18, అక్టోబర్ 2020, ఆదివారం

బాధ్యత



వాత్సల్య గోదావరి*

 *వాత్సల్య గోదావరి*


 రచన: శ్రీమతి మణి వడ్లమాని


ఆషాడం చివరన,తొలకరి జల్లులు,కుంభవృష్టిగా   మారి ఆకాశం  చిల్లుపడ్డట్టుగా కుండపోతగా  వర్షం కురుస్తోంది.


వీధి వసారాలో సుబ్బుశాస్త్రిభోరున పడుతున్న వానను చూస్తూ,మనసులోబావురుమనుకుంటూ పీట మీద కూర్చొని శివ పంచాక్షరీ జపం చేస్తున్నాడు.పెదాలుమాత్రమేజపిస్తున్నాయి.చూపు మాత్రంవీధివైపు ఉంది. పంచాంగం ముందు పెట్టు కొని ఆరోజు తిది,వార,నక్షత్రాలు తో సహా సిద్ధంగాఉన్నాడు.అలాగే ఎవరన్నా వచ్చిపిలుస్తారేమోఅనివడికిన జంద్యాలు కూడా పక్కనేపెట్టుకున్నాడు


‘శాస్త్రి గారు’ అనే పిలుపు కోసం చెవులు రిక్కించి ఉంచాడు.


అబ్బే ఏది ఎవరూ  రాందే?


నిరాశగా  మళ్ళి పంచాక్షరీ జపం చేస్తున్నాడు. మనసులో మటుకు వరద గోదావరిలా ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి


ఈవర్షం కనక లేకపోతెరోజూ  ఈ పాటికల్లాగోదారొడ్డున ఉన్న  కోటిలింగాల  రేవుదగ్గర  ఉండేవాడు. ఉదయాన్నే వెళ్లి గోదావరి లో ఓ నాలుగు మునకలు వేసి  సంధ్యావందనం అక్కడే కానిచ్చి, ఈశ్వరుడి దర్శనం చేసుకొని,  ఆ పావంచాల అంచున కూర్చొని  ఎక్కడెక్కడి నుంచోపరమపావని అయిన  ఈ  గోదావరి లో స్నానం చెయ్యడానికి  వచ్చిన వాళ్ళ చేత సంకల్పం చెప్పించివాళ్ళు ఇచ్చిన తృణమో పణమో  తీసుకొని  ఆరోజు కి సరిపడ సంబారాలు కొనుక్కొని  ఇంటికి వెళ్ళే వాడు.ఇది రోజూ అతని దినచర్య. భార్య వర్ధనమ్మ ఎంతో ఒబ్బిడిగా సంసారం లాక్కొని వస్తోంది , లేదు,సరిపోదు అనకుండా తెచ్చిన వాటితోనే రుచికరమైన వంట చేసి భర్తకు పెట్టేది.


అందుకే ఎప్పుడు సుబ్బుశాస్త్రి అనేవాడు “వర్ధనం,నీ చేతి లో ఏదో మంత్రదండం ఉంది సుమా!” అని. ఆ తృప్తి తోనే ఆవిడకి కడుపు నిండి పోయేది.


కాని  నాలుగు రోజులనుంచి కురుస్తున్న ఈ కుంభవృష్టి  వల్ల యాత్రికులు ఎవరూ రావటం లేదు. ఇంచుమించుగా భార్యభర్తలిద్దరూ  అర్ధాకలితోనే కాలం వెళ్ళదీస్తున్నారు


 పోనీ,ఎవరైనా,ఆభ్దికాలకి భోక్తలుగా పిలుస్తున్నారా? అంటే అది లేదు. అయినా ఇళ్ళలో చేస్తేనే కదా  పిలిచేది అది కాస్తా మఠం  లోనే  కానిచ్చేస్తుంటే, ఇహ  చేసేదేముంది? అనుకుంటూ ‘ఆ గోదావరి తల్లినే నమ్ముకున్నాను. పుణ్యనదిలో స్నానాల కోసం ఎవరైనా రాకపోతారా? సంకల్పం చెప్పక పోతానా? నాలుగు రూపాయలు తెచ్చుకురానా?” అని ఆశగా చూస్తున్నాడు.


అందరిలా తను పెద్దగా పండితుడు కాదు,పూజలు ,పెళ్ళిళ్ళు చేయడానికి.ఏదో  బతుకు తెరువు కోసం, ఆభ్దికాలకి,భోక్తలుగా వెళ్ళడం, లేదా ఎవరైనా గ్రహ పూజలు చేస్తే ఆ దోష నివారణార్ధం దానం అందుకోవడం, అలా వాటితో వచ్చిన సొమ్ము తోనే  బ్రతుకును  వెళ్లదీసుకువస్తున్నాను.పిత్రార్జితం గ ఉన్న ఈ పెంకుటిల్లే.కాస్త నీడ నిస్తోంది.అది కాస్తశిధిలావస్థలోఉంది.ఉన్న ఈ ఆధారం  కూడా పోతె,ఇక నా దారి  నువ్వేతల్లీ, అనిగోదావరి వైపు దిగులుగాచూస్తున్నాడు.


నాలుగు రోజులనుంచి కడుపునిండా తిండి సరిగాలేదు,నిన్న రాత్రి తిన్న ఉప్పుడుపిండి ఏ మూలకు సరిపోతోంది. నీరసంగా ఉంది. పాపం నేనే ఇలా ఉంటెవర్ధనం  ఎలా తట్టుకుంటుందిఅనుకుంటూ పెరటివైపుకి చూసాడు. అక్కడ వసారాలో కూర్చొని వత్తులు చేసుకుంటూ ,గీతగోవిందం పాడుకుంటోంది.


జలజలా కురుస్తున్న వానని చూస్తూ “ఓ ఆకాశగంగాఎంతో ఉత్సాహంగా పైనుంచి కిందకి దూకుతున్నావు,ఆ గోదారేమోఅంతకంటే ఆవేశంతో నిన్నురమ్మనమని పిలుస్తోంది. మీ ఆట బాగానే ఉంది. అర్భకుడిని తల్లీ  మీ ఇద్దరిమధ్యలో  నన్ను బలి చెయ్యకండి.కాస్త  ఈదీనుడిని కరుణించి శాంతించండి” అని మనసులోనే వేడుకుంటున్నాడు.


భర్త ఆశగా చూసే చూపుని తప్పించుకుంటూ పెరటి వసారాలో వత్తులు చేస్తున్నవర్ధనమ్మ ఆవేదనగా తలపోస్తోంది. ఏదైనా వండి పెడదామన్నా, ఇంట్లో బొత్తిగా సరకులు  లేవు.ఉన్న రవ్వతో నిన్న రాత్రి కాసింత ఉప్పుడుపిండి చేసేసింది.ఈ పూట  ఏదైనా దొరికేతే పర్వాలేదు. లేకపోతె ఇహ ఈ పూట పస్తే. అని  ఏదోలెక్కలు వేసుకుంటూ అప్పుడే  గంట పదకొండు దాటి ఉండచ్చు ఆనుకుంది.


ఇంతలో   ముందు  వసారాలో ఏదో అలికిడి వినిపించింది. గభాల్న లేచి చెంగు దులుపుకుంటూ  వెళ్ళింది.  ఆ వానలో కళ్ళకి ఏమి కనబడటం లేదు. ఎవరా అనిఆరాగా తొంగి తొంగి చూసింది. “సుబ్బుశాస్త్రి  గారి ఇల్లు ఇదేనా?  అంటూ ఒక వ్యక్తి అడుగుతూ లోపలకి వచ్చారు. “అవునండి,” అని సమాధానం ఇచ్చే లోపల ఒకఆడావిడా మరో  మగమనిషి కూడా లోపలికి వచ్చారు.


ఈ హడావుడి అంతా విన్న సుబ్బుశాస్త్రి కూడా  లేచి నిలబడ్డాడు. వాళ్ళు తెచ్చిన గొడుగులనువసారా మెట్ల మీద పెట్టారు. వాటి లోంచి చుక్కా చుక్కా నీరుమెట్ల మీద నుంచి కిందకిజారుతున్నాయి.వచ్చిన వాళ్ళ చేతులలోఏవో సంచులు కూడా ఉన్నాయి.


వాళ్ళలో  ముందు గా మాట్లాడిన అతను. “వీళ్ళు మా అక్క,బావగారు.  కెనడాలో ఉంటారు. ఇవాళ మా బావగారి తండ్రి తిధి , గోదావరి ఒడ్డున పెట్టుకుందామని  వచ్చారు, మీ గురించి అవధాని గారు చెప్పారు కాని ఈ వానవల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక  స్వయం పాకం ఇచ్చేద్దాము అనుకుంటున్నాము”  అని అన్నాడు.


దానికి  సుబ్బుశాస్త్రి“ అబ్బే, నాకు ఏమిఫర్వాలేదు. మీ బావగారుఈ వానలో గోదారి ఒడ్డున కూర్చొని చెయ్యగలరా?”  అని సందేహం వెలిబుచ్చాడు.


“ఫర్వాలేదండి,వస్తాము… నేను కూర్చొని చేస్తాను” అని అతని బావగారు అన్నాడు. తెచ్చిన సంబారాలు అన్నీ సుబ్బుశాస్త్రి చేతికిచ్చారు.అవి అందుకొని “ఓ పని చేద్దాము.మా ఆవిడ ఇంత పెసరపప్పు,పరమాన్నము చేసి పెడుతుంది.మీ తండ్రి గారి ప్రసాదం తిన్న తృప్తి కూడా ఉంటుంది. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా” అని అన్నాడు.


“అయ్యో ఎంత మాట! అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది” అంటూ ఎంతగానో సంతోష పడ్డారు. నలుగురూ గొడుగులుతీసుకొని రేవు దగ్గరకి వెళ్లారు.


వాళ్ళు వచ్చే లోపల వర్ధనమ్మ చక చకా,రెండు కూరలు, పప్పు, పరమాన్నంతో భోజనం వండిపెట్టి ఉంచింది. సరిగ్గా అపరాహ్న వేళకి వాళ్ళు కూడా కార్యక్రమం ముగించుకొని వచ్చారు.పెరట్లో ఉన్న అరటి ఆకులు కోసి  విస్తళ్ళు వేసి భోజనాలు వడ్డించింది.


భోజన కార్య క్రమం అయ్యాక “ అయ్యా! రండి,తమకి  తాంబూలం  ఇస్తాను” అని అన్నారు కెనడా నుంచి వచ్చిన శ్రీపతి శర్మగారు.


సుబ్బుశాస్త్రిని, వర్ధనమ్మని ఇద్దరినీ పక్కపక్కనే నిలుచోమని వాళ్ళ తల్లితండ్రుల జ్ఞాపకార్థం గా ఇద్దరికీ చీరా,పంచెల చాపు  తో పాటుగా  భారీగా  తాంబూలం కూడా ముట్ట చెప్పారు ఆ దంపతులు.


ఈ కార్య క్రమం అంతా అయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది.ఆ బావమరది వెళుతూ “తొందరలోనేపుష్కరాలు కూడా వస్తున్నాయి కదా శాస్త్రి గారు. అప్పుడు మళ్ళి వస్తాము. అన్నీ మీరే చెయ్యాలి” అని అన్నాడు.


“అయ్యో తప్పకుండా చేస్తాను బాబు” అంటూ ఎంతో నమ్రతగా చెప్పాడు.

www.bestsocialteacher.com 

అప్పుడు శ్రీపతిశర్మగారు,బావమరది తో అంటున్నారు’ చూడు భాస్కర్, ఇంత పరమ పవిత్రమైన కార్యం చేసే వీళ్ళ జీవితాలు చూస్తే నాకు చాల భాదగా ఉంది. అయ్యో, ఏమిటిది? శనిదానాలు పట్టే బ్రాహ్మలు, కర్మలు జరిపించే వాళ్ళు శుభకార్యాలు చెయ్యకూడదుట కదా, పైగా అందరిలో చులకనగా కూడా చూస్తారట. ఇందాక శాస్త్రి గారు అంటుంటే విన్నాను. ఆర్ధికంగా కూడా వీళ్ళు చాలా  బలహీనులు.


 చాలీ చాలని, బతుకులు, ఎలాగడుస్తుంది,మరి వీళ్ళని ఆదుకునేది ఎవరు?అందరికి లక్ష్మీదేవి ప్రసన్నం కావాలని  ఆశీర్వదించే  వీళ్ళింట మాత్రం ఎప్పుడూ దరిద్రదేవత తాండవం చేస్తోంది. మనం ఏదైనా చెయ్యలేమా? వాళ్ళకి కనీసం కడుపునిండా భోజనం చేసే అవకాశం కూడా కల్పించాలేమా? అనిపించింది.అప్పుడే  నాకు ఈ ఆలోచనకలిగింది.సుబ్బుశాస్త్రి గారి లాంటి వాళ్ళకి మనము సాయం చేయాలి.దానికి ఒక చక్కటిప్రణాళిక వేసుకొని  ఒక ట్రస్ట్గా ఏర్పడదాం .వీళ్ళల్లా ఆర్ధికంగా వెనకబడిన వాళ్ళకి మనం చేయగలిగినంత సాయం చేద్దాము. దానికి  నీసహయం కావాలి,నువ్వే కాదు సాయం చెయ్యాలన్న సంకల్పం,ఉద్దేశ్యం ఉన్న,ఎవరైనా సరే.వాళ్ళందరనీమన ప్రాజెక్ట్ ద్వారా కూడగట్టుకొని,ఈమంచిపనిని ఆరంభిద్దాము” అనిఆవేశంగా అన్నారు.           ఆయన సుబ్బు శాస్త్రిని చూసి బాగా కదిలిపోయారు అనుకున్నాడు భాస్కర్.


దానికి శ్రీపతిగారి భార్య,విజయ “అవును తప్పకుండా చేద్దాము నేను నా స్నేహితులకి చెబుతాను. ఒకమూడు నెలల లోఅన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి వీళ్ళకి సాయం అందేలా చూద్దాము”అనిఆవిడ కూడా భర్త నిసమర్థించారు.


“మనదేశం, సంస్కృతీ,నదులు,వేదాలు అంటూ గొప్పగా చెప్పుకోవడమే కాదు,వాటిని రక్షించి ముందు తరాలకి ఇవ్వడం కూడా  మనబాధ్యత.”


“తప్పకుండా బావగారు, ఈ పవిత్ర గోదావరి తీరాన  ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి.అందరికీ మనం సాయం చేయలేకపోయినా,  కొందరికైనా  చేద్దాము.ఒక ముందడగువేసాము. ఆ అడుగేమనలని ఆపకుండా సాగిపోయేలా చేస్తుంది.నేను సైతం ఈ పవిత్రమైన కార్యం లోభాగం పంచుకుంటాను”.అని భాస్కర్ కూడాశ్రీపతి,విజయలతో ఏకీభవిస్తూ  అన్నాడు.


ఇవేమీ తెలియని శాస్త్రి, వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ “చూసావా వర్ధనం ఈ వేళ ఆదేవుడు పంపినట్లు గా వాళ్ళు ఇంత కుంభవృష్టి లోరావడం తండ్రికి ఆబ్దికంపెట్టి తర్పణాలు వదిలివెళ్ళడం మాములువిషయం కాదు. అంతా  మనం నమ్ముకున్న  ఆ తల్లి గోదావరి వల్లే.అందులోను ఎక్కడో కెనడా నుంచి వచ్చారుట.ఈ అఖండ గోదావరి దర్శనం కోసం,నిజంగా ఆ తల్లి నీడలో ఉండటం నిజంగా మనం  చేసుకున్న పుణ్యమే. ” అని  తాంబూలం లో ఉన్న నోట్లను లెక్కపెట్టుకొని  నిర్ఘాంత పోయాడు. అక్షరాలా పదివేల రూపాయలు.ఉన్నాయి.           “వర్ధనం ఏమిటో నాకు నమ్మబుద్ధి కావటం లేదు, నువ్వుఓ సారి లెక్కపెట్టి  చూడు…” అన్నాడు ఖంగారుపడుతూ. ఆవిడ కూడా మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టింది.“అవును,అచ్చంగా పదివేల రూపాయలే, యెంత దొడ్డ మనసు వాళ్లది” అని సంతోషంగాఅంటూ వాళ్ళు పెట్టిన చీర చూసుకుంటోంది


“అవును ఈ వేళ నిజంగా  చాల సుదినం.నా వొంట్లో శక్తుడిగిపోయినా  పర్వాలేదు తండ్రీ, కొంత కాలం దాన్ని మటుకు పునిస్త్రీ  గానే ఉంచమనికోరుతున్నాను  ఎందుకు అనుకుంటున్నావేమో, అదిఅలా ఐదో తనంతో ఉంటె అందరూ దాన్నిముత్తైదువ గ  ఆదరిస్తారు. అప్పుడు దానితిండికి బట్టకి కొదవ లేకుండా ఉంటుంది అని”. సుబ్బుశాస్త్రి మనసులో అనుకున్నాడు.


ఉరకలేస్తూ ఉప్పొంగు తున్న గోదావరిని చూస్తూ “తల్లీ,ఏదోచాపల్యంతో నేనన్న మాటలు పట్టించుకోకుండా, కన్నతల్లిలా వాత్సల్యం  చూపించి నన్ను  కరుణించావు.” అంటూ భక్తిగా నమస్కరించాడు, సుబ్బుశాస్త్రి.


గోదావరి నిండుగా  నవ్వి,నేనున్నానని  ప్రేమగా నిమిరినట్లు అనిపించింది సుబ్బుశాస్త్రి కి.


*సేకరణ: కెయస్వీ కృష్ణారెడ్డి, 9492146689*

*ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత* *పాఠశాల గంటి, కొత్తపేట *మండలం తూర్పుగోదావరి.*

www.bestsocialteacher.com 

********

_*Don't edit this story. Don't remove the writer's n collector's details. It is the only respect we can pay to them. If you wish Forward to all.*_

🙏💐🙏💐🙏💐🙏

 గ్రంథాలు - వాటి గురించి విశేషాలు .

మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు . నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను .

* బృహద్యంత్ర సర్వస్వము -

ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు

ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.

ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.

అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.

* ఆగతత్వలహరీ -

ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .

* అవతత్వ ప్రకరణం -

ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు .

* అండ కౌస్తభం -

ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర

జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.

* అంశు బోధిని -

ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.

* ఆకాశ తంత్రం -

ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.

* ఋక్ హృదయ తంత్రం -

ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.

* ఔషధీ కల్పం -

ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.

* కరక ప్రకరణము -

ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.

* కర్మాబ్దిసారము -

ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.

* కౌముదీ -

ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.

* ఖేట సర్వస్వము -

ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.

* ధాతు సర్వస్వము -

ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి

లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు .

* ధూమ ప్రకరణం -

ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.

* నామార్థ కల్పం -

ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.

* ప్రపంచ లహరీ -

ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.

* బ్రహ్మాండ సారం -

ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.

* మేఘోత్పత్తి ప్రకరణం -

ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.

* లోక సంగ్రహము -

ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.

* లోహ తంత్రము -

ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.

* వాయుతత్వ ప్రకరణము -

ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు.

* వైశ్వనర తంత్రము -

ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.

* శక్తి తంత్రము -

ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా .

* శుద్ద విద్యాకల్పం -

ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.

* సమరాంగణ సూత్రధారము -

ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.

పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము , యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ, గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో 1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది. ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి.


Collected....

భక్తపోతన

 *వందేమాతరం*

                                                                                                                                                                                            *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1931 (౧౯౩౧)*


*10.1-924-*


*క. రాజీవాక్షునిచే నొక*

*రాజీవముభంగి శైలరాజము మెఱసెన్;* 

*రాజేంద్ర! మీఁద మధుకర*

*రాజి క్రియన్ మేఘరాజి రాజిల్లెఁ గడున్.* 🌺



*_భావము: ఓ పరీక్షిన్మహారాజా! కలువలవంటి కన్నులు కల ఆ శ్రీకృష్ణుని చేతిలో అమరియున్న ఆ గోవర్ధనగిరి ఒక తామర పువ్వు వలె ప్రకాశించినది. ఆ పర్వతము పైన నడయాడుతున్న మేఘమాలలు తుమ్మెదల గుంపులా యన్నట్లు తోచుచున్నవి._* 🙏



*_Meaning: O king Parikshit! The mountain held high in the hands of Lotus-eyed Sri Krishna appeared and shone like a lotus and the array of clouds hovering above the mountain appeared like a swarm of bees._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

నవరాత్రులు


నవరాత్రులు - బాలాత్రిపురసుందరీదేవి


అమ్మవారిని మనము రెండవ రోజున బాలాత్రిపురసుందరీదేవిగా ఆరాధన చేసి ఆ తల్లి కృపకు పాత్రులం అవుతాము. అసలు ఈ బాల అంటేనే లలితమ్మ యొక్క ప్రాణశక్తి, జ్ఞ్యానశక్తి - శ్యామలాదేవి, క్రియాశక్తి - వారాహీదేవి. ఈ బాలాత్రిపురసుందరి ప్రాణశక్తి కాబట్టి లలితమ్మకు మరియు బాలాత్రిపురసుందరికి భేదం లేదు. ఇద్దరూ ఒక్కటే. ఆ తల్లి మహాశక్తి సంపన్నురాలు. పైగా, బాలారూపంలో ఆ తల్లి మనలను త్వరగా అనుగ్రహిస్తుంది. ఇప్పటి వరకు అమ్మను మనము అమ్మా!! అని పిలిచినప్పుడు...ఆ తల్లే చుబుకం పట్టుకుని ఒక పసిపిల్లను బుజ్జగించి బువ్వ తినిపించిన రీతిగా ఆ తల్లి చుబుకం పట్టుకుంటే మరి ఎంత అదృష్టం?? అలాంటి అదృష్టం ఆ హిమవంతునికి కలిగింది. నిజానికి ప్రతి ఇంట్లో తిరుగాడుతున్న 10 సం: లోపు పిల్ల ఆ బాలా రూపమే. ఈ బాలాత్రిపురసుందరిని ఆరాధించిన వారికి వాక్శుద్ధి, వాక్సిద్ధి కలుగుతాయి. ఈ తల్లి శ్రీచక్రంలోని చిన్మయానంద బిందువులో కొలువై ఉంటుంది. నిజానికి బాలారూపం అనగానే ఆ శ్రీచక్రంలో కొలువై ఉన్న తల్లే కాదు. ఆ తల్లి ఎక్కడో లేదు. మన యొక్క శరీరంలోనే ఉంది. మన శరీరంలో కూడా చంద్రకాంతి, సూర్యకాంతి, అగ్నికాంతి ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన చక్రాలలో - అగ్నికాంతి, ఆజ్ఞా, విశుద్ధి చక్రాలలో - చంద్రకాంతి, అనాహిత, మణిపూరాబ్జా చక్రాలలో - సూర్య కాంతి తో ఉంటాయి. అవి ఒక త్రికోణంగా ఏర్పడి ఈ మూడింటిలో ఉండే చిత్ శక్తి రూపమే బాలాత్రిపురసుందరి. 


బాల అంటే చిన్నపిల్ల. మరి త్రిపుర అనగా 3 పురాణాలు. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. శరీరంలో ఉండే 3 నాడులు - పింగళ, సుషుమ్న నాడులు. సత్వ, రజో, తమో గుణాలు. అలాగే త్రయి వేదాలు - ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ. వీటన్నిటి గుర్తుగా ఆ తల్లి త్రిపుర. అందుకే ఆ తల్లి బాలాత్రిపురసుందరి. తల్లి మంచి అరుణ వర్ణంలో ఉంటుంది. మన యొక్క సహస్రార చక్రంలో కల్హారము అనే కమలం పైన కూర్చుని ఉంటుంది. ఈ తల్లి 9 సం: వయస్సు ఉన్న చిన్న పిల్లగా ముద్దులు మూటకడుతూ పట్టు పరికిణీ వేసుకుని చేతులకు గాజులు, కాళ్ళకి అందియలు పెట్టుకుని ఎంతో అందంగా చూసి చూడగానే బుగ్గలు పుణికిపుచ్చుకుని ముద్దు గొలిపే రూపంలో ఈ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లి తన నాలుగు చేతులలో - పై రెండు చేతులలో పుస్తకం, అక్షమాల పట్టుకుని అలాగే క్రింది రెండు చేతులలో అభయహస్తం, వరదహస్తం పట్టుకుని మనలను అనుగ్రహించి వాక్సిద్ధిని, బుద్ధిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే ఈ బాలోపాసనను ముఖ్య ప్రాణోపాసన అని కూడా అంటారు. ఎంతో మంది ఈ బాలను ఉపాసన చేసి తరించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ రోజు మనము శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం. మనకు కూడా అలాంటి ఉపాసనా శక్తిని అనుగ్రహించమని ఆ తల్లిని కొలిచి సాక్షాత్కారం పొందిన మహనీయులను వేడుకుందాము. మనకి ఈ దేవీనవరాత్రులలో సువాసినీ పూజ మరియు బాలపూజ ముఖ్యంగా చెప్పబడ్డాయి. 3 సం: వయసు నుండి 10 సం: బాలిక వరకు మనము బాలపూజ చేసి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. 2 సం: కుమారి అని 3 సం: త్రిమూర్తి అని, 4 సం: కళ్యాణి అని, 5 సం: రోహిణి అని, 6 సం: కాళీ అని, 7 సం: చండిక అని, 8 సం: శాంభవి అని, 9 సం: దుర్గ అని, 10 సం: సుభద్ర అని వయసుని బట్టి ఆయా తల్లుల పేర్లతో వారిని సంబోధించి బాలపూజ చేసుకుంటాము. మనందరిని కూడా ఆ బాలాత్రిపురసుందరి మందస్మితవదనంతో ఉండి మనలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. మనం వెళ్లి ఆ తల్లి దగ్గిర చేతులు రెండూ జోడించి వేడుకోవడమే తరువాయి.


"అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే"


సర్వేజనా సుఖినోభవంతు.


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

+91 8886240088

[18/10, 5:00 pm] +91 99489 31150: దేవీనవరాత్రులు - మహేశ్వరీ


ఈ దేవీనవరాత్రులలో ఆలయముయొక్క ఆగమమునుబట్టి ఆ ఆలయం ఏ సంస్థకు చెందినదో దానినిబట్టి ఆ దేవాలయంలో అమ్మవారికి ఈ శరన్నవరాత్రులలో అలంకరించి భక్తులు ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు.


మరి శృంగేరి సంస్థానానికి సంబంధించిన శారదాలయంలో ఈరోజు ఆ తల్లిని మహేశ్వరిగా ఆరాధన చేస్తూ ఉంటారు. మహేశ్వరి అనగా మహేశ్వరుని శక్తిస్వరూపురాలు అని అర్ధం. ఇంకో రకంగా చూస్తే త్రిగుణాతీతుడగు మహేశ్వరుని శక్తిస్వరూపురాలు ఆ తల్లే! ఓంకారీతీతమైనది.


మనము వేదాలను ఉచ్ఛరించేటప్పుడు వాటియొక్క మొదలు చివర్లయందు ఉచ్చరింపబడే ఏ స్వరము కలదో అదే ప్రకృతియందు లీనమగు ప్రణవము అనగా ఓంకారము. దీనికంటే ముందునుంచి ఉన్నవాడు మహేశ్వరుడు. అనగా ప్రకృతిని అతిక్రమించిన నిర్గుణరూపుడను తెలుపలేదు. లక్షణముచే తెలిసికొనవలెను. ఈ మహేశ్వరునికి త్రిగుణాతీతతత్వము కలదు.


త్రిగుణాతీతుడు అనగా సత్త్వ, రజో, తమోగుణములకు అతీతుడు అని అర్ధము. సత్త్వగుణముతో బ్రహ్మచర్యంతో మనము ఈతనిని యదార్ధముగా ఉన్న లింగరూపాన్ని పూజించుచున్నాము. కావున ఇతను మహేశ్వరుడు అని చెప్పబడుచున్నాడు. అంతేకాక మహాభూతాలకు ఈశ్వరుడు కాన మహేశ్వరుడు. యీతని భార్య కాబట్టి మహేశ్వరి అయ్యింది. ఈ తల్లి కూడా త్రిగుణాతీతాలకు అతీతంగా ఉంది. ఆ మహేశ్వరుడికి శక్తి స్వరూపురాలుగా ఆయన చేత పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. 


ఈ తల్లి వృషభ వాహనంపైన దర్శనమిస్తుంది. వృషభమనగా ధర్మం. మనమెవ్వరిమైనా ఆ తల్లి పాదాలు పట్టుకున్నా వేడుకున్నవారందరికీ కూడా ధర్మమునందు అనురక్తిని పెంచి మనలను సన్మారంగములో పెట్టే నామము ఈ నామము.


"జయ జయ శంకర హర హర శంకర"


'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

WhatsApp Number: +91 8886240088

 +91 99489 31150: బ్రహ్మచారిణీ


ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!

పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!

సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!

నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః 


ఒక్క దుర్గ నవదుర్గలుగా భాసించి తొమ్మిది రూపాలను ధరించింది. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిగా, ఒక్కొక్క అవతారమూర్తిగా మనలను అందరినీ అనుగ్రహించడానికి ఆ తల్లి ఇన్ని మూర్తులలో మనలను అనుగ్రహించింది. ఆ కోవలో రెండవ రోజు బ్రహ్మచారిణీ అమ్మవారు బ్రహ్మతత్వ స్వరూపిణి. మనకు సామాన్యంగా బ్రహ్మచారిణీ అనగానే వివాహం కాని స్త్రీ అనుకుంటాము. కాని అది కాదు దాని అర్ధం. ఆ తల్లి దగ్గిర ఒక శక్తి ఉంటుంది. ఆమె బ్రహ్మతత్వము తెలిసేటట్లు చేస్తుంది.


బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మం తెలుసుకుని బ్రహ్మం అవుతాడు. బ్రహ్మం ఎరుకలోనికి వచ్చేటట్లుగా చేసే తల్లికి బ్రహ్మచారిణీ అని పేరు. బ్రహ్మము అంటే భగవానుడు. ఆయన ఎలా ఎరుకలోనికి వస్తాడు? ఆయన ఎలా ఉంటాడు? అసలు ఉన్నాడా? ఇలా అనేక సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. నిజానికి చూడండి ఒక కుటుంబంలో ఉన్నవారైనా ఒక వయసు వచ్చిన తరువాత మన పిల్లలు ఎందుకమ్మా? ఈ పూజలు, ఈ ఉపవాసాలు? అంటూ మన కడుపున పుట్టిన బిడ్డలే అయినా మనకు హితవాక్యాలు చెబుతూ మనల్ని భగవంతుని ఉనికిని గురించి ప్రశ్నిస్తూ ఉంటారు.


అసలు అది కూడా తల్లి అనుగ్రహమే. భగవంతుని ఉనికిని ప్రశ్నించి తెలుసుకోవాలని ప్రయత్నించడం కూడా ఒక రకంగా బ్రహ్మతత్వాన్ని అన్వేషించడమే.


నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్వణూపమా! 

తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః!

సబ్రహ్మ స్సశివ స్సహరిస్సేంద్రో స్సోక్షరః పరమస్వరాట్


వడ్లగింజ చివర మొన ఎంత ఉంటుందో అంతరూపంలో మన మనస్సులోనే ఉన్నాడు పరమాత్మ. లోపల ఉన్న పరమాత్మ తెలుసుకోబడాలి అంటే దానికి ఆ తల్లి అనుగ్రహం కావాలి. ఎందువల్లనంటే ఇంద్రియాలకు బయట తిరగడం తెలుసు తప్ప లోపలికి వెళ్ళడం రాదు. లోపలి ధ్యానంలో వెళ్ళగలగాలి అంటే ఇంద్రియాలకు పైన ఉండే వాటితో సంబంధం తెగాలి. అంటే ఆ తల్లి అనుగ్రహం కలగాలి. ఆ తల్లి అనుగ్రహం ఉండే పని ఏది చేస్తున్నా ఆవిడ అనుగ్రహం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా జ్ఞాపకం ఉండటమే నిరంతర నిజమైన పూజ. పూజా గృహంలో చేసే పూజ కేవలం ఒక అక్షరాభ్యాసం లాంటిది. నిరంతర పూజలో శక్తి అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడైతే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనయందు ఉంటుందో అప్పుడు మనము మాట్లాడే ప్రతి మాటా కూడా మంత్రమే అవుతుంది. ఆ తల్లి ఇచ్చిన వాక్కును అనవసర విషయాలు మాట్లాడటం కోసం కాకుండా ఆ తల్లి గురించి చెప్పుకోవడానికి, ఇతరులు సన్మార్గంలో వెళ్ళడానికి ఆ వాక్కు ఉపయోగపడాలి. అంతేకాని వ్యర్ధ ప్రేలాపనలకి సమయాన్ని, వాక్కుని వృధా చేయకూడదు. అయ్యో ఈ సృష్టిలో ఏ జీవికి లేని వాక్కు భగవంతుడు నాకు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం అన్న ఆలోచన కలగాలి.


ఆ తల్లి అనుగ్రహం మనవైపు ఉంటే మనం వేసే ప్రతి అడుగు కూడా ప్రదక్షిణమే అవుతుంది. అమ్మవారు ఇచ్చిన శక్తిని ఖర్చుపెట్టేటప్పుడు ఆ నడక పదిమంది హితము కోసమై ఉండాలి. కాని, మన స్వార్ధం కోసం కాదు అన్న ఆలోచన మనకు కలుగుతుంది. నా నడక కొంతమందికి ఆదర్శం కావాలి. నేను నడిచే త్రోవలో పది మంది నడవడానికి ఉత్సాహం చూపాలి. మనకి ఆ తల్లి అనేక రకాలైన రుచులను అందించింది. మనకు ఏ రుచికరమైన పదార్ధం కంటికి కనిపించినా వెంటనే మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని కడుపునిండినప్పటికీ ఆర్తిగా తీసుకుంటాము. అలా తీసుకొనేటప్పుడు ఆ తల్లి శక్తి పంటగా పండింది. శక్తి అగ్నిహోత్రంగా మార్చబడి ఆ పదార్ధం వండబడింది. ఆ వండిన పదార్ధాన్ని నేను పుచ్చుకున్నాక లోపల అగ్నిహోత్రుడు దాన్ని జీర్ణం చేస్తున్నాడు. అంతా ఆ తల్లి కరుణ అనుకున్నప్పుడు తినే ప్రతి పదార్ధాన్ని ప్రసాదబుద్ధితో స్వీకరిస్తాడు. ఎన్నో సుఖాలను ఇచ్చిన తల్లి కాబట్టి ఏమి చెయ్యాలో తెలియక నేలమీద సాష్టాంగ పడి, అమ్మా! అని నమస్కరించడం, పడుకునే ముందు 11 మార్లు 'శివనామం' చెప్పుకుని పడుకోవడం, నిద్రలేచేటప్పుడు కూడా మొట్టమొదట నోరువిప్పి 'శ్రీహరీ' అని మూడు మార్లు చెప్పుకుని నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఆ తల్లి దర్శిస్తూ ఉండే ప్రతీదీ పూజే. ఆ తల్లి బ్రహ్మచారిణి, బ్రహ్మతత్వ స్వరూపిణీదేవి కాబట్టి అలా అనుగ్రహించగలదు. ఆమె పాదాలను పట్టుకొన్న వారిని అటు నడిపించగలదు. 


ఇది ఎక్కడివరకు వెళ్ళిపోతుంది అంటే బ్రహ్మతత్వస్వరూపిణీ అయిన తల్లి బ్రహ్మమును తెలియచెయ్యడమే కాక నిరంతరం కాపాడుతుంది. ఆ తల్లి 'అంతర్ముఖ సమూరాధ్య బహిర్ముఖ సుదుర్లభా'. ఇంద్రియాలు లోపలికి తిరగాలి. లోపలకు తిరగడం అనే శక్తి పొందేటట్లుగా ఆ తల్లి గురుమండల రూపిణిగా మారుతుంది. ఆ తల్లి మనని అనుగ్రహించలేనిది లేదు. అటువంటి బ్రహ్మతత్వ స్వరూపిణి, బ్రహ్మచారిణి మోక్షం వరకు తీసికొని వెళ్ళగలిగిన తల్లి. ఒక్కసారి నిండు మనసుతో నమస్కరిస్తే చాలు కదలికలను భగవంతుని వైపుకు తిప్పి మనుష్యజన్మ సార్ధకం చెయ్యగలిగిన రెండవ శక్తిగా దుర్గా రూపం 'బ్రహ్మచారిణీ'. ఈ బ్రహ్మచారిణి రూపం మనలను అందరినీ అనుగ్రహించుగాక.


సర్వేజనా సుఖినోభవంతు.


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి


+91 8886240088

భాయి భాయి

















 

an alert

 🍋Please post this to all retirees so that they are aware of this scam

👇🏼👇🏼👇🏼👇🏼


Dear All,

This is an alert for all retired people who are drawing pension.

You may get a phone call from +91 78380 19490 . Caller is a lady who speaks in Hindi, and in the background you may hear typical call centre noises. She identifies her self as an executive of provident fund office , Delhi. And then she would read out some details of your postal address, retirement year, organisation where you have retired etc, and asks you to confirm. After conformation of the details, she will tell you that the group insurance policy which your organisation has purchased has matured and you would get RS.4,50,270 in to your bank account where ur pension is credited in 3 working days. Then she instructs you to do a NEFT transfer of RS.5110 in an account given by her. She would also tell you that RS.5000 would be refunded and the remaining amount is for administrative expenses.

I have received such call today.

Pl be warned that this is new cyber crime that I came to know after checking with appropriate authorities.


Visweswara Rao, 9177649652.

భగవద్గీతను

 మీరు ఏ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఉంటూ, మీకు నచ్చిన సమయములో, మీ మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో పెట్టాము. మీరు చేయవలసిందల్లా http://learnbhagavadgitaonline.org అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీ భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకి పది శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకోండి. 70 రోజులలో మీరు భగవద్గీత 700 శ్లోకములను చదవగలుగుతారు. భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు. దయచేసి ఈ మెసేజ్ ను వాళ్ళందరికీ అందేటట్టు వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి.


💐🚩🕉️🚩💐

తిరుమల

 తిరుమల, 2020 అక్టోబరు 18

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు-2020,

సింహ‌ వాహనంపై అభ‌య ఆహ్వాన‌ న‌ర‌సింహ‌స్వామి అలంకారంలో శ్రీ‌ మలయప్ప


      శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆది‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై అభ‌య ఆహ్వాన‌ న‌ర‌సింహ‌స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు.


సింహ వాహనం - ధైర్య‌సిద్ధి


           శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.


        రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

17year old boy









 

శోభాయమాన

 (18/10/2020, ఈనాడులో నా ఆదివారం సంపాదకీయం..ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి)

------------------------------------

 శోభాయమాన సంప్రదాయం

--------------------------------------


శాస్త్రీయ నాట్యసంప్రదాయానికి జీవం పోసిన భరతుణ్ని మునిగాను, కూచిపూడి నృత్యరీతులకు పురుడుపోసిన సిద్ధేంద్రుణ్ని యోగిగాను సంభావించే జాతి మనది. సంగీతం నృత్యం శిల్పం చిత్రలేఖనం వంటి కళలను గంధర్వ విద్యలుగా ఆరాధించే దేశమిది. వరాలుగా వాటిని స్వీకరించి, భక్తితో ఉపాసించి, భగవంతుడికే నివేదించడం  భారతీయ సంస్కృతి! తన ఆశ్రయం కోరివచ్చినవాడే అయినా, బృహన్నల నాట్యవిద్యా విశారదుడని గ్రహించగానే ‘నా కూతురు ఉత్తరకు మీవద్ద నృత్యం అభ్యసించే యోగ్యత ఉన్నదా, ఉంటే నేర్పండి’ అని విరాటరాజు వినయంగా యాచించాడే తప్ప- శాసించలేదని భారతం చెబుతోంది. అది గంధర్వ విద్యలకు దక్కే లౌకిక మర్యాద. నాట్య శాస్త్ర ప్రవీణురాలిని ‘శైలూషి’ అంటారు. ‘కరతలామలకంబుగా కరాంబుజముల అర్థము ఆద్యంతంబు అభినయించు...’ సాహిత్యభావానికి అద్దంపట్టేలా హస్తముద్రలతో ఆకట్టుకొంటుంది. ‘భావింప అరుదైన భావ మర్మంబులు మెరుగు చూపులలోన మేళవించు...’ రసజ్ఞులు మాత్రమే గ్రహించగల సూక్ష్మభావాలను చూపుల్లో ప్రదర్శిస్తుంది. ‘తాళమానములతో తాళ నిర్ణయలీల చరణ పల్లవముల సంగ్రహించు...’ లయవైవిధ్యాన్ని తన కాలి అందియల శబ్దంతో శ్రావ్యంగా సమన్వయిస్తుంది... అంటే, నృత్తం నృత్యం నాట్యం మూడింటికీ ప్రాణభూతమైన- ఆంగికాభినయం, నేత్ర విలాసం, పాద విన్యాసాలతో శైలూషి పరిపూర్ణంగా శాస్త్రవిద్యను ఆవిష్కరిస్తుందని విక్రమార్క విజయంలో జక్కనకవి వివరించాడు. ఆంగిక వాచిక ఆహార్యాభినయాలు దశరూపకాల వంటి ఎన్నో అంశాలతో 36 అధ్యాయాల సమగ్ర ‘నాట్యశాస్త్ర’ సర్వస్వాన్ని భరతముని రూపొందించాడు. లాస్య తాండవ రీతులకు పార్వతీపరమేశ్వరులను ఆదిప్రవర్తకులుగా నిరూపిస్తూ ‘నృత్తరత్నావళి’ని జాయపసేనాని(జాయసేనాపతి) అందించాడు. ఆయన తెలుగువాడు!


భారతీయ కళారూపాలన్నీ రుషితుల్యుల ఆవిష్కరణలే కనుక- ఆయా ప్రక్రియలు, సంప్రదాయాలన్నీ వేటికవే  సమగ్రంగాను, సంపూర్ణంగాను ఆవిర్భవించాయి. వాటి అధ్యయన సాధనలు రుషుల మార్గంలోనే నడిచాయి. ‘కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏలఏడ్చెదో...’ పద్యంలో పోతన చెప్పినట్లు- కళారాధనకు, కైవల్యానికి మధ్యలో కాసుల బెడద కమ్మేయకుండా సంస్కారాలు కాపలా కాశాయి. కళలు భగవదంకితాలై తరించాయి. అధ్యయనం శాస్త్రీయంగా, ప్రదర్శనం కళాత్మకంగా ఉండటంలో రుషుల పాత్ర గణనీయం. శాస్త్రీయ నృత్య ప్రదర్శనల్లో ఆహార్యమూ ముఖ్యాంశమే. విరాటరాజుతో అర్జునుడు ‘నేను నిపుణ నైపథ్య విధులలో నేర్పరి’నని చెప్పుకొన్నాడు. రంగప్రవేశానికి ముందుచేసే  వస్త్రాభరణాది అలంకారాలు నైపథ్యవిధులలోకే వస్తాయి. అలంకరణ విద్యలో ఆదినుంచీ పురుషులదే ముందంజ. బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి చీరకట్టు ఎంత సొగసుగా ఉండేదంటే ‘పట్టుచీర కట్టుకొన్న పుత్తడి బొమ్మా నీ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అనుకొంటూ సినీతారలు వచ్చి చీరకుచ్చిళ్లు అంత అందంగా ఎలా మడవాలని ఆయనను అడిగేవారట. ‘సవ్యహస్తంబు అర్ధచంద్రాభినయముతో కౌను అంటి...’ దేవదేవి కుడిచేయి నడుముకు చేర్చి అలా నిలబడితే చాలు ముగ్ధమోహనంగా ఉందన్నాడు వైజయంతీ విలాసంలో సారంగు తమ్మయ్య. వేదాంతం సత్యనారాయణశర్మ నిలువెత్తు ఆహార్యాన్ని చూస్తే అచ్చంగా అలానే అనిపించేది. యామినీ కృష్ణమూర్తి, శోభానాయుడు లాంటి నర్తకీమణులు సైతం అంతటి విఖ్యాతిని సాధించారు. జక్కన చెప్పిన సకల శాస్త్రమర్యాదల్లోనూ ప్రవీణులు కావడం ఒకటే కాదు... రుషుల మార్గంలో నడిచారు, పోతన దారినే అనుసరించారు! సినిమా అవకాశాలను సైతం కాదనుకొన్న శోభానాయుడు, తన రంగంలో గురుపీఠాన్ని అధిరోహించి కూచిపూడి ప్రతినిధిగా, పరంపరకు దీపధారిగా ఘనచరిత్ర సృష్టించారు... సంప్రదాయానికి సొబగులద్దారు... నటరాజులో లీనమయ్యారు!

