2, ఆగస్టు 2023, బుధవారం

Heart attach


 

Panchaag

 


ధనతృష్ణ, దుఃఖ విముక్తి.*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


     *ధనతృష్ణ, దుఃఖ విముక్తి.*

                ➖➖➖✍️


*ఒకసారి ధర్మరాజు భీష్ముని…        “పితామహా! ధనతృష్ణతో  కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు?” అని అడిగాడు.*


*భీష్ముడు… “ధర్మజా  ధనము సంపాదించి,సంపాదించి విసుగుపుట్టి ధనం సంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది.             ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను… ”ఒక ఊరిలో మంకి అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడికి ధనాపేక్ష అధికం. అందు వలన అతడు రెండు కోడెదూడలను కొని వాటిని తాళ్ళతో బంధించాడు. ఒక రోజు అవి తాళ్ళతో కలిసి పారిపోయాయి. *


*అవి పడుకుని ఉన్న ఒంటెను దాటబోయే సమయానికి అది పైకిలేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటిమెడకు కట్టిన తాళ్ళకారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు రెండు వైపులా వేలాడసాగాయి.*


*అది చూసిన బ్రాహ్మణుడు హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో…           "అయ్యలారా ! నేను నా ప్రతిభతో ధనం సంప్రదించాలి అనుకున్నాను. అది సాధ్యంకాదని తేలి పోయింది.*


*మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలికాని మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అవివ్యర్ధమేకదా ! కనుక దైవం మీద భారంవేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరికవదలకుంటే సుఖం ఉండదు.*


*కోరికలకు మూలం మనస్సంకల్పం. మనస్సులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకున్న ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేని వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలదీ తృష్ణ పెరుగుతుంది, దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది.*


*కనుక అంతు లేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందాలి. నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే      నా లోని ధనాపేక్ష తగ్గింది.*


*నాలో ధనతృష్ణ తగ్గింది, ఇంద్రియ నిగ్రహం కలిగింది, నాలో సహనం కలిగింది, ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేషజీవితం ప్రశాంతంగా గడుపుతాను.” అన్నాడు.*


*దుఃఖ విముక్తి:-*


*ధర్మరాజు… “పితామహా ! మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖములనుండి విముక్తి పొందగలడు?”  అని అడిగాడు.* 


*భీష్ముడు…  “ధర్మనందనా ! నేను నీకు అజగర కథచెప్తాను... ‘పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు.*


*అందుకు ఆ బ్రాహ్మణుడు…  "మహారాజా ! ఈ చరాచర జగత్తులో అనుదినము  ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులూ ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు.*


*ప్రాణం శాశ్వతం కాదని తెలిసీ, మానవులు  మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంతదూరం పోయి విడిపోతాయి.* 


*ఈ సృష్టిలో  భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఃఖాలకు అతీతుడు అయి శాశ్వత ఆనందం పొందగలడు.     నేను సుఖదుఃఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను, నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను.*


*దుఃఖం వచ్చిన కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక  ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్యమీద, కటిక నేలమీద సమభావంతో నిద్రించగలను. పట్టువస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఎదీ నాకుగాకోరను.*


*లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగరవ్రతం స్వీకరించి నన్ను వెదుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి ఇదే అజగరవ్రతం . ఇది యజ్ఞయాగాదుల వలన లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించ గలదు.*


*అజగరవ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకము చేరదు, మోక్షము అతడికి దగ్గరగా ఉంటుంది" అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు.*


*మనుషులు తరించడానికి కృత యుగంలో  ధ్యానం  తపస్సులు, త్రేతా యుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరంలో పూజా పరిచర్యలు, కలిలో హరినామ సంకీర్తనములైనట్లే,  శిష్టులను ఉద్దరించి దుష్టులను ఉత్తరించుటకు కృత ,  త్రేత,  ద్వాపర  యుగాలలో  ఆ  జగన్నాథుడు అవతారములు  ధరించాడు,  మరి కలియుగం మాటేమిటి ?*


*కలియుగంలో  దుష్టశిక్షణ,  శిష్టరక్షణ కోసం  నేను  రాను గాక  రానని  ఆ  దేవదేవుడు  తెగేసి  చెప్పటమే  గాక , తాను చేయాల్సిన పనిని ప్రకృతియే తన వికల్ప ములచే పూర్తి చేస్తుందని సెలవిచ్చాడు. *✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఆచార్య సద్బోధన:*

