26, జులై 2021, సోమవారం

తస్మాత్ జాగ్రత

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
               అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నద్యాం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కర్ర/కట్టె ముక్కలు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?ఎప్పుడూ మనల్ని వీడని సర్వేశ్వరుడుండగా!

🌞🌞🌞అంతాశివసంకల్పం🌞🌞🌞

దగ్గుబాటి లక్ష్మీపతి

*గురు దక్షిణ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

        *గురు దక్షిణ*

      *రచన:ఎం.ఆర్.వి.*       

    *సత్యనారాయణ మూర్తి* 

🏛️👴🏛️👴🏛️👴🏛️👴🏛️


“తప్పదు నాన్నా.  అంతకన్నా నాకు వేరే దారి లేదు". కొడుకు మాటలకు ఖిన్నుడైపోయాడు రాఘవ రావు. జానకమ్మ ఎటూ చెప్పలేక కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. తల్లీ, తండ్రి ఇద్దరికేసి మరోమారు చూసి బాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్.

రాజేష్ వెళ్ళిన రెండు నిముషాల వరకూ భార్యా, భర్తా ఇద్దరూ అలానే గుమ్మం కేసి చూస్తూ ఉండిపోయారు.  ముందుగా జానకమ్మ తేరుకుని నిట్టూర్పు విడిచి వంటింట్లోకి వెళ్ళింది. రాఘవ రావు కండువా భుజమ్మీద వేసుకుని పార్కుకి బయల్దేరాడు. పదినిముషాలలో పార్కుకి చేరుకున్నాడు.  అప్పటికే అతని మిత్రులు పరమేశం, సుబ్బారావు బెంచి మీద కూర్చుని ఉన్నారు. సుబ్బారావు పక్కకు జరిగి ‘రా రాఘవా’ అని ఆహ్వానించాడు.

మ్లానవదనంతో కూర్చున్న రాఘవరావు ని చూసి , ఇంటి దగ్గర ఏదో అయ్యిందని గ్రహించారు మిత్రులు ఇద్దరూ.  కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు వాళ్ళు ఇద్దరూ. తర్వాత పరమేశం అన్నాడు “చూడు రాఘవా, నువ్వు ఏదో విషయం గురించి

బాధపడుతున్నట్టున్నావు.

నీ బాధ నీ సన్నిహితులుతో పంచుకుంటే కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది.  మన ముగ్గురి మధ్యా రహస్యాలు లేవుగా.”  రాఘవ రావు దీర్ఘంగా నిట్టూర్చి “మా అబ్బాయి ఇల్లు అమ్మేయమంటున్నాడు.” అన్నాడు.  “కారణం?” అడిగాడు సుబ్బారావు. “ఎనభై లక్షల, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ అరవైకే వస్తోందట. మళ్ళీ ఈ అవకాశం రాదుట.  నేను ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు, వాడి దగ్గర ఉన్న డబ్బు

కలిపి ఆ ప్లాట్ కొంటాడట.  అదీ సంగతి.” అని కండువాతో మొహం తుడుచుకున్నాడు రాఘవ రావు.  మిత్రులు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.  కాసేపటికి సుబ్బారావు

అడిగాడు “మీ ఆవిడ ఏమంది?”

“తల్లి ప్రేమ కదా, కొడుకు వైపే మాట్లాడింది.  ఎలాగూ చివర దశలో వాడి దగ్గరకు చేరవలసిన వాళ్ళమే కదా అని అంది.”

“రాఘవా, నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు. ఆ మమకారం ఉంటుంది. కానీ పరిస్తితుల్ని బట్టి మనం నడచుకోవాలి.  నీకు ఒక్కగానొక్క కొడుకు.  అతణ్ణి

కాదని అంటే, రేపు నిన్ను చూడటానికి కూడా రాడేమో ఆలోచించు.  ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాంగా” అన్నాడు పరమేశం.  సుబ్బారావు కూడా పరమేశం లాగే కొడుకు దగ్గరకు వెళ్ళడమే మంచిదని సలహా

ఇచ్చాడు.  ఒక అరగంట కూర్చుని ఇంటికి వచ్చాడు రాఘవ రావు. అన్యమనస్కంగానే భోంచేసి పడుకున్నాడు.  కానీ ఎంతకూ నిద్ర రావడం లేదు.  గతం పదే పదే గుర్తుకు వస్తోంది .

                🌷🌷🌷

పంచాయతీ ఆఫీస్ వెనక ఉన్న ఖాళీ స్థలాల్ని తక్కువ రేటుకి ఇస్తున్నారని, మాస్టార్లందరూ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. అందరూ రెండు వందల గజాలు

స్థలం తీసుకుంటే, రాఘవరావు భార్య కోరిక మీద నాలుగు వందల గజాల స్థలం తీసుకున్నాడు. జానకమ్మకు మొక్కలంటే ప్రాణం. అందుకే స్థలం మధ్యలో ఇల్లు

కట్టుకుని చుట్టూ ఉన్న జాగాలో చాలా మొక్కలు వేసుకున్నారు. రాఘవరావు స్కూల్ లో ఉంటే, జానకమ్మే ఇంటి నిర్మాణం పనులు చూసేది.  పనివాళ్ళతో సమంగా తానూ ఎండలో నిలబడి వారిచేత పనులు చేయించేది.  వాస్తవానికి, రాఘవరావు కన్నా జానకమ్మే ఇంటి కోసం కష్ట పడింది.  ఒక ఆదివారం నాడు భార్యా భర్తలు ఇద్దరూ కడియం వెళ్లి రక రకాల పూల మొక్కలు, మామిడి, పనస, సపోటా మొక్కలు చిన్న వాన్ మీద తెచ్చుకున్నారు.  మిగతా మాస్టర్లు

‘వాళ్ళిద్దరికీ చాదస్తం అని’  విమర్శించినా వాళ్ళ ఇల్లు *నందన వనంలా* పెరిగాక అభినందించ కుండా ఉండలేక పోయారు. అందరూ బోరింగ్ పైపులు వేయించుకున్నా, రాఘవరావు మాత్రం నుయ్యి తవ్వించుకున్నాడు .

నూతి పళ్ళెం దగ్గరనుండి తూములు ఏర్పాటు చేసి నీళ్ళు మొక్కలకు చేరేటట్లు చేసాడు. ఉదయమే నూతి దగ్గర స్నానం చేసి, సూర్యుడికి నమస్కరించి ఇంట్లోకి వచ్చేవాడు. మామిడి చెట్టు బాగా పెరిగి పెద్దది అయ్యాకా దానికి సిమెంట్చప్టా చేయించాడు.  రాఘవరావు స్కూల్ నుంచి వచ్చాక మామిడి చెట్టుకింద ఉన్న చప్టా మీద కూర్చుంటే, జానకమ్మ కాఫీ తీసుకు వచ్చి ఇచ్చేది.  ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు.  సెలవు రోజుల్లో మిత్రులు వస్తే వాళ్ళ మీటింగ్ కూడా మామిడి చెట్టుకిందే.  వేసవికాలం సాయంత్రాలలో భార్యా భర్తలు ఇద్దరూ ఆ చెట్ల మధ్యే కూర్చుని

మాట్లాడుకునే వారు.  టీచర్స్ కాలనీ లో ఏ శుభకార్యం జరిగినా రాఘవరావు ఇంటి నుండే మామిడి ఆకులు తెచ్చుకుని తోరణాలు కట్టుకునే వారు.  సపోటా పళ్ళు కూడా రాఘవరావు మిత్రులు అందరకు పంపించేవాడు.  రెండు పడక గదులు, ఒక హాలు, వంటగది అన్నీ విశాలంగా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవరావు.

పాతిక ఏళ్ల అనుబంధం ఉంది ఆ ఇంటితో వాళ్ళిద్దరికీ.  ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి.  వాటిని ఒక్కసారిగా వదులుకోవాలంటే రాఘవరావు తట్టుకోలేక పోతున్నాడు.  కానీ తప్పదు.

కొడుకు కోరిక తీర్చాలి. ఏం చేస్తాం? అని మధనపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రాఘవరావు.


కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో

రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ

వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు.  ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం

చేయలేకపోతున్నామని.  ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు.  భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు.

“మాస్టారు, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క.  ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.  మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత

ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?”


రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే.  అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?”  ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు. “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి

కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.

అతను వెళ్ళాకా భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం.  మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు”

ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి

ఇద్దామనుకుంటున్నామని .

రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.  మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు.  వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు

పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.  నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.

కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ.  మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.  రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే

వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా , నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు.  జానకమ్మ ఎంతో

సంతోషించి వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది.  ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది.

ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు

రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని సుమిత్ర కాన్వెంట్ లో

టీచర్గా చేరింది.  వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.  శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు.  వంట తక్కువ, పని

కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.  ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని.

మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాలే పడుకోకుండా స్కూల్

విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు. ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.  మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.

శీతాకాలం వచ్చింది.  టైల్స్ మీద చాప వున్నా జానకమ్మ చలికి తట్టుకోలేక పోతోంది.  అది చూసి రాజేష్ బజారు నుండి చిన్న పరుపు తీసుకు వచ్చి తల్లికి ఇచ్చాడు. దానికే చాలా మురిసిపోయింది జానకమ్మ.  ఒకసారి సుమిత్ర తల్లి తండ్రులు హైదరాబాద్ వచ్చారు. రాజేష్ వాళ్లకు ఎంతో మర్యాదలు చేసాడు.  పిల్లల పడకలు తల్లి తండ్రుల గదిలోకి మారాయి. రాజేష్, మావయ్య అత్తయ్య పిల్లల గదిలో పడుకున్నారు.  రాఘవరావు, జానకమ్మ

యధావిధిగా హాలు లోనే పడుకున్నారు. మొత్తం వంట పనంతా జానకమ్మ మీదే

పడింది.  సుమిత్ర , తల్లి తండ్రులు వారం రోజులు ఉన్నారు.  జానకమ్మ వళ్ళు హూనం ఐపోయింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు సుమిత్ర తండ్రి అన్న మాట రాఘవరావు దంపతుల్ని మరీ బాధించింది. ‘బావ గారు, అక్కయ్య గారు అదృష్టవంతులు. చక్కగా కొడుకు దగ్గర వుండి సుఖ పడుతున్నారు’ అని.  అమ్మమ్మ, తాతయ్య వెళ్లి పోగానే మనవలు మల్లీ వాళ్ళ గదిలోనే పడుకో

సాగారు.  దాంతోరాఘవరావు, జానకమ్మ లకు ఒక విషయం పూర్తిగా అర్ధమయ్యింది.  కొడుకు, కోడలు కావాలనే తమని హాలు లోకి పంపించారని.  ఆ రాత్రి దంపతులు ఇద్దరూ చాలా సేపు బాధపడ్డారు.  శివపురం వదిలి కొడుకు దగ్గరకు వచ్చి చాలా పొరపాటు చేసామని.  రెండేళ్ళు గడిచాయి. వంటరి తనంతో రాఘవరావు, పని ఎక్కువై , విశ్రాంతి లేక జానకమ్మ ఆరోగ్యం దెబ్బతింది. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కుమిలి

పోతున్నారు వాళ్ళిద్దరూ.  ఈ మధ్యనే పరమేశం కూతురు దగ్గరకు వచ్చి రాఘవరావుని చూడటానికి రాజేష్ ఇంటికి వచ్చాడు.  ఆ సమయానికి రాజేష్ ,సుమిత్ర ఉద్యోగాలకు వెళ్ళారు.  పిల్లలు కాన్వెంట్ నుంచి ఇంకా రాలేదు.  రాఘవరావు,

జానకమ్మలను చూసిఆశ్చర్య పోయాడు, ఆపై బాధ పడ్డాడు.

“ఏమిటి రాఘవా ఇది?  ఇద్దరూ ఇలా అయి పోయారేమిటి? ఏమిటి అనారోగ్యం? డాక్టర్కి చూపించు కున్నారా?“ “ఆ ఏమీలెదు, కొద్దిపాటి నీరసం. అంతే.” అన్నాడు రాఘవరావు చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేకపోవడం గ్రహించాడు పరమేశం. ఈ లోగా పిల్లలు ఇద్దరూ వచ్చారు.  వాళ్లకు టిఫిన్ పెట్టి, పాలు ఇవ్వడం పనిలో మునిగిపోయింది జానకమ్మ.  ఒక పావుగంట ఉండి వెనుదిరిగాడు పరమేశం.  శివపురం వచ్చాకా సుబ్బారావు దగ్గర బాధపడ్డాడు పరమేశం. “మన రాఘవ పరిస్తితి ఏమీ బాగోలేదు.  ఇద్దరూ చిక్కి పోయారు.  కొడుకు వాళ్ళని

పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఇంటి బాధ్యత అంతా జానకమ్మ మీద పడింది.  చాలా శ్రమ పడుతున్నారు ఇద్దరూ. కాళ్ళూ, చేతులూ ఆడుతున్డగానే ఇలా ఉంటే, రేపు ఓపిక తగ్గిపోతే వాళ్ళ పరిస్తితి ఎంత దుర్భరమో అనిపిస్తోంది.”

కొద్దిసేపు మౌనం వహించాడు సుబ్బారావు.  తర్వాత పరమేశంతో చిన్నగా మాట్లాడాడు. ఆ మాటలకు పరమేశం చాలా సంతోషించాడు.

రెండు నెలలు గడిచాయి.  ఒకరోజు రాజేష్ ఇంటికి మిదున్, సాత్విక్ వచ్చారు.  “మేము శివపురంలో రాఘవరావు మాస్టారు దగ్గిర చదువుకున్నాము.  వచ్చే

ఆదివారం మా స్కూల్ పూర్వ విద్యార్ధుల సమావేశం ఉంది.  ఆ రోజున మా గురువులు అందరినీ సన్మానించాలని నిర్ణయించాము. మాస్టారికి ఆహ్వానం పత్రిక

ఇద్దామని వచ్చాం.” చెప్పాడు మిదున్.  నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, కూర్చోమని చెప్పి లోపలకు వెళ్ళాడు రాజేష్. పదినిముషాలకు రాఘవరావు హాలులోకి వచ్చాడు.  మిదున్, సాత్విక్ లేచి రాఘవరావు కి నమస్కరించి, తాము వచ్చిన

పని చెప్పారు.  “నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు?” అడిగాడు రాఘవరావు.

“పరమేశం గారు చెప్పారు సర్ . వచ్చే శనివారం ఉదయమే వచ్చి కారులో మిమ్మల్ని, మేడం గారిని తీసుకుని వెళ్లి, తిరిగి హైదరాబాద్లో దిగబెడతాం” వినయంగా చెప్పాడు మిదున్.  తప్పకుండా వస్తానని వాగ్దానం చేసాడు రాఘవరావు.

ఆరు రోజులు గడిచాకా శనివారం ఉదయమే మిదున్, సాత్విక్ ఇద్దరూ ఏ.సి. కారు తీసుకుని వచ్చి రాజేష్ అపార్ట్ మెంట్ కి వచ్చారు. ఫంక్షన్ అయ్యాకా వెంటనే వచ్చేయమని రాజేష్ , సుమిత్ర మరీ మరీ చెప్పారు.  అలాగే అని చెప్పి కారు ఎక్కారు రాఘవరావు, జానకమ్మ.  వాళ్ళు ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది.  శివపురంలో అందరిని కలవ వచ్చని, రెండోది ఆ జైలు నుంచి బయటకు వస్తున్నామని.  పరమేశం కూడా ఫోన్ చేసి చెప్పాడు’ రెండురోజులూ మా ఇంట్లోనే ఉండాలని’.  చిన్న పిల్లలు పండగకు తాత గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటారో, రాఘవరావు, జానకమ్మ కూడా అంత హుషారుగాను ఉన్నారు.  విజయవాడలో భోజనాలుచేసి, సాయంత్రానికి శివపురం చేరుకున్నారు నలుగురూ.  పరమేశం ,గిరిజ ఏంతో ఆదరంగా వాళ్ళని ఇంటిలోకి తీసుకువెళ్ళారు. మిదున్, సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు.  ఒక అరగంటకు సుబ్బారావు, పద్మలత వచ్చారు.  మిత్రులు అందరికీ

భోజనాలు ఏర్పాటు చేసాడు పరమేశం.  మూడు జంటలూ కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా

భోజనం చేసారు. మిత్రులు ముగ్గురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కదలాడాయి.  “నేను హైదరాబాద్ వెళ్ళాకా ఏం కోల్పోయానో ఇప్పుడు నాకు బోధపడింది” అన్నాడు రాఘవరావు.  మిత్రులు ఇద్దరూ ఆప్యాయంగా అతని భుజాల మీద చేతులు వేసారు.  ఆ రాత్రి రాఘవ రావు, జానకమ్మ చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒక స్తిరమైన నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ.  మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.  ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ 

పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు. రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు.  అమెరికాలో,

ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.  పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్.   వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు. తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.  రాఘవరావు మాట్లాడుతూ, ”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత.  మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.  మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.  మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన

సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ” మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.

అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.  రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.  తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.  గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి

పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి

మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ

ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం.  మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.  కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు

తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.  వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి, మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు.  తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ , చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.  ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు

తీసుకుని వెళ్ళిపోయారు. రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావు

ల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన

హృదయంతో.

“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.

ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ.  ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.

*******

రచయిత వివరాలు

ఎం. ఆర్. వి. సత్య నారాయణ మూర్తి, జె.వి.ఎల్.రావు నగర్, పెనుగొండ - 534320.Andhra Pradesh

ఫోన్ .9848663735. email.mrvsmurthy@gmail.com

🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫


గోరింటాకు

 గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరి ఇంటి ఆకు, గౌరీ దేవి బాల్యములో చెలులతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయములో రజస్వల అయింది. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది.

ఈ వింతను చెలులు పర్వత రాజుకు చెప్పగా సతీ సమేతముగా చూసేందుకు వచ్చాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దది అయి నేను సాక్షాత్తు పార్వతి రుధిర అంశతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునేలోపు పార్వతి నాకు ఏవిధమైన బాధ కలుగలేదు. పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అంది.

అప్పుడు పర్వత రాజు ఇక పై స్త్రీ సౌభాగ్య చిహ్నముగా ఈ గోరింటాకు మానవలోకములో ప్రసిద్ధము అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు, స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది. అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది. తన రంగు వలన చేతులకు, కాళ్లకు అందానినిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందముగా తీర్చి దిద్దుకున్నారు.

అదే సమయములో కుంకుమకు ఒక సందేహము వచ్చింది. నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీ దేవి తో బాధగా చెప్పగా అప్పుడు గౌరీ దేవి ఈ ఆకు నుదుటన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకుని చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ట్నాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది ఈ గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి.

ఇక భర్తకు, గోరింటాకుకు కల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పని తీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా, సున్నితంగా, అందముగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహా భాగ్యము కదా. అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణం అయిన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో అలోచించి చెప్పారు. గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా అలోచించి ఆదరిస్తే అన్నివిధాలా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. 

నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి, ఈ ఆషాఢ మాసములో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసములో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళుతుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసి పోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా. 

ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసము వర్షాకాలం. ఈ కాలములో తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్లు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతే కాదు, ఇంతటి అద్భుతమైన, ఆరోగ్యకరమైన, మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్ లతో పెడుతున్నారు. కానీ అలాగే కాకుండా, మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకుని, వాళ్ళు చెప్పినట్లు నూరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి. ఇది మన గోరింటాకు కథ. 

    🙏 శ్రీ మాత్రే నమః 🙏

వాట్సప్ సమూహ వింత లక్షణములు*.

 *వాట్సప్ సమూహ వినియోగదారుల వింత లక్షణములు*. 


1. *కుప్పరులు*

*వీరు రోజస్తమానం కుప్పలు తెప్పలుగా సమాచారమును సమూహములో గ్రుమ్మరించుచుందురు*. 


2. *ఆకస్మికులు*

*వీరు అప్పుడప్పుడు తమ ఉనికిని తెల్పుటకు అసందర్భపు సమాచారమును సమూహములో ప్రచురించెదరు*. 


3. *విధ్యుక్తులు*

*వీరు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేదా రాత్రి వేళలో శుభోదయం, శుభరాత్రి లాంటి సమాచారములు మరియు లేదా పుట్టిన రోజు శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు లాంటివి మాత్రమే సమూహములో ప్రచురించెదరు*.


4.*గవాక్షులు*

*వీరు సమూహములో ఏమి జరుగుతున్నదో చూచెదరుకాని ఎటువంటి సమాచారమునూ ప్రచురించరు. బహుశా వీరికి సాంకేతిక పరిజ్ఞానం కాని భాషా పరిజ్ఞానం కాని లోపించి ఉండవచ్చు*. 


5. *అవ్యవస్థితులు* 

*వీరు అనేక సమూహములలో సభ్యత్వం కలిగి ఉండుటచే ఏ సమాచారమును ఎక్కడ ముద్రించవలయునో అనే అయోమయావస్థితిలో ఉండి తను ప్రస్తుతం ఉన్న సమూహములోని సమాచారమును అదే సమూహములో ప్రచురించెదరు*. 


6. *అనుక్రియాయులు* 


*వీరు సమూహములో ప్రచురించబడిన ప్రతి సమాచారమునకు, కార్యాలయంలో అధికారి ఎవరి ఉత్తరము వారికి తన వాఖ్యనము వ్రాసి ఏవిథంగా పంచునో ఆ విధంగా తన వాఖ్యనము తో విధిగా ప్రతిస్పందిస్తారు*. 


7. *తంత్రజ్ఞులు*. 

*వీరు తమ సమాచారములతో అందరూ ఏకభవించాలని ఆశిస్తారు*. 


*8.పృథక్ లు*. 

*సమూహములో వీరి ఉనికి మిగతా సభ్యులెవరికి తెలియదు. తామరాకు మీది నీటి బొట్టులాగా*. 


*9.అసంబద్ధులు*.

*వీరు ప్రచురించే సమాచారమునకు సమయము సందర్భము ఉండదు. సాయంకాలమునకు శుభోదయ మన్నన ఉదయమున శుభ రాత్రి మన్నన లాంటివి ప్రచురించెదరు*. 


10. *మేషియలు*

*వీరు తమ మేథస్సుననుసరించరు. తమకంటే ముందున్న సమాచారమును సరించి, తథనుగుణంగా సమాచారమును తప్పు ఒప్పు విచారణ విస్మరించి ప్రచురించెదరు*. 


11. *తస్కరులు*. 

*వీరు ఇంతకు ముందే ప్రచురితమైన* *సమాచారమును కాపీ చేసి పేస్ట్ చేయుదురు*. 


*12. *రవాణాగ్రేసరులు*. 

*వీరు వివిధ మార్గములలో తమకు* *సంక్రమించిన సమాచారమును* *కేవలం రవాణా చేయుదురు. అది ఎటువంటి సమాచారము*, *ఇతరులకు అది ఉపయోగకరమా అనేది కూడ పట్టించుకోరు*. 


*"ఇందులో మనందరి మనస్తత్వాలు ఉన్నాయి."*

 ఇది ఎవరిని దృష్టి లో ఉంచుకొని వ్రాసినది కాదు.

*ఒకవేళ మీకలా అనిపిస్తే అది కేవలం కాకతాళీయం మాత్రమే. హాయిగా నవ్వుకోండి. ఆనందో బ్రహ్మ.*

అనేక శివాలయాలు

 #ద్రాక్షారామం చుట్టుపక్కల అనేక శివాలయాలు, దేవీ మందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. 


ఆ ఆలయాలన్నిటిని ఆకాశ మార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.


విశేషమేమిటంటే., ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి, దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంది..


 గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయదలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము లేదా జన్మ నక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు #ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట.


మేష రాశి నుండి మీన రాశి వరకు.. అదే క్రమంలో ఆరాధించవలసిన ఆలయాల సమాచారం..


1. #మేష_రాశి


మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాస గంగావరంలో వుంది.  


అశ్విని_నక్షత్రం


పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు...


1 వ పాదం... బ్రహ్మపురి.... శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి..

2 వ... ఉట్రుమిల్లి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి 

3 వ... కుయ్యూరు... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

4 వ... దుగ్గుదూరు... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


భరణి_నక్షత్రం


1 వ... కోలంక... శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ... ఎంజారం... శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి

3 వ... పల్లిపాలెం... శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

4 వ... ఉప్పంగళ... శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి


కృత్తికా_నక్షత్రం


1 వ... నేలపల్లి... శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.


2. #వృషభ_రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాస గంగావరంలో ఉన్నది. 


కృత్తికా_నక్షత్రం


 2 వ... అదంపల్లి... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

3 వ... వట్రపూడి... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ... ఉండూరు... శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి


రోహిణీ_నక్షత్రం


1 వ... తనుమల్ల... శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

2 వ... కాజులూరు... శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

3 వ... ఐతపూడి... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

4 వ... చీల... శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


మృగశిర_నక్షత్రం


1 వ... తాళ్ళరేవు... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.

2 వ... గురజానపల్లి... శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి


3. #మిధున_రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.


మృగశిర_నక్షత్రం


3 వ... అంద్రగ్గి... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

4 వ... జగన్నాధగిరి... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి


ఆరుద్ర_నక్షత్రం


1 వ... పనుమళ్ళ... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ... గొల్లపాలెం... శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి

3 వ... వేములవాడ... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి

4 వ... కూరాడ... శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి


పునర్వసు_నక్షత్రం


1 వ... గొర్రిపూడి (భీమలింగపాడు)....

శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి

2 వ... కరప... శ్రీ పర్వతవర్ధి సమేత శ్రీ రామ లింగేశ్వర స్వామి

3 వ... ఆరట్లకట్ల... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి

   

4. #కర్కాటక_రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం. 


పునర్వసు_నక్షత్రం


4 వ... యెనమాడల... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


పుష్యమి_నక్షత్రం


1 వ...కాపవరం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

2 వ... సిరిపురం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

3 వ... వేలంగి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

4 వ... ఓడూరు... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి


ఆశ్లేష_నక్షత్రం


1 వ... దోమాడ... శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి

2 వ... పెదపూడి... శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

3 వ... గండ్రాడు... శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ... మామిడాడ... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి


5. #సింహ_రాశి 


 ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం. 


మఖ_నక్షత్రం


1 వ... నరసరావుపేట... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

2 వ... మెల్లూరు... శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

3 వ... అరికిరేవుల... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

4 వ... కొత్తూరు... శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగ లింగేశ్వర స్వామి


పుబ్బ_నక్షత్రం


1 వ... చింతపల్లి... శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి

2 వ... వెదురుపాక... శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి

3 వ... తొస్సిపూడి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి

4 వ... పొలమూరు... ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


ఉత్తర_నక్షత్రం


1 వ... పందలపాక... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


6. #కన్యా_రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లి లోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది. 


ఉత్తర_నక్షత్రం


2 వ... చోడవరం... శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి

3 వ... నదురుబాడు... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

4 వ... పసలపూడి... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు


హస్త_నక్షత్రం


1 వ... సోమేశ్వరం... శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ... పడపర్తి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు

3 వ... పులగుర్త... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

4 వ... మాచవరం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి


చిత్త_నక్షత్రం


1 వ... కొప్పవరం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

2 వ... అర్థమూరు.... శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి


7. #తుల_రాశి


ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపు పేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. 


చిత్త_నక్షత్రం


3 వ... చల్లూరు.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

4 వ... కాలేరు.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


స్వాతి_నక్షత్రం


1 వ... మారేడుబాక.... శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి

2 వ... మండపేట.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి

3 వ... గుమ్మిలూరు.... శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

4 వ... వెంటూరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


విశాఖ_నక్షత్రం


1 వ... దూళ్ళ.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

2 వ... నర్సిపూడి.... శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

3 వ... నవాబుపేట... శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి


8. #వృశ్చిక_రాశి


ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపు పేట లో వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం. 


విశాఖ_నక్షత్రం


4 వ... కూర్మపురం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


అనూరాధ_నక్షత్రం 


1 వ... పనికేరు.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి

2 వ... చింతలూరు.... శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి

3 వ... పినపల్ల.... శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

4 వ... పెదపల్ల.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


జ్యేష్ట_నక్షత్రం


1 వ... వడ్లమూరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

2 వ... నల్లూరు.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

3 వ... వెదురుమూడి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

4 వ... తేకి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


9. #ధనుస్సు_రాశి


ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతిలో ఉన్నది. నేలపర్తిపాడు లోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశి విశ్వేశ్వర స్వామికి అంకితం...


మూల_నక్షత్రం


1 వ.... యెండగండి.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ.... పామర్రు.... శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

3 వ... అముజూరు.... శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ... పానంగిపల్లి..... శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి


పూర్వాషాఢ_నక్షత్రం


1 వ... అంగర... శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి

2 వ.... కోరుమిళ్ళ..... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

3 వ... కుళ్ళ.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ.... వాకతిప్ప..... శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి


ఉత్తరాషాఢ_నక్షత్రం


1 వ.... తాతపూడి.... శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి


10. #మకర_రాశి


మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువు లోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం. 


ఉత్తరాషాడ_నక్షత్రం


2 వ___ మచర___ శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

3 వ___ సత్యవాడ____ శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ___ సుందరపల్లి____ శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి


శ్రవణ_నక్షత్రం  


1 వ___ వానపల్లి...... శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి

2 వ....మాదిపల్లి (మాడుపల్లి)__ శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

3 వ.... వాడపాలెం..... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి

4 వ.... వీరపల్లిపాలెం.... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి


ధనిష్ట_నక్షత్రం


1 వ.... వెల్వలపల్లి... శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి

2 వ... అయినవెల్లి..... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి


11. #కుంభ_రాశి


కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.


ధనిష్ట_నక్షత్రం


3 వ..... మసకపల్లి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

4 వ... కుందూరు.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


శతభష_నక్షత్రం


1 వ.... కోటిపల్లి___ శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ... కోటిపల్లి____ శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి

3 వ.... తొట్టరమూడి..... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మూల్లేశ్వర స్వామి

4 వ___ పాతకోట.... శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి


పూర్వాభాద్ర_నక్షత్రం

1 వ.... ముక్తేశ్వరం.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

2 వ.... శాసనపల్లి లంక..... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి

3 వ... తానెలంక..... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి


12. #మీన_రాశి


మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.


పూర్వాభాద్ర_నక్షత్రం


4 వ.... ఎర్రపోతవరం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి


ఉత్తరాభాద్ర_నక్షత్రం


1 వ.... డంగేరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ.... కుడుపూరు..... శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

3 వ..... గుడిగళ్ళ____ శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి

4 వ.... శివల___ శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి


రేవతి_నక్షత్రం


1 వ... భట్లపాలిక..... శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

2 వ.... కాపులపాలెం..... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి

3 వ... పేకేరు...... శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

4 వ..... బాలాంత్రం..... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి..


ఓం నమఃశివాయ... హరహర మహాదేవ...


🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼


#పాత_మహేష్

చిట్టికథ

 ✍️ *...నేటి చిట్టికథ* 


--- ఛాందోగ్య ఉపనిషత్తు నుండి..


ఒకానొకప్పడు జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే జాబాలికి కూడా జ్ఞానాన్ని అర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని గౌతముడు అనే ఋషి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. ‘సరే నీ తల్లిదండ్రులు ఎవరో, నీ గోత్రం ఏమిటో చెప్పు’ అన్నాడు గౌతముడు. ఆ ప్రశ్నకి జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. తల్లిని ప్రశ్నలకు జవాబుని కోరాడు. ‘నాయనా! నిజానికి నీ పుట్టుకకు కారణం ఎవరో నాకు కూడా తెలియదు.  కానీ ఒకటి. నా పేరు జాబాల కాబట్టి నా కుమారుడమైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటూ వస్తున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉందని నమ్ముతున్నాను. అంతేకాదు! ఇకమీదట ఎప్పుడూ సత్యాన్నే వాంఛించు. దానికి గుర్తుగా నీకు ‘సత్యకాముడు’ అన్న పేరుని అందిస్తున్నాను’ అని చెప్పి పంపింది.


తన తల్లి చెప్పిన మాటలను యథాతథంగా సత్యకామజాబాలి, గౌతమునితో చెప్పాడు. జాబాలి సత్యవాక్కుకు సంతోషించిన గౌతముడు అతణ్ని తన శిష్యగణంలో చేర్చుకున్నాడు. జ్ఞానానికే అంతిమం అనదగ్గ బ్రహ్మజ్ఞానాన్ని గౌతముని వద్ద పొందాలన్నది జాబాలి కోరిక. కానీ జ్ఞానం పట్ల జాబాలికి ఉన్న తపనను పరీక్షించి కానీ అతనికి విద్యను అందించేందుకు సిద్ధంగా లేడు గౌతముడు. 


అందుకోసం జాబాలికి ఆవులు, ఆంబోతులు ఉన్న పశుమందను అప్పగించి. ‘వీటి సంఖ్య వేయిగా మారేంతవరకూ నువ్వు వాటిని అడవులలో సంరక్షిస్తూ ఉండు’ అని ఆదేశించాడు.


గురువుగారి ఆదేశం మేరకు సత్యకాముడు పశువుల మందను మేపుతూ అడవులలో తిరగసాగాడు. కానీ అతని మేధోశక్తికి ప్రకృతిలోని ప్రతి అణువూ ఏదో ఒక రహస్యాన్ని చెబుతున్నట్లే తోచేది. లేత చిగుళ్లు జీవనంలోని సౌకుమార్యాన్ని సూచిస్తే, ఎండిన ఆకులు లయతత్వాన్ని బోధించాయి. కొండలు స్థిరత్వం గురించి చెబితే, సెలయేళ్లు సంతోషానికి శబ్దాన్ని ఇచ్చాయి. అలా అడవిలో తిరుగుతూ, కాలం గడుపుతూ…. తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలోని పరమజ్ఞానాన్ని పొందసాగాడు సత్యకాముడు.


 ఇలా ఉండగా ఒకరోజున అతని మందలోని ఒక ఆంబోతు అతని దగ్గరకు వచ్చి ‘సత్యకామా! మా సంఖ్య వేయిని చేరుకుంది. ఇక నువ్వు నీ గురువుగారి దగ్గరకు బయల్దేరవచ్చు. అయితే అందుకు ముందుగా నీకు బ్రహ్మజ్ఞానంలోని తొలి పాదాన్ని వివరిస్తాను విను. ఈ విశ్వంలోని నాలుగు దిక్కులూ ఆ బ్రహ్మతత్వంలోని భాగమే!’ అని చెప్పింది.


సత్యకాముడు ఆ సాయంత్రం వెలిగించిన అగ్ని నుంచి వెలువడిన అగ్నిదేవుడు ‘ఈ జగత్తులో భాగమైన భూమి, ఆకాశం, సముద్రాలు అన్నీ కూడా బ్రహ్మంలోని భాగమే. ఇదే బ్రహ్మజ్ఞానంలోని రెండో పాదం’ అని విశదీకరించాడు.


 ఇక మర్నాడు ఒక హంస అతని చెంతకు చేరి వెలుతుర్ని ప్రసాదించే రూపాలు (అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు) కూడా బ్రహ్మకు ప్రతిరూపాలే అని చెప్పి ఎగిరిపోయింది. 


ఇక బ్రహ్మజ్ఞానంలోని చివరి పాదాన్ని ఒక నీటి పక్షి అతనికి అందించింది. ‘మనిషి ఉనికికి ఆధారభూతమైన ప్రాణం, దృష్టి, వినికిడి, మనస్సు కూడా బ్రహ్మలోని అంతర్భాగాలే’ అని ఆ నీటి పక్షి అతనికి చెప్పింది.


 అలా సత్యకాముడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడై సంతృప్తిగా తన గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.


సత్యకామునిలో వెలుగొందుతున్న బ్రహ్మవర్చస్సుని అల్లంత దూరాన చూసిన గురువుగారు జరిగింది గ్రహించారు. ‘సత్యకామా! నీకు ఇక నా అవసరం లేదు. నీ అంతట నువ్వే కావల్సిన జ్ఞానాన్ని సాధించగలిగావు’ అన్నారు. కానీ సత్యకామునిలో తాను జ్ఞానాన్ని పొందానన్న గర్వం లేశమంతైనా లేకపోయింది. ‘గురువుగారూ! జ్ఞానానికి అంతు ఎక్కడ? నాకు ఆ ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి బ్రహ్మజ్ఞానాన్ని నేర్పిన మాట నిజమే. కానీ మీ నుంచి కూడా ఎంతో కొంత విద్యను ఆర్జించాలనుకుంటున్నాను. దయచేసి ఈ దీనుడి కోరికను మన్నించండి’ అని వినమ్రతతో వేడుకున్నాడు. 


సత్యకాముని వినమ్రతకు ముగ్థుడైన గౌతముడు తనలో ఉన్న జ్ఞానసారాన్ని కూడా సత్యకామునికి అందించాడు.


సత్యకాముని నిబద్ధత, వినయము, గురువుపట్ల అతనికి ఉన్న భక్తి, విద్యపట్ల అతని శ్రద్ధ శ్లాఘనీయమైనది.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷

జీవితం

 🙏ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..🙏

*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.

జీవితం కూడా అంతే...

*ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.

• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.

• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.

• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.

• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. 

ఫైనల్ గా చెప్పదేంటంటే...

*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*. 

• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?

• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.

• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.

• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*. 

• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*. 

• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*. 

• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*. 

• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*. 

• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*. 

• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*. 

• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*. 

• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*. 

• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.  

• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*. 

• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*. 

• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*. 

• బిడ్డలకొచ్చే చదువు  *ఐశ్వర్యం*. 

• భగవంతుడిచ్చిన ఆరోగ్యం  *ఐశ్వర్యం*. 

• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*. 

• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.

• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు. 

• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*. 

• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం

కలియుగం

* #కలియుగం ఎలా ఉంటుంది.


కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం. 


ఒకసారి ధర్మరాజు లేని సమయంలో  మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.


శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.


అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగికృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.


భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.


నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.


ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.


నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  


ఆయన చెప్పనారంభించాడు.


కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.


కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.


కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.


కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.


ఉద్ధవ గీత శ్రీమద్భాగవతం...

(సేకరణ)

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆపత్కాలం..అన్నదానం..*


"ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందీ?.." పోయిన సంవత్సరం మార్చి నెల మధ్యలో..

ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండా..నేరుగా నేను కూర్చున్న చోటికి వచ్చి అడిగాడు మధ్యవయసులో ఉన్న ఆ వ్యక్తి..ఆ వచ్చినతన్ని ముందు కూర్చోమని చెప్పి..కుర్చీ చూపించాను..


"మీ పేరు?.." అన్నాను..


"నా పేరు చంద్రశేఖర్..నెల్లూరు దగ్గర మా ఊరు.." అన్నాడు.."ఒకప్పుడు బాగా సంపాదించానండీ..రొయ్యల సాగు చేసి మంచి లాభాలే గడించాను..కానీ గత మూడేళ్ళుగా కలిసి రాలేదు..సంపాదించిందంతా నష్టపోవడమే కాకుండా..పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాను..ఈ మధ్యనే మళ్లీ అప్పుచేసి చెరువుల్లో సీడ్ వేసాను..ఈ పంట చేతికొస్తే నేను నిలబడతాను..లేకుంటే మరణమే శరణ్యం..అంత ఇబ్బందుల్లో వున్నాను.." అన్నాడు..


అంత కష్టం లో వుండి కూడా అన్నదానం చేయిస్తానంటున్నాడు..అదే అర్ధం కాక.."మీరు స్వామివారికి మ్రొక్కుకొని వెళ్ళండి..మీ కష్టాలు తీరిన తర్వాత వచ్చి అన్నదానం చేయించవచ్చు..ఇప్పుడు ఎందుకు?.."అన్నాను..


"గత ఐదు వారాలుగా నేను ఈ మందిరానికి వస్తున్నాను..శ్రీ స్వామివారికి నా కష్టం చెప్పుకున్నాను..ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరగడం చూస్తున్నాను..నేనుకూడా ఒకవారం అన్నదానం చేయిస్తే..నా కష్టాలు తీరుతాయేమోనని ఒక భావన నిన్నరాత్రి కలిగింది..ఇంట్లో మా ఆవిడ కూడా ఒక వారం అలా చేయించండి..మంచి జరగొచ్చు అని చెప్పింది..అందుకోసం అడుగుతున్నాను..ఎంత ఖర్చు అవుతుందీ?.."అన్నాడు..


మళ్లీ కూడా చెప్పి చూసాను..తన కున్న కష్టాలు తొలిగిన తర్వాతే అన్నదానం చేయించమని..అంతవరకూ శ్రీ స్వామివారిని నమ్మకంతో కొలవమని కూడా చెప్పాను..కానీ చంద్రశేఖర్ పట్టు బట్టాడు..వచ్చే ఆదివారం నాడు తాను ఆ ఖర్చు భరిస్తాననీ..చెప్పడమే కాకుండా ఆ ప్రక్క ఆదివారం నాటి అన్నదానపు ఖర్చంతా తానే భరించాడు..


సరిగ్గా మూడు నెలల అనంతరం ఆ చంద్రశేఖర్ సంతోషం తో మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..వనామీ సాగులో మంచి లాభాలే వచ్చాయనీ..తనకున్న అప్పుల్లో ఎనభై శాతం తీరిపోయాయని..చెప్పుకొచ్చాడు..


అన్నదానం చేయించినందువల్ల చంద్రశేఖర్ కష్టాలనుంచి గట్టెక్కాడా?.. శ్రీ స్వామివారిని నమ్మినందుకు లబ్ది పొందాడా?..ఏమీ అర్ధం కాలేదు నాకు..అదే మాట అడిగాను..


"నా కష్టాలు తీరాలంటే..నా చేత అన్నదానం చేయించాలని శ్రీ స్వామివారే నాకు ఆ బుద్ధి పుట్టించాడని మీరెందుకు ఆలోచన చేయలేదు?.." అని ఎదురు ప్రశ్నించాడు..


నిజమే..ఎవరికి ఏది ఎప్పుడు ఎలా నిర్దేశించాలో శ్రీ స్వామివారికే తెలుసు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

*శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 297*

 *శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 297*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏


 *వడివేల్ - వెణ్ పొంగల్* 


చాలా సంవత్సరాల క్రితం తిరుత్తణి కొండపై బైరవ సుబ్రమణ్య అయ్యర్ ప్రసాదందుకాణం నిర్వహించేవారు. ఆ దుకాణంలో పనిచేసేవాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. విపరీతమైన పని వల్ల నాకు ఒకసారి జ్వరం వచ్చింది. సమయం గడుస్తున్న కొద్దీ జ్వరం చాలా ఎక్కువ అయ్యింది. రాత్రి పదింటికి ఇంటికి చేరుకోగలను అనుకుని చిన్నగా మెట్లు దిగడం మొదలుపెట్టాను. నిదానంగా నడుస్తూ అక్కడక్కడ కూర్చుంటూ ఎలాగైతేనేమి చివరి మెట్టు వద్దకు వచ్చాను.


దేవాలయ పుష్కరిణి వద్ద ఒక మేనా నిలిపి ఉండడం గమనించాను. ఆ వైపు నుండి ఒక వ్యక్తి నాకేసి వస్తున్నాడు. అతను నన్ను “కొండపై నుండి వస్తున్నారా?” అని అడిగాడు. నేను అవునన్నాను. సరే నాతో రండి అని మేనావద్దకు తీసుకునివెళ్ళాడు. నేను కొద్దిగా మేనాలోపలికి తొంగిచూసాను. పరమ శాంత స్వరూపంతో మహాస్వామివారు నాకు దర్శనమిచ్చారు. నన్ను నేను మరచిపోయి భక్తితో చేతులు జోడించి నిలబడిపోయాను. 


“నీవు కొండపైనుండి వచ్చావా? దేవాలయం తెరిచి ఉన్నదా?” అని అ మహాస్వామి వారు అడిగారు. చాలా వినయంతో, “దేవాలయం మూసివేసారు స్వామి” అని బదులిచ్చాను. “అక్కడ ప్రసాదాల దుకాణం ఉన్నదా?” అని అడిగారు. నేను “అది కూడా మూసివేసారు” అని చెప్పగా వారు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత మహాస్వామి వారు నాతో, “నన్ను మోసిన వీరందరూ ఆకలిగా ఉన్నారు. వారికి పుత్తూరులోను, నగరిలోను అహారం దొరకలేదు. నేను వారికి తిరుత్తణిలో ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది అని చెప్పాను. ఇక్కడికి రాగానే పుష్కరిణి గట్లపై ఉన్న హోటళ్లలో కూడా వారికి ఆహారం దొరకలేదు” అని మహాస్వామివారు చెప్పగా నాకు ఏమి చేయాలో తోచలేదు.


నేను జ్వరంతో బాధపడుతున్నప్పటికి దీని గురించి తరువాత అలోచిద్దాం అనుకుని స్వామివారితో, “మహాస్వామివారు ఆజ్ఞాపిస్తే నేనే స్వయంగా వారికి ఆహారం తయారుచేస్తాను” అని చెప్పాను. స్వామివారు ఆశ్చర్యంతో “ఈ రాత్రప్పుడు నువ్వు ఏమి చెయ్యగలవు?” అని అడిగారు. ”నేను కొండపైనున్న ప్రసాదాల దుకాణంలో పనిచేస్తాను. వాళ్ళకోసం వెణ్ పొంగల్ (వెన్న పొంగలి) తయారుచేస్తాను” అని చెప్పాను. మహాస్వామివారు ”అలా అయితే సరే. నేను మెట్లమార్గం గుండా కొండ ఎక్కుతాను. వాళ్ళని మామూలు మార్గం ద్వారా రమ్మని చెప్తాను. నువ్వు వెళ్ళి త్వరగా అహారం సిద్ధం చెయ్యి. వెళ్ళు!!”


స్వామివారు ఆ చివరి పదం “వెళ్ళు” అని అనగానే అప్పటిదాకా ఉన్న జ్వరం, అలసట మాయమయ్యాయి. ఎక్కడాలేని ఉత్సాహం వచ్చేసింది. ఏదో పరుగుపందెంలో పాల్గొంటున్న వాడిలా ఒక్క ఉదుటున వెళ్ళి పైకి చేరుకున్నాను. ఆరోజు మా యజమాని లేరు. నేను విషయమంతా వారి భార్యకు చెప్పాను. ఆ సాధ్వి నాతో, “నువ్వు కిందకు వెళ్ళినది డాక్టరుకు చూపించుకోవాడానికే కదా! ఆ వైద్యనాథుడే నీ జ్వరాన్ని పోగొట్టి నీకు అనుజ్ఞ ఇచ్చిన తరువాత నన్ను అడగడం దేనికి? ఇది మనందరి ఉన్నతి కొరకు జరిగిన సంఘటన. నువ్వు సంతోషంగా వెళ్ళి ఆహారం తయారుచెయ్యి” అని చెప్పారు. వెంటనే నేను పొయ్యి వెలిగించి ఆహారం తయారు చెయ్యడం మొదలుపెట్టాను. అక్కడ పడుకొని ఉన్న అతణ్ణి లేపి ఆహారం, చెక్క తెడ్డు, తినడానికి మందార ఆకులు, పొంగల్ లో నంచుకోవడానికి పులికైచల్ (చింతపండు పులుసు) తీసుకుని వెళ్ళడానికి సహాయం తీసుకుని దేవాలయ ధ్వజస్థంభం దగ్గరకు వెళ్ళాము. 


కొన్ని నిముషాల తరువాత పరమాచార్య స్వామివారు వచ్చారు. మొత్తం దేవాలయ ప్రాకారాలు అన్ని విద్యుత్ వెలుగులతో నిండిపోయాయి. మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో దేవస్థానం అధికారి కృష్ణ రెడ్డియార్, ఆలయ పరిపాలనాధికారి కులశేఖర నాయుడు, ఆలయ ఉద్యోగులు, పండితులు మహాస్వామివారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారు చుట్టూ చూసారు. నేను వెళ్ళి వారిముందు చేతులు కట్టుకుని నిలబడ్డాను. 


స్వామివారు “ఆహారం తయారు అయ్యిందా?” అని అడిగారు. నేను, “తయారు చేసి ఇక్కడకు తీసుకుని వచ్చాను” అని బదులిచ్చాను. “సరే నువ్వు వీరికి వడ్డించిన తరువాత లోపలికి రా” అని అన్నారు. నేను మేనా మోసే బోయీలను కూర్చోమని చెప్పి ఆకుల్లో వేడి వెణ్ పొంగలి వడ్డించాను. “ఇది మీకోసమే తయారుచేశాను. నంచుకోవడానికి పులికైచల్ కూడా ఉంది. కడుపునిండుగా తినండి. నేను ఆలయంలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటాను” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. 


పరమాచార్య స్వామివారు గర్భాలయం వద్ద నిలబడి ఉన్నారు. నేను వారిని దర్శించగనే కళ్ళు నులుముకుని తేరిపారగా చూసాను తనిగైమలై మురుగన్ ఎవరు పరమాచార్య స్వామి ఎవరు అని నిర్ధారించుకోవడానికి. మహాస్వామిని అలా దైవగురువు, జగద్గురువుగా చూడడంతో కళ్ళ నీరు ఆపుకోలేకపోయాను. దర్శనానంతరం స్వామివారు బయటకు వచ్చారు. 


నేను వెళ్ళి వారి ఎదురుగా చేతులుకట్టుకుని నిలబడ్డాను. స్వామివారు నాతో, “వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు రుచిగా బాగా చేశావు. వాళ్ల కడుపు నింపావు” అని అన్నారు. నేను స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసాను. నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించారు స్వామివారు. 


”ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రామనామం జపించు” అని చెప్పి నన్ను ఆశీర్వదించినప్పుడు సమయం రాత్రి ఒంటి గంట అయ్యింది.


--- యస్. బలరామ రావు, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1



*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏

Kerala State is "God's Own Country"?

 Do you know why the Kerala State is called "God's Own Country"? 


Younger generation will not know and older generation might have forgotten the history behind this. Here below is the History:


When India got independence on 15th August 1947, the Trivancore Kingdom didn’t join the Indian Union Government. The Diwan of Trivancore Kingdom announced in June, 1947 that the Trivancore Kingdom will be a separate country by itself. 


During that period, the Trivancore Kingdom was well developed with Public Transport, Telephone Network, and Heavy Engineering Industries. The King took over all the expenses of the University. Above all, all Hindus were allowed to enter into all the Temples, without any bias on the caste, which was prevalent throughout India that point in time. 


When the talks were on between the Indian representatives and the King Chithirai Thirunal Balarama Varma, to make Trivancore Kingdom as part of Indian Union, the King said, "this land doesn't belong to me and belongs to Lord Padmanabha Swamy and I am only the Custodian. If the Lord Ananthan asks me to do, I will oblige". The Indian authorities didn't believe this and considered King's statement was just to dodge the issue. 


But the Trivancore authorities showed a Palm Leaf written on 20th January, 1750 signed by the then Trivancore King Anizhom Thirunal Marthanda Varma in favour of the Lord Padmanabha Swamy that the entire Trivancore Kingdom, which extended from today's Kanyakumari and Paravoor, belongs to the Lord. 


This is the reason, why the Kerala State is called "God's Own Country". Let's spread this history to all our youngsters. 


This information is published in the recent Thuglak Tamil Weekly.

శ్రీకృష్ణుడు శరీరాన్ని

 

శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, దహన సంస్కారాలు జరిగాయి, ఆయన శరీరమంతా ఐదు మూలకాలలో కలుపుతారు కాని ఆయన గుండె ఒక సాధారణ మనిషిలా కొట్టుకుంటుంది. ఆయన ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నాడు, ఆయన గుండె ఈ రోజు వరకూ సురక్షితంగా ఉంది, ఇది జగన్నాథుని చెక్క విగ్రహం లో ఉంది. మరియు అదే విధంగా కొట్టుకుంటుంది, చాలా కొద్ది మందికే ఇది తెలుసు.


 మహాప్రభు జగన్నాథ్ (శ్రీ కృష్ణ) ను కలియుగ ప్రభువు అని కూడా అంటారు.


 ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది, ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తరువాత, crpf సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ... ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు ...


 ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంది ... పూజారి కళ్ళు కట్టుకున్నాయి ... పూజారి చేతిలో చేతి తొడుగులు ఉన్నాయి .. పాత విగ్రహం నుండి "బ్రహ్మ పదార్ధం" తీసి కొత్త విగ్రహంలో ఉంచుతాడు ... ఈ బ్రహ్మ పదార్ధం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ... ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు. .. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతోంది ...


 ఇది అతీంద్రియ పదార్ధం, దానిని తాకడం ద్వారా, ఒక వ్యక్తి శరీరం యొక్క రోగాలు ఎగిరిపోతాయి .. ఈ బ్రహ్మ పదార్ధం శ్రీ కృష్ణుడికి సంబంధించినది .. అయితే అది ఏమిటోి, ఎవరికీ తెలియదు ... ఈ మొత్తం ప్రక్రియ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ సమయంలో భద్రత చాలా ఎక్కువగా ఉంటుoది .


 కానీ ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు ???


 కొంతమంది పూజారులు మేము అతని చేతిలో తీసుకున్నప్పుడు, అతను కుందేలు లాగా దూకుతున్నాడని ... అక్కడ కళ్ళకు కట్టినట్లు ఉంది ... చేతికి తొడుగులు ఉంటేనే మనకు ఆ అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. ...


 ఈ రోజు కూడా, జగన్నాథ్ యాత్ర సందర్భంగా, పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో తుడుస్తాడు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయ సింహ ద్వారం నుండి లోపలికి మొదటి అడుగు వేసిన వెంటనే సముద్రపు తరంగాల శబ్దం వినబడదు, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఆలయం నుండి ఒక అడుగు బయటకు వేసిన వెంటనే, సముద్రం యొక్క అలల హోరు వినబడుతుంది.


 చాలా దేవాలయాల శిఖరంపై పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మీరు చూసిఉంటారు, కాని జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు.


 జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది


 లార్డ్ జగన్నాథ్ ఆలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ పడదు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజూ మార్చడం జరుగుతుంది, జెండాను ఒక రోజు కూడా మార్చకపోతే, ఈ ఆలయం 18 సంవత్సరాలు మూసివేయబడుతుంది.


 అదేవిధంగా, జగన్నాథ్ ఆలయం పైభాగంలో సుదర్శన్ చక్రం కూడా ఉంది, ఇది ఏ దిశ నుండి చూసినా అది మీకు ఎదురుగా ఉంటుంది.


 లార్డ్ జగన్నాథ్ ఆలయ వంటగదిలో, 7 మట్టి కుండలు ఒకదానికొకటి పైన ఉంచి ప్రసాదం ఉడికించాలి, ఇది ఒక చెక్క నిప్పుతో వండుతారు, ఈ సమయంలో పైన ఉంచిన కుండ యొక్క వంటకం మొదట వండుతారు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజూ చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు, కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది.🌼🌿🌻🌾