3, డిసెంబర్ 2020, గురువారం

సంఖ్యావాచక పదాలు*

 0️⃣1️⃣2️⃣3️⃣4️⃣

       *సంఖ్యావాచక పదాలు*

                           5️⃣6️⃣7️⃣8️⃣9️⃣




1️⃣2️⃣


*ద్వాదశావస్థలు :* 1.దర్శనము, 2.మనస్సంగము,3.వాదశావస్థలు. 4.జాగరము,5. కార్శ్యము,6. అరతి,7. అలజ్జ, 8.ఉన్మాదము, 9.మూర్ఛ,10. మరణోద్యమము 11. జ్వారము 12. సంతాపము.


*ద్వాదశ-తపస్సులు :* 1. ఉపవాసము, 2. అరకడుపుగ భుజించుట, 3. వృత్తి పరిసంఖ్యానము (భిక్షకై గృహముల నేర్పఱచుకొనుట), 4. రస పరిత్యాగము (షడ్రసములను లేక 1,2 రసములను వదలుట), 5. వివిక్త శయ్యాసనము (ఏకాంత స్థానమున పడుకొనుట, ఉండుట), 6. కాయక్లేశము, 7. ప్రాయశ్చిత్తము, 8. వినయము (రత్నత్రయము, దానిని ధరించువారిపై వినయమును చూపుట), 9. వైయావృత్తము (గురుముని పాదసేవ), 10. స్వాధ్యాయము, 11. వ్యుత్యర్గము (శరీరముపై కల మమతను తక్కువ చేసికొనుట), 12. ధ్యానము చేయుట [ఇవి జైనాచార్యుల తపస్సులు]. [జైనధర్మపరిభాష]

గీర్వాణవాణి

 గీర్వాణవాణి 

  వ శ్లోకం.

 భావానువాదం    

గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏


101.ఉద్యమేన  హి సిద్ధ్యంతి కార్యాణి  న మనోరథైః

న హి సుప్తస్య సింహస్య  ప్రవిశంతి ముఖే మృగాః.


ప్రయత్నంతోనే పనులు సిద్ధిస్తాయిగానీ కేవలం కోరికలతో కాదు.నిద్రిస్తున్న సింహం నోటిలోకి మృగాలు తమంతట తాము ప్రవేశించవు కదా. (సింహం వేటాడకుండా ఆహారం లభించదు కదా! )

నామ సంకీర్తన

 *నామ సంకీర్తన* 


🍁🍁🍁🍁



  *హరేకృష్ణ హరేకృష్ణ* 

   *కృష్ణకృష్ణ హరేహరే* 


    *హరేరామ హరేరామ* 

      *రామరామ హరేహరే* 


పదహారు నామములతో కూడిన ఈ మహామంత్రము సర్వోత్కృష్టమైనది. 


 ఈ నామజపము వలన సర్వ సిద్ధులు లభించును. 



ఎవని నాలుకపై అహర్నిశము హరినామము తాండవము చేయునో వానికి కురుక్షేత్రము, కాశి, పుష్కర క్షేత్రము మొదలుగు తీర్ధ పర్యటనల అవసరమేమి? (స్కాంద పురాణము)


సహస్ర కోటి తీర్థ యాత్రలు చేసినంతటి ఫలితమును అతి శీఘ్రముగ నిరంతర నామ సంకీర్తన వలన పొందగలము


 ----(వామన పురాణము)


ఒకానొకప్పుడు కురుక్షేత్రములో విశ్వామిత్రుడు తన భక్త సమూహమునకు ఇట్లు చెప్పెను. 

"ఈ భూమండలము నందు గల అనేక తీర్థములను గురించి వింటిని.  కాని హరి నామము యొక్క కోటి అంశముతోనైనను అవి ఏవియు సమము కానేరవు.  నామము అంతటి విలువైనది". ---(విశ్వామిత్ర సంహిత)


వేద, ఆగమ, శాస్త్రాదుల పఠనము వలనను, అనేక తీర్థ పర్యటనల వలనను ఏమి ప్రయోజనము? ఒకవేళ నీకు ముక్తి కావలయునని నచో గోవిందా! యని అనుక్షణము స్పష్టముగా కీర్తించుము. ----(లఘు భాగవతము)


సూర్యగ్రహణ కాలమందు కోటి గోవులను దానము చేసినను, మాఘ మాస వ్రత నియమానుసారము ప్రయాగ లో గంగానదీ తీరమందు కల్పము వరకు నివాసము చేసినను, అసంఖ్యాకములైన యజ్ఞములు చేసినను, మేరు పర్వత సమానమగు సువర్ణ దానము చేసినను, గోవింద కీర్తనములో నూరవ అంశమునకు అవి అన్నియును సమము కానేరవు. ---(లఘు భాగవతము)


చెరువులు, నూతులు, తోటలు నిర్మించుట, మొదలగునవి పుణ్య కర్మలైనను బంధన హేతువులే అగుచున్నవి.  శ్రీహరి నామ సంకీర్తనమొక్కటే శ్రీహరి పాదారవిందముల యొద్దకు మనలను చేర్చగలదు. --- (బోధాయన సంహిత)


రాజేంద్రా! సాంఖ్య, యోగ శాస్త్రములతో నీకు పని ఏమున్నది? నీకు ముక్తి కావలయునేని గోవిందనామ కీర్తనము చేయుము--- (గరుడ పురాణము)


 *హరేకృష్ణ హరేకృష్ణ* 

   *కృష్ణకృష్ణ హరేహరే** 


 *హరేరామ హరేరామ* 

  *రామరామ హరేహరే* 


🍁🍁🍁🍁 #

అరుదైన శిల్ప మరియు వాస్తు శాస్త్ర గ్రంధాలు -

 ప్రాచీన భారత దేశము నందలి రచించబడిన అరుదైన శిల్ప మరియు వాస్తు శాస్త్ర గ్రంధాలు - 


        ఇప్పుడు మీకు వివరించబోవు గ్రంధాల పేర్లు అత్యంత అరుదైనవి. ఇవి ఎక్కడన్నా మీకు దొరికితే వాటిని ఏ మాత్రం విడిచిపెట్టవద్దు. వీటిలో అత్యంత నిగూఢమైన ప్రాచీన భారతీయ విజ్ఞానం దాగి ఉంది. ఇవి మీకు సంస్కృత భాషలో లభ్యం అగును.  


 గ్రంథాల పేర్లు  - 


 * ఆది సారము . 


 * విశాలాక్షము . 


 * తాపదృక్ .


 *  కాశ్యపము  - కాశ్యపుడు. 


 *  నామసంగిల్యము . 


 *  ఆయతత్వము  -  విశ్వకర్మ. 


 *  అంశుమాన బేధ కల్పము  - కశ్యపుడు . 


 *  గౌతమము - గౌతముడు. 


 *  నారాయణశిల్పము  - నారాయణుడు. 


 *  ప్రబోధకము  -  ప్రభోధకుడు. 


 *  భోజమతము  -  భోజుడు. 


 *  మహాసారము  . 


 *  వాసిష్ఠ శిల్పం  -  వసిష్ఠుడు. 


 *  సౌరము  -  సూర్యుడు . 


 *  పరావ చిత్రకము . 


 *  ఉలూక కల్పము . 


 *  కేసరి రాజము . 


 *  కుండ మండ పదర్పణము. 


 *  గార్గేయయాగమము  - గర్గుడు. 


 *  గృహవాస్తు సారము  -  మండవ సూత్రధారుడు 


 *  తారాలక్షణము -  మండవ సూత్రధారుడు . 


 *  దారు సంగ్రహము -  మండవ సూత్రధారుడు . 


 *  నిర్దోష వాస్తు -  మండవ  సూత్రధారుడు  . 


 *  ప్రాసాద మండవము - మండవ సూత్రధారుడు  


 *  ప్రాసాద కల్పము - మండవ సూత్రధారుడు . 


 *  విశ్వేశము . 


 *  వాస్తుబోధము . 


 *  విస్తారకము . 


 *  కల్పశిల్పము . 


 *  సృష్టి శిల్పము . 


 *  మహాతంత్రము . 


 *  చైత్రికము . 


 *  బహుశ్రుతము . 


 *  ఆత్రేయశిల్పము - అత్రి.


 *  అగస్త్య సంహిత  - అగస్త్యుడు.


 *  కార్పార్యము  - కృపుడు. 


 *  ప్రాజాపత్య శిల్పము  -  ప్రజాపతి. 


 *  నారదీయము - నారదుడు. 


 *  భృగుమతము -  భృగువు . 


 *  మహావిశ్వకర్మీయము - విశ్వకర్మ. 


 *  మార్కండేయము  -  మార్కండేయుడు . 


 *  శౌనక శిల్పము  -  శౌనకుడు. 


 *  ఆయాది లక్షణము . 


 *  ఉద్విష్టానయనము . 


 *  కేసరీవాస్తువు . 


 *  కుండ మార్తాండము . 


 *  గోపాసవము .


 *  నగ్నసిద్ధ కల్పము - నగ్నజితుడు. 


 *  బ్రాహ్మ్మేయము  - బ్రహ్మ. 


 *  మనుతంత్రము  -  మనువు. 


 *  మానవిజ్ఞానం  . 


 *  వాల్మీక శిల్పము -  వాల్మీకి . 


 *  సాధక శిల్పము . 


 *  ఇంద్రవరుణి కల్పము . 


 *  కలానిధి  - గోవిందస్థపతి . 


 *  నానావిధ కుండ ప్రకాశము  - నకులశిల్పి. 


 *  ప్రాసాద కర్తనము . 


 *  ప్రాసాద కేసరి . 


 *  విశ్వబోధము  . 


 *  గాంధర్వ విద్య . 


 *  చిత్రశాలము . 


 *  ఛాయాపురుష లక్షణము . 


 *  దైవజ్ఞ శిల్పము -  దైవజ్ఞాచార్యుడు . 


 *  నిర్దోషముక్త వాస్తువు . 


 *  ప్రమాణ మంజరి . 


 *  మల్ల శిల్పము - భానురాజా శ్రితుడు . 


 *  ప్రతిష్టాసారా సంగ్రహము . 


 *  విశ్వసారము . 


 *  విరంత  . 


 *  విశ్వశిల్పము . 


 *  కపిల కాలయూపము - కపిల ఋషి . 


 *  మనోబోధము . 


 *  పాద్మీయ శిల్పము . 


 *  ఔశానస శస్త్ర శిల్పము . 


 *  ఈశాన శిల్పము -  శుక్రాచార్యుడు.


 *  వజ్రశిల్పము . 


 *  విశ్వకర్మీయము - విశ్వకర్మ. 


 *  భానుమతము - భానువు . 


 *  మానసారము  -  మనసార ఋషి . 


 *  సాద్దికము . 


 *  అపరాజిత పృచ్ఛా  -  భువనదేవాచార్యుడు . 


 *  కశ్యప సంహిత ( యంత్ర శిల్పం ) - కశ్యపుడు . 


 *  చిత్రబాహుళ్యము  . 


 *  ప్రబోధ శిల్పము . 


 *  ప్రయోగ శిల్పము . 


 *  భారద్వాజ శిల్పము  - భరద్వాజుడు. 


 *  మానుసారము  - మనువు. 


 *  యమశిల్పము  -  యముడు. 


 *  విశ్వామిత్ర శిల్పము  -  విశ్వామిత్రుడు. 


 *  సింధువు . 


 *  జలార్గళము  - వరాహమిహిరాచార్యుడు . 


 *  కాష్ఠశాల . 


 *  కాష్ఠ సంగ్రహము . 


 *  కుండ ప్రదీపము. 


 *  గద్య చింతామణి . 


 *  చిత్ర లక్ష్మణ . 


 *  జయమధ్వా మానము . 


 *  ధాతుకల్పము . 


 *  నంది ఘనము . 


 *  నల తంత్రము  - నలుడు.


 *  పద్మసంహిత . 


 *  ప్రాసాద లక్ష్మణము . 


 *  పాషాణ విచారము . 


 *  విశ్వధర్మము . 


 *  ఆరుటిక . 


 *  పారాశర్య శిల్పము  -  పరాశరుడు. 


 *  మయాశిల్పము - మయుడు. 


 *  ఐంద్ర మతము - ఇంద్రుడు. 


 *  సౌమము  - సోముడు.


 *  నక్షత్ర కల్పము . 


 *  ప్రయోగ మంజరి. 


 *  ప్రాసాద దీపిక . 


 *  ప్రాసాదాలంకార మాల. 


 *  ప్రాసాద విచారము . 


 *  ప్రాసాద నిర్ణయము . 


 *  భువనదీపిక . 


 *  మానవసూత్రము . 


 *  మూర్తి ధ్యానము -  మండవ సూత్రధారుడు . 


 *  విశ్వకర్మ విద్య.  


 *  విశ్వకర్మ ప్రకాశ


 *  విశ్వకర్మ శిల్పము . 


 *  విశ్వకర్మ రహస్యము . 


 *  విశ్వకర్మ సిద్ధాంతము . 


 *  విశ్వకర్మ సంహిత . 


 *  విశ్వకర్మ వాస్తు . 


 *  విశ్వకర్మాగామము  - విశ్వకర్మ . 


 *  వాస్తు మంజరి. 


 *  అనిరుద్ద శిల్పము  - అనిరుద్ధుడు. 


 *  కాలయూపము . 


 *  కుమారశిల్పము - కుమారస్వామి. 


 *  త్వష్ట్రు తంత్రము  - త్వ ష ట . 


 *  ప్రశుద్ధ శిల్పము . 


 *  పాణి శిల్పము 

  

*  బృహస్పతీయము  - బృహస్పతి. 


 *  లానజ్ఞము  . 


 *  సాకము . 


 *  వాసుదేవ శిల్పము - వాసుదేవుడు 


 *  ఉద్ధార ధోరణి - గోవింద స్థపతి.


 *  కుండతత్వ ప్రదీపము . 


 *  కపింజల సంహిత  - కపింజలుడు. 


 *  గ్రహ పీఠ మాల . 


 *  చిత్రకర్మ శిల్పము . 


 *  తత్వమాల. 


 *  ధ్యానపద్ధతి. 


 *  వాస్తు విచారము . 


 *  వాస్తు సముచ్ఛయము. 


 *  విహార కారిక. 


 *  వాస్తు పద్ధతి. 


 *  వాస్తు శాస్త్రము  - భోజదేవుడు. 


 *  వాస్తు తంత్రము. 


 *  విమానాదిమానము . 


 *  శిల్ప సంహిత  -  కశ్యపుడు. 


 *  శిల్పజ్ఞానము . 


 *  శిల్ప ప్రకాశము . 


 *  శిల్ప సంగ్రహము . 


 *  సనత్కుమార శిల్పము  -  సనత్కుమారుడు. 


 *  సారస్వత శిల్పము . 


 *  జ్ఞానరత్న కోశము . 


 *  తంత్ర సముచ్చయము  - నారయణుడు. 


 *  పాంచరాత్రాగమము .


 *  బృహత్సంహిత  - వరాహమిహిరుడు. 


 *  మయజయము  - మయుడు. 


 *  మయ విద్య ప్రకాశము - మయుడు. 


 *  మయాదీపిక  - మయుడు. 


 *  మయ సంగ్రహము - మయుడు. 


 *  మాన సంగ్రహము . 


 *  వాస్తు మండనము  .


 *  వాస్తు సారము . 


 *  వాస్తు మహత్యము . 


 *  వాస్త్వాధికారము . 


 *  వాస్తు కోశము . 


 *  వాస్తు రత్నావళి. 


 *  వాస్తు ప్రకాశము. 


 *  విశ్వాసారోద్ధారము . 


 *  కళాదీపిక  - అగస్త్యుడు . 


 *  శిల్పసాహిత్యము . 


 *  శిల్ప రత్నాకరం . 


 *  వర్ణ సంగ్రహము.  


 *  శిల్పవతంసం  - గోవిందానందుడు. 


 *  శిల్పశాస్త్ర విఙ్ఞానం. 


 *  శిల్పశాస్త్ర విధి - మయుడు . 


 *  సార  సంహిత . 


 *  సిద్ధాంత శిరోమణి. 


 *  సుప్రభేధ ప్రతిష్టా తంత్రము. 


 *  కామినీ దీప్తము . 


 *  రత్నవన సారము . 


 *  పాద్మ తంత్ర ప్రక్రియ. 


 *  మనశ్శిల్పము . 


 *  మనుసార వాస్తువు . 


 *  యంత్ర చింతామణి. 


 *  రాజ వల్లభము . 


 *  రుద్రయామళ వాస్తు తంత్రము. 


 *  వాస్తు నిర్మాణము. 


 *  వాస్తు శిరోమణి. 


 *  వాస్తు వేధ్య . 


 *  శత్రుఘ్నీయము . 


 *  సాతక సారము . 


 *  సమరాంగణము . 


 *  జ్ఞానప్రకాశ దీపిక . 


 *  భాస్కరీయము  - భాస్కరాచార్యుడు. 


 *  ప్రతిష్టా మంత్రము. 


 *  కుండమండప సిద్ధి. 


 *  మంజుశ్రీ సాధనము. 


 *  యుక్తి కల్పతరువు. 


 *  రూపమండకము . 


 *  వాస్తు చక్రము - వీక్షాచార్యుడు 


 *  వాస్తు శాస్త్రము. 


 *  వాస్తు రాజము  -  రాజసింహ శిల్పి. 


 *  వాస్తు కరణము . 


 *  వాస్తు పురుషము.  


 *  వాస్తు విధి. 


 *  వాస్తు తిలకము. 


 *  వాస్తు శాస్త్రము  - విశ్వకర్మ. 


 *  వ్యధ్యావాసము . 


 *  విశ్వంభర వాస్తువు . 


 *  శిల్పసర్వ సంగ్రహము. 


 *  శిల్పార్ధ సారము . 


 *  క్షీరార్ణవము. 


 *  సూత్రధారము . 


 * సూత్ర సంతానము. 


 *  హేమాద్రి ప్రతిష్టా తంత్రము - హేమాద్రి . 


 *  రత్న పరీక్ష . 


 *  మహా వజ్ర భైరవ తంత్రము. 


 *  ప్రతిమాలక్షణము - నగ్నజిత్తు. 


 *  మూలస్థంభ నిర్ణయము. 


 *  మృత్సంగ్రహము . 


 *  రూపవిధి.  


 *  రాజగృహ నిర్మాణము. 


 *  విశ్వకర్మావతారము. 


 *  లగ్నశుద్ధి. 


 *  వాస్తు లక్షణం. 


 *  వాస్తు సంగ్రహము. 


 *  వాపీ చక్రము . 


 *  వాస్తు ప్రదీపము. 


 *  వాస్తు విద్యావతి. 


 *  వాస్తు భోధము . 


 *  శిల్పసారము. 


 *  విమానవిద్య. 


 *  శిల్ప లేఖ . 


 *  శిల్ప గ్రంధము . 


 *  శిల్పదీపిక . 


 *  శిల్పవిషయము . 


 *  సకలాధికారము. 


 *  సూర్యసిద్ధాంతం. 


 *  గురుదేవ పద్దతి. 


 *  హరి సంహిత . 


 *  శిల్ప తంత్రము  - కుమారి బట్టు . 


 *  సుఖానంద వాస్తువు . 


 *  కౌమార సంహిత . 


 *  హనుమత్కల్పము . 


 *  రూపావతారము. 


 *  గోబిల గృహ్య సూత్రము . 


 *  వాస్తు విధానము  - నారదుడు . 


 *  నారదశిల్పము . 


 *  సమరాంగణ సూత్రధారము  - భోజుడు . 


              పైన చెప్పినటువంటి వాస్తు శాస్త్ర మరియు శిల్పశాస్త్ర గ్రంథాల పేర్లు అత్యంత కష్టసాధ్యముగా సేకరించాను . దీనికి కారణం ఇది చదివినవారిలో కొంతమందైనా అంతరించిపోతున్న మన అపూర్వ గ్రంధాలను కొన్నింటినైనా సేకరించి భద్రపరుస్తారని చిన్న ఆశ. అదేవిధముగా ఆ గ్రంధాలలోని అద్భుతమైన విజ్ఞానాన్ని తరువాతి తరాలకు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 


  

   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

*SRi KRISHNA

 EXCELLENT INFO ABOUT 

*SRi KRISHNA*


1) Krishna was born *5252 years  ago* 

2) Date of *Birth* : *18 th July,3228 B.C*

3) Month : *Shravan*

4) Day :  *Ashtami*

5) Nakshatra : *Rohini*

6) Day : *Wednesday*

7) Time : *00:00 A.M.*

8) Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*

9) Date of *Death* : *18th February 3102BC.*

10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra)* war took place. 

11) He died *36 years after the Kurukshetra* war.

12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi,BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".*  

12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.*

13) Bhishma died on *2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.*

14) Krishna  is worshipped as:

(a)Krishna *Kanhaiyya* : *Mathura*

(b) *Jagannath*:- In *Odisha*

(c) *Vithoba*:- In *Maharashtra*

(d) *Srinath*:  In *Rajasthan*

(e) *Dwarakadheesh*: In *Gujarat*

(f) *Ranchhod*: In *Gujarat*

(g) *Krishna* : *Udipi, Karnataka*

15) *Bilological Father*: *Vasudeva*

16) *Biological Mother*: *Devaki*

17) *Adopted Father*:- *Nanda*

18) *Adopted Mother*: *Yashoda*

19 *Elder Brother*: *Balaram*

20) *Sister*: *Subhadra*

21) *Birth Place*: *Mathura*

22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*

23) Krishna is reported to have *Killed only 4 people* in his life time. 

(i) *Chanoora* ; the Wrestler

(ii) *Kamsa* ; his maternal uncle

(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins. 

24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage. 

25) He was *born dark skinned.* He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; *Kanha*. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.

26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*

27) He stayed in Vrindavan *till 14~16 years*. He killed his own uncle at the age of  14~16 years at Mathura.He then released  his biological mother and father. 

28) He *never returned to Vrindavan ever again.*

29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ;  Kala Yaavana.*

30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*

31) He *rebuilt Dwaraka*. 

32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18. 

33) He had to *fight the pirates from Afrika and rescue his teachers son ;  Punardatta*;  who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat. 

34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga. 

35) Then, he helped his cousins  establish Indraprastha and their Kingdom.


36) He *saved Draupadi from embarrassment.*


37) He *stood by his cousins during their exile.*

38) He stood by them and *made them win the Kurushetra war.*


39) He *saw his cherished city, Dwaraka washed away.* 

40) He was *killed by a hunter (Jara by name)* in nearby forest. 

41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges. 

42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*


43)  He is the *only person, who knew the past and probably future ; yet he lived at that present moment always.*


44) He and his life is truly *an example for every human being.*🌷🙏🏻

నాన్న

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                       *నాన్న!*

                   ➖➖➖✍️


*నాన్న_మన_కోసంఏం_చేశాడో... ఏం_కోల్పోయాడో  మనకు_తెలియదు..!*


*జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి. తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు.*


*నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. ఎందుకంటే.. నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు.*


*అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. *


*నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. *


*బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు. *


*‘ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. *

*పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు.* 


*నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. *


*పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు. *

*మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. *


*చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. వృద్ధాప్యం ఇంకా రాలేదు.. *


*మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. *


*నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు. *


*తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. *


*ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. *

*మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. *

*పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.* 


*ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. *

*ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు.*

*కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా?.. నాన్న కూడా ఏడుస్తాడు. కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు. *


*పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. *

*నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత అనారోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురుచెప్పడం మొదలుపెడతారు. *


*‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. *

*‘నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు. *


*నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. *


*ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. *


*ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి. *


*కొడుకు ఎంత మంచివాడు, ప్రయోజకుడైతే తండ్రిని అంత బాధ పెడతాడు. వాడికి ఎంత సక్సెస్‌ వస్తే.. అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు. ఇది నిజం. *


*మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ నాన్న పుట్టినరోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు. *

*మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. *

*ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..’*✍️


                   🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నారాయణుడు

 👨‍🦰🧔🧓👴👨‍🦱👨‍🦰🧔🧓👴


           _*🧓*నాన్నే నారాయణుడు. సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే దశావదారుడు అవుతాడు.**_🧓


_**పాకడానికి ప్రయత్నించేటప్పుడు "మత్స్యం" అవుతాడు..*_


_**ఆటలాడే సమయానికి "కూర్మం" అవుతాడు..*_


_**కాస్తా పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో "వారాహుడు " అవుతాడు.*_


_**అల్లరి ఎంత చేసిన పైకి మాత్రమే కోపం నటించే "నరసింహుడు " అవుతాడు.*_


_**తాహతు తేలీక అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి "వామనుడు " అవుతాడు.*_


_**వెయ్యి కష్టాలు వచ్చిన అలవోకగా నరుకుంటు వెళ్ళే"భార్గవుడు " అవుతాడు.*_


_**జీవిత విలువల నడక నేర్పే "రాముడు " అవుతాడు.**_


_**జీవన యుద్దపు నడత నేర్పే "కృష్ణుడు "**_


_**చివరికి ఏదేమైనా.. నాన్నే నారాయణుడు!!*_


       _*👨‍🦰*పితృ దేవో భవ.**_👨‍🦰

చిట్టికథ

 ✍️‌...... *నేటి చిట్టికథ* 




అనగా అనగా ఒక నాడు ఒక పట్నం ఎలుక  పల్లెలో ఉన్న తన నేస్తం దగ్గరికి వెళితే పల్లె ఎలుక పట్నం ఎలుకకి మర్యాదలు చేసి భోజనం పెట్టింది. పట్నం ఎలుకకి ఆ తిండి నచ్చలేదు. "మిత్రమా! ఈ పల్లెలో ఏం సుఖం ఉంది? ఇదేమి తిండి? పట్నంలోనైతే పిండి వంటలు తినవచ్చు; దర్జాగా బతకవచ్చు. ఒకసారి రుచి చూస్తే నీకే తెలుస్తుంది- నాతో రారాదూ?" అంది.


సరేనని పల్లెటూరి ఎలుక బయలు దేరి పట్నం వెళ్ళింది. ఆ రోజు ఆ ఇంట్లో విందు. పిండి వంటలన్నీ అందంగా పేర్చి ఉన్నారు. వాటిని చూడగానే పల్లె ఎలుక పొంగి పోయింది.

"మిత్రమా! ఎంత అదృష్టం చేసుకున్నావోగాని, ఇంత చక్కని ఆహారం తింటూ గడిపావు నువ్వు" అని పొగిడింది పట్నం ఎలుకను.


పట్నం ఎలుక దర్జాగా దాన్ని ఆ వంటకాల దగ్గరికి తీసుకెళ్ళింది. అంతలోనే ఎవరో లోనికి వస్తున్న అలికిడి అయ్యింది: "మిత్రమా‌! కలుగులోకి దూరు! ఎవరో వస్తున్నారు!" అంటూ లోనికి పరుగు తీసిందది. పల్లె ఎలుక దాని వెనకనే కలుగులోకి పరుగెత్తింది.

అవి అక్కడి నుండి చూస్తూండగానే ఇద్దరు మనుషులు లోనికి వచ్చి, మెల్లగా భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే మళ్లీ వంటకాల దగ్గరికి చేరాయి ఎలుకలు. ఇంకా దేన్నీ రుచి చూడనే లేదు- మళ్ళీ అలికిడైంది! ఈసారి ఇంకా ఎక్కువ మంది మనుషులు లోనికి వచ్చారు.


వాళ్లంతా తిని వెళ్ళేంత వరకూ ఎలుకలు కలుగులోంచి బయటికి రాలేకపోయాయి. ఆ సరికి వాటికి ఆకలి దహించుకు- పోతున్నది. గది ఖాళీ అయ్యిందో లేదో- రెండూ బయటికి పరుగెత్తాయి- మిగిలిన వంటకాలు తినేందుకు.


అయితే అంతలోనే కుక్కల అరుపులు వినిపించాయి. రెండు ఎలుకలూ కలుగులోకి దూరాల్సి వచ్చింది మళ్ళీ. ఆ తర్వాత అవి బయటికి వచ్చేసరికి, ఇంటివాళ్ల పిల్లి వాటి వెంటపడి, కిలోమీటరు వరకూ తరిమింది!


పల్లె ఎలుకకి ఆకలి దహించుకు-పోతోంది. చివరికి 'ఎలా అయితేనేం' అని, అక్కడే- రోడ్డు ప్రక్కన- ఉన్న చెత్తకుప్పలో భయం భయంగా భోజనం కానిచ్చాయి, రెండు ఎలుకలూ!


అప్పుడు ఇంటి దారి పడుతూ అన్నది పల్లె ఎలుక- "మిత్రమా! భయపడుతూ పాయసం తినేకంటే ప్రశాంతంగా కూర్చొని మాడిన మెతుకులు తినటమే హాయినిస్తుంది నాకు. మీకూ మీ పట్టణ జీవితానికీ ఒక నమస్కారం. నా వరకూ నా పల్లె చాలు"అని.


🍁🍁🍁🍁🍁🍁


అనువుగాని చోట అధికుల మనరాదు

కొంచె ముండు టెల్ల కొదువ గాదు

కొండ అద్దమందు కొంచెమై యుండదా

విశ్వదాభిరామ వినురవేమ.



వీలుకాని చోట గొప్పవాళ్లం అని చెప్పుకోకూడదు. అక్కడ చిన్నతనం వచ్చినా అవమానమయిందని భావించనక్కర్లేదు. పెద్దదైన కొండ అద్దంలో కొంచెం గానే కనిపిస్తుంది గదా..!

మిత్రాయనమః

 *మిత్రాయనమః* 💞


"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /

అనెడి మిత్రుండొకడుండిన చాలు/

వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/

మిత్రాయనమః/(1)


స్నేహితుండులేని జీవితంబు/

తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/

దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/

మిత్రాయనమః!/(2)


"ఔషధంబుకానౌషధౌంబు/

మనంబునకు శాంతినొసంగు/

తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/

మిత్రాయనమః/(3)


"దేశంబులనున్న, దేవళంబుననున్న/

సంతలోననున్న, సభలలోననున్న/

'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/

మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/

మిత్రాయనమః/(4)


"పూర్వజనమ పుణ్యంబున దొరకు/

ఏరాయను బాల్యమిత్రుండు,/

వృద్ధాప్యంబున పలుకరించ/

అమృతము చిలకరించు పలుకు/

అదిలేని జనమంబు దరిద్రమ్ము/

మిత్రాయనమః/(5)॥


"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/

సగము ప్రాణంబులు పోవు/

తీపి గురుతులే మిగులు/

దిగులు చెంద దినంబులు భారంబుగ/

మిత్రాయనమః!"(6).


 మితృలందరికీ అంకితం! 🙏

రుద్రాభిషేకం ఫలితాలు :

 #రుద్రాభిషేకం ఫలితాలు :-

గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.

పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.

చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును.

మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.

మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును.

పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది(మెత్తుట) ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన.

ద్రాక్ష రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.

కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.

నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.

మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.

పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

శ్రీకృష్ణ శతకము*

 *శ్రీకృష్ణ శతకము*


*అనుదినము కృష్ణశతకము*

*వినిన బఠించినను ముక్తి! వేడుకగలుగున్!*

*ధనధాన్యము గో గణములు!*

*తనయులు నభివృద్ధిపొందు! దద్దయు కృష్ణా!*


ఓ కృష్ణా! ప్రతి దినమును ఈ కృష్ణ శతకము వినిన వారికి, చదివినవారికి పరలోకమందు ముక్తియు, ఈ లోకమందు ధన ధాన్య గోగణ పుత్రాభివృద్ధియు విశేషముగా గలుగును.


============================


ఆధ్యాత్మికతను స్వంతం చేసుకుని జీవించే వారి పట్ల మనకు ఆరాధనా భావం కలుగుతుంది. జ్ఞానులు, ప్రవక్తలు మొదలైన మహాత్ములంతా ఈ కోవకు చెందినవారే. వారికీ మనకూ మధ్య తేడా ఏమిటి అనేది గమనిద్దాం.


వారిలో మృదుత్వం, పారదర్శకత్వం అధికంగా ఉంటాయి.


ఒక సాధారణ కిటికీ అద్దాన్ని మనం పట్టించుకోక వదిలివేస్తే అది దుమ్ము ధూళితో కప్పబడి తన పారదర్శకతను కోల్పోతుంది, తిరిగి శుభ్రం చేసినపుడే దాని నుండి వెలుగు ప్రసరితమవుతుంది.


అదే విధంగా మనలో సందేహం, స్వార్థం, దాస్య భావనల ధూళి పేరుకుని ఉన్నది. వాటిని తుడిచి వేయగలిగితే స్వతః సిద్ధమైన ఆత్మస్వరూపం ప్రకాశవంతంగా గోచరమవుతుంది.


ప్రకాశవంతమైన కాంతి ఉనికి సర్వదా మన చుట్టుముట్టి ఉన్నది, దానిని గుర్తించగలగాలి. మనం అంధకారంలో మునిగి ఉండవలసిన ఆవశ్యకత ఏదీ లేదు. ఎందుచేతనంటే ప్రతీ జీవిలోనూ నశించని ఆత్మజ్యోతి ప్రకాశం నిలిచి ఉన్నది.


భగవంతుడు ఆబ్రహ్మకీట పర్యంతం ప్రతీ జీవికి కలుగజేసిన అద్భుత వరం ఇది. ఆ అంతర్జ్యోతి అత్యంత పారదర్శకంగా వెలుగొందుతూ తన ఉనికి ద్వారా ప్రకాశాన్ని విరజిమ్ముతూనే ఉన్నది.


స్వయంప్రకాశితమైన ఆ కాంతిరేఖలను అల్పబుద్ధితో, అహంతో, కోరికల వలయాలతో అడ్డుకుంటూ అడ్డుగోడను మనమే నిర్మించుకుంటున్నాం.

🌼కావ్యసుధ 🌼

మంత్ర సిద్ధి

 మంత్ర సిద్ధి ఎలా కలుగుతుంది....


ఒకప్పుడు ధ్వజదత్తుడు అనే ఒక మహాత్ముడు ఉండేవాడుట. అతడు వేదవేదాంగ పండితుడు. సామాన్యుడు కాదు. పైగా అనేక శాస్త్రములలో నిష్ణాతుడు. ఆయనని ఆధారం చేసుకొని అనేకమంది శిష్యులు విద్యనేర్చుకొనేవారు. విద్య నేర్పేవారు. వచ్చినవాడు నేర్చుకోవడానికి అర్హుడా? లేదా? అనే చూసేవారు గానీ ఇవ్వగలడా లేదా అని చూసేవారు కాదు. గురువుయొక్క లక్షణం విద్యార్థి యొక్క శ్రద్ధ మాత్రమే. కానీ చిత్రమేమిటంటే ఈయనకి పూర్వజన్మ విశేషం చేత ఆర్థికంగా బలం లేదట. ఎవరికి? ధ్వజదత్తుడికి. విద్యంటే కావలసినంత ఉన్నది. పండితునిగా గౌరవమున్నది. కానీ ఆర్థికంగా పుష్టిలేదు. కానీ ఆ ఇల్లాలు ఎంత గొప్ప తల్లి అంటే ఈయన ఎంత తెచ్చాడో అంతే. ఇంటికి సరిపోయినంత ఆదాయం లేకపోయినా ఎక్కడా లేమిని చెప్పేది కాదుట ఆ తల్లి. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన వచ్చేటప్పటికల్లా కావలసిన పదార్థాలుండేవి. తానూ, తన పిల్లలు తినీ తినక ఈయనకి ఈ దరిద్రం కనపడకుండా చూసుకున్నారట. అలా భర్తను గమనించుకున్నారు. చరిత్ర చెప్పేటప్పుడు చాలా గొప్ప విషయం. ఒక సమయంలో విద్యనేర్పుతూ ఎప్పుడూ తనతో పాటు వేదం వల్లె వేసే కుర్రవాడు కనపడకపోయే సరికి ఎక్కడున్నాడురా? అని తను లోపలికి వెళ్తాడు. ఆకలితో ఉన్న పిల్లవాడికి పండు పెడుతూందిట తల్లి. అది చూస్తాడు తండ్రి. ఏమిటి? భోజనం లేదా? పండు పెడుతున్నావు అంటే మాకు భోజనం లేక చాలారోజులైంది. దొరికిన పండు, నీళ్ళే త్రాగుతున్నాం అనగానే కళ్ళనీళ్ళు తిరుగుతాయి. భార్య ఎలా ఉందో, ఏంచేస్తోందో కూడా గమనించకుండా నా విద్య, నా వ్యాపకంలో పడిపోయానే, ఎంత తప్పు చేశాను. నువ్వు మహా పతివ్రతవు. నీలాంటి పతివ్రతను బాధపెడితే నాకు పాపం వస్తుంది అన్నాడు. భార్యాభర్తల అనుబంధం చూడండి. అక్కడ పాతివ్రత్య ధర్మం ఎంత చెప్పాడో ఇక్కడ పతిధర్మం అంత చెప్పాడు. ఆమె ఆవిధంగా గుట్టుగా సంసారం సాగిస్తున్నా ఈయన నిన్ను ఇంత బాధ పెట్టాను అని దుఃఖితుడయ్యాడు. ఇప్పుడు గృహస్థుగా నా బాధ్యత ఒకటుంది. ఇంట్లో దరిద్రం లేకుండా చూడవలసిన బాధ్యత గృహస్థుది. ఇంటి యజమానిగా నాబాధ్యత. అయితే దరిద్రం పోగొట్టుకోవడానికి నాలాంటి వేదవేత్తలకి మార్గములేమిటి? చెప్తాడు. ౧. అధ్యాపనము ౨. దానము ౩. జపము. ఈ మూడింటితో ప్రస్తుతము నేనున్ దుర్దశనుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ దరిద్రం కానీ, సంపద కానీ ఇవాళ ప్రయత్నం వల్ల రాదు. ప్రారబ్ధం బట్టి వస్తూంటాయి. కనుకనే ఇంత పండితుడైనా, ఇంత మంది విద్యార్ధులకి విద్య నేర్పుతున్నా, తన దారిద్ర్యానికి కారణం పూర్వజన్మయొక్క పాపమే. దానినుంచి బయటపడాలి అంటే దానికి అనేక పరిహారాలున్నాయి. ౧. తాను దైన్యాన్ని ఆశ్రయించి కొన్ని యాచించాలి. లేదా మంత్రాన్ని ఆశ్రయించి జపం చేయాలి. అందులో ముఖ్యంగా విప్రుడికి చెప్పిన పెద్ద ఉపాయమేంటంటే "జప్యేనైవతి సిద్ధ్యంతే" - జపం చేతనే ఏదైనా సాధింపజేసుకోవాలి. ఇది ప్రధానం. అందుకు నేను ఈ దరిద్రం నుంచి బయట పడడానికి ఏదైనా మంత్రం గురువును ఆశ్రయించి స్వీకరించి తరించుతాను. అప్పుడు ఆధనాన్ని స్వీకరించి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తాను. మంత్రసిద్ధితో దరిద్రం నుంచి బయటపడాలి అనుకున్నాడు. సరియైన గురువు ఎవరు దొరుకుతారా అని బయలుదేరాడట. అంతమంది మహర్షులకీ ఆశ్రయమైన చోటు  ఒకటుంది - నైమిశారణ్యం. ఆ నైమిశారణ్యంలో పుష్కరుడు అనే మహాత్ముడు ఉన్నాడు.  ఆయన గురించి విని ఆయనను శరణు వేడాడు. స్వామీ! నేను దరిద్రంలో బాధపడుతున్నాను. దీనినుంచి బయటపడే ఉపాయాన్ని నాకు చెప్పు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పుష్కరుడు బాగా ఆలోచన చేసి తనదైన దైవాన్ని ధ్యానిస్తే ఆ దైవం ప్రేరణ ఇచ్చాడట ఇతనికి హనుమన్మంత్రం ఇవ్వు అని. ఎందుకంటే ఆయన హనుమదుపాసకుడు కనుక వెంటనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. దీనిని స్వీకరించి జపం చెయ్యి అని. పైగా ఈయన పండితుడు గదా! అదొచ్చింది బాధ. పాండిత్యం ఉంటే ఒక ప్రమాదం, లేకపోతే మరో ప్రమాదం. పాండిత్యం ఉంటే అహంకారం వస్తుంది.  దానితో ఇచ్చిన గురువును పట్టించుకోకుండా ఇది మంత్రం, అది దైవం. ఆ దైవం మంత్రం ఆయన ఇచ్చాడు అంతే. ఒక వస్తువు ఇచ్చినట్లు మంత్రం ఇచ్చాడు. ఇక గురువును ప్రక్కన పెట్టాడు. 