         *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️



*మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?*

```మనిషి "రంగూ,రూపూ" చూసి మాత్రం "విలువ" ఇవ్వరు!

కేవలం బాగున్నారు అన్న "ప్రశంస" దక్కుతుంది.


అంగబలం,ఆర్ధికబలం ఉన్నా ఇవ్వరు.

వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని "అణుకువ" నటిస్తారు.అంతవరకే!


పదవి,పలుకుబడి,చూసినా అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరుగుతారు. "విలువ" ఇవ్వటానికి కాదు వాడుకుందామని.

పదవి పోయిన పూటకే వెనుతిరిగి చూస్తే ఒక్కడూ ఉండడు.ఇది నిజం!


కొంతమంది కబుర్లు చెప్పి "కడుపు" నింపినంత గొప్పగా చెబుతారు.

కాసేపు కబుర్లు "ఎంజాయ్" చేస్తారు కాని "విలువ" మాత్రం ఇవ్వరు.


మనిషి "విలువ" పొందాలంటే ఉండవలసినవి 

కరుణ,దయ,ప్రేమ,జాలి,సేవాభావం,సాయపడాలనే తపన,మంచిమనసు,

తెగింపు,విశాలహృదయం ఉండాలి.


పై లక్షణాలు మనకు ఉంటే "విలువ" 

మనం పిలవకుండానే మన దగ్గరకు  వస్తుంది!✍️```

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పరమపదం

 *పరమపదం*

                 


*’శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.    సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.* 


*శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.*


*అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.*


*శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…*

*శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు,                      శివుని పూజించే చేతులే చేతులు.            శివుని సదా స్మరించేవాడే ధన్యుడు..* 


*పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.*


*అదే 'శివసిద్ధి'.*


*అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.*


*పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.*


*శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.*


*జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.*


🙏ఓం నమః శివాయ 🙏

🔥శివాయ గురవే నమః 🔥

🔱సర్వం శివమయం 🔱

Eye flue





 

A


 

Yemi katyukovaali

 


Wedding

 

*అబ్బురపరచే మణిపూర్‌లోని మైతీ హిందువుల వివాహ వేడుక.*


*మణిపూర్ ఉత్కృష్ఠమైన సంస్కృతికి, సుసంపన్నమైన సాంప్రదాయానికి, భారతదేశ ఈశాన్యంలో మిగిలున్న ఒకే ఒక చిరునామా.*

*దీనిపై క్రిస్టియన్స్ అయినటువంటి కుకీలు, డ్రగ్స్ మాఫియా కళ్ళు పడ్డాయ్.*

*దాంతో ఈ సంస్కృతి వినాశనానికి, వీరి నిర్మూలనకు కంకణం కట్టుకొంది.*

*వీరికి కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర సెక్యులర్ పార్టీల మద్దతు కూడా ఉంది.*

🚩🪷🚩🪷🚩 👇

అష్టాంగ యోగము

 అష్టాంగ యోగము అనగా... యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి


యమములు అనగా 5.. అహింస , సత్యం, అస్తేయం , బ్రహ్మచర్యం,  అపరిగ్రహం


నియమములు 5... శౌచం, సంతోషం , తపస్సు, స్వాధ్యాయం,  ఈశ్వర ప్రణిధానం


 ఆసనం...  శరీర మాలిన్యం పోవడానికి


ప్రాణాయామం... శ్వాస మాలిన్యం పోవడానికి


యమ నియమ ప్రత్యాహార లు..  నడవడి సరి చేసుకొనుటకు


ధారణ ,  ధ్యాన , సమాధి... మనో మాలిన్యం            పోవటానికి


ప్రత్యహార  అనగా... ఇంద్రియాలు నుండి మనసుని ఉపసంహరించు కోవడం


అస్తేయం అనగా...దొంగతనం చెయ్యాలనే బుద్ధి లేకుండుట. 


అపరిగ్రహం.. ఇతరుల నుండి ఉచితంగా పొందటం


ఈశ్వర ప్రణిధానం...శరణాగతి

తస్మాత్ జాగ్రత్త

 *🙏🌹ఆటో మోసాలు తెలుసుకొని జాగ్రత్త తీసుకోండి.మోడీ గారి డిజిటల్ ఇండియా నినాదం గుర్తు చేసుకోండి.👉 ఆటో బుక్ చేసినాక ఆటో వాడు మనకి ఫోన్ చేసి ఫోన్ పే వద్దు, క్యాష్ ఇస్తే వస్తా అంటాడు. ఆ హడావుడిలో సరే అంటాము. ఆటోలో కూర్చున్నాక OTP చెప్పమని అంటావా అని అడిగితే బుకింగ్ కేన్సిల్ చెయ్యండి అంటాడు. ఎందుకు అంటే బుక్ చేస్తే నాకు ఇంకో ఆర్డర్ రాదు, పైగా పది రూపాయలు కంపెనీ కి కట్టాలి. బుకింగ్ కేన్సిల్ చేస్తే నాకు ఇంకో ఆర్డర్ వస్తుంది. అని అంటాడు. బుకింగ్ కేన్సిల్ చేస్తే ఆటోలో ఉన్నవాడికి సేఫ్టీ ఉండదు. బుకింగ్ రికార్డ్ ఉండదు. డబ్బులు క్యాష్ చేతికి ఇస్తే,  ఫోనేపే లో లాగా ఆటో వాడి వివరాలు ఉండవు.  *ప్రయాణాల్లో అన్నీ డిజిటల్ పెమెంట్లు మాత్రమే చెయ్యండి*. దీనివల్ల మనం ఆటోలో ఏదైనా విలువైన వస్తువులు మర్చిపోయినా తిరిగి తెచ్చుకోవచ్చు. కిడ్నాప్, లేదా రిస్క్ అయినా ట్రేస్ చెయ్యచ్చు. తస్మాత్ జాగ్రత్త!

అలసట మాయం..

 *ఓం….!*

                  ➖➖➖✍️   


*'ఓం'...  తో   అలసట  మాయం...!శాస్త్రీయంగా  నిరూపించిన  బాలిక..!!*


*ఓం... శబ్దంతో.... *

*శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.*


*పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది.*


*కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.*


*ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది.*


*అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యంగా కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.*


*అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది.*


*ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌనఃపున్యం(Frequency)కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...*


*ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ జేసింది.*


*అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.*


*గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు.*

*కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.*


*ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.*


*ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు.*

*వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.*


*అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది.*


*దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది.*


*దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది.*

*ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌనఃపున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.*


*17 మంది యువతీ, యువకులకు  ఓం కారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.*


*ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది...*


*ప్రతి రోజు  ఉదయం ,  సాయంత్రం  కనీసం  11 సార్లు  దీర్ఘ  ఓంకారం  చేయండి.*


*మీ  బంధు మిత్రులతో  చేయించండి ...*✍️

*ఓం ,  ఓం , ఓం…*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

స్వగతం

 మా ఇంటి ఘటో....

💐💐💐💐💐💐


"అట్టు అట్టు పెసరట్టూ..ఉల్లిపాయ పెసరట్టూ...

ఉప్మాతో జత పెట్టు, భల్ చెట్నీతోటీ కలేసి కొట్టూ..."


ఎక్కణ్ణించో పిఠాపురం నాగేసర్రావు పాట వినిపిస్తోంది.


'ఈ పాట ఎప్పుడో విన్నట్టుందే' అనుకుంటున్నానో - లేదో...


"ఇదిగో...ఏవోయ్...రేప్పొద్దున్న మనింట్లో టిఫిన్...

పెసరట్టుప్మా చేసుకుందామా ?" అనే అడ్వాన్స్ 

బుకింగు ఆర్డరొచ్చేసింది !


"చచ్చాంరా దేవుడా...ఇప్పుడు...ఎప్పటిదో...

నేను పుట్టనిక్రితం పాట వినబడ్డట్టుంది...

నా తిండిపుష్టి మొగుడికి" అనుకున్నాను.


"మా ఆయన బంగా........రం !" అని మా పుట్టింట్లో సాగదీసి చెబుతాను గాని, ఈయన తిండిగోల గురించి చెబితే, నవ్వుతారని, పుట్టింట్లో కూడా చెప్పట్లేదు.


ఈయన ఓ మోస్తరు మంచోడే కానీ, అదేం గోలో...

ఈయనకి, ఎక్కడ తినేవి ఏం చూసినా, విన్నా, 

వెంఠనే అవన్నీ తినెయ్యాలనిపించేటంత జిహ్వ చాపల్యం !


ఆమధ్యెప్పుడో...ఎవరో రికమండు చేశారన్జెప్పి,

మేవిద్ధరం, వెళ్ళక వెళ్ళక, "మిథునం" సినిమాకెళ్ళాం...ఈడూ - జోడూగా...


అసలీమధ్య, ఈయన్తో బయటికెళ్ళడం మానేశాను...

పోకిరీ కుర్రాళ్ళు, మమ్మల్ని చూసి, "ఏనుగు - ఎలక" అంటున్నారని !


ఎందుకో...నిజంగానే, నాకు నేను, ఎలకలాగే అనిపిస్తున్నాను, ఈయన ముందు !


సినిమాలో ఆ అప్పదాసు పాత్రలో ఈయన దూరిపోయినట్టున్నారు, ఎప్పటికీ బయటికి రారే...!


పైగా, "ఈ అప్పదాసున్నాడే...నాకు అగ్రజుడు, దగ్గిరచుట్టం" అని తెగ మెచ్చేసుకుంటున్నారు !


చెప్పొద్దూ... నేనుకూడా...ఆ బుచ్చిలక్ష్మి పాత్రలో, 

ఎంతోకొంత దూరిపోయాను...


వాళ్ళది అదోరకం దాంపత్యం...


మొగుడిమీద ప్రేమ వుంటుంది కానీ, ఆయన తిండిగోలమీద విసుక్కుంటూనే, మళ్ళీ అన్నీ చేసిపెడుతూనే వుంటుంది, నాలాగ !


ఇంటికొచ్చిందగ్గిర్నించీ, ఈయన...

"ఆవకాయ మన అందరిదీ...గోంగూర పచ్చడీ మనదేలే" అనే పాటట్టుకుని వదల్రే !


అందులో వర్ణించిన, ఇడ్డెన్నులు, కొబ్బరిచెట్నీ, పెసరట్టు, అల్లం, పులిహోర, మిర్చిబజ్జీ, వేడి పాయసం, ఆవడ - పెరుగు, దిబ్బరొట్టి, తేనెపానకం, గుత్తివంకాయ కూర, గుమ్మడికాయ పులుసు, ఆవపెట్టిన పనసపొట్టు కూర వగైరాలన్నీ...ఈయనకి ఆరాధ్య దైవాలే కదా ?


ఇంక చెప్పేదేముంది...ఆ పాట, ఈయన సెల్ లో అస్తమానూ మారుమోగిపోతోంది !


💐💐


మా పెళ్ళైన కొత్తలో, రేడియోలో ఏదో పాతపాట వస్తోంది...


"అందమైన బావా...ఆవుపాల కోవా...

విందుగా, పసందుగా, నా ప్రేమనందుకోవా..." అని !


అందులో శిష్ట్లా జానకమ్మ,

"హాటు హాటు గారీ...స్వీటు స్వీటు బూరీ...

రాగాల రవ్వట్టూ...భోగాల బొబ్బట్టూ...

నా ప్రేమ పెసరట్టూ..." అనుకుంటూ, 

చాలా రకాల తిళ్ళ గురించి వర్ణిస్తుంది.


ఖర్మ కాలి, అవన్నీ ఈ మనుగుడుపుల అల్లుడుగారు విన్నట్టున్నాడు !


"మా పదహార్రోజుల పండగలోపు, అవన్నీ చేయించమని, నాద్వారా, మా అమ్మకి చెప్పించారు !


అత్తలకి, కొత్తల్లుడికి అన్నీ చేసిపెట్టాలనే వుంటుంది కానీ, బొత్తిగా ఇలా, "వెంకటాద్రి వంటిల్లు" లెవెల్లో అడుగుతాడని మా అమ్మకేం తెల్సు ?


ఇంక తప్పేదేముంది...మా ఆస్థాన వంటలక్క, 

శేషమ్మ గారిని పిలిచి, రోజుకోరకం చేయించి పెట్టింది.


అప్పణ్ణించీ మా అమ్మకి, కూతురు - అల్లుడూ రావడం ఇష్టమే కానీ, భయంకూడా పట్టుకుంది !


దాన్నే, "అల్లుడు ఫోబియా" అంటారని, మా డాట్రారు చెప్పేశారు !


💐💐


పెళ్ళైన కొత్తలోనే మా అత్తగార్ని అడిగేశా...

"అత్తయ్యగారండీ...ఈయన్ని చిన్నప్పుడు గాని,

'మాయాబజార్' సినిమాకి గాని తీసికెళ్ళారా ?" అని !


"అయ్యో...మాయాబజార్ చూడని వాళ్ళెవరమ్మా...

మా ఇంట్లో అందరం, చాలాసార్లు చూశాం.." అన్నారు.


కొంచెం మొహమాటపడుతూనే అడిగాను,

"వివాహభోజనంబు పాట వచ్చినపుడు, 

ఈయన ఎలా వుండేవారూ..." అని.


"నువ్వంటే గుర్తొచ్చింది, అందులో ఘటోత్కచుడు తిన్నవన్నీ...తనకీ కావాలని ఒకటే పేచీ...


ఇంక వాడితో పడలేక, వాళ్ళ నాన్న, ఏవో రెండు మూడు రకాలు మిఠాయి కొట్లోంచి, రకానికి అరకిలో చొప్పున తెచ్చి, సీసాల్లో పోసి, 'ఇంక నెలాఖరుదాకా పరవాలేదులే' అనుకున్నారు.


వీడు, ఓ కర్రని గదలాగ, భుజమ్మీద పెట్టుకుని,

'హహహ్హహ హహహ్హా' అనుకుంటూ, వాటిచుట్టూ తిరుగుతూ, ఎవరికీ మిగల్చకుండా, అన్నీ తనే తినేశాడు ! దిష్టి తగుల్తుందని, ఎవరికీ చెప్పలేదు." 

అని నిట్టూర్చింది.. ఆవిడ !


💐💐


టీవీలో ఏదైనా సినిమా గాని, సీరియల్ గాని చూస్తుంటే, ఎక్కడ భోజనాల సీన్లు వస్తాయో అని భయపడి ఛస్తుంటాను.


టీవీలో ఏదైనా సినిమాలో భోజనాల సీను వస్తే,

సినిమా వాళ్ళదేంపోయింది, షో కోసం, ఆ టేబుల్ నిండా, రకరకాల పదార్ధాలు, పది రకాల ప్లాస్టిక్ పళ్ళు పెట్టేస్తారు.


ఆ సినిమాలో నటించేవాళ్ళు, అవేం తినరు సరికదా,

ఏదో మాటా - మాటా వచ్చి, మొహాలు ముడుచుకుని, కంచంలోనే చేతులు కడిగి చక్కా పోతారు !


తరవాత, ఇక్కడ మాకుంటుంది...రుద్రవీణ ! 

ఈయనెళ్ళి, ఫ్రిడ్జ్ లో వెతికేస్తుంటారు !


ఎప్పుడైనా రైల్లో వెడుతుంటామా...

ఎవరెవరో అమ్ముకునేవాళ్ళొచ్చి, ఏవేవో అమ్మేస్తుంటారు...జాం కాయలు, మావిడి తాండ్రలు,

వేశనక్కాయలు, పాకుండలు, చిక్కీలు  గట్రా...

వాళ్ళందర్నీ పోషించే బాధ్యత ఈయనే తీసుకుంటారు, ఎవణ్ణి వదలరు !


ఈయన ఇంటిదగ్గిరే...చిల్లర మార్చుకుని, మరీ 

ఆటో ఎక్కుతారు. ముందు జాగర్త !


ఇది చాలదన్నట్టు, ప్రతీ స్టేషన్లోనూ దిగి, అక్కడ 

ప్లాట్ ఫారమ్మీదున్న అడ్డమైనవీ కొనుక్కుతింటారు.


ఇంటికెళ్ళగానే మొదలవుతుంది...

"ఘల్లు ఘల్లు ఘల్లు...గజ్జల సంగీతం !"


పొట్టలోపలికి తోసేసినవన్నీ విడివిడిగాను, సామూహికంగాను కలిసి, మిశ్రచాపుతాళంలో నాట్యప్రదర్శన ప్రాక్టీసు చేస్తాయనుకుంటా...ఆ చిత్ర విచిత్ర శబ్దాల గురించి, తదనంతర పరిణామాల గురించీ మీరడగనూ కూడదు - నేను చెప్పనూ కూడదు... ఎడిటింగులో పోతాయన్నమాట !


సినిమాకి వెళ్ళిన ప్రతిసారీ...ఇంటర్వల్లో ఈయన బయటికెళ్ళాల్సిందే, అక్కడ అమ్మే నానా రకాలు కొనాల్సిందే, సినిమా అయ్యేదాకా పరపరలాడించాల్సిందే !


రెండు మూడుసార్లు, ఆ సౌండ్లు భరించలేక, పక్కసీటువాళ్ళు కొట్టడానికొచ్చారుకూడానూ...


💐💐


ఓ రోజు, మొదటిసారి నాగేసర్రావు డబల్ పోజు వేసిన "ఇద్దరు మిత్రులు" సినిమాకెళ్ళాం.


అందులో, రేలంగి - రవణారెడ్డి గారెలు తినడంలో 

పోటీ పెట్టుకుంటారు. అంతే... ఆ సీను ఈయనకి 

తెగ నచ్చేసింది ! 


మర్నాడు..మాఇంట్లో...గారెల పండగ అని చెప్పఖ్ఖర్లేదుగా ? పైగా, ఎవరైనా అలాంటి గారెల పోటీ పెడితే బాగుణ్ణుట !


పరుగు పందాలు, బరువులు ఎత్తడాల్లో పోటీలు ఈయనకి పడవు !


"నేను జపాన్లో అయినా పుట్టాను కాదు" అంటుంటారు.

"ఎందుకు ?" అంటే, అక్కడ సుమోగాళ్ళని బాగా మేపుతార్ట ! అందుకుట !


మా తమ్ముడు, ఈయనకి, "తుమ్ముల తిమ్మయ్య బావ" అని పేరెట్టాడు.


'ఎందుకురా, అలా ?' అనడిగితే, 


"అక్కా, బావని నువ్వు సరిగ్గా చూళ్ళేదులా వుంది, బావ బయట ఎండలోకి వస్తే చాలు...ముక్కు ఆకాశం వైపు పెట్టి, కళ్ళు చిట్లించి, నోరు తెరిచి, ఇంకో రెండు నిమిషాల్లో గేరంటీగా తుమ్ముతాడు అనేట్టుగా హడావిడి చేస్తాడు.." అన్నాడు.


వాడన్నాక, నాక్కూడా, 'అవును, నిజమేగా...' అనిపించింది.


💐💐


మొన్న ఆదివారంనాడు, ఈటీవీ వాళ్ళు, "శ్రీకృష్ణపాండవీయం" సినిమా వేస్తున్నారు.


ఆ సినిమా మాఇంట్లో అందరికీ చాలా ఇష్టం.

ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు.

అందరం చేరి, సరదాగా చూస్తున్నాం...


సినిమా చూసేటప్పుడు, ఈయనకి పక్కని ఓ కిలో జంతికల్లాంటివి ఉండాల్సిందే !


భీముడు - బకాసురుణ్ణి చంపడానికి, తన తల్లి 

కుంతీదేవి ఆశీస్సులు తీసుకుని, రెండు 

దున్నపోతుల బండెక్కి, బయల్దేరతాడు.


నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది...

అప్పుడే భీముడికోసం, మాధవపెద్ది సత్యం,

ఒకపాట అందుకుంటాడని...

"భళా భళా నా బండి...పరుగూ తీసేబండి..."

అని పాడుతూ...


"అట్టుర...మినపట్టుర...దీన్నొదిలిపెట్టేదెట్టురా...

తీపి తీపి బొబ్బట్టుర...ఇది తింటే ఆకలి కట్టురా..."

అని పాడేలోపు, మా ఇంట్లో కరెంటు కట్టు అవడం 

దేశానికి చాలా అవసరమనిపించి, లోపలికెళ్ళి, 

మెయిన్ స్విచ్చి కట్టేసి వచ్చి, "వెధవ కరెంటు, 

సరిగ్గా ఇప్పుడే పోవాలా ?" అని ఊర్వశి శారదని మించిపోయాను.


పాపం ఈయన, నన్ను ఓదారుస్తున్నారు...


....ఒక బాధిత ఇల్లాలి స్వగతం !


                         😜😜😜


                  వారణాసి సుధాకర్.

                 💐💐💐💐💐💐

_తాపత్రయం-తపన_

 *_తాపత్రయం-తపన_* 

                   

*ఒక కోటిశ్వరునికి పెద్ద కారు  ప్రమాదం జరిగింది... పదిహేను రోజుల తర్వాత కోమాలో నుండి స్పృహలోకి వచ్చాడు.... చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులందరు ఆనందంతో చూసారు....*


*_తాపత్రయం మొదటి మెట్టు_*

*“అందరూ ఇక్కడే వున్నారా?” అని అడిగాడు....*


*అవునని కొడుకు చెప్పాడు....*


*“అందరూ ఇక్కడే ఉంటే అక్కడ షాపులో ఎవరున్నారు?” అని అడిగాడు.....*


*_తాపత్రయం రెండో మెట్టు_*

*“నేను అదృష్టవంతురాలిని...  నా మాంగల్యం గట్టిది.... మీకు పెద్దకారు ప్రమాదం జరిగింది.... కారు నుజ్జునుజ్జు అయ్యింది.... అయినా మీరు ప్రాణాలతో బయటపడ్డారు,” అంది భార్య....*

*వెంటనే… “కారు ఇన్సూరెన్స్ క్లైమ్ చేశారా?” అని అడిగాడు....*


*_తాపత్రయం మూడోమెట్టు_*

*“నాన్నా మీకింకొక విషయం చెప్పాలి.... కారు ప్రమాదంలో మీచెయ్యి కారు డోరులో ఇరుక్కుపోయింది.... మీచెయ్యి తీసేసారు... ” అన్నాడు....కొడుకు* 

*చెయ్యి చూసుకున్నాడు, లేదు...“చేతికి పాతిక లక్షల రోలెక్స్ వాచీ వుండాలిరా!” అన్నాడు....*


*_తాపత్రయం నాలుగో మెట్టు_*

*“వాచీ తీసుకున్నారా?” జాగ్రత చేశారా?అని లేవబోయాడు....* 

*“నాన్న కంగారు పడకండి, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రమాదంలో మీ వెన్నెముక విరిగిపోయింది....  మీరు నడవలేరు.... . మీపనులన్నీ చేసుకొనేందుకు అనువుగా మీకు కోటిరూపాయలతో ఎలక్ట్రానిక్ రోబో వీల్ చెయిర్ తీసుకొన్నాం ....  అందులో కూర్చుంటే పళ్ళు బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం వంటి అన్ని మీపనులు మీరే చేసుకోవచ్చు!” అన్నాడు కొడుకు....*

*“కోటిరూపాయలతో కొన్నారా, కొంటానికి  కొటేషన్ తీసుకున్నారా, ఇంకా తక్కువకి వచ్చేదేమో?” అన్నాడు...*


*తాపత్రయానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమి కావాలి?*

నాసదీయ సూక్తము

 నాసదీయ సూక్తము

శ్రీ శివాయ గురవే నమః




నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)


అక్కడ పుస్తకము ఉందా? లేదా? అని ఎవరయినా ప్రశ్న అడిగారనుకోండి. అక్కడ పుస్తకము ఉంటే ఉందని చెబుతాం. లేదంటే లేదని చెబుతాం. కాని పుస్తకం ఉంది.. లేదు అని జవాబు చెబుతామా? ఏమిట్రా ఇలా చెబుతున్నాడు. ఉంటే ఉందని చెప్పాలి. లేక పొతే లేదని చెప్పాలి. ఉంది... లేదు ఏమిట్రా బాబూ ! అనుకొంటాం. పరమపవిత్రమయిన ఋగ్వేదంలో ఉన్న నాసదీయ సూక్తము ఇలాంటిదే. ఉంది, లేదు అను జవాబులు ఈ సూక్తములో వస్తాయి.




సరస్వతీ దేవికి సంబంధించిన మేధా సూక్త వివరణ పూర్తయిన పిదప, పెద్దలు శ్రీ గుడిపాటి రామకృష్ణ శర్మగారు ఈ నాసదీయ సూక్తాన్ని వివరించమని కోరారు.వారు అడిగి చాలా రోజులయింది. శివయ్య అనుగ్రహంతో నమక చమకాల చివరి భాగం పూర్తి చేసి ఆత్మ జ్యోతి మాస పత్రికకి పంపించిన తర్వాత ఈ సూక్తవివరణను ధైర్యం చేసి ఈరోజు మొదలుపెడుతున్నాను..(త్వరలో పెద్దలు శ్రీ గుడిపాటి రామకృష్ణ శర్మగారు నా నమకచమక వివరణలను పుస్తకంగా ప్రచురించబోతున్నారు.వారికి ధన్యవాదములు)








ఋగ్వేదంలో ఉన్న 1017 సూక్తాలలో నాసదీయ సూక్తము ఒకటి. సృష్టికి ముందు ఉన్న ప్రళయ స్థితి ఈ సూక్తములో చెప్పబడింది. ఈ సూక్తములో సామాన్యుల భావనకు అతీతమైన ఒక విచిత్రమైన శైలి కనిపిస్తుంది. పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది .








న, అసత్ = నాసత్ . సత్ అంటే ఉంది. అసత్ అంటే లేదు. నాసత్ అంటే లేదని ఏదయితే చెబుతున్నామో అది లేదు. అంటే ఉంది. (At first there was no being nor non being )




ఉంది, లేదు,లేదని చెబుతున్నది ఉంది . ఈ మూడింటి విశ్లేషణ ఈ నాసదీయ సూక్తములో కనబడుతుంది. మహానుభావుడయిన సాయణాచార్యులవారు ఈ నాసదీయ సూక్తానికి వ్రాసిన భాష్య సహాయముతో, బ్రహ్మ సూత్రాల వ్యాఖ్యాన సహాయముతో పెద్దల అనుగ్రహము ద్వారా , నేను తెలుసుకొన్నంత వరకు ఈ నాసదీయ సూక్తాన్ని వివరించటానికి ప్రయత్నిస్తాను.




సహేతుకంగా దోషాలు తెలియచేస్తే వెంటనే సవరించుకొంటాను.




01




नासदासीन्नो सदासीत्तदानीम् नासीद्रजो नो व्योमा परो यत्।




किमावरीव: कुह कस्य शर्मन्नंभ: किमासीद्गहनं गभीरम्॥१॥




నాసదాసీన్నోసదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమాపరో యత్ ।




కిమావరీవః కుహకస్యశర్మన్నంభః కిమాసీద్గహనం గభీరం ॥ ౧ ॥




పద విభాగము




న, అసత్, ఆసీత్, నో ఇతి, సత్, ఆసీత్, తదానీం, న , ఆసీత్, రజః, న , వి, ఓమ, పరః, యత్, కిమ్, ఆ,అవరీవరీతి, కుహ, కస్య, శర్మన్,అమ్భః, కిమ్, ఆసీత్, గహనమ్, గభీరమ్




ప్రతి పదార్థము




సృష్టికి పూర్వము ఉన్న ప్రళయావస్థ వర్ణించబడుచున్నది




తదానీం= ప్రళయ కాలములో అప్పుడు ఈ ప్రపంచానికి మూల కారణమువలె ఉన్నది




తద్ అసత్= కుందేలు కొమ్ములా లేనే లేదు (కుందేలుకు కొమ్ములు అసంభవము. ఎలుకకు కొమ్ములు అసంభవము)




తథా నోసత్= సత్ పదార్థము ఆత్మ వలె ఉన్నది కావున నిర్వచింఛుటకు వీలులేనిది




న ఆసీత్ రజః= ఆకాశము కింద ఉన్న భూమితో అంతమైన పాతాళము మొదలైన లోకములు లేనే లేవు




వ్యోమ= ఆకాశము




తదపి నో= అది కూడా లేనే లేదు




పరః= ఆకాశమునకు పై భాగము ఉన్న స్వర్గలోకమునుండి సత్య లోకమువరకు లేదు




అవరీవః= ఏదైతే ఆవరించదగినదో - ఆవరించదగిన(ఆక్రమించుకొన్న) భూత సమూహములు - వరించబడుగాక ! అదియునులేదు




కుహ= వరించదగిన వస్తు స్వరూపము ఏ ప్రదేశమునుండి వరించబడుతోందో అదికూడా లేదు




కస్య శర్మన్ =ఏ భోక్త అయిన జీవునియొక్క సుఖ దుఃఖ సాక్షాత్కారములు నిమిత్తములు కాగా ఆవరించిన కలిగిన వస్తు స్థితి ఆవరించబడుగాక !




గహనం= ప్రవేశించుటకు వీలులేని అగాధమైన




ఈదృశః= ఇటువంటి




అంభః= నీరు




కిమాసీత్= ఏమైనది?(నీరు కూడా లేదు)




తాత్పర్యము




సృష్టికి పూర్వము ఉన్న ప్రళయావస్థ ఈ సూక్తములో చెప్పబడుతోంది.




మొదట్లో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అంటూ కూడా లేదు. మనకి అర్థమయ్యే విశ్వం లేదు.




ఆకాశం లేదు. ఆకాశమునకు పై భాగము ఉన్న స్వర్గలోకమునుండి సత్య లోకమువరకు లేనే లేదు




అలా అని ఏదీ లేదనటానికి వీలు లేదు. నీరు ఏమైనది? ఈ నీరు దేనిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?




ఏదయితే ఉన్నదో అది ఎఱుగరానిది; చొరరానిది.మిక్కిలి లోతైనది.








నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-02.(31-08-2016)




2




न मृत्युरासीदमृतं न तर्हिन रात्र्या अह्न आसीत्प्रकेतः।




आनी॑दवातं स्वधयातदेकं तस्मा॑द्धान्यन्न परः किञ्चनास॥२॥




న మృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యాఆహ్నఆసీత్ప్రకేతః ।




ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్యన్నపరః కిఞ్చనాస ॥ ౨ ॥




పదవిభాగము




న మృత్యుః, ఆసీత్, అమృతమ్, న తర్హి, న రాత్ర్యాః, ఆహ్నః,ఆసీత్ , ప్రకేతః ।




ఆనీత్, అవాతం, స్వధయా, తత్ ,ఏకం తస్మాత్, హ, అన్యత్, నపరః కిమ్, చన, ఆస




ప్రతి పదార్థము




న మృత్యుః+ ఆసీత్= మృత్యువు లేదు




అమృతం న తర్హి॒= అమృతము(అమర్త్వము) లేదు




రాత్ర్యా = రాత్రితో




ఆహ్నః= పగలు యొక్క




ప్రకేతః = జ్ఞానము, చిహ్నము




న ఆసీత్ = లేకుండెను (ఎందుకంటె వీటికి కారణములైన సూర్యచంద్రులు లేరు కనుక)




స్వధయా= బ్రహ్మతో(మాయ, ప్రకృతి. శక్తిని ధరించినది , తనయందు ధరించబడియుండునది స్వధా)




అవాతం = వాయురహితమైన




తత్ ,ఏకం = కేవలము ఏక ప్రాణము మాత్రమే (బ్రహ్మము )




ఆనీత్ హ = ఉండెను కదా !




తస్మాత్ = ఇదివరకు చెప్పిన బ్రహ్మము కంటె భిన్నముగా




అన్యత్ =వేరొకటి




పరః కించన న ఆస= = సృష్టికి పూర్వము కొంచెము కూడా లేదు.




తాత్పర్యము




ప్రళయకాలపు పూర్వకాలములో మృత్యువు లేదు ; అమృతము(అమర్త్యము) లేదు




రాత్రి పగలు యొక్క జ్ఞానము, చిహ్నము లేదు (ఎందుకంటె వీటికి కారణములైన సూర్యచంద్రులు లేరు కనుక)




మాయతోలేదా, ప్రకృతితో వాయురహితమైన ఏక ప్రాణము మాత్రమే (బ్రహ్మము )ఉండెను.




ఇదివరకు చెప్పిన బ్రహ్మము కంటె భిన్నముగా వేరొకటి సృష్టికి పూర్వము కొంచెము కూడా లేదు.




విశేషాలు




ఈ మంత్రంలో వినబడే స్వధా అనే పదానికి విస్తృతార్థ ప్రయోగాలు ఉన్నాయి.




1. అగ్నికార్యంలో/ యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా.) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి.)




2. అగ్ని దేవుని భార్య స్వాహాదేవి. ఆమె మరో రూపం స్వధా.




3. స్వధా శబ్దానికి అన్నం అని కూడా అర్థం ఉంది.




4. స్వధా : పితృహోమము చేయుట.(సంస్కృత-తెలుగు నిఘంటువు వావిళ్ల 1943 )




5. కౌసల్యాదేవి రామునితో బాధ పడుతూ “ నాయనా రామా ! నువ్వు నా ఎదుట లేనప్పుడు పితృ లోకమున లభించే స్వధతో కాని, స్వర్గప్రాప్తి వలన కలిగే అమృతముతో గాని ఏమి లాభము ? “ (వాల్మీకి రామా.అయోధ్య 021 వ సర్గ- 51వ శ్లో) అని చెబుతుంది.




6. అయితే ఈ నాసదీయ సూక్తానికి భాష్యము రచించిన సాయణాచార్యులవారు “స్వస్మిన్ ధీయతే ధ్రియత ఆశ్త్రిత్యవర్తత ఇతి స్వధా “ (తనయందు ధరించబడియుండునది, ఆశ్రయించి ఉండునది) అని వ్రాసారు.అందుకే నేను కూడా స్వధా పదానికి “తనయందు ధరించబడియుండునది” అను అర్థాన్ని స్వీకరించాను.




 




 




నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-03.(01-09-2016)




तम आसीत्तमसा गूळ्हमग्रे॑ऽप्रकेतं सलिलं सर्व॑मा इदं।




तुच्छ्येनाभ्वपि॑हितं यदासीत्तप॑सस्तन्म॑हिना जायतैकं॥ ३॥




తమ అసీత్తమసా గూళ్హమగ్రే॑ ప్రకేతం సలి॒లం సర్వమాఽఇదం ।




తుచ్ఛ్యేనాభ్వపిహితం యదాసీత్తపసస్తన్మహినా జాయతైకం ॥ ౩ ॥




పదవిభాగము




తమః, అసీత్ , తమసా గూళ్హమ్,అగ్రే , అప్రకేతం, సలిలమ్, సర్వమ్ ,ఆః, ఇదం ।




తుచ్ఛ్యేన, ఆభు అపిహితం , యత్, ఆసీత్ . తపసః , తత్ మహినా, అజాయత, ఏకం




ప్రతి పదార్థము




అగ్రే = సృష్టికి ముందు ప్రళయ దశలో జీవులకు సంబంధించిన (భూత భౌతికమైన) సర్వ ప్రపంచము




తమసా = చీకటితో




గూళ్హమ్= ఆవరించబడియున్నది.




తమః = అన్ని పదార్థాలలో ఆవరించిన చీకటి ఏరకంగా అయితే ఈ శ్వరుని ఆవరించదో అటువంటి చీకటి




అసీత్ = ఈ సర్వ ప్రపంచమును ఆవరించినది..




ఇదం సర్వమ్ సలిలమ్ = ఇప్పుడు కనబడే సకల జగత్తు నీటితో కూడినది




అప్రకేతం= పాలతో కూడిన నీరును ఎలా వేరు చేసి చెప్పుటకు వీలుపడదో అలా అంధకారముతో కూడిన ఈ ప్రపంచమును విడదీసి తెలుసుకొనుటకు బోధ పడుటలేదు




తుచ్ఛ్యేన = అవ్యక్తావస్థలో అనగా వివరించుటకు వీలు కాని స్థితిలో




ఆభుః= మళ్ళీ




అపిహితం = జగత్తు కప్పబడి ఉన్నది.




యత్= ఏదయితే




ఏకం ఆసీత్ = చీకటితో కలిసి విడదీయుటకు వీలు కాకుండా ఒకటిగా ఉన్నదో




తత్= అది(సృష్టి)




తపసః = సృష్టించవలెనని భగవంతుని చక్కని ఆలోచనరూపమగు




మహినా=మాహాత్మ్యముతో (గొప్పతనముతో)




అజాయత= పుట్టింది.




తాత్పర్యము




సృష్టికి ముందు ప్రళయ దశలో జీవులకు సంబంధించిన సర్వ ప్రపంచము చీకటితో కప్పబడియున్నది.




అన్ని పదార్థాలలో ఉన్న చీకటి ఏరకంగా అయితే ఈ శ్వరుని కప్పలేదో అటువంటి చీకటి ఈ సర్వ ప్రపంచమును కప్పివేసింది..




ఇప్పుడు ఈ ప్రళయ కాలములో కనబడే సకల ప్రపంచము నీటితో కూడినది




పాలతో కూడిన నీరును ఎలా వేరు చేసి చెప్పుటకు వీలుపడదో అలా అంధకారముతో కూడిన ఈ ప్రపంచమును విడదీసి తెలుసుకొనుటకు బోధ పడదు.




అవ్యక్తావస్థలో అనగా వివరించుటకు వీలు కాని స్థితిలో జగత్తు కప్పబడి ఉన్నది.




చీకటితో కలిసి విడదీయుటకు వీలు కాకుండా ఒకటిగా ఉన్న సృష్టి - సృష్టించవలెనని భగవంతుని చక్కని ఆలోచనరూపమగు




గొప్పతనముతో మరలా ప్రారంభమవుతుంది.




విశేషాలు




సత్వము, రజస్సు, తమస్సు – ఈ మూడింటికి సమానమయిన పదము ప్రకృతి




ఈ ప్రకృతికి ప్రధానము, అవ్యక్తము, మరియూ అదృశ్యము- ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి.




వేదములో ఈ ప్రకృతి శబ్దము తమస్సు అనే పదముతో చెప్పబడింది.




వేదాంతములో ప్రకృతిని అజ్ఞానము అన్నారు. ఎందుకంటే ఆ పరమాత్మ జ్ఞానము తెలుసుకోవటం కష్టం కనుక.




చివరగా ఒక మాట




బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటం) అని ఒక మాట ఆధునిక కాలములో వింటున్నాం. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఎక్కువ వేడి పుట్టిందని చెబుతున్నారు.




భగవంతుని తపస్సుచే (తపముచే , వేడిచే) సృష్టి ఏర్పడిందని నాసదీయ సూక్తములోని ఈ మూడవ మంత్రం చెబుతోంది.స్వస్తి.




 




 




నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-04.(02-09-2016)




कामस्तदग्रे समवर्तताधि मनसो रेत: प्रथमं यदासी॑त्।




सतो बन्धुमसति निरविन्दन् हृदि प्रतीष्या॑ कवयो॑ मनीषा॥४॥




కామస్తదగ్రే సమవర్త॒తాధి మనసో రేతః॑ ప్రథమం యదాసీ॑త్ ।




సతోబన్ధుమసతి నిరవిన్దన్హృది ప్రతీష్యా కవయో మనీషా ॥ ౪ ॥




పదవిభాగము




కామః ,తత్ అగ్రే , సమ్ అవర్త॒త, అధి మనసః ,రేతః ప్రథమం యత్ ,ఆసీత్ ।




సతః బన్ధుమ్ , అసతి నిః, అవిన్దన్, హృది ప్రతి ఇష్య కవయః మనీషా ॥ ౪ ॥




ప్రతి పదార్థము




తత్ అగ్రే = ఇప్పుడు కనబడే సృష్టికి పూర్వము




కామః =సృష్టి చేయవలెనని కోరిక




సమ్ అవర్త॒త,= కోరిక కలిగింది.




యత్= ఆ




అధి మనసః = అంతః కరణమునకు సంబంధించిన వాసనాశేషముతో




ప్రథమం = జరిగిపోయిన కల్పమునందు




రేతః = సృష్టించబోవు ప్రపంచమునకు సంబంధించిన బీజ భూతము




ఆసీత్ = ఉండెను




కవయః= క్రాంతదర్శులైన యోగులు, మునులు




మనీషా=తమ సాత్విక బుద్ధి చేత




అసతి= వినశ్వరమైన




హృది =హృదయములో




ప్రతి ఇష్య =విచారణ చేసి




సతః = సత్పదార్థము చేత ఇప్పుడు అనుభవిస్తున్న సకల జగత్తుకు




బన్ధుమ్ = కల్పాంతరములో ప్రాణులచే అనుభవించబోవు కర్మ సమూహ బంధకము




అసతి =సద్విలక్షణము అన్యాకృతమగు కారణము నందు




నిః, అవిన్దన్= వివేచన చేసి తెలుసుకొనిరి




పద విశేషాలు




1. అంతఃకరణము




అంతర్ + కరణమ్. లోపలి యింద్రియము.




అంతఃకరణము లు - వేదాంతుల మతమున మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అని నాలుగు విధములు. వీనికి క్రమముగా సంశయము, నిశ్చయము, గర్వము, స్మరణము - విషయములు. ఇవి సాంఖ్యుల మతమున బుద్ధి, అహంకారము, మనస్సు లని మూడు విధములు.




2. వాసనాత్రయము




ఇవి మూడు 1.లోకవాసన, 2. దేహవాసన, 3. శాస్త్రవాసన.




3. కల్పము :




a day of Brahma or 1000 Mahayugas, being a period of 432, 000, 000 years of mortals and measuring the duration of the world;( శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953)




తాత్పర్యము




కల్పము అనగా కృత ,త్రేతా ,ద్వాపర కలియుగములు




ఈనాలుగు కలిపి ఒకకల్పాంతరము.




ప్రతి యుగమునకు మహాప్రళయం సంభవిస్తుంది .




మరల తర్వాత యుగం ప్రారంభం కావడానికి మధ్య సంధి కాలం వుంటుంది




ఇప్పుడు కనబడే సృష్టికి పూర్వము భగవంతునికి సృష్టి చేయవలెనని కోరిక కలిగింది.




ఆ అంతః కరణమునకు సంబంధించిన వాసనాశేషముతో జరిగిపోయిన కల్పమునందు సృష్టించబోవు ప్రపంచమునకు సంబంధించిన బీజ భూతము ఉండెను




క్రాంతదర్శులైన యోగులు, మునులు తమ సాత్విక బుద్ధి చేత నశించే దానిని హృదయములో విచారణ చేసారు. సత్పదార్థము చేత ఇప్పుడు అనుభవిస్తున్న సకల జగత్తుకు కారణమయిన - కల్పాంతరములో ప్రాణులచే అనుభవించిన కర్మ సమూహ బంధకములను వివేచన చేసి తెలుసుకొన్నారు.




తదైక్షత అని చాందోగ్యోపనిషత్తు. పరమాత్మ విస్తరించాలని సంకల్పించింది — ఆ సంకల్పం చేతనే జగమేర్పడింది. ఈ భావమే ఈ నాసదీయ సూక్త నాలుగవ మంత్రములో చెప్పబడింది.కామము లేకపొతే సృష్టి లేదు. అందువలన జీవులకు తమ కర్మలకు తగిన ఫలములను అనుభవింపచేయుటకు ఈశ్వరుడు సృష్టి చేయాలనుకొన్నాడు.ఇది తమ బుద్ధి చేత ఋషులు తెలుసుకొన్నారని భావం.




సృష్టికి కారణం కోరిక. అదే ప్రధమ బీజం, దేవుని యొక్క మనసు నుంచి ఆ కోరిక పుట్టింది. ఆ కోరిక నుంచే జగత్తు వికసించింది. తమ హృదయాలను శోధించిన ఋషులు , ఉనికికి, ఉనికి లేకపోవటానికి కారణమైన చైతన్యాన్ని దర్శించి . వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.




 




నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-05.(03-09-2016)




तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासीदुपरि स्विदासीत् |




रेतोधा आसन् महिमान आसन्त्स्वधा अवस्तात् प्रयतिः परस्तात् ||




తిరశ్చీనో వితతో రశ్మిరేషామధః స్విదాసీదుపరిస్విదాసీ త్ ।




రేతోధా ఆసన్మహిమానఆసన్త్స్వధా అవస్తాత్ ప్రయతిః పరస్తాత్ ॥ ౫ ॥




పదవిభాగము




తిరశ్చీనః, వితతః , తతః రశ్మిః ఏషామ్ ,అధః స్విత్, ఆసీత్, ఉపరిస్విత్ ఆసీత్ ।




రేతః ధాః ఆసన్ మహిమాన ఆసన్ , స్వధా అవస్తాత్. ప్రయతిః, పరస్తాత్




ప్రతిపదార్థము




ఏషామ్= ఆకాశాది భూత సమూహములను సృష్టించు ఈ సృష్టి పదార్థముల అవిద్యా కామ కర్మలు( మహా మోహం మొదలైనవి)




రశ్మిః= సూర్య కిరణ సమానములు( సూర్య రశ్మి ఉదయము తరువాత నిమేష కాలములో ప్రపంచమంతటా ఎలా వ్యాపించుచున్నదో ఆవిధముగా అవిద్యా కామ కర్మలు వ్యాపించుచున్నవని భావము. ఏ కార్య వర్గము)




వి తతః= విస్తరించబడెనో ఆ కార్య వర్గము మొట్టమొదట




కింతిరశ్చీనః ఆసీత్ = మధ్యలో ఉండెనా?




కింవాధః అసీత్ = కింద భాగములో ఉండెనా?




అహోస్విత్ = లేక (స్విత్=వికల్పము; ప్రశ్నము; సందేహము)




ఉపరి ఆసీత్ = పై భాగములో ఉండెనా?




రేతః ధాః ఆసన్= సృష్టించబడిన కార్యముల మధ్యలో కొన్ని భావములు బీజ భూతమగు కర్మకు సృష్టి కర్తలు, జీవులు , భోక్తలుగా ఉండిరి.




