28, అక్టోబర్ 2024, సోమవారం

మంగళవారం*🍁 🌹 *29, అక్టోబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🍁 *మంగళవారం*🍁

🌹 *29, అక్టోబర్, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*              


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*


*తిథి : ద్వాదశి* ఉ 10.31 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం:మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : ఉత్తర* సా 06.34 వరకు ఉపరి *హస్త*


*యోగం  : ఐంద్ర* ఉ 07.48 వరకు ఉపరి *వైధృతి*

*కరణం : తైతుల* ఉ 10.31 గరజి రా 11.53 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 10.30 - 01.00 సా 04.30 - 05.30*

అమృత కాలం  :*ఉ 10.25 - 12.13*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.14*


*వర్జ్యం : రా 04.04 - 05.53 తె*

*దుర్ముహూర్తం : ఉ 08.23 - 09.09 రా 10.37 - 11.26*

*రాహు కాలం : మ 02.45 - 04.11*

గుళికకాళం : *మ 11.51 - 01.18*

యమగండం : *ఉ 08.57 - 10.24*

సూర్యరాశి : *తుల* 

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.04*

సూర్యాస్తమయం :*సా 05.38*

*ప్రయాణశూల : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 06.04 - 08.23*

సంగవ కాలం   :      *08.23 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.00*

అపరాహ్న కాలం:*మ 01.00 - 03.19*

*ఆబ్ధికం తిధి     : ఆశ్వీజ బహుళ త్రయోదశి*

సాయంకాలం  :  *సా 03.19 - 05.38*

ప్రదోష కాలం   :  *సా 05.38 - 08.07*

రాత్రి కాలం : *రా 08.07 - 11.26*

నిశీధి కాలం      :*రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.25 - 05.14*

_______________________________

           🌹 *ప్రతినిత్యం*🌹

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌹🙏 *అంజని పుత్ర స్తోత్రం..!!*🍁


స్థిర నిల్యావర హనుమంత

ఈశ బాలక హనుమంత

జయ బజరంగబలి 

జయజయ జయ బజరంగబలి


             🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Panchaag


 

నిశ్చలమైన ఏకాగ్రతతో

 *భగవంతుని నిశ్చలమైన ఏకాగ్రతతో ధ్యానించండి* 


మనం చేసే మంచి పని లేదా పూజ ప్రచారం కోసం కాదు, దేవుడు వాటిని ప్రసన్నం చేసుకోవాలి అని మన అభిప్రాయం ఉండాలి.  అందుకే భీష్ముడు..

 *యత్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్సేన్నరః సదా...* 

..అని చెప్పారు

 భక్తితో భగవంతుని నామాన్ని జపిస్తే అదే గొప్ప పుణ్యం అని సూచించారు. 

 కనీసం పది నిమిషాలైనా భగవంతుని నామాన్ని భక్తితో చెబితే అది మహా పుణ్యం.. కొందరు పూజా సంధ్యావందనం చేస్తున్నారు.. అప్పుడే అతని మదిలో వేయి ఆలోచనలు మెదులుతాయి.  కనీసం ఆ పది నిముషాలు ఇతర విషయాలను మరచిపోయి భగవత్ పూజపై మనసును నిలపండి.. అది మీకు పరమ దైవానుగ్రహాలను కలిగిస్తుంది.. భక్తిశ్రద్ధలతో కొద్దిసేపు పూజ చేసినా విశేష ఫలితాలను ఇస్తుంది.. కాబట్టి భక్తి ప్రేమికులందరూ విధేయులుగా భగవంతుని భక్తితో పూజించి ఆయన అనుగ్రహం పొందాలి...


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతితీర్ధ మహాస్వామి వారు*

శివయోగసాధన

 స్వామి శివానంద విరచిత శివయోగసాధన - 8 (Scroll down for english)


శివమానస పూజ

మానసపూజ అంటే మానసికంగా పూజించడం. పువ్వులు, చందనం మొదలైనవాటితో చేసే బాహ్యపూజ కంటే మానసపూజ చాలా ప్రభావంతమైనది. మానసపూజ చేసినప్పుడు మీకు మరింత ఏకాగ్రత ఉంటుంది.


