21, మార్చి 2023, మంగళవారం

ఉగాది పచ్చడి

 ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం


శ్లో" శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్ ||


సనాతన ధర్మం అర్ధం:- 

వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై, సర్వారిష్టాలూ  తొలగిపోతాయనీ.... నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.


ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది:-


శ్లో" అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల మృతైర్యుతమ్ భక్షితం పూర్వయామేస్యా తద్వర్షం సౌఖ్యదాయకమ్ ||,


అర్థం:- ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... ఆ సంవత్సరం అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం....

క్రొత్త అమావాస్య



: 🙏🌹నేడు క్రొత్త అమావాస్య🌹🙏


ఉగాదికి ముందు రోజును *క్రొత్త అమావాస్య* అనడం ఒక వాడుక. ముఖ్యంగా గుంటూరు, క్రిష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలలో చాలా విశేషంగా చెప్పుకుంటారు.


రాబోయే క్రొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కనుక క్రొత్త అమావాస్య అని మన పెద్దలు అంటూంటారు.


క్రొత్త అమావాస్య నాడు గ్రామ దేవత (నూకాలమ్మ, మరిడమ్మ, పోలేరమ్మ, దుర్గాలమ్మ మొదలైన గ్రామదేవతలు) లను ఆరాధించుతారు. ఈ రోజున అమ్మవారికి ఉపారములు (అమ్మవారికి పెట్టే నైవేద్యములు) పెడతారు.అవి వేడి ఉపారము, చల్లని ఉపారము అని కడుపు చలువకోసం (తమ పిల్లలు చల్లగా ఉండాలని) పెడతారు. పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలికి ఇస్తారు. 


క్రొత్ప అమావాస్యనాడు ముఖ్యంగా పప్పు (పెసర పప్పు), తెలగపిండి (నువ్వుల చెక్క) కూర చేస్తారు. ఇంకా పోలి పూర్ణం బూరెలు, గారెలు  వడపప్పు, పానకం, పెరుగు (చల్లని ఉపారంలో ఇస్తారు).


ఇంటిలో ఈశాన్యంలో గోడకు గుండ్రంగా పసుపురాసి (అమ్మవారి ముఖం వలె), కుంకుమతో బొట్టుపెట్టి అమ్మవారిని ఆహ్వానించి పూజించుతారు.


అమ్మవారికి నైవేద్యంగా మూడు విస్తర్లు వేసి,వండిన పదార్థములను వడ్డించి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. అనంతరం అమ్మవారిని ధ్యానించి, తమ పిల్లలు చల్లగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని మ్రొక్కుకుంటారు.


అమ్మ వారికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలిని పిలిచి అతనికి ఇస్తారు. 


🙏🌹🙏🌹🙏🌹



: *రేపే ఉగాది* పర్వదినం..  *శోభకృత్ నామ సంవత్సరం శోభాయమానంగా రానుంది*.  *ఈ సందర్భంగా మనందరి జీవితాలు ఆరు రుచులతో ఆరోగ్యంగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం*.  ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి నాలుగు మాటలు.  ఉగాది పండుగ నాడు తయారుచేసే ఆరు రుచుల ఉగాది పచ్చడిలో పలు ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.  దీనికి మూలం ఆయుర్వేద శాస్త్రం.  తెలుగువారి భోజన సంప్రదాయాలు ఆయుర్వేదంతో ముడిపడి ఉన్నాయి.  *ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజూ యీ ఉగాది పచ్చడి తింటే రానున్న వేసవికి శరీరం  తట్టుకోగలదని మన పూర్వీకులు ధృవీకరించారు*..  సమ పాళ్లలో ఆరు రుచులు ఉండాలి.  అంతేకాకుండా ప్రతీరోజూ కూడా మన ఆహారంలో యీ ఆరు రుచులు..  ఉప్పు కారం తీపి పులుపు వగరు చేదు..  ఉండేలా చూసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తారు.  బెల్లంలో తీపి, చింతపండు రసంలో పులుపు, మిరియాల పొడిలో కారం, లేత మామిడి పిందెల్లో వగరు, వేపపువ్వులో చేదు.. ప్రధాన రుచులుగా ఉంటాయి.  యీ ఆరు రుచుల శక్తివంతమైన ఆహారమే ఉగాది పచ్చడి.  ఆయుర్వేద శాస్త్రం ఏ రుచికి ఏ గుణం ఉంటుందో స్పష్టంగా చెప్పింది.  పరిమితిగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు, అతిగా తీసుకుంటే కలిగే నష్టాలు కూడా వివరించింది. గనుక యీ ఆరు రుచులు సమపాళ్లలో రంగరించి ఉగాది పచ్చడి చేసుకోవాలి.  చాలామంది ఉగాది పచ్చడిలో ఉండే వగరు చేదు రుచుల వల్ల తినడానికి అంతగా ఇష్టపడరు.  ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా ఉగాది పచ్చడి ఒక్క ఉగాది రోజునే కాకుండా ఓ వారం పదిరోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. *మా తరఫున మీ అందరికి, మీ కుటుంబ సభ్యులకి  శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*....

ఉగాది

 [20/03, 6:53 am] K Sudhakar Adv Br: 🙏🕉️🌹🌷🙏🌷🌹🕉️🙏


           🕉️ *శ్రీ శివ కవచం*🔯


🌴ప్రతీరోజూ ఈ స్తోత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది🌴


_*పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః| పశ్చిమే పాతు విశ్వేశో,  నీలకంఠ స్థధొత్తరే | ఈశాన్యాం పాతు మే శర్వో, పార్వతీ హ్యగ్నేయం పార్వతీ పతిః | నైరుత్యాం  పాతు మే రుద్రోణుడు, వాయవ్యాం నీలలొహితః| ఊర్ధ్వే త్రిలొచనః పాతు, అధరాయం మహేశ్వరః| ఏతోభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః| నమశ్శివాయ సాంబాయా శాంతాయ పరమాత్మనే| మృత్యుంజయాయ రుద్రాయ మహదేవాయతే నమః||*_


_*అర్థము:-* తూర్పున పశుపతి, దక్షిణాన శంకరుడు, పడమరన విశ్వేశ్వరుడు, ఉత్తరాన నీలకంఠుడు, ఈశాన్యాన శర్వుడు, ఆగ్నేయంలో పార్వతీపతి, నైఋతిలో రుద్రుడు, వాయవ్యంలో నీలలోహితుడు, పైన త్రిలోచనుడు, క్రింద మహేశ్వరుడు…_

_ఇలా వివిధ నామాలతో పదిదిక్కులలో అన్ని విధములుగా  శివుడు నన్ను కాపాడుగాక!! అంబాసమేతుడు, శాంతస్వరూపుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, రుద్రుడు, మహాదేవుడు శివుడు. ఆ స్వామికి నమస్సులు_

_ఈ స్థొత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది._🍒


            🪷🪷 _*సేకరణ*_ 🪷🪷


*ఉగాది విశిష్టత..*


("శోభకృత్"  నామ‌ సంవత్సర ఉగాది)


చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.


శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. 'ఉగాది', 'యుగాది' అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. "యుగాది" శబ్దానికి ప్రతిరూపంగా "ఉగాది" రూపొందింది.


తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.


*ఉగాది పచ్చడి ప్రాముఖ్యత..*


ఉగాది రోజు ముఖ్యమైన వంటకం "ఉగాది పచ్చడి". షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి లోని ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.


బెల్లం- తీపి:

ఆనందానికి ప్రతీక!


ఉప్పు:

జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం!


వేప పువ్వు- చేదు:

బాధకలిగించే అనుభవాలు!


చింతపండు- పులుపు:

నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు!


పచ్చి మామిడి ముక్కలు- వగరు:

కొత్త సవాళ్లు!


కారం:

సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు!



*ఉగాది రోజున.....* 


తైలాభ్యంగనం......................

నూతన సంవత్సరాది స్తోత్రం....

నింబ కుసుమ భక్షణం.............

ధ్వజారోహణం......................

పంచాంగ శ్రవణం...................

 

మున్నగు "పంచకృత్య నిర్వహణ" గావించవలెనని వ్రతగంధ నిర్ధేశితం.


సంవత్సరాది నాడు ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో కూడా మనకు శాస్త్రమే చెప్పింది. 


యద్వర్షాధౌ నింబసుమం 

శర్కరామ్లఘృతైర్యుతం 

పశ్యతం పూర్వయామేశ్యా 

తద్వర్షం సౌఖ్యదాయకం!!

 

అంటుంది శాస్త్రం. నింబసుమం అంటే వేపపూత. ఉగాదిపచ్చడిలో ఇది

ప్రధానంగా ఉండాలి. వేపచెట్టు పరదేవతా స్వరూపం. వసంత ఋతువులో మాత్రమే పూచే వేపపువ్వులో విశేషమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఆ వేపపువ్వును మొదటిగా నీటిలో కలపాలి. బెల్లం మంగళద్రవ్యం. దానికి నిలవ దోషంలేదు. వేపపువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు. ఆ తరువాత చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్ధంగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అందులో కొంత

ఆవునెయ్యి కలపాలి. భగవంతుని పేరిట ఏ వృక్షజాతి లేదు. ఆ అదృష్టం ఒక్క మామిడి చెట్టుకే దక్కింది. ఈ వృక్షాన్ని రసాల వృక్షం అంటారు. భగవంతుడిని రసోవై సః అంటారు. అలాంటి పరమపవిత్రమైన మామిడి ముక్కలను కూడా ఉగాదిపచ్చడిలో కలుపుకోవడం మన‌ సంప్రదాయం. వీటన్నింటి మిశ్రమముతో తయారైన షడ్రుచుల ఉగాది పచ్చడిని మొదట ఈశ్వరుడికి నివేదించాలి.


శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ 

సర్వారిష్ఠ వినాశాయ 

నింబకం దళ భక్షణమ్!!


నూతన సంవత్సరాది స్తోత్రం చదువుకుని తొలి యామకాలం దాటకుండానే ప్రసాదం స్వీకరించాలి. ఈ నైవేద్యాన్ని స్వీకరించిన వారికి ఈ సంవత్సరమంతా సౌఖ్యదాయకముగా భాసిల్లుతుంది. తరువాత పెద్దలను గురువులను దర్శించాలి. దైవదర్శనం చేయాలి. గోపూజ, వృషభ పూజ చేయాలి. మామిడిపళ్ళు, చల్లటి మంచినీరు, కొత్త వస్త్రాలు, విసనకర్రలు, మజ్జిగ వంటివి ఇతరులకు దానం చేసుకుంటే ఎంతో మంచిది!!

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.

 *సమరసత సేవా ఫౌండేషన్* 🕉️

               🚩  *ఆంధ్ర ప్రదేశ్*  🚩


🙏 *శ్రీశోభకృత్ ఉగాది  నూతన సంవత్సర శుభాకాంక్షలు*   🙏


మామిడికాయ ,బెల్లం ,చింతపండు

మిరపకాయ ,వేపపూవు ,ఉప్పు 


షడ్రుచులు(ఆరు)తో కూడిన పచ్చడిని తయారుచేసి భగవంతుని కి  నివేదించిన తరువాత అందరూ ప్రసాదంగా పంచుకొని సేవించాలి.


*ఉగాది పచ్చడి తినేముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి*


*శతాయు:వజ్రదేహాయ సర్వసంపత్కారాయచ సర్వారిష్టవినాశాయ నింబకందళభక్షణం*


*శతాయు*- 100 సం ఆయువు

 *వజ్రదేహాయ* వజ్రం లాంటి శరీరం, అనగా సంపూర్ణ ఆరోగ్యం

*సర్వ సంపత్* - సకల సంపదలు 

*కరాయచ* - ఒసగునది.            

*సర్వారిష్ట* - సకల అరిష్టములు, అన్ని ఇబ్బందులు

*వినాశాయ* - నశింప జేయునది 

*నింబకం* ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి 

*దళ బక్షణం* - బక్షించుట వలన,  తినుట వలన. 


*ఉగాది పచ్చడి ఈ భావంతో తినండి.* 👌

శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో..

                 ~ మీ *జగన్నాథ్* 🪷

నిర్వాణ షట్కము

            **నిర్వాణ షట్కము** 


01

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః

    చిదానందరూపః శివోహం శివోహం

    చిదానందరూపః శివోహం శివోహం



ఘనత గల్గిన చిత్తమ్ము  మనసు గాను 

అరయ బుద్ధిని గాను నే నహము గాను 

చెవులు కన్నులు నాసిక  జిహ్వ  గాను

అవని వ్యో మాగ్ని  వాయువు నరయ గాను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను    01


02                                                                 

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః

న వా సప్తధాతుః న వా పంచకోశః

న వాక్పాణిపాదం న చోపస్థపాయుః

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం 


ప్రాణ  సంజ్ఞను  భావింప కాను నేను 

పంచ వాయువు లరయంగ యంచ గాను

రక్త రస మాంస  మేదాస్థి  యుక్త మైన 

సప్తధాతువులను గాను  సంభ్రమముగ

పంచకోశంబులను గాను నెంచ నేను

కర చరణ మాట లేమియు న్నరయ కాను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను  02 


03                                                                 

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్యభావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

    చిదానందరూపః శివోహం శివోహం

    చిదానందరూపః శివోహం శివోహం



ద్వేష మనురాగ  లోభముల్ వెదుక లేవు 

ఆరయ మనురాగ ద్వేషమ్ము లసలు లేవు

మోహలోభంబులును కూడ మొదలు లేవు 

మరియు ధర్మార్థ  కామముల్ మహిత ముక్తి

యేవియును లేవు నాకు నే నేమి కాను

      శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   03



04                                                                 

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా

            చిదానందరూపః శివోహం శివోహం

            చిదానందరూపః శివోహం శివోహం



ఎన్నగా పుణ్య పాపంబు లేవి లేవు 

సుఖము దుఃఖము లనునవి చూడ లేవు 

తీర్థ మఖములు మంత్రముల్ తెలియ లేవు

అనుభవమ్మది  లేదు నా కనుభవించ

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   04     

05                                                                 

న మే మృత్యుశంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం



చనెడుభయమది  లేదింక  జాతిలేదు 

జనని జనకులు తా లేరు జన్మలేదు

కాను  బంధువు  నరయంగ  కాను సఖుడ

కాను నే శిష్యుడను మరి  కాను గురువు

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   05  


 06                                                             

అహం నిర్వికల్పో నిరాకార రూపః

విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం

సదామే సమత్వం న ముక్తిర్న బంధః

           చిదానందరూపః శివోహం శివోహం

           చిదానందరూపః శివోహం శివోహం



లేదు  రూపమ్ము చూడగన్  లేదు మార్పు

ఇల ప్రదేశమ్ము లందున యింద్రియముల

వ్యాప్తి చెందియు ననయమ్ము వరలు చుందు

నరయ సమదృష్టి నుందు నే నన్నిటందు 

ముక్తి బంధమ్ము లవిలేవు రక్తి లేదు

      శివ  చిదానంద రూపమౌ శివుడ నేను 

    శివ  చిదానంద రూపమౌ శివుడ నేను   06


    

అద్భత ఓషధుల మహిమ

 " విశ్వ జీవ నిత్య జీవన గమనంలో మానవాళి పాత్ర మహోన్నతం, అత్యంత కీలకం "                         ప్రకృతి ప్రసాదించే అద్భత ఓషధుల మహిమ వర్ణనాతీతం, సకల జీవ జగతికి సురక్షాత్మకం ! సృష్టిలో ప్రకృతి పాత్ర ప్రతి నిత్యం కడు ప్రశంసనీయం, జీవకారుణ్యతాత్మక జీవనంలో దివ్య సుచైతన్య ప్రకాశం ! విశ్వ మానవాళి తక్షణ కర్తవ్యం, ప్రకృతి పరిరక్షణం తద్వారా సకల జీవ ప్రశాంత జీవన మార్గ నిర్దేశన దార్శనికం ! ప్రకృతి ఒసగెడి సన్మైత్రీ భావనాత్మక సన్మార్గ స్ఫూర్తిమంత సురక్షా జీవన దృక్పథం ! ప్రపంచంలో విభిన్న రీతుల పెల్లుబుకుతున్న వింత విష వ్యాధుల నివారణలో సహజ సిద్ధ ఓషధీ సద్వినియోగానికి మానవాళి నడవాలి, కలసికట్టుగా విశ్వ సురక్షాత్మక స్ఫూర్తితో, తక్షణ విశ్వ పరిరక్షణా దృక్పథంతో ! ఎటువంటి బేధ భావాలు లేని, సకల జీవ సుసంక్షేమాత్మక భావనతో విశ్వ మానవాళి ఏర్పర్చుకోవాలి, చక్కని పటిష్టమైన ప్రణాళిక ప్రస్తుత తరుణంలో !                                   " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! "                          ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః !                                              ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

సుభాషితమ్


           _*సుభాషితమ్*_


𝕝𝕝పద్యం𝕝𝕝 

ఆ.వె.

 *ఆశ విడక కాని పాశ ముక్తుడు గాడు* 

*ముక్తుడైన గాని మునియు గాడు*

*మునికి గాని సర్వ మోహంబు లూడవు*

*విశ్వదాభిరామ వినుర వేమ!*


తా𝕝𝕝 

*ఆశలు విడిచినవాడే బంధాల నుంచి విడువబడు తున్నాడు, అతడే ముక్తుడవుతున్నాడు, అనంతరం మునిగా మారి అన్ని రకాల మొహాల నుంచీ బయట పడుతున్నాడు*.......


              _*సూక్తిసుధ*_



*చేయరాని పనులు:* 

జూదమాడి నలచక్రవర్తి దుఃఖపడెను, పర స్త్రీ మోహముచేత రావణుడు నశించెను, తమ్ముని పగచేత వాలి మృతిబొందెను. దుష్టకృత్యముచేత పరీక్షిన్మహారాజు శపింపబడెను. పరద్రవ్య ఆశచేత దుర్యోధనుడు కీడునొందెను. అహంకారము చేత హిరణ్యకశిపుడు హానిజెందెను. కావున ఈ పనులు పురుషునకు అర్హములు గావు.

అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి

 అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి అవధాని అంత కంటే కొంటెగా సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను . 


ప్రశ్న :- అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో ?

జవాబు :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం .


ప్రశ్న :- భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది? 

జవాబు :- పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం .


ప్రశ్న :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి ? 

జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో... కమ్ కదా .


ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదూ ?

జవాబు:- భర్త చనిపోతూ ‘నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు. 


ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది. 

జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’ 


ప్రశ్న :- ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకు రమ్మన్నారు 

జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు 


ప్రశ్న :- పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి ?  

జవాబు :- అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం .

In in

ప్రశ్న :- అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు? 

జవాబు :- దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను .


ప్రశ్న :- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి ? 

జవాబు :- ప్రశ్నవేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి .


ప్రశ్న :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు 

జవాబు :- రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి .


ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు? 

జవాబు :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం .


ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా ?

జవాబు :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి. 


ప్రశ్న :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు 

జవాబు :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను. 


ప్రశ్న :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు .


ప్రశ్న :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట నిజమా? 

జవాబు :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది .


ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా ?

జవాబు :-పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు .


ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా ?

జవాబు :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను .


ప్రశ్న :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి? 

జవాబు :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి .


ప్రశ్న :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా ?

జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద. 


ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి? 

జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి .


ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు ?

జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా .


ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు? 

జవాబు:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’ 


ప్రశ్న:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు? 

జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను. 


ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?

జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి.

మీదే పురుషులు ఆధారపడుతారు గనుక .


ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు

జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని

భయపడేవాడు ప్రేమికుడ ... మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త 


ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?

జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే ' కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయి పేరు .


ప్రశ్న:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరి గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి? 

జవాబు: - ‘ఆపిక’ వెంటనే అవధాని సమాధానం

వడ్లు గురించి

 వడ్లు గురించి సంపూర్ణ వివరణ  - 1 


       వడ్లను సంస్కృతం నందు "శాలి ధాన్యం" అని పేరుతో పిలుస్తారు . సాధారణముగా హేమంత ఋతువులో పైరగుట వలన "హైమంతిక ధాన్యం " అని కూడా పిలుస్తారు . సంస్కృత నిఘంటుకార్తలు వడ్లను రెండు తెగలుగా విడదీసి శాలిధాన్యం అని వ్రీహీ ధాన్యం అని పిలుయుచున్నారు. వ్రీహి ధాన్యం అనునది వర్షాకాలం నందు పండును. శాలిధాన్యం అనునవి హేమంత ఋతువు నందు పండును అని సంస్కృత నిఘంటుకర్తల అభిప్రాయం . 


                  వ్రీహిధాన్యము నందు కృష్ణ వ్రీహి ధాన్యము ( నల్ల వడ్లు ) , పాటల వ్రీహి ధాన్యము , కుక్కు తాండకములు , శాలాముఖములు , జంతుముఖములు అని రకాలు కలవు  . వ్రీహి ధాన్యము పాకము నందు తియ్యగా ఉండటం , చలవనిచ్చుట , కొద్దిపాటి మలబద్దకం కలగచేయుట , వ్రీహి ధాన్యము అన్నింటిలో కృష్ణ వ్రీహి ధాన్యము మిక్కిలి శ్రేష్టమైనది . ఈ ధాన్యము యొక్క అన్నము తియ్యగా , తెల్లగా ఉండును. కొంచం వగరు కలిగి పిత్తాన్ని హరించును . వీర్యవృద్ధిని ఇస్తూ , క్రిమిరోగములు , కఫవ్యాధులు , రక్తపిత్త వ్యాధులు , తాపదాహములు మొదలగువాటిని పోగొట్టి బుద్ది సూక్ష్మత కలిగించును . కొంచం వాతమును కూడా కలిగించును. ఈ వ్రీహిధాన్యములో షష్ఠికములు ( ఆరు నెలలకు పండునవి ) , మహా వ్రీహి ధాన్యము ( పెద్ద వడ్లు ), యవక ధాన్యము , పాక వ్రీహి ధాన్యము , రక్తసార ముఖములు ( ఎర్ర మొల కోలుకులు ) మొదలగు రకాలు కూడా కలవు . 


            శాలి ధాన్యము నందు రక్తశాలి , మహాశాలి , సుగంధప్రసవ , బృందారక , ముష్టక , శావరశాలి మొదలైన రకాలు కలవు . అన్నము రుచికరంగా , స్నిగ్దముగా ( చమురు కలిగి ) , బలమును , వీర్యమును , లఘుత్వమును ఇచ్చునదై , చలువనిచ్చునదై ఉండును. 


         తరవాతి పోస్టు నందు అతిముఖ్యమైన వడ్ల రకాలు , వాటిలోని ఔషధ గుణాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 


             


         

జ్ఞాని మాత్రం చలించడు

 శ్లోకం:☝️

*ప్రళయే భిన్నమర్యాదా*

 *భవన్తి కిల సాగరాః ।*

*సాగరా భేదమిచ్ఛన్తి*

 *ప్రళయేఽపి న సాధవః ।।*

  - చాణక్య నీతి 3.6


భావం: స్థితిలో ఉన్న సృష్టి లయ తప్పడమే ప్రళయం. ఆ ప్రళయ కాలంలో సముద్రాలు కూడా తమ హద్దులను ఉల్లంఘించి తీరాలు దాటి పొంగుతాయి, కానీ స్థితప్రజ్ఞుడైన జ్ఞాని మాత్రం చలించడు.