9, అక్టోబర్ 2020, శుక్రవారం


 


 

యజ్ఞం


 

జాతక రీత్యా

 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘


      _*👌*మీరు గమనిస్తే రెప్పపాటు కాలంలో అంటే ఒక్క క్షణంలో కనీసం నలుగురైనా ఈ భూమిపైన మనుషులుగా జన్మిస్తూ ఉంటారు. మరి ఒకే సమయంలో పుట్టిన వారందరూ జాతక రీత్యా ఒకే రకమైన జీవితం గడపాలి కదా? కానీ అలా జరగడం లేదే, మరి అందుకు కారణం ఏమిటో ఒకసారి పరిశీలిద్దామా..*_👌


      _**ఇదే విషయాన్ని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. జాతకం రిత్యా ఒకేసారి జన్మించిన వ్యక్తులు ఒకరు ఉచ్చ స్థితిలో ఉన్నారు, మరొకరేమో నీచ స్థితిలో ఉన్నారు. మరి దీనికి కారణాన్ని మీకు తెలియజేయడానికి మీకు ఒక కథనాన్ని అందిస్తున్నాను. దాన్ని పరిశీలించి మీరు జవాబును పొందవచ్చు. మగద సామ్రాజ్యానికి రారాజు మదన కామరాజు గారు. వారి జన్మదినం సందర్భంగా రాజ్యంలోని ప్రజలంతా వైభవంగా రాజుగారి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆరోజు రాత్రి పడుకున్న రాజుగారికి తన ఇంతటి వైభవవంతమైన జీవితానికి కారణమైన తన జాతకాన్ని తీసి ఒకసారి చూడాలని అనిపించింది.*_


     _**అలా తన జాతకాన్ని తీసి చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. నేను పుట్టిన రోజే ప్రపంచంలో అనేకమంది పుట్టివుంటారు కదా. కానీ వాళ్ళంతా నాలాగే రాజులు కాలేదు, మరి నేను మాత్రమే రాజును ఎందుకయ్యాను? ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలని మరుసటిరోజు సభలో పండితులను ఇదే ప్రశ్న అడుగగా వాళ్ళు చెప్పిన సమాధానాలు రాజుకు తృప్తిని ఇవ్వలేదు. అంతలో ఒక వృద్ధ పండితుడు రాజా, ఈ నగరానికి తూర్పున వున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు, ఆయనను వెళ్ళి కలవండి. మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అన్నాడు.*_


     _**రాజు ఆ సన్యాసిని కలవడానికి అడవికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. అది చూసి రాజు ఆశ్చర్య పోయినా, తన ప్రశ్నకు సమాధానం ఏమిటని అడుగగా ఆయన అన్నాడు ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఇలాంటిదే మరొక గుడిశె వుంటుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు, వెళ్ళి ఆయన్ను కలవండి మీకు సమాధానం దొరుకుతుంది అన్నాడు. అసహనంగానే రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. రాజు ఆయన్ని కలిసినపుడు, ఆ సమయంలో ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. రాజు ఆశ్చర్య పోయాడు, కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.*_


    _**కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు. అందుకు రాజుకు కోపం వచ్చినా, సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. వెనుదిరిగిన రాజుతో సన్యాసి మళ్ళీ ఇలా అన్నాడు ఇదే దారిలో ఇంకొంచెం ముందుకు వెళితే ఒక గ్రామం వస్తుంది. అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి మీకు సరైన సమాధానం దొరుకుతుంది అన్నాడు. ఇదంతా రాజుకు గందరగోళంగా అనిపించినా ముందుకు వెళ్ళి చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. అపుడు ఆ అబ్బాయి చెప్పాడు, గత జన్మలో నలుగురు బాటసారులు అడవిలో ప్రయాణిస్తూ వున్నారు.*_


     _**ఆకలి వేయడం వల్ల ఆ నలుగురు ఒక చెట్టుక్రిందకు చేరి తమవెంట తెచ్చుకొన్న తమ ఆహారాన్ని తినే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతలో అక్కడికి బాగా ఆకలితో నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి బాగా ఆకలిగా ఉంది నాయనా ! నాకూ కొంచెం ఆహారం ఇవ్వండి అని అడిగితే ఆ నలుగురిలో మొదటవాడు కోపంతో పోపో నేను తెచ్చుకొన్నది నీకు ఇస్తే ఇంక నేను బొగ్గులు తినాలా అంటూ కసురుకొన్నాడు. రెండవ వ్యక్తిని అడిగితే.. నేను తినాల్సినది నీకు ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని కోపంగా అన్నాడు. ఇక మూడవ వాడు ఏం ఈ పూట తినకపోతే ఈ రాత్రికే నీవేమైనా చస్తావా? అని మానవత్వం లేకుండా మాట్లాడాడు.*_ 


     _**కానీ నాల్గవవాడు మాత్రం చూడు తాతా, నీవు చాలా నీరసంగా వున్నావు, నేను తెచ్చుకున్న ఆహారాన్ని నీకు ఇచ్చేస్తాను, ఈ పూట తినకపోతే నాకేమీ కాదులే అంటూ తన ఆహారాన్ని మొత్తంగా ఆ ముసలాయనకు ఇచ్చేశాడు. అలా ఇచ్చేసిన ఆ నాల్గవ వ్యక్తివి ఎవరోకాదు నువ్వే. అలా ఆకలి గొన్న వారికి నీ ఆహారాన్ని ఇచ్చిన ఆ పుణ్యఫలం వలన ఈ జన్మలో నీవు రాజువు అయ్యావు అని అన్నాడు. రాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. చూడు రాజా అవసరంలో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వల్ల మహా పుణ్యాన్ని పొందుతారు. అలాంటి పనిని నీవు చేయడం వల్ల నీవు ఈ జన్మలో రాజుగా జన్మించావు.*_


     _**ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండికూడా అలా సహాయం చేయని వారు ఇదిగో మాలాగా అధోగతి పాలౌతారు. అందుకే మేము ఇలా నీచమైన జన్మను పొంది కష్టాలను అనుభ విస్తున్నాము. నీవేమో మహారాజువి అయ్యావు. కానీ నీవు, నేను రాజును నా దగ్గర ధనముంది అన్న అహంకారంతో ప్రవర్తిస్తూ ఇతరులకు సహాయం చేయకుండా, ఇతరులను నష్టపరచడం, కష్టపరచడం, బాధపెట్టడం వంటి పనులు చేస్తే నీవు కూడా మట్టిగొట్టుకు పోతావు. జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. అనవసరమైన విషయాలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె ఆదరించి పాలించు అని చెప్పి కన్ను మూశాడు..*_


           _**కాబట్టి మిత్రులారా ! చిన్నతనంలో జాతకాలు భేషుగ్గా బావున్నాయని మురిసి పోకండి. ఇక్కడ నీ జాతకాన్ని కూడా మార్చగల శక్తి నువ్వు చేసే కర్మలకు ఉంది. అది నీవు చేసే కర్మల పైన ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే ఉత్తముడిగా తయారై పుణ్యాన్ని మూటగట్టు కొంటావు. అలాకాకుండా ఇతరులను నష్టపరిచి కష్టపెట్టే చెడుపనులు చేస్తే నీచుడుగా తయారై పాపాన్ని మూటగట్టు కొంటావు. కాబట్టి అందరూ కూడా ఇతరులకు మీ చేతనైన సహాయం తప్పకుండా చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకొని పుణ్యాత్ములుగా జీవిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_👌


_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘


       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌


       _**For Every Action Equal &*_   

             _*Opposite Reaction**_

మంత్రపుష్పం

 సాధారణంగా పుష్పం అనేదానిని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు ఒక్కొక్క డానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో. ధూపం వేస్తాం. చెవులు ఇచ్చాడు. ఎన్నో ఉపకారాలు పొందుతున్నావు. అందుకని పువ్వులతో పూజ చేస్తున్నావు.


వినడానికి పువ్వుకు సంబంధం ఏమిటి అంటే తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనే తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయాయి. కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి డానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత. 


అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు. చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు. 


అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో. లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం. 


మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం. 


ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డులో పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి కొడుతోంది, క్రిందకి కొడుతోంది, ప్రక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది జీవుడు. 


‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు. 


వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. కాబట్టే ఆ తొడుగుకు ఆకలి వేస్తోంది, నిద్రవస్తోంది. అది లేనినాడు ఆ తొడుగు శవం. అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఆకలి దానివల్లనే వస్తోంది, ఆకలి తీరింది అని దానివల్లే తెలుసుకుంటోంది. జ్ఞాని ఎలా చూస్తాడంటే తనలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకు నామరూపాలు కాదు. లోపల ఉన్నది అన్నింటిలో నేనే. తెలిసో తెలియకో ఎక్కడ ఉన్నాడు అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు ‘నేను’ అని. 


అంటే ఎవరు ఆ నేను? – భగవంతుడు. ఆ ‘నేను’ అక్కడా ఉంది. ‘నేను’ ‘నువ్వు’ – ఈ ‘నేను’కి, ‘నువ్వు’కి మధ్య స్వార్థం అంతా వస్తుంది. ‘నువ్వు’ పాడైపోయినా పర్లేదు, ‘నేను’బాగుండాలి. కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒక్కటే – జ్ఞానం. ఇక తరతమాలు లేవు, బేధాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. 


అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం. 


అది మననాత్ త్రాయతే’ ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటావో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం అయింది. ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది. 


కాబట్టి ఆ వికసనాన్ని - ఇవ్వు అని విన్నదానిని పట్టుకుని ప్రయత్నం కోసం, అనుగ్రహం కోసం అడగడం ఆ భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివరలో మంత్రపుష్పం. పూజ అంతర్భాగంలో పుష్పార్చన.

A Fabulous Statement about Life.

 

Do please read it, tonite, tomorrow morning or anytime later. 

BUT PLEASE DO READ IT.

🙏

*A Pencil is not just a Pencil!*


Once upon a time........

A boy was watching his grandmother write a letter. 

At one point he asked:

‘Are you writing a story about what we’ve done? Is it a story about me?’


His grandmother stopped writing her letter and said to her grandson:

I am writing about you, actually, but more important than the words is the pencil I’m using. I hope you will be like this pencil when you grow up.’


Intrigued, the boy looked at the pencil. It didn’t seem very special.


He said, 'But it’s just like any other pencil I’ve ever seen!’


Granny replied, ‘That depends on how you look at things. It has seven qualities which, if you manage to hang on them, will make you a person who is always at peace with the world.’


‘First quality: You are capable of great things, but you must never forget that there is a hand guiding your steps. We call that hand God, and He always guides us according to His will.’


‘Second quality: Now and then, I have to stop writing and use a sharpner. That makes the pencil suffer a little, but afterwards, he’s much sharper. So you, too, must learn to bear certain pains and sorrows, because they will make you a better person.’


‘Third quality: The pencil always allows us to use an eraser to rub out any mistakes. This means that correcting something we did is not necessarily a bad thing; it helps to keep us on the road to justice.’


‘Fourth quality: What really matters in a pencil is not its wooden exterior, but the graphite inside. So always pay attention to what is happening inside you.’


 'Fifth quality: It always leaves a mark. in just the same way, you should know that everything you do in life will leave a mark, so try to be conscious of that in your every action.'


'Sixth quality : It gets shorter and shorter while in use, so also life. Make the most while it lasts.'


'Finally the Seventh quality of pencil is : It writes till the very end. Be useful and productive till your dying day.'


The pencil may vanish but the impression it leaves, stay on forever...            

 ✏️✏️✏️✏️✏️✏️✏️

యత్ర యత్ర వేద పారాయణం:

 యత్ర యత్ర వేద పారాయణం: కన్నీరు పెట్టుకున్న కంచి స్వామి (పెరియవ ) 

మహాస్వామి వారు మధ్యాహ్నపు పూజ ముగించుకుని తీర్ధ ప్రసాదాలు ఇచ్చే సమయంలో కుంభకోణం సమీపంలోవున్న తిరువిడైమరుదూరు(మధ్యార్జునం) మహాలింగస్వామికి చైత్రపౌర్ణమినాడు 11 మంది ఘనాపాఠీలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించి ప్రసాదం స్వామి వారికి సమర్పించాలని ఉత్సుకతతో ఒక సంపన్నుడైన మిరాశీదారు(భూస్వామి) ఒకరు వరుసలో వేచివున్నారు. మహాలింగ స్వామి ప్రసాదాన్ని కొత్త పట్టుగుడ్డలో చుట్టి తీసుకొనివచ్చాడాయన. ఆరోజు భక్తజన సమ్మర్ధం ఎక్కువగావుంది. మిరాశీదారు వంతు వచ్చింది. మహాస్వామివారియందు అమితమైన భక్తితాత్పర్యములు కలవాడాయన. స్వామివారిని చూస్తూనే భక్తితో వణికిపోతూ సాష్టాంగ నమస్కారంచేశాడు. స్వామివారు కనుబొమలెత్తి వారిని చూసి "ఏమి సమాచారం?" అన్నారు. ఆయన తడబడుతూ ప్రసాదాలను విప్పి వెదురు బుట్టలో విభూతి, చందనము, కుంకుమ, బిల్వపత్రములు, కొబ్బరిచెక్కలు విడివిడిగా వుంచి స్వామి వారికి సమర్పించాడు. ప్రసాదమనగానే ముందుకు వంగి గ్రహించే స్వామి "ఏ క్షేత్రానిది ఈ ప్రసాదం?" అని ప్రశ్నించారు. "స్వామీ! తిరువిడైమరుదూరు మహాలింగ స్వామికి నిన్న రుద్రాభిషేకం చేయించాను, స్వామివారి అనుగ్రహం కోసం ప్రసాదం సమర్పిస్తున్నాను" అన్నాడు మిరాశీదారు….స్వామివారు ప్రసాదాలున్న తట్టవైపు పరీక్షగాచూసి "నీవే ఎంతో స్థితి పరుడవు కదా! రుద్రాభిషేకానికి చందాలుకూడా పోగు చేశావా?" అన్నారు. "లేదుస్వామి! మొత్తంఖర్చు నేనే భరించాను", అన్నాడు నేనే అన్న పదాన్ని వత్తుతూ. “రుద్రాభిషేకం లోకక్షేమంకోసం జరిపించావా?” అన్నారు స్వామివారు. "రెండు మూడుసంవత్సరాలుగా పంటలు సరిగా పండటంలేదు, జ్యోతిష్కులు చైత్ర పౌర్ణమి నాడు అభిషేకం జరిపిస్తే ఫలసాయం ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పారు." అందుకు చేయించాను అన్నాడు మిరాశీదారు. "అయితే నువ్వు ఆత్మార్ధంగానో, లోకక్షేమార్ధమో కాక ఒక కామ్యాన్ని ఆశించి చేశావన్న మాట", అంటూ ప్రసాదాన్ని గ్రహించకుండానే కనులు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు స్వామివారు. ….కొన్ని నిమిషాల తరువాత కనులు తెరిచిన వారిని చూస్తే, జరిగిందేమిటో అవగతమైనట్లు తెలుస్తుంది. "సరే, ఎంతమంది వేదపండితులు వచ్చారు?" అన్నారు స్వామి. మిరాశీదారు "11 మంది" అన్నాడు. "నీవే నిర్వహించావుకదా! వారెవరు? ఏగ్రామానికి చెందినవారు?" అన్నారు స్వామి. అక్కడున్న భక్తులకు స్వామివారు ఎందుకలా తరచి తరచి ప్రశ్నలు వేస్తున్నారో అర్ధం కాలేదు. మిరాశిదారు కాగితం చూచి పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. "ఓహో! అందరూ మహా పండితులు. నీ జాబితాలో తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనాపాఠి గారు వున్నారేమో చూడు". అన్నారు. మిరాశీదారుకు సంతోషంవేసింది. స్వామివారు చెప్పిన ఘనపాఠి గారుకూడా రుద్ర జపంలో పాల్గొన్నారు. "భేష్! భేష్! వేంకటేశ ఘనాపాఠి గారు కూడా వున్నారన్నమాట మంచిది. ఆయన చాలా పెద్ద విద్వాంసులు. మంచి వేద పండితులు. పెద్దవారయి పోయారు. రుద్ర జపం ఎంతో కష్టంమీద చేసి వుంటారు." స్వామివారి ఈ మాటలతో బలంపుంజుకున్న మిరాశీదారు "మీరు సరిగ్గా చెప్పారు స్వామీ! ఎక్కువ భాగం ఆయన పారాయణ చెయ్యకుండా కనులు మూసుకుని కూచుంటారు. దాని మూలంగా సంఖ్య తగ్గిపోతోంది. ఎందుకు పిలిచానా అనుకున్నాను" అన్నాడు. స్వామివారి కనులలో ఉవ్వెత్తున తీవ్రత కనిపించింది. "మనదగ్గర ఏదో కొంచెం డబ్బు ఉంది కదా అని ఎలాగయినా మాట్లాడవచ్చు అనుకోకూడదు. నీకు తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారి అర్హతలేమిటో తెలుసా? అతని చరణ ధూళికి సరితూగవు నీవు. ఆయనను అలా ఎలా అనగలిగావు నీవు. నిన్న ఏమి జరిగిందో నాకు ఇప్పుడు అర్ధమయింది. ఆయనలా కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు నీవు దగ్గరకు వెళ్ళి, “తీసుకున్న డబ్బుకు గట్టిగా వళ్ళు దాచుకోకుండా పారాయణం చెయ్యకుండా నోరు మూసుకుని కూరుచుంటే ఎలా?” అని అన్నావా లేదా చెప్పు" అన్నారు తీక్షణంగా! ప్రదేశమంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దంగా అయిపోయింది…భక్తులందరూ నిశ్చేష్టులయి పోయారు. క్షణంవరకు సాధారణంగా మాట్లాడుతున్న మిరాశీదారు గడగడ వణికి కాళ్ళబలం చాలక మోకాళ్ళమీద ముందుకు పడి బలవంతంగా లేచి నుంచున్నాడు. కన్నులనుండి నీరు జలజల స్రవిస్తుండగా నోటీమీద చేయి అడ్డు పెట్టుకుని, "నాది తప్పే! స్వామీ!దయచేసి క్షమించండి. ఘనపాఠి గారితో సరిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన మాట్లే అన్నాను. క్షమించండి స్వామీ! క్షమించండి" అంటూ ప్రాధేయపడ్డాడు…."ఆగు! అంతటితో ఆపలేదు. ఇంకాఉంది. నువ్వు పండితులందరికి దక్షిణఇచ్చావా? ఎంత ఇచ్చావు?" అన్నారు. "ఒక్కక్కరికీ 10 రూపాయలు ఇచ్చాను""నాకంతా తెలుసు. మళ్ళీ చెప్పు. అందరికీ 10 రూపాయల చొప్పున ఇచ్చావా?" రెట్టించారు స్వామివారు. మిరాశీదారు మౌనంగాఉన్నాడు. స్వామి వదిలేటట్లు లేరు. "చెప్పడానికే సిగ్గువేస్తుందికదూ! నే చెబుతాను ఏమి జరిగిందో! మిగతా పండితులందరికీ నీవు 10 రూపాయలు చొప్పున ఇచ్చావు. వేంకటేశఘనపాఠి గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన సరిగా జపం చేయలేదని 7 రూపాయలకు తగ్గించావు. చేసిన దానికి తగినంత ఇచ్చానని నిన్ను నువ్వు మెచ్చుకుని ఆయనను కించ పరచినందుకు సంతోషించావు. ఆయన ఈషణ్మాత్రం ఈ విషయాన్ని సరుకు చెయ్యలేదు. నిన్ను చూచి ఒక చిరునవ్వు నవ్వి ఇచ్చినది తీసుకున్నారు. చెప్పు ఇది నిజమేనా?" అన్నారు. ఈ విషయమంతా స్వామి వారికి ఎలా తెలుసని భక్తులు ఆశ్చర్య పోయారు…[ఒక ఉపన్యాసంలో రాజగోపాల ఘనపాఠి అనే మహా పండితులు చెప్పారు. రామనామం జరిగేచోటల్లా హనుమంతుడున్నట్లు, వేద పారాయణంజరిగే చోటంతా మహాస్వామి వారు ఉంటారట. వారి …గురువుగారు ఎక్కడైనా పారయణాలలో శిష్యులు బాల చేష్టలు చేస్తుంటే "జాగ్రత్త! సరిగ్గాపారాయణ చెయ్యి. మహాస్వామి వారున్నారు".అనేవారట. మరుసటిరోజు వీరు పెద్ద స్వాములవారిని దర్శనంచేస్తే జరిగినదంతా సినిమాలో చూచినట్లు చెప్పేవారట మహాస్వామి.