14, మార్చి 2021, ఆదివారం

మన మహర్షులు- 49 దేవల మహర్షి -

 మన మహర్షులు- 49


దేవల మహర్షి -


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



పూర్వం దేవుడనే మనువుండేవాడు. అతని కొడుకు ప్రజాపతి. ప్రజాపతి కొడుకు ప్రత్యూషుడు, ప్రత్యూష్యుడికి ఇద్దరు కొడుకులు. మొదటివాడు దేవలుడు రెండవవాడు

విభువు.


దేవలుడు నల్లగా ఉండేవాడు. అందుకే అతడిని 'అసితుడని' కూడా పిలిచేవాళ్ళు.


దేవలుడు పెద్దవాడయ్యాక విద్యాభ్యాసానికి వ్యాసుడి దగ్గరకి పంపాడు తండ్రి దేవలుడు చక్కటి గుర్తుభక్తితో విద్య నేర్చుకున్నాడు. వ్యాసుడు తాను రాసిన మహాభారతాన్ని వ్యాప్తి చెయ్యమని పితృలోకం పంపించాడు దేవలుడిని. గురువు గారు చెప్పినట్లే చేశాడు దేవలుడు. గురువుగారిని మించిన శిష్యుడని అందరూ మెచ్చుకున్నారు.


దేవలుడు గొప్ప తపస్విగా, సత్యవ్రతుల్లో మొదటివాడుగా బ్రహ్మనిష్ఠ గలవాడుగా

పేరుపొందాడు.


ఒకసారి జైగీషవ్యుడు దేవలుడున్న చోటికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. బృహస్పతి లాంటి పెద్దలందరు వచ్చి దేవల జైగీషవ్యులున్న ప్రదేశాన్ని దివ్యతీర్థంగా ప్రశంసించారు. దేవలుడు అందరి దగ్గర సెలవు తీసుకుని సింధునదీ తీరానికి వెళ్ళిపోయాడు.


దేవలుడు ఒక చెఱువులో స్నానం చేస్తుంటే 'హూహూ' అనే పేరుగల గంధర్వుడు అదే చెఱువులో తన భార్యలతో స్నానం చేస్తూ దేవలుడి పాదాలు పట్టుకుని బాధపెట్టడం మొదలుపెట్టాడు. దేవలుడు కోపంతో గంధర్వుడిని మొసలిగా పుట్టమని శపించాడు.


గంధర్వుడు దేవలుడిని రక్షించమని ప్రార్థించాడు.


 నువ్వు మొసలివై ఒక ఏనుగుని పట్టుకున్నప్పుడు ఏనుగుని రక్షించడానికి విష్ణుమూర్తి వస్తాడు. అప్పుడు నీకు శాపవిమోచనం

అవుతుందని చెప్పాడు.

 దేవలుడు .


మనకి' గజేంద్రమోక్షం' కధ  తెలుసు కదా... ఆ గజేంద్రుణ్ణి పట్టుకున్న మొసలే ఈ గంధర్వుడు.


దేవలుడు కఠోర దీక్షలో వుండి తపస్సు చేసుకుంటుంటే రంభ వచ్చి తనను వివహమాడమని  అడిగింది. దేవలుడు అందుకు అంగీకరించలేదు. తన మాట వినలేదు గనుక శూద్రుడిగా పుట్టమని దేవలుడిని శపించింది.


రంభ శాపం వల్ల దేవాంగకులంలో పుట్టిన దేవలుడు రకరకాల వస్త్రాల్ని తయారు చెయ్యడం మొదలుపెట్టి తన కొడుకులు దివ్యాంగుడు, విమలాంగుడు, ధవలాంగుడు ముగ్గురితో కలసి నేత పరిశ్రమని లోకంలో వ్యాపించేలా చేశాడు.


 ఒకసారి నారదుడు దేవలుడి దగ్గరకి వచ్చి ఈ ప్రపంచం ఎల్లా పుట్టిందీ,

ప్రళయకాలంలో ఏమవుతోంది? మొదలయిన విషయాలు అడిగి తెలుసుకున్నాడు.


 దేవలుడు తీర్థయాత్రలు చేస్తూ గంగాస్నానం చేసి విష్ణుజపం చేస్తుండగా అతడికి

పితృదేవతలు కనిపించి పున్నామ నరకం నుంచి రక్షించమని వేడుకున్నారు.


నాయనా! బ్రహ్మచర్యం వలన ముని ఋణం తీరుతుంది. అగ్నిహోత్రానికి సంబంధించిన పనులవల్ల దేవ ఋణం తీరుతుంది. పెళ్ళిచేసుకుని మంచి సంతానం పొందితేనే పితృదేవతల ఋణం తీరుతుంది. కాబట్టి నువ్వు వివాహం చేసుకుని మాకు మోక్షంకలిగేలా చెయ్యమన్నారు పితృదేవతలు.


అయ్యా! నేను పెద్దవాడ్నయ్యాను. ఈ వయస్సులో నాకు పిల్లనెవరిస్తారు? అని అడిగాడు దేవలుడు.


కౌండిన్యుడనే మహామునికి ఒక కుమార్తెవుంది. ఆమెని నువ్వు పెళ్ళి చేసుకో

ఆమెను నీ కోసమే బ్రహ్మ సృష్టించాడని చెప్పారు పితృదేవతలు


దేవలుడు బయలుదేరి కౌండిన్యుడి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు. దేవలుడి గురించి తెలిసిన కౌండిన్యుడు తనకుమార్తెను దేవలుడికిచ్చి పెళ్ళి జరిపించాడు. కొంతకాలానికి దేవలుడికి సువర్చల అనే కూతురు కొంతమంది కొడుకులు పుట్టారు


అలా పితృదేవతల ఋణం కూడా తీర్చుకున్నాడు దేవలుడు. 


దేవల మహర్షి మహాధర్మశాస్త్రాన్ని ప్రతిపాదించాడు. ఈయన రాసిన 'దేవలస్మృతి' ఇంకా పూర్తిగా దొరకలేదు


దేవల మహర్షి, దివ్యర్షి, మహాతపస్వి, యోగీశ్వరుడు, ధర్మశాస్త్ర ప్రవక్త, మహా

పురుషుడుగా ప్రసిద్ధికెక్కాడు. భారతదేశ మహర్షుల్లో గొప్ప ఋషిగా పేరు పొందాడు.🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

అన్యోన్య దాంపత్యం*

 శ్రీనివాస సిద్ధాంతి 9494550355


*అన్యోన్య దాంపత్యం* 


దాంపత్యం అంటే… భార్యాభర్తల అన్యోన్యత. ఇది ఒక శాశ్వతబంధం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు.. అంటూ దాంపత్య ధర్మాన్ని దేవతా స్థానంలో ఉంచి ఆరాధించే సంప్రదాయం మనది. ఆ దేవదంపతులకు అనేకమార్లు కళ్యాణాలు చేస్తూ.. ఆ ఉత్సవాల ద్వారా వివాహ వ్యవస్థలోని పవిత్రతనీ, దాంపత్యంలోని శాశ్వతత్వాన్ని గుర్తు చేసుకుంటాం.


ధ్రువాసి ధ్రువోయం యజమానో స్మిన్నాయతనే!! (యజుర్వేదం)

'ఈ గృహంలో నువ్వు శాశ్వతం, యజమానియైన ఇతడు (భర్త) శాశ్వతం' ఈ వేద వాక్కు. మార్పు చెంద(కూడ)ని దంపతుల స్థిరత్వాన్ని చాటుతోంది. 'యజమాని' అంటే సత్కర్మను (యజ్ఞాన్ని) ఆచరించు వాడు అని సరైన నిర్వచనం. 


భారతీయ దృక్పథంలో సతీపతుల బంధం ఇహలోక, పరలోకాలకు, జన్మజన్మలకు కొనసాగుతుంది. ఇంద్రాదులు, గంధర్వాదులు ఆ జాయాపతులకు బంధాన్ని ఏర్పరచిన వివాహ మంత్రాలు చెబుతున్నాయి. దంపతుల స్థిరత్వం కుటుంబానికి పునాది. దంపతులు అభిరుచులు, అభిప్రాయాలు, ప్రేమానురాగాలను పంచుకుంటూ, పెంచుకుంటూ అన్నింటా కుటుంబంలో ఒదిగిపోవాలి. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల దంపతుల మధ్య అనురాగం కరువగు చున్నది అటువంటి వారు ఈ క్రియతో మంచి ఫలములు పొందే అవకాశమున్నది.  

నవదుర్గల్లో కాత్యాయని మాతకు ఆరో స్థానం. ఈమెకు గురు గ్రహం ఆధిపత్య దైవం. ఈమె సింహంపై ఆసీనురాలై వుంటుంది. త్రినేత్రాలను కలిగివుంటుంది. కాత్యాయని మంత్ర జపంతో కుజ దోషాలు హరించుకుపోతాయి. దాంపత్య జీవనంలో వుండే దోషాలను ఇది తొలగిస్తుంది. కాత్యాయని మంత్రాన్ని జపించే దంపతులు అన్యోన్యంగా జీవనం సాగిస్తారు.  ''కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి 

నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః 

అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః

కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర 

విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం 

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే 

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే 

శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే" 41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే దాంపత్య దోష నివారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాటకు చోటుండదు. ఇంకా దంపతుల మధ్య వివాదాలుండవు.


జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.   

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.*

*9494550355*

_plz forward the message_🌹

ఆనందానికి

 ఆనందానికి అసలు రూపం 

ఏది సత్యమో... ఏది నిత్యమో... అదే నిజమైన ఆనందం. నిజమైన సుఖం. ఈ స్థితినే గీతలో శ్రీకృష్ణుడు దుఃఖసుఖాత్యయం అని నిర్వచిస్తాడు. అంటే దుఃఖానికి, సుఖానికి అతీతమైన స్థితి అని అర్థం. ఇంద్రియాల వల్ల వచ్చే హాయి కలిగినట్టే కలిగి అలాగే పోతుంది. అది ఎంత కలిగిందో అంతా ఉండదు. సున్నా అవుతుంది. చివరకు దుఃఖంగా మారిపోవచ్చు కూడా.. ఒక రేఖకు ఒక చివర సుఖమైతే మరో చివర దుఃఖం ఉంటుంది.రెండింటి మధ్య బిందువు దగ్గర అది సుఖ, దుఃఖాలను దాటిన స్థితి అవుతుంది. ఇక్కడ ఏ అలజడీ ఉండదు. ఇదే నిజమైన ఆనందం... దీన్నే శివం అని పిలుస్తారు. అందుకే స్వచ్ఛమైన ఆనందానికి ఒక రూపం ఊహిస్తే అదే శివ స్వరూపం. సుఖదుఃఖాల మధ్య బిందువుకు ఎలా చేరుకోవాలి? అనే ప్రశ్నకూ శివ స్వరూపమే సమాధానం చెబుతుంది. శివుడు యోగ ముద్రలో కూర్చోవడమే కాదు. ఆయన మెడ చుట్టూ పాము కూడా చుట్టుకుని ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అదరకుండా, బెదరకుండా, కదలకుండా యోగ ముద్రలో కూర్చోవడమే ఆనందానికి¨ మార్గమని శివుడు తన రూపంతో మనకు ఉపదేశిస్తున్నాడు. చుట్టూ ఎన్ని కష్టాల పాములు చుట్టుకున్నా క్షోభ పడకుండా, భయపడకుండా ఉండడమే ఆనందమంటే..


సుదర్శన చక్రం శివుడి చేతిలోనూ... 

విష్ణువు ఆయుధం సుదర్శన చక్రం. మరి శివుడు కూడా సుదర్శన చక్రాన్ని ధరించాడా? అవునంటుంది శివ పురాణం. పరమేశ్వరుడి అవతారాల్లో ఒకటైన వామదేవ మూర్తిది విష్ణు స్వరూపం. ఆయన చేతిలో శంకు, చక్రాలు కూడా ఉంటాయి. శివకేశవ ఏకత్వాన్ని రూఢి చేస్తూ ‘శివాయ విష్ణు రూపాయ... శివ రూపాయ విష్ణవే’ అనే మంత్రభాగం ఉండనే ఉంది. ఇది కాకుండా ఉపమన్యు మహర్షి శివుడు తనకు దర్శనమిచ్చిన అవతారంలో చేతిలో సుదర్శన చక్రం ఉందని చెబుతారు. ఇంకా రుద్రుడి చేతిలో ఓ మహత్తరమైన ఆయుధం ఉంటుంది. అదే త్రిశూలం. దానిని విజయం అని పిలుస్తారు. త్రిశూలాన్ని ధరించినందునే శివుడిని శూలి అని అంటారు. భూమిని బద్దలుకొట్టి, సముద్రాలను ఎండగట్టి, నక్షత్ర సమూహాలను కూల్చేసే శక్తి ఈ ఆయుధానికి ఉంటుందని చెబుతారు. ఈ శూలం మూడు కొనలు కనుబొమల్లా, నిలువెత్తున ఉండి భయంకరంగా కనిపిస్తుంది. అలాగే శివుడి చేతిలో గండ్రగొడ్డలి ఒకటి ఉంటుంది. వీటితో పాటు సుదర్శన చక్రం, వజ్రాయుధం, అమ్ములపొదిలో పినాకం అనే ధనుస్సు, కత్తి, పాశం, అంకుశం కూడా ఉంటాయి.

కథావల్లరి - 3* 🌷🌷🌷 *పాకవేదం*

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

        *నాకు నచ్చిన ఓ* 

       *వాట్సాప్ కథానిక* 

              🌷🌷🌷

          *కథావల్లరి - 3* 

               🌷🌷🌷

              *పాకవేదం* 

               🌷🌷🌷

"బాపన్నగారమ్మాయికి పెళ్లి కుదిరిందిటా.  విశేషాలేమిటి పంతులు గారూ!"

"పెళ్లి ఎక్కడ చేస్తున్నారు పంతులు గారూ, దసపల్లా లోనా, డాల్ఫిన్ లోనా"

"మనందరికీ బస్సు వేయిస్తారా లేదా బాపన్న గారు, ముందది చెప్పండి పంతులు గారూ."

                       విశాఖపట్నానికి అత్యంత సమీపంలో ఉన్న పల్లెటూరది. బాపన్న గారు ఆ ఊళ్లో పేరు మోసిన భూస్వామి.  ఆయనకి ఉన్న సంతానమల్లా కూతురు జానకి ఒక్కర్తే.  జానకి పేరే పాత పేరు.  అందరూ లాస్య, షర్మిల లాంటి పేర్లు పెట్టుకుంటున్న రోజుల్లో బాపన్న గారు కూతురికి 'జానకి' అని తన తల్లి పేరు పెట్టుకున్నారు.  పిల్లని పద్ధతిగా పెచుకొచ్చారు. జానకి కూడా తండ్రికి తగ్గ కూతురే.  చదువులో సరస్వతే గాని ఫ్యాషన్ల రాణి మాత్రం కాదు. అన్ని రకాల ఆధునిక దుస్తులూ వేసుకుంటుంది. కాని ఎక్కడా అసభ్యత కనబడనివ్వదు. నల్లని, ఒత్తైన నిడుపాటి కురుల్ని చక్కగా జడ వేసుకుని మల్లెలూ, మొల్లలూ, కనకాంబరాలూ పెట్టుకుంటుంది.  పండుగలకి చక్కగా పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని రుక్మిణీదేవిలా అమ్మవారి గుడికి వెళుతూ ఉంటుంది. 

           ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీలో సీటు తెచ్చుకుని, ఇంజనీరింగ్ టాప్ ర్యాంక్ లో పాసైన జానకికి ఉద్యోగం కూడా వచ్చేసింది.  అందులో జాయిన్ అవకముందే సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఆ ముందు రోజునే పెళ్లి చూపులయాయి. ముహూర్తాలు పెట్టే పండితులు వేరే ఉన్నా, అమ్మాయి భక్తిగా కొలిచే అమ్మవారి గుడి పూజారి గదా అని రామయ్య పంతుల్ని కూడా చూపులకి ఆహ్వానించారు బాపన్న. మొత్తం తతంగం అంతా పూర్తి అయి, రామయ్య పంతులు ఇల్లు చేరే సరికి రాత్రి తొమ్మిదైంది.  తెల్లారి ఆయన గుడికి వచ్చిన దగ్గర నుంచీ జనం వస్తూనే ఉన్నారు. బాపన్న గారమ్మాయి పెళ్లి గురించి తలో ప్రశ్నా వేస్తూనే ఉన్నారు.  వాళ్లని కాస్త ఆగమని, అమ్మవారి పూజాదికాలు గబగబా కానిచ్చేశాడు పంతులు. తీరిగ్గా మంటపంలోకి వచ్చి కూచుని, "చెప్పుకోవాలే గాని పెద్ద కథర్రా.  మహా పసందైన కథ" అన్నాడు. 

     "చెప్పండి, చెప్పండి" జనం ఆయన చుట్టూ చతికిలబడ్డారు.

     "బాపన్నగారు ఎంత పద్ధతి మనిషో మనకి తెలిసిందే కదా.  ఆయనకి కాబోయే వియ్యంకుడు మరో నాలుగాకులు ఎక్కువ.  పెళ్లి ఏ దసపల్లా లోనూ కాదు. ఇక్కడే, మనందరి మధ్యనే. "

శ్రోతల ఆశ్చర్యానికి మేర లేదు. 

   "అవునర్రా... నిన్న బాపన్న గారూ, ఆయన వియ్యంకుడూ మాట్లాడుకున్న మాటలు వింటుంటే నాకు ఒళ్లు గరిపొడిచిందనుకోండి. పెళ్లి వైశాఖ మాసంలో.. ఇక్కడే. తాటాకు పందిరేసి ఇంటి ముంగిట్లోనే.  అచ్చంగా ఒకప్పటి పెళ్లిళ్లు ఎలా జరిగేవో అలాగే.  ఒక్క స్వీటు ముక్క కూడా బజార్లో కొనరు. పెళ్లికి పదిహేను రోజుల ముందే వియ్యంకుడు గారు రంగాజమ్మ గారి బృందాన్ని ఇక్కడికి పంపిస్తారుట. రంగాజమ్మ గారంటే వంటావిడ. జానకి అత్తవారి ఊళ్లోనే ఆవిడా ఉంటుందిట. రంగాజమ్మ, ఆవిడ తమ్ముడు, కొడుకు, కోడలు, ఇంకా మరో ఇద్దరు కుర్రాళ్లు.. వీళ్లంతా కలిసి ఒక బృందం.  మర కత్తిపీటలు, మామూలువి పెద్ద పెద్ద కత్తిపీటలు,పనసకాయ కత్తులు, బూందీ చట్రాలు ఇలాంటి సామగ్రి అంతా వాళ్ల దగ్గర ఉంటుందిట. ఐదారువందల మంది జనానికి అవలీలగా వండి వారుస్తారుట.  లడ్డూలు, అరిసెలు, బూరెలు వగైరా వంటలు అద్భుతంగా చేస్తారుట.  పనసపొట్టు కూర, కందా బచ్చలి, వాక్కాయ పప్పు, ఆవ పెట్టిన పులిహోర ఇలాంటి పాతకాలం వంటలు వీళ్లు చేసినట్టు ఎవ్వరూ చెయ్యలేరుట. 

           పెళ్లికి పదేను రోజుల ముందొచ్చి వాళ్లు ఆవకాయ, మాగాయ, తొక్కుపచ్చడి వగైరాలు పెడతారుట. అప్పడాలు, వడియాలు కూడా ఇంట్లోనే తయారు చేస్తారుట. పెళ్లి దగ్గర పడనిచ్చి లడ్డూ, సున్ని, మైసూర్ పాక్, చక్కిలాలు, కారం బూందీ చేస్తారుట. పెళ్లి కార్యక్రమాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఆ రెండ్రోజులూ మన ఊరు ఊరంతటికీ బాపన్న గారింట్లోనే భోజనాలు. "మనిద్దరికీ డబ్బుకి లోటు లేదు. మన అభిరుచి మేరకు ఇలా చేద్దాం" అని వియ్యంకులిద్దరూ మాట్లాడుకున్నారు. "మీక్కావలిస్తే సిటీలో మళ్లీ రిసెప్షన్ ఇద్దాం" అని పెళ్లి కొడుకుతో వాళ్ల నాన్న అంటే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా... వాళ్ల ఫ్రెండ్స్ కూడా హొటళ్లూ, బిర్యానీలతో విసిగెత్తిపోయి ఉన్నారుట... "వాళ్లకి కూడా ఇవే నచ్చుతాయిలే నాన్నా" అన్నాడు. 

అదీ సంగతి"

రామయ్య పంతులు చెప్పడం పూర్తి చేసిన మరుక్షణం నుంచే జనం రంగాజమ్మ బృందం కోసం ఎదురు చూపులు ప్రారంభించారు. 

        అనుకున్న రోజు రానే వచ్చింది.  తెల్లని మల్లుచీర కట్టుకుని, వేలిముడి వేసుకున్న రంగాజమ్మా, పెద్ద కత్తిపీట పుచ్చుకుని అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ ఆవిడ కోడలూ, నామం దిద్దుకుని ఓ భుజం మీద కండువా, ఇంకో భుజం మీద పనసకాయ కత్తీ పట్టుకుని ఆవిడ తమ్ముడూ, మర కత్తిపీటలు పట్టుకుని కుర్రాళ్లూ దిగారు. 

          బాపన్నగారూ, ఆయన వియ్యంకుడూ ఏర్పాటు చేసిన ప్రకారం అప్పటికే మాడుగుల నుంచి ఆవాలు, బందరు నుంచి మిరపకాయలు, అనకాపల్లి నుంచి బెల్లం దిమ్మలు, సామర్లకోట నుంచి పప్పునూనె, నూజివీడు నుంచి రసాలు, బంగినపల్లి కాయలు ఇంకా ఇతర సామగ్రి వచ్చేశాయి. 

"అత్త లేని కోడలుత్తమురాలూ ఓయమ్మా"అంటూ ఆవాలు, మిరపకాయలు దంపి, ఆవకాయ పని ముగించారు. ఊరంతా తలా కాస్తా రుచి చూసి "హా" అంటూ లొట్టలేశారు.  రంగాజమ్మ బృందాన్ని చూస్తూనే ప్రేమలో పడిపోయిన ఊరి జనం, వాళ్ల చేతి ఆవకాయ రుచి చూశాక దాసోహం అంటూ తలో పనీ అందుకుని సాయం చెయ్యడం ప్రారంభించారు. 

     ఆవకాయలతో బాటే కారం అప్పడాలు, పెసర అప్పడాలు రంగాజమ్మా, కోడలూ వత్తి ఇస్తూ ఉంటే మిగిలిన వాళ్లు ఆరబెట్టి, బొత్తులు పెట్టారు.  మినపప్పు నానబోసి రుబ్బి గుమ్మడి వడియాలు, పులుసులూ కూరల్లోకి చిట్టొడియాలూ పెట్టారు.  సగ్గుబియ్యం ఉడికించి పల్చగా అప్పడాలంతేసి సగ్గుబియ్యం వడియాలు పెట్టారు. 

      ఆవకాయలు, అప్పడాలు, వడియాల పని అయాక, బాపన్న గారి పెరట్లోనే దగ్గరుండి గాడిపొయ్యి తవ్వించింది రంగాజమ్మ.  వేసవి ఎండకి ఎండిన కట్టెల్ని పొయిలో పెట్టి, శుభ ముహూర్తం చూసి ఇంత కర్పూరం వేసి వెలిగించగానే, హోమాగ్నిలా ఝామ్మంటూ మంటలు లేచాయి. గాడిపొయ్యి దగ్గర వంతుల వారీగా పిండివంటలు చేసే పని రంగాజమ్మ, ఆవిడ తమ్ముడిదే.  మిగిలిన వాళ్లు పిండి కలపడం, ఉండలు చుట్టడం వగైరా పనులు చేసేవారు. 

       బాపన్నగారి కోరిక మేరకు పంచదార లడ్డూ, బెల్లం లడ్డూ రెండూ చేశారు రంగాజమ్మ అండ్ పార్టీ.  పచ్చకర్పూరం ఘుమఘుమలకు స్వచ్ఛమైన నేతి గుబాళింపు జోడై, లడ్డూ నోట పెట్టిన వారికి స్వర్గం అరడుగు దూరంలో కనిపించింది.  నేతి తడితో మెరుస్తూ తయారైన మైసూర్ పాక్ దాని రుచి ముందు మైసూరు రాజ్యం కూడా దిగదుడుపే అనిపించేసింది. బెల్లంతో చేసిన మినపసున్ని, ఒక్కటైనా తినకపోతే జన్మ ఎందుకు అనిపించింది అందరికీ.  చక్కిలాల కరకర, బూందీలో జీడిపప్పు మిసమిస జీవితం పసందుగా ఉందనిపించాయి.

       ఇలా ముందస్తు ఏర్పాట్లు పూర్తయి, పెళ్లివారు తరలి వచ్చారు. ఊరు ఊరంతా వాళ్లకి స్వాగతం పలికి, తమ ఇళ్లన్నీ విడిదిగృహాలే అనుకోమన్నారు. సింహాచలం నుంచి వచ్చిన మరో నలుగురు పండితులతో బాటు రామయ్య పంతులు కూడా పెళ్లి పౌరోహిత్యం స్వీకరించాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు తలో పనీ అందుకున్నారు. మొదటిరోజు కత్తెర స్నాతకం - తోట సంబరం సంబరంగా ముగిశాయి.  తమ ఆడపడుచు పెళ్లి జరుగుతున్నంత ఆనందంగా ఊరి జనం పెళ్లి పనుల్లోనూ, కార్యక్రమాల్లోనూ పాలు పంచుకున్నారు. వాక్కాయ పప్పు, పనసపొట్టు కూర, గుత్తి వంకాయ, గోంగూర పచ్చడి, ముక్కల పులుసు, ఆవడలు, బొబ్బట్లు, పాయసంతో తొలిరోజు విందు జరిగింది. 

          మర్నాడు పెళ్లికొడుకు శ్రీరామ్ జానకి మెడలో తాళి కట్టిన తరువాత అందరికీ కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చారు. కందా బచ్చలి కూర, అరటికాయ బెల్లం వేసిన కూర, మావిడికాయ పప్పు, కొబ్బరి, మావిడి కలిపి పచ్చడి, పులుసు, ఆవ పెట్టిన పులిహోర, బూరెలు, చక్రపొంగలి, లడ్డూ, బంగినపల్లి మామిడి పండు ముక్కలు, కమ్మని పెరుగు.. వీటితో పెళ్లి భోజనం చేసి ఊరంతా భుక్తాయాసంతో బ్రేవ్ మంటూ త్రేన్చింది. 

     పెళ్లి జరిగిన మర్నాడు కొత్త కోడల్ని తీసుకుని పెళ్లివారు బయల్దేరారు.  ఊళ్లో ముఖ్యమైన వాళ్లు కొందరు కార్ల దగ్గరకి వచ్చి జానకికి వీడ్కోలు పలికారు. మిగిలిన వాళ్లంతా ఇంకా పెళ్లి భోజనపు మత్తు వదలనట్టు ఇళ్లల్లో పడుకున్నారు.   మరో రెండు రోజుల్లో బాపన్న గారి ఇంట్లో అన్నీ సర్ది పెట్టి, మంచిరోజు చూసి గాడిపొయ్యి కూడా మూసి పెట్టి రంగాజమ్మ బృందం తిరుగు ప్రయాణమైంది.  వాళ్లు సొంత కష్టంతో కొనుక్కున్న మెటడార్ వ్యాన్ లో కత్తులూ కత్తిపీటలూ అన్నీ సర్దుకోబోయేసరికి ఊరు ఊరంతా అక్కడ హాజరైంది. రంగాజమ్మ బృందాన్ని కూర్చోబెట్టి సామానంతా ఊరిజనమే సర్దారు. 

    "ఈ మర కత్తిపీటతో ఆయన అంతలేసి మావిడికాయల్ని ఎంత చులాగ్గా టకటకా తరిగేశారో.. మళ్లీ అన్ని ముక్కలూ ఒక్కలాగే వచ్చాయ్"

    "దీని పేరే పనసకాయ కత్తి ట. ఆ పెద్దమ్మ గారు దీంతో పనసకాయని ఎంత చిన్న ముక్కలుగా కొట్టారో... అసలు కత్తి కదులుతున్నట్టే అనిపించేది కాదు. పెద్దయ్యగారు నేర్పారంట ఆమెకి అలా తరగడం"

   "ఈ చట్రంతో పెద్దమ్మ గారు మిఠాయి బూందీ కొట్టి పెట్టేస్తే కోడలు గారు ఎంత చకచకా ఉండలు కట్టేదో... ఆవిడ చేతులు మంట పెట్టవా అని నేను అనుకునేదాన్ని గానీ ఆవిడ నవ్వుతూనే ఉండేది"

     ఊరివాళ్ల మాటలు వింటూ ఆనందంతో కంటనీరు పెట్టుకున్నారు రంగాజమ్మ బృందం. 

        బాపన్నగారు కూడా వాళ్లకి వీడ్కోలు పలుకుతూ, "ఒకప్పటి పాక వైభవాన్ని మళ్లీ మా కళ్లకూ నోటికీ చూపించారమ్మా. మిమ్మల్ని పంపినందుకు మా వియ్యంకుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను. మీకు మా అందరి తరఫునా ధన్యవాదాలు" అంటూ చేతులు జోడించారు. 

రంగాజమ్మ బృందం ఆనందబాష్పాలతో తిరిగి నమస్కారాలు చేస్తూ సాగిపోయింది. 

          🌷🌷🌷                  

లక్ష్మీ గాయత్రి, విశాఖపట్నం.

మొగలిచెర్ల

 *నాగమణిగారి నియమం..*


"ఈరోజు నాగమణి గారి పేరుతో అన్నదానము అని రిజిస్టర్ లో ఉన్నది..కానీ ఇతర వివరాలేమీ లేవు..బోర్డ్ మీద అన్నదానానికి విరాళం ఇచ్చిన దాత తాలూకు గోత్రము, పేరు..ఊరు..వ్రాయాలి కదా..ఇక్కడ కేవలం నాగమణి గారు అని మాత్రమే ఉన్నది..కనీసం వారి సెల్ నెంబర్ కూడా లేదు..ఈరోజు ఇక్కడ అన్నదానం జరిపించామని వారికి తెలియచేయాలి కదా?..వారి గోత్రనామాలతో అర్చన చేయించాలి..ఇప్పుడెలా?.." అని మా సిబ్బంది నన్ను అడిగారు..నేను రిజిస్టర్ తెప్పించుకుని చూసాను..నిజమే..ఒక్క పేరు తప్ప మరే వివరాలు లేవు.."ఇది నమోదు చేసింది ఎవరు?.." అని అడిగాను.."మీరు నా పేరు వ్రాసుకోండి..ఆతేదీకి నేను వస్తాను..అన్ని వివరాలు ఇస్తాను.." అని ఆవిడ చెప్పింది సార్..ఎంత ఖర్చు అవుతుంది..అని అడిగింది..చెప్పాను..అంత మొత్తము ఇచ్చింది..రసీదు ఇచ్చాను..ఎలాగూ ఆవిడ వస్తానన్నారు కదా అని నేను మిగిలిన వివరాలు అడగలేదు..." అని సిబ్బందిలో ఒకరు చెప్పారు.."సరే..ఇప్పుడు సమయం ఏడు గంటలేకదా..?..తొమ్మిదిన్నర కు వచ్చే బస్సులో వేస్తారేమో వేచి చూద్దాము.. మరో రెండుగంటలు చూద్దాం..అన్నదానం మాత్రం నిర్వహిద్దాము.." అని చెప్పాను..


స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..మా సిబ్బంది మైకు ద్వారా..అన్నదానం ఉందన్న సంగతి అందరు భక్తులకూ తెలియచేశారు..ఆరోజు మంగళవారం..ఉదయం తొమ్మిదిన్నర సమయం లో వచ్చిన బస్సులో కొందరు భక్తులు వచ్చారు కానీ..అన్నదానానికి విరాళం ఇచ్చిన నాగమణి గారు మాత్రం రాలేదు..మరో అరగంట గడిచింది..స్వామివారి మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుండి దంపతులు దిగారు..వారి వెనకాలే నాగమణి గారు కూడా వచ్చారు..మందిరం లోపలికి వచ్చి..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేను కూర్చున్న స్థలం వద్దకు వచ్చి.."నా పేరు నాగమణి అండీ..ఈరోజు ఈ స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం ఏర్పాటుకు నాకు అవకాశం దొరికింది..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని మీ సిబ్బంది చెప్పారు.." అన్నారు.."అమ్మా..ఉదయం నుంచీ మీ గురించే మేము మథనపడుతున్నాము..మీ తాలూకు వివరాలేవీ మా వద్ద లేవు..ఈకార్యక్రమం జరుపుతున్నామని మీకు తెలియచేయాలి కదా..అలాగే మీ గోత్రనామాలతో అర్చన చేయడానికి కూడా ఇబ్బంది వచ్చింది..మీరే వచ్చారు కనుక ఇక మాకు బాధలేదు.." అన్నాను..నాగమణి గారు నా వైపు చిరునవ్వుతో చూసి.."నేను వస్తానని చెప్పే వెళ్ళాను బాబూ..ఆరోజు మీరు లేరు.." అన్నారు..


తనతో వచ్చిన దంపతులను నాకు చూపిస్తూ.."వీళ్ళిద్దరూ నా తమ్ముడూ మరదలూనూ..అసలు వీళ్ళగురించే నేను ఈ స్వామిదగ్గరకు వచ్చాను..వీడిపేరు రాజేశ్వరరావు..అమ్మాయి ప్రసూనాంబ..అమెరికా లో వుంటారు..వీళ్లకు ఇద్దరు పిల్లలు.. మూడేళ్ళ క్రితం వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు..వీడి చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసాడు..మాటల్లో రెండు మూడు రకాల వ్యాపారాలు చెప్పాడు..కొద్దిగా పెట్టుబడి పెడితే..ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు..మా తమ్ముడు ఆశ పడ్డాడు..సరే అన్నాడు..ఆ స్నేహితుడి మాటలు నమ్మి..ఏ కాగితాలూ లేకుండా కొంత డబ్బు ఇచ్చాడు..ముందు కొద్దిగా పెట్టుబడి చాలు అని చెప్పిన ఆ స్నేహితుడు..వీడి నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు..తీరా వీడు ఇక్కడికి వచ్చి విచారిస్తే..మోసపోయానని తెలుసుకున్నాడు..ఆ స్నేహితుడి వద్ద కొన్ని భూముల తాలూకు పత్రాలు తప్ప మరేమీ లేవు..ఆ భూముల కాగితాలు వీడి చేతిలో పెట్టి..ఇంతకంటే ఏమీ చేయలేను..అని తేల్చి చెప్పాడు..అవి ఎవరూ కొనే భూములు కూడా కాదు..మావాడు బాగా దిగులు పడ్డాడు..అప్పుడు నేనే సలహా ఇచ్చాను.."నాయనా మనం ఒకసారి మొగిలిచెర్ల వెళ్లి ఆ దత్తాత్రేయుడి ని శరణు వేడదాము..ఏదో ఒక దారి చూపిస్తాడు..నువ్వు దిగులుపడకు..నీ కష్టార్జితం అయితే ఎక్కడికీ పోదు.." అని చెప్పాను..వీళ్లిద్దరి తరఫున నేనే ఇక్కడికి వచ్చాను..మొత్తం పదకొండు ఆదివారాలపాటు ఒక నియమం అనుకోని ..ప్రతి ఆదివారం ఈ స్వామివద్దకు సాధారణ భక్తులతో పాటు వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని..వీళ్ల గురించి ప్రార్ధించి వెళ్ళాను..స్వామివారు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు అని నా మనసుకు తోచింది..అందుకు తగ్గట్టుగానే..పోయిన నెలలో ఈ అవధూతకు మామీద దయ కలిగింది..అనుకోకుండా వీడి వద్ద ఉన్న భూముల కు రేటు వచ్చింది..అగ్రిమెంట్ అయింది..కొంత డబ్బూ చేతికి వచ్చింది..అందుకే ఈరోజు అన్నదానం చేయిస్తానని మొక్కుకొని..వీళ్ళిద్దరినీ పిలిపించాను..ఈరోజు మంగళవారం అయినా..ఈరోజే అన్నదానం చేయడానికి కారణం ఉంది..ఈరోజు వీడి పుట్టినరోజు..స్వామివారి దయవల్ల మా తమ్ముడు నిరాశ లోంచి బయటపడ్డాడు.." అని చెప్పారు..


నాగమణి గారు పదకొండు ఆదివారాలు.. స్వామివారి మందిరానికి వచ్చి వెళ్లిన విషయం మేమెన్నడూ గమనించలేదు..


ఆరోజు అన్నదానానికి బోర్డ్ మీద తమ పేర్లు ఏవీ రాయవద్దని నాగమణి గారు కోరారు..స్వామిచూపిన కరుణ తమ మీద ఎల్లకాలమూ ఉంటే చాలని..తమ పేర్లు ప్రచారం చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు..అందరూ ఆరోజు అర్చన చేయించుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం నాగమణి గారు తిరిగి వెళ్లిపోయేముందు నా వద్దకు వచ్చి.."స్వామివారు కరుణించబట్టి మావాడికి తన సొమ్ము లభించింది..ఈ క్షేత్రం అభివృద్ధికి సహాయం చేయమని సలహా ఇచ్చాను..నలుగురికి ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా నాకు తెలియచేయండి..తప్పకుండా మా వంతు సహకారం మేము అందిస్తాము.." అన్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఫాల్గుణ మాసం

 ఫాల్గుణ మాసం


🍁🍁🍁🍁🍁



ఫాల్గుణం ..విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం.



ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం


ఫాల్గుణ శుద్ధ పాడ్యమి

 నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. 


అదితి పయోవ్రతం ఆచరించి వామనుణ్ణి పుత్రుడు గా పొందింది.



ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నుండీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.


ఫాల్గుణ శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు. 



ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 


ఫాల్గుణ శుద్ధ నవమి నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.


*అమలక ఏకాదశి :-* ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని ఆమలక ఏకాదశి అంటారు. ...


.

 ఫాల్గుణ శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి, నృసింహ ద్వాదశి అంటారు. ఈ నాడు గంగాస్నానం పవిత్రం. 


 ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మహా పూర్ణిమ, హోళికా పూర్ణిమ, డోలా పూర్ణిమ, కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు.


ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు.


ఫాల్గుణ బహుళ విదియనాడు లక్ష్మీదేవి పాలకడలి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆరోజు కనకధారా స్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది.


ఫాల్గుణ బహుళాష్టమి

రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేకమంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు.


ఫాల్గుణ బహుళ అమావాస్య

 రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృ దేవతలకి తర్పణాలు ఇస్తారు.


ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. 



ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. 


ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరచుకున్న ఫాల్గుణ మాసంలో, భక్తితత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమవుదాం🙏


🌸జై శ్రీమన్నారాయణ🌸


🍁🍁🍁🍁


సేకరణ