ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, నవంబర్ 2023, మంగళవారం
ఉద్ధవగీత
ఉద్ధవగీత
శ్లో)కర్తుశ్చ సా రథేర్హేతోరనుమోదితు రేవ చ |
కర్మణాం భాగినః ప్రేత్య భూయో భూయసితత్ఫలం||
అ)ఆపహరించువానికి గలుగు ఫలము, వానికి సహాయము చేయువానికి, వానిని ప్రేరేపించువానికి, ఆమోదించువానికి మరణానంతరము లభించును. ఈ కార్యములయందు వారి భాగ మధికముగ నున్న ఫలము గూడ అధిక ముగనే యుండును
హనుమంతుని_జననం_బాల్యం
#హనుమంతుని_జననం_బాల్యం.
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాల్లో కెల్లా శ్రేష్టమయినది. శంబసాధనుడనే ఒక రాక్షసుడుయజ్ఞయాగాలుకు భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు. దేవ ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి శంబసాధనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు. మునులకోరికపై శంబసాధనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడువాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తనవజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
నోక్టూరియా
*నోక్టూరియా*
నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు.
శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా వాస్తవానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. నిద్రకు భంగం వాటిల్లుతుందనే భయంతో పెద్దలు రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడానికి దూరంగా ఉంటారు. నీళ్లు తాగితే మూత్ర విసర్జనకు మళ్లీ మళ్లీ లేవాల్సి వస్తుందని అనుకుంటారు. పెద్దలు మరియు వృద్ధులలో తరచుగా తెల్లవారుజామున గుండెపోటు లేదా స్ట్రోక్‌లు రావడానికి పడుకునే ముందు లేదా రాత్రి మూత్ర విసర్జన తర్వాత నీరు త్రాగకపోవడం ఒక ముఖ్యమైన కారణం అని వారికి తెలియదు. నిజానికి, నోక్టురియా అంటే తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేది మూత్రాశయం పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు. వయస్సుతో పాటు వృద్ధులలో గుండె పనితీరు తగ్గిపోవడమే దీనికి కారణం, ఎందుకంటే గుండె శరీరం యొక్క దిగువ భాగం నుండి రక్తాన్ని పీల్చుకోలేకపోతుంది.
అటువంటి పరిస్థితిలో, పగటిపూట మనం నిలబడి ఉన్న స్థితిలో, రక్త ప్రవాహం మరింత క్రిందికి ఉంటుంది. గుండె బలహీనంగా ఉంటే, గుండెలోని రక్తం తగినంతగా ఉండదు మరియు శరీరం యొక్క దిగువ భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే పెద్దలు మరియు వృద్ధులు పగటిపూట శరీరం యొక్క దిగువ భాగంలో వాపు పొందుతారు. వారు రాత్రి పడుకున్నప్పుడు, శరీరం యొక్క దిగువ భాగం ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది మరియు తద్వారా చాలా నీరు కణజాలాలలో నిల్వ చేయబడుతుంది. ఈ నీరు తిరిగి రక్తంలోకి వస్తుంది. ఎక్కువ నీరు ఉంటే, నీటిని వేరు చేయడానికి మరియు మూత్రాశయం నుండి బయటకు నెట్టడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాలి. నోక్టురియా యొక్క ప్రధాన కారణాలలో ఇది ఒకటి.
కాబట్టి మీరు పడుకున్నప్పుడు మరియు మీరు మొదటిసారి టాయిలెట్‌కి వెళ్లడానికి సాధారణంగా మూడు లేదా నాలుగు గంటలు పడుతుంది. ఆ తర్వాత, రక్తంలో నీటి పరిమాణం మళ్లీ పెరగడం ప్రారంభించినప్పుడు, మూడు గంటల తర్వాత మళ్లీ టాయిలెట్కు వెళ్లాలి.
మెదడు స్ట్రోక్ లేదా గుండెపోటుకు ఇది ఎందుకు ముఖ్యమైన కారణం అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది?
రెండు మూడు సార్లు మూత్ర విసర్జన చేసిన తర్వాత రక్తంలో నీరు చాలా తక్కువగా ఉంటుందని సమాధానం. శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు కూడా తగ్గిపోతుంది. దీనివల్ల రక్తం మందంగా మరియు జిగటగా మారుతుంది మరియు నిద్రలో హృదయ స్పందన మందగిస్తుంది. మందపాటి రక్తం మరియు నెమ్మదిగా రక్త ప్రసరణ కారణంగా, ఇరుకైన రక్తనాళాలు సులభంగా నిరోధించబడతాయి...
పెద్దలు మరియు వృద్ధులు ఎల్లప్పుడూ ఉదయం 5-6 గంటల సమయంలో గుండెపోటు లేదా పక్షవాతంతో బాధపడుతున్నారని గుర్తించడానికి ఇదే కారణం. ఈ స్థితిలో వారు నిద్రలోనే చనిపోతారు.
నోక్టురియా అనేది మూత్రాశయం పనిచేయకపోవడం కాదు, వృద్ధాప్య సమస్య అని అందరికీ చెప్పాల్సిన మొదటి విషయం.
అందరికీ చెప్పాల్సిన మరో విషయం ఏమిటంటే పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లు తాగాలి, రాత్రి మూత్ర విసర్జనకు లేచిన తర్వాత మళ్లీ తాగాలి.
నోక్టురియాకు భయపడవద్దు. పుష్కలంగా నీరు త్రాగండి, ఎందుకంటే నీరు త్రాగకపోవడం మిమ్మల్ని చంపుతుంది.
మూడవ విషయం ఏమిటంటే, గుండె యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, మీరు సాధారణ సమయంలో ఎక్కువ వ్యాయామం చేయాలి. మానవ శరీరం అతిగా వాడితే పాడైపోయే యంత్రం కాదు, దానికి విరుద్ధంగా, ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత బలంగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని, ముఖ్యంగా అధిక పిండి పదార్ధాలు మరియు వేయించిన ఆహారాన్ని తినవద్దు.
ఈ కథనాన్ని మీ పెద్దలు మరియు వృద్ధులతో పంచుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
సీనియర్ సిటిజన్లకు చాలా ముఖ్యం.
ఇది ఆరోగ్య సమస్య గురించి.. *నోక్టూరియా* గురించి డా.బన్సల్ రాసిన ఆసక్తికరమైన మరియు సమాచార కథనం.
ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించినది కాబట్టి, దయచేసి దీనిని విస్మరించవద్దు. దీన్ని చదవండి మరియు అవసరమైన వ్యక్తులతో భాగస్వామ్యం చేయండి!
మన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన ఉండటం మంచిదే. అయితే చదువంటే ఇంజనీరింగ్ ఒక్కటేనా? 'ఇంజనీర్ అవ్వాలి. అమెరికా పోవాలి' ఇదే ధ్యాస కనపడుతోంది.
ఈ మధ్య CA కూడా తయారయింది.
మన తెలుగు రాష్ట్రాలనుండి సివిల్స్ కు వెళ్ళేవారి సంఖ్య, అందులో నెగ్గుకొచ్చేవారి సంఖ్య, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మనకు వచ్చే ఐఏయస్, ఐపియస్ అధికారులలో త్రిపాఠీలు, మిశ్రాలు, మీనాలు ఎక్కువ.
దీనికి కారణం ముఖ్యంగా ప్రైవేటు కళాశాలల మార్కెటింగ్. గుంటూరులో చూస్తుంటాను, దాదాపు 75,000 నుండి 80,000 మంది CA కోచింగ్ కోసం వస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలోనే పాస్ పర్సంటేజ్ 2%. CA కోర్సు పూర్తి చేసి, సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని నిలదొక్కుకునే సరికి 30-35 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. ఐతే అందులోకి వెళ్ళవద్దని చెప్పడం లేదు.
సివిల్స్ అనగానే మనకు కనపడేవి రెండే. ఐఏయస్, ఐపియస్.
నేను ఎవరికైనా సివిల్స్ చెయ్యమని చెబితే 'అమ్మో, చాలా కష్టం' అనే మాట వినపడుతుంది.
CA కష్టం కాదా? ఇంజనీరింగ్ కష్టం కాదా? మెడిసిన్ కష్టం కాదా? 'లా' కష్టం కాదా?
ఇష్టంగా చదివితే కష్టమైనా ఇష్టమవుతుంది. సివిల్స్ గురించి, 'లా' గురించి సరైన అవగాహన లేకపోవడం అసలు కారణం అనిపిస్తుంది.
'లా' గురించి మరొకసారి చెప్పుకుందాం. సివిల్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయనేది చూద్దాం.
సివిల్స్ లో మొత్తం 24 సర్వీసులు ఉన్నాయి.
వీటిలో మూడు ఆల్ ఇండియా సర్వీసెస్.
01. Indian Administrative Service (IAS)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలను అమలు చేసే బాధ్యత వీరిదే. అత్యంత ప్రతిష్టాత్మకమైన, బాధ్యతగల ఉద్యోగం. రాష్ట్రంలో ఛీఫ్ సెక్రటరీ, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది.
02. Indian Police Service (IPS)
జిల్లా ఎస్పీ స్థాయినుండి CBI, IB, CRPF, BSF, CISF, RAF వంటి వాటికి డైరక్టర్, డైరక్టర్ జనరల్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.
03. Indian Forest Service (IFS)
రాష్ట్రంలోను, కేంద్రంలోను ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ స్థాయి దాకా వెళ్ళే అవకాశం ఉన్నది.
గ్రూప్ A సివిల్ సర్వీసెస్ ....
01. Indian Foreign Service (IFS)
వివిధ దేశాలలో హై కమీషనర్, ఛార్జ్ డీ అఫైర్స్, రాయబారులు, ఐక్యరాజ్యసమితి, కేంద్రంలో విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి స్థాయికి చేరుకోగలరు.
02. Indian Audit and Accounts Service (IAAS)
వివిధ ప్రభుత్వ శాఖల, సంస్థలను ఆడిట్ చేసేందుకు నియోగించబడతారు. వీళ్ళు కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ (CAG) క్రింద పని చేస్తారు.
03. Indian Civil Accounts Service (ICAS)
వీళ్ళు కూడా పైన చెప్పిన పనులే చేస్తారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఎకౌంటెంట్ జనరల్ క్రింద పని చేస్తారు.
04. Indian Corporate Law Service (ICLS)
కేంద్ర కార్పొరేట్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన లీగల్ విషయాలు చూస్తారు.
05. Indian Defence Accounts Service (IDAS)
రక్షణరంగంయొక్క ఎకౌంట్స్ తనిఖీ చేస్తారు,
06. Indian Defence Estates Service (IDES)
కంటోన్మెంట్స్, ఎయిర్ ఫోర్స్, నేవీలకు చెందిన భూములు, భవనాల నిర్వహణ.
07. Indian Information Service (IIS)
కేంద్ర సమాచార శాఖకు చెందినది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆలిండియా రేడియో, దూర్ దర్శన్ లలో పని చేస్తారు.
08. Indian Ordinance Factories Services (IOFS)
ఆయుధ తయారీ పరిశ్రమలలో పని చేస్తారు. రక్షణశాఖకు చెందినది.
09. Indian Communication Finance Service (ICFS)
టెలీకామ్ రంగానికి చెందిన ఆర్థిక వ్యవహారాలు చూస్తారు.
10. Indian Postal Service (IPoS)
పోస్ట్ & టెలిగ్రాఫ్ శాఖకు చెందినది. పోస్ట్ మాస్టర్ జనరల్ స్థాయికి చేరగలరు.
11. Indian Railway Accounts Service (IRAS)
రైల్వేల ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించేది.
12. Indian Railway Personnel Service (IRPS)
రైల్వే ఉద్యోగుల నియామకంనుండి పదవీ విరమణ వరకు వీరి ఆధ్వర్యంలోనే నడుస్తుంది.
13. Indian Railway Traffic Service (IRTS)
దేశంలో రైళ్ళ నిర్వహణ బాధ్యత.
14. Indian Revenue Service (IRS)
లిస్టులో వెనుక ఉందని తక్కువ అంచనా వేయకండి. ఇన్కమ్ టాక్స్, కస్టమ్స్ & ఎక్సైజ్ శాఖలో ఆఫీసర్ స్థాయినుండి ఛీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, Central Bureau of Direct Taxes (CBDT), Central Board of Indirect Taxes (CBIT), GST Council వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ మధ్య మనం తరచుగా వింటున్న 'ఈడి' (Enforcement Directorate) ఈ కేడర్ నుండే వస్తారు.
15. Indian Trade Service (ITS)
వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. DGFT (Director General of Foreign Trade) స్థాయివరకు వెళ్ళేందుకు అవకాశం ఉంది.
16. Railway Protection Service (RPF)
రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యత. రైల్వేల ఆధీనంలో పని చేస్తుంది.
గ్రూప్ B సర్వీసెస్ ....
01. Armed Forces HQ Civil Service
త్రివిధ దళాల, పారా మిలిటరీ కేంద్ర కార్యాలయాలలో Non Combating సర్వీస్.
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
కాంతా! వెంటనే వెళ్ళు. ఆ దేవవైద్యులను నా మాటగా ఆహ్వానించు. ఇక్కడికి తీసుకురా.
ఇందులో ఆలోచించవలసింది ఏమీలేదు. వారు చెప్పినట్టు చెయ్యి - అని అనుమతించాడు చ్యవనుడు.
సుకన్య త్వరత్వరగా అశ్వినులను సమీపించింది. సూర్యపుత్రులారా! మీ షరతుకి అంగీ
కరిస్తున్నాను. రండి. మా ఆశ్రమానికి వచ్చి నా భర్తను మీతో సాటివచ్చేవాడుగా మార్చండి - అంది. ఆమెతో
అశ్వినులిద్దరూ చ్యవనమహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతడిని సమీపసరోవరానికి తీసుకురమ్మని తాము
ముందునడిచారు. సరోవరంలో దిగి స్నానం చెయ్యమన్నారు. చ్యవనుడు నీళ్ళల్లోకి దిగాడు. అతడి
వెనకగా అశ్విమలు దిగారు. ముగ్గురూ ఒక్కసారిగా మునిగారు. లేచేసరికి ముగ్గురూ సమానరూప
యౌవన సౌందర్యాలతో కనిపించారు మకన్యాదేవికి. తన కన్నులను తానే నమ్మలేకపోయింది. ఆనంద
బాష్పాలు కమ్ముకున్నాయి. బొమ్మలా నిలబడి చూస్తోంది.
వరవర్ణివీ! మా ముగ్గురిలో నీకు నచ్చిన భర్తమ వరించు. అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో
గుర్తించు - అన్నారు ముగ్గురూ కలిసి ఏకకంఠంతో.కంఠస్వరాలు కూడా ఒక్కలాగే ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది పెద్ద పరీక్ష అయ్యింది.
సంశయంలో పడింది. భర్తను గుర్తుపట్టలేక మథనపడింది. ఏమి చెయ్యను? ఈ దేవతలు ఇంద్రజాలం
కల్పించారు. ఇది నాకు మరణావస్థలాగా ఉంది. పొరపాటున అశ్వినులలో ఒకరిని వరించానంటే ఎంత
ప్రమాదం! ఎలాగ, ఎలాగ? - అనుకుంటోంది. ఎంతకీ తెమలలేదు. దారి దొరకలేదు. విశ్వేశ్వరిని
ధ్యానించింది. అమ్మా! నువ్వే దిక్కు. నా పాతివ్రత్యాన్ని కాపాడు. నీ పాదాలకు శిరసునువంచి మొక్కుతున్నాను.
నమః పద్మోద్భవే దేవి! నమః శంకరవల్లభే |
విష్ణుప్రియే నమో లక్ష్మీ ! వేదమాతః సరస్వతి
బ్రాహ్మీ మూర్తి! విశ్వనాధ!!
శ్రీ వాడపల్లి రామమోహనరావుగారు.సాహితి సౌజన్యంతో.
విశ్వనాథవారిని బ్రాహ్మీమూర్తి అని పండిత లోకం కీర్తించింది. ఈ బ్రాహ్మీమూర్తిమత్వం విశ్వనాథకు కేవలం సంస్కృతాంధ్ర సారస్వతాలలో ఆయనకున్న గొప్ప అభినివేశానికి సంబంధించినది మాత్రమే కాదు.ఆయనలోని ఆలోచనావిధానం పరిపక్వస్థితిని గాంచి రసాలూరుతూ పరిమళాలు వెదజల్లే, భావసమాహారంగా వెలువడిన ఆయన రచనలలో కనబడే తానెంచుకున్న వస్తువు యొక్క ఔన్నత్యం,భావౌన్నత్యం,భాషా ప్రౌఢిమ ఇవన్నీ కలిసిన ఒకానొక మేలుకలయికగా నిలచిన ఒక మహాతత్త్వం అనిపిస్తుంది. ఇంకా ఆలోచించి చూస్తే అది మాత్రమే కాదేమో అని మళ్ళీ! ఇదంతా ఆయన పూర్వజులనుంచి వచ్చిన మహాసంస్కార ఫలం. ఆయన గురువుల నుంచి నేర్చిన 'సదసద్వివేక చతురత.' తన తండ్రిగారు శోభనాద్రిస్వామి పిలిచి అబ్బాయీ!
"వ్రాసిన రామచంద్రు కధ వ్రాసితివం చనిపించుకో..."
అన్న తండ్రి యాజ్ఞ యును, జీవుని వేదన - ఈ రెండూ కలిసి ఆయనకు సారస్వతాభినివేశమూ,భావౌన్నత్యమూ ఇచ్చేయి. రామాయణ కల్పవృక్ష రచనకు పురికొల్పాయి సరే. కాని ఇక్కడ జీవుని వేదన అన్నది ఇంకా పరిశీలన చేయాల్సి ఉందేమో. ఈ జీవుని వేదన ఇంతటితో ఆగిందా!లేదనిపిస్తుంది. వేదవర్గీకరణ,అష్ఠాదశ పురాణాలు,మహాభారత రచన ఇన్ని చేసిన వ్యాస మహర్షికి జీవుని వేదన శాంతించలేదు. నారదుణ్ణి రప్పించుకుంది.నారదుని సలహా మీద శ్రీమద్భాగవత రచన చేసినప్పుడు గాని ఆయన జీవుడు శాంతించ లేదు. ఎన్నో చారిత్రక ఇతివృత్తాలను తీసుకుని వాటి ద్వారమున ఉజ్వల ప్రాచీనభారత చరిత్రకు సంబంధించిన వాస్తవాలు పురాణవైరగ్రంథమాల రూపంలో తెచ్చే బృహత్ప్రయత్నం చేశారు విశ్వనాథ. తన కిష్టమైన వైదిక జీవనవిధానానికి సంబంధించిన ఎన్నో ఇతివృత్తాలను చేపట్టి తత్త్వం,తర్కం అనే రెండు పంచకళ్యాణులను పూన్చిన తన రచనారధాన్ని నడిపారు.జీవితంలోని గహనమైన దుఃఖాలను తవ్వుకుని తవ్వుకుని రచనలు చేశారు. వీటివల్ల జీవుని వేదన పెరిగిందే గాని తరుగ లేదు. ఓ పక్క రామాయణ రచన సాగుతూనే ఉంది. మరో పక్క ఆ జీవుని వేదన పెరుగుతూనే ఉంది.
మొన్నటి వ్యాసంలో తన కావ్యానంద ప్రధమ ముద్రణ 1972 లో జరిగిందని వ్రాశాను. అంటే అప్పటికి కావ్యానందము రచన ప్రారంభించి సంవత్సరం పై మాటే. నిజానికి ఈ కావ్యవిమర్శనా రచనలు నాలుగు భాగాలు.
కావ్యానందము
కావ్యపరీమళము
సాహిత్య సురభి
సాహిత్యోపన్యాసములు.
ఈ నాలిగింటిలో కావ్యానందము మకుటాయమానమైన రచన. ఇతర రచనలన్నీ తన జీవితంలో ముందు సాగగా కావ్యానందము తన జీవుని వేదన పరాకాష్టనొందిన సమయానమ్మవారు తనలో చేరి రాయించినదనిపిస్తుంది.
ఆయన తన కల్పవృక్ష అవతారికలో నన్నయతిక్కనలు తనను ఆవేశించారని రాశారు.కాదేమో!
ఆయన వచనంలో కాని పద్యంలో కాని వాక్య విన్యాసం,పదాలను తన భావనలకనుగుణంగా సరిపోయేవి - అంటే తన భావనను యధాతధంగా దింపే పదాలను పొందుపరచి చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పేతీరు,ఆ భాష చూస్తుంటే - భాష మళ్ళీ గొప్ప గ్రాంధీకమో,వ్యాకరణపరిష్కృత శిష్టవ్యావహారికమో కూడా పూర్తిగా కాదు.చాలా మామూలు వ్యవహారశైలిలో ఉంటుంది. చెప్తున్నది ఆయన కాదేమో,ఆయన్ను ఆవేశించిన సరస్వతీదేవి చెప్తూంది అనిపిస్తుంది.ఇందులో ఏదో అతిశయోక్తిగా చెప్పాలన్న ఉద్దేశమేమీ లేదు. ఈ గ్రంథం, కావ్యానందం ఒక కథావస్తు సహితమైనది కాదు. కథాబలం వల్ల ఇష్టంగా చదవటానికి కావలసిన అంశాలిందులో లేనే లేవు.రాసిన ప్రతి వాక్యంలోనూ ఒక చంటిపిల్లవాణ్ణి కూర్చోపెట్టి అమ్మ ప్రేమ మీరగా చెప్పిన తీరు ద్యోతకమౌతుంది.కొన్ని కొన్ని వాక్యప్రయోగాలు ఆయనవి ఆనందం వల్లనా,దుఃఖం వల్లనా? ఎందుకు వస్తున్నాయి అన్నది తెలియనీయకుండా కన్నీళ్ళు తెప్పిస్తాయి.ఇది నిజం! ఆయన చేపట్టిన ఏ విషయాన్నైనా దాని మూలభావన నిరూపణకు ఆయన కొనసాగించే భావనాక్రమం,దానికోసం వాడే భాష - ఒకదానికోసం ఒకటి అన్నట్టు దర్శనం అవుతుంది. అది ఎంత ప్రేమాస్పదంగా ఉంది అనిపిస్తుంది.
నిన్నటి వ్యాసంలో ఆఖరి పేరాలో ఆయన మాటలు చూడండి.."రెండువందల యేండ్లనుండి....పరిమిత సంఖ్యాకులయందైనా దాని యచ్చత్వం అది నిలబెట్టుకొనుచునే యున్నది...ఈ కొత్తమార్పును కూడ తట్టుకొన గలదు. కాని దైవమనుకూలించక...😢 ఈ వాక్యాలలో సారస్వతం ఒకదేవతామూర్తిగా ఆవిర్భవించిన వైనం కనబడుతుంది.ఆ దేవత కన్నీళ్ళు కారుస్తున్నట్టు...
పోతనగారు. "కాటుక కంటినీరు చనుకట్టుపయిన్ బడ ఏల యేడ్చెదో..."అని ఓదారుస్తున్నప్పుడు శోకమూర్తియైన అమ్మవారు ఇక్కడ గోచరిస్తుంది. అక్కడ. "ఇమ్మనుజేశ్వరాధములకమ్మా" లని అనుకుంటున్నాడేమో అని ఆవిడ ఏడ్చింది.
ఇక్కడ నేరుగా తనను హత్య చేస్తారేమో అని ఏడుస్తూన్నట్టు అనిపిస్తుంది. ఐతే ఇక్కడ ఆవిడ దుఃఖ స్వరూపం వేరు. తను హత్యకు గురైతే తనను నమ్ముకున్న తన బిడ్డలగతేంటనే ఈవిడ దుఃఖం.నేను లేకపోతే మీరెలా బ్రతుకుతార్రా అబ్బాయీ! అన్న తల్లి వేదన. విశ్వ నాథవారి జీవుని వేదన పరాకాష్ట పొందినవేళ స్వయంగా అమ్మవారే వచ్చి తన జీవుని ఆవేశించి పలికించిన పలుకులు కావ్యానందం అనిపిస్తుంది. ఈ గ్రంథంలో ఆఖరు
వ్యాసం "స్వయంభువు" అన్న శీర్షికన వ్రాసినది. ఇది చాలా ఉత్కంఠ కలిగించే చర్చ. దీనిగురించి మరోసారి వ్రాస్తాను. కాని ఈ వ్యాసం చివర శ్లోకం చూస్తే జీవుని వేదన పరాకాష్ట పొందిన మీదట అమ్మవారు జోకొడితే పొందిన శాంతి వల్ల చిన్నపిల్లవాడి నోటినుంచి వచ్చే '...ఊఊఊ...'అనే శబ్దాలవంటిదనిపిస్తుంది.
"అర్చామీతి ధియా యదేవకుసుమం భిత్త్వాజనో ముచ్చతే
నధ్యామీతి.ధియా తదేవ వికిరన్ భస్మీకృతో మన్మథః
యశ్చాభ్యాంతర వృత్తి మాత్ర రసికో సాక్షాత్స్వయంభూ పుమాన్
సస్స్వామీ మమదైవతం తదితరో నామ్నా పినామ్నాయతే.
అమ్మవారు జీవుని ఆవేశించి కొనిపోయి వృత్తి వృత్తిమాత్ర రసికుడైన పరమేశ్వర విభూతి స్వయంభువుగా ఇక్కడ ఆత్మలో ప్రతిష్ఠించుకున్న స్వామి ఎదుట నిలబెట్టింది. పరమశాంతిని పొందిన భావన!
అందుకే విశ్వనాథ బ్రాహ్మీమూర్తి!
🌺🙏🌺
సంప్రదాయ వస్త్ర ధారణ
సంప్రదాయ వస్త్ర ధారణ కాకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న యువతులను అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలని యూ.పి పోలీసులకు సి.ఎం యోగి ఆదిత్య నాథ్ ఇచ్చిన ఆదేశాలు మేరకు పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది!!🫡🫡🚩🚩🫡🫡🙏🙏🚩🚩🙏🙏🔥🔥🔥
ఆధ్యాత్మిక శిఖరం
*ఆధ్యాత్మిక శిఖరం... శ్రీచక్రం*
భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ మోక్షసాధన లక్ష్యంగా సాగుతుంది. ఇందుకు అనేక ఉపాసన, ధ్యాన మార్గాలను పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు సూచిస్తున్నాయి. వీటన్నిటిలో శ్రీచక్ర పూజ, అర్చన, ఉపాసన అత్యున్నతమైనవి. యోగసాధనకు శ్రీచక్ర ఉపాసన పరమోన్నతమైన మార్గం.
*శ్రీచక్ర ఆవిర్భావం*
శ్రీచక్ర ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది. దీని ప్రకారం భండాసురుడనే రాక్షసుడిని సంహరించటం కోసం ఇంద్రుడు అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ గొప్ప యాగాన్ని చేస్తాడు. ఫలితంగా, యజ్ఞకుండం మధ్యభాగం నుంచి అమ్మవారు శ్రీచక్రమధ్యగతయై సాక్షాత్కరిస్తుంది. మరొక కథ ప్రకారం ‘రేణు’ మహారాజు అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇందుకు మెచ్చిన జగన్మాత, శ్రీచక్రస్థితయై అతనికి ప్రత్యక్షమవుతుంది. ఈవిధంగా శ్రీచక్ర ఆవిర్భావం జరిగినట్లు పురాణాల్లో ఉంది.
*శ్రీచక్ర నిర్మాణం*
*శ్రీచక్రనిర్మాణంలో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి. బిందువు, త్రికోణం, అష్టకోణం, దశకోణాలు (రెండు), చతుర్దశ కోణం, అష్టదళం, షోడశదళం, భూపురత్రయం అనే తొమ్మిది ఆవరణలను వివిధ దేవతలు అధిష్ఠించి ఉంటారు. త్రిపురతాపినీ ఉపనిషత్తులో శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించిన వివరణ ఉంది.*
*శ్రీచక్రం భూప్రస్తారం, మేరుప్రస్తారం అనే రెండు రూపాల్లో మనకు కనిపిస్తుంది. యంత్రరూపంలో, పటం రూపంలో కనిపించేది భూ ప్రస్తారం. కాగా, ఆలయాల్లో అర్చనలు అందుకునే రూపం మేరుప్రస్తార రూపం.* శ్రీచక్రార్చనకు సంబంధించి అనేక అర్చన, ఉపాసనా విధానాలు ఆచరణలో ఉన్నాయి.
గురు పరంపర పద్ధతి ప్రకారం వీటిలో అనేక భేదాలు ఉంటాయి. వీటన్నిటిలో నవావరణార్చన ఎంతో శ్రేష్ఠం.
*శ్రీచక్రంలోని ఆధ్యాత్మిక కోణం ఎంత ఉన్నతమైందో అందులోని గణిత నిర్మాణం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. సమున్నతమైన భారతీయ వైజ్ఞానిక దృక్పథానికి శ్రీచక్ర నిర్మాణం తార్కాణంగా నిలుస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ద్వి, త్రిజ్యామితీయ పరిమాణాల్లో ఉన్న ఏకైక నిర్మాణం శ్రీచక్రం మాత్రమే. లెక్క తెలియని లక్షల సంవత్సరాలకు పూర్వమే మనదేశం నేటి శాస్త్రవేత్తల ఊహకు సైతం అందని నిర్మాణాలు చేసిందనటానికి శ్రీచక్రం తరగని సాక్ష్యంగా నిలుస్తుంది.*
*రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్ కాలేజీ, విజయవాడ-1, సెల్: 9032044115*
సంచలన తీర్పు
దేవాలయాలపై మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. ఆలయ భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయని.. వాటి మీద వచ్చే ఆదాయం దేవాలయాల అభివృద్ధి, హిందువుల కోసమే ఉపయోగించాలంది. ప్రభుత్వాలు దొంగల మాదిరిగా దోచుకొని ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు ఇవ్వకూడదని చెప్పింది.
ఆలయాలకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను తెలిపింది మద్రాస్ హైకోర్టు’1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములను ఉండేవి.. ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు.. మరి 50 వేల ఎకరాలు ఏమయ్యాయి లెక్క తీయండి, ఆక్రమంలో ఉంటె తొక్క తీయండి కేసులు పెట్టండి,మళ్లీ 50 వేల ఎకరాలను దేవాలయాలకు అప్ప చెప్పండి... ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలి, దేవాలయ అధికారులు ఆధీనంలో దేవాలయం ఆధీనంలో మాత్రమే ఉండాలి..ప్రభుత్వాలు పనికిరాని చెత్త పెత్తనం చేయకూడదు..హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
అంతేకాదు..’దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి, ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, దొంగల మాదిరిగా దోచుకొని మరి ఇతర మతాల కోసం క్రైస్తవులు, ISLAMIC కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ప్రభుత్వాల రోజు వారి పరిపాలన కోసం మీ యొక్క భోగాల కోసం హిందువుల దేవాలయాల ఆదాయాన్ని ఎందుకు వాడుతున్నారు..దాతలు హిందూ దేవాలయాలకు హిందూ దేవుడికి భూములు ఇచ్చారు.. దాతలు మీ భోగాల కోసం ఇవ్వలేదు హిందూ ధర్మం కోసం ఇచ్చారు..హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి..దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయండి హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వండి అన్యమతస్తులకు కాదు.. సెక్యూలరిజం బొంగు భోషాణం దొంగ ముచ్చట్లు అన్ని మీరు చూసుకోండి కానీ అది హిందూ దేవాలయాలు వాటిని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి..దేశంలో చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు అందులో ఎంత ఆదాయం వస్తుందో ఎవరికీ తెలియదు కానీ హిందూ దేవాలయాలను మాత్రం దొంగల మాదిరిగా దోచుకుంటున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
దేవాలయాల భూములు దేవుళ్ళ యొక్క సంక్షేమం కోసం కృషి ఇచ్చింది ఎస్సార్ మహదేవన్ అనే జడ్జిగారు.. కొన్ని రోజుల క్రితమే మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది.. హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకొని క్రైస్తవం ఇతర మతాలలో ఉద్యోగాలు తొలగించండి, జీతాన్ని రికవరీ చేయండి కేసులు పెట్టండి అని జడ్జి గారు తీర్పు ఇచ్చారు ఇప్పుడు అదే జడ్జిగారు మళ్లీ హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది
త్వరలో హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వాధీనంలో నుండి బయటకి రావాలి, ఆక్రమణకు గురైన హిందూ దేవాలయాల భూములన్నీ మళ్ళీ దేవాలయాలకు చెందాలి. ఆలయాలు దేవుడి సాక్షిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడవాలి.. హిందూ దేవాలయాల ఆదాయంతో హిందువులకు మాత్రమే విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి కార్యక్రమాలు జరగాలి .
SAVE టెంపుల్స్ అని ఒక గొప్ప ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది. భారతదేశ చరిత్ర మొత్తం మలుపుతిప్పే విధంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
శుద్ధి చేయలేము
శ్లోకం:☝️
*చిత్తమంతర్గతం దుష్టం*
*తీర్థస్నానాన్న శుద్ధ్యతి |*
*శతశోఽపి జలైర్ధౌతం*
*సురాభాండమివాశుచిః ||*
(కాశీ ఖండం - 6/38)
భావం: మద్యంతో నిండిన కుండ వందల సార్లు నీటితో కడిగినా అది పవిత్రంగా మారనట్టు, మనస్సు మలినాలతో (పాపాలతో) నిండి ఉంటే పవిత్ర తీర్థస్నానం చేయడం ద్వారా దానిని శుద్ధి చేయలేము.
పంచాంగం 07.11.2023 Tuesday,
ఈ రోజు పంచాంగం 07.11.2023 Tuesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: దశమి తిధి భౌమ వాసర: మఘ నక్షత్రం బ్రహ్మ యోగ: వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం.
దశమి ఈ రోజు పూర్తిగా ఉంది.
మఘ సాయంత్రం 04:22 వరకు.
సూర్యోదయం : 06:20
సూర్యాస్తమయం : 05:38
వర్జ్యం : రాత్రి 01:20 నుండి 03:08 వరకు.
దుర్ముహూర్తం : పగలు 08:36 నుండి 09:21 వరకు తిరిగి రాత్రి 10:43 నుండి 11:34 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు
యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
పూజాకార్యక్రమాల సంకల్పము.
**********
*శుభోదయం*
*********
సంధ్యా వందన మరియు
ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ. 07.11..2023
మంగళ వారం (భౌమ వాసరే)
**************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరదృతౌ
ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే దశమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భౌమ వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరత్ ఋతౌ ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే దశమ్యాం
భౌమ వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.6.04
సూ.అ.5.24
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణ పక్షం దశమి పూర్తి.
మంగళ వారం.
నక్షత్రం మఘ సా. 4.44 వరకు.
అమృతం మ. 2.05 ల 3.51 వరకు.
దుర్ముహూర్తం ఉ.8.19 ల 9.04 వరకు.
దుర్ముహూర్తం రా.10.28 ల 11.18 వరకు.
వర్జ్యం రా. 1.37 ల 3.23 వరకు .
యోగం బ్రహ్మం సా. 4.36 వరకు.
కరణం వనజి సా.6.21 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు.
గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు.
యమగండ కాలం ఉ. 9.00 ల 10.30 వరకు.
***********
పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ దశమి.
.**********
*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,బి
Sachivalayanagar,
Vanasthalipuram,
Rangareddy Dist, 500 070,
80195 66579.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
మంగళవారం నవంబరు 7, 2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
మంగళవారం నవంబరు 7, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహళ పక్షం
తిథి:దశమి పూర్తి
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:మఖ సా4.44 వరకు
యోగం:బ్రహ్మం సా4.35 వరకు
కరణం:వణిజ సా6.23 వరకు
వర్జ్యం:రా1.36 - 3.22
దుర్ముహూర్తము:ఉ8.19 - 9.05 &
రా10.28 - 11.18
అమృతకాలం:మ2.04 - 3.51
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి: తుల
చంద్రరాశి : సింహం
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం: 5.24
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
మాట్లాడితే సత్యం
🕉️ ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🕉️
అవ్యాహృతం వ్యాహృతాయ ఆహుః సత్యం వదేత్ వ్యాహృతం తద్ద్వితీయమ్| ప్రియం వదేత్ వ్యాహృతం తత్ తృతీయం ధర్మ్యం వదేత్ వ్యాహృతం తచ్చతుర్థకమ్||
"మాట్లాడటం కంటే మౌనం మేలు. మాట్లాడితే సత్యం మాట్లాడటం రెట్టింపు మేలు. ఆ సత్యం ప్రియంగా మాట్లాడటం మూడురెట్లు మేలు.
ఆ సత్యప్రియాలు ధర్మంతో కలిసి ఉంటే అది నాలుగురెట్లు మేలు".
*07-11-2023* *రాశి ఫలితాలు
*07-11-2023*
*రాశి ఫలితాలు*
*భౌమ వాసరః మంగళ వారం*
*మేషం*
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
*వృషభం*
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూవివాదాలు కలుగుతాయి. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు.
*మిధునం*
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
*కర్కాటకం*
సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
*సింహం*
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభలా బాటలో పయనిస్తాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి.
*కన్య*
రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
*తుల*
పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు.
*వృశ్చికం*
చేపట్టిన పనులు శ్రమాదిక్యాతతో కానీ పూర్తి కావు.కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాలు ప్రారంబానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.
*ధనస్సు*
సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి.
*మకరం*
సంతాన విద్యా విషయాలపై ద్రుష్టి సారిస్తారు. రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంభందిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.
*కుంభం*
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది.
*మీనం*
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులులో వ్యయప్రయాసలు అధికమౌతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి.
🕉️
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం - దశమి - మఘా - భౌమ వాసరే* *(07-11-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/IwI8X_i-XE0?si=B_633xNKvIGTLhak
🙏🙏
నిత్యాన్నదాన మార్గం..*
*నిత్యాన్నదాన మార్గం..*
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద 2007 వ సంవత్సరం జూన్ మాసం లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము..ఒక నెల రోజులపాటు కేవలం ఆదివారం మధ్యాహ్నం సమయం లో మాత్రమే అన్నదానం నిర్వహించేవాళ్ళము..శనివారం నాటి సాయంత్రం స్వామివారి మందిరానికి వచ్చిన భక్తులు ఆహారం కొరకు పడుతున్న ఇబ్బందులు గమనించి..శనివారం రాత్రికి కూడా అన్నదానం చేయాలని సంకల్పించాము..ఆరోజుల్లో శనివారం నాడు పల్లకీసేవ ఇప్పుడు నిర్వహిస్తున్న మాదిరిగా కోలాహలంగా ఉండేది కాదు..అర్చకస్వాములు పల్లకీ వద్ద స్వామివారి అష్టోత్తర పూజ చేసి హారతి ఇచ్చేవారు..ఆపై భక్తులు పల్లకీని తమ భుజాలపై మోసుకుంటూ..స్వామివారి మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణలు చేసేవారు..ప్రదక్షిణలు పూర్తికాగానే, అర్చకస్వామి పల్లకీ వద్ద మరలా హారతి ఇచ్చేవారు..అంతటితో పల్లకీసేవ సమాప్తం అయ్యేది..ఆ సమయానికి స్వామివారి మందిరం వద్ద సుమారు మూడు, నాలుగు వందలమంది ఉండేవారు..వారందరికీ ఆహారం ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి..అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము..
ఇలా ప్రతి శని ఆదివారాల్లో అన్నదానం నిర్వహించడానికి మాకు ఆర్ధిక వనరులు ఎప్పటికప్పుడు సమకూరేవి..ఇందుకు సంబంధించి ఒక చిన్న ఉదంతాన్ని మీతో పంచుకుంటాను..
2011 వ సంవత్సరం లో ఒకరోజు మా సిబ్బంది నా వద్దకు వచ్చి.."అయ్యా..అన్నదానానికి సరుకులు కొనాలి..ప్రస్తుతం మనవద్ద ఉన్న నిల్వ సరుకులు మరో మూడువారాలు అన్నదానం చేయడానికి సరిపోతాయి..అప్పటికప్పుడు వెతుక్కోవడం కష్టం కనుక..మీ దృష్టికి ఇప్పుడే తెస్తున్నాము.." అన్నారు.."సరే..మరో మూడు నెలలకు సరిపడా సరుకులు కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో..విచారించి నాకు చెప్పండి.." అన్నాను..మరో గంట తరువాత లెక్క తీసుకొని నావద్దకు వచ్చారు..దాదాపుగా రెండు లక్షల రూపాయలు కావాలి..దాతలు ఇచ్చిన విరాళాలు ఓ ఎనభై వేల రూపాయలు ఉన్నాయని..మిగిలిన మొత్తం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు..సరే అన్నాను..
మరో వారం గడిచింది..మరో పదివేలు సమకూరాయి..ఎలా లేదన్నా ఒక లక్ష రూపాయల పై చిలుకు మొత్తం కావాలి..(2011 వ సంవత్సరం లో లక్ష రూపాయలు పెద్ద మొత్తం క్రిందే అనుకునే వాళ్ళము..) ఆలోచిస్తూ వున్నాను.."మీరెందుకు ఎక్కువగా ఆలోచిస్తారు..స్వామివారి కి ఈ సమస్య విన్నవించండి..పదండి.. ఇద్దరమూ స్వామివారి సమాధి వద్ద చెప్పుకొని వద్దాము.." అని నా భార్య చెప్పింది..క క్షణం ఆలస్యం చేయకుండా మనసులో స్వామివారిని తలచుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి స్వామివారి పాదుకులకు శిరస్సు ఆనించి..నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చేసాము..
ఆ ప్రక్క ఆదివారం నాడు భక్తులు విశేషంగా స్వామివారి మందిరానికి దర్శనార్థం వచ్చారు..ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంట దాకా మాకెవ్వరికీ తీరిక లేకుండా పోయింది..స్వామివారికి మధ్యాహ్నం నివేదన చేసి, హారతి ఇచ్చిన తరువాత..భక్తులను అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేయవలసినదిగా మా సిబ్బంది మైక్ లో చెప్పారు..స్వామివారి మందిరం లో ఉన్న భక్తులందరూ అన్నదాన సత్రం వద్దకు వెళ్లారు..నేనూ మా సిబ్బంది మిగిలాము..ఇంతలో మధ్యాహ్నం బస్సు లో ఓ దంపతులు వచ్చారు..స్వామివారి సమాధి దర్శనానికి వచ్చామని..కందుకూరులో బస్సు దొరకడం ఆలస్యం అయినందున తాము ముందుగా రాలేక పోయామని మా సిబ్బందికి చెప్పి..స్వామివారి సమాధిని దర్శించుకోవడానికి టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చారు..స్వామివారి సమాధి దర్శించుకొని..తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని ఇవతలకు వచ్చారు..భోజనం చేసి రమ్మని వారికి మా సిబ్బంది చెప్పారు.."ఇక్కడ భోజనం ఉందా?..తినడానికి ఏమీ దొరకవేమో అనే ఉద్దేశ్యం లో మేము కందుకూరులో ఓ రెండు రకాల పళ్ళు కొనుక్కొని వచ్చాము..స్వామివారి ప్రసాదం ఉంది కనుక అదే తీసుకుంటాము.." అని చెప్పి..వెళ్లారు..
మరో రెండుగంటల తరువాత..మేమందరమూ లెక్కలు చూసుకునే సమయం లో ఆ దంపతులు మా వద్దకు వచ్చి నిలబడ్డారు.."ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుంది?" అన్నారు..ప్రస్తుతానికి శని, ఆదివారాల్లో మాత్రమే అన్నదానం నిర్వహిస్తున్నామని..శనివారం నాటికీ, ఆదివారానికి విడి విడిగా ఎంత మొత్తం ఖర్చు అయ్యేదీ మా సిబ్బంది తెలిపారు.."మిగిలిన రోజుల్లో కూడా మధ్యాహ్నం భోజనం పెట్టవచ్చు కదా..ఈ ప్రాంతం మారుమూల ఉంది..ఇక్కడికి స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు ఆకలితో ఉండకూడదు..ఏమంటారు?" అని నన్ను అడిగారు.."ఆర్ధిక వనరులు చూసుకోవాలి కదా..ఒకరోజు భోజనం పెట్టి..ఆ తరువాత ఆపకూడదు..నిర్వహణ చేసేటప్పుడు అన్నీ ఆలోచించుకోవాలి.." అన్నాను..
ఆ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.."ఏమీ అనుకోకుండా ఒక నెలలో రోజూ మధ్యాహ్నం అన్నదానం చేయడానికి..శని, ఆదివారాల్లో ఇదే ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా..ఖచ్చితంగా లేకపోయినా..కొంచెం అటూ ఇటుగా తెలుపండి.." అన్నారు..మరో అరగంటకు లెక్క తేల్చి..కాగితం పై వ్రాసి ఇచ్చాము..ఆ కాగితాన్ని సరిగా చూడకుండానే తన జేబులో పెట్టుకొని.."మంచిదండీ..మా వంతు ప్రయత్నం మేము చేస్తాము..దత్తక్షేత్రం లో నిత్యాన్నదానం ఉంటే మంచిది..మీరు అనుమతి ఇస్తే..స్వామివారి సమాధిని మరొక్కసారి దర్శించుకొని వస్తాము.." అన్నారు..సరే అన్నాను..స్వామివారి సమాధిని దర్శించుకొని..సాయంత్రం బస్సుకు వెళ్ళిపోయారు..
మరో మూడు రోజుల తరువాత..ఆ దంపతుల నుంచి నాకు ఫోన్ వచ్చింది.."ప్రసాద్ గారూ..ఇప్పుడే సరుకులన్నీ ఆటో కు ఎత్తించాము..మీకు మధ్యాహ్నం చేరుతాయి..ఒక నెలరోజులకు సరిపడా మా లెక్కప్రకారం పంపాము..మామీద దయవుంచి.. వచ్చేవారం నుంచి ప్రతిరోజూ అన్నదానం చేయండి..పాలు, కూరగాయలు ఇతర ఖర్చులకు మేము అక్కడికి వచ్చి నగదు గా ఇస్తాము.." అన్నారు..నేను ఏమీ జవాబు ఇవ్వలేదు.."సరే నండీ.." అని మాత్రం అనగలిగాను..స్వామివారు నిత్యాన్నదానానికి మార్గం వేసేశారు అని అర్ధం అయింది..నా పాత్ర పరిమితమైనది అనికూడా అర్ధం అయింది..
ఆ ప్రక్కవారం మొదలైన నిత్యాన్నదానం ఈరోజువరకూ నిరంతరం కొనసాగుతోంది..ఎందరో దాతలు సహకరిస్తున్నారు..
ఆరోజు సహాయం చేసిన దంపతులు ఏనాడూ తమ పేరు బోర్డ్ మీద వ్రాయవద్దని కోరారు..ఇప్పటికీ ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి స్వామివారి సన్నిధికి వచ్చి సమాధి దర్శించుకొని వెళుతుంటారు..స్వామివారే వారికి ఆదేశం ఇచ్చారు కనుక వేరే ప్రచారం ఎందుకు?
సర్వం..
శ్రీ దత్తకృప!!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).
Indian Railways" For Sr. Citizens Convenience..!
Centralised Numbers Released By "Indian Railways" For Sr. Citizens Convenience..!
9760534983 : TTI,
Reservation & Meals
9760500000 : Cleaning
9760534057 : Problem In Coach
9760534060 : Electricity Problems
9920142151 : Enquiry Problems
9760534063 : RPF & Security
9760534069 : Drinking Water Arrangements
9760534073 : Medical
-----------------------------------------------
Please Post To As Many As Possible
..
ఆలోచనాలోచనాలు
@@@ ఆలోచనాలోచనాలు @@@ తెలుగు పద్య సుమ మాలిక @@@ చాటు పద్యములు @@@ సమస్యాపూరణములు @@@ (ప్రాచీనము- మోచర్ల వెంకన్న కవి )@@@ "" ఎలుకలు తమ కలుగు లోని కేనుఁగు నీడ్చెన్."" కం. ఇలలో నిద్దఱు రాజులు / మలయుచుఁ జదరంగమాడి మాపటివేళన్ / బలమెత్త మఱచిన / నెలుకలు తమ కలుఁగు లోనికేనుఁగు నీడ్చెన్. ***** "" రండాగమనంబుఁ జేయ రమ్యంబ యగున్."" కం. కుండినపురమున రుక్మిణి / చండికకుం బూజసలుపు సమయంబున కా / యండజవాహనుఁ దోడ్కొని / రండా గమనంబుఁ జేయ రమ్యంబ యగున్. ***** "" నిప్పున నొక చేరెఁడంత నెత్తురుగాఱెన్."" కం. కుప్పించి నెలుఁగు దూఁకిన / గొప్పములిదె నాటె నిపుడు వేగన్ / ఉప్పుఁ గొనిరమ్ము కాతము / నిప్పున, నొక చేరెఁడంత నెత్తురుగాఱెన్. ***** "" సుగ్రీవుని యెడమకాలు శునకము కఱచెన్."" కం. అగ్రారపు నడివీథిని / నిగ్రహముగ బొమ్మలాట నేర్పుగఁ నాడన్ / విగ్రహము లెత్త మఱచిన / సుగ్రీవుని యెడమకాలు శునకము కఱచెన్. ***** ""కమ్మలు మోకాళ్ళు తాఁకి ఘలుఘలు మనియెన్."" కం. కొమ్మను మదనుండపుడు జ / వమ్మున నీలోత్పలముల వడి నేయంగా/ సొమ్మసిలి మోము వంచినఁ / గమ్మలు మోకాళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్. ***** "" గాడిద యేడిచెఁగదన్న ఘనసంపన్నా!"" కం. ఆడిన మాటకుఁ దప్పిన / గాడిదకొడుకంచుఁ దిట్టఁగా విని యయ్యో / వీఁడా నాకొక కొడుకని / గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా! ***** "" అస్ఖలిత బ్రహ్మచారి కార్గురు పుత్రుల్."" కం. ఈస్ఖాప్రాసము దుష్కర / మస్ఖలనతి నీయఁదగునె యది సుకవులకున్?/సస్ఖలితలయి గుహుఁగని / రస్ఖలిత బ్రహ్మచారి కార్గురుపుత్రుల్. ***** "" మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్."" కం. హిత మాచరించువారికి / హిత మొనరించుచును సుజనహితుఁ డగుచును దు/ దుష్కృతమెప్పుడుఁ జేయను స / మ్మతి లేని నరుఁడు మిగుల మన్నన నొందున్. తేది 7--11--2023, మంగళవారం, శుభోదయం.
బయటఉన్నదంతా
ఎవరో రాశారో తెలియదు..
👏_
*విత్తనం తినాలని*
*చీమలు చూస్తాయ్*..
*మొలకలు తినాలని*
*పక్షులు చూస్తాయ్*..
*మొక్కని తినాలని*
*పశువులు చూస్తాయ్*
*అన్ని తప్పించుకుని*
*ఆ విత్తనం వృక్షమైనపుడు*..
*చీమలు, పక్షులు, పశువులు*..
*ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....
*జీవితం కూడా అంతే TIME*
*వచ్చే వరకు వేచివుండాల్సిందే*
*దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....
*లైఫ్ లో వదిలి వెళ్ళిన*
*వాళ్ళ గురించి ఆలోచించకు*..
*జీవితంలో ఉన్న వాళ్ళు*
*శాశ్వతం అని భావించకు*..
*ఎవరో వచ్చి నీ బాధను అర్థం*
*చేసుకుంటారని ఊహించకు*...
*నీకు నీవే ధైర్యం కావాలి*.....
*నీకు నువ్వే తోడుగా నిలబడాలి*...
*లోకులు కాకులు,*
*మనిషిని చూడరు*,
*మనస్సును చూడరు,*
*వ్యక్తిత్వాన్ని చూడరు.*
*కనిపించింది,*
*వినిపించింది నమ్మేస్తారు*,
*మాట అనేస్తారు,*
*ఒక్కోసారి మన కళ్ళే*
*మనల్ని మోసం చేస్తాయి.*
*మరొకసారి చెప్పుడు మాటలు*
*జీవితాలను*
*తలకిందులు చేస్తాయి*
*అబద్దాలతో, మోసాలతో*
*కీర్తి, ప్రతిష్టలను*
*ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..
*అవి కుప్పకూలి పోవడానికి*
*ఒక్క "నిజం"చాలు*.
*అందుకే కష్టమైనా సరే*
*నీతిగా బ్రతకడమే మనిషికి*
*ఉత్తమ మార్గం.*
*ఒక చిన్న మొక్కనాటి*
*ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*
*చూడకూడదు.*
*ఎందుకంటే అది పెరగాలి*
*మొక్క వృక్షం కావాలి*
*పుష్పించాలి, పిందెలు రావాలి*
*అవి కాయలై , పండితే తినగలం.*
*అలాగే నేను ఇది కావాలి*
*అనే కోరిక కూడా మొలకై*
*వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*
*మసలుకోండి సన్నిహితులారా*🌹
*జీవితంలో కష్టము,*
*కన్నీళ్ళు, సంతోషము,*
*భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,
*కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*
*ఆనందం, ఆవేదన కూడా అంతే.*
*నవ్వులూ, కన్నీళ్ళూ*
*కలగలసినదే జీవితం*
*కష్టమూ శాశ్వతం కాదు,*
*సంతోషమూ శాశ్వతమూ కాదు.*
🌹🌹🌹🌹
*ఓడిపోతే*
*గెలవడం నేర్చుకోవాలి*,
*మోసపోతే*
*జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*
*చెడిపోతే ఎలా*
*బాగుపడలో నేర్చుకోవాలి,*
*గెలుపును ఎలా పట్టుకోవాలో*
*తెలిసిన వాడికంటే*
*ఓటమిని ఎలా*
*తట్టుకోవాలో తెలిసిన వారే*
*గొప్ప వారు నేస్తమా* !
*దెబ్బలు తిన్న రాయి*
*విగ్రహంగా మారుతుంది*
*కానీ దెబ్బలు కొట్టిన*
*సుత్తి మాత్రం ఎప్పటికీ*
*సుత్తిగానే మిగిలిపోతుంది*....
*ఎదురు దెబ్బలు తిన్నవాడు*,
*నొప్పి విలువ తెలిసిన వాడు*
*మహనీయుడు అవుతాడు*...
*ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*
*ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...
*డబ్బుతో ఏమైనా*
*కొనగలమనుకుంటున్నారా*
*అయితే కొనలేనివి ఇవిగో*
*మంచం పరుపు కొనవచ్చు*
*కానీ నిద్ర కాదు*
*గడియారం కొనవచ్చు*
*కానీ కాలం కాదు*
*మందులు కొనవచ్చు*
*కానీ ఆరోగ్యం కాదు*
*భవంతులు కొనవచ్చు*
*కానీ ఆత్మేయిత కాదు*
*పుస్తకాలు కొనవచ్చు*
*కానీ జ్ఞానం కాదు*
*పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*
*కానీ జీర్ణశక్తిని కాదు*
🌹🌹🌹🌹🌹
*ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*
*అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*
*కావాలి,*
*స్నానాలతోనే పాపాలు పోతే ముందు*
*చేపలే పాప విముక్తులు కావాలి,*
*తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*
*పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*
*గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*
*ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*
*నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*
*పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*,
*నీలో లేనిది బయటేమీ లేదు*
*బయటఉన్నదంతా నీలోనూ ఉంది*
*తెలిసి మసులుకో మిత్రమా*
సుబ్రహ్మణ్యస్వామివారి అనుగ్రహం అనుగ్రహం
*శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, శుభోదయ శుభాకాంక్షలతో, మీ శ్రేయోభిలాషి, నిష్ఠల సుబ్రహ్మణ్యం.*
https://youtu.be/KRrejtErvN4?si=hKxrFD9PQ9SiDkAU
దేవాలయాలలో
*ఎందుకండీ హిందూ దేవాలయాలలో అన్నేసి ప్రసాదాలు*?
_దానికి కారణం ఇదుగో_
ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .
★ *జీర్ణశక్తిని పెంచే "కట్టె పొంగలి"*
" బియ్యం, పెసరపొప్పు, జీలకర్ర, ఇంగువ, నెయ్యి, అల్లం, శొంఠిపొడి, ఉప్పు, కరివేపాకు, జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని, జీర్ణశక్తిని పెంచు తుంది. మంచి ఆకలిని కలిగిస్తుంది.
★ *జీర్ణకోశ వ్యాధుల నివారిణి "పులిహోర"*
' బియ్యం, చింతపండు పులుసు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ, పసుపు, బెల్లం, నూనె, వేరుశనగలు, జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది.
★ *మేధస్సును పెంచే "దద్ధోజనం"*
బియ్యం, పెరుగు, ఇంగువ, కొత్తిమీర, అల్లం, మిర్చి, శొంఠిపొడి మిశ్ర మంతో తయారు చేసే ఈ ప్రసాదం మేధస్సును పెంచుతుంది. శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది.
★ *వార్ధక్యాన్ని నిలువరించే "కదంబ"*
బియ్యం, చింతపండు, ఎండుమిర్చి, పోపు గింజలు, ఇంగువ, నూనె, ఉప్పు , కందిపప్పు, పసుపు, బెల్లం, నెయ్యి , బెండకాయ, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుళ్లు, బీన్స్ , దోసకాయ, క్యారెట్, టమోటా, చిలకడ దుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం. సప్తధాతువుల పోషణ చేస్తుంది. వార్ధక్యాన్ని నిలువరిస్తుంది. అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం.
★ *శ్లేష్మాన్ని తగ్గించే "పూర్ణాలు"*
పచ్చిశనగపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది. శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. మంచి బలవర్ధకం.
★ *రోగ నిరోధక శక్తిని పెంచే "చలిమిడి"*
' బియ్యం పిండి, బెల్లం, యాలుకలు, నెయ్యి, పచ్చకర్పూరం, జీడిపప్పు, ఎండుకొబ్బరి కోరుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం.
★ *కొబ్బరి పాల పాయసం*
కొబ్బరి పాలు, పచ్చ కర్పూరం, యాలకుల పొడి, బాదంపప్పు, కుంకుమపువ్వు, పంచదార, ఆవు పాలు, కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.
శ్రీరామ స్తుతి
🌸శ్రీరామ స్తుతి🙏
సీ. రమణీయ గుణభూష ! రఘురామ ! శ్రీరామ !
రాజీవలోచన ! రామభద్ర !
ముల్లోక సంపూజ్య ! మునిజన మానసా !
ఘోరపాప విరామ ! గుణగణాఢ్య !
దైత్య వన కుఠార ! దశరథాత్మజ రామ !
రవికుల సంభవా ! రమ్య తేజ !
శరణు శ్రీరామ ! నీ చరణమే శరణమ్ము
నరవిందదళ నేత్ర ! యమల చరిత !
తే. మనసు విభ్రాంతి చెందగా మాయ వలన
కాంతు లీనెడి నీ రూపు కాంచ నైతి
నీదు నామమ్ము జపియించి నిష్ఠ తోడ
నిన్ను జేరంగ దలచితి నిగమవేద్య!
జయలక్ష్మి