మిరాశీదారు నిర్ఘాంతపోయాడు. నోట మాటరాలేదు. తేరుకొని తాను తప్పు చేశానని, మరల ఇటువంటితప్పిదం చేయనని మరల మరల వేడుకుంటున్నాడు. కన్నీరుమున్నీరుగా అవుతున్నాడు.స్వామివారు అక్కడితో ఆపలేదు. మరి వారి మనసు ఎంత క్షోభపడిందో? "ఆగు అక్కడితో ఆగితే బాగానే ఉండేది. ఆరోజు బ్రాహ్మణులందరికి రామచంద్ర అయ్యర్ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశావుకదూ! అందరికి నీవే స్వయంగా వడ్డించావు. చక్రపొంగలి అమృతంలా ఉన్నది. మంచి నెయ్యి ఓడుతూ ఉంది. ఆనేతిలో ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు తేలుతున్నాయి. ఆ చక్రపొంగలి నీవే స్వయంగా వడ్డించావు కదూ!" అన్నారు స్వామివారు…తానుచేసిన ఒక మంచిపని శ్రీవారు గుర్తించినట్లుగా మిరాశీదారు, "అవును స్వామీ! నేనే స్వయంగా వడ్డించాను". అన్నాడు."వడ్డించే టప్పుడు పంక్తి మర్యాదను పాటించావా?" అని ప్రశ్నించారు స్వామి….మిరాశీదారునుంచి సమాధానం లేదు…"సరే నేను చెప్తాను. చక్రపొంగలి రుచిగా ఉండడంతో పండితులు మరలమరల మారువడ్డనకై అడిగారు. నీవుకూడా ఆనందంతో వడ్డించావు. కాని వేంకటేశఘనపాఠి మారు అడిగితే, ఒకసారి కాదు అనేకసార్లు, నీవు విననట్లే నటించావు. చాలాసార్లు అడిగారాయన. ఒక్కసారి కూడా నీవు స్పందించలేదు. ఇది పంక్తి మర్యాదా? ఇది ధర్మమా? ఎంత ఘోరంగా అవమానించావు". మహాస్వామివారి మాటలు బాధతో తొట్రుపడుతున్నాయి. ఎంతో విచారంగా కన్పిస్తున్నారు…మిరాశీదారు సిగ్గుతో చితికిపోతూ నిలుచున్నాడు…మహస్వామివారు దండం పట్టుకొని మాలధారి అయిన పరమేశ్వరిని వలె సర్దుకొని నిటారుగా కూర్చున్నారు. మళ్ళీ కొంతసేపు మౌనంగా ధ్యానముద్రలో కనులు మూసికొని ఉద్విగ్నతను అదుపు చేసుకుంటూ .కూర్చున్నారు…కనులుతెరచి సూటిగా చూస్తూ "మిరాశీదారుగారూ! ఒక విషయం అర్ధం చేసుకోండి. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారికి 81 ఏళ్ళు. వారు తన పదహారేళ్ళ ప్రాయంనుండి అనేక శివాలయాలలో రుద్రజపం చేశారు. శ్రీరుద్రం వారి నరనరములలో, వారి నెత్తురులోనూ, వారి ఊపిరిలోనూ వ్యాపించింది. వారు మహాపురుషులు. వారి యెడ నీవు ప్రవర్తించిన తీరు పూర్తిగా పాపభూయిష్టం. పాపం తప్ప మరొకటికాదు." మహాస్వామి వారు ఇక మాటలాడలేక పోయారు. కొంచెంసేపు ఆగి మరలా కొనసాగించారు…."నీవు చేసిన అవమానం ఆయనను కలవరపరచింది. లోతుగా బాధించింది. నీకు తెలుసా? ఆ తరువాత ఆయన ఇంటికి పోలేదు. నిన్న సాయంత్రం ఆయన నేరుగా మహాలింగస్వామి గుడికిపోయారు. మూడు ప్రదక్షిణలు చేసి స్వామి ఎదురుగా నుంచొని ఏమి ప్రార్ధించారో తెలుసా?" మహాస్వామివారికి మాట్లాడటం కష్టమయిపోతుంది. కొంతసేపయినతరువాత కొనసాగించారు."కన్నీరు బుగ్గలమీదుగా జలజల కారుతుండగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి, స్వామికి చేతులెత్తి నమస్కరించి, "అయ్యా! జ్యోతి మహాలింగమా! నేను నీకెంత భక్తుడినో నీకు తెలుసు. నీ సన్నిధిలో నా చిన్నతనం నుండి నే చేసిన రుద్రజపములు నీవు అనేక పర్యాయములు అవధరించావు. ఇప్పుడు నావయసు 81. హృదయం చాలా గట్టిగానే ఉన్నది. కానీ వార్ధక్యం తగ్గిపోయింది. ఇవ్వాళ భోజన సమయంలో ఏమి జరిగిందో చూశవు కదా! ఆ చక్రపొంగలి ..... ఎంతో రుచిగావుంది. నా సిగ్గును ప్రక్కనుంచి, మరికొంచెం వడ్డించమని అర్ధిస్తున్నాను. ఒకసారికాదు....అనేకసార్లు. మిరాశీదారు విననట్లు నటించి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా? నాకు చక్రపొంగలి అంటే ఎంతో ఇష్టం. నేను అర్ధించినా అతడు వడ్డించక పోవడంవలన నేనెంతో బాధపడ్డాను. కానీ స్వామీ! తరువాత నాకీ విధమైన చాపల్యం - అదీ ఒక వంటకంపై ఉండరాదని గుర్తించాను. అందుకే ఇప్పుడు నీ ముందు నుంచున్నాను. కాశీ వెళితే ఇష్టమైన పండు, కూర వదిలిపెడతారని చెబుతారు. నీవు కాశీలో ఉండే మహాలింగానివే! అందుకే నీ ముందు వాగ్దానంచేస్తున్నాను. ఈ నిమిషం నుండి నా శరీరంలొ జీవం ఉండేదాకా చక్రపొంగలే కాదు ఏ మధుర పదార్ధమూ ముట్టుకోను. ఇది నా వాగ్దానము. స్వామీ! ఇక సెలవు." అంటూ కన్నీటితో ఆ ఘనపాఠి నిన్న రాత్రి తన గ్రామం చేరారు. ఇప్పుడు చెప్పండి అయ్యర్ గారూ! నీవు చేసినది మహాపాపం కాదా"? మహాలింగ స్వామి నీ చేష్టితాలను ఒప్పుకుంటారా?"..మహాస్వామివారు మౌనం వహించారు. మూడు గంటలయింది. పరిచారకులు భిక్షకై రావలసినదని ప్రార్ధిస్తున్నారు. ఎవరు ఆ ప్రదేశం వదలి కదలటంలేదు. ప్రతివారి కనులనిండా నీరు.మిరాశీదారు మహాస్వామి పాదముల ఎదుట ఆపుకోలేనంతగా విలపిస్తున్నాడు. మాటలు రావటంలేదు. అయినా ప్రయత్నంమీద "స్వామీ! నా ప్రవర్తనకు సిగ్గు పడుతున్నాను. నేను పెద్ద తప్పు చేశాను. క్షమించానని చెప్పండి. మళ్ళీ ఇటువంటి అపరాధం చేయను స్వామీ! క్షమించండి. మహాలింగస్వామి ప్రసాదంతీసుకోండి. నన్ను క్షమించండి." అంటున్నాడు. స్వామివారు ప్రసాదం ముట్టుకోలేదు…."కొంచెం ఆగు. నాకు మహాలింగస్వామియే అనుగ్రహంతో ప్రసాదం పంపుతాడు". న్నారు.అంతలో రుద్రాక్షలు ధరించిన 65ఏళ్ళ పండితుడు చేతిలో వెదురుతట్టలో ప్రసాదాలు పుచ్చుకొని వచ్చాడు. "స్వామీ! నా పేరు మహాలింగం. నేను తిరువిడైమరుదూరు అర్చకుడను. నిన్న మహాలింగస్వామికి రుద్రాభిషేకం జరిగింది. ఆ ప్రసాదాలు పరమాచార్య స్వామి వారికి సమర్పించి ఆశీస్సులు తీసుకొని వెళదామని వచ్చాను". అన్నారు. ఆయన నమస్కరించబోతుండగా స్వామివారు "శివదీక్ష పుచ్చుకొన్న వారు ఇతరులకు మస్కరించరాదు" అంటూ వారించి, ప్రసాదం ఎంతోభక్తితో గ్రహించి, ఆ పండితునకు బదులు మర్యాద చేసి పంపారు. ఆయన వెళుతు ఈ మిరాశీదారును చూచి, "ఈయనే నిన్న రుద్రాభిషేకం జరిపించింది" అని చెప్పి వెళ్ళిపోయాడు…మిరాశీదాదు ఈ పాపమునకు పరిహారమేమిటని మహా స్వామి వారిముందు మళ్ళీమళ్ళీ ప్రాధేయపడినాడు…మహాస్వామివారు లేస్తూ, "ప్రాయశ్చిత్తం నేను చెప్పలేను. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి మాత్రమే చెప్పగలరు" అన్నారు."ఇంత జరిగిన తరువాత ఆయన ప్రాయశ్చిత్తం చెబుతాడా" అన్నాడు మిరాశీదారు…"నీకుప్రాప్తముంటే ఆయన చెబుతాడు" అంటూ తనగదిలోనికి వెళ్ళిపోయారు స్వామివారు. రాత్రిదాకా స్వామివారు బయటకు రాలేదు…

మిరాశీదారు నేరుగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి పాదములు పట్టుకొని ప్రాయశ్చిత్తానికై ప్రార్ధించడానికి నిశ్చయించు కొన్నాడు. అక్కడకు చేరేసరికి తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి ఇంటిముందు జనం గుమికూడి ఉన్నారు. ఘనపాఠి గారు ఆ తెల్లవారుఝామునే శివసాయుజ్యమొందారు. స్వామివారు "నీకుప్రాప్తముంటే" అన్న మాటలకర్ధం మిరాశీదారుకు ఇప్పుడు అర్ధమయింది. తాను మహాపాపిననుకొంటూ ఘనపాఠి గారి పార్ధివదేహానికి నమస్కరించి ఇంటికిపోయాడు. వేదపండితులకు మనమీయవలసిన మర్యాద ఎటువంటిదో మహాస్వామివారు అనేక సందర్భాలలో ఈ విధంగా తెలియచేశారు…ఇట్టి మహాపరాధం చేసిన, తనను ఆశ్రయించిన మిరాశీదారును పరమ కరుణామూర్తి ఐన స్వామివారు వదిలివేయలేదు. ఆయన శ్రీవారి ఆదేశం మేరకు ప్రాయశ్చిత్తంగా కాశీవాసం చేసి కాశీలో ముక్తి పొందారు.

జీవితంలొ ఎవ్వరిని తక్కువగా చూదకండి…….!

తొలి తిరుపతి


తిరుపతి (తిరుమల), చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) ... ఈ క్షేత్రాలు ఎక్కడున్నాయో, వాటి ప్రాశస్థ్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వాటి స్థాయిలో ప్రాచుర్యం పొందని మరో తిరుపతి కూడా ఉంది. అదే తొలి తిరుపతి... శ్రీ శృంగార వల్లభ స్వామిగా శ్రీ మహవిష్ణువు వెలసిన పురాతన పుణ్యక్షేత్రం.

శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల దేశంలోని ప్రాచీన ఆలయాల్లో ఒకటి. అయితే తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న తొలి తిరుపతి అంతకన్నా పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయంలో విష్ణుమూర్తి శిలారూపంలో దర్శనమిస్తాడు. తొలుత విష్ణువు వెలసిన చోటు ఇదే కనుక దీనికి 'తొలి తిరుపతి'గా పేరు వచ్చిందనీ స్థానికుల కథనం.


స్థల పురాణం ప్రకారం... రాజైన ఉత్థానపాదుడికి ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చొని ఉండగా, మొదటి భార్య కుమారుడు ధ్రువుడు కూడా వచ్చి తండ్రి ఒడిలో చేరబోతాడు. అతణ్ణి సవతి తల్లి పక్కకు నెడుతుంది. ఆవేదన చెందిన ధ్రువుడు తల్లి సూచన మేరకు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తాడు. విష్ణువు ప్రత్యక్షమవగా, బ్రహ్మాండమైన ఆయన దివ్య తేజస్సును చూసి ధ్రువుడికి భయం వేస్తుంది. అతణ్ణి బుజ్జగించే సమయంలో విష్ణుమూర్తి శంఖ చక్రాలు చేతులు మారుతాయి. ధ్రువుడి కోసం తన రూపాన్ని చిన్నదిగా చేసుకొని, చిరునవ్వుతో కటాక్షిస్తాడు. తారామండలంలో నక్షత్రంగా నిలిచిపోతావని దీవిస్తాడు. శ్రీ శృంగార వల్లభ స్వామిగా శిలా రూపంలో ఆ క్షేత్రంలో నిలిచిపోతాడు. తనను దర్శించిన వారికి వారి ఎత్తులోనే కనిపిస్తాననీ వాగ్దానం చేస్తాడు. ఆయనకు దేవతలే ఆలయాన్ని నిర్మించారనీ, మహాలక్ష్మిని నారదుడు ప్రతిష్ఠించాడనీ స్థల పురాణం వివరిస్తోంది.. శ్రీ శృంగార వల్లభ స్వామిని పూజిస్తే పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందనే విశ్వాసం ఉంది.

విశాఖ నక్షత్రము -గుణగణాలు, ఫలితాలు

నక్షత్రములలో ఇది 16వ నక్షత్రము. ఇది గురు గ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని. జంతువు పులి, రాజ్యాధిపతి కుజుడు. గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది.


విశాఖ నక్షత్ర మొదటి పాదము

విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరు ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. 


ఇక విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కళాశాల చదువులలో కాస్త మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.  తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా సుఖం కాస్త తగ్గవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కాస్త జాప్యం కలుగే అవకాశం ఉంది. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం జీవితకాలం సహకరిస్తుంది. 


ఉపాధ్యాయ వంటి వృత్తులు వీరికి అనుకూలం. అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత  ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. 


33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీ పర్యటన అనుకులిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.


విశాఖ నక్షత్ర రెండవ పాదము   

ఈ జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కల్గి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆపాధ్యాయులు రంగ వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది. పసుపు వర్ణ వస్తువులు, శ్వేత వర్ణ వస్తువులకు సంబంధించిన, జలసంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. 


విద్యా ఆరంభ దశలో బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో  విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది.  పదేళ్ల వయసు వరకు జీవితం సాఫీగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. 


ఇక సంపాదించిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం తరువాత వచ్చే జీవితకాలానికి సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 46 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  కేతుదశ అనుకూలిస్తే  విదేశీ పర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం.  53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది. 


విశాఖ నక్షత్ర మూడవ పాదము

 వీరికి పనుల యందు పట్టుదల ఉంటుంది. కార్య నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. వీరు  విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.  


ఈ నక్షత్ర జాతకులకు తొలి నుంచి విద్య మందకొడిగా ఆరంభమవుతుంది. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 6 సంవత్సరాల వయసు వరకు జీవితం సుఖంగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. 42 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం.  49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. ఇక మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది. 


విశాఖ నక్షత్ర నాలుగవ పాదము 

 వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి మెండు. కోపతాపాలు, ప్రేమాభిమానాలు మార్చిమార్చి ప్రదర్శిస్తారు.  ఉపాధ్యాయ రంగ వృత్తులు వీరికి అనుకూలం. ఔషధ సంబంధిత, శ్వేత వర్ణ సంబంధిత వస్తువుల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 


జన్మించిన తర్వాత కొంత కాలం మాత్రమే సౌఖ్యంగా ఉంటారు. తరువాత కొంత సుఖం తగ్గుతుంది.  ఆరు సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది.  2 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. విద్యాభ్యాసం మందకొడిగా సాగుతుంది. 21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. 38 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన ఉంటుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. 


విశాఖ నక్షత్రము గుణగణాలు - ఫలితాలు


ఈ నక్షత్ర జాతకులకు గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది. కాబట్టి బాల్యం సుఖంగానే ఆరంభమవుతుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలవుతుంది. గురు గ్రహ నక్షత్రమైన విశాఖలో జన్మించిన ఈ జాతకులకు పట్టుదల, మొండితనం ఉంటుంది. అనుకున్నది అమలు చేసే మనస్తత్వం.


భార్య లేక ఓ స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశము చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. సొంతంగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వల్ల ఖ్యాతి లభిస్తుంది. అన్యభాషలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో కూడా విజయం సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. 


ఇక ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారమూ లేకపోలేదు. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వలన నష్టము, లాభము సమానంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీ పౌరసత్వము లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు.  భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జివితములో సమపాళ్ళలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరము జీవితం సుఖవంతం. కనుక కనుక వృద్ధాప్యము సుఖవంతమే.


విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం రంగు అన్ని విధాలా అనుకూలం. కాబట్టి నీలపు రంగు చేతి రుమాలును అధికంగా వాడటం మంచిది. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు 6 సంఖ్య అన్ని విధాలా సహకరిస్తుంది. అలాగే 4, 5, 8 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అయితే 1, 2 అనే సంఖ్యలు ఏ మాత్రం కలిసి రావు. ఇక గురువారం తలపెట్టే కార్యాలు ఈ జాతకులకు దిగ్విజయంగా పూర్తవుతాయి.


విశాఖ నక్షత్రము నాలుగో పాదంలో పుట్టిన జాతకులకు మంగళవారం, సోమవారం, బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. అయితే చంద్రాస్టమందినాల్లో ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదదు. నాలుగో పాదంలో జన్మించిన జాతకులకు 9 అదృష్ట సంఖ్య. ఇంకా 9, 18, 36 అనే సంఖ్యలు శుభ ఫలితాలనిస్తాయి. అయితే 6, 8 సామాన్య ఫలితాలనివ్వగా, 4, 5, 6, అనే సంఖ్యలు వీరికి అశుభ ఫలితాలిస్తాయి. ఇక పసుపు, ముదురు పచ్చ రంగు వీరికి అదృష్టానిస్తాయి.


ఇక ఈ నక్షత్ర జాతకులు వ్యాపారాభివృద్ధి కోసం ప్రతి శుక్రవారం నేతితో సుబ్రహ్మణ్య స్వామికి దీపమెలిగించడం మంచిది. ఇలా 9 వారాలు ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు ఫలప్రదమవుతాయి....మీ... చింతా గోపి శర్మ సిద్ధాంతి*   లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

ఎన్నో జన్మల పుణ్యం

 రాత్రి మట్టిలో నాటిన విత్తనం మూడోరోజు మొలకగా కనిపిస్తుంది. నల్లటి కారుమబ్బు వద్దన్నా జలజలా చినుకులు రాలుస్తుంది. ప్రకృతిలో ప్రతీది సహజంగా జరిగిపోయే ఏర్పాటు ఉంది. 


 జీవితమూ అంతే. అది జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. 


 అష్టాంగ యోగ మార్గాలు, అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడి ముందుకొచ్చి దర్శనం ఇస్తాయి. 


 అందుకే యమ-నియమాలు ముందుగా చెప్పి తరవాత సాధనక్రమం అంతా చెబుతారు. మంచితనం లేనివాళ్లకు యోగం అబ్బదు. చెడ్డవాళ్లకు ఆలోచనలు అడ్డగించడం వల్ల ధ్యానం కుదరదు. పరిశుభ్రత లేనివారికి, ఆరోగ్యదాయకమైన యోగా అనుకూలపడదు. భక్తి లేనివారికి జ్ఞానం ఒంటపట్టదు. 


 జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. జీవితం ఈశ్వర ప్రసాదం. భక్తిగా రెండు చేతులు పైకెత్తి దివ్యజీవనాన్ని ఆహ్వానించాలి. ఆటుపోట్లతో, హెచ్చుతగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తలవంచుకుని అనుభవించాలి. నిజమైన సాధన ఇదే. 


 ఊపిరి ఆపడం, భూమిలోకి దిగబడిపోవడం, ముళ్లమీద పడుకోవడం అభ్యాసం వల్ల వస్తాయి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు. 


 జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ఒక దీపం మరోదీపం వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి. అంతకంటే మనిషికి సార్థకత లేదు. సాధన చేసి సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు. పూనుకోవాలి. 


 ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది సాధనే. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం. 


 పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ జీవిస్తున్నాయి. మరి మనమెందుకలా నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం? బుద్ధి కలిగిఉండటం మనిషికి వరం, శాపం కూడా. నేను లేకుండా చేసుకుంటే బుద్ధి వరం. నేనును మేరుపర్వతమంత పెంచుకుంటే బుద్ధి శాపం. 


 చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీకృష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత. 


 శ్రీరాముడు జీవించాడు. మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. జీవితం అవకాశం ఇస్తుంది. అంతే. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. 


 కారణజన్ముడికైనా, అకారణ జన్ముడికైనా- బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది. 


 పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు. ఇంతకంటే మహాసాధన ఉండదు. 


 మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సత్యానుభవం కోసం తహతహలాడటం... ఎన్నో జన్మల పుణ్యం. ఏ ఉపనిషత్తూ ఈ విషయాన్ని కాదనలేదు.

పిల్లలు చెడిపోవడానికి కారకులు

 పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!


పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. 


పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..


వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..


ఇప్పుటి తరం పిల్లలు..

(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)


🔥  తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..

🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

🔥  లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

🔥  కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...

🔥  గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..

🔥  తిడితే వస్తువులను విసిరి కొడతారు..


ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..


🔥  ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

🔥  ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

🔥  అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..

🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

🔥  బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..

🔥  కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..

 వారిస్తే వెర్రి పనులు..


మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది.. 

కష్టం గురించి తెలిసేలా పెంచండి 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..


ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..

మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..


అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...


కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..

చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...


గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..


వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే తల్లిదండ్రులు మారాలి..


రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?


ఒక్కసారి ఆలోచన చేయండి...


సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?


కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో 

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..


పిల్లలకు..👇


👉  బాధ్యత 

👉  మర్యాద

👉  గౌరవం 

👉  కష్టం 

👉  నష్టం 

👉  ఓర్పు

👉  సహనం

👉  దాతృత్వం

👉  ప్రేమ

👉  అనురాగం

👉  సహాయం

👉  సహకారం

👉  నాయకత్వం

👉  మానసిక ద్రృఢత్వం 

👉  కుటుంబ బంధాలు

👉  అనుబంధాలు    

👉  దైవ భక్తి

ఈ భావనలు సంప్రదాయాలు అంటే..

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.. 

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..

పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...

మనం కూడా మమేకమవుదాం...

భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.....

     🙏🏻 లోకా సమస్తాః సుఖినోభవంతు 🙏🏻

(COVID is NOW a COMMON FLU)

 *COVID-19*

(COVID is NOW a COMMON FLU)


*👉5D 5D (5 DRUGS for 5 DAYS)*


1. IVERMECTIN 12mg OD 5 days

2. DOXYCYLINE 100mg BD 5 days

3. ZINC 50 mg OD 5 days

4. MONTEK-LC OD 8pm 5 days             

5. DOLO 650mg for Fever >100°F   

*(OD Once a Day) & (BD Twice a Day)*


👉IVERMECTIN scientist was awarded NOBEL PRIZE 


👉 SHARE this message to ALL PHARMACISTS, VOLUNTEERS, NURSES (ANM, GNM), PARAMEDICS, MEDICAL REPRESENTATIVES, RMPs, TEACHERS, 108 & 104 STAFF

* DIZ Triple Drugs Therapy is Very EFFECTIVE for COVID-19 and most people recover at home in less than 5 days (Very few need hospitalization)

* Of the three DIZ drugs, IVERMECTIN is the most powerful drug and should be taken IMMEDIATELY after 1st symptom. So everyone should have an IVERMECTIN tablet at home ready.

* Even a SINGLE dose will give MAGICAL RELIEF 

* Along with IVERMECTIN DOXYCYLINE & ZINC should be used for 5 days


*👉5 Symptoms:*


1. FEVER & BODY pains

2. COLD & COUGH 

3. Loss of SMELL & TASTE 

4. DIARRHOEA 

5. BREATHLESSNESS 


*👉5 Vital Signs (Thermometer, Pulse Oximeter)*


1. OXYGEN >94%

2. PULSE <94/min

3. TEMP <100°F

4. RESPIRATION <24/min

5. URINE: Adequate


*👉5 Activities:*


1. BREATHING exercises 

2. MEDITATION 

3. STEAM Inhalation 

4. WALKING (Gentle)

5. MOUTH Gargling 


*👉General Complaints:*


1. Acidity: Pantaprazole 40mg

2. Body pains & Fever : Dolo 650mg

3. Cough: Ambroxyl 

4. Vomiting: Ondem 4mg

5. Immunity: B-C-D-vitamins 


👉Covid Prevention Medication (CPM)

1. HIGH-Risk (FRONTLINE Workers)

Ivermectin 12mg EVERY WEEK till Pandemic 


2. SEMI-Risk (STUDENTS & Shopping)

Ivermectin-12mg EVERY 2 WEEKS till Pandemic


3. LOW-Risk (NON-WORKING)

Ivermectin 12mg Day1, Day7 & then MONTHLY till Pandemic 


*👉Gadgets:*


1.Thermometer, 

2.Pulse Oximeter,  

3.Rotahaler, 

4.Incentive Spirometer, 

5.Glucometer 


👉IVERMECTIN is in use for more than 30 YEARS and is called WONDER drug because it's SAFE, CHEAP, CURES MANY diseases: Threadworm, Roundworm, Hookworm, Filarialworm, Strongyloides worm, Scabies, Head-lice, Dengue fever, Covid-19, Some action on Zika virus, HIV virus, Some Cancers, Immuno-modulation etc


👉SMS protection: (Sanitizer, Mask, Shield)

👍Let's HELP GOVERNMENTS to END this pandemic FAST

చాగంటి కోటేశ్వర రావు

 చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు -

         

ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సునాయాసంగా బయటపడ్డారు.  


చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.  


చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు.  


చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.  


ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.  


ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా?  


అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.  


పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.  


చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.  


ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!!  


 

చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు...... Forwarded as received


మిత్రమా !


ధుర్మార్గులను ఖండించక పోవుట ఏంతటి తప్పో 

ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది 

ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం పదుగురికీ తెలియజేస్తున్న మీ మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం ధన్యవాదములు

🙏🙏🙏

ఇక్కడ- అక్కడ

 ఇక్కడ- అక్కడ 


ఇక్కడ మనం ఉదయం నిద్రలేచిన దగ్గరనుండి మరలా రాత్రి నిద్రపోయేవరకు ఇక్కడే (బౌతికంగా)  ఉంటున్నాము. కానీ నిజానికి మనం పూర్తిగా ఇక్కడే వుంటూ(మానసికంగా) అక్కడి విషయం అస్సలు ఆలోచించటం లేదు. ఎందుకంటె నీకు అన్ని ఇక్కడే కనపడుతున్నాయి. నీ ఇల్లు, నీ తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, బంధువులు, స్నేహితులు, విరోధులు, సంపదలు, ప్రేమలు, సాధింపులు, మమకారాలు, ద్వేషాలు, కోపాలు తాపాలు, సుఖదుక్ఖాలు,రాగద్వేషాలు, సంపాదనా ఖర్చులు, ఇవ్వన్నీ నీ చుట్టూ వున్నాయి అంతేకాక నేను నా గొప్పతనం, నా ఐశ్వర్యం, నా పేరు ప్రేతిష్ఠలు, నా గౌరవం అనేవి నిన్ను పూర్తిగా వశం  చేసుకున్నాయి. నీవు ఏ పని చేసిన అది కేవలం అంటే కేవలం నీ కోసం లేక నీ వాళ్ళు అని నీవు అనుకునే వాళ్ళకోసం మాత్రమే.  కాదు అని నీవు అనగలవా. అంటే అనలేవు ఎందుకంటె అది నీకు కనపడుతున్న సత్యం. అదే నీవు అనుకుంటున్న సత్యం. 

మరి అక్కడ అక్కడ నీవు మాత్రమే వున్నాను అదికూడా నీవు అనుకునే నీవు కాదు ఆ నీవు ఎవరో అది నీకు తెలుసో లేదో కూడా నీకు తెలియదు. అంతే కాదు అక్కడ ఏమి వున్నదో కూడా నీకు తెలియదు అంతా శున్యం ఆ శున్యం ఒక పెద్ద అగాధంలా కనపడుతుంది అది నీకు అట్లా కూడా కనపడుతుందో లేదో తెలియదు ఎందు కంటే నీవు అక్కడి గూర్చి తెలుసుకోవాలని అనుకున్నావో లేదో తెలియదు ఇక్కడ వున్న వాళ్లంతా అక్కడికి చేరాల్సిన వాళ్ళే కానీ అందరు ఇక్కడే అన్ని ఉన్నాయని అక్కడి విషయాలు మరచారు. కొందరు పూర్తిగా అక్కడ వున్న దన్నది తెల్వకుండా వున్నారు. 

ఇది ఇలా ఉంటే కొంతమంది మేము అక్కడే నిత్యం ఉంటామని నిన్ను కూడా అక్కడికి తీసుకొని వెళతామని అంటూవుంటాం. ఇది  ఇక్కడ మనం రోజు చూస్తున్నాము. మరి నిజంగా వాళ్ళు అక్కడి గూర్చి తెలుసుకున్నవారా లేదా అది నీకు తెలియదు కానీ నీవు తెలుసుకోవచ్చు.  అట్లా చెప్పే వాడు నీ నుంచి ఏ ప్రతిఫలం ఆశిస్తున్నాడు అన్నది నీవు గమనించు వాడు కేవలం ఒక రూపాయి నీ నుంచి ఆశించిన వాడు పూర్తిగా ఇక్కడి వాడే కానీ అక్కడి వాడు కాడు.  వాడికన్నా నీకే అక్కడి గూర్చి తెలుసు అని తెలుసుకో 

ముముక్షువులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