25, అక్టోబర్ 2022, మంగళవారం

భారత మూలాలున్న దేశాధినేతలు

 న్యూఢిల్లీ


*ప్రపంచంలో భారత మూలాలున్న దేశాధినేతలు వీరే.*


 బ్రిటన్‌ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ చరిత్ర సృష్టించారు. లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధానిగా టోరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజా పరిణామంతో భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టే ఏడో దేశంగా బ్రిటన్‌ నిలవనుంది. ఇప్పటికే ఆరు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే దేశాల్లో భారత మూలాలున్న వ్యక్తులు కీలక పదవులు చేపట్టారో చూస్తే..


*రిషి సునాక్‌,బ్రిటన్‌ నూతన ప్రధాని* 

భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ నగరంలో జన్మించిన రిషి పూర్వీకుల మూలాలు భారత్‌ లోని పంజాబ్‌లో ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు.


*ఆంటోనియా కోస్టా, పోర్చుగల్‌ ప్రధానమంత్రి* 

గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా పోర్చుగల్‌ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా.. గోవాకు చెందినవారు.


*మహమ్మద్‌ ఇర్ఫాన్‌, గయానా అధ్యక్షుడు* 

ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌.. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.


*ప్రవింద్‌ జుగ్నాథ్‌, మారిషస్‌ ప్రధానమంత్రి* 

మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన ప్రవింద్‌ జుగ్నాథ్‌ భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి.


*పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌, మారిషస్‌ అధ్యక్షుడు* 

మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కుటుంబం కూడా భారత ఆర్యసమాజ్‌ హిందూ కుటుంబానికి చెందినదే. పలుమార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో మారిషస్‌ అధ్యక్షుడు అయ్యారు.


*చంద్రికా ప్రసాద్‌ సంతోఖి (చాన్ సంతోఖి), సురినామ్‌ అధ్యక్షుడు* 

దక్షిణ అమెరికాలోని సురినామ్‌ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్‌ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన ఆయన కుటుంబం కూడా భారత మూలాలున్నదే.


*కమలా హ్యారిస్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు* 

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారు.


ఇలా భారత మూలాలున్న వ్యక్తులు విదేశీ గడ్డపై రాజకీయాల్లో కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు. కేవలం ఈ ఆరు దేశాలే కాకుండా ట్రినిడాడ్‌&టొబాగో, పోర్చుగల్‌, మలేసియా, ఫిజీ, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు...

గ్రహణ కాల ప్రత్యేక విధులు

 *గ్రహణ కాల ప్రత్యేక విధులు నిర్వహించండి!*


 స్వామీ నమస్తే!

 గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?

గాయత్రీ జపం చేయవచ్చా?

 తర్పణాలు విడువవచ్చా? 

అసలు ఆచమనం చేయవచ్చా?

 స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా?

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగిఃచాలా?అక్కర్లేదా?

రాత్రి భోజనం కాక పళ్లు ఫలహారం పనికొస్తుందా?

 దానాలు  గ్రహణం సమయంలోనా లేక విడిచిన తరువాతా?

 గ్రహణం సమయంలో అయితే బ్రాహ్మణులు దొరకరు కదా? 

గ్రహణం సమయంలో ఎవరిని ఉద్దేశించి జపం చేయాలి?

ఇష్టదైవం ప్రీత్యర్థంఅనా లేక సూర్య/ చంద్ర ప్రీత్యర్థం అనా జపసంకల్పం చేయాలి?

ఇలా ఎన్నో ప్రశ్నలు.... నేను  ఈ ప్రశ్నలు గొప్ప ఫండితుల్ని అడిగినా తృప్తికరమొన శాస్త్రియ జవాబు లేదు.ఒక వ్యాస రూపంలో  తమరువ్రాస్తే ఎందరికో తెలుస్తుంది.

===============================

చాలా మంచి ప్రశ్నలు అడిగారు. నిజానికి వీటికి సమాధానాలు చాలా మందికి తెలియవు. ఎక్కువ మంది గ్రహణకాల విధులు మరిచిపోయారు. కేవలం కొద్దిమంది సనాతనపరులు మాత్రమే వీటిని పాటిస్తున్నారు. కనుక తమ ప్రశ్నలకు సమాధానాలు కూలంకషంగా ఇవ్వవలసి ఉంది.

అయితే సామాజిక మాధ్యమం విస్తృతమైన పరిధిని దృష్టిలో ఉంచుకొని అన్ని కులాల వారు, వయసుల వారు, ఆడమగ, మతాల వారికీ పనికి వచ్చే విధంగా సమాధానం ఇస్తాము. ఎందుకంటే గ్రహణకాల విధులు అందరికీ ఒకే విధంగా ఉండవు. మీరు అడిగిన ప్రశ్నలకు కొన్ని అనుబంధప్రశ్నలున్నాయి కనుక వాటి గురించి ముందుగా తెలుసుకుందాము



================================

గ్రహణం అంటే ఏమిటి? గ్రహణ సమయం అంటే ఏమిటి?


గ్రహణం అనేదానికి వేదాలకు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిషం ప్రకారం సూర్య గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు. ఆధునికులు చంద్రుడిని గ్రహంగా అంగీకరించరు. అది వేరేసంగతి. 

గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు. ఇవి స్పర్శకాలం, మధ్య కాలం, మోక్షకాలం అంటారు. వీటిని అన్నింటినీ కలిపి ఆద్యంత పుణ్యకాలం అంటారు. 

ఉదాహరణకు కేతువు ద్వారా రాబోతున్న ఆశ్వయుజ సూర్యగ్రహణం స్పర్శకాలం 25వ తేదీన సాయంత్రం గం 5.04నిమిషాలు. మధ్యకాలం సాయంకాలం 5.39. ఇక గ్రహణం విడిచేది అయిన మోక్షకాలం సాయంత్రం 6.28. అయితే ఈ గ్రహణంలో మోక్షం సూర్యాస్తమయం తరువాత కలిగింది. భారతభూభాగంపై సూర్యుడు అస్తమించిన తరువాత గ్రహణం విడిచిపెట్టింది. కనుక దీన్ని కేత్రగ్రస్తాస్తమయ గ్రహణంగా చెబుతారు. ఇది చాలా అరుదైన గ్రహణం. అక్టోబర్ 25వ తేదీని సూర్యాస్తమయం 5.36నకే జరుగుతుంది. కనుక దీన్ని గ్రహణం మిగిలి ఉన్న అస్తమయంగా చెబుతారు. దీని వలన మరునాడు సూర్య దర్శనం అయ్యేంత వరకూ గ్రహణదోషం వీడదు. ఈ కారణాల వలన గ్రహణకాల విధులు మారిపోతాయి.

ఇక్కడ మరో విచిత్రం చంద్రగ్రహణం నాడు జరుగుతోంది. 

ఈ ఏడాది చంద్రగ్రహణం నవంబర్ 8వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున రానుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణం స్పర్శకాలం మధ్యాహ్నం 2.39 కాగా మధ్యకాలం సాయంత్రం 4.29 మోక్షకాలం సాయంత్రం 6.18 అవుతోంది. అంటే చంద్రగ్రహణంతోటే చంద్రోదయం కాబోతోంది కనుక దీన్ని రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణంగా చెబుతారు. దీని వలన కూడా గ్రహణ విధులు మారిపోతాయి.

ఈ ప్రత్యేక పరిస్థితుల్లో గ్రహణ సమయంలో ఎలా విధులు నిర్వర్తించాలో అంతా తెలుసుకోవాలి.

===================

ముందుగా ఈ గ్రహణ సమయంలో స్వాతీ నక్షత్రం వారు సూర్యగ్రహణం, భరణీ నక్షత్రం వారు చంద్రగ్రహణం చూడరాదు. తులారాశివారు సూర్యగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి. మేషరాశి వారు చంద్రగ్రహణం నాడు శాంతి చేయించుకోవాలి.

=================

 గ్రహణం సమయం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?

ఇది మంచి ప్రశ్న. గ్రహణ కాలం చాలా ఉత్తమమైన సమయం. చాలా అరుదైన సమయం. చాలా యోగదాయకమైన సమయం. ఈ సమయంలో చేసే సాధనలు కోటిరెట్లు ఉత్తమ ఫలాలను ఇస్తాయి. జపాలు కోటి రెట్లు అవుతాయి. దానాలు లక్షల రెట్లు అవుతాయి. అంటే ప్రతీ రూపాయి లక్షరూపాయల దానంతో సమానం అవుతుంది. ధ్యానం, నిధిధ్యాసం, సమాధి, ప్రాణాయామాది సాధనలకు అనుకూలం.

కనుక అనవసరమైన సంభాషణలు చేయరాదు. వృథాపనుల్లో ఉండరాదు. ఇంద్రియలోలత్వం కూడదు. నోటికీ నాలుకకూ విశ్రాంతి ఇవ్వాలి. అంటే మౌనం, నిరాహారం పాటించాలి. ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. వృథాగా బయట తిరగడం సూర్య చంద్ర కిరణాలు పొందడం చేయరాదు. సూర్యచంద్రాదులను చూడడానికి ప్రయత్నించరాదు. 

=====================

గాయత్రీ జపం చేయవచ్చా?

చేయవచ్చా కాదు. చేయాలి. చేసితీరాలి. గ్రహణవిముక్తి, మోక్షకాలం వరకూ చేస్తూనే ఉండాలి. కేవలం గాయత్రినే కాదు. ఎన్ని ఉపదేశాలు పొందితే ఆ మంత్రాలు అన్నీ జిపించాలి.

=================================

తర్పణాలు విడువవచ్చా? 

కేవలం తర్పణాలు మాత్రమే కాదు. పిండప్రదానాలు వంటివి కూడా చేయాలి. కనీసం గోసేవ చేసుకొని పెద్దలను పేరుపేరునా తలచుకున్నా చాలు. గ్రహణాలు షణ్ణవతుల్లో భాగం. అంటే పితృదేవతార్చనలు చేయవలసిన తప్పనిసరి రోజుల జాబితా లోనిది. ఈ రోజున పెద్దల పేరిట దానాలు చేసినా తర్పణాలు విడిచినా పెద్దలు అపారంగా సంతోషించి మనసులోని కోరికలు అన్నీ తీరుస్తారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా సంతృప్తి చెందుతారు. నిజానికి పితృశాపాలు, దోషాల నుంచీ విడుదల పొందడానికి జాక్ పాట్ వంటివి. జన్మదోషాలు జాతక దోషాలు కూడా ఈ సమయంలో పితృదేవతార్చనల వలన పోతాయి. దానాలు, తర్పణాదులు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకున్నా సమస్త దేవతలూ సంతోషిస్తారు. అన్ని కోరికలూ తీరుస్తారు.

=============================

ఆచమనం చేయవచ్చా?

ఇది మంచి ప్రశ్నే. గ్రహణ కాలంలో నీరు కూడా త్రాగకూడదు. అయితే ఇది అందరికీ చెప్పలేదు. కేవలం కఠినమైన సాధనలు చేసే వారికి మాత్రమే చెప్పారు. గ్రహణ స్పర్శకాలానికి ముందే సంధ్యావందనాదులు ప్రారంభించి గాయత్రీ ధ్యానాదులు, అంగన్యాస కరన్యాసాదులు చేసేసుకొని జపం మొదలు మొదలు పెట్టాలి. గ్రహణ స్పర్శకాలంలోకి జపం చేస్తూ ప్రవేశించాలి. గ్రహణ మోక్షకాలం వరకూ జపం చేస్తూనే ఉండాలి. గ్రహణ మోక్ష స్నానం చేసిన తరువాత కాఫీ టీలు సేవించాలి.

=============================

స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా?

స్త్రీలు స్తోత్రాదులు మాత్రమే చదువుకోవాలి. వారికి జపతపాదులు చెప్పలేదు. అయితే నేడు అనేక మంది స్త్రీలకు కూడా మంత్రోపదేశాలు చేస్తున్నారు. కనుక మంత్రోపదేశం పొందిన వారు కూడా జపాలు చేసుకోవాలి. అయితే స్త్రీలు శివ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా సప్తశతి వంటివి గీతవంటివి చదువుకోవచ్చు. లేదా నామస్మరణను చేసుకోవచ్చు. అంటే బీజాక్షరాలు మంత్రాక్షరాలు లేకుండా కేవలం నామసాధన చేయవచ్చు. లేదా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు. 

గర్భిణీలు, రజస్వలలు ఏమీ చేయకుండా క్రీయాశూన్యంగా పడుకోవాలి.

===================

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగిఃచాలా?అక్కర్లేదా?

గ్రహణ సమయానికి ముందు, తరువాత జ్యోతి ప్రజ్వలనాలు చేయవచ్చు. కార్తీక మాసం వస్తోంది కనుక స్పర్శా కాలానికి పూర్వమే దీపప్రజ్వలన చేయాలి. మోక్షం తరువాత మరలా జ్యోతి ప్రజ్వలనం చేయవచ్చు.

==================

రాత్రి లేదా పగలు భోజనం కాక పళ్లు ఫలహారం పనికొస్తుందా?


నేడు సూర్యగ్రహణం గ్రస్తాస్తమయం అవుతుంది. అలాగే చంద్రగ్రహణం గ్రస్తోదయం అవుతుంది. అంటే గ్రహణం ఉండగానే సూర్యాస్తమయం అవుతుంది కనుక మరునాడు సూర్యుడిని చూసేంత వరకూ అశౌచం ఉంటుంది. అంటే మరునాడు సూర్యోదయం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని వండుకొని తినాలి. అప్పటి వరకూ ఏమీ తిన కూడదూ త్రాగరాదు. అలాగే చంద్రగ్రహణం గ్రస్తోదయం అవుతుంది. అంటే చంద్రోదయానికి పూర్వమే గ్రహణం ప్రారభమవుతుంది. అంటే చంద్రోదయానికి చంద్రుడు గ్రహణంలో ఉంటాడు. కనుక ఆరోజు పగలు భోజనాదులు చేయరాదు. సాయంత్రం చంద్రగ్రహణ మోక్షం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని అశౌచ శుద్ధి చేసుకొని వండుకొని తినాలి.

అయితే ఈ నియమాలు అందరికీ వర్తించవు. ముఖ్యంగా పిల్లలకు బాలబాలికలకూ, గర్భవతులకు, దీర్ఘకాలప్రాణాంతక వ్యాథులు ఉన్నవారికి, బిపిలు షుగర్లు వంటి ఉన్నవారికి, వృద్ధులకూ, బాలింతలకు మినహాయింపులు ఉన్నాయి. వీరు పాటించాల్సిన అవసరం లేదు. అయితే గర్భవతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పాలుతాగే పిల్లలలకు మినహాయింపు ఉంది. తల్లిపాలకు దోషం లేదు. 

ఇక ఆకలికి ఆగలేని వారు దుంపలు, సగ్గుబియ్యంతో చేసినవి, అటుకులతో చేసిన పదార్థాలు పళ్ళు పాలు వంటివి తీసుకొని తీరాలి. గృహస్థులకు శుష్కోపవాసాలు చెప్పలేదు. కనుక ఫలహారాలు సేవించవచ్చు. సేవించాలి. 

=========================

దానాలు  గ్రహణం సమయంలోనా లేక విడిచిన తరువాతా?గ్రహణం సమయంలో అయితే బ్రాహ్మణులు దొరకరు కదా? 

ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రంలో ఉన్నదాని కన్నా ఆచరణలో ఉన్నదానికే ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రహణ సమయంలో ప్రతీ బ్రాహ్మణుడూ గాయత్రినో లేదో ఏదో ఒకసావిత్రినో ఆశ్రయించి జపం చేసుకుంటూ ఉంటారు. కనుక వారు దొరకరు. అయితే నదీనదాలు పుణ్యక్షేత్రాదుల్లో కొందరు బ్రాహ్మణులు గ్రహణకాల సేవల్లో ఉంటారు. కనుక వారి సలహాప్రకారం చేసుకోవాలి.

=====================

ఇష్టదైవం ప్రీత్యర్థంఅనా లేక సూర్య/ చంద్ర ప్రీత్యర్థం అనా జపసంకల్పం చేయాలి?


కేతగ్రస్త సూర్యగ్రహణదినే గ్రస్తాస్తమయ గ్రహణకాలే

రాహుగ్రస్త చంద్రగ్రహణ దినే గ్రస్తోదయ గ్రహణ కాలే అని సంకల్పాలు చెప్పుకొనాలి.

కొంత మంది సూర్యోపారగ, సోమోపారగ అని కూడా చెబుతారు. హిరణ్యశ్రాద్ధాదులు నిర్వహిస్తారు.

https://chat.whatsapp.com/GDbe0UUwmB38nz6GKvSMkS

==================

మిడిల్ క్లాస్..

 *మెస్సేజ్


▪ రూపాయి బియ్యం తినలేం.. 

       50 రూపాయలకి బియ్యం కొనలేం 

▪ మున్సిపల్ నీళ్ళు తాగలేం.. 

       మినరల్ వాటర్ కొనలేం

▪ ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం..

      కలల ఇల్లు కట్టుకోలేం

▪ ప్రభుత్వ బడికి పంపలేం..

      కార్పొరేట్ ఫీజులు కట్టలేం

▪ సర్కారు దవాఖానా కు పోలేం..

       కార్పొరేట్ బిల్లులు కట్టలేం

▪ సిటీ బస్సుల్లో వెళ్ళలేం..

      బండికి పెట్రోలు కొనలేం


ఎందుకంటే..మనం మిడిల్ క్లాస్..కాబట్టి.!!!


👋🏻కులం పోవాలని చెప్పేది మనమే..

👋🏻కులం చూసి ఓటు వేసేది మనమే..

👋🏻అవినీతి పోవాలనేది మనమే..

👋🏻అవకాశం. వస్తే అవినీతిని సమర్ధించేది మనమే..

👋🏻ఇంటికో భగత్ పుట్టాలని చెప్పేది మనమే..

👋🏻మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే..

👋🏻మార్పు రావాలని చెప్పేది మనమే..

👋🏻అబ్బే పబ్లిక్ మారరండీ అంటూ నిరాశ నూరిపోసేది మనమే..

అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే ........

వెర్రి గొర్రెలు..


 *✅ అదేమి విచిత్రమో గానీ ... శవాన్ని

 ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడి - మేక - గొర్రె లను చంపి తింటుంటాం.*


​✅ ఎంత మూర్ఖులం కాకపోతే ....దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం కానీ అవే దీపాలను ఆర్పి పుట్టిన రోజులు జరుపుకుంటాం.​


​✅మన ఆచారాలు ఎలాంటివి అంటే.......ప్రాణం పోయిన శవం ముందు వెళ్తుంటుంది - ఊరు జనం అంత వెనుక వస్తుంటారు. అలాగే పెళ్ళికొడుకు - పెళ్ళికూతురు ఊరేగింపులో వెనుక వస్తుంటారు కానీ ఊరు జనం అంతా ముందు వెళ్తుంటారు.​


​✅ మంచి పని చేసేవాడు ఊరు ఊరు వెళ్తాడు కానీ చెడ్డ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళడు .......... సారాయి (వైన్ షాప్) అమ్మేవాడు ఒక దగ్గరే ఉంటాడు కానీ అదే పాలు అమ్మేవాడు ఊరు ఊరు - వీధి వీధి - ఇంటి ఇంటికి వెళ్తాడు.​


​✅ మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే ....పాలవాడుని మాటి మాటికి అడుగుతుంటాం - నీళ్ళు కలిపావా అనీ, కానీ మందులో మాటి మాటికి నీళ్ళు కలిపి త్రాగుతుంటాం.​


​✅ 


​✅ విచిత్రం ఏమిటంటే ......గోడకు తగిలించిన మేకు జీవితాంతం ఫొటోని మోస్తుంది కానీ మనం మాత్రం ఆ ఫొటోని పొగుడుతుంటాం అసలు మేకుని పట్టించుకోం.​


​ఎవరైనా నువ్వు " పశువు " లా ఉన్నావు అంటే చాలు కోపగించుకుంటాం కానీ నువ్వు " సింహంరా (పులిరా) " అంటే చాలు లోలోనే ఎగిరి గంతులు వేసి ఆనందిస్తాం.!​ 

నిజమె కదా.....👍👍

అందరూ అసురస్వభావం కలవారు

 ** బహుశా 1987 లో అనుకుంటా...మా తాతపాదుల వారిని అడిగి ఉంటా... నరకచతుర్దశి అంటే ఏమిటని..? 

**కృష్ణుడు ఉన్న ద్వాపర కాలం కంటే ముందు ఈ పండుగ తలంట్లు లెవా .. ? అని...అప్పుడు మా తాత కొన్ని అంశాలు చెప్పి...నా దేహం లోని సందేహాలు తీర్చే ప్రయత్నం చేశారు...


**నరకుడు ఒక్కళ్ళు కారని... ఇరవై నాలుగు లేక ఇరవై ఐదు మంది రాజులు ఒకే వంశానికి చెందిన వారి వంశ నామం నరక యని...అందరూ అసురస్వభావం కలవారు కారని...చివరి నరక యను వంశ నామం కలవాడే అసురస్వభావం కలవాడవుట వలన నరకాసురుడు అని పిలువబడ్డాడని...

మా మాతామహుల  మరియు వారి..మేనమామ గరై నట్టి నా పితమహులైన గణపతిశాస్త్రీ గారి ద్వారా నా చిన్నప్పుడు తెలుసుకున్నా...!


** బహుశా కాళికాపురాణం అనే పేరు తో మా తాత చెప్పిన విషయాలు... ఆయన గతించి, పదహరేళ్లు,అవుతున్నా... నాకు చెప్పినది...పాతికేళ్ల క్రితమే అయినా మా తాతలను తలచిన మరుక్షణమే నాకా... రోజులు కళ్ల ముందు గోచరిస్తున్న ట్లు గా ఉంది..

.

** నరకచతుర్దశి యనగా నరకం నుండి దుర్గతి నుండి తరింపచేయు చతుర్దశి యని సనాతన భారతీయ గ్రంథాలు చెపుతున్నాయి..

శ్లో|| ఆశ్వయుకృష్ణపక్షస్య,

   చతుర్దశ్యాం విదూదయే,

   తిలతైలేన కర్తవ్యం

    స్నానం నరక భీరుణా...

అని పద్మపురాణం లో చెప్పబడింది. "నరకము వలన భీతిల్లు వారు అనగా భయపడు వారు ఆశ్వయుజ కృష్ణ బహుళ చతుర్దశి నాడు చంద్రోదయ కాలమున కు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయవలెనని దీని అర్ధం.


శ్లో|| " కర్తవ్యం మంగళ స్నానం నరైర్నిరయ భీరుభిః "


 అనే" కాలాదర్శం " లోని అంశం ద్వారా..నరకశబ్ద పర్యాయ పదమగు నిరయ శబ్దము ను ఉదహరించబడుట ద్వారా...


నరకచతుర్దశి లోని నరక శబ్దమునకు  నరకమని యర్థమే కానీ నరకాసురుడని..కాదు..

 ఎందుకనగా..నరక "భీతి" గలవారు ఆచరింపవలసినది విధించు విధి అయిన తైలాభ్యంగన స్నానము నరకాసురుడు గతించిన కాలము వారికి అన్వయింపలేము  కదా !...


** ఈ విధి ని లోక ప్రాచుర్యం పొందిన  నరకాసురుడి సంహారం ముందు నుండే వాడుకలో ఉండేది..కాకుంటే కృష్ణపరమాత్మ సత్యభామా సమేతుడై  ,లోకకంఠకుడైన నరకుని సంహరించిన రోజు కూడా ఈ రోజే అవడం మూలానా, నరకచతుర్దశి లోని నరక పదానికి..నరకాసురుడని భ్రమించి భావించడంజరిగి ఉండవచ్చు...

ఆ తియ్యని జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని...

ఇలా....మీ తో....

గురు అక్షరమాల స్తుతి*

 *గురు అక్షరమాల స్తుతి*



*అ - అద్వైతమూర్తి - గురువు*

*ఆ - ఆనందస్ఫూర్తి - గురువు*

*ఇ - ఇలదైవం - గురువు*

*ఈ - ఈశ్వరరూపము - గురువు*

*ఉ - ఉద్ధరించువాడు - గురువు*

*ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు*

*ఋ - ఋజువర్తనుడు - గురువు*

*ౠ - ఋణము లేనివాడు - గురువు*

*ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు*

*ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు*

*ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు*

*ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు*

*ఓ - ఓంకార రూపము - గురువు*

*ఔ - ఔదార్య మేరువు - గురువు*

*అం - అందరూ సేవించేది - గురువు*

*అః - అహంకార రహితుడు - గురువు*

*క - కళంకము లేనివాడు - గురువు*

*ఖ - ఖండరహితుడు - గురువు*

*గ - గుణాతీతుడు - గురువు*

*ఘ - ఘనస్వరూపము - గురువు*

*ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు*

*చ - చక్రవర్తి - గురువు*

*ఛ - ఛత్రము వంటి వాడు - గురువు*

*జ - జనన మరణములు లేని వాడు - గురువు*

*ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు*

*ఞ - జ్ఞానస్వరూపము - గురువు*

*ట - నిష్కపటుడు - గురువు*

*ఠ - నిష్ఠకలవాడు - గురువు*

*డ - డంబము లేనివాడు - గురువు*

*ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు*

*ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు*

*త - తత్త్వోపదేశికుడు - గురువు*

*థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు*

*ద - దయాస్వరూపము - గురువు*

*ధ - దండించి బోధించువాడు - గురువు*

*న - నవికారుడు - గురువు*

*ప - పంచేంద్రియాతీతుడు - గురువు*

*ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు*

*బ - బంధము లేనివాడు - గురువు*

*భ - భయరహితుడు - గురువు*

*మ - మహావాక్యబోధకుడు - గురువు*

*య - యమము కలవాడు - గురువు*

*ర - రాగద్వేష రహితుడు - గురువు*

*ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు*

*వ - వశీకరణశక్తి కలవాడు - గురువు*

*శ - శమము కలవాడు - గురువు*

*ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు*

*స - సహనశీలి - గురువు*

*హ - హరిహర రూపుడు - గురువు*

*ళ - నిష్కళంకుడు - గురువు*

*క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు*

*ఱ-ఎఱుకతో ఉన్నవాడు - గురువు*

*🙏

Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 52 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ప్రహ్లాదుడు చెప్తున్న విషయములను విని హిరణ్యకశిపుడు కోపించిన వాడై గురువుల వంక చూశాడు. మేమేమీ చెప్పలేదు మహా ప్రభో అన్నట్లు హడలిపోయి చూస్తున్నారు చండామార్కులు. ‘ఈ పద్యములన్నీ నీకు ఎక్కడినుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణుని సేవించాలని ఎలా చెప్తున్నావు? నీకీ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు. వాళ్ళ సంగతి చూస్తాను’ అన్నాడు. ప్రహ్లాదుడు  ‘నాన్నా! నీలాంటి వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారని చెప్పినా నీకు అర్థంకాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెపితే తలకెక్కుతుందా! అజ్ఞానావస్థలో కోరికోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మే నీలాంటి అహంకార పూరితమయిన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెపితే నీకు అర్థం అవుతుంది?’ అని అన్నాడు.

ఈ మాటలు వినేసరికి హిరణ్యకశిపునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను పిలిచి ‘వీడిని చంపండి. వీడిని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు ఆహారం ఇవ్వడం మానేయండి. ఆ తరువాత వీడి నవరంధ్రములు మూసేసెయ్యండి. ఆ తరువాత నేను నా మాయను చూపెట్టి భయపెడతాను. మరుగుతున్న నూనెలో వేయండి. పర్వత శిఖరముల మీదనుండి కిందకి తొయ్యండి. ఏనుగులతో తొక్కించండి. సముద్రంలో పారెయ్యండి’ అన్నాడు.

తనని శూలంపెట్టి రాక్షసులు పొడిచేస్తుంటే, పర్వత శిఖరం మీదనుంచి కింద పారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కిందపడేసి ఏనుగుల చేత తొక్కిస్తుంటే, రాక్షసులలో, తండ్రిలో, అందరిలో, అంతటా శ్రీమన్నారాయణుని చూసి పొంగిపోతుంటే గుప్తరూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకుంటున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగడం లేదు. ఈశ్వరుడిని నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది. రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేస్తుంటే అంతకంతకీ తేజోవిరాజితుడు అయిపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమయిన స్థితిని పొందాడు. తన వాడయిన కారణం చేత, తనయందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు. హిరణ్యకశిపుడు రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నింటిని ప్రయోగించాడు. అతడు చచ్చిపోలేదు కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొలదీ పిల్లవాడు ఎక్కువ తేజమును పొందుతున్నాడు.  గురువులు ‘బెంగ పెట్టుకోవద్దు. చావుతో సమానమయిన మందు ఒకటి మావద్ద ఉన్నది. వీనిని తీసుకువెళ్ళి అది వేస్తాము. ఈ పిల్లవాడికి వయస్సు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేస్తాము. వీడు భ్రష్టుడయిపోతాడు. సంసారమునందు అనురక్తి కలుగుతుంది’ అని చెప్పి పిల్లవాడిని తీసుకువెళ్ళి అతనికి శాస్త్రబోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినది చక్కగా నేర్చుకుంటున్నాడు.

ఒకరోజున గురువులు తమ గృహకార్యములను నిర్వర్తించుటకు లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడు పిల్లలందరినీ పిలిచి ‘ఒరేయ్ మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేను మీకొక విషయం చెప్తాను. మీరందరూ కూర్చోండి. అని మనకి ఆయుర్దాయం నూరు సంవత్సరములు. రాత్రి అయితే నిద్రపోతాము. ఏభై ఏళ్ళు నిద్రలో పోతుంది. ఇరవై ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది. ఇంకా మిగిలింది ముప్పది ఏళ్ళలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటికన్నింటికీ తగుల్కొని అరిషడ్వార్గాలకి లొంగిపోతాయి. నా మాట వినండి. ఈ పంచ భూతములను, మూడు గుణములను, ఇరవై ఏడు తత్త్వములను నిర్మించి మాయచేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మ దర్శనాభిలాషులు అవండి. నామాట నమ్మండి’ అన్నాడు. వాళ్ళు ‘ఈపాఠం చాలా గమ్మత్తుగా ఉన్నది. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు. మాతోనే చదువుకున్నావు. గురువులు మాకేమి చెప్పారో నీకు కూడా అదే చెప్తున్నారు. గురువులు చెప్పని విషయములు నీకు ఎవరు చెప్తే వచ్చాయి?’ అని అడిగారు. ప్రహ్లాదుడు ‘మహానుభావుడయిన నారదుడు చెప్పాడు’ అని బదులిచ్చాడు. వాళ్ళు ‘నారదుని నీవు ఎప్పుడు కలుసుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు?’ అని అడిగారు.

హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురువచ్చి ‘మహాపతివ్రతయిన ఆమెను ఎందుకు చెరపట్టి తీసుకువెళుతున్నావని అడిగాడు. ఆయన ‘నాకు ఆవిడ మీద క్రోధం లేదు. ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని తేజం ఉన్నది. వాడు తపస్సుయందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డపుట్టి వాడు కూడా పెరిగి పెద్ద వాడయితే చాలా ప్రమాదం.  ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు.  నారదుడు ‘నీకేమి తెలుసు! ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడయిన వాడు ఉన్నాడు. వాడు జన్మచేత భక్తిజ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము.  లీలావతిని నా ఆశ్రమమునకు తీసుకువెడతాను’ అని తీసుకు వెళ్ళి అక్కడ వేదాంత తత్త్వమును ప్రబోధం చేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రమేమిటంటే విన్న లీలావతి మరిచిపోయింది. కడుపులో ఉన్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. ‘మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యములలో నారదుడు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నాయందు ఉన్నది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం, జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా’ అన్నాడు.

 పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలు పెట్టారు. లోపలనుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుడిని పట్టుకుని జరజర ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి ‘తులసివనంలో గంజాయిమొక్క పుట్టినట్లు రాక్షసవంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పడం దేవుడెరుగు వీడు రాక్షస బాలకులనందరిని పాడు చేసాడు. అందరిని నారాయణ భక్తులుగా చేస్తున్నాడు’ అన్నారు.  హిరణ్యకశిపుడు ‘ఎవరి దిక్కు చూసుకుని, ఎవరి బలం చూసుకొని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు?’ అని కుమారుని చూసి అడిగాడు.

బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్!

బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బల మసురేంద్రా!

‘నాన్నా! నీలో బలానికి కారణమెవడో వాడే నాలో బలమునకు కూడా కారణం. బలహీనుడయిన వానిలో ఉన్న కొంచెం బలానికి కారణం ఎవరో లోకములను సంపాదించిన మహాబలవంతుల బలమునకు కారణమెవడో వాడు నాకు దిక్కు’ అన్నాడు. ‘ఏమిరా ! వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా! వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’ అని  అడిగాడు. ‘నాన్నా! ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేమిటి? ఇదొక వెర్రి ప్రశ్న.

ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూసిన నందందే కలడు దానవాగ్రణి! వింటే.

జ్ఞాననేత్రంతో చూస్తే దంతి కనపడదు. దారువు కనపడుతుంది. ఆభరణం కనపడదు. స్వర్ణం కనపడుతుంది. పాత్ర కనపడదు. మట్టి కనపడుతుంది. జ్ఞాన నేత్రంతో చూడు. ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు. నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యి’ అన్నాడు. ఒక ప్రక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ

కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం

గల, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం

గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం

గల, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్!!

నాన్నా! ఈశ్వరుడు ఎక్కడలేడు? అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. రాత్రులందు పగలందు, ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారము నందు సమస్త ప్రపంచమునందు నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆయనలేని ప్రదేశం లేదు’ అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

మృకండు మహర్షి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*మన మహర్షుల చరిత్రలు*..


*🌹ఈరోజు 60,వ మృకండు మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🍁మనం మృకండు మహర్షి గురించి తెలుసుకుందాం . 

మృకండు మహర్షి తండ్రి మృగశృంగ మహర్షి తల్లి పేరు సువృత్త .


☘️మృగశృంగ మహర్షికి నలుగురు భార్యలు , వారు నలుగురు మహర్షులను సేవలతో సంతోషంగా సేవలు చేస్తూ ఉండేవారు.

అతడును వారిపట్ల సమాన ప్రేమను చూపెడుతూ ఆనందపరిచాడు. 


☘️వారు నలుగురు ఒక్కసారిగా గర్భము లు ధరించి నలుగురు పుత్రులను కన్నారు. అందులో సువృత్త కుమారుడే మృకండుడు. 


🍁మృకండు మహర్షి నాలుగు వేదాలు సకల విద్యలు నేర్చుకుని , చక్కటి వినయ విధేయతలున్న వాడిగా పేరు తెచ్చుకున్నాడు .


☘️మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల


🍁 మృగములు వచ్చి తమ కండుయాన్ని (దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం) తీర్చుకొనేవి.


☘️ మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు.


🍁 మృకండుడు పెద్దవాడయ్యాక ముద్గల మహర్షి కూతురు మరుద్వతినిచ్చి పెళ్ళి చేశారు . 


☘️వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి 


🍁వారణాశి కి తపస్సు చే..యడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు.

అన్ని తీర్థాలు తిరుగుతూ తల్లులతో సహా కాశీకి చేరుకున్నాడు .


☘️ అక్కడ గంగాస్నానం చేసి అందరూ డుంఢి వినాయకుణ్ణి దర్శించుకుని ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు .


🍁 ఆ శివలింగాన్ని చూసిన వాళ్ళకి కోరికలునెరవేరేలాగగృ శివుడి అనుగ్రహం ఉంది . మృకండు మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాన్ని మృకండీశ్వరుడు అంటారు .


☘️ ఆలింగాని దర్శించిన వాళ్ళకి తలచిన పన్లు నెరవేర్తాయి . అలాగే మరుద్వతీశ్వరుణ్ణి దర్శిస్తే జన్మరాహిత్యం కల్గుతుంది .


🍁 మృకండుడి తల్లుల పేర్ల మీద ప్రతిష్ఠించిన శివలింగాల్లో సృవ్వతేశ్వర దర్శనం మంచి శీలాన్ని ఇస్తుంది . 


☘️ ఏ పని తలపెట్టినా విఘ్నం లేకుండా చేస్తుంది . కమలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే కావాలనుకున్న పన్లు చక్కగా జరుగుతాయి . 


🍁విమలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే విమల జ్ఞానం వస్తుంది . ఇలా ఒక సంవత్సర కాలం మృకండుడు కాశీలోనే వున్నాడు . 


☘️తల్లులు పెద్దవాళ్ళయిపోవడం వల్ల అక్కడే మరణించారు . మరుద్వతీ మృకండులు కాశీలోనే ఉండిపోయి గంగాస్నానం చేసి శివుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతున్నారు .


🍁సంతానం కోసం మృగండు మహర్షి , శివుడు గురించి ఘోర తపస్సు చేస్తాడు

మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని పరీక్ష చేయడానికి


☘️ మహర్షి నీకు ఏం కావాలనడిగాడు . పిల్లలు కావాలి అనుగ్రహించమన్నాడు మృకండ మహర్షి . 


🍁 చాలా గుణవంతుడు విద్యావంతుడయి పదహారేళ్ళే బ్రతికే కొడుకు కావాలా ? గుణం లేనివాడు చదువు రాని వాడు చిరంజీవి కావాలా ? అనడిగాడు శివుడు .


☘️మృకండు మహర్షి ఆయువు తక్కువున్నా ఫర్వాలేదు . విద్యావంతుడు , సుగుణవంతుడు కావాలన్నాడు . అలాంటి కొడుకు వల్లే కదా తల్లిదండ్రులకి ఆనందం ...... శివుడు అనుగ్రహించాడు . 


🍁కొంతకాలం తర్వాత మృకండు మహర్షికి కొడుకు పుట్టాడు . వెంటనే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది . దేవదుందుభులు మ్రోగాయి . నదులు నిండుగా ప్రవహించాయి .


☘️ వ్యాసభగవానుడు శిష్యుల్తో సహా వచ్చి , దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా ఆ పిల్లవాడికి నామకరణం చేశాడు . ఆ పిల్లవాడి పేరు ' మార్కండేయుడు ' . 


🍁 ఆ పిల్లవాణ్ణి కన్న మరుద్వతీ మృకండు మహర్షుల్ని అందరూ అభినందించాడు . ఎవరికీ చూడడానికి దొరకని వ్యాసభగవానుడు వచ్చేసరికి,


☘️ మృకండుడు ఆనందం పట్టలేక ఆయన పాదాల్ని ఆనందభాష్పాల్తో కడిగి కృతజ్ఞత చెప్పుకుని ఆయన్ని పూజించి , గౌరవించి , సన్మానించి పంపాడు .


🍁 మార్కండేయుడు పెరిగి పెద్దవాడై తల్లిదండ్రులు చెప్పినట్లు తపస్సు చేసి చిరంజీవిగా వరం పొంది తల్లిదండ్రుల్ని ఆనందపరిచాడు . 


☘️ఇదండి మృకండు మహర్షి గురించి మనకు అందిన సమాచారం రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి!


*సేకరణ:*  శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

వైరభక్తి కూడా ఒక్కటి

 నరక చతుర్దశి - దీపావళి


దీపావళి నరక చతుర్దశి రెండు సమానమే. ఇది భారతదేశం అంతటా జరుపుకునే జాతీయ పండగ. ఉత్తర భారత దేశంలో దీనిని ఎక్కువగా దీపాల పండుగ లాగా ఇళ్ళను దీపాల వెలుగులో నింపి చేసుకుంటారు. దక్షిణాపథంలో వేకువనే నువ్వుల నూనెతో తలంటు పోసుకుని కొత్త బట్టలను కట్టుకుంటారు. దీనివల్ల శ్రేయస్సు కలిగి జీవితంలో పడుతున్న కడగండ్ల నుండి విముక్తి కలుగుతుంది. 


అమావాస్యకు ముందురోజైన చతుర్దశి నాడు సూర్యుడు తులా రాశిలో ఉండగా శ్రీమహాలక్ష్మి సాన్నిధ్యం వల్ల నువ్వుల నూనె పవిత్రమవుతుంది. నీటిలో గంగా సాన్నిధ్యం వల్ల మొత్తం నీరంతా గంగాజలంతో సమానం అవుతుంది. పసివాడి నుండి సన్యాసి వరకు, ధనికుడి నుండి బిదవాని వరకు ప్రతి ఒక్కరూ తైలాభ్యంగన స్నానము చెయ్యాలి. పరమ సంతోషంతో భగవంతుణ్ణి ఆరాధించి ప్రతి చోట పార్టి మూలలోనూ దీపములను వెలిగించాలి ఈ దీపావళి (దీపముల యొక్క వరుస) నాడు.


భూదేవి తన కుమారుడైన నరకాసుర సహారం జరిగినప్పుడు శ్రీకృష్ణున్ని అడిగిన వరం ఇదే. “నా కుమారుని మరణం వల్ల నాకు కలిగిన ఈ దుఃఖం, ఈనాడు ప్రపంచంలోని అందరి సుఖ సంతోషాల వల్ల తిరిపోవాలి” అని కోరింది ఆ వీరమాత. అన్ని పండుగలు ఉత్సవాలకెల్ల దీపావళి చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే, వ్యక్తిగతంగా రెండు హృదయాలకు (భూదేవి, నరకాసురుడు) కలిగిన బాధ వల్ల ప్రపంచానికి కలిగిన హర్షాతిరేకమే ఈ దీపావళి. చేసిన తప్పులకు ప్రాణాలు వదిలిన ఆ రాక్షసుడు, కన్న కొడుకును కోల్పోయి పుత్రశోకంతో ఉన్న ఆ తల్లి  ఇద్దరి కోరిక ఎంతో ఉన్నతమైనది.


[భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎన్నో మార్గములు. అందులో వైరభక్తి కూడా ఒక్కటి. శ్రీ కృష్ణావతారంలో కంస, శిశుపాల, పౌండ్రక, నరకాసుర ఇలా ఎందరినో పరమాత్మ తనలో ఐక్యం చేసుకున్నారు. ఎలా వెళ్ళినా ఆయన పాదలచెంతకే, కాని వైరభక్తి వల్ల బ్రతికినంతకాలం ప్రశాంతత లేక భయంకరమైన మరణ వేదనను అనుభవించి చనిపోతారు. దుర్మార్గులు రాక్షసులుగా మిగిలిపోతారు. వారు నడిచిన మార్గం అధర్మంతో కూడుకున్నది కాబట్టి అడి ఆచరణ యోగ్యము కాదు]


--- kamakoti.org నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం