1, నవంబర్ 2023, బుధవారం

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర్

 🕉 మన గుడి : నెం 226


⚜ *గోవా  : వెలింగ్*


⚜ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర్ 







💠 గోవా అంటే బీచ్‌లు మాత్రమే అని మీరు అనుకుంటే పొరబడినట్టే. 

గోవాలో అనేక ప్రసిద్ధ హిందూ దేవాలయాలు ఉన్నాయి, అలాంటి అపూర్వమైన ఆలయం ఒకటి గోవాలోని వెలింగ్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. 


💠 శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం ఉత్తర గోవాలోని పోండాలోని వెలింగ్ గ్రామంలో ఉంది.  మర్డోల్ నుండి 3 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం లక్ష్మీ దేవి మరియు విష్ణువు యొక్క నాల్గవ అవతారమైన నరసింహ స్వామికి అంకితం చేయబడింది.


💠 వెలింగ్ అనేది పోండా తాలూకాలోని ఒక చిన్న గ్రామం మరియు ఇది రాజధాని పనాజీకి 50 కి.మీ.ల దూరంలో ఉంది. 

16వ శతాబ్దంలో గోవాలోని ఇతర ప్రాంతాల నుండి దేవతలను తీసుకువచ్చారని నమ్ముతారు. దండయాత్ర సమయంలో పోర్చుగీసు సైన్యం హిందూ విగ్రహాలను ధ్వంసం చేయకుండా హిందువులు రక్షించాలని కోరుకున్నారని నమ్ముతారు. 

అసలు లక్ష్మీ నరసింహ దేవాలయం మొదట్లో గోవాలోని సల్సెట్‌లో నిర్మించబడింది, అయితే విగ్రహాలను పోర్చుగీస్ నియంత్రణ ప్రాంతం వెలుపల వెలింగ్‌కు మార్చారు.


💠 నరసింహ భగవానుడు విష్ణువు యొక్క నాల్గవ అవతారం మరియు సగం మనిషి మరియు సగం సింహం రూపంలో ఉంటాడు మరియు నరసింహ పురాణంలో వివరంగా చెప్పబడింది. 

ఈ ఆలయంలో నరసింహ అవతారం మరియు విష్ణువు యొక్క ఇతర అవతారాల కథను వర్ణించే అనేక వివరణాత్మక శిల్పాలు ఉన్నాయి. కొంకణి మాట్లాడే గోవా కమ్యూనిటీకి నరసింహ స్వామిని కుల దేవతగా భావిస్తారు.



💠 ఆలయంలో అనేక చెక్క చిత్రాలు మరియు చెక్క శిల్పాలు కూడా ఉన్నాయి.

ఆలయంలో మంచి నీటి బుగ్గ ఉంది, ఇది ఆలయ ట్యాంక్ స్ఫటికాకార స్వచ్ఛమైన నీటితో నింపుతుంది. 



💠 ఆలయ ప్రాంగణంలో, నీటికి దారితీసే మెట్లతో సాంప్రదాయ ఆలయ ట్యాంక్ ఉంది.  పచ్చని కొబ్బరి చెట్లతో  ఈ నీటి తొట్టె శాశ్వతమైన నీటి బుగ్గ ద్వారా మంచినీటితో నిండి ఉంటుంది మరియు ప్రధానంగా భక్తులు పుణ్యస్నానానికి ఉపయోగిస్తారు.



🔅 శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో జరుపుకునే ప్రముఖ పండుగలలో ఒకటైన 'మాంగురిష్ జాత్ర' ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. 

 పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహుని గొప్ప పలఖి (పల్లకి) ఊరేగింపు జరుగుతుంది మరియు ఈ వేడుకలలో పాల్గొనడానికి ప్రాంతం మరియు చుట్టుపక్కల నుండి భక్తులు ఇక్కడకు తరలివస్తారు.


🔅 రామనవమి - చైత్ర శుక్ల నవమి. (మార్చి-ఏప్రిల్)

రామనవమిని ఇక్కడ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 


🔅 పల్కీ ఊరేగింపు - 

 ప్రతి నెలా శుక్ల చతుర్దశి నాడు శ్రీ లక్ష్మీ నారసింహుని ఊరేగింపు జరుగుతుంది.  దేవతలను పాల్కి (పల్లకి)లో కూర్చోబెట్టి, ఆలయం చుట్టూ పెద్ద ఊరేగింపుగా తీసుకువెళతారు.  ఈ మహా వేడుకలో పాల్గొనేందుకు అనేక మంది భక్తులు ఇక్కడకు వస్తారు.


🔅 నవరాత్రి - చైత్ర మాసం (ఏప్రిల్) & ఆశ్వయుజ మాసం (అక్టోబర్)

ఇక్కడ ప్రతి సంవత్సరం రెండు సార్లు నవరాత్రులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.  

నవరాత్రులు అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు.  

ఈ పండుగ సందర్భంగా భక్తులు వ్రతం పాటిస్తారు మరియు ప్రత్యేక పూజలు చేస్తారు


💠.ఈ ఆలయం గోవాలోని ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా, పైకప్పుగా పలకలతో కూడిన పిరమిడ్ మాత్రమే ఉంది మరియు ఆశ్చర్యకరంగా గోపురాలు లేవు.  

గోడలు కూడా ప్లాస్టరింగ్‌తో సాదాసీదాగా ఉంటాయి.  కానీ లోపలి భాగం బయటికి పూర్తి భిన్నంగా ఉంటుంది.  అన్ని క్లిష్టమైన చెక్క శిల్పాలలో ఇంద్రధనస్సు యొక్క మొత్తం ఏడు రంగులతో ఉంటుంది


💠 దేవాలయ ప్రవేశం హిందువులకు మాత్రమె పరిమితం చేయబడినందున హిందువులు కానివారు ప్రవేశించలేరు.

 గోవాను సందర్శించే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి మరియు నరసింహ స్వామి అనుగ్రహాన్ని పొందాలి.



💠 ఆలయం ఉదయం 06:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు మరియు తరువాత సాయంత్రం 04:30 నుండి రాత్రి 08:30 వరకు తెరిచి ఉంటుంది.



💠 ఈ ఆలయం రాజధాని నగరం పనాజీకి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Photo

 
























Panchaag


 

దూరం నుంచి దర్శనం..

 *దూరం నుంచి దర్శనం..*


"అయ్యా..గుడి దగ్గరకు దంపతులు ఇద్దరు కారులో వచ్చారయ్యా..ఇద్దరూ వయసులో పెద్దవాళ్ళు..సుమారు అరవై ఐదు, డెబ్భై ఏళ్ళు వుంటాయేమో..చాలా దూరం నుంచి వచ్చారట..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లిపోతారట..దర్శనం కుదరదు అని చెపుతున్నాము..కానీ ప్రాధేయపడుతున్నారు..ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేస్తున్నాము.." అని మా సిబ్బందిలో ఒకరు నాకు తెలిపారు..అప్పటికి కరోనా తాలూకు లాక్ డౌన్ పెట్టి సరిగ్గా పదిరోజులు..ఏప్రిల్ నెల 4,5 తేదీలలో నాటి సంఘటన ఇది..ప్రయాణాలు చేయకుండా పూర్తి స్థాయిలో నిషేధం ఉంది..మరి ఈ దంపతులు ఎలా వచ్చారు? అని నాకు సందేహం వచ్చింది..పైగా..ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్ధనా మందిరాలు తెరువరాదనే నియమం పెట్టారు..స్వామివారి నిత్య పూజలూ..నైవేద్యములు..కైంకర్యాలు..అర్చకస్వాములు  ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..అప్పటికి స్వామివారి మందిరం వద్ద దత్తదీక్ష స్వీకరించిన స్వాములు సుమారు 250 మంది వున్నారు..వాళ్ళు కాకుండా దూరప్రాంత వాసులు..ప్రయాణం చేసే వీలులేక..మరో 50 మంది కూడా వున్నారు..వీళ్ళందరికీ రెండుపూటలా అన్నప్రసాదం ఏర్పాటు చేసాము..ఆ హడావిడి లో మా సిబ్బంది వున్నారు..అక్కడ దీక్ష చేస్తున్న స్వాములు దర్శనానికి స్వామివారి మందిరం లోకి రాకుండా మేము అనుమతి ఇవ్వలేదు..ఆ పరిస్థితుల్లో ఈ దంపతులకు అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పి..భోజనం పెట్టించి..వెనక్కు పంపివేయమని చెప్పాను..మా సిబ్బంది సరే అన్నారు..


ఆరోజు నేను మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వెళ్లలేదు..ప్రక్కరోజు ఉదయం స్వామివారి మందిరానికి వెళ్ళాను..స్వామివారి ఆలయం వెనుక వైపు ద్వారం వద్ద ఆ దంపతులు నిలబడి వున్నారు..వారి వద్దకు వెళ్ళాను..నమస్కారం చేశారు.."నా పేరు వెంకటేశ్వరరావు అండీ..నా భార్య సుబ్బలక్ష్మి..మా ఊరు మచిలీపట్నం దగ్గర..తీవ్రమైన సమస్యలో వున్నాము.. మా అమ్మాయి జీవితానికి సంబంధించినది.. మాకు ఒక్కతే కూతురు..అది ఇంట్లో కూర్చుని దుఃఖ పడుతుంటే చూడలేకుండా వున్నాము.. స్వామివారి గురించి ఆరేడు నెలల నుంచీ చదువుతున్నాను..ఇక ఏ దారీ తోచలేదు..కారు తీసుకొని..నా భార్యను తోడు తీసుకొని..నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను..ఒకసారి స్వామివారి సమాధిని దర్శించుకొని..మా సమస్యను ఆ అవధూత చెవిలో వేసి వెళ్లిపోదామని అనుకున్నామండీ..కానీ ఇక్కడికి వచ్చాక మాకు పరిస్థితి అర్ధం అయింది..దత్తదీక్ష స్వీకరించిన వారిని కూడా మీరు లోపలికి అనుమతించడం లేదు..ప్రభుత్వ నిబంధనలు మీరు పాటించాలి..ఈ రెండురోజులు స్వామివారి ప్రసాదం తీసుకున్నాము..ఇంత వత్తిడి లోనూ మీరు ఇంతమందికి ఇబ్బంది లేకుండా ఆహారం అందిస్తున్నారు..సరే నండీ మాకు ప్రాప్తం లేదు..మీరు స్వామివారి ని ప్రత్యక్షంగా చూసి, సేవ చేసుకున్న వారు కనుక..మీతో మా సమస్య చెప్పుకొని వెళ్లిపోతాము..మళ్లీ ప్రాప్తం ఉంటే..ఇంకొకసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాము.." అన్నారు..మందిరం ప్రధాన ద్వారం వద్దకు వచ్చి..ఆ ద్వారం అవతల వైపునుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..


"అయ్యా..మీ మనసులోని వేదనను స్వామివారి కి ఇక్కడినుంచే విన్నవించుకోండి.. ఈ ప్రదేశం అంతా స్వామివారు నడచిన నేల.. మీరు  మనస్ఫూర్తిగా స్వామివారిపై విశ్వాసం ఉంచండి.." అని చెప్పాను..దంపతులిద్దరూ..ఆ గేట్ కు తమ తలలు ఆనించి..కళ్ళు మూసుకొని సుమారు పది నిమిషాలు అలానే ఉండిపోయారు..ఆ తరువాత ఇవతలికి వచ్చి..నాకు వెళ్ళొస్తామని చెప్పి.. "స్వామివారి విభూతి గంధం ఇప్పించగలరా?" అన్నారు..మా సిబ్బందికి చెప్పి రెండు పాకెట్లు విభూతి గంధం, స్వామివారి చిన్న ఫోటో తెప్పించి..వారికి ఇచ్చాను..భక్తిగా కళ్లకద్దుకొని తీసుకొని..కారులో వెళ్లిపోయారు..


వైశాఖ శుద్ధ సప్తమి రోజు స్వామివారి ఆరాధన వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ..ఈసారి ఈ కరోనా కారణంగా వేడుక పూర్తిగా రద్దుచేసి..కేవలం మా అర్చకస్వాములు, సిబ్బంది సమక్షంలో ప్రత్యేక పూజలు, అభిషేకము నిర్వహించాము..దత్తదీక్ష స్వీకరించిన స్వాములు ఆలయం వెలుపలే వుండి దీక్ష విరమణ చేశారు..ఆరోజు ఉదయం 10 గంటల వేళ.."ప్రసాద్ గారూ..నా పేరు వెంకటేశ్వర రావు..మేము 25 రోజుల క్రితం మొగిలిచెర్ల వచ్చి, గేటు దగ్గరనుంచి స్వామివారి సమాధిని చూసి..మొక్కుకొని..మీతో మాట్లాడి వెళ్ళాము..గుర్తుకు వచ్చామా? " అని ఫోన్ లో అడిగారు.."గుర్తు వున్నారు.." అన్నాను..


"స్వామివారు మమ్మల్ని కరుణించారు.. మా సమస్య తీరిపోయింది..ఈ వయసులో మా నెత్తిమీద ఉన్న బరువు తొలిగిపోయింది..మాకు మనోవేదన కలగడానికి కారణం అయిన మా అమ్మాయి కాపురం చక్కబడింది..అల్లుడు గారే వచ్చి మాకు క్షమాపణ చెప్పి, అమ్మాయిని తీసుకెళ్లాడు..మీకొక విషయం చెప్పాలి..స్వామివారి విభూతి గంధం మా అమ్మాయి రోజూ ధరించింది..మేము అక్కడ ఉన్న రెండురోజులు మీ సిబ్బంది బాగా సహకరించారు..ఈ కరోనా కష్ట కాలం తొలగిపోగానే వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాము..స్వామివారి సమాధి వద్దకు ఆరోజు పోలేకపోయామే అని బాధపడ్డాము కానీ.. మీరు చెప్పినట్టు ఆ ప్రదేశం అంతా స్వామివారు నిండిపోయి వున్నారు..దూరం నుంచి దర్శనం చేసుకున్నాము..స్వామివారు మమ్మల్ని దయతో దగ్గరకు తీసుకున్నారు.. అక్కడే మూడు రాత్రులు నిద్ర చేసాము.. ఆయన మా మొర విన్నాడు..ఈసారి తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుంటాము.." అని ఉద్వేగంతో చెప్పారు..


స్వామివారి పై ఆ దంపతుల అచంచల విశ్వాసమే వారి ఆనందానికి హేతువు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

భారతీయ కమెండో

 ఒక సెక్యూలర్ హిందూ, ఒక BBC రిపోర్టర్ మరియు ఒక భారతీయ కమెండో తాలిబాన్ టెర్రరిస్టుల చేత పట్టుబడ్డారు.


వారిని తుపాకీతో కాల్చి చంపే ముందు చివరిగా ఒక్కొక్క కోరిక తీరుస్తాను కోరుకోండి అని తీవ్రవాదుల నాయకుడు వారికి చెప్పాడు.


సెక్యూలర్ హిందూ ఇలా అన్నాడు, మీరు అమెరికా వల్ల ఇలా తయారు అయ్యారు. స్వతహాగా మీరు అహింసా వాదులు. అయినా మీరు అమెరికా మీద కోపం కొద్దీ నన్ను చంపుదాం అనుకుంటున్నారు కాబట్టి, చంపండి, కానీ మీ ముక్తి కోసం ప్రార్ధన చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు.


టెర్రరిస్టు నాయకుడు సరే అని చెప్పడం తో ఆ హిందూ సెక్యూలర్ ప్రార్ధన చేసేసి“ఇప్పుడు నేను  చనిపోడానికి రెడీ"  అన్నాడు.


బిబిసి రిపోర్టర్ మాట్లాడుతూ "నేను చివరి వరకు రిపోర్టర్‌ని. విడియో కామ్ ఇస్తే ఇక్కడ ఏం జరుగుతోందో షూట్ చేసి నా వ్యాఖ్యలు జోడించి ఉంచుతాను.  ఏదో ఒక రోజు ఎవరైనా ఆ విడియో చూసి ఇక్కడ జరిగిన దాని గురించి తెలుసుకుని నా ఉద్యోగ నిబద్ధత గుర్తిస్తారు" అని చెప్పాడు.


దానికి టెర్రరిస్టు నాయకుడు స్పందిస్తూ మా గురించి నువ్వు అంతా గొప్పగా చెప్పాలి, అమెరికా చెడ్డ తనం వల్లే మేం టెర్రరిస్టు లుగా మారాం, మిమ్మల్ని చివర వరకూ మేం చక్కగా చూసుకున్నాం, అమెరికాకు పాఠం చెప్పడానికే మిమ్మల్ని చంపుతున్నాం అని నీ వీడియోలో చెప్పాలి. అలా చెప్తాను అంటేనే నీకు విడియో కామ్ ఇస్తాను అని చెప్పాడు. దానికి బిబిసి రిపోర్టర్  మా బిబిసి చేసేది ఇలా తప్పుడు రిపోర్టు లు ఇవ్వడమే కాబట్టి , నాకు ఇబ్బంది ఏం లేదు నువ్వు ఎలా కావాలంటే అలా చెప్తాను,   కాబట్టి విడియో కామ్ ఇవ్వమని అడిగాడు. దాంతో ఆ బిబిసి విలేకరి కి విడియో కామ్ ఇవ్వమని టెర్రరిస్టు నాయకుడు ఆదేశించాడు. ఆ విలేఖరి టెర్రరిస్టు నాయకుడు ముందు చెప్పినట్లుగానే అంతా చెప్పి రికార్డ్ చేసి కామ్ వాడికి తిరిగి ఇచ్చి, ఇప్పుడు నేను చనిపోడానికి రెడీ అన్నాడు.


చివరిగా ఆ టెర్రరిస్టు నాయకుడు భారతీయ కమెండో కమాండో వైపు తిరిగి, ఇప్పుడు, నీ చివరి కోరిక ఏమిటో చెప్పు అన్నాడు.


దానికి భారతీయ కమెండో స్పందిస్తూ నన్ను తుపాకీతో కాల్చి చంపే ముందు నా కడుపులో కత్తి తో పొడవమని కోరాడు.


" అది ఏంటి?"అని  నాయకుడు ఆశ్చర్యం గా అడిగాడు.  


“లేదు, నేను తమాషాగా అడగడం లేదు. మీరు నన్ను కత్తితో పొడవాలని నేను కోరుకుంటున్నాను" అన్నాడు కమెండో.


ఎందుకు అని నాయకుడు అడిగాడు.


కమెండో పోరాడుతూ చనిపోవాలి కానీ,  పిరికివాడిలాగా చనిపోకూడదు. అందుకే, నా మీద కత్తి గాయాలు చూసి పోరాడుతూ చనిపోయాను అని అంతా అనుకుంటారు.

అందుకే ఈ కోరిక అని అన్నాడు.


ఎలాగూ చావబోతున్నాడు కదా అని తీవ్రవాద నాయకుడు కమెండో దగ్గరకు వెళ్లి అతన్ని కత్తితో పొడిచాడు. వెంటనే ఆ కమెండో ఆ నాయకుడి భుజాన ఉన్న AK 47 రైఫైల్ తీసుకుని వాడిని కాల్చి, ఏం జరిగిందో అని తేరుకునే లోపే మెరుపు వేగంతో మిగతా టెర్రరిస్టులను కూడా లేపేసాడు.


“ముందుగా నువ్వే నాయకుడిపై దాడి చేసి వాడి తుపాకీ లాక్కొని వాడిని ఎందుకు కాల్చలేదు? ముందు నిన్ను కడుపులో పొడవమని ఎందుకు అడిగావు?” అని కమెండో ని అడిగారు సెక్యులర్ హిందూ మరియు బిబిసి రిపోర్టర్.


దానికి కమెండో ఇలా జవాబిచ్చాడు, 


రెండు కారణాలు ఉన్నాయి. 


మొదటిది, ఆ నాయకుడు దూరంగా వున్నాడు. దగ్గరికి వస్తే కానీ వాడి తుపాకీ లాక్కోవడం నాకు కుదరదు.


రెండోది, అన్నిటి కంటే ముఖ్యమైనది ఏమిటంటే నేనే ముందు దాడి చేసి ఉంటే హింస కు పాలు పడ్డానని సెక్యులర్ హిందూ,  వాళ్ళు ఎటువంటి దాడి చేయకుండానే అమాయక టెర్రరిస్టుపై నేను దాడి చేసాను అని బిబిసి వారు ప్రచారం చేసేవారు అని అని ఆ భారతీయ కమెండో చెప్పాడు.


....శాస్త్రి.....

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////      ***** అవధాన మధురిమలు ***** అష్టావధాని శ్రీ గరికపాటి మల్లావధాని *****               సమస్యాపూరణములు ;----1*"" మానిని మానుషం బెడలి మర్కట మౌనిదియేమి యీశ్వరా!"" ఉ.నేనను వస్తువీజగతి నిల్వ నుపాధి యొకండు కావలెన్ / దానికి ప్రోపు ప్రాపు వెలిదాపు ఘటింపగ గ్రాసవా / సో నిచయాదులక్కరగుజువ్వె, తదార్జనకై కడంగుచో / మానిని మానుషంబెడలి మర్కటమౌనిది యేమి యీశ్వరా!                            2*"" కరణంబును జూచి భూమికాంతుడు బెదరెన్.""    కం. పరిపూర్ణ బాహుసత్త్వులు / హరిపుత్రకు లొకరి కొక్కరందక పెలుచన్ / గిరులం బోరంగని భీ / కరణంబును జూచి భూమికాంతుడు బెదరెన్.       దత్తపది;--- " గాంధిః -- జేతుం -- ఈశః -- పాయాత్"" అను పదములతో " గాంధీజీ దీవెన" గా శ్లోకం.                   శ్లో!! గాంధీ ర్మహౌజసాం కంధిః                                   జేతాయేన యదార్జితుం         ఈహాంగ తోద్య సర్వేశః.         పాయాత్ప్రాపయ్యనః ప్రియాత్!                               వర్ణనలు;--- విమానము.        ఉ. మానిత యంత్రశక్తిని విమానము ద్యోతలమందు  నేగుచో / దానఁ గలట్టి వారలకు ధారుణి దిద్దిర దిర్గునట్లుగా / గానంగనౌను, భూధరనికాయము దోఁచును బొమ్మరాళ్ళ చం / దాన నదీనదంబులు గనంబడు ప్రాకెడు పాములో యనన్.                 2* స్త్రీ పురుష సామ్యమును గూర్చి పద్యము---                           సీ. కుచముల బరువుతోఁ గ్రుంగిన నడుముతో బటువులౌ తత నితంబములతోడ.                రాచిల్క నుడులతో రాయంచ నడలతో బెడఁగారు పెన్జలడతోడ.         చలదపాంగములతోఁ జారుహాసములతో కలితాతిమృదులాంగకములతోడ.                                  అదరుతో బెదరుతో నతిమాత్ర లజ్జతో బ్రత్యంగ భూషాప్రభాస తోడ                తే.గీ. నలరు నన్వర్థసంజ్ఞలౌ నబల లేడ? పూరుషులతోడ సామ్యంబుఁ బొందుటేడ?       నక్క చిరముగఁ బొరియలోన స్థపించి, సింహసామ్యంబు నెన్నఁడే న్జెందఁగలదె?                         ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                         తేది 1--11--2023, బుధవారం, శుభోదయం.

జన్మ రహస్యం

 ఆత్మ విద్య :మీ జన్మ రహస్యం. చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం    


చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు.

కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…

“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,

భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”

ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

3. పురాణ కధనం ప్రకారం 24మంది

మహా ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకునిధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైదిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు :

*ఐదు జ్ఞానేన్ద్రియాలు,

*5 కర్మేంద్రియాలు,

*పంచ తన్మాత్రలు,

*5 మహాద్భుతాలు,

*బుద్ధి, *ప్రకృతి, *అహంకారం, *మనస్సు

7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామహం”

8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు.

10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

11. మన వెన్నుబాములో 24 మృదులాస్థులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.

“న గాయత్ర్యాత్ప పరం మంత్రం .. నమాతుః పర దైవతం” అన్నారు పెద్దలు .

24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు.

సకల దేవతా స్వరూపం గాయత్రీ.

రామాయణ సారం గాయత్రీ .

కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.

సకలకోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రీ

24 బీజాక్షర సంపుటి గాయత్రీ..

అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.!!

Yaagam


 

మేలుకోండి

 ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయారు. చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు ఆత్మని తీసుకుని బయలుదేరారు. దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు. ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు వెళ్ళాలో తేల్చుకోమని అందుకుగాను ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ ఉండమని తీర్పు ఇచ్చారు. అదే తడవుగా యమభటులు ముందు మా లోకం చూడమని తీసుకుని వెళ్లారు. లోనికి వెళ్ళగానే తనకంటే ముందు చనిపోయిన పాత మిత్రులు ఎదురొచ్చి ఆహ్వానించారు. సరదా పలకరింపులు, తాను భూలోకంలో ఆడిన ఆటలు అన్నీ సరదాగా సాగుతున్నాయి. ఒకవైపు ఫాస్ట్ బీట్ పాటలతో, బిర్యానీ, మందు పార్టీలతో, ఆటపాటలతో సమయం గడిచింది కూడా తెలియకుండా రోజు పూర్తయింది.


మరుక్షణం స్వర్గలోక భటులు ప్రత్యక్షమై తమలోకానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా పరిచయం ఉన్న కొందరు మిత్రులు సాదరంగా ఆహ్వానించారు. మంద్రమైన సంగీతం హాయిగా ఉంది. భగవంతుని కీర్తనలు, సత్సంగాలు, ఆలోచింపచేసే బోధలతో నిండుగా సాగింది ఆరోజు. సాత్విక ఆహారం, అవసరమైన పోషకాలు నిండిన పానీయాలతో భోజనం పెట్టారు. మనసుకి హాయిగా ఉండగా నిద్ర పట్టేసింది. తెల్లవారుతూనే యమధర్మరాజు ముందు నిలబెట్టారు. నీ నిర్ణయం ఏమిటని అడగగానే కాస్త సందిగ్ధంలో పడి మళ్ళీ తన మిత్రులు అంతా ఉన్నారు, విలాసవంతమైన జీవితం అటే ఉందని యమలోకమని బదులిచ్చాడు. 


వెంటనే యమభటులు ఆ వ్యాపారవేత్తని తీసుకొని వెళ్ళి పోయారు. నరక ద్వారం లోకి రాగానే అంతా మురికి కూపంలా కనిపించింది. నిన్న తనను ఆహ్వానించిన మిత్రులు మురికి వస్త్రాలతో, వెట్టి చాకిరి చేస్తూ, మధ్యలో భటుల చేతిలో దెబ్బలు తింటూ కనిపించారు. వెంటనే "ఇదేమిటీ? నిన్న ఇలా లేదు కదా నరకం ఈనాడు ఇలా ఉంది" అని భటులను ప్రశ్నించాడు. 

"నిన్న మేము ప్రచారంలో భాగంగా నిన్ను ఆకర్షించేలా అన్నీ అలా చూపించాము. నిన్ను మా వైపు తిప్పుకునే ప్రయత్నం అది. నువ్వు అదే నిజమనుకుని మాకే ఓటు వేసావు. ఇక నువ్వు మా బానిసవి పద!" అంటూ చేతిలోని శూలంతో బాధించడం మొదలుపెట్టారు. 


   "అయ్యో! సాదాగా ఉన్న నిజమైన స్వర్గాన్ని వదిలి ఆర్భాటాలు అద్దిన నరకాన్ని నిజమని నమ్మి చేజేతులా వచ్చిన అవకాశం నాశనం చేసుకున్నా"నని చింతిస్తూ నరకకూపంలోకి చేరిపోయాడు.```


మిత్రులారా! ఓటన్నది మన హక్కయితే, ఈ ఆకర్షణలు, ప్రలోభాలు, ధనం ఇవన్నీ మన బలహీనతలను లొంగదీసుకోవాలనుకునే ప్రయత్నాలు. నిజంగా మనకోసం, మనకి ఉపయోగపడే నాయకులు ఎవరో ఆచి తూచి ఎన్నుకోండి. ప్రలోభాలకు లోనయితే మరో అయిదేళ్ళవరకూ వారికి మనం బానిసలమవుతాం!! 


మేలుకోండి మిత్రులారా మనకి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది, వదులుకోవదు... నిర్ణయిద్దాం!!


 మన  దేశ ప్రగతికి దిశను నిర్ణయిద్దాం..పదండి.


       🙏🏻🙏🏻🙏🏻🙏🏻

అమరజీవికి అంజలి

 అమరజీవికి అంజలి 


సీ. అరవరాష్ట్రమునందు పరువును గోల్పోయి

                యాంధ్రు లనాథులై యలమటించ

    వేఱు రాష్ట్రమ్ముకై  యారాటపడియును

                పొట్టి శ్రీరాములు పట్టు బట్టె

    నరువది దివసము లాహారమును మాని

                కఠినదీక్షను చేసె ఘనులు మెచ్చ

    కేంద్రమిచ్చెను తుద కాంధ్రరాష్ట్రమ్మును 

                పొట్టి శ్రీరాములు గిట్టి నంత

ఆ. అమరజీవి దివ్య యాత్మార్పణంబున 

     కూడెరాష్ట్ర వసతి వేడుకగను 

     ఆంధ్ర ప్రజకు రాష్ట్ర మందిచ్చినట్టి యా

     అమరజీవి 'పొట్టి'  కంజలింతు


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

విదుర నీతిః


: విదుర నీతిః

.సుధన్వోవాచ - సుధన్వుడు పలికెను.


శ్లో)హిరణ్యం చ గవాశ్వం చ తవైవాస్తు విరోచన

 ప్రాణయోస్తు పణం కృత్వాప్రశ్నం పృచ్చావ యే విదుః॥


అ)విరోచనా! బంగారము, గోవులు, అశ్వాలు నీకే ఉండనీ, మన ఇద్దరి ప్రాణాలనే పందెంగా పెట్టి తెలిసిన వారిని ప్రశ్నిద్దాము

ఉద్ధవగీత

శ్లో)ఏవం క్రియాయోగపథైః పుమాన్ వైదిక తాంత్రికైః | అర్చన్ను భయతస్సిద్ధం మత్తో విందత్యభీప్సితామ్ ॥ 49


అ)పురుషు డిట్లు వైదికతాంత్రిక క్రియా యోగములద్వారా నన్ను పూజించి, నానుండి ఇహలోక పరలోకములయం దభిలషిత మైనసిద్ధిని పొందును

పుణ్యఫలం

 పుణ్యఫలం అనుభవించడంతోపాటుగా ఎవరెవరు పాపాత్ముల వెనక చేరతారు? 

ఎవరైతే ధర్మద్రోహాన్ని ఖండించకుండా ఉంటారు? గ్రహించి, 

వాళ్లందరికీ కూడా పాప ఫలం పొందే అవకాశం ఇవ్వడమనేది భగవంతుని యొక్క ఉపేక్షకి ముఖ్య హేతువు. 

*ఉదాహరణకి* 

జరాసంధుడు అనేకమార్లు దండెత్తుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ జరా సంధుని మాత్రం సంహరించకుండా తప్పించుకునేవాడు ఎందుచేత అంటే... 

అనేకమార్లు జరాసంధుడు ధర్మద్రోహులు అందరిని తోడు వేసుకుని రావడం, వాళ్ళందరూ కూడా జరాసంధుడు వినా, శ్రీకృష్ణ చేత సంహరించబడడం జరుగుతూ ఉండడం వలన పాపాత్ములని పోగు చేసే డ్యూటీ జరాసంధునికి ఇచ్చినట్టు అయ్యింది. 

అదేవిధంగా అధర్మాత్ముడిని ఎవరెవరైతే ఖండించరో... 

వాళ్ళందరూ ఉపేక్ష వహించినవారుగా భగవంతుని దృష్టిలో శిక్షార్హులవుతారు. 

దీనికే భారతంలో 

సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే 

బారము పొందలేక చెడబారినదైన ..... 

అంటూ శ్రీకృష్ణ పరమాత్మ కౌరవసభలో చెప్పడం జరిగింది.

ధైర్యం లేకుండా లక్ష్మి లేదు

 సుభాషితం - 

---------------

*శ్లో.  న ధైర్యేన వినా లక్ష్మీ* 

 *న శౌర్యేన వినా జయః ౹౹*

     *న దానేన వినా మోక్షో*

*న జ్ఞానేన వినా యశః ౹౹*


*భావము. ధైర్యం లేకుండా లక్ష్మి లేదు. శౌర్యం లేకుండా జయం లేదు. దానం చెయ్యకపోతే మోక్షం లేదు. జ్ఞానం లేకుండా కీర్తి లేదు.*

ఉత్తమ ఫొటో

 




వివాదానికి కారణమైన ఓ ఫొటోకు దశాబ్దపు ఉత్తమ ఫొటో అవార్డు దక్కింది. ఫొటోగ్రాఫర్ ను 'ఈ ఫొటో ఎలా తీశారు?' అని అడగ్గా.. అతను ఈ క్రింది విధంగా జవాబిచ్చాడు: చిరుతలు ఒక తల్లి జింకను మరియు దాని ఇద్దరు పిల్లలను వెంబడించాయి,  తల్లి జింక చిరుతల కంటే వేగంగా ఉంది .. కానీ పిల్ల జింకలు వేగంగా పరిగెట్ట లేకపోతున్నాయి, అప్పుడు తల్లి జింక తన ఇద్దరు పిల్లలు తప్పించుకోవడానికి తనను తాను అర్పించుకుంది.  తన బిడ్డలు సురక్షితంగా పరిగెత్తడాన్ని ఆమె ఎలా చూస్తుందో ఈ ఫోటో చూపిస్తుంది. . మీ తల్లిదండ్రులు మీ కోసం ఎన్ని త్యాగాలు చేస్తారో మీరు ఎన్నిసార్లు ఆలోచించారు? మీరు సరదాగా, నవ్వుతూ మరియు జీవితాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, వారు వాటిని ఆనందిస్తారు. పిల్లలు ఎదగడం గురించి వారి భవిషత్తు  గురించి చాలా ఆందోళన చెందుతారు పెద్దవారయ్యాక ప్రేమను పంచి కొంత సమయాన్ని వారి కోసం కేటాయిస్తే నిజమైన ప్రేమ పంచినవారు అవుతారు. * నిజమైన ప్రేమ మనం ప్రేమించే వారి కోసం అన్నీ ఇచ్చేలా చేస్తుంది.* ❤️

చమత్కార శ్లోకం

 చమత్కార శ్లోకం


ప్రభాతే కీదృశంవ్యోమ

ప్రమాణే కీదృశం వచః

ఆంధ్ర గీర్వాణ భాషాభ్యాం

ఏకమేవోత్తరం వద


ఉదయం ఆకాశం ఎలా ఉంటుంది?


ప్రమాణం చేసేటప్పుడు ఏ పదం ఉపయోగిస్తారు? 


ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఒకే పదమై ఉండాలి , అది అటు ఆంధ్ర(తెలుగు) భాషా మరియూ ఇటు సంస్కృత భాషా అయ్యుండాలి


సంస్కృతం లో లింగ, వచన, విభక్తి ఇత్యాది దోషాలు ఉండకూడదు 


ఎలా?








జవాబు 


“నీతోడు”


ప్రమాణం చేసేప్పుడు “నీతోడు” అని అనడం తెలుగు భాషలో ఉంది 


సంస్కృతంలో నీత+ఉడు=నీతోడు


అంటే తొలగిపోయిన నక్షత్రాలు కలది(“ఉడు”=నక్షత్రం) 


ఉదయం నక్షత్రాలు లేకుండా ఉన్నది ఆకాశం 


(నీతోడు వ్యోమ-రెండూ నపుంసక లింగాలే,లింగ విభక్తి వచన దోషాలు లేవు , విశేషణ విశేష్యాలు👍🏻)


ఇలా జవాబు కుదిరింది . 


ప్రభాతే వ్యోమ నీతోడు


ప్రమాణే వచః


 ఆంధ్ర భాషలో “నీతోడు”

😃


ఉడు = నక్షత్రం

 ఉడుపః=చంద్రుడు(తాటంకయుగలీభూత తపనోడుప మండలా)


ఉడుభృత్= చంద్రుడు 

ఉడుభృన్మౌలిః=శివుడు

Madagascar cuba


 

01-11-2023* *రాశి ఫలితాలు

 *01-11-2023*

*రాశి ఫలితాలు*

*సౌమ్య వాసరః బుధ వారం*

*మేషం*

వృత్తి, వ్యాపారాలలో ఊహించని నష్టాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయటా మానసిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మంద కొడిగా సాగుతాయి.

*వృషభం*

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు.

*మిధునం*

ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

*కర్కాటకం*

వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

*సింహం*

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

*కన్య*

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహా సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని సమస్యలు కలుగుతాయి.

*తుల*

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు మానుకోవాలి. వృత్తి వ్యాపారాలలో వివాదాలు చికాకు పరుస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తప్పవు.

*వృశ్చికం*

నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి

*ధనస్సు*

కొన్ని ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

*మకరం*

బంధు వర్గం వారితో అకారణ విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

*కుంభం*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

*మీనం*

సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.

🕉️

పరమేశ్వర స్తుతికి భాషా భేదాలు లేవు

🙏


పరమేశ్వర  స్తుతికి  భాషా భేదాలు లేవు


                

               ఉ:  హెడ్డున  మూను , స్కిన్నుపయి  నెంతయు  డస్టును, ఫైరు నేత్రమున్ ,


                      సైడున గ్రేటు బుల్లు , బహు చక్కని  గాంజెసు    హైరు లోపలన్ ,


                      బాడికి  హాఫెయౌచు  నలపార్వతి ,  మౌంటెను   డాటరుండ ,   ఐ


                       షుడ్డు  డివోటు ,దండములు   సోకగ  ప్రేయరు సేతు  నెప్పుడున్;


                                      ఆదిభట్ల నారాయణ  దాసుగారు.


                    బహు భాషా  కోవిదులైన  దాసుగారు  పరమేశ్వరుని  మణిప్రవాళ  శైలిలో  యీవిధంగా  నుతించారు. ఇందులో  ఆంగ్లపదాలను బహురమ్యంగా  తెలుగు పదాలకు జోడించి  తమభాషాచాతుర్యాన్ని  ప్రకటించారు.


                      సిరసున  చంద్రుడు , శరీరమునభస్మము , అగ్ని నేత్రము ,(మూడవకన్ను)  వాహనంగా నంది. తలపై గంగ , అర్ధనారీశ్వరియై పార్వతి. (హిమవంతుని పుత్రి) నేను ఒరుల నేల తలచెదను  శంకరునకే  నమస్కృతులు  చేసి  ప్రార్ధింతును.

అనిదీని భావము. 


                    ఇలా అన్సభాషాపదాలను తెలుగు పదాలతోకలిపి వ్రాయటం  శివకవులతో ప్రారంభమైనది.పాల్కురికి సోమనాధుడే

ఈవిధానమునకు ఆద్యుడు. తరువాత తరువాత తక్కిన కవులందరూ ఈపద్దతిని అనుసరిస్తూ  ఈవిధానానికి  "మణిప్రవాళశైలియని" పేరు నిర్దేశించారు.


                                                  బాగుందికదా  తరువాత  మరికొన్ని!


                                                                        స్వస్తి!🙏🙏

కన్యా దానం

 కన్యా దానం 


ఆ సమయంలో పురోహితుడు ఏం చెబుతున్నాడో చూడండి.


ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి,


ధ్రువంత ఇంద్రాగ్నిశ్చ రాష్ట్రం ధారాయతాం ధ్రువం,


ధ్రువం ధ్రువేణ హవిశా తస్త్మ్ర దేవా అధిబ్రువన్,


అయంచ బ్రహ్మణ స్పతి


దాంపత్య సామ్రాజ్యాన్ని ధరించనున్న నీకు రాజైన వరుణుడు, దేవుడైన బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని, వేదమూర్తియైన బ్రాహ్మణుడు స్థిరమైన వారుగా నిశ్చయించబడ్డారు.


పై జాబితాలో అమ్మాయి ఐదుగురికి నిశ్చయించ బడింది. ఆ జాబితాలో అసలు కాబోయే పెళ్ళికొడుకు ప్రస్తావన ఏదీ? వివాహ ప్రకరణంలో ప్రధాన హోమం సమయంలో చెప్పే ఈ శ్లోకం ఏమిటి అంటే


సోమః ప్రధమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: !


తృతీయో అగ్ని స్టే పతి: తురీయస్తే మనుష్యజ: !!


