19, ఆగస్టు 2021, గురువారం

యాప్పిలే యాప్పిలే రూపాయికి రెండు యాప్పిలే

 🔻 యాప్పిలే యాప్పిలే రూపాయికి రెండు యాప్పిలే 🔻

😊

♦️ విజినారం బస్టాండులో కునికి పాట్లు పడుతున్న జిగురుముర్తికి

 "యాప్పిలే యాప్పిలే రూపాయికి రెండు యాప్పిలే" అన్న అరుపులకి 

సడన్ గా మెలుకువ వచ్చింది .

నేనెక్కడున్నాను అని అనుమానపడుతూ కుళ్ళిపోయిన 

చెత్తదగ్గర కెలుకుతున్న పందిని చూసి - ఒకే అయితే విజినారం లోనే ఉన్నానన్నమాట అని కన్ఫర్మ చేసుకుని చెవులు రిక్కించి మళ్ళి విన్నాడు

.

♦️యాప్పిలే యాప్పిలే రూపాయికి రెండు యాప్పిలే తాజా తాజా యాప్పిలే ఇప్పుడే కోసుకొచ్చిన యాప్పిలే --- అన్న అరుపులు మళ్ళి వినబడ్డాయి .

--

♦️ఆహా - రూపాయికి రెండు యాపిల్సా ఇంత చవకా -కొమ్పతిసి జగన్ ji -పాడ్ లాగ కొత్త స్కీము ఏమైనా పెట్టారా - ఓహో అనుకుంటూ అరుపు వినబడ్డ వైపు పరిగెత్తాడు జిగుమ--

--

అటు ఇటు వెతగ్గా వెతగ్గా సులాభ్ కాంప్లెక్స్ ఎదురుగా అడ్డపుగ కాల్చుకుంటూ సిమ్మాచలం కనబడ్డాడు

--

♦️బుట్టలో చక్కగా పొందిగ్గా పేర్చి ఉన్నాయి

--

-

♦️వేపపుల్లలు

♦️- యాప్పుల్లె యాప్పుల్లె - రూపాయికి రెండు తాజా యాప్పుల్లె - 

మళ్ళి అరిచాడు సిమ్మాచలం .😊


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

బాపు - రమణీయం

నూతన యఙ్ఞోపవీత ధారణ

 


Sunday, 28 October 2018

నూతన యఙ్ఞోపవీత ధారణ

                                       యజ్ఞోపవీత ధారణ

      శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
.శ్రీ మహాగణాధిపతయే నమ:
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహాఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడువేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)

ప్రాణాయామం
---------------
(
కుడి చేతి బ్రొటన వేళిని కుడి ముక్కు గోడకి,ఉంగరం వేళిని ఎడమ ముక్కు గోడకి తాకించి)
ఓం భూ: , ఓం భువ: , ఓగ్సువ: , ఓం మహ: , ఓం జన: , ఓం తప: , ఓగ్సత్యం , ఓం తత్సవితుర్వే--ణ్యం , భర్గో దేవస్య ధీమహి , ధియోయోనప్రచోదయా--త్ , ఓమాప: , జ్యోతీరస: ,అమృతం బ్రహ్మ , భూర్భువస్సువరోం--
సంకల్పము
మమఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , శుభేశోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయాప్రవర్తమానస్యఅద్యబ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే , ____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే , శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం , శుభ తిథౌ।………శ్రీమాన్ …….. గోత్ర: ………నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య , ఆయురారోగ్య , అఖండ ఐశ్వర్య , అభివృద్ధర్ధం , ధర్మార్ధ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం , సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుస్ఠాన యోగ్యత సిద్ధ్యర్ధం,బ్రహ్మ తేజఅభివృద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీతధారణం కరిష్యే అంటూ నీరు వదలాలి.

మూడు కొత్త యజ్ఞోపవీతాలిని నీటితోను,పసుపుతోను శుభ్రపరచాలి.

యజ్ఞోపవీతం ఇతి మంత్రస్య
పరబ్రహ్మ ఋషి:(కుడిచేతితో నుదుటిని తాకాలి)
తృష్ఠప్ ఛంద:(ముక్కు కింద తాకాలి)
పరమాత్మ దేవత:(హృదయాన్ని తాకాలి)
యజ్ఞోపవీతధారణే వినియోగ:
ఒకదాని తర్వాత ఒకటి  మూడు యజ్ఞోపవీతాలిని  క్రింది విధంగా చేస్తూ ధరంచాలి.
ధరించేటప్పుడు రెండు చేతులతో యజ్ఞోపవీతాన్ని పట్టుకుని,యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని కుడి చేతితో పైకి ఉండేటట్లు(ఆకాశానికి చూపించేటట్లు)చేసి  కింది ధారణ మంత్రాన్ని పఠిస్తూ మొదటి యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
1.యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజఅంటూ మొదటి దాన్ని ధరించాలి.
పునరాచమ్య!!...ఓం కేశవాయ స్వాహా ,……. (హస్తములతో బాహువులని)
       మమ గృహస్థాశ్రమ యోగ్యత సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజఅంటూ రెండవ దాన్ని ధరించాలి.
2. ఆచమ్య!!......ఓం కేశవాయ స్వాహా …… మమ ఉత్తరీయార్థే తృతీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజఅంటూ మూడవ దాన్ని ధరించాలి.
3. ఆచమ్య!!....ఓం కేశవాయ స్వాహా ……… శ్రీమతకౌండన్యస గోత్రస్య , రామయోగిశర్మ నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య , ఆయురారోగ్య , అఖండ ఐశ్వర్య , అభివృద్ధర్ధం , ధర్మార్ధ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం , నూతన యజ్ఞోపవీతధారణ సమయే దశాసంఖ్య గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే
పాత,కొత్త యజ్ఞోపవీతాలని పట్టుకుని గాయత్రి మంత్రం 10 సార్లు జపించాలి.జపించిన పిమ్మట గాయత్రీ మహామంత్ర జపం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పళ్ళెంలో నీటిని వదలాలి.
తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని పట్టుకుని,
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం వేదాంతవేద్యం పరబ్రహ్మ స్వరూపం జీర్ణోపవీతం విసృ తస్తు తేజ:
(
లేదా)
ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కష్మలదూషితం|
విసృజామి పరబ్రహ్మణ్ వర్చో దీర్ఘాయురస్తు మే |
"
సముద్రం గచ్ఛ స్వాహాఇత్యుక్త్వా విసృజేత్ | అని అంటూ పాత యజ్ఞోపవీతాన్ని బయటకి తీసేయాలి.
ఆచమ్య!

శివ కల్యాణం లో చెప్పబడు శివ పార్వతుల గోత్ర ప్రవరలు

 శివ రాత్రి రోజు జరిపే శివ రాత్రి రోజు జరిపే శివ కల్యాణం లో చెప్పబడు శివ పార్వతుల గోత్ర ప్రవరలు


     

.చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।

పరశివ పరమేశ్వర పరాపరశివ పరంజ్యోతి పరమాత్మా పంచార్షేయ ప్రవరాన్విత

పర శివ గోత్రోద్భవస్య, సదాశివ శర్మణో నప్త్రే॥

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు॥

పరశివ పరమేశ్వర పరాపరశివ పరంజ్యోతి పరమాత్మా పంచార్షేయ ప్రవరాన్విత

పర శివ గోత్రోద్భవస్య పర శివ శర్మణః పౌత్రాయ॥

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।

పరశివ పరమేశ్వర పరాపరశివ పరంజ్యోతి పరమాత్మా పంచార్షేయ ప్రవరాన్విత

పర శివ గోత్రోద్భవస్య మహేశ్వర శర్మణః పుత్రాయ॥

హరిణ పరశు ధరాయ-చంద్రశేఖరాయ-ఈశ్వర శర్మణే వరాయ॥


పార్వతీ ప్రవర.

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।

ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య

చతుర్ముఖ బ్రహ్మణో నప్త్రీం॥

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।

ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య మ

హామేరు శర్మణ పౌత్రీం॥

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యఃశుభమ్ భవతు।

ఇఛ్ఛాశక్తి ఙ్ఞాన శక్తి క్రియాశక్తి త్రియార్షేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య

హిమవచ్ఛ శర్మణ పుత్రీం॥

పార్వతీ నామ్నీం కన్యాం

*శ్రీ సూక్తము..* *(ఎనిమిదవ భాగము)*

 *శ్రీ సూక్తము..*  *(ఎనిమిదవ భాగము)*



లక్ష్మీదేవికి మొత్తం 18 మంది కుమారులు. ( ఆవిడకు సంతాన లక్ష్మి అన్న పేరు ఊరికే రాలేదు). వీళ్ళందరూ కూడా ఆమెకు మానసిక పుత్రులు. విష్ణుమూర్తి తో సంబంధం లేకుండా అచ్చంగా లక్ష్మీదేవికే పుట్టినవాళ్ళు. శివుడు గజాసురుని గర్భంలో ఉన్నప్పుడు పార్వతికి గణపతి పుట్టినట్లు అలాగే పార్వతి తో సంబంధం లేకుండా శివునికి కుమారస్వామి పుట్టినట్లుగా లక్ష్మీదేవికి ఈ పద్దెనిమిది కుమారులు మానసిక పుత్రులుగా పుట్టారు. వీళ్ళ పేర్లు  దేవసఖ, చిక్లీత (మన్మధుడు), ఆనంద, కర్దమ, శ్రీప్రద, జాతవేద, అనురాగ, సంవాద, విజయ, వల్లభ, మద, హర్ష, బల, తేజ, దమక, సలిల, గుగ్గుల, కురుంటక అని. వీళ్లకు సంబంధించిన వివరాలు పురాణాలలో అంత ప్రముఖంగా లేవు. లక్ష్మీ దేవి కి సంబంధించిన కొన్ని వ్రతాల లోనూ కొన్ని రకాల పూజల్లోనూ మాత్రమే వీళ్ళ పేర్లు వినిపిస్తాయి. వీళ్ళ పేర్లకు ముందు ఓం అని తరువాత యైనమః అని చేర్చి జేపిస్తే లక్ష్మీదేవి చాలా సంతోషించి భక్తులను అనుగ్రహిస్తుంది అని నమ్మకం. ఓం దేవసఖాయై నమః ఓం చిక్లీతాయై నమః ఇలాగ అనమాట. శ్రీ సూక్తం లో  జాతవేద చిక్లీత, కర్దమ, ఆనంద, దేవసఖ అనే వాళ్ళ పేర్లు వినిపిస్తాయి. సూక్తంలో అమ్మవారి అనుగ్రహాన్ని మాకు సాధించి పెట్టు అమ్మవారిని మా వద్దకు ఆహ్వానించు అని వాళ్ళను ప్రార్ధించడం జరుగుతుంది. 


*ఏడవ ఋక్కు* :: 


*ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ ।*

*ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తి॒మృ॑ద్ధిం ద॒దాతు॑ మే ॥*


*దే॑వస॒ఖ*= లక్ష్మీదేవి పుత్రుల్లో ఒకడు. దే॑వస॒ఖుడు నాకు కోరికలు తీర్చుటకు చింతామణిని కీర్తి అనుపేరుగల లక్ష్మీదేవికి చెందిన శక్తిని నా కొరకు తెచ్చు గాక. దే॑వస॒ఖ అంటే దేవదేవుడైన శివునికి స్నేహితుడైన కుబేరుడు అని కూడా అర్థం చెప్తారు. కుబేరుడు దిక్పాలకుల లో ఒకడు. పైగా ఈశ్వరుడు ఇంద్రుడు కుబేరుడు మొదలైన వాళ్ళు ఐశ్వర్య ప్రదాత లయిన దేవతలు. యముడికి చిత్రగుప్తుడి లాగా కుబేరుడికి మణిభద్రుడు అని మంత్రి ఉన్నాడు. కుబేరుడి పనులన్నీ అతనే చేస్తుంటాడు. దేవుడు వరమిచ్చినా...  అన్నట్లుగా కాకుండా, మణి భద్రుడి తో సహా వచ్చి కుబేరుడు నాకు సంపదలను కీర్తిని ఇచ్చుగాక అనే ప్రార్ధన మణి నా సహా అన్న మాటలో ఉంది.


ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్లి పేరు డబ్బు సంపాదించుకుని జీవిస్తే మనిషికి సుఖం రాదు. ఆ వ్యక్తి యొక్క సొంత ఊర్లో పుట్టి పెరిగిన ప్రదేశం లో వీడి గొప్పతనం తెలిస్తేనే వాడికి తృప్తి సంతోషం వస్తాయి. ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ అంటే నేను పుట్టి పెరిగిన ప్రదేశం లో నాకు కీర్తి  కలగాలి అనేది ఇక్కడ కోరుకున్న కోరిక. 


*ఎనిమిదివ ఋక్కు* ::


*క్షు॒త్పి॒పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॒ల॒క్షీం నా॑శయా॒మ్యహం ।*

*అభూ॑తి॒మస॑మృద్ధిం॒ చ స॒ర్వాం॒ నిర్ణు॑ద మే॒ గృహాత్ ॥*


ఈ ఋక్కులో ఏ పనికైనా పురుష ప్రయత్నము దైవసహాయము రెండూ ఉండాలి. ఏ ఒక్క దానినో నమ్ముకుంటే ఫలితం ఉండదు అనే విషయము సూచింప బడింది.  ఆకలి దప్పిక మురికి రూపంలో ఉన్న దరిద్రాన్ని నేను నాశనము చేయడానికి ప్రయత్నిస్తాను. లేమిని మా ఇంటి నుంచి పోగొట్టి సమృద్ధమైన సంపదలను నువ్వు నాకు ప్రసాదించాలి అనేది ఈ ఋక్కులో ఉన్న ప్రార్థన. 


*తొమ్మిదవ ఋక్కు* :: 


*గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీం᳚ ।*

*ఈ॒శ్వరీగ్ం॑ సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియం ॥*


శ్రియం, కరీ॒షిణీం, పదాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి. కానీ ఈ ఋక్కులో ప్రార్థన చేయబడే దేవత శ్రీదేవి కాదు. భూదేవి. భూదేవి నీళాదేవి లక్ష్మి దేవి వీళ్లలో తేడా లేదు అందరూ ఒకటే.  ఈశ్వరి అంటే ఐశ్వర్య ప్రదాయిని. భూదేవిని సంపదల కోసం నేను  ఆహ్వానిస్తున్నాను అనేది ఇందులో  భావము.


పంచభూతాల్లో ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం ప్రధానంగా చెప్పారు. ఆకాశానికి శబ్దము. వాయువుకు స్పర్శ. అగ్నికి రూపము. జలానికి రుచి. భూమికి గంధము. ఈ విషయాన్ని గంధద్వారాం అనే పదం సూచిస్తుంది. భూమి ని ఎవరు నాశనం చేయలేదు. భూమి మనకు ఆధారం కాబట్టి దాని సహాయంతోనే మనము జీవించగలము. దు॑రాధ॒ర్షాం॒ అనే పదానికి అది అర్థము. నిత్యపుష్టాం = ధాన్యాన్ని పంటలను వృక్ష సంబంధమైన అన్ని వస్తువులను మనకు ప్రసాదించేది.


*కరీ॒షిణీం*= ఆవు పేడ రూపము లో ఉన్నది. దీనికి ఓ చిన్న కథ ఉన్నది. గోవు అత్యంత పవిత్రమైన జంతువు. దాని శరీరం లో ఎక్కడైనా చోటు సంపాదిస్తే మనకు కూడా పవిత్రత గౌరవం లభిస్తాయని దేవతలందరూ నీ శరీరంలో మాకు చోటు కల్పించు అని గోవును ప్రార్థిస్తారు. గోవు అంగీకరిస్తుంది. లక్ష్మీదేవి ఆఖర్లో వెళుతుంది. అప్పటి గోవు శరీరంలో అన్ని ప్రదేశాలు మిగిలిన దేవతలు ఆక్రమించుకొని ఉంటారు. ఆవిడ బతిమాలు కోగా ఆవు పేడలో లక్ష్మి కి నివాస ఉండేటట్లు గోవు నిర్ణయిస్తుంది. అందువల్ల ఆవు పేడ లక్ష్మీప్రదము.


భూమికి సంబంధించిన వర్ణనకు ఆవు పేడ కు సంబంధం ఏమిటంటే, పంటలు వేసి పైరు కోసుకున్న తర్వాత భూమి కి మరలా పంటలను పండించే శక్తి రావాలంటే, ఎరువు వేయాలి. ఎరువు వల్ల భూమికి పంటలు పండించే శక్తి వస్తుంది. ఎరువు కూడా పృథ్వి తత్త్వమే. ఆవు పేడ ఎరువును సూచిస్తుంది. అందరికీ పుష్టి కలిగించే భూ దేవతకు పుష్టిని కలిగించేది ఆవు పేడ. 


 ఇది ప్రసిద్ధమైన శ్లోకము. పూజలలో గంధంతో అర్చన (ఉపచారము) చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్తాము.



 ఇంకా ఉంది......


 *పవని నాగ ప్రదీప్.*

ప్రమధ గణాలు ఎవరు?

 ప్రమధ గణాలు ఎవరు?


ప్రమథ గణాలు మొదట శివుని నుండి ఉద్భవించిన వారు. కేవలం శివుని మాత్రమే కొలిచే వారు. తదుపరి ఎంతో మంది శివ భక్తులు ప్రమథులలో చేరారు.


"ప్రమథ" అంటే బాగా మథించ గలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు. వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తాడు.


రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో


సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం ..


అంటూ వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.


అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:


వీరభద్రుడు: దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షున్ని, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు. సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.


ఆది వృషభం: ధర్మదేవత. శివున్ని మోయ గలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.


నందీశ్వరుడు: శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.


భృంగి: శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు. కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. stability కోసం.. tripod లాగా.


స్కందుడు: కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.


పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు. నేటికీ వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు.


రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ: శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగమునుంది వచ్చి పంచ మఠములను స్థాపించి, శివాద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యు లయ్యారు.


కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాదీశుడు


రిటి: ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.


బాణుడు: శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.


చండీశుడు: ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.


ఇలా ఎందరో ప్రమథ నాయకులు.


దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పిలాదుడు , దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు.


అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. అనన్యశివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికీ వీరు వీరమాహేశ్వరులని, జంగమదేవతలని పిలువబడతారు.


ఇక జంగమలు గురుపరంపరలో ఉంటే , శిష్య పరంపర చెందిన శివశరణలు కూడా గణములలో స్థానం పొందారు. ఎంతో మంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు. 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెళ్లరు శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది.


గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యం తో ఉంటారు, కొందరు ఇచ్చాధార రూపాలతో ఉంటారు.రకరకాల ముఖాలతో, రక రకాల శరీరాలతో, అవయవాలలో వింతగా ఉంటారు ప్రమథ గణాలు. వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే!!


వీలున్నప్పుడు అనేకానేక ప్రమథ గణముల వర్ణన బసవపురాణం నుండి సేకరించి జత చేస్తాను!!


వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము.

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 23

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 23     

                           SLOKAM : 23

                                                

शत्रुच्छेदैकमन्त्रं सकलमुपनिषद्वाक्य 

                               सम्पूज्यमन्त्रं

संसारोत्तारमन्त्रं समुचिततमसः सङ्घ 

                              निर्याणमन्त्रम् ।

सर्वैश्वर्यैकमन्त्रं व्यसनभुजगसन्दष्ट 

                                सन्त्राणमन्त्रं

जिह्वे! श्रीकृष्णमन्त्रं जप जप सततं                              

                       जन्मसाफल्यमन्त्रम् ॥२३॥


శతృచ్చేదైక మంత్రంసకలమ్ 

  ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తారమంత్రం సముపచిత 

        తమస్సంఘ నిర్యాణ మంత్రం 

సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన 

    భుజగ సందష్ట సంత్రాణ మంత్రం

జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప 

        సతతం జన్మసాఫల్య మంత్రం ॥ 23    


ఓ జిహ్వా! (ఓ నాలుకా!) 

    శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము. అదియే 

  - జన్మకు సాఫల్యము ఇచ్చునది.    

  - కామాది శత్రువులను భేదించుటలో ప్రధాన సాధనం ఆ మంత్రము. 

    సర్వోపనిషద్ వాక్యములు ఆ మంత్రమునే పూజించినవి.   

    జననమరణము లనెడి సంసారము నుండి తరింపచేయగల మంత్రమది.    

    రాశీభూతమైన అవిద్యాంధ కారమును నశింపజేయు మంత్రము. 

    ఆ మంత్రమే సర్వైశ్వర్యములను ఇచ్చెడిది. వ్యసనములనెడి సర్పములు కాటువేసినప్పుడు కాపాడగల మంత్రము. 

    కనుక శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము.!!    


O tongue!    

    please constantly chant the mantra composed of Śrī Kiṛṣhṇa’s names. 


    This is the only mantra for destroying all enemies, 

    the mantra worshiped by every word of the Upaniṣads,  

    the mantra that uproots saṁsāra, 

    the mantra that drives away all the darkness of ignorance, 

    the mantra for attaining infinite opulence, 

    the mantra for curing those bitten by the poisonous snake of worldly distress, and 

    the mantra for making one’s birth in this world successful.   



https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వ్యాపారం..వాత్సల్యం..*


1980 వ సంవత్సరం లో (అప్పటికి శ్రీ స్వామివారు సిద్ధిపొంది నాలుగు సంవత్సరాల కాలం పూర్తి అయింది..) శ్రీ మీరాశెట్టి గారికి కందుకూరులో నూనె మిల్లు స్థాపించి, వంట నూనెల వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది..తనకు తోడుగా తన బావమరిది రామయ్య శ్రేష్టి ని కలుపుకోవాలని అనుకున్నారు..రామయ్య శ్రేష్టి కూడా అందుకు సమ్మతించారు..ఆ సమయం లో నేను కూడా కందుకూరు లో వ్యాపారం చేస్తూ వున్నాను..శ్రీ మీరాశెట్టి గారు కూడా మా దుకాణం నుంచే తన వ్యాపార కార్యకలాపాలు చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు..


ఏదైనా పని మొదలు పెట్టేముందు..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని రావడం శ్రీ మీరాశెట్టి గారికి అలవాటు..అదే ఆనవాయితీ పాటిస్తూ..శ్రీ రామయ్య శ్రేష్టి తో కలిసి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..తాము చేయబోయే వ్యాపారానికి శ్రీ స్వామివారి అనుమతి తీసుకోవాలని మీరాశెట్టి గారి అభిప్రాయం..ఉదయాన్నే శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఉత్సవ విగ్రహం వద్ద అర్చన చేయించుకున్నారు..ఆ సమయం లో మీరాశెట్టి గారి మనసులో ఒక రకమైన వేదన కలిగింది..శ్రీ స్వామివారి నుంచి అనుమతి రాలేదు అనే భావన కలిగింది..అయినా సర్దిచెప్పుకున్నారు..మనం చేసేది మంచి పనే కదా..ఇంకెందుకు ఆలోచించడం అని ఒక భరోసాను తనకు తానే ఇచ్చుకున్నారు..కానీ ఆరోజు రాత్రి మీరాశెట్టి గారికి శ్రీ స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి.."అనవసరపు ఆర్భాటాలు వద్దు..ఉన్నంతలో జీవితాన్ని గడుపమని" చెప్పారట..ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు..వ్యాపారం కొనసాగించాలా?..వద్దా?..అనే మీమాంసే లేదు..శ్రీ స్వామివారు వద్దు అని సంకేతం ఇచ్చారు..ఇక కొనసాగించడం మంచిదికాదు..కానీ..ముందుగానే కొంత పెట్టుబడి పెట్టి, బావమరిది రామయ్య ను కూడా కలుపుకొని వున్న కారణంగా..ఎలా వెనక్కురావాలని రెండు రోజుల పాటు బాధ పడ్డారు..చివరకు రామయ్య శ్రేష్టి కి అసలు విషయం చెప్పారు.. రామయ్యశ్రేష్టి గారు తాను నిర్వహించుకుంటానని గట్టిగా చెప్పారు..మీరాశెట్టి గారు తనకు శ్రీ స్వామివారి ఆదేశం ఇచ్చిన సంగతిని కూడా దాచుకోకుండా చెప్పేసారు..అయినా రామయ్య శ్రేష్టి గారు తాను నూనె వ్యాపారం చేస్తానని పట్టుబట్టారు..విధిలేక మీరాశెట్టి గారు ఆ వ్యాపారాన్ని ఆయన కు అప్పచెప్పారు..


మరో నెలరోజుల కల్లా..రామయ్యశ్రేష్టి నూనె వ్యాపారాన్ని ప్రారంభించాడు..ఆరేడు నెలలు గడిచాయి..రామయ్య శ్రేష్టి గారు అనుకున్నట్లు గా వ్యాపారం జరుగలేదు..నష్టం కనబడసాగింది..అప్పుడు శ్రీ స్వామివారు మీరాశెట్టి గారిని హెచ్చరించిన విషయం స్ఫురణకు వచ్చింది..ఇక ఆలస్యం చేయకుండా..మరింత నష్టం మూటకట్టుకోకుండా.. ఆ వ్యాపారాన్ని మూసి వేశారు రామయ్య గారు..తక్కువ నష్టాలతో బయటపడ్డారు..శ్రీ స్వామివారు వాత్సల్యం తో సకాలంలో హెచ్చరించి.. తనను నష్టాల పాలుకాకుండా కాపాడారని మీరాశెట్టి గారు పదే పదే చెప్పుకునేవారు..


మీరాశెట్టి గారికి సంబంధించినదే మరో అనుభవం..


ఒకసారి మీరాశెట్టి దంపతులు శ్రీ స్వామివారి వద్దకు రావాలని బయలుదేరారు..వారి స్వగ్రామం నుండి శ్రీ స్వామివారి ఆశ్రమానికి సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంది..నడుచుకుంటూ వచ్చారు..శ్రీ స్వామివారు ఆ సమయానికి ఆశ్రమం బైట వున్నారు..మీరాశెట్టి దంపతులను చూసి.."రండి..మీ కోసమే ఎదురుచూస్తున్నాను.." అన్నారు..శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొన్నారు..వారిద్దరినీ తీసుకొని ఆశ్రమం లోపలికి వెళ్లారు శ్రీ స్వామివారు..తాను ధ్యానం చేసుకునే గది బైట మీరా శెట్టి గారిని కూర్చోమని చెప్పి..ఆ దంపతుల కెదురుగా పద్మాసనం వేసుకొని స్వామివారు కూర్చున్నారు.."మీరాశెట్టి..మీరు నా మీద విశ్వాసం తో ఈ ఆశ్రమాన్ని కట్టించారు..భవిష్యత్ లో ఇది ఒక దత్త క్షేత్రంగా మారుతుంది..మీ పేరు కూడా నిలిచిపోతుంది..మీకు నా పరిపూర్ణ ఆశీస్సులు ఉంటాయి.." అన్నారు..శ్రీ స్వామివారు ఆదరంతో చెప్పిన ఆ మాటలను మీరాశెట్టి గారు ఎప్పుడూ మననం చేసుకుంటూ వుండేవారు..


శ్రీ స్వామివారికి అత్యంత సన్నిహితంగా మెలిగినా.. ఏనాడూ తన పరిధులు దాటి అహంకరించకుండా..శ్రీ స్వామివారిని భక్తి విశ్వాసాలతో కొలచిన ధన్యజీవి శ్రీ మీరాశెట్టి గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).