28, సెప్టెంబర్ 2023, గురువారం

⚜ శ్రీ అక్షరధామ్ స్వామినారాయణ మందిర్

 🕉 మన గుడి : నెం 192







⚜ ఢిల్లీ : 


⚜ శ్రీ అక్షరధామ్ స్వామినారాయణ మందిర్


💠 100 ఎకరాల స్థలం..200 కోట్ల వ్యయం.. 11,000 మంది శ్రమ...20,000 విగ్రహాలు అన్నీ కలిస్తే ఓ అద్భుత ఆలయం! 

ప్రపంచ వింతల్లో ఒకటి!

అదే " అక్షరధామ్" స్వామి నారాయణ్ మందిర్ 


💠 ప్రపంచ వింతల జాబితాలో ఎప్పటికప్పుడు కొత్తవి చేరుతూ ఉంటాయి. 

అలా అంతర్జాతీయ ప్రముఖ రెజెస్ట్ పత్రిక గుర్తించిన ఏడు వింతలో ఢిల్లీలోని అక్షరథామ్ స్వామి నారాయణ్ ఆలయం ఒకటి 


💠 'అక్షరధామ్' అంటే భగవంతుని దివ్య నివాసం. ఇది భక్తి, స్వచ్ఛత మరియు శాంతి యొక్క శాశ్వతమైన ప్రదేశంగా ప్రశంసించబడింది. 

న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఒక మందిరం - భగవంతుని నివాసం, హిందూ ప్రార్థనా మందిరం మరియు భక్తి, అభ్యాసం మరియు సామరస్యానికి అంకితమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వివాసం


💠 స్వామినారాయణ అక్షరధామ్

6 నవంబర్, 2005న తెరవబడింది.

నవంబరు 7, 2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. 


💠 శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) ద్వారా నిర్మించబడింది,

యోగిజీ మహారాజ్ (1892-1971 ) ప్రేరణతో

ఆయన శిష్యులు ప్రముఖ్ స్వామి మహారాజ్ రూపొందించారు.


⚜ స్వామి నారాయణ్ చరిత్ర ⚜


💠 ఉత్తరప్రదేశ్‍లోని అయోధ్యకు సమీపంలో వున్న ఛాపయ్యా గ్రామంలో 1781 లో ఆయన జన్మించాడు. ఏడవ ఏటనే పవిత్ర గ్రంథాల్ని పఠించి వాటి సారాన్ని గ్రహించాడు. నాలుగేళ్ళ తర్వాత ఆధ్యాత్మిక యాత్రీకుడిగా ఇల్లు వదిలి వెళ్ళాడు. ఏడేళ్ళ పాటు కాలినడకన భారతదేశమంతా సంచరించి, వివిధ సంస్కృతీ రూపాల్ని ఆకళింపుజేసుకుని, చివరకు గుజరాత్‍లో స్థిరపడ్డాడు. 

సాంఘీక- ఆధ్యాత్మిక విప్లవానికి నాందిపలికి' స్వామి నారాయణ సంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు. 

లక్షలాది జనులు ఆ సంప్రదాయానికి అనుయాయులయ్యారు. 

49 ఏళ్ళు ఈ భూమ్మీద జీవించి, తన వారసుల దీక్ష, తన బోధనల ప్రాచుర్యం ద్వారా, తాను అమలుపరచిన సంప్రదాయం "అక్షరం" (వినాశనం లేనిది) గా కొనసాగే మార్గం సుగమం చేశాడు. 

అందుకే ఆ భవన సముదాయం "అక్షరధామ్"గా ప్రసిద్ధిపొందింది. 

ఆ సంప్రదాయానికి చెందిన బ్రహ్మ స్వరూప్ యోగీజి మహారాజ్ 1968 లో ఒక కోరిక వెలిబుచ్చాడు. యమునాతీరాన ఒక స్మారక భవనం నిర్మించబడాలన్నదే ఆ అకాంక్ష. అయినా ఆయన జీవితకాలంలో అది జరగలేదు. ఆయన వారసుడు  శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బ్యాప్స్) కు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ (83) ద్వారా ఆ కోరిక నెరవేరింది. కేవలం ఆయన చొరవతో, ఆశీస్సులతో రెండు దశాబ్దాల కృషి ఫలితంగా నేటి స్వామి నారాయణ్ అక్షరధామ్ వెలిసింది.


💠 ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా పేరొందిన దీన్ని 200 కోట్ల రూపాటు వ్యయంతో నిర్మించారు. 

100 ఎకరాల ప్రాంగణంలో నెలకొల్పిన ఇందులో మొత్తం 20,000 శిల్పాలను నిలువెత్తున అపురూపంగా మలిచారు. 

ఏకంగా 11,000 మంది శిల్పకారులు 5 ఏళ్ళు శ్రమించారు. 

రాజస్థాన్ నుంచి ఎర్ర చలువరాయిని తెప్పించారు. ప్రధాన ప్రాంగణం 356 అడుగు ఎత్తుగా ఉంటుంది. మొత్తం 234 స్తంభాలు అపూర్వమైన శిల్పకళతో కనువిందు చేస్తాయి. 


💠 అహ్మదాబాద్ వాస్తు శిల్పి వీరేంద్ర త్రివేది రూపొందించిన ఆ కట్టడాన్ని 148 రాతి ఏనుగులు తమ భుజాలపై మోస్తుంటాయి.

 148 ఏనుగులు భారత పురాణాలకు, పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు, 20,000 దేవతా విగ్రహాలు, పురాణ, ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనం లోని ప్రతి చదరపు అంగుళం, కళాత్మకంగా కనువిందు చేస్తుంది. భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది.


💠 ఇక్కడ నిర్మించిన మెట్ల బావి దేశంలోనే అతి పెద్దది. దాదాపు 2,870 మెట్ల మధ్య 300 అడుగుల పొడవు వెడల్పులలో కమలాకారంలో యజ్ఞగుండం ఉంటుంది. 

రాత్రివేళల్లో ఫౌంటేషన్ గా మారుతుంది.


💠 ఇక్కడి పడవ విహారం మరచిపోలేని అనుభూతినిస్తుంది. 

పదివేల ఏళ్ల భారతీయ చరిత్రకు అద్దం పట్టే కట్టడాల మీదుగా ప్రయాణం సాగుతుంది. ప్రపంచంలోనే మొదటిదైన తక్షశిల జీవన శైలికి సంబంధించిన నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. ఆలయంలో 11 అడుగులు ఎత్తున నారాయణ్ విగ్రహం చుట్టూ వేర్వేరు దేవతల రూపాలు కొలువై ఉంటాయి. గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా పేరొందిన స్వామి నారాయణ్ శిష్యులే దీన్ని రూపొందించారు.


💠 ఈ భవన నిర్మాణానికి లోహాన్ని (స్టీలు) ఉపయోగించకపోవటం ఓ విశేషం. 

ఈ మందిరం అంతా ఎరుపు రాళ్ళ గోడల్ని కలిగి ఉంది. అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద మందిర నిర్మాణం నమ్మశక్యం కాకుండా ఉంది. స్వామి నారాయణ సంస్థ ఆధ్వర్యంలో ఈ మందిర పరిసరాలు ఇంకా వృద్ధిలోకి వస్తున్నాయి. దాదాపు పదివేల సంవత్సరాల హిందూ సంస్కృతీ చిహ్నాలను మందిరంలో భద్రపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


💠 60 ఎకరాల ప్రశాంత వాతావరణంలోని కొలనులో ఓ పది నిమిషాల బోటు ప్రయాణం హిందూ సంస్కృతికి సంబంధించిన  దృశ్యాలను దర్శింపచేస్తుంది. 

సాయంకాలం 'లైట్ అండ్ సౌండ్ షో'ని ప్రదర్శిస్తారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ 'అక్షర ధామాన్ని' అతి పెద్ద హిందూ దేవస్థానంగా తన రికార్డులో నమోదు చేసుకుంది.

లతా మంగేష్కర్


 https://youtu.be/mpgnNq33Rsc?si=15hUSuJv5sgmBOrM

శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 ఆమె పాటకు పర్యాయపదం. దాదాపు ఏడు దశాబ్దాల పాటు భారత దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలన్నిటిని పరవశింపచేసిన గానామృత ఝరి లతా మంగేష్కర్.  వి. మధుసూదన రావు గారు ఆమె జయంతి సందర్భంగా ఎంత చక్కగా ఆ భారతరత్నాన్ని ఆవిష్కరించారో వినండి. తెలుగు సహా దాదాపు అన్ని భాషల్లోనూ మరచి పోలేని ఎన్నో మధుర గీతాలను ఆమె ఆలపించారు. ఈ ఎపిసోడ్ లో ఆ విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

Panchaag


 

నమ్మకము లేకపోతే

 శుభరాత్రి. యీ ప్రొద్దున్నే చూసా గరికపాటి వారి సందేశం. 

మన పురాణాలలో కానీ మన వేదాలలో కానీ గట్టిగా పూజలు చేయండి. బహుమతులు దే మునికి  యివ్వండి అని  చెప్పలేదు..

మనస్సు ప్రధానం. శ్రద్ధ ప్రధానం త్యాగం ప్రధానం.

 యుద్ధానంతరం శ్రీ కృష్ణ భగవానుడు తిరిగి తన రాజ్యానికి వెళుతుంటే కుంతి దేవి కృష్ణునుకి  నమస్కరిస్తూ

 నాకు ఎప్పుడూ కష్టాలు. వుండేటట్లు అనుగ్రహించు. స్వామి అని వేడుకుంది. .ఎందుకు అని చెబుతూ

     జీవిత పరమావధి

కైవల్యం.జన్మ రాహిత్యం. యిది మరచి పోయి ఏవేవో అఖరలేని సంబంధము లేని వ్యాపలకై ఎదురు చూస్తున్న అవివేకులు గూర్చి ఏమి ఆలోచించాలి.దేనికోసం యిదంత. 

కల్లయదుట జరుగుతున్న యీ మాయాప్రపంచము లోని వింతలు విశేషాలు  చు కూడా యింకా మనోరంజకంగా వుండే విషయాల కోసం ఎదురు చూస్తూ వుండే యీ మానవుల గూర్చి యేమి వివరిస్తారో మీరే నిర్ణయంచుకోండి .

     అనాన్య శ్చింత యో.............  .

తేష్షాo నిత్యాభియిక్తానా

..........  . . యింకా నమ్మకము లేకపోతే 

..... ఓం నమఃశివాయ.

మరణ జననమ్ము పరిణయ

 మరణ జననమ్ము పరిణయ మనెడిమూటి

ననుభవించకతప్పదు మనిషి జగతి,

ఎప్పుడు డెక్కడ నయ్యవి యెవని చేత

ననుభవించంగ నుండునో నగును నచట

AMmavari Harati


 

Song

Song 

 MAHASAMADHI DIVAS OF SRI SRI LAHIRI MAHASAYA, TUESDAY SEPTEMBER 26


“THE PHYSICAL, MENTAL, AND SPIRITUAL LAWS OF HEALING ARE ALL GOD'S LAWS. They are not separate, but different aspects of the same divine principle of healing. The division created by supporters of each method is caused by ignorance. Each of these laws gets results when practiced rightly. Why deny that doctors can cure? Or that mind can heal? Or that faith can restore health? 


LAHIRI MAHASAYA was so great because he was not onesided. He was balanced. He never ridiculed doctors; in fact, he had many doctor disciples. LAHIRI MAHASAYA would sometimes give an herb to a sick disciple, and to others he would merely say, "You are all right." Occasionally, he would recommend a doctor. It depended on the nature of the ailing person.”


~  Paramahansa Yogananda, 

'Harmonizing Physical, Mental, and Spiritual Methods of Healing", 

"THE DIVINE ROMANCE", pg 163

Opportunities in Japan*

 **Career Opportunities in Japan*


If there is any country on this earth where there are plenty of jobs available it is only Japan. 


Japan is a country where the average age of population is above 38 years.


There is a huge requirement of freshers and experienced in streams of B.Tech, M.Tech, MBA, and MCA. To meet this huge requirement of Engineering graduates, Japan has opened its doors to qualified and skilled manpower from India.


It's a very good opportunity for young graduates and experienced under the age of 27 years to start their career in Japan.


Salary Package: 1,60,000 INR to 2,00,000 INR PM.


Japan is the safest country in the world, especially for women, with zero crime rate. 


Anyone Interested should contact:

Ashwin,

+91 9866660722


Disclaimer. Blogger is not responsible about the content

Gangotri video

Gangotri video 

Design


 

Moving piller


 

Aksharam


 

Sewing machine to wood cutter converstion


 

Motor to generator


 

Door bolt


 

Drone motor

 


Himaja veena vaadana


 

Vinayak


 

ఎప్పుడు ఎక్కడ ఎవడిచే

 త్రయః కాలకృతాః పాశాః శక్యన్తో న నివర్తితమ్ | వివాహో జన్మ మరణం యథా యత్ర చ యేన చ||


తా వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు....


ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవించబడవలెనో అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే!!! ఇవి మార్చడానికి అసాధ్యమైనవి.....

