ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
19, మార్చి 2026, గురువారం
రామాయణం
శ్రీరామ (9)
(వాల్మీకి రామాయణం - 2)
(19-3-'26 ఉదయం పోష్టు తరువాయి భాగం )
" కౌసల్యా ౽జనయద్రామం సర్వలక్షణ సంయుతమ్"
(సమస్త శుభలక్షణములతో కూడిన శ్రీరామచంద్రుని కౌసల్యాదేవి ప్రసవించినది)
అని ఇంతకుముందు చెప్పుకున్నాము.
మంచి గుణములు ఉన్నవారిని లోకం కోరుకుంటుంది.
దయ, దాక్షిణ్యాది మంచి గుణములు మనచేత మంచిపనులను చేయించి మనకు, ఇతరులకు శాంతిని కలిగిస్తాయి.
ద్వేషము, పగ, అసత్యము, అసూయ, లాంటి దుర్గుణములు చెడు పనులు చేయించి మనకు లోకమునకు అశాంతిని కలిగిస్తాయి.
కాబట్టి మంచిగుణముల ప్రస్తావనతో రామాయణ మహాకావ్యం మొదలైంది.
1. శ్లో // తపస్స్వాధ్యాయనిరతం, తపస్వీ వాగ్విదాం వరమ్ /
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ //
( నారదమహర్షి ఎల్లప్పుడూ తపస్సు, వేదాధ్యయనము చేసుకుంటూ ఉంటాడు.
పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ, స్వరూపమైన వాక్కును తెలుసుకున్న వారిలో ఆ మహర్షి శ్రేష్ఠుడు.
తన ఆశ్రమానికి విచ్చేసిన,
మునులలో శ్రేష్ఠుడైన ఆ నారద మహర్షిని, తపస్వి అయిన వాల్మీకి మహర్షి, ఎంతో వినయంతో ఇలా ప్రశ్నించాడు )
2. శ్లో// కోన్వస్మిన్ సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చవీర్యవాన్/
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢ వ్రత://
(ఓ మహర్షి! ఈ భూలోకంలో ప్రశస్తములైన గుణములు కలవాడు ఎవడైనా ఇప్పుడున్నాడా?
గొప్ప పరాక్రమము కలవాడు,
అన్ని ధర్మములు తెలిసినవాడు,
చేసిన మేలు మరచిపోనివాడు,
ఎల్లప్పుడూసత్యమేపలికేవాడు,
నియమములయందు దృఢముగా వుండేవాడు,
అయిన వ్యక్తి ఎవడైనా ఇప్పుడు ఉన్నాడా?)
3.శ్లో// చారిత్రేనచ కో యుక్త: సర్వ భూతేషు కో హిత:/
విద్వాన్ క: క: సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః//
(అందరూ మెచ్చుకునే నడవడి కలవాడు,
అందరి మేలు కోరేవాడు,
విద్యలన్నీ నేర్చుకున్నవాడు,
కార్యములు సాధించడములో సమర్ధుడు,
ఎప్పుడు చూసినా ఆనందం కలిగించేవాడు,
అయిన మహాపురుషుడు ఇప్పుడు ఎవడైనా ఉన్నాడా?).
4. శ్లో// ఆత్మవాన్ కో జితక్రోధో, ద్యుతిమాన్ కో౽నసూయక:/
కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే//
(ఎల్లప్పుడూ ధైర్యముతో కూడినవాడు,
కోపమును తన అధీనములోఉంచుకున్న వాడు,
ఆహ్లాదాన్నికలిగించే కాంతి కలవాడు,
అసూయ లేనివాడు,
యుద్ధరంగములో ఎవరి కోపము చూచి దేవతలు కూడా (రాక్షసుల సంగతి చెప్పనక్కర లేదు)భయపడుతారో, అటువంటి వాడు ఇప్పుడు ఎవడైనా ఉన్నాడా?).
5. శ్లో//ఏత దిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే/
మహర్షే త్వం సమర్థో౽ సి జ్ఞాతు మేవం విధం నరమ్//
(ఓ మహర్షీ!ఇట్టి గుణములు గల మనుష్యుని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది.
మీరు మాత్రమే ఈ విషయం తెలియజెప్పడానికి
సమర్థులై వున్నారు).
అని వినయపూర్వకంగా నారదమహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్నించారు.
సద్గుణములే మనచేత సత్కార్య ములు చేయించి ఇహపర లోకములలో సుఖశాంతులను, తద్వారా మోక్షమును, ప్రసాదిస్తాయి కాబట్టి ఆ సద్గుణములను మనం అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆ సద్గుణ వర్ణణతో మహర్షి రామాయణ మహాకావ్యం ప్రారంభించారు.
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
19-3-'26.
పంచాంగం 17.03.2026 Tuesday,
ఈ రోజు పంచాంగం 17.03.2026 Tuesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస కృష్ణ పక్ష త్రయోదశి తిథి భౌమ వాసర శతభిషం నక్షత్రం సిద్ధ తదుపరి సాధ్య యోగః వణిజ తదుపరి భద్ర కరణం.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.
