవిధియౌ.

గిట్టక నుండుట కొరకై

పుట్టిన ప్రతి మనిషిజేయు పూజలు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పుట్టిన వారి కి మరణము, మరణించిన వారి కి పునర్జన్మ ము ఈ భూలోకంలో విధి. కానీ పుట్టిన మనుషుల లందరూ మరణించకుండా ఉండటానికే పూజలు చేస్తూ ఉంటారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ* *2058*

*కం*

పిలిచిన పలుకని వారల

పిలిచెడివారలు తరగుచు పెనుసంకటమున్

విలవిలలాడుచు నెంతగ

పిలిచిన పలుకందుకొనరు వితతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పిలిచినప్పుడు పలుకనివారిని పిలిచేవారు తగ్గడమే గాక పెద్ద కష్టం లో బాధపడుతూ పిలిచి ననూ వారలకై పలికేవారు ఉండరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శంకరాభరణం వారి సమస్య-

 03-03-2025

శంకరాభరణం వారి సమస్య-

*శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చో గనన్*


మ.

మనమున్ఁ గోవెల జేయుచున్ సుదతి యాత్మానందమే పొందగా

కనగా పార్వతి పెండ్లికై మరుని సంకల్పంబు విన్నాణమై

తనదౌ పూవుల బాణమేసెనట  చోద్యంబౌగ దీప్తించె, యీ

శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చో గనన్


అరుణ చయనం

స్వచ్చమైన పలకరింపు

 విజయ 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏          🔥స్వచ్చమైన పలకరింపు మనుషులకు మాత్రమే ఉన్న గొప్ప వరం..సకల జీవజీవరాసులలో మనిషికి ఉండే గొప్ప సధావకాశము..మానవీయ సంబందాల వారధి.. మనసు వ్యాకులతల పారద్రోలే మంత్రం.. ఎంత డబ్బు కుమ్మరించినా దొరకని అమూల్య సంపద.. పలకరింపుతో ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు.. ఒక బాధని తొలిగించవచ్చు.. ఒక మంచి ఆలోచనను రేకిత్తించవచ్చు.. ఒక ఆశను చిగురింప చేయవచ్చు..మంచి మాటతో మనసుకు తగిలిన గాయలను మాన్పించవచ్చు🔥మీరు చెప్పే మాట సత్య మైనది కావచ్చు.. కానీ చెప్పే విధానం సభ్యతతో ఉన్నప్పుడు సత్యత కు శోభ పెరుగుతుంది.. సభ్యత లోపించిన మాట వితండ వాదంగా కనిపిస్తుంది...మనిషి మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే రోగాలు కూడా మనిషి మీద ఆధిపత్యం వహిస్తాయి.. విజయాలకు మూలం మంచి మాట, మంచి ఆలోచన.. శాంతంగా మాట్లాడి, నిబ్బరంగా ఆలోచన చేస్తే దేనినైనా సాధించవచ్చు🔥 సంస్కారవంతమైన మాటలతో బ్రతికి ఉండగానే జీవించడం నేర్చుకుందాం!!..యెడ మొహం, పెడ మోహంతో బిగదీసుకుని కుటుంబాలను చిన్నా భిన్నం చేయకుండా ఉన్నంతలో కుటుంబ వ్యవస్థని అనందం నింపుదాం.. నిలబెట్టుకుందాం.. మంచి పలకరింపుతో జీవనం సాగిద్దాం🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510 * 🙏🙏🙏

హృద్యంబుగ రచియించగ

 *2056*

*కం*

హృద్యంబుగ రచియించగ

పద్యంబుకు విలువ హెచ్చు పదపడి జనులన్.

సేద్యంబగు రచనలెపుడు

సద్యంబులకన్న వెలుగు సతతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! హృదయాలను తాకే విధంగా రచించినప్పుడే పద్యం విలువ పెరుగుతుంది. కృషి చేసి చేసే రచన వేగంగా అప్పటికప్పుడే చేసిన రచన కంటే గొప్పగా ఉంటుంది.

*సందేశం*:-- అవధానాదులలో వెంటనే చేసే కవనం వారి సాహిత్య ప్రకర్షను తెలుపగలవే గానీ సందేశాత్మకంగా ఉండే అవకాశం తక్కువ.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ధర్మాన్ని ఎందుకని ఆచరించాలి ?*

 *ధర్మాన్ని ఎందుకని ఆచరించాలి ?*


*వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే,వేదః ప్రాచేతసా దాసీత్‌ సాక్షా ద్రామాయణాత్మనా.*


వేదవేద్యే-వేదంచేత తెలిసికోదగినవాడెవడూ? పరేపుంసి-పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు. వేదవేద్యుడైన నారాయణుడు దశరథాత్మజుడైన వెంటనే వేదాలు వాల్మీకి శిశువుగా, రామాయణంగా అవతరించినవి. ఆ రామాయణం ఏమి చెపుతూంది? వేదాలు ధర్మమును చెపుతై. ఆలాటి ధర్మస్వరూపుడే రాముడు అని రాముని తల్లి కౌసల్య, అడవులకు పోయే రామచంద్రుడితో చెప్పిన మాటలవల్ల రాముడు ‘ధర్మస్వరూపుడు’. అని గోచరిస్తుంది.


పొరుగూరు పోయే బిడ్డకు తల్లి తినుబండారాలు కట్టి యివ్వడం వాడుక. రామునికి కౌసల్య యిచ్చిన తినుబండం ఏమిటి? ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే.


*‘యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ స వై రాఘవశార్దూల ధర్మస్త్వా మభిరక్షతు’*


రాఘవా! నీవు ఏ ధర్మాన్ని ధైర్యంతో నియమంతో ఆచరిస్తావో, ఆ ధర్మమే నిన్ను కాపాడేది’


ధృతి అంటే ధైర్యం. ఒకడు పరిహసిస్తాడని లెక్కచేయక ఎవరేమన్నా ధైర్యంతో ఉండడమే ధృతి. ‘ఎవరేమన్నా సరే’ అని కొందరు కొన్నాళ్ళు ధైర్యంతో ఉంటారు. పిదప పిదప మెల మెలగా దాన్ని వదిలివేస్తారు. దానికి ఒక కట్టుబాటో నియమమో ఉండదు. దానివల్ల ప్రయోజనం శూన్యం.


రాఘవుడు ధర్మాన్ని కట్టుబాటుతో నియమంతో ఒక పూటయినా వదలక కాపాడుకొంటూ వచ్చాడు. మనశ్చలనం లేక ధర్మం పాటిస్తూవచ్చాడు. ఎవరు నవ్వేది, మరి ఎవరడ్డు పెట్టేది మన ధర్మాన్ని మనం ఇందువల్ల వదలరాదు. ఆ ధర్మస్వరూపి ధర్మరక్షణ చేశాడు. అందుచేతనే అడవికి పోతూవున్నపుడు కౌసల్య కుమారుడికి ‘ధర్మంగా వర్తించుకో’ అని మాత్రమే చెప్పక, ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చావో, ఆధర్మమే నిన్ను కాపాడుతుందని ఆ ఆపదల నన్నిటినీ నివృత్తి చేసే ఆశీర్వాదం చేస్తూంది.


ఒక కుక్క దొంగలబారినుండి మనలను కాపాడవలెనంటే దానిని మనం చక్కగా కాపాడాలి. మనం దేనిని కాపాడతామో అది మనలను కాపాడుతుంది- ”నీవు ధర్మాన్ని రక్షించుకొంటూ వచ్చావు, ఇకముందు గూడా రక్షించుకొంటూ వస్తావు. అదే. ఆధర్మమే నిన్ను రక్షించుకొంటుంది’ అని ఇతరులు చెప్పటం అటుంచి సొంత తల్లి ‘తన బిడ్డ అడవులపాలయిపోతున్నాడే’ అని దుఃఖించక ఇట్లా చెబుతూంది. కూడా పుట్టిన సోదరుడే ‘అన్నా! ధర్మం. ధర్మం’ అంటూ ధర్మానికి కట్టుబడి ఉండడముచేతనే నీకు ఇంత శ్రమ ఇంత కష్టమూ సంభివిస్తూంది. దాన్ని వదలివేశావా నీకీబాధ ఉండదు’ అని ఎన్నోసారులు చెప్పాడు. ‘ఎవరు నవ్వినా, నాయనా! రాఘవా! ఏధర్మాన్ని నీవుధైర్యంతో నియమంతో వదలక అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది.’ అని తల్లి ఆశీర్వదిస్తున్నది.


*‘ధర్మం తలకాస్తుంది’* అని ఒకసామెత ఉంది. ఆడవిలో రాఘవుని తల కాచింది ధర్మమే. రావణునికి పది తలలున్నప్పటికి తాను చేసిన ఆధర్మం ఒక తలనయినా కాచలేక పోయింది.


*‘వేదోఽఖిలో ధర్మమూలమ్‌’* వేదమే ధర్మమును చెపుతూంది. వేదాలలో వర్ణింపబడిన పరమపురుషుడు దశరథునకు కొడుకుగా అవతరించా డనీ, *‘వేదవేద్యే పరే పుంసి’* అనే శ్లోకం చెపుతూంది. కౌసల్యాదేవి వాక్యంవల్ల ‘ధర్మ స్వరూపుడే రాముడు’ అని తెలియవస్తూంది. ఇంకో చోట *‘రామో విగ్రహవాన్‌ ధర్మః’* అని ఉన్నది. ధర్మం అనేది మనోభావం. అది ఒక రూపం ధరిస్తే ఎలావుంటుంది అని అంటే రాముడై కూచుంటుంది అని అర్థం. ఆపత్కాలంలో కూడా ఒక అడుగయినా వెనుకాడకుండా ధైర్యంతో నియమంతో ఉండే రూపమే ధర్మం. ఆ ధర్మ స్వరూపమే రామావతారం. వేదాలవలన తెలియదగిన వస్తువే అందరకూ కంటికి కనబడే వస్తువుగా అవతరించింది. అపుడే వేదం సైతం రామాయణంగా అవతరించింది.


సాక్షాద్రామ చంద్రమూర్తినే లక్ష్యంగా పెట్టుకొన్న రామమంత్ర జపపరాయణులకు కామం, మోహం మొదలయిన మకిల యేదీ మనస్సు కంటదు. అట్టివారు ధర్మమార్గం వదలిపోరు.


‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే

వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షాద్రామాయణాత్మవా’


వేదాలవల్ల తెలుసుకోదగిన పరమపురుషుడు దశరథునికి కొడుకుగా అవతరించినందున రామాయణరూపం ఎత్తిన వేదాలయొక్క సారం రామనామంలో ఇమిడి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యం పోగొట్టి వేరొకదానిమీద ఆశ కలుగనీయక సదా ఆనందంగా ఉండేటటుల చేస్తుంది.

15-18-గీతా మకరందము

 15-18-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - పరమాత్మ పురుషోత్తముడని యేల చెప్పబడెనో తెలియజేయుచున్నారు - 


యస్మాత్ క్షర మతీతోఽహం

అక్షరాదపి చోత్తమః | 

అతోఽస్మి లోకే వేదే చ 

ప్రథితః పురుషోత్తమః || 


తాత్పర్యము:- నేను క్షరస్వరూపునికంటె మించినవాడును, అక్షరస్వరూపుని (జీవుని) కంటె శ్రేష్ఠుడను అయియున్నందువలన ప్రపంచమునందును, వేదమునందును "పురుషోత్తముడ”ని ప్రసిద్ధికెక్కియున్నాను. 


వ్యాఖ్య:- క్షర, అక్షరపురుషులు ఇరువురికంటెను అతీతుడై యుండుటవలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కెను. జీవుడున్ను తన పురుషత్వము (జీవత్వము)తో తృప్తి పడక పురుషోత్తమత్వమునకై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను. అపుడే యతడు కృతార్థుడగుచు భవబంధవిముక్తుడై సాక్షాత్ భగవానునివలె లోకమున కీర్తింపబడగలడు.

ప్రశ్న:- భగవానుడు పురుషోత్తముడని లోకమున ఏల ప్రసిద్ధికెక్కెను?

ఉత్తరము:- ఆతడు క్షర, అక్షరపురుషులిరువురికంటెను అతీతుడుగనుక.

కపిలతీర్థం

 *తిరుమల సర్వస్వం 198-*

  *కపిల తీర్థం -3*


 *చరిత్రపుటల్లో కపిలతీర్థం* 


 తిరుమల సమీపంలోని 'కొత్తూరు' అనే గ్రామానికి చెందిన 'రాయన్న రాజేంద్రచోళుడు' అనే ప్రాంతీయ పాలకుడు, పదకొండవ శతాబ్దపు ప్రథమార్థంలో కపిలేశ్వరస్వామి ఆలయం యొక్క గర్భాలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు తర్వాత అధికారంలోకి వచ్చిన అతని తమ్ముడు అచ్యుతదేవరాయలు, మునుపెన్నడో కపిలతీర్థానికి గల 'సుదర్శన చక్ర తీర్థం' లేదా 'చక్రత్తాళ్వార్ తీర్థం' అనే నామాంతరాన్ని స్ఫురణకు తెస్తూ, కపిలతీర్థం పుష్కరిణికి నాలుగు మూలలలో నాలుగు 'సుదర్శనచక్ర శిలాయంత్రాల' ను ప్రతిష్ఠించి తన విష్ణుభక్తిని చాటుకున్నాడు. వాటిలో మూడింటిని ఈనాడు కూడా దర్శించుకోవచ్చు. నాలుగవ యంత్రం తర్వాతి కాలంలో చేపట్టిన నూతన నిర్మాణాలలో కలిసిపోయింది. అచ్యుతరాయల కాలంలోనే, కోనేటికి ఇరుప్రక్కలా చెక్కడపు శిలాస్తంభాలతో కూడిన పొడవాటి సంధ్యావందన మంటపాలు ఏర్పాటు చేయబడ్డాయి. అచ్యుతరాయలు తదనంతరం సదాశివరాయలు కాలంలో కూడా కపిలతీర్థం ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.


 విజయనగర చక్రవర్తుల అనంతరం కొంతకాలం కరకంబాడి పాలెగార్ల అధీనంలో ఉన్న తరువాత, ఈ ఆలయం 1843వ సంవత్సరంలో మహంతుల పాలనలోకి వచ్చింది. 1865వ సంవత్సరంలో అప్పటి విచారణకర్త అయిన 'మహంతు ధర్మదాస్' కోనేటి మెట్లను, సంధ్యావందన మంటపాలను పునరుద్ధరించి; ఆలయంలో కొన్ని సేవలను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపే శాసనాలు లభించాయి. ఆ తరువాత తి.తి.దే. హయాంలో ఆలయం మరింత అభివృద్ధి చెందింది.


 *ఆలయ వైశిష్ట్యం* 


 కొండకోనల్లో నుండి మహోధృతంగా దుముకుతూ భూమిపై జాలువారే కపిలతీర్థం సోయగాలను దర్శించుకుంటూ పుష్కరిణికి ఆగ్నేయ మూలలోని మెట్లెక్కి కపిలేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశిస్తాం. ఈ మార్గం తిన్నగా కళ్యాణమండపం లోకి దారి తీస్తుంది. కపిలేశ్వరునికి కామాక్షమ్మవారికి జరిగే నిత్య, వార, మాస, సంవత్సరోత్సవాలలో చాలా వరకు ఈ మంటపం లోనే జరుగుతాయి. ఈ మంటపంలోని సిద్ధివినాయకుణ్ణి దర్శించుకున్న తరువాత, ధ్వజస్తంభమంటపం లోనికి ప్రవేశిస్తాం. శిల్పసౌందర్యం ఉట్టిపడే ధ్వజస్తంభ పీఠంపై, వెండితో తాపడం చేయబడిన ఇరవై అడుగుల పొడవు గల ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడింది. ధ్వజస్తంభానికి అన్ని దిక్కుల్లోనూ శివపరివార దేవతామూర్తులు మనోహరంగా మలచబడ్డాయి.


 *కపిలేశ్వరస్వామి సన్నిధి* 


 ధ్వజస్తంభ మంటపానికి అభిముఖంగా, ప్రవేశద్వారానికి ఇరుప్రక్కలా, వైష్ణవాలయాలలోని జయవిజయులను తలపుకు తెస్తూ; *'దిండి'-'ముండి'* అనే శివకింకరులు నిలుచుని ఉంటారు. చతుర్భుజధారులైన వారిరువురూ ఢమరుకం, త్రిశూలం, గదాయుధాలతో అప్రమత్తంగా ఉండి; భక్తులకు స్వాగతం పలుకుతుంటారు. ఈ ప్రవేశద్వారాన్ని దాటి ముఖమండపం లోనికి ప్రవేశిస్తాం. శతాబ్దకాలం క్రితం వరకు కపిలేశ్వరస్వామి వారి ప్రీత్యర్థం, ఈ మంటపంలో దేవదాసీలు నృత్యం చేస్తుండడంతో దీన్ని 'నాట్యమంటప' మని కూడా పిలుస్తారు. దేవునికి సమర్పించే షోడశోపచారాలలో - నృత్యోపచారం, అనగా నాట్యప్రదర్శనం - కూడా ఒకటి.


 ఈ మధ్యకాలం వరకూ ఈ మండపంలోని శిలాస్తంభాలపై అద్భుతమైన కళాకృతులు చెక్కబడి ఉండేవి. తరువాత చేపట్టబడిన పునరుద్ధరణ కార్యకలాపాల వల్ల అవన్నీ కనుమరుగై పోయాయి. కపిలేశ్వరస్వామికి అభిముఖంగా నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు.