మానసికంగా స్వామిని వజ్రాలు, ముత్యాలు, పచ్చలు మొదలనవి పొదిగిన సింహాసనంపై కూర్చోబెట్టండి. ఆయనకు ఆసనం ఇవ్వండి. అర్ఘ్యం, మధుపర్కం మరియు అనేక రకాల పుష్పాలు, వస్త్రాలు మొదలనవి ఇవ్వండి. ఆయన నుదుటన మరియు శరీరానికి చందనం పూయండి. అగరబత్తీలు వెలిగించండి. దీపములు చూపించండి. కర్పూరం వెలిగించి, హారతి చూపించండి. అనేకరకాల ఫలాలు, మధురపదార్ధాలు, పాయసము, కొబ్బరికాయ మరియు మహానైవేద్యం సమర్పించండి. షోడశోపచారపూజ చేయండి.


పంచాక్షరి మంత్రలేఖనం

చక్కని పుస్తకంలో 'ఓం నమః శివాయ' అని అరగంట లేదా ఎక్కువ సమయం రాసుకోండి. ఈ సాధనను చేయడం ద్వారా మీకు మరింత ఏకాగ్రత వస్తుంది. ఇంకుతో మంత్రాన్ని స్పష్టంగా రాయండి. మంత్రాన్ని రాసేటప్పుడు మౌనాన్ని పాటించండి. మంత్రాన్ని మీరు ఏ భాషలోనైనా రాయవచ్చు. అటుఇటు చూడటం విడిచిపెట్టండి. మంత్రాన్ని రాసేటప్పుడు మానసికంగా మంత్రాన్ని ఉచ్ఛరించండి. మంత్రం మొత్తాన్ని ఒకేసారి రాయండి. మంత్రం రాసే పుస్తకం పూర్తవ్వగానే దాని మీరు ధ్యానం చేసుకునే గదిలో ఒక పెట్టెలో పెట్టుకోండి. సాధనలో క్రమబద్ధంగా ఉండండి.


చిన్న నోటుపుస్తకాన్ని మీ జేబులు పెట్టుకుని, ఆఫీస్ లో ఖాళీ సమయం దొరికినప్పుడు రాయండి. మీ జేబులు మూడు వస్తువులు పెట్టుకోండి, అవి భగవద్గీత, మంత్రం కోసం చిన్న పుస్తకం మరియు జపమాల. మీరు గొప్పగా ప్రయోజనం పొందుతారు.


ఇంకా ఉంది ...........

- స్వామి శివానంద  


------------------------


Siva Manasa Puja


Manasa Puja is mental worship. Manasa Puja is more powerful and effective than the external worship with flowers, sandals, etc. You will have more concentration when you do Manasa Puja.


Mentally enthrone the Lord on a Simhasana, set with diamonds, pearls, emeralds, etc. Offer Him a seat. Offer Arghya, Madhuparka and various sorts of flowers, clothes, etc. Apply sandal paste to His forehead and body. Burn incense and Agarbatti (scented sticks). Wave lights. Burn camphor and do Arati. Offer various kinds of fruits, sweetmeats, Payasa, cocoanut and Mahanaivedyam. Do Shodasa-upachara or the sixteen kinds of offerings in worship.


Panchakshara Mantra Writing


Write down in a fine note book ‘Om Namah Sivaya’ for half an hour or more. You will have more concentration by taking recourse to this Sadhana. Write the Mantra in ink clearly. When you write the Mantra observe Mouna. You may write the Mantra in any language. Give up looking hither and thither. Repeat the Mantra mentally also when you write the Mantra. Write the whole Mantra at once. When the Mantra notebook is completed, keep it in a box in your meditation room. Be regular in your practice.


Keep a small notebook in your pocket and write Mantra when you get leisure in the office. Have three things in your pocket, viz., the Gita, Mantra notebook and a Japa Mala or rosary. You will be immensely benefited.


To be continued....

- Swami Sivananda