13, సెప్టెంబర్ 2022, మంగళవారం

ఆత్మజ్ఞానం

 ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఏమౌతుంది?

ఆత్మజ్ఞానం కలగగానే, వేయి సూర్యులు ప్రకాశం కనిపించడం గాని, ఇతరుల మనుసులో ఏముందో తెలిసిపోవడం కానీ, తల వెనుక వెలుగు కానీ రావు.


సిద్ధులు కూడా ప్రాప్తించవని ఇంతకు ముందు ఈ సమాధానంలో చెప్పాను.[1]


జెన్ సంప్రదాయంలో ఒక సూక్తి ఉంది.


Before Enlightenment, chop wood, carry water. After Enlightenment, chop wood, carry water.


అంటే మన దైనందిన కార్యక్రమాలు ఎప్పటిలాగానే సాగుతాయి. జ్ఞానసిద్ధి పొందిన తర్వాత బాహ్యంగా ఏమీ పెద్ద మార్పు ఉండదు. మోహంలో శాంతి, చిరునవ్వు కూడా కనిపించాలని ఏమీ లేదు. రమణ మహర్షి వదనం కరుణను కురిపిస్తే, శ్రీ నిసర్గదత్త మహారాజ్ చివరివరకూ చిర్రుబుర్రులాడుతూనే ఉండేవారట.


కానీ మన అంతరంగంలో మాత్రం పెను మార్పులు సంభవిస్తాయి. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని వివరిస్తాను.


ఇదివరకు తెలియని ‘తేలికతనం’ వస్తుంది


గతంలో మనం చేసిన/చేయని పనుల పట్ల ఆత్మనింద, మన క్షమత మీద అపనమ్మకం, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనే చింత, భవిష్యత్తు గురించి ఆందోళన, ఇలా మన జీవన ప్రయాణంలో తెలియకుండానే చాలా బరువులను మోస్తూ ఉంటాము.


ఈ బరువులన్నింటికీ కారణం ‘నేను’ అనే స్ప్రుహ కేవలం శరీరం, మనస్సు మాత్రమే పరిమితం అవడం. ఈ ‘మితమైన నేను’ ఒక భ్రమే అని నిస్సందేహంగా తెలియటమే ఆత్మజ్ఞానం. అపుడు దాని తాలూకు బరువులు కూడా, బేతాళుడిలా ఎగిరిపోతాయి. నిజానికి చిన్నపిల్లలగా ఉన్నప్పుడు (ఇంకా ‘ఊహ’ రానప్పుడు) మనకి ఈ స్థితి అనుభవైక్యమే. ఇపుడు కూడా, ఏ బాదరబందీ లేకుండా హాయిగా నవ్వుతున్న పిల్లలను చూస్తే మనకీ ఆనందం కలుగుతుంది. అదే స్థితి మళ్ళీ మనకే పూర్తి యెఱుకతో కలిగితే? ఆ ఆనందాన్ని అనుభవించగలమే కానీ వర్ణించలేము.


బానిసత్వానికి చెల్లు


మీరు గమనిస్తే మనం ప్రస్తుతం కన్నా గతం, భవిష్యత్తు తాలూకు ఆలోచనలలోనే ఎక్కువ సమయం గడుపుతాము. గతంలో జరిగినవి/జరగనివి అకస్మాత్తుగా గుర్తుకువస్తాయి. వాటి వెంబడే సంతోషం/గర్వం/గిల్ట్/నిస్పృహ ఆవహిస్తాయి. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా ఉత్సాహం/ఆందోళన కలిగిస్తూ ఉంటాయి.


ఈ భావాలన్నిటికీ మూలం ఆలోచనలు. Thoughts ‘Arise’ and trigger ‘Actions’ (including emotional responses). ఈ ఆలోచనలు బుడగలుగా ఉద్భవిస్తాయి. వాటి ఆయుష్షు చాలా తక్కువ. అయితే ఈ విషయాన్ని మనం నిశితంగా గమనించకపోవటం వలన మనందరమూ మన ఆలోచనలకు బానిసలమై, అవి ఎటుతీసుకుని వెళితే అటు నిస్సహాయులమై పోతూవుంటాము.


ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత Arising - Action మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. దీని వలన ఏది అవసరమైన చింతనో ఏది అనవసరమో తెలుసుకునే సమయం దొరుకుతుంది. అపుడు ఆలోచన వ్యాకులతగా మారుతుంటే వెంటనే కళ్లెం వేయగలుగుతాము. జ్ఞానం స్థిరమౌతున్న కొద్దీ, ఈ అప్రమత్తత (alertness) ఆశావాదం లోనూ పనిచేస్తుంది. అదేంటి, ఆశావాదం మంచిదేకదా అనిపించవచ్చు. జ్ఞానులకు ఆశ-నిరాశ ఒక నాణెంలో ఉన్న బొమ్మ-బొరుసు. అందుకే వారు స్థితప్రజ్ఞుతతో ఉండగలరు.


సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది


జ్ఞానసిద్ధి పొందిన తర్వాత, సాధించాల్సింది ఇంకేమి ఉండదు కాబట్టి, గతంలో భవిష్యత్తులో కన్నా ప్రస్తుతంలో ఎక్కువ ఉంటాము.


మనకి ఎవరూ ఇవ్వగలిగేది ఇంకేమీ లేదు అనే ప్రచండమైన భావన ఆవహిస్తుంది. ఇది గొప్ప అనుభూతి. అపుడు అవతలి వారు ఎంత గొప్పవారైనా కూడా, you won’t be starstruck. Ever.


అంతటి సెల్ఫ్-వర్త్ వస్తుంది.


మరణ భయం పోతుంది


ఇది అన్నిటికన్నా గమనించదగ్గ విషయం.


మరణ భయం అంటే ఏమిటి? మనం ఆనందించేవి, మనకి ప్రియమైనవి కోల్పోతామేమోననే చింత. అవి కుటుంబ ప్రేమాప్యాతలు, ఆస్తిపాస్తులు, పేరుప్రతిష్ఠలు కావచ్చు. వీటన్నింటికి మించినది మన దగ్గరున్నప్పుడు (మనమే అయినప్పుడు) ఇవి కోల్పాతమనే చింత ఎందుకుంటుంది? Rolls Royce కారే ఉంటే, Alto ని వదులుకోవడంలో బాధ ఏమి ఉంటుంది?


అయితే బాధలేనంత మాత్రాన నొప్పి ఉండదని కాదు. నొప్పికి బాధకి తేడా ఉంది. మాజీ ప్రధాని శ్రీ వీపీ సింగ్ ఒకనొక చివరి ముఖాముఖీల్లో “నేను మరణానికి భయపడను కానీ ఆ సమయంలో నొప్పికి భయపడతాను” అన్నారు. నిజానికి నొప్పి కన్నా, నోప్పి కలుగుతుందేమో అన్న భయం మరింత బాధిస్తుంది. ఉదాహరణకు, మనకి ఎప్పుడో ఒకప్పుడు కాలికి ఎదో తగిలి ప్రాణం కడెట్టుంటుంది. అంత బాధా మనము భరిస్తాము, కానీ తెలిసితెలిసి ఒక చిన్న ఇంజక్షన్ తీసుకోలేము.


కానీ ఆత్మజ్ఞానులకు శరీర పరంగా నొప్పి ఉంటుంది కానీ బాధ ఉండదు. శ్రీ రామకృష్ణ పరహంస కి గొంతు కాన్సర్ కారణంగా తీవ్రమైన నొప్పి ఉన్నా అది ఆయనను బాధించలేదు.


జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాము


ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆనందానికి దేని మీద ఆధారపడము. ఎపుడు ఎదో పనిలో నిమగ్నమవ్వాల్సిన ‘అవసరం’ ఉండదు. సాధన దశలో పెంచుకున్న ఏకాగ్రత ఫలవంతమై నిశబ్దంలో శాంతంగా ఉండగలుగుతాము. (ఈ ఏకాగ్రత సాధన ధ్యాన సమయాల్లోనే కాకుండా, ఇతర దైనందిన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఎలా చేయవచ్చో ఈ సమాధానం లో చెప్పాను.)[2]


అయితే ఈ మార్పులన్నీ వివిధ దశల్లో సంభవించవచ్చు. నిజానికి జ్ఞానోదయం అయిన తర్వాత జరిగే మార్పులను, మోక్ష సిద్ధి తర్వాత జరిగే మార్పులను నేను కలిపి చెప్పాను. జ్ఞానసిద్ధికీ, మోక్ష సిద్ధికీ తేడా ఉంది.

సర్టిఫికేట్

 డెత్ సర్టిఫికెట్:


       ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. 


     ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

  

     “చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో  ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. 

                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.


     ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ  గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" 

"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది  అయినా ఒకటే. 


     అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే. 

ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


       మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. 

చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. 


     ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

 

     మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. 

అదే డెత్ సర్టిఫికేట్.


సేకరణ ..


గౌ.శ్రీ. జస్టిస్ ఎన్.వి.రమణ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

సంకష్టహర చతుర్ధి

 🌹🙏 _*సేకరణ*_🙏🌹


🌴🌹🌷🪷🛕🪷🌷🌹🌴

*మంగళవారం 13, సెప్టెంబరు 2022*

      🙏 *సంకష్టహర చతుర్ధి*🙏


🌹 *వ్రతము - వ్రత - విధానం..!!!*🌹 


గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అంటారు...


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. 


ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. 

రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. 

ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది,

ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు, ఈ వ్రతాన్ని  12 లేదా 21 నెలలు ఆచరిస్తారు,

ఈ సంకట హర వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి.


 ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి  అందులో వుంచాలి....

 మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. 

దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే  ప్రదక్షిణ చేయవచ్చు.  

శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. 

అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి.

 "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి.

 చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. 

నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి....


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


 *సంకటహర గణపతి స్తోత్రం* 


ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం 

భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం

లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం

ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్

ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం

నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో

విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం

పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్

జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్

సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః


*సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.*

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు.

 అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది.


ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.


అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. 

ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. 

అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా!అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. 

సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. 

సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. 

చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.


అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. 

ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష దూత అంగీకరించనే లేదు. 

ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది, దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ( *ఈ కథ అంతర్జాలంలో లభ్యం అయింది మాత్రమే, ఏ పురాణ అంతర్గతమో తెలియదు* )


ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.


వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.


*అంగారక చతుర్థి*


సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు.

 సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజ దోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.


భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి, నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. 

అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు.


*అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి?*


గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. 

అవి 

1. వరద గణపతి పూజ 

2. సంకష్టహర గణపతి పూజ. 

వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, 

అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. 

అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, 

వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.


 *సంక్షిప్త వ్రత విధానం* 


1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.

*2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి*.

*3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి*.

4. సాయంత్రమవగానే స్నానం చేయాలి.

5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.

6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.

*7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి*.

*8. కొంతసేపు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి*.

9. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి.

10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.

*11. చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి*.

*12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి*.

*13. బ్రహ్మచారికి భోజనం పెట్టి , తరువాత తానూ భుజించాలి*.

14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ, నిద్రపోవాలి.


నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ, మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా,


 ఏ పూలు వాడాలి?


జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం.

వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు  వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.


 ఏ మంత్రం జపించాలి?


జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ,

' *ఓం సంకష్టహర గణపతయే నమః* ' అనే నామ మంత్రంగానీ,'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః

ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే' 

అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.


నైవేద్యం ఏమి సమర్పించాలి?


కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు, 21 మోదకాలు.

 

ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?


జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.


రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?


జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.


అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?


జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.


 పూజ చేయడం చేతకాదనుకుంటే?


జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి.


 *వ్రతాచరణ వలన లాభాలు* 


గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. 

వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. 

అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.


అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కఏడాది అయినా  ఆచరిస్తే చాలు మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. 

ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం.


పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.


 *సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు* 


ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం

లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం

ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః

శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం


 *ఏకవింశతి నామ పూజ* 


ఓం సుముఖాయ నమః మాలతీ పత్రం పూజయామి

ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి

ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి

ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి

ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి

ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి

ఓం గజకర్ణాయ నమః జంబూ పత్రం పూజయామి

ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి

ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి

ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి

ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి

ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి

ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి

ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి

ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి

ఓం సురాగ్రజాయ నమః గణ్డకీ పత్రం పూజయామి

ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి

ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి

ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి

ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజయామి


🙏 *వ్రత కథ* 🙏


పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ...


                *_🌷శుభమస్తు🌷_*


   🙏 *సమస్త లోకా సుఖినోభవంతు* 🙏

ఉబ్బస వ్యాధి

 ఉబ్బస వ్యాధి  -  నివారణా యోగాలు  .


  *  ఉత్తరేణి చెట్టు సమూలంగా తెచ్చి కాల్చి భస్మం చేసి జల్లెడ పట్టి నిలువ ఉంచుకుని పూటకు ఒక గ్రాము మోతాదు గా ఒక టీ స్పూన్ తేనే కలిపి రెండు పూసిటలా సేవిస్తూ ఉంటే కటిన ఉబ్బస రోగాలు తగ్గుతాయి .


  *  కుప్పింట చెట్టు సమూలంగా తీసి కడిగి నీడలో ఎండబెట్టి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి ఆ చుర్ణానికి తేనే కలిపి దంచి ముద్దచేసి నిలువ చేసుకోవాలి . రోగబలాన్ని , రోగి బలాన్ని బట్టి , వయస్సుని బట్టి ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బసపు దగ్గు హరించును. ఇది నా అనుభవ పూర్వకం .


  *  గలిజేరు చెట్టు చెట్టు వ్రేళ్ళతో సహా తెచ్చి శుభ్రంగా కడిగి వ్రేళ్లు కత్తిరించి తీసి ఆవుపాలలొ ఉడకబెట్టి ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా బెల్లం , నెయ్యి కలిపి ఉదయం పూటనే తింటూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును. 


  *  రావి చెట్టు కాచే రావిపండ్లు తెచ్చి ముక్కలుగా కోసి ఎండబెట్టి దంచి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి నిలువ చేసుకోవాలి . ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రా మోతాదుగా రెండు పూటలా తేనేతో కాని పటికబెల్లం చూర్ణం తో కాని కలిపి తింటూ ఉంటే ఉబ్బస రోగం హరించును. ఇది స్త్రీలకు, సంతాన యోగం కూడా కలిగించ గలదు.


  *  ప్రతి రొజూ ప్రతి పూట భొజనం చేసే ముందు యాలుక ల చూర్ణం రెండు లేక మూడు గ్రాముల మోతాదుగా మొదటి ముద్దతో కలుపుకుని తింటూ ఉండాలి.దీనితో పాటు ప్రతిరొజు రాత్రి నిద్ర పొయే ముందు 10 గ్రా శనగపప్పు తింటూ ఉండాలి. ఇలా నిత్యం చేస్తూ ఉంటే ఉబ్బసం వలన కలిగే బాదలు తొలగిపోతాయి.


  *  పసుపు కొమ్ములు దంచిన చూర్ణం ఒక గ్రాము నుండి రెండు గ్రాముల వరకు తమలపాకు లొ పెట్టుకుని తింటూ ఉంటే ఉపిరితిత్తులు బిగబట్టి శ్వాస కష్టంగా ఉండే సమస్య తొలగిపోవును.


  *  మారేడు ఆకులు, 10 గ్రా తీసుకుని 40 గ్రా మంచినీళ్ళలో వేసి 10 గ్రా కషాయం మిగిలేలా మరగబెట్టి వడపోసి చల్లార్చి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఉబ్బసం తగ్గును . 


  *  శొంటి 20 గ్రా చూర్ణం లొ 300 గ్రా నీళ్లు పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి , 100 గ్రా మిగిలేంత వరకు కాచి దించుకొని వడకట్టాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే క్రమంగా ఉబ్బసం హరించి పొతుంది.


  *  జిల్లేడు చెట్టు మొగ్గలు 15 గ్రా , వాము 10 గ్రా , బెల్లం 15 గ్రా ఈ మూడు వస్తువులు కలిపి మెత్తగా మర్దించి 5 గ్రా బరువు ఉండేలా మాత్రలు తయారు చేసుకోవాలి . ప్రతిరొజు ఉదయం పూట మాత్రమే మంచినీళ్ళతో వేసుకోవాలి . ఈ విధంగా 40 దినాలు చేస్తే ఎంత కటినమైన ఉబ్బసం అయినా సమూలంగా నివారించ బడును.


  * ఉల్లిపాయ రసం 50 గ్రా , వెల్లుల్లి రసం 50 గ్రా , అల్లం రసం 50 గ్రా , కలబంద రసం 50 గ్రా , పట్టు తేనే 50 గ్రా ఈ పదార్దాలు అన్ని గాజు సీసాలో పోసి మూతగట్టిగా పెట్టి మూడు రోజుల పాటు ఆ సీసాని భూమిలో పాతిపెట్టాలి.ఆ తరువాత దాన్ని బయటకి తీసి రోజు రెండు సార్లు 5 గ్రా మోతాదుగా  లొపలికి తీసుకుంటూ ఉంటే మూడు వారాల్లో ఉబ్బసం వ్యాధి సమూలంగా అంతరించి పొతుంది.


  * ఒక కప్పు టీ లొ ఒక నిమ్మ పండు రసం కలిపి తాగితే ఉబ్బసం వెంటనే శాంతించును. ఇది తాత్కాలికంగా పనిచేయును . 


  *  నేలతాడి గడ్డల చూర్ణం 5 గ్రా , పటికబెల్లం చూర్ణం 5 గ్రా కలిపి ఒక మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఉబ్బస వ్యాధి హరించును.


 *  శారీరక శక్తిని బట్టి రోజు 5 నుండి 10 చుక్కల శుద్ధమైన వేప నూనెని తాంబూలం లొ వేసుకొని నమిలి మింగుతుంటే మూడు వారాలలో కటినమైన ఉబ్బస వ్యాధి హరించును.


 *  రోజు రెండు పూటలా భరించ గలిగినంత వేడి నీటిని ఒక పళ్ళెంలో పోసి ఉబ్బసం రోగి తన పాదాలని ఆ నీటిలో ఉంచడం వలన ఉబ్బసం శాంతిస్తుంది.ఇలా రెండు పూటలా చేస్తూ తగిన ఔషధాలు , ఆహర నియమాలు పాటిస్తే తొందరగా ఉబ్బస వ్యాధి నుంచి కోలుకొంటారు.


 *  చక్ర కేళి అరటి పండు ని ఆవుమూత్రం లొ మెత్తగా పిసికి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఆవుమూత్రం పతంజలి స్టోర్స్ లొ దొరుకును.


 *  ఉత్తరేణి గింజలు 5 గ్రా , మిరియాలు 10 గ్రా , ఈ రెండింటిని తుమ్మ చెట్టు జిగురు నీళ్లతో నూరి గురుగింజ అంత మాత్రలు చేసి పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూటలా మంచినీళ్ళు తో వేసుకోవాలి . ఈ విధంగా చేయడం వలన ఉబ్బసవ్యాది  పూర్తిగా తగ్గిపోవును . 


 గమనిక  -


      పైన చెప్పిన నివారణా యోగాలలో మీకు సులభమైన వాటిని ఏదో ఒకటి ఎంచుకుని మీ వ్యాధిని తగ్గించుకోనగలరు. అదే విధంగా యే అయుర్వేద ఔషదం అయినా 41 రోజులు                 ( మండలం ) విడవకుండా వాడినప్పుడే తన ప్రభావాన్ని బలంగా చూపిస్తుంది. కొన్ని మూలికలు నేలతాడి ఇలాంటివి మీకు పచారి షాపుల్లో దొరుకుతాయి.


    మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

ఒక్క పేరుకైనా

 సేకరణ 

😂ఒక్క పేరుకైనా పొట్టచక్కలు అయ్యేట్టు నవ్వుతారు 😂


ఈరోజుల్లో....పిల్లల పేర్లు.....ట్రెండ్ ఎలావుందో చూడండి...........(ఇది సేకరణ.....వాట్సప్)


నాదగ్గరకి ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నాకు తెలిసిన వాడొకడు.

 "మీరే ఎలాగైనా సాయం చేయాలి. ఎంతోమందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థంచేసుకోలేకపోయారు."


 "ఏమిటో నీ కష్టం?"


 "పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి, ఇంతవరకూ పేరు పెట్టలేకపోయాం. నెట్‌ సెర్చ్‌ చేశాం, పుస్తకాలు వెతికాం. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీ దగ్గరకెళ్ళమన్నారు. మీరు తెలుసు కనక మీదగ్గరకొచ్చాను."


 "ఎలాంటి పేరు కావాలి?"


 "ఆ పేరు మా పిల్లకు మాత్రమే ఉండాలి. ఇంకెవరూ పెట్టుకోకూడదు."


 "సూర్యకాంతం పెట్టు. అదైతే నాకు తెలిసి ఎవరూ పెట్టుకోరు."


 "కానీ, పేరు విచిత్రంగా ఉండాలి. మా బావ, కూతుళ్ళిద్దరికీ ‘పండు వెన్నెల’, ‘నిండు పున్నమి’ అని పెట్టాడు. అట్లాంటి పేర్లు ఎవరికీ లేవని పొగరుతో విరగబడుతున్నాడు. వాటిని తలదన్నే పేరు పెట్టాలి."


 "మీ బావగాడి చెంప మీద కొట్టినట్టుండే పేర్లు చెప్తా రాసుకో. పట్టపగలు, చిమ్మచీకటి, మిట్ట మధ్యాహ్నం."


 "మా పిల్ల పేరు ఫైనలైజ్‌ అయ్యేవరకూ ఈ పేర్లు ఎక్కడా లీక్‌ చేయొద్దు సార్‌, ప్లీజ్‌!"


 "సర్లే, ఎవరికీ చెప్పనులే. అయినా ఎందుకోయ్‌ అంత టెన్షన్‌?"


 "పిల్లకు పేరుపెట్టే ఉద్దేశమేమైనా ఉందా... అసలేమైనా ప్రయత్నం చేస్తున్నావా? - అని రోజూ మా ఆవిడ తిడుతోంది సార్‌!"


 "నీ మాటల్లోనే రెండు పేర్లు దొరికాయి. ‘ఉద్దేశ’, ‘ప్రయత్న’ ఇంతకూ మీ ఆవిడ ఏమని తిడుతోంది నిన్ను?"


 "వేస్టుగాడివంది."


 "వేస్టు అంటే వ్యర్థం. ‘వ్యర్థ’- సూపర్‌ పేరు!"


 "ఇప్పుడు చాలామంది శాన్వి అనీ శ్రాగ్వి అనీ పెడుతున్నారు కదా... వాటికి అర్థం ఏవిటండీ?"


 "మీ ఆవిడ అందని కాదుగానీ, నిజంగానే వేస్టుగాడివోయ్‌. పేరుకు అర్థమేంటీ... పేరుకు అర్థం ఉండకపోవడమే ఇప్పటి ట్రెండ్‌. మా బాబాయి మనవరాళ్ళ పేర్లేవిటనుకున్నావు? పెద్దదాని పేరు ‘శ్మశాన’, చిన్నదాని పేరు ‘వాటిక’. ఎలా ఉన్నాయి?"


 "బ్రహ్మాండంగా ఉన్నాయి సార్‌. కాదేదీ పేరు కనర్హం అన్నమాట!"


 "మరే... ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా రెండు పేర్లున్నాయి... బ్రహ్మాండ, అనర్హ."


 "మీరు శూన్యంలో నుండి కూడా పేర్లు తీస్తున్నారు సార్‌!"


 "శూన్య - ఇదేదో బాగుందయ్యా! బుర్రలో ఆ తెలివి ఉండాలి. ఏది చూసినా పేరు తట్టాలి. మా తమ్ముడు ఓ రోజొచ్చి ‘అన్నయ్యా, పిల్లల పేర్లు పెట్టడం విషమ సమస్యైంది’ అన్నాడు. అంతే, పిల్ల పేరు ‘విషమ’, పిల్లాడి పేరు ‘సమస్య్‌’. ఎలా ఉన్నాయి?"


 "బాగున్నాయి సార్‌. మా అమ్మ శివుడి పేరు మీద శివకుమారి అని పెడతానంటోంది."


 "అలా రొటీన్‌ పేరు పెట్టావో, నువ్వూ మీ ఆవిడా కలిసి ఒకే తాడుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది."


 "కోప్పడకండి సార్‌!"


 "రొటీన్‌కు భిన్నంగా ఆలోచించవయ్యా. శివకుమారి కామనే గదా... ‘శవకుమారి’ అని పెట్టు. లేకపోతే 'కళేబరి' "


 "గురువుగారూ, ఇంతకూ మీ పిల్లల పేర్లు ఏవిటండీ?"


 "ఎవరికీ లేని పేర్లు పెట్టాలని అమ్మాయి పేరు ‘సామూహిక’, అబ్బాయి పేరు ‘అత్యాచార్‌’ పెట్టాను. తీరా ఇప్పుడేమో పొద్దున్న లేస్తే పేపర్‌ నిండా అవే. ఆ పేర్లు ఇంకెవరైనా పెట్టుకుంటారేమోనని కంటినిండా నిద్రపోయింది లేదు. అంతా నా ఖర్మ... అరె, ఇదేదో బాగుందే, ‘ఖర్మ’ ఎలా ఉంది?"


 "చాలా బాగుంది గురువుగారూ. కాకపోతే మా వంశానికి నాగదేవత పేరుతో కలిపి పెట్టుకోవాలి. ‘నాగఖర్మ’ అని పెట్టుకోమంటారా?"


 "మళ్ళీ ఇదొకటా?"


 "అవును సార్‌. మా కజిన్ల పేర్లు ‘నాగ బీభత్స్‌’, ‘నాగ డింభక్‌’, ‘నాగ హిడింబ్‌’. మా అన్నయ్య తన పిల్లలకు ‘సర్ప జగదేక్‌’, ‘నాగ అతిలోక్‌’ అని పెట్టాడు. 


 "మళ్ళీ ఇదొక దరిద్రమా? ఒక్క నిమిషం... దరిద్ర... నాగ దరిద్ర అని పెట్టు."


 "కానీ మా ఆవిడ మూడక్షరాల పేరే పెడదామంటోంది."


 "‘కుబుస’ అని పెట్టు, సరికొత్త పేరు. నాగదేవతకు సంబంధించినదే. అక్షరాలూ మూడే."


 "అద్భుతం సార్‌. ఇదే ఫైనల్‌. ‘కుబుస’ అని పెట్టేస్తా."

...

చూశారా? పిల్ల పేర్ల ఉత్పత్తి ప్రకరణం!...


🙏సర్వేజనా సుఖినోభావంత్🙏

వ్యాసభగవానుడు

 Srimadhandhra Bhagavatham -- 1 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు.


వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విధి విదానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. ‘జ్ఞానాత్ కేవల కైవల్యం’ జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.


పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తరభాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడయిన జైమినిచేత వేదమునకు పూర్వభాగమయిన కర్మకు సంబంధించిన, విషయములన్నిటికి వ్యాఖ్యానం చేయించారు. దానిని ‘పూర్వమీమాంస’ అంటారు. ఉత్తరభాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాసమహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ‘ఉత్తరమీమాంస’ అని కూడా అంటారు. మరల ఆయన పదునెనిమిది పురాణములను రచించారు. పురాణములను రచించడం అంటే తేలికయిన పనికాదు.


‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ!

వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం!!

పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశములను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధముగా దానిని ప్రతిపాదన చేయకలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేదు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడము కోసమని తేలిక సూత్రమునొక దానిని పెద్దలు ప్రతిపాదించారు.


‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’చతుష్టయం!

‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ స్కా’ని పురాణాని పృథక్ పృథక్!! (దేవీభాగవతం 1-3-21)


మద్వయం – మకారముతో రెండు పురాణములు ప్రారంభము అవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము.

భద్వయం – భ తో రెండు పురాణములు ప్రారంభమవుతాయి. అవి భాగవత పురాణము, భవిష్య పురాణము.


బ్రత్రయం – బ్ర’ తో మూడు పురాణములు ప్రారంభమవుతాయి. అవి బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము.

వచతుష్టయం – ‘వ’కారంతో నాలుగు పురాణములు ప్రారంభమవుతాయి. అవి వరాహపురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము.

అనాపలింగకూస్కాని – అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పురాణము వస్తుంది.


అ – అగ్నిపురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగపురాణం, గ – గరుడ పురాణం, కూ – కూర్మపురాణం, స్కా – స్కాందపురాణం.


వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

గణేషుడిని 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారు ?

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


_*వినాయక చవితి రోజున , గణేషుడిని 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారు ?*

వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి , అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి 'మతం' అంటే 'మానవత్వా'న్ని పెంచేదే కదా ! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం 'కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి.


21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన , శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. . 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు. చెరువులు , బావులు , నదులు - వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో , చెరువుల్లో , బావుల్లో నిమజ్జనం చేయడం , అలా నీటిలో కలిపిన మట్టి , 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి , జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే *'పర్యావరణ పరిరక్షణ'* రహస్యం.


వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.


*మాచీ పత్రం:*


మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.


*బృహతీ పత్రం:*


దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక , పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.


*బిల్వ పత్రం:*


బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా , ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.


*దూర్వా పత్రం:*


దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక , నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.


*దుత్తూర పత్రం:*


దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.


*బదరీ పత్రం:*


బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు , జిట్రేగు , గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.


*అపామార్గ పత్రం:*


తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు , ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.


*తులసీ పత్రం:*


హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.


*చూత పత్రం:*


చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు.


*కరవీర పత్రం:*


దీనినే గన్నేరు అంటారు. తెలుపు , పసుపు , ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.


*విష్ణుక్రాంత పత్రం:*


ఇది నీలం , తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.


*దాడిమీ పత్రం:*


దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.


*దేవదారు పత్రం:*


దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.


*మరువక పత్రం:*


దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం , మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.


*సింధువార పత్రం:*


సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.


*జాజి పత్రం:*


ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.


*గండలీ పత్రం:*


దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.


*శమీ పత్రం:*


జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


*అశ్వత్థ పత్రం:*


రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.


*అర్జున పత్రం:*


మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.


*అర్క పత్రం:*


జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు , అష్టైశ్వర్యాలు , కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

పాలవెల్లి

 🙏పాలవెల్లి ఎందుకు కడతారు 🙏


వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు...మన పెద్దలు కట్టారని మనమూ కడుతున్నాం... వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం.


వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. 


ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి.


ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.


గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా! ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశాన్ని (లయం) సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము.

 

*గణపతి'* అంటే గణాలకు అధిపతి, తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు


పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళవస్తువులకు సూచన అన్నమాట.

 

ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది.


గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు....పండగ అంగరంగవైభవంగా సాగిపోయినట్లే! పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.


                   ఓం గం గణపతయే నమః

సందేహం

 *సందేహం (❓):* 💐 *నివృత్తి (✅):*

🌹🌻🌻🌻🌹🙏🙏🌹🌻🌻🌻🌹


       ❓ *సందేహం (?):* ❓


❓ *గణపతి అర్చనకు తులసి పనికి రాదని చాలామంది చెబుతున్నారు. కానీ వినాయకచవితినాడు తులసి వేయవచ్చు - అని కొందరంటారు. అయితే ఆ రోజు కూడా తులసి వేయరాదని చెబుతూ, 'వేయవచ్చు' అనే మాటకు ఎక్కడా ప్రమాణం లేదని ఒక పండితుడు అన్నారు.* 


*గణేశ చతుర్థినాడు తులసి వేయవచ్చా!? వేయరాదా!?* ❓


        ✅ *నివృత్తి (√):* ✅

                        ✍️ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు. 


💫 గణేశ విధానాలకు పరమ ప్రమాణమైన గ్రంథాలలో ఒకటి *ముద్గల పురాణం.* దానిలో స్పష్టంగా ఇలా చెప్పబడి ఉంది - 


💫 ఒక ప్రత్యేక కారణంగా, తులసి తన అర్చనకు పనికిరాదని గణేశుని శాపం. అటుపై తులసి పశ్చాత్తప్తురాలై గణపతి అనుగ్రహం కోసం తపస్సు నాచరించింది. అప్పుడు గణపతి ప్రత్యక్షమై, తులసీదేవికి ఎన్నో వరాలనిచ్చి, *'వినాయక చవితినాడు మాత్రమే నీ దళాలతో నన్ను పూజించవచ్చు'* అని అనుగ్రహించాడు.


*భాద్రశుక్లచతుర్య్థాం యే మహోత్సవ పరాయణాః ౹*

*పూజయిష్యంతి మాం భక్త్యా తత్ర త్వం ధారయామ్యహం ౹౹*

*ఏకవింశతి పత్రాణి హ్యర్చయిష్యంతి మానవాః ౹*

*తత్ర తే పత్రమేకం మే మాన్యం దేవి భవిష్యతి ||*

*ఉల్లంఘన సమం పాపం న భూతం న భవిష్యతి ||*


- "భాద్రపదమాసంలో వచ్చే నా చవితి మహోత్సవాలలో సమర్పించే 21 పత్రాలలోకెల్లా తులసీపత్రమే అత్యంత గొప్పదిగా నేను స్వీకరిస్తాను. కనుక ఆ రోజున 21 పత్రాలలో తులసి పత్రం కూడా నాకు సమర్పించాలి. ఆ రోజున తులసిని సమర్పించకుండా పూజిస్తే, ఆ ఉల్లంఘన దోషానికి వారు పాపులుగానే పరిగణించబడతారు.” 


పై వృత్తాంత ఆధారంగా వినాయకచవితినాడు మాత్రమే తప్పకుండా తులసిని సమర్పించాలి.