VAIBHAVA FOODS*

 *VAIBHAVA FOODS*


PRICES WITH EFFECT FROM 1/7/2023


Avakaya  ........Rs.600/-

 Magaya.........Rs.700/-

Kaya Avakaya.Rs.700/- (sold out)

Pulihora

Avakaya..........Rs.600/-

mukkala pacchadi........Rs.600/-

Lemon...........Rs.600/-

Pesara

Avakaya…......Rs.600/-

Jaggery

Avakaya..........Rs.900/-❌

Reduced to Rs.         600/-✅

Menthikaya....Rs.800/-(Sold out)

Gongura.........Rs.600/-

Pallagongura..Rs.650/- Pandumirchi.. .Rs.600/_(sold out)

Tomato.......... Rs.600/-

Tomato

Pandumirchi...Rs.600/-(sold out)

Allam

Chutney.          Rs.600/-

Mamidi Allam

Chutney. ...     .Rs.600/-

Usiri Avakaya.Rs.600/-

Chinthakaaya.Rs.600/-

Dosa Avakaya Rs.600/-

Pacha

Avakaya            R.900/-❌

Reduced to Rs.      600/-✅

Usiri thokku

 pachadi.          R.600/-

Allamvellulli

Avakaya.         Rs.800

Reduced to Rs. 600/-✅

Munaga Avakaya.         Rs.600/_

Pesara

Avakaya,         Rs.600/-

కరివేపాకు పచ్చడి Rs.600/-

Kandipodi.      Rs.600/-

Idlypodi.       ...Rs.600/-

Karivepaku

podi.                 Rs.600/-

Sambarpodi....Rs.600/- Charu podi.…. . Rs.600/-

Karapupodi..   Rs.600/-

Vellullikaram..Rs.600/-

Pallipappula

Podi.,..............Rs.600/-

Putnalapappu

Podi.                Rs.600/-

Munagaaku

 podi.                Rs.800/-

Kura karam.    Rs.600/_

Dabbakaya         Rs.600/-

కరివేపాకు పచ్చడి   Rs.600/-

Gummadi

Vadiyalu........Rs.1200/

చిట్టి వడియాలు Rs.800/-

*to our members*


*Preparing with passion*

*No preservatives*

*No colours*

*Most trusted brand in the market in respect of taste, quality and delivery*

*No controversies*

*Affordable prices*

*Prompt delivery*

*Shipping charges are to be borne by the customer*


*We can deliver all the pickles within one day in Hyderabad*


*Apart from above, we can prepare different types of pickles and powders on order*

*Vaibhava Foods*

*102, Mithila APTS*

*VV NAGAR COLONY*

*KUKATPALLY*

*HYDERABAD*


*Contact if any needed to 7032752421*

మహాలయ పక్ష ప్రారంభం

 మహాలయ పక్ష ప్రారంభం

*మహాభారతంలో కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి, భూలోకంలో అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్లిన ఈ పది అయిదు రోజులకే మహాలయ పక్షమని పేరు...*


అయ్యా !


*బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు.*

**(29-9-2023నుంచి 14-10-2023)వరకు**


కర్ణుడి కథ:- దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది, ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు.

ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారి పోయింది. స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది, దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ''కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు, అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది'' అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.


కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒ అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు.

అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు, పితరులకు తర్పణలు వదిలాడు... తిరిగి అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది, ఆకలి తీరింది.

కర్ణుడు మరణించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గాని కెళ్లిన ఈ పక్షం (15) రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.


అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. *అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.* 

*NOTE:-*మహాలయ అమావాస్య. తండ్రి జీవించి తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీ, తండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు, పేదలకు అన్నదానములు చేయాలని శాస్త్రం తెలుపుతుంది, ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య.

సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది.* 

**మహాలయ పక్షం సందర్భంగా అన్నదానం చేయాలి అనుకునేవారు మీ సమీపంలో అన్నదాన కేంద్రాన్ని సంప్రదించవచ్చు.**


👆🏾🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👆

అశోక చక్రవర్తి*

 మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??


ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! 

మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 


# అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 

" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 


# "చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.


 # అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... 


# *"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 


# అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.

ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 


# "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 


# "అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది

భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 


# వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 


# *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 


# జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది. 


# అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* "  జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? 


లేదా ......

*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* 


ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, 

తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??


# *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 

*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? 


*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 

చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు 

అలెగ్జాండర్ 

" *వెనుదిరగవలసి వచ్చింది* ".


# ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 


ఈ చారిత్రక నిజాల్ని కనీసం *ఐదు* గ్రూపుల కన్నా పంపుదాం🙏

 

# *కొందరు పంపరు*... 

అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్న👍🏻


*వర్ధిల్లాలి భారతి యశస్సు*

*ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు*


 *భారత్ మాతాకీ జై* 🇮🇳

✊✊✊✊✊✊

అమ్మ- కథ

                *అమ్మ- కథ

                 ➖➖➖✍️


అమ్మ కావాలా?....అమెరికా కావాలా? అందరూ దయచేసి చదవండి....


ఈ  మధ్య      ఒకానొక       ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.


ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు!


నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి. వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు.


ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు, కొందరికి పొలాలు, ఆస్తులూ ఉన్నాయి. ఎవ్వరూ చూసేవాళ్ళు లేక, పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు.


నేను వెళ్ళేటప్పటికి రఘురాం అనే ఒక ఎన్నారై అక్కడున్నాడు. ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు. ఆరు నెలలకోసారి వస్తాడట ఆయన.


ఆయనతో మాట్లాడాలనిపించింది. ఆశ్రమం బయట ఉన్న గుట్టల వేపు నడుస్తూ వెళ్ళాం.


"మీ అమ్మ గారికి ఇప్పుడెలా ఉంది?" అడిగాను. 


"బాగానే ఉంది. వయసు మీదపడింది. ఓల్డేజ్ రిలేటెడ్ ప్రోబ్లంస్ అంతే." అన్నాడు.


"ఆమెకి హటాత్తుగా ఏమైనా అయితే ఎలా?"


"హోం వాళ్ళు చూసుకుంటారు. నాకు ఇంఫార్మ్ చేస్తారు. జూబిలీ హిల్స్ లో పెద్ద ఇల్లుంది ప్రోపర్టీస్ ఉన్నాయ్.. హటాత్తుగా డాడి చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడుంచాం."


"అమెరికా తీసుకెళ్ళొచ్చుగా!"

"ప్రయాణం చేయలేనంది!"

"ఇక్కడ ఇల్లుంది, ఆస్తులున్నాయ్ కదా మీరు ఇంక అమెరికాలోనే ఎందుకుండడం.?"


రఘురాం చివ్వున తలెత్తి నా వేపు చూసాడు.."ఇక్కడుండలేమండీ"


"ఎందుకుండలేరు?'


"నా వైఫ్, పిల్లలు రారు. అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం."


"ఏముందక్కడ?"


"ఏమి లేదో చెప్పండి."


"మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా"


"వస్తూ పోతూ ఉంటాగా"


"సారీ...నేనిలా మాట్లాడుతున్నానని వేరే అనుకోకండి. నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నా. ఎన్నో ఓల్డేజ్ హోంలు తిరుగుతుంటాను. ఎంతో మంది తల్లితండ్రులతో మాట్లాడుతుంటాను. వాళ్ళ అనుభవాలు, పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంటాయి. లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్ధిస్తుంటారు."


"మా అమ్మ కూడా అంతేనండి"


"అమ్మలందరూ అంతే రఘురాం గారూ. ఇక్కడ కూర్చుందామా. మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తోంది" అన్నాను.


"తప్పకుండా, అమ్మ కూడా నిద్రపోతోంది" అన్నాడు రఘురాం.


అక్కడున్న ఓ బెంచీ మీద కూర్చున్నాం. "మా అమ్మ నాన్నలకి నేనొక్కడినే. P.G. చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను. P. G. అయిపోయింది, మంచి ఉద్యోగమొచ్చింది. పెళ్ళి చేసారు, పిల్లలు పుట్టుకొచ్చారు. విలాసవంతమైన జీవితం, వీకెండ్ పార్టీలు, ప్రయాణాలు. అప్పుడప్పుడూ ఇండియా రావడం, చుట్టాల్లా ఉండి వెళ్ళడం. నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసేవాళ్ళకి లోటులేదు. ఓ రాత్రి నాన్న హటాత్తుగా గుండె పోటుతో చనిపోయాడు. శవంతో అమ్మ ఆ రాత్రంతా ఉంది. షాక్ లోకి వెళ్ళిపోయింది. నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు. మూడు రోజుల తర్వాత నేనొస్తే వచ్చావా, నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు" అంది. 


నాకు ఏడుపు తన్నుకొస్తోంది. అమ్మ ఏడవడం లేదు. హాస్పిటల్ కి పోదామంటుంది.

అమ్మ చుట్టూ బంధువులున్నారు. అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు. ఆయనకి ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకుపడిపోయింది. నాన్న లేడని అర్ధమైంది. అంతా ముగిసిపోయింది. అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను. రానంది. ఈ ఇంటితో, మీ నాన్నతో ఏభై ఏళ్ళ అనుబంధం నాది. ఇక్కడే ఉంటాను. ఎక్కడికీ రానంది.


నా పరిస్థితి …మీరూహించగలరనుకుంటాను. అమ్మకి నేనొక్కడినే! ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎన్నో రకాల మందులు వేసుకుంటుంది. నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా? ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గరుంచి నేను వెళ్ళిపోయాను...

వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగొచ్చాను. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వచ్చాను.

నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి. నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిపోయాయి.

అంత పెద్ద ఇంటిలో ఒక్కర్తీ ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు. తన తోడుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని. నా జీవితమంతా అమ్మ పంచిన ప్రేమ, లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది. ఓ రోజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను.


"నానీ తో స్కైప్ లో మాట్లాడొచ్చుగా డాడీ" అని మాత్రమే అన్నారు.


"నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను."


"వాట్... ఆ ముసలామె కోసం నీ కెరీర్ పాడుచేసుకుంటావా?" అంది నా భార్య.


"డాడీ... ఆ డర్టీ ఇండియాకి మేము రాం." ఇద్దరూ ఒకే సారి అరిచారు.


“రోకీ నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టు వదిలేస్తావా?”

ముగ్గురూ బిత్తరపోయారు.


“నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు. మీ చదువులు పాడవుతాయని నాకూ తెలుసు. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళతాను.” 


దాని మీద చాలా ఆర్గుమెంట్స్ జరిగాయి. 


"ఇంత మంచి జీవితాన్నిచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతానంటున్నావ్ ఏముంది డాడీ అక్కడ" అంది నా కూతురు. 


"అక్కడ మా అమ్ముంది. నా మీద ప్రాణాలన్ని పెట్టుకుని పెంచిన మా అమ్ముందమ్మా అక్కడ. నన్ను కని పెంచిన నా కన్నతల్లిని వొంటరిగా వదిలేయలేనమ్మా"  అంటూ ఏడ్చాను. గుండెలవిసేలా ఏడ్చాను. ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని, ఉద్యోగానికి రెజైన్ చేసీ ఇండియా వచ్చేసాను.


నేనొచ్చి ఐదేళ్ళయ్యింది. మా నాన్న మీద బెంగతో, అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో గడిపిన ఈ ఐదేళ్ళు నాకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత నా భార్యా పిల్లలూ కూడా వచ్చేసారు. చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోం లు తిరుగుతూ నా కధ చెబుతుంటాను. అమెరికా కంటే అమ్మెంత గొప్పదో చెబుతుంటాను."

రఘురాం కళ్ళల్లో నీళ్ళు.


నన్ను వదిలేసి వడి వడిగా వాళ్ళమ్మ గది వైపు వెళ్ళిపోయాడు.


"తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మనబాల్యంలో వారు పంచిన ఆప్యాయతానురాగాలను తిరిగి పంచి కన్నవారి ఋణం తీర్చుకోండి. కాలం కరిగిపోయిన తరువాత ఎంత ఏడ్చినా ఏమి పలితం?"✍️

        అశ్రునయనాలతో...మీ...

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

Purandaradasa kriti


 Listen to this amazing rendition of famous Purandaradasa kriti by an unknown street singer

you are at peace. Or stressed

 



This image was created by a Japanese neurologist. When the photo does not move, you are at peace. It's going slowly? You are a little stressed. If it moves fast, you are very stressed.

Have a nice and peaceful days...💌🍀

మోరియా" అంటే ఏమిటి.?*



 *"మోరియా" అంటే ఏమిటి.?* 

🚩వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ *మోరియా* అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి *మోరియా* అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం..


*మోరియా అసలు కథ*

15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట.. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. 

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు.. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట.. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. *మోరియా* గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది.. ఆనాటి నుంచి *గణపతి బప్పా మోరియా*..అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది.. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు *గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా*.. అని మరాఠీ లో నినదిస్తాం.. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి.. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.. 🙏🚩🙏

108 ఉపనిషత్తులు

 108 ఉపనిషత్తులు 


1. ఈశావాస్యోపనిషత్ 

2. కేసోపనిషత్ 

3. కఠోపనిషత్ 

4. ప్రశ్నోపనిషత్ 

5. ముండకోపనిషత్ 

6. మాండూక్యోపనిషత్  

7. తైత్తిరీయోపనిషత్ 

8. ఐతరేయోపనిషత్ 

9. ఛాందోగ్యోపనిషత్ 

10. బౄహదారణ్య కోపనిషత్ 

11. బ్రహ్మోపనిషత్ 

12. కైవల్యోపనిషత్ 

13. జాబాలోపనిషత్ 

14. శ్వేతాశ్వతరోపనిషత్ 

15. హంసోపనిషత్ 

16. అరుణికోపనిషత్ 

17. గర్భోపనిషత్ 

18. నారాయణోపనిషత్ 

19. పరమహంసోపనిషత్ 

20. అమౄతబిందూపనిషత్ 

21. అమౄతబిందూపనిషత్ 

22. అథర్వనాదోపనిషత్ 

23. అథర్వఖోపనిషత్ 

24. మైత్రాయణ్యుపనిషత్ 

25. కౌషితకీబ్రాహ్మణోపనిషత్ 

26. బౄహజ్జాబాలోపనిషత్ 

27. నౄసిమ్హతాపిన్యుపనిషత్ (పూర్వతాపిని, ఉత్తరతాపిని) 

28. కాలాగ్నిరుద్రోపనిషత్ 

29. మైత్రేయోపనిషత్ 

30. సుబాలోపనిషత్ 

31. క్షురికోపనిషత్ 

32. మంత్రికోపనిషత్ 

33. సర్వసారోపనిషత్ 

34. నిరాలంబోపనిషత్ 

35. శుకరహస్యోపనిషత్ 

36. వజ్రసూచ్యుపనిషత్ 

37. తేజోబిందూపనిషత్ 

38. నాదబిందూపనిషత్ 

39. ధ్యానబిందూపనిషత్ 

40. బ్రహ్మవిద్యోపనిషత్ 

41. యోగతత్వోపనిషత్ 

42. ఆత్మబోధోపనిషత్ 

43. నారదపరివ్రాజకోపనిషత్ 

44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్ 

45. సీతోపనిషత్ 

46. యోగచూడామణ్యు పనిషత్ 

47. నిర్వాణోపనిషత్ 

48. మండల బ్రాహ్మణోపనిషత్ 

49. దక్షిణామూర్త్యుపనిషత్ 

50. శరభోపనిషత్ 

51. స్కందోపనిషత్ 

52. మహానారాయణోపనిషత్ 

53. అద్వయతారకోపనిషత్ 

54. రామరహస్యోపనిషత్ 

55. రామతాపిన్యుపనిషత్ (పూర్వతాపిన్యుపనిషత్ ,  ఉత్తరతాపిన్యుపనిషత్)  

56. వాసుదేవోపనిషత్ 

57. ముద్గలోపనిషత్ 

58. శాండిల్యోపనిషత్ 

59. పైంగలోపనిషత్ 

60. భిక్షుకోపనిషత్ 

61. మహోపనిషత్ 

62. శారీరకోపనిషత్ 

63. యోగశిఖోపనిషత్ 

64. తురీయాతీతోపనిషత్ 

65. సన్న్యాసోపనిషత్ 

66. పరమహంసపరివ్రాజకోపనిషత్ 

67. అక్షమాలికోపనిషత్ 

68. అవ్యక్తోపనిషత్ 

69. ఏకాక్షరోపనిషత్ 

70. అన్నపూర్ణోపనిషత్ 

71. సూర్యోపనిషత్ 

72. అక్ష్యుపనిషత్

73. అధ్యాత్మోపనిషత్ 

74. కుండికోపనిషత్ 

75. సావిత్ర్యుపనిషత్ 

76. ఆత్మోపనిషత్ 

77. పాశుపతబ్రహ్మోపనిషత్ 

78. పరబ్రహ్మోపనిషత్ 

79. అవధూతో పనిషత్ 

80. త్రిపురతాపిన్యుపనిషత్ 

81. శ్రీదేవ్యుపనిషత్ 

82. త్రిపురోఒపనిషత్ 

83. కఠరుద్రోపనిషత్ 

84. భావనోపనిషత్ 

85. రుద్రహౄదయోపనిషత్ 

86. యోగకుండల్యుపనిషత్ 

87. భస్మజాబాలోపనిషత్ 

88. రుద్రాక్షజాబాలోపనిషత్ 

89. గణపత్యుపనిషత్ 

90. దర్శనోపనిషత్ 

91. తారసారోపనిషత్ 

92. మహావాక్యోపనిషత్ 

93. పంచబ్రహ్మోపనిషత్ 

94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్ 

95. గోపాలతాపిన్యుపనిషత్ 

96. కౄష్ణోపనిషత్ 

97. యాజ్ణ్జవల్క్యోపనిషత్ 

98. వరాహోపనిషత్ 

99.  శాట్యాయనీయొపనిషత్ 

100. హయగ్రీవోపనిషత్ 

101. దత్తత్రేయోపనిషత్ 

102. గారుడోపనిషత్ 

103. కలిసంతారణోపనిషత్ 

104. బాల్యుపనిషత్ 

105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్ 

106. సరస్వతీ రహస్యోపనిషత్ 

107. బహ్వౄచోపనిషత్ 

108. ముక్తికోపనిషత్

పండితులసంభాషణల్లో

 *పండితులసంభాషణల్లో తెలుగు సంవత్సరాల పేర్లు :*


తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ….. అని ఇలా 60 ఉంటాయి. పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.


*‘ ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’* అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25 వ సంవత్సరం పేరు ‘ఖర’ (అంటే గాడిద). 26 వ సంవత్సరం పేరు నందన (అంటే కొడుకు).


*‘నీ కొడుక్కేంట్రా ఇరవై తొమ్మిది. గొప్పింటి సంబంధాలు వస్తాయి’* అంటే మన్మధుడని. 29 వ సంవత్సరం పేరు ‘మన్మధ’ 


*‘వాడికోసారి నలభై జరిగినా తెలిసి రాలేదు’* అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40 వ సంవత్సరం ‘పరాభవ’


*‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ముప్పయి, ముప్పై మూడు కదా! ‘* అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30 వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33 వ సంవత్సరం ‘వికారి’


*‘ నీ ‘నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’* 48 వ సంవత్సరం పేరు ‘ఆనంద’


*‘వాడితో వాదనెందుకురా వాడో యాభై అయిదు* . అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55 వ సంవత్సరం ‘దుర్మతి’


 *‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ నలభై ఒకటి లే'* అంటే కోతులూ కప్పలూ అని అర్ధం.41 వ సంవత్సరం ‘ప్లవంగ’


*‘వాడసలే ముప్పై ఎనిమిది జాగ్రత్తగా మాట్లాడు.* అంటే కొంచెం కోపిష్టి అని. 38 వ సంవత్సరం పేరు  ‘క్రోధి’ 

🤣😂🤣

Vinayak uragimpu



 

ఫోన్ చార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడకండి...!*

 


*దయచేసి ఎంత పని మీకు ఉన్నాసరే...!*

*ఫోన్ చార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడకండి...!*

*ఫోన్ మాట్లాడుతూ నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి...!*

*ఎందుకంటే...?*

*గత వారం ఢిల్లీలో జరిగిన ఒక* *సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మరణం దీనికి నిదర్శనం...!*

*ఇది CC కెమెరాలో రికార్డు అయింది..!*

*దానిని జాగ్రత్తగా గమనించండి...* 


*దానిని చూసి నేను కూడా ఎంతో షాక్ కు గురయ్యాను...*

*ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇలాంటి పని చేయరు అని నేను అనుకుంటున్నాను.*


*ఫ్రెండ్స్ ఫోన్ కన్నా...!*

*పని కన్నా...!*

*మన ప్రాణం మిన్న...!*

K


 

సారహీనమైన

 శ్లో॥

అసారే ఖలు సంసారే

సారం శ్వశుర మందిరం

హిమాలయే హర శ్శేతే

హరి శ్శేత మహాదధౌ।


భావము:

సారహీనమైన ఈ సంసారమందు అత్తవారిల్లు ఒక్కటే కొంత సారం గలదిగా ఉంటూంది।అందువల్లనేగదా పరమేశ్వరు డంత వాడు అత్తవారిల్లయిన హిమాలయంమీది కైలాసమున నివసించుట; అంతేకాకుండా సాక్షాత్ విష్ణుమూర్తి కూడా అత్తవారిల్లు అయిన పాల సముద్రం లోనే పండుకొని వుంటున్నాడు గదా.



సారహీనంబు నైన సంసార మందు 

అత్తగారిల్లె నన్నింటయుత్తమంబు శివుడువసియించెనందుకేశీతగిరిని

కమలనాభుండువసియించె కడలియందు


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

Nee illu yekkada

 


🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -59 &60🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -59 &60🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో వున్న చిన్న మండపాన్ని కట్టించిన గొల్లపడుచు. తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలూ, పెరుగూ ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది.


 ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా, ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా పై నుండి వచ్చిన (బెజవాడ దుర్గమ్మ పంపిన) సొమ్మంతా అయ్యిపోయింది అన్నారట. 


అప్పుడు ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బుతో కడితే నిలుస్తుంది కానీ, మా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూ, పెరుగూ అమ్మాను ఆ డబ్బును మూడు కొండ రాళ్ళను ఒక దగ్గరకు చేర్చి ఆమధ్యలో దాసుకొన్నాను ఆ డబ్బుతో కట్టండని కట్టించిందట అదే నేటి గొల్ల మండపం.......... (కోర్ల సంబరం లోని కథ ఇది.)


*✓తీర్థములు:*


*తుంబుర తీర్థము:*

తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబురతీర్థం. తుంబురుడి పేరుమీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసానదశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికీ అక్కడ ఉన్నాయి.


 కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబురతీర్థం ఏర్పడింధి. ఫాల్గుణ పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతిస్తారు.


*పాండవ తీర్థం:*


పాండవ తీర్థం తిరుమలలో ఉంది. దీనికే గోగర్భ తీర్థమనీ పేరుంది. వేంకటేశ్వరాలయానికి ఈశాన్య దిశలో మైలు దూరంలో ఉన్న పాండవతీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాదికాలం నివసించారని ఐతిహ్యం. వైశాఖమాసంలోశుక్లపక్ష ద్వాదశిరోజు, అదీ ఆదివారం అయితే, పాండవతీర్థంలో స్నానం చేయటంకానీ లేదా కృష్ణపక్ష ద్వాదశీ మంగళవారం నాడు స్నానం చేయటంకానీ మంచిదని భక్తులు భావిస్తారు. 


ఆ రెండు రోజులూ స్నానం చేయటం సకల శ్రేష్ఠం.

• తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ దూరంలో పాండవ తీర్ధంఉంది. పాండవులు ఈ తీర్ధంలో స్నానం చేయడం వల్ల పాండవ తీర్ధం.ఈ స్నాన ఫలం వల్ల పాండవులకు సమర విజయం., రాజ్య ప్రాప్తి కలిగిందని వరహః పురాణం చెబుతుంది.

• 

జ్ఞాతులయిన కౌరావులను చంపడం వల్ల కలిగిన పాపాన్ని పాండవులు ఈ తీర్ధస్నానంవల్ల పోగొట్టుకోన్నారని పద్మ పురాణం విశాదికరిస్తుంది 20 వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మ విద్యావ్యాపకుడుగా ప్రసిద్ధి వహించిన శ్రీ మలయాళ స్వాములవారు ఏర్పేడు ఆశ్రమం స్థాపించడానికి ముందు ఈ ప్రాంతంలోనే కఠనమయిన తపస్సు చేశారు.


తిరుమల తిరుపతి దేవస్తానం వారు అనుమతించగా ఏర్పేడు వ్యాసాశ్రమంవారు అందమయిన భవన నిర్మాణం ఇక్కడ చేపట్టారు వృషభరాశిలో సూర్యుడు సంచరించే వేళా శుక్ల పక్షంలో గాని కృష్ణపక్షంలోగాని, ద్వాదశి తిదిలో ఆది, మంగళవారాలలో ఈ తీర్ధంలో స్నానం చేయడం పవిత్రమని, ప్రశస్తామని పెద్దలంటారు


*దేవతీర్థం:*


తిరుమలలో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో ఉంది ఈ దేవతీర్థం. పుష్యమీ నక్షత్రం కలిసిన గురువారంకానీ శ్రవణానక్షత్రయుక్తమైన సోమవారం నాడుకానీ ఈ తీర్థస్నానం వల్ల పాపాలు నశించి, దీర్ఘాయువు వరమై, ఆ తర్వాత మోక్షసిద్ధి కలుగుతుందని ప్రతీతి.


