2, జూన్ 2024, ఆదివారం

దుప్పటి

 *దుప్పటి*

                 


ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి  రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి. అమలాపురంలో బస్సెక్కి, బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి, లేదా ముక్తేశ్వరం వచ్చి, రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి. (అప్పటికి రావులపాలెం వంతెన పడలేదు. అందువల్ల ఇవే మార్గాలు).


సాధారణంగా రాముడు ఎప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళినా ఆలమూరు మీదుగానే వెళ్ళేవాడు. అయితే ఈసారి ఆ బస్సు దాటిపోయింది. అంచేత తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది. 

ముక్తేశ్వరం రేవులో బస్ దిగి, రేవు దాటడానికి లాంచీ టికెట్టు తీసుకుంటున్నాడు.


ఇంతలో  "ఒరేయ్.. రావుడూ! ఒరేయ్ రావుడూ !” అంటూ పరిచిత కంఠం వినిపించింది. 

అతను వెనక్కి తిరిగి చూశాడు. కుంటి సోమన్న! అవును కనిపించేది కుంటి సోమన్నే. 

కుంటి సోమన్నది రావుడూ వాళ్ల ఊరే. రావుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు, వాళ్ల స్కూలు పక్కనే కుంటి సోమన్న పెసరట్ల కొట్టు ఉండేది. ఉదయం పూట పెసరట్లు, మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చ వెచ్చగా బడి పిల్లలకి దొరికేవి. ఏదయినా, ఒక కానీ ఖరీదు! 

ఈ పిల్లలకి తోటల్లో దొరికే కొబ్బరిపళ్ళు (రాలిన ముదురు కొబ్బరికాయలు) పట్టుకెళ్ళి కుంటి సోమన్నకే అమ్మేవారు. అప్పుడు కొబ్బరిపండు ఖరీదు కూడా ఒక కానీయే. వీళ్ళు ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరి లౌజు తీసుకునే వారు.


సోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆ కారణంగా అతనికి పెళ్లి కాలేదు. 

ఓ అంగవస్త్రం కట్టుకుని పెనం దగ్గర కూర్చునేవాడు. ఈ వ్యాపారంలో లాభం తియ్యాలనే ఆశ కుంటి సోమన్నకి లేదు. 

ఆ వీధిలోనే అతని అన్నదమ్ములున్నారు. రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు. కాకపోతే అతనికి నల్లమందు అలవాటొకటి ఉండడంవల్ల.. దానికి రోజూ ఓ అణా కావలసి వచ్చేది. ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజూ ఒక్క అణా మాత్రమే. 

అప్పుడప్పుడు పిల్లల దగ్గర డబ్బులు లేనప్పుడు, వాళ్ళకి తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించే వాళ్ళు.  కొందరి కుర్రాళ్ల ప్రయత్నం సఫలమయ్యేది కూడా. అయితే అది సోమన్న దృష్టిలో పడనే పడేది. 

"వెర్రి వెధవల్లారా! కావాలని ఏడవకూడదూ? నేనే ఇద్దును కదా!” అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకి పంచిపెట్టేవాడు.


సోమన్న కొట్టు దగ్గరే కాలవ. ఈ కుర్రాళ్ళు ఆ కాలవలో ఈదేందుకు సోమన్న సాయం చేసేవాడు. కుంటివాడనే మాటే కానీ కాలువ ఈ మూలనుంచి ఆ మూలకి నాలుగు బారల్లో ఈదేసేవాడు. పిల్లలందరికీ చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు. 

సోమన్న కొట్టు ఎదురుకుండా ఉన్న చింతచెట్టు కింద ఓపాక వేసి, రాముణ్ణి ప్రతిష్ఠించి, పిల్లలు భజన చేసేవారు. ప్రసాదాలు చేసి, పంచిపెట్టే బాధ్యత సోమన్న తీసుకునే వాడు. ఆ విధంగా రావుడితోపాటు పిల్లలందరి బాల్యజీవితంలోనూ సోమన్న ఓ భాగం అయిపోయాడు.!


ఆ సోమన్న రావుడికిప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనిపించాడు.  

"ఇలాగ ఎక్కడికి పోతున్నావ్?” అన్నాడు. 

"రాజమండ్రి…., ఉద్యోగం చేస్తున్నానక్కడ” అన్నాడు రావుడు. 

“అబ్బో! పెద్దవాడవయ్యావురోయ్,” అన్నాడు సోమన్న ఆనందంగా. 

“నువ్విక్కడున్నావేమిటీ ?” అంటూ , ఎదురుగా ఉన్న పెనం , పెసరట్ల పొయ్యి చూసి ‘నేను ఎంత తెలివి తక్కువగా అడిగేను’ అని అనుకున్నాడు రావుడు. 

రోజులు మారిపోయాయనీ, తన పొట్ట తానే పోషించుకోవలసి వస్తోందనీ, ఓ రోజున పెనం, అట్లకాడా పుచ్చుకుని వాళ్ల ఊరునుంచి ఇక్కడకి వచ్చేసేననీ , ఇప్పుడిక్కడే ఉంటున్నాననీ చెప్పేడు సోమన్న. "పెసరట్టు కాల్చనా? ఇంకా నీకు లాంచికి అరగంట టైముంది.” అంటూ పెనం మీద రెండు పెసరట్లకి పిండి పోశాడు సోమన్న.


ఒకసారి మంట ఎగదోసి,  "ఒరేయ్! విశ్వనాథంగాడు ఎక్కడున్నాడురా ఇప్పుడు?” అన్నాడు. విశ్వనాథం రావుడి చిన్ననాటి స్నేహితులలో ఒకడు. మంచి చురుగ్గా ఉండేవాడు. 

"వాడిప్పుడు హైదరాబాదులో రైల్వేలో పనిచేస్తున్నాడు” అన్నాడు రావుడు. 

“ఎప్పుడూ ఎవ్వరూ కనబడరురా” అన్నాడు సోమన్న పెసరట్టు మీద నెయ్యి పోస్తూ. 

"ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనపడుతుందిరా. దాని అత్తారు కోటిపల్లే. ఇద్దరు పిల్లలు…. పలకరించి వెళ్తూంటుంది.” అంటూ పెసరట్లు ఆకులో వేసి అందించాడు సోమన్న.


రావుడి మనస్సు తన చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తోంది. ఇంతలో లాంచి హారను వినిపించింది. ఉలిక్కిపడ్డాడు రావుడు. 

"ఫర్వాలేదులే….ఇంకా పావుగంట ఉంటుంది.” అన్నాడు సోమన్న. ఘుమఘుమలాడే పెసరట్లు రెండు తిని, ఓ అర్ధరూపాయి సోమన్న కివ్వబోయాడు రావుడు. సోమన్న తీసుకోలేదు. 

"ఉంచు.” అన్నాడు రావుడు. 

"వద్దు…. డబ్బెందుకురా నాకు?” అని క్షణం ఆగి,  "ఒరేయ్ రావుడూ! చలికి మహా బాధపడుతున్నాను–ఈ గోదావరి వార.  దుప్పటీ గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దూ.” అన్నాడు సోమన్న. ఆ అడగడంలో యాచనా, దైన్యం ఏమీ లేదు. ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు. 

రావుడి చేతిసంచీలో ఓ దుప్పటి ఉంది కూడా. కానీ అది ఒక వారంరోజుల కిందటే కొన్నాడు. దాని ఖరీదు పది రూపాయలు! అది ఇచ్చేద్దామా అని ఒక్కసారి రావుడికి అనిపించినా, అతని నాలుక మాత్రం యాంత్రికంగా,  "ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే,” అంది.


రావుడు సంచీ పుచ్చుకువచ్చి లాంచీలో కూచున్నాడు. గోదావరి కెరటాల మీద లాంచీ ఉయ్యాలలూగుతూ పోతూ ఉంది. రావుడి మనసు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతూ ఉంది. చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కరే జ్ఞాపకానికి రాసాగారు. 

‘చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో ఉందిట. అప్పట్లో వాళ్ల తరగతిలో తనే పెద్దపిల్ల.  ఆదిలక్ష్మి శుద్ధ మొద్దుపిల్ల. తన లెక్కలు చూసి చేసేసేది. మేష్టారితో చెప్తానంటే మొట్టికాయలు మొట్టేసేది. శ్యామలా, మంగాయీ అప్పచెల్లెళ్లు. ఇద్దరూ ఒకే క్లాసు. వాళ్ళింటిదగ్గర మెట్టతామర పువ్వులుండేవి. సుందరికి ఆ పువ్వులంటే ఎంతో ఇష్టం. తను కోసుకొచ్చి ఆమెకిస్తూండేవాడు. సుందరి ఇప్పుడెక్కడుందో? నలుగురు పిల్లల తల్లై ఉంటుంది. 

వేసవి వెన్నెల రాత్రుల్లో తన స్నేహితులతో కలిసి, మావిడి చెట్టుకింద కూర్చుని దూరంనుంచి వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునే వాళ్ళం! గుయ్యంగాడూ, ఆంజనేయుడి వేషం వేసే ఆ సత్యంగాడూ– వీళ్ళందరూ ఇప్పుడెక్కడికి పోయారో? ఇంక మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా?’ కరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచిస్తోంది రావుడి మనస్సు.


ఆ మధుర స్మృతులన్నీ అతనిలో తట్టిలేపి, తీయని రోజుల్ని జ్ఞాపకానికి తెచ్చిన వాడు సోమన్న! దానికి కృతజ్ఞతగా సోమన్నకి తనేమిచ్చాడు? ఒక్క దుప్పటీగుడ్డ అడిగాడు. అది కూడా ఇవ్వలేని క్షుద్రుడ్నయ్యాను. 

అలా ఆలోచిస్తూ ఒక్కసారి ఒడ్డువైపు చూశాడు రావుడు. సోమన్న ఉండే పాక చిన్నగా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ అందరూ సోమన్నని ఎరుగుదురు. లాంచీ దిగి, ఏ పడవ వాడికైనా దుప్పటీ ఇచ్చి పంపిద్దామనుకున్నాడు. కానీ ఆ కొత్త దుప్పటీ సోమన్నకివ్వక వాడే ఉంచేసుకుంటే?? 

ఇలా ఆలోచిస్తూన్న రావుడికి 'సోమన్న సొమ్ము ఎవడూ అపహరించడులే' అని మాత్రం అనిపించలేదు.


పడవ దిగి, బస్సెక్కేడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నులపండుగగా ఉన్నాయి. వాళ్ళ బడికి అవతలిపక్క అలాంటి చేలే ఉండేవి. 

పెసర పైరు వేసినప్పుడు పిల్లలందరూ చేలోకి వెళ్ళి పెసర రొట్ట పీకి కాల్చుకుని తినేవాళ్ళు. 

రావుడు ఊహాల్లో వుండగానే బస్సు రాజమండ్రి చేరింది. రాజమండ్రిలో దిగి, తనపనిలో తాను కూరుకుపోయినా, ఆ భావోన్మత్తత, అందుకు కారణమైన సోమన్నా రావుడి మనస్సును విడిచిపెట్టలేదు. మరునాటి మధ్యాహ్నానికిగానీ ఆ స్మృతులను మరచిపోలేకపోయాడు.


ఓ నెల గడిచింది. ఏదో పనిమీద రావుడికి అమలాపురం వెళ్ళవలసి వచ్చింది. ఈ సారి కోటిపల్లి మీదుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. 

తన చిన్ననాటి స్నేహితుడి కోరిక నెరవేర్చడానికి దుప్పటీ కొనాలని అనుకున్నాడు. దుకాణానికి వెళ్ళేడు. రావుడి దగ్గర పుష్కలంగా డబ్బుంది. కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో అతనిలో వచ్చేసింది. ఆరు రూపాయలిచ్చి ఓ దుప్పటీ కొన్నాడు.


ఉదయాన్నే బస్సెక్కి బయలుదేరేడు రావుడు. కోటిపల్లి చేరేసరికి తొమ్మిదైంది. లాంచీ గోదావరిలో సగం దూరం వచ్చేసరికి సోమన్న పాక కనపడుతోంది. 

తనని చూసి సోమన్న పిలుస్తాడు. పిలవకపోయినా తనే పాకలోకి పోయి, రెండు నేతి పెసరట్లు కాల్పించుకుని తిని సోమన్నకి దుప్పటీ ఇవ్వాలి. రావుడు ఆలోచనలలో ఉండగా లాంచీ ఒడ్డుకు చేరింది.


అతను దిగి, సంచీ పుచ్చుకుని ముందుకు నడుస్తున్నాడు. సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు. అందులో సోమన్నకి అన్నగారైన వెంకటప్పయ్య ఒకడు. 

"ఏమోయ్ , ఇల్లావచ్చావ్?” అన్నాడు రావుడు వెంకటప్పయ్యతో. కానీ వెంకటప్పయ్య ఏమీ బదులు చెప్పకుండా పాకలోకి వెళ్ళేడు. రావుడు కూడా వెనకాలే లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఒకడు అతని జబ్బ పట్టుకుని ఆపేడు. రావుడు పక్కకి తిరిగి,  "సోమన్న?” అన్నాడు. 

"సోవన్నగారు సచ్చిపోయారు. రేత్రి నాలుగు డోకులెళ్ళాయి,” అన్నాడు. 

*రావుడికి అంతా అర్థమైంది. అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వెంకటప్పయ్య సోమన్న శవాన్ని ఇవతలికి తెచ్చాడు. చాలా నీరసించి, పీక్కుపోయి ఉంది ఆకృతి. శవాన్ని గంపలో కూచోబెట్టి,  "ఏదైనా గుడ్డ కప్పాలి,” అన్నాడు వెంకటప్పయ్య.*


*రావుడు తలవంచుకుని, తన సంచీలోంచి కొత్త దుప్పటి తీసి సోమన్నకి కప్పేడు.*


* * *



కొన్ని కథలు వెంటాడతాయి. చదివిన కొన్నాళ్ళదాకా ఆ కథ తాలూకు ఆలోచనలు మనల్ని వదిలిపెట్టవు. కాశీభొట్ల కామేశ్వర రావుగారు రాసిన ఈ కథ అలాంటిదే. దానికి ముఖ్య కారణం….అతి సహజంగా జీవితాన్ని దర్శించిన వైనం ఆ కథ చదవటంవల్ల హృదయంలో కలగడం! పాత నలుపు – తెలుపు ( Black & white) సినిమా చూసిన అనుభూతి కళ్ళకు కట్టినట్టుగా ఉండడమూనూ.


ఈ చిన్న కథలో అరవై ఏళ్ల క్రిందటి కోనసీమ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య సంబంధాలు, ఆకుపచ్చటి కొబ్బరి తోటలు, గలగల పారే కాలవలూ , పిల్లలు చదువుకునే బళ్లూ, వాళ్ళు తినే చిరుతిళ్ళు, గోదావరిపై ప్రయాణాలు….. అన్నీ ఎంచక్కా స్మృతిపథంలో తిరుగాడుతాయి. ఓసారి అందమైన బాల్యంలోకి మనసు మళ్ళిపోతుంది.


అలాంటి చక్కటి అనుభూతులను పంచుతూనే రచయిత ఈ కథలో మనిషిలో పిసినారితనం ఎంత లోతుగా ఉంటుంది..? దాని ప్రభావం ఎటువంటి పరిణామాలు కలుగచేస్తుంది అనే విషయాన్ని ఎంతో సహజంగా చిత్రీకరించారు. లోభం మనిషిలో ఒక సాధారణ బలహీనత అని రావుడి ద్వారా చెప్పేరు. 


సోమన్న నిస్వార్థంగా, వయోభేదం లేకుండా పిల్లలతో మైత్రి నెరపినవాడు. ఈవాల్టికికూడా డబ్బులు తీసుకోకుండా పెసరట్టు నేతితో కాల్చి తినిపించినవాడు. రావుడిలో నిద్రాణమై ఉన్న గతకాలపు మధురానుభూతులను తట్టి లేపినవాడు. 

కానీ, రావుడు?? ఒక్క దుప్పటీ గుడ్డ అడిగితే ఏదో కారణం చెప్పుకుని తప్పుకున్నాడు. ఇవ్వాలని లేక కాదు… అంత ఖరీదుది ఎందుకనే లోభగుణం. చివరికి తను కొనదలుచుకున్న ఖరీదులోనే కొన్నాడు….కానీ అది సోమన్న శవం మీద కప్పడానికే ఉపయోగపడింది కానీ బతికుండగా అతన్ని చలినుంచి కాపాడలేక పోయింది.


చెయ్యదలుచుకున్న పని….ముఖ్యంగా దాన ధర్మాల వంటివి వెంటనే తక్షణమే చేసేయాలి. లేకపోతే ఈ దిక్కుమాలిన మనసు మాయ చేస్తుంది. వేరే ఆలోచనలు వస్తాయి. వాటిని సమర్థించుకునే తర్కం పుట్టుకొస్తుంది. నువ్వు ఇవ్వదలుచుకున్నది వాయిదా వేస్తే, రేపు పుచ్చుకునేందుకు వాడు ఉండకపోవచ్చు…. ఇచ్చేందుకు నువ్వూ లేకపోవచ్చు.🙏

మనస్సు-భగవంతుడు*

 *మనస్సు-భగవంతుడు*

శ్రీ నీలకంఠ దీక్షితులు రచించిన శ్లోకాన్ని ఉటంకిస్తూ జగద్గురువులు, ఏదైనా రాయి ప్రకాశవంతముగా కనిపిస్తేనే మన దృష్టి మళ్ళుతుందని, మాములు రాయి వైపు మనం చూడమని చెప్తూ ఇలా అన్నారు. 

*పాషాణా సర్వ ఏవైతే పద్మరాగేషు కో గుణః ।*

 *ప్రకాశః కశ్చిదత్రాస్తి పరత్ర స న విద్యతే*.

మౌల్యము లేని ఒక సాధారణ రాయివలన మన మనస్సు చెదిరిపోకుండా ఉంటుంది. అదే విధంగా మనం జపం చేస్తూ కూర్చున్నప్పుడు ప్రపంచం మొత్తం విలువలేనిదిగా పరిగణించబడాలి. అప్పుడే మన మనస్సు సంచరించదు. భగవంతునియందు  స్థిరపడుతుంది.


*జగద్గురువు శంకరాచార్య*

*శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు.*

అపర ఏకాదశి

 🌸 *నేడు (జూన్ 02 ఆదివారం) అపర ఏకాదశి సందర్భంగా...* 🌸


*ఏకాదశి వ్రత మహిమ | అపర ఏకాదశీ వృత్తాంతం*


*పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా వైశాఖ బహుళ ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో 'భద్రకాళి జయంతి'గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుపుకుంటారు.*


*ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అని అర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెబుతారు.*


*అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా మరో అర్థం ఉంది. అపర ఏకాదశి రోజు భగవంతుని ఆరాధిస్తే మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని.. శాస్త్ర వచనం. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పినట్టు పురాణ వచనం. 'అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగి పోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట.*


*ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలంనుంచి ఉపవాసం ఆరంభించాలి. ఏకాదశి. రోజు తలార స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ ఉండి, ద్వాదశ ఘడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా, ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు, పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసినా శుభాలు చేకూరుతాయని పురాణ వచనం.*


*అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ కోసం తూర్పు వైపు ఒక పీటాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై విష్ణువు, లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి. తరువాత కలశాన్ని ప్రతిష్టించాలి. అనంతరం స్వామికి ధూప దీపం వెలిగించి, పండ్లు, పూలు, తమలపాకులు. కొబ్బరికాయ, లవంగం మొదలైన పూజా సామగ్రిని సమర్పించాలి. ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి. భక్తులు తమ కుడిచేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి. సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. లేదా వినాలి.*


🌹🌺🌹 *అపర ఏకాదశీ వృత్తాంతం* 🌹🌺🌹


*శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. దాని మాహాత్మ్య మేమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది" అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు.*


*దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. "ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంతశాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశీ వ్రతపాలనతో నశించిపోతాయి. మోసగాడు, మిథ్యాజ్యోతిష్కుడు, దొంగవైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చే - వారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు”.*


*"రాజా! గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియైనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథక్షేత్ర దర్శనఫలం, బదరీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుఱ్ఱములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడ అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం, ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు, పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది. రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు.*


*అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశీ మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు.*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ ఏకాదశి  - రేవతి -‌‌ భాను వాసరే* (02.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

హనుమజ్జయంతి ప్రత్యేకం - 2/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  2/11 

         (నిన్న హనుమజ్జయంతి) 

         

II. వ్యక్తిత్వం - ఆదర్శం 


1. వ్యక్తిత్వం - శీలం : స్వామి వివేకానంద నిర్వచనం 


(i) వ్యక్తిత్వం = చేతలు ÷ మాటలు  


    మాటలు కోటలు దాటి, చేతలు గడప దాటకపోతే, ఈ భాగాహారం విలువ 1 కన్నా తక్కువ ఉంటుంది. 

    చెప్పిన మాటా, దానినే చేసి చూపిస్తే, దాని విలువ 1. 

    చెప్పిన మాటకన్నా, అధికంగా చేసి చూపితే, ఆ నిష్పత్తి విలువ 1 కంటే అధికం. 


(ii) శీలం = (మాటలు + చేతలు) ÷ ఆలోచనలు 


    శీలం విషయంలో 

  - ఆలోచనలు సక్రమమై, అవి మాటలు చేతల రూపంలో నిలబడగలగాలి. 


2. హనుమంతుని మనస్సు - వాక్కు - చేత 


(i) మనస్సు 


అ) లంకకు వెళ్ళే సమయంలో 


    వేగము గలవాడు, 

    వేగము విషయమున మనస్సు నిలిపినవాడు, 

    శత్రువీరులను సంహరించువాడు, 

    గొప్ప సామర్థ్యం కలవాడు, 

    ఉత్తమమైన మనస్సు కలవాడు, 

    వానరులలో మహావీరుడుఅయిన హనుమంతుడు 

    మనస్సునుఏకాగ్రము చేసి, మనస్సుచేత లంకకు వెళ్ళాడు.   


సవేగవాన్ వేగసమాహితాత్మా

హరిప్రవీరః పరవీరహన్తా I 

మనస్సమాధాయ మహానుభావో 

జగామ లఙ్కాం మనసా మనస్వీ ৷৷ 

         కిష్కింధ 67/50 


ఆ) లంక అంతఃపురంలో స్త్రీలను చూచి 


(పరపురుషు లెవ్వరూ లేరుకదా! అనే) నమ్మకంతో ఇష్టమువచ్చినట్లు పరుండి నిద్రించుచున్న రావణుని భార్యలను నేను చూస్తున్నాను. 

    అయినా నా మనస్సులో ఎట్టి వికారములూ కలగలేదు కదా! 

    మంచి పరిస్థితులలోగానీ, చెడ్డ పరిస్థితులలోగానీ (పుణ్యపాప కార్యములయందు) ఇంద్రియములు ప్రవర్తించడానికి మనస్సే కారణం. ఈ స్త్రీలను చూసినా, నా మనస్సు ఎట్టి వికారమూ చెందక స్థిరంగా ఉంది. 


కామం దృష్టా మయా సర్వా 

విశ్వస్తా రావణస్త్రియః I 

న హి మే మనసః కిఞ్చిత్ 

వైకృత్యముపజాయతే ॥

మనో హి హేతుః సర్వేషామ్  

ఇన్ద్రియాణాం ప్రవర్తనే I 

శుభాశుభాస్వవస్థాసు 

తచ్చ మే సువ్యవస్థితమ్ ॥ 

           సుందర 11/40,41 


(ii) హనుమంతుని వాక్కు 


లంకకి వెళ్ళేముందు వానరులతో 


   "రాముడు విడిచిన బాణమువలె, నేను వాయువేగంతో రావణుడు పాలించే లంకకు వెడతాను." 

   

యథా రాఘవనిర్ముక్తః 

శరః శ్వసనవిక్రమః I 

గచ్ఛేత్తద్వద్గమిష్యామి 

లఙ్కాం రావణపాలితామ్ ৷৷ 

             సుందర 1/39 


(హనుమగూర్చి వాల్మీకి మొదటగా వాడిన పదం "వాక్యకోవిదుడు".) 


(iii) హనుమ చేసిన క్రియ - శ్రీరామ ప్రశంస 


    లంకవెళ్ళి, సీతామాత జాడ తెలిసికొనివచ్చి నివేదించిన హనుమనుగూర్చి, శ్రీరామచంద్రుడు 

   "ఈ భూలోకములోని ఇతరులెవ్వరూ మనస్సుచేత కూడ భూమియందు చేయజాలని దుర్లభమైన గొప్ప కార్యమును హనుమంతుడు చేశాడు." అన్నాడు. 


కృతం హనుమతా కార్యం 

సుమహద్భువి దుర్లభమ్ I 

మనసాపి యదన్యేన 

న శక్యం ధరణీతలే ॥ 

         యుద్ధ 1/2 


అనుమితి: 


    హనుమ అనుగ్రహంతో, ఆయన ఆదర్శ వ్యక్తిత్వవికాసాన్నే మనం కూడా పొందుతాం.  


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

02.06.2024. ఆదివారం

 02.06.2024. ఆదివారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష *ఏకాదశి* తిథి రా.02.41 వరకూ తదుపరి *ద్వాదశీ* తిథి, *రేవతి* నక్షత్రం రా.01.40 వరకూ తదుపరి *అశ్వని* నక్షత్రం, *ఆయుష్మాణ* యోగం మ.12.12 వరకూ తదుపరి *సౌభాగ్య* యోగం , *బవ* కారణం మ.03.53 వరకూ,*బాలవ* కరణం రా.02.41 వరకూ తదుపరి *కౌలవ* కరణం ఉంటాయి.

*సూర్య రాశి*: వృషభ రాశి లో (రోహిణి నక్షత్రం లో)

*చంద్ర రాశి*: మీన రాశిలో రా.01.40 వరకూ తదుపరి మేష రాశిలో 

*నక్షత్ర వర్జ్యం*: మ.02.28 నుండి మ.03.58 వరకూ

*అమృత కాలం*: రా.11.26 నుండి రా.12.55 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.41

*సూర్యాస్తమయం*: సా.06.48

*చంద్రోదయం*: రా.02.46

*చంద్రాస్తమయం*: మ.02.45

*అభిజిత్ ముహూర్తం*: ప.11.48 నుండి మ.12.41 వరకూ

*దుర్ముహూర్తం*: సా.05.03 నుండి సా.05.55 వరకూ.

*రాహు కాలం*: ఉ.05.09 నుండి ఉ.06.48 వరకూ

*గుళిక కాలం*: మ.03.31 నుండి సా.05.09 వరకూ

*యమగండం*: మ.12.14 నుండి మ.01.53 వరకూ.


ఈ రోజు *అపర ఏకాదశి*.వైశాఖ బహుళ పక్ష ఏకాదశి ని అపర ఏకాదశి అని పిలుస్తారు. *అపర* అనే సంస్కృత పదానికి అర్ధం అనంతమైన,పరిధి లేనిది అని. ఈ రోజు విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే,అనంతమైన సుఖ సంతోషాలు,సంపదలు కలుగుతాయి అని నమ్మకం. ఈ ఏకాదశి ని *అచల ఏకాదశి* అని కూడా పిలుస్తారు. వాయువ్య భారత దేశంలో,ఈ ఏకాదశి ని *భద్రకాళీ ఏకాదశీ* గా జరుపుకుంటారు. ఈ రోజు భద్రకాళీ అమ్మవారిని పూజించడం వలన శుభాలు కలుగుతాయని అక్కడి భక్తుల నమ్మకం. ఒరిస్సా రాష్ట్రం లో *జలక్రీడా ఏకాదశి* గా ఈ రోజు జగన్నాథ స్వామి కి ప్రత్యేక పూజలు చేసి జరుపుకుంటారు. భాగవత పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు గోపికలతో జలక్రీడలు ఆడిన రోజు ఈ ఏకాదశి అని,అందుకని *జలక్రీడా ఏకాదశీ* అని పేరు వచ్చినది అని కథనం. ఈ రోజంతా భక్తులు ఉపవాసం ఉండి, విష్ణుమూర్తి ని తులసీ దళాలతో,విష్ణు సహస్ర నామాలతో పూజించి,వైష్ణవ దేవాలయ సందర్శనం చేయడం వలన శుభాలు కలుగుతాయని నమ్మకం.ఈ రోజు ఏకాదశీ ఉపవాసం ఉన్నవారికి, *పారణ సమయం* రేపు 08.05 నుండి ఉదయం 08.18 వరకూ ఉంటుంది. ద్వాదశీ హరివాసరం రేపు ఉ.08.05 వరకూ ఉంటుంది.


ఆదివారం, అశ్వని నక్షత్రము కలయిక ఉండడం వలన, *సర్వార్థ సిద్ధి యోగం* ఈరోజు రా.01.40 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


నారాయణ స్మరణ తో..సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నంబర్:6281604881.

వైశాఖ పురాణం - 25

 వైశాఖ పురాణం - 25

25వ అధ్యాయము - వాయుశాపము


అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.


శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచేనతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.


శంఖుడును కిరాతుడా! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని యింద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.


బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి యుండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వందరెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షులకంటె అగ్ని, అగ్నికంటె సూర్యుడు, సూర్యునికంటె గురువు, గురువుకంటె ప్రాణము, ప్రాణము కంటె యింద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.


ఇంద్రునికంటె గిరిజాదేవి, ఆమెకంటె జగద్గురువగు శివుడు, శివునికంటె మహాదేవియగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో, ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ యింద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుననక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.


అప్పుడు శ్రీహరి నవ్వుచు విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరమునుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.


స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి యింద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము యింద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.


శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.


ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.


అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.


ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని యిట్లు శపించితివి కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.


వైశాఖ పురాణం 25వ అధ్యాయం సమాప్తం.

ఒకపని మొదలు పెట్టినప్పుడు

 *2026*

*కం*

ఒకపని మొదలిడి నప్పుడు

సకలంబుల విస్మరించి సాగెడి వాడే

సకలంబులు జేయగలుగు

ఒకేఒకడుగా నెగడును ఉర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఒకపని మొదలు పెట్టినప్పుడు (ఎంతగొప్పవైననూ) తక్కిన పనులన్నీ విడిచిపెట్టి ముందు కు నడవగలిగేవాడే ఈ భూలోకంలో అన్ని పనులనూ చేయగలిగే ఒకేఒక్కడుగా వర్థిల్లును.

*సందేశం మరియు సందర్భం*:-- ఈనాడు ఒకపనికోసం స్మార్ట్ ఫోన్ తీయగా నే ఎన్నో అనవసరమైన సమాచారాలు కనబడి కలత(disturbance)పెడతాయి. అటువంటప్పుడు ఈ పద్యం గుర్తుకు తెచ్చుకుని తక్కినవన్నీ విడిచిపెట్టగలిగినవాడే సర్వ సమర్థుడగును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మెరుపుతీగ విలసిల్లిన చందంగా

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *కాలాంబుదాళి లలితోరసి కైటభారేః*

       *ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ*,

      *మాతు స్సమస్తజగతాం మహనీయమూర్తిః*

      *భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః* (05)


          { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: మేఘమందు మెరుపుతీగ విలసిల్లిన చందంగా వానా కాలం మబ్బు మాదిరి నల్లని శరీరచ్ఛాయగల శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఏ జగజ్జనని రూపం వెలిగిపోతోందో ఆ *మహాలక్ష్మియొక్క మంగళస్వరూపం నాకు శుభాలను ప్రసాదించుగాక!*


✍️🌷🌸🪷🙏

పంచాంగం 02.06.2024 Sunday.

 ఈ రోజు పంచాంగం 02.06.2024  Sunday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ    పక్ష: ఏకాదశి తిధి భాను వాసర: రేవతి నక్షత్రం ఆయుష్మాన్ యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి రాత్రి 02:41 వరకు.

రేవతి రాత్రి 01:39 వరకు.


సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:43


వర్జ్యం : మధ్యాహ్నం 02:27 నుండి 03:57 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:59 నుండి  05:51 వరకు.


అమృతఘడియలు : రాత్రి 11:25 నుండి 12:54 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

AGNIPATH Recruitment

 Indian Army AGNIPATH Recruitment


*  Vacancy      : 46,000 Posts

*  Job Role     : Agniveer

*  Qualify        : 8th, 10th, 12th

*  Age             : 17 to  23

*  Salary         : Rs.30,000 - 40,000/-

*  Location     : All Over India

*  Selection    : Physical, Medical

*  Apply Mode: Online


This message is very useful for the job seeker. Kindly share this information with at least one group, Benefits of AGNIPATH


1st Year: Rs.21000 × 12 = Rs. 2,52,000

2nd Year: Rs.23100 × 12 = Rs. 2,77,200

3rd Year: Ra.25580 × 12 = Rs. 3,06,960

4th Year: Rs.28000 × 12 = Rs. 3,36,000

4 Years Total = Rs.11,72,160


Retirement Time after 4th Year: Rs.11,71,000 


Grand Total after 4th Year = Rs. 23,43,160


Plus:

1. Excellent Army Training,

2. Food, Clothes, Boarding & Lodging @ Army Regimental Life for 4 years.

3. Disciplined Lifestyle and

4. Matured Mindset.


Job Offers after 4 Years from:


1. Tri-Forces (Army, Navy, Airforce)

2.. CRPF

3. Railway Protection Force

3. GRP

5. CISF

6. BSF

7. Customs & Central Excise

8. Forest Departments

9. ONGC

10. IOCL

11. HPCL

12. Indian Railways

13. State Police

14. Banks

15. Airports

16. Seaports

17. Traffic Police Depts

18. Toll Plazas

19. ATMs

20. NMDC

21. SAIL

22. All Central PSUs

23. All State PSUs.

24. Task Force

25. Corporates like TATAs, Wipros, Mahindras.

26. Private Security Agencies

27. Logistics Companies

28. Cargo Companies

29. Warehousing Cos.

30. Road Transport Corps (RTCs)

31. Private Transport Cos.

32. Airliners (Indigo, SpiceJet, Tata Vistara etc etc)

33. Community Policing.

and Many MORE...


And, youth get excellent training to face rioters/looters/anti-social elements.


So, Dear YOUTH, please urgently learn that AGNIPATH is very important in your life and a Great Gift. No doubt in it.


And, 10% Quota for Agniveers in Coast Guard, Defence, Civilian Posts, and in nearly 100 Defence PSUs & Defence R&D Units viz....

1. Hindustan Aeronautics Ltd (All 38 Divisions/Units of HAL and HAL JV Companies)

2. Bharat Electronics Ltd (all 10 Units)

3. Bharat Dynamics Ltd

4. BEML Ltd.

5. Mishra Dhatu Nigam Limited (MIDHANI)

6. Mazagon Dock Shipbuilders Limited (MDL)

7. Garden Reach Shipbuilders and Engineers Ltd (GRSE)

8. Goa Shipyard Limited (GSL)

9. Hindustan Shipyard Ltd

10. Advanced Weapons & Equipment India Limited

11. Gliders India Ltd

12. Troop Comforts Ltd

13. Armoured Vehicles Nigam Limited (AVNL)

14. Munitions India Limited (MIL)

15. Yantra India Limited (YIL)

16. India Optel Limited (IOL)

17. Defence Research and Development Organisation (DRDO) Labs/Units

18. Advanced Centre for Energetic Materials (ACEM)

19. Advanced Numerical Research & Analysis Group (ANURAG)

20. Advanced Systems Laboratory (ASL)

21. Aerial Delivery Research & Development Establishment (ADRDE)

22.Aeronautical Development Establishment (ADE)

23. Armament Research & Development Establishment (ARDE)

24. Centre for Air Borne System (CABS)

25. Centre for Artificial Intelligence & Robotics (CAIR)

26. Centre for Advanced Systems (CAS)

27. Integration of Strategic Systems

28. Centre for Military Airworthiness & Certification (CEMILAC)

29. Centre for Personnel Talent Management (CEPTAM)

30. Centre for Fire, Explosive & Environment Safety (CFEES)

31. Centre for High Energy Systems and Sciences (CHESS)

32. Centre for Millimeter Wave Semiconductor Devices & Systems (CMSDS)

33. Combat Vehicles Research & Development Establishment (CVRDE)

34. Defence Avionics Research Establishment (DARE)

35. Defence Bio-engineering & Electromedical Laboratory (DEBEL)

36. Defence Electronics Applications Laboratory (DEAL)

37. Defence Scientific Information & Documentation Centre

38. Defence Food Research Laboratory (DFRL)

39. Defence Institute of Bio-Energy Research (DIBER)

40. DRDO Integration Centre (DIC)

41. Integration of Strategic System

42. Defence Institute of High Altitude Research (DIHAR)

43. High Altitude Agro-animal Research

44. Defence Institute of Physiology & Allied Science (DIPAS)

45. Defence Institute of Psychological Research (DIPR)

46. Defence Laboratory (DL)

47. Defence Electronics Research Laboratory (DLRL)

48. Defence Materials & Stores R&D Establishment (DMSRDE)

49. Defence Metallurgical Research Laboratory (DMRL)

50. Defence Research & Development Establishment (DRDE)

51. Defence Research & Development Laboratory (DRDL)

52. Defence Research Laboratory (DRL)

53. Defence Terrain Research Laboratory (DTRL)

54. Gas Turbine Research Establishment (GTRE)

55. High Energy Materials Research Laboratory (HEMRL)

56. Institute of Nuclear Medicine & Allied Sciences (INMAS)

57. Institute of Systems Studies & Analyses (ISSA)

58. Institute of Technology Management (ITM)

59. Instruments Research & Development Establishment (IRDE)

60. Integrated Test Range (ITR)

61. Joint Cypher Bureau (JCB)

62. Laser Science & Technology Centre (LASTEC)

63. Electronics & Radar Development Establishment (LRDE)

64. Military Institute of Training (MILIT)

65. Mobile Systems Complex (MSC)

66. Microwave Tube Research & Development Centre (MTRDC)

67. Naval Materials Research Laboratory (NMRL)

68. Naval Physical & Oceanographic Laboratory (NPOL)

69. Naval Science & Technological Laboratory (NSTL)

70. Proof and Experimental Establishment (PXE)

71. Recruitment and Assessment Center (RAC)

72. Research Centre Imarat (RCI), HYD

73. Research & Development Establishment (Engrs)

74. DRDO Research & Innovation Centre (RIC)

75. Scientific Analysis Group (SAG)

76. Snow and Avalanche Study Establishment (SASE)

77. Snow and Avalanche Complex

78. Solid State Physics Laboratory (SSPL)

79. Terminal Ballistics Research Laboratory (TBRL)

80. Vehicle Research & Development Establishment (VRDE)