రామాయణానుభవం_ 145*

 🌹 *రామాయణానుభవం_ 145* 


బ్రహ్మ రుద్ర మహర్షులు కాకాసురుడు శరణు వేడాడు, వాళ్ళెవరూ సరమర్థులు కారు.


"ఒక్కసారి దగ్గరకు తీయకపోయినప్పటికి మళ్లీ మళ్లీ వెళ్లి కాళ్లపై పడితే కరుణించక పోతారా?" అని వెళ్లిన వారి దగ్గరకే మళ్లీ వెళ్లాడు. మూడులోకాలలో తిరస్కారమే మళ్లీ మళ్లీ ఎదురైంది.


*త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః*


ఇక ఎవ్వరు తనను దగ్గరకు రానీయరని తెలిసి, లోకాలన్ని తిరిగి తిరిగి విసిగి వేసారి అలసటతో తాళలేక ఆ దుర్మార్గుడు తనను చంపదలిచిన రామప్రభువు పాదాల పైననే పడిపోయాడు.


సీతాదేవి అతని స్థితిని చూచింది. జాలి పడింది. అంత అపచారము చేసిన వానిని కూడ తప్పుచేసే కొడుకులాగే చూచింది ఆ లోకజనని. ఆయనపై ఆ తల్లికి దయ కలిగింది.


కాకాసురుడు రామచంద్రుని కాళ్లపై పడ్డాడు. కాని సక్రమంగా పడిపోలేదు. 


స్వామి కాళ్లవైపు తన కాళ్లు ఉండేట్లు పడిపోయాడు. కావాలని కాదు. చేతగాక పడిపోయాడు.


*పురతః పతితం దృష్ట్వా ధరణ్యాం* *వాయసం తథా తచ్ఛిరః పాదయోస్తస్య* *యోజయామాస జానకీ*


తండ్రి కంటపడకుండా తనయులను కాపాడే తల్లివలె, రామభద్రుడు ఆగ్రహంతో ఉండగానే, ఆయన గమనించకుండా ఆ కాకిని లేవనెత్తి, దాని తలను స్వామి పాదాలపై పడేట్లుగా సవరించింది ఆ దయామయి.


అప్పటికి ఆ కాకిని గమనించని రామచంద్రునితో "స్వామి! ఇంత పిట్టపై అంత కోపమా? అని నన్ను పరిహసించారే గాని మీరు మాత్రము "పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలా?" ఆ అల్పప్రాణి మీ బ్రహ్మాస్త్రాన్ని తట్టుకోగల్గుతుందా?దిక్కు లేక

మీ చరణాలనే ఆశ్రయించింది చూడండి. శరణన్న వారిని సంరక్షించే కరుణామయులే మీరు” అని కాంతా సమ్మితంగాస్వామితో ఆ కాకి విషయంలో పురుషకారం చేసింది.


*వధార్హమపి కాకుతః కృపయా పర్యపాలయత్*


జానకీ దేవి  ప్రార్ధనతో (పురుషకారం) స్వామి ఆగ్రహం మటుమాయ మైంది. చిరునవ్వుతో "కాకీ! బ్రతికి పోయావులే" అని లేపాడు.


అయితే రామబాణానికి తిరుగులేదు కద! అందువలన బ్రహ్మాస్త్రానికి ఏదైనా ఒక అవయవాన్ని ఆహారంగా సమర్పించుమన్నాడు కాకుత్సుడు. (కకుత్సని వంశంలో జన్మించిన శ్రీరాముడు) కాకి తన కుడికన్నును సమర్పించింది.


అందుకే కాకికి ఒకటే కన్ను ఉంటుంది. కాకాసురుడు “కాకః” “కాకః” అని సంతోషంతో అరవసాగాడు.


**

సీతాదేవి హనుమతో రామునికి తన వినతిని అందించాలనుకొంది. అప్పుడు నేరుగా రామునితోనే మాట్లాడుతున్నట్లు ఈ మాటలు అన్నది. "రామచంద్రా! ఆనాడు నా కొరకు ఒక పిచ్చుకపై బ్రహ్మాస వేశావు కదా! ఈనాడు నేనింత ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడవా?


నానాధుడివే! జగన్నాధుడివే! ఇప్పుడు నేను అనాథగా అలమటిస్తుంటే కూడ చూచి. ఊరకుండడము న్యాయమా?


ఆనాడు నీతో కలసి ఉన్నప్పుడు "అన్ని ధర్మాలకంటే శ్రేష్టమైన ధర్మమేది?" అని

అడిగినప్పుడు.


*ఆనృశంస్యం పరోధర్మః* పరదుఃఖ దుఃఖిత్వమే  పరమధర్మము అన్నావే? ఇప్పుడు నన్ను నా దుఃఖానికి వదలివేయడం ధర్మమా?


స్వామీ! మీరు మహావీరులే. అసహాయ శూరులే. "ఇక్ష్వాకుడా మియం భూమిః సశైల వనకాననా" అన్నట్లు ఈ భూమి, పర్వతాలు, సముద్రాలు అన్ని మీ ఆధీనంలో ఉన్నవే కదా! మీరు రక్షించాలనుకొంటే సురులు, నరులు, రాక్షసులు, గంధర్వులు ఎవ్వరైనా, సకల లోకాలలో మరెవ్వరైనా మీ ముందు నిలువగలుగుతారా?" అని అడిగానని నా మాటలను హనుమా! నాస్వామికి తెలుపు.


అయినా హనుమా! అసాధారణ సామర్ధ్యము కల్గికూడ, నా స్వామి నన్ను రక్షించడం. లేదంటే ఆయనకు దయలేదని కాదు. ఆయన దయాసముద్రుడు. అయినా నన్ను రక్షించ రాలేదంటే కారణము నా పాపమే.


*మమైన దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః*

 నాదే కొద్దో గొప్పో పాపము తప్పక ఉంటుంది.


సమర్ధులై ఉండి కూడ రామలక్ష్మణులు తనను రక్షించడానికి రాకపోవడానికి తన తప్పులే కారణమని సీతాదేవి బాధపడుతుంటే - హనుమ ఆమెను ఓదార్చసాగాడు.


**


[భగవత్ అపచారం... 


అరణ్యవాసానికి సీతను రాముడు వద్దన్నపుడు 

రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం

రామా నీవు పురుష రూపం లో ఉన్న స్త్రీ వి కాబట్టి నన్ను అరణ్యానికివద్దంటున్నావు అన్నది 

దీనిని భగవత్ అపచారం అని,  


లేడి వెంట  రాముడు వెళ్లినప్పుడు తన పై వేరే ఆలోచనతోనే లక్ష్మణుడు ఉన్నాడని, ఆయన అడవులకు వెంట వచ్చింది కూడ అందుకే అంది. తాను ఆయనకు ఎన్నటికి లొంగవని అంది. 

దీనినీ భాగవత అపచారం గా సంప్రదాయం పరం గా చెబుతారు.....

ఇలాంటి విషయాల ను పెద్దలను  సేవించి తెలుసుకుంటే ఆవగతం అవుతాయి.

రామాయణానుభవం_ 144*

 🌹 *రామాయణానుభవం_ 144* 


సీతాదేవి పలుకులకు హనుమ చిన్నబోయాడు. తన శక్తి సామర్ధ్యాలను సీతాదేవికి చూపాలనుకొన్నాడు. తన శరీరాన్ని పెంచసాగాడు. పెద్ద పెద్ద కొండలే చిన్న చిన్న బండలుగా తగ్గిపోయాయి అప్పుడు హనుమ అగ్నివంటి ఎఱ్ఱని ముఖంతో, వజ్రము వంటి గోళ్లతో భయంకరమైన దంష్ట్రలతో మేరుపర్వతమంత ఎత్తుతో ప్రకాశించాడు. ఆయన అప్పుడు సీతాదేవిని చూచి, "తల్లీ! నా పర్వతాకారాన్ని చూచావుకదా! ఇక అనుమానాన్ని వదలిపెట్టి నిశ్చింతగా నా వీపుపై ఎక్కి వచ్చి రామలక్ష్మణులను దర్శించి, వారి శోకాన్ని తొలగించు"మని కోరాడు.


ఆ భీమరూపం చూసిన సీత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "మహాకపీ! నీ శక్తిసామర్థ్యాలు నాకు తెలుసు. నువ్వు యింతటి వాడివి కాకపోతేఊహించడమే సాధ్యంకాని సముద్రలంఘనానికి పూనుకోవు. 


నువ్వు నన్ను అవలీలగా తీసుకువెళ్ళగలవనీ తెలుసు. అయితే మనం రాముడి కార్యం చెడిపోకుండా ఏమి చెయ్యాలో నిర్ణయించాలి.  నేను నీతో వెళ్ళకూడదు.


అంత ఎత్తులో, ఎంతో వేగంతో నువ్వు వెడుతూంటే భయపడి (కళ్ళు తిరిగి) నేను పడిపోవచ్చు. నన్ను తీసుకు వెడుతుంటే చూసిన రాక్షసులు చుట్టుముట్టి నీమీద దాడి చెయ్యవచ్చు. వాళ్ళందరివద్ద గొప్ప ఆయుధాలు ఉంటాయి. నువ్వు ఏ ఆయుధాలూ లేకుండా, ఒక పక్కన నన్ను రక్షిస్తూ వేరొకపక్కన నిన్ను రక్షించుకోవాలి. ఆ మహాయుద్ధం చూసి భయంతో నేను సముద్రంలో పడిపోవచ్చు.

*న చ శక్ష్యే త్వయా సార్ధం గన్తుం శత్రువినాశన*

*కలత్రవతి సన్దేహస్త్వయ్యపి స్యాదసంశయః*

అయితే, నువ్వు మహాపరాక్రమవంతుడివి కనుక ఆ రాక్షసులందర్నీ సంహరించగలవు. కాని, దానివలన రాముడి కీర్తి దెబ్బతింటుంది.


లేదా, ఏదో రకంగా నీనుంచి నన్ను ఎత్తుకుపోయి రాక్షసులు ఎవరికీ కనపడనిచోట దాచెయ్యవచ్చు. అప్పుడు నువ్వు చేసిన యీ మహాప్రయత్నమంతా వృథా అవుతుంది.

ఇవన్నీ అలా ఉంచి.....


రాముడు ఇక్కడికి వచ్చి సబాంధవంగా రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకువెడితే-అది అతడికి తగిన పద్ధతి. రాముడి పరాక్రమం ముందు యీ రాక్షసులు నిలువలేరు. ఆ పరాక్రమం విన్నాను. కళ్ళారా చూసాను. ఆ రాముడి రాకకోసం ఎదురుచూస్తున్నాను. నువ్వు రామలక్ష్మణులనూ, వానరసేనానాయకులనూ వెంటనే తీసుకువచ్చి నాకు సంతోషం కలిగించు.”.....

*స మే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ*

*చిరాయ రామం ప్రతి శోకకర్శితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితామ్*

**


సీతాదేవి పరిశుద్ధమైన పలుకులను విని హనుము సంతృప్తితో ఇలా అన్నాడు: "తల్లీ! పురుషులు ఆవేశంతో తొందరపడితే, స్త్రీలు నెమ్మదిగా ఆలోచించి, ఆ పురుషులు ఆలోచనలలోని మంచి చెడులను వారికి తెలిపి, వారిని శాంతపరుస్తారు.


అలాగే నీవు ఒక స్త్రీ రత్నంగా నా ఆవేశానికి మంచి చెడులు చెప్పి అడ్డుకట్ట వేశావు. ఒక వీర పత్నిగా నీ పతికి కలిగే అవమానాన్ని నివారించావు. ఒక పతివ్రతగా నీ స్వభావాన్ని నీ మహిమను నిరూపించుకొన్నావు. ఇంతటి స్థిరత్వము, ఇంతటి వీరత్వము, ఇంతటి పాతివ్రత్యము రామభద్రుని ధర్మపత్నివైన నీకు తప్ప మరొకరికి సాధ్యమా?


నేను నీ కష్టాలకు తొందరలో ముగింపు పలుకాలని నాతో రమ్మని పిలిచానే తప్ప

వేరే ఉద్దేశ్యంతో కాదు.


నీకు నా వెంట రావడం ఇష్టము కాకుంటే, నేను నిన్ను కలిసి మాట్లాడానని రాముడు నన్ను నమ్మే విధంగా ఏదైనా ఒక ముఖ్యమైన గుర్తు తెలుపుమని కోరాడు. అప్పుడు సీతాదేవి తనకు, రామునికి తప్ప వేరెవ్వరికి తెలియని కాకాసుర

వృత్తాంతాన్ని హనుమకు తెలిపింది.

*ఏవముక్తా హనుమతా సీతా సురసుతోపమా*

*ఉవాచ వచనం మన్దం బాష్పప్రగ్రథితాక్షరమ్*

*ఇదం శ్రేష్ఠమభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియమ్*


"రామభక్తా! మేము చిత్రకూట పర్వతముపై ఒక తాపసాశ్రమాన్ని నిర్మించుకొని అందులో నివసించాము. మందాకినీ నదీతీరంలోని, ఆ ఆశ్రమ పరిసరాలలోని ఒక తోటలో భార్యాభర్తలు ఒక తూరి విహరించాము. ఆ ఆటలో నేను తొందరగా అలసిపోయి విశ్రాంతి తీసికోవాలనుకొన్నాను. నా భర్త తొడపై పడుకొన్నాను. అప్పుడు అక్కడికి మాంసముపై ఆశతో ఒక పాడు కాకి వచ్చి నా చుట్టు తిరుగుతూ రొద చేయసాగింది. కొంచెము సమయం తరువాత నా గుండెలపైకి ఎగిరి పొడవ సాగింది.


దగ్గరలో ఎండు మాంసము ముద్ద ఉన్నా, దాని జోలికి పోక నా గుండెలనే గీర సాగింది. నేను నా మొలత్రాడును తీసి దానిని కొట్టబోయాను. అప్పుడు నా నాథుడు "ఇంత చిన్న పిట్టపై అంత కోపమా" అని పరిహసించాడు. నాకు అంత బాధలో కూడ నా భర్త మాటలకు సిగ్గు కలిగింది. రాముడు నన్ను దగ్గరకు తీసికొని ఓదార్చాడు. నా కన్నీటిని తుడిచాడు.


అప్పుడు నా ప్రాణవిభుడు నా తొడపై పడుకొన్నాడు. నేను కాకి బాధను భరిస్తున్నాను.


నా భర్తకు నిద్రా భంగము కలుగుతుందని ఆ కాకిని కొట్టే ప్రయత్నాన్ని మానుకొన్నాను.


"స్వామి నిద్రా సౌందర్యాన్ని కనులారా సేవిస్తున్నాను. ఆ స్వామి సహజంగానే సుందరుడు. నిద్రలో ఆయన సౌందర్యము మరింత అధికమైంది. రెప్పపాటు కూడ లేక తదేకంగా తన్మయంగా ఆ స్వామినే చూస్తూ ఉండిపోయాను. ఆ ఆనందంలో నా గుండెల నుండి కారే రక్తాన్ని కూడ గమనించలేదు.


అయితే నా రక్తపు బిందువులు కొన్ని నా భర్త కపోలము పై పడ్డాయి. ఆ వేడికి వెంటనే సుఖంగా నిద్రించే పరంతపుడు నా స్వామి మేలుకొన్నాడు. "అయ్యో నా మూలంగా నా స్వామికి నిద్రాభంగమైందే?" అని నేనెంతో బాధపడ్డాను. ఆయన ఆగ్రహ పరవశుడయ్యాడు. "ఐదు తలలుగల భయంకర సర్పముతో ఆటలాడే ఆ నీచుడెవ్వడు? నిన్ను ఇంత క్రూరంగా హింసిస్తున్న ఆ అథముడెవ్వడు?" అని కోపంతో లేచి చుట్టు ప్రక్కల పరిశీలించాడు. అప్పటికి విడువకుండా నా గుండెలను పొడుస్తున్న అసురు స్వభావం గల ఆ పాడు కాకి రాముని కంటబడింది.


అరులను అణచడానికి ఆ అసహాయ శూరుడైన రామునికి ప్రత్యేకంగా ఒక ఆయుధము కావాలా? ప్రక్కలో ఉన్న ఒక గడ్డిపోచను తీసికొన్నాడు. బ్రహ్మాస్త్రాన్ని దానిలో సంధించి వదిలాడు. ఆ బ్రహ్మాసము ఆ కాకిని తరుమసాగింది......

*స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి*

*తతస్తం వాయసం దర్భస్సోమ్బరేనుజగామ హ*

రామాయణానుభవం_ 143*

 🌹 *రామాయణానుభవం_ 143* 


హనుమ సీత సంవాదం కొనసాగుతోంది....


"తల్లీ! రామునికి ఇంతవరకు నీవెక్కడ ఉన్నావో  తెలియదు. తెలిశాక తక్షణమే మహేంద్రుడు శచీదేవిని తీసికువెళ్లినట్లు నిన్ను తీసుక వెళ్తాడు.


నీ వార్త తెలిసిన వెంటనే వానర మహాసైన్యంతో శ్రీరాముడు బయలుదేరి తన బాణాలతో సముద్రాన్ని బంధించి, లంకలోనికి ప్రవేశించి, సమస్త రాక్షస కోటిని సంహరిస్తాడు. ఆయనకు సురులు, అసురులు ఎవ్వరు అడ్డుకారు.


సింహముచే బాధింపబడిన మహాగజమువలె నీ విరహ బాధతో శ్రీరాముడు నలిగి పోతున్నాడు.


మేము నివసించే మహా పర్వతములపై, మేము భక్షించే కందమూల ఫలములపై

ఒట్టుపెట్టుకొని నిజమే చెప్పుతున్నాను. స్వర్గంలో ఉన్న మహేంద్రునివలె ప్రస్రవణ పర్వతముపై అందమైన కన్నులు, సుందరములైన కుండలములు గల శ్రీరాముని నీవు అతి త్వరలో చూడగలవు.


శ్రీరామునికి నీకు దూరమైన నాటి నుండి అన్నము, రుచించడం లేదు. నిద్రపోవడం

లేదు. ఒకవేళ నిద్రపట్టితే, వెంటనే "సీతా" అని నీ మధుర నామాన్ని ఉచ్చరిస్తూ వెంటనే మేల్కొంటాడు.


ఆయనకు ఆయన శరీరముపై స్పృహే లేదు. ఆయన నిన్నే ధ్యానిస్తూ నీ గురించే పలవరిస్తూ, నిన్ను పొందడానికే ప్రయత్నిస్తున్నాడు" అని హనుమ తెలిపాడు. 

సీతాదేవికి రామ వార్త విన్నందువలన శోకము తొలగింది. కాని ఆయన తన కొరకే శోకిస్తున్నాడని తెలిసి మళ్లీ శోకము కలిగింది. మబ్బులు కొద్దిగా మిగిలిన శరద్రాత్రి వలె సీతాదేవి శోక హర్షాలను కలిగి ఉంది.


హనుమంతుడు సీతాదేవితో "అమ్మా! రాముడు క్షేమంగా ఉన్నాడు. కాని నీ విరహ దుఃఖముతో కృంగిపోతున్నాడ”ని చెప్పాడు. ఆ మాటలు సీతకు అమృతమువలె, విషము వలె అనిపించాయి.

*అమృతం విషసంసృష్టం త్వయా వానర భాషితమ్*

*యచ్చ నాన్యమనా రామో యచ్చ శోకపరాయణః*


"హనుమా! రాముని క్షేమవార్త అమృతము వలె నాకు ప్రాణం పోసింది. అయితే ఆయన అమితమైన దుఃఖంతో ఉన్నాడు" అన్న మాట నాకు విషమువలె భరించరానిదిగా ఉంది.


సుఖదుఃఖాలు మనిషిని త్రాటితో కట్టి లాగినట్లు దైవములాగి వేస్తుంది. దైవాన్ని ఎవ్వరు ఎదిరించజాలరు. *లేకపోతే సజ్జనులు, శక్తి సంపన్నులైన రామలక్ష్మణులు, నేను ఇంత ఆపదల వలయంలో చిక్కుకోవడమేమిటి?*

*విధిర్నూనమసంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ*

*సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనై: పశ్య మోహితాన్*


శ్రీరామచంద్రస్వామి లంకకెప్పుడు వస్తాడో? రావణుని సంహరించి నన్నెప్పుడు స్వీకరిస్తాడో? అయితే ఆయన ఆలస్యం చేస్తే ప్రయోజనము లేదు. రావణుడు నన్ను తీసుకొని వచ్చాక, తనను వరించడానికి ఒక సంవత్సరము గడువిచ్చాడు. ఆ గడువు పూర్తి కావడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలాయి.....


**

సీత హనుమ సంభాషణ...


హనుమా రావణుడు మూర్ఖుడు. చండ స్వభావుడు. ఆయన ఎవ్వరి మాటను వినడు. ఇంతకు ముందు ఎన్నోసార్లు “రాఘవునికి నన్ను అప్పగించి లంకా సామ్రాజ్య వైభవాన్ని, ఆనందోత్సాహాలను పదిలంగా కాపాడుమని" విభీషణాదులు హితము పలికారని విభీషణుని పెద్ద కూతురు నల నాతో స్వయంగా చెప్పింది. అయితే అంత్యకాలము దాపురించిన వానికి దీపము మలిగిపోయేప్పటి వాసన రానట్లే రావణునికి ఈ సలహాలు రుచించడం లేదు.


అయినా రావణుడెంత కాలము ప్రయత్నించినా నన్ను దక్కించుకోలేడు. నా ప్రభువు అతులిత పరాక్రమ సంపన్నుడు. ఆశ్రిత రక్షాదక్షుడు. నన్ను రావణుని బారి నుండి తప్పక కాపాడగలడు.


రాముడు రావణుని జయించుటకు తగిన బలము, పరాక్రమము, ఉత్సాహము, ప్రభావము మొదలైన గుణాలన్ని కలవాడు.


పదునాల్గు వేల మంది భయంకర రాక్షసులను “ఒంటి చేతితో” గెలిచిన శ్రీరామ భద్రుని ముందు రావణుడు నిలువగలుగుతాడా?

రాముడనే సూర్యుడు తన బాణాలనే కిరణాలతో శత్రుసైన్యమనే జలాన్ని తప్పక "ఇంకింప జేస్తాడు" అని పలికి ఊరుకుంది.


హనుమకు సీతాదేవి ఇంకా లంకలో శత్రువుల మధ్య బాధపడడం మంచిది

కాదనిపించింది. అప్పుడు హనుమ సీతాదేవి భయాన్ని, బాధను పోగొట్టడానికి ఆమెతో

ఈ విధంగా అన్నాడు. 


"అమ్మా! నేను తిరిగి వెళ్ళి శ్రీరామచంద్రునికి నీ వార్తను వివరించగానే, ఆయన ససైన్యంగా వచ్చి, రావణుని సంహరించి, నిన్ను తీసికొని వెళ్తాడు.


కాని నీకంత వరకు ఓర్చుకొనే ఓపిక లేక పోతే, నిన్ను నా వీపుఎక్కించుకొని ఇప్పుడే

వెళ్లి స్వామి సన్నిధిలో సమర్పిస్తాను.

నేను సముద్రమును దాటడం, నిన్ను దాటించడం నాకు ఒక లెక్క కాదు. అవసరమైతే రావణునితో పాటు, ఆయన పరివారంతో పాటు మొత్తము లంకనే పెల్లగించి, తీసికొని వెళ్లి రాముని ముందు ఉంచుతాను.


అగ్నిదేవుడు హోమంలో అర్పించిన హవిస్సును ఇంద్రునికి అప్పగించినట్లే నిన్ను నేను రామునికి అప్పగిస్తాను.

*అహం ప్రస్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలి*

*ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలః*

 నీవు సందేహించకు. నా వీపుపై కూచో. ఆకాశమార్గంలో సూర్యచంద్రులతో సంభాషిస్తూ నా వీపుపై కూచొని సముద్రాన్ని దాటి ఇప్పుడే రామలక్ష్మణులను చూడగలవు. నన్నెదిరించుటకు రావణునికి శక్తి చాలదు. నేనెంత సులభంగా సముద్రం దాటి వచ్చానో అంత సులభంగా తిరిగి నిన్ను తీసికొని సముద్రం దాటి వెళ్లగలను".


హనుమ మాటలు సీతాదేవికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. " చిన్న శరీరము ఉన్న నీవు నన్ను సముద్రం దాటిస్తావా?" అని ప్రశ్నించింది......

*కథం వాల్పశరీరస్త్వం మామితో నేతుమిచ్ఛసి*

*సకాశం మానవేన్ద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ*

రామాయణానుభవం_ 141*

 🌹 *రామాయణానుభవం_ 141* 


*రామః కమల పత్రాక్ష స్సర్వ సత్త్వ మనోహరః* ।

*రూప దాక్షిణ్య సంపన్నః*

*ప్రసూతో జనకాత్మజే* ॥


సీతమ్మా! శ్రీ రాముడు కమల పత్రముల వంటి కన్నులు గలవాడు; సకల ప్రాణుల మనస్సును ఆకర్షించువాడు, రూపముతో దయతో కూడిన వాడై పుట్టిన వాడు;


ఈ శ్లోకమునందు హనుమంతుడు శ్రీరాముని పరతత్త్వమును సూచించుచున్నాడు,


రామః = ఆనంద స్వరూపుడు, ఆనందము గుణముగా గల వాడు; ఆనందమునొసంగువాడు; అయిన జగత్కారణ తత్త్వమే దశరథుని కుమారుడగు శ్రీరాముడు, 


ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందమే, 

ఆనందము కలవాడే; పరబ్రహ్మ అని తెలిసికొనెను, 

తైత్తి రీయోపనిషత్తు, భృగువల్లి, 


ఏషహ్యేవా ఽనందయాతి, 

ఈ పరబ్రహ్మమే సకల ప్రాణులను ఆనందింపచేయును; తైత్తిరీయోపనిషత్తు, ఆనందవల్లి అని శ్రుతి వాక్యము.


 కమల పత్రాక్షః = ఆ పరబ్రహ్మమే ఉపాసకుల సౌలభ్యము కొరకై సూర్య మండలమున నున్నాడు; అతడే పుండరీకముల వంటి కన్నులు గల శ్రీ మన్నారాయణుడు అని 


యఏషోఽంతరాదిత్య హిరణ్మయః పురుషోదృశ్యతే | హిరణ్యశ్మశ్రు ర్హిరణ్యకేశ ఆ ప్రణఖాత్సర్వ ఏవ సువర్ణః, తస్య యథాకప్యాసం పుండరీక మేవ మక్షిణీ సూర్యమండలము నందు హిరణ్మయస్వరూపుడగు పురుషుడు కనబడుచున్నాడు; బంగారు వెంట్రుకలు కలవాడు, బంగారు గడ్డము గల వాడు; గోళ్ళు మొదలుకొని అంతయు బంగారుమయమే; గంభీరమైన నీటిలో మొలచిన, లావైన దృఢమైన కాడపై నిలిచిన, అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణములచే వికసించిన, తామర పూవుల వంటివి అతని యొక్క రెండు నేత్రములు - ఛాందోగ్యోపనిషత్తు, అని చెప్పిన ప్రకారముగా పుండరీకాక్షుడు; 


సర్వసత్వ మనోహరః = సకల ప్రాణుల చిత్తమునందున్న వాడు; రూపదాక్షిణ్య సంపన్నః = దివ్య మంగళ విగ్రహముతో, చేతనాచేతనములందు సంపూర్ణమైన దయతో కూడిన వాడు, అయిన ఆ పరమాత్మయే, 


ప్రసూతః = దశరథుని పుత్రుడైన శ్రీరాముడుగా అందరికీ కనబడునట్లు జనించినవాడు; జన్మ లేని వాడు. జన్మించినాడు; 


జనకాత్మజే = ఓ సీతమ్మా!; శ్రీరాముడు శ్రీమన్నారాయణుడేయని హనుమంతునిచే సూచింపబడినట్లు.....


**


హనుమ రామకథాగానం చేస్తున్నాడు...


రాముడు తేజస్సులో సూర్యునితోనూ, ఓర్పులో భూమితోనూ, బుద్ధిలో బృహస్పతితోనూ, కీర్తిలో దేవేంద్రుడితోనూ సమానమైనవాడు. సమస్తజీవజాలాన్నీ రక్షిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తాడు. లోకంలో మర్యాదని (కట్టుబాట్ల) ను రక్షిస్తాడు..


రాముడు విద్వాంసుడు. శాస్త్రాభ్యాసం చేసాడు. రాజవిద్యలు నేర్చాడు. పండితుల మన్ననలు పొందాడు. వినీతుడు (వినయవంతుడు) శీలసంపన్నుడు. వేదవేదాంగాలలో నిష్ణాతుడు, వేదవేత్తలు ప్రశంసించే పండితుడు. స్వశాఖ అయిన యజుర్వేదం చక్కగా అభ్యసించాడు.


అతని రూపం ఎలా ఉంటుందని అడిగావు. రాముడిది నీలమేఘచ్ఛాయ. ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఉంటాడు. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. అతడి కంఠస్వరం దుందుభినాదంలా ఉంటుంది. కళ్ళు ఎర్రగా ఉంటాయి. భుజాలు విశాలమైనవి. బాహువులు దీర్ఘమైనవి. ముఖం మంగళప్రదం. బలిసిన కండతో మూపున ఎముకలు కనపడవు. త్రిస్థిరః ముంజేయి, పిడికిలి, వక్షఃస్థలం స్థిరంగా ఉంటాయి. త్రిప్రలంబ: కనుబొమలు, ముష్కములు, బాహువులు పొడవుగా ఉంటాయి. (ఇలా సాముద్రికశాస్త్రంలో చెప్పిన చక్రవర్తి లక్షణాలన్నీ వర్ణిస్తాడు) 


దేశకాల విభాగం తెలిసినవాడు. సత్యధర్మాలను ఉపాసించేవాడు. లక్ష్మణుడూ రాముడిలానే ఉంటాడు. రాముడు నీలమేఘశ్యాముడు, లక్ష్మణుడిది బంగారు శరీరచ్చాయి.


ఆ అన్నదమ్ములు నిన్ను వెదుకుతూ ఋశ్యమూకపర్వతం వద్దకు వచ్చారు. అక్కడ మేము సుగ్రీవుణ్ణి సేవిస్తూ ఉన్నాము. వీరి రూపాలూ, ఆయుధాలూ చూసి భయపడి వీరెవరో కనుక్కోమని సుగ్రీవుడు నన్ను పంపాడు. సుగ్రీవుడి గురించి విని రామలక్ష్మణులు సంతోషించారు. నేను వారిని వీపుమీద ఎక్కించుకుని సుగ్రీవాదులు ఉన్న చోటికి తీసుకువెళ్ళాను. రామసుగ్రీవులు. అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. ఒకరి కథ ఒకరికి చెప్పుకున్నారు.


సుగ్రీవుడి భార్య రుమ, అతడి అన్న వాలి మహాబలశాలి. పరాక్రమవంతుడు.  "ఒకానొక సంఘటనలో అపోహతో వాలి సుగ్రీవుణ్ణి రాజ్యంనుంచి వెళ్ళగొట్టాడు".

. ఆ కథ విని రాముడు సుగ్రీవుణ్ణి ఓదార్చాడు.


తరువాత తన అరణ్యవాస కథ, రావణుడు నిన్ను అపహరించడం వివరంగా చెప్పాడు. రావణుడు నిన్ను పట్టి వాయుమార్గంలో వెడుతుంటే నువ్వు పడవేసిన ఆభరణాలన్నీ వానరనాయకులు తీసి జాగ్రత్తచేసారు. అవన్నీ తెచ్చి రాముడికి చూపించాము. వాటిని చూస్తూనే రాముడు స్పృహ తప్పి పడిపోయాడు.


స్పృహరాగానే వాటిని ఒడిలో ఉంచుకుని అనేక విధాల విలపించాడు. నీ వియోగంవలన రాముడు  జ్వలిస్తున్న అగ్నివలన అగ్నిపర్వతం తపించినట్లు తపించుకుపోతున్నాడు. రాత్రింబవళ్ళు నిన్నే తలుచుకుంటూ దుఃఖిస్తున్నాడు.......


*

[రాముని యొక్క సౌందర్యాదులను మొల్ల అద్భుతం గా తెలుగు పద్యం గా అందించింది.


నీల మేఘ చ్ఛాయ బోలు దేహమువాఁడు. ధవ ళాబ్జ పత్ర నేత్రములవాఁడు

కంబు సన్నిభ మైన కంఠంబు గలఁవాఁడు చక్కని పీన వక్షంబువాఁడు.

తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాఁడు ఘనమైన దుందుభి స్వనమువాఁడు పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాఁడు


కపట మెఱుఁగని సత్య వాక్యములవాఁడు ,రమణి! రాముండు శుభ లక్షణములవాఁడు ఇన్ని గుణముల రూపింప నెసఁగువాఁడు వరుస సౌమిత్రి బంగారు వన్నె వాఁడు.]

మాండూక్యోపనిషత్

 శ్లోకం:☝️

  *ఇయం కైవల్యముక్తిస్తు*

*కేనోపాయేన సిద్ధ్యతి ।*

  *మాణ్డూక్యమేకమేవాలం*

*ముముక్షూణాం విముక్తయే ।।*


భావం: ముక్తిని పొందే ఏకైక సాధనం మాండూక్యోపనిషత్ ద్వారా మాత్రమే. మరే ఇతర మార్గాల ద్వారా ముక్తి లభించదని తెలుసుకోండి. సాధకులందరికీ మోక్షానికి ఈ ఒక్క ఉపనిషత్తు సరిపోతుంది అని భావం! అందుకేనేమో శంకరాచార్యుల గురువు గారయిన గౌడపాదాచార్యులు మాండూక్యోపనిషత్ పై మాండూక్య కారిక వ్రాసారు.🙏