29, జూన్ 2024, శనివారం

మోక్ష సాధనకు మార్గం

 *మోక్ష సాధనకు మార్గం*




🙏 *భగవంతుణ్ని పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.* 


💐 *మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించడం,* 


💐 *దేవునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం,* 


💐 *నామ సంకీర్తన చేయడం  వంటివన్నీ భగవంతుని పూజా విధానాలే.* 


1. *కృతయుగంలో ధ్యానం* 

2. *త్రేతాయుగంలో యజ్ఞాలు* 

3. *ద్వాపర యుగంలో అర్చనలు* 

4. *కలియుగంలో భగవన్నామ సంకీర్తనం* 


🪷 పై నాలుగు మార్గాలు, భగవంతుని అనుగ్రహానికి,  మోక్షప్రాప్తికి తగిన సాధనాలు అని శాస్త్రాలలో చెప్పారు.


🪷 *ముక్తి సాధనాలు* గా *కర్మయోగం,* 

*రాజయోగం,* 

*భక్తియోగం,* 

*జ్ఞాన యోగం* 

అని నాలుగు యోగాలు శాస్త్రాలలో తెలిపారు.


💐 సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు.  ఫలాపేక్ష వదలి కర్మలు చేయాలని అదే నిష్కామ కర్మయోగమనీ గీతాచార్యుడు బోధించాడు. 

దీని వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామకర్మ - బంధం నుండి విడిపిస్తుంది. 


💐 *ప్రతి పనినీ భగవత్‌ కైంకర్యమనే భావంతో చేయాలి. ఇదే కర్మయోగం.* 


💐 *చంచలమైన మనస్సును అరికట్టడమే రాజయోగం ఇది బ్రహ్మప్రాప్తికి రాజమార్గం కావడం వలన రాజయోగం అనబడింది.* 


💐 అభ్యాసంతోనూ, వైరాగ్యంతోనూ మనస్సును అరికట్టవచ్చని గీతలో చెప్పబడింది. 


💐 *తత్వ విచారణలో జీవాత్మ స్వరూపాన్ని పరమాత్మతో దాని సంబంధాన్ని తెలుసుకోవడమే జ్ఞానయోగం.* 


💐 అద్వైత మతస్తులు - జ్ఞానయోగమే అన్ని యోగాల కంటే శ్రేష్ఠమని చెబుతారు. అవిద్య, అజ్ఞానం తొలగినప్పుడు జీవాత్మకు పరమాత్మకు తేడా ఉండదని చెబుతారు. 


💐 ఈ కాలంలో తరించడానికి భక్తియోగమే సులభోపాయం. 


💐 *అనన్యమైన భక్తి చేత మాత్రమే భగవంతుణ్ని తెలుసుకోవడం, దర్శించడం ఆయనలో ప్రవేశించడం సాధ్యమవుతుంది.* 


💐 సాత్వికాహారాన్నే భుజించడం, విషయసుఖాలపై విరక్తి, శాస్త్రవిధిని పాటించడం, సత్యమార్గాన్ని అనుసరించడం, అహంకారానికి లోను కాకుండా ఉండడం భక్తియోగానికి మార్గాలు.


*ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి* 


💐 సమస్త ప్రాణుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడని గ్రహించి, భూత దయ గలిగి, ఇతరుల మనస్సును నొప్పించకుండా, మితిమీరిన స్వార్థాన్ని వీడి, అందరూ మనుగడ సాగించాలనే భావాన్ని కలిగి ఉండాలి. 


💐 *అలా జీవితం కొనసాగించి, మరణం తరువాత కూడా ఇతరుల హృదయాలలో జీవించగలగడమే అసలైన మోక్షం.*

🙏శ్రీ మహావిష్ణువు 16 నామముల స్మరణ

 🙏🌞🙏🌞🙏

🙏శ్రీ మహావిష్ణువు 16 నామముల స్మరణ వలన కలుగు ఫలితము🙏

🌸🌿🌸🌿🌸

ఔషధం సేవించేటప్పుడు -విష్ణువు


భోజనం చేసే సమయంలో  -జనార్ధన


నిద్రించు సమయంలో  -పద్మనాభం


వివాహ సమయములో -ప్రజాపతి


యుద్ధసమయంలో -చక్రధారి


ఇతర ప్రదేశము కు వెళ్ళిన సమయములో- త్రివిక్రమ


చనిపోయే సమయం -నారాయణ


భార్య సంగమం-శ్రీధర


చెడు స్వప్నమున -గోవిందా


సంకట స్థితి-మధుసూదన


అడవిలో ఉన్నప్పుడు- నరసింహ


దాహం తీసుకునే సమయంలో -జల సాయి


నీటిలో ఉన్న సమయమున -వరాహం


పర్వతము మీద ఉన్నప్పుడు-రఘు నందన


ప్రళయకాల సమయములో -వామన


అన్ని కార్యములు లో -మాధవం


ఈ 16 నామములు ఉదయం పఠించడం ద్వారా అన్ని పాపముల నుండి విముక్తి కలిగి శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది..🙏


ఓం నమో వేంకటేశాయ.

🙏🌞🙏🌞🙏

కలియుగం రాబోతుందనగా

 *ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు*


 *శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.*


*ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.*


*ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.*


*అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు.*


*ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.*


*దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.*


*“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.*


*కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.*


*ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.*


*కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.*


*కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.*


*అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు. తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.*


*ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.*


*మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు.*


*ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.*


*ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.*


*కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.*


*ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.*


*కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.*


*కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.*


*కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో!*


*కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా! ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.*


*ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం...*


*ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.*

కల్కి అవతారం

 🔔 *సత్సంగం* 🔔


కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ............!!


కృతయుగం నుండి  ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది. 

కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం.వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. 


పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు.


1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు.


2. గోవులు విశేషంగా వదింపబడి గో మాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది. 


3. వివాహ వ్యవస్థ నిలబడదు


4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు


5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు


6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సర

ములకే పడిపోతుంది


7.స్త్రీలు కేశపాశము లు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది


8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే  బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10 వ అవతారంగా వస్తాడు


9. అది ఎప్పుడూ అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది


10. ఆసనము నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది .కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలి పోతారు


11. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి


12. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్లు మాత్రమే శరీరాలతో ఉంటారు


13. ఆయన "శ్వేతాశ్వాన్ని " ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్లందరినీ దునుమాడుతాడు


14. తరువాత కలియుగం పూర్తి అవుతుంది తరువాత కృత యుగం ప్రారంభం అవ్వడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది 


15.ప్రతి కలియుగం చిట్టచివర్లో వచ్చే అవతారం కల్కి అవతారం.


16. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన నమస్కరించిన పాపబుద్ధి     పోతుంది


17 అంత గొప్ప అవతారం కల్కి అవతారం


ఓం నమో నారాయణాయ నమః




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

*శ్రీ కేదారేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 363*


⚜ *కర్నాటక  : హాలబీడు*


⚜ *శ్రీ కేదారేశ్వర ఆలయం*



💠 కేదారేశ్వర దేవాలయం ("కేదారేశ్వర" లేదా "కేదారేశ్వర" అని కూడా పిలుస్తారు) భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో , చారిత్రాత్మకంగా ముఖ్యమైన హళేబీడు పట్టణంలో హొయసల యుగపు నిర్మాణం.


💠 కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఉన్న కేదారేశ్వర దేవాలయం హళేబీడులోని ప్రసిద్ధ హోయసలేశ్వర ఆలయానికి సమీపంలో ఉంది, ఈ ఆలయ నిర్మాణం మరియు లోపలి భాగం చాలా ఆకట్టుకుంటుంది మరియు ఈ చారిత్రక ఆలయాన్ని అన్వేషించడానికి ప్రతి సంవత్సరం లెక్కలేనన్ని పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.  


💠 ఈ ఆలయాన్ని 1219లో హోయసల రాజు వీర బల్లాల II మరియు అతని రాణి కేతలాదేవి నిర్మించారు.  

ఈ ఆలయం సబ్బు రాళ్లతో తయారు చేయబడింది మరియు ఇది హిందువుల ముఖ్యమైన దేవుడైన శివునికి అంకితం చేయబడింది.  

హళేబీడు కేదారేశ్వర దేవాలయం యొక్క అద్భుతమైన వాస్తుశిల్పం భారత పురావస్తు శాఖచే జాతీయ ప్రాముఖ్యతగా రక్షించబడింది.  ఆలయాన్ని సందర్శించే ముందు మీరు తప్పక తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.


💠 హళేబీడులోని కేదారేశ్వర దేవాలయం వీర బల్లాల II యొక్క అత్యంత ముఖ్యమైన పురావస్తు వారసత్వాలలో ఒకటి.  

అతను తన కాలంలో గుర్తించదగిన చక్రవర్తి మరియు అతని కథలు మరియు స్మారక మేధావి ఈనాటికీ ప్రశంసించబడ్డాయి.  

అతను దక్షిణ కాలచూరీలు, దేవగిరి యాదవులు, మధురై పాండ్యులు మరియు పశ్చిమ చాళుక్య సామ్రాజ్యంపై విజయం సాధించాడు.  ఈ విజయాలు కాకుండా, అతను తంజావూరులోని క్షీణిస్తున్న చోళులలో కూడా ఆధిపత్యం వహించాడు.


💠 హళేబీడులోని కేదారేశ్వర ఆలయ నిర్మాణం పురాతన కాలం నాటి హొయసల నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ.  

ఆలయం లోపల కొన్ని ప్రధాన చేర్పులు విమాన మరియు మహామండపం ఆలయ నిర్మాణ శైలిని మెరుగుపరుస్తాయి.  

ప్రధాన మందిరం రెండు చిన్న దేవాలయాలతో నక్షత్ర ఆకారంలో ఉంది.  ఆలయంలో మొత్తం మూడు మందిరాలు ఉన్నాయి మరియు గర్భాలయాలు సెంట్రల్ హాల్‌కు అనుసంధానించబడి ఉన్నాయి.


💠 ఈ ఆలయంలో మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నందున, ఇది త్రికూటంగా , మూడు మందిర నిర్మాణంగా అర్హత పొందింది. 

తరచుగా త్రికూటాలలో , మధ్య మందిరానికి మాత్రమే గోపురం ఉంటుంది, పార్శ్వ మందిరాలు వాస్తవంగా దట్టమైన బయటి గోడల వెనుక దాగి ఉన్నాయి మరియు హాలులోనే ఒక భాగంగా కనిపిస్తాయి. 


💠 ఇది శైవ దేవాలయం అయినప్పటికీ (శివునికి సంబంధించినది) ఇది శైవ మరియు వైష్ణవ (విష్ణుదేవునికి సంబంధించినది) పురాణంలకు ప్రసిద్ధి చెందింది.


💠 బెంగుళూరు NH 48 ద్వారా హళేబీడుకి మరియు బేలూరు వరకు రాష్ట్ర రహదారికి బాగా అనుసంధానించబడి ఉంది. 

Panchaag


 

ఏమి ఫలితం వస్తుంది

 ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది .

1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.

2. శివాష్టకం - శివ అనుగ్రహం..

3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం...

4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది...

5. అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి....

6. కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం...

7. దుర్గష్టోత్తర శతనామం - భయహరం..

8. విశ్వనాథ అష్టకం - విద్య విజయం..

9. సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం..

10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ...

11. విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి...

12. శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి...

13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి...

14. శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం...

15. లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం.

16. కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం..

17. ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత..

18. శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం..

19. లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి..

20. శ్యామాల దండకం - వాక్శుద్ధి..

21. త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి..

22. శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి...

23. శని స్తోత్రం - శని పీడ నివారణ...

24. మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం..

25. అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి...

26. కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం..

27. కనకధార స్తోత్రం - కనకధారయే...

28. శ్రీ సూక్తం - ధన లాభం..

29. సూర్య కవచం - సామ్రాజ్య సిద్ది..

30. సుదర్శన మంత్రం - శత్రు నాశనం...

31. విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం...

32. రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి..

33. దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు...

34. భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు..

35. వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు...

36. దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు..

37. లలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి...

ప్రతీ మనిషి ఆలోచన విధానం మారాలి 

లోకా సమస్తా సుఖీనోభవంతూ

ఓం శం శరవణభవ


Edu hub academy online sessions available on above mentioned stotras.  Paid classes. Interested contact 6300671439

సహకరించవలసిందిగా మనవి*

 హైందవశక్తి గ్రూప్ సభ్యులకు జై శ్రీరామ్🚩🚩🚩


విషయం:*దాతలు సహకరించవలసిందిగా మనవి* 


అణగారిన వర్గాలైన SC హిందువులు కోసం కేటాయించిన రిజర్వేషన్లు, క్రైస్తవ మతానికి మారికూడా హిందువు అని చెప్పుకుంటూ దొంగచాటుగా ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా, ఏవైనా విబేధాలు వచ్చినపుడు అసలైన హిందువులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్న విషయం గ్రామాల్లో,పట్టణాలలో ఉంటున్న ఎక్కువమంది హిందువులకు తెలిసినదే. కానీ క్రైస్తవ మతానికి మారిన SC వ్యక్తి  BC "C" అవుతాడాని, అతను అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హుడని, ఎక్కువమంది హిందువులకు తెలియక మోసపోతున్నారు,

ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి హిందువులను మేల్కొలపడం కోసం ఈ వాల్ పోస్టర్లను గ్రామగ్రామానా అంటించడానికి  హైందవశక్తి పూనుకున్నది. 


1000 వాల్  పోస్టర్ల ఖరీదు: 3500/-

అంటించే కుర్రవాడి జీతం : 1500/-

సహకరించేవారు ఈ నెంబర్ ను సంప్రదించగలరు

Phone No : 8331034785


*హైందవ శక్తి VSKనక్కపల్లి2*

సామాజికం

 🔔 *సామాజికం* 🔔


వారం రోజుల కింద‌ట తెగిన చెప్పు కుట్టిద్దామంటే విజ‌య‌వాడ‌లో కుట్టేవారిని క‌నిపెట్ట‌డం పెద్ద టాస్కే అయ్యింది. మొత్తానికి అయ్య‌ప్ప‌న‌గ‌ర్ రోడ్డులో ఇవాళ ఒకాయ‌న్ని ప‌ట్టుకుని చెప్పు కుట్టించుకున్నాను. అన్నిచోట్లా ఇర‌వై రూపాయ‌లు తీసుకుంటుంటే ఆయ‌న ప‌ది రూపాయ‌లే తీసుకున్నాడు. స‌రే ప‌నేం లేదు క‌దా అని ఆయ‌నతో కాసేపు మాట్లాడాను. 


ఆయ‌న తాత‌, తండ్రుల‌ది కూడా ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మీ పిల్ల‌లు ఏం చేస్తున్నారు? అని అడిగితే చెప్పాడు అస‌లు విష‌యం. వాళ్ల‌బ్బాయి ఇంజ‌నీరింగ్ చ‌దివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్లుడు బ్యాంక్ ఉద్యోగి. య‌న‌మ‌ల‌కుదురులో 7 సెంట్ల‌లో సొంతిల్లు. నెల‌కు వ‌చ్చే అద్దెలు 25వేలు.  నున్న‌లో ఎక‌రం మామిడి తోట‌. ఇన్ని ఉండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావ‌ని అడిగితే --


  "ఒక‌ప్పుడు ఈ ప‌నే మాకు అన్నం పెట్టింది. మా నాన్న ఈ ప‌నిచేసే అప్ప‌ట్లో రేటు త‌క్క‌వని నున్న‌లో మూడెక‌రాలు కొంటే నా వాటా ఎక‌రం వ‌చ్చింది. మా చిన్న‌ప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డ‌బ్బులకు బ‌దులు వ‌డ్లు ఇచ్చేవారు. అవి స‌రిపోక మా అమ్మ వ‌రి కోసిన పొలాల్లో ప‌రిగె ఏరుకొచ్చి అందులో గింజ‌లను వేరుచేసి మాకు అన్నం పెట్టేది. మేం త‌ర‌త‌రాలుగా ఆధార‌ప‌డి బ్ర‌తికిన ప‌ని ఇది. డ‌బ్బులున్నా ఈ ప‌నిచేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది "  అని ఆయ‌న చెప్పిన మాట‌లు అద్భుతంగా అనిపించాయి. మీరు ఎప్పుడైనా రండి ఉద‌యం నుంచి సాయంత్రం ఏడింటిదాకా ఇక్క‌డే ఉంటాన‌ని చెప్పాడు. 


వెనక కావాల్సినంత ఆదాయం ఉంద‌న్న ధీమా లేదు. ఒక‌రోజు కుట్ట‌క‌పోతే ఏంకాదులే అనే ఆలోచ‌న లేదు. అందుకే ఆదివారం కూడా అక్క‌డే ఉన్నాడు. నా త‌ర్వాత మ‌రొకాయన వ‌చ్చి 200 నోటుకు చిల్ల‌ర ఉందా? అని అడిగితే ఫ‌ర్లేదు స‌ర్ ఈసారి వ‌చ్చిన‌ప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పు తీసుకుని కుట్టేశాడు.


            సింపుల్‌గా ఉండే ధ‌న‌వంతులు మ‌న‌కు రోల్‌మోడ‌ల్‌. సుధా నారాయ‌ణ మూర్తి సాదాసీదా నేత చీర క‌ట్టుకుంటే అదొక ఆశ్చ‌ర్యం మ‌న‌కి. సెల‌బ్రిటీలు రోడ్డు ప‌క్క‌న ధాబాలో తింటే అదీ ఒక వార్తే. అలా ఉండ‌టం వారి గొప్ప‌త‌న‌మే. ఈ చెప్పులు కుట్టే ఆయ‌న కూడా ఆ కోవ‌కి చెందిన వాడే. ఆయ‌నకు చ‌దువు లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. పిల్ల‌ల్ని చ‌దివించుకున్నాడు. ఇవాళ కూర్చుని తినే స్థితికి చేరాడు. అలాగ‌ని అన్నం పెట్టిన వృత్తిని వ‌దల్లేదు. 59ఏళ్ల ఆ ముస‌లాయ‌నకు ప‌ళ్లు ఊడిపోయే ద‌శ వ‌చ్చింది, అందుకే మాట స్ప‌ష్టంగా రావ‌ట్లేదు. నిరంత‌ర క‌ష్టం వ‌ల్ల ఒంట్లో ఇంకెలాంటి రోగాలు చేర‌లేదు. ఉద‌యం అన్నం తిని రావ‌డం. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి వెళ్లొచ్చి మ‌ళ్లీ రాత్రి వ‌ర‌కూ అక్క‌డే చెప్పులు కుట్ట‌డం. ఇదే సంతృప్తి అంటున్నాడు. 


ఆయ‌న వైపు నుంచి చూస్తే ఆయ‌న‌కిదే విలాస‌వంత‌మైన జీవితం. ఈ మ‌ధ్య ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో చూశా. ప‌చ్చ‌ని పొలాల మ‌ధ్య‌లో చిన్న పంపుసెట్ లాంటి ఇంట్లో ఒకాయ‌న ద‌ర్జాగా కూర్చున్న ఫొటో అది. ఈ ఆనందం ఎంత పెద్ద బంగ‌ళా ఉన్నా వ‌స్తుందా? అనేది ప్ర‌శ్న‌.  


విలాసం, ఆనందం అనేవి న‌చ్చిన జీవన విధానంతో వ‌స్తాయి త‌ప్ప, కేవలం డబ్బు వల్ల మాత్రమే రావు.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

వెంకటేశ్వర స్వామికి శనివారం

 *శుభోదయం ! శ్రీనివాస గోవిందా! శ్రీ వెంకటేశా గోవిందా!*


*వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకంత ప్రీతి:*


🛕ఓంకారం ప్రభవించిన రోజు శనివారం.


🛕శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం.


🛕వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం.


🛕ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం.


🛕శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది,  పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే.


🛕వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే.


అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం.

శీతలాష్టమి

 *నేడు శీతలాష్టమి (శీతలాదేవి పూజ)*


"వన్దే౽హం శీతలాం దేవీం సర్వ రోగభయాపహామ్ 

యమాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్"


జ్యేష్ట బహుళ అష్టమినాడు శివుడిని త్రిలోచనునిగా పూజించాలి. ఆయనతో పాటుగా జగన్మాతను శీతలాదేవిగా పూజించాలి. స్కాందపురాణంలోని శీతలాష్టకాన్ని పారాయణం చేయాలి. అందువల్ల రోగాలు తగ్గుతాయని ఫలశ్రుతి చెబుతోంది.హైందవులుఈరోజున శీతలా మాతను పూజిస్తారు. అంటు వ్యాధులు సోకకుండా తమను, తమ పిల్లలలను తమ కుటుంబ సభ్యులను రక్షించమని శీతలా మాతను వేడుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఎంతో పవిత్రంగా, వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శీతలా సప్తమి రోజు అక్కడి గ్రామ దేవతలను పూజిస్తారు.


శీతల సప్తమి పండుగ ఔచిత్యం స్కాంద పురాణంలో స్పష్టంగా వివరించారు. పురాణాల ప్రకారం పార్వతి దేవి మరో అవతారమే శీతలా దేవి. శీతలా దేవి ప్రకృతి వైపరిత్యాలనుండి ప్రజలను కాపాడుతుందని విశ్వసిస్తారు. 'శీతలా' అనే పదానికి చల్లదనం అని అర్థం. ఆ తల్లిని నమ్మి కొలిచిన వారిని, వారి కుటుంబాలను శీతలా మాత చల్లగా చూస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అనేక ప్రాంతాల్లో ఈ రోజున భక్తులు శీతలా మాతకు పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేస్తారు. అనంతరం పూజలు చేస్తారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందేందుకు శీతలా దేవతకు ప్రార్థనలు చేస్తారు. కొందరు శీతల వ్రతం పాటించి శీతల మాత వ్రత కథను చదువుతారు. శీతలా మాతను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు.


శీతల సప్తమి రోజున, భక్తులు వంట చేయడం మానుకుంటారు. ఒక రోజు ముందు తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు. ఈ ప్రత్యేక రోజున వేడి, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా నిషేధిస్తారు. మహిళలు ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ఉపవాసం చేస్తారు.


🌺పురాణ కథనం: 🌺


శీతల సప్తమికి సంబంధించిన పురాణ కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఇంద్రయుమ్న అనే రాజు ఉదారవంతుడు. సద్గుణశీలి. అతనికి ప్రమీల అనే భార్య, శుభకరి అనే కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఇంద్రయుమ్నుని రాజ్యంలో ప్రతి సంవత్సరం శీతల సప్తమి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. ఒకసారి శుభకరి కూడా ఆ ఉత్సవంలో పాల్గొంది. పూజలు చేయడానికి శుభకరి తన స్నేహితులతో కలిసి సరస్సుకు బయలుదేరింది. కానీ దారి తప్పడంతో వారు సరస్సుకు చేరుకోలేక పోయారు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు వారికి సహాయం చేసి సరస్సుకు దారి చూపింది. అంతేకాదు శీతల సప్తమి పూజా నిర్వహణలో, ఉపవాసం పాటించడంలో తదితర ఆచార వ్యవహారాలను వారికి వివరిస్తూ తగు సూచనలు ఇచ్చింది. అంతా బాగా జరిగింది, శీతలా దేవి చాలా సంతోషించి శుభకరికి వరం ఇచ్చింది. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు ఆ వరాన్ని ఉపయోగించుకుంటానని శుభకరి దేవితో చెప్పింది. వారు రాజ్యానికి తిరిగి వస్తుండగా ఒక పేద కుటుంబంలో పాము కాటు కారణంగా వారి కుటుంబ సభ్యులలో ఒకరు మరణించినందుకు దుఃఖిస్తున్నారు. ఆ దృశ్యం చూసిన శుభకరీ తనకు లభించిన వరాన్ని గుర్తుచేసుకుంది. చనిపోయిన ఆ వ్యక్తికి ప్రాణం పోయమని శీతలా దేవిని ప్రార్థించింది. ఆ వ్యక్తి తన జీవితాన్ని తిరిగి పొందాడు. శీతల సప్తమి వ్రత మహత్యం తెలుసుకున్న ప్రజలందరు అప్పటి నుండి ప్రతి సంవత్సరం అచంచలమైన భక్తి ప్రవత్తులతో, అంకిత భావంతో వ్రతం ఆచరిస్తున్నారు.

నవ్వుతూ ఉండేవారు

 🚩 *నవ్వుతూ ఉండేవారు తమలో ఒక ప్రపంచాన్ని నిర్మిస్తారు, నవ్వలేనివారు బయట ప్రపంచాన్ని నిందిస్తారు*. మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తును ప్రేమిస్తే బాగుపడతాడు.

🟨సంతోషం సీతాకోక చిలుక లాంటిది పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు ప్రశాంతంగా ఉంటే అదే వచ్చి వాలుతుంది.. నవ్వండి, నవ్వించండి, నవ్వుతూనే ఉండండి ఎందుకంటే మీ ఏడుపుకై ఎదురుచూసే వారికి మీరిచ్చే గొప్ప రిటర్న్ గిఫ్ట్ మీ నవ్వు మాత్రమే.

🟣 *సంతోషంగా ఉండాలంటే మతి మరుపు ఉండడం కూడా అవసరమే*. ప్రతి నవ్వు వెనక సంతోషం ఉండదు అది వాళ్ళకి వాళ్ళు ధైర్యం చెప్పుకునే ఒక ప్రయత్నం కావచ్చు.. కానీ నవ్వుతూనే ఉండండని అంటాడు  *రాగో*.

        🚩 *ధర్మో రక్షతి రక్షితః* 🚩

             *శుభోదయం*🙏🙏

       *🌜సత్యమేవ జయతే🌛*

Support this blog

  Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

ధర్మాచరణ కర్తవ్యం*

 *ధర్మాచరణ కర్తవ్యం*


ఎంత దార్శనిక శ్రేష్టుణ్ణైనా ధర్మాచరణ నాకూ కర్తవ్యమే అని ఆచార్య శ్రీఆది శంకరులు అనుకున్నారు. వాళ్ళు ఎవరూ కూడా ధర్మమార్గంలో తమకు  మినహాయింపు ఉంది అని ఎన్నడూ అనుకోలేదు. అటువంటప్పుడు మనమంతా ఏరీతిగా ఉండాలి. అంటే పాశ్చాతుల అంధానుకరణం అనేటటువంటిది మనవాళ్లలో వస్తున్నది, గుడ్డిగా పాశ్చాతులను అనుసరించటం . ఆ పాశ్చాతులలాగా నేనుంటే నేను పెద్దమనిషిని అవుతాను. గొప్పవాడినినైతాను. అనే ఒక భ్రమ మనవాళ్లలో వస్తున్నది. అది చాలా పొరపాటు. పాశ్చాతులను మనం ఎన్నడూ అనుకరించకూడదు. వాళ్ల సంస్కృతి వాళ్లకు, వాళ్ల రీతి వాళ్లకు, అది మనకు అనుకరణీయం కాదు. అది తప్పా, సరా? అనేటటువంటి విమర్శ మనకు అక్కర్లేదు, కానీ మనకు,మన సాంస్కృతి,సాంప్రదాయం మనదే. వేరేది మనకు అనుకరణీయం కాకూడదు.

మనము ఏ పరంపరలో ఎలా వచ్చామో? ఏ ధర్మ మార్గంలో వచ్చామో? అదే మనకు అనుకరణీయంకాని, అన్యులది,విదేశీయులది మనకు అనుకరణీయం కాదు. అది ఎప్పుడు అనుకరణీయం అవుతుంది అంటే మనకు ఉన్న ధర్మమార్గం మనకు శ్రేయఃప్రదం కాకపోతే, వాళ్లయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం అనటానికి హిందూ శాస్త్రాల్లో ఏమైనా ప్రమాణం ఉంటే, అప్పుడు వాళ్ళది మనకు అనుకరణీయం అవుతుంది. వాళ్ళది మనకు శ్రేయఃప్రదం అనటానికి మన ఈ శాస్త్రంలో ప్రమాణం లేదు, వారియొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం కాదు అనటానికీ ప్రమాణం లేదు.

అలాంటప్పుడు మనం అన్యధర్మాన్ని ఎందుకు అనుసరించాలి?.  అలాంటప్పుడు సర్వదా మనకు అది పనికిరాదు. ఏ విధంగా చూచినా మనయొక్క ధర్మాన్ని  మనం ఉపేక్షించటానికి ఏ విధమైన కారణం కనపడదు. అందువలన పాశ్చాతుల అంధానుకరణం మనకు పనికిరాదు.

మన స్త్రీల నుదుటన కాసంత పరిమాణంలో బొట్టు,  సాంప్రదాయ వస్త్రధారణ, పురుషుల భస్మ ధారణ మనం ఈ విశ్వంలో ఉన్నంత కాలం మరువరాదు.అది మనకు భగవంతుడు, పెద్దలు నేర్పిన సంస్కృతి.


--- *జగద్గురు శ్రీశ్రీశ్రీ  భారతీతీర్థ మహాస్వామి వారు.*

ఇనుప మూకుడు

ఇనుప మూకుడు  

హిమోగ్లోబిన్ అనునది ఇనుము సంబంధిత రసాయన పదార్ధము. ఇది మన శరీరంలో ఎక్కడ శక్తి కావాలో అక్కడకు ఆక్షీజనును తీసుకొని వెళుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాకూడా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మన శరీరానికి కావలసినంత ఆక్షీజను లభించదు దద్వారా మన శరీరాన్ని శక్తివంతంగా పనిచేయలేము. ఈ రోజుల్లో ఎక్కువగా మహిళల్లో రక్తహీనత సర్వసాధారణమైనది. ఎవ్వరు చూసిన రక్త హీనతతో బాధపడుతున్నవారే అయితే ఎక్కువగా మహిళలకే ఎందుకు రక్త హీనత వస్తుంది అని ఆలోచించినట్లయితే దానికి అనేక కారణాలు వున్నాయి. అందులో ఒకటి మహిళల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పురుషులలో వుండే హిమోగ్లోబిన్ శాతం కన్నా తక్కువ ప్రకృతి సిద్దంగానే ఉంటుంది. 