*కుమారధారాతీర్థం:*


కుమారధారాతీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో, సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో పవిత్రస్నానం పరమ పుణ్యప్రథమంటారు. ఆనాడు అక్కడ, స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచటం మరో విశేషం.


కుమారస్వామి ఇక్కడే శ్రీవారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధారాతీర్థమన్న పేరు వచ్చింది.


*జాబాలి తీర్థము:*


జాపాలి. ఈ ఆలయం తిరుమలలో ఉన్నది. ఇది పాప వినాశం నకు పోవు మార్గం లో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గం కనిపిస్తుంది.


ఇక్కడ భగవాన్ హనుమంతుడు వెలిశి ఉన్నారు. ఈ ఆలయం సమీపమునక వెళ్లే కొద్ది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది.ఎందుకంటే ఇక్కడ ఆ ఆంజనేయడు కొలువై ఉన్నారు. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి. 


*శేష తీర్థము:*


తిరుమల లోని ఒక పుణ్య తీర్థం .ఇది పపవినాసనం నుండి కొన్ని మైళ్ళు అడవిలో నడచి చేరుకోవాలి. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. 


ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.


*కపిలతీర్థం:*


 శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలోకపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. 


అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.


 ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తిక మాసం నందు వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.


 ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పని చేస్తుంది, శివరాత్రి పండుగ మరియు బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.


• తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం.


ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది.

అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం... అడుగుతీసి అడుగు వేయనివ్వదు. 


ఇంతటి సుమనోహర తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడిందంటే...కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది.


 ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. 


ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు


*పాప వినాశనము:*


పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, నాలుగో అధ్యాయం పేర్కొంటోంది.


*ఆకాశ గంగ:*


ఆకాశ గంగ తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరంపాటు అంజనాదేవి తపస్సుచేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని భావన. ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి వంశస్తులు తేవడం సంప్రదాయం.


• తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కే.మీ దూరంలో `ఆకాశ గంగ తీర్ధం ఉంది. హిమచలంలో ప్రవహించిన గంగమూడు పాయలయిoది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం.



*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -60*


🍁🍁🍁🍁🍁


*-నారాయణవనంలో శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతిల కళ్యాణం:*


కలియుగ దైవం వేంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైబోగం. అలాంటి కలియుగ నాధుని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది. 


తిరుపలికి 40కి.మీ. దూరంలో పుత్తూరుకి 5 కి.మీ. దూరంలో, శ్రీ కళ్యాణ వేంకటేవ్వర ఆలయం కలదు. ఇది అరుణానదీ తీరంలో ఉన్న అతి ప్రాచీన ఆలయము. ఈ ఆలయం క్రీ.శ. 1544లో అచ్యుత దేవరాయల ఆంతరంగికుడైన పెనుగొండ వీరప్పన్నగారిచే నిర్మించబడినదని చర్రిత్ర చెప్పుచున్నది. 


ఈ వీరప్పన్నయే విరూపన్న అని తెలియుచున్నది. కాని స్థలపురాణం మాత్రం నారాయణవరం అధిపతి అయిన ఆకాశరాజుగారు కట్టించారని చెప్పుచున్నది. ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలించుచున్న కాలంలో వైకుంఠనివాసుడైన శ్రీమహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర రూపంతో వెంకటాద్రి మీద వెలసాడు.


అపుడాయన దేవేరి లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకు పుత్రికగా జన్మించింది. యుక్తవయస్సుకు వచ్చిన పద్మావతి దేవి వేంకటేశ్వరుని తప్ప మరొకరిని వివాహమాడనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించవలసిందిగా తండ్రిని కోరింది. 


కుమార్తె కోరిక మన్నించిన ఆకావరాజు శ్రీవేంకటేవ్వర, పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోనే అతివైభవంగా జరిపించాడని,ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి.

 

ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ఆవరణ కలిగి ఉన్నది. ఈ ఆలవరణ చుట్టూ ఉన్నతమైన ప్రాకారము కలదు. ఈ ప్రాకారం తూర్పు దిశలో 96 అడుగుల ఎత్తుగల 7 అంతస్తులు గలిగిన గోపురంతో శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుచున్నది.


 ఈ ఆలయమందు గర్భగుడిలో కళ్యాణ వేంకటేశ్వరుడు ప్రక్కనే మరొక చిన్నగుడిలో పద్మావతీ అమ్మవారు దర్శనమిస్తారు. పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరుగలి రాయి కలయి. ఆ తిరుగలితో ఆమె పెండ్లి రోజున బియ్యము విసిరినారని చెప్పుచుందురు.


ఈ ఆలయములో పద్మావతి, వేంకటేశ్వరులేకాక ఆళ్యారులు, దశావతారాలు, శ్రీవరదరాజస్వామి ఆండాళ్ళమ్మ, శ్రీకోదండరాముల వారు, శ్రీరంగ నాయకస్తామి, శ్రీరాజమన్నారుస్వామి, శ్రీ ప్రయాగస్వామి మున్నగువారు మనకు దర్శనమిస్తారు.


 ఈ ఆలయానికి కొంత దూరంలో నున్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమినుండి అయిదు రోజులు స్వామివారి తెప్పోత్సవము, జ్వేష్ఠ శుద్ధ దశమి నుండి పదిరోజులు బ్రహ్మాత్సవములు అత్యంత వైభవంగా జరుపుకుంటారు


*శ్రీ వేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *38వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *38వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*బుధగ్రహ జననం - 1*


ఆశ్రమంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వరుసలుగా కూర్చున్న విద్యార్థులు. వేదమంత్రాలను వల్లె వేస్తున్నారు. వాళ్ళపైన చెట్ల రెమ్మల్లో దాక్కున్న చిలుకలు వాళ్ళను అనుకరిస్తూ మంత్రాలు పలుకుతున్నాయి.


ఆగకుండా వినవస్తున్న పక్షుల కిలకిలరావాలూ , అప్పుడప్పుడు వినవచ్చే నెమళ్ల అరుపులూ ఆశ్రమ వాతావరణానికి నేపథ్య సంగీతం అందిస్తున్నాయి.


వల్లెవేస్తున్న విద్యార్థుల స్వరాన్ని ఏకాగ్రతతో గమనిస్తూ , ఆకర్షిస్తున్న బృహస్పతి కనుబొమలు ఎవరో కదిలించినట్టు కదిలి - ఒకదానికొకటి దగ్గరవుతూ - మధ్యలో కలుసు కుంటున్నాయి. ఆయన చూపులు - వయ్యారంగా , అందంగా మెలికలు తిరుగుతూ - పచ్చిక తీసుకున్న పాపటలా కనిపిస్తున్న కాలిబాట మీద నడుస్తూ వస్తున్న యువకుడి మీద కేంద్రీకృతమయ్యాయి.


చక్కటి శరీర నిర్మాణం. మెరిసిపోతున్న శరీర వర్ణం. చూపుల్ని ఆకర్షించి , పట్టివుంచే అందం. మగవాళ్లకు కూడా మళ్లీ చూడాలనిపించే చక్కదనం. ఎవరా యువకుడు ? ఇంద్రలోకంలో కూడా ఇంత అందగాడు. తారసిల్లలేదే !


తన వైపే చూస్తూ , ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్న యువకుణ్ణి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు బృహస్పతి. యువకుడు బారులుగా కూర్చున్న విద్యార్థుల వెనక నిలబడి , వినయంగా బృహస్పతి వైపు చూస్తూ ఉండిపోయాడు.


*"ఎవరు నాయనా ?"* బృహస్పతి ప్రశ్నించాడు. 


*“మీ దర్శనానికి వచ్చాను...”* చంద్రుడు వినయంగా అన్నాడు.


బృహస్పతి చేతిని పైకెత్తుతూ , శిష్య బృందాన్ని చూశాడు. శిష్యుల పఠనం ఆగిపోయింది. అలవాటు కొద్దీ చెట్టు మీద చిలుకలూ మౌనం ధరించాయి.


*"ఇలా దగ్గరగా రా !”* బృహస్పతి అన్నాడు. శిష్యుల తలలు ఒకసారి వెనుకకు తిరిగాయి. అందరి కళ్ళూ ఆ యువకుడి మీద నిలిచిపోయాయి. యువకుడు బృహస్పతి ముందు ఆగి , వినయంగా చూశాడు.


*"అనసూయ , అత్రిమహర్షి దంపతులు పుత్రుణ్ణి... నా పేరు చంద్రుడు...”.*


*“ఓహ్...ఆత్రేయుడివా !”* బృహస్పతి అడ్డు తగుల్తూ అన్నాడు.


*“చిత్తం. నా తండ్రిగారి ఆదేశం మేరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం మీ సన్నిధికి వచ్చాను. దయచేసి...”*


*"అలాగా !”* బృహస్పతి మళ్ళీ అడ్డొస్తూ అన్నాడు. అత్రి అనసూయ దంపతుల పుత్రుడిది అసామాన్య సౌందర్యం !


*"దయచేసి విద్యార్థిగా స్వీకరించి , విద్యాదానం అనుగ్రహించండి !"* అంటూ చంద్రుడు బృహస్పతికి పాదాభివందనం చేశాడు..


*"సుఖీభవ !"* బృహస్పతి దీవిస్తూ అన్నాడు.


*చంద్రుడు లేచి , ఆశ్చర్యంగా బృహస్పతి వైపు చూశాడు. "గురుదేవా ! నేను.... విద్యాదానం కోసం వచ్చాను..."*


బృహస్పతి కళ్ళు చిట్లించాడు. తన ఆశీర్వాదంలో సందర్భ శుద్ధీ , సమయ స్ఫూర్తీ , ఔచిత్యమూ లోపించాయని చంద్రుడు పరోక్షంగా గుర్తు చేస్తున్నాడు ! ఆయన మొహం మీద చిరునవ్వు మెరిసింది.


*"ఔను , విద్యార్థికి సుఖం ఉండదు. ఉండకూడదు !"* బృహస్పతి తనను దిద్దుకుంటూ అన్నాడు. కుడిచేతిని పైకెత్తి చంద్రుడి ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. *"సకల విద్యా ప్రాప్తిరస్తు !"*


*“ధన్యోస్మి !"* చంద్రుడు పునరభివాదం చేస్తూ అన్నాడు.


*"చంద్రా ! అనుష్టానాలు పూర్తి చేసి , మార్గాయాసం తీర్చుకో... తదనంతరం...”* 


*"అనుష్ఠానాలు మార్గంలోనే పూర్తి చేసుకున్నాను. ఈ ప్రశాంత వాతావరణంలో అడుగు పెట్టగానే మార్గాయాసం మాయమైపోయింది గురుదేవా !"* ఆశ్రమాన్ని కలియజూస్తూ అన్నాడు చంద్రుడు.


బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. *"సంతోషం నాయనా ! ఆ... అత్రి మహాశయులు కుశలమే కదా !"*


*"నాన్నగారు కుశలంగా ఉన్నారు...”*


*"సాధ్వి అనసూయా దేవి...”*


*"నాన్నగారి సేవే అమ్మకు సత్కాలక్షేపం గురుదేవా !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.


*"ఆ ఆదర్శ దంపతులు అదృష్టవంతులు ! వాళ్ళ పుత్రుడైన నువ్వు అదృష్టవంతుడివి ! సరే... చంద్రా... అలా కూర్చో... సాయంత్రం నిన్ను ప్రత్యేకంగా పరీక్షిస్తాను. నువ్వు ఆర్జించిందీ , నీ వద్ద ఉన్నదీ ఏదో తెలుసుకుంటాను ! లేనిదీ , అవసరమైనదీ నిర్ణయిస్తాను !”* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. ఆయన చూపులు ఆశ్రమం వైపు తిరిగాయి.


ఒక యువతి , నీటి పాత్రతో చకచకా వచ్చి , చంద్రుడికి తాగడానికి నీళ్ళు అందించింది వినయంగా.


*"ఆశ్రమ పరిచారిక పుంజికస్థల !"* బృహస్పతి పరిచయం చేశాడు. *"విద్యార్థుల విడిది గృహాల్ని చక్కగా చూసుకుంటుంది. ఆశ్రమంలో చేదోడు వాదోడుగా ఉంటుంది !"* 


చంద్రుడు దాహం తీర్చుకుని పాత్ర పుంజికస్థలకు ఇచ్చివేశాడు. విద్యార్థుల వరుసల వెనుక వైపుకి అడుగులు వేశాడు. రెండు కళ్ళు చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్నాయి.


అవి బృహస్పతి కళ్ళు కావు !


అవి ఏ విద్యార్థి కళ్ళూ కావు !


అవి ఆశ్రమ గవాక్షంలోంచి చూస్తున్న కళ్ళు ! అవి కలువ రేకుల్లాంటి విశాలమైన కాటుక కళ్ళు !


అవి బృహస్పతి సతి కళ్ళు !


అవి మదవతి తార కళ్ళు !