 *గర్భాలయం* 


 గర్భాలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా శివపుత్రులైన 'గణపతి', 'కుమారస్వామి' భక్తితో నిలుచుని ఉంటారు. ప్రవేశద్వారం పైభాగంలో చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువును కూడా దర్శించుకోవచ్చు. స్వయంభువుగా వెలసిన, ఆలయ ప్రధాన దైవమైన కపిలేశ్వరస్వామి గర్భాలయంలో పశ్చిమాభిముఖుడై, లింగాకారంలో దర్శనమిస్తారు. పానవట్టంతో సహా మూడడుగుల ఎత్తుండే, నాలుగు ముఖాలు కలిగిన ఈ లింగం దాదాపుగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఈ శివలింగం క్రింది భాగంలో రజతవర్ణం తోనూ, మధ్యభాగంలో స్వర్ణకాంతులీనే బంగారువర్ణం తోనూ, అగ్రభాగాన తామ్రవర్ణం తోనూ, ఇలా మూడు రంగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ లింగాకారంలో త్రినేత్రాలను కూడా స్పష్టంగా దర్శించుకోవచ్చు. లింగోపరితలభాగంపై కామధేనువు యొక్క కాలిగిట్టల గుర్తులను కూడా చూడవచ్చు. అయితే, కపిలేశ్వరుడు ఎల్లవేళలా నిండుగా పుష్పాలంకృతుడై ఉండటంవల్ల భక్తులు సాధారణంగా లింగాకారాన్ని మాత్రమే చూడగలరు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే

ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ (40)


తస్మాత్‌త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ 

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ (41)


అర్జునా.. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. ఇది వీటిద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహధారులకు మోహం కలగజేస్తున్నది. అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పుచేతల్లో వుంచుకుని, జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే కామమనే పాపిని పారద్రోలు.

మహరాజండీ

 ఎంత కష్టం.. ఎంత కష్టం..


'ఏవమ్మా అన్నపూర్ణమ్మా.. నీ సుపుత్రుడు నిద్ర లేచాడా?' అని వ్యంగ్యంగా అడిగాడు హరి. 'ఆ.. చాల్లేండి.. మీ వెటకారాలు.. వాడిని తిట్టందే మీకు తెల్లారదనుకుంటా..


కొడుకు నచ్చినప్పుడు నిద్రలేస్తాడు' అంది అన్నపూర్ణమ్మ విసుగ్గా..!

'ఇదిగో ఇలానే.. నా కొడుకు.. నా కొడుకు అని వాడ్ని బాగా గారాబం చేసి ఎందుకూ పనికిరానివాడిలా చేస్తున్నావ్‌' అన్నాడు భర్త హరి.

'నా కొడుకు మహరాజండీ.. చూస్తుండండీ.. ఏదో ఒక రోజు వాడు గొప్పవాడవుతాడు' అంది అన్నపూర్ణమ్మ.

'అవునవును.. తల్లీ కొడుకులిద్దరూ ఇలానే పగటి కలలుకనండి..' అంటూ.. బల్లపై పెట్టిన క్యారేజీ తీసుకొని ఆఫీసుకి బయలుదేరాడు హరి.

'నాన్నా.. సిద్ధూ.. లేవరా.. ఇదిగో కాఫీ తాగు.. లేరా బాబూ' అంటూ నిద్రలేపింది అన్నపూర్ణమ్మ.

'ఆగమ్మా.. ఇంకాసేపు పడుకొని లేస్తాలే.'.

'ఇప్పటికే ఉదయం 9 గంటలయ్యింది.. ఎక్కడో ఇంటర్వ్యూ ఉంది.. వెళ్లాలమ్మా అన్నావ్‌.. మర్చిపోయావా? లే.. నాన్నా..' అని తలనిమురుతూ కొడుకును ఆప్యాయంగా నిద్రలేపింది అన్నపూర్ణమ్మ.

'ఓV్‌ా.. ఇంటర్వ్యూకి వెళ్లాలి కదూ..' అని బరువుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, టిఫిన్‌ తిని, ఫైల్‌ పట్టుకొనిపట్టుకొని ఇంటర్వ్యూకి బయలుదేరాడు సిద్ధూ.

.. దారిలో తండ్రి హరి నుండి ఫోన్‌..

'ఏరా.. సిద్ధూ.. ఇంటర్వ్యూకి వెళుతున్నావా?'

'ఆ.. వెళుతున్నా నాన్న..'

'చేతిలో ఖర్చులకు చిల్లరేమైనా ఉందా?'

'ఆ.. బయలుదేరేప్పుడు అమ్మ ఇచ్చింది నాన్నా..'

'సరే.. జాగ్రత్తగా వెళ్లి రా.. ఆల్‌ ది బెస్ట్‌..' అన్నాడు హరి.


'రేరు.. సిద్ధూ..' (వెనక నుండి పిలుపు)

'అరేరు.. చైతూ.. నువ్వేంట్రా ఇక్కడీ'

'ఇక్కడ కొత్తగా పెట్టిన కంపెనీలో వేకెన్సీ ఉందంటే ఇంటర్వ్యూకి వచ్చారా?'

'ఓV్‌ా.. నేను కూడా అక్కడికేరా?

పదా.. ఇద్దరం కలిసి వెళదాం..' (అంటూ.. సిద్ధూ, చైతూ కలిసి మాట్లాడుకుంటూ వెళ్లారు.)

.. ఇంటర్వ్యూ అయ్యింది..


'ఏరా.. చైతూ.. ఏమన్నార్రా..?'

'తర్వాత కాల్‌ చేస్తాం అన్నార్రా..'

'మరి నువ్వు?'


సేమ్‌ రిప్లరు రా..'

'ఏంట్రా సిద్ధూ.. ఇంత చిన్న ఉద్యోగానికి అంతమంది వచ్చారేంట్రా..!'

'మరి.. మన దేశంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారంటే.. ఎగ్జాంపుల్‌గా ఈ ఒక్క ఇంటర్వ్యూ చూపిస్తే చాలు..!' అని అన్నాడు సిద్ధూ నిస్పృహతో..!

'అవును రా.. ఇద్దరం డిగ్రీలు చేసి ఇలా ఫైళ్లు చేత్తో పట్టుకొని ఇంటర్వ్యూలకు వెళ్లడమే సరిపోతుంది.. సంత మార్కెట్లో రద్దీ ఉన్నట్లు ఎక్కడ ఇంటర్వ్యూలున్నా కాంపిటీషన్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. మనకు తగ్గ ఉద్యోగాలు దొరుతాయంటావారా..' అని ఆవేదనతో అన్నాడు చైతూ..!

'సరేరా.. ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటలయ్యింది.. కడుపులో ఆకలి దంచికొడుతుంది.. మళ్లీ కలుద్దాం.. నువ్వు జాగ్రత్తగా వెళ్లు..' అని సిద్ధూ ఇంటి బాటపట్టాడు.

.. సిద్ధూ ఇంటికి రాగానే.. అన్నపూర్ణమ్మ భోజనం వడ్డించింది..

'నాయనా సిద్ధూ.. ఇంటర్వ్యూ ఏమయ్యింది?'

'తర్వాత కాల్‌ చేస్తాం అని చెప్పారమ్మా..!'


అవునా.. సరేలే..!'

'ఏంటమ్మా.. ఈ వంట 4 రోజులుగా పప్పూ, దోసకాయ, బెండకాయ అంటూ.. ఇవే వండుతున్నావ్‌.. నోరు చచ్చిపోతుంది..!' అంటూ విసుగ్గా భోంచేశాడు సిద్ధూ.

'ఏం చేయను నాన్న.. మీ నాన్న ఒక్కడి సంపాదనతో ఇల్లంతా గడవాలి కదా..!' అని బాధగా బదులిచ్చింది అన్నపూర్ణమ్మ.

.. భర్త హరికి అన్నపూర్ణమ్మ ఫోన్‌..

'ఏవండీ.. వచ్చేటప్పుడు ఓ బిర్యానీ ప్యాకెట్‌ తెండి..'

'ఎందుకు.. పూర్ణ..?'

'ఏంలేదండీ.. సిద్ధూ మంచి ఆకలి మీద వచ్చాడు.. ఇంట్లో పప్పు ఉండేసరికి వాడు సరిగ్గా భోంచేయలేదు.. బిడ్డ అర్థాకలితో లేచాడు.. కాస్త మీరు బిర్యానీ తెస్తే వాడు తింటాడని'.

'సరే.. తెస్తాలే.'

.. ఇంటికి వచ్చిన హరి గుమ్మంలోనే భార్యను పిలిచాడు..

'ఏవోరు.. అన్నపూర్ణమ్మ.. ఇదిగో నీ సుపుత్రుడికి బిర్యానీ.. వచ్చి తినమని చెప్పు..' అన్నాడు హరి వ్యంగ్యంగా..


సర్లేండి వాడినెప్పుడూ తిట్టడమే మీ పని..!' అంది విసురుగా అన్నపూర్ణమ్మ.

'నాన్నా.. సిద్ధూ.. లే నాన్న.. ఇదిగో మీ నాన్న నీ కోసం బిర్యానీ తెచ్చాడు.. తిందువుగాని లే..' అంది అన్నపూర్ణమ్మ.

బిర్యానీ మాట వినగానే దిగ్గున లేచాడు సిద్ధూ.. వెంటనే ప్యాకెట్‌ ఓపెన్‌ చేసి తినడం ప్రారంభించాడు.

..

సిద్ధూతోపాటు భోజనానికి హరి కూడా కూర్చున్నాడు.

అరే సిద్ధూ.. ఇప్పటికి 2 చోట్ల 'ఉద్యోగాల్లో చేరి కష్టంగా ఉందని, టైం ఎక్కువ అని, పని ఎక్కువ చెబుతున్నారని.. మానేశావ్‌. ఇంటర్వ్యూలకి వెళుతూనే ఉన్నావ్‌.. ఇప్పటికే నీకు 30 ఏళ్ళొచ్చొరు.. మాకున్న ఒక్కగానొక్క కొడుకువి కాబట్టి నిన్ను గారాబంగా చూసుకుంటున్నాం. నీ భవిష్యత్తు గురించి దిగులుగా ఉంది. ఈసారి వచ్చే ఉద్యోగం ఎంత కష్టమైనా నిలదొక్కుకొని పనిచేరు నాన్న.. మనది మధ్యతరగతి కుటుంబం.. నాకూ వయసవుతుంది.. ఆలోచించు.'. అని అంటుండగానే.. అన్నపూర్ణమ్మ వచ్చింది..


' ఆ..ఆ.. మొదలుపెట్టారా? తింటున్నప్పుడే వాయించేస్తారు మీరు.. పిల్లాడ్ని ప్రశాంతంగా బిర్యానీ తిననివ్వండి' అంది.

'ఏంటి పూర్ణ.. నీ కర్థమవుతుందా? ఒకరి దగ్గర నేను పనిచేయడమేంటీ? అని వాడు, సొంత వ్యాపారం పెడతానంటూ.. మనచేత రెండుసార్లు పెట్టుబడి పెట్టించి దివాలా తీశాడు.. అనుభవం లేని వ్యాపారం వద్దు అంటే వినలేదు..' అని విసుక్కున్నాడు హరి.

'అవునండీ.. గుర్తుంది.. ఆ పెట్టుబడి డబ్బులు నా నగలు తాకట్టు పెట్టినవే కదా.. తెలుసులే' అంది అన్నపూర్ణమ్మ.

'మరి ఆ రెండో వ్యాపారం మాటేమిటి?' అని అన్నాడు హరి.

'అది లోను కదా.. నెలనెలా కడుతున్నాంగా..' అంది పూర్ణమ్మ.

'చూడు పూర్ణ.. నేను చిన్న ఉద్యోగిని.. నాకొచ్చే జీతంతో ఎలా ఇంటిని నెట్టుకొస్తున్నామో నీకు తెలుసు.. అయినా నీ అతి గారాబంతో వీడికి కష్టం విలువ తెలీకుండా చేస్తున్నావు..' అన్నాడు అసహనంతో హరి.

'ఇక చాలు నాన్న.. నా కోసం మీ ఇద్దరూ గొడవపడకండి.. అమ్మనేం అనొద్దు.. నాకు నచ్చిన ఉద్యోగం దొరకాలిగా.. డిగ్రీ చదివి తక్కువ జీతానికి పని చేయమంటావా ఏంటి? ' అని విసుక్కున్నాడు సిద్ధూ.

' అరే.. సిద్ధూ.. ముందు దొరికిన ఉద్యోగంలో చేరి ఎక్స్‌పీరియన్స్‌ సంపాదించు.. నిదానంగా నీకు తగ్గ ఉద్యోగం వెతుక్కొని స్థిరపడు.. అంతేకానీ అసలు ఉద్యోగమూ, సద్యోగమూ, లేకుండా ఇలా టైంపాస్‌ చేస్తే రేపు నీకు వయసైపోతుంది.. అప్పుడేం చేస్తావురా?' అని గట్టిగా అరిచాడు హరి.

'ఛీ.. బిర్యానీ తేవడం ఎందుకు.. ఇలా క్లాసులు పీకడం ఎందుకు? ఛిఛీ..' అంటూ.. సిద్ధూ చిరాగ్గా వెళ్లిపోయాడు.

'ఏంటండీ మీరు.. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు.. వాడ్ని ఎందుకు అలా బాధపెడతారు? నిదానంగా ఉద్యోగంలో చేరతాడులెండి..' అంది అన్నపూర్ణమ్మ.

చేసేదేం లేక.. తలపట్టుకొని లోనికి వెళ్లాడు హరి.

.. ఇలా రోజులు గడుస్తుండగా..


ఓ రోజు ఆఫీసులో హరికి గుండెపోటు వచ్చింది. ఆఫీసు సిబ్బంది వెంటనే హరిని దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి క్లిషంగా ఉందని డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. విషయం తెలియగానే.. అన్నపూర్ణమ్మ, సిద్ధూలు ఆసుపత్రికి చేరుకున్నారు.

'చూడు బాబూ.. మీ నాన్నగారికి అర్జెంటుగా హార్ట్‌ ఆపరేషన్‌ చేయాలి.. బ్లడ్‌ పంపింగ్‌ ప్రాబ్లం ఉంది.. దాదాపు రూ.2 లక్షలు అవుతుంది. బిల్లు గురించి మా నర్సు చెబుతారు..' అని డాక్టర్‌ చెప్పడంతో.. సిద్ధూ గుండె బరువెక్కిపోయింది..

తల్లికి విషయం తెలిపాడు సిద్ధూ.

'చూడు నాన్న సిద్ధూ.. మా అన్నయ్య వెంకటేశ్వర్లు దగ్గరకు వెళ్లు.. వెంటనే బయలుదేరు.. ఊరెళ్లి మా అన్నతో మాట్లాడి డబ్బు పట్టుకొని రా.. వెళ్లు నాన్నా..' అని అన్నపూర్ణమ్మ కొడుకును తన అన్న వద్దకు పంపింది.

వెంటనే బయలుదేరిన సిద్ధూ.. తన మామయ్య వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి జరిగిన సంగతంతా చెప్పాడు.

'అరే.. సిద్ధూ.. నీకు తెలీదేమో..! ఆ మధ్య నువ్వేదో


వ్యాపారం పెడుతున్నావంటూ.. మీ అమ్మ నా చేత నగలు తాకట్టు పెట్టించింది. మళ్లీ ఏదో అవసరం ఉందంటూ.. మీ నాన్న కూడా నా దగ్గర కొంత మొత్తం తీసుకున్నాడు.. ఇప్పుడైతే నా దగ్గర చిల్లిగవ్వ లేదురా.. అసలు మా పరిస్థితే ఏం బాగోలేదు.. ఏమీ అనుకోకు నాన్న.. ఓ సారి వచ్చి నాన్నకు చూసి వెళతానని చెప్పు.. సరేనా.. మళ్లీ నీకు లేటవుతుందేమో.. తొందరగా వెళ్లు.. ' అని సిద్ధూను పంపేశాడు.

సిద్ధూ.. నిర్ఘాంతపోతూ.. బరువెక్కిన అడుగులతో ఆ ఇంటి గుమ్మం దాటి బయలుదేరాడు.

మా మావయ్య ఎంత మారిపోయాడు. మా పరిస్థితి బాగున్నంతసేపు మాకోసం అగ్గగ్గలాడిపోయాడు. ఇప్పుడు మా స్థితి మారిపోయేసరికి కనీసం మిట్టమధ్యాహ్నం వచ్చిన నాకు గుక్కెడు మంచినీళ్లయినా ఇవ్వకుండా లేని ప్రేమను నటిస్తూ సాగనంపాడు. మా అత్తయ్య కనీసం వచ్చి పలకరించను కూడా లేదు.. మనుషులు ఇంతలా మారిపోతారా? అనుకుంటూ సిద్ధూ ఆసుపత్రికి చేరుకున్నాడు.


'ఏం నాన్న.. మామయ్య ఏం అన్నాడు.. నీతోపాటు వచ్చాడా? డబ్బు సాయం చేస్తానన్నాడా?' అంటూ ఆత్రంగా అడిగింది అన్నపూర్ణమ్మ.

'అమ్మా.. మామయ్య పరిస్థితి బాగోలేదంట.. ఓసారి వచ్చి చూసెళతానన్నాడు..' అంటూ.. కనురెప్పలచాటున ఉవ్వెత్తున వస్తున్న కన్నీళ్లను దింగమింగుతూ అమ్మ అమాయకత్వాన్ని చూస్తూ చెప్పాడు. అంతే.. ఆ మాటతో అన్నపూర్ణమ్మ ఆలోచనలో పడిపోయింది.!

'.. అమ్మా.. నువ్వేం కంగారుపడకమ్మా.. నా స్నేహితుడు ఒకడున్నాడు.. వాడ్ని అడిగితే తప్పకుండా మనకు అప్పు ఇస్తాడు.. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.. నేనిప్పుడే వస్తాను..' అంటూ.. సిద్ధూ వెంటనే చైతూ ఇంటికి బయలుదేరుతూ ఫోన్‌ చేశాడు.

'అరే సిద్ధూ.. నేను మా కాలనీలో ఉన్న వాచ్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారా.. నువ్వు అక్కడికి వచ్చేరు..' అన్నాడు చైతు.

చైతూను కలిసిన సిద్ధూ విషయమంతా చెప్పాడు.

'అరే సిద్ధూ.. ఇప్పటికిప్పుడు అంత మొత్తం కావాలంటే కష్టం.. కానీ.. ఇక్కడే ఉండు..' అని చైతు తన ఓనర్‌తో మాట్లాడటానికి వెళ్లాడు.

కాసేపటికి తిరిగొచ్చి.. 'అరే సిద్ధూ.. మా ఓనర్‌తో మాట్లాడాను.. ఆయన మంచి మనసుతో డబ్బు ఇస్తానన్నారు. నిదానంగా నెలనెలా కొంతకొంత మొత్తంలో ఆ అప్పు కట్టొచ్చు.. నువ్వు ధైర్యంగా ఉండరా..' అన్నాడు చైతూ.

అంతే.. గుండెల్లో నుండి తన్నుకొచ్చిన కన్నీళ్లతో చైతూను గట్టిగా హత్తుకున్నాడు సిద్ధూ.ఇంతలో.. చైతూ ఓనర్‌ వచ్చి డబ్బివ్వడంతో సిద్ధూ అక్కడి నుండి వెంటనే ఆసుపత్రికి వెళ్లి బిల్లు కట్టేసి తల్లితో జరిగిందంతా చెప్పాడు.ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యింది. నాలుగు రోజుల తరువాత హరిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ చేశారు. మూడు నెలల వరకు హరి బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఇల్లు గడవడం ప్రశ్నార్థకమయ్యింది. ఇంతవరకు అమ్మానాన్నల గారాబం, ప్రేమతో కాలం గడిచిన సిద్ధూకి.. ఇప్పుడు ఆ కాలమే పరీక్ష పెట్టినట్టయింది..!

ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? రేపటి నుండి ఇల్లు గడిచేదెలా? ఏం చేయాలి? సిద్ధూ బుర్రలో ఆలోచనలు తొలిచేస్తున్నాయి.. నిద్ర పట్టడమే లేదు.. ఇంతలో అన్నపూర్ణమ్మ వచ్చింది.

'నాన్న సిద్ధూ.. ఏం ఆలోచిస్తున్నావ్రా..'

'ఏం లేదమ్మా..' అన్నాడు సిద్ధూ..

'నాన్న సిద్ధూ.. నేను ఏదైనా పనికి వెళతానురా.. నాన్న చూస్తే అలా ఉన్నాడు.. మన ఇల్లు గడవాలి కదా? నీకా ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? నువ్వు కూడా నీ ప్రయత్నం చెయ్యి.. ఏం నాన్న' అని కన్నీళ్లతో అంది అన్నపూర్ణమ్మ.

'అమ్మా.. నీ ఆరోగ్యమే అంతంతమాత్రం.. నువ్వు పనికెళితే నాన్నను ఎవరు చూసుకుంటారు? అయినా నేనున్నాగా అమ్మా.. నేను ఏదో విధంగా రేపు ఉద్యోగం సంపాదిస్తాను.. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.. వెళ్లమ్మా.. నువ్వు ఏ ఆలోచన లేకుండా పడుకో..!' అన్నాడు సిద్ధూ. తనకు తెలిసిన ఫ్రెండ్స్‌ అందరికీ ఫోన్లు చేశాడు..' ఏమైనా వేకెన్సీలున్నాయా?'

' లేవురా? ఉంటే చెబుతాం..!' అందరి దగ్గర నుండి అదే సమాధానం..!

.. నిద్రపట్టక వరండాలో ఉన్న బైక్‌ పై కూర్చొని సిద్ధూ ఆలోచించసాగాడు..


ఉద్యోగం విషయంలో నిర్లక్ష్యంగా వెతికినప్పుడు చాలా అవకాశాలొచ్చాయి.. అప్పుడు వాటిని కాలదన్నుకున్నాను. ఇప్పుడు ఏ ఉద్యోగం చేద్దామన్నా.. కనీసం కూడా దొరకడం లేదు. కాసేపు సిద్ధూ కుంగిపోయాడు.. వెంటనే తనకు తానే ధైర్యం తెచ్చుకొని కాసేపు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని తీక్షణంగా ఆలోచించాడు. వెంటనే సిద్ధూకి ఓ ఆలోచన తట్టింది..! బైక్‌ సర్వీస్‌ చేస్తే.. ఆలోచన వచ్చిందే తడవు.. బైక్‌ సర్వీస్‌లో రిజిస్ట్రేషన్‌ చేశాడు. తెల్లవారగానే రెడీ అయ్యి బైక్‌ సర్వీస్‌కి బయలుదేరాడు.

ఆకలిని సైతం పక్కన పెట్టి పనిలో కూరుకుపోయాడు సిద్ధూ..తెల్లారనగా వెళ్లిన కొడుకు.. రాత్రి 10 గంటలైనా రాలేదు. తిన్నాడో, లేదో.. ఎటు వెళ్లాడో, అనుకుంటూ గుమ్మం దగ్గరే కొడుకు కోసం అన్నపూర్ణమ్మ ఎదురుచూస్తూ ఉంది. ఇంతలో.. సిద్ధూ ఇంటికొచ్చాడు.

అన్నపూర్ణమ్మ కళ్లు వెలిగాయి..' నాన్న సిద్ధూ, ఎక్కడికెళ్లావురా..! ఇదిగో వస్తానమ్మా.. అంటూనే 10 గంటలకొచ్చావు? ఏం నాన్న ఏమైందిరా?' అని తల్లడిల్లిపోతూ అడిగింది అన్నపూర్ణమ్మ.


'ఏం లేదమ్మా.. నేను ఉద్యోగానికెళతానన్నాగా.. ఇదిగో అమ్మా నా తొలి సంపాదన' అని తల్లి చేతిలో కొంత మొత్తం డబ్బును పెట్టాడు సిద్ధూ.

కొడుకు కష్టపడి తొలి సంపాదన అంటూ తల్లి చేతిలో పెట్టగానే అన్నపూర్ణమ్మకు సిద్ధూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు కనిపించాడు.

'బాబూ.. అన్నం తిందువుగాని రా.. నాయనా..' అంటూ సిద్ధూ చేతులను పట్టుకోగానే అన్నపూర్ణమ్మ కన్నీళ్లు గుండెలను తన్నుకొని కళ్లలో నుండి సిద్ధూ చేతులపై జాలువారాయి.

'ఏం నాన్న.. ఏం ఉద్యోగం రా అది.. ఇలా నీ రెండు చేతులూ బొబ్బలెక్కిపోయాయేంటి? వద్దు నాన్న ఆ ఉద్యోగం నీకొద్దు..' అంటూ.. అన్నపూర్ణమ్మ కన్నీళ్లతో తల్లడిల్లిపోయింది.

'అమ్మా.. నేను బైక్‌ సర్వీస్‌కు వెళుతున్నాను.. ఇది మొదటి రోజు.. పని అలవాటు లేక ఇలా చేతులు బొబ్బలెక్కాయంతే..! నువ్వు బాధపడకమ్మా.. పదమ్మా.. ఆకలేస్తుంది.. అన్నం పెడుదువుగాని' అని సిద్ధూ తల్లిని పట్టుకొని లోనికి వెళ్లాడు.


ఇదంతా చూస్తున్న హరి మనస్సు నీరుగారిపోయింది..ఇలా.. కొన్ని రోజులు గడిచాయి..

ఓ పెద్ద కంపెనీలో పనిచేసే ఆఫీసర్‌కు కారు రిపేరు వచ్చి.. అర్జంటుగా బైక్‌ సర్వీసుకి కాల్‌ చేశాడు.. అది తెల్లవారి 4 గంటల సమయం. ఎవ్వరూ సర్వీసుకి రావడం లేదు.. 'సారీ సార్‌..' అంటూ ఫోన్‌ పెట్టేస్తున్నారు.. ఫోన్లు చేసే క్రమంలో ఆ ఆఫీసర్‌కు సిద్ధూ నెంబర్‌ కలిసింది.

' హలో.. అర్జంటుగా నన్ను డ్రాప్‌ చేయాలి.. నువ్వు ఎంతడిగినా ఇస్తాను.. ' అని అన్నాడు ఆఫీసర్‌.

'ఓకే సార్‌.. మీ లొకేషన్‌ పెట్టండి.. వెంటనే వస్తాను' అని చెప్పాడు సిద్ధూ.

ఆ సమయంలో వచ్చి తనను జాగ్రత్తగా డ్రాప్‌ చేసినందుకు మెచ్చుకుంటూ ఆ ఆఫీసర్‌ సిద్ధూకి అనుకున్నదానికంటే ఎక్కువగానే ఇచ్చాడు.

'ఇదిగో బాబూ నీ పేరేంటీ?' అడిగాడు ఆఫీసర్‌.


'నా పేరు సిద్ధూ సార్‌..'


'ఓకే.. సిద్ధూ.. నా కార్‌ రిపేరులో ఉంది.. ఈ నాలుగు రోజులు నన్ను నువ్వు పికప్‌ చేసుకోగలవా?' అని అడిగాడు ఆఫీసర్‌.

'తప్పకుండా సార్‌..' అన్నాడు సిద్ధూ.

మూడు రోజులు గడిచాయి.తక్కువ సమయంలో సిద్ధూ ఆ ఆఫీసర్‌కు దగ్గరయ్యాడు.ఓ రోజు ఆఫీసర్‌ సిద్ధూతో..

' సిద్ధూ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు.. ఈ బైక్‌ సర్వీసేనా? ఇంకేమైనా చేస్తున్నావా?' అని అడిగారు.

'లేదు సార్‌.. ఈ బైక్‌ సర్వీస్‌ మాత్రమే చేస్తున్నాను. డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను సార్‌' అన్నాడు.

'ఓకే సిద్ధూ.. మా కంపెనీలో వేకేన్సీ రెడీగా ఉంది.. నీలాంటి కష్టపడే కుర్రాడే మాకు కావాలి.. నీకు ఇష్టమైతే రేపు నీ రెస్యూమ్‌ తీసుకొని మా ఆఫీసుకి వచ్చి నన్ను కలువు ఓకేనా..' అన్నారు ఆఫీసర్‌.

'చాలా.. చాలా థాంక్యూ సార్‌..' అన్నాడు సిద్ధూ.మరుసటి రోజు రెస్యూమ్‌తో సిద్ధూ ఆఫీసర్‌ పనిచేసే కంపెనీకి వెళ్లాడు.ఇంటర్వ్యూ సక్సెస్‌.. నెలకు రూ.30 వేల జీతం. ఇంటికి ఆనందంగా వచ్చిన సిద్ధూ తన తల్లితో జరిగిందంతా చెప్పాడు.తండ్రి హరి కూడా ఆ మాటలు విని ఆనందించాడు. సిద్ధూని దగ్గరకు పిలిచి తలపై ముద్దుపెట్టుకున్నాడు.

'నాన్న నువ్వు చెప్పినప్పుడు నాకు కష్టం విలువ తెలియలేదు.. నువ్వున్నావన్న ధైర్యంతో నేను నిర్లక్ష్యంగా ప్రవర్తించాను.. కానీ నేనెప్పుడైతే కష్టానికి సిద్ధపడ్డానో.. ఆ కష్టం నన్ను పిలిచి గౌరవించి ఈ ఉద్యోగమిచ్చింది నాన్న.. నేను ఇంకా కష్టపడి ఎదుగుతాను నాన్న.. మీ మాటలు పెడచెవినపెట్టి మిమ్మల్ని బాధపెట్టాను. క్షమించండి నాన్న ' అని సిద్ధూ తన తండ్రితో మాట్లాడుతుంటే హరి కళ్లు చెమ్మగిల్లాయి. తండ్రి రెండు చేతులను సిద్ధూ ముద్దాడాడు.

ఇంతలో.. అన్నపూర్ణమ్మ వచ్చి 'నాన్నా.. సిద్ధూ.. రా నాన్న.. భోజనం చేద్దువుగాని..' అని పిలిచింది.

'మరి బాబూ.. ఈరోజు పప్పు మాత్రమే చేశాను.. ఉండు నాన్న అన్నం చల్లారింది కాస్త వేడి చేసుకొస్తాను' అంది అన్నపూర్ణమ్మ.

'వద్దమ్మా..' అన్నాడు సిద్ధూ..

'ఏం నాన్న..?' అని అడిగింది అన్నపూర్ణమ్మ.


అమ్మా.. నువ్వు వండే పప్పు చాలా కమ్మగా ఉంటుంది.. అన్నం వేడి చేయనక్కరలేదు.. అలాగే పెట్టమ్మ.. రా అమ్మా ముగ్గురం కలిసి భోంచేద్దాం' అన్నాడు సిద్ధూ. కొడుకు అలా అనడంతో తల్లిదండ్రులిద్దరూ ఆనందంతో నిండిపోయారు. ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటే.. అప్పుడర్థమయ్యింది సిద్ధూకి.. ఇన్నాళ్లూ తాను ఎంత సంతోషాన్ని కోల్పోయానో అని..!

మొట్టమొదటిసారి తల్లితండ్రితో కలిసి సిద్ధూ భోజనం చేస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదించాడు. ఆ అన్నంలోని ప్రతీ మెతుకులో కష్టం కనబడుతుంది.. తన కోసం ఇంతవరకు తల్లితండ్రులు పడిన కష్టం విలువ తెలిసింది. తల్లితండ్రులతో కలిసి ప్రేమగా తృప్తిగా భోజనాన్ని ముగించాడు సిద్ధూ.

పంచాంగం 05.04.2025

 ఈ రోజు పంచాంగం 05.04.2025

Saturday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన  విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాస శుక్ల పక్ష అష్టమి తిథి స్థిర వాసర పునర్వసు నక్షత్రం అతిగండ యోగః: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00  వరకు.

 




శుభోదయ:, నమస్కార:

మరణం లేకుంటే”*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *“మరణం లేకుంటే”*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ జనన మరణాలు సృష్టి నియమాలు....*


*విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. మరణమే లేకుంటే ఎన్నెన్ని అనర్థాలో..! అదేంటో తెలుసుకుందాం.*


*ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి _"ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి"_ అని అడిగాడు. అప్పుడా సన్యాసి _"ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."_ అని చెప్పాడు.* 


*రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా...* 


*"నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."*


*రాజు ఆలోచించాడు... _"అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి?"_ నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే? పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. _"నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలపండి"_ అని...* 


*సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు."* 


*రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.*


*నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు _"నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు.* 


*రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి..._*


*"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు" అన్నాడు.*


*అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు...మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. "మరణాన్ని నివారించే బదులు, మీరు ప్రతిరోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది.* 


*1. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది.*

 

*2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది.*

 

*3. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర లాగా ఉంటుంది.*

 

*4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది.*

 

*5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది.*


*6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది.*

 

*7.ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.* 


*ఓం నమః శివాయ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(96వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

             *శ్రీకృష్ణ లీల*

     *గోపికావస్త్రాపహరణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కృష్ణుణ్ణి జారుడు, చోరుడు, గోపికాలోలుడు అంటారంతా. కృష్ణుని శృంగారచేష్టల గురించి కొల్లలుగా కథలు చెబుతారు.*


*ఆ కథల్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, కృష్ణుడు జగన్మోహనాకారుడు అన్నది నిజం. ఆ అందాన్నే గోపికలంతా ఆరాధించారు. అందంతో పాటు కృష్ణుని వేణుగానం హృదయాల్ని పరవశింపజేస్తుంటే గోపికలు తట్టుకోగలరా? అందుకే వారంతా అతని వెంటపడ్డారు. కృష్ణుణ్ణి కావాలనుకున్నారు. కావాలనుకున్న ప్రతి గోపికనూ చేరదీశాడతను.*


*వారితో యుమునాతీరంలో వెన్నెల్లో ఇసుకతిన్నెల్లో విరహించాడు. జలక్రీడలాడాడు. రాసక్రీడలాడాడు. క్షణకాలం కృష్ణుడు దూరమయితే కన్నీరు పెట్టుకునేవారు గోపికలు. ఆ వియోగాన్ని భరించలేకపోయేవారు.*


*కృష్ణుడు లేడు, కృష్ణుడు తనకడకు రాడు అన్న భావన ఆత్మహత్యలకు పురిగొలిపేది గోపికల్ని. బృందావనంలో కృష్ణుడూ గోపికలూ జరిపిన రాసక్రీడల్ని వ్యాసమహర్షి మనోజ్ఞంగా వర్ణించాడు. గోపికాగీతలు, భ్రమరగీతలు పేరిట వారి శృంగారక్రీడల్ని అత్యద్భుతంగా చిత్రించాడాయన. ఈ చిత్రణలను అపార్థం చేసుకుని కృష్ణుణ్ణి ‘జారుడు’ అనడం పొరబాటు. అపచారం కూడా.*


*శ్రీకృష్ణలీలలు వర్ణించడంలో వ్యాసమహర్షి ఉద్దేశం వేరు. స్త్రీలలో భగవద్భక్తిని పాదుకొలిపేందుకే కృష్ణుడు అలా ప్రవర్తించాడని అంటాడాయన. భక్తునికీ భగవంతునికీ తేడా లేదు. ఇద్దరూ ఒకటే! వారికి స్త్రీ పురుష భేదం లేదు.*


*భక్తుడు, భగవంతునిలో తాదాత్మ్యం చెందడమే ముక్తి. సర్వం భగవదర్పణ చేయడమే భక్తుని కోరిక అంటాడు వ్యాసమహర్షి. దీనిని చాలా మంది భక్తులు నిజం చేశారు. జయదేవుడు, లీలాశుకుడు కృష్ణునిలీలలు గొంతెత్తి పాడారు. మీరాబాయిలాంటి వారు కూడా ఇదే విధంగా భగవంతుని సేవించి తరించారు.* 


*నిప్పునకు చెదలు అంటవంటారు. అలాంటి నిప్పు, సర్వాంతర్యామి పరమాత్మకు పాపపుణ్యాది కర్మవాసనలు అంటవన్నది నిజం. భక్తుడు, భగవంతునితో తాదాత్మ్యం చెందినప్పుడు ఆత్మానందమేకాని, శారీరకవాంఛల ప్రసక్తే ఉండదక్కడ. కృష్ణుడు భగవంతుడు. గోపికలు భక్తురాళ్ళు. కృష్ణుని శృంగారక్రీడలన్నిటినీ ఈ దృష్టినే అర్థం చేసుకోవాలి. మరోరకంగా అర్థం చేసుకుంటే అపార్థాలే కాదు, అంతుచిక్కని వేదన కూడా కలుగుతుంది. ఆ వేదనలు పక్కన పెడితే కృష్ణుని శృంగారక్రీడకు గోపికావస్త్రాపహరణం పరాకాష్ఠగా చెబుతారు పెద్దలు.*


*గోపికలంతా కృష్ణుణ్ణి తమ పతిగా పొందాలని ఆశించారు. అతన్ని పతిగా పొంది తరించాలనుకున్నారు. తమ కోరిక నెరవేరేందుకు వారంతా వ్రతం చేపట్టారు. దాని పేరు కాత్యాయనీవ్రతం*. 


*మార్గశిరమాసం నెలరోజులూ ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాలి. వ్రతాన్ని ఆరంభించారు గోపికలు. వేకువనే లేచారు. కాళిందిమడుగులో స్నానాలు చేశారు. ఇసుకతో కాత్యాయనీదేవి ప్రతిమను రూపొందించి ఒడ్డున ప్రతిష్టించారు. ఆ ప్రతిమను గంధపుష్పాక్షతలతో పూజించి, రకరకాల పళ్ళూ, పువ్వులూ నివేదించారు. అలా కొద్దిరోజుల గడిచింది.*


*ఒకనాడు ఎప్పటిలాగానే గోపికలంతా వేకువనే లేచి, స్నానానికి కాళిందిమడుగునకు చేరుకున్నారు. చీరెలు విప్పి ఒడ్డున పెట్టుకున్నారు. మడుగులో దిగి జలకాలాడసాగారు. అప్పుడు వచ్చాడక్కడకి కృష్ణుడు. ఒంటరిగా రాలేదు, చెలికాళ్ళతో వచ్చాడు. గుంపుగా వచ్చాడు. ఒడ్డున ఉన్న గోపికల చీరలు చూశాడు. జలకాలాడుతున్న గోపికల్ని చూశాడు. కొంటెబుద్ధిపుట్టింది. చీరెలందుకున్నాడు. పరుగందుకున్నాడు. పరిగెత్తి, దగ్గరగా ఉన్న వేపచెట్టెక్కి కూర్చున్నాడు.*


*‘‘ఇదేమిటి కృష్ణా! చీరెలెత్తుకొచ్చి చెట్టెక్కి కూర్చున్నావు. ఇది ఎవరయినా చూస్తే ఇంకేమయినా ఉందా? దెబ్బలు పడతాయి. కిందకి దిగు, వాళ్ళ చీరెలు వాళ్ళకి ఇచ్చేయ్‌.’’ అన్నారు స్నేహితులు.‘‘నేను ఇవ్వను.’’ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు మాటంటే మాటే! చీరెలివ్వడు. గోకులంలో పెద్దలు చూస్తే దెబ్బలు తప్పవు. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు స్నేహితులు. మెల్లగా తప్పుకున్నారు అక్కణ్ణుంచి.*


*ఇంతలో స్నానాలు పూర్తయ్యాయోమో! చీరెలు కోసం ఒడ్డుకేసి చూశారు గోపికలు. లేవక్కడ. ఆందోళన చెంది, అటూ ఇటూ చూశారు. చెట్టుమీద చీరెలు పట్టుకుని కూర్చున్న చిన్నికృష్ణుడు కనిపించాడు. నవ్వుకున్నారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు ఈశ్వరుని తన మనస్సు అనే మణిపాదుకలు ధరించి విహరింపుమని  ఈ శ్లోకంలో వేడుకున్నారు.*


*శ్లోకము : 64*


*వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మార సంమర్దనం*


*భూభృత్ పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణమ్ ।*


*కర్మేదం మృదులస్య తావకపద ద్వన్ద్వస్య గౌరీపతే*


*మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు ।।*


*తాత్పర్యము :-*


*పార్వతీ పతీ !  ఈశ్వరా మార్కండేయుణ్ణి   రక్షించేటప్పుడు యముడి రొమ్మును తన్నడం, కఠినుడైన అపస్మార రాక్షసుణ్ణి కాలితో మర్దించడం, కైలాస పర్వత సంచారమూ, నమస్కరించే దేవతల శిరస్సునందలి కిరీటాలతో ఒరిపిడి , మొదలైనవన్నీ  నీ మెత్తని పాదాల జంట చేసే పనులు.  అందువల్ల నీ పాదాలకు బాధ కలుగుతుంది.  ప్రభూ ! శివా ¡ నా చిత్తము అనే రత్నమయ పాదుకలతో విహరించడానికి సర్వదా  అంగీకరించు.*


*వివరణ : -*    


*శంకరులు ఈశ్వరుడికి ఇలా విన్నవించారు.*


*ಓ గౌరీ నాథా !  ఈశ్వరా !  ఆ యముడు ఉక్కు పిండంలాంటి వాడు.  అతడి రొమ్మును నీవు తన్నావు.  యముడి కంటే కఠినుడు అపస్మారుడనే రాక్షసుడు. వాడిని నీవు కాళ్ళతో త్రొక్కి చంపవలసి వచ్చింది.  ఇదీ గాక , నీవు సంచరించే ప్రదేశాలు సైతం పర్వతాలు.  అవి రాళ్ళగుట్టలతో నిండి ఉంటాయి. నీవు కైలాస పర్వతం పై తిరగాలి. దేవతలూ, దేవతానాయకులూ తమ కిరీటాలతో కూడిన తలలను, నీ పాదాలవద్ద వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు.   ఆ కర్కశ వజ్ర కిరీటాల తాకిడి, నీ పాదాలకు అధికంగా ఉంటుంది.*  


*కాబట్టి ఒకమాట చెపుతాను విను.  నీకు ఇటువంటి సమయాల్లో మంచి పాదరక్షలు  కావాలి.  నా హృదయం చాలా గట్టిది. నా హృదయాన్ని నీకు మణిపాదుకలుగా చేసి సమర్పిస్తాను.  నీవు సర్వ కాలాలయందూ నా చిత్తమనే మణిపాదుకలు ధరించినడు. అప్పుడు నీ పాదాలకు నొప్పి తగలదు ప్రభూ.*


*శివ పాదపద్మాలు, మృత్యుభీతినీ, అపస్మారస్థితినీ (మతిస్థిమితం లేకుండా ఉండడాన్ని)  రాజాశ్రయమునూ, మణులవంటి వాటియందు నిస్పృహత్వాన్ని కలిగిస్తాయనీ, అటువంటి పాదాల, ఎల్లప్పుడూ తన హృదయంలోనే  ఉండాలనీ శంకరులు ఈ శ్లోకంలో  కోరుకున్నారు*.  


*తన హృదయంలో ఈశ్వరుణ్ణి తన పాదాలను ఉంచమని,  శంకరులు

ఈవిధంగా కోరుకున్నారు.*


*శ్రీ సూక్తంలో కూడా ఇదే విధంగా*


*"విశ్వ ప్రియే  విష్ణు మనోనుకూలే త్వత్ పాద పద్మం మయి సన్నిధత్స్వ" అని ప్రార్థన చేశారు.*


*అర్థం ఏమంటే  "లోకానికి ప్రియమైనదానా !  విష్ణువు మనస్సునకు అనుకూలురాలైనదానా!  లక్ష్మీ మాతా !  నీ పాదపద్మాలను నాపై మోపి నన్ను అనుగ్రహించు"*


*భగవంతుని పాద స్పర్శ, మనకు సకల శుభములనూ ప్రసాదిస్తుంది. అందుకే శంకరులు తన మనస్సు అనే మణి పాదుకలతో విహరించమని ఈశ్వరుణ్ణి కోరారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శివ భక్తి యొక్క విచిత్రతను  శంకరులు  ఈ శ్లోకములో చెప్పారు.*


*శ్లోకము :63*


*మార్గావర్తిత పాదుకా  పశుపతే రంగస్య  కూర్చాయతే*

               

*గండూషాంబు నిషేచనం పురరిపో ర్దివ్యాభి ‍షేకాయతే*

               

*కించిద్భక్షిత  మాంస శేషకబళం  నవ్యోపహారాయతే*

               

*భక్తిః  కిం న కరోత్యహో  వనచరో భక్తావతంసాయతే !!*


*పదవిభాగం :-*


*మార్గావర్తిత పాదుకా _ పలుమార్లు దారినడచిన పాతచెప్పు*


*అంగస్య _ అవయవమునకు*


*కూర్చాయతే _ చీపురైనది*


*గండూషాంబు నిషేచనం _ పుక్కిలించి నీరు చల్లుట*


*పురరిపోః  _ త్రిపురాంతకునికి*


*దివ్యాభిషేకాయతే _ గంగాజలముతో అభిషేకమైనది*


*కించిద్భక్షితమాంస  శేషకబళం _ కొంచెం తినగా మిగిలిన మాంసపుతునక*


*నవ్యోపహారాయతే _ క్రొత్త నివేదన ద్రవ్యమగుచున్నది*


*భక్తిః _ భక్తి*


*కిం న కరోతి _ ఏమి చేయలేదు?*


*అహో _ ఎంత విచిత్రము!*


*వనచరః _ కిరాతుడు*


*భక్తావ తంసాయతే _ ఉత్తమ భక్తుడగుచున్నాడు.*


*తాత్పర్యము :~*


*ఆహాహా !  ఏమి శివభక్తి యొక్క మహిమా చమత్కారము. అడవి దారులందుతిరిగే  అపరి శుద్దమైన చెప్పు, శివలింగమును తుడిచే కుంచె అయ్యింది. నోటితో నీటిని పుక్కిలించి చల్లడం, శివునికి దివ్య అభిషేక మయ్యింది. కొంచము తినగా మిగిలిన మాంసపు ముక్క  క్రొత్త నైవేద్యమయ్యింది. ఏమాశ్చర్యము !  భక్తి ఏమైనా చేయగలదు. అటవికుడు భక్తులలో అగ్రగణ్యుడు అయ్యాడు.*


*వివరణ :~*


*ఈశ్వరా !  ఇది ఎంతో ఆశ్చర్యం. పాత చెప్పు  ఈశ్వరుని నిర్మాల్యం తుడిచే కుంచె అయ్యింది. పుక్కిలితో తెచ్చిన నీరు పరమశివుడి దివ్యాభిషేకానికి పనికి వచ్చింది. ఎంగిలి మాంసపు ముక్క క్రొత్త నైవేద్య పదార్థంగా ఉపయోగపడింది.  భక్తి యన్నది ఏమైనా చేయగలదు.*


*కొండలలో తిరిగే కోయవాడు భక్తులలో శిరోమణి అయ్యాడని శంకరులు శ్రీ కాళహస్తిలో జరిగిన తిన్నడి కథను దృష్టిలో ఉంచుకొని ఈ శ్లోకము చెప్పారు.*


*ఈశ్వరుడికి భక్తుల మనస్సులోని భక్తి మీదనే దృష్టి గానీ ఆచారం, నియమాలపై అంతగా ఆసక్తి యుండదు. ఇందుకు ఉదాహరణంగా శంకరులు శ్రీ కాళహస్తి మహాత్మ్యమును తెలిపే గాథలలోని తిన్నడి గాథను ఉదహరించారు.*  


*తిన్నడికి కన్నప్ప అనే పేరుంది. శ్రీకాళహస్తి క్షేత్రమునకు దగ్గరలో "ఉడుమూరు " అనే బోయపల్లె ఉండేది. ఆపల్లెలో శివభక్తులయిన బోయ దంపతులకు తిన్నడనే కుమారుడుండేవాడు. తిన్నడు శివభక్తుడు. తిన్నడు వేటకు వెళ్ళాడు. అతనికి ఒక వరాహము కంటబడింది. అది తిన్నడి బాణానికి అందకుండా పోయి ఒక పొదలో మాయ మయ్యింది.*


*ఆ పొదలో ఒక శివలింగం తిన్నడికి కనిపించింది. తిన్నడా శివలింగాన్ని నిత్యమూ పూజించేవాడు.*


*తిన్నడు విల్లు చంకలో పెట్టుకొని, అమ్ములపొది వీపున కట్టుకొని, మాంసం దొప్పలు రెండు చేతుల్లోనూ పెట్టుకొని సువర్ణముఖీ నదీ జలాన్ని పుక్కిలిలో ఉంచుకుని శివలింగం దగ్గరకు వచ్చేవాడు. శివలింగం మీద అంతకు ముందు పూజచేసిన పత్రిని తన చెప్పుకాలితో ప్రక్కకు నెట్టి, పుక్కిటి జలంతో శివుడికి అభిషేకం చేసి, తాను మొదట రుచి చూసి తెచ్చిన ఎంగిలి మాంసాన్ని శివుడికి నైవేద్యముగా పెట్టేవాడు.*


*ఇలా తిన్నడి కాలి చెప్పు శివలింగాన్ని శుభ్రం చేసే కుంచె అయ్యింది.  పుక్కిటి నీరు శివునికి దివ్యాభిషేక జలమయ్యింది.* *దొప్పల్లోని ఎంగిలి మాంసం నైవేద్యంగా శివుడికి తిన్నడర్పించాడు.  ఆ ఎంగిలి మాంసమే శివుడికి నైవేద్యమయ్యింది. తిన్నడి శివభక్తికి, ఈశ్వరుడు సంతోషించాడు.* 


*తిన్నడు నిత్యమూ లింగానికి పూజాదులు సాగిస్తున్నాడు. శివుడు తిన్నడ్ని భక్తిని పరీక్షింప దలచి తనకంటి నుండి నీటిని కార్చాడు. తిన్నడు దానికి మందూ మాకులూ తెచ్చి వైద్యం చేశాడు. అయినా నీరు కారడ మాగలేదు. సరికదా రక్తం కారడమారంభమైంది. చివరకు తిన్నడు శివుడి కంటికి బదులుగా తన కన్నును తీసి పెట్టాడు. శివుని కంట రక్తం కారడమాగింది.  కానీ రెండవ కంటినుండి రక్తం వచ్చింది. తిన్నడు తన రెండవ కంటిని కూడా తీసి శివుడికి కన్నుగా అమర్చ బోయాడు. శివుడి కన్ను ఎక్కడ వుందో గుర్తు కోసం శివలింగంపై తన చెప్పుకాలితో తిన్నడు గుర్తు పెట్టుకున్నాడు. తిన్నడు తన రెండవ కంటిని పెకలింప బోగా శివుడు ప్రత్యక్షమై తిన్నడిని వారించాడు. తనకు కన్నునిచ్చిన తిన్నడిని మెచ్చుకున్నాడు. " కన్నప్ప " అని పిలిచాడు. కాళహస్తీశ్వరుని  భక్తులలో మేటి అయ్యాడు.*


*నాటినుండి శ్రీ కాళహస్తీశ్వరునకు నైవేద్యం పెట్టే ముందు గానే, కన్నప్పకు అర్చకులు నైవేద్యం పెడుతున్నారు*


*పై కథనే దృష్టిలో యుంచుకుని శంకరులు ఈ శ్లోకము వ్రాశారు.  

ముక్కంటినే ముగ్ధుణ్ణి చేసిన తిన్నడి గాఢభక్తి ఎంతటిదో ఆలోచించండి. దీన్ని బట్టి చూస్తే భక్తి ప్రధానము గానీ మంత్ర తంత్రాలు ముఖ్యమైనవి కావనీ 

ఈశ్వరుడు  భక్త సులభుడని తెలుస్తోంది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️