*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 1931 (౧౯౩౧)*
*10.1-924-*
*క. రాజీవాక్షునిచే నొక*
*రాజీవముభంగి శైలరాజము మెఱసెన్;*
*రాజేంద్ర! మీఁద మధుకర*
*రాజి క్రియన్ మేఘరాజి రాజిల్లెఁ గడున్.* 🌺
*_భావము: ఓ పరీక్షిన్మహారాజా! కలువలవంటి కన్నులు కల ఆ శ్రీకృష్ణుని చేతిలో అమరియున్న ఆ గోవర్ధనగిరి ఒక తామర పువ్వు వలె ప్రకాశించినది. ఆ పర్వతము పైన నడయాడుతున్న మేఘమాలలు తుమ్మెదల గుంపులా యన్నట్లు తోచుచున్నవి._* 🙏
*_Meaning: O king Parikshit! The mountain held high in the hands of Lotus-eyed Sri Krishna appeared and shone like a lotus and the array of clouds hovering above the mountain appeared like a swarm of bees._* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి