14, డిసెంబర్ 2020, సోమవారం

జలము కనుగొను విధానము

 నిర్జల ప్రదేశము నందు చెట్లును మరియు రాళ్లను బట్టి భూమి యందు జలము కనుగొను విధానము -


ద్వారము లేనిది కూపము అనియు, ఒక ద్వారము కలది వాపిక అనియు, నాలుగు ద్వారములు కలది పుష్కరణి అనియు , పొడవుగా ఉండునది దీర్గిక అనియు, కాలువతో నీటి ప్రవాహాలు చేత నిండునది తటాకం అని చెప్పబడును.


 * తెల్లని వస్త్రము వంటి రంగును, తెనే వర్ణం గల రాళ్లు ఏ ప్రదేశం నందు ఉండునో, అచ్చట సకల ప్రాణులకు సుఖము నిచ్చెడి జలం సమృద్ది కలిగి ఉండును.


 * వైడుర్యాలు, పెసలు, తుమ్మెద ఈ వర్ణములు గల రాళ్లు సమీపము నందు సమృద్ది గల జలమును, మరియు ముత్యములు , బంగారం , వెండి, హరిదళము వీని చాయలు కలిగిన రాళ్లు అక్కడ సంపూర్ణ జలం ఉండును.


 * మద్ది చెట్టు, బిల్వ వృక్షం, నెల్లి చెట్టు, తిప్పతీగ , పొన్నగంటి ఇవి కలిగిన చోట జలం ఉండును. మరియు సున్నపు రాతితో చేరిన నల్ల మృత్తిక కాని , ఎరుపు మృత్తిక కాని , కుశ, దర్భ కల చొట్ల జలం ఉండును. ఖర్జూరము , నేల తామర, తామర, కానుగ మొదలగు యుండు ప్రదేశములో , పచ్చిక కల ప్రదేశముల యందు జలం ఉండును.


 * సున్నపు రాళ్ళతో కూడి ఎరుపు అగు భూమి యందు చేదు నీళ్లు ఉండును. తీగలు, ఆకులు దట్టముగా, పచ్చగా ఉండు ప్రదేశం యందు జలం ఉండును. కపి వర్ణం గల భూమి యందు ఉప్పు నీరు దొరుకును. తెల్లటి నేలయందు కొంచం ఉప్పు గల నీరు పడును. నలుపు భూమి యందు నీరు మధురంగా ఉండును. కొండ మీద కొండ ఉండిన నొక మట్టున జలం ఉండును.


జలము కనిపెట్టు విధానము -


  బావి తవ్వునట్టి స్థలము ను నిశ్చయించి ఆ ప్రదేశం నందు 12 అంగుళముల లోతు గుంట చతురస్ర ఆకారముగా తవ్వి సాయం సమయమున దాని నిండా నీరుని నిండించి గంధ పుష్పాదుల చేత నలుదిశల యందు పూజించి తెల్లవారిన పిదప ఆ గుంతను పరీక్షించగా నీరు ఉండిన భూమిలో అధిక జలం ఉండును. బురదగా ఉండిన స్వల్పజలం ఉండును. నేల నెర్రలు బారి యుండిన అసలు అక్కడ జలం ఉండదు.


 * నేరెడు చెట్టుకి తూర్పు భాగమునందు పుట్ట యున్న యెడల దానికి దక్షిణము నందు ఇద్దరు పురుషుల లోతున మధురమైన నీరు , పురుషార్ధ ప్రమాణం నందొక మత్స్యమును , బూడిద వర్ణం గల రాళ్లు ను కృష్ణ వర్ణం గల రాళ్లను , కృష్ణ వర్ణం గల మృత్తిక యును దాని కింద సంపూర్ణ జలం ఉండును.


 * మేడి చెట్టు యున్న యెడల దానికి పశ్చిమం నందు మూడు మూరలలో 35 మట్టు ప్రమాణం నందు తెల్లని పాము ను , నల్లని శిలయు ను దాని క్రింద తూర్పు నుండి ప్రవహించే మధురజల నాడి యుండును.


 * ప్రబ్బలి చెట్టు ఉండినట్లైతే దానికి పడమట దిశ యందు మూడు మూరల దూరంలో అర్ధ మట్టులో శ్వేత మండూకము ను , పచ్చని మృత్తిక యును, దాని క్రింద పగలగొట్టడానికి వీలైన శిలయు ఉండును. దాని క్రింద సమృద్దిగా జలం ఉండును.


 * మద్ది చెట్టు ఉండినట్లైతే దాని క్రింద పుట్ట ఉండిన యెడల మద్ది చెట్టుకి పడమర దిశ యందు మూడు మూరల దూరం నందు 35 మట్టు ప్రమాణం నందు బూడిద రంగు గల మృత్తికయును, దాని క్రింద కృష్ణ వర్ణం గల మృత్తిక యు , తెలుపు, పసుపు రంగుల గల ఇసుకయు, దాని క్రింద నిర్మల జలము దొరుకును.


 * ముత్త పులగపు చెట్టును, రేని చెట్టు నుండి దానికి పడమట దిశ యందు 31 మట్టు లోతున జలం ఉండును. పురుష ప్రమాణం నందు విషము లేని రెండుతలల పాము ఉండును.


 * వావిలి చెట్టుకి పుట్ట చుట్టుకొని యుండిన దానికి దక్షిణము నందు మూడు మూరల దూరం యందు 21 మట్టున మంచి జలం ఉండును. అలాగే అర్ద పురుష ప్రమాణం నందు ఎర్రని చేపయు, దాని క్రింద కపిల వర్ణం గల మృత్తిక యు, దాని కింద తెల్లని వర్ణం గల మృత్తిక యు, దాని క్రింద ఇసుకయు, దాని క్రింద సున్నపురాయి, దాని క్రింద జలం యుండును.


 * మేడి చెట్టు, మారేడు చెట్టు కూడి యుండిన దానికి దక్షిణ దిశ యందు మూడు మూరల దూరం నందు మూడు నిలువుల లోతున మంచి జలం ను , 15 నిలువు లోతున కప్ప యుండును.


 * బ్రహ్మ దండి చెట్టు ఉండిన దానికి తూర్పు దిశ యందు మూడు మూరల దూరమున 3 మట్ల ప్రమాణం న దక్షిణము నుండి ప్రవహించే డి ఉదక ధారయు , దాని క్రింద నల్లని రంగు గల మన్నును , బూడిద రంగు గల మృత్తిక యు , మేక వాసన గల చేపయు , దాని క్రింద అమృత తుల్యమైన ఉదకం ఉండును.


 * జల రహిత ప్రదేశం నందు జిల్లెడు చెట్టు ఉండిన దానికి వాయువ్య దిశ యందు రెండు మూరల దూరము నందు మూడు నిలువుల లోతున జలనాడి యుండును.


 * కానుగ చెట్టు ఉండిన దానికి దక్షిణపు దిక్కు నందు అర్ద మట్టు లోతున తాబేలు , దానికింద తూర్పు నుండి ప్రవహించే డి జలదారయు , దాని క్రింద ఉత్తరము నుండి ప్రవహించె డి జలదారయు , దాని క్రింద పచ్చని పాషానమును , దాని క్రింద సంపూర్ణ జలం ఉండును.


 * నిర్జల ప్రదేశం నందు ఏ వృక్షము క్రింద నైనను , కప్ప యుండిన దానికి మూరెడు దూరము నందు 4 నుండి 5 మట్టు లోతున జలము ఉండును. అందొక నిలువులోతున ముంగీసయు , నల్లని రంగు గల మన్ను ను , ఆకుపచ్చ రంగు మన్నును , శ్వేత వర్ణం గల మన్నును , కప్ప వన్నె గల శిలయు, దాని క్రింద సమృద్దిగా ఉదకం ఉండును.


 * ఇప్పచెట్టు ఉండిన దానికి ఉత్తరముగా పుట్ట యుండిన దానికి ఉత్తరము నందు అయిదు మూరల దూరం నందు నాలుగు మట్టుల లోతున తూర్పు నుండి ప్రవహించె డి జలధార యుండును.


 * మారేడు చెట్టు, కానుగ చెట్టు, జీడి చెట్టు, మద్ది చెట్టు, చిట్టాముదపు చెట్టు వీటి యందు ఏ చెట్టు కైనా పుట్ట చుట్టుకొని యుండిన దానికి ఉత్తరమున 3 మూరల దూరము నందు నాలుగున్నర నిలువు లోతున సమృద్ధిగల జలం ఉండును.


 * తాటి చెట్టు నకు గాని , టెంకాయ చెట్టునకు గాని పుట్ట ఆవరించి ఉండిన దానికి పశ్చిమం దిశ యందు ఆరు మూరల దూరమున నాలుగు మట్ల లోతున దక్షిణము నుంచి వచ్చెడి జలధార యుండును. మరియు కొబ్బరి చెట్టుకి దక్షిణమున పుట్ట యుండిన దానికి 7 మూరల దూరమున 5 మట్టుల లోతున సమృద్ధ జలము కలిగి ఉండును.


 * నీరు లేని నిర్జల ప్రదేశము నందు నడుచుచున్నప్పుడు గంబీరమైన శబ్దం పుట్టిన యెడల నచట 3 లెక 4 పురుష ప్రమాణమున ఉత్తరము నుండి ప్రవహించె డి జలనాడి యుండును.


 * యే వృక్షము నైనను వాటి వాటి స్వభావం మారి , చిగుళ్లు , పువ్వులు , కాయలు మొదలగు వాటి భ వర్ణములు భేదముగా ఉండిన యెడల దానికి తూర్పున మూడు మూరల దూరమున 4 మట్టులలో జలం ఉండును.


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అశ్వగంధ చూర్ణం

 అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు - 


 * చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .


 * దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో "samniferin " అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.


 * ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును 


 * జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును. 


 * పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును . 


 * విరేచనం సాఫీగా అయ్యేలా చేయును . 


 * విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.


 * రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి 


 * వీర్యదోషాలకు కూడా మంచి మందుగా పనిచేయును . 


 * శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును . 


 * శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును . 


 * వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి. 


 * థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .


 * మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు . 


 * తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .


 * గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .


 * స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.


 * చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును . 


 * క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు . 


         పైన చెప్పినటువంటి యోగాలు మాత్రమే కాక మరెన్నో రోగములకు ఈ అశ్వగంధ చూర్ణం అత్యద్భుతంగా పనిచేయును. బయట షాపుల్లో దొరికే అశ్వగంధ చూర్ణం శుద్ధిచేయబడి ఉండదు. శుద్ధిచేయబడని చూర్ణం వాడటం వలన ఫలితాలు అంత తొందరగా రావు. ఫలితాలు త్వరగా రావలెను అనిన శుద్ధి చేయబడిన అశ్వగంధ చూర్ణాన్ని వాడవలెను. 


                మేలైన అశ్వగంధ గడ్డలను తీసుకొని వచ్చి శుభ్రముగా కడిగి బాగుగా ఎండించి స్వచ్ఛమైన దేశివాళి ఆవుపాలయందు ఉడికించి బాగుగా ఎండించవలెను. మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా 11 సార్లు ఉడికించి ఎండించి ఆ తరువాత మెత్తటి చూర్ణం చేయవలెను . 


          పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసినటువంటి అశ్వగంధ చూర్ణం సంపూర్ణమైన ఫలితాలు అతి త్వరగా ఇచ్చును.  


       అవసరం ఉన్నవారికి మాత్రం చేసి ఇవ్వబడును. మీకు ఈ చూర్ణం కావలెను అనినచో నన్ను సంప్రదించగలరు. నా నెంబర్ 9885030034 కి ఫోన్ చేయగలరు. 


   

  గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ధనుర్మాసం

 *_ధనుర్మాస పూజా విధానము_*

_*ధనుర్మాస వ్రతం*_

_*గోదా దేవి అష్టోత్తర శతనామావళి*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం .

భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది *"ధనుర్మాసము"* . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు .

ధనుర్మాసం అంటే

ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట .

ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు .

ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .

ధనుర్మాసం అరంబాన్నే పల్లెటూర్లలొ "సంక్రాంతి "నెల పట్టడము అంటారు .ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ,జంగమ దేవర లతో ,గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ ,సందడిగా వుంటుంది . ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గుల తో కనుల విందు గా వుంటాయి .ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు "సంక్రాంతి "పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి .

ధనుర్మాస వ్రతం ఎందుకు ఆచరించాలి ? "మనకు లభించిన శరీరం కర్మ వల్ల ఏర్పడ్డది. ఈ శరీరానికి సాత్విక ప్రవృత్తి చాల తక్కువ. సాత్వికం వల్లే మనం బాగుపడే అవకాశం ఉంది. ఏమైనా సాధించాలి అంటే ఇపుడున్న ఈ శరీరంతోనే సాధించాలి. మన చేతిలోని చూపుడు వేళు జీవుడిని సూచిస్తే, ప్రక్కన ఉన్న మూడు వేళ్ళు ప్రకృతి అంటే మన శరీరం యొక్క స్వభావాలైన తమస్సు, రజస్సు మరియూ సాత్వికాన్ని సూచిస్తాయి. చిటికెన వేళు సాత్వికాన్ని తెలిపేది, చిన్నది. బ్రొటనవేళు పరమాత్మను సూచిస్తే, చూపుడు వేళును బ్రొటనవేళు వైపు వంచడమే జ్ఞాన ముద్ర. దాని ఆచరణనే ధనుర్మాస వ్రతం,అంటే మనల్ని పరమాత్మ వైపు నడిపించుకోవడమే దాని తాత్పర్యం. ధనుర్మాసం సాత్వికమైన కాలం సాత్విక ప్రవృత్తి పెంచుకోవడానికి సరియైన సమయం, అట్లాంటి కాలాన్ని మనం తప్పక వినియోగించుకోవాలి" - శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు

01 వ రోజు 16 డిసెంబర్

02 వ రోజు 17 డిసెంబర్

03 వ రోజు 18 డిసెంబర్

04 వ రోజు 19 డిసెంబర్

05 వ రోజు 20 డిసెంబర్

06 వ రోజు 21 డిసెంబర్

07 వ రోజు 22 డిసెంబర్

08 వ రోజు 23 డిసెంబర్

09 వ రోజు 24 డిసెంబర్

10 వ రోజు 25 డిసెంబర్

11 వ రోజు 26 డిసెంబర్

12 వ రోజు 27 డిసెంబర్

13 వ రోజు 28 డిసెంబర్

14 వ రోజు 29 డిసెంబర్

15 వ రోజు 30 డిసెంబర్

16 వ రోజు 31 డిసెంబర్

17 వ రోజు 01 జనవరి

18 వ రోజు 02 జనవరి

19 వ రోజు 03 జనవరి

20 వ రోజు 04 జనవరి

21 వ రోజు 05 జనవరి

22 వ రోజు06 జనవరి

23 వ రోజు 07 జనవరి

24 వ రోజు 08 జనవరి

25 వ రోజు 09 జనవరి

26 వ రోజు 10 జనవరి

27 వ రోజు 11 జనవరి

28 వ రోజు12 జనవరి

29 వ రోజు 13 జనవరి

30 వ రోజు 14 జనవరి


ధనుర్మాస వ్రత సంకల్పం

పెద్దలు ఆండాళ్ తల్లి గురించి చెప్పుతూ తమిలంలో ఈ పాటను పాడిరి.

అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్ఱ్కు

ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం ఇన్నిశైయాల్

పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై

శూడి కొడుత్తాళై చ్చోల్లు

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై

పాడియరుళవల్ల పల్-వళై యాయ్ నాడినీ

వేంగడవఱ్ఱ్కెన్నె విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం

నాంగడవా వణ్ణమే నల్గు

"అన్నవయల్ పుదువై ఆండాళ్" గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ స్థలంతో కలిపి గుర్తించాలని, ఎందుకంటే జల సమృద్దిగా ఉండే ఆ క్షేత్రాన్ని ఆనుకొని పచ్చని పంటపోలాలు ఉండేవి. ఆ నీటికై హంసలు, కొంగలు అక్కడికి చేరేవి, చూడటానికి రెండూ తెల్లగా ఉన్నా వేరే వేరేలక్షణాలు కల్గి ఉంటాయి. ఏది సారమో ఏది అసారమో తెలుసుకొని సారాన్నే గ్రహించి బ్రతికేది హంస. తనకు లభించేంతవరకు దక్షతతో దీక్షగా ఉండి లభించగానే ఉపవాసం మానేది కొంగ. కాబట్టి మనం హంసనే ఆశ్రయించాలి. గోదాదేవి గొప్ప హంస, అందమైన నడక కల్గినది. ఈ లోకంలో ఏది సారతగుమో దాన్ని మాత్రమే గ్రహించి, అనుభవించి, చక్కని నడక కల్గిన మహనీయులను పరమ హంసలు అని అంటారు. అలాంటి పరమ హంసలు వచ్చేవారు శ్రీవెల్లిపుత్తూరికి గోదావద్ద నడక నెర్చుకోవటానికి. తిరుప్పావై లో ఏది వేదములు, ఉపనిషత్తులు తగునని చెప్పెనో అవన్ని చూపించినది మన తల్లి గోదా. రామానుజాచార్యులవంటి వారుకూడా ఆదర్షంగా తీసుకోవటంచే యతిరాజసహోదరి అయ్యింది గోదా. జ్ఞానులైన మహానుభావులకే నేర్పే యోగ్యురాలు మన అమ్మ గోదా.

ఏమి చెసింది ఆమే, "అరంగఱ్ఱ్కు ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం" శ్రీరంగనాథున్ని ప్రేమించి 30 క్రమమైన పాటల్ని తిరుప్పావైగా పాడింది. మేడపైకి ఎక్కడానికి ఒకటి తర్వాత ఒకటి అమరి ఉండే మెట్లమాదిరిగా, మానవుడు ఈలోకంలో జ్ఞానం ఉంది అనుకున్నప్పటి నుండి, జ్ఞానసారమైన పరతత్వాన్ని చేరేంతవరకు అచరించతగిన లౌకిక అలౌకిక యిహలౌకిక పారలౌకిక పారమార్తమైన అన్ని రకాల అనుభవాలకి అనువైనట్టుగా 30 పాటలను మెట్లుగా తాను పాడి వినిపించినది.

"ఇన్నిశైయాల్ పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై శూడి కొడుత్తాళై చ్చోల్లు" పాటలమాలలను పాడింది, పూలమాలను ధరించి స్వామికి అర్పించినది. ఈ రెండూ ఎంగిలివేగా!! దొషం కాదా!! అంటే ఎలాగైతే తేనెటీగలు ఎంగిలి చేసినా తేనె వినియోగతగమవునో, చిలక ఎంగిలి చేసిన పండు తిన తగునో, అలాగే భగవంతునికోసమై చేస్తే ఎదీ ఎంగిలికాదు.

"శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై పాడియరుళవల్ల పల్-వళై యాయ్" శుడర్ క్కొడి అనగా బంగారు లత. ఎలాగైతే బంగారం మనం కల్గి ఉంటే మన విలువ పెరుగుతుందో, గోదా తల్లి మన దగ్గర ఉంటే మన విలువ పెరుగుతుంది. ఎలాగైతే లత పట్టుకొమ్మని ప్రాకి పుష్పాలను విరజిమ్మునో, ఈ గోదా రంగనాథున్ని ఆధారంగా చేసుకొని ప్రాకి జ్ఞానం అనే పుష్పాలతో మనల్ని తరించింది. మనం కూడా ఆ తల్లి పాడిన పాటలను పాడుదాం.

ఏమి చెసింది ఆ వ్రతంలో గోదా, "నాడినీ వేంగడవఱ్ఱ్కెన్నె విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం నాంగడవా వణ్ణమే నల్గు" ఒకటి రెండు .. పదులు .. వందలు గా పాయసాన్ని అర్పిస్తానని చేస్తూ తనను తానే భగవంతునికి అర్పించింది. జీవుడు భగవంతున్ని చేరాలనే కోరిక సహజమే కదా. మాకుకూడా ఆ కొరిక కల్గేట్టు, మమ్మల్ని తీర్చిదిద్దు. భగవంతున్ని సేవించటానికి శక్తిని భక్తిని మనకు కూడా గోదా అందించుగాక.


_*🕉శ్రీగోదా పూజా విధానము🕉*_


నిత్య ఆరాధనలో లక్ష్మీ అష్టోత్తరం తరువాత శ్రీకృష్ణఅష్టోత్తర శతనామావళి, శ్రీగోదా అష్టోత్తర శతనామావళి చేర్చి పూజ చేయండి.


*శ్రీగోదా అష్టోత్తర శతనామావళి*


01 ఓం శ్రీరంగనాయక్యై నమః

02 ఓం గోదాయై నమః

03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః

04 ఓం సత్యై నమః

05 ఓం గోపీవేషధరాయై నమః

06 ఓం దేవ్యై నమః

07 ఓం భూసుతాయై నమః

08 ఓం భోగశాలిన్యై నమః

09 ఓం తులసీకాననోద్భుతాయై నమః

10 ఓం శ్రీయై నమః

11 ఓం ధన్విపురవాసిన్యై నమః

12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః

13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః

14 ఓం అమూక్త మాల్యదాయై నమః

15 ఓం బాలాయై నమః

16 ఓం రంగనాథ ప్రియాయై నమః

17 ఓం పరాయై నమః

18 ఓం విశ్వంభరాయై నమః

19 ఓం కలాలాపాయై నమః

20 ఓం యతిరాజసహోదర్యై నమః

21 ఓం కృష్ణానురక్తాయై నమః

22 ఓం సుభగాయై నమః

23 ఓం సులభశ్రియై నమః

24 ఓం సలక్షణాయై నమః

25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః

26 ఓం శ్యామాయై నమః

27 ఓం దయాంచిత దృగంచలాయై నమః

28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః

29 ఓం రమ్యాయై నమః

30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః

31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః

32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః

33 ఓం నారాయణసమాశ్రితాయై మనః

34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః

35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః

36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః

37 ఓం బ్రహ్మణ్యాయై మనః

38 ఓం లోకజనన్యై మనః

39 ఓం లీలామానుషరూపిణ్యై మనః

40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః

41 ఓం అనుగ్రహాయై నమః

42 ఓం మాయాయై నమః

43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః

44 ఓం మహాపతివ్రతాయై నమః

45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః

46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః

47 ఓం నిత్యాయై నమః

48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః

49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః

50 ఓం మంజుభాషిణ్యై నమః

51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః

52 ఓం రంగమంగళ దీపికాయై నమః

53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః

54 ఓం తారకాకారనఖరాయై నమః

55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః 

56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః

57 ఓం శోభనపార్షికాయై నమః

58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః

59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః

60 ఓం పరమాయై నమః

61 ఓం అణుకాయై నమః

62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః

63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః

64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః

65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః

66 ఓం విశాలజఘనాయై నమః 

67 ఓం పీనసుశ్రోణ్యై నమః

68 ఓం మణిమేఖలాయై నమః

69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః

70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః

71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః

72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః

73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః

74 ఓం కల్పమాలానిభభుజాయై నమః

75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః

76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః

77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై నమః

78 ఓం కంబుకంఠ్యై నమః

79 ఓం సుచుబుకాయై నమః

80 ఓం బింబోష్ఠ్యై నమః

81 ఓం కుందదంతయుజే నమః

82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః

83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః

84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః

85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః

86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః

87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః

88 ఓం సుగంధ వదనాయై నమః

89 ఓం సుభ్రువే నమః

90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః

91 ఓం పూర్ణచంద్రాననాయై నమః

92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః

93 ఓం సౌందర్యసీమాయై నమః

94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః

95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః

96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః

97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః

98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః

99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః

100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః

101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః

102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః

103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః

104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః

105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః

106 ఓం శ్రీరంగనిలయాయై నమః

107 ఓం పూజ్యాయై నమః

108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః

ఓం శ్రీరంగనాయక్యై నమః

ఓం శ్రీమహాలక్శ్మై నమః

ఓం శ్రీభూదేవ్యై నమః

ఓం శ్రీనీళాదేవ్యై నమః

ఓం శ్రీగోదాదేవ్యై నమః

ఓం శ్రీఅనంతాయ నమః

ఓం శ్రీగరుడాయ నమః

ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః

ఓం శ్రీపరాంకుశాయ నమః

ఓం శ్రీమతే రామానుజాయ నమః

ఓం శ్రీమద్వరవరమునయే నమః

ఓం స్వాచార్యేభ్యో నమః

ఓం పూర్వాచార్యేభ్యో నమః

ఓం సమస్తపరివార సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ


_*🕉ధనుర్మాస పూజా విధానము🕉*_


గోదాయై నమః శ్రీమతే రామానుజాయ నమః

స్నానానంతరం పరిశుద్ధ వస్త్రములు ధరించి ఊర్ధ్వపుండ్రాన్ని పెట్టుకొని గురుపరంపరను అనుసంధించుకొని, పెరుమాళ్ళ సన్నిధి చేరి సాష్టాంగ నమస్కారం చేసి క్రింది శ్లోకములను అనుసంధించాలి.

అమర్యాదః క్షుద్రశ్చలమతిరసూయా ప్రసవభూః

కృతఘ్నో దుర్మానీ స్మర పరవశో వంచన పరః |

నృశంసః పాపిష్ఠః కథ మహమితో దుఃఖజలధేః

అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః ||

నమో నమో వాఙ్మనసాతి భూమయే

నమో నమో వాఙ్మనసైక భూమయే |

నమో నమోనంత మహావిభూతయే

నమో నమోనంత దయైక సింధవే ||

న ధర్మ నిష్ఠోస్మి నచాత్మవేదీ

న భక్తి మాన్ త్వహ్చరణారవిందే |

అంకిచనో నన్యగతిశ్శరణ్యః

త్వ త్పాద మూలం శరణం ప్రపద్యే ||

కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే |

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |

ఉత్తిష్ఠ కమలా కాన్త త్రైలోక్యం మంగళం కురు ||

తతోఖిల జగత్పద్మ భోధాయాచ్యుత భానునా |

దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా ||

ఇతి కర తాళత్రయేన భగవంతం ప్రభోధ్య, కవాటం విముచ్య

(3 సార్లు చప్పట్లు చరిచి, ద్వారములు తీసి పెరుమాళ్ళను మేల్కొలపాలి)

నిర్మాల్యము తొలగించి, మనసులో చేయదలచిన ఆరాధనను ఒకసారి పరిపూర్ణముగా భావించి, పంచపాత్రలలో పరిమళ తీర్థమును నింపి, తులసీదలము వేసి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించవలెను.

ముందుగా మనసులో ఆచార్యారాధన చేసుకొని 

స్వాచార్య శ్రీహస్తేన ఆరాధనాభిముఖో భవేయం ( అని పెరుమాళ్ళతో విన్నవించి)

స్వ శేష భూతేన మయా స్వీయైః సర్వ పరిచ్ఛదైః |

విధాతుం ప్రీత మాత్మానం దేవః ప్రక్రమతే స్వయం ||

భగవన్! పుండరీకాక్ష! హృద్యాగంతు మయాకృతం |

ఆత్మ సాత్కురు దేవేశ! బాహ్యే త్వాం సమ్యగర్భయే ||

(అని ప్రార్థించి పాదముల చెంత తులసిని అర్పించాలి)

_*1. ధ్యానము*_

కూర్మాదీన్ దివ్యలోకాన్, తదను మణిమయం

మంటపం తత్రశేషం |

తస్మిన్ ధర్మాది పీఠం, తదుపరి కమలం

చామర గ్రాహిణీశ్చ |

విష్ణుం దేవీర్విభూషాయుధగణ, మురగం

పాదుకే వైన తేయం

సేనేశం ద్వార పాలాన్ కుముదముఖ గణాన్

విష్ణు భక్తాన్ ప్రపద్యే

సవ్యం పాదం ప్రసార్య, ఆశ్రిత దురిత హరం

దక్షిణం కుంచయిత్వా

జానున్యాధాయ సవ్యేతర మితరభుజం

నాగ భోగే నిధాయ |

పశ్చాద్భాహుద్వయేన ప్రతిభట శమనే

ధారయన్ శంఖ చక్రే |

దేవీ భూషాది జుష్టో జనయతు

జగతాం శర్మ వైకుంఠ నాథః

(శ్రీ గోదాదేవి రంగనాథులను ఎదురుగా యుంచి మనస్సులో కూడా వారిని నిలుపుకొంటూ)

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

శ్రీ-భూ-నీళా-గోదాది దేవిభ్యో నమః

అనంత గరుడ విష్వక్సేనాది నిత్య సూరి గణేభ్యో నమః

శ్రీపరాంకుశ పరకాల యతివర వరవర మున్యాది ఆళ్వారాచార్యేభ్యో నమః

ఓం సర్వాన్ ధ్యాయామి

2. స్వాగతం (నమస్కారం చేస్తూ స్వాగతం చెప్పండి)

ఆవాహయామి (స్వాగత ముద్ర చూపాలి)

3.సింహాసనం ( మన ఆరాధన అందుకోవడానికి మూర్తి ఉన్న స్థానంలో కూర్చోమని చెప్పండి)

రత్న సింహాసనం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)

_*4. అర్ఘ్యం*_

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

(అర్ఘ్య పాత్ర నుండి పెరుమాళ్ళ చేతికి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

_*5. పాద్యం*_

పాదయోః పాద్యం సమర్పయామి (పాదాలకు రెండు సార్లు నీటిని అందించాలి)

(పాద్య పాత్ర నుండి పెరుమాళ్ళ పాదాలకి ఒక సారి నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

_*6. ఆచమనీయం*_

ముఖే ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించాలి)

(ఆచమాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

దంత కాష్ఠ జిహ్వా నిర్లేఖన గండూషణ

ముఖ ప్రక్షాళన తాంబూల తైలాభ్యంజన

అంగోద్వర్తన ఆమలకతోయ హరిద్రాలేపన

స్నాన కూర్చ ప్రసారణాని సమర్పయామి

_*7. పవిత్ర స్నానం*_

స్నానం సమర్పయామి 

(స్నాన పాత్ర నుండి పెరుమాళ్ళకు మూడు సార్లు నీటిని అందించి తీర్థ పాత్రలో వేయాలి)

స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి 

ప్లోత వస్త్రం సమర్పయామి ( పూల రెక్కతో తడి ఆరునట్లు అద్దాలి)

_*8. వస్త్ర యుగ్మం*_

వస్త్ర యుగ్మం సమర్పయామి (నూతన పట్టు వస్త్రాలు/ పుష్పాన్ని సమర్పించండి)

_*9. ఊర్ధ్వ పుణ్డ్రం*_

ఊర్ధ్వ పుణ్డ్రాన్ సమర్పయామి ( తిరునామము/శ్రీచూర్ణం సమర్పించండి)

_*10. యజ్ఞోపవీతం*_

యజ్ఞోపవీతం సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)

_*11. చందనం*_

దివ్య శ్రీ చందనం సమర్పయామి (చందనం సమర్పించండి)

_*12. ఆభరణములతో అలంకారం*_

సర్వాభరణాలంకారాన్ సమర్పయామి (పుష్పాన్ని సమర్పించండి)

(ఈ విధముగనే పరివారమునకందరకూ అలంకరణ పర్యంతము చేసి)

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

*_13. నామావళి_*

ఓం శ్రీరంగనాయక్యై నమః

తులసీ దళైః పుష్పైశ్చ పూజయామి

(తులసీ దళములు, పుష్పములతో కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ హృదయమునకు పుష్పాన్ని చూపిస్తూ దానియంది మన ప్రేమని నింపి అర్చన చేయాలి)


01 ఓం కేశవాయ నమః

02 ఓం నారాయణాయ నమః

03 ఓం మాధవాయ నమః

04 ఓం గోవిందాయ నమః

05 ఓం విష్ణవే నమః

06 ఓం మధుసూదనాయ నమః

07 ఓం త్రివిక్రమాయ నమః

08 ఓం వామనాయ నమః

09 ఓం శ్రీధరాయ నమః

10 ఓం హృషీకేశాయ నమః

11 ఓం పద్మనాభాయ నమః

12 ఓం దామోదరాయ నమః

13 ఓం సంకర్షణాయ నమః

14 ఓం వాసుదేవాయ నమః

15 ఓం ప్రద్యుమ్నాయ నమః

16 ఓం అనిరుద్ధాయ నమః

17 ఓం పురుషోత్తమాయ నమః

18 ఓం అధోక్షజాయ నమః

19 ఓం నారసింహాయ నమః

20 ఓం అచ్యుతాయ నమః

21 ఓం జనార్దనాయ నమః

22 ఓం ఉపేంద్రాయ నమః

23 ఓం హరయే నమః

24 ఓం శ్రీకృష్ణాయ నమః


*_🕉శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి🕉_*


01 ఓం శ్రీకృష్ణాయ నమః

02 ఓం కమలానాథాయ నమః

03 ఓం వాసుదేవాయ నమః

04 ఓం సనాతనాయ నమః

05 ఓం వసుదేవాత్మజాయ నమః

06 ఓం పుణ్యాయ నమః

07 ఓం లీలామానుషవిగ్రహాయ నమః

08 ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

09 ఓం యశోదావత్సలాయ నమః

10 ఓం హరయే నమః

11 ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశార్ ఙ్గద్యాయుధాయ నమః

12 ఓం దేవకీనందనాయ నమః

13 ఓం శ్రీశాయ నమః

14 ఓం నందగోపప్రియాత్మజాయ నమః

15 ఓం యమునావేగ సంహారిణే నమః

16 ఓం బలభద్రప్రియానుజాయ నమః

17 ఓం పూతనాజీవిత హరాయ నమః

18 ఓం శకటాసురభంజనాయ నమః

19 ఓం నందవ్రజ జనానందినే నమః

10 ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః

21 ఓం నవనీత విలిప్తాంగాయ నమః

22 ఓం నవనీతనటాయ నమః

23 ఓం అనఘాయ నమః

24 ఓం నవనీతనవాహారాయ నమః

25 ఓం ముచికుందప్రసాదకాయ నమః

26 ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః

27 ఓం త్రిభంగినే నమః

28 ఓం మధురాకృతయే నమః

29 ఓం శుకవాగమృతాబ్దీందవే నమః

30 ఓం గోవిందాయ నమః

31 ఓం యోగినాంపతయే నమః

32 ఓం వత్సవాటచరాయ నమః

33 ఓం అనంతాయ నమః

34 ఓం ధేనుకాసురభంజనాయ నమః

35 ఓం తృణీకృతతృణావర్తాయ నమః

36 ఓం యమళార్జునభంజనాయ నమః

37 ఓం ఉత్తాలతాలభేత్రే నమః

38 ఓం తమాలశ్యామలాకృతయే నమః

39 ఓం గోపగోపీశ్వరాయ నమః

40 ఓం యోగినే నమః

41 ఓం కోటీసూర్యసమప్రభాయ నమః

42 ఓం ఇలాపతయే నమః

43 ఓం పరంజ్యోతిషే నమః

44 ఓం యాదవేంద్రాయ నమః

45 ఓం యదూద్వహాయ నమః

46 ఓం వనమాలినే నమః

47 ఓం పీతవాససే నమః

48 ఓం పారిజాతాపహారకాయ నమః

49 ఓం గోవర్దనాచలోద్ధర్త్రే నమః

50 ఓం గోపాలాయ నమః

51 ఓం సర్వపాలకాయ నమః

52 ఓం అజాయ నమః

53 ఓం నిరంజనాయ నమః

54 ఓం కామజనకాయ నమః

55 ఓం కంజలోచనాయ నమః

56 ఓం మధుఘ్నే నమః

57 ఓం మధురానాధాయ నమః

58 ఓం ద్వారకానాయకాయ నమః

59 ఓం బలినే నమః

60 ఓం బృదావనాంత సంచారిణే నమః

61 ఓం తులసీదామభూషణాయ నమః

62 ఓం శమంతకమణేర్హర్త్రే నమః

63 ఓం నరనారాయణాత్మకాయ నమః

64 ఓం కుబ్జాకృష్టాంబరధరాయ నమః

65 ఓం మాయినే నమః

66 ఓం పురమపురుషాయ నమః

67 ఓం ముష్టికాసుర చాణుర మల్ల యుద్ధ విశారదాయ నమః

68 ఓం సంసారవైరిణే నమః

69 ఓం కంసారయే నమః

70 ఓం మురారయే నమః

71 ఓం నరకాంతకాయ నమః

72 ఓం అనాదిబ్రహ్మచారిణే నమః

73 ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః

74 ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః

75 ఓం దుర్యోధన కులాంతకాయ నమః

76 ఓం విదురాక్రూరవరదాయ నమః

77 ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః

78 ఓం సత్యవాచే నమః

79 ఓం సత్యసంకల్పాయ నమః

80 ఓం సత్యభామారతాయ నమః

81 ఓం జయినే నమః

82 ఓం సుభద్రాపూర్వజాయ నమః

83 ఓం విష్ణవే నమః

84 ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః

85 ఓం జగద్గురవే నమః

86 ఓం జగన్నాథాయ నమః

87 ఓం వేణూనాదవిశారదాయ నమః

88 ఓం వృషభాసుర విధ్వంసినే నమః

89 ఓం బాణాసుర కరాంతకాయ నమః

90 ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః

91 ఓం బల్హి బర్హావ తంసకాయ నమః

92 ఓం పార్థసారథయే నమః

93 ఓం అవ్యక్తాయ నమః

94 ఓం గీతామృతమహోదధయే నమః

95 ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః

96 ఓం దామోదరాయ నమః

97 ఓం యజ్ఞభోక్త్రే నమః

98 ఓం దానవేంద్రవినాశకాయ నమః

99 ఓం నారాయణాయ నమః

100 ఓం పరస్మై బ్రహ్మణే నమః

101 ఓం పన్నగాశనవాహనాయ నమః

102 ఓం జలక్రీడాసమా సక్తగోపీ వస్త్రాపహారకాయ నమః

103 ఓం పుణ్యశ్లోకాయ నమః

104 ఓం తీర్థపాదాయ నమః

105 ఓం వేదవేద్యాయ నమః

106 ఓం దయానిధయే నమః

107 ఓం సర్వతీర్ధాత్మకాయ నమః

108 ఓం సర్వ గ్రహరూపిణే నమః

109 ఓం పరాత్పరాయ నమః


_*🕉శ్రీగోదా అష్టోత్తర శతనామావళి🕉*_


01 ఓం శ్రీరంగనాయక్యై నమః

02 ఓం గోదాయై నమః

03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః

04 ఓం సత్యై నమః

05 ఓం గోపీవేషధరాయై నమః

06 ఓం దేవ్యై నమః

07 ఓం భూసుతాయై నమః

08 ఓం భోగశాలిన్యై నమః

09 ఓం తులసీకాననోద్భుతాయై నమః

10 ఓం శ్రీయై నమః

11 ఓం ధన్విపురవాసిన్యై నమః

12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః

13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః

14 ఓం అమూక్త మాల్యదాయై నమః

15 ఓం బాలాయై నమః

16 ఓం రంగనాథ ప్రియాయై నమః

17 ఓం పరాయై నమః

18 ఓం విశ్వంభరాయై నమః

19 ఓం కలాలాపాయై నమః

20 ఓం యతిరాజసహోదర్యై నమః

21 ఓం కృష్ణానురక్తాయై నమః

22 ఓం సుభగాయై నమః

23 ఓం సులభశ్రియై నమః

24 ఓం సలక్షణాయై నమః

25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః

26 ఓం శ్యామాయై నమః

27 ఓం దయాంచిత దృగంచలాయై నమః

28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః

29 ఓం రమ్యాయై నమః

30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః

31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః

32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః

33 ఓం నారాయణసమాశ్రితాయై మనః

34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః

35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః

36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః

37 ఓం బ్రహ్మణ్యాయై మనః

38 ఓం లోకజనన్యై మనః

39 ఓం లీలామానుషరూపిణ్యై మనః

40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః

41 ఓం అనుగ్రహాయై నమః

42 ఓం మాయాయై నమః

43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః

44 ఓం మహాపతివ్రతాయై నమః

45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః

46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః

47 ఓం నిత్యాయై నమః

48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః

49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః

50 ఓం మంజుభాషిణ్యై నమః

51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః

52 ఓం రంగమంగళ దీపికాయై నమః

53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః

54 ఓం తారకాకారనఖరాయై నమః

55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః 

56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః

57 ఓం శోభనపార్షికాయై నమః

58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః

59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః

60 ఓం పరమాయై నమః

61 ఓం అణుకాయై నమః

62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః

63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః

64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః

65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః

66 ఓం విశాలజఘనాయై నమః 

67 ఓం పీనసుశ్రోణ్యై నమః

68 ఓం మణిమేఖలాయై నమః

69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః

70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః

71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః

72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః

73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః

74 ఓం కల్పమాలానిభభుజాయై నమః

75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః

76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః

77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై మనః

78 ఓం కంబుకంఠ్యై మనః

79 ఓం సుచుబుకాయై మనః

80 ఓం బింబోష్ఠ్యై మనః

81 ఓం కుందదంతయుజే నమః

82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః

83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః

84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః

85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః

86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః

87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః

88 ఓం సుగంధ వదనాయై నమః

89 ఓం సుభ్రువే నమః

90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః

91 ఓం పూర్ణచంద్రాననాయై నమః

92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః

93 ఓం సౌందర్యసీమాయై నమః

94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః

95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః

96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః

97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః

98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః

99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః

100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః

101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః

102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః

103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః

104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః

105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః

106 ఓం శ్రీరంగనిలయాయై నమః

107 ఓం పూజ్యాయై నమః

108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః

01 ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః

02 ఓం శ్రీ భూదేవ్యై నమః

03 ఓం శ్రీ నీళాదేవ్యై నమః

04 ఓం శ్రీ గోదాదేవ్యై నమః

05 ఓం శ్రీ అనంతాయ నమః

06 ఓం శ్రీ గరుడాయ నమః

07 ఓం శ్రీ విష్వక్సేనాయ నమః

08 ఓం శ్రీ పరాంకుశాయ నమః

09 ఓం శ్రీమతే రామానుజాయ నమః

10 ఓం శ్రీమద్వరవరమునయే నమః

11 ఓం స్వాచార్యేభ్యో నమః

12 ఓం పూర్వాచార్యేభ్యో నమః

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః


*14. ధూప పరిమళం*

ధూపమాఘ్రాపయామి


*15. దీపం*

దీపం సందర్శయామి

ధూప దీప అనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ( నోటికి మూడు సార్లు నీటిని అందించండి)


*16 నైవేద్యం*

నైవేద్యం సమర్పయామి

(పొంగలిని ప్రోక్షించి మృగముద్రతో ఆరగింపు చేయండి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

హస్తౌ ప్రక్షాళయామి

పాదౌ ప్రక్షాళయామి

గండూషణం సమర్పయామి


*17 మంగళాశాసనం*

మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)


*లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే |*

*క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||*

*స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే |*

*విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||*


*18. సేవాకాలం*

గురుపరంపర, తిరుప్పళ్లియొళుచ్చి, తిరుప్పావై 28 వ పాశురం వరకు చదవండి


*19 నైవేద్యం*

అర్ఘ్యం సమర్పయామి

పాద్యం సమర్పయామి 

ఆచమనీయం సమర్పయామి

నైవేద్యం సమర్పయామి

(స్థలమును శుద్ధి చేసి ప్రసాదము, ఫలాదులను అన్నింటినీ యుంచి, ప్రోక్షించి, తులసి యుంచి, సురభి ముద్రను చూపి, మృగముద్రతో ఆరగింపు చేయాలి.)


*పాయసాన్నం గూడాన్నంచ ముగ్దాన్నం శుద్ధమోదనం*

*దధి క్షీరాజ్య సంయుక్తం నానాశాక ఫలాన్వితం ||*

*అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపపాదితాన్*

*పృథుకాన్ గూడసమ్మిశ్రాన్ సజీరక మరీచికాన్ ||*

*అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్నం ఘృత శర్కరం*

*పంచధా షడ్రసోపేతం గృహాణ మధుసూదన ||*


'ఓం ఓం ఓం'

(అనుచు స్వామికి చూపండి)

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

హస్తౌ ప్రక్షాళయామి

పాదౌ ప్రక్షాళయామి

గండూషణం సమర్పయామి

తాంబూలం సమర్పయామి (తమలపాకు వక్కలు అందించండి)

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః


*20 మంగళాశాసనం*

మంగళ నీరాజనం సమర్పయామి ( నిలుచుని హారతి వెలిగించి చూపండి)

తిరుప్పావై 24 వ పాశురమం చదవండి


*శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిథయేర్థినామ్ |*

*శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||*

*లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే |*

*క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||*

*అస్తు శ్రీస్తన కస్తూరీ వాసనా వాసితోరసే |*

*శ్రీహస్తిగిరి నాథాయ దేవరాజాయ మంగళమ్ ||*

*కమలా కుచ కస్తూరీ కర్ద మాంకిత వక్షసే |*

*యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాయ మంగళమ్ ||*

*నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మెనే |*

*సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్ ||*

*స్వోచ్ఛిష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే |*

*విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||*

*శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తటే|*

*శ్రీ తింత్రిణీ మూలధామ్నే శఠకోపాయ మంగళమ్ ||*

*శేషో వా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికైః|*

*వితర్క్యాయ మహాప్రాజ్ఞైః భాష్యకారాయ మంగళమ్ ||*

*తులా మూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే*

*సౌమ్యజామాతృ మునయే శేషాంశాయాస్తు మంగళమ్ ||*

*మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః |*

*సర్వైశ్చ పూర్వై రాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ||*

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః

సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి

సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః


21 చామరోపచారం

చామరోపచారం సమర్పయామి

చామరమును వీచుచు తిరుప్పావై 29, 30 వ పాశురములను ఒక్కొక్కటి రెండు సార్లు అనుసంధించాలి.

ఇచ్చట ఆనాటి పాశురమును హారతినిస్తూ రెండుసార్లు విన్నపం చేయాలి

*కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |*

*పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||*

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం

పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ

స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే

గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు

స్వామి వారి మంగళా శాసనాలు


_*🕉కృష్ణ భక్తులకు ఇష్టం.. ధనుర్మాసం🕉*_


హేమంతంలో వసంతం వచ్చినట్లుగా పడతులందరూ ధనుర్మాసం రాగానే ఆనందిస్తారు. ఉదయానే్న లేచి వాకిళ్లను అందంగా రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ఆవుపేడతో గొబ్బెమ్మలను తీర్చి వాటిని కుంకుమ, పూలతో అర్చిస్తారు. తోటి వారినందరినీ కలుపుకుని అఖిలాండకోటి నాయకుడైన శ్రీకృష్ణ భగవానుని కొలవడానికి సిద్ధమవుతారు. అలనాడు విష్ణుచిత్తుని కూతురైన గోదాదేవి రంగస్వామిని ఎలా స్మరిస్తుండేదో,  అనుక్షణమూ ఆయన మెప్పును పొందాలని ఎలా తహతహలాడేదో అలానే ఇపుడు కృష్ణ్భక్తులు, గోదాదేవి భక్తులు ఈ మాసంకోసం ఎదురుచూస్తారు. ఉదయానే్న లేచి శుచులై తిరుప్పావై గానం చేస్తారు. ఏ గుడిచూసిన ఈ సమయంలో గోదాదేవిని, కృష్ణపరమాత్మను వేడుకొనే జనసందోహం ఆశ్చర్యానందాలకు కలిగిస్తుంటారు.

ఈ ధనుర్మాసంలో తిరుప్పావై- ‘తిరు’’ అంటే శ్రేష్టమైన అనీ- ‘పావై’ అంటే వ్రతమని అర్థం. ప్రాచీన ‘పావై’ అనే తమిళ కవితా పద్ధతికి చెందిన ‘తిరప్పావై’ని రచించినవారు- *‘‘గోదాదేవి’’*. ఈమెనే *‘ఆండాళ్’* అని పిలుస్తుంటారు. *‘‘శ్రీవిల్లిపుత్తూరు’’*అనే గ్రామంలో విష్ణ్భుక్తుడైన- ‘విష్ణుచిత్తుడు’ ప్రతిరోజూ తులసి మాలలు కట్టి రంగడికి సమర్పించి పూజలు చేస్తుండేవాడు. ఆ విష్ణుచిత్తుడు పేరుకు తగ్గట్టుగా స్వామి నామగానంలో తన్మయుడై ఆనందాబ్దిలో మునిగి తేలుతుండేవారట. అందుకే ఆయనను భక్తులందరికన్నా పెద్దవారు అనే అర్థంలో *‘‘పెరియాళ్వార్’’* అనే పేరు స్థిరపరిచారట.

స్వామి కైంకర్యానికై ఆయన స్వయంగా తులసి వనాన్ని పెంచేవారట. ఒకనాడు ఆ వనంలో తులసి కోస్తుండగా ఓ కనులు తెరవని చిన్నారి కనిపించిందట. ఆ పాపకు ‘కోదై’ అనే పేరు పెట్టుకొన్నాడు. ఆమె గోదాదేవి. ఈ గోదా చిన్నప్పటినుంచి తండ్రి మాదిరి విష్ణు భక్తురాలైంది. ఈ గోదాదేవి స్వామి కోసం మాలలు కట్టి తాను ధరించి ఎలా ఉందో చూసుకొని తాను మురిసిపోయ రంగనికి పంపించేదట. ఓ రోజు ఎప్పటిలా మాలానందాన్ని పొందుతున్నప్పుడు ఆ విష్ణుచిత్తుడు చూశాడు. అయ్యో.. ఎంత తప్పు జరిగిపోయందని వాపోయాడు. ఖిన్నుడై వేరుగా మాలలు కట్టి రంగని అర్చనకోసం తీసుకెళ్లాడు. కాని ఆ మాలలు రంగడు స్వీకరించలేదు.

దానితో మరింత కుంగిపోయాడు విష్ణుచిత్తుడు. కాని ఆ రోజు రాత్రి చిత్తాన్ని రంగనికర్పించి నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో కనిపించి ‘‘ఓయా నీ గోదా చేసే పని నాకిష్టమైందే, ఆమె ధరించిన పూలమాలలే నాకు ప్రీతిపాత్రాలు అని చెప్పాడు. ఆమెనిచ్చి నాకు పెండ్లి చేయవయ్యా’’ అరి అడిగాడట. రంగని మనసెరిగిన విష్ణుచిత్తుడు ఆనందంగా గోదాదేవిని రంగనికిచ్చి పెళ్లి చేయంచాడు. రంగడిని తన నాధుడిని చేసుకోవాలని గోదా చేసిన వ్రతమే ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం గురించి స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడు. ధనుర్మాస వ్రత మహత్యం బ్రహ్మాండ, ఆదిత్య, భాగవత పురాణాలతో పాటు- నారాయణ సంహితలోనూ ఉంది.

ధనుర్మాస వ్రతంకోసం విష్ణువు విగ్రహాన్ని ధనుర్మాస ప్రారంభదినంనాడు  పూజామందిరంలో మధుసూదనుడు అనే పేరుతో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికంటే ఐదు ఘడియలముందే, సంధ్యావందనాది అనుష్టానాలను ముగించుకుని తర్వాత ధనుర్మాస వ్రతాన్ని చేయాలి. మధుసూదనుడికి ప్రతిరోజూ ఆవుపాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. తర్వాత తులసీ దళాలు, వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా మొదటి పదిహేను రోజులూ ‘చక్కెర పొంగలి’ లేదా ‘పులగం’ను, తర్వాతి పదిహేను రోజులూ ‘దద్ద్యోజనం’ను సమర్పించాలనేది శాస్తవ్రచనం. ఈ విధంగా చేయడంతోపాటూ బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. కాశీ, రామేశ్వరం, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల్లో వందలకొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన కలిగే ఫలితం ఈ మాసంలో ఒక్క రోజు బ్రాహ్మణుడికి అన్నదానం వల్ల కలుగుతుందని పెద్దలంటారు. ఈ విధంగా మధుసూదనుడితోపాటు ప్రతిరోజూ బృందావనంలో తులసిని పూజించాలి. ఇలా ధనుర్మాసంలో వ్రతాన్ని చేయడం పూర్తయ్యాక మధుసూదనస్వామి విగ్రహాన్ని విప్రుతోత్తమునికి దానం ఇవ్వాలి. ధనుర్మాస వ్రతం నెల రోజులపాటు చేయలేనివారు కనీసం ఒక్కరోజు అయినా ఆచరిస్తే మంచిది. వేయి సంవత్సరాలపాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం ధనుర్మాసంలో ఒక్కరోజు చేసిన వ్రతంవల్ల లభిస్తుంది.

ధనుర్మాసం అనగానే నాకు గుర్తుకు వచ్చేది పొంగలి. నా చిన్నప్పటినించి  జ్ఞాపకం. మా అమ్మమ్మ ఈ మాసం అంతా తెల్లవారు ఝామున లేచి చన్నీళ్ళ స్నానం చేసి పూజ చేసుకొని ప్రతీ రోజు తిరుప్పావై, పాశురాలు చదువుతూ ఉంటుంది. ఆ పాశురాలు వింటూ నిద్ర లేచే వాణ్ని. అవి నేర్చుకుందామని ప్రయత్నించా కాని మనకు అవి నోరు తిరగలేదు. ఆ తర్వాత వీలు కాలేదు.


శ్రీ రంగనాథుని మనోరదుడిగా భావించిన పరమ భక్తురాలు గోదాదేవి. గొప్ప ప్రేమ తో ఆరాధనతో ఆ స్వామి ని తన స్వామి ని చేసుకున్న ప్రేమ మూర్తి ఆమె. కలియుగం ప్రారంభం లో భూదేవి అంశంలో జన్మించిన గోదాదేవి మార్గశిర మాసం లో శ్రీ రంగని కోసం ఆచరించిన వ్రతమే *" ధనుర్మాస వ్రతం"*. ఈ వ్రతం భక్తీ , ఆరాధన మార్గాలే కాదు ప్రేమ మార్గాన్ని చూపుతుందట. ఈ పదహారవ తేది నుండి ధనుర్మాసం ప్రారంభం కానుంది. సూర్య భగవానుడు దనూ రాశి లో ప్రవేశంచిన నాటి నుండి ముప్పయి రోజుల కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసంలోనే శ్రీ రంగనాథున్ని భర్తగా పొందడానికి గోదా దేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ శ్రీ రంగనాథున్ని ప్రసన్నం చేసుకుంటుంది. గోదా దేవి స్వయంగా రచించి గానం చేసిన *" తిరుప్పావై"* పాశురాలు (పాటలు) రోజుకొకటి చొప్పున పాడితే కోరిన కోరికలు నేరవేరుతాయత .తమిళనాట ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి పతిని ప్రసాదించమని పార్వతి దేవి ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉందట . ఆ కోవకు చెందినదే తిరుప్పావై. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది.

చిన్నప్పుడు తెలీదు కాని ఈ కథంతా తెలుసుకొన్న తర్వాత మా అమ్మమ్మ ను నేను ఆట పట్టిచ్చేవాని. గోదా దేవి ప్రేమకోరకు, ప్రియుడి తలుస్తూ రోజు పాటలు , విరహగీతాలు పాడుకుంటే , మీరెందుకే పెళ్ళయిన వాళ్ళు ఇవి చదవడం అని సరదాగా ఆట పట్టిచ్చేవాన్ని. రోజు ఉదయమే స్నానం చేయగానే రెడీ గా ఉండే *"పొంగలి"* . మళ్ళీ కొంత శర్కర , నేయి కలిపి ముద్దగా చేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.అల తినడం ఓ ఇష్టం.ఇప్పుడంటే కోల్లెస్త్రాల్ భయం కాబట్టి కాస్త తగ్గించి కట్టే పొంగలి తినటం లెండి. పెద్దవయసయినా కూడా మా అమ్మమ్మ ఇప్పటికీ రోజూ శ్రద్దగా తెల్లవారు ఝమునె లేచి చన్నీళ్ళ స్నానం చేసి మడి కట్టుకొని పాశురాలు చదువుతుంటుంది. ఆ పాశురాలు వినడం , ఆ పొంగలి తినడం ,అందుకే నాకు ఈ ధనుర్మాసం అంటే ఇష్టం.


_*🕉ధనుర్మాస వ్రతవిధానం🕉*_


సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - *"ధనుర్మాసం"*. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన *"తిరుప్పావై"* ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును *"మధుసూదనుడు"* అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని,  తర్వాతి పదిహేను రోజులు దధ్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.



_*🕉ధనుర్మాస వ్రతం🕉*_



ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే *"ధనుర్మాసం"* ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ *"ధనుర్మాసవ్రతం"* ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.

వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే  శక్తి మేరకు పంచలోహలాతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును *'మధుసూదనుడు'* అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ *'చెక్కర పొంగలి'* ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన *'పులగం'*ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ *'దధ్యోదనం'* నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు

15 రోజులుగానీ,

8 రోజులుగానీ, 

6 రోజులుగానీ, 

4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.

వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని -

*"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"*

అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -

*"ఇందిరా ప్రతి గృహ్ణాతు"*

అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాల పాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితుల అభిప్రయం. కాత్యాయనీవ్రతం లేక శ్రీ వ్రతం. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.


*🌳వ్రత విధానం🌳*


ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం *కాత్యాయనీదేవిని* షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం. 

పాశురాల సాయం

1 నుంచి 5 వరకు ఉన్న పాశురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16 నుంచి 17,18 పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొల్పడం, 23వ పాశురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 స్వామివారికి అలంకారలైన ఆయుధాలను *'పర'* అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాశురంలో పరమాత్మకు, జీవాత్మకు గల సంబంధాన్ని *'కూడారై'* ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాశురం ఫలశ్రుతితో భగవంతునికి, మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పనిలేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియజేసింది గోదాదేవి.



*🌳ధనుర్మాస వ్రత విశిష్టత🌳* 



- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్


ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మసవత్రంగా పిలుస్తున్నాం. మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తుంటాడు. దీనిని సంక్రమణం లేక సంక్రాంతి అంటున్నాం. ఉదాహరణకు సూర్యుడు మేష రాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేదా మేష సంక్రాంతి అవుతుంది. అలాగే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం లేక ధనుస్సంక్రాంతి అవుతుంది. ఒక రాశిలో ప్రవేశించిన సూర్యుడు నెలపాటు ఆ రాశిలో వుంటాడు కనుక ఆ రాశి పేరున ఆ సంక్రాంతిని వ్యవహరిస్తారు. ధనూరాశిలో ఒక మాసం పాటు సూర్యుడు వుంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మానం అనడం జరుగుతోంది. మార్గశీర్ష మానం ఆరంభమైన ఏడు రోజులకు ధనుస్సంక్రమణం జరుగుతుంది. అంటే మార్గశీర్ష మాసపు ఏడవ రోజునుండి పుష్యమాసం ప్రారంభమైన ఆరవ రోజు వరకు ఉంటుంది. 30వ రోజును భోగి పండుగగాను , ఆ మరుసటిరోజున మకర సంక్రాంతి పండుగగాను మనం జరుపుకుంటాం.

ఈ ధనుర్మాస వ్రతం మార్గశీర్షపు ఏడవ రోజునుండి ప్రారంభమై పుష్యమాసపు ఆరవ రోజువరకు నిరంతరాయంగా సాగుతుంది. వ్రతాన్ని ధనుర్శాసంలోనే ఎందుకు చేయాలన్న సందేహం రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా *'మాసోహం మార్గశీర్షోహం'* అని తానే మార్గశీర్ష మాసాన్నని భగవద్గీతలో సెలవిచ్చాడు. ఇది శ్రీకృష్ణ భగవాసునికి ప్రీతి పాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని శ్రీ గోదాదేవి మనకు నిరూపించి చూపింది.

మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి. ఇందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగను , దక్షిణాయన పుణ్యకాలం వారికి రాత్రిగాను పరిగణించబడతాయి. ఇందులో మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమాట. అంటే బ్రహ్మీ ముహూర్తమన్నమాట! కావుననే మార్గశీర్షమాసం ఇంత ఆధిక్యతను సంతరించుకుంది.

ఇక ధనుర్మస వ్రత విషయానికొస్తే శ్రీ ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ సంశ్లేషమును పొందగోరిన గోపకన్యలు వ్రేపల్లెలో కాత్యాయినీ వ్రతాన్ని చేశారని విని, తానూ అలాగే చేయాలనుకుంది. తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగను, తన్ను ఒక గోప కన్యకగను, తన స్నేహితురాళ్ళను వ్రజ కన్యలుగను భావించి, తాను గొల్ల కన్య రూపాన్ని ధరించి విల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయినే శ్రీకృష్ణునిగా భావించి, అతి శ్రేష్ఠమైన మార్గశీర్షమాసాన ధనుర్మాససమయంలో శ్రీ స్వామివారిని నెలరోజులూ అర్చిస్తూ రోజుకొక పాశురాన్ని(పాట) సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు.(1) శ్రీ సీతాకళ్యాణం *"అష్ఠాక్షరీ మంత్రాన్ని "ఓం నమోనారాయణాయ.(2) శ్రీ గోదాకళ్యాణం"* ద్వయమంత్రాన్ని *"శ్రీ మన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః 3)* 

శ్రీ రుక్మిణీ కళ్యాణం చరమశ్లోకాన్ని

*శ్లో|| సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ*

*అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచుః"* అని

ప్రతిపాదిస్తాయని ఆచార్య సూక్తి -

శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాశురాలు ప్రణవమంత్ర, అష్టాక్షరీ మంత్ర, స్వరూపాలే. వేదోపనిషత్తుల సారాంశమే! నియమ నిష్ఠలతో స్వామిని ఆరాధిస్తే ముప్పది దినాల్లోనే తరుణోపాయం లభిస్తుందని చాటి చెప్పింది మన ఆండాళ్ తల్లి చూపిన మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.

వ్రతం చేయదల్చుకున్న వారెవరైనా ఆచార్య నిష్ఠను కలిగి కులమత వర్గ భేదాల కతీతంగా ఉండి బ్రాహ్మీ ముహూర్తంలో బహిర్ స్నానం చేయటం అంతర్ మనస్సుకు భక్తిజల స్నానాన్నవలంభించటం ముద్గాన్నం వండి ఆరగింపు చేయగలగటం ఇవే నియమాలు.

ఆచరిద్దాం! శ్రీ గోదా రంగనాధుల అనుగ్రహాన్ని పొందుదాం.


*తిరుప్పావు తనియులు*

*శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్|*

*యతీన్ద్ర ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్||*

*లక్ష్మీనాథ సమారమ్భం నాథ యామున మధ్యమామ్|*

*అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్||*

*యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ*

*వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే!|*

*అస్మద్గురో ర్భగవతో2స్య దయైకసిన్దోః*

*రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే..||*

*మాతా పితా యువతయ స్తనయా విభూతిః*

*సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |*

*ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం*

*శ్రీ మపత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ద్నా.. ||*

*ఆళ్వారులతనియన్ - శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది ||*

*భూతం సరశ్చ మహాదాహ్వయ భట్టనాథ*

*శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ |*

*భక్తాంఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్*

*శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||*

తిరుప్పళ్ళియెళుచ్చి

తమేవ మత్వా పరవాసు దేవం

రంగేశయం రాజవదర్హణీయం

ప్రాబోధికీం యోకృతసూక్తి మాలాం

భక్తాంఘ్రి రేణుం భగవంతమీడే

మండం గుడి మెన్బర్ మామఱైయోర్ మన్నియశీర్

తొండరడిప్పడి తొన్నగరమ్ వణ్ణు

తిణర్త వయల్ తెన్న రంగత్తమ్మానై - పళ్ళి

యుణర్తుమ్ పిరానుదిత్త పూర్,

తొండరడిప్పొడి యాళ్ వారు అనుగ్రహించిన రెండు దివ్య ప్రబంధములలో ఇది రెండవ ప్రబంధము *"తిరు"* అను శబ్దము గోప్పతనమను అర్ధము చెప్పుచు *"పళ్ళి"* పడక *"ఎళుచ్చి"* లేచుట అనగా పడకను విడచి లేచుట యని అర్ధము.

దీనిలో ఒక్కొక్క పాశురమునందును పళ్ళియెళందరుళాయే అని పడకను విడచి లెమ్మనియే ప్రార్థించుటచే శ్రీ రంగనాధులను మేలుకొలుపుటనే -రాజవదర్హణీయమ్ అని చెప్పిరి దేవాలయాల్లో నేడు విన్పించే సుప్రభాతములకు ఇదియే నంది అని పెద్దల వాక్కు.


1. కదిరవన్ కుణతిశైచ్చిగరమ్ వన్ధణైన్దాన్

కనైయిరుళగన్ఱచు కాలైయమ్ పొళుదాయ్

మదువిరిన్దోళుగిన మామలరెల్లామ్

వానవరరశర్ కళ్ వన్దు వన్దీణ్డి,

ఎదిర్ దిశై , నిఱైన్ధన రివరొడుమ్ పుగున్ధ

ఇరుంగళి త్తీట్టముమ్ పిడియెడు మురశుమ్

అదిర్ దలిలలై కడల్ పోన్ఱుళదు ఎంగుమ్

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె


2. కొళుంగొడి ముల్లైయిన్ కొళు మలరణవి

క్కూర్ న్ధదు కుణదిశై మారుద మిదువో,

ఎళున్ధన మలరణై ప్పళ్ళి కొణ్డన్నమ్

ఈన్బనిననైన్ధ తమిరుమ్ శిఱుగుదఱి

విళుంగియ ముదలైయిన్ పిలమ్బురై పేళ్వాయ్

వెళ్ళెయిఱుఱవదన్విడత్తినుక్కనుంగి,

అళుంగియ వానైయి నరుమ్ తుయర్ కెడుత్త

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయె..


3. శుడరొళి పరన్ధన శూళిందిశై యెల్లామ్

తున్నియ తారకై మిన్నొళిశురజ్గి.

పడరొళి పశుత్తనన్ పనిమది యివనో

పాయిరుళగనదు పెమ్ పోళిఱ్కముగిన్

మడిలిడైక్కీఱి వణ్ పాళై కళ్ నాఱ

వైగఱై కూర్ న్ధదు మారుద మిదువో

అడలొళి తిగళదరు తిగిరియమ్ తడక్కై

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే...


4. మేట్టిళమేదిగళ్ తళై విడు మాయర్ గళ్

వేయజ్ఞుళలో శైయుమ్ విడైమణిక్కురలుమ్

ఈట్టియ విశైదిశై పరన్ధన వయలుళ్

ఇరిన్ధన శురుమ్బిన మిలజ్గైయర్ కులత్తై,

వాట్టియ వరిశిలై వానవరేఱే

మాముని వేళ్వియైక్కాత్తు అవపిరదమ్

అట్టియవడుతిఱలయోత్తి యెమ్మరశే

అరంగత్తమ్మా పళియెళున్ధరుళాయే..


5. పులంమ్బిన పుట్కళుమ్ - పూమ్ పోళుల్ గళిన్ వాయ్

పోయిత్తుంగళ్ పుగున్ధదు పులరి

కలన్ధదు కుణదిశైక్కనై కడలరవమ్

కళివణ్ణు మిళుత్తియ కలమ్బగమ్ పునైన్ధ

అలంగలన్దొడైయల్ కొణ్ణడియిణై పణివాన్

అమరర్ కళ్ పుగున్ధన రాదలిలమ్మా

ఇలంగైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిల్

ఎమ్బెరుమాన్ పళ్ళియేళున్ధరుళాయే...


6. ఇరవియర్ మణినెడుమ్ తేరొడుమివరో

ఇఱైయవర్ పదినొరు విడైయరుం ఇవరో

మరుమియ ముయిలిన నఱుముగ నివనో

మరుదరుమ్ పశుక్కలమ్ వన్దు వన్దీణ్డియ వెళ్ళమ్

అరువరైయనై యనిన్ కోయిల్ మున్నివరో

అరంగత్తమా పళ్ళి యెళున్ధరుళాయే


7. అన్ధరత్తమరర్ గళ్ కూట్టంగళివైయో

అరుందవ మునివరుం మరుదరుమివరో

ఇన్దిర నానైయుమ్ తానుమ్ వన్దివనో

ఎమ్బెరు మానున కోయిలిన్ వాశల్

శున్ధరర్ నెరుక్కవిచ్చాదరర్ నూక్క

ఇయక్కరుమ్ మాయంగినర్ తిరువడిత్తొళువాన్

అన్ధరమ్ పారిడ మిల్లైమత్తిదువో

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే.


8. వమ్బవిళింవానవర్ వాయుఱై వళుజ్గ

మానిది కపిలై యొణ్ కణ్ణాడిముదలా

ఎమ్బెరుమాన్ పడిమైక్కలమ్ కాణ్డఱ్కు

ఏర్పన వాయినకొణ్డు నన్మునివర్

తుమ్బురునారదర్ పుగున్ధన రివరో

తోన్ఱిన విరవియమ్ తులంగొళి పిరప్పి

అమ్బరతలత్తి, నిన్ఱగల్ గిన్ఱ దిరుళ్ పోయ్

అరంగత్తమ్మా పళ్ళి యెళున్ధరుళాయే...