శ్రాద్ధ తిథి: చతుర్దశి
నమస్కారః , శుభోదయం
ఆర్యా శతకం - 1*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 53*
*శంపాలతాసవర్ణం సంపాదయితుం భవజ్వరచికిత్సామ్।*
*లింపామి మనసి కించన కంపాతటరోహి సిధ్ధభైషజ్యమ్||*
*భావము :*
*కంపానదీ తీరమున కొలువైన కాంచీపురములో, ఔషధ పూరితమైన ఒక తీగ ఉన్నది. ఆ తీగవంటి దేవిని నా శారీరక, సాంసారిక, ప్రాపంచిక జ్వర సంబంధమైన వ్యాధులను నివారించుటకు, మనసులో ధ్యానిస్తాను.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
భగవద్గీత
-------------------- భగవద్గీత. -------------------
తృతీయోధ్యాయ: కర్మ యోగము.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ।। 19 ।।
ప్రతిపదార్థ:
తస్మాత్ — కాబట్టి; అసక్తః — ఆసక్తి రహితుడవై (మమకారము లేకుండా); సతతం — ఎల్లప్పుడూ; కార్యం — కర్తవ్యమును; కర్మ — పని; సమాచర — నిర్వర్తించుము; అసక్తః — ఆసక్తి రహితుడవై (మమకారం లేకుండా); హి — నిజముగా; ఆచరన్ — ఆచరిస్తూ; కర్మ — పని చేయుము; పరం — ఆ పరమాత్మ; ఆప్నోతి — పొందును; పూరుషః — వ్యక్తి.
తాత్పర్యము :
కాబట్టి, మమకారాసక్తులను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము, ఏలనన కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.
వివరణ:
3.8వ శ్లోకం నుండి 3.16వ శ్లోకం వరకు, శ్రీ కృష్ణుడు, జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయి చేరనంత వరకూ, వారి వారి విహిత (చేయవలసిన) కర్మలను చేస్తుండమనే చెప్పాడు. 3.17వ మరియు 3.18వ శ్లోకాలలో, జ్ఞానోదయమైన మహాత్ములు విధింపబడిన కర్మలను చేయనవసరం లేదు అన్నాడు. కాబట్టి అర్జునుడికి ఈ రెంటిలో ఏ మార్గం యోగ్యమయినది? శ్రీ కృష్ణుడి సిఫారసు, అతన్ని కర్మ యోగిలా ఉండమనే, కర్మ సన్యాసం తీసుకోవద్దనే. దీనికి గల కారణాన్ని 3.20వ శ్లోకం నుండి 3.26వ శ్లోకం వరకూ వివరిస్తాడు.
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*🥭సభ్యులు - బంధువులు 🥭*
*🌿మిత్రులందరికీ🌿*
*🌹నూతన తెలుగు 🌹*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*🎊ఉగాది శుభాకాంక్షలు🎊*
*స్వస్తిశ్రీ పరాభవనామ*
*🌿సంవత్సరాదిః🌿*
*🥭యుగాది / ఉగాది🥭*
*ఉగాది / యుగాది ఆచరణ విధానం…*
*ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘ధర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు...*
```
1. తైలాభ్యంగనం,
2. నూతన సంవత్సరాది స్తోత్రం,
3. నింబకుసుమ భక్షణం(ఉగాది పచ్చడి సేవనం),
4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం),
5. పంచాంగ శ్రవణం,
మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.```
*(1) తైలాభ్యంగనం*```
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి.
ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసినచో లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.```
*“అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం”*```
(అభ్యంగన స్నానం సర్వ అవయవాల పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా.
ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.```
*(2) నూతన సంవత్సర స్తోత్రం*```
అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకుల తోరణాలతో, పూల తోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.```
*(3) ఉగాది పచ్చడి సేవనం*```
ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది, వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!
```
*”అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్”*
```అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది.
ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను.
ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖానికి క్రుంగకు, సుఖదుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి.
అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.```
*(4) పూర్ణ కుంభదానం*```
ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది.
ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం.
ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.
యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు(మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.```
*(5) పంచాంగ శ్రవణం*```
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం.
ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.
ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుంది.
ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.
‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు.
ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు.
అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి, జీవునకు చైతన్యం కలిగించేది కాలం.
ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.```
*శ్లోకం:*
*శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ*
*సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం*```
“ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి•```
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
నేటి వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - అమావాస్య*
మరియు
*పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్*
*ఉత్తరాభాద్ర - గురం వాసరే* (19.03.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
స్రగ్విణి
స్రగ్విణి వృత్తంలో వ్రాసిన పద్యం.
*సౌరభం వాహనం, సర్పమే భూషణం*
*తారకాశైలమే త్ర్యక్షునీ వాసమూ*,
*భారమూ నీదనీ, భాగ్యమూ నాదనీ*,
*కూరిమీ తోడనూ కొల్చెదా భైరవా!*
పరాభవ నామ సంవత్సరం*
*ఉగాది 2026 – పరాభవ నామ సంవత్సరం*
అసలు అర్థం ఏమిటి ?
మార్చి 19న ఉగాది.
తెలుగు ప్రజలకు ఇది కొత్త సంవత్సరానికి ఆరంభం.
ఈసారి ప్రారంభమయ్యే సంవత్సరానికి పేరు.
*పరాభవ నామ సంవత్సరం*.
*పరాభవ* పదం యొక్క అసలు అర్థం సంస్కృతంలో “पराभव” (Parābhava) అనే పదానికి నిఘంటువుల్లో ఇచ్చిన అర్థాలు.
పరాజయం (defeat)
అవమానం (humiliation)
తగ్గుదల / క్షీణత (decline)
ఈ పదం “पराभू (parābhū)” అనే ధాతువు నుండి వచ్చింది.
దాని అర్థం ఓడిపోవడం / అధిగమించబడటం.
ప్రామాణిక సంస్కృత నిఘంటువులు కూడా ఇదే అర్థాన్ని ఇస్తాయి.
ఈ పేరు విన్న వెంటనే చాలా మంది ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు
పరాభవం అంటే ఓటమి, అవమానం.
మరి ఈ సంవత్సరం కష్టాలు ఎక్కువగా ఉంటాయా?”
అయితే పండితులు చెప్పేది ఏమిటంటే పేరు అర్థం అలా ఉన్నా భక్తి పరముగా చూస్తే,
*పరాభవ* అనే పదం వెనుక ఉన్న అసలు భావం చాలా పవిత్రమైనది.
*పరాభవ* అనే పదం యొక్క భక్తిభావ లోతైన అర్థం
*పరాభవ* అనే పదాన్ని రెండు భాగాలుగా చూడాలి.
*1) పరా*
*పరా* అంటే *పరా భట్టారిక* *పరాత్పరి*— ఇది *లలితా త్రిపురసుందరి* / పార్వతి దేవికి సంబంధించిన పేరు.
*2)భవ*
“భవ” అంటే భవుడు — అంటే పరమశివుడు.
అందువల్ల *పరా + భవ = పరాభవ* అంటే పార్వతి పరమేశ్వరుల సమ్మిళిత కృపను సూచించే సంవత్సరం అని భావించాలి.
*పరాభవ నామ సంవత్సరం యొక్క భావం:*
సనాతన ధర్మంలో సంవత్సరాల పేర్లు యాదృచ్ఛికంగా పెట్టలేదు.
ప్రతి సంవత్సరం పేరుకు సంస్కృత పేరుతో పాటు ఒక ఆధ్యాత్మిక భావం ఉంటుంది.
పరాభవ నామ సంవత్సరం సూచించేది ఏమిటంటే,
ఆదిదంపతులైన పార్వతి – పరమేశ్వరులు తమ పిల్లలైన భక్తులను రక్షించే సంవత్సరం దైవ కృపతో సామరస్యం, శాంతి పెరిగే సంవత్సరం అందువల్ల ఈ సంవత్సరం పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు.
సంవత్సరం పేరు కంటే మన ఆచరణ ముఖ్యము. ఈ సంవత్సరం మనం సత్యం, ధర్మం, భక్తి, సత్సంకల్పంతో జీవిస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
పార్వతి పరమేశ్వరులను భక్తితో స్మరిస్తూ ఉంటే వారి కరుణతో మనకు కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, మనశ్శాంతి. అభివృద్ధి
లభిస్తాయి.
ఉగాది యొక్క అసలు సందేశం.
ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం కాదు.
ఇది మనకు గుర్తు చేసే విషయం.
🌱 కొత్త ఆలోచనలు ప్రారంభించాలి.
🌱 పాత చెడు అలవాట్లు వదలాలి.
🌱 ధర్మ మార్గంలో నడవాలి.
ఉగాది పచ్చడి కూడా ఇదే సందేశం ఇస్తుంది. జీవితంలో తీపి, చేదు, కారం, పులుపు అన్నీ ఉంటాయి.
అన్నిటినీ సమంగా స్వీకరించగలిగితే జీవితం సమతుల్యంగా ఉంటుంది.
కాబట్టి *“పరాభవ నామ సంవత్సరం”* అంటే అవమానాల సంవత్సరం కాదు.
అది పార్వతి పరమేశ్వరుల కృప మనపై ఉండే సంవత్సరం అని పండితులు వివరంగా చెబుతున్నారు.
ఉగాది పచ్చడి తినేటప్పుడు
ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్||
వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ.... నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.
ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది:-
అబ్దాదౌ నింబకుసుమం
శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేస్యా
తద్వర్షం సౌఖ్యదాయకమ్॥ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం.