పురుషుల్లో హిమోగ్లోబిన్ : 14 to 18 g/dl;

మహిళల్లో హిమోగ్లోబిన్  12 to 16 g/dl

ఇక్కడ ఇచ్చిన సమాచారం సగటు ఆరోగ్యవంతులైన వారి విషయం. ఇంకొక విషయం మనం గుర్తించాలి పురుషలల్లో రక్తం శరీరంలో వున్నది వున్నట్లే ఉంటుంది.  కానీ మహిళలకు ఋతుక్రమంలో వారి ప్రమేయం లేకుండా చాలా రక్తం వెలువడుతుంది. అసలే శరీరంలో హిమోగ్లోబిన్ పురుషులకన్నా తక్కువ ఉంటే వారు ఈ విధంగా కూడా  రక్తాన్ని కోల్పోతారు. నాకు వున్న సమాచారం ప్రకారం చాలామంది మహిళలు 10g /dl కన్నా తక్కువ ఉన్నట్లు తెలిసింది. పూర్వకాలంలో మన ఇండ్లలో వున్న వస్తువులు, ఆహారపు అలవాట్లు చాలావరకు మనం ముఖ్యంగా  మహిళలు ఆరోగ్యంగా రక్త హీనత లేకుండా ఉండటానికి ఉపకరించేవి. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రక్త హీనత వలన అనేక ఇతర రుగ్మతలు కూడా రావచ్చు. ఎందుకంటె ఎప్పుడైతే శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ అవుతుందో అప్పుడు శరీరం బలహీన పడుతుంది దానివల్ల శరీరం ఇతర రోగాలను రాకుండా నిరోధించే శక్తిని కోల్పోతుంది దాని పర్యవసానంగా ఇతర రోగాలు ప్రవేశించటానికి తలుపులు తేరాచినట్లు అవుతుంది.  కాబట్టి ప్రతివారు తమ ఇంటిలోని ఆడవారి శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ కాకుండా ఉండేటందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. 

వంటశాలలో మార్పులు: పూర్వం మన ఇండ్లలో అనేక వంట సామాగ్రిని మనం ఇనుముతో చేసినవి ఉపయోగించే వాళ్ళము. ఇప్పుడు మన వంటశాలలో ఇనుము పూర్తిగా కనుమరుగు అయ్యింది.   వాటి వల్ల శరీరం అనారోగ్యం పాలు అవుతున్నది. ఇప్పుడు నిశీతంగా పరిశీలిద్దాం. 

ముఖ్యంగా మనందరికీ తెలిసిన వంట ఇంటి వస్తువు ఇనుప మూకుడు. మనం పూర్వం ఇనుప మూకుడులో అనేక పిండివంటలను చేసుకునేవారము. పూరి, వడ, బజ్జే కారపూస, అదే జంతికలు, వడియాలు, అప్పడాలు, చల్లమెరపకాయలు అంతే కాదు బండపచ్చళ్ళు గోంగూర, బచ్చలికూర, చింతకాయ, మామిడికాయ, దోసకాయ మొదలయిన పచ్చళ్ళు చేయటానికి ఇనుప మూకుడునూనెలో వేయించి రోట్లో రుబ్బుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినే వాళ్ళం. అంతే కాకుండా పోపుపెట్టాలన్నా ఇనుప మూకుడు లేక ఇనుప గరిటను వాడే వాళ్ళము. ఒక్క మాటలో చెప్పాలంటే మన వంట సగానికి సగం ఇనుప ముకుడు మీదనే ఆధారపడి వున్నది. పూర్వం ఆడవారు ఇలా మాట్లాడుకునే వారు "వదిన మా ఇంట్లో మూకుడు పెట్టి వారం రోజులైంది నా కుమారుడు వచ్చాడు ఏదైనా చేయాలి" అని అంటే ఇంట్లో పిండి వంట చేసి అని అర్ధం. ఈ రకంగా మన వంట ఇల్లు ఇనుప మూకుడుతో అనుసందానం చేసి ఉండటం వలన మనం ఆరోగ్యంగా వుండే వాళ్ళము. మూకుడు తరువాత స్తానం ఇనుప పెనం తీసుకుంది. అట్లు వేసుకోవాలన్న, రొట్టెలు చేసుకోవాలన్న, పెనం మనకు అవసరం. వీటితో పాటు అట్లకాడ, జాలి గంటె ఇవికూడా ఇనుమువే ఉండేవి.

వీటితరువాట్ మరింత ప్రాధాన్యత సంతరించుకున్న వంట ఇంటి ఇనుప వస్తువు కత్తిపీట కత్తిపీట లేని ఇల్లు  గతంలో ఉండేదే కాదు. ప్రతి కూరగాయను కత్తిపీటతోటె తరిగే వాళ్ళు ఎప్పుడైతే కూరలు కత్తిపీటతో తరుగుతారో ఆ కూరలలో వుండే ఆమ్లము ఇనుముతో రసాయనకిక్ చర్య చెంది ఆమ్లంలో కరిగిన  ఆ పదార్ధం కూరలతో పాటు వంటగిన్నెను చేరేది. మనందరికీ తెలిసిన విషయం మనం మామిడికాయలు తిరిగినప్పుడు కత్తిపీట చాలా పదును ఎక్కుతుంది. "అరె ఇప్పుడే మామిడి కాయలు తరిగా కత్తిపీట బాగా పదును మీద వుంది జాగ్రత్త"  అని కత్తిపీట పిల్లలకు ఇచ్చేటప్పుతూ అనటం కద్దు అంటే మరి కత్తిపీట ఎలా పదును ఎక్కింది అంటే కత్తిపీటలోని ఇనుము మామిడి కాయలలో కరిగి ముక్కలలో కలిసింది అని అర్ధం. 

