13, ఆగస్టు 2021, శుక్రవారం

దైవ సాక్షాత్కారం

దైవ సాక్షాత్కారం 

మన హిందూ సనాతన ధర్మం అనేక మహర్షులు వారి అపురూప జ్ఞాన సంపదతో మనకు అందించిన విజ్ఞాన గని.  ఇప్పుడు మనలో చాలామంది వారికి తెలిసి తెలియని మిడి మిడి జ్ఞ్యానంతో ప్రవచన కారులుగా ప్రసిద్ధి చెంది వారికి తెలిసిన దానినే సత్యమని నమ్మి మనకు అదే సత్యమని నమ్మేటట్లు ప్రవచిస్తున్నారు.   ఈ సిలిసిలలో నేను ఇటీవల ఒకటి రెండు ప్రవచనాల వీడియోలు చూసిన తరువాత ఇది వ్రాయ ప్రయత్నిస్తున్నాను.  అందులో వారు చెప్పేది ఏమిటంటే చాలామంది విగ్రహారాధన ఒక ప్రారంభ ఆరాధన క్రమమని దానిని జ్ఞానాన్వేషులు ఆచరించ నవసరం లేదనే అపోహలో వున్నారని అది సరైనది కాదని విగ్రహారాధన చేయటము ఉత్తమమైనదని ప్రజలను నమ్మించేటట్లు ప్రభోదిస్తున్నారు. మరి ఏ ఆధారంతో వారు అట్లా ప్రవచిస్తున్నారో నాకు మాత్రము తెలియదు. 

నేను నాకున్న స్వల్ప జ్ఞానంతో తెలుసుకున్నది ఏమనగా మనకు జగత్ గురువు అయిన కృష్ణ భగవానులు ప్రవచించిన శ్రీమద్ భగవత్ గీత, మరియు వేదాంత గ్రంధాలైన ఉపనిషత్తులు మనకు పరం ప్రమాణాలు.  వేదాంతానికి సంబంధించి ఉపనిషత్తులకు మించిన గ్రంధాలు వుంటాయని నేననుకోను. 

అటు గీతలో కానీ ఇటు ఉపనిషత్తులలో కానీ విగ్రహారాధన తప్పకుండ చేయాలని ఎక్కడ చేయలేదు. గీతాచార్యుడు స్పష్టంగా ఆత్మ, పరమాత్మా గురుంచి వివరించారు. స్వామి ఒక సందర్భంలో ఏమన్నారంటే ఎవరెవరు ఏ ఏ రూపాలలో నన్ను కొలుస్తున్నారో వారి వారికి నేను ఆయా రూపాలలో అనుగ్రహిస్తున్నాను అని పేర్కొన్నారు. 

మనం దేముడిని ఎందుకు కొలవాలి అనే ప్రశ్న వేసుకుంటే మనకు సమాధానము దొరుకుతుంది. చాలా మంది దైవార్చన కేవలము ఐహిక వాంఛలను తీర్చుకోటానికే అనే సమాధానం ఇస్తారు.  వారిని కేవలము లౌకికులుగా మనం పేర్కొన వచ్చు.  ఈ లోకంలో సుఖాలను, ఆనందాలను పొందాలనే కాంక్ష కలిగిన వారు విగ్రహారాధన చేయ వచ్చు. తప్పులేదు. 

మన జీవిత పరమావధి మోక్షమని మన వేదాంత గ్రంధాలూ ఏక కంఠంతో పేర్కొంటున్నారు. ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వారు మోక్షం అంటే ఏమిటి దానిని ఎలా సాధించుకోవాలని నిర్ణయించుకుంటారు. ప్రస్తుతము చాలా మంది ప్రవచన కారుల జ్ఞానము విగ్రహారాధన మటుకే పరిమితమైనది పేర్కొనటానికి నేను బాధపడుతున్నాను.  వారు వారికి వున్న జ్ఞానమే సర్వ శ్రేష్టమైనది అందరు ఆచరించ దగింది అని అనుకుంటే . వారిని ఆ దేవదేముడే రక్షించాలి. 

నిజానికి మోక్షము జ్ఞాన రూపంలో వున్నది అది సాద్య వస్తువు కాదు సిద్ధ వస్తువు.  అటువంటప్పుడు నోములు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు చేసి మోక్షాన్ని పొందడము అంటే ఇంట్లో పారేసుకుని చేలో వెతకటం లాంటిది. మీకు ఒక చిన్న ఉదాహరణతో వివరించ ప్రయత్నిస్తాను.  మీరు మీ ఇంట్లో ఒక గుండు సూది పారవేసుకున్నారనుకోండి. మీ ఇంట్లో వెలుతురూ లేదు, కానీ మీ వీధిలో వెన్నెల పుష్కాలంగా వుంది ఇప్పుడు మీరు వీధిలో గుండు సూదిని వెతుకితే దొరుకుతుందా?  మీ హృదయ కుహరంలో వున్న పరమాత్మను మీరు దేవాలయ విగ్రహంలో వెతకటం కూడా దాదాపు అదే విధమైనది.  

మరి దేవాలయాలకు వెళ్లి విగ్రహారాధన చేస్తే ప్రయోజనం ఏమిటి.  ఏమి ప్రయోజనము లేదా అంటే అట్లా అనలేము.  మనము వీధిలో వెతకటం వాళ్ళ మనం ఇంట్లో పారవేసుకున్న గుండు సూది దొరకదు కానీ మీకు వెతకటం మాత్రం యెట్లా అనేది తెలుస్తుంది. అదే విధంగా మీరు గుడికి వెళ్లి విగ్రహారాధన చేయటము వలన కలిగే ఫలితము.  అంటే మీకు కొంత వరకు అంతఃకరణ శుద్ధి లభించ వచ్చు.  కానీ మీ గమ్యము కేవలము అంతఃకరణ శుద్ది మాత్రమే కాదు కధ.  మీ గమ్యము మీకు తెలియక పొతే మీ ఆరాధనను కేవలము విగ్రహారాధన వరకు చేయవచ్చు.  కానీ మీకు ఎట్టి పరిస్థితిలో కూడా జ్ఞాన రూపంలో వున్న మోక్షము లభించదు. ఇది సత్యం. 

కాబట్టి ముముక్షువులారా దయచేసి ఈ ప్రవచన కారుల మిడి మిడి జ్ఞానంతో మీ అపురూపమైన లక్ష్యాన్ని మార్చుకోకండి, కేవలము గీతాచార్యుడు చెప్పిన జ్ఞాన మార్గంలో నడవండి. మనకు జ్ఞాన మార్గ దర్శనము చేయటానికి అనేక ఉపనిషత్తులు వున్నాయి. వాటిని అనుసరించండి మోక్ష సాధన చేయండి. ప్రతి మనిషి ( స్త్రీ పురుషుడు ఎవరైనా కానీయండి) సాదించ వలసింది కేవలము చతుర్ధ పురుషార్థం ఐన మోక్షము మాత్రమే అంతకంటే వేరే ఏమి లేదు. 

స్త్రీ, పురుషుడు: 

మనము సామాన్య సామాజిక వాడుకలో స్త్రీ, పురుష విభేదాలను పాటించి ఇది పురుషులు చేసేది ఇది మాత్రమే స్త్రీలు చేసేది అని వర్గీకరిస్తుంటాము.  నిజానికి స్త్రీ పురుష బేధము అనేది కేవలము మనము వున్న లింగ శరీరానికే కానీ ఆత్మకు కాదు.  ఆత్మా స్వరూపము ఎట్టి లింగము కలిగి లేదు. పురుషుడు మోక్షానికి యెంత అర్హుడో  స్త్రీ కూడా అంతే అర్హురాలు. కాబట్టి ముముక్షువులారా మీలో ఇటువంటి విభేదాలు పూర్తిగా విస్మరించండి ఇప్పుడే మోక్ష సాధనకు నడుము చుట్టండి. 

ముముక్షువులు చేయవలసిన మొదటి సాధన స్త్రీ పురుష భేదము మనసు నుంచి పోగొట్టటమే.  ఆ స్థితిని ఎప్పుడైతే చేరుకుంటాడో అప్పుడు అన్నీ జీవులు ఒకటే నని ప్రతి జీవి ఆత్మా స్వరూపమే అని తెలుసుకుంటాడు. తనను పొగిడే వానిని దూషించే వానిని ఒకే విధంగా చూడ గలుగుతాడు. మనో వికారాలను ఎవరైతే అదుపు చేసుకోగలడో అతడే మోక్ష సాధనకు యోగ్యత సంపాదించ గలుగుతాడు ( ఇక్కడ అతడు,  వాడు అనే శబ్దాలు కేవలము పురుషులకు సంబందించినవి కావు అవి ప్రతి ముముక్షువుకు వర్తించేది. అందరికి అర్ధం అవటానికి మాత్రమే పురుష వాచకములో  వ్రాసినవి మాత్రమే) నేను ఈ శరీరము కాదు శరీరాన్ని నియంత్రిచే ఆత్మను అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పటినుంచే నీకు మోక్ష సాధనకు మార్గము ఏర్పడుతుంది. మనము రోజు ఎంతోమంది తమ పాంచభౌతిక శరీరాన్ని వీడి వెళ్లటం చూస్తున్నాము. అయ్యో పాపం అని మనము వారి మీద జాలి చూపెడుతుంటాము.  మిత్రులారా ఆ రోజు అందరికి వస్తుంది ఇక్కడ ఎవ్వరు శాస్వితంగా వుండరు. ఈ ప్రపంచంలో ప్రతివారు మూడురోజుల అతిధులు మాత్రమే. నీ శరీరము ఈ భూమిమీది పంచ బుటాలతో తయారు చేయబడినది.  కాబట్టి అది ఒకరోజు మళ్ళీ పంచ భూతాలలో కలసిపోవలసినదే. పంచ భూతాలకు సంబంధం లేకుండా వున్నది ఒక్క ఆత్మా మాత్రమే అది నీ పంచ భౌతిక శరీరంలోని హృదయ కుహరంలో నిక్షిప్తమై వున్నది.  ఈ విషయం మంత్రపుక్షంలో కూడా స్పష్టంగా పేర్కొని వున్నది. 

పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం

అథోనిష్ట్యా వితస్త్యాన్త్యే నాభ్యాముపరి తిష్ఠతి 

జ్వాలమాలాకులంభాతి విశ్వశ్యాయతనం మహత్

సంతతగ్ం శిరాభిస్తు లంబత్యా కోశసన్నిభం

తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం 

తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః 

సోగ్రభుగ్విభజంతిష్ఠన్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మథశ్శాయీ రశ్మయ తస్య సంతతా

సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః

తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః

నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా

నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా 

తస్యాశిఖాయామధ్యే  పరమాత్మా వ్యవస్థితః    

స్త్రీ పురుష భేదము లేదని చెప్పటానికే పరమేశ్వరుడు మనకు అర్ధనారీశ్వరుడుగా దర్శన మిస్తున్నారు. ఈ సత్యం మనమందరము గమనించాలి. 

దయచేసి గమనించ గలరు: ఈ రచన నేను విగ్రహారాధన చేయ కూడదని, లేక విగ్రహారాధనకు వ్యతిరేకంగా వ్రాసినది అనుకోవలదు. నా భావన కేవలము విగ్రహారాధన వల్ల మనకు ఐహిక వాంచితాలు నెరవేరుతాయి కానీ మోక్షము సిద్దించదని తెలుపటమే నా లక్ష్యము. మోక్షార్ధి సర్వ జగత్తులోను భగవంతుని  దర్శిస్తాడు. అందుకే విష్ణు సహస్ర నామాలలో మొదటి నామము "విశ్వం" అని అన్నారు అంటే ఈ కనిపించే జగత్తు అంతాకూడా భగవంతుడే అని అర్ధము. 

ఈ ప్రపంచంలో వున్న ఏ వ్యక్తి కూడా తృప్తిగా లేడని తనకు ఇంకా ఏదో ఉంటే తృప్తి లభిస్తుందని అందరు అనుకుంటారు.  మరైతే ఏమి దొరికితే తృప్తి కలుగుతుంది. ఏదైతే లభిస్తే తరువాత ఇంకా ఏమి వద్దు అని అనుకుంటాడో అదే.  ఆ అదే ఏమిటి దానినే మోక్షము అంటారు.  మోక్షము లభించిన వానికి ఇంకా ఏదో కావాలనే చింత ఉండదు. 

ఓం తత్ సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

సంస్కృత మహాభాగవతం

 


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*


*శ్రుతిగీతలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*87.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ద్యుపతయ ఏవ తే న యయురంతమనంతతయా త్వమపి యదంతరాండనిచయా నను సావరణాః|*


*ఖ ఇవ రజాంసి వాంతి వయసా సహ యచ్ఛ్రుతయః త్వయి హి ఫలంత్యతన్నిరసనేన భవన్నిధనాః॥12001॥*


దేవా! స్వర్గాదిలోకములకు అధిపతులైన ఇంద్రుడు, బ్రహ్మదేవుడు మొదలగువారుగూడ నీ అభ్యంతరములను తెలిసికొనజాలరు. ఇక మానవమాత్రుల విషయము చెప్పనేల? అంతేగాదు, నీవుగూడ వాటి హద్దును ఎఱుంగజాలవు. ఇది ఎంతయు ఆశ్చర్యకరము. యథార్థముగా ఆద్యంతములే లేనప్పుడు దానిని తెలిసికొనుట ఎట్లు? గాలిచే ఎగురగొట్టబడిన ధూళికణములు ఆకాశమునందువలె నీలో సప్తావరణములతో కూడిన అసంఖ్యాక బ్రహ్మాండములు ఒక్కసారిగా తిరుగుచుండును. ఇంక నీ అవధి ఎట్లు తెలియును? వేదములమైన మేముగూడ సాక్షాత్తుగా నీ స్వరూపమును వర్ణింపజాలము. నీకు అతిరిక్తములైన వస్తువులను *నేతి-నేతి* (న + ఇతి, న + ఇతి) అని నేషేధించుచు, నిషేధించుచు పోగా పోగా చివఱకు మమ్ములనుగూడ మేము నిషేధించుకొనుచుపోగా మా అస్తిత్వమును (ప్రత్యేకతను) కోల్పోయి నీలోనే ఐక్యమగుదుము." అని శ్రుతులు భగవానునితో పలికెను.


*సప్తావరణములు*:- 1. మహత్తత్త్వము, 2. అహంకారము, 3. పృథివి, 4. జలము, 5. అగ్ని, 6. వాయువు, 7. ఆకాశము.


*శ్రీభగవానువాచ*


*87.42 (నలుబది రెండవ శ్లోకము)*


*ఇత్యేతద్బ్రహ్మణః పుత్రా ఆశ్రుత్యాత్మానుశాసనమ్|*


*సనందనమథానర్చుః సిద్ధా జ్ఞాత్వాఽఽత్మనో గతిమ్॥12002॥*


*పిమ్మట నారాయణఋషి ఇట్లనెను* "నారద మహామునీ! ఈ విధమగా బ్రహ్మమానస పుత్రులైన సనకాది మహర్షులు సనందునిద్వారా ఆత్మ పరమాత్మల ఏకత్వమును నిరూపించునట్టి ఉపదేశమును వినిరి. తాము ఆత్మజ్ఞానమును పొందినవారై కృతకృత్యులు అగుటతో వారు సనందనుని పూజించిరి.


*87.43 (నలుబది మూడవ శ్లోకము)*


*ఇత్యశేషసమామ్నాయపురాణోపనిషద్రసః|*


*సముద్ధృతః పూర్వజాతైర్వ్యోమయానైర్మహాత్మభిః॥12003॥*


దేవర్షీ! నారదా! సనకాదిఋషులు సృష్ట్యారంభము నుండే ఉత్పన్నమైరి. కనుక, వారు అందరికంటెను పూర్వజులు. ఆకాశగమనులైన ఆ మహాత్ములు ఈ విధముగా సమస్తవేద, పురాణ, ఉపనిషత్తుల సారమును మనకు అందించిరి.


*87.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*త్వం చైతద్బ్రహ్మదాయాద శ్రద్ధయాఽఽత్మానుశాసనమ్|*


*ధారయంశ్చర గాం కామం కామానాం భర్జనం నృణామ్॥12004॥*


మహాత్మా! నారదా! నీవుగూడ వారివలె బ్రహ్మమానసపుత్రుడవే. వారి జ్ఞానసంపదకు ఉత్తరాధికారివి గనుక, ఈ బ్రహ్మాత్మ విద్యను శ్రద్ధగా ధారణచేసి, నీవు స్వేచ్ఛగా సంచరింపుము. ఈ బ్రహ్మవిద్య మానవాళియొక్క సమస్త విషయవాసనలను భస్మమొనర్చును".


*శ్రీశుక ఉవాచ*


*87.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*ఏవం స ఋషిణాఽఽదిష్టం గృహీత్వా శ్రద్ధయాఽఽత్మవాన్|*


*పూర్ణః శ్రుతధరో రాజన్నాహ వీరవ్రతో మునిః॥12005॥*


*శ్రీశుకుడు వచించెను* మహారాజా! దేవర్షియైన నారదుడు జితేంద్రియుడు, జ్ఞాని, పూర్ణకాముడు, నైష్ఠిక బ్రహ్మచారి. అతడు తాను విన్నదానిని వెంటనే పూర్తిగా ధారణచేయును. నారాయణమహర్షి చేసిన ఉపదేశమును శ్రద్ధగా గ్రహించిన పిదప నారదుడు ఇట్లనెసు-


(వేదములు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుని స్తుతించిన విధమును సనందుడు, సనకాది ఋషీశ్వరులకు తెలిపెను. దానిని నారాయణఋషి నారదునకు వివరించెను. దానిని ప్రస్తుతము శుకయోగి, పరీక్షిన్మహారాజునకు విశదపరచెను)


*నారద ఉవాచ*


*87.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*నమస్తస్మై భగవతే కృష్ణాయామలకీర్తయే|*


*యో ధత్తే సర్వభూతానామభవాయోశతీః కలాః॥12006॥*


*నారదుడు నుడివెను* "దేవా! నీవు సచ్చిదానందస్వరూపుడవు శ్రీకృష్ణుడవు. నీ యొక్క కీర్తి నిర్మలమైనది. నీవు సకల జీవులను సంసారబంధములనుండి విముక్తులను గావించుటకై మహనీయములైన లీలావతారములను దాల్చితివి. అట్టి పరమాత్ముడవైన నీకు నమస్కారము".


*87.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*ఇత్యాద్యమృషిమానమ్య తచ్ఛిష్యాంశ్చ మహాత్మనః|*


*తతోఽగాదాశ్రమం సాక్షాత్పితుర్ద్వైపాయనస్య మే॥12007॥*


ఇట్లు పలికిన పిదప నారదుడు మహాత్ముడైన నారాయణమహర్షికిని, ఆయనయొక్క శిష్యులకు వినమ్రుడై నమస్కరించెను. అనంతరము ఆ దేవర్షి మా తండ్రియగు వ్యాసభగవానునియొక్క ఆశ్రమమునకు స్వయముగా వెళ్ళెను.


*87.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*సభాజితో భగవతా కృతాసనపరిగ్రహః|*


*తస్మై తద్వర్ణయామాస నారాయణముఖాచ్ఛ్రుతమ్॥12008॥*


మహారాజా! వ్యాసమహర్షి గౌరవాదరములతో నారదుని సత్కరించి, సుఖాసీనుని గావించెను. పిమ్మట ఆ దేవముని తనకు నారాయణమహర్షి తెలిపిన విషయములను వేదవ్యాసునకు వర్ణించి చెప్పెను.


*87.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*ఇత్యేతద్వర్ణితం రాజన్ యన్నః ప్రశ్నః కృతస్త్వయా|*


*యథా బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణేఽపి మనశ్చరేత్॥12009॥*


మహారాజా! 'అవాఙ్మానసగోచరుడు, ప్రాకృతగుణ రహితుడు అయిన పరమాత్మయందు మనస్సును ఏవిధమగా నిలుపవలెను?' అని నీవు ప్రశ్నించియుంటివి. దానికి సమాధానముగా శ్రుతులు భగవానుని వర్ణించిన రీతిని నేను నీకు వివరించియుంటిని (మాతండ్రియగు వ్యాసభగవానునినుండి నేను ఈ విషయములను వినియుంటిని).


*87.50 (ఏబదియవ శ్లోకము)*


*యోఽస్యోత్ప్రేక్షక ఆదిమధ్యనిధనే యోఽవ్యక్తజీవేశ్వరో|*


*యః సృష్ట్వేదమనుప్రవిశ్య ఋషిణా చక్రే పురః శాస్తి తాః|*


*యం సంపద్య జహాత్యజామనుశయీ సుప్తః కులాయం యథా|*


*తం కైవల్యనిరస్తయోనిమభయం ధ్యాయేదజస్రం హరిమ్॥12010॥*


రాజా! భగవంతుడే ఈ విశ్వమును సంకల్పించును. దాని ఆది, మధ్య, అంతములయందు తానే నిలిచియుండును. ప్రకృతి మరియు జీవులకు ఆయనయే స్వామి. ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించి, అందులో తాను జీవునిరూపమున ప్రవేశించెను. ఆయనయే ఈ దేహములను నిర్మించి, వానిని పాలించుచున్నాడు. గాఢనిద్రలో నున్న పురుషుడు తన శరీరముతోగల అనుసంధానమును ఏవిధముగ విడచిపెట్టునో, అట్లే భగవంతుని పొందిన జీవుడు మాయనుండి ముక్తుడగును. భగవానుడు కేవలము విశుద్ధమైన చిన్మాత్రస్వరూపుడు. జగత్తువలన ఆయనలో మాయ లేక ప్రకృతియొక్క అస్తిత్వము పిసరంతకూడా ఉండదు. వాస్తవమునకు అభయస్థానము - సర్వలోకశరణ్యుడు ఆయన ఒక్కడే. అట్టి భగవానుని నిరంతరము ధ్యానపూర్వకముగ చింతించవలెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే నారదనారాయణసంవాదే వేదస్తుతిర్నామ సప్తాశీతితమోఽధ్యాయః (87)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *శ్రుతి గీతలు* 

అను ఎనుబది ఏడవ అధ్యాయము (87)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*384వ నామ మంత్రము* 13.8.2021


*ఓం విశ్వసాక్షిణ్యై నమః*


సకల జగత్తుకును తానే సాక్షిగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విశ్వసాక్షిణీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం విశ్వసాక్షిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వశుభములు సంప్రాప్తింపజేయును మరియు అభీష్ట సిద్ధిని అనుగ్రహించును.


పరమేశ్వరి పంచభూతాత్మిక. పంచభూతముల ద్వారా సమస్త జీవకోటియొక్క కర్మలకు సాక్షీభూతురాలిగా ఉన్నది.. ఆ తల్లి నేత్రములు ఒకటి సూర్యుడు. మరియొక నేత్రము చంద్రుడు. ఫాలనేత్రము అగ్ని. సూర్యచంద్రాగ్నులద్వారా జగత్తునంతటినీ పరిశీలిస్తూ, విశ్వమందలి జీవుల దినచర్యలకు సాక్షిగా ఉన్నది. గనుకనే అమ్మవారు *విశ్వసాక్షిణీ* యని అనబడినది. నిరంతరము అంతర్యాగ నిమగ్నుడైన సాధకుడు, విశ్వసాక్షిగా నిలచిన పరమేశ్వరి వీక్షణముతో ఆత్మజ్ఞానము పొందును. పంచభూతములలోను, అష్టదిక్కులయందును, సూర్యచంద్రాగ్నులలోను - విశ్వమంతయు తానుగా, కోటానుకోట్ల నేత్రములతో అనుక్షణము ప్రవర్తిల్లే పరమేశ్వరి జీవులకర్మలకు సాక్షీభూతమై నిలుస్తున్నది గనుకనే అమ్మవారు *విశ్వసాక్షిణీ* యని అనబడినది. ఆ తల్లి మూడు నేత్రములు సూర్యచంద్రాగ్నులు మాత్రమే కాదు. భూతభవిష్యద్వర్తమానములు అనెడి మూడుకాలమములు కూడా. ఆ తల్లి ఎల్లవేళలా అనంతకోటి జీవరాశుల దినచర్యలకు సాక్షీభూతము గనుకనే *విశ్వసాక్షిణీ* యని అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విశ్వసాక్షిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*967వ నామ మంత్రము* 13.8.2021


*ఓం సుమంగళ్యై నమః* 


సువాసినీ స్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సుమంగళీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సుమంగళ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు జీవనగమనమంతయు శుభప్రదమై సాగును.


జగన్మాత సర్వమంగళ స్వరూపిణి. *శోభనం మంగళం అస్యాః* (సౌభాగ్య భాస్కరం, 1066వ పుట) శోభనమైన మంగళము గల లలితాంబిక. అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి గనుక నిత్యసుమంగళి యనదగును. అమ్మవారి భర్త అయిన పరమేశ్వరుడు మృత్యువుకే మృత్యువైనవాడును, మృత్యుంజయుడు అనబడినాడు. హాలాహలమును సామాన్యమైన జలము మాదారిగా గ్రోలినవాడు. గరళకంఠుడని నామము గలవాడు. గనుకనే పరమేశ్వరి నిత్యసుమంగళి. *సత్కృత్యములు చేయుట, అకృత్యములు చేయకుండుట యను ఈ రెండిటిని మంగళమని బ్రహ్మవేత్తలు అయిన ఋషులు చెప్పారు* అని అత్రిస్మృతియందు గలదు. అమ్మవారు తను సర్వమంగళయని తెలిసియున్నది. గనుకనే పరమేశ్వరుని హాలాహలము గ్రోలమని చెప్పినది. తన మంగళసూత్రమనందు గట్టి నమ్మకమున్న నిత్యసుమంగళి గనుకనే ఆ తల్లి *సుమంగళీ* యని అనబడినది. ఇదే విషయాన్ని బమ్మెరపోతనా మాత్యులవారు ఆంధ్రమహాభాగవతంలో ఇలా చెప్పారు.


*కంద పద్యము*


మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!


ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

 

శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఇదే.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం సుమంగళ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*


*శ్రుతిగీతలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*87.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*న యదిదమగ్ర ఆస న భవిష్యదతో నిధనాత్ అనుమితమంతరా త్వయి విభాతి మృషైకరసే|*


*అత ఉపమీయతే ద్రవిణజాతివికల్పపథైః వితథమనోవిలాసమృతమిత్యవయంత్యబుధాః॥11997॥*


పురుషోత్తమా! వాస్తవముగా ఈ జగత్తు ఉత్పత్తికి ముందునూలేదు. ప్రళయమునకు తరువాతగూడ ఉండబోదు. మధ్యకాలమునందు అనగా వర్తమానకాలమునందు ఏకాత్మ స్వరూపుడవైన నీయందు మిథ్యారూపముననే ప్రతీతమగుచున్నది. కుండలు, శస్త్రములు, కుండలములు మొదలగునవి క్రమముగా మట్టి, లోహము, బంగారములనుండి ఏర్పడిన నామమాత్ర రూపములే. అట్లే పరమాత్మయందు వర్ణితమైస జగత్తు నామమాత్రమే. ఇది సర్వధా మిథ్య, మనఃకల్పితము, అజ్ఞానులైన మూర్ఖులు మాత్రమే దీనిని సత్యమని భావింతురు. ఈ జగత్తు అంతయును సత్యస్వరూపుడవైన నీ నుండియే వ్యక్తమగుచున్నది.


*87.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*స యదజయా త్వజామనుశయీత గుణాంశ్చ జుషన్ భజతి సరూపతాం తదను మృత్యుమపేతభగః|*


*త్వముత జహాసి తామహిరివ త్వచమాత్తభగో మహసి మహీయసేఽష్టగుణితేఽపరిమేయభగః॥11998॥*


పరమేశ్వరా! జీవుడు అంశయే అగుటవలన అతని స్వస్వరూపము సచ్చిదానందమయమే. కాని, ఆ జీవుడే మాయామోహితుడై అవిద్యను ఆశ్రయించినప్పుడు తన సహజమైన ఆనందాది గుణములను విస్మరించి, త్రిగుణ జన్యములైన వృత్తులు, ఇంద్రియములు, దేహములయందు బంధింపబడి, వాటినే తన స్వరూపములుగా భావించి, వాటియందే నిరతుడై యుండును. దేహాదుల జన్మమృత్యువులనే తన జనన మరణములుగా భావించి, ఆ చక్రములో తిరుగుచుండును. కానీ, ప్రభూ! పాము తన కుబుసమును వదలి, దానితో ఎట్టి సంబంధమూ లేకున్నట్లు ప్రవర్తించును. అట్లే, నీవును ఈ మాయతో (అవిద్యతో) ఎట్టి సంబంధమునూ కలిగియుండక దానినుండి వేరుగానుందువు. ఐశ్వర్యాది గుణములు అన్నియును సంపూర్ణముగా సర్వదా నీ యందు ఉండును. నీవు అణిమాది అష్ట సిద్ధులతో గూడిన పరమేశ్వరుడవు. నీ యొక్క ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపదలు, జ్ఞానము, వైరాగ్యము అపరిమితములు, అనంతములు. అవి, దేశ, కాల, వస్తువులతో పరిమితములుగావు, పరిచ్ఛిన్నములుగావు.


*87.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*యది న సముద్ధరంతి యతయో హృది కామజటా దురధిగమోఽసతాం హృది గతోఽస్మృతకంఠమణిః|*


*అసుతృపయోగినాముభయతోఽప్యసుఖం భగవన్ అనపగతాంతకాదనధిరూఢపదాద్భవతః॥11999॥*


పరమపురుషా! మానవులలో కొందరు యతులైనప్పటికిని, వారి మనస్సులలోని విషయవాసనలు పూర్తిగా తొలగిపోనంతవరకును వారు, కంఠమునందు ఉన్న మణిని గుర్తింపజాలని అజ్ఞానులవలె తమ హృదయములలో విరాజమానుడవైయున్న నిన్ను తెలిసికొనజాలరు. విషయసుఖములయందే తత్పరులై యుండెడి అట్టి కపటయతులకు ఇహపరములయందును దుఃఖమే మిగులును. బ్రతికియున్నంతవరకును వారు లోకులను రంజింపజేయుచు, ధనార్జనకై పడరాని పాట్లు పడుచు, నిన్ను విస్మరించి, అంతులేని అకృత్యములకు ఒడిగట్టుచుందురు. ఫలితముగా వారు ఈ లోకమున మిగుల దుఃఖములపాలగుటయేగాక నీ అసుగ్రహమునకు దూరమైనందున మరణానంతరమున యమయాతనలను అనుభవింపవలసియుండును.


*87.40 (ముప్పది ఏడవ శ్లోకము)*


*త్వదవగమీ న వేత్తి భవదుత్థశుభాశుభయోః గుణవిగుణాన్వయాంస్తర్హి దేహభృతాం చ గిరః|*


*అనుయుగమన్వహం సగుణ గీతపరంపరయా శ్రవణభృతో యతస్త్వమపవర్గగతిర్మనుజైః॥12000॥*


పురుషోత్తమా! నీవు మానవులకు పుణ్యపాపకర్మల ఫలములను ప్రసాదించువాడవు. నీ యందే అనురక్తులైన అనన్యభక్తులకు ఆ సుఖదుఃఖముల పై ధ్యాసయే యుండదు. దేహాభిమానుల కొఱకే ప్రతిపాదింపబడిన శాస్త్రముల విధినిషేధములకును వారు అతీతులు. అట్టివారు (భక్తాగ్రేసరులు) భాగవతోత్తములు. నీకృపకు పాత్రులై మోక్షమును పొందుదురు. అంతేగాదు, నీ స్వరూపజ్ఞానమునకు నోచుకొనని భక్తులుగూడ ప్రతి యుగమునందును నీవు సల్పిన లీలలను, నీ గుణములను, వినుటవలనను, కీర్తించుటవలనను నీవు వారి హృదయములయందు స్థిరముగా నిలచియుందువు. అట్టి భక్తులుగూడ నీ అనుగ్రహమునకు పాత్రులై, లౌకికములైన సుఖదుఃఖములను, విధినిషేధములను త్రోసిరాజని, నీ పరమపదమును పొందుదురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కర్మ సిద్థాంతం

 కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది అది ఎవ్వరికీ అర్థంకాదు. మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది "కర్మను" అనుభవించాలి, నిందిస్తే ప్రయోజనం లేదు. రమణులు అప్పుడప్పుడు వ్యహాలికి పోతుండేవాడు ఆయన వెంట కృష్ణ అనే భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు అలా పోతుంటే ఉన్నట్టుండి, తన వెనుకనున్న కృష్ణాతో..

"కృష్ణా! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు". అని అన్నారు కృష్ణకు అర్ధం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు, మీదపడినది. కాలి వేలు చితికి, రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు కృష్ణ, అప్పుడు గ్రహించాడు.


వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు .ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి ,రమణ మహాశయులతో 

"మహారాజ్! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద 

పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా! మరెందుకు ఆ ఇటుక దెబ్బ నుంచి తప్పుకోలేదు? " అని ప్రశ్నించారు.


అప్పుడు రమణ మహాశయులు కృష్ణాతో 

"ఆలా జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే. రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచింది కదా!" అని అన్నారు.


కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే.

🙏🙏🙏🙏

జీవిత సత్యం 🌹

 🌹🌹జీవిత సత్యం 🌹🌹

----------------------------------------

సమయం గడిచి పోయింది.

ఎలా గడిచిందో తెలియదు.

జీవితమనే పెనుగులాటలో

వయసు గడిచి పోయింది

తెలియకుండానే.


భుజాలపైకి ఎక్కిన పిల్లలు

భుజాలదాకా వచ్చేశారు

తెలియనే లేదు.


అద్దె ఇంటినుంచి చిన్నగా

మొదలైన జీవితం ఎప్పుడు

మన ఇంట్లోకి వచ్చామో

తెలియలేదు.


ఆయాసంతో సైకిల్ పెడల్

కొడుతూ కొడుతూ కారులో

తిరిగే స్థాయికి ఎప్పుడొచ్చామో

తెలియలేదు.


ఒకప్పుడు తల్లి తండ్రుల

బాధ్యత మాది కానీ ఇప్పుడు

నాపిల్లలు నేను బాధ్యతగా మారాను. ఇదికూడా ఎలాజరిగిందో తలియలేదు.


ఒకప్పుడు పగలుకూడా హాయిగా నిద్ర పోయేవారం

కానీ, ఇప్పుడు నిద్రరాని రాత్రులు ఎన్నో, ఇదికూడా

ఎలాజరిగిందో తెలియలేదు.


ఒకప్పుడు నల్లని కురులని

చూసుకొని గర్వంగా వగలు

పోయేవాళ్ళం, అవన్నీ ఎప్పుడు తెల్లగా మారాయో

తెలియలేదు.


ఉద్యోగం కోసం తిరిగి తిరిగి

ఎప్పుడు రిటైర్ అయ్యామో

తెలియనే లేదు.


పిల్లల కోసం ప్రతీది అని

ఎంత తాపత్రయ పడ్డామో!

వాళ్ళు ఎప్పుడు దూరంగా

వెలియిపోయారో తెలియనేలేదు.


రొమ్ము విరుచుకొని అన్న దమ్ముల, అక్కా చెల్లెండ్ల మధ్య

గర్వంగా నడిచే వాణ్ణి.

ఎప్పుడు అందరు దూరంగాయ్యారో

తెలియనే లేదు.


ఇప్పుడే ఆలోచిస్తున్నాను.

నాకోసం, నాశరీరం కోసం

ఏమైనా చేసుకోవాలని కానీ,

శరీరం సహకరించడం లేదు.


ఇవన్నీ జరిగిపోయాయి.

కానీ,

కాలం ఎలా గడిచిందో

తెలియనే లేదు.


నిజంగా ఇది జీవిత సత్యం!

            

              మీకోసం

                   మీ

              "విష్ణు "

So true

 So true.

40 Years Ago ::

40 years ago, children were gentle with their parents. Today parents have to be gentle with their children.

40 years ago, everyone wanted to have children. Today many people are afraid of having children.

40 years ago, children respected their parents. 

Now parents have to respect their children.

40 years ago, marriage was easy but divorce was difficult. 

Nowadays it is difficult to get married but divorce is so easy.

40 years ago, we got to know all the neighbours. 

Now we are strangers to our neighbors.

40 years ago, people had to eat a lot because they needed the energy to work hard. 

Now we are afraid to eat fatty foods for fear of the cholesterol.

40 years ago, villagers were flocking to the city to find jobs. 

Now the town people are fleeing from the stress to find peace.

40 years ago, everyone wanted to be fat to look happy ... 

Nowadays everyone diets to look healthy.

40 years ago, rich people pretended to be poor.

Now the poor are pretending to be rich.

40 years ago, only one person worked to support the whole family. 

Now all have to work to support one child.

40 years ago, people loved to study and read books ... 

now people love to update Facebook etc and read their whatsapp messages.

I received this realistic message from one friend and on realizing that it's hard fact for today's life, 

Forwarded to all my friends

_*WELCOME TO THE 21ST CENTURY!*_

*Phone.....Wireless*

*Cooking..Fireless*

*Cars........Keyless*

*Food........Fatless*

*Tyres.......Tubeless*

*Tools.......Cordless*

*Dress......Sleeveless*

*Youth......Jobless*

*Leaders...Shameless* 

*Attitude...Careless*

*Spouse....Fearless*

*Feeling....Heartless*

*Education Valueless*

*Kids........Mannerless*

*Government Useless*

*Parliament Clueless*

*MASSES.. HELPLESS*

_*Everything is becoming LESS but still our hope in God is - Endless.*_

In fact I am *Speechless* Because friendship remains *Priceless!!*

*If u don't share this, the message is worthless!*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆరుబయట దీక్ష..*


కొన్నాళ్ల క్రితం నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చింది..చిత్రమైన సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళు..భార్యా భర్తా ఇద్దరు కుమారులు..ఆ ఇద్దరు కుమారులు కూడా పదిహేను సంవత్సరాల వయసు పై బడిన వారే..కుటుంబం లో ఉన్న ఇద్దరు పిల్లలకూ మానసిక స్థితి సరిగాలేదు..ఒక గంట ప్రవర్తించినట్లు..మరో గంటలో ప్రవర్తించరు.. ఒక రోజులోనే వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది..ఉన్నట్టుండి బాధ పడుతున్నట్లు మెలికలు తిరిగి పోతారు..మరి కొద్దిసేపటికే మామూలుగా వుంటారు..వీళ్ల ఇద్దరినీ తీసుకొని ఆ తల్లి తండ్రి శ్రీ స్వామివారి మందిరానికి చేరారు..


శ్రీ స్వామివారి మందిరానికి ఉత్తరంగా ఉన్న రావిచెట్టు క్రింద ఉన్న అరుగు మీదే ఉండేవాళ్ళు..రోజూ ఉదయం సాయంత్రం శ్రీ స్వామివారి మందిరం లో ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు..వీళ్ళను నేను గమనిస్తూనే వున్నాను..ఎండగా వున్నా..వర్షం కురుస్తున్నా కూడా ఆ కుటుంబం ఆ అరుగు మీదే వుంటున్నారు తప్ప..తలదాచుకోవడానికి రూము ల్లోకి రావడం లేదు..కొద్దిగా ఆశ్చర్యం గా ఉండేది నాకు..ఆరుబయట..ఏ ఆచ్ఛాదనా లేకుండా..కేవలం రావి చెట్టు నీడలో.. వీళ్ళు ఎలా వుండగలుగుతున్నారా? అని..


ఒకరోజు కుతూహలం ఆపుకోలేక..వీళ్ళ వివరాల కోసం మా సిబ్బందిని అడిగాను..ఈ కుటుంబం..పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామం..ఇళ్లు కట్టే మెస్త్రీ పని చేస్తుంటాడు అతను.తనకొచ్చిన ఆదాయం లోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు..ఇద్దరు మొగపిల్లలు..పెద్ద పిల్లవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు..రెండవవాడు పదవతరగతి చదువుతున్నారు.. ఉన్నంతలో బాగానే జరిగిపోతున్న సంసారం లో చిన్న కుమారుడి మానసిక స్థితి లో మార్పు వచ్చింది..పిచ్చి పిచ్చిగా ప్రవర్తించసాగాడు..మరో వారం కల్లా పెద్దకుమారుడూ అలానే మారిపోయాడు..ఇవన్నీ గ్రహ బాధలనీ..ఇవి తొలగిపోవాలంటే మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వెళ్లి కొన్నాళ్ల పాటు శ్రీ స్వామివారి ని కొలుస్తూ వుండమని కొందరు చెప్పారు..ఆ మాట ఈ దంపతుల మనసులో నాటుకుపోయింది..ఒక క్షణం కూడా ఆలస్యం లేకుండా..పిల్లలను తీసుకొని మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి చేరారు..


ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం..శ్రీ స్వామివారి సమాధి మందిరానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయసాగారు..పది రోజులు గడిచిపోయాయి..పిల్లల ప్రవర్తన లో మార్పు వస్తున్నది.. ముందుగా చిన్న పిల్లవాడు మామూలుగా మారాడు..మరో పదిరోజుల కల్లా పెద్దవాడిి ప్రవర్తన కూడా మారిపోయింది..ఆ తల్లీ తండ్రీ సంతోషానికి అవధులు లేవు..వాళ్ళు శ్రీ స్వామివారి వద్ద నలభై రోజులు ఉంటామని మ్రొక్కుకున్నారు..కానీ ఇరవై రోజుల్లోనే పిల్లలకు స్వస్థత ఏర్పడింది..అంతమాత్రం చేత వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్లిపోలేదు..శ్రీ స్వామివారి మందిరం వద్దే..ఆ చెట్టుకిందే వున్నారు..మందిరం లో చిన్న చిన్న పనులు చేయసాగారు..ఆ భార్యా భర్తా ఇద్దరూ మందిరం వద్ద పనులకు రాసాగారు..క్రమంగా మందిరం వద్దే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడపసాగారు..నలభై రోజుల పాటు శ్రీ స్వామివారిని కొలుద్దామనుకున్న ఆ కుటుంబం మూడు నెలల పాటు ఉండిపోయింది..పిల్లలిద్దరూ వాళ్ళ ఊరు వెళ్లి తమ తమ పరీక్షలు వ్రాసి వచ్చారు..మంచి మార్కులతోనే పాసయ్యారు..నలభై రోజుల తర్వాత కూడా ఆ కుటుంబం ఆ చెట్టు క్రింద ఉన్న అరుగు వద్ద నుంచి రూము లోకి రాలేదు..అక్కడే వున్నారు..


పిల్లలిద్దరూ పనికిరాకుండా పోతారేమోనని దిగులుపడ్డ ఆ దంపతులకు వాళ్ళు మళ్లీ మామూలు మనుషులవడానికి శ్రీ స్వామివారి ఆశీస్సులే కారణమని ప్రగాఢంగా నమ్మారు..మూడు నెలల తరువాత..వాళ్ళ ఊరికి వెళ్లేముందు..వాళ్ళను అడిగాను.."ఇన్నాళ్లూ ఆ చెట్టు క్రింద ఎలా వుండగలిగారూ?.." అని..


"అయ్యా..మేము అనుకున్నది కాదు..మొదటిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు..ఆరోజు రాత్రి నాకు స్వప్నం లో ఒక యోగి కనబడి..మమ్మల్ని ఇక్కడే వుండమని ఆదేశించాడు..అది శ్రీ స్వామివారి ఆదేశం అనుకొని..మేము అక్కడే ఉండిపోయాము..ఎండయినా.. వాన అయినా..అక్కడే వున్నాము..మేము అనుకున్న నలభై రోజుల దీక్ష లో ఇది కూడా ఒక భాగం అనుకున్నాము..చిత్రంగా మాకు ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు..ఆ స్వామి మమ్మల్ని కాపాడాడు.." అని చెప్పాడు..


శ్రీ స్వామివారి వద్ద నిరంతరమూ ఉన్నామనీ..అన్ని పనులూ సక్రమంగా చేస్తున్నామనీ..ఒక్కొక్కసారి కొద్దిగా గర్వంగా అనుకుంటాము..ఇటువంటి వారికున్న భక్తిలో ఎంత శాతం మనలో ఉందీ అని మాత్రం అనుకోము.. అందుకే అటువంటి వారిని అన్నివేళలా దైవం అడుగడుగునా కాపాడతాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).