బృహస్పతి శయనాగారంలోకి వచ్చాడు. తార మంచం మీద కూర్చుని ఉంది. వాతాయనంలోంచి దూసుకొస్తున్న గాలి , ఆమె పైట చెంగుతో ఆడుకుంటోంది. మధురమైన పూల సుగంధాన్ని మోసుకొస్తున్న గాలి శయనాగారమంతా వ్యాపిస్తోంది.


*"ఇంకా మేలుకునే ఉన్నావా , తారా ?"* ప్రశ్నించాడు బృహస్పతి.


భర్త రాకను అప్పుడే గమనించినట్లు తార తటాలున లేచి , నిలబడింది. “నిద్ర రావడం లేదు..." అందామె.


బృహస్పతి మంచం మీద నడుం వాల్చాడు విశ్రాంతిగా , అప్రయత్నంగా ఆయన చెయ్యి తార చేతిని పట్టుకుంది. తార , మంచం అంచున కూర్చుంది. ఆమె కళ్ళు బృహస్పతి ముఖంలోకి చూశాయి.


*"ఆ నూతన విద్యార్థి... చంద్రుడు..."* అంటూ ఏదో చెప్పబోయింది తార. *"చంద్రుడా ?!"* బృహస్పతి ప్రశ్నించాడు.


*"ఆ... అతని పేరు అదే కదూ... మన విద్యార్థులందరిలోనూ , అతనే పెద్దవాడ నిపిస్తోంది... పెద్దవాడేగా , స్వామీ ?"* అడిగింది. 


*“చంద్రుడు వయసులోనే కాదు , తారా ! వినయంలోనూ , విద్యలోనూ , బుద్ధిలోనూ పెద్దవాడే !"* బృహస్పతి నవ్వుతూ అన్నాడు.


*"అలాగా...".*


*"చంద్రుడు ఎవరనుకుంటున్నావు ? బ్రహ్మ మానస పుత్రుడు అత్రిమహర్షికీ , సాధ్వీమణి అనసూయకూ అనుంగు పుత్రుడు !"*


*"తల్లిదండ్రులిద్దరూ గొప్పవారేనే !"* తార చిరునవ్వుతో అంది.. 


*"ఔను ! అత్రిమహర్షి చంద్రుణ్ణి ప్రత్యేకంగా నా వద్దకు పంపించారు. శిష్యరికం చేయమని !"* బృహస్పతి సగర్వంగా అన్నాడు.


*"పోనీ లెండి ! మీ శిష్యుల్లో యువకుడు ఉండడం మంచిది ! ఇప్పుడున్న వాళ్లంతా , చిన్నపిల్లలు ! నది నుండి నీళ్ళు తీసుకురాలేకపోతున్నారు !"* తార నర్మగర్భంగా అంది.


*"స్వామీ... ఆ చంద్రుడి చేత నదీజలం తెప్పించుకోవచ్చుగా !"*


బృహస్పతి నవ్వాడు. *"అడగాలా , తారా ! గురుకుల వాసం చేసే విద్యార్థులకు గురుశుశ్రూష ఎంత ముఖ్యమో , గురుపత్నీ సేవ కూడా అంతే ముఖ్యం !"*


తార అసంకల్పితంగా తృప్తిగా నిట్టూర్చింది.


*"పడుకో తారా ! మళ్లీ వేకువజామునే లేవాలి !"* బృహస్పతి ఆమె చేతిని సున్నితంగా లాగుతూ అన్నాడు.


తార మంచం దిగి నిలబడింది. సున్నితంగా ఆయన పట్టులోంచి తనయుడు చేతిని విడిపించుకుంది. *"మీరు పడుకోండి ! ఎందుకో నిద్ర రావడం లేదు. కాసేపు తోటలో తిరిగి... త్వరగా వచ్చేస్తా లెండి !"* అంటూ తార భర్త మాట కోసం ఎదురు చూడకుండా వెలుపలికి నడిచింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 33-37*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 33-37*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్లోకం - 33*


*స్మరం యోనిం లక్ష్మీం త్రితయ మిద మాదౌ తవ మనోః*

*నిధా యైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః |*

*భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః*

*శివాగ్నౌ జుహ్వన్త స్సురభి ఘృతధారాహుతి శతై: ‖*


నిత్యే= అమ్మా


తవ మనోః = నీ మంత్రమునకు ముందు చెప్పిన హాది విద్య లోని 'హ్రీమ్'


త్రితయ మిద మాదౌ = మొదటి కూటమిలోని మూడు అక్షరములను మార్చుకుంటే 


స్మరం = కామరాజ, మన్మధ బీజం


యోనిం = భువనేశ్వరీ బీజంః


లక్ష్మీం = లక్ష్మీ బీజం 

ఈ మూడూ ఐం హ్రీమ్ శ్రీమ్


నిధాయ = అవుతున్నది 

కాది విద్యగా


నిరవధి మహాభోగ రసికాః = అవధి లేని మహాభోగమంటే కేవలం బ్రహ్మానందము. 

ఇట్టి ఆనందమును కోరే రసికులు (సంస్కారవంతులు) ఈ మంత్రమును జపిస్తారు.  నిన్ను ధ్యానిస్తారు. 


భజంతి త్వామ్ చింతామణి గుణ నిబద్ధాక్ష వలయాః = చింతామణులతో కూర్చిన జపమాలను ధరించి, జపించి 


శివాగ్నౌ జుహ్వంతః = రుద్ర మంత్రంతో మంత్రించిన అగ్నిహోత్రంలో   


సురభి ఘృత ధారాహుతి శతైః  = ఉత్తమమైన గోక్షీరము నుండి తీసిన నేయితో శతాధిక సంఖ్యలో ఆహుతులు ఇస్తారు.


ఏదైనా మంత్రం సిద్ధించాలంటే జప తర్పణాదుల తరువాత ఆ దేవతకు సంబంధించిన హోమం చేస్తే సంపూర్ణ ఫలం సిద్ధిస్తుందని శాస్త్రము. అంతేకాక ఇక్కడ ఈ ఉపాసనల వల్ల లభించే ఇహలోక పరలోక సుఖములు అనిత్యములు కనుక

ఆ కర్మఫలములను జ్ఞానాగ్నిలో (శివాగ్నిలో) బ్రహ్మార్పణమస్తు అని ఆహుతి చేస్తున్నారు అని భావించాలి. వారికి అమ్మవారి పాదాలే అవధి లేని భోగం. 

హాది విద్య, కాది విద్య, సాది విద్య ఇవన్నీ అమ్మవారి బ్రహ్మవాస్తు విద్యలు. కాది విద్యను మన్మధుడు, హాది విద్యను లోపాముద్ర , సాది విద్యను దూర్వాస మహర్షి ప్రకటించారు.


 🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷


*శ్లోకం - 34*


*శరీరం త్వం శంభోశ్శశిమిహిర వక్షోరుహయుగం*

*తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘమ్ |*

*అతశ్శేష  శ్శేషీ త్యయ ముభయసాధారణతయా*

 *స్థితస్సమ్బన్ధోవాం సమరస పరానంద పరయోః ‖*



ఈ శ్లోకం నుండి 41 వ శ్లోకము వరకు ఒక గుచ్ఛము. వీటిలో శివ శక్తులు జగత్తుకు జననీ జనకులై ప్రతి జీవుడి హృదయంలో ఆసీనులై పాలిస్తున్నారు అని చెప్పబడుతున్నది. మొదట్లో మనము చెప్పుకున్న సమయాచారము శివ శక్తుల సమైక్యత వీటిలో స్ఫుటంగా కనబడుతుంది. *సమయాచార తత్పరా* అని సహస్ర నామాల్లో ఒకటి కదా!


శరీరం త్వం శంభోః = తల్లీ నీవు శివునకు శరీరమువు. వ్యక్తమయేది శరీరం. అవ్యక్తం ఆత్మ. అమ్మ వ్యక్తమయితే స్వామి అవ్యక్తం.


శశి మిహిర వక్షోరుహయుగం = సూర్యచంద్రులు వక్షముగా కలిగిన శరీరము నీది. అదే విశ్వము. విశ్వమే శివుని శరీరం. జగత్తంతా నిండిపోయినవాడు కదా! పసిపిల్లలకు తల్లి స్తన్యము వలె సర్వ జగత్తుకు ప్రాణశక్తిని, సస్యములను, ఓషధులను ఇచ్చి పోషించేది సూర్యచంద్రులు.


తవాత్మానం మన్యే భగవతి = ఆత్మ శబ్దానికి సందర్భాన్ని బట్టి అన్వయం మారుతూ ఉంటుంది. 

ఇప్పుడు తాపత్రయములలో  (ఆధి భౌతిక,ఆధి ఆత్మిక, ఆధి దైవిక తాపములు) ఆధ్యాత్మికము వలె ఒక చోట మనస్సనీ మరొకచోట శరీరమనీ అన్వయం చేసుకోవాలి. ఇప్పుడు శంకరులు అంటున్నారు. తల్లీ ఒక్కొక్కసారి నీవు ఆత్మవు అవుతావు ఆయన శరీరమవుతాడు.


నవాత్మాన మనఘమ్ = నవరూపములుగా వున్న శివుడు

 శివ వ్యూహాలు,అంశలు తొమ్మిది.


 ఇవి కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళా, జీవ అనేవి. అందుకే శివునకు నవాత్మ అని కూడా పేరు.


అతః శేషః శేషీ త్యయ ముభయ సాధారణ తయా = శేషః అంటే ఆశ్రయించుకొని వున్న జీవులు/విశ్వము

 శేషి అంటే ఆశ్రయింపబడినవాడు. బహుశా ఈ భావము నుండే విష్ణువునకు శేష శయనుడు అనే పేరు కలిగివుండవచ్చు. ఇప్పుడు, ఇంతకు ముందు చెప్పుకున్న విధముగా ఒక్కొక్క సారి అమ్మవారు శివునకు శరీరముగా శేషః  అయితే, స్వామివారు ఆత్మగా శేషి అవుతారు. మరొకసారి సందర్భమును బట్టి స్వామి శేషః అయితే, అమ్మవారు శేషి. అలాగే వారి సమన్వయం ఎలా ఉంటుందంటే 


పంచ కృత్యములలో సృష్టి, స్థితి అమ్మవారు చేస్తే, ఆయన సహకరిస్తారు. (ప్ర)లయము, తిరోధానము సహజ స్థితిని కప్పి ఉంచటం.

ఉదా: నిద్రా సమయంలో ఇంద్రియాలు ఉపసంహరింపబడి, ప్రపంచ వ్యవహారాలన్నీ మరుగున పడటం. అయ్యవారి పని అయితే, ఆవిడ సహకరిస్తుంది. అనుగ్రహము మోక్షము, తెల్లవారి లేచాక రాత్రి నిద్రా సమయంలో మరుగున ఉన్నవన్నీ మళ్ళీ బుద్ధికి తోచటం మాత్రము ఇద్దరూ సమముగా చేస్తారట.


స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః = పరానందము అంటే మాలిన్యములేని విషయ సుఖాపేక్ష లేని స్వచ్ఛమైన ఆనందము.

 పైన చెప్పిన విధంగా శేష,శేషీ భావ సంబంధము  సమరస సమన్వయము కలిగిన శివ శక్తులను ఆనంద భైరవ, ఆనంద భైరవీ రూప చిచ్ఛక్తులుగా ఈ విశ్వమునంతా నడుపుతున్న జననీ జనకులుగా భావించి ధ్యానించాలి అని అర్థము.


తాపత్రయాలు మనిషికి మూడు విధాల తాపములు కలుగుతూ ఉంటాయట.

 అవి


1. ఆధి ఆత్మికము = మనిషి స్వయంగా చేసే కర్మల వల్ల కలిగే బాధలు, వృత్తిలోను, ఇతరులతో మనం వ్యవహరించే తీరు తోను ఉత్పన్నమయే బాధలు.


2. ఆధి భౌతికము = వ్యాధులు, జంతువులు/ కీటకములు/ సర్పములు, వృశ్చికములు వంటి వాటి వలన కలిగే బాధలు. 

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి ఈ కోవ లోనిదే.


3. ఆధి దైవికం = దైవికంగా కలిగే ఆపదలు. 

ఉదా: భూకంపాలు, తుఫానులు, సునామీలు, కార్చిచ్చులు వంటివి.


🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్లోకం - 35*


*మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి రసి*

*త్వ మాప స్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరమ్ |*

*త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వ వపుషా*

*చిదానందాకారం శివయువతి భావేన బిభృషే ‖*


ఓ తల్లీ 

పంచభూతములు మనస్సు నీ రూపములై ఈ ప్రపంచముగా కనబడుతున్నావు నీవు. 

ఈ ఆరూ మనలోని షట్చక్రములు. 

నీ కంటే ఇతరమైనది ఏదీ లేదు. ఈ ప్రపంచముగా అభివ్యక్తమవటానికి చిదానంద రూపాన్ని ధరించి ప్రకృతిగా, శివానిగా రూపు దిద్దుకున్నావు.


