9, సెప్టెంబర్ 2026, బుధవారం

🌷 *బుధవారం*🌷 *🪷09సెప్టెంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

  *🪷09సెప్టెంబర్26🪷*  

   *దృగ్గణిత పంచాంగం*    

                 

        *ఈనాటి పర్వం* 

  *🕉️మాస శివరాత్రి🕉️* 


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : త్రయోదశి* మ 12.30 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : ఆశ్లేష* మ 03.14 వరకు ఉపరి *మఖ*

*యోగం  : శివ* రా 09.52 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం   : వణజి* మ 12.30 *భద్ర* రా 11.29 ఉపరి *శకుని*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ09.00-10.00 సా04.00-05.00*

అమృత కాలం  : *మ 01.43 - 03.13*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం          : శేషం ఉ 06.12 & రా 02.39 - 04.10 తె*

*దుర్ముహూర్తం : ప 11.40-12.29*

*రాహు కాలం  :మ12.05 - 01.37*

గుళికకాళం      : *ఉ 10.32 - 12.05*

యమగండం    : *ఉ 07.27 - 09.00*

సూర్యరాశి : *సింహం*                 

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*  

సూర్యోదయం :*ఉ 06.03*  

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.55 -08.23*

సంగవ కాలం      :*08.23 - 10.51*

మధ్యాహ్న కాలం    : *10.51 - 01.19*

అపరాహ్న కాలం  : *మ 01.19- 03.46*

*ఆబ్ధికం తిధి     : శ్రావణ బహుళ చతుర్దశి*

సాయంకాలం    :*సా 03.46- 06.14*

ప్రదోష కాలం    :*సా 06.14 - 08.34*

రాత్రి కాలం        :*రా 08.34 - 11.41*

నిశీధి కాలం       :*రా 11.41 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

పంచాంగం 09.09.2026 Wednesday,

  ఈ రోజు పంచాంగం 09.09.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష త్రయోదశి తిథి సౌమ్య వాసర ఆశ్రేష నక్షత్రం శివ యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి : చతుర్దశి 



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము


అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।

జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ।। 5 ।।



ప్రతిపదార్థ:



అపరా — నిమ్నమైన; ఇయం — ఈ యొక్క; ఇతః — దీనికంటే; తు — కానీ; అన్యాం — వేరైన; ప్రకృతిం — శక్తి; విద్ధి — తెలుసుకొనుము; మే — నా యొక్క; పరామ్ — ఉన్నతమైనది; జీవ-భూతాం — ప్రాణులు; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; యయా — ఎవరిచే; ఇదం — ఈ యొక్క; ధార్యతే — ఆధారము; జగత్ — భౌతిక జగత్తు.



తాత్పర్యము:


 

ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కల అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ శక్తి (ఆత్మ శక్తి), అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.



వివరణ:


తన భక్తి శతకంలో, ఈ విషయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు:


జీవు, మాయా దుఇ శక్తి హైఁ, శక్తిమాన్ భగవాన్

శక్తిహిఁ భేద్ అభేద్ భీ, శక్తిమాన్ తే జాన్


(భక్తి శతకము, 42వ శ్లోకము)


‘జీవాత్మ మరియు మాయ రెండూ కూడా భగవంతుని శక్తులే. కాబట్టి, అవి రెండూ భగవంతునికి అభేదమే మరియు భగవంతుని కంటే వేరు కూడా.’


శక్తులు మరియు శక్తిమంతుడు ఒకటే అన్న దృక్పథంతో, సమస్త జగత్తు కూడా భగవంతుని కంటే అభేదమే. ఈ విధంగా, సమస్త జగత్తు యదార్థ భగవత్ స్వరూపమే అని చెప్పబడింది.


సర్వం ఖల్విదం బ్రహ్మ (ఛాందోగ్య ఉపనిషత్తు 3.14.1)

‘సర్వం బ్రహ్మమే.’


ఈశావాస్యం ఇదం సర్వం (ఈశోపనిషత్తు 1)

‘ఈ జగత్తులో ఉన్నదంతా బ్రహ్మమే.’


పురుష ఏవేదం సర్వం (శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.15)

‘ఉన్నదంతా ఆ సర్వోన్నతమైన దివ్య మంగళ స్వరూపమే’


ఇవన్నీ వేద మంత్రములు కూడా, ఉన్నది ఒక్కడే భగవంతుడు, మరివేరే ఇతరమైనది ఏదీ లోకంలో లేదు అని పేర్కొంటున్నాయి. అదే సమయంలో, శక్తి మరియు శక్తిమంతుడుకి ఉన్న భిన్నత్వం పరంగా, ఈ ఏకత్వం లోనే బ్రహ్మాండమైన వైవిధ్యం కూడా ఉంది, అని మనం అర్థం చేసుకోవచ్చు. జీవాత్మ వేరు; పదార్థం వేరు; భగవంతుడు వేరు. పదార్థం అచేతనమైనది (జడమైనది), అదే సమయంలో ఆత్మ చైతన్యవంతమయినది, కానీ భగవంతుడు సర్వోత్కృష్ట చైతన్యవంతమై ఉండి, ఆయనే సమస్త పదార్థద్రవ్యములకు, ఆత్మలకు రెంటికీ మూల ఉత్పత్తిస్థానము. సృష్టిలో ఉన్న మూడు అస్తిత్వాల గురించి చాలా వేద మంత్రములు చెప్తున్నాయి:


క్షరం ప్రధానమమృతాక్షరం హరః


క్షరాత్మానావీషతే దేవ ఏకః

తస్యాభిధ్యానాద్ యోజనాత్ తత్త్వభావద్


భూయశ్చాంతే విశ్వమాయానివృత్తిః


(శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.10)


 


‘మూడు అస్తిత్వాలు ఉన్నాయి: 1) పదార్థము/ద్రవ్యము, ఇది నశించేది. 2) జీవాత్మలు, ఇవి నాశము లేనివి. 3) భగవంతుడు, ఈయన పదార్థము మరియు ఆత్మ లను కూడా నియంత్రించే వాడు. భగవంతుని పై ధ్యానం చేయటం వలన, ఆయనతో ఏకమవటం వలన మరియు ఆయనలా అవటం వలన, ఆత్మ, ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛ పొందుతుంది.’


అద్వైత మరియు ద్వైత మంత్రముల రెంటినీ కూడా వేదములు అర్థవివరణచేయటం మనం గమనించవచ్చు. జగద్గురు శ్రీ క్రుపాలు జీ మహారాజ్, ఈ ఆత్మ-పరమాత్మల ఏకకాల అచింత్య భేదాభేద వాదననే బలపరిచాడు.