సి. భార్గవ శర్మ



1  శ్రీ కరుడవ్ పార్వతీదేవి
అగ్రసుతుని అనవరతము
స్తుతించెద  నే చేసెడి  పనులెల్ల
సఫలము కాగా భార్గవ

2  అమృతమన్న అమ్మ స్తన్యము  
కామధేనువున్న  అమ్మ దీవెన
కల్పవృక్షమన్న  అమ్మ ప్రేమ
స్వర్గమన్న మరి వేరు కాదయ అమ్మ వడియె భార్గవ

3  జీవుల యందు జాలియు
సతి, సుతులయందు ప్రేమయు
భగవంతుని మీద భక్తియు
గలవాడే మనుజుడన భార్గవ

4  ఉరక పరుల సొమ్ము కోరుటయు
తన సొత్తును ఇసుమంతయు ఇవ్వకుండుట
పర బాధల చూసి నవ్వుటయు
ఖలులులు చేసెడి  పనులు భార్గవ

5  అన్నదమ్ములు నావారని
అలిబిడ్డలు నావారని
ఆస్తిపాస్తులు నావనె బ్రాంతి నుంటివి 
కాలుడొచ్చిననాడు  కాయమ్ముకూడా నీది కాదయా భార్గవ

6  తనువూ,   మీద మోజు
తిండి మీద మోజు
ఇల్లు వాకిలి పైన మోజు
ఆలి బిడ్డల పైన మోజు
కట్టు బట్టల పైన మోజు
కాలమంత ఇటులఖర్చు చేస్తే
దైవ  సన్నిదికిచేరుటెటుల భార్గవ

7  అన్నదమ్ములు కల్ల
అలిబిడ్డలు కల్ల
ఇల్లువాకిలి కల్ల
ఆస్తిపాస్తులు కల్ల
ఆత్మ వక్కటే నిక్కము భార్గవ

8  తీయని  తేనెల తెలుగు పలుకక
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కేగాబ్రాకినట్లు భార్గవ

9 ఆకలితో తిన్న అన్నము
అవసరముకు అందిన ధనము
వైరితో తిరిగి కలిగిన సక్యము
ధరణిని మరువంగా తరమే భార్గవ

10  గంధము లేని సుమములు
సోయగము లేని మగువలు
మానవత్వము లేని మనుజుడును
ధరణిలో వ్యర్ధము భార్గవ

11  తల్లికి అన్నము పెట్టని వాడును
సతి సుతులను కానని వాడును
సఖునికి కీడు చేసెడి వాడును
భువికే భారము కదరా  భార్గవ

12  కలిమి యుండదు కలకాలము
బలముండదు బహుకాలము
కలిమి  లేముల కలిసున్నదే
దాంపత్యమన్నయిలలో భార్గవ

13  ఘడియకు తప్పులు వేతికేడి పురుషుని తోటి జీవితము
ప్రతి పనికి సాధించేడుయజమాని వద్ద కొలువును
ఎంత చదివిన వంటపట్టని  సాహిత్యవిద్యయు 
వెను వెంటనే వదలి వేయుట మంచిది భార్గవ

14  తా తినక పరుల కిచ్చుట దైవత్వము
తా తిని పరుల కిచ్చుట మానవత్వము
తా తిని పరుల మరచుట రాక్షసత్వము
మనుజులము మానవత్వమున్న చాలు భార్గవ

15  అమ్మను అడుగక పెట్టదు అన్నము
తండ్రిని కోరనిదే ఇవ్వడు ఎదియును 
సుతుడును కోరకనే సమకూర్చాడు దేదియు
అడుగుటకు వేనుకిడిన దొరకదు ఏదియు భార్గవ

16  కలహంభులకు దూరముగా నుండుము
చెలిమికి  సాదరమున స్వాగతించుము 
పరులకు ఎప్పుడు కీడును సలుపకు
మనుజులు చేయ మంచి పనులివియే భార్గవ

17  పరులను యాచించకు 
ఉన్నదానితో సంతసించుము
లేదని దిగులు  పడకు
తృప్తిని మించిన సౌక్యమేది భార్గవ

18  అందినదియే అందలము
అందనిదానికై అర్రులు చాచకు
కొందరికే అన్నియు అందును
అందరకు అన్నీ అందవు భార్గవ

19  పరులను ప్రేమతో పిలువుము
అరువులకి ఆశ  పడకు
తనువుఫై మోహ పడకు
ఇవేయే పో కావలసినవి భార్గవ

20  కాలంబుకు విలువ నీయుము
హేమంబును కూడా తృణముగా చూడుము
సాయంబుకు ముందు నుండుము
వాదునకు వెనుక నుండుటయే మిన్న భార్గవ

21  హరి నామ స్మరణ మరువకు
సిరులను త్యదించుటకు వెరువకు
జ్ఞ్యాతుల దరి  చేర నివ్వకు
భక్తిని మించిన మార్గ మ్యేది భార్గవ

22  కోరుము ధనమును భగవంతుని
పరులకు సాకారము చేయుటకు
కోరుము ఆయువుని దేవుని
నిరంతర నామ స్మరణ చైయను
ఇతరములన్నియు వ్యర్ధము భార్గవ

23 సంకల్పముకి మించినది లేదు
ప్రారంభించుటయే మంచి ముహూర్తము
అవరోధము లేకసాగుటయే అవిఘ్న మన్న
విఠలాక్షుని కృపయున్న సర్వము సమకూరు భార్గవ

24  సాదువుల యెడ ప్రేమ
బలహీనుల యెడ జాలియు 
తన వారి ఫై మమకారము
చూపెడు వాడెపో మాన్యుడన భార్గవ

25  అమ్బలియు లేని నాడును
అష్ట ఐశ్వర్యములు సిద్దించిన నాడును
అయోనిజుని మరువని వాడె
నిజమగు భక్తుడు కదరా భార్గవ

26  సిరి కోరిన యంతనే రాదు
ఖ్యాతి ప్రాకులాడిన పొందలేరు
ఈసునిఆజ్ఞ తోటే ఇలను
కష్ట శుకములు కలుగును భార్గవ

27  తనదన్నదిఏదియును లేని వాడును
కష్ట సుకముల సమముగా చుసేడి వాడును
మనవమానముల తొణకని వాడును
నిజమగు ముముక్షువన్నకదరా భార్గవ

28 కవితల నల్లగ వచ్చును 
మూగకు మాటలు నేర్పను వచ్చును 
వైరిని చేరి ప్రియభాషణలాడగ వచ్చును 
దైవమ్ము వెన్నంటి ఉంటే భార్గవ 


29 ప్రేమను పిలచిన పసిపాపలునగుదురు 
కోపగించిన వెను వెంటనే యడ్చుదురు
భాష తెలియని చిన్నారులు కూడా
భావమెరుగ గలరు ఇదియ సృష్టి యన భార్గవ

30  అమ్మ అనుగ్రహము లేనినాడును
తిన తిండికరువైన నాడును
నావారను వారు లేని నాడును
జీవించుట ఏమి సుఖము భార్గవ

31  ప్రీతినిపిలిచి పెట్టినదియే పాయసము
ద్వేషంబుతో పడవేసినభక్ష్యములును విషంబు
ప్రేమను తినిపించినదియేమాతృత్వమన్న 
తల్లి ప్రేమను పొందని జన్మ వృధా భార్గవ

32 
మామిడి కాయలు చూడ నోక్కతీరుగుండు  
తరిగి తిన్న కానీ తీపి పులుపు తెలియదు 
మనుషులందరు  చూడ నొక్క తీరునుండు 
చేరి పలకరించిన గాని  గుణములెరుగలేమయ భార్గవ 


33  తనదన్నదిఏదియును లేని వాడును
కష్టసుఖముల సమముగా చుసేడివాడును
మనవమానముల తొణకని వాడును
నిజమగు ముముషువన్నకదరా భార్గవ

34  కోరనిదేఏదియు రాదు
కోరినను కొన్ని రావు
పొందుట కర్హమినది కోరిన
జగదీసుడు నీ కిచ్చును భార్గవ

35 తన పని కావలెనన్న 
ఆఫీసరు చేయి తడపక తప్పదు యేరికైనను 
ఏలనన ఇరుసునఁ గ్రీసు పెట్టక 
భారత ప్రెసిడెంటు కారు కూడా కదలదు భార్గవ 

 36 కారణము లేకుండా భార్య తోటి తగవులాడకు 
అనవసరముగా నీ పిల్లల కోపగించకు 
మిత్రునితోటి కపటముగా వర్తించకు 
ఈవై పో సజ్జనుడు చేయవలసినది భార్గవ 

37 సిరి వచ్చిన గర్వపడకు 
ధనముడిగిన చింతపడకు 
కలిమి లేముల తొణకక 
జీవనము గడుపుటే ప్రాజ్ఞుల పని భార్గవ 

38  ఆశలకు రెక్కలు వచ్చిన
రెక్కలు వచ్చిన చీమల భంగిని
అనతి కాలమున నేలను వ్రాలును
ఉహల నదుపు చేసిన వాడె మనుజుడు భార్గవ

39  సుఖములు మరగిన వడలు సోమరియగున్
శ్రమ పడిన కాని తనువుకు ఆరోగ్యమబ్బదు  
కష్ట సుఖముల సమముగ చూసెడి   మనుజుడే మనుజుడు 
సాన పెట్టిన కాని కత్తికి పదునురాదు భార్గవ

40  నీతులు పరులకు చెప్పుట తేలిక
వాటినిఆచరించుటయే దుర్లభము
తాచేసినదిచెప్పుట మాన్యుల  గుణము
మాన్యుల  నవలంబించుట శ్రేయము భార్గవ

41  ప్రాణమున్నంత  వరకు ప్రార్ధించెద పరమేశుని 
జీవ మున్నంతవరకు జపియించెద జగదీసుని
ఊపిరున్నన్త వరకు పూజిన్చెద ఆయోనిజుని
నీది నీదరికి చేరువరకు అన్యుల తలవడు భార్గవ  

42 తెనుగు దేశమున పుట్టి తెలుగు వాగ్మయం నాకళించి 
సుకవితల చెప్పు కవి పండితులు గాక అన్యులెరుగుదురే 
తెలుగు భాషలోని గరిమనైన కానీ  మధురిమను కానీ   
తల్లి పాల తీపి తనయుడు గాక ఇతరులెరుగుదురే భార్గవ  

43  యజమాని సమర్ధుడైన గృహము అవరోధములు లేక నడుచును 
అసమర్ధపు గృహస్తు ఇంట ఎంత సంపద వున్నా తిన తిండి ఉండదు 
 ఏలనన కట్ట దృఢముగ వున్న చెరువులో నీరు వున్నటుల 
కట్టలు తెగిన తటాకమున ఉండునా భార్గవ 

44  ఈ జగత్తు పుట్టుకకు కారకుడెవ్వఁడు 
జనన మరణములు ఎవరి ఆధీనముననున్నవి 
పంచభూతముల మూలమెవ్వడు 
హృదయబౌడవు అట్టి ఈశ్వరునే శేరణువేడెద భార్గవ 

45  అడగక  ఉచిత సలహాలిచ్చుట  
బాధలో నున్న వారిని  చూసి పరిహసించుట 
తోటివారితో తన గొప్పలు చెప్పుకొనుట 
మాన్యులు చేయదగినవి కావు భార్గవ 

46  మనసు పరవళ్ళుత్రొక్క వలెను
హృదయమానంద డోలికలనూగవలెను
బుద్ధి పరిపక్వత నొంది పరవశింపవలెను
కవిత యన్న యీరీతి నుండవలెను భార్గవ 


47  ప్రౌడ కవిత చెప్ప పండితులు ఇష్ట పడుదురు 
సరళ కవిత నల్ల సామాన్యులు సంతసిన్తురు 
పండిత పామరులు మెచ్చు రీతి కవిత చెప్పుట 
కడలి చిలికినమృతము బడచునట్లు భార్గవ 

48  ఆటవెలదులు కావు తేటగీతులు కావు 
శీస పద్యమసలు కానేకాదు 
మనసు నచిన రీతి నే కవిత నల్లితి 
నచ్చ నన్నా నీవు మేచ్చు కున్నా  కానీ  భార్గవ 

49 పుత్రుడు సమర్ధుడైన తండ్రి కష్టములతీర్చి కీర్తినిపెంచున్ 
మల్లె తీగకు పూలు పూసి పరిమళించిన రీతిన్ 
కొడుకు దుర్మార్గుడైన సంపదలహరించి వానిని వీధికి తెచ్చును 
తులసి వనమున గంజాయి మొక్క భంగిని  భార్గవ 

50 తండ్రి గుణముల బట్టి 
పుత్రుని సంస్కార మబ్బు
నీచ తండ్రికి గుణవంతుడెలా కలుగు 
కాకి పిల్ల కోకిల కాదుగా భార్గవ 

