🌹💐🌷🌾🥀🌸🌺
*కార్తికమాసంలో బిల్వార్చన ప్రాధాన్యం ఏమిటి?*
*కార్తికమాసంలో బిల్వదళాలతో శివుణ్ణి, తులసీదళాలతో విష్ణువును సేవించాలి అసలు శివుణ్ణి చూసినవెంటనే ఒక బిల్వదళం సమర్పించాలి.*
*ముందుగా బిల్వదళం సమర్పించకుండా శివునికి అభిషేకం చేయకూడదు.*
*కేవలం జలంతోనే అభిషేకించే సందర్భంలో కూడా లింగంపై బిల్వదళం వేయడం తప్పనిసరిగా భక్తులు భావిస్తారు.*
*బిల్వవృక్షాన్నే మారేడు అని పిలుస్తారు. మూడేసి ఆకులుగా శివుని త్రిశూలాన్ని, త్రినేత్రాలను గుర్తుతెచ్చేలా ఉంటుంది బిల్వదళం దీనిని త్రిమూర్తులకు ప్రతీకగా కూడా చెబుతుంటారు*
*వివిధ రకాల పూలతో అభిషేకించడం కన్నా ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించడం వలన శివుడు ఎక్కువ సంతోషపడిపోతాడని చెబుతారు.*
*అందుకే శివుడి అనుగ్రహాన్ని కోరే భక్తులు అత్యధిక సంఖ్యలో బిల్వదళాలతో పూజిస్తూ వుంటారు.*
*కార్తికమాసంలో ఎక్కువగా లక్ష బిల్వార్చనలు జరుగుతుంటాయి.*
*బిల్వదళానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దానిని ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు ఒకరోజు సమర్పించిన బిల్వదళాన్నే మరునాడు కూడా శివునికి సమర్పించవచ్చు క్రిందపడినా బిల్వదళానికి పవిత్రత చెడిపోదు.*
*శివలింగానికి చుట్టుపక్కల మరొకరు వేసిన దళం చేతిలోకి తీసుకుని మనం మళ్లీ శివలింగంపై ఉంచవచ్చు ఎన్నిసార్లు శివుణ్ణి చేరితే అన్నిసార్లూ ఫలితాన్నిచ్చేది, ఆయన మళ్లీ మళ్లీ కోరుకునేది బిల్పదళమే*
*భక్తి*
M.s.s.k
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి