14, అక్టోబర్ 2022, శుక్రవారం

గీత ప్రాముఖ్యత

 గీతలోని మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 వాక్యాలలో ఇక్కడ ఇస్తున్నాను.


 వన్ లైనర్ గీత -

 దీన్ని అందరికి ఫార్వార్డ్ చేసి సర్క్యులేట్ చేస్తారా? ప్రతి ఒక్కరూ దీన్ని 4 రోజుల్లో 100 మందికి ఫార్వార్డ్ చేయాలని అభ్యర్థించారు. మీ రాష్ట్రంలోనే కాదు, ఇది మొత్తం భారతదేశానికి ఫార్వార్డ్ చేయాలి.


 వన్ లైనర్ గీత


 *అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .*

 *అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.*

 *అధ్యాయం 3 - నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం.*

 *అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .*

 *అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి .*

 *అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.*

 *అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .*

 *అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి.*

 *9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .*

 *అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .*

 *అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి.*

 *అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.*

 *అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం.*

 *అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.*

 *అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .*

 *అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.*

 *అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం .*

 *అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.*

 (ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)

                          

                   || ॐ తత్సత్ ||


  - దీన్ని 1ఫార్వార్డ్ చేసి, గీత ప్రాముఖ్యతను వివరించవలసిందిగా నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నాను.

      ⛳ జైశ్రీరామ్⛳

త్రిపురసుందరీ ఆలయం

 🙏🌹త్రిపురసుందరీ ఆలయం- 

త్రిపురాంతకం🌹🙏*శివుడు లీలామయుడు. సర్వాంతర్యామి. భోళా శంకరుడైన శివుడు ఆశ్రిత జన రక్షకుడిగా తన పేరును సార్ధకం చేసుకున్నాడు.*


*ఈ లోకంలోని సమస్తమైన పాపాలు,దుష్కర్మలు శివనామ స్మరణంతోనే మటుమాయమవుతాయని శివపురాణాలు చెప్తాయి.*


*అలా శివుడు కొలువు దీరిన మరో అతి పురాతన దివ్యక్షేత్రమే త్రిపురాంతకం.*


*శ్రీశైల పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహా శైవధామమే త్రిపురాంతకం.*


*త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువుదీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు వేదికగా, ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది.*


అలాంటి ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న ఈ క్షేత్రం ప్రకాశం, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉంది.


*శ్రీశైల ద్వారాలలో ప్రథమం, ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైలం క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది.*


*శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్ఠాన దేవత అయిన బాలా త్రిపుర సుందరి కూడా ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంది.*


ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే త్రిపురాంతకంలో ప్రధాన ఆలయం త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయం.


కుమారగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నెలవు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లతో పాటు ఘాట్‌రోడ్డు సదుపాయం ఉంది.


ఆలయానికి వెళ్లే మార్గంలో వందలకొద్దీ శివలింగాలు దర్శనమిచ్చి ఇది భూలోక కైలాసమా అనే అనుభూతిని భక్తులకు కలిగిస్తాయి.


అతి పురాతన ఈ ఆలయ అభివృద్ధికి చోళ, రాష్టక్రూట, విజయనగర ప్రభువులు విశేషంగా కృషి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది.


*దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది. మది పులకించే సుందర మండపాలు, శిల్పాలు, మందిరాలతో ఈ ఆలయం అలరారుతుంది.*


*పురాణగాథ:*


విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి మనసు కలత చెంది కైలాసం వీడాడని అంటారు. అలా కైలాసం వీడిన కుమారస్వామి త్రిపురాంతకానికి సమీపంలో గల కొండపై తపస్సు చేశాడట.


అతని తపస్సుకు మెచ్చిన పార్వతీపరమేశ్వరులు ఆనాటినుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారని ఇక్కడ స్థల పురాణ కథనం.


దీనివల్లే ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరువచ్చినట్టు తెలుస్తుంది.


*ఆది దంపతులకు ప్రతిరూపం ఈ క్షేత్రం.*


త్రిపురాసుర సంహారం ఈ క్షేత్రంలోనే జరగడంవల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది.


త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమిగా ఉన్నది ఈ క్షేత్రం.


అలాంటి మహిమగల ఈ దేవాలయ ధ్వజ స్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయని భక్తుల నమ్మకం.


*ఈ స్వామి దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం ..*


త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమ శివుడే చెప్పాడని అంటారు.


ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వరస్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు. అణువణువు శివ నామస్మరణంతో మారుమోగే ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు.


తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవాడు. ప్రతి పౌర్ణమి *నాడు పార్వతీ దేవి,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూడటానికి వస్తూ ఉండేవారని శివ పురాణంలోని ఈ శ్లోకం మనకు తెలియ జేస్తోంది –‘’*


*అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం ‘’*


ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి.


ప్రధానాలయం శ్రీ చక్రాకారంలో నిర్మించబడింది శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు అలాంటి అరుదైన దేవాలయం ఇది.


*’’శ్రీ చక్రం శివ యోర్వపుః’’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం .*


*స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట.అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి.*


అమ్మవారు పార్వతీ మాత. ఆలయ ప్రాంగణంలో అపరాధీశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశవ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, కుమారస్వామి, నగరేశ్వర స్వామి మందిరాలు దర్శనమిస్తాయి.


ఆలయంలో ఒక పక్క అగస్త్య మహాముని నిర్మించాడని చెప్పబడుతున్న బిల్వ మార్గమొకటి ఉంది. దీనిని చీకటి గుహగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గంగుండానే వెళ్లేవారని ప్రతీతి.


ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి. ఇక్కడే మరోపక్క గణపతి మండపం ఉంది.


దీనికి సమీపంలోనే నవగ్రహాలయం ఉంది. ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శృంగి, భృంగి, నందీశ్వరుడుతోపాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి.


*త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి కింద చెరువులో బాలా త్రిపుర సుందరి మాత ఆలయం ఉంది. బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృశ్చికేశ్వరాలయం, పాపనాశనం దర్శనమిస్తాయి. ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి.*


వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబ వనం ఉంది. ఉజ్జయిని,


కోల్‌కతా, కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు.

అమ్మవారు కదంబ వనవాసిని కావడంవల్లనే ఇక్కడిలా కదంబ వనం ఉందని భక్తులు చెబుతారు.


త్రిపురాసుర సంహారంలో త్రిలోచనునికి వింటికి (విల్లు) త్రిపుర సుందరి ధనువై రాక్షస సంహారం చేసింది. అక్కడే ఆదిపరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమ గుండంలో, బాల త్రిపుర సుందరి అంతర్లీనం కావడం జరిగింది.


*పూర్వం ఈ ఆలయంలో వామాచార పద్ధతిలో పూజలు నిర్వహించేవారు. కానీ నేడు ఆ ఆచారం తెరమరుగైంది. అమ్మవారి ఆలయం అతి పురాతనమైనది.*


ఈ అమ్మవారి ఆలయం త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి పూర్వం నాటిదిగా దీనిని చెబుతారు. అమ్మవారి ఆలయంలో ఓ పక్క దక్షిణామూర్తి కొలువుదీరారు.


*గర్భాలయంలో ఉన్న అమ్మవారు నిరాకార శిల్పం. భక్తులకు చూసే భాగ్యం కలగదు. ఈ శిల్పానికి ముందు భాగంలో అమర్చిన త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహమే దర్శనమిస్తుంది.*


అలాగే గర్భాలయంలో గణపతి, వీరభద్రుని మూర్తులు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క చతుషష్టి యోగినీ మూర్తుల శిల్పాలున్నాయి. వీరంతా అమ్మవారి పరిచారికలని చెబుతారు.


ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే .ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది .గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత.


*.’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు .*


కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే


అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది .ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం .


దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు అమ్మవారు ఉత్తరాభి ముఖంగా దర్శనమిస్తుంది .చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి .ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ .అదే నవావరణంలో బాలాత్రిపురసుందరి ఉంటుందన్నమాట.


తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండంలో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది.


దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది .


సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు అలంకారాలన్నీ ఈ విగ్రహానికే చేస్తారు


*‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై*

*కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’* అని


తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు పద్యం చెప్పారు .


చిదగ్ని కుండం నుంచి (గర్భగుడి నుండి) బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి .వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు .ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు.


మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి.అర్చనలన్నీ వీటీకే చేస్తారు.అందరూ వీటిని పూజించవచ్చు.


చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు .


చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’చిన్న మస్తా దేవి’’చిన్న మండపం లో కనిపిస్తుంది .


ఈమెనే ప్రచండ చండిక అని ,వజ్ర వైరోచని అని అంటారు ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు .ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య .


ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు .


సాధారణం గా శక్తి ఆలయాలలో సింహ వాహనం ధ్వజస్తంభం ఉండాలి ఈ రెండు ఇక్కడ లేవు .కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు


వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత .


’’సవ్యాప సవ్య మార్గస్థా’’.ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది .అందుకే గర్భాలయంలో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది .


*ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు ,రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది .ఎన్ని దున్నల్ని బలిచ్చినా ,ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు .ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యంలో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది .దీనిపై సంస్కృత శాసనం ఉంది .శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు*


దీన్ని ఒక కవి పద్యంలో


*‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన –యూప శిలకు దా,సమీప మంద –*

*మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’*


వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు స్కాంద పురాణం శ్రీశైల ఖండం లో-


*‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ*

*దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’*


త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం .ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి .అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి.అందుకే ‘’కదంబ కుసుమ ప్రియాయై నమః ‘’అని


లలితా సహస్రంలో చెప్పారు .


అమ్మవారి ఉత్తర ద్వారం కు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే .ఇవి భక్తుల వీర కృత్యాలకుప్రతి బింబాలు .ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది .ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే .వివిధ ఆలం కారాలతో కేశ పాశాలతో వీరులు బల్లాలను తలలో,గుండెలో,గొంతులో,తొడలలో పొడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు .వీరు ఎందుకు వీరక్రుత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి .


’’స్వస్తిశ్రీ సోమతుశివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలుగావలేన్ అని తల త్రిపురా దేవి కిన్ ఇచ్చే ‘’


అని ఒక శాసనం .ఇంకోదానిపై ‘’దేవికి తల ఇస్తున్నాను తెలుంగు నాయని బావ మరది చావుండయ్య వీర’’అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి .ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం.


శివతేజోమయం త్రిపురాంతక క్షేత్రం. ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని, స్వామివారిని పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా శివ కైవల్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.


*భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో కోటికి పైగా శివలింగాలు, నూటికి పైగా జలాశయాలున్నాయని చెబుతారు.*


ప్రతి సోమ ,శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం వసంత నవరాత్రులు ,శరన్నవరాత్రులు శ్రావణ మాసం లోప్రత్యేక ఉత్సవాలు కార్తీకంలో అభిషేకాలు సంతర్పణలు జరుగుతాయి.


ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిఅమ్మవారిని, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి.. ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి మార్కాపురం మీదుగా అలాగే గుంటూరు నుండి శ్రీశైలం వెళ్లు మార్గంలో ఈ త్రిపురాంతకం వెళ్లవచ్చును..


శ్రీమాత్రే నమః 🙏🌹🙏🌹🙏🌹

హనుమాన్ చాలీసా*:

 *హనుమాన్ చాలీసా*:🙏🙏🙏🙏🙏

1}. *చాలీసా" అంటే ఏమిటి?*

జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)


🔥2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి? 

జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.


🙏3.ఆంజనేయ - అర్థం?

జ. ఆంజనేయ అంటే. సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.


🙏4.తులసీదాస్ అస్సలు పేరు ?

జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.


🙏5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?

జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.


🙏6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?

జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే

.

🙏7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?

జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.


🙏8.హనుమంతుని పంచముఖములు ఏవి?

జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము.దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.పశ్చిమం గరుడ ముఖం అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.ఉత్తరం వరాహ ముఖం అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య, త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం. 


🙏9."జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?

జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము

.

🙏10.తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?

జ.126 సం.జీవించాడు.


🙏11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు?

జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.


🙏12.రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?

జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు. త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా, హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.


🙏13.రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?

జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో


🙏14.సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?

జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు.


🙏15. కపీశ అంటే అర్థం ఏమిటి?

జ. కపీశ అంటే.

a) కపులకు ఈశుడు

b) కపి రూపంలో ఉన్న ఈశుడు

C) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.


🙏16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు. అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటారు


🙏17.హనుమ రామదూత ఎలా అయ్యాడు ?

జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే 

అగ్ని ముఖావై దేవాః.

దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు. అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు.


🙏18.అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ?

జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం.


🙏19.ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా?

జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సు ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ.


🙏20.నామస్మరణ మహిమ ఏమిటి?

జ. కలియుగంలో తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం.


🙏21.మహాత్ముడు అంటే ఎవరు ?

జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని తానే నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.) 


🙏22.ఆ రోజులలో ఉన్న వానరుల ప్రత్యేకత ఏమిటి? 

జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.


🙏23.వీర లో ఎన్ని రకాలు అవి ఏవి?

జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.


🙏24.విక్రమ అంటే అర్థం ఏమిటి?

జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు.


🙏25.సూక్ష్మరూపం ఎప్పుడు ధరించాడు ?

జ. లంకా ప్రవేశ సమయంలో పిల్లి లా మారాడు. మరో సారి సీతమ్మ ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు.


🙏26.వికటరూపం అంటే ఏమిటి ?

జ. వికట = హద్దు లేనిది అని అర్థం, వికట రూపం = భయంకర ఘోర రూపం - లంకా దహన సమయంలో చూపుతాడు.


🙏27. హనుమ తత్వాన్ని ఏ కార్యంలో చూస్తాము?

జ. లంకా దహన సమయంలో హనుమ తత్వాన్ని చూస్తాము.


🙏28.భీమరూపధారిగా ఎపుడు వున్నాడు?

జ. అసుర సంహారం లో, ఉగ్రమైనదే భీమ రూపం.


🙏29. రామచంద్రుని కార్యం చక్కబెట్టడానికి ఏం చేసాడు ?

జ. తనదైన ముద్రతో దూతే ఇంత చేస్తే ఇంక రాజు ఎంత చేస్తాడో అని రావణుడు భయపడాలి అని భావించి లంకా దహనం చేసాడు.


🙏30.అశోకవన నాశనానికి ప్రతిగా రావణుడు హనుమకి ఇచ్చిన దండన ఏది?

జ.వానరులకు వారి తోక అంటే ఇష్టం ఉంటుంది కనుక తోకకు నిప్పు పెట్టమన్నాడు.( హనుమని చంపమని ఆదేశిస్తున్న రావణునితో విభీషణుడు, దూతను చంపరాదు అంటాడు).


🙏31.రఘువీరుడు ఎందుకు సంతోషించాడు ?

జ. ఇంద్రజిత్తు అస్త్రం వల్ల వానర సైన్యం, రావణుని శక్తి అస్త్రం వల్ల లక్ష్మణుడు పడిపోతే సంజీవనీ పర్వతం (2సార్లు) తెచ్చి రామునికి ఆనందం కలిగించాడు హనుమ.


🙏32.అపుడు రాముడు హనుమని ఎవరితో పోల్చాడు?

జ. నీవు నా తమ్ముడు భరతునితో సమానం అని అంటాడు.


🙏33.భీముడు హనుమని కోరినదేమిటి (జెండా పై వుండమని కాకుండా) ?

జ. మహత్ రూపం  చూపమని అడుగుతాడు.


🙏34. హనుమ ఎన్ని సార్లు తన మహత్ రూపం చూపాడు? ఎపుడు ?

జ. మహేంద్ర పర్వతం పైన మొదటిసారి, వ్యాకరణం నేర్చుకున్నపుడు, అశోకవనంలో సీతమ్మ దగ్గర మొత్తం మూడు సార్లు తనమహత్ రూపాన్ని చూపాడు.

(సహస్ర వదన తుంహరో యశ గానై 1000 వదనముల హనుమంతుని మహత్ రూపాన్ని శ్రీపతి అనగా సీతారాములు పొగిడారు)


🙏35.హనుమంతుని జన్మదినం రెండు మాసాలలో చెబుతారు ఏది సరి అయినది? 

జ) చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు కాని ఇంద్రుని దెబ్బకు మూర్ఛిల్లిని హనుమ బ్రహ్మ స్పర్శద్వారా తిరిగి ఉత్తేజితుడు అయినది వైశాఖ బహుళ దశమి శనివారంనాడు. అందుకు అలా రెండు మాసాలలో చెబుతారు. ప్రాంతాన్ని బట్టి జరుపుతుంటారు.


🙏36. హనుమ - ఓంకార స్వరూపుడు- ఎలా?

జ) హ 'లో 'అ', ను' లో 'ఉ', ' మ ని మ గా తీసుకుంటే అకార, ఉకార, మకారాత్మకమే ఓంకారం కదా అదే హనుమ అంటే.


🙏37.భజరంగీ అంటుంటాం - ఎందుకు?

జ) వజ్రం వంటి అంగములు అంటే అవయవములు కలవాడు. అదే వజ్రాంగీ కాస్తా భజరంగీ అయింది.


🙏38.తుమ్హారో మంత్ర విభీషణ మానా. విభీషణునికి మంత్రం ఇవ్వడం ఏమిటి?

జ) రావణాసురుని కొలువులో రావణునితో హనుమ అంటాడు- రాముని శరణు వేడమని చెబితే బాగుపడే లక్షణం లేక వినడు కానీ అక్కడే ఉండి విన్న విభీషణుడు పాటించాడు. మంత్రం- ఆలోచన, వ్యూహరచన.


🙏39.అర్జునుడి జెండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటారు?

జ. అర్జునుడు రాముడు అంతటి వాడిని అనిపించు కోవాలి అనుకుంటాడు. ఒకసారి కృష్ణునితో, రాముడు సేతువు రాళ్లతో కట్టడమెందుకు బాణాలతో కట్టవచ్చుకదా అని అంటే, సరే నీవు ప్రయత్నించు అంటాడు. కొంత మేర కట్టగానే హనుమంతుడు ఎక్కి కూల్చుతాడు.   నీవు కూల్చలేని సేతువు నిర్మిస్తానని అంటాడు. అలా చేస్తే నీవు ఏం చెబితే అది చేస్తానని అంటాడు హనుమ. కట్టలేకపోతే గాండీవం వదిలేస్తా నంటాడు అర్జునుడు.   అయితే హనుమ మళ్లీ కూల్చితే, అర్జునుడు గాండీవం వదలబోగా, ఈసారి ప్రయత్నించు అని కృష్ణుడు చెప్పగా, దానిని హనుమ కూల్చ లేకపోతాడు.( అర్జునుడు గాండీవం వదిలితే జరగవలసిన కార్యం జరగదు).నేను ఓడిపోయాను. నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంటాడు హనుమ. అప్పుడు అర్జునుడు, నిన్ను ఆజ్ఞాపించే వాడిని కాను అర్థిస్తున్నాను  నా రథం పై వుండి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు కృష్ణుడు హనుమతో నువ్వు ఓడలేదయ్యా అంటాడు,మరి అర్జునుడు ? అని అడిగితే, అర్జునుడు గెలవలేదయ్యా అని కృష్ణుడు తన వీపు చూపగా, మొత్తం నెత్తుటి మరకలు వుంటాయి. సేతువు నిలవడానికి వీపు అడ్డుపెట్టాను అంటాడు. తనను శరణు పొందిన అర్జునుని విజయానికి అలా కారణమై నాడు.

యుద్ధసమయంలో అర్జునుడు కృష్ణునితో అంటాడు, నేను చంపాలనుకున్న వారిని నా కన్నా ముందే జటాధారియై త్రిశూలం పట్టుకొని ఒకరు చంపుతూ వుంటే, వారిపై నేను బాణాలు వేసి చంపిన కీర్తి తెచ్చుకుంటున్నాను అని అంటే రథ జెండా పై వున్నఆ శివాంశ సంభూతుడు అయిన హనుమనే అలా చేసినవాడు అని రహస్యం వెల్లడిస్తాడు కృష్ణుడు.


🙏40.హనుమ సంజీవనీ పర్వతం ఎప్పుడు తెచ్చాడు?

జ) రెండుసార్లు- వానరసైన్యం మూర్చిల్లినప్పుడు.లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు.


🙏41.సుందర కాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 

జ. సుందరకాండలో రామ కథ రెండు సార్లు చెప్పబడింది. అందుకు ఆ కాండకు ఆ పేరు.పోయిన దాని యొక్క జాడ తెలుసుకొని ఆనందాన్ని ఇచ్చేవాడే సుందరుడు  .ఆ సుందరుని గురించి చెప్పేదే సుందరాకాండ.

పోయిన వస్తువు అపురూపంగా సుందరంగా ఉంటుంది.   అటువంటి   సీత జాడ కనుక్కోవడమే సుందరాకాండ.హృదయమనే అశోక వనంలో ఆత్మ వస్తువనే సీతను దొరక బుచ్చుకోడమే సుందరాకాండ. పరబ్రహ్మ తత్వమే, సత్యం శివం సుందరం. అటువంటి పరబ్రహ్మ గురించి అసలయిన తత్వాన్ని వెల్లడించిన కాండ కనుక సుందర కాండ.


🙏42.చూసి రమ్మంటే కాల్చి రావడమేమిటి?

జ. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటే, మరి రాముని మాట జవదాటాడు అని అనుకుంటే హనుమ శివాంశ సంభూతుడు చూపులోనే అగ్ని ఉన్నవాడిని చూసి రమ్మంటే కాల్చి రావడమే కదా మరి.


🙏43.రాబోయే కల్పానికి హనుమంతునికి రాముడిచ్చిన పదవి ఏంటి?

జ. బ్రహ్మ పదవి. 

పట్టాభిషేక అనంతరం హనుమ గంధమాదన పర్వతం పై తపస్సుకు వెళితే ఒకసారి రాముడు రమ్మని కబురు చేస్తాడు. "బ్రహ్మ నా అంగుళీయాన్ని పూజించుకుంటాను అంటే ఇచ్చాను దానిని సీతమ్మ చూస్తానంటుంది బ్రహ్మలోకం వెళ్లి తీసుకు రమ్మంటాడు. యోగ మార్గం( సుషుమ్నా) ద్వారా బ్రహ్మ లోకం వెళ్లి బ్రహ్మ ను అడిగితే, ఇచ్చిన దానిని అడగరు అని అంటాడు. చర్చ అనవసరం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు బ్రహ్మ .అప్పుడు బ్రహ్మ కి వింశతి          (20) బాహువుల హనుమ దర్శనమిస్తాడు.

దాంతో బ్రహ్మ నమస్కరించి, తాను పూజిస్తున్న పళ్ళెంలోని అంగుళీయాన్ని తీసుకో మన గా చూస్తే అందులో చాలా ముద్రికలు ఉన్నాయి. ఎన్నో కల్పాలు ఎందరో రాములు.   నాకు 100 కల్పాల ఆయువు. కాబట్టి ఇప్పటి ముద్రిక ఏదో వెతికి తీసుకో అని అంటాడు బ్రహ్మ.హనుమ గుర్తించి తీసుకుంటాడు.

బ్రహ్మకు హనుమ గొప్పతనం తెలియజేయడానికే రాముడు అలా చేస్తాడు.   తిరిగి వచ్చిన హనుమతో బ్రహ్మలోకం ఎలా ఉంది అని రాముడు అడిగితే, బానే ఉంది కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అని అంటాడు.    అప్పుడు రాబోయే కల్పానికి నీవే బ్రహ్మవు, ఆ దోషాలను నువ్వు అప్పుడు సరిదిద్దు అని చెబుతాడు.

వింశతి భుజ హనుమ అభీష్ట సిద్ధి రూపం.

20 చేతులలో ఖడ్గం, *డాలు, మొనగలిగిన ఆయుధం, పరశువు, పాశం, త్రిశూలం, వృక్షం, చక్రం, శంఖం, గద, ఫలం, అంకుశం, అమృత పాత్ర, నాగలి,పర్వతం, టంకం (పార), పుస్తకం, ధనుస్సు, సర్పం, *ఢమరుకం ధరించి వున్నాడు.

అటువంటి హనుమకు బ్రహ్మతో సహా మనందరo మానసికంగా దర్శించుకొని ప్రణమిల్లుదాం!...

🚩🚩🚩🚩🚩🚩🚩

information

 *Useful information* 

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷


1. *PAN* - permanent account number.

2. *PDF* - portable document format.

3. *SIM* - Subscriber Identity Module.

4. *ATM* - Automated Teller machine.

5. *IFSC* - Indian Financial System Code.

6. *FSSAI(Fssai)* - Food Safety & Standards Authority of India.

7. *Wi-Fi* - Wireless fidelity.

8. *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.

9. *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.

10. *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.

11. *COMPUTER* - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research.

12. *VIRUS* - Vital Information Resources Under Siege.

13. *UMTS* - Universal Mobile Telecommunicati ons System.

14. *AMOLED* - Active-matrix organic light-emitting diode.

15. *OLED* - Organic light-emitting diode.

16. *IMEI* - International Mobile Equipment Identity.

17. *ESN* - Electronic Serial Number.

18. *UPS* - Uninterruptible power supply.

19. *HDMI* - High-Definition Multimedia Interface.

20. *VPN* - Virtual private network.

21. *APN* - Access Point Name.

22. *LED* - Light emitting diode.

23. *DLNA* - Digital Living Network Alliance.

24. *RAM* - Random access memory.

25. *ROM* - Read only memory.

26. *VGA* - Video Graphics Array.

27. *QVGA* - Quarter Video Graphics Array.

28. *WVGA* - Wide video graphics array.

29. *WXGA* - Widescreen Extended Graphics Array.

30. *USB* - Universal serial Bus.

31. *WLAN* - Wireless Local Area Network.

32. *PPI* - Pixels Per Inch.

33. *LCD* - Liquid Crystal Display.

34. *HSDPA* - High speed down-link packet access.

35. *HSUPA* - High-Speed Uplink Packet Access.

36. *HSPA* - High Speed Packet Access.

37. *GPRS* - General Packet Radio Service.

38. *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.

39. *NFC* - Near field communication.

40. *OTG* - On-the-go.

41. *S-LCD* - Super Liquid Crystal Display.

42. *O.S* - Operating system.

43. *SNS* - Social network service.

44. *H.S* - HOTSPOT.

45. *P.O.I* - Point of interest.

46. *GPS* - Global Positioning System.

47. *DVD* - Digital Video Disk.

48. *DTP* - Desk top publishing.

49. *DNSE* - Digital natural sound engine.

50. *OVI* - Ohio Video Intranet.

51. *CDMA* - Code Division Multiple Access.

52. *WCDMA* - Wide-band Code Division Multiple Access.

53. *GSM* - Global System for Mobile Communications.

54. *DIVX* - Digital internet video access.

55. *APK* - Authenticated public key.

56. *J2ME* - Java 2 micro edition.

57. *SIS* - Installation source.

58. *DELL* - Digital electronic link library.

59. *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.

60. *RSS* - Really simple syndication.

61. *TFT* - Thin film transistor.

62. *AMR*- Adaptive Multi-Rate.

63. *MPEG* - moving pictures experts group.

64. *IVRS* - Interactive Voice Response System.

65. *HP* - Hewlett Packard.

జీవితమంటే

 ***ఇంతేకదా మనిషి జీవితమంటే…***  


#లతామంగేష్కర్_గారి_ఆఖరి_మాటలు...

లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు.అత్యంత విలువైన బ్రాండెడ్‌ కార్లు నా ఇంటి గేరేజ్‌లో ఉన్నాయి.నేను 

చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. 


విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి వున్నాయి.కాని ఆస్పత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని వున్నాను.నా బ్యాంకు అక్కౌంట్ లో డబ్బు చాలానే వుంది. కాని నాకు ఏది ఉపయోగం లేదు ఇప్పుడు.


నా ఇల్లు ఒక రాజభవనంలా వుంది కాని నేను ఆస్పత్రిలో ఒక

చిన్న బెడ్‌ మీద వున్నాను.ప్రపంచంలో వున్న ఫైవ్ స్టార్  హోటల్స్ అన్నింటికి  ప్రయాణం చేసేదాన్ని.ఆస్పత్రిలో ఆ టెస్టు కి ఈ టెస్టుకీ లేబ్‌లకు మారి మరీ వెళుతున్నాను.

ఆనాడు నిత్యం శిరోజాలంకరణలవారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరసు పై శిరోజాలే లేవు.

ప్రసిద్ధి చెందిన హోటల్స్ లోని ఆహారం తింటూ వుండేదానిని. కాని ఈనాడు పగలు రెండు మాత్రలు,రాత్రి ఒక చిటికెడు ఉప్పు ...


ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని.కాని నేడు ఆస్పత్రి వరండా దాకా వెళ్ళడానికి ఇద్దరు అటెండర్‌లు సాయం చేస్తున్నారు.ఏ సంపదా,వసతులు ఏవీ నాకు సహాయ పడలేదు.ఏ విధమైన ఓదార్పునివ్వ లేదు కాని కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత,ఆప్యాయత,వారి ప్రార్ధనలు…నాకు జీవం పోస్తున్నాయి. 


ఇంతేనండి ఈ జీవితం…ఎవరికి సహాయం చేయలేని ధనం, పదవి వున్న వారికే విలువ ఇవ్వకండి.మంచి మనసు వున్న వారికి విలువనిచ్చి ,స్నేహం,ఆప్యాయత, ప్రేమను చూపించండి…

Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 42 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

భరతుడు ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. ఆయన పుట్టిన తరువాత కొంతకాలమునకు ఉపనయనము చేశారు. తరువాత ఆయనకు మనస్సులో ఒక భావన ఉండిపోయింది. ‘అప్పుడు పులహాశ్రమానికి వెళ్లాను. లేడిమీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగోలాగ కష్టపడి మనసులో భగవంతుడిని పెట్టుకుని లేడిని వదిలి ఇపుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను. ఇప్పుడు కానీ నేను గాయత్రిని చేయడం, ఈయన చెప్పిన మంత్రములన్నీ నేర్చుకుంటే నాకు వివాహం చేస్తానని నాకు పెళ్ళి చేసి నన్ను సంసారంలో పడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మరల భ్రష్టుడనయిపోయి మరల ఎటు జారిపోతానో! అందుకని నేనెవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను. నేనొక వెర్రివాని వలె వుంటే నాకు పిల్ల నిచ్చేవాడెవడు ఉంటాడు?’ అని నిర్ణయించుకుని వెర్రివాడిలా అలా కూర్చుని ఉండేవాడు. ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు. తల్లి సహగమనం చేసింది. సవతి బిడ్డలయిన అన్నదమ్ములు 'వీడికేమి వచ్చు. వీడికి శాస్త్రం ఏమిటి! వీడిని గొడ్లశాల దగ్గర కూర్చోబెట్టండి. పొలానికి పంపించండి. ఆ పనులన్నీ చూస్తుంటాడు అని అతనిని ఒరేయ్ పేడ ఎత్తరా అనేవారు. ఎత్తేవాడు. పాసిపోయిన అన్నం పెడితే మారుమాట్లాడకుండా అదే తినేవాడు. ‘సర్వం బ్రహ్మమయం జగత్’ అని బ్రహ్మమునందు మనస్సు కుదుర్చుకుని ఉండిపోయాడు. ఒకరోజు అన్నదమ్ములు ‘నువ్వు పొలానికి వెళ్ళి పంటని కాపలా కాయమన్నారు. ఆయన పొలం వెళ్ళి మంచెను ఎక్కి వీరాసనం వేసుకుని కూర్చున్నాడు.

లోకమునందు కొంతమంది చిత్రవిచిత్రమయిన ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు లేని ఒక వ్యక్తి కాళికా దేవికి మంచి అవయవ హీనత్వం లేని వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు పుడతారు అనుకుని వీడెవడో బాగానే ఉన్నాడు. మాట కూడా మాట్లాడడం లేదు వీడిని తీసుకుపోదాం అని వెళ్ళి తాళ్ళు వేసి కడుతున్నారు. బ్రహ్మజ్ఞానుల జోలికి వెళితే లేనిపోని ప్రమాదములు వస్తాయి. చక్కగా కట్టించేసుకున్నాడు. పద అన్నారు. వెళ్ళిపోయాడు. ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ఏదో పెట్టారు. తినేశాడు. తరువాత వంగు, నరికేస్తాము అన్నారు. వంగాడు. కత్తియందు బ్రహ్మము, నరికేసేవారియందు బ్రహ్మం. అంతటా బ్రహ్మమును చూసి తలవంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహములో నుంచి బయటకు వచ్చి ‘ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అంతటా ఈశ్వర దర్శనం చేస్తున్నవాడు. ఆయన మీదనా మీరు కత్తి ఎత్తుతారు అని కత్తి తీసి ఆ వచ్చినవారి శిరసులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేశాడు. బ్రహ్మమే అనుకుని ఒక నమస్కారం పెట్టుకుని మరల తిరిగి వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తుంటే సింధుదేశపు రాజు రహూగణుడు (రాహుగణుడు) ఇక్షుమతీ నదీతీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తపోపదేశం కోసమని వెళుతున్నాడు. బోయీలు పల్లకిని మోస్తున్నారు. ఒక బోయీకి అలసట వచ్చింది. వాడిని అక్కడ వదిలేశారు. నాలుగో బోయీ కోసం చూస్తుంటే ఈయన కనపడ్డాడు. మంచి దృఢకాయుడై ఉన్నాడు. ఈయనను తీసుకురండి పల్లకీ మోస్తాడు అన్నారు.

బాగా పొడుగయిన వాడు పల్లకీ పట్టుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఈయన పల్లకీ మోస్తున్నాడు. అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనంద పడిపోవడములో ఒక్కొక్కసారి ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి అడుగులు తడబడేవి. ఎత్తు పల్లములకు లోనయి పల్లకీ లోపల కూర్చున్న రాజుగారి తల పల్లకి అంచుకు గట్టిగా తగిలేది. ఆయన రెండుమూడు మాటలు చూసి ‘ఎందుకురా అలా ఎగిరెగిరి పడుతున్నారు. ఒంటిమీద తెలివి ఉందా’ అని అడిగారు. వాళ్ళు ‘అయ్యా! మా తప్పు కాదు. కొత్త బోయీ సరిగా లేడు. వీడి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాడు’ అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చి ఆ బోయీవంక చూసి పరిహాసమాడాడు. మోస్తున్న వాడు బ్రహ్మజ్ఞాని. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడడం. రాజుగారు పల్లకి తెర తప్పించి క్రిందికి చూసి ‘తిన్నగా నిందించకుండా పరిహాసపూర్వకమయిన నింద చేశాడు. అలా చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తాను అన్ని మాటలు అన్నాడు కాబట్టి జాగ్రత్తగా మోస్తాడని రాజు అనుకున్నాడు. ఈయన మరల బ్రహ్మమునందు రమించిపోతూ మళ్ళీ దూకాడు ఎందుకో మళ్ళీ రాజుగారి బుర్ర ఠంగుమని తగిలింది. అపుడు రాజు ‘ఒరేయ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపడడము లేదు. నిన్ను రాజ దండనము చేత నా మార్గములోనికి తిప్పే అవసరము నాకు కనపడుతోంది. పలకవేమిటి?’ అన్నాడు. ఇప్పటివరకు పుట్టిన తరువాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ‘రాజా, నువ్వు మాట్లాడింది నిజమే. నువ్వు ఎవరికి శిక్ష వేస్తావు? ఈ దేహమునకు శిక్ష వేస్తాను అంటున్నావు. ఈ దేహం నేను కాదు. నేను ఆత్మని ఉన్నవాడిని నేను. ఇది నీ మాయని నీ అజ్ఞానమును బయటపెడుతున్నది’ అన్నాడు.

ఈమాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. ‘ మోస్తున్న వాడెవడో సామాన్యుడు కాదు. ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు’ అని పల్లకి ఆపమని గభాలున క్రిందికి దూకి ఆయనవంక చూస్తే గుర్తుపట్టడానికి యజ్ఞోపవీతం ఒక్కటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా! నన్ను పరీక్ష చేయడానికి బహుశః కపిలుడే ఇలా వచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు? నిజం చెప్పండి. మీవంటి బ్రాహ్మణులు జోలికి నేను రాను. మీమాటలు నన్ను చాలా సంతోష పెట్టాయి. నాకొక్క మాట చెప్పండి. లేనిది ఎలా కనపడుతోంది? ’ అని క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళమీద పడ్డాడు రాజు. భరతుడు నవ్వి ‘రాజా! నువ్వు ఉపదేశం పొందడానికి అర్హత పొందావు. అందుకని చెపుతున్నాను. ‘నేను’ అనబడే పదార్థము ఈ కన్నుల చేత చూడలేనిది కాదు. ఈ కన్నులకు కనపడుతుంది. దీనిని తిరస్కరించక పోతే ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇంకా నీకు బోధ ఎందుకు? ఈ నేత్రానికి మూడిటి వలన అనేకము కనపడతాయి. అవి కాలము, బుద్ధి, నామములు. రూపము ఉంటే నామము ఉంటుంది. నామము ఉంటే రూపము ఉంటుంది. నామము రూపము రెండూ లేకపోయినట్లయితే మాయ పోయినట్లు అవుతుంది. రూపము చేత నామము మారదు. నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు. ఈ రెండూ అశాశ్వతమే. నామము, రూపము రెండూ అబద్ధమే. నామ రూపములుగా కాలగతియందు బుద్ధిచేత తిరస్కరింపబడుతుంది. మాంస నేత్రముచేత మగ్నము చేయబడుతుంది. అది నీవు తెలుసుకుంటే నేను చెపుతాను. ఒక్కమాట ఆలోచించు. ఇది పృథివి. ఈ భూమిమీద నా చరణములు పృథివి. నా చరణముల మీద నా కాళ్ళు పృథివి. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారమునకు నీవు ఒక పేరు పెట్టుకున్నావు. ‘నేను మహారాజును – వాడు బోయీ’ అనుకుంటూ నన్ను నిందించి మాట్లాడుతున్నావు. నీవు మాట్లాడడానికి ఆధారమయిన ఆత్మ, నాలో వున్న ఆత్మ ఒక్కటే. రెండూ రెండు శరీరములను ధరించాయి. ఈ రెండూ నామరూపముల చేత గుర్తించ బడుతున్నాయి. ఇవి మాయ వీటికి అస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలుసుకున్నట్లే. నీకు తత్త్వం అర్థం అయింది. సంసారం అనే అడవి దీనిని అర్థం కాకుండా చేస్తుంది. అక్కడ బంధుత్వములనే తోడేళ్ళు ఉంటాయి. అవి మేకలవెంట తరుముకు వచ్చినట్లు వస్తాయి. ప్రతివాని ఇంట్లో ఈగలు ఉంటాయి. పొమ్మంటే పోవు. వాటిని తోలుకు తిని బతుకుతూ ఉంటారు. అలాగే పిల్లలు భార్య వెంబడించి ఉండనే ఉంటారు. కామము పోయినట్లు ఉంటుంది. మళ్ళీ వచ్చి చేరుతుంది. రాజా వ్యవసాయం బాగా చెయ్యాలని ఆనుకున్న వాడు కలుపుమొక్కని కత్తిరిస్తే సరిపోదు. మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. మొదటంట తీసి బయటపారేసి ఎండిపోయిన తరువాత తగులబెట్టెయ్యాలి. తరించాలనుకున్నవాడు కామమును ముందు గెలవాలి.

అలా గెలవలేకపోతే ఏమవుతుంది? అడవిలో వెళుతుండగా నిన్ను చూసి ఆరుగురు దొంగలు వెంట పడతారు. ఆ ఆరుగురు ఎక్కడో లేరు. ఇక్కడే ఉన్నారు. అయిదు ఇంద్రియములు, మనస్సు – ఈ ఆరుగురు లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా, ఇంత ధర్మం కలిగినా ఎత్తుకు పోతారు. నువ్వు పతితుడవయిపోయి పతనమయిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడం శరీరంలోకి వెడుతూ ఉండడం ఇది ‘నేను’ అనుకోవడము దీని అనుబంధములతో మగ్నం అయిపోవడం ఈశ్వరుడిని తెలుసుకోవడం. అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు. రాజా! ఏనాడు నీ జ్ఞాన నేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల పాదసేవ చేస్తావు. వారి పాదముల మీద పడతావు. బ్రహ్మ జ్ఞానమును పొందుతావు. భక్తితో ఉంటావు. కర్మా చరణమును చేసి వైరాగ్యమును పొందుతావు. అదే మనిషి పొందవలసిన స్థితి. అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెబితే రహూగణుడు విని వైరాగ్యమును పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతమును తెలుసుకున్నాడు భరతుడు మోక్షమును పొందాడు.

ఇలా ఎంతోమంది ఒక చిన్న పొరపాటుకి ఎన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది. మనిషి సాధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అరణ్యమునకు వెళితే మోక్షం వచ్చేస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు. ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటకు వెళ్ళి ఋషభుడు మోక్షమును పొందాడు. ఇంట్లో ఉంటే నన్నేదో పట్టేసుకుందని భయపడిపోయి అరణ్యము వెళ్ళి మూడు జన్మలు ఎత్తి మోక్షం పొందాడు భరతుడు. పాడుచేసేది ఇల్లు కాదు. లోపల వున్న మనసు. అందుకే ఆధునిక కవి ఒకమాట అన్నారు.

'తలనీలాలు అస్తమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది? మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకు నిలయమయిన మనస్సును ప్రక్షాళన చేయాలి. నీ మనస్సే నీ ఉన్నతికి గాని, పతనమునకు గాని కారణము అవుతోంది అని ఒక అద్భుతమయిన విషయాన్ని నలుగురి యందు నాలుగు విషయములను ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమయిన ఘట్టమును గృహస్థాశ్రమంలో తరించడానికి మనకి ఉన్న అనుమానములను నివృత్తి చేస్తూ వ్యాసభగవానుడు ఇచ్చిన అమృతఫలములను పోతనగారు ఆంధ్రీకరించి మనలను ఉద్దరించారు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

మహర్షుల చరిత్రలు

 *మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈరోజు 49 వ పైల మహర్షి గురించి తెలుసుకుందాం..🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🍁ఇప్పుడు మనం పైల మహర్షి గురించి తెలుసుకుందాం .ఈ మహర్షి గురించి ఎక్కడ కూడా వారి ప్రస్తావన లేదు వారి గురించి చాల తక్కువ సమాచారం అందింది...


☘️ఈయన తల్లితండ్రులెవరో తెలియదు . వ్యాసభగవానుడికి శిష్యుడు పైల మహర్షి . 


🍁శిష్యులకి ఋగ్వేదం చెప్తుండేవాడు . ఈయన్ని ఋగ్వేదధ్యాపకుడంటారు . వ్యాస మహర్షి తన దగ్గరుంచుకుని విద్యలన్నీ నేర్పించాడు . 


☘️పైలుడు విద్యలన్నీ నేర్చుకున్నాక గొప్ప తపస్సు చేసి పైల మహర్షి అయ్యాడు . భగవంతుడు సత్యవతీదేవి యందు పరాశరుడుగా పుట్టి వేదరాశిని ఋగ్వేదము , యజుర్వేదము , సామవేదము , అధర్వవేదము అని నాలుగు భాగాలుగా విభజించి ,


🍁పైల మహర్షికి ఋగ్వేదం , వైశాంపాయనుడికి యజుర్వేదం , జైమినికి సామవేదం , సుమంతునికి అధర్వవేదం ఉపదేశించాడు .


☘️పైలమహర్షి నేర్చుకున్న ఋగ్వేదం చాలా ఋక్కుల్తో కూడుకుని వుండటంచేత " బ్రహ్వృచశాఖ ” అని పేరు పొందింది . పైలుడు ఈ వేదాన్ని ఇంద్రప్రమితి , పాష్కలుడు అనే శిష్యులకి చెప్పాడు . 


🍁ఇంద్రప్రమితి తనకొచ్చింది మాండూకేయుడికి చెప్పాడు . మాండూకేయుడు దేవమిత్రుడికి , దేవమిత్రుడు సౌభరికి , సౌభరి తన కొడుకు శాకల్యుడికి చెప్పారు .


☘️శాకల్యుడు తాను నేర్చుకున్నది అయిదు భాగాలుగా చేసి వాత్స్యుడు , శాలీయుడు , మౌద్గల్యుడు , గోముఖుడు , శిశిరుడు మొదలైన వాళ్ళకి చెప్పాడు .


🍁 శిశిరుడు తన శిష్యులకి , పాష్కలుడు నాలుగు విభాగాలుగా నలుగురుకి చెప్పాడు . ఈ విధంగా ఋగ్వేదం చాలామంది ఋషులు నేర్చుకున్నారు . పైల మహర్షి ఋగ్వేదం నాలుగువైపులా వ్యాపించేలా చేశాడు . 

గొప్ప ఆదర్శ మాహర్షిగా ప్రసిద్ధి చెందారు.


☘️ఇదండీ మనకు పైలమహర్షి గురించి మనకు తెలిసిన విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి...


సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️

కాలం కలిసి రాకపోతే

 🌹🙏*శుభోదయం*🌹🙏


      *కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సివస్తుంది.*

      *అందుకే అవసరం లేని చోట మాట కన్నా మౌనం మేలు.*


 *గోవులను పూజించు గోమాత రక్షించు*


 *🌹🙏జైశ్రీరామ్🌹🙏*

ఘంటసాల

                   ఘంటసాల 


అత్యున్నత శ్రుతిని  యలవోకగా పాడు

            మంద్రమున్ బాడును మధురముగను

కవ్వించి నవ్వించి కడుహాస్యముగ పాడు

            వేదన గీతాల యేడిపించు

సరిగమల్ పలికించు సరస గాంభీర్యాన

            రాగముల్ పాడును రంజితముగ

పద్యమ్ములను పాడు హృద్య రాగమ్మున 

            శ్లోక గానము చేయు సుస్వరమున

గానగంధర్వు డన నొక్క ఘంటసాలె !

కళల పుంభావ వాణియే ఘంటసాల

ఘంటసాలను మించిన ఘనుడు  లేడు

పరగ గత వర్త మానాల భవిత యందు


గోపాలుని మధుసూదనరావు

9959536545

నా దేముడే గొప్ప

 

నా దేముడే గొప్ప 

ఇటీవల నేను యూట్యూబ్ లో వెతుకుతుంటే ఒక విచిత్రమైన వీడియో నా కంటికి కనపడింది అదేమిటంటే ఒక యెడారిమతం అతను చెపుతున్నాడు అతని మతంలో ఒకడే దేముడట అదేవిధంగా ఇంకొక ఎడారి మతానికి కూడా దేముడు ఒక్కడే అట కానీ హిందూ మతంలో వేలు, కోట్లమంది  దేముళ్ళట. ఇదెక్కడిది ఇట్లా ఎక్కడైనా ఉంటుందా అని మన హిందూ ధర్మాన్ని విమర్శిసిస్తున్నాడు.  అట్లా ఎంతోమంది మూర్ఖులు రోజురోజుకు హిందూ ధర్మాన్ని విమర్శించి వాళ్ళ మతమే గొప్పదని చెప్పుకొనే ప్రయత్నం చేస్తూ అమాయకులైన హిందువులను మతమార్పిడి చేస్తున్నారు,  చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ ఏదారిమతస్తులు ఎప్పుడు చెప్పేది ఒక్కటే మా దేముడే గొప్ప అని.  మరి మీ దేముడి గొప్ప ఏమిటయ్యా అంటే సమాధానం ఉండదు. 

అందరు తెలుసుకోవలసినది ఒక్కటే అదేమిటంటే హిందూ మతం కాదు, ఇది ఒక సనాతన ధర్మం.  అన్ని మాతాలకూ ఒక ప్రవక్త ఉంటాడు ఈ విషయం మనందరికీ తెలుసు.  మరి మీ మతాల లాగ హిందుత్వం కూడా మతం అయితే మరి హిందూ మతానికి ప్రవక్త ఉండాలి కదా కానీ ఎవరూ లేరే

మతగ్రంధం: ప్రతి మతానికి ఓక మత గ్రంధం ఉంటుంది దానిని వారు ప్రమాణంగా తీసుకొని అనుసరిస్తారు.  మరి హిందూ మతానికి మత గ్రంథం ఏది అంటే ఏ గ్రంధాన్ని చెపుతారు.  ఒక్క గ్రంధం అంటూ ఏది చెప్పలేరు. 

మతం అనేది ఒక ప్రవక్త తన అనుభవాలతో, అనుభూతులతో ఏర్పరచిన ఒక పద్దతి, విధానం.  కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవలసింది ఏమిటంటే మత ప్రవక్త లాగ ఏ ఒక్క వ్యక్తి హిందూ ధర్మంలో లేరు.  మన సనాతన ధర్మంలో వేలకొద్దీ మహర్షులు వారి వారి తపఃశక్తితో కనుగొన్న జీవన విధానమే హిందూ ధర్మం. 

దేవుడు కాపాడుతాడు: ప్రతి మతంలో ఒక్కటే చెప్పబడి ఉంటుంది అదేమిటంటే నిన్ను దేవుడు కాపాడతాడు అని. అలా భావించే ఆయా మతాల వారు వారి మత గ్రంధం లో పేర్కొన్నట్లు దేవతారాధన  చేస్తారు. కానీ హిందూ ధర్మంలో దేవుడు నిన్ను కాపాడుతాడు అని ఎక్కడా చెప్పలేదు. మన ధర్మంలో చెప్పింది ఒక్కటే అదేమిటంటే "ధర్మం నిన్ను కాపాడుతుంది" అది యెట్లా అంటే ధర్మాన్ని ఆచరించాలి, అప్పుడే ధర్మం నిన్ను కాపాడుతుంది. 

“ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః

తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్”– మనుస్మృతి

“చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపిన వాణ్ణి చంపుతుంది; రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించు వారిని రక్షిస్తుంది; కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి” ధర్మాచరణ అంటే ఏమిటి అనగా ప్రతివారు తనకు చెప్పబడిన కర్మలను చేయడం, నిషేధించిన  కర్మలు చేయకపోవటం మరియు చెప్పిన కర్మలను విస్మరించి, నిషేధించిన  కర్మలు చేయడం అనేది ధర్మానికి హాని కలుగ చేయటమే. 

చెప్పిన కర్మలు అంటే ఏమిటి అనగా మనకు వేదాలలో చెప్పిన పనులు వీటిని విహిత కర్మలు అని అంటారు.  వెడలు ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిని, పట్టి, స్థితిని పట్టి ఏమేమి కర్మలు చేయాలో తెలియజేశాయి. ఉదాహరణకు.  తల్లిదండ్రులను సేవించటం ఇది ప్రతి మానవుడికి చేయవలసిన కర్మ, అదేవిధంగా ఇతరుల తల్లిదండ్రులను గౌరవించ వచ్చు కానీ వారి సంతానం వారిని సరిగా చూడనంత మాత్రంన  ఇతరులు వారిని సేవించ వలసిన పని లేదు.  కేవలము వారి పుత్రుడు మాత్రమే వారిని సేవించాలి.  ఈ విషయంలో శ్రీ కృష్ణపరమాత్మ స్పష్టంగా తెలిపారు.

భగవద్గీత 3-35

“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

తాత్పర్యం

“ చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా, గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది ; స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే ; కానీ, పరధర్మం మాత్రం భయంకరమైనది. ”

వివరణ

“ స్వధర్మం ” అంటే “ ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో వున్నారో ఆ ఆత్మస్థాయికి తగ్గ ధర్మం అన్నమాట ” …“ పరధర్మం ” అంటే “ ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు ” అన్నమాట …మనలో సహజసిద్ధంగా ఉన్న అభిరుచి, వాసనలను అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది … అదే “ స్వధర్మం ” అవుతుంది. ఇతరులకు నిర్దేశించబడినవి,

మరి మనకు నిర్దేశించబడనిది అయినదే “ పరధర్మం. ” మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం … ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం … “ పరధర్మపాలన ” అవుతుంది. “ పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం ” సబబు కాదు … పులి జీవితంలా ‘నక్క జీవితం’ ఉంటే నక్క నష్టపోతుంది … ‘ నక్క దశ ’లో వున్నప్పుడు నక్కలానే జీవించాలి … స్వధర్మానికి వ్యతిరేకంగా ‘ ఓ నక్క ’ జీవించడానికి యత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పవు ! స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే ‘ ఒక్క నక్క జన్మ ’తోనే సరిపోతుంది ! ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది. పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది. ఒక యజమాని ఇంట్లో దొంగ ప్రవేశించడం చూసినా, కుక్క ఊరుకోవడంతో … గాడిద … కుక్క పని తాను చెయ్యబోయి … ఓండ్రపెట్టి …యజమానితో చావుదెబ్బలు తిన్నది. మన స్థాయి ఎదిగినప్పుడు ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు. కానీ, ముందే దానికోసం ప్రాకులాడడం …

“ రెక్కలు రాకుండానే ఎగరడానికి ప్రయత్నించడం ” వంటిది … క్రిందపడి కష్టాలు కొని తెచ్చుకుంటాం. “ గురువు చేసినట్లు ” చెయ్యొద్దు …

“ గురువు చెప్పినట్లు ” చెయ్యాలి ! విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం … దానిని సరిగ్గా ఆచరించడం ధర్మం. జ్ఞానం ఉంటేనే ధర్మం తెలుస్తుంది. ధర్మం తెలిస్తేనే అనుష్ఠానం సరిగ్గా చేస్తాం. ధర్మమే శాశ్వతం … ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదలకూడదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు … అది విశిష్టగుణ రహితం అయినప్పటికీ … “ అల్పగుణి ” అయినప్పటికీ … దానినే అనుసరించాలి … “ జయ విజయులు ” తమ అల్పగుణాన్ని భయరహితులై, సంకోచరహితులైఆశ్రయించి మూడు జన్మలలోనే కడతేరినట్లు పురాణగాథ వున్నది కదా ! వుండవలసింది మరి భయరహితం … సంకోచరహితం … సదా, సర్వత్రా స్వధర్మాశ్రయమే శరణ్యం ! స్వధర్మపాలనలో మరణం సంభవించినా మేలే ! అదేవిధంగా పాప, పుణ్య విచారణ చేయవలసిన ధర్మం ప్రతి ఒక్కరి మీద వున్నది.

పాపం అనగా ఏమిటి: పాపం అనగా నీ యెడ వేరే వారు ఏ పని చేస్తే నీ మనస్సు, శరీరం బాధపడుతుందో ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయటాన్ని పాపంగా పరిగణించాయి మన శాస్త్రాలు.  పాప కార్యాలు చేయటం వలన వచ్చే ఫలమును, పాప ఫలము అంటారు.

పుణ్యం అనగా ఏమిటి: పుణ్యం అనగా నీ యెడ వేరే వారు ఏ పని చేస్తే నీ మనస్సు, శరీరం ఆనంద పడుతుందో ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయటాన్ని పుణ్యం పరిగణించాయి మన శాస్త్రాలు.  పుణ్యం కార్యాలు చేయడం వలన వచ్చే ఫలము, పుణ్యం ఫలము అంటారు.

ఒకరు చేసే ప్రతి కర్మ కూడా పాప, పుణ్యాలలో ఏదో ఒకటి అవుతుంది.  దీని పర్యవసానంగా పాప, పుణ్య ఫలితాలు కలుగుతాయి.  వాటిని జీవుడు తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది.

పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలాన్ని పొంది ఈ జన్మ వీడిన తదుపరి వచ్చే జన్మ ఇప్పటి జన్మ కన్నా ఉన్నతమైన జన్మ కలుగుతుంది.  కాబట్టి అందరూ సదా పుణ్య కార్యాలు చేస్తూ పాప కార్యాలకు దూరంగా ఉండవలెను.

