12, ఫిబ్రవరి 2025, బుధవారం

ఉచిత శిక్షణ

 Training of Technician Course (Free): Hurry Up! AC, TV, Washing Machine, Water Purifier, Dish Washer Etc.,

ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలు

హైదరాబాద్ ఏ ఎస్ రావు నగర్, రాధిక థియేటర్ దగ్గర చిన్న పరిశ్రమల మంత్రిత్వ శాఖ(NSIC)  ప్రాంగణంలో, LG మరియు ESSCI వారి ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్స్, డిష్ వాషర్స్, టెలివిజన్, వాటర్ ప్యూరిఫైయర్, మైక్రోవేవ్ ఓవెన్ కోర్సులలో సాంకేతిక శిక్షణ ఇస్తున్నారు. 

ఒక నెల/మూడు నెలల శిక్షణ తర్వాత, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ (NCEVT), మరియు ప్రతి ఒక్కరికీ ఉద్యోగం పొందడానికి సంస్థ సహాయం చేస్తుంది. చాలా అత్యాధునికమైన పరికరాలు, ట్రైనర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిగా ఉచితం. శిక్షణ కాలంలో రెండు టీ-షర్టులు, ప్రాథమిక టూల్ కిట్, స్టడీ మెటీరియల్ మరియు మధ్యాహ్నం భోజనం కూడా ఉచితంగా అందించబడుతుంది. వ్యక్తిత్వ అభివృద్ధి మరియు యోగా శిక్షణ కూడా ఇస్తోంది.

అర్హత: 10వ తరగతి పాస్ అయి ఉండాలి. చిన్న ప్రవేశ పరీక్ ఉంటుంది.

వయోపరిమితి 18 to 25. ఎస్టీ, ఎస్సీలకు మరో ఏడాది వయో సడలింపు.

డిసెంబర్ 30 మరియు జనవరి 2వ వారంలో బాచ్ ప్రారంభం అవుతుంది. గ్రామవాసి, వనవాసీ పిల్లలు చేరితే వారికి ఉద్యోగం తప్పని సరిగా ఏర్పాటు చేస్తారు. యువకులకు ఈ విషయాన్ని చేరవేసి వారిని రప్పించ గలిగితే చాలా ఉపయోగం. 

https://www.youtube.com/watch?v=6VBWd4ziKUA 

https://maps.app.goo.gl/BuiN4jbHyHCTSyWV8 

సంప్రదించండి :

Sri Maruthi Prasad,

LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ

+91 63037 82424.

ఔషధాలు లేని జీవితం`*

 *`ఔషధాలు లేని జీవితం`*


*1.త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.*


*2. ఓం జపించడం ఔషధం.*


*3.యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.*


*4. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.*


*5.ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.*


*6. సూర్యకాంతి కూడా ఒక ఔషధం.*


*7.కుండ నీరు తాగడం కూడా ఔషధమే.*


*8.చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.*


*9.ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.*


*10. ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.*


*11.ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.*


*12.సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.*


*13.కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.*


*14.నవ్వు మరియు జోకులు ఔషధం.*


*15. సంతృప్తి కూడా ఔషధం.*


*16.మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.*


*17.నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.*


*18. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.*


*19.అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.*


*20.ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.*


*21.అందరితో కలిసి జీవించడం ఔషధం.*


*22.తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.*


*23.మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.*


*24.సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.*


*25.ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.*


*26.చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.*


*ప్రకృతి యొక్క "గొప్పతనం"ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.*


*`ఈ ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.`*

ఛాతీ నొప్పి*

 *ఛాతీ నొప్పి* ఇటీవల, ఒక వ్యక్తి ఛాతీ నొప్పి కారణంగా చెన్నైలోని ఒక ప్రసిద్ధ ఆసుపత్రిలో చేరాడు. అతను 2016 లో గుండెపోటుకు చికిత్స పొందుతున్నాడు. వైద్యులు

యాంజియోగ్రఫిని సిఫార్సు చేశారు.


ఈ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో యాంజియోగ్రఫి తర్వాత, వైద్యులు యాంజియోప్లాస్టీకి ముందు రక్తనాళంలో బహుళ అడ్డంకులు ఉన్నట్లు కనుగొన్నారు మరియు యాంజియోప్లాస్టీకి బదులుగా, వైద్యులు బైపాస్ సర్జరీని సూచించారు.


అతని గుండె చాలా బలహీనంగా ఉందని వైద్యులు సలహా ఇచ్చారు మరియు ఆ సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు, 10 - 15 రోజుల తర్వాత, బైపాస్ అధిక ప్రమాదంతో మాత్రమే చేయవచ్చని హెచ్చరించారు.


ఇంతలో, బంధువులు మరియు సన్నిహితులతో ఈ విషయాన్ని చర్చించిన తర్వాత, కుటుంబ స్నేహితుడి నుండి కొత్త సమాచారం వచ్చింది. *EECP థెరపీ* అనే కొత్త చికిత్సను ఇండియన్ మెడికల్ (AIIMS) వైద్యుడు ప్రవేశపెట్టారు.


ఇప్పుడు దీనిని *US FDA & T.N GOVT ఆమోదించింది*


ఇక్కడ,


బైపాస్ సర్జరీ లేకుండా మరియు స్టెంట్లు లేకుండా గుండె అడ్డంకులను నయం చేయవచ్చు, కానీ ఈ అధునాతన *EECP మెషిన్* యంత్రం సహాయంతో.


ఈ చికిత్సతో, బైపాస్ అవసరమయ్యే రోగి అలా చేయవలసిన అవసరం లేదు.

(దీనిని సహజ బైపాస్ అంటారు)

బదులుగా, రోగికి దాదాపు 20 బాటిళ్ల IV ద్రవాలు ఇవ్వబడతాయి, దానికి కొంత ఔషధం ఇంజెక్ట్ చేయబడుతుంది.


ఈ ఔషధం గుండెలోని రక్త నాళాలలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. రోగి వయస్సు మరియు ఆరోగ్యాన్ని బట్టి, ఎన్ని బాటిళ్లు ఇవ్వవచ్చు.


ఒక బాటిల్ ధర రూ.2,000/- వరకు ఉంటుంది.


ప్రస్తుతం, భారతదేశంలో కొద్దిమంది వైద్యులు మాత్రమే ఈ రంగంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. వారిలో ఒకరు కోయంబత్తూరులోని DR.S.PRABU.


ప్రధాన ఆసుపత్రులలో ఈ సహజ బై-పాస్ (EECP థెరపీ) చేయించుకున్న రోగుల జాబితా అతని వద్ద ఉంది. ఈ కొత్త చికిత్స తర్వాత, గుండె రోగులు పూర్తిగా బాగున్నారు మరియు కనీస మందులు కూడా లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.


ఈ చికిత్స కోయంబత్తూరులో ఉంది

*PGS హాస్పిటల్*. పూర్తయింది

మరిన్ని సమాచారం కోసం


DR. S. Prabhu MD PGDHsc(ECHO)PPHC(UA)

(జనరల్ ఫిజిషియన్ & ప్రివెంటివ్ కార్డియాలజీ)

ఇన్వాసివ్ & నాన్-సర్జికల్ కార్డియాక్ కేర్ అనుభవం & మెరుగైన జీవన నాణ్యత.


0422 4971331

మొబైల్ : +91 91597 00800

+91 94430 61115

www.pgshospital.com

దయచేసి ఈ సందేశాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయండి ఎందుకంటే ఇది చాలా మందికి సహాయపడవచ్చు.


దయచేసి, దీన్ని షేర్ చేయకుండా తొలగించవద్దు.


నేను వీలైనంత త్వరగా దీన్ని పంపుతాను.


ఇది 130 కోట్ల మంది భారతీయులను మరియు మిగిలిన వారిని మేల్కొల్పాలి!


*ఇది ఎవరికైనా సహాయపడవచ్చు.* దయచేసి దీన్ని మీకు వీలైనంత వరకు షేర్ చేయండి

🙏🏻🙏🙏

13-23-గీతా మకరందము

 13-23-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఉపద్రష్టానుమన్తా  చ 

భర్తా భోక్తా మహేశ్వరః | 

పరమాత్మేతి చాప్యుక్తో 

దేహేఽస్మిన్ పురుషః పరః || 


తాత్పర్యము:- పురుషుడు (ఆత్మ) ఈ శరీరమందున్నప్పటికిని శరీరముకంటె వేఱైనవాడును, సాక్షి భూతుడును, అనుమతించువాడును, భరించువాడును, అనుభవించువాడును, పరమేశ్వరుడును (గొప్పప్రభువు, నియామకుడును), పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- 'ఉపద్రష్టా’ యజ్ఞమునందు 'ఉపద్రష్ట’ అనువాడు సాక్షిమాత్రుడుగ నుండును. అట్లే ఆత్మ శరీరమందున్నను 'పరః’ - శరీరముకంటె వేఱుగ, పరముగనున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగ వెలయుచున్నాడు. కావున జీవుడు తాను వాస్తవముగ అట్టి పరమాత్మస్వరూపుడే యనియు దేహేంద్రియాదులుకాదనియు లెస్సగ భావనచేయవలెను.

‘మహేశ్వరః, పరమాత్మా దేహేఽస్మిన్’ - అని చెప్పబడినందువలన జగన్నాథుడైన పరమేశ్వరుడు, పరమాత్మ ఈ దేహమందే వర్తించుచున్నాడని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ భగవానుడు జీవునకు అతిసమీపమున నుండుటవలన ప్రయత్నముచే సులభముగ పొందగలడు. వారికై దూరదూరములందు ప్రయాసపడి వెతుకనక్కఱ లేదు. మఱియు శిక్షించువాడు, శాసించువాడు, (ఈశ్వరుడు) చెంతనేయుండుట వలన పాపులివ్విషయమును గమనించి పాపకృత్యము లెవ్వియు చేయకనుండవలెను.


'పరః' - అని చెప్పుటవలన ఆత్మ దేహముతో, ఉపాధితో, సంబంధములేక దానికి పరముగా వేఱుగ, అతీతముగ నున్నదని తెలియుచున్నది.

 ‘పరః పురుషః’ - అను పదములకు పరమపురుషుడు, పరమాత్మ అనియు అర్థము చెప్పవచ్చును.


ప్రశ్న:- పరమాత్మ యెట్టివాడు?

ఉత్తరము:- (1) శరీరమందున్నను, శరీరముకంటె వేఱుగనున్నవాడును, (2) సాక్షిభూతుడును, (3)అనుమతించువాడును, (4) భరించువాడును, (5) అనుభవించువాడును, (6) గొప్పనియామకుడును, (పరమేశ్వరుడును) అయియున్నాడు.

తిరుమల సర్వస్వం-146*

 తిరుమల సర్వస్వం-146* 

   

           *తొండమాన్ చక్రవర్తి -1*


 *తొండమాన్ చక్రవర్తి* 


 మనం వివిధ ప్రకరణాలలో ఇంతవరకూ ఆకాశరాజు తమ్ముడైన తొండమానుడు పద్మావతీపరిణయం లో ముఖ్య భూమిక వహించటం; శ్రీనివాసుని ఆనతిపై ఆనందనిలయం నిర్మాణం కావించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు శాశ్వతంగా తిరుమల క్షేత్రం మీద కొలువై ఉండటానికి కారణభూతుడు అవ్వటం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అయితే, ఈ భక్తశిఖామణికి ఎంతో విశిష్టమైన వృత్తాంతం ఉంది.


 *శ్రీతీర్థం – భూతీర్థం* 


 కృతయుగంలో ముల్లోక పర్యటనలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతుడై భూలోకానికేతెంచిన శ్రీమహావిష్ణువు, ఆనాడు క్రీడాద్రిగా పిలువబడే, నేటి వెంకటాద్రి పర్వతం పైనున్న ప్రకృతి సోయగానికి ముగ్ధుడై కొంతకాలం అక్కడే విహరిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువుకు కావలసిన భోజనాదుల నిమిత్తం, ఆ పర్వతశిఖరంపై దేవేరులిద్దరూ చెరొక తీర్థాన్ని (బావులను) ఏర్పాటు చేశారు. శ్రీదేవి ఏర్పరచిన తీర్థం *'శ్రీతీర్థం"* గానూ, అలాగే భూదేవి ద్వారా ఏర్పాటు చేయబడ్డ తీర్థం *"భూతీర్థం"* గానూ ప్రసిద్ధికెక్కాయి. కాలాంతరాన, కలియుగారంభం నాటికి ఈ రెండు తీర్థాలు శిథిలమై పోయాయి. తన ప్రియసఖుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ తీర్థాలను ఎంతగానో ఇష్టపడే విష్ణుమూర్తి, వాటిని ఎలాగైనా పునరుద్ధరింప చేయాలని సంకల్పించి తగిన సమయం కోసం వేచి చూస్తున్నాడు.


 *సద్భాహ్మణుడు - శూద్ర భక్తుడు* 


 ఇదిలా ఉండగా, కలియుగారంభం నందు చోళరాజ్యంలోని హరిద్రానదీ తీరాన ఉన్న కృష్ణ క్షేత్రమనే గ్రామంలో, శ్రీకృష్ణునికి పరమభక్తుడైన వైఖానసుడనే సద్ర్బహ్మణుడు భగవత్సాక్షాత్కారం కోసం కఠోరమైన తపమాచరించాడు. అతని నిష్ఠాగరిష్టతకు ప్రీతి చెందిన శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోవలసిందిగా ఆదేశించాడు. అందుకు వైఖానసుడు భౌతిక సంపదలను కోరుకోకుండా; తనకు మోక్షాన్ని ప్రసాదించమని, ఎల్లవేళల శ్రీకృష్ణుని రూపంలో తన పూజలు స్వీకరించమని కోరుకున్నాడు. 


‌ అతని నిస్వార్థభక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, తాను వెంకటాద్రి పర్వతంపై శ్రీనివాసునిగా స్వయంవ్యక్తమై ఉన్నానని; అతను కోరుకున్నట్లే నిత్యము ఆ శ్రీనివాసుణ్ణి సేవించి తరించవచ్చునని వరమిచ్చాడు. అంతే గాకుండా ఇకనుండి వైఖానసుడే *"గోపీనాథుని"* గా ప్రసిద్ధి కెక్కుతాడని; అతనికి *"రంగదాసు"* అనే శూద్రభక్తునితో పరిచయం ఏర్పడుతుందని; కృతయుగంలో వేంకటాద్రిపై *"శంఖరాజు"* అనే భక్తునిచే నిర్మించబడిన విమానగోపురం కలిగిన తన ఆలయం శిథిలమవ్వగా, అందున్న విగ్రహం సమీపంలోనే ఉన్న ఒక చింతచెట్టు క్రింద ఉన్నట్టి పుట్టలో పడిఉన్నదని; వారిరువురూ (వైఖానసుడు, రంగదాసు) కలసి ఆ విగ్రహాన్ని పుట్టలో నుండి బయటకు తెచ్చి, ఒక వైభవోపేతమైన దేవాలయాన్ని నిర్మించి, అందులో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, నిత్యము పూజాదికాలు జరుపవలసిందని కూడా శెలవిచ్చాడు. 


‌ తదనంతరం, భగవదాజ్ఞ మేరకు వెంకటాద్రి పర్వతానికి బయలుదేరిన గోపీనాథునికి మార్గమధ్యంలో రంగదాసు కలువగా; ఇరువురూ కలసి సువర్ణముఖీ నదిలో స్నానమాచరించి, సమీపంలోనే ఉన్న శుకపురి (నేటి తిరుచానూరు) అనే పుణ్యక్షేత్రం లోని శ్రీకృష్ణ బలరాముల ఆలయాన్ని దర్శించుకుని, వేంకటాచలానికి తరలి వెళ్ళారు.


 *శ్రీనివాసుని సేవలో భక్తద్వయం* 


‌ శ్రీవారి ఆనతి మేరకు వెంకట పర్వతాన్ని చేరుకున్న భక్తులిరువురు స్వామి పుష్కరిణియందు స్నానమాచరించి; పుష్కరిణికి దక్షిణాన ఉన్న చింతచెట్టు క్రింది పుట్టను త్రవ్వి, అందులో నిక్షిప్తమైయున్న, దివ్య తేజస్సు ఉట్టిపడే, సాలగ్రామశిలా నిర్మితమైన స్వామివారి మూర్తిని వెలికి తీసి; ఎంతో కాలంగా పుట్టకు నీడనిచ్చిన చింతచెట్టును, శ్రీమహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన చంపక వృక్షాన్ని మాత్రమే ఉంచి; ఇతర వృక్షాలను, తుప్పలను, బండరాళ్లను తొలగించి; ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. విగ్రహం చుట్టూ అందుబాటులో ఉన్న బండశిలలతో కుడ్యాలను నిర్మించి, రెల్లుగడ్డితో పైకప్పు నేర్పరచి శ్రీవారికి తాత్కాలిక వసతి కల్పించారు.


 ప్రతిరోజూ శ్రీనివాసునికి గోపీనాథుడు పూజాదికాలు సమర్పించుకునేవాడు. పూజకు కావలసిన పుష్పాలను సమయానికి సమకూర్చే బాధ్యతను వహించిన రంగదాసు, పూదోటను పెంచటం కోసం ఆ సమీపంలోనే రెండు బావులను కూడా నిర్మించాడు. భగవత్సంకల్పంతో ఆ బావులు నిర్మించబడ్డ ప్రదేశంలోనే శ్రీదేవి భూదేవిలచే ఎప్పుడో నిర్మించబడి శిథిలమై పోయిన శ్రీతీర్థం, భూతీర్థం బహిర్గత మయ్యాయి. శ్రీతీర్థం నందలి పవిత్ర జలాలను గోపీనాథుడు శ్రీవారి వంటలకు, అభిషేకార్చనాదుల నిమిత్తం ఉపయోగించేవాడు. అదే నేడు విమానప్రదక్షిణ ప్రాకారంలో ఉన్న *"బంగారుబావి".*


[ రేపటి భాగంలో... *రంగదాసు మరుజన్మ* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*


*285 వ రోజు*


*సంశక్తులతో అర్జునుడి యుద్ధం*


అర్జునుడు ఆకలిగొన్న సింహమువలె సంశక్తులను ఎదుర్కొన్నాడు. వారు అర్ధచంద్రాకారంలో మొహరించి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు దేవదత్తఘోష విన్న సంశక్తుల హృదయాలు దద్ధరిల్లాయి అంతలోనే తేరుకుని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడిని చుట్టిముట్టి వాడి అయిన శరములు అర్జునిపై ప్రయోగించారు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి తన వాడి అయిన బాణములతో పది వేలమంది రధికులను చంపాడు. తన మీద పది శరములను ప్రయోగించిన వారిని కేవలం అయిదుబాణాలతో యమసదనానికి పంపాడు. సుశర్మ, సుభాహుడు, సుధన్వుడు, సురధుడు అర్జునితో పోరాడుతున్నారు. అర్జునుడు వారి కేతనములు విరుగకొట్టాడు. సుధన్వుని హయములను చంపి , విల్లువిరిచి, ఒకేఒక బాణంతో అతడి తల నరికి విజయ సూచకంగా శంఖారావం చేసాడు. అర్జునుడు సంశక్తుల సైన్యంపై పడి వారి రధములను విరుగకొట్టాడు. అర్జునిని ధాటికి సంశక్తుల సేన చెల్లాచెదురు అయ్యాయి. అది చూసి సుశర్మ కలవర పడి " భయపడకండి వెనక్కు రండి అర్జునిని పరాక్రమం మనకు తెలియనిదా ! చేసిన ప్రతిజ్ఞ మరిచారా ! సుయోధనుని ముందు తల ఎత్తుకుని ఎలా తిరుగగలము " అని బిగ్గరగా అరిచాడు. అతడి మాటాలకు సైన్యం వెనుతిరిగి వచ్చి అర్జునుడితో తలపడింది. అర్జునుడు " కృష్ణా ! త్రిగర్తులు ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతుంటారు. రథమును వెనుకకు మరల్చి వీరిని యమసదనముకు పంపినగాని మన పని పూర్తి కాదు " అన్నాడు.


*నారాయణాభిదాసుల సమరం*


కృష్ణుడు రధమును వెనుకకు మరల్చాడు ఆ సమయంలో నారాయణాభిదాసులు పదివేల మంది వారిని ఎదుర్కొన్నారు. వారందరికి కృష్ణార్జునుల మీద కోపంగా ఉంది. యుద్ధానికి ముందు ద్వారకకు వచ్చి అర్జునుడు, సుయోధనుడు సహాయం కోరిన సమయంలో అర్జునుడు తమను కృష్ణుని నుండి వేరు చేసి సుయోధనుడి పరం చేసినందుకు వారికి కృషార్జునుల ఇరువురి పైన కసిగాను కోపంగాను ఉంది. వారు కృష్ణార్జునులపై శరవర్షం కురిపించాడు. వారిని చంపనిచ్చగించని అర్జునుడు తనకు త్వష్ట ప్రజాపతి ప్రసాదించిన దివ్యాస్త్రమును వారిపై ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావంతో నారాయణాభిదాసులలో ప్రతి వారికి తన ఎదుటి వాడు అర్జుడిలా కనిపించసాగాడు. ఆ అస్త్ర ప్రభావంతో ఒకరిని ఒకరు నరుక్కుని అనేక మంది చని పోయారు. ఇంతలో అస్త్ర ప్రభావం తగ్గి పోయింది. మిగిలిన నారాయణాభిదాసులు మగధ, కేరళ మొదలగు రాజులతో కలిసి మహోగ్రంగా కృష్ణాంజ్ఞులను చుట్టుముట్టి అర్జునుడిపై శక్తి వంతములైన అస్త్రశస్త్రములు వేసారు. అర్జునుడు వారి అస్త్రములను త్రుంచి వారి శిరములను తన వాడి బాణములతో ఖండించాడు. వారి సైన్యములోని హయములు, ఏనుగులు, కాల్బలము అర్జునుడి బాణములకు ఆహుతి అయ్యాయి.


*అర్జునుని సంశక్తులు తిరుగి ఎదుర్కొనుట*


ఇంతలో సంశక్తులు తమ సైన్యాలను సమీకరించి అర్జునుడిని ఎదుర్కొని అర్జునుడి మీద శరవృష్టి కురిపించారు. వారిలో కొంత మంది రధములు దిగి అర్జునుడి రధము మీద హయముల మీద దాడి చేసారు. అన్ని దిక్కుల నుండి శరప్రయోగం చేయడంతో పాండవ సేనకు అర్జునుడి రథం కనిపించ లేదు. కృష్ణార్జునులు సంశక్తుల చేతిలో మరణించారు అనుకుని ఆందోళన పడ్డారు. వారి ఆందోళన గమనించి సంశక్తులు సింహనాదాలు చేసి శంఖారావములు చేసారు. నొగల మీద కూర్చున్న కృష్ణునికి అర్జునుడు కనిపించక కలవర పడి " అర్జునా! అర్జునా ! " అని ఎలుగెత్తి అరిచాడు. పరిస్థితి అర్ధం చేసుకున్న అర్జునుడు వాయవ్యాస్త్రం ప్రయోగించి సంశక్తుల సైన్యాలను చెదుమదురు చేసాడు. కృష్ణార్జునులు కనిపించగానే పాండవ సైన్యం ఊపిరి తీసుకుని హర్షధ్వానాలు చేసారు. సంశక్తులు తిరిగి సైన్యములను కూడగట్టుకుని ఒక్కుమ్మడుగా అర్జుడి మీద దాడి చేసారు. అర్జునుడు వారు వేసిన శరములు మధ్యలో త్రుంచి వారిపై అతి క్రూర నారాచములు వేసి వారి సైనికుల శిరస్సులను త్రెంచాడు. ఏనుగులు, హయములు, రథములు తునాతునకలు ఔతున్నాయి. మొండెములు ఇతర అవయవములు ఎగిసి పడుతున్నాయి. అయినా బెదరక సంశక్తులు అర్జునుడిపై శరపరంప కురిపించారు. తీవ్రంగా పోరు సాగుతుంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

*124వ బ్రహ్మోత్సవాల

 *124వ బ్రహ్మోత్సవాల "అన్న సమారాధన"*


గుంటూరు నగరంలోని అరండల్ పేట 4/4 శివాలయంలో (శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠ పాలిత) శ్రీ గంగా మీనాక్షి సోమ సుందరేశ్వర ఆలయం 124వ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈ భక్తులకు దాతల సహకారంతో *అన్న సమారాధన కార్యక్రమం 11 - 2 - 2025 మంగళవారం మ.12 గం.ల నుండి ఏర్పాటు చేయడం జరిగింది.* కావున భక్తులు ఈ అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.🙏🙏


*ఆలయ ఉత్సవ కమిటి*


*చాణక్య ఫ్రెండ్స్ సర్కిల్*


*శివ భక్త బృందం*


*అయ్యప్ప సేవా సమాఖ్య*

పోతన భాగవతం 🙏 నాలుగవ భాగం

 🙏పోతన భాగవతం 🙏

               నాలుగవ భాగం 

భాగవతం మరొక విశిష్టత ఏమిటంటే 

పోతన గారు  భాగవతంలో భక్తి జ్ఞాన వైరాగ్యములను చక్కగా బోధించారు. .జీవితం గురించి బంధాలు గురించి ఆయన చెప్పిన విషయాలు వింటే జీవితం బుద్బుదప్రాయం అనే విషయం అవగతం అవుతుంది. అంతేగాక మనకు మోక్ష మార్గం కూడా భాగవతంలో నిర్దేశం చేశారు.


భాగవతమును శ్రీశుకుడు ఉపదేశం చేసేప్పుడు పరిక్షిత్తుమహారాజు ఒక్కరే లేరు. ఆయన చుట్టూ ఎన్నో వేల మంది ఉన్నారు. రాజు రాజ్యం వదిలి పెట్టి ఉంటే వారంతా ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఋషులు కూడా అక్కడ చేరి ఉన్నారు. గంగను మించిన జన ప్రవాహం ఉంది అక్కడ. అందరూ భాగవతమును విన్నారు, మరి అందరూ తరించారా? ఊహు ... తరించింది ఒక్క పరిక్షిత్తుమహారాజు మాత్రమే. ఎందుకంటే అది విన్న వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. అందులో కొందరు రాజుగారికి సప్తదినాల్లో మరణమని తెలిసి, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి విన్నవారు, మరికొందరు ఏదో కాలక్షేపం కోసం అన్నట్లు విన్నవారూ ఉన్నారు. కానీ పరిక్షిత్తుమహారాజుకే మోక్షఫలం దక్కింది. అదేమి పక్షపాతం కాదు. విన్నవారి యోగ్యతబట్టే ఫలితం. తెలుసుకోవాలని తపన మూర్తీభవించి విన్నవాడు తరించాడు. శ్రవణం చేస్తుంటే తిండి నీరు నిద్ర అసలేం వద్దు అన్నాడు. దాహం, ఆకలి, అలసట అనేది అనిపించటం లేదు అని అన్నాడు. ఆయనకున్న శ్రద్ధ, తపన అలాంటిది. అందుకే ఆయనకి మోక్షం వెంటనే లభించింది

చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;-

  కాంతలు సంసార కారణములు;

ధనము లస్థిరములు; దను వతి చంచల-

  గార్యార్థు లన్యులు; గడచుఁగాల

మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర-

  మని కాదె తమ తండ్రి నతకరించి

మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు-

  నీ పాదకమలంబు నియతిఁ జేరె

భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె

వైరులై కాని తొల్లి మా వారుఁ గాన

రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల

బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?"

భావము:

పురాణపురుషా! “చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుస్సు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది” అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు అర్థివై వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ

హిరణ్యకశిపుడు సాక్షరుడైన రాక్షసుడు. విద్య ఉన్నా వివేకం లేనివాడు. వేదాంతం తెలిసినా భేదాంతం కాని వాడు- భేద బుద్ధి నశించనివాడు. ఎంతైనా ద్వైతబుద్ధి- భేదబుద్ధి అనే ‘దితి’ పుత్రుడేకదా! కనుక మాటల్లోనే వేదాంతం. అంటే, వాడిది మెట్టవేదాంతమే కాని తుది ముట్టే పట్టుకలిగిన గట్టి వేదాంతం కాదు. అది కేవలం ‘వాచా జ్ఞానం’. అనుభవం లేని పరోక్ష జ్ఞానం. ఇట్టి వాచా (నోటిమాటల) జ్ఞానాన్ని శాస్త్రం అజ్ఞానమనే అన్నది. వివేక, వైరాగ్యాలు లేని వాచా జ్ఞానాన్ని నాటకాల్లో వాడే దూది గదతో పోల్చారు ప్రాజ్ఞులు- తత్త్వవేత్తలు. అది ప్రదర్శనకు, ప్రవచనానికే గాని యుద్ధానికి, పరమార్థానికి పనికిరాదు.


‘పరోపదేశే పాండిత్యం’- పరులకు నీతిని బోధించడంలో హిరణ్యకశిపునికి ఉన్న పాండిత్యానికి ఈ ‘సుయజ్ఞ’ ఉపాఖ్యాన ప్రసంగం ఒక ప్రకృష్ట ప్రతీకం- సంకేతం. తన తల్లికి, కోడండ్రకు వైరాగ్యం ఉపదేశించే వీడు తాను మాత్రం మదించి మహావిష్ణువుతో విరోధం పెంచుకున్నాడు. తాము ఆచరించక ఇతరులకు బోధించి, తమను తాము బాధించుకొనే వారే అసురులు- హిరణ్యకశిపులు.

                  సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

13-24-గీతా మకరందము

 13-24-గీతా మకరందము

           క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారికII ఈ ప్రకారముగ ప్రకృతిపురుషులనుగూర్చి యొఱుంగుటవలన గలుగు ఫలితమును వచించుచున్నారు –


య ఏవం వేత్తి పురుషం 

ప్రకృతిం చ గుణైః  సహ | 

సర్వథా వర్తమానోఽపి 

న స భూయోఽభిజాయతే || 


తాత్పర్యము:- ఎవడీ ప్రకారముగ పురుషుని (ఆత్మను), గుణములతో గూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో, ఆతడేవిధముగ నున్నప్పటికిని మఱల జన్మింపడు.


వ్యాఖ్య:- మఱల జన్మను బొందకుండుటకు అనగా మోక్షప్రాప్తికి ఉపాయమేమియో ఇచట సెలవిచ్చుచున్నారు. పురుషుడు (ఆత్మ) యెట్టివాడు? ప్రకృతి యెట్టిది? అను ఈ ప్రకారముగ ఆత్మానాత్మవిచారణాసమర్థుడై యుండు మనుజుడు, దృక్, దృశ్యములను బాగుగ వివేచించి చూడగలడు. కాబట్టి అట్టి విచారణాశీలుడు త్రిగుణాత్మకమై, బంధజనకమై, దుఃఖప్రదమైనట్టి ప్రకృతిని ఆశ్రయింపక గుణరహితమై, బంధచ్ఛిదమై, పరమానందరూపమైనట్టి పురుషునే (ఆత్మనే) ఆశ్రయించును. కావున ఆతడిక జన్మింపడు, ముక్తుడేయగును. ఏలయనగా ప్రకృతి, పురుషుల జ్ఞానముకలవాడు, అనాత్మను, అనగా దృశ్యమును, ప్రకృతిని తనకంటె (పురుషునికంటె) వేఱుగజూచుచు అద్దానితో సంగము (కలయిక) లేకుండును. కనుకనే అట్టివాడు ముక్తుడై మరల జన్మింపడని వచింపబడినది.


‘సర్వథా వర్తమానోఽపి’ - అట్టివాడు ఎట్లున్నప్పటికిని - అని చెప్పుటచే సమాధినిష్ఠుడైయున్నను, లేక లోకమున (ప్రజోపకార) కార్యములను జేయుచున్నను, బ్రహ్మచర్యాదిరూపమగు ఏ ఆశ్రమమందున్నను, మఱల జన్మింపడని భావము. అతడెట్లువర్తించినను సర్వథాముక్తుడేయగును. అయితే “ఎట్లు వర్తించినను" అనుదానికి అర్థము 'నిషిద్ధాచరణ' గలిగియుండినప్పటికిని అని యెవరును భావింపరాదు. ఏలయనిన నిషిద్ధాచరణగలవాడు ఆత్మానాత్మవివేకి యెన్నటికిని కానేరడు. మఱియు వివేకియగువాడు నిషిద్ధకృత్యముల నెన్నటికిని  చేయడు. కావున ఇట్టి వాక్యముల యర్థమును గ్రహించుటయందు బహుజాగరూకుడై యుండవలెను.


ప్రశ్న:- ప్రకృతి, పురుషులనుగూర్చిన జ్ఞానము గలిగియున్నచో ఫలితమేమి?

ఉత్తరము:- అట్టి జ్ఞానము కలవాడు ఏ ప్రకారము వర్తించినను జన్మరాహిత్యమును బొందును. అతడు మఱల జన్మింపడు.

తిరుమల సర్వస్వం -147*

 *తిరుమల సర్వస్వం -147*

*తొండమాన్ చక్రవర్తి -2*


 ఆ రంగదాసు స్వామివారి నిత్యపూజకు కావలసిన, పరిమళ భరితమైన, రంగురంగుల పువ్వులను పెంచటానికి భూతీర్థం లోని నీటిని వినియోగించే వాడు. ఆ తీర్థమే నేడు సంపంగి ప్రదక్షిణంలో ఉన్న "పూలబావి".

అలా, శ్రీమహావిష్ణువు తన దేవేరుల ద్వారా నిర్మింపబడ్డ తీర్థాలను తన భక్తుల ద్వారా పునరుద్ధరింప జేయించి తన మనోరథాన్ని నెరవేర్చుకోవడమే గాకుండా, ఆ తీర్థాలను ఈనాటికీ ఉపయుక్తంగా ఉంచి ఆ భక్తులిరువురినీ చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిపాడు.


 ఈ విధంగా, గోపీనాథుడు-రంగదాసులు ఇరువురు సుదీర్ఘకాలం పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవారిని సేవించుకున్నారు.


 *వరమా? శాపమా?* 


 కొంతకాలం తరువాత ఒకనాడు ఒక గంధర్వ చక్రవర్తి తన భార్యలతో కలిసి స్వామిపుష్కరిణిలో స్నానమాచరిస్తుండగా, అతని భార్యల అందచందాలను చూచిన రంగదాసు వికలమనస్కుడై, ఆ గంధర్వుడి భోగ భాగ్యాలకు అసూయాగ్రస్తుడై, పూలసేకరణలో జాప్యం చేశాడు. ఇంతలోనే జరిగిన పొరపాటుకు చింతిస్తూ, పుష్కరిణిలో తిరిగి స్నానమాచరించి, మరలా పుష్పాలను కోసుకుని, పూలమాలలతో దేవాలయానికి చేరుకున్నాడు. జరిగిన కాలాతీతానికి కారణమేమని ప్రశ్నించిన గోపీనాథునితో, తన తప్పిదానికి పశ్చాత్తాప పడుతూ జరిగినదంతా యథాతథంగా వివరించాడు. 


 ఆ సంభాషణను విన్న భగవంతుడు అశరీరవాణితో ఇలా పలికింప జేశాడు. *"జరుగవలసిన సమయానికి పూజ జరుగక పోవడం క్షమార్హం కాదు. కామవాంఛతో కలుషితమైన మనసుతో సాధన జరగటం దుర్లభం. ఈ దేహం విడిచిపెట్టేంతవరకూ ఆ పరమాత్ముడినే సేవిస్తూ, అవసానదశలో స్వామిపుష్కరిణి తీరంలోనే పరమపదం చెంది, మరుజన్మలో 'సుధర్ముడు" అనే ధర్మవర్తనుడైన రాజుకు పుత్రునిగా జన్మించి, తొండమండలానికి ప్రభువై, పెక్కుభార్యలతో భోగభాగ్యాలననుభవించి, ఆ జన్మలో కూడా శ్రీనివాసునికి ఆంతరంగిక భక్తుడై, శ్రీవారికి వెంకటాద్రి శిఖరంపై వైభవోపేతమైన ఆలయాన్ని నిర్మించి, ఆ దేవదేవుని సేవించుకుంటూ చరితార్థుడవుతావు".*


 ఈ విధంగా, క్షణికమైన కామవాంఛకు లోనైన పాపానికి సుదీర్ఘకాలం మోక్షసిద్ధికై వేచి ఉండేలా శాపాన్ని; అచిరకాలం తనను సేవించు కున్నందుకు ఫలితంగా మరుజన్మలో మహారాజుగా జన్మించి ఆనందనిలయాన్ని నిర్మించి తరించేలా వరాన్ని; ఏకకాలంలో అనుగ్రహించాడు.


 తరువాత రంగదాసు మరుజన్మ కోసం నిరీక్షిస్తూ, నూరు సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు శ్రీనివాసుణ్ణి పుష్పకైంకర్యంతో సేవించుకొని, స్వామి పుష్కరిణీ తటాన కాలధర్మం చెందాడు.


 తిరుమలేశుని ద్వారా శాపాన్ని, వరాన్ని ఏకకాలంలో పొందిన రంగదాసు నూరు సంవత్సరాల పాటు జీవించి, ఎల్లవేళలా శ్రీవారిని సేవించుకొని, స్వామి పుష్కరిణి తటంలో పరమపదించాడు.


 *రంగదాసు మరుజన్మ* 


 కలియుగారంభంలో ఒకానొకప్పుడు సుధీరుడనే చక్రవర్తి కుమారుడైన సుధర్మ మహారాజు వేట నిమిత్తం కపిలతీర్థం ఆలయ ప్రాంతానికి విచ్చేశాడు. ఆ సమయంలో అక్కడ విహరిస్తున్న సౌందర్యరాశి యైన ఒక నాగకన్యను చూచి మోహించిన సుధర్ముడు, తనను గాంధర్వవివాహం చేసుకోవలసిందిగా ఆమెను వేడుకొన్నాడు. అంతట ఆ నాగకన్య తాను పాతాళలోక వాసుడైన "ధనుంజయుడు" అనే సర్పరాజు కుమార్తెనని, తన తండ్రి ఓ రాకుమారునికే తననిచ్చి వివాహం చేయ సంకల్పించాడని, తనకు జన్మించిన పుత్రునికే రాజ్యాభిషేకం జరగాలనే అభిలాషను కలిగి ఉన్నాడని, తన తండ్రి కోరిక ప్రకారం అటువంటి రాకుమారుడినే తాను వివాహమాడతానని బదులిచ్చింది. సుధర్ముడు, తాను సుక్షత్రియుణ్ణని, సుసంపన్నమైన "నారాయణవన" రాజ్యానికి రాజునని, కావున సర్పరాజు కోరుకున్న లక్షణాలన్నీ తనలో ఉన్నట్లేనని నాగకన్యతో చెప్పాడు. అయితే, అప్పటికే తనకు "ఆకాశరాజు" అనబడే తనయుడున్నాడని, జ్యేష్ఠపుత్రునికే రాజ్యాధికారం సంప్రాప్తిస్తుంది గావున నాగకన్యకు పుట్టే బిడ్డను రాజ్యాభిషిక్తుణ్ణి చేయలేనని విన్నవించుకున్నాడు. అయితే, మార్గాంతరంగా తన సామ్రాజ్యాన్ని రెండు భాగాలు చేసి, నాగకన్య తనను వివాహమాడితే ఆమెకు పుట్టబోయే కుమారునికి అర్థరాజ్య మిస్తానని వాగ్దానం చేశాడు. ఆ ఒప్పందానికి నాగకన్య అంగీకరించడంతో, వారిరువురూ గాంధర్వవివాహం చేసుకొని, కొండకోనల్లో విహరిస్తూ, కపిలతీర్థం వద్దే చాలా కాలం గడిపారు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము*


*286 వ రోజు*


ద్రోణుడు పాండవసైన్యమును ఎదుర్కొనుట*


ద్రోణుడు ఎలాగైనా ధర్మరాజును పట్టుకోవాలని ప్రయత్నంతో పాండవ సైన్యాలను తరిమి తరిమి కొట్టి ధర్మజుని సమీపించాలను చూస్తున్నాడు. దుర్ముఖుడు ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ద్రోణుని ధాటికి పాండవ సన్యాలు వెనక్కు తగ్గాయి. ధర్మరాజు తనసేనను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేస్తున్నాడు. ద్రోణుని చేతిలో వేలకు వేలు సైనికులు వీరస్వర్గం చేరుకున్నారు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. రథముల క్రింద కొందరు, ఏనుగుల పాదముల క్రింద కొందరు మరణిస్తున్నారు. మదపుటేనుగులు తమ తొండముతో సైనికులను పైకెత్తి నేలకేసి కొడుతున్నాయి. యుద్ధభూమి భయానకంగా ఉంది. ద్రోణుడు తన సైన్యంతో ధర్మరాజు మీదకు వెళ్ళాడు. అతడిని ధర్మరాజు ఎదుర్కొన్నాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచాడు. సత్యజిత్తు వేరు విల్లు తీసుకుని క్రూర భల్ల బాణాలు ముప్పది ద్రోణుని మీద వేసాడు. పాంచాల రాకుమారుడు వృకుడు సత్యజిత్తుతో కలిసి అరవై బాణములు ద్రోణునిపై ప్రయోగించాడు. అది చూసి పాండవసేన హర్షధ్వానాలు చేసాడు. ద్రోణుడు కోపించి సత్యజిత్తుని, వృకుని తన బాణపరంపరతో ముంచెత్తాడు. వారిరువురు వెరువక ద్రోణుని సారథిని, హయములను, కేతనములను కొట్టారు. ద్రోణుడు సత్యజిత్తు శరీరంపై పది నారాచములు వేసాడు. సత్యజిత్తు మరొక విల్లు తీసుకుని ద్రోణునిపై శిలీఖములు వేసాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచి వృకుని తల నరికి సత్యజిత్తు రథమును విరిచి, హయమును, సారథిని చంపాడు. సత్యజిత్తు వేరొక విల్లు తీసుకుని ద్రోణునిపై శరవర్షం కురిపించాడు. ద్రోణుడు సత్యజిత్తు విల్లు విరిచాడు సత్యజిత్తు తీసుకుంటున్న ప్రతి విల్లు విరుస్తూ అతడి శిరస్సుని ఒక అర్ధ చంద్ర బాణంతో ఖండించాడు. సత్యజిత్తు మరణం చూసిన ధర్మరాజు అర్జునుడి మాటలు గుర్తుకు వచ్చి కలవరపడి ద్రోణునికి పట్టుబడక అక్కడి మెల్లగా నుండి తప్పుకున్నాడు. తనకు ఎదురు వచ్చిన వారినందరిని చంపుతూ ధర్మజుని కొరకు వెతుకుతున్నాడు. అంతలో విరాటుని తమ్ముడు సూర్యదత్తు ద్రోణుని ఎదుర్కొని అతడిపై కరకుటమ్ములు ప్రయోగించాడు. చిరాకు పడ్డ ద్రోణుడు ఒకే బాణంతో అతడి శిరస్సు ఖండించాడు. అది చూసి విరాటుని సేనలు పారిపోయాయి. ద్రోణునికి ఎదురు నిలిచేవారు లేక పోయారు. ఆ రోజు అలాగైనా ధర్మజును పట్టుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాడు. అప్పుడు యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదాసుడు, శిఖండి ఒక్కుమ్మడిగా ద్రోణుడిని ఎదుర్కొని ఒక్కొక్కరు అయిదేసి బాణములు ద్రోణునిపై ప్రయోగించారు. సాత్యకి పన్నెండు బాణములు, క్షాత్రధర్ముడు పది బాణములు ద్రోణునిపై ప్రయోగించారు. యుధిష్టరుని కాపాడుతూ ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు ద్రోణుని ఎదుర్కొని ద్రోణుని మీద ఒక్క సారిగా మూడు వందల బాణములు వేసారు. వారి అండతో ధైర్యం తెచ్చుకుని ధర్మరాజు ద్రోణునికి ఎదురుగా వచ్చి ద్రోణునిపై పన్నెండు బాణములు ప్రయోగించాడు. ధర్మజుని చూసి రెచ్చి పోయిన ద్రోణుడు ఒకే శరముతో వసుదాసుని శిరస్సు ఖండించాడు. ఉత్తమౌజుడు, సాత్యకి, శిఖండి మీద కరకుటమ్ములు వేసాడు. ధర్మరాజు వైపు ద్రోణుడు రావడం గ్రహించి ధర్మరాజు అక్కడి నుండి నిష్క్రమించాడు. చేతికి చిక్కిన ధర్మజుడు కనపడక ద్రోణుడు చిరాకు పడ్డాడి పాండవ సేనను చెండాడ సాగాడు. రథములు, కేతనములు విరిగి పడుతున్నాయి, హయములు, గజములు నేల పడుతున్నాయి. కౌరవ సేనలు ఉత్సాహంగా పాండవ సేనలను తరుముతున్నాయి. ఇంతలో వార్ధక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చనుడు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, సుమిత్రుడు, సాత్యకి, శిఖండి తమ సేనలతో ఒక్కుమ్మడిగా ద్రోణుని ఎదుర్కొన్నారు. ద్రోణుడు రథమును వేగంగా త్రిప్పితూ అనేక రూపములు ధరించాడా అన్నట్లు శరవర్షం కురిపిస్తూ సుమిత్రుని చంపాడు. ఇది చూసిన కేకయరాజులు, మత్స్య రాజులు తమ సేనలతో పారిపోయారు. ధృష్టద్యుమ్నుడు, సేనాబిందుడు, సాత్యకి మొదలగు ప్రముఖులు నిశ్చేష్టులై ద్రోణుని యుద్ధ వైఖరిని చూడ సాగారు. ఇది చూసిన సుయోధనుడు " కర్ణా ! చూసావా పెను గాలికి కూలి పోయిన వృక్షములవలె పాండవ సేన కూలి పోయింది. ద్రోణుని ఎదిరించగలిగిన వాడు పాండవ సేనలో లేడు. భీముడు ఒంటరిగా నిస్సహాయం నిలబడి ఉన్నాడు చూడు అన్నాడు. ద్రోణుని అస్త్రధాటికి నిలువ లేక రాజ్యకాంక్ష వీడి పారి పోతున్నాడు చూడు " అని ఆనందంగా అన్నాడు. కర్ణుడు " సుయోధనా ! పాండవులను అంత తేలికగా తీసి వేయకు. వారు మహావీరులు. అంతా కలిసి భీముని ముందు నిలిపి ద్రోణుని ఎదుర్కొంటారు. మనం ద్రోణుని రక్షణకు వెళ్ళాలి " అన్నాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పంచాంగం 12.02.2025 Wednesday

 ఈ రోజు పంచాంగం 12.02.2025 Wednesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి సౌమ్య వాసర ఆశ్లేష నక్షత్రం సౌభాగ్య యోగః: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30  వరకు.




శుభోదయ:, నమస్కార:

సనాతనం మహోన్నతం.

 #మహాకుంభలో ప్రత్యక్షంగా చూడకున్నా, కొంతమందికి అక్కడ అపరిశుభ్రతే కనిపించింది.


అక్కడికి వెళ్ళకున్నా, కొంతమందికి మహాకుంభలో ట్రాఫిక్ జామ్ లు, కష్టాలు మాత్రమే కనిపించాయి.


కానీ,,,


#మహాకుంభలో ప్రత్యక్షంగా పాల్గొన్న చాలామందిలో ఆధ్యాత్మికత కనిపించింది.


#మహాకుంభ తో కొంతమందికి తమ తమ తల్లిదండ్రుల కల నెరవేరడం కనిపించింది.


దానితో పాటూ......


#మహాకుంభ లో వచ్చిన 43.57 కోట్ల మందిలో ఒక్కరికి కూడా, తినే రొటీలో లేదా టీ, జ్యూస్ లలో ఉమ్మి వేయడం ఏ ఒక్కరికి కనపడలేదు.


ఈ 43.57 కోట్ల మంది హిందువుల్లో  ఏ ఒక్కరూ అన్యమతాల అస్తిత్వంని ప్రశ్నించలేదు. రెచ్చగొట్టే, బలవంతపరిచే, భయపెట్టే నినాదాలు చేస్తూ ఏ ఒక్కరు కూడా కనపడలేదు.


ఈ 43.57 కోట్ల మందిలో రోడ్ల మీద, రైళ్లలో, స్టేషన్లలో ప్రార్ధనలు చేసి ఇబ్బంది కలిగిస్తూ ఏ ఒక్కరు కనపడలేదు.


దళితులకి వేరుగా, బ్రాహ్మణులకి వేరుగా, జాట్ లకు వేరుగా, వైశ్యులకు వేరుగా ఇలా కులాలవారిగా స్నానాలు చేసేందుకు ఘాట్ లు కనపడలేదు. 


 *హిందువులందరు ఒకే చోట పవిత్ర స్నానాలాచరించి తాము వచ్చిన ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేసుకున్నారు* .


ఈ 43.57 కోట్ల మందిలో ఏ ఒక్క హిందువు కూడా ఆకలికి ఆహారం లేక ఇబ్బంది పడటం కనపడలేదు.


43.57  కోట్ల మంది వచ్చినా ఏ ఒక్కరిని కూడా మతమార్పిడికి ప్రలోభ పెట్టడం లేదా ప్రార్ధనల తర్వాత రాళ్లు రువ్వడం, అన్యమతస్తుల మీద దాడి చేయడం ఎక్కడా కనపడలేదు.


ఇన్ని కోట్ల మంది వచ్చినా ఎక్కడా మందబలం చూపి ఏ టోల్ గేట్ వద్ద టాక్స్ ఎగ్గోట్టలేదు. 


ప్రపంచం మొత్తం ప్రయాగ పవిత్ర సంగమంలో అత్యంత ప్రశాంతంగా ఓలలాడుతుంది. నిత్యనూతనం, చిర పురాతనంగా విరాజిల్లుతుంది.


ఇదీ అందరూ గమనించాల్సింది.

ఇదే అందరూ అర్థం చేసుకోవాల్సింది.


అందుకే #సనాతనం మహోన్నతం.


#మహాకుంభ_2025_ప్రయాగరాజ్ 🙏🚩