పుట్టిన ప్రతి ఆడపిల్ల మీదా ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చేవరకూ చంద్రుడు రాజ్యంచేస్తాడట. అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయంగా ఉండడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూ వుంటారు కూడా. ఏ చంద్రుడు మనస్సుని దృఢం చేస్తుంటాడో ఆ కారణంగా తండ్రి, మామయ్య, బాబాయి …. ఇలా అందరినీ, ఇంటినీ, పొరుగింటినీ కూడా ఇట్టే ఆకర్షించ గలుగుతారు ఈ కాలంలో. ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకూ ఆ పిల్లని చంద్రసాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు. గంధర్వుడు లావణ్యానికి అధినేత కాబట్టి ఆ పిల్లకి అందాన్ని కలిగిస్తాడు. ఆడపిల్లలలో నిజమయిన అందం (ఏ విధమైన దుర్భావనకూ లేని అందం) ఆరు నుండి పదేళ్ళ వరకూ బాగా ఉంటుంది. ఇక 11 నుండి 15 యేళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగా స్వీకరిస్తాడు. అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామగుణాన్ని 11 వ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు.



అగ్నిర్వై కామకారకః –


శరీరంలో ఆమెకి అగ్నిని, కామగుణాన్ని ప్రవేశపెడతాడు. ఆకర్షణీయతని, మనస్సుని చంద్రుడు, లావణ్యాన్ని గంధర్వుడు ప్రవేశపెట్టాక, ఆమెలో కామగుణాన్ని అగ్ని ప్రవేశ పెడతాడు. 12-15 వయసుగల అమ్మాయిలు రజస్వ్వల కావడానికి కారణం ఇదే. ఇపుడామె వివాహానికి యోగ్యురాలు అయింది. అందుకనే వీరందరూ అంగీకరిస్తేనే పెళ్లి.



చంద్ర సాక్షిగా గంధర్వుడు, గంధర్వ సాక్షిగా అగ్ని, అగ్ని సాక్షిగా వరుడు ఈమెని గ్రహిస్తారు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం. వరుడు ఇంకా ఈమెని అగ్నిసాక్షిగా ధనాన్ని, పుత్రులను కూడా ఇచ్చాడు అని వరుడు అగ్నికి నమస్కరిస్తాడు. తనకి అభివృద్ధికి కాబోయే సంపద అంతా ఈమె ఇల్లాలుగా ఇంటి బాధ్యత చేపట్టాక వస్తుంది అని చెబుతుంది. అంటే మొదటి ఐదేళ్ళు చంద్రుడు అమ్మాయి బాధ్యత తీసుకుంటున్నాడు, తరువాత గంధర్వులు తీసుకుంటున్నారు, అటుపై అగ్ని దేవుని బాధ్యత అందుకే అగ్ని సాక్షిగా నీ వివాహం ఆయన తన బాధ్యత నీకు అప్పగిస్తున్నాడు. ఇది ఈ మంత్రార్థం. వీరి అందరికీ దంపతులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధాన హోమం చేస్తారు.


వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు.


నిశ్చితార్ధంలో చెప్పినా ఇక్కడ బ్రహ్మముడి వేసి చెప్పినా


‘ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి:


ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ ….


అని దీవిస్తారు. అంటే దాంపత్యసామ్రాజ్యాన్ని అనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి.


వీళ్ళ దాంపత్యం నిత్యనూతనంగా నిశ్చలంగా ఆనందమయంగా ఎప్పటికీ కలిసి ఉండాలని దేవతల అండగా ఉండాలని దీవిస్తారు. ప్రతీ దానికీ ఎంతో అందమైన అంతరార్థం వుంటుంది, సనాతనధర్మంలో.

సుభాషితమ్

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం*


*_సంసారకూప మతిఘోర మగాధమూలం_౹*

*_సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య_౹*

*_దీనస్య దేవ కృపయా శరణాగతస్య_౹*

*_లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్_౹౹*........ 


_*శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్ - 05*_


*ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*..….


🧘‍♂️🙏🪷 ✍️🙏

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?*

 *🔥పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?*

🔴🟠🔴🟡🔴🟠

🔴🟡🔴🟠🔴🟡

👉ఇవి ఋత్విక్కులు చేసేయజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు. అవి ఏమిటి?


1. దేవ యజ్ఞం


పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు.

వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.


2. పితృ యజ్ఞం


మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.


3. భూత యజ్ఞం


గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి, కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూత

దయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా

ఆహారం వెయ్యాలి. సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.


4. మనుష్య యజ్ఞం


*మన పెద్దలు అతిధి దేవో భవ*  అన్నారు.


అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా

ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మనకే విషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో

సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.


5. బ్రహ్మ యజ్ఞం


ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి

వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి

చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి. ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం,

శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస

వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.


మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.

🔴🟠🔴🟡🔴🟠🟠🔴🟡🔴🟠🔴

పుణ్య ధరిత్రిపై

 " పుణ్య ధరిత్రిపై భారతీయ సంస్కృతి, సనాతన ధార్మిక సుసాంప్రదాయ జీవన మార్గ నిత్య సుచైతన్య స్ఫూర్తి "



సృష్టిలో అద్భుతమై, మహత్తరమై, మహోన్నతమై వెలుగొందు జంబూద్వీపం ! 


అందు భరతఖండమనెడి పవిత్ర భూమి, అపౌరుషేయమై వెలసిన వేద సంపదకు నెలవు !


సకల విశ్వ జీవజాలానికి నిత్య సుచైతన్య దివ్య దృక్పథమై అనాదిగా నిలచిన భారతీయ సనాతన ధార్మిక దార్శనికత !


నిత్య విశ్వ సురక్షా మార్గగామిగ దేదీప్యమానమై వెలుగొందు సకల ఓషధీ సంపదతో అలరారే పుణ్య భూమి !


విశ్వ శ్రేయోమార్గాన అనునిత్యం ఇచట కానవచ్చెడి సముచిత దివ్య సురక్షా చైతన్య దీప్తి !


భారతీయ సంస్కృతీ ప్రాభవం,  సహస్రాబ్దుల పుణ్య చరిత గల సుసంస్కార సన్మైత్రీ భావుకతతో వెలుగొందు దివ్య భూమిక !


విశ్వ మానవాళి నిత్య సత్య సుచైతన్య సమైక్య స్ఫూర్తితో సకల విశ్వ జీవ సంరక్షణకై నడుంకట్టి నడవాల్సిన ఆవశ్యకత !


" సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై ! "


' ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ' !


" సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు !మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! "


' ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ' !!


రచన : గుళ్లపల్లి ఆంజనేయులు


మొబైల్ ఫోన్ నెంబర్స్ : 9848369618 & 7901238168

మనస్సుకి చాంచల్య స్థితి

 శ్లోకం:☝️

*స యథా శకునిస్సూత్రేణ*

   *ప్రబద్ధో దిశన్దిశమ్పతి-*

*త్వాన్యత్రాయతనమలబ్ధ్వా*

   *బన్ధనమేవోపశ్రయతే l*

 _ఏవమేవ ఖలు సోమ్య!_

   *తన్మనో దిశన్దిశమ్పతి-*

*త్వాన్యత్రాయతనమలబ్ధ్వా*

   *ప్రాణమేవోపశ్రయతే హి*

*ప్రాణబన్ధనం మన ఇతి l*

    - చాందోగ్యోపనిషత్తు


భావం: ఎలా అయితే త్రాటితో కట్టబడ్డ పక్షి ఎక్కడ తిరిగినా తగిన ఆశ్రయం లభించక తిరిగి పంజరానికే వచ్చి చేరుతుందో, ఓ సౌమ్యా! అదే విధంగా మనస్సు కూడా ఈ శరీరంలో ప్రాణంతో బంధింపబడి ఉండడం వల్ల ఎక్కడకు వెళ్లినా తగిన ఆశ్రయం లభించక తిరిగి తిరిగి ప్రాణాన్నే ఆశ్రయిస్తోంది. మనస్సుకి చాంచల్య స్థితి తప్పేది ప్రాణంలో లీనం కావడం వల్లనే.🙏

పంచాంగం 01.11.2023 Wednesday,

 ఈ రోజు పంచాంగం 01.11.2023  Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: చతుర్ధి తిధి సౌమ్య వాసర: మృగశిర నక్షత్రం పరిఘ యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


చవితి రాత్రి 09:24 వరకు.

మృగశిర  రా.తె  04:36 వరకు .

సూర్యోదయం : 06:18

సూర్యాస్తమయం : 05:41

వర్జ్యం : రాత్రి 09:43 నుండి 11:21 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:37 నుండి 12:22 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం   12:00  నుండి 01:30 వరకు 


యమగండం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

పూజాకార్యక్రమాల సంకల్పము

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 01.11..2023

బుధ వారం (సౌమ్య వాసరే) 

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ ు సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే చతుర్ధ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే చతుర్ధ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.01

సూ.అ.5.27

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం చవితి రా.10.42 వరకు. 

బుధ వారం. 

నక్షత్రం రోహిణి ఉ.6.14 వరకు. 


అమృతం రా.9.51ల 11.39 వరకు. 

దుర్ముహూర్తం ప. 11.21 ల 12.07 వరకు. 

వర్జ్యం ప. 11.59 ల‌ 1.37 వరకు .

యోగం పరిఘ సా.5.08 వరకు.

కరణం బవ ప.10.44 వరకు.

కరణం బాలవ రా.10.42 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం ప. 12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. .

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ చవితి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

Aghoraa

 https://youtube.com/shorts/m_p6TMme6Ug?si=o94E06m5nh_cuO7n


దేవుడంటే ఏంటి

 *దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది?* 


అని ... చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. " అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని .

మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు... మనం వాడే మాట అదే!.


కళ్లు పోగొట్టడానికి దేవుడేమీ శాడిస్ట్‌ కాదు గదా !.

మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.


తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.


పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.


దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ. రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.


ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.


పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి. మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.


అదే సమయంలొ మూఢ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....


*1. *మూలవిరాట్* 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.


*2. ప్రదక్షిణ* 🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


*3. ఆభరణాలతో దర్శనం* 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


*4. కొబ్బరి కాయ* 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


*5.మంత్రాలు* 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.


*6. *గర్భగుడి* 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


*7.*అభిషేకం* 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


*8. *హారతి* 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. 


*9. *తీర్థం* 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._

  *సర్వేజనాః సుఖినోభవంతు*

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


.

పరమధర్మజ్ఞుడైన శర్యాతి ఈ మాటలకు కుమిలిపోయాడు. దారుణంగా విలపించాడు.

గత్యంతరం లేదన్నట్టు నారచీరలు తెప్పించి అందించాడు. సుకన్య వాటిని సంతోషంగా స్వీకరించి కళ్ళకు

అద్దుకుంది. వొంటిమీది నగలన్నీ తీసేసింది. వాలుజడ ముడిచుట్టింది. నారచీరలు ధరించింది.

పట్టుపుట్టాలూ రత్నాభరణాలూ తండ్రికి అందించింది. శర్యాతి ముఖం పాలిపోయింది. నోటమాట

రాలేదు. అడుగుముందుకి కదలలేదు. శిలాప్రతిమలా అలా నిలబడిపోయాడు.

అంతఃపురకాంతలు ఈ దృశ్యాన్ని చూసి హృదయవిదారకంగా విలపించారు. ఓదార్చేందుకు

ఎవరూ ధైర్యం చెయ్యలేకపోయారు. విలపించి విలపించి అలిసిపోయిన రాజునూ రాజకాంతలనూ కడకు

మంత్రులు ఓదార్చారు. ఎట్టకేలకు తేరుకుని గుండె చిక్కబట్టుకుని అందరూ రాజధానికి బయలుదేరారు.

రాజపుత్రిని ఒక మునిరాజుకు సమర్పించి బరువెక్కిన గుండెలతో మెల్లగా రాజధానికి చేరుకున్నారు.

(అధ్యాయం-3, శ్లోకాలు- 640)


సుకన్యాదేవి పూర్తిగా పతిసేవలో నిమగ్నురాలయ్యింది. ధర్మతత్పరురాలై అగ్నులను అర్చిస్తోంది.

కందమూల ఫలాలను ఏరితెచ్చి భర్తకు అందిస్తోంది. ఉదయమే వేడినీళ్ళతో స్నానం చేయించి,

వల్కలాలు ధరింపజేసి శుభ్రప్రదేశంలో ఆసనంపై కూర్చోబెట్టి, దర్భలూ కమండలూదకాలూ మొదలైన

పూజా సామగ్రిని అందించి దగ్గర నిలబడి నిత్యకర్మలు చేయిస్తోంది. అడవిలో గాలించి నీవారధాన్యం

తెచ్చి ఎండబోసి, దంచి, చెరిగి, రుచిగా వండి పెడుతోంది. పక్వఫలాలను భుజింపజేస్తోంది. భోజనం

అయ్యాక ఆచమనానికి నీళ్ళు అందించి, కాళ్ళూ చేతులూ కడిగి, తాంబూలం అందించి, తీసుకువచ్చి

శుభ్రాస్తరణంమీద విశ్రమింపజేస్తోంది. వింజామర వీస్తోంది. అటుపైని పతి అనుమతి తీసుకుని తాను

వెళ్ళి శరీర సాధనంగా రెండు మెతుకులో రెండు ఫలాలో నోట్లోవేసుకుంటోంది. మళ్ళీ వచ్చి సన్నిధిలో

'కూర్చుని ఏమి ఆజ్ఞ నాథా! అని వినయంగా అడుగుతోంది. కాళ్ళు వొత్తనా, మంచినీళ్ళు కావాలా -

ఇత్యాదిగా అవసరాలు అడిగి తెలుసుకుంటోంది

భక్తిసుధ

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*_సంసారకూప మతిఘోర మగాధమూలం_౹*

*_సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య_౹*

*_దీనస్య దేవ కృపయా శరణాగతస్య_౹*

*_లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్_౹౹*


_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్ - 05_


ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని. కావున, *ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము*