10, ఆగస్టు 2021, మంగళవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*


*శ్రుతిగీతలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*87.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*దురవగమాత్మతత్త్వనిగమాయ తవాత్తతనోఃచరితమహామృతాబ్ధిపరివర్తపరిశ్రమణాః|*


*న పరిలషంతి కేచిదపవర్గమపీశ్వర తే చరణసరోజహంసకులసంగవిసృష్టగృహాః॥11981॥*


ప్రభూ! పరమాత్మజ్ఞానము లభించుట ఏమాత్రమూ సులభముగాదు (ఎంతయు కష్టము). అట్టి నీ ఆత్మతత్త్వమును బోధపఱచుటకై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మున్నగు అవతారములను దాల్చి, నీవు నీ యొక్క వివిధ లీలలను నెఱపుచుందువు. మధురమై, పారవశ్యమును గూర్చెడి నీ లీలామృతములను గ్రోలినవారు తాపత్రయములనుండి (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపములనుండి) విముక్తులై పరమానందసాగరమున మునుగుదురు. కొందరు పరమ భక్తులు నీ లీలా కథా శ్రవణములను తప్ప మోక్షమునుగూడ కోరుకొనరు. ఇంకను కొందరు నీ పాద కమలములను సేవించుటయందే నిరతులై మిగుల పుణ్యాత్ములైన పరమహంసలవలె భాగవతోత్తములతోగూడి నీ కథశ్రవణ సుఖమును అనుభవించుచు ఐహికములైన సాంసారిక బంధములను తెంచుకొందురు (సాంసారిక బంధములనుండి బయట పడుదురు). నీ పవిత్ర కథా శ్రవణమునందు నిరతిగలిగిన భక్తులు మహాయోగులకు ప్రాప్యమగు ముక్తిని సైతము తమ మనస్సులలో తలంపరు.


*87.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*త్వదనుపథం కులాయమిదమాత్మసుహృత్ప్రియవత్ చరతి తథోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మని చ|*


*న బత రమంత్యహో అసదుపాసనయాఽఽత్మహనో యదనుశయా భ్రమంత్యురుభయే కుశరీరభృతః॥11982॥*


స్వామీ! ఈ శరీరము నీ సేవలకే సాధనమై, నీ మార్గమును అనుసరించినప్పుడు ఆత్మహితైపి, సుహృత్తు, ప్రియవ్యక్తివలె, ఇది సహకారియగును. వాస్తవముగా నీవు హితుడవు, ప్రియమైనవాడవు, ఆత్మస్వరూపుడవు, మిక్కిలి సులభుడవు. దుర్లభమైన మానవ శరీరమును పొందియు జనులు సర్వవిధముల క్షేమంకరుడవైన నిన్ను సేవింపక విషయసుఖముల యందు అనురక్తులై నశ్వరమైన ఈ దేహమునే సేవించుచుందురు. అట్లొనర్చుట ఆత్మహత్యా సదృశము. తత్ఫలితముగా వారి మనోవృత్తులు, వాసనలు, దేహేంద్రియ సుఖపరములగును. అట్టి కుసంస్కారముల ప్రభావమున వారు పశుపక్ష్యాదుల శరీరములను పొంది మిగుల భయానకమైన జననమరణరూప సంసారచక్రముననే పరిభ్రమించు చుందురు. ఇది పరమ శోచనీయము.


*87.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*నిభృతమరున్మనోఽక్షదృఢయోగయుజో హృది యన్మునయ ఉపాసతే తదరయోఽపి యయుః స్మరణాత్|*


*స్త్రియ ఉరగేంద్రభోగభుజదండవిషక్తధియో వయమపి తే సమాః సమదృశోఽఙ్ఘ్రిసరోజసుధాః॥11983॥*


పద్మనాభా! పరమయోగులు ప్రాణములను, మనస్సును, ఇంద్రియములను వశపరచుకొని, యమనియమాది యోగసాధనలద్వారా నిన్నే ధ్యానించుచు పరమపదమును పొందుదురు. కానీ, నీ యెడ వైరభావముతోనైనను సర్వదా నిన్నే స్మరించుచుండెడి శిశుపాలాది భూపాలురును, శేషనాగుని శరీరమువలె దృఢమై, సుకుమారమైన నీ భుజములపై ఆసక్తులై, నిరంతరము నిన్ను స్మరించుచుండెడి (పదహారువేలమంది) స్త్రీలును నీ పరమపదమునే పొందుదురు. సర్వదా నీ చరణారవిందములను బాగుగా ధారణ చేయుచుండెడు శ్రుతులమగు మేము కూడ సమదర్శనముగల నీకు సమానులమేకదా! నీలో ఎటువంటి రాగద్వేషభావములు లేవు. అందుకే నీవు సమదర్శివి.


*87.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*క ఇహ ను వేద బతావరజన్మలయోఽగ్రసరం యత ఉదగాదృషిర్యమను దేవగణా ఉభయే|*


*తర్హి న సన్న చాసదుభయం న చ కాలజవః కిమపి న తత్ర శాస్త్రమవకృష్య శయీత యదా॥11984॥*


బ్రహ్మాదిదేవతలు, సనకాది మహర్షులు, మరీచ్యాదిఋషులు, ఇంద్రవరుణాది లోకపాలకులు, ఇంద్రియాధిష్ఠాన దేవతలు - వీరందరునూ నీ సంకల్పముద్వారా ఉత్పన్నమైన వారు. ఈ విధమగ నీవు అందరికంటే అగ్రేసరుడవు. ఆశ్చర్యమేమనగా - నీ తర్వాత, నీ నుండి ఉత్పన్నమైనవారలు నీ గురుంచిగానీ, *జన్మ కర్మ చ మే దివ్యమ్* దివ్యములైన నీ జన్మ, కర్మల గురుంచిగానీ ఎట్లు? ఏమని? తెలియుదురు? అంతేగాదు, యోగనిద్రద్వారా శయనించుటకు సంకల్పించినప్పుడు, నీవు ఈ సమస్త జగత్తును నీలో లయము చేసెదవు. అప్పుడు జగత్తు అనే కార్యముగానీ, ప్రకృతి అనే కారణముగానీ, కాలముయొక్క వేగముగానీ ఏదీ ఉండదు. అప్పుడు వేదము నీలో లయమైయుండును. ఈ రీతిగా సృష్టియొక్క ఆద్యంతముల యందు నీవు ఒక్కడవే ఉందువు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

విజ్ఞానం - అజ్ఞానమే.

 చేతగాని, చేవలేని విజ్ఞానం - అజ్ఞానమే..

***********""""""""""""""""**************


బ్రిటిషు వారు మనకు నేర్పిన మా గొప్ప విద్యలు


1. సున్నం --ఇటుక -ఇసుక ఉపయోగించి వేల ఏళ్ళ క్రితమే భారతీయ ఇంజనియర్లు అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తే ....


బ్రిటిషు వైజ్ఞానికులు ఆ సున్నాన్ని (lime) కి ఇంకొన్ని ధాతువులు జోడించి విపరీతంగా విద్యుత్తు, నీరు ఖర్చు చేసి "సిమెంట్ " తయారు చెయ్యడం నేర్పారు.

 

సున్నం ఇటుక ఇసుక ఉపయోగించిన కట్టడాలలో సహజ వాతానుకులత (air conditioning) ఉంటె ఇప్పుడు మనం బహుదా వికసించిన విజ్ఞానంతో AC గురించి ఖర్చు చెయ్యడమే కాకుండా పర్యావరణాన్ని కుడా పాడుచేయ్యగలుగుతున్నాం (ఇదంతా విదేశి విజ్ఞానం చలవే) .


పాతకాలం సున్నం కట్టుబడితో కట్టిన ఇల్లులు 

ఎండాకాలం చల్లగా , చలికాలం -మరియి రాత్రి 

కాస్త వేడిని ఇస్తాయి . ఇది మనిషికి ఆరోగ్యం


2. ఒక్క గ్రాము ఇనుము వాడకుండా చార్మీనార్ కుతుబ్ మినార్లు,తాజ్ మహళ్ళు , కొండ కోనల మీద విశాలమైన దేవాలయాలు నిర్మించగలిగిన మనం 


ఇప్పుడు - ఒంటి గది ఇంటికి కుడా 400 కేజీల ఇనుము వాడే దుస్తికికి ఎదిగిపోయాం -- ఇది కుడా వారి చలవే (బహుశా ఫ్రెంచి లేదా ఇటలి శాస్త్రవేత్తల పుణ్యం)


3. చిన్న చిన్న వ్యాదులకి పోపుల డబ్బాలో అద్భుత మైన ఔషధాలు ఉంచుకోగలిగిన మనం 


ఇప్పుడు తలనొప్పికి విరేచనాలకీ పోడిదగ్గుకి కూడా మందులు కొనే (అది విదేశాలలో బ్యాన్ చేసిన ) గొప్ప సంస్క్రతికి అలవాటు పడ్డాం.


ఇన్నిటికీ ఒకే ఒక్క కారణం - విదేశీ వ్యామోహం స్వదేశీ వస్తు వ్యవహారాల మీద చిన్నచూపు అంతే ---- 


ఆలోచించగలిగితే విశ్వ రహస్యం కూడా బోధపడుతుంది.


మా అమ్మమ్మో - మీ నాయనమ్మో " పోపుల పెట్టెలో మందులు ఉన్నాయని చెపితే మనకది హాస్యాస్పదం/ అనాగరికం/ అసహ్యం ---- 


అదే విషయాన్ని విదేశస్తులు చెపితే మాత్రం మన పేపర్లనిండా వార్తలే , సోషల్ సైట్లనిండా పోస్టులే ,షేరులే ఓహో --- 


ఇంత మహత్తరమైన విషయాన్ని కనుక్కున్నందుకు ఆ విదేశి వైజ్ఞానికులకు నోబెల్లె .... నోబెల్లు

కాలం ఎలా* *గడిచిందో

 *Very nice poem about life,* 


     *సమయం గడిచిపోయింది,*

 *ఎలా గడిచిందో తెలియదు, జీవితమనే పెనుగులాటలో వయసు గడిచిపోయింది* *తెలియకుండానే.*


 *భుజాలపైకి ఎక్కే పిల్లలు భుజాలదాక వచ్చేశారు తెలియనేలేదు..* 

 

*అద్దె ఇంటి నుండి చిన్న గా మొదలైన జీవితం. ఎప్పుడు మన ఇంట్లో కి వచ్చామో తెలియదు*


*ఆయాసంతో సైకిల్ పెడల్ కొడుతూ కొడుతూ కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో తెలియదు*


*ఒకప్పుడు తల్లిదండ్రుల బాధ్యత మాది. కానీ*

 *ఇప్పుడు నాపిల్లలకు నేను బాధ్యత గా మారాను.* 


*ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు*


*ఒకప్పుడు పగలు కూడా హాయిగా నిద్ర పోయే వారం కానీ..*

 *ఇప్పుడు నిద్ర రాని రాత్రులు ఎన్నో. ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు*


*ఒకప్పుడు నల్లని కురులనుచూసుకొని గర్వంగా వగలు పోయే వాళ్ళం.*

*అవన్నీ ఎప్పుడు తెల్లగా మారాయో తెలియదు.*


  *ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ..*

    *ఎప్పుడు రిటైర్ అయ్యామో తెలియనేలేదు.*


*పిల్లల కోసం ప్రతిదీ అని ఎంత తాపత్రయం పడ్డామో వాళ్ళు ఎప్పుడు దూరంగా వెళ్లి పోయారో తెలియదు*


*రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల మధ్య గర్వంగా నడిచే వాడిని ఎప్పుడు అందరూ...దూరమయ్యరో తెలియదు*


 *ఇప్పుడే ఆలోచిస్తున్నాను..నా కోసం నా శరీరం కోసం ఏమైనా చేసుకోవాలని కానీ..*

*శరీరం సహకరించడం లేదు.*

 *ఇవన్నీ..జరిగిపోయాయి..*

*కానీ........*

*కాలం ఎలా* *గడిచిందో..తెలియనేలేదు*


*It's truth of life...*

ప్రశ్న పత్రం సంఖ్య: 17

 ప్రశ్న పత్రం సంఖ్య: 17                 కూర్పు:(సేకరణ ) సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి   

1.బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి ఎవరు 

2.శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి ఎవరు

3.రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ఎవరిఇంటివద్ద అతిధిగా ఉన్నాడు

4.మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది ఎవరు

5.ఆంజనేయుని వాహనం ఏమిటి

6.ద్రోణుని కుమారుని పేరేమి

7.భీష్ముని తలిదండ్రులెవరు

8.దశరధుడు ఎవరినిర్వహణలో పుత్రకామేష్ఠియాగం చేసెను

9.సీతాదేవితల్లిదండ్రులెవరు

10.వాలికుమారునిపేరేమి

11.జఠాయువు సోదరుడెవరు

12.శ్రీకృష్ణుని తలిదండ్రులెవరు

13.దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది ఎవరు

14.సుగ్రీవుని మంత్రి ఎవరు

15.కుచేలుని అసలు పేరేమి

16.నరనారాయుణులు అని ఎవరిని సంభోదిస్తారు

17.పిడుగు మంత్రాలుగా ఎవరి పేర్లు చెప్పబడినవి

18.ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది ఎవరు

19.సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు

20.ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా అడిగినదెవరు?

పాజిటివ్ గా స్వీకరిస్తే!!!

 నెగిటివ్ అంశాన్ని,పాజిటివ్ గా స్వీకరిస్తే!!!

  

  ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్ను పై అతని ముందు రైటింగ్ పాడ్ పై పడింది. దానిమీద ఏదో రాసి ఉంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని చదవసాగింది.. నిశ్శబ్దంగా!


నెగిటివ్ ఆలోచనలు!!!


"గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది...


   "ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధి లో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీ తో నాకెంతో అనుబంధం ఉంది.దానితో ఋణం తీరిపోయింది.


"ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.


"ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది.


"దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!!"


చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది.


కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది.


ఆయనకి మెలుకువ వచ్చింది. తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద రాసి ఉన్నది చదివాడు.


పాజిటివ్ గా ఆలోచిస్తే!!!


"గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పికి ఎట్టకేలకు ముగింపు పలక గలిగాను.


"ఈ ఏడాది లోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం, నా కుటుంబం కోసం గడుపుతాను.


"ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ప్రశాంతంగా సహజమరణం చెందారు.


"ఈ ఏడాదిలోనే నా కొడుకుకు కొత్త జీవితం వచ్చది. కారు పోతే పోయింది గానీ నా కొడుకు ఎలాంటి సమస్యా లేకుండా పెద్ద గండం నుండి బయట పడ్డాడు.


"హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"


అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు....


ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.


మంచి,చెడు అనేవి మన ఆలోచనా సరళే. మన ఆలోచనా సరళి సరిగా ఉంటే మన మనసుకు హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది... మరియు మన జీవితం ఆనందమయంగా ఉంటుంది!

శ్రావణమంగళగౌరీవ్రతవిధానం

 _*🚩#శ్రావణమంగళగౌరీవ్రతవిధానం – #మంగళగౌరీపూజ🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది


*ఈ మంగళగౌరీ వ్రతం*


ఈ నెలలో వచ్చే ఐదు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.


శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం లేదా మంగళ గౌరీ పూజ ఏవిధంగా జరుపుకోవాలో మంత్ర పూర్వకంగా, వివరణతో క్రింది విధంగా తెలుపబడినది.


*శ్రీ పసుపు గణపతి పూజ:*


శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే


(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)


శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్


(గంటను మ్రోగించవలెను)


*ఆచమనం*


ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,


(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)


ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,

మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,

వామనాయ నమః, శ్రీధరాయ నమః,

ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,

దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,

వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,

అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,

అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,

అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,

ఉపేంద్రాయ నమః, హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||


శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః

అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||


(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)


*ప్రాణాయామము*


(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)


ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్


*సంకల్పం:*


ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే


(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)


తదంగత్వేన కలశారాధనం కరిష్యే


*కలశారాధనం:*


శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః


(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)


శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య


(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)


మం || ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్


శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి


(అక్షతలు వేయవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి


(నీళ్ళు చల్లవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి


(నీళ్ళు చల్లవలెను)


ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి


(నీళ్ళు చల్లవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి


(అక్షతలు చల్లవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి


(గంధం చల్లవలెను)


శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి


(అక్షతలు చల్లవలెను)


ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి


(అగరవత్తుల ధుపం చూపించవలెను.)


ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.


(బెల్లం ముక్కను నివేదన చేయాలి)


ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.


(నీరు వదలాలి.)


తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.


(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)


ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు


(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)


తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.


శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.


*(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)*


*శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం:*


*ధ్యానం:*


శ్లో: సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం

సమందహాసితేక్షణాం సశర చాపాశాంకుశాం

అశేష జనమోహిని అరుణమాల్యాభూషాంభరాం

జపాకుసుమభాసురాం జపవిధౌస్మరేదంబికాం.


శ్లో: దేవీం షోడశావర్షీ యాం శశ్వత్ సుస్థిర యౌవనాం

బిమ్బోష్టీం సుదతీం శుద్దాం శరత్పద్మ నిభాననాం

శ్వేతా చంపకవర్నాభాం సునీలోత్పల లోచనం


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ధ్యానం సమర్పయామి.


*ఆసనం 


శ్లో: కల్లోలోల్ల సితామ్రుతాబ్ది లహరీ మధ్యే విరాజన్మని

ద్వీపే కల్పకవాతికా పరివృతే కాదంబ వాత్యుజ్వలె

రత్న స్థంభ సహస్ర నిర్మిత సభామద్యే విమానోత్తమే

చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే.


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.


*ఆవాహనం 


శ్లో: ఏణాంకానల భానుమందల సచ్చీచ్రక్రమ మధ్యేస్తితాం

బాలార్క ద్యుతి భాసురాం కరతలై పాశాన్కుశౌ బిబ్రతీం

చాపం బానమసి ప్రసన్న వదనం కౌస్తుమ్భ వస్త్రాన్విన్తాం

తాంత్వాచంద్ర కలావటం సమకుతాం చారుష్మీతాం భావయే


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ఆవాహనం సమర్పయామి.


*పాద్యం:*


శ్లో: ఈశానాదిపదం శివైక ఫలదం దత్నాసనం తే శుభం

పాద్యం కుంకుం చందనాది భరితం చార్ఘ్యం సరత్నాక్షతై

శుద్డై రాచమనీయం తవ జలైర్భాక్తై మయా కల్పితం

కారుణ్య మ్రుతవారిదే తధఖిలం సంతుష్టయే కల్పతాం.


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః పాదయో పాద్యం సమర్పయామి.


*అర్ఘ్యం 


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.


*ఆచమనీయం 


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.


*శుద్దోదక స్నానం 


శ్లో: లక్ష్మే యోగిజనన్య రక్షిత జగజ్జాలే విశాలేక్షేన

ప్రాలేయామ్బు పటీర కుంకుమ లసత్కర్పూరమి శ్రోదకై

గోక్షేరై రాపి నారికేళ సలిలై శుద్దోదకై ర్మంత్రితై

స్నానం దేవిదియా మయైతదఖీలం సంతుష్టయే కల్పతాం.


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్నానం సమర్పయామి.


*అక్షతలు:*


శ్లో: హ్రీంకారఅంకిత మంత్రక్షితలతోనో హేమాచాలాత్స చిన్తై

రత్నైరుజ్జ్వల ముత్తరీయసహితం కౌస్తుమ్భ వర్ణాంకుశాం


*వస్త్రయుగ్మం:*


శ్లో: కల్హారోత్పలమల్లికా మ్రునకై సౌవర్ణ పంకేరుహై

జాతీ చంపక మాలతీ వకులకై మందారకుందాదిభి

ముక్తానంతతి యగ్నసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భవం

దత్తం దేవిదియా మయి మయైతద ఖిలం సంతుష్టయే కల్పతాం.


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః కంచుక సహిత కౌసుంద వస్త్రయుగ్మం సమర్పయామి.


*యజ్ఞోపవీతం:*


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి.


*ఆభరణం:*


శ్లో: హంసి రాస్యతిలో భానీయగామనే హారావాలీ ముజ్వలాం

హిందోళ ద్యుతి హేమపూరిత తారేహేమాన్గాడే కనకనే

మంజీరౌ మనికున్దలౌ మ్కుతమవ్యే ర్దేండు చూదామనిం

నాసామోవ్క్తిక మంగులీయ కతకౌ కాన్చీమపి స్వీకురు


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న మయా భారనాని సమర్పయామి.


*గంధం:*


శ్లో: సర్వాంగే ఘనసారకుమ్కుమ ఘన శ్రీ గంధనం కామ్కితం

కస్తూరి తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం

గండా దర్శన మండలే నాయన యోర్ది వ్యంజనం తెర్పితం

కన్తాబ్జే మ్రుగానాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం


శ్రీ మంగళగౌరి దేవతాయై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.


*అధాంగ పూజ:*


వుమాయై నమః పాదౌ పూజయామి

గౌర్యై నమః జన్ఘి పూజయామి

పార్వత్యైనమః జానునీ పూజయామి

జగన్మాత్రేనమః ఊరూ పూజయామి

జగత్ ప్రతిష్టాయై నమః కటిం పూజయామి

మూల ప్రక్ర్తుత్యైనమః నాభిం పూజయామి

అమ్బికాయై నమః ఉదరం పూజయామి

అన్నపూర్నాయై నమః స్థ నౌ పూజయామి

శివ సుందర్యై నమః వక్షస్థలం పూజయామి

మహాబలాయై నమః బాహూన్ పూజయామి

వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి

కంభు కంట్యై నమః కంటం పూజయామి

బ్రహ్మ విద్యాయై నమః జిహ్వం పూజయామి

శాంకర్యై నమః ముఖం పూజయామి

శివాయై నమః నేత్రే పూజయామి

రుద్రాన్యై నమః కర్ణౌ పూజయామి

సర్వంన్గాలాయై నమః లలాటం పూజయామి

సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి

మంగళ గౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

మంగలగౌర్యై నమః


 _*అష్ట్తోత్తర శతనామావళి*_


ఓం గౌర్యై నమః

ఓం గిరిజాతనుభావాయై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం వీరభద్ర ప్రసువే నమః

ఓం విశ్వరూపిన్యై నమః

ఓం కష్ట దారిద్రషమన్యై నమః

ఓం శామ్భావ్యై నమః

ఓం బాలాయై నమః

ఓం భాద్రదాయిన్యై నమః

ఓం సర్వ మంగలాయై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం మంత్రారాధ్యై నమః

ఓం హేమాద్రిజాయై నమః

ఓం పార్వత్యై నమః

ఓం నారాయణంశాజాయై నమః

ఓం నిరీశాయై నమః

ఓం అమ్బికాయై నమః

ఓం ముని సంసేవ్యాయై నమః

ఓం మేనకాత్మజాయై నమః

ఓం కన్యకాయై నమః

ఓం కలిదోష నివారిన్యై నమః

ఓం గణేశ జనన్యై నమః

ఓం గుహామ్బికాయై నమః

ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః

ఓం విశ్వా వ్యాపిన్యై నమః

ఓం అష్టమూర్తాత్మికాయై నమః

ఓం శివాయై నమః

ఓం శాంకర్యై నమః

ఓం భావాన్యై నమః

ఓం మాంగల్య దాయిన్యై నమః

ఓం మంజు భాశిన్యై నమః

మహా మాయాయై నమః

ఓం మహా బలాయై నమః

ఓం హేమవత్యై నమః

ఓం పాప నాశిన్యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం నిర్మలాయై నమః

ఓం మ్రుదాన్యై నమః

ఓం మానిన్యై నమః

ఓం కుమార్యై నమః

ఓం దుర్గాయై నమః

ఓం కాత్యాయిన్యై నమః

ఓం కలార్చితాయై నమః

ఓం క్రుపాపూర్నాయై నమః

ఓం సర్వమయి నమః

ఓం సరస్వత్యై నమః

ఓం అమర సంసేవ్యాయై నమః

ఓం అమ్రుతెశ్వర్యై నమః

ఓం సుఖచ్చిత్పుదారాయై నమః

ఓం బాల్యారాదిత భూతదాయై నమః

ఓం హిరణ్మయై నమః

ఓం సూక్ష్మాయై నమః

ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః

ఓం సర్వ భోగాప్రదాయై నమః

ఓం సామ శిఖరాయై నమః

ఓం కర్మ బ్రమ్హ్యై నమః

ఓం ఓం వాంచితార్ధ యై నమః

ఓం చిదంబర శరీరిన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం మార్కందేయవర ప్రదాయి నమః

ఓం పున్యాయై నమః

ఓం సత్యధర్మరతాయై నమః

ఓం శశాంక రూపిన్యై నమః

ఓం భాగాలాయై నమః

ఓం మాత్రుకాయై నమః

ఓం శూలిన్యై నమః

ఓం సత్యై నమః

ఓం కల్యాన్యై నమః

ఓం సౌభాగ్యదాయిన్యై నమః

ఓం అమలాయై నమః

ఓం అన్నపూర్ణాయై నమః

ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః

ఓం అమ్బాయై నమః

ఓం భానుకోటి సముద్యతాయై నమః

ఓం పరాయి నమః

ఓం శీతాంశు కృత శేఖరాయై నమః

ఓం సర్వ కాల సుమంగళ్యై నమః

ఓం సామ శిఖరాయై నమః

ఓం వేదాంగ లక్షణా యై నమః

ఓం కామ కలనాయై నమః

ఓం చంద్రార్క యుత తాటంకాయై నమః

ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః

ఓం కామేశ్వర పత్న్యై నమః

ఓం మురారి ప్రియార్దాన్గై నమః

ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః

ఓం పురుషార్ధ ప్రదాయి నమః

ఓం సర్వ సాక్షిన్యై నమః

ఓం శ్యామలాయై నమః

ఓం చంద్యై నమః

ఓం భాగామాలిన్యై నమః

ఓం విరజాయై నమః

ఓం స్వాహాయై నమః

ఓం ప్రత్యంగి రామ్బికాయై నమః

ఓం దాక్షాయిన్యై నమః

ఓం సూర్య వస్తూత్తమాయై నమః

ఓం శ్రీ విద్యాయై నమః

ఓం ప్రనవాద్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం షోడశాక్షర దేవతాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం ఆర్యాయై నమః

ఓం దీక్షాయై నమః

ఓం శివాభిదానాయై నమః

ఓం ప్రణ వార్ధ స్వరూపిన్యై నమః

ఓం నాద రూపాయి నమః

ఓం త్రిగునామ్బికాయై నమః

ఓం శ్రీ మహాగౌర్యై నమః

ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.


*ధూపం:*


శ్లో: హన్తారం మదనస్య నందయసియై రంగై రాసంగోజ్వలై

రైబృంఘ్యా వలినీల కుంతలా భర్త్యై ర్భ్నాసి తస్యాశయం

తానీ మాని తవాంబ కొమలతరాన్యా మొదలీలాగ్రుహ

న్యామోదాయదశాంగగ్గుల ఘ్రుటై ర్దూపై రహన్దూపాయే .


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దూపమాగ్రాపయామి


*దీపం 


శ్లో: లక్ష్మిముజ్జ్వలయామి రత్ననివహైర్భాస్య త్తరు మందిరే

మాలారత్న నిడంబిటై ర్మనిమయ స్తంభేషు సంభావియై

చిత్రైర్హాతకపు త్రికాకరద్రుటై ర్ఘవై ఘ్రుతై ర్వర్దిటై

ర్దివ్యైర్దిపగానైర్ధ్యై గిరిసుతే త్వత్ప్రీతయే కల్పతాం.


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దీపం దర్శయామి


*నైవేద్యం:*


శ్లో: హ్రీమ్కారేశ్వరి తప్త హాటక కృతి స్తాలీసహశ్ర్యై ఘ్రుతం

దివ్యాన్నం ఘ్రుతసూపశక భరితం చ్త్రాన్నభేదం తదా

దుగ్దాన్నం మధుశార్కరాధది యుతం మానిక్యపాత్రేస్తితం

మాశాపూశాసః శ్రమంబ సఫలం నైవేద్య మావేదాయే


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మహా నైవేద్యం సమర్పయామి


*తాంబూలం 


శ్లో: సచ్చాయై ర్వరకేతకీదలరుచా తాంబూల వల్లి దలై

ఫూగీ ర్భూరి గుణి స్సుగంది కర్పూర ధన్దోజ్జలై

ముక్తాచూర్ణ విరాజియై గృహవిధ్యై ర్వక్తాంభుజా మోదకై

పూర్నా రత్న కలాచికా తమ మదేన్యస్త పురస్తాడుమే


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.


*నీరాజనం:*


శ్లో: కన్యాభి కమనీయ కాంతిభి రాలంకారామలారారిక్త

పాత్రే పౌక్తిక చిత్ర పంజ్క్తి విలసత్కర్పూర దీపాలిభి

తత్తత్తాల మ్రుదంగగీత సహితం నృత్య పదాంభోరుహం

మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజయం గృహ్యాతాం


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.


శ్లో: పరాంకుషౌ పాశామభీతి ముద్రం

కరైర్వహన్తీం కమలాసనస్తాం

బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం

భజేహ మంబాం జగదీశ్వరీం తాం.


*మంత్రపుష్పం 


శ్లో: సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే

శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.


*ప్రదక్షిణ నమస్కారాన్ 


శ్లో: హ్రీంకార త్రయపుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభి

వాక్యై రల్క్ష్యతనో తవ స్తుతివిదౌ కో వాక్షమేతాంబికే

సల్లాప స్తుతిః ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుమే

సంవేశో నమసహస్ర మఖిలం సంతుష్టయే కల్పతాం.


ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.


*శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ*


పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు.


పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా … పసువు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాలలోను, ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది.


చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానము కలుగలేదు. ఆ దంపతులకు అదే దిగులు.. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము.. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతుల పై కరుణ కలిగినది … పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి “భవతీ భిక్షాందేహి” అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పళ్లెం లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు. ఇలా మూడు రోజులు జరిగింది. జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడా రాజు.


మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక … సంతానము లేని నీ చేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి … అయితే మహాత్మా! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా.. ఆ సన్యాసి రూపము లో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్త కు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసట తో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది. ఆ స్వర్ణదేవాలయం లో ఉండె అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది. అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు. ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు. స్వర్ణదేవాలయం లో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు, వైధవ్యము గల కన్య కావలెనా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పిత్రుదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడాదేవి ఆ రాజుని తన పార్శమున ఉన్న గణపతి నాభియందడుగు వైచి, చెంతనే ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసేసరికి గణపతికి కోపము వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని శపిస్తాడు .


ఈ విదంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్త తో అన్నది. కాశీ విశ్వేశ్వరున్ని దర్శించి వచ్చాక వివాహము చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామ తో కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రం లోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకొంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండ, రండ అంటూ కోపం తో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది కాబట్టి మాకుటుంబము లో ఎవరూ ముండలు, రండలు ఉండరు అంది కోపం తో. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు, రండలు ఎవరు ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది. అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది. సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ, ధ్యానము లో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీకూతురుకి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల .. శివుడుల వివాహము జరిగిఫోతుంది.


పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు మార్గము చెపుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్ది సేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు … అప్పుడ పాము ఆ ఘటం లోకి ప్రవేశించాక వస్త్రము తో ఆకుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు. దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణములొ భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. విషయము తెలుసుకొందామని శివుడు .. సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావమని చెప్పినది. ఈ విధముగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు.


*పూజావిధానం  ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా….ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం పునరాగమ నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు.

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏


🌹🌹 *సేకరణ*🌹🌹

*న్యాయపతి నరసింహారావు*

అత్యవసరమైన ధాతువులు

 శరీరానికి అత్యవసరమైన ధాతువులు లభించు ఆహారపదార్ధాలు -


  స్వాభావిక విటమిన్ "A" ను అందజేయు "కెరొటిన్ " అనే పదార్థం అతి ఎక్కువుగా లభించు ఆహారపదార్ధములు -


 కెరోటిన్ -


     ఆకుకూరలు - 240 మై . గ్రా .


   పేనికులెటన్ అనబడే తోటకూర - 14 ,000 మై .గ్రా .


  చామాకులు - 10 ,000 మై .గ్రా .


  కొత్తిమీర - 6 , 000 మై .గ్రా .


  మునగాకు - 6 , 700 మై .గ్రా .


  గేన్జేటికన్ అనబడే తోటకూర లేక లేత తోటకూర 5 ,500 మై .గ్రా .


 * C విటమిన్ లేక ఆన్ కార్మిక ఆమ్లం -


      ఉశిరికలో ఈ విటమిన్ కు ప్రతికూలమైన ఆక్సాలిక్ అమ్లం ఉండటం వలన లభించవలసినంత విటమిన్ లభించదు.


       మునగాకు - ౨౨0 మి .గ్రా .


       నాటు జామపండు - 212 మి.గ్రా .


      కుప్పా కు ఆలిపాకు - 169 మి.గ్రా . దీనిని అమరన్తాన్ విరిడిన్ అని పిలుస్తారు .


 * క్యాల్షియం -


        అవిసె ఆకు - 1100 మి.గ్రా .


        ముండ్ల తోటకూర - 800 మి.గ్రా .


        కాలిఫ్లవర్ - 626 మి.గ్రా .


        పొన్నగంటి ఆకు - 570 మి.గ్రా .


 * మెగ్నీషియం -


        పింక్ రాడిష్ - 196 మి.గ్రా .


       చుక్కకూర - 123 మి.గ్రా .


       లేత తోటకూర - 1౨౨ మి.గ్రా .


 * పొటాషియం -


        అడవి తమ్మ - 1800 మి.గ్రా .


        లేత తోటకూర - 340 మి.గ్రా .


        మునగాకులు - 259 మి.గ్రా .


         కొత్తిమిర - 256 మి.గ్రా .


         పాలకూర - 206 మి.గ్రా .


     మూసామ్బా అనే నిమ్మజాతి పండు. 490 మి.గ్రా .


       అరటి పండు - 348 మి.గ్రా .


 * ఇనుము -


        కాలిఫ్లవర్ - 40 మి.గ్రా .


        చిర్రికూర - 38 మి.గ్రా .


        లేత తోటకూర - 27 మి.గ్రా .


        ముళ్ళ తోటకూర - 22 మి.గ్రా .


        ఎండ్రకాయ మాంసం - 21 మి.గ్రా .


     ఎండ్రకాయ మాంసం సులభముగా జీర్ణం అయ్యి దాదాపు అంతా ఇనుమును శరీరమునకు అందించును.


 * సూక్ష్మ ఖనిజాలు -


         జింక్ , మాంగనీస్ , రాగి , మాలీబ్డ్ నం , క్రోమియం .


 * జింక్ -


        పుదీనాలో , పెద్ద ఎర్రగడ్డలో , మెంతికూర , కొత్తిమీర , గెనుసుగడ్డ , పాలకూర లో జింక్ లభించును.


 * మాంగనీసు -


         పుదీనా , పాలు , కొత్తిమీర , చుక్కకూర , లేతతోటకూర , కరివేపాకులో మాంగనీసు లభించును.


 * రాగి -


        పొన్నగంటి ఆకు , పుదీనా , పెద్ద ఎర్రగడ్డ , కొత్తిమీర , కరివేపాకులలో ఈ రాగి ధాతువు ఎక్కువుగా లభించును.


 * మాలీబ్డ్ నం -


         కొత్తిమీర , పొన్నగంటి ఆకు , పెద్ద ఎర్రగడ్డ , లేత తోటకూర లో లభించును.


 * క్రోమియం - 


        పొన్నగంటి ఆకు , కొత్తిమీర లలో లభించును.


       పైన చెప్పిన సూక్ష్మ ధాతువులు , జీవప్రక్రియలకు చాలా అవసరమైన ధాతువులు కాబట్టి ప్రతిదినం పుదీనా , కొత్తిమీర , మెంతికూర , పెద్ద సైజు ఉల్లిపాయలు పదార్దాలను , పచ్చళ్లు రూపములోను , పాలకూర , చుక్కకూర వగైరాలను , పప్పు పదార్థములతోటి కలిపి వంట పదార్దాలను వాడితే ఆరోగ్యమునకు చాలా శ్రేష్టం .


         కొత్తిమీర , పెద్ద ఉల్లిపాయకాడలతో చేసిన పచ్చడి తీసుకోవడం వలన ఐదు రకాల ధాతువులను అందజేయును . కరివేపాకు పొడి అధిక శాతములో సున్నపు ధాతువును మరియు మెగ్నీషియం , జింక్ , మాంగనీసు ధాతువులను లభింపచేయును .


                          సమాప్తం   

  

 

          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

SUTHA SPATIKAM

 SUTHA SPATIKAM our ancient devise of data saving through waves, now every tom dick harry making noise of cloud data, cloud saving.


In the battle field Kurukshetra war, arrow bed ridden Bheeshma was glorifying Lord Krishna with Sahasranamams, all Pandavas and Lord Krishna were keenly listening.’ and lost.


Later how it's Divinely saved and written by Sage Vyasa, very well explained by Paramaacharya Sri Sri Sri Chandrasekharendra Saraswati Swamy Maha Periyavaar.  Once way back in 1940/50s someone was interviewing Maha Periyavaar, that gentleman recorded the interview using a tape recorder. Maha Periyavaar then posed a question.

“Does anyone know which is the oldest known tape recorder?” Nobody was able to answer. 


Then Maha Periyavaar asked another question. “How did Vishnu Sahasranamams come to us?” Someone said Bheeshma gave it to us. Thats ok All agreed. Then Maha Periyavaar posed another query . “When all were listening to Bheeshma on the battlefield, who took notes of it ?” 


Again silence. Maha Periyavaar then explained… When Bheeshma was glorifying Lord Krishna with Sahasranamams, everyone was looking at him including Lord Krishna. After he finished the 1000 Namas, all opened their eyes. The first to react was Yudhistara, he said, ‘Pithamaha has rendered 1000 glorious names of Vasudeva. All of us listened but none of us have noted it down. The sequence is lost’. Then all turned to Lord Krishna and asked for His help. As usual He said, ‘I also was listening like all of you. What can I do now ?’ Then all beseeched Lord Krishna to help them recover the precious rendition. 


Then Krishna said, ‘It can only be done by Sahadeva's Divine gift and Sage Vyasa will write it down.’ Everyone wanted to know how Sahadeva could do it. Krishna replied, ‘Sahadeva is the only one amongst us having a boon SUTHA SPATIKAM. If he prays Lord Shiva and does Dhyanam, he can  use the SUTHA SPATIKA into cloud waves of sound and bring back the renditions, then Sage Vyasa can write it down. 


Sahadeva started the Dhyanam to recover the sound waves through the SUTHA SPATIKA,. the nature of SUTHA SPATIKA is that it will capture sounds through cloud waves in a calm environment which can bring back the renditions with proper Dhyanam of Lord Mahadeva and controller of SUTHA SPATIKA. 


So, the world’s earliest cloud stored tape recorder was SUTHA SPATIKA which gave the wonderful Divine gift Vishnu Sahasranamas to our Mother Land.  


When Maha Periyavaar explained this, all were stunned in awe… about the SUTHA SPATIKA, our ancient Divine cloud recording, thus Vishnu Sahasranamas came to us thru Sage Vyasa.'s writing, simultaneously when Sahadeva was chanting.


Computing world big wigs, now atleast come to terms and realities and stop blah blah blah of cloud computing - it's done long long thousands of years ago in ancient Sanatana Dharmabhoomi.

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 14

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 14      

                           SLOKAM : 14

                                                

तृष्णातोये मदनपवनोद्धूतमोहोर्मिमाले

दारावर्ते तनयसहजग्राहसङ्घाकुले च ।

संसाराख्ये महति जलधौ मज्जतां 

                                 नस्त्रिधामन्

पादाम्भोजे वरद भवतो भक्तिनावं 

                                 प्रयच्छ ॥ १४॥


తృష్ణాతోయే మదన పవనోద్ధూత

                            మోహోర్మిమాలే 

దారావర్తే తనయ సహజగ్రాహ 

                            సంఘాకులే చ I 

సంసారాఖ్యే మహతి జలధౌ 

                 మజ్జతాం నస్త్రిధామన్ 

పాదాంభోజే వరద భవతో 

                    భక్తినావం ప్రయచ్ఛ ॥  


    ఈ సంసారమను సముద్రము లో ఆశయే జలము. 

    ఆ జలము కామమను పెనుగాలి చే కదిలింపబడుచున్నది. 

    ఆ విధంగా కదులుటచే మొహమ ను కెరటములు వరుసగా సాగుచుండును. 

    ఈ సముద్రములో భార్య సుడి గుండమువలె పట్టి తిప్పి, అందు పడినవారిని బయటకు పోనీయక ముంచివేయును. 

    బిడ్డలు, బంధువులు, మొసళ్ళు మొదలగు జంతువులవలె కబళింప ప్రయత్నించుచుందురు. 

    ఇట్లు భయంకరమగు సంసార మహా సముద్రమున పడి, దాటు ఉపాయము లేక మునుగు చున్న మాకు, 


ఓ వరద! ఓ త్రిధామ! 

    నీ పాదపద్మభక్తి అనెడి నౌకను ఇచ్చి దరిజేర్చుమయ్యా!    


O Lord of the three worlds!    

    we are drowning in the vast ocean of saṁsāra, 

  - which is filled with the waters of material hankering, 

  - with many waves of illusion whipped up by the winds of lust, 

  - with whirlpools of wives, and 

  - with vast schools of sharks and other sea monsters who are our sons and brothers. 


O giver of all benedictions!    

    please grant me a place on the boat of devotion that is Your lotus feet.


( సంసారమను సముద్రము లోపడి, మునుగుచు, తెలుచూ, దాటలేక బాధపడుచున్న వారికి విష్ణువే నౌక అని, విష్ణుభక్తియే నౌక అని వెనుకటి 2 శ్లోకములలో పేర్కొని, ఆ నౌకను ఇవ్వమని విష్ణువునే ప్రార్థింపవలెనని తెలుసుకొని, ఈ శ్లోకంలో ప్రార్థించుచున్నారు.)          


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పెళ్లి సంబంధాలు..*


"రాబోయే శ్రావణ మాసం లో మా అబ్బాయి వివాహం నిశ్చయం అయిందండీ..ఇక్కడే శ్రీ స్వామివారి సన్నిధిలో నే పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నాము..అమ్మాయి తరఫు వాళ్లకు కూడా చెప్పాము..ఆరోజు మీ దంపతులిద్దరూ ఇక్కడ వుండి.. వధూవరులను ఆశీర్వదించాలి.." అన్నారు ఆ భార్యా భర్తలు ..వాళ్లిద్దరూ ఎప్పుడూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చేవారే.. శ్రీ స్వామివారి మీద అపారమైన భక్తి కలిగి వున్నవారు..మాకూ బాగా తెలుసు..అందువల్ల..ఒక్కక్షణం కూడా సంకోచించకుండా "సరే!" అనేశాము.. పెళ్లికి సుమారు నెలన్నర పైనే సమయం ఉంది..


శ్రావణమాసం వచ్చింది..సహజంగానే శ్రావణమాసం లో వచ్చే శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది..మేమూ ఆందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటాము..ఆ నెలలో మందిరం వద్ద వివాహాలూ జరుగుతుంటాయి..మొదటివారం గడిచిపోయింది..అప్పుడు గుర్తుకొచ్చింది నాకు..ఆ దంపతులు వచ్చి వాళ్ళబ్బాయి వివాహం అని చెప్పి వెళ్లారు కదా..నేను మర్చిపోయానేమో..అనే సందేహం వచ్చి మా సిబ్బందిని అడిగాను..ఫలానా వాళ్ళబ్బాయి వివాహం ఎప్పుడు?..లేక జరిగిపోయిందా?..అని..మా సిబ్బంది కూడా "ఆరోజు వచ్చి శ్రావణమాసం లో వివాహం అని చెప్పారే కానీ..ఫలానా తేదీ అని చెప్పలేదు..మళ్లీ మందిరానికి రాలేదు..మనలను సంప్రదించలేదు.." అన్నారు..హమ్మయ్య!..నేను మర్చిపోలేదు అని సంతోషించాను..వివరం కనుక్కోవడానికి ఫోన్ చేసాను.."అయ్యా..అబ్బాయి పెళ్లి విషయం నేను వచ్చి మీతో మాట్లాడతాను..వచ్చే ఆదివారం నాడు నేనూ నా భార్యా ఇద్దరమూ గుడికి వస్తాము.." అని ముక్తసరిగా బదులిచ్చి, ఫోన్ పెట్టేసాడు..ఏదో జరిగింది అని అనిపించింది..ఆ తరువాత నేను నా పనుల్లో మునిగిపోయాను..


ప్రక్క ఆదివారం నాడు ఆ దంపతులిద్దరూ మందిరానికి వచ్చారు..ఈసారి తమ కుమారుడిని కూడా తీసుకొని వచ్చారు..వాళ్ళను చూస్తే..పుట్టెడు దిగులుతో ఉన్నారనిపించింది..శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లి, సమాధి మందిరం గడప వద్ద చాలా సేపు నిలబడి ప్రార్ధించుకున్నారు..యధావిధిగా అర్చన చేయించుకున్నారు..నన్ను అనుమతి అడిగి, సమాధి వద్దకు వెళ్లి, సమాధికి తల ఆనించి నమస్కారం చేసుకున్నారు..ఇవతలికి వచ్చేసారు..


"మీతో ఆరోజు శ్రావణమాసం లో వివాహం అని చెప్పాను కదండీ..అన్నీ మాట్లాడుకున్నాము..నిశ్చయ తాంబూలాలు కూడా తీసుకున్నాము..మరి ఏ కారణమో తెలీదండీ..అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేసి.."మేము మీ సంబంధం వద్దు అనుకుంటున్నాము..మేము బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.." అన్నారండీ..మాకేమి అర్ధం కాలేదు..మా ఇంట్లో శుభకార్యం అని బంధువులందరితో చెప్పేశాము..ఫలానా తేదీ నాడు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద వివాహం అని కూడా తెలిపాము..ఉన్నట్టుండి వాళ్ళు "పెళ్లి రద్దు" అని చెప్పేసరికి..బాగా బాధపడ్డాము..మేమేమీ కట్న కానుకల దగ్గర పేచీ పెట్టలేదు..మా వైపు నుంచి ఎటువంటి కోరికలూ కోరలేదు..మరి ఎందుకని వద్దన్నారో అర్ధం కాలేదు..మనసుకు తీవ్ర కష్టం వేసింది..శ్రీ స్వామివారినే నమ్ముకొని వున్నాము..ఆయన ఎందుకని మాపై చిన్న చూపు చూశాడో తెలీదు..ఇప్పుడు కూడా ఆయనకే మొర పెట్టుకున్నాము.." అన్నారు.. 


"నమ్మిన వాళ్ళను దైవం ఎప్పుడూ చిన్న చూపు చూడడు..మీకు ఇంతకంటే మంచి సంబంధం కుదురుతుందేమో..కొన్నాళ్లపాటు మీకు వేదన ఉండొచ్చు..కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది..శ్రీ స్వామివారిని నమ్మి వున్నారు..నిశ్చింతగా వుండండి.." అని ఓదార్పుగా చెప్పాను..అన్యమన్యస్కంగానే తలూపారు..తల్లీ దండ్రి తో పాటు వచ్చిన ఆ అబ్బాయి కూడా ముభావంగా వున్నాడు..తిరిగి వాళ్ళ ఊరికి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి ఆ కుటుంబం మొత్తం శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..మాకూ కొద్దిగా బాధ అనిపించింది..


ఆ ప్రక్క బుధవారం నాడు ఉదయం పది గంటలప్పుడు..నేనూ మా సిబ్బంది మందిరం లో కూర్చుని వున్నాము..ఇంతలో ఆ దంపతులు వచ్చారు..వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి..ఇద్దరూ నేరుగా శ్రీ స్వామివారి సమాధి మందిరం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..అర్చన కూడా చేయించుకున్నారు..అక్కడనుంచి నేరుగా మా వద్దకు వచ్చి.."వచ్చే గురువారం అబ్బాయి పెళ్లి..ఇక్కడే చేయాలి..మొన్న సోమవారం నాడు మాట్లాడుకున్నాము..ఇంతకూ అమ్మాయి తరఫు వాళ్ళు మా బంధువులే!..వాళ్ళు మా సంబంధం చేసుకోవాలని అనుకున్నారట.. కానీ ఈలోపల మేము వేరే కుదిరింది అని చెప్పడంతో ఊరుకున్నారట..తీరా ఆ సంబంధం తప్పిపోయిందని తెలిసి..మా ఇంటికొచ్చి మాతో మాట్లాడి అన్నీ కుదుర్చుకుని వెళ్లారు..పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు..ఆలస్యం ఎందుకని వచ్చే గురువారానికి ముహూర్తం పెట్టుకున్నాము..ఈ స్వామివారు చల్లంగా చూసాడు..మంచి సంబంధమే కుదిరింది.." అని చెప్పారు..


అనుకున్నవిధంగానే శ్రీ స్వామివారి సన్నిధిలో ఏ ఆటంకం లేకుండా లక్షణంగా వివాహం జరిగిపోయింది..మొదటి సంబంధం తప్పిపోవడానికి ఏ కారణమో తెలీదు..మళ్లీ ఈ సంబంధం కుదిరి వివాహం కావడానికి కూడా కారణం తెలీదు..కారణం తెలిసింది ఒక్క స్వామివారికే..వారు చెప్పరు..మౌనంగా సమాధి నుంచి గమనిస్తూ వుంటారు..అందుకే మేము నిత్యమూ ఒకటి అనుకుంటూ వుంటాము.."స్వామి వారి లీలలు మన ఆలోచనలకు అందవూ.." అని..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

Manchi maatalu

 🌱🌱🌱🌱



                   *విత్తనం తినాలని*

                 *చీమలు చూస్తాయ్*..


                 *మొలకలు తినాలని*

                 *పక్షులు చూస్తాయ్*..

           

                 *మొక్కని తినాలని*

                *పశువులు చూస్తాయ్*..


                 *అన్ని తప్పించుకుని*

             *ఆ విత్తనం వృక్షమైనపుడు*..


            *చీమలు, పక్షులు, పశువులు*..

         *ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....


            *జీవితం కూడా అంతే TIME*

          *వచ్చే వరకు వేచివుండాల్సిందే*

          *దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....


              

 🌱🌱🌱🌱

 


               *లైఫ్ లో వదిలి వెళ్ళిన*

           *వాళ్ళ గురించి ఆలోచించకు*..


              *జీవితంలో ఉన్న వాళ్ళు*

              *శాశ్వతం అని భావించకు*..


           *ఎవరో వచ్చి నీ బాధను అర్థం*

           *చేసుకుంటారని ఊహించకు*...


              *నీకు నీవే ధైర్యం కావాలి*.....

          *నీకు నువ్వే తోడుగా నిలబడాలి*....


             

🌱🌱🌱🌱

 


                  *లోకులు కాకులు,*

                 *మనిషిని చూడరు*,

              *మనస్సును చూడరు,*

              *వ్యక్తిత్వాన్ని చూడరు.*


                     *కనిపించింది,*

            *వినిపించింది నమ్మేస్తారు*,

                 *మాట అనేస్తారు,*


                 *ఒక్కోసారి మన కళ్ళే*

              *మనల్ని మోసం చేస్తాయి.*


           *మరొకసారి చెప్పుడు మాటలు*

                        *జీవితాలను*

                  *తలకిందులు చేస్తాయి*


               🌱🌱🌱🌱

 


             *అబద్దాలతో, మోసాలతో*

                   *కీర్తి, ప్రతిష్టలను*

         *ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..

          *అవి కుప్పకూలి పోవడానికి*

               *ఒక్క "నిజం"చాలు*.

             *అందుకే కష్టమైనా సరే*

          *నీతిగా బ్రతకడమే మనిషికి*

                  *ఉత్తమ మార్గం.*


             : 🌱🌱🌱🌱

   


                *ఒక చిన్న మొక్కనాటి*

      *ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*      

                   *చూడకూడదు.*


             *ఎందుకంటే అది పెరగాలి*

                *మొక్క వృక్షం కావాలి*

          *పుష్పించాలి, పిందెలు రావాలి*

         *అవి కాయలై , పండితే తినగలం.*


              *అలాగే నేను ఇది కావాలి*

              *అనే కోరిక కూడా మొలకై*

       *వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*    

         *మసలుకోండి సన్నిహితులారా*🌹


            

🌱🌱🌱🌱

 


               *జీవితంలో కష్టము,*

             *కన్నీళ్ళు, సంతోషము,*

        *భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,


     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*


              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*.


             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*


              🌹🌹🌹🌹

    


                      *ఓడిపోతే*

            *గెలవడం నేర్చుకోవాలి*,


                     *మోసపోతే*

       *జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*,


                  *చెడిపోతే ఎలా*

           *బాగుపడలో నేర్చుకోవాలి,*


         *గెలుపును ఎలా పట్టుకోవాలో*

                *తెలిసిన వాడికంటే*

                   *ఓటమిని ఎలా*

          *తట్టుకోవాలో తెలిసిన వారే*

               *గొప్ప వారు నేస్తమా* !


           

        

 🌱🌱🌱🌱

 


              *దెబ్బలు తిన్న రాయి*

            *విగ్రహంగా మారుతుంది*


              *కానీ దెబ్బలు కొట్టిన*

             *సుత్తి మాత్రం ఎప్పటికీ*

          *సుత్తిగానే మిగిలిపోతుంది*....


          *ఎదురు దెబ్బలు తిన్నవాడు*,

         *నొప్పి విలువ తెలిసిన వాడు*

          *మహనీయుడు అవుతాడు*...


       *ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*

    *ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...

    

             🌱🌱🌱🌱

  


                 *డబ్బుతో ఏమైనా*

           *కొనగలమనుకుంటున్నారా*

             *అయితే కొనలేనివి ఇవిగో*


            *మంచం పరుపు కొనవచ్చు*- 

                    *కానీ నిద్ర కాదు*


                 *గడియారం కొనవచ్చు*:- 

                    *కానీ కాలం కాదు*


                  *మందులు కొనవచ్చు*:- 

                   *కానీ ఆరోగ్యం కాదు*


                  *భవంతులు కొనవచ్చు* :- 

                   *కానీ ఆత్మేయిత కాదు*


                   *పుస్తకాలు కొనవచ్చు* :- 

                      *కానీ జ్ఞానం కాదు*


          *పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*

                     *కానీ జీర్ణశక్తిని కాదు*

🌹🌹🌹🌹🌹

      


*ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*

*అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*

*కావాలి,*


*స్నానాలతోనే పాపాలు పోతే ముందు*

*చేపలే పాప విముక్తులు కావాలి,*


*తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*

*పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*

*గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*


*ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*

*నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*

*పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*,


*నీలో లేనిది బయటేమీ లేదు* 

*బయటఉన్నదంతా నీలోనూ ఉంది*

                                   

   🌹🌹🌹🌹🌹🌹