మనస్త్వం = భ్రూమధ్య స్థానం, మనస్సు నీవే


వ్యోమత్వం = ఆకాశము నీవే


మరుత్ ఆసి = వాయువు నీవే


మరుత్ సారధి రసి = వాయువు సారధిగా కల అగ్నివి నీవే


త్వం ఆపః = జలమువు నీవే


త్వం భూమిః = నీవే భూమివి 


పరిణమయితుం విశ్వ వపుషా =  నీవే ఈ ఆరుగా పరిణమించి విశ్వముగా, శరీరముగా ఏర్పడ్డావు.


ఇన్నిటిగా ఉంటూ కూడా నీవు మాత్రం ఏ పరిణామం లేకుండా చిదానంద రూపిణిగా శివశక్తిగా వున్నావు అని భావం.


🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*శ్లోకం - 36*


*తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం*

 *పరం శంభుమ్ వందే పరిమిళితపార్శ్వం పరచితా |*

*యమారాధ్యా న్భక్త్యా  రవిశశిశుచీనా మవిషయే*

*నిరాలోకేఽలోకే నివసతిహి భాలోకభువనే ‖*


ఈ శ్లోకం నుండి నాలుగు శ్లోకాలలో సాధనపరమైన విషయములను చెప్తున్నారు. నిన్న 35 వ శ్లోకార్థంలో చెప్పుకున్నాము మనలోని షట్చక్రాలు అమ్మవారి పరిణామ స్వరూపాలని. ఇప్పుడు శివ శక్తులు సామరస్యంగా ఈ షట్చక్రాల్లో విహరిస్తూ ఏ చక్రంలో ఎలా వుంటారో ఏ పేరుతో వుంటారో ఆ స్వరూపం ఏమిటో మన ధ్యానం ఎలా ఉండాలో వివరిస్తున్నారు. 


 35 వ శ్లోకంలో చెప్పుకున్నట్లు మన షట్చక్రములు అమ్మవారివేనన్న భావనతో మన ధ్యానం సాగాలి.


తవాజ్ఞాచక్రస్థం = నీ ఆజ్ఞాచక్రమునందు


తపన శశికోటి ద్యుతిధరం = కోట్లాది సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోతున్న


పరం శంభుమ్ = పరశంభు గా పిలువబడే పరమేశ్వరునికి


వందే పరిమిళితపార్శ్వం పరచితా = ఆయనతో వామభాగాన కలిసిపోయి పరచితి అని పిలువబడుతున్న నీకు నమస్కారము.

 పరచితి అంటే పరమమైన చైతన్యం.


యమారాధ్యన్ భక్త్యా = వారిని ఆరాధిస్తే, భక్తులకు ఎలాటి ఫలితం ఉంటుంది?


రవి శశి శుచీనామవిషయే = సూర్య, చంద్ర, అగ్నులకు అందని స్థానానికి వెళ్తారు. నిజానికి ఈ మూడు వెలుగులూ ఒక్కటే. వేదాంత పరిభాషలో త్రిపుటి అంటారు.

అంటే

 జ్ఞాత 

తెలుసుకొనేవాడు, సాధకుడు


 జ్ఞానము

తెలుసుకొనే సాధనం 


జ్ఞేయ 

తెలుసుకోబడే వస్తువు,పరమాత్మ. అంతా ఒక్కటేనన్న స్థాయికి చేరుతాడు.


నిరాలోకేఽలోకే = ఇక ఏ లోకమూ లేదు.(నిరాలోకే)


*లోకాతీతా* అని అమ్మవారి నామం చెప్పినట్లు


ఆలోకే =  స్వయంప్రకాశమైన వెలుగు,బ్రహ్మజ్ఞానము 


భాలోక భువనే = భా అంటే కాంతి, వెలుగు అన్ని లోకాలనూ ప్రకాశింపజేసే స్థాయికి చేరి


నివసతి హి = అక్కడ నివసిస్తాడు.


మనది భారతదేశం. మనది సనాతన ధర్మం. హిందూ అనే శబ్దం పారశీకులు దండెత్తి వచ్చినప్పుడు సింధు నది ప్రాంతంలో వున్న దేశం కాబట్టి  సింధు/హిందూ (వారి భాషలో  స కి హ కి భేదం లేదు) దేశంగా పిలిచారు. రతము అంటే ఆసక్తి, రమించుట అని. కాంతి, ప్రకాశము (ఆత్మజ్యోతి) యందు ఆసక్తి, నిష్ఠ కలిగి తాను పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకొని ఆ పరబ్రహ్మానందమునందు రమించు ఋషులు, యోగి పుంగవులు కలిగిన దేశము భారతదేశము.


🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷


*శ్లోకం - 37*


  *విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం*

   *శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితామ్ |*

   *యయోః కాంత్యా యాంత్యా  శ్శశికిరణ సారూప్యసరణేః*

   *విధూతాం న్తర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ ‖*



ఈ శ్లోకంలో స్వామి, అమ్మ విశుద్ధ చక్రంలో ఎలా వుంటారో చెప్తున్నారు.


విశుద్ధ చక్రమంటే ఆకాశ చక్రం. ఆకాశమును కలిగించినవారు వ్యోమజనకం  ఆకాశము నుండి మిగిలిన భూతములు ఉద్భవించాయి.

వాయువు, అగ్ని, జలము, భూమి.ఒకదాని నుండి ఒకటి జన్మించాయని వేదము చెప్తున్నది.ఇప్పుడు ఈ విశుద్ధ చక్రములోనున్న పార్వతీ పరమేశ్వరులను వ్యోమేశ్వరి, వ్యోమేశ్వరుడు అంటారు. 


విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక = శుద్ధ స్ఫటిక కాంతులతో


శశికిరణ సారూప్యసరణేః = వారి శరీర కాంతులు చంద్రకిరణ కాంతులవలె తెల్లగా చల్లగా ఉంటాయట.


విధూతాంతర్ధ్వాంతా = మన లోపలి అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారు.


విలసతి చకోరీవ జగతీ = జగత్తు చకోరము వలె వున్నది వారి వలన. చకోరములు వెన్నెల త్రాగి జీవిస్తాయి. ప్రపంచం శివశక్తుల నుండి ప్రసరిస్తున్న అమృతం వల్లనే బ్రతుకుతున్నదని భావం.


శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్ = అట్టి జననీ జనకులను సమముగా సేవిస్తున్నాను.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 50*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 50*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*శ్రీ రామకృష్ణులు అవతార పురుషులా?*


శ్రీరామకృష్ణులు సైతం పలువురిని, "నా

 గురించి నువ్వు ఏమనుకొంటున్నావు?” అని అడగడం కద్దు. భక్తశ్రేష్ఠుడు, సాటిలేని జ్ఞాని, గొప్ప మహాత్ముడు, రాధాదేవి అవతారం, చైతన్య మహాప్రభు అవతారం, సాక్షాత్తు భగవంతుడే మానవరూపం దాల్చి అరుదెంచిన అవతారం అంటూ విభిన్న భక్తుల నుండి వివిధ జవాబులు వచ్చేవి. వచ్చే జవాబు నుండి ప్రతి ఒక్కరి మనఃస్థితిని శ్రీరామకృష్ణులు గ్రహించే వారు. తమ శిష్యుల మానసిక స్థితిని పరీక్షించే కొన్ని మార్గాలలో ఇదీ ఒకటి. 

 

నరేంద్రుణ్ణి కూడా ఆయన ఇదే ప్రశ్న అడిగినప్పుడు, "వేయిమంది మిమ్మల్ని భగవదవతారంగా పేర్కొనవచ్చు. కానీ నాకు రూఢిగా నమ్మకం కలిగేంత వర నేను దానిని స్వీకరించలేను" అని అతడు జవాబిచ్చాడు. అలవాటు ప్రకారం శ్రీరామకృష్ణులు నవ్వేసి మౌనం వహించారు.


ఈ విషయంగా ఒకసారి భక్తుల మధ్య చర్చ జరుగుతున్నప్పుడు నరేంద్రుడు, "భగవంతుని లాంటి వ్యక్తిగా నేను ఆయనను పరిగణిస్తున్నాను. స్థావరానికీ (చెట్లు) మృగానికీ మధ్య సృజింపబడింది ఒకటి ఉంది. ఆ ప్రాణి స్థావరమా, మృగమా అని రూఢిగా చెప్పలేం. అట్లే మనిషికీ దేవునికీ మధ్య ఒక దశ ఉంది. ఆ దశలో ఉన్న వ్యక్తి భగవంతుడా, మనిషా చెప్పడం కష్టం. అలాంటి దశలో శ్రీరామకృష్ణులు ఉన్నారు" అని చెప్పాడు. 


డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆ అభి ప్రాయాన్ని ఖండిస్తూ, "భగవంతుని గురించి విషయాలను ఉదాహరణలు చూపి విపులీకరించలేం" అన్నాడు. అందుకు నరేంద్రుడు, “ఆయనను నేను భగవంతుడని పేర్కొనడం లేదు; మనిషిగానే పరిగణిస్తున్నాను" అన్నాడు. శ్రీరామకృష్ణులతో సన్నిహితంగా మెలగేకొద్దీ నరేంద్రుని దేవుని- భావన క్రమంగా మారిపోసాగింది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ప్రథమాశ్వాసము*


                      *8*


*తక్షకుని మీద ఉదంకుని ప్రతీకారం*


అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందు కొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు జనమేజయునితో  తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు. " జనమేజయ మహారాజా ! నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను గురువు గారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేసాడు. నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేసాడు. శృంగి శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు మహారాజును అతి క్రూరంగా కాటు వేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు. మహా బలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా చంపాడు కదా ! నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా ! ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసి నట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి " అని జనమేజయుని రెచ్చకొట్టాడు.

బలములుగల

 *1934*

*స.ల.కం*

బలములుగల రిపుని గెలువ

బలముల వినియోగమొనర ఫలముండదయా.

బలయుతమగు నతనికడన

బలముల యలతెరుగ జయము  వలచును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! బలవంతుడైన శత్రువు ను నీ బలములతో గెలుచుట కష్టము. కానీ అంతటి బలవంతునికైనా కొన్ని బలహతలుంటాయి,అది తెలుసుకుంటే విజయం వరించగలదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

గణేశ పంచరత్నమ్*

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

                _*భక్తిసుధ*_

         *గణేశ పంచరత్నమ్*

              (ఫలశ్రుతితో...)


𝕝𝕝శ్లోకం𝕝𝕝-1

*ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం*

*కళాధరావతంసకం విలాసిలోక రక్షకం*

*అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం*

*నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం*

𝕝𝕝తా𝕝𝕝 

మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-2

*నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం*

*నమస్సురారి నిర్జనం నతాధికాపదుద్ధరం*

*సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం*

*మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం*

𝕝𝕝తా𝕝𝕝

భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-3

*సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం*

*దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం*

*కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం*

*మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం*

𝕝𝕝తా𝕝𝕝

సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-4

*అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం*

*పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం*

*ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం*

*కపోల దాన వారణం భజే పురాణ వారణం*

𝕝𝕝తా𝕝𝕝

కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా నమస్సులు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-5

*నితాంతికాంత దంతకాంతి మంతకాంతకాత్మజం*

*అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం*

*హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం*

*తమేకదంతమేవతం విచింతయామి సంతతం*

𝕝𝕝తా𝕝𝕝

ఎంతో శోభతో ఉన్న దంతము కలవాడు, మృత్యుంజయ కారకుడైన శివుని కుమారుడు, వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవాడు, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే వానిడు, వసంత ఋతువులాగా యోగుల మనస్సులో నిలిచే వాడు అయిన ఏకదంతుని ఎల్లప్పుడూ నా స్మరించెదను.


𝕝𝕝శ్లోకం𝕝𝕝  *ఫలశ్రుతి*

*మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం*

*ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్*

*అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం*

*సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్॥*

𝕝𝕝తా𝕝𝕝

మహాగణేశ పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ వినాయకుని మనస్సుయందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి వారికి వెంటనే ఆరోగ్యము,దోషములేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్కులై అష్టైశ్వర్యములను అనుభవించి సమస్త మంగళములనూ పొందెదరు.

               --------------------

Veeda patan


 

Ghana vinayak


 

మనవాడు లేదా పరాయి వాడా

 అయం నిజః పరోవేతి గణనా లఘు చేతసామ్l

ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్ll


ఇతడు మనవాడు లేదా పరాయి వాడా అనే తలపు సంకుచిత మనస్సు కలవారిది. ఉదార స్వభావం కల వారికి లోకమంతా తమ కుటుంబమే.

నవగ్రహ పురాణం - 65 వ అధ్యాయం*_

 _*నవగ్రహ పురాణం - 65 వ అధ్యాయం*_


*చంద్రగ్రహ చరిత్ర - 3*


చంద్రుడు , రోహిణీ భోజనం చేసి రాత్రి వాహ్యాళికి వెళ్ళిపోయాక - అశ్వినీ , ఆమె ఇరవై అయిదుగురు చెల్లెళ్ళూ మౌనంగా , స్వల్పంగా ఆరగించారు.


అందరూ గుంపుగా తోటలోకి వెళ్ళారు. తోటంతా కలియదిరిగారు. కానీ రోహిణీ చంద్రులు లేరు !


*"మనం భోజనాలలో ఉన్నప్పుడే ఉద్యానవనంలోంచి మందిరంలోకి వచ్చేశారేమో ! అంది అశ్విని.


*"అంతే జరిగి ఉంటుందే ! పదండి... పతి దేవులు ఆగ్రహిస్తారు !”* భరణి ఆదుర్దాగా అంది.


అందరూ మందిరం వైపు వేగంగా నడిచారు.


భర్త ఏకాంత శయనాగారం వైపు వెళ్తున్న అశ్వినీ , ఆమె చెల్లెళ్ళూ తటాలున ఆగారు. శయనాగారం లోంచి రోహిణీ చంద్రుల స్వరాలు వినిపిస్తున్నాయి.


*"అక్కయ్యలు ఏమైనా అనుకుంటే ?”* రోహిణి నవ్వుతూ అడుగుతోంది. *"అనుకోవడానికి ఏముంది ? ఒక విషయం చెప్పు ! ఇవాళ విస్తరిలో వడ్డించిన పదార్థాలన్నీ తిన్నావా ? ఇష్టమైనవే తిన్నావా ?"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.


*"ఇష్టమైనవే”* రోహిణి నవ్వింది.


*"విస్తరిలో ఉన్నాయని అన్నీ ఆరగించలేం. మందిరంలో ఉన్నారని అందరితోనూ విహరించలేం. ఇష్టమైనదాన్ని ఆరగిస్తాం ; ఇష్టమైన వాళ్ళతో విహరిస్తాం !"* చంద్రుడు నవ్వుతూ అంటున్నాడు.


రోహిణీ , చంద్రుడూ - ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. కాదు - నవ్వుకుంటున్నారు.


అశ్విని బలహీనంగా వెనక్కి తిరిగింది. దూరంగా ఉన్న కక్ష్య వైపు అడుగులు వేసింది. ఆమె సోదరీమణులు మౌనంగా ఆమెనే అనుసరిస్తున్నారు.


అశ్విని నుండి రేవతి దాకా - రోహిణిని తప్పించి - ఇరవై ఆరుగురు దక్షపుత్రికలు , నవ వధువులు భర్త మందిరానికి వచ్చి చేరిన మొదటి రోజు ... మొదటి రాత్రి... నేల మీద ఒకరి పక్కన ఒకరు అలా పడి ఉన్నారు.


*"అశ్వినీ ! అల్లుడికి నువ్వు జ్యేష్ఠ పత్నివి ! పట్టమహిషివి ! మొదట చంద్రుడు నిన్నే చేరదీస్తాడు. ఆయనకు అనుకూలంగా ప్రవర్తించి , అలరించు. అలాగే నీ చెల్లెళ్ళు కూడా భర్తను అలరించేలా చూడు !"* తల్లి ప్రసూతీదేవి మాటలు అశ్విని చెవుల్లో గింగురుమంటూ , తమ సమీపంలోనే ఉన్న ఆమె కళ్ళలోంచి అశ్రువులు కారేలా చేశాయి.


*"అక్కా...ఏమిటిలా జరిగింది ?"* కృత్తిక దీనంగా ప్రశ్నించింది అశ్వినిని. *"మన పతిదేవుడు మొదట నిన్ను ఆదరించి , చేరదీస్తారని అమ్మ చెప్పిందే!!* 


*"బహుశా , ఆయన ... రోహిణి మనందరికన్నా పెద్ద వధువుగా అనుకున్నారేమో ! బాధపడకండి ! అన్నీ సర్దుకుంటాయి !"* చెల్లెళ్ళను ఓదార్చే తన మాటలతో తనకు కూడా ఓదార్పును వెదుక్కుంది అశ్విని..


ఆ నవ వధువుల నిట్టూర్పులతో ఆ కక్ష్యలో గాలి వేడెక్కుతోంది.


అశ్విని ఆశ నిరాశగా , రోజులు గడిచే కొద్దీ పేరాశగా మారిపోయింది.


రోహిణి తప్పించి మిగిలిన దక్షపుత్రికలను చంద్రుడు కన్నెత్తి చూడడం లేదు. పన్నెత్తి పలకరించడం లేదు. భర్త దృష్టిని ఆకర్షించాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


అంటిపెట్టుకుని ఉన్న మిగతా చెల్లెళ్ళనూ పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టి వేశాయి.


వాళ్ళెవరికీ ఇప్పుడు భర్తకు ఆహారం అందించే అవకాశం కూడా లేదు. ఆయనకు రోహిణి మాత్రమే వడ్డించాలి. ఆయనతో బాటు , ఆయన పళ్ళెంలోనే ఆరగించాలి ! చంద్రుడి ప్రవర్తన కన్నా , రోహిణి ప్రవర్తన దక్షపుత్రికలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది.


పుట్టినప్పట్నుంచీ కలిసి మెలిసి ఆడి , పాడి వాళ్ళలో ఒక్కతెగా పెరిగిన రోహిణి , ఇప్పుడు వాళ్ళెవరో తనకి తెలియనట్టు ప్రవర్తిస్తోంది. ముగ్గురు అక్కలనూ , ఇరవై ముగ్గురు చెల్లెళ్ళనూ రోహిణి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వాళ్ళందరూ ఇప్పుడామెకు అపరిచిత యువతులు !


చంద్రుడి దృష్టిలో లాగే , ఆమె దృష్టిలో కూడా వాళ్లు మందిరంలో పరిచారికలు ! 


రోజులు వారాలుగా , వారాలు నెలలుగా ఎదుగుతున్నాయి. రోహిణి సోదరీ మణులకూ , 'ఆమె' భర్తకు మధ్య దూరం కూడా ఎదుగుతూనే ఉంది...


*“ఈ రోజు ఏమైనా సరే ఆయనా రోహిణి జలక్రీడకూ , ఉద్యానవన విహారానికి వెళ్ళేటప్పుడు మనందరమూ వెళ్ళాలి ! వాళ్ళతో బాటు జలక్రీడలో పాల్గొనాలి"* మృగశిర ఉద్రేకంగా అంది.


*"ఆయన వద్దన్నా వినకుండా సరస్సులో దూకాలి"* ఆర్ధ్ర ఆవేశంగా అంది. అందరూ మౌనంతో తమ అంగీకారం తెలిపారు.


చంద్రుడూ , రోహిణి చేతులు కలుపుకుని ఉల్లాసంగా మందిరంలోంచి ఉద్యానవన ద్వారం దాటి వచ్చారు. అక్కడే నిరీక్షిస్తున్న ఇతర చంద్ర పత్నులు వెంట అడుగులు వేశారు.


ద్వారం దాటి సోపానాలు దిగుతున్న చంద్రుడు ఆగి విసుగ్గా చూశాడు.


*"ఆగండి ! మీరెక్కడికి ? వెళ్ళి మందిరంలో పనులు చూసుకోండి",* చంద్రుడు ఆజ్ఞాపించాడు.


మృగశిరా , ఆర్ధ్ర వినిపించుకోనట్టు మరొక మెట్టు దిగారు. 


*"ఆగు"* చంద్రుడు అరిచాడు.


*"నీ పేరేమిటి”*


*"మృగశిర..."*


*"మృగ... శిర... - అందుకే మృగంలాగా ప్రవర్తిస్తున్నావు. వెళ్ళండి మందిరంలోకి"* 


మృగశిర ముఖం చిన్నబుచ్చుకుని , వెనుదిరిగింది. ఆర్ద్ర ఆమెను అనుసరించింది. అందరూ తలలు వాల్చుకుని మందిరంలోకి నడుస్తున్నారు.


వెనక నుండి రోహిణీ చంద్రుల నవ్వులు వాళ్ళను వెంటాడి తరుముతున్నాయి..


అశ్విని ఆమె చెల్లెళ్ళు ఇరవై ఐదుగురూ ఒకే రకమైన మానసిక స్థితిలో ఉన్నారు...

పుట్టినింటికి దూరమయ్యారు. తల్లిదండ్రుల అనురాగానికి దూరమయ్యారు. తమ సర్వస్వంగా రూపొందుతాడనుకున్న భర్తకు దగ్గర కాలేక పోయారు. చేరువలో దూరాన్ని అనుభవిస్తున్నారు. భర్తను కొంగున ముడివేసుకున్న సోదరి మూలంగా నిరంతరావమానాన్ని చవిచూస్తున్నారు.


భర్త నిరాదరణా , రోహిణి నిర్లక్ష్య ప్రవర్తనా వాళ్ళందరినీ ఒక్కటిగా దగ్గర చేశాయి. వాళ్ళ విచారం సామూహిక విచారంగా మారింది. నిస్సహాయత సామూహిక నిస్సహాయతగా మారింది. అందరిలోనూ ఒకే విధమైన నిర్లిప్తత. ఒకే విధమైన నిరాసక్తత. ఒకే విధమైన నిస్సహాయత.


మౌనంగా గుంపుగా కూర్చున్న ఇరవై ఆరుగురు దక్షపుత్రికల ఆలోచనా ప్రవాహాలకు నారదుడి రాకా , ఆయన చేసే నారాయణ నామస్మరణ ఆనకట్ట వేశాయి.


దక్షపుత్రికలు లేచి , మౌనంగా ఆయనకు చేతులు జోడించారు. నారదుడు వాళ్ళను ఎగాదిగా చూశాడు. ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం ప్రతిఫలిస్తోంది. *"అశ్వినీ ! ఏమిటిలా విచారంగా ఉన్నారు ? మీ పతిదేవుడు చంద్రుడు లేడా ?"*


*"ఉన్నారు... ఎక్కడున్నారో తెలీదు స్వామీ"* అశ్విని మెల్లగా అంది. 


*"అంటే...?"*


*"మా సోదరి రోహిణీ , ఆయనా ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు తెలీదు..."* భరణి సన్నని కంఠంతో దీనంగా అంది. 


నారదుడు విచారంతో నిండిన వాళ్ళందరి ముఖాలనూ కలయజూశాడు. అలంకరణ లేని శరీరాలు... అలంకరణ లేని శిరోజాలు... చెంపల మీద కరిగిన కాటుక చారికలు... కళ్ళల్లో దైన్యం... అందరి ముఖాల మీదా ఒకే రకమైన విచార ముద్ర.


*"అశ్వినీ... మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభను మీ ముఖదర్పణాలు చూపిస్తున్నాయి. మీరందరూ చంద్రపత్నులై ఈ మందిరంలో ప్రవేశించిన శుభకార్యానికి సూత్రధారి నేనే ! మీ విచారానికి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ,”* నారదుడు చెప్పి ఆగాడు.

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,40 వ శ్లోకం*


 *నేహాభి క్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే |* 

 *స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌ || 40* 



 *ప్రతి పదార్థం* 


ఇహ = ఈ కర్మ యోగము నందు ; అభిక్రమ నాశః = ఆరంభ ( బీజ నాశము );న, ఆస్తి = ఉండదు; ప్రత్యవాయః =( మరియు దీనికి ) విపరీత ఫరూ ప దోషము గూడ;న, విద్యతే = (ఏ మాత్రము ) ఉండదు. ; అస్య = ఈ ( కర్మ యోగ రూప మైన ); ధర్మస్య = ధర్మము యొక్క ; స్వల్పమ్, అపి = ఏ కొంచెము సాధన యైనను; మహతః భయాత్ = జన్మ మృత్యు రూప మైన గొప్ప భయము నుండి ; త్రాయతే= కాపాడును;


 *తాత్పర్యము* 


ఈ (నిష్కామ) కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములు ఉండును. పైగా ఈ (నిష్కామ)కర్మయోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

_హిందూ ధర్మాన్ని ,

 🚩🚩☀️☀️💥💥💥

*_నేను మోడీ గారిని సపోర్ట్ చేస్తుంటే నేనేదో బీజేపీ కార్యకర్తను అనుకుంటున్నారు.._*


*_హిందూ ధర్మాన్ని ,ఈదేశ_* *_సంస్కృతి,సంప్రదాయాలను కాపాడే ప్రతి పార్టీకి_* 

*_నా మద్దతే కాదు_*

*_ప్రతి హిందువు మద్దతు ఉంటుంది.._*

*_ఏ ఒక్క పార్టీ కూడా హిందువుల తరుపున పోరాడే పార్టీ లేదు.._*

*_మరి ఏమి చేయమంటారు._*

*_బీజేపీ పార్టీ ఏకంగా హిందుత్వ జెండానే_* 

*_భుజాన మోస్తుంది.._*

*_మరి బీజేపీ కి కాకుండా ..ఇంకే పార్టీకి సపోర్ట్ చెయ్యాలి..హిందువులు.._*


*_1)ఈశాన్య రాష్ట్రాల లో హిందూ జనాభా తగ్గడానికి కారకులు ఎవరు....?_*


*_2)జమ్మూకాశ్మీర్ లో కాశ్మీర్ పండిట్ల ఊచకోత కు_*

*_కారకులు ఎవరు?(బీజేపీ పార్టీనా)_*


*_3)దేశ విభజన సమయంలో పాక్ లో కొన్ని వేల హిందూ కుటుంబాల చావుకు కారకులు ఎవరు?(బీజేపీ పార్టీయేనా)_*


*_4)1947 లో బంగ్లాదేశ్ లో 20% వున్నహిందువుల జనాభా ఇప్పుడు 2% కి దిగజారడనికి కారకులు ఎవరు?(బీజేపీ పార్టీయేనా)_*


*_5)ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను పెడచెవి పెట్టి. అఫ్గాన్, పాక్, బంగ్లా, నుండి ముస్లింల వలసలను ప్రోత్సహించింది ఎవరు?(బీజేపీ పార్టీయేనా)_* 


*_ఇలా చెప్పుకుంటే పోతే హిందువులను హిందూ జనాభాను గోరంగా అనగ ద్రొక్కిన ప్రతి పార్టీ..మా హిందువులకు వ్యక్తిగతంగా శత్రువే.._*


*_ఒకవేళ బీజేపీ, RSS, భజరంగ్ దళ్, ABVP, విశ్వహిందూ పరిషత్ లేకపోతే.. హిందువుల పరిస్థితి చాలా గోరంగా ఉండేది._*

.

*_So ప్రతి హిందువు బీజేపీ కి_* 

*_SUPPORT చెయ్యడం లో తప్పు ఏమైనా ఉందా.????_*


*_చెప్పండి హిందూ బంధువుల్లారా.._*

*_చెప్పండి.._*

*_మన పోరాటం_* 

*_మన ఆరాటం దేశం కోసమా?_*

*_మన స్వార్ధం కోసమా.???_*


*_ముమ్మాటికీ దేశం కోసం అని నేను అంటాను.._*

*_మరి మీరు?_*

🙏🙏💐💐

రామాయణమ్ 338

 రామాయణమ్ 338

...

శాంతించండి,మీరంతా కాస్త ప్రశాంతముగా ఆలోచించండి !

.

నాయనలారా ! ఏదేని ఒక కార్యమును సామ,దాన,భేదములను మూడు ఉపాయముల ద్వారా సాధించలేనప్పుడు మాత్రమే దండోపాయముమునకు పూనుకొనవలెను.

.

ఏమరపాటుగా ఉన్నవారు 

ఇంకొక శత్రువుచేత ఆక్రమింపబడినవారు

దైవము ప్రతికూలముగా ఉన్నవారు

ఇలాంటి వారివిషయములో బాగా పరీక్షించి  పరాక్రమము ప్రదర్శించినచో అది సఫలమగును.

.

ఆ రాముడు బలవంతుడు ,ఏమరుపాటులేనివాడు,జయించవలెనన్న పట్టుదలతోఉన్నవాడు,ఆయన కోపమును జయించినవాడు ,ఎదిరింపశక్యము కాని వాడు మహాబలవంతుడు !! ఆయనను ఏవిధముగా ఎదిరింపగలమని అనుకొను చున్నారు ?

.

అసలు అంతకుమునుపు ఎవడైనా సముద్రమును దాటివచ్చి లంక చేరగలిగినాడా ?..హనుమంతుడు వచ్చి సీతాదేవిని చూసి మాటలాడి ,లంకను తగులపెట్టి తిరిగి వెళ్ళిపోయినాడు . అసలు ఇటువంటి సంఘటన జరుగ గలదు అని మనము ఎప్పుడైనా కలలోనైనా ఊహించినామా?

.

రాక్షసరాజు జనస్థానమునుండి రాముని భార్యను అపహరించినాడు రాముడు ఏ అపరాధము చేసినాడని సీత అపహరణకు గురి అయినది ? మనకు రాముడి వలనజరిగిన అపకారమేదైనా ఉన్నదా?

.

మన ఖరుడిని చంపినాడు అని అందురేమో !! స్వీయరక్షణ ఏ ప్రాణి చేయకుండును ? మితిమీరి ప్రవర్తించిన ఖరుని రాముడు చంపినాడు అందులో దోషమేమున్నది ?

.

సీత మన లంకకు వినాశ హేతువు ! తీసుకొని వచ్చిన ఆమెను మరల వెనుకకు పంపివేయవలెను ! అనవసర కలహముల వలన ఏమి ప్రయోజనము ?

...అనుచూ విభీషణుడు ప్రసంగింస్తూనే ఉన్నాడు.

.

NB 

.

కామందక నీతి అని ఒక నీతి ఉన్నది !ఎప్పుడు శత్రువుపై దండెత్తవచ్చును ..దీనిని

Political Strategies, Corporate wars కు కూడా అన్వయించుకొనవచ్చును.

.

శత్రవు బాలుడైనప్పుడు

శత్రువు వృద్ధుడైనప్పుడు

దీర్ఘరోగి

జ్ఞాతులచే వెలివేయబడ్డవాడు

పిరికివాడు

పిరికి పరిజనము ఉన్నప్పుడు

లోభము కలవాడైనప్పుడు

ప్రజలయొక్క ప్రేమ కోల్పోయినప్పుడు

....ఇంకా వున్నాయి..అవి రేపు

.

వూటుకూరు జానకిరామారావు 


.


.

పంచాంగం *_సెప్టెంబరు 28, 2023_*

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

 శుభోదయం, పంచాంగం *_సెప్టెంబరు 28, 2023_* 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *చతుర్దశి* సా6.26

వారం: *బృహస్పతివాసరే*

(గురువారం)

నక్షత్రం: *పూర్వాభాద్ర* రా2.48

యోగం: *గండం* రా1.43

కరణం: *గరజి* ఉ7.37

*వణిజ* రా6.26

విష్ఠి* తె5.17

వర్జ్యం: *ఉ10.23-11.53*

దుర్ముహూర్తము: *ఉ9.52-10.40*

మ2.39-3.27*

అమృతకాలం: *రా7.20-8.50*

రాహుకాలం: *మ1.30-3.00*

యమగండం: *ఉ6.00-7.30*

సూర్యరాశి: *కన్య*

చంద్రరాశి: *కుంభం*

సూర్యోదయం: *5.53*

సూర్యాస్తమయం:5.51*

🙏అనంత పద్మనాభ వ్రతం* 🙏

 లోకాః సమస్తాః*సుఖినోభవంతు

ఏ సమస్య గొప్పది కాదు

 83) మన శరీరం లో ఉన్న శక్తి కన్నా ఏ సమస్య గొప్పది కాదు

[84)మనిషికి ఏదైనా సమస్య వస్తే నేను గెలవాలి సమస్య ఓడిపోవాలి ఆ విధంగా మనం సాధన చేయాలి సమస్యకె భయం పుట్టాలి

[85)మొదటి దేహశుద్ధి రెండోది భావ శుద్ధి మూడోది ఆత్మ శుద్ధి అవుతుంది అప్పుడు లక్ష్యానికి వెళ్తారు ఇది సత్యం

[86)దేవుని ఫలితాలు అడిగేది భోగి దేవునే అడిగేది యోగి

87)-ప్రపంచాన్ని పట్టుకుని వేలాడుతున్నవు కానీ, విశ్వనాధుని పట్టుకుని విశ్వంలో తిరుగు

బ్రహ్మాండం ఆకారం

 

బ్రహ్మాండం ఆకారం, శివలింగం ఆకారం రెండు ఒకేలా ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు.


పూర్వం మునులు, తపస్విలు, ఋషులు మన శాస్త్రాలలో ఏ విషయాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలియ చెప్పారు


బ్రహ్మాండమే శివలింగం.

సమస్త బ్రహ్మాండమే శివస్వరూపం.

శివ లింగానికి ప్రదక్షిణ చేయడం సమస్త లోకాలను ప్రదక్షించడంతో సమానం.

శివ లింగాన్ని అభిషేకం చేయడం సమస్త బ్రహ్మాండాన్ని సేవించడంతో సమానం అని.


విఘ్నేశ్వరుడూ కూడా శివ పార్వతులను ముమ్మారు ప్రదక్షిణ చేయడం వల్లనే గణాధిపతి/విఘ్నాధిపతి అయ్యాడు.


‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని,

‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది.

అందుకే అది లింగమైంది.

ఈ సృష్టి సమస్తం శివమయం.


- oఓo నమః శివాయ -


- సర్వం శివమయం జగత్

కోపంగా ఉన్న వ్యక్తికి

 శ్లోకం:☝️

*వాచావాచ్యం ప్రకుపితో*

  *న విజానాతి కర్హిచిత్ ।*

*నాకార్యమస్తి క్రుద్ధస్య*

  *నావాచ్యం విద్యతే క్వచిత్ ॥*


భావం: కోపంగా ఉన్న వ్యక్తికి తాను ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు అనే విచక్షణ ఉండదు. అలాగే కోపంతో ఉన్న వ్యక్తికి చేయకూడనిది మరియు చెప్పకూడనిది లేదు. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి.

పంచాంగం 28.09.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 28.09.2023  Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: చతుర్థశి తిధి బృహస్పతి వాసర: పూర్వాభాద్ర నక్షత్రం గండ యోగ: గరజి తదుపరి వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం.

చతుర్థశి సాయంత్రం 06:50 వరకు.

పూర్వాభాద్ర రాత్రి 01:48 వరకు.

సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:04

వర్జ్యం : పగలు 10:09 నుండి 11:35 వరకు.

దుర్ముహూర్తం : పగలు 10:07 నుండి 10:55 వరకు తిరిగి మధ్యాహ్నం 02:53 నుండి 03:41 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

సాధన

 卐///  _*సాధన*_  ///卐



సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి.


    ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకు అందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది.

    ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం.

అనంత పద్మనాభ వ్రతం*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*నేడు అనంత పద్మనాభ వ్రతం*


అనంత పద్మనాభ చతుర్దశి అనగా భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం. ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది.


ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి


ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.


ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.


వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.

దినఫలం నేటి (28-09-2023)ఫలితాలు

 🌸     _*దినఫలం*_     🌸


నేటి (28-09-2023)ఫలితాలు


మేషం

సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి  ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

వృషభం

రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

---------------------------------------

మిధునం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో  అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగుల ప్రయత్నాలకు నిరాశ తప్పదు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మధ్యమ ఫలితాలు అందుతాయి.  

---------------------------------------

కర్కాటకం

చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల  ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------

సింహం

నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో   చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలలో  నష్టాలు  భర్తీ అవుతాయి. గృహమున సంతాన శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో  సమస్యల నుండి బయట పడతారు.

---------------------------------------

కన్య

రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. 

---------------------------------------

తుల

ఋణదాతల  ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో  విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన  పనులు నిదానంగా  సాగుతాయి. ఆస్తి  వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

ధనస్సు

సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన సహకారం లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు  అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా  సమస్యల నుండి బయట పడతారు .

---------------------------------------

మకరం

వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------

కుంభం

ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారమున వ్యవహార  అనుకూలత కలుగుతుంది. కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగస్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున  అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 

---------------------------------------

మీనం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన శుభకార్యలు విషయమై ప్రస్తావన వస్తుంది.  

---------------------------------------

గణేశ పంచరత్నమ్*

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

                _*భక్తిసుధ*_

         *గణేశ పంచరత్నమ్*

              (ఫలశ్రుతితో...)


𝕝𝕝శ్లోకం𝕝𝕝-1

*ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం*

*కళాధరావతంసకం విలాసిలోక రక్షకం*

*అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం*

*నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం*

𝕝𝕝తా𝕝𝕝 

మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-2

*నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం*

*నమస్సురారి నిర్జనం నతాధికాపదుద్ధరం*

*సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం*

*మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం*

𝕝𝕝తా𝕝𝕝

భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-3

*సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం*

*దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం*

*కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం*

*మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం*

𝕝𝕝తా𝕝𝕝

సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-4

*అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం*

*పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం*

*ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం*

*కపోల దాన వారణం భజే పురాణ వారణం*

𝕝𝕝తా𝕝𝕝

కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా నమస్సులు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-5

*నితాంతికాంత దంతకాంతి మంతకాంతకాత్మజం*

*అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం*

*హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం*

*తమేకదంతమేవతం విచింతయామి సంతతం*

𝕝𝕝తా𝕝𝕝

ఎంతో శోభతో ఉన్న దంతము కలవాడు, మృత్యుంజయ కారకుడైన శివుని కుమారుడు, వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవాడు, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే వానిడు, వసంత ఋతువులాగా యోగుల మనస్సులో నిలిచే వాడు అయిన ఏకదంతుని ఎల్లప్పుడూ నా స్మరించెదను.


𝕝𝕝శ్లోకం𝕝𝕝  *ఫలశ్రుతి*

*మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం*

*ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్*

*అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం*

*సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్॥*

𝕝𝕝తా𝕝𝕝

మహాగణేశ పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ వినాయకుని మనస్సుయందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి వారికి వెంటనే ఆరోగ్యము,దోషములేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్కులై అష్టైశ్వర్యములను అనుభవించి సమస్త మంగళములనూ పొందెదరు.

               --------------------