--(ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి)


 







 

జలమయం




 

తీర్థం



 

జాగ్రత్తగా ఉండండి

 యాత్రలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వెధవలు చాలామంది ఉంటారు.

ఏం జరిగిందో తెలిసే లోపే అమ్మాయి ప్రాణం పోయింది చూడండి.




అన్యాయంగా

 1 అన్యాయంగా 

హింసచేస్తూ డబ్బులు 

సంపాదించే వారితో 

బలవంతంగాకోరికలు అనుభవించే వారితో 

దొంగతనాలు చేసేవారితో 

సాంగత్యం చేయకూడదు వీరుఅధములు

వీరు రెండో దశకు రావాలి

.

2 కేవలం డబ్బులు సంపాదించేందుకే పనులు చేసేవారి గురించి కేవలం తినడానికే బ్రతికినవారి గురించి ఎక్కువ ఆలోచించకూడదు వీరిని వదిలేయాలి

తినడానికి కాకుండా పనిచేస్తూ డబ్బులు ఆశించని వారి గురించి అయితే అప్పుడు ఆలోచించాలి 

వీరు మూడో దశకు రావాలి

.

3 ధర్మంగా జీవనం గడుపుతూ పరోపకారం చేస్తూ ఆధ్యాత్మిక చింతన లో ఉన్న వారి సాంగత్యం చేయాలి అలా అయితే ఒక మెట్టు ఎక్కుగలుగుతారు

వీరు నాలుగో దశకు రావాలి

.

4 కర్మ ఉపాసన మానేసి జ్ఞానఉపాసన చేయాలి 

జ్ఞాన ఉపాసన మానేసి తత్వ విచారణ చేయాలి 

తత్వ విచారణ చేస్తూనే సత్యాన్వేషణ చేయాలి 

సత్యాన్ని తెలుసుకొని జన్మరాహిత్యం చేసుకోవాలి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి 

.

5. మీరు బ్రహ్మమై ఉన్నారు కానీ 

అనుభవపూర్వకంగా మీకే తెలిసివస్తుంది 

అప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి అంటారు




.

 దుర్గ అన్న నామమే పరమపవిత్రం.


దుర్గమాసురుడనే రక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం.దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం.


దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగనాశనానికి,

'గ' కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.


అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించపఓవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపాన, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు....... ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షసలక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది 'దుర్గా' నామంలో

చంద్రవిద్య


 

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 31 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంథరా’


ఈ నామములో వశిన్యాదిదేవతలు అమ్మవారి కంఠము గురించి మాట్లాడుతున్నారు. మహాకామేశ్వరుని చేత కట్టబడిన మంగళసూత్రము కంఠములో ప్రకాశిస్తున్న తల్లి. లోకములో అందరూ కట్టించుకుంటారు. అందరూ కట్టించుకోవడానికి ఆవిడ కట్టించుకోవడానికి చాలా పెద్ద భేదము ఉన్నది. మంగళసూత్రధారణ వివాహములో అంతర్భాగము. కామమును ధర్మబద్ధము చేసుకోవడానికి లోకములో అందరూ సాధారణముగా వివాహము చేసుకుంటారు. అమ్మవారు శుశ్రూష చేస్తున్న ఈశ్వరుని మీద మన్మధుడు బాణం వేస్తే ఆయన మన్మధుని కాల్చేసాడు. లోకములో పెళ్ళికి, అమ్మవారి పెళ్ళికి చాలా తేడా ఉన్నది. ఎంతో గొప్పగా తపస్సు చేసి మహాకామేశ్వరునితో మంగళసూత్రము కట్టించుకున్నది. అమ్మ అలా కట్టించుకున్నది కాబట్టే శివుని దర్శనము అవుతున్నది. ‘కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంథరా’ అన్నది చాలా గహనమైన మాట. అమ్మవారు షరతు పెట్టి తాళి కట్టించుకున్నది. శంకరుడు బ్రహ్మచారిగా వచ్చి – నీ తపస్సుకి మెచ్చాను నా చిటికిన వేలు పట్టుకో కైలాసమునకు తీసుకుని వెళతాను అంటే వేదప్రమాణము చెప్పిన వైదిక ధర్మము ప్రకారము నన్ను వివాహము చేసుకోవలసిందని చెప్పింది. మహాకామేశ్వరునితో మంగళసూత్రము కట్టించుకున్నఓ తల్లీ అని పిలిస్తే మగవారు దీర్ఘాయుష్మంతులై ప్రతి కుటుంబము పార్వతీ పరమేశ్వర స్వరూపమై, లక్ష్మీ నారాయణ స్వరూపమై ఆనందమునకు ఆలవాలమై ఉంటుంది. మంగళసూత్రములో అమ్మవారు పరిపూర్ణముగా ఆవాహన అయి ఉంటుంది. స్త్రీ ప్రతి రోజు ఒకసారి అమ్మవారి దగ్గరకు వెళ్ళి చిటికెడు పసుపు కుంకుమలను చేత్తో పట్టుకుని ‘అమ్మా ! నీ మెడలో మంగళసూత్రము ఎలా ఉన్నదో అలా నా మెడలో మంగళసూత్రము నిలబెట్టమ్మా’ అని పసుపు కుంకుమలను వేసి ఆ కుంకుమను తీసి శతమానమునకు రాసుకుంటే ఆమె నిండు పసుపు కుంకుమలతో హాయిగా, సంతోషముగా, భర్తను అనువర్తించినదై ధర్మమార్గములో ఇద్దరూ ప్రస్థానము చేసి పరమేశ్వరునిమీద నిశ్చలభక్తితో మూడుతరములు చూసి జీవితమును పండించుకుంటారు. సర్వమంగళ స్వరూపిణి అయిన అమ్మవారికే మంగళసూత్రము మీద అంత మర్యాద ఉంటే లోకమంతా ఎంత భక్తి ప్రపత్తులు పొందాలన్న విషయమును పరోక్షముగా సూచన చేస్తున్నది. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

Optical illusion