ధర్మో రక్షతి రక్షితః

మీ

భార్గవ శర్మ (న్యాయవాది)

గమనిక:

మీ వ్యాపారాభివృద్ధి చేసుకోండి.  ఏ వ్యాపారం చేసినా కూడా పబ్లిసిటీ చాలా ముఖ్యం.  పబ్లిసిటీకి ఎంతో ఖర్చు చేస్తుంటారు.  కొద్ది ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ కావాలంటే అందరూ ఇష్టపడతారు.  మీలో ఎవరైనా ఇలా కావాలనుకుంటే ఫై వ్యాసాన్ని కరపత్రంగా అచ్చు వేయడం(వ్యాసకర్త అనుమతి తో)  క్రింద మీ వ్యాపార ప్రకటన ఉదా: మీరు పురోహితులు ఎలక్ట్రిషనో, ప్లంబరో, లేక ఇతర వ్యాపారం ఏదయినా చేస్తున్నారనుకోండి. ఆ వివరాలు అచ్చువేయించిన కరపత్రాలను మీకు సమీపంలో ఉన్న దేవాలయంలో పంచి పెడితే అది చదివిన వారికి హిందుత్వం మీద అవగాహన వస్తుంది అదే విధంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి దోహద పడుతుంది.  కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

అజ్ఞానాన్ని దూరం చేసుకొ

 *🕉🌹నేను అనేది ఈ శరీరం కాదని, ఆత్మ అని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం.🌹🕉*


*నేను*


*నేను అనేది ఈ శరీరం కాదని, ఆత్మ అని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం. మనుషులంతా ఆత్మ స్వరూపులని జ్ఞానులంటారు. శరీరంతో ఆత్మ తాదాత్మ్యం చెందినప్పుడు మనిషిలో ‘నేనే అన్నింటికీ కర్తను, అనుభవించే భోక్తను’ అన్న అహంకారం కలుగుతుంది. ఈ భావనలే మానవ జీవిత వినాశనానికి దారితీస్తున్నాయి. పంచకోశాలు- అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అన్నవి ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనవి. ఇవి స్థూలదేహాన్ని, ప్రాణాన్ని, మనసును, బుద్ధిని, అంతరాత్మను ఆవరించిఉండి మసకబారుస్తాయి. ఈ శరీరం అన్నగతమైంది. ఆహారం లభిస్తే ఉంటుంది, లేదంటే నశిస్తుంది. అందువల్ల దీన్ని అన్నమయ కోశం అంటారు. కర్మేంద్రియాలను నడిపించే ప్రాణ శక్తిని ప్రాణమయ కోశం అంటారు. ఇది అన్నమయ కోశం అంతటా వ్యాపించి ఉంటుంది. జ్ఞానేంద్రియ పంచకాన్ని, మనసును కలిపి మనోమయకోశం అంటారు. మనిషిలోని అహానికి ఇదే ప్రధాన కారణం. విజ్ఞానమయ కోశం జీవాత్మకున్న అన్ని అవస్థల్లోనూ ఆత్మను అనుకరిస్తుంటుంది. జ్ఞానం ఉన్నా శరీరంతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతుంటుంది.* *మనిషి అధోగతికి కారణమవుతుంది. అనాది నుంచి అస్తిత్వం కలిగిఉండి, అహంకార స్వభావంతో, సమస్త వ్యాపారాలు (కర్మలు) జీవాత్మ చేత చేయించేది విజ్ఞానమయ కోశమే. మనకు ప్రీతినిచ్చేది పొందినప్పుడు అనుభవానికొచ్చేది ఆనందమయ కోశం. అనాత్మలైన ఈ అయిదు కోశాలను వివేకంతో అధిగమించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది.*

*పరబ్రహ్మాన్ని ఆకాశంతో పోలుస్తారు మహాత్ములు. అది నిర్మలంగా, దోషరహితంగా, ఎల్లలు లేనిదిగా, నిశ్చలంగా, నిర్వికారంగా, లోపలా బయటా అనే తేడాలు లేకుండా, ఒకే ఒక్కటిగా కనిపిస్తూ ఉంటుంది. అదే అంతరాత్మ.*

*కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే శత్రువులను ఓడించి, మనసును అధీనంలో ఉంచుకుని తానే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకొన్నవాడు- బ్రహ్మవేత్త అంటారు వివేక చూడామణిలో ఆది శంకరాచార్యులవారు. ఆకలి, దప్పిక, దుఃఖం, క్షీణించడం, మరణించడం, భ్రాంతి అనేవి షడూర్ములు. వీటికి అతీతంగా ఉంటూ హృదయంలో సదా పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలన్నది పురాణ వచనం.*

*విషయ వాంఛలను విడిచిపెట్టడం అంత సులువు కాదు.* *వేదవేదాంగాల్ని, పురాణాలను వింటూ, పఠిస్తుంటే ముక్తి మార్గం పట్టినట్టు కాదు. ఇవన్నీ పైపై మెరుగులు.*

*తానేమిటో తెలుసుకోలేని వ్యక్తి మరో వ్యక్తికి ఎన్నటికీ దారి చూపించలేడు. డాంబికాలకు తలొగ్గడం చిల్లి పడవలో ప్రయాణం వంటిది!*

*నిత్యానిత్య విచక్షణ చేయగలిగి, వేద వాంగ్మయంపై విశ్వాసం కలిగి, పరమాత్మపై ఏకాగ్ర దృష్టి కలవాడై, మోక్షసాధన చేసేవాణ్ని పండితుడని అంటారు.*

*అనాదిగా ముముక్షువులు తగిన జ్ఞాన సముపార్జనతో, సాధనసంపత్తితో, అజ్ఞానాన్ని దూరం చేసుకొని ఆత్మజ్యోతి దర్శనంతో అఖండంగా ప్రజ్వరిల్లుతూ నిస్వార్థంగా మనకు దారి చూపారు.*

*ఆ దారి పట్టుకోగలగాలి. వాసనా వాంఛల్ని ఉల్లిపొరల్ని వలిచినట్లు వదిలించుకుంటూ శ్రద్ధగా, దీక్షగా ఏ దశలోనూ నమ్మకం సడలకుండా, ఆ దారిలో ప్రయాణించేవారు, ఆత్మ సారథ్యంలో, శరీరాన్ని జాగ్రత్తగా పరమాత్మలో లీనం చేయడానికి ఉపక్రమించారు. వారి జీవితం మార్గదర్శకం, అనుసరణీయం.✍️

ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 2

 ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 2


మహాస్వామి వారు తమ మఠగౌరవం విషయంలోనే కాదు. ఇతరుల గౌరవ విషయంలోనూ అంతే గమనంగా ఉంటారు. శ్రీవారు కంచిలో ఉంటున్న రోజుల్లో క్రొత్తగా పీఠాధిపత్యం స్వీకరించిన మైసూరు వైష్ణవ పీఠాధిపతులు స్వామివారిని కలవాలనుకొన్నారు. వైష్ణవ పీఠాలలో ధనబలం మెండుగా ఉన్న మఠం అది. ఆ స్వామివారు పరమ సాత్వికులు. వారు సిద్ధాంతంలో మహా పండితులు. మహాస్వామి వారిని వారి పూర్వాశ్రమంలో అనేకసార్లు దర్శించారు. కానీ మఠాధిపతులుగా ఆ రకంగా దర్శించడానికి ఆ మఠ అనుయాయులు తమ మఠగౌరవానికి భంగంగా తలపోశారు. కాలక్రమాన వారు కాంచీపుర యాత్రకి వచ్చారు. కంచి వచ్చి కూడా మహాస్వామిని దర్శనం చేయకుండానే వెళ్ళిపోవాలా అని బాధపడ్డారు. కంచి మహాస్వామి వారికీ విషయం తెలిసింది.


వైష్ణవులకు కంచియాత్ర కామకోటి పీఠ సమీపంలో ఉన్న గరుడాళ్వారును దర్శనం చేయందే పూర్తికాదు. మహాస్వామివారు వైష్ణవ యతి దర్శనానికి వచ్చే సమయానికి సరిగ్గా గరుడాళ్వారు సన్నిధిలో కూర్చున్నారు. వైష్ణవ స్వామి రానే వచ్చారు. గరుడాళ్వారుకు వందనం చేసి ప్రక్కనే ఉన్న స్వామివారిని చూసి ఆనందపరవశులయిపోయారు. మఠమర్యాదలకు భంగం కాకుండా కలుసుకోవడం ఎలా అనేది ప్రశ్న. కానీ సమావేశమయిన పిదప మాట్లాడుకొనే విషయంలో ఇబ్బందే లేదు కదా!


అయితే రమణులను శంకరాచార్య పరంపరకు సంబంధమున్న శివగంగ పీఠాధిపతులు, శంకర పీఠాధిపతులయిన పూరీ శంకరాచార్యుల వారు దర్శించారు. శివగంగ పీఠాధిపతులు తమ పీఠానికి దయచేయవలసినదిగా కబురు చేశారట. రమణులు “మనమేమి పండితులమా? పీఠాధిపతుల వద్దకు పోయేందుకు ఏమి అర్హత ఉన్నదని” పోలేదట. వారే బయలుదేరి వెళ్ళారు. ఓ చెట్టునీడన కలుసుకొన్నారు. పీఠాధిపతులు జరీ అంచు శాలువా. రూ.116లు సమర్పించి “స్వామీ తాము స్వీకరించాలి అన్నారట. రమణులు ఎంతో కష్టం మీద శాలువా మాత్రం గ్రహించారు. ‘సుఖి అంటే రమణులె సుఖి. ఈలాంటి సుఖం నాకు వేయి జన్మలకైనా దుర్లభం” అన్నారట వారు.

పూరీ శంకరాచార్యులు రమణులను దర్శనం చేసి వారిద్వారా సందేహ నివృత్తి చేసుకొని, వారి అనుగ్రహం వల్ల అనిర్వచనీయమైన అనుభూతిని పొంది, ఆనందభాష్యాలు కారగా కరములు శిరమున ఘటించి నమస్కరించారట.


అప్పటి శృంగేరీ స్వామి శ్రీ సచ్చిదానంద నృసింహభారతీ స్వామివారు రమణులను కలవాలని ప్రయత్నం చేశారట. పీఠాధిపతులాయె! ఎన్నో నిబంధనలు చుట్టూ ఉన్నవారు రానిస్తారా! అంటారు రమణులు. శృంగేరీ మఠపండితులు ఒకరు వీరికి సన్యాసదీక్ష ఇప్పించాలని కూడా ప్రయత్నం చేశారు. అది తెలుసుకొనిన శృంగేరీ స్వామి వారు వారిని మందలించారట. శృంగేరీ చంద్రశేఖర భారతీ స్వామి చరిత్ర ఇంగ్లీషులో వ్రాసిన శ్రీ నటరాజన్ గారు రమణ మహర్షి సెంటర్ ఫర్ లెర్నింగ్ కు అధ్యక్షులు. వారు చంద్రశేఖర భారతీస్వామి గురించి రమణులు ఏదైనా వ్యాఖ్య చేశారని గానీ, భారతీ స్వామివారు రమణుల గురించి ఏదైనా అన్నారని గానీ వ్రాయలేదు. నే చూసినంత వరకు ఇంకే రమణ గ్రంథాలలోనూ ఈ ప్రసక్తి లేదు.


కంచి స్వామి రమణులు ఉపాధిలో ఉండగా రెండుసార్లు తిరువణ్ణామలై విజయం చేశారు. 1929లో ఒకసారి 1944లో రెండవసారి. మొదటిసారి వెళ్ళేటప్పటికే రమణుల స్థితి గురించి తమ శిష్యుల వద్ద ఎంతో ఉన్నతంగా చెప్పి ఉన్నారు. అప్పటికే పాల్ బ్రంటన్ ను కూడా రమణుల వద్దకు వారే నీకు తగిన గురువు అని ప్రోత్సహించి పంపారు. 


అయినా గిరి ప్రదక్షిణ సమయంలో రమణాశ్రపు గేటు వద్ద ఒక నిమిషం నిలబడి పరకాయించి చూసి సాగిపోయారు. పీఠాధిపతులయిన స్వామివారికి ఆహ్వానించకుండా ఎక్కడికీ వెళ్ళకూడదనే నియమముంది. మరి రమణులకో! తమకు భిన్నమైన వస్తువు లేదనే ఆత్మానుభవంలో ఉన్నవారికి పిలిచే వారెవరు? పిలువబడే వారెవ్వరు? 1929 సంఘటన పుస్తకాలలో రికార్డు కాలేదు. అయితే శ్రీ రా.గణపతి గారికి కుంజస్వామి స్వయంగా చెప్పారు. కుంజస్వామి రెండు సందర్భాలలోనూ రమణులకు సమీపవర్తులుగా ఉన్నారు.


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

విగ్రహారాధన

 విగ్రహారాధన ఎందుకు చేయాలి?


వేదాంతులు ఏ దేవుణ్నీ ప్రత్యేకించి ప్రస్తావించరు. మనిషికైతే మాత్రం దేవుడు తనకు మానవాకారంలో కాని, సృష్టిలో కనిపించే రూపాల్లోకాని, అతణ్ని ఊహించుకుంటూ చూస్తున్నప్పుడే సంతృప్తి. 


అందుకే అతడు ఆ రూపాలను విగ్రహాలుగా మలిచి, దేవాలయాలు నిర్మించి, అందులో ప్రతిష్ఠించుకుంటాడు.


వేదాంతులన్నట్ల్లుగా- దేవుణ్ని నిరాకార నిర్గుణ చైతన్యం అన్నా, నామ గుణ రూప రహితుడన్నా… పామరుడు సామాన్య జ్ఞానంతో తెలుసుకోలేడు. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం అని చెబితే- పండితులకు కానీ తెలియని పెద్ద మాటలని అనుకుంటాడు. 


దేవుణ్ని దేవాలయాల్లో విగ్రహంగా చూసుకుంటూ ఆరాధించడమే అతడికి ఇష్టం. తనకు నచ్చిన పేర్లు పెట్టి ఆ దేవుణ్ని పిలుచుకోవడానికే అతడు మొగ్గుచూపుతాడు. సృష్టిలో కనిపించే శ్రేష్ఠమైన వస్తువులను, ధన కనక వస్తువాహనాలను కానుకలుగా దేవుడికివ్వాలని అనుకుంటాడు. ఇష్టదైవాల పేర్లు పెట్టి పిల్లలను పిలుచుకుంటాడు.


భగవంతుడి శక్తి విద్యుచ్ఛక్తిలాంటిది. అది నేరుగా చూడలేనిది. పరికరాలుంటేనే కానీ అది ప్రవహించదు. ఆస్తికతను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఆ దైవశక్తిని అందుబాటులోకి తెచ్చుకుని అనుభవించడానికి ఉన్న పరికరమే దైవ విగ్రహమని తెలుసుకొమ్మంటారు. 


త్రిమతాచార్యులుగా ప్రసిద్ధికెక్కిన వేదాంత మహాగురువులు శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు ముగ్గురూ విగ్రహారాధనను సమర్థనీయమన్నారు.


ఆస్తికతకు అర్థం తెలియనివారికి దేవతామూర్తుల విగ్రహాలు ప్రయోజనం లేని మానవ కల్పితాలుగా కనిపిస్తాయి. దేవుడికి అన్ని పేర్లా అంటూ అవహేళనగా ప్రశ్నిస్తారు. దైవంతో సరళమైన, శక్తిమంతమైన, తిరుగులేని సంబంధం ఏర్పడటానికి విగ్రహారాధన ప్రక్రియగా ఏర్పరచుకుని, మహాత్ములెందరో ఫలితం సాధించారని తెలియనప్పుడు అటువంటి విమర్శలు వస్తాయి. 


సత్యశోధనకు విగ్రహారాధనతో వచ్చే ఉపశమనం వేరుగా ఉంటుంది. ఏకాగ్రచిత్తంతో జరిపిన విగ్రహ పూజతో భావరహిత స్థితికి చేరుకుని, ఆరాధన ఆరాధకుడూ వేరు కాదన్న విషయాన్ని నిరూపించిన భాగవతోత్తముల చరిత్రలు తెలియనివి కావు. 


రామభక్తుడైన వాగ్గేయకారుడు త్యాగరాజు, నిత్యపూజ కోసం తన పూజాగృహంలో ప్రతిష్ఠించుకుని నిరంతరం ఆరాధించుకుంటున్న రామలక్ష్మణ సీతాదేవి విగ్రహాలను కిట్టనివారు ఎవరో నదిలోకి విసిరి పారవేస్తారు. అప్పుడాయన ఆవేదనతో, రచించి ఆలపించిన కీర్తనలకు స్పందించి భగవంతుడే ఆ విగ్రహాలను అవి ఉన్నచోటుకు చేర్చినట్లు వివరించే కథనం తెలిసిందే. 


కలియుగంలోనే, నిష్కామ భక్తితో కాళీమాత రూపాన్ని ఆరాధించిన రామకృష్ణ పరమహంస భగవత్‌సాక్షాత్కారం పొందిన అనుభూతి కలిగించుకున్నారు.


మనోవాక్కాయ కర్మలతో ముడివడిన విగ్రహారాధననే సనాతన ధర్మం ఆచరించమంటున్నది. దేవాలయ నిర్మాణాలు, విగ్రహ పూజల విధి విధానాలను ఆగమ శాస్త్రం సహేతుకంగా వివరిస్తుంది. దేవాలయంలో దేవుడి ఎదుట చదివే మంత్రాలను, స్తోత్రాలను దేహానికి, మనసుకు ఉపశమనమిచ్చే విధంగా మహర్షులు రచించి ఇచ్చారు. 


దేవాలయాలు సందర్శిస్తున్నప్పుడు భక్తితో దైవరూపాలను కొలుస్తున్నప్పుడు మనిషికి- భగవంతుడు పత్రం, ఫలం, తోయాలు తప్ప మరేదీ అడగలేదని గీతలో ఆయనే చెప్పిన విషయం గుర్తుకు రావాలి.


భగవంతుడి సాక్షాత్కారం ఇప్పించలేని మహిమలు తనకు వద్దంటాడు వివేకానందుడు. అంతర్యామిని చేరుకోవడమే లక్ష్యంగా సాగే ఆధ్యాత్మికులందరికీ

గుర్తుండవలసిన విషయమది,,,

నారాయణునికి నమస్కరిస్తున్నాను

 శ్లోకం:☝️

*హే విష్ణో నిహితం కృత్నం*

  *జగత్త్వయ్యేవ కారణే l*

*జ్యోతిషాం జ్యోతిషే తస్మై*

  *నమో నారాయణాయ తే ll*


భావం: ఓ విష్ణుమూర్తి ! ఏ జగత్తుకి నీవు కారణమో ఆ విశ్వమంతా నీలోనే ఉన్నది. అందులో వెలిగే వాటన్నిటనీ వెలిగించే వెలుగువు నీవు. అంటే మన అనుభూతిలోకి (experiences) వచ్చే వాటన్నిటనీ చూపే జ్ఞానము లేక చైతన్యము (consciousness),  ఐన నారాయణునికి నమస్కరిస్తున్నాను అని భావం.🙏