51 ఆశు కవులు అష్టావధానులు 
పురవీధుల తిరుగుచుండ తదన్యులు 
విశ్వవిద్యాలయాల నేలుచుండిరి 
వెన్నల అడవికాయ పురముల అంధకారామైనట్లు  భార్గవ 

52.మొదలు పెట్టరు ఏ కార్యమును సోమరులు 
మొదలు పెట్టి మధ్యలో ఆపుదురు అస్థిమిత పరులు 
ఎన్ని కష్టములేదురైనను తా తలచిన పని పరిపూర్ణము చేదురు ధీరులైన మానవులు లాభాపేక్ష లేకనే భార్గవ 

53. పరుండుటకు పాన్పు నేతకడు దుస్తులలో అందము చూడడు తిండిలో రుచుల కెగబ్రాకాడు  ఉన్నదానితో సరిపెట్టుకొనును కానీ తన పనిలోని లగ్నతను మాత్రము వీడడు కార్య సాధకుడు సుఖ ధుఃఖఃముల తలపడు  మది భార్గవ 

54.  సరిగమలు సరిగా పాడారాని 
వారు సంగీతవిద్వంసులు,
యతి ప్రాసలు తెలియనివారు 
కవి పండితులుగాను వప్పారుచుండిరి 
ఆహా హ తెలుగు సంస్కృతి ఏమికానున్నదో భార్గవ 

55. కలుగ నేల పుత్రులు నూరుమంది 
తుదిశ్వాస విడుచు వేళలో లేనియపుడు  
సుతుడొకడు చాలదా పృద్వినందు 
విష్ణు దేవుని చే మోక్షమిప్పింప భార్గవ  

56.కవి కోరడు ధనమును, కనకంబును
కవి కోరడు మణిమయ భూషిత కిరీటములు 
కవికోరడు గోవుల ధాన్య రాసుల ఇలన్ 
పాఠక ప్రశంసలే తృప్తినిచ్చు కవిలోకముకు భార్గవ

57.పొలము దున్నిననేమి కవి పోతనా మాత్యుడు 
మందార మకరందముల పండించలేదా 
పున్నమి వెన్నల చకోరముల విహరింప లేదా 
తెలుగు వాని హృదయంబు పరవశింపగ  భార్గవ  

58మొదలు పెట్టరు ఏ కార్యమును సోమరులు 
మొదలు పెట్టి మధ్యలో ఆపుదురు అస్థిమిత పరులు 
ఎన్ని కష్టములేదురైనను తా తలచిన పని పరిపూర్ణము చేదురు 
ధీరులైన మానవులు లాభాపేక్ష లేకనే భార్గవ 

59. పరుండుటకు పాన్పు నేతకడు దుస్తులలో అందము చూడడు 
తిండిలో రుచుల కెగబ్రాకాడు  ఉన్నదానితో సరిపెట్టుకొనును 
కానీ తన పనిలోని లగ్నతను మాత్రము వీడడు 
కార్య సాధకుడు సుఖ ధుఃఖఃముల తలపడు  మది భార్గవ
భర్తృహరి సుభాషితం ఆధారంగా 

60.  ఆయువు ఉన్న తరి  కాయంబుకు 

పెను గాయములు పెక్కుతగిలిననేమి  జీవము పోదు 

కాలమ్ము ఆసన్నమైన కాలుజారి పడినను 

అశువులు బాయుట  తధ్యము భార్గవ 


61.తన పని కావలెనన్న 

ఆఫీసరు చేయి తడుపక తప్పదు ఎవరికైనా 

ఇరుసునఁ గ్రీసు పెట్టక 

ప్రెసిడెంటు కారు కూడా కదలదు భార్గవ


62. ఇల్లాలి మదినేప్పుడు నొప్పింపకు 

తన తప్పు ఏదియు లేనపుడు 

ఉరక తన సతి కన్నీరొలికిన  

ధన లక్ష్మి ఇంట నుండదు భార్గవ

63. ప్రేమను సతి సుతులతో వర్తింపుము 

అనవసరపు వాదుల ప్రోత్సహించకు 

ప్రశాంతముగా ఇల్లు వున్న 

సంపదలు కలుగు భార్గవ

63.ఈడు వచ్చిన పుత్రుని జోడుగా తలువుము 

వాని బుధ్దికెపుడు తోడుగా ఉండుము 

సుతుని ప్రజ్ఞతోటె నీకు శుభము కలుగు 

ప్రేమ లేని ఇల్లు కష్టముల నెలవురా భార్గవ

64. భార్య నీకు బానిస కాదు 

ప్రతి విషయంలో సగ భాగము అగు 

సంపద వచ్చిన తరి పరసతి గూడుట 

ఏరుదాటి తెప్ప కాల్చిన విధము భార్గవ 


65. తల్లి తండ్రుల యెడ ప్రేమయు 

గురువుల ఫై గౌరవము 

భగవంతుని యందు భక్తియు 

పిల్లలకునేర్పింప వలెను భార్గవ 


66. వీధి గుమ్మమువీడి వెడలడాయే 

సంపాదన అంత పూర్ణమాయె 

అలితోటి నిత్యము జగడమాయె 

కరోనా వేళ మనిషి బ్రతుకు భార్గవ 


67.మోడువారిన మ్రాను చిగురింపగవచ్చు  

కరడుగట్టిన గుండె ద్రవియించగ  వచ్చు 

సాగర జలమున దాహార్తి తీర్చ వచ్చు 

మూర్కుని మది రంజింపలేము భార్గవ 


68.గడప దాటినా కరోనా భయమని ఎంచి 

ఆను లైనులో కొనుగోలు చేయ బడితిమి 

కూరలు పుచ్చులు, చచ్చులుయైయుండె 

దినుసుల ధర లేమో గగన మంటే 

తిండిలేక ఎటుల మనుట ఇలను భార్గవ 


69.పెట్రోలు ధరచూస్తే భగ్గుమనియె 

కూరగాయలు కూడా ఆ దారే వెడలె 

పనివారు  కూలీలు రేట్లు పెంచి వేస్తిరి 

సంపాదనేమో  సగమైయ్యే  బ్రతుక టేటుల భార్గవ 




నీ స్థానము పట్టి మిత్రు శత్రువులు కలుగుదురు 
 

పదవవాడు 

  పూర్వకాలంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాతానికి వెళ్లాలంటే చక్కటి రహదారులుకాని, వాహనాలు కానీ ఉండేవి కావు చాలా కొద్దిమంది ధనవంతులు మాత్రము రాధాలు, బండ్లు కలిగి ఉండేవారు. అటువంటి రోజులల్లో ఒక అరణ్యంలో పదిమంది ప్రయాణికులు వెళుతున్నారట. వారు కొంతదూరం ప్రయాణం చేసినతరువాత వారికి ఒక నది అడ్డంగా వచ్చింది వారిలో ఏ వక్కరికి కూడా ఈతరాదు. అందరు ఆ భగవంతుని మీద భారం వేసి జాగ్రత్తగా నదిని దాటాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని లోతయిన నదిని దాటారు.  అవతలి తీరం చేరగానే అందరికి ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తాము పదిమంది క్షేమంగా చేరామా లేక ఎవరైనా నదిలో మునిగి పోయారా, అని అనుకోని అందులో వారిని అందరిని లెక్కించమని చెప్పారు. అతను లెక్కించి తొమ్మిది మందే వున్నారు అని చెప్పారు. అప్పుడు ఇంకొకడు లెక్కించాడు అతనికి తొమ్మిది మందే వచ్చారు. అట్లా ప్రతి వక్కరు లెక్కించారు.  కానీ పదవవాని జాడ  తెలియలేదు. అప్పుడు అందరు కలిసి తమలో ఒకడు నదిలో మునిగినట్లు నిర్ధారణ చేసుకొని ఏడవటం మొదలు పెట్టారు. 

ఆ సమయంలో నది వడ్డున వెళుతున్న ఒక బాటసారి వారిని చూసి విషయం కనుక్కొని తన ముందు మళ్ళీ లెక్కించమని అన్నాడు అందులో ఒకడు తిరిగి లెక్కించి తొమ్మిదిమందే అని  తెలిచాడు. విషయం తెలుసుకున్న ఆయన ఈ సారి మీరంతా వరుసలో వుండండి నేను లెక్కిస్తాను అని చెప్పి గణిస్తే పదిమంది తేలారు. అప్పుడు వారంతా సంతోషించి తమకు ఒకడు తక్కువ ఎందుకు వస్తున్నాడు అని అడిగారు. నాయనలారా మీలో లెక్కించే వాడు తనను తాను లెక్కించుకోలేదు అందుకే ఒకడు తగ్గాడు అని చెప్పి వారాలకు వివరణ ఇచ్చి పంపించాడు. 

సరిగ్గా ఈ కధలో లానే మనంకూడా పదవ వాడిని తెలుసుకోవటం లేదు.  ఎంతసేపు బయట తొమ్మిది మందిని లెక్కిస్తూ పదవ వానిని లెక్కించకుండా పదవవాడు దొరకటం లేడని బాధపడుతున్నాము. నిజానికి ఆ పదవవాడిని నేనె అనే ఎరుక కలగటమే వేదాంత రహస్యంగా మనకు మన అద్వయిత గురువుగారు శ్రీ ఆదిశంకరా చార్యులవారు వారి అనేక గ్రంధాలద్వారా తెలియ చేశారు. మనం మనలో వున్న భగవంతుని తెలుసుకోక బయట గుడులలో గోపురాలతో వెతుకుతూ అజ్ఞ్యానంములో జీవనాన్ని  సాగిస్తున్నాము. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే క్షేత్రాలు, తీర్ధాలు కేవలం నీకు తాత్కాలిక మానసిక ఆనందాన్ని ఇచ్చే సాధనాలు మాత్రమే నిజానికి శాశ్విత ఆనందం కేవలం నాలోని పదవవాడిని తెలుసుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. ఫై కధలో వడ్డున ఉండి వాళ్ళను లెక్కించిన వాడు ఎవడో కాదు అతనే సత్గురువు ఆయన సాన్నిద్యంలోనే మనకు సాధనకు ఊతం లభిస్తుంది.  శ్రీ ఆది శంకరాచార్యుల వంటి సద్గురువు మనకు లభించటం మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. ఆచార్యుల వారి బాటలో నడుద్దాము మన జన్మ తరిమ్పచేసుకుందాము. 

దయచేసి నేనే సద్గురువును నన్ను కొలవండి, ఆరాధించండి అని ఈ రోజుల్లో అనేకమంది తారసపడుతున్నారు. వారి వెంట వెళ్లి మీ అమూల్య జీవిత కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకోకండి. ముక్తికి మార్గం కేవలం అద్వైతము ఒక్కటె శ్రీ శంకరులను మించిన గురువు దేవులు లేరు.  ప్రతి సాధకుడు ముందుగా శ్రీకృష్ణ భగవానులు మనకు ఇచ్చిన అమూల్య సంపద ఐన శ్రీ భగవత్ గీతను పఠించి అర్ధం చేసుకొని గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించి తరువాత ఆది శంకరుల వేదాన్త గ్రంధాలను పఠించి పాటించిన ముక్తి కలగటం తథ్యం. 

"మోక్షమ్ము ధనముతో రాదు"

ఉపనిషత్తులలో సారాన్ని మొత్తాన్ని జ్ఞ్యానామృతంగా మార్చి మనకు వసంగిన మహాను భావుడు.శ్రీ ఆది శంకరాచార్యుల వారు.  అయన బాటలో నడుద్దాము.   

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

 

&*&*&*&*&*&*&*(&

 

సాధకుడు- మనస్సు  

అటుపిమ్మట సాధకుని ద్రుష్టి మనస్సు మీద పెట్టాలి. నిజానికి మనస్సు అనేది ఒక కోతి లాంటిది, ఏ రకంగా అయితే ఒక కోతి ఒక కొమ్మ మీదినుంచి ఇంకొక కొమ్మమీదికి నిర్విరామంగా ఉరుకుతూ, గెంతుతూ నిలకడ లేకుండా ఉంటుందో అదే విధంగా మనస్సు అనుక్షణం వివిధ విషయాలమీద మళ్ళుతూ ఉంటుంది. ఒక క్షణం నీవు చూసిన సినిమా గుర్తుకు వస్తే మరుక్షణం నీకు జరిగిన సంతోషకరమైన లేక దుఃఖకరమైన విషయం. ఒక నిముషం మీ ఊరులో ఉంటే మరుక్షణం ఇంకొక ఊరికి ఇలా పరి పరి విధాలుగా మనస్సు పయనిస్తుంది. అన్నిటికంటే వేగంగా పయనించేది మనస్సు అనేకదా మేధావులు చెపుతారు. యదార్ధానికి సాధకుడు తన శరీరాన్ని నియంత్రించుకోవటంలో ఆంతర్యం మనస్సుని నియంత్రించుకోవటానికి మాత్రమే కదా. 

మనస్సును నియంత్రించుకోవడం: 

ఒక గుర్రం వున్నదనుకోండి దాని రౌతు  చిన్న చిన్న రేకు ఫలకాలను దానికంటికి ప్రక్కగా అమరుస్తారు  దానివలన గుర్రం చూపు ప్రక్కకు మళ్లకుండా కేవలం వీడిమీదనే ఉంటుంది.  కాబట్టి గుర్రం ముందుకు మాత్రమే పరిగెడుతుంది.  అలా గుర్రం నడిపే రౌతు గుఱ్ఱాన్ని లొంగదీసుకుంటాడు. మన మనస్సు కూడా గుఱ్ఱం లాగా పరి పరి విషయాలమీదకు మళ్లకుండా కేవలం భగవంతుని మీదకు మళ్ళటానికి మనం ఏదో ఒక ఫలకాన్ని మనస్సుకు అడ్డంగా పెట్టుకోవాలి.  అది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సాధకుడు ఏర్పాటు రకంగా వారి ఇష్టానుసారంగా  ఏర్పాటు చేసుకోవాలి.  కొంతమంది నామ స్మరణను ఎంచుకొని భగవన్నామాన్ని సదా ఉచ్చరిస్తుంటారు.   ఇంకొకరు భగంతుని భజిస్తూ వుంటారు, కొంతమంది సదా నామ జపం  చేస్తూవుంటారు. (ఉదాహరణకు ఇస్కోన్ సమస్తలోని సాధకులు) కొందరు నామాన్ని లికిస్తూవుంటారు, రామకోటి, శివకోటి వ్రాయటం మొదలగునవి. ఇలా ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు. ఇందులో ఇది మంచిది ఇది కాదు అని అనటానికి లేదు. విధానం ఏదైనాకూడా మనకు కావలసింది మనస్సును నియంత్రించుకోవడం మాత్రమే. మన ప్రయాణం అనాయాసంగా జరగాలి అంటే అది బస్సు అయితే నేమి రైలు అయితేనేమి గమ్యాన్ని చేరటం ముఖ్యం కదా. 

మనం తరచుగా చూస్తూవుంటాము చాలామంది పైన  పేర్కొన్నఏదో ఒక విధానాన్ని అనుసరించి అదే జీవిత లక్ష్యంగా వారి జీవనాన్ని కొనసాగిస్తారు.  కానీ మిత్రమా ఆలా ఎప్పటికి అనుకోకూడదు. ఈ పద్ధతులు కేవలం మనస్సును నియంత్రించుకోవటానికి మాత్రమే ఉపకరిస్తాయి కానీ అంతకంటే వేరొకటి కాదు నీ లక్ష్యం మోక్ష సాధన మాత్రమే. మోక్షయానికి ఈ పద్ధతులు ప్రారంభ శిక్షణగా మాత్రమే ఉపకరిస్తాయి కానీ మోక్షసిద్ది మాత్రము లభించదు. 

మనం పూర్తిగా సాధకులు ఆచరించే భక్తి మార్గాలు మోక్షాన్ని చేరుకోలేవు అని కూడా అనలేము. మనం మన చరిత్రను పరిశీలిస్తే భక్తి మార్గంతో మోక్షాన్ని చేరుకున్న మహా భక్తుల ఉదంతాలు మనకు తెలుసు. ముందుగా భక్తి మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, తన్మయాసక్తి, పరమ విరహాసక్తి   అని పదకొండు భక్తి సాధనలున్నాయి.

          శ్రవణానికి పరీక్షిత్‌ మహారాజు, కీర్తనము వలన తుంబురుడు, విష్ణుస్మరణ వలన నారదుడు, పాదసేవ వలన  శ్రీ మహాలక్ష్మి, అర్చన వలన పృథు చక్రవర్తి, వందనము వలన అక్రూరుడు, దాస్యము వలన హనుమంతుడు, సఖ్యము వలన  అర్జునుడు, ఆత్మ నివేదన వలన బలిచక్రవర్తి ముక్తి పొందారు. ఇక పదవది తన్మయాసక్తి. భక్తితో పారవశ్యము చెంది తన్మయమైపోయాక నీవే ఆ కృష్ణ పరమాత్మగా మారి చైతన్య ప్రభువు ఎలా గంతులేస్తున్నాడో, ఎలా తనకు తెలియకుండానే గీతాలు పాడుతున్నాడో, కవిత్వము రాకుండానే కవిత్వం చెప్తున్నాడో అది తన్మయాసక్తి. పరమ విరాహసక్తి అంటే, భగవంతుని విడిచి ఒక్క క్షణము కూడా వుండలేను. ప్రియుని విడిచి వుండలేను అని ప్రియురాలు ఎలాగైతే విరహ వేదన అనుభవిస్తుందో, అలాగే. 

కాబట్టి భక్తి మార్గం కూడా ఉపయుక్తమైనదే అయితే మరి భక్తిమార్గాన్నే అనుసరించవచ్చుకదా.  జ్ఞ్యాన మార్గం ఎందుకు ఆచరించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. మనం సూక్షమంగా పరిశీలిస్తే భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరుగా గోచరించవు. అటువంటప్పుడు రెండు మార్గాలు ఎందుకు వున్నాయి అంటే.  ముందుగా ఒక సాధకుడు భక్తి మార్గాన్ని అనుసరించి సాధన కొంత ముందుకు సాగిన తరువాత తనకు తానుగా జీవాత్మ వేరు పరమాత్మా వేరు కాదనే భావనలోకి  వస్తాడు. అప్పుడు తానూ ఈ చరచరా జగత్తుకు కారణభూతుడైన సర్వేశ్వరునిలో అంతర్లీనంగా వున్నాను అంటే 

అహం బ్రహ్మాస్మి 

అనే భావనలోకి వస్తాడు.  ఇలా తెలుసుకోవటమే జ్ఞ్యానం తరువాత తనకు తెలియకుండానే భ్రహ్మ జ్ఞ్యాన పిపాసకుడు అయి తానె బ్రహ్మ అవుతాడు. 

"బ్రహ్మ విత్ బ్రహ్మయేవ భవత్" 

ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా 

ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా అనే సందేహం ప్రతి సాధకుని మదిలో తొలిచే ప్రశ్నయే కొంతమంది విగ్రహారాధన సద్గుణోపాసన అని ధ్యానంలో ప్రతిమ లేదు కాబట్టి అది నిర్గుణోపాసనే అని చెపుతారు. నిజానికి సూక్ష్మంగా పరిశీలిస్తే ధ్యానం కూడా సద్గుణోపాసనే అని చెప్పవలసి వస్తుంది.  అది ఎలా అంటే బాహ్యంగా, బౌతికంగా ఎలాంటి విగ్రహం లేకపోవచ్చు కానీ అంతరంగికంగా మనం మనస్సుకు ఒక స్థాన నిర్దేశనం చేసి ధ్యానం చేస్తున్నాం. ఉదాహరణకు గీతలో కృష్ణ భగవానులు భృకుటి (రెండుకనుబొమ్మల నడుమ) జాస నిలిపి అంటే మనస్సు నిలిపి ధ్యానానం చేయమన్నారు. కొందరు సాధకులు ఈ పద్దతి సులువు కాదని పేర్కొన్నారు.  ఏదిఏమైయేన సాధకుని అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు. ఇటీవల చాలా సంస్థలు యోగా కేంద్రాలు వస్తున్నాయి. ఒక్కరు శ్వాస మీద జాస అని ఒకరు హృదయంలో జాస అని ఒకరు బిందువు మీద జాస అని కొందరు క్రియా యోగమని కొందరు సుదర్శన యోగమని ఇలా పరి పరి విధాలుగా ధ్యాన పద్ధతులు  తెలుపుతున్నారు. అవి అన్ని తప్పు అని మనం అనలేము. పద్దతి ఏదైనా కానీ అంతిమ లక్ష్యం మనస్సును నిగ్రహించటమే. కాబట్టి ఎవరికి నచ్చిన పద్దతిని వారు అనుసరించవచ్చు. 

పైన పేర్కొనిన ప్రతి పద్ధతిలోను మనస్సు వున్నది అంటే మనోవృత్తి  వున్నాడనుమాట. ఎప్పుడైతే మనస్సు లయం కాలేదో అప్పుడు అది సద్గుణమే అవుతుంది కానీ నిర్గుణం కాదు.  అయితే నిర్గుణోపాసన లేదా అని అడుగవచ్చు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిర్గుణోపాసన వున్నది కానీ అది ఉపాసన మాత్రం కాదు ఎందుకంటె ఉపాసన అనే పదంలోనే నీవు భగవంతునికన్నా బిన్నంగా ఉన్నవని కదా అర్ధం.  ఎప్పుడైతే మనస్సు పూర్తిగా లయం అవుతుందో అదే నిర్గుణోపాసన. అది కేవలం సమాధి స్థితిలోనే లభిస్తుంది. చిత్తవృత్తి నిరోధమే  ధ్యానం అని మహర్షులు తెలిపారు.

సాధకుడు ఎప్పుడయితే సమాధి స్థితిని పొందుతాడో అప్పుడు అతనికి బాహ్య స్మ్రుతి పూర్తిగా పోతుంది. శరీర వ్యాపారాలు అంటే ఆకలి దప్పులు, హృదయ స్పందన, శ్వాస పీల్చుకోవటం, వదలటం. స్పార్స్య జ్ఞ్యానం, ఇవి ఏవి వుండవు. శరీరం మీద పాములు, జర్రులు ప్రాకిన శరీరం చుట్టూ పుట్టలు పెరిగిన, ఎండలు కార్చినా వర్షాలు కురిసిన ప్రకృతి బీబత్సవంగా ప్రళయాలు సంభవించినా సాధకునికి స్పృహ ఉండదు.  ఆ స్థితిని చేరుకునే సాధకుడు  జీవన్ముక్తుడు. అదే మోక్షముగా మనం తెలుసుకోవచ్చు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి సార్దకుడు సమాధి స్థితిని చేరుకునేలా తన సాధనను కొంగసాగించాలని సాధకులందరు మోక్షగాములు కావాలని అభిలాష. 

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 



 సాదాకా మేలుకో -2

 పడగనీడలో 

ఒక కప్పు ఎండలో అటు ఇటు తిరుగుతూ వున్నదట దానికి ఎక్కడ కూడా ఏమాత్రం నీడ దొరకటం లేదు కాళ్ళు కాలిపోతున్నాయి, శరీరం అంతా చెమటలతో మునిగిపోతుంది, నోరు ఎండిపోతున్నది, ఇంకనేను బ్రతకలేనేమో అని భావిస్తుండగా కొంత దూరంలో కొద్దిగా నీడ కనిపించింది.  బతుకు జీవుడా అని ఆ కప్పు ఆ నీడలో తన శరీరాన్ని దాచుకోవటానికి వేగంగా వెళ్ళింది.  అక్కడకు వెళ్ళగానే ప్రాణానికి కొంత ఊరట లభించింది. అమ్మయ్య నాకు ఈ నీడ చాలా హాయిగా వుంది అని అనుకొన్నది. కొంత ఊరట చెందినతరువాత నీళ్లు ఎక్కడైనా లభిస్తాయా అని అటు ఇటు చూడటం మొదలు పెట్టింది.  ఆ వెతుకులాటలో తన మీద ఉన్న నీడ అటు ఇటు కదలటం గమనించింది.  ఏమిటి ఈ నీడ ఇలా కదులుతున్నది అని ఒక్కసారి పైకి చూసింది.  పైకి చూసిన తన ఫై ప్రాణాలు పీకే పోయాయి ఎందుకంటె ఆ నీడ మరెవరిదో కాదు కప్పలను విందారగించే ఒక పెద్ద పాముది నా అదృష్టం కొద్ది దాని ద్రుష్టి నా మీద పడలేదు కానీ పడితే ఆ భావనతోటె ప్రాణం పోయినంత పామునైయింది. కప్పు రక్షింపబడ్డదా లేక భక్షింపపడ్డాదా అనేది పాఠకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నాను.  

ఇక విషయానికి వస్తే సాధకులారా మీ సాధన నిత్యం కొనసాగించండి.  రోజు సాధనను నిర్విరామంగా చేస్తేనే కానీ మనకు ఈ జన్మలో మోక్షం లభించదు జాప్యం అస్సలు  చేయవలదు. మనం ఏ పనినైనా వాయిదా వేయవచ్చు కానీ దేవదేవుడైన పరమేశ్వరుని ధ్యానాన్ని అస్సలు వాయిదా వేయకూడదు.  మనకు లభించిన ఈ జన్మ కేవలం పడగనీడలో వున్న కప్ప జీవిత కాలమంతే మన వెనుక పెద్ద పడగ వున్నది దానిపేరు కాలుడు. అందుకే మన ఆదిశంకరులు చెప్పారు "నిత్యం సన్నిహితే మృత్యువు"  మానవ జీవనం కూడా పాము పడగక్రింద వున్న కప్పలాంటిదే ఆ పాము (మృత్యువు) ఏ క్షణంలో నయినా కాటు వేసీ ప్రాణాన్ని అపహరించగలదు.  కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగరూకులం అయి ఉండాలి.

కాబట్టి సాధక నీ జీవితంలో ప్రతి నిముషం విలువైనదని తెలుసుకో నీ జీవితాన్ని పూర్తిగా జన్మ రావాహిత్యానికై అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించు.  మనం నిత్యం అనుభవించే సుఖాలు, భోగాలు నిత్యమైనవి కావు కేవలము తాత్కాలికమైనవి ఈ సంగతి ప్రతి సాధకుడు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. 

ఈ రోజుల్లో మనకు అనేకమంది తమ వాక్చాతుర్యంతో భక్తి మార్గాన్ని ప్రభోదిస్తున్నామని చెపుతున్నారు.  నిజానికి వారు వారి జీవితాలను యెంత మోతాదులో ఉద్దరించుకుంటున్నారు అన్నది ఒక ప్రశ్నర్ధకమే. ఎంతమంది దేహ వ్యామోహం లేకుండా వున్నారు. చాలా వరకు దేహవ్యామోహం  ఉన్నట్లు ప్రస్ఫుటంగా బాహ్యంగా కనిపిస్తూ ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు. మరి తమను తామే ఉద్దరించుకోలేని స్థితిలో ఉంటే వారు మనలను ఎలా ఉద్ధరిస్తారు ఆలోచించండి. 

నిజమైన సాధకుడు దేహవ్యామోహాన్ని వదిలి ఉండి ఈ దేహం కేవలం మోక్షాన్ని పొందటానికి ఉపయోగ పడే ఒక సాధనగా మాత్రమే తలుస్తాడు. ఏ మాత్రము దూషణ, భూషణాదులకు లొంగడు, అరిషడ్వార్గాన్ని నియంత్రించుకొని ఉంటాడు, ఎప్పుడు మృదు భాషణలు చేస్తాడు, రాజసం అస్సలు ఉండదు, ధనాపేక్ష, కీర్తి కాండూతి ఉండదు. తన జీవితాన్ని ఎలా తరించుకోవాలని మాత్రమే ఆలోచిస్తాడు. అటువంటి సాధకుడు మాత్రమే సద్గురువుగా పేర్కొన వచ్చు. అటువంటి సద్గురువులు తారసపడితే వారి సాన్నిధ్యంలో మన సందేహ నివృత్తి చేసుకొని నిత్యం సాధన చేస్తే తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది. 

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

భార్గవ శర్మ


 

 ఆలోచనా విధానాలు 


ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కోవిధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తారు. కానీ అందరి ఆలోచనలు ఒక్కొక్క రీతిలో ఉంటాయి. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్బవించవచ్చు కూడా. ఒకమనిషి ఆలోచనా విధానం అతని మేధస్సుమీద ఆధారపడి ఉంటుంది. సమస్యను కూలంకుషంగా సత్వరం అర్ధం చేసుకొని వెనువెంటనే సరైన పరిష్కారం చెప్పటం అనేదానినికి సూక్ష్మగ్రాహ్యత సమయస్పూర్తి కావాలని పెద్దవారు చెపుతారు. ఒకే విధమైన నెలజీతం పొందుతున్న ఇద్దరు ఉద్యోగస్తుల జీవన విధానం ఒకే విధంగా వుండాలని లేదు ఒకరు అనేక అప్పులు చేస్తూ అనవసరమైన డాంబికాలు పోయి అనేక ఇక్కట్లు పడవచ్చు ఇంకొకరు తనకు వున్న వనరులను ఒక ప్రణాళికా బద్దంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తనకు మించిన ఖర్చులు చేస్తూ తగిన ఆదాయంలేక అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చలేక కస్టాలు పడుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకున్న వారి గూర్చి నిత్యం మనం వార్తల్లో చదువుతున్నాము, చూస్తూన్నాము . వాటన్నిటికీ కారణం ఆలోచనా విధానం మాత్రమే. 


సరయిన నిర్ణయం తీసుకోవటం ఒకని మేధాశక్తికి నిదర్శనం. అంతే కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో నిర్ణయం సరైనది అయినా కూడా సరైన సమయంలో తీసుకోక పోవటం అనేక కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు అనేక కారణాలవల్ల పేరుకొని ఉంటే తాను కొన్న ధరకాన్న తక్కువ ధరకు అమ్ముతారు, దానికి కారణం ఒకటి ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మచూస్తే అది అమ్మటానికి చాలాసమయం పట్టవచ్చు, రేండు ఎక్కువ సమయం వేచి చుస్తే ఆ సరకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు. అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక జనప్రదాన్యత వున్న సరకు మీద వెచ్చిస్తే దానిమీద ఎక్కువ లాభం రావచ్చు. ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గూర్చి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక లాభాన్ని కోల్పోతాడు. 


ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు. మేనేజరులు తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి. 


సమయస్పూర్తి: సీతాపహరణ తరువాత సుగ్రీవుని రాజ్యంలోని వానరులను సీతాదేవిని వెతకటానికి నియమించారు ఆ వరువడిలోనే హనుమంతులవారిని కూడా నియమించారు. హనుమంతులవారు లంకకు చేరారు, సీతామాతను తెలుసుకున్నారు. నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది. వెంటనే వచ్చి సీతాదేవి జాడని శ్రీ రామచంద్రులకు తెలిపితే తన నియమిత కార్యం అయిపోయినట్లే కానీ సీతజాడతోటి హనుమంతులవారు ఊరుకోలేదు సీతాదేవిని రావణుడినుండి విడిపించుటకు శ్రీరాముడు యుద్ధం చేయవలసి ఉంటుంది. కాబాట్టి రావణాసురుని బలం అతని రాజ్య విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు రావణుని దర్శనం చేసుకోవాలి అది యెట్లా సాధ్యం తాను రాజప్రాసాదానికి వెళ్ళితే అక్కడి భటులు రావణాసురుని చూడనీయరు. అందుకే ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేశారు. నిరోధించటానికి వచ్చిన వీరులను ఓడించారు. అప్పుడు తప్పనిసరై హనుమంతులవారిపై బ్రహ్మస్త్రాన్ని ఇంద్రజిత్ ప్రయోగించి రావణుని సభకు తీసుకొని వెళతారు. ఇక మిగిలిన కధ మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం గమనించాలసింది హనుమంతులవారి ఆలోచనా విధానం సమయ స్ఫూర్తి. సమయ స్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపద నయినా సులభంగా దాట వచ్చు. 


జ్యోతిష్య శాస్త్రంలో ప్రావిణ్యం వున్న ఒక జ్యోతిష్కులవారు ఒక రాజుగారి వద్దకు వెళ్లారట అయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట " మీ వాళ్ళందరూ మీ ముందే చనిపోతారు" అది విన్న ఆ రాజుగారు కోపోద్రేకుడై అతనికి బహుమానాలు ఇవ్వటం అటుంచి మరణ శిక్ష విధించారట. ఒకటి రెండు రోజులలో శిక్ష అమలు అనగా ఈ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్య పండితులు రాజుగారి దర్శనం చేసుకున్నారు. రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా వున్నారు ఆ విషయం మన జ్యోతిస్యులవారికి తెలుసు ఆయన అత్యంత లౌక్యము చూపించి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి "మహారాజా మీరు అత్యంత మహార్జాతకులు మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలిస్తారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు జీవిస్తారు. ఏ కొద్దీ మందికో మీలాగా జాతకం ఉండదు" అని తెలిపారు. దానికి ప్రసన్నులైన మహారాజు నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు నీకు ఏమి కావాలో కోరుకో అని అన్నారు. మహారాజా నా శిష్యుడు తెలిసి తెలియని జ్ఞానంతో మీ వద్దకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణ శిక్ష విధింపబడ్డాడు. దయచేసి అతనిని క్షమించి విడిపించవలసిందిగా ప్రార్ధించారు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిస్యుల శిక్షను రద్దుచేశారట. మన రెండవ జ్యోతిషేలవారు మొదటివారిని కలుసుకొని నీవెందుకు అలా చెప్పావు అని అడిగితె నేను చెప్పింది నిజంకాదా అని ప్రశ్నించారట. నీవు చెప్పింది నిజం నేను అదే చెప్పాను కానీ చెప్పే విధానం బట్టి మనము అనుగ్రహ, ఆగ్రహాలకు పాత్త్రులము అవుతాము అని అన్నారట. 


జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః!

జిహ్వాగ్రే మిత్రబాంధవాః!

జిహ్వాగ్రే బంధనప్రాప్తిః!

జిహ్వాగ్రే మరణం ధృవం!!


అని అన్నారు కాబాట్టి మనం నోటిని జాగ్రత్తగా అంటే మాటలను సమయానుకూలంగా వాడాలని హితవు చెప్పి పంపారట. బుద్ది కర్మానుసారినే అనే నానుడి ఊరికే రాలేదేమో అనిపిస్తుంది. 


ఒక కేసువిషయంలో చాలా తీవ్రంగా ఒక లాయరుగారు వాదిస్తున్నారట ఆయన వాదనకు జడ్జిగారు కూడా ముగ్దులు అయ్యారట. ఇక వాదనను ముగించపోవగా ప్రక్కనే వున్నా జ్యునీయరు లాయరుగారు మన లాయరుగారి చెవిలో ఏదో చెప్పారట వెంటనే మన లాయరు గారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నేను చెప్పింది బహుశా డిఫెన్సు లాయరుగారు చెప్పవచ్చు కానీ అది ఎంతమాత్రమూ సబబుకాదు ఇప్పుడు నా వాదనను వినండి అని తానూ ముందు చెప్పిన వాదనకు వ్యతిరేకంగా చెప్పి జడ్జిగారిని మెప్పించి కేసు గెలిపించారట. ఇంతకూ ఆ జూనియరు లాయరు గారు చెవిలో చెప్పింది ఏమిటి అంటే అయ్యా మీరు మన క్లయెంటు గూర్చి కాకుండా అవతలి పార్టీకి సపోర్టుగా వాదిస్తున్నారు అని. ఆక్షణంలోనే సర్దుకొని తన వాదనను పూర్తిగా మార్చుకున్నారు సీనియర్ లాయరు గారు అదే సమయ స్ఫూర్తి అంటే. ఇవ్వన్నీ మనం తెలుసుకున్నవి, నిత్యం చూస్తూవున్నవి. ఇక అసలు విషయానికి వస్తే మానవుడు తన జీవిత లక్ష్యం అయిన మోక్ష సాధన చేయటానికి చక్కటి ఆలోచనా విధానం వుండాలి అంతేకాదు తనకు దైనందిక జీవితంలో ఎదురుపడే అనేక ఒడిదుడుకులను ఎదుర్కునే సమయస్ఫూర్తి కావలి. సాధకుని చూసి సామాన్యులు అనేక విధములుగా మాట్లాడవచ్చు అటువంటి మాటలకు, విమర్శలకు ఏమాత్రం చలించకుండా నిత్యం తన లక్ష సాధనవైపు ద్రుష్టి సాగించి లక్ష్యాన్ని ఈ జన్మలోనే సాదించాలి. 


నాకు ఈ జన్మలోనే మోక్షం వస్తుందా అది ఎంతో దుర్లభం ఏదో దైవ జాసలో, నామ స్మరణతో కాలం గడుపుదాం అని చెప్పే అనేకులు మనకు తారసపడతారు. అంతే కాకుండా అయన సద్గురువు, ఈయన సద్గురువు అని చెప్పి మీ వద్ద వలసినంత ద్రవ్యాన్ని వసూలు చేసేవారు కూడా వుంటారు. కాబట్టి ఎవ్వరిని అనుసరించకుండా నీ సాధన నీవు కొనసాగించు. వారి మాటలను పరిగణలోకి తీసుకొన్నామంటే మన సాధనకు పూర్తిగా అవరోధం కలుగుతుంది. కాబట్టి మిత్రమా మోక్షం అంటే సామాన్యమైన విషయం కాదు అత్యంత కృషి, సాధన, అకుంఠిత దీక్ష ఉంటేనే సాధించగలం. ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనది దీనిని ఇక్కడే,ఇప్పుడే సార్ధకట్చేసుకోవాలి. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః  


మీ భార్గవ శర్మ