12, ఫిబ్రవరి 2022, శనివారం

స్నేహితుడు

 Hyderabad లో సెటిల్ అయిన రిటైర్డ్ ఆఫీసర్ రాజారావు కి ఆరోగ్యం బాగో లేదని హాస్పిటల్ కి తీసుకెళితే, ఆ డాక్టర్ మెడికల్ షాప్ లో దొరకని *friendship* అనే మందు రాశాడు. 

అది చూసి ఆయన పిల్లలు అవాక్కయితే 

డాక్టర్ చెప్పాడు - మీ నాన్న గారు రిటైర్ అయ్యాక, మీరందరూ ఆయన్ని మీ ఇంటికి పెదరాయుడుని చేసేసి నోటికి ప్లాస్టరు వేసేసారు. 


ప్రతీ మనిషిలో ఓ కోతి ఉంటుంది.  

దాని పేరే *"స్నేహితుడు."*

దాన్ని కట్టెస్తే 

కంటి మీద కునుకూ,  

మోహం మీద నవ్వూ, 

కడుపుకు ఆకలి,  

కాళ్లకు నీరసం 

లాంటి అన్ని రోగాలు వస్తాయి అని హిత బోధ చేశాడు అందరికీ.


వాళ్ల అబ్బాయిలు ఆయన చదివిన స్కూల్, కాలేజీ వివరాలతో Facebook లో Account ఓపెన్ చేశారు. 


దాంతో ఆయన ఇప్పుడు ఫోన్లో బిజీ బిజీ, యెప్పుడూ ముసి ముసి నవ్వులు, నెలకోసారి వంకపెట్టి వూరెళ్లి స్నేహితులతో సిట్టింగ్ లు.

 

ఇంకా ఆయన కి డాక్టర్ అవసరం రాలేదు ఎప్పటికీని.

ఆ ఇంట్లో వాళ్లకి ఈయన తో ఏ టెన్షనూ లేదు.


అందుకే అన్నారు 

 *న మిత్రం న సౌఖ్యం..!!*


అవును 👌👌ఇది నిజం నేను అనుసరిస్తున్నా, నాకు హైస్కూల్, ఇంటర్, డిగ్రీ, PG, ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్ ఇలా స్నేహితులతో 10 గ్రూప్ లు వున్నాయి, వారితో 2 నెలల కు ఒకసారైనా ఫోన్, watsapp గ్రూప్ కాల్, పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరితో సంతోషంగా వారివారి వయసుతో పరిచయాన్ని బట్టి కబుర్లు, యంత హ్యాపీ, ఎంత హాయిగా ఉంటుందో,.అది అనుభవిస్తే ఆ హాయే వేరు . 🙏🙏🙏

వారందరికి భోజనం చేసి పెడతాము

 ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి.


మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.

 

  దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు

  సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. 


అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.

మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.


అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,

నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.

 అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం

 అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.


50 లక్షల మందికి భోజనాలు వండాలంటే  

 భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం

 భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.


నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న  సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా 

వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.


రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది.

అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా 

వండేవాడు నరేశుడు.

ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.

 ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా

 మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.

 అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?

 ఈ రోజు  ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..


ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.


అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.

అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.

 అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.

  ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.

  ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా

  కారణం అని నరేషుడుని అడుగుతారు. 

అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు...


శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.

శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని...

 శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే

 శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.

  దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.

  ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.

  ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.

ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

*భీముని ఏకాదశివ్రతము

 _*మాఘమాసం*_

      🚩 _*శనివారం*_🚩

_*ఫిబ్రవరి 12వ తేది 2022*_


  _*🍁మాఘ పురాణం🍁*_ 

🌴 _*11 వ అధ్యాయము*_🌴


🕉🍁🌷🍁🍁🌷🍁🕉️


*భీముని ఏకాదశివ్రతము*


☘☘☘☘☘☘☘☘


సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని , నదిలేనిచోట తటాకమందుగాని , తటాకము కూడా అందుబాటులో లేనియెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునానదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు , తపశ్శాలురు , దానధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.


అతడు చిన్నతనములో గడుసరి , పెంకివాడు , అతడు తల్లితండ్రుల భయభక్తులవలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను , తనకున్న ధనమును తాను తినడు , ఇతరులకు పెట్టడు , ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. *"అయ్యో ! నేనెంతటి పాత్ముడనైతిని ధనము , శరీరబలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా"* అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా ! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ , బంగారమూ యెత్తుకొని పోయిరి.


అనంతుడు నిద్రనుండి లేచి చూడగా , అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలనీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసిపోవుచూ *'నారాయణా'* అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను , అని వశిష్టుడు తెలియజేసెను.


పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు , భోజనప్రియుడు , ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతోయుండెను. అదేమందువా ! *"ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా ! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా ! అని విచారించి , తన పురోహితుని కడకు బోయి , ఓయీ పురోహితుడా అన్ని దినములకంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి"* , అని భీముడు అడిగెను.


అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు *"అవును భీమసేనా ! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక , అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును"* అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని , *"విప్రోత్తమా ! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగధ్విదితమే గదా ! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను , కనుక , ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున , ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము"* , అని భీముడు పలికెను.


భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి *"రాజా ! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనేకార్యము చేసినను కష్టము కనిపించదు , కాన , నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది , దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశిరోజు పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు ఇరువదినాలుగు ఏకాదశులలో మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన , ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన , ఓ భీమ సేనా ! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము , దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు , నియమము తప్పకూడదు"* అని వివరించెను.


ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని *"భీమ ఏకాదశి"* అని పిలుతురు. అంతియేగాక , ఓ దిలీప మహారాజా ! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజుతో నిటులపలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో , అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా , శివచతుర్దశి. దీనినే *'శివరాత్రీ యని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే "మహాశివరాత్రి"* అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలోగాని , తటాకమందుగాని లేక నూతివద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి , అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ , అవన్నియు వెంటనే హరించిపోయి , కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక , అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయును.


మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు బోవుట , జంతువులను చంపి , వానిని కాల్చి , తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూరమృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి , అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దుకృంగిపోయినన అక్కడున్న మారేడుచెట్టుపైకెక్కి జంతువులకొరకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచుకురుస్తున్నందున కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ , పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట , తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.


జరామరణములకు హెచ్చుతగ్గులుగాని , శిశువృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే , మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు - పార్వతి , గణపతి , కుమారస్వామి , తుంబుర , నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి , ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు , *"మహేశా ! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శనకారణమేమనగా , ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి , క్రూరుడు , దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒకదినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని , చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా"* అని యముడు విన్నవించుకున్నాడు. *"యమధర్మరాజా ! నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండిలేక జాగరణతోనున్న ఈ బోయవాడుకూడా పాప ముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక , ఈ బోయవాడు పాపాత్ముడైనను , ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది"* అని పరమేశ్వరుదు వివరించెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

ఆణిముత్యాలు

 ఆణిముత్యాలు. 


🌀 జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు.


🌀 ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానంతెలియదు.


🌀 నీగురించి నీవు ఎక్కువ మాట్లాడు తున్నావ్ అంటే నీకు ౼ నేను అన్నది పోలేదన్నమాట... 


🌀 జ్ఞానమున్న వారితో  వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది కాని అజ్ఞానునితో వాదించకు  నీ విజ్ఞతను కోల్పోతావు...


🌀 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు.... 

అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది...


🌀 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్లమే,  కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..


🌀 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు..


🌀 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు,  అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది.. 


🌀 మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు, _అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది._,

_ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు,  ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...


🌀 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు...


🌀 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం, 

_ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం.._


🌀 మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...?  వారిస్థానం ఎప్పుడు మన వెనుకే...


🌀అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది..అలాగే అన్నీ అనారోగ్యసమస్యలు వేగంగా తగ్గిపోవాలని వాడే మందుల వల్ల వచ్చే ప్రమాదాలే సైడ్ ఎఫెక్ట్స్.


సేకరణ..👏

మన విద్యావేత్తలు

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

ఇందాక అలా పనుండి పాట్నా లో ఉన్న వేదపాఠశాల కాంపౌండ్ లో ఉన్న SBI కి వెళ్లాను. లింకు ఫెయిల్ అవడంతో అలా బయటపడి వేదం వల్లె వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని *ఎందుకండీ ఇలా బట్టి వేయిస్తున్నారు, చేతికి పుస్తకం ఇస్తే చూసి జాగ్రత్తగా చదువుతారు కదా* అని అడిగా..


దానికి ఆయనిచ్చిన సమాధానం..


"నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన మహమ్మదీయ రాజు కాలంలో కాల్చివేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళీ ఆ వేదం విద్యను గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రూరంగా హింసించి చంపేయ్యడం జరిగింది!

ఇది ముందే గమనించిన  *మన విద్యావేత్తలు  వేదాన్ని ఆనాటినుండే కంఠస్తం చెయ్యడం అలాగే మరికొంత మందికి కంఠోపాఠం గా నేర్పడం మొదలు పెట్టారు - అలా చాలా వరకు వేదాధ్యయనం ముఖత గానే కొనసాగింది అందువల్లే వేదాన్ని కంఠస్థం చెయ్యడం అలవాటుగా మారింది*

4 వేదాలు నోటికి వచ్చిన వాడిని చతుర్వేది అని

3 వేదాలు వచ్చినవాడిని త్రివేది అని

2 వేదాలు వచ్చిన వాడిని ద్వివేది అని

1 వేదం నేర్చినవాడిని ఉపాధ్యాయ అని

శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి అని

మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని మిశ్రా అని

శాస్త్రీయ కర్మ విధి విధానాలను నేర్చిన వాడిని శర్మ అని ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది!"

*మరి.. ఇప్పుడు రాయచ్చు కదండీ..ఇప్పుడు మనం స్వతంత్రులం కదా?* అన్నాను.


ఆయన నవ్వేసి.. *ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని? గత 70 ఏళ్లుగా గమనిస్తున్నాను.. ఒక్కడంటే ఒక్క  మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మీద దృష్టి పెట్టనేలేదు! - ఇప్పటికీ మనం బానిస రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే ఇతర మత గ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం లేదా ఇతరులకు ఇంకా భయపడుతూనే ఉన్నాం!* అన్నారు.


ఆయన మాటల్లో నిజం ఉందనిపించింది నాకు! మీరేమంటారు?


*(ఈ టపా..జాతీయ వాదుల సమాలోచన అనే గ్రూపు నుండి సేకరించింది)*

*హనుమంతు వెంకట రమణ మూర్తి* 

*టెక్కలి, విశాఖపట్నం* *(బతుకు తెరువు కోసం)*

అష్టస్థాన పరీక్ష

 అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 6 . 


  మూత్రపరీక్షా విధానము - 


     మూత్రపరీక్ష చేయవలసిన రోగిని 4 ఘడియల   తెల్లవారుజామున నిద్రనుంచి మేల్కొలిపి మూత్రము మొదటి ధార ( మొదట కొంత వదిలి) తరవాతి ధార నిర్మలమగు తెల్లని పాత్ర యందు కాని కుండపెంకు నందు గాని విడుచునట్లు చేసి దానిని సూర్యరశ్మి యందు ఉంచి గడ్డిపోచతో బాగుగా కలియబెట్టి దాని యందు తైలము చుక్కలుచుక్కలుగా వేసి దాని మార్పులను బట్టి దోష వ్యాధి బేధములను తెలుసుకొనవలెను . 


                   ఆరోగ్యవంతునకు మూత్రము లఘువుగాను తెల్లగా ఉండును . పిత్త ప్రకృతి గలవానికి పసుపుపచ్చగా వేడిగా ఉండును . శ్లేష్మప్రకృతి గలవానికి నూనె వలే ఉండును . వాత శ్లేష్మ కలగలసిన వాని మూత్రము చిక్కగా , తెల్లగాను , రక్తవాత  ప్రకృతి కలవానికి కుసుంబా పుష్పము వలే మూత్రము ఉండును . 


           వ్యాధి లక్షణము లేవియు లేక కేవలము మూత్రము చెడుగా కనపడినచో రోగమున్నట్లు నిర్ధారణ చేయకూడదు . అనగా ఇతర వ్యాధి లక్షణములు ఉన్నప్పుడే మూత్రము చెడిపోయినచో రోగము ఉన్నదని నిర్ధారణ చేసుకొనవలెను . 


  వాత దుష్ట మూత్రము - 


      వాతదోషము వలన చెడిపోయిన మూత్రము నూనె వలె మకమకలాడుచుండును . నలుపు పసుపు కలిసిన కొంచము నల్లని వర్ణము కలదిగా కాని కొంచము ఎర్రగా గాని ఉండును . ఇట్టి మూత్రము పైన ఒక నూనె చుక్కను వేసిన ఆమూత్రము యొక్క పైభాగము అంతటను వ్యాపించి వెంటనే చిన్నచిన్న నూనె కణములు పైన కలిగిన చిన్నచిన్న బుడగలుగా బయలుదేరును . అట్టి దానిని వాత దుష్ట మూత్రముగా తెలుసుకొనవలెను . 


        మరియు మూత్రము నందు తైలబిందువులు మండలాకారముగా మార్పు చెందిన వాతరోగము అని గుర్తించవలెను . కొందరు వాతరోగుల మూత్రము ఘృతము ( నెయ్యి) వలే ఉండును . 


  పిత్త దుష్ట మూత్రము - 


       పిత్త దోషము చేత చెడిన మూత్రము ఎర్రగా ఉండును . దాని పైన నూనె చుక్క వేసినచో బుడగలు పుట్టును . పిత్తవ్యాది నందు మూత్రము నందు తైలము వేసినచో బుద్బుదాకారము చెందును . పిత్తరోగి మూత్రము నురుగులతో కూడి ఉండి పులికడుగు రంగుననైన లేక మాదిఫల రస ( కాఫీ రంగు ) రంగు కలిగి ఉండును . 


  శ్లేష్మ దుష్ట మూత్రము - 


      శ్లేష్మ దోషము వలన చెడిన మూత్రము నురుగులతో కూడుకుని ఉండును . చిన్నచిన్న గుంటలలో ఉండు బురద నీటివలె ఉండును . చిన్నచిన్న బిందువుల ఆకారము దాల్చును . శ్లేష్మరోగి మూత్రము శీతలముగా ఉండును . 


       అపక్వ పిత్తదోషము వలన చెడిన మూత్రము తెల్ల ఆవనూనె వలె ఉండును . 


    వాతపిత్తములచే దూషితమైన మూత్రము పైన నూనె చుక్క వేసినచో కొంచము నల్లని రంగుగల బుడగ తేలును . 


       వాతాశ్లేష్మములచే దూషితమైన మూత్రము నందు నూనె వేసినచో మూత్రము వెంటనే నూనెతో కలిసిపోయి పులిసిన బియ్యపు గంజి వలె అగును . 


          పిత్తశ్లేష్మము వలన దూషితమైన మూత్రము నందు నూనె వేసినచో మూత్రము వెంటనే నూనెతో కలిసిపోయి పులిసిన బియ్యపు గంజి వలె అగును . 


   పిత్తశ్లేష్మముల రెండింటివలన దూషితమైన మూత్రము బూడిద రంగు కలిగి ఉండును . 3 దోషములు ప్రకోపించిన యెడల మూత్రము ఎర్రగా గాని నల్లగా గాని ఉండును . అందు పిత్తము మిగిలిన రెండింటి కంటె ఎక్కువ ప్రకోపించిన పైభాగము పచ్చగాను కింది భాగము ఎర్రగా కనిపించును . 


       జ్వరము నందు రసము శేషించినచో మూత్రము పాలవలె ఉండును . పక్వ జ్వరము నందు మేకమూత్రము వలె ఉండును . క్షయ యందు మూత్రము నల్లగా ఉండును . క్షయరోగి మూత్రము నందు నూనె బొట్టు వేసినచో చేప , మేడ , వింజామరం , ఏనుగు , గొడుగు , తోరణముల ఆకారము కనిపించినచో వ్యాధి నయం చేయవచ్చు . తీగె , మద్దెల , మనిషి , చక్రము , సింహము వలే నూనె వికసించిన ఆ రోగము కష్టసాధ్యము . తలలేని మనిషి ఆకారము , స్తంభాకారముగా నైనను కనిపించిన రోగి మృతిచెందును . 


       అతిసార రోగము నందు రోగి యొక్క ముత్ర అడుగు భాగము రక్తవర్ణముగా ఉండును . జలోదరము నందు నేతి కణము వలె ఉండును . ఆమవాతము నందు మూత్రము వస లేక మజ్జిగ వలె ఉండును . వాత జ్వరం నందు కుంకుమ వలె ఎర్రగాను లేక ఎరుపు పసుపు కలిసిన వర్ణముగాను లేక మలినముతో కూడిన పీతవర్ణముగాను అధికంగా వెడలును . పిత్త జ్వరం నందు పసుపు వర్ణముగా స్వచ్ఛముగా ఉండును . సమధాతువు నందు కూప జలము వలె ఉండును . సన్నిపాత జ్వరం నందు కృష్ణవర్ణము ( నల్లని ) కలిగి ఉండును . జ్వరము ఆరంభమయ్యే దశలో రక్తవర్ణము లేక ధూమ్ర వర్ణముగా ఉండును . దీర్ఘరోగము నందు రక్తవర్ణముగా ఉండును . మూత్రము నల్లని రంగులో ఉండిన మరణము చెందును . ప్రమేహరోగము నందు కూడా మూత్రము రక్తవర్ణములో ఉండును . 


  దీర్ఘాయుష్మంతుని ముత్ర లక్షణము - 


      మూత్రము నందు వేసిన తైలబిందువు హంస , కన్నె లేడి , పూర్ణతటాకము , కమలం , ఫలములు , సంపూర్ణ శరీరము , చక్రము , తోరణముల ఆకారంగా కనపడిన దీర్ఘాయుష్షు కలిగినవాడగును . 



                     *   సమాప్తం  * 


    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

అక్షరమాల స్తుతి*

*గురు అక్షరమాల స్తుతి*

*అ - అద్వైతమూర్తి - గురువు*
*ఆ - ఆనందస్ఫూర్తి - గురువు*
*ఇ - ఇలదైవం - గురువు*
*ఈ - ఈశ్వరరూపము - గురువు*
*ఉ - ఉద్ధరించువాడు - గురువు*
*ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు*
*ఋ - ఋజువర్తనుడు - గురువు*
*ౠ - ఋణము లేనివాడు - గురువు*
*ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు*
*ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు*
*ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు*
*ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు*
*ఓ - ఓంకార రూపము - గురువు*
*ఔ - ఔదార్య మేరువు - గురువు*
*అం - అందరూ సేవించేది - గురువు*
*అః - అహంకార రహితుడు - గురువు*
*క - కళంకము లేనివాడు - గురువు*
*ఖ - ఖండరహితుడు - గురువు*
*గ - గుణాతీతుడు - గురువు*
*ఘ - ఘనస్వరూపము - గురువు*
*ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు*
*చ - చక్రవర్తి - గురువు*
*ఛ - ఛత్రము వంటి వాడు - గురువు*
*జ - జనన మరణములు లేని వాడు - గురువు*
*ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు*
*ఞ - జ్ఞానస్వరూపము - గురువు*
*ట - నిష్కపటుడు - గురువు*
*ఠ - నిష్ఠకలవాడు - గురువు*
*డ - డంబము లేనివాడు - గురువు*
*ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు*
*ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు*
*త - తత్త్వోపదేశికుడు - గురువు*
*థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు*
*ద - దయాస్వరూపము - గురువు*
*ధ - దండించి బోధించువాడు - గురువు*
*న - నవికారుడు - గురువు*
*ప - పంచేంద్రియాతీతుడు - గురువు*
*ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు*
*బ - బంధము లేనివాడు - గురువు*
*భ - భయరహితుడు - గురువు*
*మ - మహావాక్యబోధకుడు - గురువు*
*య - యమము కలవాడు - గురువు*
*ర - రాగద్వేష రహితుడు - గురువు*
*ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు*
*వ - వశీకరణశక్తి కలవాడు - గురువు*
*శ - శమము కలవాడు - గురువు*
*ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు*
*స - సహనశీలి - గురువు*
*హ - హరిహర రూపుడు - గురువు*
*ళ - నిష్కళంకుడు - గురువు*
*క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు*
*ఱ-ఎఱుకతో ఉన్నవాడు - గురువు* గురువులుఅందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏

ముమ్మారు "రామ" నామమును

 శ్లోకం:☝️భీష్మ ఏకాదశి

*శ్రీ రామ రామ రామేతి*

    *రమే రామే మనోరమే l*

*సహస్రనామ తత్తుల్యమ్*

    *రామనామ వరాననే ll*


భావం: భీష్ముని ద్వారా లభించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణ చేయలేనివారు... ముమ్మారు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.🙏

భీష్మ ఏకాదశి

 భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు... మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.


అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.


సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.


తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.


అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.


కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు.


ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.


భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.


కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.


నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.


భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వస ారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది జై శ్రీ మన్నారాయణ🙏