గతంలో మనకు ప్రతి ఆహారపదార్ధం ఇనుముతో చేసిన వస్తువుమీది నుంచి వచ్చేవి దానివలన ఇనుము స్వల్పంగా ఆహారపదార్ధాలలో కరిగి మన ఆహారంలోకి ప్రేవేశించేది. దాని వలన ఇనుము మన శరీరానికి అందేది రక్త హీనత అనేది అస్సలు ఉండేది కాదు. 

ఇప్పుడు ఇనుప వస్తువులు అన్నీ  స్టీలు  అల్యూమినియం, ప్లాస్టిక్ పదార్ధాలతో మార్పు చేయబడినవి వాటి వలన ఆరోగ్యకరమైన కరిగిన ఇనుము మన  శరీరంలోకి వేళ్ళ కుండా అనారోగ్యాన్ని చేకూర్చే ప్లాస్టిక్కు, అల్యూమినియం వెళ్లి శరీరాన్ని సుషుకింపచేస్తూ అనారోగ్యం పాలుచేస్తున్నాయి. 

శరీరంలో రక్త హీనతను గుర్తించటం ఎలా: రక్తహీనత వుండే వారిలో త్వరగా అలసట చెందటం, కంటి గ్రుడ్డు క్రింది రెక్కను ప్రక్కకు అని చుస్తే అక్కడ గులాబిరంగుగా, లేక పాలిపోయి ఉంటాయి. శరీరం శుష్కించినట్లుగా కనపడుతుంది. రక్తహీనత సాదారణ మైన విషయమే కానీ దీనిని ఆశ్రర్ధ చేయకూడదు. సత్వరం తగిన ఆహారపదార్ధాలు అంటే ఇనుము ఎక్కువ ఉండేవి తినటం వలన దీనినుండి కాపాడుకోవచ్చు. 

కొన్ని వంటింటి చిట్కాలు: 

1) పల్లీ చెక్క అంటే వేరుశనగ పల్లెలను బెల్లంలో కలిపి చేసే స్వీట్ ఇది చావుకగా లభిస్తుంది. దీనిని రోజు స్వేకరించాలి . 

2) పల్లీలు, బెల్లం నువ్వులు, రోజు తినే అలవాటు చేసుకోవాలి.

విధిగా మన వంటకాలలో పంచదార బదులుగా బెల్లాన్ని వాడాలి.  మరల ఇనుపముకుడును మన వంటశాలకు ఆహ్వానిస్తే చాలావరకు మనం రక్త హీనతనుండి కాపాడుకోగలుగుతాము. ఈ వ్యాసము చదివిన వారందరికీ ఆరోగ్యం చేకూరాలని ఆశిస్తున్నాను.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ


రోగమువలె కోపం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝    *కృతాపకారోపి పరైః అనావిష్కృత విక్రియః* । 

          *అసాధ్యం కురుతే కోపం ప్రాప్తేకాలే గదోయధా* ||


తా𝕝𝕝  *పరులు అపకారం చేసినా తెలివైన వాడు ఆ సమయంలో శాంతంగా ఉంటాడు. సమయం వచ్చినపుడు రోగమువలె కోపం ప్రదర్శిస్తాడు*.


 ✍️💐🌷🌹🙏

నృసింహపురాణము

 శు భో ద యం🙏


ఓం నమో నారాయణాయ!


తపములఁబోనిపాపములు,దానగుణంబునబోనిదోషముల్

జపముల నారిపోని కలుషంబులు దుప్పర దూలిపోవు న

చ్చపుఁదలపొప్ప నొక్కపరి సర్వమునైన

రమేశుపేరిదీ

యపుదలపొప్పుమీర మనమందిదొడగూర్పెడు నేర్పుగల్గినన్;

   -నృసింహపురాణము.ఎఱ్ఱాప్రెగ్గడ.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల

సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 29.06.2024

శని వారం (స్థిర వాసరే)  

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే కృష్ణ పక్షే అష్టమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

స్థిర వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ 

జ్యేష్ఠ మాసే   కృష్ణ పక్షే అష్టమ్యౌపరి నవమ్యాం

స్థిర వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.31

సూ.అ.6.34

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం 

కృష్ణ పక్షం అష్టమి మ. 3.40 వరకు. 

శని వారం. 

నక్షత్రం ఉత్తరాభాద్ర ప. 10.49 వరకు. 

అమృతం  ఉ.6.20 ల 7.49 వరకు. 

దుర్ముహూర్తం ఉ.5.32 ల 7.16 వరకు. 

వర్జ్యం  రా.10.00 ల 11.30 వరకు.

యోగం శోభన  రా. 9.11 వరకు. 

కరణం కౌలవ మ. 3.40 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

గుళిక కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

యమగండ కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

***********   

 పుణ్యతిధి జ్యేష్ఠ బహుళ అష్టమి మరియు నవమి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