9. ఏదమిల్ తణ్ఱుమై యెక్కమ్ మత్తళి

యాళుమ్ కుళుల్ ముళువమో డిశైదిశైకైళుమి

కీదంగళ్ పాడినర్ కిన్నరర్ కరుడర్ గళ్

కన్ధరు వరుమివర్ కజ్గలు ళెల్లామ్

మాదవర్ వానవార్ శారణర్ ఇయక్కర్

శిత్తరుమ్ మయంగినర్ తిరువడిత్తోళువాన్

ఆదలిలవర్కునాళో లక్కమరుళ

అరంగత్తమ్మా పళ్ళియెళున్ధరుళాయే..


10. కడిమలర్కములంగళ్ మరల్ న్ధన వివైయా

కదిరవన్ కనైకడల్ ముళైత్తన నివనో

తుడియుడైయార్ శురికుళుల్ పిఱున్దుదఱి

త్తయిలుడుత్తే ఱినర్ శూళుంపునలరంగా!

తొడై యొత్తతుళవముమ్ - కూడైయుమ్ పొలిన్దు

తోన్ఱియతోళ్ తొణ్ణరడిప్పొడి యెన్నుమ్

ఆడియనై యళియనెన్ఱరుళియున్నడియార్కు

అప్పడుత్తాయ్ పళ్ళియెళున్ధరు ళాయే

తొండరడి యాళ్వార్ తిరువడిగళే శరణం.

తొండరడిప్పొడి యాళ్వార్ తిరువడి ఘళే శరణమ్

(అని నమస్కారము చేయవలెను)


*అణ్డాళ్ తిరువడిగళే శరణమ్*

*నీలా తుంగస్తన గిరిత సుప్త ముద్బోధ్య కృష్ణం*

*పారార్థ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ద మధ్యాపయన్తీ|*

*స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే*

*గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః ||*

అన్నవయల్ పుదువై యాండా ళరంగఱ్కు

ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్

పాడి కోడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై

శూడిక్కొడుత్తాళై చ్చొల్.




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

*శ్రీ శివ మహాపురాణం - 30 వ

 _*శ్రీ శివ మహాపురాణం - 30 వ అధ్యాయం*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*నారదుడు తండ్రిని ప్రశ్నించుట*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




*సూతుడిట్లు పలికెను -*


ఓ విప్రులారా ! విష్ణువు అంతర్ధానము కాగానే , నారద మహర్షి భక్తితో శివలింగములను దర్శిస్తూ, భూలోకమునంతయూ పర్యటించెను. ఓ విప్రులారా ! ఆతడు భూలోకమును పర్యటించి , భుక్తిని ముక్తిని ఇచ్చే అనేక శివరూపములను ప్రీతితో దర్శించెను. దివ్యజ్ఞాని యగు నారదుడు ప్రసన్న మనస్కుడై భూలోకములో సంచరించుచున్నాడని తెలిసి , ఆశంభుభక్తులిద్దరు ఆతని వద్దకు వచ్చిరి. తమకీయబడిన శాపము నుండిఉద్దారమును గోరు వారై వారిరువురు వెంటనే అతనికి తలవంచి నమస్కరించి, పాదములను పట్టుకొని ఆదరముతో నిట్లనిరి.


*శివభక్తులిద్దరు ఇట్లు పలికిరి -*


బ్రహ్మపుత్రా ! దేవర్షీ ! నీవు ప్రసన్నుడవై మాఇద్దరి మాటను వినుము. విప్రులమగు మేము యథార్థముగా నీయందు అపరాధమును చేయలేదు . హే విప్రా ! మేమిద్దరము శివుని అనుచరులము. ఓమహర్షీ ! మేము నీయందు తప్పు చేసితిమి. స్వయం వరములో మాయా ప్రాభావముచే నీమనస్సు రాజపుత్రి యందలి మోహముతో నిండియుండెను . అట్టి నీవు మాకిద్దరికి శాపము నిచ్చితివి. పరమేశ్వరుని ప్రేరణ చేతనే అట్లు జరిగినది. అది మాటలాడుటకు సమయము కాదనియు, మౌనమే రక్షక మనియు తెలిసుకొంటిమి. జీవుడు తన కర్మల ఫలమును పొందును. ఇతరులను దూషింప బని లేదు. హే ప్రభో! నీవు మాయందు ప్రసన్నుడవై మమ్ములను గ్రహింపుము.


*సూతుడిట్లు పలికెను -*


శివుని అనుచరులిద్దరు భక్తితో చెప్పిన ఈ మాటను విని , నారదముని పశ్చాత్తాపమును పొందిన వాడై, ప్రీతితో ఆదరముతో నిట్లు బదులిడెను.


*నారదుడిట్లు పలికెను -*


మహాదేవాను చరులారా ! నా మాటను వినుడు. మీరు సత్పురుషులలో మిక్కిలి శ్రేష్ఠులు. మీరు సుఖమును కలిగించు, మోహములేని సత్యవచనమును పలికినారు. కొద్దికాలము క్రితము నాబుద్ధి భ్రష్టమైనది. శివుని ఇచ్ఛ వలననే అట్లు జరిగినదనుట నిశ్చయము. నేను పూర్తిగా మోహమును పొంది , దుష్టబుద్ధి గలవాడై మిమ్ములనిద్దరినీ శపించితిని. నా శాపవచనములు సత్యములయి తీరును. అయిననూ, శివభక్తులారా ! నా యీ పాపమును క్షమించుడు. ముని శ్రేష్ఠుని బిడ్డలై పుట్టి, మీరు సంపత్తులు గల వారై బలము, ప్రతాపము గల రాక్షస ప్రభువులు అగుదురు.


మీరు ఇంద్రియజయము గల శివ భక్తులై శివుని రెండవ స్వరూపమగు విష్ణువు చేతిలో మృత్యువును పొంది, మీ స్వస్థానమును పొందెదరు.


మహాత్ముడగు నారదముని యొక్క ఈ వాక్యమును విని శివాను చరులిద్దరు సంతసించి, ఆనందముతో తమ స్థానమునకు వెళ్లిరి. నారదుడు కూడ మిక్కిలి సంతసించి, శివుని ఏకానుగ్రమగు బుద్ధితో ధ్యానిస్తూ, భూలోకములో శివతీర్థములనన్నింటినీ చూస్తూ సంచరించెను. తరువాత ఆ మహర్షి కాశీని చేరెను. కాశీ తీర్థములన్నింటిలో గొప్పది. శివునకు ప్రియమైనది. కాశీ శివుని స్వరూపము. అతడు కాశీని దర్శించి కృతార్థుడయ్యెను. కాశీనాథుని దర్శించి, పరమానంద భరితుడై పూజించెను.


ఆ మహర్షి ఆనందముతో ఆ కాశీనగరమును సేవించి , శివునికి నమస్కరించి , భక్తితో శివమహిమను వర్ణించి , ప్రేమవ్యాకులుడై శివుని స్మరించి కృతార్థుడాయెను . శివుని స్మరించుటచే పవిత్రమైన బుద్ధి గల ఆ నారదుడపుడు శివతత్త్వమును అధికముగా తెలియగోరి బ్రహ్మలోకమునకు వెళ్లెను. అచట బ్రహ్మకు భక్తితో నమస్కరించి, వివిధ స్తోత్రములతో స్తుతించి, శివుని యందలి భక్తితో నిండిన మనస్సు గలవాడై శివతత్త్వమును గూర్చి ప్రశ్నించెను.


*నారదుడిట్లు పలికెను -*


హే బ్రహ్మన్‌ ! నీవు పరబ్రహ్మ స్వరూపము నెరింగిన వాడవు. హే పితామహా! నీవు జగత్తునకు అధీశుడవు. నేను నీ అనుగ్రహముచే ఉత్తమమగు విష్ణు మహాత్మ్యమును పూర్తిగా వినియుంటిని. భక్తి మార్గమును, జ్ఞానమార్గమును, కఠినమగు తపో మార్గమును, దానమార్గమును, మరియు తీర్థమార్గమును నేను విని యుంటిని. కాని, నాకు శివతత్త్వము తెలియదు. కావున, హే ప్రభో! నాకు శివపూజా విధిని, శివుని వివిధ చరిత్రలను క్రమముగా చెప్పుము. తండ్రీ ! శివుడు నిర్గుణుడైననూ సగుణుడు ఎట్లు అయినాడు? నేను శివమాయచే మోహితుడనగుటచే, శివతత్త్వమును తెలియకున్నాను.


సృష్టికి పూర్వము శంభుడు తన రూపములో ఎట్లు ప్రతిష్ఠితుడై యుండెను ? ఆ ప్రభువు స్థితికాలములో క్రీడించు విధమెట్టిది ?. ఆ మహేశ్వరుడు ప్రలయ కాలములో నెట్లుండును ?లోకములకు శుభములనిచ్చు శంకరుడు ప్రసన్నమగు విధమెట్టిది ?. హే బ్రహ్మన్‌ ! మహేశ్వరుడు సంతుష్టుడై తన భక్తులకు, ఇతరులకు ఏమి ఫలమునిచ్చును ? ఈ సర్వమును నాకు చెప్పుము. భగవాన్‌ శంకరుడు శీఘ్రముగా ప్రసన్నుడగునని వినియుంటిమి , ఆ మహాను భావుడు దయాళువు. భక్తుల శ్రమను చూడలేడు.


బ్రహ్మ విష్ణు మహేశులు ముగ్గురు దేవులు శివుని అంశనుండి జన్మించిరి. వారిలో మహేశుడు శివుని పూర్ణ అంశముతో జన్మించెను. కాన, మహేశుడు సాక్షాత్తుగా పరమశివుడే . శివుని ఆవిర్భావమును , విశేషించి లీలలను చెప్పుము. హే ప్రభో ! ఉమ యొక్క ఆవిర్భావమును, మరియు వివాహమును చెప్పుము . మరియు హే అనఘా ! శివుని గార్హస్థ్యమును, లీలలను, ఇంతియే గాక ఇతర గాథలనన్నింటినీ చెప్పుము . హే ప్రజాపతే ! ఉమ యొక్క ఆవిర్భావమును , వివాహమును మరియు గుహుని జన్మను నాకు చెప్పుము.


హే జగన్నాయకా ! నేను అనేకుల నుండి పూర్వము విని యుంటిని. అయిననూ , తృప్తి కలుగలేదు. కావుననే, నిన్ను శరణు వేడితిని. నాపై దయము చూపుము. కుమారుడగు నారదుని ఈ మాటను విని, లోకపితామహుడగు బ్రహ్మ అపుడు ఇట్లు పలికెను .



*శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహిత యందలి మొదటి ఖండము అగు సృష్ట్యు పాఖ్యానములో నారద ప్రశ్న వర్ణనమను ఐదవ అధ్యాయము ముగిసినది.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

*కార్తీక పురాణం - 30 వ

 _*కార్తీక పురాణం - 30 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*చివరి అధ్యాయం*



*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*



☘☘☘☘☘☘☘☘☘




నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను , విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి , వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున , సూతునిగాంచి , *"ఓ ముని తిలకమా ! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై , అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ? ధర్మములన్నింటిలో మోక్షసాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది ? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమదైవమెవరు ? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి ? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కావున దీనిని వివరించి తెలియజేయు"* మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి *"ఓ మునులారా ! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు , సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని , శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని , లేక , ఆచరించువారలను ఎగతాళి చేసినగాని , వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్టివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని , గంగా నదిలోగాని , అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము ఉత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి , మరుజన్మలేక , వైకుంఠమందుగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు , దుర్మార్గులకు , పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన , ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి , జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము , ధాన్యము , బంగారము , గృహము , కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను , బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు , పురాణములు వింటూ , పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంబును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.



*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

పోలిస్వర్గం

 పోలిస్వర్గం


కార్తీకమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏంటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పోలిస్వర్గం అచ్చం తెలుగింటి మహిళ కథ. కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ తెలుపుతుంది. పూర్వం కృష్ణాతీరంలోని ఓ ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారంట. వారందరిలోకి చిన్నకోడలే పోలి. చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది. తనలాంటి మహా భక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది.


ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్తపడి వెళ్లేదు. అయితే, పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి, కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరి కంటా పడకుండా దానిపై బుట్టని బోర్లించేంది. ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి కార్తీక అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీకం చివరి రోజు కాబట్టి ఆ నాడు కూడా నదీస్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది.


కానీ, పోలి ఎప్పటిలాగే ఇంటిపనులు చకచకా ముగించి, కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురై, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పవిమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె మిగతా కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారు.


ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తల్చుకుంటారు. కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే.... ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజు బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు.


తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మీ రూపంగా భావిస్తుంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అటుంచితే, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. భగవంతుని కొలవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదు. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని ఈ కథ హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందుకే కార్తీకమాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

చీమలా పని చేయటం

 *🐜చీమలా పని చేయటం*

🕉️🌞🌎🏵️🌼🚩


నెమ్మదిగా పనిచేసే వారిని చీమలాగా పని చేస్తున్నారు అని అంటాం. అది తక్కువ చేసి మాట్లాడటంలా అని పిస్తుంది. ఎప్పుడైనా ఒక్క చీమ నిద్రపోతూగానీ, కదల కుండాగానీ కనపడుతుందేమో చూడండి.


చూడటానికి నెమ్మదిగా చేస్తున్నట్టుండటంతో పని తెమిలినట్టు ఉండదు. కానీ దాని పుట్ట చూస్తే తెలుస్తుంది. ఎంత ధాన్యం సేకరించి ఉన్నదో. చీమ శరీరమెంత? దానిలో కాలెంత? ఆ కాలితో భూమిని తొలుచుకుంటూ అవి తమ నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. వాటికి సాధన సంపత్తి, పరికరాలు ఉండవు. చేతనయిన పని చేసుకుంటూ పోవటమే. త్వరగా చేయాలనే తొందర, ఆందోళన, ఒత్తిడి ఉండవు.


సంఘీభావంతో, కలసికట్టుగా చీమలు తయారు చేసుకున్న నివాసం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఏర్పాటు చేసుకున్నది నేల లోపలే అయినా  చిన్న నలుసు కూడా ఉండదు. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చక్కగా అలికినట్టు నున్నగా ఉంటుంది. నేలని ఎంత తెలివిగా తొలుస్తాయంటే ఒక్క చుక్క నీరు కూడా వాటి కన్నాల్లోకి చొరబడదు. వాటి గృహ నిర్మాణ విజ్ఞా నానికి జోహార్లు. వీలైతే మనుషులు వాటి నుంచి నేర్చు కోవాలి.

అయితే, ఆ విజ్ఞానాన్ని మానవులు కాదు కానీ, పాములు బాగా ఉపయోగించుకుంటున్నాయి. తాము ఉండటానికి తగిన ఇల్లు నిర్మించుకోవటం పాములకి తెలియదు. బొరియల్లో ఉంటాయి. కానీ చీమలు చక్కని పుట్ట పెడితే హాయిగా వాటిని సొంతం చేసుకుంటాయి. అయినా చీమలు తమ పని మానవు.


చీమలాగా పని చెయ్యటమంటే నిబద్ధతతో మాత్రమే కాదు. క్రమశిక్షణతో పనిచేయటం. చీమల గుంపు ఒక దారిలో వెడుతుంటే ఒక్కటి కూడా పక్కకి వెళ్లదు. ఒకదాని వెనుక మరొకటి శిక్షణ పొందిన సైనికుల్లాగా కదులు తాయి. చూడముచ్చటగా ఉండే ఆ వరుసని చూసి ఏదైనా అలా క్రమంగా ఉంటే చీమలబారు అని పోలుస్తారు.


ఎటువంటి ఆర్భాటం హడావుడి లేకుండా నెమ్మదిగా తమ మానాన తాము పని చేసుకుంటూ పోయే చీమల పుట్ట లోపల చూస్తే ఎంత ధాన్యం నిలువ ఉంటుందో! తాము తినగా, తమ వారందరూ వర్షాకాలంలో తినటానికి సరిపడినంత ధాన్యం ఉంటుంది. తెలివైన వారు చేసే పని అదే కదా? పగటిపూట రాత్రి కోసం, వేసవిలో వర్షాకాలం కోసం, యవ్వనంలో వార్ధక్యం కోసం, ఇహలోకంలో పర లోకం కోసం జాగ్రత్తపడాలని మనిషికి చెప్పి, హెచ్చ రించవలసిన అవసరం వచ్చింది. చీమకు ఎవరూ చెప్ప లేదు. అందుకే ఎవరైనా కొద్ది కొద్దిగా కూడబెడితే చీమ లాగా కూడబెట్టాడు అంటారు.


క్రమశిక్షణ, పరిశుభ్రత, పనిచేసే మనస్తత్వం, సంపా దించినదంతా ఖర్చు చేయకుండా కావలసినంత తిని, మిగిలినది దొరకని రోజుల కోసం కూడబెట్టడం, సంఘీ భావం మొదలైనవి చీమల పనికి ఉన్న లక్షణాలు. కనుక చీమలాగా పనిచేశారు అంటే కుదురుగా, నిలకడగా, నిబ ద్ధతతో, ఓర్పుతో, క్రమశిక్షణతో, పనిచెయ్యటమే తమ ధ్యేయంగా, ప్రతిఫలాపేక్ష రహితంగా పనిచేశారు అని అర్థం. అందువల్ల చీమలాగా పని చేస్తున్నారని అనడం అంటే మెచ్చుకోవడమే అవుతుంది.


– డాక్టర్‌ ఎన్‌. అనంతలక్ష్మి


🕉️🌞🌎🏵️🌼🚩

సోమవతి_అమావాస్య

 సోమవతి_అమావాస్య..

తేదీ__14_12_2020__సోమవారం_రోజు


సోమవతి_అమావాస్య_రోజు_ఏం_చేయాలి.?


శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే... అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు.. ఇక  సోమవారము అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి_అమావాస్య..’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…


దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే..! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది.


సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు.. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు.. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు.. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు.


నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు.. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది.. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ... ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు.


శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి...తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని  ‘సోమవతి_అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది..  సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.


సోమవతి_అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు.. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే.. సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం.. 


ఈ పూజ పంచారామాలలో కానీ, రాహు కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట... ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు..


సోమవతి_అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో వుండే సకల దోషాలు తొలగి పోతాయని విశ్వాసం... సోమవతి_అమావాస్య రోజున

శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.


ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకం.. ఈనాడు ఉపవాసము చేసిన స్త్రీ కి సంతాన భాగ్యము తో పాటు, ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం ప్రాప్తించదట... అందుకే దీనిని సోమవతి_అమావాస్య అంటారు.. 


        ఓం_నమఃశివాయ.. హరహర_మహాదేవ..

విశ్వనాధ వారి పద్యం

 అమ్మ ప్రేమ మీద కవిసామ్రాట్ విశ్వనాధ వారి పద్యం. 

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి   శ్రీ మద్రామాయణ కల్పవృక్షంలోనిది ఈ పద్యము.


తానో లాములు “తండ్రి పేరెవరయా"

దాచాత మాలాలు నౌ

లే ! నాపేరన, నమ్మగాల గన, నోలిం దల్లి కౌసల్య తం

డ్రీ ! నాగానన బోయిరాక, కనులన్ నీర్వెట్ట, కౌసల్య నే

గానేకానులె యమ్మనే యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్ !!


తాత్పర్యము


చిన్ని రాముని కౌసల్య దగ్గరకు పిలచి


నీపేరేమిటి అని అడిగిందట. పసివాడైన రాముడు పసి భాషలో లాములు (రాముడు) అన్నాడట. 


మరి మీ నాన్నగారి పేరేమిటి అంటే దాచాత మాలాలు  (దశరథమారాజు)

అని బాల రాముని జవాబు.


మరైతే నాపేరేమిటి అని కౌసల్య అడిగితే 

అమ్మ గాలు (అమ్మ గారు) అన్నాడు. 

కాదు నాయనా నాపేరు కౌసల్య

అని సవరించింది.


"కౌసల్య"  అనేమాట పసి పిల్లాడికి పలుకడం

కష్టం . ఆ అసహాయతతో పసివాడు కంట నీరు పెట్టాడు .


తట్టుకోలేక కౌసల్య బాలరాముని హత్తుకొని

"కౌసల్య నేకాను"  "నీ అమ్మనే" అంటూ

ముద్దాడింది. 


ప్రతి బాలుడూ చిన్ని శ్రీరాముడై  ప్రతితల్లీ

కౌసల్య వలె అనుభవానుభూతిని ఆస్వాదించాలని ఆశిస్తూ 🙏🙏🙏

సేకరణ:-

బౌద్ధావతారం

 ప్ర: దశావతారాలలో 'బౌద్ధావతారం' అంటే చరిత్రలోని గౌతమ బుద్ధుడేనా? "నమో బౌద్ధావతారాయ దైత్యస్త్రీ మానభంజినే, అచింత్యాశ్వత్థ రూపాయ రామాయాపన్నివారిణే" అని 'శ్రీమదాపన్నివారక రామస్తోత్రం"లో ఉంది. దీని గురించి తెలుప ప్రార్ధన.


జ: దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాడనే చెప్పాలి. ప్రాచీన పురాణ వాజ్ఞ్మయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమౌతుంది. త్రిపురాసురుల భార్యలు మహా పతివ్రతలు. వారి పాతివ్రత్య శక్తి వల్ల త్రిపురులను ఎవరూ జయించలేకపోతారు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింపజేయడానికి లోకరక్షణ, ధర్మరక్షణ కోసం విష్ణువు బుద్ధరూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపంతో, ఒక అశ్వత్థవృక్ష మూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. వారు శివుని చేత హతులయ్యారు. ఇదే మీరు చెప్పిన 'ఆపన్నివారక స్తోత్రం'లో ఉంది. 'దైత్య స్త్రీ మానభంజినే' అంటే రాక్షస స్త్రీల పాతివృత్యాన్ని భంగం చేసినవాడు' అని అర్ధం. ఇది కాక - దివోదాసుడనే రాజును ఆ కాలానికి అవసరంగా రాజ్యచ్యుతి కల్పించవలసి వచ్చింది. అందుకు ధర్మ బలాన్ని తొలగించి రాజును తప్పించడానికి విష్ణువు బుద్ధావతారమెత్తాడు. ఆ సమయంలో అవైదిక, ఆధార్మిక బోధలతో ఆ రాజ్యానికి బలహీన పరిస్థితి చేకూర్చాడు.


 -ఇవే పురాణ బుద్ధుని అవతారాలు. పై మొదటి వృత్తాంతాన్నే అన్నమయ్య దశావతార వర్ణనలలో పేర్కొన్నాడు. *“పురసతుల మానములు పొల్లచేసినచేయి” “ఆకసాన బారే వూరి అతివలమానములుకాకుసేయువాడు"* 


ఆకసాన విహరించే ఊరులు - త్రిపురాలు. వారి మగువల ధర్మాన్ని తప్పించిన వాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది. ఆ బుద్ధునికీ ఈ గౌతమ బుద్ధునికీ సంబంధం లేదు.

ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల వ్రతం

 ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం (మార్గశిర లక్ష్మీవార వ్రతం)


హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం...’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే...’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందంచేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! 


ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం అందరి కోసం...

 

 లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.


* ఐదువారాల అద్భుత వ్రతం...


 మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.

 

* వ్రతవిధానం


ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. 


" ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’  "


అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి.

 

  అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి.  చివరగా క్షమాప్రార్థన చేయాలి.


 అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు. 


* తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి. 

* రెండవవారం  అట్లు ,తిమ్మనం

* మూడోవారం  అప్పాలు ,పరమాన్నము

* నాలుగోవారం  చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి. 

* ఐదోవారం నాడు అమ్మవారికి  పూర్ణం బూరెలను నివేదించాలి. 


ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.

 

* నియమనిష్ఠలు కీలకం


 గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచేస్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.

 

 ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు.


మార్గశిర లక్ష్మీవార వ్రత కధ:


పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లిచేప్పినది. ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురుమాత్రమే చేసుకున్నది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా.... నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కధలోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.

(సేకరణ)

శ్రీ శివ మహాపురాణం

 _*శ్రీ శివ మహాపురాణం - 27 వ అధ్యాయం*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*నారదుని తపస్సు*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




*సూతుడిట్లు పలికెను -*


ఓ విప్రులారా ! ఒకప్పుడు మునిశ్రేష్ఠుడు , బ్రహ్మ గారి కుమారుడు , వినయస్వభావము కలవాడు నగు నారదుడు తపస్సును చేయు సంకల్పించెను . హిమవత్పర్వతము నందు ఒక మిక్కిలి సుందరమగు గుహ కలదు. దాని సమీపమునందు జీవనదియగు గంగ వేగముగా ప్రవహించుచుండును .  అచట అనేక శోభలతో గూడిన దివ్యమగు ఆశ్రమము గలదు. పుణ్యదర్శనుడగు నారదుడు తపస్సు చేయుటకు అచటికి వెళ్లెను . ఆ ముని పుంగవుడు ఆ ఆశ్రమమును చూచి, అచటనే దృఢమగు ఆసనమును వేసి, మౌనియై, ప్రాణయామమునుచేసిస పవిత్రాంతః కరణుడై దీర్ఘకాలము తపమాచరించెను .


నారదముని 'అహం బ్రహ్మాస్మి (బ్రహ్మము నేనే)' అను దర్శనము గల సమాధిని పొందెను. ఓ ద్విజులారా! ఇట్టి తపస్సు వలన బ్రహ్మ సాక్షాత్కారహేతువగు జ్ఞానము సిద్ధించును . మునిశ్రేష్ఠుడగు నారదుడు ఈ తీరున తపస్సు చేయుచుండగా, ఇంద్రుని మనస్సు తీవ్రమగు ఆదుర్ధాతో కంపించెను .  'ఈమహర్షి నారాజ్యమును కోరుచున్నాడు' అని తలపోసిన వాడై ఇంద్రుడు నారదుని తపస్సునకు విఘ్నము చేయ నిశ్చయించుకొనెను . దేవతలకు నాయకుడగు ఇంద్రుడు మనస్సులో మన్మథుని స్మరించెను. అపుడు మహిమ గలవాడు, పుష్పబాణుడు నగు మన్మథుడు వెంటనే విచ్చేసెను.


దేవతలకు ప్రభువగు ఇంద్రుడు మన్మథుని రాకను చూచెను. ఆతడు స్వార్ధమును సాధించుకొనుటలో కుటిలమగు బుద్ధి చతురత గలవాడు. ఆతడు మన్మథుని వెంటనే పిలిచి ఇట్లు పలికెను .


*ఇంద్రుడిట్లు పలికెను -*


ఓ శ్రేష్ఠమిత్రమా ! నీవు గొప్ప వీరుడవు. మాకు ఎల్లవేళలా హితమును చేయువాడవు. నీవు నా మాటను ప్రీతితో విని, సాహాయ్యమును చేయుము . నేను నీ బలముతోనే అనేకుల తపోగర్వమును అడంచితిని . ఓ మిత్రమా ! నా రాజ్యము యొక్క స్థిరత్వము అన్ని వేళలా నీ అనుగ్రముపై నాధారపడి యున్నది . హిమవత్పర్వత గుహలో నారదముని జగత్పితను ఉద్దేశించి గొప్ప నియమముతో కఠినమగు తపము నాచరించుచున్నాడు .


ఆ నారదుడు బ్రహ్మ నుండి నా రాజ్యమును వరముగా కోరునేమో యను శంక నాకు గలదు. నీవీనాడే అచటకు వెళ్లి, ఆయన తపస్సునకు విఘ్నమును కలిగించుము . ఈ విధముగా మహేంద్రునిచే ఆజ్ఞాపింపబడిన ఆ మన్మథుడు ప్రియమిత్రుడగు వసంతునితో గూడి గర్వముతో ఆ ప్రదేశమునకు వెళ్లి తన ఉపాయమును మొదలిడెను . ఆతడచట వెనువెంటనే తన కళలనన్నిటినీ ప్రదర్శింపజొచ్చెను. వసంతుడు కూడా గర్వించిన వాడై, తన ప్రభావమును అనేక విధములుగా చూపెట్టెను .  ఓ మునిశ్రేష్ఠులారా! నారదముని యొక్క మనస్సు మహేశుని అనుగ్రహముచే వికారమును పొందలేదు. మన్మథునకు గర్వభంగమాయెను .


ఓ శౌనకాది ఋషులారా! అట్లు జరుగుటకు గల కారణమును శ్రద్ధగా వినుడు. ఈశ్వరుని అనుగ్రహముచే ఆ ప్రదేశములో మన్మథుని ప్రభావము నిరుపయోగము . మన్మథ శత్రువగు శంభుడు గొప్ప తపస్సు చేసిన స్థలమదియే. మహర్షుల తపస్సును భంగము చేయు మన్మథుడచటనే శివునిచే దహింపబడినాడు . మన్మథుని బ్రతికించుడని రతీదేవి దేవతలను ప్రార్థించగా, వారు శివుని ప్రార్థించిరి. లోకములకు మంగళములను కలుగజేయు శంకరుడు అపుడిట్లనెను . ఓ దేవతలారా! కొంతకాలము తరువాత మన్మథుడు మరల జీవించగలడు. కాని ఈ స్థానములో మన్మథుని ఆటలేమియూ సాగవు . ఓ దేవతలారా! ఇచట నుండి కనుచూపుమేర వరకు ఉండే ప్రదేశములో మన్మథ బాణముల ప్రభావము చెల్లదు. దీనిలో సందియము లేదు .


శివుని ఈ పలుకుల చే నారదుని యందు చూపదలచిన తన ప్రతాపము భగ్నము కాగా, మన్మథుడు వెనువెంటనే స్వర్గములో ఇంద్రుని వద్దకు వెళ్లెను .  మన్మథుడు నారదుని ప్రభావమును, జరిగిన వృత్తాంతమును పూర్తిగా ఇంద్రునకు విన్నవించెను. వసంత మిత్రుడగు మన్మథుడు ఇంద్రుని వద్ద సెలవు తీసుకుని తన స్థానము చేరెను .  అపుడు ఇంద్రుడు ఆశ్చర్య చకితుడై నారదుని ప్రశంసించెను. నారదుని వృత్తాంతము నెరుంగని ఇంద్రుడు శివమాయచే మోహితుడయ్యెను .  శివుని మాయ సర్వప్రాణులకు తెలియ శక్యము కానిది. సర్వ స్వార్పణము చేసిన భక్తుడు తక్క ఈ జగత్తంతయూ శివమాయచే మోహితమగును .


ఈశ్వరుని అనుగ్రహముచే నారదుడచటనే చిరకాలముండెను. తరువాత ఆ మహర్షికి తన తపస్సు పూర్ణమైనదనే తలంపు కలిగి విరమించెను .  మన్మథునిపై విజయము తన ప్రభావమేనని ఆ మహర్షి తలపోసెను. ఆయన శివమాయచే మోహితుడయ్యెను. ఆయన జ్ఞానము వృథా అయెను . ఓ మునిశ్రేష్ఠులారా! శంభుని మహా మాయ మిక్కిలి ధన్యమైనది. బ్రహ్మ, విష్ణువు మొదలగు వారికి కూడా దాని ప్రసారము తెలియకుండును . మునిశ్రేష్ఠుడగు నారదుడు ఆ మాయచే మిక్కిలి సంమోహితుడై, తన మహిమను శివునకు చాటిచెప్పే ఉద్దేశ్యముతో వెంటనే కైలాసమునకు బయలు దేరెను .


గర్వితుడగు ఆ మహర్షి తాను మహాత్ముడననియు, మన్మథుని పై విజయము తన ప్రభావమేననియు తలంచినవాడై, రుద్రునకు నమస్కరించి తన వృత్తాంతమునంతయూ చెప్పెను . భక్త వత్సలుడగు శంకరుడా పలుకులను విని, తన మాయచే మోహితుడై వివేకమును కోల్పోయిన ఆనారదునితో నిట్లనెను .


*రుద్రుడు ఇట్లనెను -*


వత్సా ! నారదా ! నీవు ప్రాజ్ఞుడవు. ధన్యుడవు. నీ నామాటను వినుము. ఈ మాటలను ఇతరుల వద్ద చెప్పకుము. విష్ణువు యెదుట సుతరాము చెప్పకుము . నీవు నాకు చెప్పిన ఈ వృత్తాంతమును రహస్యముగ నుంచుము. ఏనాడైననూ బయటపెట్టకుము  నీవు విష్ణుభక్తుడవు. విష్ణుభక్తులు నాయందు కూడ భక్తిని కలిగియుందురు. కావున, నీవు నాకు మిక్కిలి ప్రియమైనవాడవు. నేను నిన్ను ప్రత్యేకించి శాసించు చున్నాను . ఈ విధముగా, జగత్తును సృష్టించి పాలించు రుద్రుడు నారదునికి అనేక విధముల నచ్చచెప్పెను. అయిననూ, శివమాయచే విమోహితుడైన నారదుడు ఆ మాటలను లెక్కచేయలేదు .


రాబోవు కర్మఫలముల చాల బలీయమైనదని విద్వాంసులు తెలియవలెను. మానవులెవ్వరైననూ కర్మగతిని తప్పించుకొనలేరు. శంకరునని ఇచ్ఛానుసారముగా కర్మగతి ప్రవర్తిల్లును . అపుడా మహర్షి బ్రహ్మలోకమునకు వెళ్లి, బ్రహ్మకు నమస్కరించి, తాను తన తపశ్శక్తి చేత కాముని జయించితినని చెప్పెను . విధి ఆ మాటలను విని శంభుని పాదపద్మములను స్మరించి, కాముని జయించుటకు గల కారణము నెరింగి, కుమారుడగు నారదుని అట్లు ప్రచారము చేయవద్దని నివారించెను . నారదుడు గొప్ప జ్ఞానియే అయిననూ, శివమాయచే మోహితుడగుటచే, అతని మనస్సునందు గర్వము అంకురించి, బ్రహ్మ గారి మాటను పెడచెవిని పెట్టెను . లోకమునందు సర్వము శివుని ఇచ్ఛ ప్రకారమే జరుగును. జగత్తంతయూ శివుని అధీనమునందుండును. ఇది సత్యము .


వివేకము నశించి గర్వము అంకురించిన మనస్సు గల నారదుడు తరువాత వెనువెంటనే తన గొప్పదనమును ప్రకటించుటకు విష్ణులోకమునకు వెళ్లెను . నారద మహర్షి వచ్చుచుండుటను గాంచి, విష్ణువు లేచి, కొద్ది దూరము ఎదురేగి కౌగిలించుకొనెను. నారదుని రాకకు కారణము ఆయనకు విదితమే . విష్ణువు నారదుని తన ఆసనముపై కూర్చుండబెట్టి, శివుని పాదపద్మములను స్మరించి అతని గర్వమును పోగొట్టు సత్యవచనముల నిట్లు పలికెను .


*విష్ణువు ఇట్లు పలికెను -*


వత్సా ! ఎచటనుండి వచ్చుచున్నావు ? ఇచటకు వచ్చుటకు కారణమేమి ? ఓమునిశ్రేష్ఠా ! నీవు ధన్యుడవు. నీ రాకచే నేను పవిత్రుడనైతిని . విష్ణువు యొక్క ఈ మాటలను విని, గర్వితుడగు నారద మహర్షి మోహమునకు వశుడై అహంకారముతో తన వృత్తాంతమును చెప్పెను . అపుడు విష్ణువు గర్వముతో నిండియున్న మహర్షి వాక్యములను వినెనే గాని, కామజయమునకు గల వాస్తవ కారణము ఆనకు విదితమే . ఆయన శివుని పాదపద్మములను హృదయములు స్మరించెను . శివభక్తులలో శ్రేష్ఠుడు, పరిశుద్ధమగు అంతఃకరణము గల వాడునగు విష్ణువు శిరసువంచి, దోసిలి యొగ్గి పరమేశ్వరుని భక్తితో స్తుతించెను .


*విష్ణువు ఇట్లు పలికెను -*


హే శివ! నీవు దేవదేవుడవు. మహాదేవుడవు. అనుగ్రహింపుము. నీవు ధన్యుడవు. అందరినీ మోహింపజేయు నీ మాయ ధన్యము . ఈ విధముగా ఆయన పరమేశ్వరుని స్తుతించి, కళ్లను మూసుకుని, శివుని పాదపద్మములను ధ్యానించి, విరమించెను . శివుని యాజ్ఞచే జగత్తును పరిపాలించు విష్ణువు మనస్సులో శంకర కృతమగు కామజయమును ఎరింగి, నారద మహర్షితో నిట్లనెను .



*విష్ణువు ఇట్లు పలికెను -*


ఓ మునిశ్రేష్ఠా ! నీవు ధన్యుడవు. తపస్సునకు నిధివి. గొప్ప జ్ఞానివి. ఓ మహర్షీ ! భక్తి జ్ఞానవైరాగ్యములనే మూడు లేనివానికి , సర్వ దుఃఖములనిచ్చే కామ మోహాది వికారములు శీఘ్రమే కలుగును. నీవు నైష్ఠిక బ్రహ్మచారివి. సదాజ్ఞాన వైరాగ్యములు గలవాడవు . నీవు జన్మప్రభృతి వికారములు లేని వాడవు. గొప్ప జ్ఞానివి. నీకు కామవికారమెట్లు కలుగును ?


ఈ విధముగా అనేకములగు పలుకులను విని ఆ మహర్షి పెద్దగా నవ్వెను . అతడు మనస్సులో విష్ణువునకు నమస్కరించి ఇట్లు బదులిడెను.


*నారదుడిట్లు పలికెను -*


ప్రభూ! నీదయ నాయందున్నచో మన్మథుని సామర్థ్యమెంతటిది ? . ఇట్లు పలికి విష్ణువునకు నమస్కరించి ఆ మహర్షి తనకు తోచిన దారిన వెళ్లెను .



_*శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండమగు సృష్ట్యుపాఖ్యానములో నారదతపోవర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది .*_




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

ధార్మికగీత -109*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత -109*

                                    *****

         *శ్లో:- అద్భి ర్గాత్రాణి శుద్ధ్యంతి ౹*

                *మన స్సత్యేన శుద్ధ్యతి   ౹*

                *విద్యా తపోభ్యాం పూతాత్మా  ౹*

                 *బుద్ధి: జ్ఞానేన  శుద్ధ్యతి ౹౹*

                           *****


*భా:- మానవునికి ఆధ్యాత్మిక పథ గమనంలో  బాహ్య, అంతః కరణ శుచులు అత్యావశ్యకములు. భగవానుడు భావప్రియుడు. బాహ్యప్రియుడు కాడు. మనకు భగవత్ ప్రీతికి గాను విధిగా, శుద్ధిగా ఉండితీరవలసినవి.1."శరీరము":- బాహ్య సంచారము వలన పేరుకుపోయిన స్వేదమును, దేహమాలిన్యమును స్నానంలో జలధారలచేత సులువుగా పోగొట్టుకోవచ్చును. 2. "మనస్సు":-  త్రికరణాలలో మూలమైన మనస్సును గాడిలో పెట్టి, జప ధ్యానాలు,యజ్ఞ యాగాలు, పూజలు, వ్రతాలు చేయాలి. ఆ మనసు సత్యము చేత శుద్ధమౌతుంది. మానసిక శుద్ధికి సత్యనిష్ఠ తప్పనిసరి. 3."ఆత్మ":-  మానసిక,వాచిక, కాయిక తపస్సులచేతను, జ్ఞానసముపార్జనకు,వికాసానికి మూలాధారమైన విద్య చేతను ఆత్మ పవిత్రీభూతమై "పూతాత్మ" గా భాసిస్తుంది. 4."బుద్ధి":-  సంకల్ప  వికల్పాలకు నిలయమై, క్షణికము, చంచలమైన మనస్సును వివేక విచక్షణలతో నియంత్రించేది బుద్ధి. ఆ బుద్ధికి అంతటి  శక్తి సామార్ధ్యాలను ప్రసాదించి, శుద్ధి చేయగలిగింది జ్ఞానము మాత్రమే. ఈ విధంగా దైవతత్వము, రూప గుణ నామాల గరిమ, మహిమల జిజ్ఞాసతో ప్రయత్నశీలియైన మానవుని కాయము జలము చేత ;  మనస్సు సత్యముచేత ;  ఆత్మ విద్యా తపస్సులచేత ;  బుద్ధి జ్ఞానసంపదచేత  పూతము, పవిత్రము, పరిశుద్ధము  కాగలవని సారాంశము*.

                                 *****

                  *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ధనుర్మాసములో ప్రసాదాలు

 *ధనుర్మాసములో ప్రసాదాలు*

(14.12.20)

(పి.యల్.నరసింహాచార్య)


పాసుర సంఖ్య.                 ప్రసాదాలు.

3--ఓంగి                      చక్కెర పొంగలి

7--కీశు                        పుళిహోర

12--కనైత్తు                  చక్కెర పొంగలి

16--నాయగనాయ్    పుళిహోర~దధ్యోదనము~ చక్కెరపొంగలి

18--ఉందు                  చక్కెరపొంగలి

23--మారి                       -do-

24--అన్రి                      ధద్ద్యోధనము

27--కూడారై              పాయసము, పుళిహోర, ధద్ద్యోదనము

28--కరవైగళ్              ధద్ద్యోధనము

29--శిత్తమ్             చెక్కెర పొంగలి, ధద్ద్యోధనము, పుళిహోర

30--వంగకడల్             అప్పము


*(ఆణ్డాళ్ తిరువడిగళై శరణమ్)*

Pravachanam