మంత్రాన్ని మాత్రం జపం చేశాడు చాలా జాగ్రత్తగా. ఈ మంత్రం సిద్ధినిస్తుంది అనే ఆశతో పైగా పండితుడు గదా ఆయనకి తెలుసు మంత్రం అక్షర లక్షలు చేయడం, దశాంశ హోమం చేయడం, దశాంశం తర్పణం చేయడం, దశాంశం అన్నదానం ఇవన్నీ చేశాడు. అలా ఈ మంత్రానికి అనేక పురశ్చరణలు చేశాడట. కానీ మంత్రం సిద్ధించలేదు. పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడైతే సిద్ధి దూరమైందో వెంటనే అనుమానం మొదలైంది. నేనేమిటి? అనేక వేదములు తెలిసినవాడిని. ఆ వేదములలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేయచ్చుగా. ఇక్కడికెందుకు రావాలి? నా ప్రారబ్ధం ఇలా ఉన్నది. వచ్చినప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు. అదేదో హనుమన్మంత్రంట. ఇది అసలు ఆభాస మంత్రమా? అసలు మంత్రమా? ఆలోచిస్తున్నాడు. ఇచ్చిన ఆయనలో లోపమో, మంత్రంలో లోపమో, దేవతలోనో లోపముంది. అందుకు ఈ మంత్రం పండలేదు అనుకున్నాడట. ఇన్ని పురశ్చరణలు చేశాను అని ఒక నైరాశ్యంలో ఉన్నాడు. 

ఆ సమయంలో ఒక దొంగ రోగిష్టియై అటు వస్తున్నాడు. ఎందుకంటే ఒళ్ళు బాగున్నప్పుడు దొంగతనాలు, పాపాలు ఎన్నో చేశాడు. అనారోగ్యం వచ్చిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. ఈ తప్పులనుంచి ఎలా బయటపడతాను? ముందు రోగం నుంచి ఎలా బయటపడతాను? అని కాదు. ఇన్ని పాపాలనుంచీ ఎలా బయటపడతాను అని ఆర్తితో అటు వస్తూ ఉన్నాడు. ఈయన జపం చేసుకుంటూ కనపడ్డాడు (ధ్వజదత్తుడు). ఆయన దగ్గరికి వచ్చాడు ఈ దొంగ. ఆయన పేరు గాలుడు.  ఒక బోయ జాతికి చెందినటువంటి చోరుడితను. ఈయన ఎవరు నువ్వు? అని అడిగాడు.  దాచుకోకుండా విషయాలు చెప్పాడు. నేను తరించడానికి ఈ నైమిశారణ్యంలో ఎందఱో మహాత్ములుంటారు కనుక ఏ మహర్షియైనా ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా అని ఎదురుచూస్తున్నాను అన్నాడు. అయితే ఈయన చెప్పాడు ఏమిటో నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను మంత్రాలూ లేవు, దేవుళ్ళూ లేరు, ఫలించడం అంతకంటే లేదు. ఇదంతా కొంతమంది చేసిన ఒకానొక వంచన మాత్రమే. నిజంగా మంత్రం సిద్ధించాలంటే శాస్త్రంలో చెప్పినట్లు అక్షర లక్షలు ఏమిటి అక్షర కోట్లే చేశాను, పురశ్చరణ హోమాలు ఎన్నో చేశాను. కనుక ఇవన్నీ అబద్ధమే. లేదా ఇవన్నీ అబద్ధం కాకపొతే గురువైనా అబద్ధం అయి ఉండాలి. గురువులో బలం లేదు. అందుకని ఇంకొక్క మాట చెప్తున్నాను నా దగ్గరా పండించుకునే మంత్రములేమీ లేవు,  తేలిపోయింది. గురువులెవరైనా ఉంటారా అంటే ఇక్కడ పుష్కరుడు అని ఉన్నాడు, ఆయన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరైనా తీసుకో అన్నాడు. అతను వంచకుడు. అతని వల్లే నాకాలమంతా వ్యర్తమైంది. అతను ఇచ్చిన ఆభాస మంత్రం పట్టుకొని ఇంతకాలం జపం చేస్తూ పాడయ్యాను, అందుకు ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు  అన్నాడట. ఈ దొంగ ఆయన దగ్గరికే వెళ్ళాడు. చూద్దాంలే కొంతకాలం ఆగు అన్నాడుట. ఈయన చూద్దాంలే అన్నాడు కానీ గాలుడు వదలలేదు. ఆయన కంటి చూపులో పడేటట్లుగా ఆయనకి శుశ్రూష చేయడం మొదలుపెట్టాడట. కావలసినవన్నీ సమకూర్చడం, దణ్ణం పెట్టడం..ఈయన శ్రద్ధను గమనిస్తున్నాడు. అలా కొంతకాలం గమనించాక జాలి కలిగిందిట. ! ఇతనికి ఏ మంత్రం ఇవ్వను? ఏ మంత్రం ఇవ్వాలో నేను నిర్ణయించడం ఏమిటి? నా బుద్ధికి కూడా ప్రేరణ నా దైవము, నా సర్వస్వము అయిన ఆంజనేయస్వామి. అనుకోని ఒక్కసారి హనుమంతుణ్ణి ధ్యానం చేసాడట. స్వామీ! ఇతను ఆర్తిపరుడు. నిజమైన పశ్చాత్తాపం ఇతనియందు ఉన్నది. ఇన్నాళ్ళూ నా కనుసన్నలలోనే మసలుతూ ఉన్నాడు. రోజూ తెల్లవారుఝామున స్నానం చేయడం, పవిత్రంగా ఇక్కడ కూర్చోవడం, ఏదో భగవన్నామం జపం చేసుకుంటూ ఉండడం, పువ్వులు పండ్లు తీసుకు వచ్చి నా యజ్ఞానికి కావలసిన సంబారములు దూరం నుండే సమకూర్చుతూ నియమబద్ధంగా ఉన్నాడు. ఇతనిపై నాకు జాలి కలుగుతోంది. ఏమంత్రం ఇస్తే యితడు సిద్ధి పొందుతాడో చెప్పు అన్నాడు. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు "నా మంత్రములు అనేకములున్నాయి. నా మంత్రానికి అన్ని వర్ణముల వారూ అర్హులే. ప్రతివారూ నామంత్రానికి అర్హులే. అయితే వాడికి నాపై నిష్కపటమైన భక్తి ఉంటే తప్పకుండా మంత్రానికి అర్హుడవుతాడు. కాబట్టి నామంత్రం ఇతనికి ఇవ్వు అని ఆంజనేయస్వామి వారే ఉపదేశించారు. మొత్తానికి నువ్వు భాగ్యవంతుడివయ్యావయ్యా, నీకు మంత్రం ఇమ్మని హనుమంతుడే ఆదేశించాడు అని చెప్పి హనుమన్మంత్రం ఇచ్చాడట. మంత్రం పుచ్చుకుంటూనే శిష్యుడు పరవశించి పోయాడు గురువు కృప లభించింది అని. అయితే ఈ మంత్రం ఇచ్చేముందు ఒక పధ్ధతి చెప్పాడట. ముందు వెళ్ళి నదిలో స్నానం చేసిరా అన్నాడు. నదీ స్నానం కంటే మీ పాద జలం ఇంకా గొప్పది కనుక అది నాపై జల్లండి అన్నాడుట. ఆశ్చర్యపోయాడు గురువు. చెప్పిన ప్రకారంగా కాళ్ళు కడిగిన నీళ్ళు జల్లాడట. ఇదే నాకు సర్వనదీ స్నానము, మంత్రమివ్వు అన్నాడు. గురుభక్తి - అదీ ప్రధానం. అది చూశాడు. ఆమంత్రాన్నివ్వగానే ఎక్కడికి వెళ్ళి చేసుకుంటావు? గురుసన్నిధి కంటే గొప్ప తీర్థం లేదు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడుట. గురుసేవ చేసుకుంటూ జపమాల తీసుకొని అష్టోత్తర శతం తిప్పగానే హనుమత్ దర్శనం అయింది మహానుభావుడికి. ఆనంద పరవశుడై నమస్కారం చేస్తున్నాడు. హనుమంతుడు నీకేం కావాలి? అని అడిగాడు. నాకేమీ అక్కరలేదు, ఎందుకంటే నాకు గురుకృప లభించింది, నీ కృప లభించింది, ఇంకేం కావాలి నాకు? అన్నాడు. నువ్వు ఆధివ్యాధులతో ఇక్కడికి వచ్చావు. గురుపాదజలం నీమీద పడగానే నీ రోగాలన్నీ పోయాయి. అది తెలుసా నీకు? ఎందుకంటే నిరంతర మంత్రజప పరాయణుడైన గురువు శరీరం మంత్రమయం. అలాంటి పాదాలను కడిగి వచ్చిన నీరు అది మంత్రమయం. అది నీపై పడింది కనుక నువ్వు శుద్ధుడివైపోయావు అప్పుడే. ఎల్లవేళలా నా అనుగ్రహం నీకుంటుంది. నాకింతకంటే వరం ఇంకొకటి అక్కరలేదయ్యా, నువ్వు నాకుంటే చాలు అన్నాడు. ధన్యుదవయ్యావు అన్నాడు. వెంటనే వచ్చి నాకు స్వామి దర్శనమయ్యిందండీ అన్నాడుట. చాలా సంతోషం నాయనా! కానీ మంత్రం సిద్ధించింది అని చెప్పి జపం మానేయకు. ఇది నిరంతరం చేయవలసిందే. మంత్రం జాపకుడికి అహంకారం కూడదు. అది లభించిన దగ్గరి నుంచీ సిద్ధింప జేసుకోవాలి అని తపన ఉండాలి. అందుకు గురుభక్తి చాలా ముఖ్యం. 

"యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ!" ఉపనిషత్తు చెప్తోంది. సాధకుడికి దేవతయందు పరమ భక్తికలిగిఉండాలి.దేవతయందు ఎంత భక్తి ఉందో గురువుయందు అంత భక్తీ ఉండాలి. నీకు మంత్రం సిద్ధించి గనుక ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను. మీ దగ్గర ఉంటే ఇంత అనుగ్రహం లభించినప్పుడు మీ దగ్గరే ఉంటాను అన్నాడు. కాదు, నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి వెళ్ళు. ధర్మ బద్ధములైన భోగములు అనుభవించు. ధర్మబద్ధమైన సంపదని ధర్మకార్యాలకి వినియోగించు. ఇంతవరకూ అధర్మంగా వచ్చి అధర్మంగా సుఖించావు. ఇప్పుడు ధర్మముగా సంపాదించి త్యాగానికి వినియోగించు. ధనాన్ని త్యాగానికి వినియోగించు, స్వార్థానికి వినియోగించకు. తద్వారా నీవు ఆర్జనతో సంపాదించిన పాపములన్నీ పోగొట్టుకొంటావు. ఒకప్పుడు ఆర్జనా దోషం నీదగ్గర ఉంది. ఆర్జన దోషం పోవాలి అంటే త్యాగముతో పోగొట్టుకోవాలి. మంత్రాన్ని ఎప్పుడూ వీడకు. ఇది నా ఆజ్ఞ నువ్వు వెళ్ళు అన్నాడుట. గురుపాదాల దగ్గర ఏడ్చాడట. గురువును విడిచి వెళ్ళవలసి వస్తోందే అని ఏడ్చాడు. కానీ గురువాజ్ఞను శిరసా వహించి  వెళుతూ ఉన్నాడు అరణ్యంలో ధ్వజదత్తుడు ఉన్న చోటునుంచి. దూరంనుంచి ధ్వజదత్తుడు చూసి పిలిచాడట. ఆయనకి దొరకకుండా పరుగెత్తడం మొదలుపెట్టాడు. మిత్రమా ఉండు అని వెనక్కి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు ధ్వజదత్తుడు. ఏంటి అలా పరుగెడుతున్నావు? ఒకప్పుడు దీనుడవై ఇటునుంచి వెళ్లావు. ఇప్పడు చాలా కళకళలాడుతూ ఉన్నావు. ఏం జరిగిందేమిటి? అన్నాడు. నేను నీకు కనపడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే నువ్వు గురునింద చేస్తావు. గురునింద వినకూడదు. అందుకే పారిపోతున్నాను అన్నాడు. ఎందుకంటే ఉత్తమ సాధకుడు ఆత్మస్తుతి, గురునింద ఈరెండూ వినడు. గురునింద వింటే మహాపాపం. నిష్కృతి లేదు. నేను వినకూడదని బయలుదేరాను. పొరపాటున కూడా నువ్వు ఒక్కమాట అనకూడదు. అన్నాడు. ఏంటి అలా అంటున్నావు? నోరు తెరిచి ఎక్కడ తిడతాడో అని భయం గాలునికి. నేను ఈ స్థితి పొందడానికి కారణం నా గురుపాదజలం. అంతేకానీ మంత్ర మహిమ అనలేదు. గురువు వల్ల నాకు హనుమంతుని అనుగ్రహం లభించింది. ఎంత పురశ్చరణ చేశావేంటి? ఎన్ని కోట్లు చేశావేం? అన్నాడు. కోట్లు తెలియవు. ఒక మాల త్రిప్పాను అన్నాడు. వెంటనే ఆశ్చర్యచకితుడై పోయాడు ధ్వజదత్తుడు. అంత పొగరు ఇప్పుడు దిగింది. అంత పురశ్చరణ చేశా, ఇన్ని హోమాలు చేశా, ఇన్ని చేశా ఏమైంది నాకు? ఏమీ లేదే! అని దుఃఖితుడయ్యాడు. ఎవరింతకీ గురువు? అన్నాడు. ఎవరేమిటి? పుష్కర స్వామే నా గురువు అన్నాడు. వెంటనే ఏడుపు వచ్చింది. ఛీ ఏమిటి ఈ పాండిత్యం? ఏమిటి ఈ అహంకారం? అని అహంకార రహితమైన వైరాగ్యం కలిగి పుష్కర స్వామి వద్దకు వెళ్ళి కాళ్ళమీద పడి ఏడ్చాడు. లేలే మంత్రం పండిందా? అని అడిగాడట స్వామి. స్వామీ! ముందు గురుభక్తి పండకపోతే మంత్రం కూడా పండదు అని బుద్ధి ఇప్పుడు వచ్చింది అన్నాడు. అందుకు గురుభక్తి లేనివాడికి ఎన్ని మంత్రములు చేసినా ప్రయోజనం లేదు. అందుకు నీ కృప కావాలి నాకు. అప్పడు ధ్వజదత్తుడు ధ్యానంలో చెప్పాడు. నీకు గురువుయందు శ్రద్ధ లేకపోవడం వల్లనే మంత్రం పండలేదు అని హనుమంతుడు చెప్పిన మాట. మంత్రము ఇచ్చినప్పుడు ఆ మంత్ర దేవత గురుమూర్తిగా అనుగ్రహిస్తోంది. గురువే ఆ మంత్రముయొక్క దేవత అని ముందు తెలుసుకోవాలి. అని చెప్పి ఒక్కసారి ధ్యానం చేసి ఒక్కమాట చెప్తున్నాడు. 

"మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భిషజే గురౌ యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ" - స్వయంగా పుష్కరుడు చెప్పిన మాట. మంత్రమునందు, తీర్థమునందు, ద్విజునియందు, దైవముయందు, దైవజ్ఞునియందు, ఔషధమునందు, గురువుయందు, నీకు ఎలాంటి భావన ఉంటే సిద్ధి అలా ఉంటుంది. అది చాలా ముఖ్యమైన అంశం. మనం చేస్తూ అంత చేశాను కానీ నిజమేనా అని డౌట్ పడితే అసలు జరుగదు. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అనే మాట ఇక్కడ మనం తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యములయందు విశ్వాసం, మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భిషజే గురౌ యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ -ఇదీ తెలుసుకోవలసినటువంటి అంశం.ఆ విధంగా ఆశ్రయించు అంటే ఇంక గురువును వదలకుండా మంత్రజపం చేసి సిద్ధి పొందాడు ధ్వజదత్తుడు అనే కథ పరాశరసంహితలో చెప్పబడినటువంటిది...........బ్రహ్మశ్రీ సామవేదం గారు...

God






























 

Devalayam


 

ఆరోగ్యసూత్ర౦

 *కార్డియాలజిస్ట్  చెప్పిన ఆరోగ్యసూత్ర౦ – బాగా నీళ్ళు త్రాగ౦డి*


రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు?  


కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్లుతాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్రవిసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా!


అసలు - రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది?


ఒక కార్డియాలజిస్ట్ (గుండె వైద్యుడు) ఏమి చెప్పాడంటే - 


మీరు నిటారుగా నిలబడినప్పుడు సాధారణంగా కాళ్ళలో వాపు ఉంటుంది (ముఖ్య౦గా మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ) ఎందుకంటే గురుత్వాకర్షణ వల్ల మీ క్రి౦ది భాగాలులో, ముఖ్య౦గా కాళ్ళలో ఎక్కువ నీళ్ళు నిలువు౦టాయి. 


అదే, మీరు పడుకుంటే మీ దిగువ శరీరం (ట్రంక్, కాళ్ళు మొదలైనవి) మీ మూత్రపిండాలతో సమంగా ఒకే ఎత్తులో ఉంటు౦ది కనుక, మూత్రపిండాలు ఎక్కువ నీటిని తొలగి౦చేదానికి సులభంగా ఉ౦టు౦ది.


మూత్రంద్వారానే మన రక్తంలోని మలినాలు,విషపదార్ధాలు విసర్జింపబడతాయి.


అటువ౦టప్పుడు నీళ్ళు త్రాగడానికి సరైన సమయం ఏమిటి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.


*హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు*


1. ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ - అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది


2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - జీర్ణక్రియకు సహాయపడుతుంది


3. స్నానం చేయడానికి ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది (తెలుసుకోవడం మంచిది!)


4. రాత్రి పడుకునే ముందు ఒక (1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦ - స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్చు (తెలుసుకోవడం చాలా చాలా మంచిది!)


5. అదనంగా, రాత్రి మధ్యలో నీరు త్రాగడ౦ రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.


6. కాలు కండరాలు సంకోచించడ౦ (కొ౦కర్లు) చార్లీ హార్స్ (Charley Horse) లేక దూడ తిమ్మిరి అనే రోగ౦ మన శరీర౦లో నీటి శాత౦ తక్కువయినపుడు వస్తు౦ది. రోజ౦తా సరిగా నీళ్ళు తాగడ౦ వల్ల ఈ రోగ౦ రాదు.


ఒక కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి ఈ సందేశాన్ని పంపి౦చగలిగితే, కనీసం ఆ పది మ౦దిలో 1 ప్రాణాన్ని కాపాడుకోగలుగుతా౦.”

శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


18 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


నాగేశ్వర జ్యోతిర్లింగము

యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై

సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!

సద్భక్తిని, ముక్తిని రెండింటిని ఈయగాలిగిన నాగనాథునికి నమస్కరించుచున్నాను. ఇక్కడ నాగ నాథుడు అంటే విశేషమయిన పూజనీయుడు అని అర్థం. అటువంటి నాగనాథునికి నేను శరణాగతి చేయుచున్నాను. ఈ నాగనాథ లింగము ఎందులకు వచ్చింది? దీని ఆవిర్భావమునకు వెనకాతల ఉండే కారణం ఏమిటి? ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలనం చేయాలి. శివారాధన రాక్షసులు చేస్తారు, ప్రమథగణములు చేస్తారు, మహాభక్తులు చేస్తారు, భూతప్రేతాది గణములు చేస్తాయి. శివారాధనమును జ్ఞానమును ఐశ్వర్యమును అపేక్షించేటటువంటి వారు చేస్తారు. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు.

దారుకుడు, దారుకి వీరిద్దరూ రాక్షస దంపతులు. వారికి బోలెడంత సంతానం ఉంది. వాళ్ళు ఒకనాడు ఒక సముద్రతీరమునకు చేరారు. వీరు చాలామందిని హింసించారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలని బాధపెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. అపుడు ఆ భక్తులు ఔర్వుడు అనే మహర్షి పాదములు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔర్వుడు గొప్ప తపశ్శక్తి కలవాడు. ‘వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే ఫరవాలేదు. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడయినా రాక్షస ప్రవృత్తి కలిగినవాడు ఉన్నట్లయితే వారు ఉత్తరక్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం’ అని ఔర్వుడు అభయం ఇచ్చాడు. తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రం అయి కూర్చుంటుంది. ఈవార్త రాక్షసులకు తెలిసింది వాళ్లకి తాము బ్రతకడం ఎలా అనే బెంగపట్టుకుంది. అపుడు దారుకి ‘నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాడు. అపుడు శాంభవి నాకు ప్రక్షమయి ఒక గొప్ప వరం ఇచ్చింది. దాని వలన నేను నా వారిని ఎక్కడయినా పెట్టి బ్రతికించగలను. ఔర్వుడు మనలను భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. అందుకని మనందరం సముద్రం మీద ఉందాము. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్నందరిని నేను రక్షిస్తాను. పదండి’ అంది. దారుకి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.

అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతున్న వారిలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. సుప్రియుడికి దాసదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక్కడినీ తీసుకు వెళ్లి కారాగారంలో పెట్టారు. అపుడు ఆయన ఇవన్నీ ఉండడం, పోవడం ఈశ్వరేచ్ఛ. నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేస్తే ఒక చిన్న శివలింగం అయింది. దానిమీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేశాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. అపురూ రాక్షసులు ఆరాధనకు అడ్డుపడ్డారు. నువ్వు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివున్ని ఆరాధన చేసినా, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రం నాకు కలిగినా నీ శిరస్సు త్రుంచేస్తాను అన్నారు. అంటే ఆయన అన్నాడు – ‘నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచబడుతుంది. త్రుంచకలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదములు పట్టుకున్నాను అన్నాడు. అపుడు వెంటనే రాక్షసుడు కత్తినొకదానిని తీసుకుని అపారమయిన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠమును నరికేయ్యబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమ భక్తితో శరణాగతి చేస్తున్నాడు. రెండు చేతులతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుడిని దెబ్బకొట్టడం వాడు పారిపోవడం ఆయన ఉగ్రమయిన దృష్టికి కొన్ని వందలమంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రమేమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్థభాగమందు పార్వతీదేవి ఉంది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుని తనవారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకు అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకు వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఎమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. మీరు నామీద ప్రేమతో ఆమెయందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి’ అంది.

వెంటనే శివుడు శంకరుడు అయిపోయాడు. ఒక నవ్వు నవ్వి ‘పార్వతీ నిజమే. ఆవిడకి నీవు వరం ఇచ్చావు. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు మరల దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెడతారు. కాబట్టి వీళ్ళు మరల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగరూపంలో కూర్చుంటాను. నీవు కూడా నీవలన బతుకున్నామని వాళ్లకి గుర్తు ఉండడానికి అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. నేను నాగనాథుడు అనే పేరుతో వేలుస్తున్నాను. ఈశ్వరీ, నువ్వు నాగేశ్వరీ అనే పేరుతో వెలవవలసింది’ అన్నాడు. ఆవిధంగా ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లిన్గమై వెలిశారు.

ఎవరయినా వారి దర్శనం చేస్తే వారికి జన్మ జన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల యందు చెక్కుచెదరని భక్తి ప్రపత్తులు కలిగేలా అనుగ్రహిస్తాను అని స్వామి శపథం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలసి ఉన్నాడు. కాబట్టి మనం నాగ నాథ క్షేత్రమునకు తప్పకుండా వెళ్ళాలి. మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తములవలన రాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసన భక్తియందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహమును తన దర్శనమాత్రం చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు.

పూర్వం పెద్దలు మనలను తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసేముందు వెడుతున్న ఆ క్షేత్రం వైశిష్ట్యం తెలియాలి. తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్లినపుడు వాటిని గురించి తెలుసుకుని ఆయా క్షేత్రములలో ఏ శ్లోకమును చెప్పాలో ఆ శ్లోకమును చెప్పి ఏది మీరు భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగానీ వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మీరు చేసి వస్తుండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వరశక్తియందు అదికూడా ఉంటుంది.


🙏🙏🙏

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


ఉద్యోగపర్వం.147


పాండవసేన యుద్ధానికి బయలుదేరుతున్నది.


తూర్పున సూర్యకిరణాలు పైపైకి వస్తున్న తరుణంలో, క్రమశిక్షణా పూర్వక కవాతుతో,  రధాలు, ఏనుగులు, గుర్రాలు   ప్రత్యేక సమూహాలుగా, రెట్టించిన సమరోత్సాహంతో, శంఖనాద, దుందుభీ శబ్దఘోషతో, చతురంగబలాలు సముద్ర కెరటాలు  వువ్వెత్తున పడుతున్నట్లు, పాండవసేన, కురుక్షేత్రం వైపు దూసుకువెళ్తున్నది.   సేనకు ముందు భీమసేనుడు, నకులసహదేవులు వుండి, సేనను వుత్సాహపరుస్తూ వుండగా, వారి వెనుక, ఉపపాండవులు, ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు వున్నారు.  మార్గ ఆయాసం తెలియకుండా, సైనికులు విన్యాసాలు చేస్తూ, దారి పొడవునా, తమకు జేజేలు పలుకుతున్న ప్రజలకు కనువిందు చేసారు.  సేనావాహిని మధ్యలో యుధిష్టురుడు , ఇంద్రసమానుడై వెలిగిపోతున్నాడు.  


సైన్యం ముందునడుస్తూ వుండగా, వారికి కావలసిన ఆహార పదార్ధాలు, గుడారాలు, వైద్య బృందం వారిని వెన్నంటి వున్నాయి, ఎప్పుడు యే అవసరం వచ్చినా చిటికెలో సమకూర్చేందుకు. సేనకు కుడిప్రక్కగా, కృష్ణార్జునులు, కదులుతుండగా వారితో సాత్యకి, మొదలైన యోధులు వున్నారు.   ఉపప్లావ్యంలో ద్రౌపదిని వుంచి ఆమెకు రక్షణగా కొందరు వీరులను వుంచారు.   ఆ విధంగా, పాండవసేన, 40000 రధాలతో, రెండు లక్షల గుర్రాలతో, ఇరవైలక్షల కాల్బలంతో, 60000 ఏనుగులతో, కురుక్షేత్రం జేరింది.  కురుక్షేత్రంలో ప్రవేశించగానే, తమరాకను తెలియజేస్తూ, అర్జునుడు దేవదత్తాన్ని, శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, మిగిలినయోధులందరూ వారి వారి శంఖాలను పూరించి  తమసేనలో మరియొకసారి, ఉత్సాహాన్ని నింపారు. 


దుర్యోధనుడు  కూడా, తన పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని పదకొండు భాగాలుగా విభజించాడు.  సునిశిత బుద్ధిగలిగి పరాక్రమవంతులైన  కృపుడు, ద్రోణుడు, శల్యుడు, జయధ్రదుడు, కాంభోజరాజు, కృతవర్మ, అశ్వద్ధామ, కర్ణుడు, భూరిశ్రవసుడు, శకుని, బాహ్లికుడు,  వీరిని ఒక్కొక్క భాగానికి సేనాపతులుగా ఉంచాడు.   ఆపై అందరికీ  చేతులు జోడించి వినమ్రంగా అభివాదం చేసి, భీష్ముని వుద్దేశించి,  ' పితామహా !  ఈ సైన్యానికి సేనాధ్యక్ష స్థానంలో నిలువమని మిమ్ములను ప్రార్ధిస్తున్నాను.  సేన చిందర వందర అవకుండా తగిన సమయంలో మీ మార్గదర్శకత్వంలో సేనను నడిపించండి.  ఇంద్రుడు దేవతాసైన్యాన్ని నడిపించినట్లు, మీరు మన కౌరవసేనను విజయపధంలో నడపవలసినదిగా కోరుతున్నాను.  ' అన్నాడు.   


భీష్ముడు సమాధానమిస్తూ, ' దుర్యోధనా !  నాకు కురుపాండవులిరువురూ సమానమే.  నీ వద్దవుండి, జీవితం వెళ్లబుచ్చుతున్నాను కాబట్టి, నేను నీపక్షాన నిలబడి పాండవులపై, పోరుకు సిద్ధమయ్యాను.  నన్ను యెదుర్కొనగల పరాక్రమవంతుడు యుద్ధభూమిలో,  అర్జునుడు ఒక్కడే.  అతడు సాధ్యమైనంతవరకు, నాకు యెదురుబడి యుద్ధం చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు.  మిగిలిన నలుగురు పాండుసుతులనూ నేను చంపను.  ఆ అయిదుగురను తప్ప, మిగిలినవారిని ఒకే బాణంతో పదివేలమందిని మట్టి కరిపించగలను. '


' దుర్యోధనా !  నేను సర్వసైన్యాధక్షునిగా చేపట్టబోయే ముందు  యింకొక నియమము వున్నది.  యుద్ధభూమిలో ముందు కర్ణునినైనా ప్రవేశించమను, లేదా నేను ముందు ప్రవేశిస్తాను.  కర్ణునికి నాపై వైషమ్యమున్నది.  నేను చేసే ప్రతిపనినీ విమర్శగా చూసి, వాదానికి సిద్ధమౌతాడు. అది నేను సహించను. '  అన్నాడు.   ఆమాటలకు, కర్ణుడు కూడా దీటుగా స్పందిస్తూ, ' మిత్రమా ! గాంగేయుని నిష్క్రమణ తరువాతే, యీ రాధేయుడు యుద్ధరంగంలోనికి వస్తాడు. అర్జునునికి పోటీ యిస్తాడు. '  అని అక్కడ నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు.  ఎటూ చెప్పలేని సందిగ్ధంలో, భీష్మ పితామహుని, దుర్యోధనుడు సర్వసేనాపతిగా అభిషిక్తుడిని చేసాడు.  


ఆవిధంగా ధృష్టద్యుమ్నుని సర్వసేనాపతిగా పాండవసేన, భీష్మాచార్యులు సర్వ సేనాధ్యక్షునిగా కౌరవసేన యుద్ధ సన్నాహాలకు అంకురార్పణ చేసాయి.   జరుగుతున్న యుద్ధ సన్నాహాలను తటస్థంగా వుండి వీక్షించడానికి, బలరాముడు  తన అనుచర గణమైన అక్రూరుడు, సాంబుడు, ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు వెంటరాగా, ధర్మజుని వద్దకు వచ్చాడు.  కృషునితో సహా అందరూ లేచినిలబడి ఆయనకు వందనాలు సమర్పించారు.  ' ధర్మజా !  భయంకర సంగ్రామం జరగబోతున్నది.  ఇది దైవనిర్ణయం. అనేక జననష్టము, క్షత్రియ కులవినాశమూ తప్పేటట్లు లేదు.  నా తమ్ముడిని నావలె, యిరుపక్షాలతో సమభావం ప్రదర్శించమని చెప్పాను.  అయినా, ధర్మం మీ పక్షాన వున్నదని, మీతో  శ్రీకృష్ణుడు చేతులు కలిపాడు.  దుర్యోధనుని కోరికమేరకు యాదవ సైన్యాన్ని కౌరవసేనలో కలిపాడు.  ధర్మజా !  జయం మీవైపే ఉన్నట్లు నాకు తోస్తున్నది.  కురువంశ నాశనం నా కళ్లెదుట చూడలేక నేను తీర్థయాత్రలకు వెళ్ళ నిశ్చయించు కున్నాను. స్వస్తి. ' అని చెప్పి బలరాముడు ధర్మరాజును దీవించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు.  


తరువాత, భోజదేశ మహారాజు, రుక్మిణి  సోదరుడు,  రుక్మి,  ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చి పాండవులకు మద్దతు పలికాడు.  అతి విలువైన మూడు ధనుస్సులలో ఒకటి శార్గవము కృష్ణుని వద్ద వుండగా, గాండీవం రెండవది అర్జునుని వద్ద వున్నది.  మూడవది అయిన ఇంద్రుని చాపము విజయం రుక్మి అధీనంలో వున్నది.  ఆ విషయమే, రుక్మి అర్జునితో   ప్రస్తావిస్తూ, అహంభావంతో, తనసహాయం యెప్పుడు కావలసిన అప్పుడు, పిలిస్తే, వచ్చి విజయచాపంతో, యేకౌరవవీరునైనా వధిస్తానని బీరాలు పలికాడు.  అర్జునునికి రుక్మి ప్రేలాపన నచ్చలేదు.  ' రుక్మీ ! నీవు చేస్తానన్న సహాయానికి కృతజ్ఞుడను.  కానీ సహాయం చేయడానికి నీ అక్షౌహిణీ సైన్యంతో రానక్కరలేదు.  మా పక్షాన ధర్మం వున్నది అనుకుంటే, మాతో వుండు, లేదంటే నీ యిష్టము.  నాకు నీసహాయము అక్కరలేదు.' అన్నాడు.'  దానికి రుక్మి కోపించి దుర్యోధనునికి బాసటగా వుందామని వెళ్లి అర్జునుడు తన సహాయం వద్దన్నాడని చెప్పాడు.  ఆమాటలకు దుర్యోధనుడు కూడా ' వారికి అక్కరలేని నీశౌర్యము మాకూ అక్కరలేదు. ' అని పంపించివేసాడు. ఆవిధంగా వేరు వేరు కారణాలవలన,  బలరాముడు, రుక్మీ వీరిద్దరే, కురుక్షేత్ర భయంకర మహాసంగ్రామంలో పాల్గొనలేదు.  


ఇక, కురుక్షేత్రంలో కురుపాండవులు యుద్ధవ్యూహాలు నిర్మించుకుంటుండగా, హస్తినలో ధృతరాష్ట్రుడు,  అక్కడ యేమి మారణహోమం జరుగబోతున్నదో అని తల్లడిల్లుతూ, 'సంజయా ! కురుక్షేత్రంలోజరుగుతున్న విషయాలేమిటో, నీ దివ్యచక్షువుల ద్వారా దర్శించి నాకు యెప్పటికప్పుడు తెలియజేయి. ' అని వేడుకొనగా, సంజయుడు, ' మహారాజా !  యుద్ధంలోఅనేక భయంకర సంఘటనలు జరుగుతూ వుంటాయి.  మీకు అన్నీ నివేదిస్తాము.  మీరు మనసు రాయి చేసుకుని వినండి. '  అని చెప్పడం మొదలు పెట్టాడు అని జనమేజయునకు, వైశంపాయనుడు చెప్పినట్లుగా, శౌనకాది మహామునులకు సూతమహర్షి చెప్పాడు.


'  ధృతరాష్ట్ర మహారాజా !  ఇరుసేనలూ, కురుక్షేత్రంలో శిబిరాలు యేర్పరచుకున్న తరువాత,  అకారణంగా కేవలం పాండవులను రెచ్చగొట్టాలనే భావనతో దుర్యోధనుడు , శకుని కుమారుడైన ఉలూకుని రాయబారిగా,  సంధినిమిత్తం కాకుండా,  పాండుసేనలో వున్న వీరులందరినీ పరుషవాక్యాలతో దుర్యోధనుడు దూషిస్తూ  తనమాటలుగా, కర్ణ కఠోరమైన పదజాలంతో, నీచాతినీచమైన పదాలతో యెంతో హేళనగా, పాండు నందనులు అయిదుగురినీ, ద్రౌపదిని, శ్రీకృష్ణుని, ద్రుపదుని, దుష్టద్యుమ్నుని, శిఖండిని, అందరినీ పేరుపేరునా అవమానకరంగా దూషించి అవేపలుకులు మార్పు లేకుండా వారికి చెప్పమని ఉలూకుని పంపించాడు.  ధర్మరాజుని వృద్ధ కపట మార్జాలంతో పోల్చాడు.  అందరూ నపుంసకులన్నాడు.  హద్దూ ఆపూ లేకుండా విశృంఖల పద ప్రయోగంతో యెగతాళి చేసాడు, దుర్యోధనుడు.  చేతనైతే, పాండవులు పురుషజన్మ యెత్తిన వారైతే, తమని యుద్ధంలో చంపమని సందేశం పంపించాడు, ఉలూకునితో.


దుర్యోధనుడు వూహించినట్లే పాండవులు కూడా అతని మాటలకు రెచ్చిపోయారు.  అయినా దూతగా వచ్చినవానితో మాట్లాడి లాభమేమున్నదని చివరకు నిర్ణయించుకుని, అర్జునుడు '  ఓయీ ఉలూకా !  దుర్యోధనుని ప్రసంగమంతా తు. చ. తప్పక నీవు చెప్పినదంతా సావధానంగా విన్నామని చెప్పు.  దీని సమాధానం అతని కోరిక మేరకు మేము యుద్ధభూమిలోనే చెబుతామని చెప్పు.  నీవు ఇంక బయలుదేరవచ్చు. ' అని మాత్రం అన్నాడు.


వెళ్ళిపోతున్న ఉలూకుని, అర్జునుడు మళ్ళీ చెయ్యి పట్టుకుని దగ్గరగా లాగుకొని, ' మీ ప్రభువు దుర్యోధనుడు పురుషత్వాన్ని గురించి పదేపదే నీద్వారా చెప్పించాడు కదా !  స్వశక్తిపై ఆధారపడి శత్రువులను జయించేవాడే, క్షత్రియపురుషుడని చెప్పు. ఇతరుల బలంపై ఆధారపడి జననష్టం కలుగజేసేవాడు, అధమ క్షత్రియుడని కూడా చెప్పు, మీ ప్రభువుకు.  మా అన్నగారు భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞలు మాకందరికీ జ్ఞాపకం వున్నాయని చెప్పు. బహుశా అతడే మర్చిపోయి వుంటాడు. ' అని అన్నాడు.  భీమసేనుడు కూడా వుద్రేకపూరితంగా మళ్ళీ మాట్లాడబోతుండగా, ' ధర్మరాజు ఉలూకుని తొందరపెట్టి బయలుదేరదీసాడు. 


దుర్యోధనుని తెంపరితనానికీ, అతడి వాచాలత్వానికీ, ఉలూకరాయబారం ఒక చక్కని ఉదాహరణ.  ఇరువర్గాలు యుద్ధసన్నాహాలలో రణరంగాన్ని చేరినవేళ, ఉలూకుని చే పంపిన రాయబార సందేశం ప్రత్యేకంగా యేమీలేదు. అందరినీ నిర్లజ్జగా అవహేళనగా తూలనాడి, యుద్ధభూమిలో తమని చంపమని పంపిన అభ్యర్ధన తప్ప.


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

అజామిళోపాఖ్యానము--1**

 **దశిక రాము**


**భాగవతం 6వ స్కందము ఖండము-3**


**అజామిళోపాఖ్యానము--1**


రాజా! విను. కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పాపాత్ముడు, దరిద్రుడు, నింద్యచరిత్రుడు, సదాచారాలను విడిచినవాడు, నికృష్ట జీవనుడు, జూదాలను వివాదాలను, దొంగతనాలను ఇష్టపడేవాడు. యౌవనపు మత్తులో ఒక దాసిని భార్యగా చేసికొని, పదిమంది కొడుకులను కన్నాడు. సంసార వ్యామోహమనే సముద్రంలో మునిగి పిల్లల లాలన పాలనలో గడుపుతూ చాలాకాలం సుఖాలు అనుభవించి వృద్ధుడయ్యాడు.

మనస్సు ఎప్పటికైనా నిర్మల మౌతుందన్నట్లుగా అజామిళుని నల్లని వెండ్రుకలు తెల్లబడ్డాయి. మోహబంధాలు జారిపోతాయన్నట్లుగా అవయవాలు పట్టుదప్పి వ్రేలాడాయి. ఇంద్రియ వాంఛలు ఇక వద్దు అన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. మోహం వయస్సుతో పాటు తగ్గిపోయినట్లుగా కంటిచూపు తగ్గిపోయింది. నోటి రుచి తగ్గింది. దంతాలు ఊడిపోయాయి. ఆయాసం, దగ్గు ఎక్కువయ్యాయి. తలనొప్పి మొదలయింది. మనస్సు చెదరిపోయింది. ముసలితనం వచ్చింది. అజామిళుడు ఎనబై ఎనిమిదేండ్లు నిండాయి. కాని భ్రాంతి వీడలేదు. నారాయణ అన్న పేరున్న తన చిన్నకొడుకంటే అతనికి ఎక్కువ ఇష్టం. రాజా! పుత్రవాత్సల్యం ఆత్మలో పొంగి పొరలగా అజామిళుడు, అతని భార్య ఆ కొడుకును సదా ముద్దుచేస్తూ ఉండేవారు. ముద్దు మాటలు మాట్లాడుతూ చక్కని ఫాలభాగం కలిగి, తన తండ్రి బంధువుల పోలికలతో ప్రకాశించే ఆ బాలుని చూచి ఆ దుష్ట బ్రాహ్మణుడు సంతోషిస్తూ...ఎక్కువగా ఆ బాలునితోనే త్రాగుతూ, తింటూ అతనితో ఆటలాడుతూ అజామిళుడు రానున్న మృత్యువును తెలుసుకొనలేకపోయాడు.ఈ విధంగా రానున్న చావును తెలిసికొనకుండా గడుపుతుండగా భయంకరమైన మరణకాలం వచ్చింది. ఆ సమయంలో అతడు తన కుమారుని తలచుకొని ప్రేమాతిశయంతో “నారాయణా!” అని పలవరించాడు.ఆ సమయంలో..

.అత్యంత పాపాత్ములను బాదించేవారు, సకలలోకాలకు భయంకరులు అయిన యమకింకరులను ఆ అజామిళుడు గుండెలు చెదరిపోగా చూశాడు.పాపులను చంపేవాళ్ళు, వారిని దండించేవాళ్ళు, దయమాలి భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు అయిన యమదూతలను దూరంగా చూశాడు..తన అంత్యకాలంలో ఆ బ్రాహ్మణుడు ముగ్గురు యమదూతలను చూశాడు. వాళ్ళు పట్టుదలతో కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. లావుపాటి పెదాలతో, వికారమైన ముఖాలతో, క్రూరమైన చూపులతో ముందుకు దూకుతున్నారు. వాళ్ళు చూడ భయంకరంగా ఉన్నారు. చేతుల్లో భయంకరంగా ఉన్న పాశాలు, కత్తులు సిద్ధంగా ఎత్తి పట్టుకొని ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ విధంగా మిక్కిలి వికారాలైన ముక్కులు, బలిసిన బుగ్గలు, వికృతంగా తిరుగుతున్న మిడిగ్రుడ్లు, కండలు తిరిగిన కర్కశ దేహాలు, నిక్కపొడుచుకున్న రోమాలు కలిగిన యమకింకరులు అజామిళునికి కనిపించారు. వారి చేతులలో ప్రాణుల ప్రాణాలను బలవంతంగా అపహరించే భయంకరమైన కాలపాశాలు ఉన్నాయి. అటువంటి యమభటులను చూడగానే అజామిళుని ఇంద్రియాలు పట్టు తప్పాయి. ప్రాణాలు కంపించాయి. నిలువుగ్రుడ్లు పడ్డాయి. ఆత్మ గిలగిల లాడింది. దూరంగా ఆడుకుంటున్న కుమారుడు అతని హృదయసీమలో గోచరించగా “ఓ నారాయణా! నారాయణా! నారాయణా!” అంటూ కొడుకును పిలిచాడు.అజామిళుడు మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తుండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న విష్ణుదూతలు తమ ప్రభువు నామాన్ని విని వేగంగా అక్కడికి వచ్చారు. వికృత వేషాలతో అధికరోషంతో పెద్దగా కేకలు వేస్తున్న యమకింకరులను అదల్చారు. దాసీ భర్త అయిన ఆ బ్రాహ్మణుని శరీరం నుండి ప్రాణాలను బయటికి గుంజుతున్న యమభటులను విష్ణుదూతలు బలవంతంగా త్రోసి పడవేశారు. ఈ విధంగా తమ ప్రయత్నం విఫలం కాగా యమదూతలు ఇలా అన్నారు. మీరెవ్వరి దూతలు? మాతో కలహించడానికి కారణం ఏమిటి? ఇలా మా చేతికి చిక్కినవాణ్ణి మీరు బలవంతంగా విడిపించారు. ప్రపంచంలో యముని శాసనాలు ఇక నవ్వులాటకా?

మీరెవ్వరి దూతలు? మాతో కలహించడానికి కారణం ఏమిటి? ఇలా మా చేతికి చిక్కినవాణ్ణి మీరు బలవంతంగా విడిపించారు. ప్రపంచంలో యముని శాసనాలు ఇక నవ్వులాటకా? 

అయ్యా! మీరెవ్వరు? మీ శుభకరమైన రూపాలు మా కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మీరు నింగిలోని వారా? నేలమీది వారా? దేవతా శ్రేష్ఠులా? సిద్ధులా? సాధ్యులా? వికసించిన తెల్ల తామర రేకుల వంటి విశాల నేత్రాలు కలవారు, శ్రేష్ఠమైన పసుపుపచ్చని పట్టువస్త్రాలను ధరించినవారు, చెక్కిళ్ళపై నాట్యమాడే కుండలాలు ధరించినవారు, మిక్కిలి సుకుమారమైన యౌవన ప్రాయంలో ఉన్నవారు, రత్న ఖచితాలైన భుజకీర్తులతో విరాజిల్లే నాలుగు భుజాలు కలిగినవారు, నీలమేఘాల వంటి దేహచ్ఛాయలు కలవారు అయిన మీరెవ్వరు? ధనుస్సులు, అమ్ముల పొదులు, పద్మం, శంఖం, చక్రం, ఖడ్గం, గద మొదలైన ఆయుధాలను ధరించిన మీ స్వరూపాలు లోకాలకు ఆశ్చర్యాని గొల్పుతున్నాయి. శాంతంతో కూడిన మీ శరీర కాంతులు లోకమంతా నిండి దిగంతాలకు వ్యాపించే కారు చీకటులను పారద్రోలుతూ సంతోషాన్ని 

కలిగిస్తున్నాయి. ఈ విధంగా లోకాలన్నింటికి ఆనందాన్ని కలిగించే సుందర విగ్రహాలు కలవారు, చూడడానికి సాధ్యం కాని తేజస్సుతో విరాజిల్లుతున్నవారు, సర్వధర్మాలను పాలించేవారు అయిన మీరు మమ్మల్ని అడ్డగించడానికి కారణమేమిటి?” అని యమదూతలు పలుకగా చిరునవ్వులతో వికసించిన ముఖపద్మాలు కలిగిన ఆ విష్ణుదేవుని మందిర ద్వారపాలకులు గంభీరమైన మేఘ గర్జనలతో సమానమైన మాటలతో ఇలా అన్నారు. మీరు యమదూతలైతే పుణ్య లక్షణాన్ని, పాప స్వరూపాన్ని, దండనీతిని వివరించండి. ఇతడు ఉండ వలసిన స్థానాన్ని వెల్లడించండి. దండింపదగినవా రెవరు? లోకంలోని సర్వ ప్రాణులా? లేక పాపకర్ములైన కొందరా?” అని విష్ణుదూతలు పలుకగా యమభటులు ఇలా అన్నారు. వేదాలలో ఏది చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మం. దానికంటే వేరైనది అధర్మం. వేదం సాక్షాత్తు విష్ణుస్వరూపమని విన్నాము కదా! ఎవని వల్ల సత్త్వరజస్తమో గుణ స్వభావంతో ఈ ప్రాణికోటి తమకు అనుగుణమైన గుణాలను, పేర్లను, ప్రవర్తనను, రూపాలను పొంది ఆ విధంగా తనకు తానుగా లోకానికి తెలియబడుతున్నాడో ఆ నారాయణుడు అంతర్యామియై సర్వప్రాణులలో నిండి ఉన్నాడు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, గోవులు, చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, కాలాలు, భూమి మొదలైనవి ఈ దేహధారుడైన జీవుని సర్వ కర్మలకు సాక్షులు. ఈ సాక్ష్యాలను అనుసరించే ధర్మాధర్మాల నిర్ణయం జరిగి అధర్మపరులు దండింపబడతారు. ఇప్పుడు మీరీ క్రమపద్ధతికి అడ్డు తగిలారు. కర్మబద్ధులైన జీవులందరూ దండింపదగినవారే. కావాలని కర్మలను చేసేవారికి ఆ కర్మల ననుసరించి శుభాలు, అశుభాలు కలుగుతూ ఉంటాయి. దేహధారుడు సత్త్వరజస్తమో గుణసంపర్కం వల్ల కర్మ చేయకుండా ఉండలేడు. ఈ జన్మలో తాను ఎంత పుణ్యం చేస్తాడో, ఎంత పాపం చేస్తాడో వాటిని బట్టి భవిష్యత్తులో అంతే వికారాన్ని పొంది అపరిపక్వమైన మనస్సుతో వాటి ఫలితాలను అనుభవిస్తాడు. ఇంకా వినండి. ఈ లోకంలో ప్రాణులు గుణత్రయ సంబంధం చేత శాంత స్వభావులు, ఘోర స్వభావులు, మూఢ స్వభావులు అని మూడు విధాలుగా ఉంటారు. వీరిలో శాంతస్వభావులు ధర్మమార్గంలో ప్రవర్తిస్తూ సుఖపడతారు. ఘోరస్వభావులు కూడని మార్గాలలో నడచి నానా కష్టాల పాలవుతారు. మూఢస్వభావులు కొంత మంచిగా కొంత చెడుగా ప్రవర్తిస్తూ సుఖ దుఃఖాలను తెచ్చుకుంటారు. వారి ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబోయే జన్మలు లభిస్తాయి. ధర్మస్వరూపుడైన యముడు సమస్త జీవులలో అంతర్యామిగా ఉంటాడు. అలా ఉండి ఆయా జీవుల ధర్మాధర్మాల స్వరూపాలను విశేష దృష్టితో గమనిస్తూ వాటికి అనురూపమైన మార్గాలను కల్పిస్తుంటాడు. అజ్ఞానం ఉపాధిగా కల జీవుడు తమోగుణంతో కూడినవాడై పూర్వకర్మల చేత ఏర్పడిన ఇప్పటి ఈ దేహమే తానని భావిస్తాడు. అందువల్ల పూర్వజన్మ స్మృతిని కోల్పోతాడు. కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలతో ఏవేవో కర్మలు చేస్తూ ఉంటాడు. కన్నులు, చెవులు మొదలైన జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించకుండా కేవలం శబ్ద స్పర్శ రూప రస గంధాలను మాత్రమే గ్రహిస్తూ ఉంటాడు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, ఒక మనస్సు మొత్తం పదునారు. జీవుడు పదునేడవవాడై ఈ పదునారు ఉపాధులతో సంబంధ సంస్పర్శలు కలిగి సంసార బంధాలలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు. పది ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు అనే పదునారు కళలతో కూడి గుణత్రయ విశిష్టమైన లింగశరీరం సత్త్వగుణం వల్ల హర్షాన్ని, రజోగుణం వల్ల శోకాన్ని, తమోగుణం వల్ల భయాన్ని జీవునికి కలిగిస్తుంది. ఈ విధంగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాన్ని జయించలేక సంసార బద్ధుడైన జీవుడు కర్మలు బంధహేతువులని తెలిసి కూడా పూర్వజన్మ సంస్కార ప్రాబల్యం వల్ల ఇష్టం లేకపోయినా బలవంతంగా కర్మలు చేస్తున్నాడు. పట్టుపురుగు తన నోటిలో నుండి వచ్చిన దారాలతోనే తనచుట్టూ ఒక గూడు అల్లుకొని దానిలోనుండి బయటపడే మార్గంలేక నశించినట్లే జీవుడు స్వయంగా తనచుట్టూ ఏర్పరచుకొన్న కర్మబంధాలలో చిక్కి స్రుక్కి సురిగి పోతున్నాడు. వర్తమాన కాలంలో మనముందు నడుస్తున్న వసంతం మొదలైన ఋతువుల స్వరూప స్వభావాలను బట్టి జరిగిపోయిన, జరుగనున్న వసంతాదులలోని పుష్పాలను, ఫలాలను, శీతోష్ణ స్థితులను ఊహిస్తాము. అదే విధంగా జీవుని వర్తమాన జీవితంలోని నడవడిని బట్టి అతడు పూర్వ జన్మంలో ఎట్లా ఉండేవాడో రాబోయే జన్మలో ఎలా ఉంటాడో నిర్ణయింపవచ్చు. ఏ జీవి అయినా ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే పురుషుని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు అతణ్ణి లొంగతీసుకొని అతని చేత బలవంతంగా కర్మలు చేయిస్తూ ఉంటాయి. అవ్యక్తమైన ఆ పూర్వజన్మ సంస్కారం నుండి జీవుని స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడుతుంటాయి. అవి అప్పటి తల్లిదండ్రుల పోలికలను సంతరించుకుంటాయి. పురుషునికి విచిత్రమైన ఈ విపర్యయం ప్రకృతి సంబంధం వల్ల కలుగుతుంది. సంసార కారణమైన ఈ ప్రకృతిని తొలగించుకోవాలంటే పురాణ పురుషుడైన పరమేశ్వరుని సంసేవనం తప్ప మరోమార్గం లేదు. ఈ అజామిళుడు పూర్వజన్మంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇంద్రియాలను జయించి, శాంతచిత్తుడై ధర్మమార్గాన నడిచి, వేదాలన్నింటినీ పఠించాడు. సర్వదా గురువులను, అతిథులను, పెద్దలను ఆశ్రయించి సేవలు చేసాడు. సర్వజీవుల యందు సమబుద్ధి కలవాడై ఎన్నెన్నో మంత్రసిద్ధులను పొందినాడు. సత్యసంధుడై నియమంగా నిత్యకృత్యాలను నైమిత్తిక కర్మలను నెరవేర్చాడు. లోభం మొదలైన దుర్గుణాలను విడిచి సద్గుణాలనే తనయందు నిల్పుకున్నాడు. ఎల్లప్పుడు సదాచారాన్ని పాటించే బుద్ధి కలవాడై ఉత్తమమైన జ్ఞానమార్గాన్ని అవలంబించే సమయంలో మదనోన్మాదాన్ని కలిగించే నవయౌవనం అతని హృదయంలో జొరబడింది. అజామిళుడు కడకన్నులలో యౌవన గర్వం కనిపించింది. మనస్సులో ఉద్రేకం ఉప్పొంగింది. శరీరమంతటా కామవికారం తలచూపింది. ముఖంపై చిరునవ్వు మొలకెత్తింది. దేహమంతా బాగా బలిసి గట్టిపడింది. వెండ్రుకలు నల్లగా నిగనిగ మెరిసాయి. నడుము పెద్దదయింది. తొడలు సన్నబడ్డాయి. బాహువులు పొడవైనాయి. రొమ్ము విశాలమయింది. అవయవాలన్నీ నవనవ కాంతులతో మెరుస్తూ కుదురుకున్నాయి. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు యౌవనంలో అడుగుపెట్టి మిక్కిలి తేజోవంతు డైనాడు.హృదయంలో మొలకెత్తిన యౌవనమదం బయటికి ఉబికి వచ్చిన విధంగా అందమైన అతని ముఖంపై నూనూగు మీసాలు మొలకెత్తి చూడ ముచ్చటగా కనిపించాయి. ఇంకా...

తామరపుష్పం మీద వ్రాలిన తుమ్మెదల బారులాగా ఆ బ్రాహ్మణ కుమారుని నెమ్మోముపై అందమైన మీసాలు క్రమ్ముకొని వచ్చాయి. అంతలో వసంత ఋతువు వచ్చింది. మన్మథుడనే బ్రహ్మదేవుడు ప్రారంభించిన యజ్ఞానికి వసంతుడనే పురోహితుడు అంకురారోపణం చేసినట్లు ఉద్యావవనాలలోని చెట్లకొమ్మలు క్రొత్త చిగుళ్ళు తొడిగాయి. వాయువేగానికి ఆ చిగురాకులు కంపిస్తున్న జారజారిణీ జన హృదయాలలో గ్రుచ్చుకొనే బాకుల వలె ఉన్నాయి. చక్కగా వికసించిన పువ్వులలోనుండి చెలరేగిన పుప్పొడి దుమారాలు ఆకాశంలో వ్రేలాడగట్టిన చాందినీలవలె ప్రకాశిస్తున్నాయి. పూలలో చిందుతున్న మకరంద బిందువుల విందులతో మైమరచిన తుమ్మెదల ఝంకార నాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లుతున్నాయి. బాగా పండి పగిలిన ఫలాలను ఆరగిస్తూ ఆనందంతో చిలుకలు మొదలైన పక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా అందరికీ ఆనంద దాయకమైన మధుమాసం చెట్లన్నింటికీ క్రొత్త సొగసులను చేకూర్చింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకొని రావటం కోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక దట్టమైన పొదరింట్లో...పొంగి పొరలే కామోద్రేకంతో, అతిశయిస్తున్న ఆసక్తితో రతిక్రీడలో చతురురాలైన తన ప్రియురాలైన స్వైరిణి వృషలితో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు.కార్యనిమగ్నుడు, రతిశాస్త్ర కళలలో ఆరితేరినవాడు, నవ యౌవనంతో కామోన్మత్తుడు, సంభోగ కాంక్షతో తహతహ లాడుతున్నవాడు, దిగంబరంగా ఉన్న కటిప్రదేశం కలవాడు అయిన విటుణ్ణి (చూశాడు). కల్లు త్రాగిన మైకంలో కళ్ళు తిరుగుతున్నది, కామ తంత్రాన్ని ఆరంభించాలనే తొందర గలది, రతిక్రీడకు రెచ్చగొట్టే భ్రూవిన్యాసం కలది, చెదరిన ముంగురులు కలది, కౌగిలింతల కోసం వేగిర పడే వివిధ భంగిమలను ప్రదర్శిస్తున్నది, కాముకత్వం మూర్తీభవించినది అయిన ప్రియురాలితో శృంగారకేళిలో తేలియాడుచున్నవాణ్ణి అజామిళుడు చూశాడు. అతని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. 

రతి పారవశ్యంలో ఆ విటుని కంఠంనుండి వెలువడుతున్న అవ్యక్త మధుర ధ్వనులకు అనుగుణంగా ఆమె నడుమున కదులుతున్న ఒడ్డాణపు మువ్వల సవ్వడి లయ తప్పకుండా తాళం వేస్తున్నది. ఈ విధంగా తన ప్రియునితో రతిక్రీడలో ఆసక్తురాలై ఉన్న ఆ అందగత్తె తమకాన్ని, గమకాన్ని అజామిళుడు చూశాడు. ఆమె కాలి అందెలు ఘల్లు ఘల్లుమని ఒకదానితో ఒకటి పోటీపడి ధ్వనిస్తున్నాయి. ఆ అందెల చప్పుళ్ళు విటునికి వీనుల విందుగా వినిపిస్తున్నవి. ఇలా ఒకరిపైకి ఒకరు ఎగబడి సాగిస్తున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు చూశాడు. 

“కవకవ”, “రవరవ”.... ధ్వన్యనుకరణ పదాలుపైన; “క”, “వ”, “ర” అక్షరాల వృత్యనుప్రాసతో అలంకరించి; శృంగారరసం చిక్కగా అల్లిన సహజ కవి పోతన్న గారికి పాదాభివందనాలు...

కురులు నుదుటిపై ఎగురుతుండాగా, కొప్పుముడి వీడగా, వక్షోజాలపై ముత్యాల సరాలు నాట్యమాడగా, మొలనూలు చిరుగంటలు తాళం వేయగా, అందాల కరకంకణాలు ధ్వనింపగా, నడుము తూగాడగా యౌవన గర్వంతో ప్రియుని పైకొని ఆ మగువ మన్మథకేళి 

సల్పింది.మిసమిసలాడే మృదువైన శరీరం గలది, నవయౌవనవతి, కౌగిలింతలు మొదలైన శృంగార క్రీడలలో ఆరితేరినది అయిన ఆ వెలయాలిని చూచి అజామిళుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు. మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతని మనస్సనే అరణ్యంలో కామేద్రేకమనే కార్చిచ్చు చెలరేగ సాగింది. నియమబద్ధమైన అతని చిత్తం పట్టు తప్పిపోయింది


🙏🙏🙏

నిర్వాణషట్కము

 **దశిక రాము**


**జగద్గురు ఆదిశంకర విరచితము**

**నిర్వాణషట్కము** 

**ఆత్మషట్కము**  

6వ శ్లోకము. 
విశ్లేషణ : శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

6వ శ్లోకము (చివరి శ్లోకము) :

**అహం నిర్వికల్పో నిరాకార రూపో।**

**విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణామ్।**

**న చా సంగతం నైవ ముక్తి ర్నమేయః।**

**చిదానంద రూపః శివోహం। శివోహమ్॥**

అర్ధము : 
నాకు ఎటువంటి వికల్పములు లేవు. నాకు రూపం లేదు. నేను ఇంద్రియరూపంలో ఈ విశ్వమంతా వ్యాపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కానీ, విషయములు కానీ లేవు. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు. పొందవలసిన మోక్షమూ లేదు.
నేను చిదానందరూపుడైన శివుడను! శివుడను తప్పా వేరవరినీ కాను!! 

విశ్లేషణ :
ఆహా! ఎంత ఉదాత్తమైన, జ్ఞానవంతమైన భావము!

ఎందుకంటే ఈ సృష్టి మొత్తము క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే రెండు పదార్ధాలతో నిండివుంది. ఇందులో మొదటిది జడమైనది, చూడబడుతుంది మరియు నశింపబడుతుంది. ఇక రెండవది చైతన్యవంతమైనది, అన్నింటిని చూచునది మరియు శాశ్వతమైనది.

క్షేత్రానికి మరోపేరు ఉపాధి. ఉపాధి అంటే పంచభూతములు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ది, అహంకారము మొదలైన వాటితో కూడియున్న జడమైన జీవుని శరీరము. ఇది ఒక రూపాన్ని ధరించి బయటకు కనబడుతుంది. ఇది ఎప్పటికైన నశించే గుణం కలిగివుంటుంది.

ఇలాంటి జడమైన, నశించే స్వభావం కలిగిన ఉపాధులన్నింటిలో కూడా బయటకు కనబడకుండా, అన్నింటిని గమనిస్తూ, చైతన్యస్వరూపంతో నెలకొనియున్న ఆత్మయే క్షేత్రజ్ఞుడు. దీనికి నాశనము లేదు. పూర్తిగా శాశ్వతమైనది.

అంటే “క్షేత్రములెన్నున్నా క్షేత్రజ్ఞుడు ఒక్కడే. జీవులెన్నున్నా జీవాత్మ ఒక్కటే!!”. ఉపనిషత్తులు ఈ విషయాన్నే “జీవో బ్రమ్మైవ నా పరః”, “అయమాత్మా బ్రహ్మ”, “అహం బ్రహ్మాస్మి” ఇత్యాది ఎన్నో మహావాక్యాలతో స్పష్టంచేసేయి. 

అటువంటి ఉపనిషత్ సారాంశమంతా “ఆత్మషట్కము లేదా నిర్వాణషట్కము” అన్న పేరుతొ కేవలం ఆరు శ్లోకాలతో వ్యక్తపరిచేరు జగద్గురు ఆదిశంకరులు. ఈ సత్యాన్ని గ్రహించి, ఆచరించి “ఆత్మానుభూతి” పొందడం మన చేతుల్లోవుంది.

ఇతి శ్రీమదాకుండ్యన్వయ పవిత్ర ఆత్రేయసగోత్ర, మహాకవి శ్రీ జగన్నాధ శాస్త్రి ప్రపౌత్ర, 
ఉద్దండ పండిత శ్రీ గోపాల శాస్త్రి పౌత్ర, ఉభయభాషాప్రవీణ మహాకవి శ్రీ సూర్యనారాయణ శాస్త్రి పుత్ర, శ్రీనివాస శాస్త్రి(శాస్త్రి ఆత్రేయ)గా పిలవబడే నాచే విశ్లేషించబడిన “ఆత్మషట్కము” సర్వము సమాప్తము.

సర్వము నా గురుదేవులకు అర్పితము!!

🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**