మహిమాన ఆసన్ = గొప్పవగు ఆకాశాదులు భోగ్యములుగా(భోగింపతగినవిగా) ఉండినవి.




స్వధా అవస్తాత్.= అన్నము (భోగ్య పదార్థము) తక్కువగా ఉండెను.




ప్రయతిః,= ఈశ్వరీయ ప్రయత్నము( భుజించువాడు)




పరస్తాత్= గొప్పగా ఉండెను. ( భోగ్యప్రపంచమును భోక్తృ ప్రపంచముకంటె తక్కువగా చేసెను.భోగ్య= భోగింపదగిన; భోక్తృ= అనుభవించు )




తాత్పర్యము




మాయా సహితుడగు పరమేశ్వరుడు సక ల జగత్తును సృష్టించి తానే స్వయముగా వాటిలో ప్రవేశించి, భుజించువాడు, భుజించునది అను విభాగము చేసాడని తాత్పర్యము




సాయణాచార్యుల వారి నాసదీయ సూక్త వివరణము చివరి భాగము (04-09-2016)




को अद्धा वेद क इह प्र वोचत् कुत आजाता कुत इयंविसृष्टिः ।




अर्वाग् देवा अस्य विसर्जनेनाथा को वेद यतआबभूव ॥6॥




ప్రతి పదార్థము




కోఅద్ధా వేద కఽఇహ ప్రవోచత్ కుత।ఆజాతాకుతఽఇయం విసృష్టిః ।




అర్వాగ్దేవా।ఆస్య విసర్జనేనాథాకో వేద యత ఆబభూవ ॥ ౬ ॥




కః= ఏ పురుషుడు




అద్ధా = పరమార్థ రూపములో (విశేష సత్య రూపములో)




వేద = తెలుసుకొనుచున్నాడు?




కోవా ఇహ=ఎవరు ఈలోకమునందు




ప్రవోచత్ =దీనిని వివరించగలరు?




ఇయం= ప్రత్యక్షముగా కనబడు




విసృష్టిః = ఈ వివిధ సృష్టులు( భూత భౌతిక, భోక్తృ, భోగ్యాది రూపములుగా ఉన్న సృష్టి) (భోగ్య= భోగింపదగిన; భోక్తృ= అనుభవించు)




కుతః= ఏ ఉపాదాన కారణము వలన




కుతః= ఏ నిమిత్త కారణము వలన




ఆజాతా=పుట్టింది?(ఈ రెండు విషయములను బాగా)




కోవేద= విస్తారంగా ఎవరు చెప్పగలరు?




దేవాశ్చాస్య= దేవతలు ఈ ప్రపంచములో




విసర్జనేన తేన = ఆకాశాది భూతోత్పత్తికి తరువాత వివిధ భౌతిక పదార్థముల సృష్టి జరిగిన దానితో




అర్వాగ్=పిమ్మట దేవతలు నవీనులుగా చేయబడిరి.




వేద= ఎవరు ఈ జగత్కారణమును తెలుసుకొనుచున్నాడు?




యతః= ఏకారణము వలన ఈ సకల జగత్తు




ఆబభూవ= ఉద్భవించెను




తాత్పర్యము




ఏ పురుషుడు పరమార్థ రూపములో ఈ సృష్టి కారణము తెలుసుకొనుచున్నాడు?ఎవరు ఈలోకములో




దీనిని వివరించగలరు?




ప్రత్యక్షముగా కనబడే భూత, భౌతిక, భోక్తృ, భోగ్యాది రూపాలుగా ఉన్న ఈ సృష్టి ఏ ఉపాదాన కారణము వలన




ఏ నిమిత్త కారణము వలనపుట్టింది? ఈ రెండు విషయములను బాగా విస్తారంగా ఎవరు చెప్పగలరు? (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు.తయారు చేయాలని సంకల్పించే వాడు ఒక కారణము దానిని నిమిత్తము అంటారు. )




ఈ ప్రపంచములో ఆకాశాది భూతోత్పత్తికి తరువాత వివిధ భౌతిక పదార్థముల సృష్టి జరిగిన తర్వాత దేవతలు కొత్తవారిగా చేయబడ్డారు. . ఇటువంటి దేవతలు – సృష్టి తర్వాత ఉన్న దేవతలు ఈ సృష్టి కారణాన్ని ఎలా తెలుసుకోగలరు? ఎలా వివరించగలరు?




దేవతలే తెలుసుకోలేని సందర్భములో వారికంటె వేరైన మనుష్యుడు ఎలా తెలుసుకొనుచున్నాడు? ఏకారణము వలన ఈ సకల జగత్తు పుట్టింది?




इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न ।




यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्ग वेद यदि वा नवेद ॥7॥




ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న।




యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ సో అంగ వేద యది వా న వేద॥




ప్రతి పదార్థము




ఇయం = ఈ




యతః= ఉపాదాన భూతుడగు పరమాత్మ నుండి (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు)




విసృష్టిః = వివిధ పర్వత , నదీ , సముద్ర రూపమైన విచిత్రమగు ఈ సృష్టి




ఆబభూవ =పుట్టింది




యది వా దధే = ఆ పరమాత్మ జగత్తును ధరించవచ్చును




యది వా న=ధరించలేకపోవచ్చును. (ఒకవేళ ధరించగలిగితే భగవంతుడే ధరించవచ్చును. ఇతరులు ధరించుటకు సమర్థులు కారు.




అన్య= భూత భౌతికాత్మకమగు జగత్తుకు




యః అధ్యక్షః= ఎవరు అధిపతియో




పరమే = గొప్పదగు




వ్యోమన్= ఆకాశమునందు(ఆకాశమువలె నిర్మలమైన స్వప్రకాశమందు)




వ్యోమని= నిరతిశయ ఆనందములో ఏ పరమేశ్వరుడు కలడో




వ్యోమని= విశిష్ట స్వరూపమయిన ఆత్మయందు ఏ పరమేశ్వరుడు కలడో




సో అంగ = అతడే




వేద= తెలుసుకొనుచున్నాడు




యది వా న వేద= ఇతరులు తెలుసుకొనలేకున్నాడు




సర్వజ్ఞుడగు ఈ శ్వరుడు తప్ప సృష్టి విషయము మరెవ్వరూ తెలుసుకొనలేరని భావము.




తాత్పర్యము




ఉపాదాన భూతుడగు పరమాత్మ నుండి (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు)వివిధ పర్వత , నదీ , సముద్ర రూపమైన విచిత్రమగు ఈ సృష్టి పుట్టింది




ఆ పరమాత్మ జగత్తును ధరించవచ్చును.ధరించలేకపోవచ్చును. ఒకవేళ ధరించగలిగితే భగవంతుడే ధరించవచ్చును. ఇతరులు ధరించుటకు సమర్థులు కారు.




భూత భౌతికాత్మకమగు జగత్తుకు, ఎవరు అధిపతియో గొప్పదగు నిర్మలమైన స్వప్రకాశమందు,నిరతిశయ ఆనందములో ఏ పరమేశ్వరుడు కలడో, విశిష్ట స్వరూపమయిన ఆత్మయందు ఏ పరమేశ్వరుడు కలడో, అతడే ఈ సృష్టిని తెలుసుకొనుచున్నాడు




ఇతరులు తెలుసుకొనలేకున్నారు.సర్వజ్ఞుడగు ఈ శ్వరుడు తప్ప సృష్టి విషయము మరెవ్వరూ తెలుసుకొనలేరని భావము.




ఇంతటితో సాయణాచార్యులవారు రచించిన నాసదీయ సూక్త భాష్యానికి తెలుగు అనువాదం సమాప్తం.




మంగళమ్ మహత్


-సేకరణ

02-08-2023* *రాశి ఫలితాలు*

 *02-08-2023*

  *రాశి ఫలితాలు*

*మేషం*

భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి. సేవ కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత  పెంచుకుంటారు.  వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

*వృషభం*

 కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయట పడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

*మిధునం*

ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.    నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

*కర్కాటకం*

సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.   సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. 

*సింహం*

చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన  వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.  నిరుద్యోగ  ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

*కన్య*

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో  శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.  గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.  వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలలో  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

*తుల*

దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. 

*వృశ్చికం*

సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు  పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం  ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

*ధనస్సు*

ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన  పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం  కొంత  గంధరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపారవిస్తరణ ప్రయత్నాలు కలిసిరావు.  ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

*మకరం*

సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆదాయం  సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో  ఆశించిన అవకాశములు అందుతాయి.

*కుంభం*

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో  అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

*మీనం*

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన  గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.  ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.

🕉

యుగధర్మము

 కలియుగానికి అధిపతి కలి అన్నారు మరి కృత, త్రేత , ద్వాపర యుగములకు ఎవరు అధిపతులు?


యుగధర్మము ఏమి చెపుతుంది? జ్యోతిషము ఏమి చెపుతుంది?

కలియుగమున అధర్మము పెరుగుటకు కారణము ఏమిటి?

యుగములు: 1. కృతయుగము 2.త్రేతాయుగము 3.ద్వాపరయుగము 4.కలియుగము 


ఇది యుగ ధర్మము. నవగ్రహములను ఈ కాలము నడుపుటకు నియమించినారు. యుగమునకు ఇద్దరి వంతున ఈ చతుర్యుగములను(4 యుగములను) పంచినారు. వారి వారి కారకత్వముల వారు ప్రసరించుచు పాలన చేస్తున్నారు.

ప్రస్తుత జ్యోతిష గ్రంథములలో కొన్ని గ్రహములను క్రూరులుగా పాపులుగా చెప్పినారు నిజముగా ఈ నవగ్రహములలో క్రూరులు లేరు పాపులు లేరు వీరు శుద్ధ పుణ్యులు. అయోని సంభూతులు గర్భమునందు జనించిన వారు కాదు. దేవతా స్వరూపములు. శుద్ధపున్యులు త్రిముర్తులయిన బ్రహ్మ- విష్ణు-మహేశ్వర అంశల జనించినారు. ధర్మ స్వరూపులు ధర్మ బద్దులు అధర్మము చేయనివారు.


వీరు నిజముగా పాప గ్రహములే అయితే దైవత్వమునకు ఎలా అర్హులు అవుతారు? నవగ్రహ మండలములో చోటు ఎలా లభిస్తుంది . 

శుద్ధ పుణ్యులు దేవతలని, పాప పుణ్య మిశ్రితులు  మానవులని, శుద్ధ పాపులు క్రిమి కీటకాది పశు పక్షాదులని ధర్మ శాస్తములు చెప్పుతున్నవి. ఉన్నదికుడా అదే.


ఉదా: ఒకడు బంగారము అమ్మి లాభము పొందుతాడు. మరొకడు ఇనుమును అమ్మి లాభము పొందుతాడు. 

బంగారము అమ్మిన వాడిని గొప్పవాడని అంటావా? ఇనుమును అమ్మిన వాడిని హీనుడని అంటావా?

వస్తువు గోప్పదయినంత మాత్రాన మనిషి గొప్పవాడు అవుతాడా?

వస్తువు హీనమయినంత మాత్రాన మనిషి హీనుడవుతాడా?

వస్తువు హీనమయింత మాత్రాన మనిషి హీనుడు కాడు.


చంద్రునిలో అమృతము ఉన్నది రాహువులో హాలహలమున్నది. హాలాహలము ఉన్నంత మాత్రమున రాహువు పాపికాడు. గ్రహములకు ఇచ్చిన వస్తు సముదాయములో (కారకత్వములు)మంచివి  చెడువి ఉన్నవి. కారకత్వముల వలన పాప గ్రహములు అన్నరుకాని నిజముగ నవగ్రహములలో ఎవరునూ పాపులు లేరు వీరు పూజ్యనీయులు దైవసమానులు పూజించ తగినవారు.


యుగమునకు ఇద్దరి వంతున నియమించి పాలన చేయుచున్నారు అని చెప్పితిని కదా ఇక విను యుగధర్మము.


1.కృతయుగము

ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు(రవి) మంత్రిగా గురువు(బృహస్పతి) నియమితులయ్యారు.

సూర్యుడు, గురువు విష్ణు అంశ వీరు మిత్రులు పరమ పవిత్రులు. సుక్షత్రియుడు, త్రిమూర్తి స్వరూపుడు, ధర్మ స్వరూపుడు, ధర్మ పరాయణుడు అయిన సూర్యుడు రాజుగా శాపానుగ్రహ శక్తి గల బ్రాహ్మణ స్వరూపుడు వేద వేదాంగ స్వరూపము ను తెలిసిన గురువు మంత్రిగా నియమితులు అయ్యారు.


బంగారమునకు అధిపతి గురువు కావున అప్పుడు ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది.

ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది. సకాలమునకు వర్షము మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతున్నారు . రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకి చక్కగా నడిచి ధర్మమయిన పాలన జరిగినది.

కాలమును అనుసరించి బ్రాహ్మణులు మంత్రోపాసన చేత లోక రక్షణకు దేశ రక్షణకు మంత్రములతో  యజ్ఞ యాగములు మొదలగు దైవ కార్యములు చేసి సుభిక్షమయిన కాలము నడుచునట్లు చేసేవారు. నాలుగు భాగముల ధర్మము నడచినది.

సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి. శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడురా రాక్షసుడై పుట్టేందుకే  ఇటువంటి  అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున  త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను.

సృష్టి మొదటినుండి రాక్షస వంశములున్నవని తెలియుచున్నవి. వాక్కు శక్తి వంతమయినది అందుకే కోపమును, వాక్కును ఆడుపులో ఉంచిన వాడు ఉన్నతస్తితికి వెళుతాడు. వాక్కులో అంతటి శక్తి ఉన్నది. 

తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమగుటకు కారణము.

ఈవిధముగా కృతయుగమున  సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.


2. త్రేతాయుగము.

ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు(మంగళుడు)మంత్రిగా శుక్రుడు మంత్రిగా నియమితులై పాలన నడుపుతున్నారు.

కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా – వామాచారుడు (ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు) రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు (యువతలకు)కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించ వలసి వచ్చింది.రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము  చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి భాదించు చుండెడివారు.  

రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పిడించుచు రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు పానహానిని గలిగించిరి. 

నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించునట్లు చేసెను. 

దైవబలము తగ్గెను రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది.

కుజ గ్రహ బలము  చేత ధనుర్ విద్యా పారంగతులు (రామాయణము) అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించు చుండిరి.

ఈ విధముగా   త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరము అడుగిడినది.


3. ద్వాపరయుగము

ఇక ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన్ చేస్తున్నారు.

చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగోల్పెను.

బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కలిపించెను. దేవతా కార్యములు అర్థ భాగము నశింపు చేసెను. రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మార్చెను.

నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచినది.

చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని (ఇంద్రుని అంశలు – ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు) తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయము చేసెను.

ఈ విధముగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అయినది. మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అయినది. 

4. కలియుగము

ప్రస్తుతము మనమున్నది కలియుగమున.

ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు.

రాహువు కేతువు ఒకరికి ఒకరు పడని వారు రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. 

ఎప్పుదయితే నాలుగు ధర్మ శాస్త్రములు మాయమయినవో అప్పుడు కలియుగము ముందుకు నడిచేను.

ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చెను.


అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తెను.

వావి వరుసలు తప్పెను, వర్ణ సంకరములు మొదలయ్యెను, దొరలే దొంగలయిరి. దైవభక్తి తగ్గెను, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయ్యెను. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చెను. హింసా సిద్ధాంతము ఎక్కువ అయ్యింది, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఏవిధముగా నయినా ధనము(సిరి) స్త్రీని పొందినవాడే గొప్పవాడని చెప్పువారు చేయువారు ఎక్కువయ్యేను. బందు ప్రీతి దురంయ్యేను. సంసారం సుఖము శూన్యమయ్యే కాలము వచ్చెను. దొంగలకు దారి చూపే ప్రజలు, ప్రభువులు పెరిగారు. ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయెను. వర్ణ ద్వేషములు మత ద్వేషములు పెరిగెను. మంచివారు , ధర్మపరులు, సత్యవంతులు దుర్మార్గులచే పీడించపడిరి. 

కేతువు మంత్రిగా ఉన్న కాలములో కొంత మంది ధర్మ పరాయణులు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు కార్యములు చేస్తున్నారు.

ఈవిధముగా చెప్పుటకు వీలు కాని విధముగా కాలము ఈ కలియుగమున నడుస్తున్నది. ఇంకా కలియుగము నడువ వలసి ఉన్నది.

చిత్రగుప్తుడి జననం

 నిత్యాన్వేషణ: 


చిత్రగుప్తుని జన్మ వృత్తాంతమేమిటి?

చిత్రగుప్తుడి జననం చాలా రకాలుగా వర్ణించబడి ఉన్నా ఆయన బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అనేది కథనాలన్నింటిలో కనిపించే ఉమ్మడి సారాంశం. బాగా ప్రాచుర్యం చెందిన కథ ప్రకారం బ్రహ్మ యమలోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించ లేక అప్పుడప్పుడూ వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. బ్రహ్మ యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు కానీ ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు నిర్వహించడం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసే సరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం, కాగితం పట్టుకుని కనిపించాడు. చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకు జన్మించిన వారసులను కాయస్థులు ఆని వ్యవహరిస్తారు.మొదటగా బ్రహ్మ మనసులో ఆలోచనగా మొదలై (చిత్ర), మిగతా దేవతలకు తెలియకుండా (గుప్తంగా) సృష్టించబడ్డాడు కాబట్టి అతని పేరు చిత్రగుప్తుడు అయ్యింది.

ఈ భూలోకంలో దుష్టశిక్షణగావించి ధర్మ స్ధాపన చేయదలిచాడు. పాపాలు చేసినవారిని కఠినంగా శిక్షించి నీతి నియమాలను కాపాడే భాధ్యతను యమధర్మరాజుకు అప్పగించాడు. కానీ ఈ లోకంలోని పాపుల సంఖ్య పెచ్చు పెరిగి విధి నిర్వహణ అసాధ్యం కాగా యమ ధర్మరాజు తనకొక సహాయకుని ఏర్పాటు చేయమని మొరపెట్టుకున్నాడు.

అప్పుడు పరమేశ్వరుడు ఒక బంగారు పళ్ళెంలో ఒక రూపాన్ని చిత్రీకరించాడు. ఆవిధంగా చిత్రం నుండి ఆవిర్భవించినవాడే చిత్రగుప్తుడు. పరమశివుడు చిత్రగుప్తుని కి మానవుల పాప పుణ్యాలు లెక్క కట్టి యమ ధర్మరాజు వద్దకి తీసుకుని వెళ్ళే బాధ్యతను అప్పజెప్పేడు.

చిత్రగుప్తుని పాప పుణ్యాల లెక్క ప్రకారం యమధర్మరాజు శిక్షలు విధించి వాటిని సక్రమంగా అమలుపర్చి ధర్మాన్ని పరిరక్షిస్తూంటాడు. అటువంటి ఒక గొప్ప భాధ్యతాయుతమైన విధిని నిర్వహించే చిత్రగుప్తుడు హిమాలయా పర్వతాలలో సుదీర్ఘకాలం తపస్సు చేసి అనేక శక్తులు సంపాదించాడు.

అటువంటి చిత్రగుప్తునికి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదిగా ప్రసిధ్ధి పొందిన కాంచీపురంలో ఒక దేవాలయం (నెల్లుక్కారర్ వీధిలో) నిర్మించబడి వున్నది. 9 వ శతాబ్దానికి చెందిన చోళరాజులు ఈ అపూర్వ ఆలయాన్ని నిర్మించారు.

కాంచీపురం ఒక్క చోటనే చిత్రగుప్తుని కి ప్రత్యేక ఆలయం వున్నది. మూడు అంతస్తుల రాజగోపురం గల ఈ ఆలయంలో చిత్రగుప్తుడు కుడిచేత ఘంటం, ఎడమచేత తాళపత్రాలు ధరించి ఆశీనముద్రలో దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు.

ఇక్కడ చైత్రమాసంలో చిత్రగుప్తునికి ఉత్సవాలు చేస్తారు. చైత్ర పౌర్ణమికి ముందు రోజు చతుర్దశినాడు చిత్రగుప్తునికి కర్ణకిదేవితో వివాహోత్సవం జరిపి పౌర్ణమినాడు బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపుతారు. ఈ ఆలయం కాంచీపురం బస్ స్టాండ్ కి సమీపమున రాజవీధిలో వున్నది.

ధర్మము శ్రద్ధచేతనే సాధ్యపడుతుంది

 🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*మహాభారతే* : -


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


 *శ్రద్ధయా సాధ్యతేధర్మః |* 

*మహద్భిర్నార్ధరాశిభిః |*

*నిష్కించనాస్తుమునయః |* 

*శ్రద్ధావంతో దివంగతాః।*

*ధర్మార్ధకామమోక్షాణాం|*

 *శ్రద్ధాపరమకారణం*

*పుంసామశ్రద్దధానానాం।* 

*నధర్మోనాపి తత్ఫలం |*


*ఇతి శ్రద్ధావివేచనం*


≈తాత్పర్యం≈


ధర్మము శ్రద్ధచేతనే సాధ్యపడుతుంది. గొప్ప ధనరాశులవల్ల సాధింపబడదు. ధన సంపద లేవీలేని మహర్షులు శ్రద్ద గలవారై స్వర్గలోకాన్ని పొందారు.ధర్మార్ధ కామమోక్షాలనే పురుషార్ధ చతుష్టయ సాధనకు శ్రద్ధయే ముఖ్యకారణము. శ్రద్ధలేని పురుషులకు ధర్మమూ లేదు ధర్మఫలమూలేదు. అని మహాభారతవచనం.

Aap jasa


 

ప్రణతులర్పించు చుంటిని భక్తి తోడ

 శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత

                       శివానందలహరీ


                             01


కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే

శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున

ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్                            

                                                              


శ్రీకరాన్విత లసత్ చిత్ సర్వ కళలతో

           విభవోన్నతంబుగా వెలుగు వారు

శిఖలోన విధురేఖ చెలువమై  ధరియించి

            యత్యంత శోభను నమరు వారు

నొ0డొరుల్ తపముచే నొనగూరు చుండియు

         నిజ తపః ఫలమున నెగడు వారు

సకల జీవాళికి న్నకలంక  శుభమిచ్చు 

           మంగళాకృతులందు  మనెడు వారు 

ధ్యాన హృత్  కుహరాన తాముండి సతతంబు

          మఱి మఱి ప్రకటిత మయెడి వారు

విమలమౌ నానంద విస్ఫురణంబున

           స్వస్వరూపపు బోధ సల్పు వారు

శ్రీయుమామహేశ్వరుల నాచిత్త మందు

ధ్యాన మొనరించి యత్యంత తన్మయమున

భవములను బాపి శాశ్వత శివములీయ

ప్రణతులర్పించు చుంటిని భక్తి తోడ            01 @


గోపాలుని మధుసూదన రావు 🙏

శివానందలహరీ

 శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత

                       శివానందలహరీ


                             01


కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే

శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున

ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్                            

                                                              


శ్రీకరాన్విత లసత్ చిత్ సర్వ కళలతో

           విభవోన్నతంబుగా వెలుగు వారు

శిఖలోన విధురేఖ చెలువమై  ధరియించి

            యత్యంత శోభను నమరు వారు

నొ0డొరుల్ తపముచే నొనగూరు చుండియు

         నిజ తపః ఫలమున నెగడు వారు

సకల జీవాళికి న్నకలంక  శుభమిచ్చు 

           మంగళాకృతులందు  మనెడు వారు 

ధ్యాన హృత్  కుహరాన తాముండి సతతంబు

          మఱి మఱి ప్రకటిత మయెడి వారు

విమలమౌ నానంద విస్ఫురణంబున

           స్వస్వరూపపు బోధ సల్పు వారు

శ్రీయుమామహేశ్వరుల నాచిత్త మందు

ధ్యాన మొనరించి యత్యంత తన్మయమున

భవములను బాపి శాశ్వత శివములీయ

ప్రణతులర్పించు చుంటిని భక్తి తోడ            01 @


గోపాలుని మధుసూదన రావు 🙏

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -8🪔*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -8🪔*


 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *శేషాద్రి యొక్క పుట్టు పూర్వోత్తరములు:* 


వాయుదేవుడు ఏ వస్తువు నయిననూ అవలీలగా కదలించగల శక్తి సంపన్నుడు.


 ఆదిశేషుని యొక్క శక్తికి అవధియే లేదు కదా! శక్తిసంపన్నులయిన వీరికి పూర్వము తగవు యేర్పడింది.


 ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు.


‘‘ఆనంద పర్వతమొక్కటి యున్నదని మీకు తెలిసియేయున్నది కదా! ఆ యానందపర్వతము మేరు పర్వతము నుండి పుట్టినది. అది చాలా గొప్ప కొండ, దానిని కదలించుట మహాశక్తి సంపన్నులకు గానీ సాధ్యము కాదు. 


మీలో ఎవ్వరకు దానిని కదలింపగలరో, వారే అధికశక్తి కలవారనీ తెలియుటకు వీలుండును. ఈపరీక్షకు మీరంగీకరింతురా?’’ అనెను వారు వెంటనే, ‘‘అంగీకరించినాము’’ అని బలదర్పములతో పలికి, ఆనందపర్వతము వద్దకు వెళ్ళారు.


 ఆదిశేషుడు ఆనందపర్వతాన్ని గట్టిగా చుట్టాడు. పుంజుకున్న బలముతో దానిని కదుప జూచినాడు. 


ఎంత ప్రయత్నించిననూ ఫలితము శూన్యమైనది. ఆశ్చర్యము? సమస్త భారమును వహింపగల ఆదిశేషుడు ఆనంద పర్వతమును ఇసుమంతయినా కదపలేక పోయాడు, 


మరియొక ఆశ్చర్యము! సుడిగాలిగాను తుఫానుగాను వచ్చి, ఎంతటి బలవత్తరమయిన వస్తువునైనను చలింపజేయగల వాయుదేవుని ప్రయత్నములు కూడా వమ్మయిపోయినవి. 


ఆదిశేషుడు, వాయుదేవుడు ఇద్దరునూ వారి వారి బలములను జూపి ఆనంద పర్వతమును కదలించవలెనని చివరవరకూ చాలా ప్రయత్నించారు కాని, యే మాత్రమూ లాభము లేకపోయినది.


వారిద్దరి పట్టుదలల వలన ఆనంద పర్వతము మీద నివసించు వాయుదేవుని మహోన్నత విజ్ఞంభణ శక్తికి లోకములోనే అలజడి ప్రారంభమయి హెచ్చసాగినది. 


సర్వప్రాణులకు వాయువు ముఖ్యము కదా! ఇంద్రుడు ఆదిగా గల దేవతలు దీనికి ఒక పరిష్కార మత్యంతావశ్యకమని అనుకున్నారు. వారు ఆదిశేషుని వద్దకు బయలుదేరి వెళ్ళారు.


 వినయముగా ఆదిశేషునకు నమస్కరించి యీ విధముగా అన్నారు. ‘‘స్వామీ ఇవి ఏమి మీ పట్టుదలలు? యుక్తాయుక్త విచక్షణలు తెలిసిన మీరే యీ విధముగా ఇతర ప్రాణులకు భీతిగొలుపు విధముగా వ్యవహరంచుట ధర్మమా? 


మీ నుండి గదా ధర్మాధర్మములు మేము నేర్చుకొనవలసియున్నది! ఆ వాయుదేవుని భయకర విజ్ఞంభణమునకు లోకము లల్లాడిపోవుచున్నవి. మీరు భూతహితైక దృష్టిని పూర్తిగా యోచించి, యీ ఆనంద పర్వత చాలాన ఘనకార్య జనితోపద్రవమును తప్పించవలసియున్నది.


 ఇందులకు మీరే సహస్ర విధముల నర్హులు, మా యెడల కరుణాదృష్టి గలిగి మీరైన పట్టు సడలించగోరుచున్నాము.’’


ఆదిశేషుని యొక్క హృదయము ప్రాణికోటి యెడల చల్లబడినది. వారల మొరవిని, యాతడు తన పట్టుదలను కొంచెము సడలించెను. పట్టును ఎప్పుడయితే ఆదిశేషుడు సడలించాడో, వాయుదేవునికి పనే సులవయ్యెను. వెనువెంటనే వాయుదేవుడు ఆనంద పర్వతమును ఆకాశమార్గమునకు ఎగర గొట్టినాడు.


ఎగరగొట్టబడిన ఆ పర్వతము వెళ్ళి భూలోకము నుండి వరాహక్షేత్రములో  స్వర్ణముఖీ నదీ తీరానబడినది. 


శేషుని కారణముగానే భూలోకమునకు ఆ పర్వతము వచ్చినది. 


ఆ కారణముగానే ఆ పర్వతానికి శేషాద్రియను పేరు వచ్చినది. శేషాద్రిని దర్శించిన మాత్రముననే సర్వపాపములూ పటాపంచలగుననుట సందేహము లేని విషయము.


 *బలరామానుజ గోవిందా, భౌద్ధకల్కి గోవిందా,* *వేణుగానలోల గోవిందా, వేంకటరమణా గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||8* ||

 

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం


 *ఓం నమో వెంకటేశాయ* 


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 129*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 129*


🔴 *రాజనీతి సూత్రాణి: షష్ఠాధ్యాయము - (2)*


52. న మీమాంస్యా గురువః 

(పెద్దల్ని విమర్శించకూడదు.)


53. ఖలత్వం నోపేయాత్ (దుష్టుడుగా అవకూడదు.)


54. నాస్తి ఖలస్య మిత్రమ్ 

(దుష్టుడికి మిత్రుడనేవాడు ఉండడు.) 


55. లోకయాత్రా దరిద్రం బాధతే 

(దరిద్రుడికి నిత్యజీవనం కూడా కష్టంగా ఉంటుంది.) 


56. అతిశూరో దానశూరః 

(దానశూరుడే గొప్పశూరుడు.)


57. గురుదేవబ్రాహ్మనేషు భక్తిర్భూషణమ్ (గురువులమీదా, దేవతలమీదా, సద్భ్రాహ్మణుల మీద భక్తి ఉండడం అలంకారం.) 


58. సర్వస్య భూషణం వినయః 

(వినయం అందరికీ అలంకారమే.) 


59. అకులీనో - పి వినయః కులీనాద్విశిష్ట (ఉత్తమకులంలో పుట్టకపోయినా వినియవంతుడు ఉత్తమకులం వాడికంటే గొప్పవాడు.)


60. ఆచారాదాయుర్వర్థతే కీర్తి శ్రేయశ్చ 

(సదాచారం వల్ల ఆయుర్ధాయం, కీర్తి, శ్రేయస్సు వృద్ధి పొందుతాయి.) 


61. ప్రియమప్యహితం న వక్తవ్యమ్ 

(ప్రియమే అయినా హితం కానిది చెప్పకూడదు.) 


62. బహుజనవిద్దమేకం నానువర్తేత 

(చాలామంది అభిప్రాయానికి వ్యతిరేకంగా నడిచే ఒక వ్యక్తిని అనుసరించకూడదు.) 


63. న కృతార్థేషు నీచేషు సంబంధ 

(పనులు చేసి పెట్టే వాళ్ళయినా నీచులతో సంబంధం పెట్టుకోకూడదు.) 


64. ఋణశత్రువ్యాధయో నిఃశేషా కర్తవ్యా (ఋణాన్ని, శత్రువుల్నీ, వ్యాధుల్నీ పూర్తిగా రూపుమాపాలి.) 


65. భూత్యనువర్తనం పురుషస్య రసాయనమ్ (ఐశ్వర్యం అవిచ్ఛిన్నంగా ఉండడమే మనిషికి బలవర్థకౌషధం.) 


66. నారిష్వవజ్ఞా కర్తవ్యా 

(యాచకుల విషయంలో అనాదరం చూపకూడదు.) 


67. దుష్కరం కర్మ కారయిత్వా కర్తరమవమన్యతే నీచాః 

(నీచుడు కష్టమైన పని చేయించుకుని ఆ చేసిన వాడ్నే అవమానిస్తాడు.) 


68. నాకృతజ్ఞస్వ నరకాన్నివర్తనమ్ 

(కృతజ్ఞత లేనివాడు నరకం నుంచి తిరిగి రావడం ఉండదు.) 


69. జిహ్వాయత్తౌ వృద్ధినాశౌ 

(అభివృద్ధియైనా, వినాశనమైన నాలుకమీదనే ఉంటాయి.) 


70. విషామృతయోరాకరీ జిహ్వా 

(నాలుక విషానికీ అమృతానికీ కూడా జన్మస్థానం.) 


71. ప్రియవాదినో శత్రుః 

(ప్రియంగా మాట్లాడే వాడికి శత్రువు ఉండడు.) 


72. సుత్తా అపి దేవాస్తుష్యంతి 

(స్త్రోత్రం చేస్తే దేవతలు కూడా సంతోషిస్తారు.) 


73. అనృతమపి దుర్వచనం చిరం తిష్టతి (అసత్యమే అయినా చెడ్డమాట చాలా కాలం నిలిచిపోతుంది.) 


74. రాజద్విష్టం న వక్తవ్యమ్ 

(రాజుకు ద్వేషం కలిగించే మాట మాట్లాడకూడదు.) 


75. శ్రుతిసుఖాత్ కోకిలాలాపాదపి తుష్యంతి జనాః (చెవికి ఇంపుగా ఉండే కోకిల కూత విన్నా కూడా జనులు సంతోషిస్తారు.) 


76. స్వధర్మహేతుః సత్పురుషః 

(స్వధర్మం నిలబెట్టేవాడే సత్పురుషుడు.) 


77. నాస్త్యర్ధినో గౌరవమ్ 

(యాచకుడికి గౌరవం ఉండదు.) 


78. స్త్రీణాం భూషణం సౌభాగ్యమ్ 

(స్త్రీలకు సౌభాగ్యమే ఐదవతనం, అలంకారం.) 


79. శత్రోరపి న పాతనీయా వృత్తిః 

(శత్రువైనా వాడి కడుపు కొట్టకూడదు.)


80. అప్రయత్నోదకం క్షేత్రమ్ 

(ఎక్కువ ప్రయత్నం చేయకుండా నీరు లభించేదే మంచి పొలం.) 


81. ఎరండమవలమ్య కుజ్జ్ఞంనం న కోపయేత్ (ఆముదంచెట్టు ఆసరా చూసుకొని ఏనుగుకు కోపం కలిగించకూడదు.) 


82. అతిప్రవృద్దాపి శాల్మలీ వారణస్తమ్బో వారణస్తమ్బో న భవతి 

(ఎంత లావుగా పెరిగినా బూరుగచెట్టు ఏనుగును కట్టడానికి ఉపయోగించరు.)


83. అతిదీర్ఘోపి కర్ణికారో న ముసలీభవతి 

(కర్ర ఎంత పొడవుగా ఉన్నా రోకలిగా ఉపయోగించకూడదు.) 


84. అతిదీప్తోపి ఖద్యోతో న పావకః 

(ఎంత ప్రకాశిస్తున్నా మిణుగురు పురుగు నిప్పు కాదు.) 


85. న ప్రవృద్దత్యం గుణహేతుః 

(సంపద పెరిగినంత మాత్రాన సద్గుణాలు రావు.) 


86. సుజీర్ణో పిచుమందో న శజ్కులాయతే 

(ఎంత ముదిరినా వేపకర్ర అడకత్తేరకు ఉపయోగపడదు.) 


87. యథా బీజం తథా నిష్పత్తిః 

(విత్తనాన్ని పట్టి దిగుబడి ఉంటుంది.) 


88. యథా కులం తథా బుద్ధిః 

(చదువును పట్టి బుద్ధి.) 


89. యథా కులం తథాచారః 

(కులాన్ని పట్టి ఆచారం.) 


90. సంస్కృతః పిచుమందో న సహకారో భవతి (ఎంత దోహదం చేసినా వేప తియ్యమామిడి కాదు.) 


91. న చాగతం సుఖం త్యజేత్ 

(వచ్చిన సుఖాన్ని విడిచిపెట్టుకోకూడదు.) 


92. స్వయమేవ దుఃఖమధిగచ్చతి 

(దుఃఖం దానంతట అదే వస్తుంది.) 


93. రాత్రిచారణం న కుర్యాత్ 

(రాత్రులలో తిరగకూడదు.) 


94. న చార్ధరాత్రం స్వపేత్ 

(అర్ధరాత్రి వరకూ మేల్కొని అప్పుడు నిద్రపోకూడదు.) 


95. తద్విద్వద్భిః పరీక్షేత 

(విద్వాంసులతో కలిసి పరీక్షించాలి.) 


96. పరగృహమకారణతో న ప్రవిశేత్ 

(కారణం లేకుండా ఇతరుల ఇంట్లోకి వెళ్ళకూడదు.) 


97. జ్ఞాత్వాపి దోషమేవ కరోతి లోకః 

(జనం తెలిసి కూడా తప్పులు చేస్తుంటారు.) 


98. శాస్త్రప్రధానా లోకవృత్తిః .

(లోకవ్యవహారం శాస్త్రం ప్రకారం జరగాలి.) 


99. శాస్రభావే శిష్టాచారమనుగచ్చేత్ 

(శాస్త్రం లేనప్పుడు శిష్టుల ఆచారం అనుసరించాలి.)


100. నాచారితాచ్చాస్త్రం గరీయః 

(శాస్త్రం వాడుకలో ఉన్న శిష్టాచారం కంటే గొప్పది కాదు.)


101. దూరస్థమపి చారచక్షుః పశ్యతి రాజా 

(రాజు గూడాచారులనే నేత్రంతో దూరంగా ఉన్నదానిని కూడా చూస్తాడు.) 


102. గతానుగతికో లోకః 

(ఒకరు ఏది చేస్తే అందరూ అది చేస్తూ ఉంటారు.)


103. యమనుజీవేత్ తం నాపవదేత్ 

(ఎవర్ని ఆశ్రయించి జీవిస్తున్నాడో వారిని ఆడిపోసుకోకూడదు.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Government school


 

Nature


 

విస్తరాకు

 *విస్తరాకు.....మనిషి జీవితం* *మిత్రమా*  *"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము.  భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం *'ఆకును' (విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం.  *"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము..  *'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.  *'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి.  మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *"వాయిదా"* వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు  *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు..   ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?   కనీసం  *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు..   అందుకే *'ఊపిరి'* ఉన్నంత వరకు *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'జీవించండి'*...                                           *ఇదే జీవిత పరమార్ధం*

నాశమునొందడు

 ll శ్లోకం ll*


*పణ్దితైస్సహ సాఙ్గత్యం*

*పణ్దితైస్సహ సంకథాః।*

*పణ్దితైస్సహ మిత్రత్వం*

*కుర్వాణో నావసీదతి॥*


*తా𝕝𝕝 పండితులతో సహవాసం,పండితులతో ....మాటలాడుట, పండితులతో మైత్రి - వీటిని ఆచరించువాడు నాశమునొందడు*.....

పంచాంగం 02.08.2023 Wednesday,

 ఈ రోజు పంచాంగం 02.08.2023  Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: ప్రతిపత్తి తిధి సౌమ్య వాసర: శ్రవణా నక్షత్రం ఆయుష్మాన్  యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పాడ్యమి రాత్రి 08:06 వరకు.

శ్రవణం మధ్యాహ్నం 12:58 వరకు.

సూర్యోదయం : 05:59

సూర్యాస్తమయం : 06:45

వర్జ్యం : సాయంత్రం 04:28 నుండి 05:52 వరకు.

దుర్ముహూర్తం: పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

దైవాన్ని కోరిక ఎలా కోరాలి*

 *దైవాన్ని కోరిక ఎలా కోరాలి*


*1.నువ్వు బతికి* *ఉన్నంత కాలం* *ధార్మిక* *కార్యాలు నీ సంపదతో చేయాలి అని* *కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.*


2. *నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.*


3. *నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..*


4. *నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.*


5. *నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..*


6. *భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...*


7. *కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..*


*8 *చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..*

*మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.*

దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*

   *ఓం నమో భగవతే వాసుదేవాయ*

 🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁





*దైవానుగ్రహం...!!*

*మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరంగా ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు అర్థమవుతుంది...*


*తల్లి కడుపులో చిన్న వీర్యపు బిందువుగా మొదలైన మన జీవితం తొమ్మిది నెలల్లో చక్కని రూపుదిద్దుకోవడం మనకు అనుగ్రహంగా కనిపించటంలేదు. పుట్టినప్పుడు జానెడు పకందుగా ఉండి ఆ తర్వాత ఆరడుగులు పెరగడంలో ఆశ్చర్యం కలగటంలేదు.* 


*కానీ ఎవరో ఎక్కడో ఏదో ఒక వస్తువు సృష్టించారని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతాం. మనం అనుభవించటం మినహా స్వయంగా చేయలేని ఎన్నో విషయాలు ప్రకృతి మనకు అందిస్తుంది. మనతో నిమిత్తం లేకుండా జరిగిపోయే పనంతా దైవమే...*


*గులాబీ మొక్క నాటి నీళ్ళు పోస్తే, పువ్వు సిద్ధమవుతుంది. కానీ ఇది దైవానుగ్రహం అని మనకు అనిపించదు.*


*మామిడిపండులోని తియ్యదనం అంటే ఇష్టపడతాం. అది మనకు లభించటాన్ని అనుగ్రహం అంటాం. పండులో తియ్యదనం ద్వారా వ్యక్తమైన అనుగ్రహం భూమిలో టెంకె నాటినప్పుడే ఉంది.*


*రుచికరమైన వంటచేసి పెట్టినవారి శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెప్తాం... కానీ అసలు ఆ వంటకు మూలమైన ఆహార పదార్థాలను అందించిన దైవానుగ్రహాన్ని మనం గుర్తించం, మనం తినేది , అనుభవించేది, అంతా దైవానుగ్రహంగా భావించాలి.*


*ఈ సృష్టి అంతా దైవానుగ్రహంగా వ్యక్తమవుతుంటే... కొంత మంది మాత్రం పరిమిత ఫలాల్ని ఆశించి అవి నెరవేరటాన్ని బట్టి అనుగ్రహాన్ని కొలతలు వేసుకుంటారు... అది చాలా అజ్ఞానం ...*


             *🌺శుభమస్తు🌺*

*🌻సమస్తలోకా సుఖినోభవంతు🌻*

 🪷🪷🍁 🙏🕉️🙏 🍁🪷🪷

సుబ్రహ్మణ్యునికి శ్రీ మహా విష్ణువుకు

 



పరమాచార్య స్వామివారు, సుబ్రహ్మణ్యునికి శ్రీ మహా విష్ణువుకు ఉన్న సంబంధాన్ని, ఉత్తర దక్షిణ భారతాలలో స్వామివారి పేర్లలో ఉన్న విభిన్నతను, కుమారసంభవం అన్న పదానికి వాల్మికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని ఈ ఉపన్యాసంలో చెబుతున్నారు.


అరుణగిరినాథర్ తన “కందర్ అనుభూతి”లో సుబ్రహ్మణ్యుణ్ణి వల్ల తను పొందిన అద్వైత జ్ఞానాన్ని పొగిడాడు. తన ‘తిరుప్పుగళ్’ సంకలనంలోని ప్రతి పద్యాన్ని ‘పెరుమాళే’(గొప్పవాడు) అన్న పదంతో ముగించాడు. సాధారణంగా ‘పెరుమాళ్’ అన్న పదం శ్రీ మహా విష్ణువుకు సంబంధించినది. ప్రతి ఊరిలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం ఉండడం మనం చూస్తుంటాము. శివపార్వతుల ఇద్దరి తేజస్సుతో ఉద్భవించిన సుబ్రహ్మణ్యుణ్ణి అరుణగిరినాథర్ ‘పెరుమాళే’ అని పిలవడం చాలా అద్భుతమైన విషయం.


తమిళనాడులో సుబ్రహ్మణ్యుణ్ణి సాధారణగా శ్రీ మహా విష్ణువు సంబంధంతో ‘మురుగన్’ అని పిలుస్తారు. ఎందుకలా? ఎందుకంటే, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి. శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మాల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి. ‘మరుమగన్’ అంటే అల్లుడు. పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ

ధ్యానం చేద్దాం

 శు భో ద యం🙏


గోవిందపదసమాశ్రయణమే!సర్వశ్రేయోదాయకము.


గోవింద పదారవింద  మహిమ!


                  ఉ: పొందరు  దుఃఖముల్,  భయము పొందరు, పొందరు  దైన్య మెమ్మయిన్,


                       పొందరు  తీవ్ర దుర్దశలు , పొందు ప్రియంబులు , పొందు   సంపదల్


                      పొందు సమగ్ర సౌఖ్యములు , పొందు సమున్నత  కీర్తు  లెందు,,   గో


                       వింద  పదారవింద  పదవీ  పరిణధ్ధ   గరిష్ట   చిత్తులన్;


                            నృసింహ పురాణము-  ఎఱ్ఱాప్రెగ్గడ;


                      

                 గోవింద పదారవింద  ధ్యాన పరాయణులకు  దుఃఖములు రావు. (దుఃఖములకు వెరువరని భావము)  భయముండదు.

జీవన దైన్యముండదు. దుర్దశలు  దాపురించవు.  ప్రియములు  కలుగుచుండును. సంపదలు కలుగును. సంపూర్ణమైన  సుఖములు కలుగును. సర్వోన్నతమైన కీర్తికలుగును.ననిభావం!


                         ఈపద్యంలో  ఒక  చమత్కారం ఉన్నది. గోవిందుని గొలచినవారికి  కలుగని  కీడులు ఒకవరుసగాను, కలిగెడు

లాభములను మరియొక వరుసగాను వివరించుట.


                      నవ విధ భక్తి మార్గాలలో  పాద సేవ సముచిత మైనది. అహంకార రాహిత్యము నొనగూరిచి, మనో విశుధ్ధిని  కలిగించుటకు  అది చక్కనిమార్గం.  సనక సనందనాది భక్తులు గోరిన దదియే! నేడు  తొలి  యేకాదశీ  సందర్భముగా మనమందరం

ఆదేవదేవుని పై మనసు నిలిపి  ధ్యానం  చేద్దాం. ముక్తిమాట  యేమైనా కనీసం  చిత్త శాంతితో  ప్రశాంతంగా  బ్రతికే అవకాశం కోసం

ప్రయత్నం చేద్దాం!


                                                           స్వస్తి!🙏🌷🌷🌷

⚜ శ్రీ అహల్యాదేవి మందిర్

 🕉 మన గుడి : 






⚜ బీహార్ : అహియారి (దర్భంగా జిల్లా )


⚜ శ్రీ అహల్యాదేవి మందిర్ 


💠 దేశంలోని పలు ప్రముఖ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై నిషేధం ఒక వైపు ఉండగా, మరో వైపు దేశంలో పూజారిగా ఒక మహిళ ఉన్న ఆలయం ఉంది. 

ఈ ఆలయం త్రేతాయుగానికి సంబంధించినది

స్త్రీ పూజారి పాత్రను చేసే భారతీయ ఏకైక ఆలయం.

ఈ విశిష్టమైన ఆలయం ఎక్కడ ఉంది మరియు దాని మతపరమైన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం...


💠 ఈ ఆలయాన్ని శాప రహిత ప్రదేశం అంటారు.

ఈ ఆలయం బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని 

ఆహియారిలో ఉంది. 

ఈ ఆలయంలో అహల్య దేవి కొలువై ఉంది.

ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కేవలం మహిళా పూజారులు మాత్రమే పూజలు చేస్తారు.


💠 శ్రీ రామచంద్రుడు  అవధ్‌పురి నుండి జనక్‌పూర్‌కు వెళుతున్నప్పుడు, అతను శిలగా మారిన అహల్య పాదాలను తాకాడని, వెంటనే ఆమె సజీవ మానవ రూపంలోకి వచ్చిందని నమ్ముతారు. అప్పటి నుండి ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది మరియు గౌతమ ఋషి భార్య అయిన అహల్య దేవి యొక్క మోక్ష స్థలంగా పూజించబడుతుంది.


💠 అదే విధంగా ఇక్కడి  గౌతమ, అహల్య స్థాన్ కుండ్‌లలో స్నానం చేసి భుజాలపై బెండకాయలు వేసుకుని ఆలయానికి వచ్చిన వారికి రోగాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.


⚜ స్థలపురాణం ⚜


💠 అహల్య ఇంద్రలోకంలోని అందమైన ఆడపిల్ల అయిన ఊర్వశి యొక్క అతి విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి సప్తర్షి యొక్క ఖగోళ అవశేషాలతో బ్రహ్మ దేవుడు స్వయంగా సృష్టించాడు.  తర్వాత అహల్యకు గౌతమమహర్షితో వివాహం జరిపించారు. 


💠 రామాయణం ప్రకారం , రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలాపురిలోని అటవీ వనాలను చూడడానికి బయలుదేరినప్పుడు, వారికి ఒక తోటలో నిర్జన ప్రదేశం కనిపించింది.

 రాముడు, "ప్రభూ! ఈ ప్రదేశం ఆశ్రమంలా కనిపిస్తోంది, కానీ ఇక్కడ ఋషిగానీ, ఋషి పరివారంగానీ కనిపించకపోవడానికి కారణం ఏమిటి?" 

ఈ ప్రదేశం ఒకప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమం అని విశ్వామిత్ర మహర్షి చెప్పారు. 


💠 భార్యతో కలిసి ఇక్కడే ఉంటూ తపస్సు చేసేవాడు. ఒకప్పుడు ఇంద్రుడు  అహల్యపై మోహానికి లోనయ్యాడు. 

అహల్య దేవి పవిత్రురాలు అని ఇంద్రుడికి తెలుసు. అందుకే గౌతమ ఋషి తన ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు గౌతమ ఋషి వేషం వేసుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు.


💠 ఇంద్రుడు  గౌతమ ఋషి వేషంలో అహల్య నుండి ప్రేమను కోరాడు . అహల్య ఇంద్రుడిని గుర్తించి ఆమోదించలేదు. ఇంద్రుడు తన లోకానికి తిరిగి వస్తున్నప్పుడు, తిరిగి తన ఆశ్రమానికి వస్తుండగా గౌతమ ఋషి దృష్టి అతని వేషంలో ఉన్న ఇంద్రుడిపై పడింది. కోపంతో ఇంద్రుడిని శపించాడు. దీని తరువాత, అతను తన భార్యను వేల సంవత్సరాలుగా గాలిని భుజిస్తూ  ఇక్కడ బూడిదలో పడుకోవాలని శపించాడు.

మహర్షి  ఇంద్రుని కీర్తి నశించిపోతుందని శపించాడు. ఋషి గౌతముని శాపం కారణంగా, ఇంద్రలోకం అసురులచే ఆక్రమించబడింది. 


💠 రాముడు ఎప్పుడైతే ఈ అడవిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు అతని దయతో మాత్రమే మీరు రక్షింపబడతారు. అప్పుడే నీవు పూర్వ శరీరాన్ని ధరించి నా దగ్గరకు రాగలవు. 

ఇలా చెప్పి గౌతమ ఋషి ఈ ఆశ్రమాన్ని వదిలి హిమాలయాలకు తపస్సు చేసాడు. 

అందుకే విశ్వామిత్రుడు "ఓ రామా! ఇప్పుడు నువ్వు ఆశ్రమం లోపలికి వెళ్లి అహల్యను దయచేసి రక్షించండి." విశ్వామిత్రుని మాటలు విని అన్నదమ్ములిద్దరూ ఆశ్రమం లోపలికి ప్రవేశించారు. తపస్సులో నిమగ్నమైన అహల్య ఎక్కడా కనిపించలేదు, ఆమె తేజస్సు మాత్రమే పర్యావరణమంతా వ్యాపించింది. అహల్య కళ్ళు రాముడిపై పడగానే, ఆమె మరోసారి అందమైన స్త్రీ రూపంలో కనిపించింది . అహల్యను చూడగానే రాముని భక్తితో ఆమె పాదాలను తాకింది .


💠 ఆ స్థలంలో పురుష పూజారులకు బదులుగా కేవలం మహిళా పూజారులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. భారతదేశం నుండే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.


💠 ఈ మందిరంలో బెండకాయ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ప్రజలు ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరతారు మరియు అవి నెరవేరినప్పుడు బెండకాయలు సమర్పిస్తారు.


💠 ఈ ఆలయం 1662-1682 లలో ఛత్రసింగ్, రుద్రసింగ్ అను రాజులచే నిర్మించబడిది.

గర్భాలయములో ఒక పెద్దబండరాయి పై జానకి పాదముద్రలుగా పూజిస్తారు .


💠 శ్రీరామనవమికి ఇచట గొప్ప మేలా నిర్వహిస్తారు.

వివాహ పంచమి, శ్రీరామ నవమి మొదలైన సందర్భాలలో అహల్య స్థాన్ మరియు గౌతమ్ కుండ్  కి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.


💠 పౌరాణిక ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. ప్రతి సంవత్సరం ఇక్కడ అహల్య-గౌతమ్ ఉత్సవం నిర్వహిస్తారు.