ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనగానే బీచ్ లు మాత్రమే కాదు..ఆధ్యాత్మిక పరంగా కూడా అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి దేవీపురం సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరి ఆలయం. అక్కడ తొమ్మిది కొండలు కళ్ళకు మనోహరంగా కనబడుతాయి. వాటి మద్యన పచ్చని ప్రకృతి పరవశం కలిగిస్తుంది. ఆకుపచ్చని తోటలు కనువిందు చేస్తాయి. అక్కడే దేవీపురం ఉంది.
ఇది ఆంధ్రప్రదేశ్ లో విశాఖకు అతి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే సహస్రాక్షి ' పేరుతో శ్రీ రాజరాజశ్వరీ దేవీ ఆలయం వెలసింది. ఇక్కడ ఆలయం మొత్తం శ్రీచక్రంగానే ఉండటం పరమ విశేషం. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచంలో ఇంకెక్కడా లేకపోవటం మరో విశేషం. స్థల పురాణం: శ్రీ దేవీ ఆలయం నిర్మించే సంకల్పం తో నిష్టల శాస్త్రి గారు 1982 లో 108 మంది రుత్విక్కులతో ,16 రోజులు దేవీ యాగాన్ని పరమ నిష్ఠ తో చేశారు .వదాన్యులైన దాతలు వీరి అమోఘ సంకల్పానికి స్పందించి ఆలయ నిర్మాణానికి మూడు ఎకరాల స్థలం రాసిచ్చారు .
ఈ స్తలమే పైన పేర్కొన్న తొమ్మిది కొండల మధ్యన ఉన్న ప్రదేశం .ఈ ప్రదేశం లో తగిన చోట ఆలయాన్ని నిర్మించాలని శాస్త్రిగారు నడిచి పరిశీలిస్తుంటే ,ఒక రోజు అగ్ని గుండం లో మెరుపు లతో మెరిసే శరీరంతో పదహారేళ్ళ బాలిక లాగా శ్రీ దేవి దర్శనమిచ్చింది. పరవశంతో శాస్త్రి గారు అమ్మను అర్చించారు. అక్కడే తనకు ‘ఇల్లు’కట్టమని దేవి ఆజ్ఞాపించింది .ఆ ప్రదేశం లో త్రవ్వితే అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచ లోహ శ్రీ చక్రమేరువు లభించింది .దీన్ని గురించి వాకబు చేయగా ఇక్కడే 250 ఏళ్ళ క్రితం ఒక గొప్ప యజ్ఞం జరిగి నట్లు ,ఆ యజ్ఞం పూర్తీ అవగానే ఆ శ్రీ చక్రమేరువు ను భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్య పీఠం ప్రతిష్టించి నట్లు తెలిసింది . .
ఇంకొంచెం ఎత్తు గా ఉన్న కొండ పైన శివాలయం కట్టించారు .
ఈ ఆలయాన్ని శ్రీ చక్ర ఆకారంలోనే నిర్మించడం చాలా అరుదైన విషయం ఈ ఆలయాన్ని శ్రీ చక్ర ఆకారంలోనే నిర్మించడం చాలా అరుదైన విషయం. ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ, శివుడు కొలువై ఉన్నారు. శ్రీచక్ర యంత్రం ఆకృతిలో నిర్మింపబడిన ఈ ఆలయంలో దేవదేవతలను ప్రతిష్టించారు. సహస్రాక్షి అంటే వెయ్యి కన్నులు కలదని అర్థం. శ్రీదేవి సూచించిన పంచలోహ శ్రీ చక్రమేరుయంత్రం దొరికిన పర్వత ప్రాంతం ఇదే. సుమారు 250సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక గొప్ప యజ్ఝం జరిగిన స్థలం అని ఈ శ్రీ చక్రమేరుయంత్రం ద్వారా తెలిసింది.
శ్రీచక్రాలయ నిర్మాణానికై తగు ప్రదేశానికై అన్వేషిస్తుండగా నారపాడు శివారులో ఉన్న పుట్రోపు సోదరుల జీడిమామిడి తోట ప్రాంతంలో వీరికి అమ్మ సాక్షాత్కరించి ఇక్కడ మూడు అడుగుల నేల తవ్వితే పంచలోహ శ్రీ చక్రం దొరుకుతందని, యోని స్వరూప శక్తులతో ఓ కామాఖ్యా పీఠాన్ని స్థాపించి తగిన సంప్రదాయంలో పూజలు జరిపించమని చెప్పగా, దేవీ ఆదేశానుసారం సర్వాంగ సుందరంగా, మూడు అంతస్తులతో విలక్షణ అవతార రూపులైన దేవి దేవతల ఆవాసంగా నెలకొల్పబడినది. కామాఖ్యా పీఠాన్ని ఈ ఆలయంలో శక్తి పూజల కొరకు కామాఖ్యా పీఠాన్ని శివపూజలకొరకు కొండమీద శివాలయాన్నీ నిర్మించారు. ఈ మూడు అంతస్థుల గల ఆలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తులో నిర్మింపబడినది.
ఈ శ్రీచక్రాలయం సుమారు 12సంవత్సరాల క్రితం నిర్మించబడినది. అమ్మ వారి నిలు వెత్తు విగ్రహం ఆది శంకరాచార్యుల వారి ‘సౌందర్య లహరి'లో వర్ణించిన రీతిలో శ్రీ లలితా సహస్ర నామ స్త్రోతాలలో వాగ్తేవతలు వర్ణించినట్లుగా ఆలయాన్ని నిర్మించారు. 1990 లో మూల విరాట్ అయిన ‘'సహస్రాక్షి ‘'విగ్రహ .ప్రతిష్టఅగమోక్తం గా జరిగింది .శ్రీ చక్రాలయం మూడో అంతస్తులో అంటే ‘'బిందు స్తానం ‘'లో శయనించిన సదా శివుని మీద కూర్చున్న అమ్మ వారి నిలు వెత్తు విగ్రహం జీవ కళ ఉట్టిపడి కళ్ళను ప్రక్కకు తిప్పలేనంత మనోహరం గా ఉంటుంది .ఆమె చుట్టూ కింది అంతస్తులలో నక్షత్రాల వంటి ఆవరణలు ,వాటిల్లో అమ్మవారి పరివార దేవతల విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి.
ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీ చక్ర నమూనాలలో ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీ చక్ర నమూనాలలో నిర్మితమైన ఆలయంగా ప్రసిద్ది చెందినది. గర్భాలయంలో ప్రధానదైవంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి నల్లని కృష్ణశిలారూపవతిగా వెలుగొందుతోంది. ఈ ఆలయానికి సాక్షాత్త్ పరమశివుడే క్షేత్ర పాలకుడిగా నెలకొని ఉండటం విశేషం. అలాగే ఒక్కడ కొండపై పంచభులింగేశ్వర స్వామి అలాగే ఒక్కడ కొండపై పంచభులింగేశ్వర స్వామి దేవాలయం దక్షవాటిక ఉన్నాయి. అయితే దక్షిన వాటిక మధ్యభాగంలో పిరమిడ్ ఆకృతిలో ఫలకంపై 360శివలింగాలను, అగ్రభాగంలో మహాలింగాన్ని ప్రతిష్టించారు. రోజుకి ఒక్క శివలింగార్చన చొప్పున ఏడాది అంత జరిగే అర్చన మహాశివలింగార్చన జరుగుతుంది.
ఈ మహాలింగానికి నలువైపులా 1005 శివలింగాలు ప్రతిష్టమై ఉన్నాయి. నిష్టల ప్రహ్లద శాస్త్రి గారికి అమ్మవారు ధ్యానంలో దర్శనమిచ్చిన విధంగానే దేవీ ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాత్రుమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద , 10విగ్రహాలను మొదటి అంతస్తులో 10విగ్రహాలను రెండో అంతస్తులో సిమెంట్తో నిర్మించి నెలకొల్పారు. మిగిలిన వాటిని పంచలోహాలతో తయారుచేయించి మూడవ అంతస్తులో అష్టదళ పద్మంలో ఉంచారు. వైష్టవీ, వారాహీ మాహెంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, వీటితో పాటు భూమి మీదే బ్రాహ్మా, మహేశ్వరీ, కౌమారీ, వైష్టవీ, వారాహీ మాహెంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, బాలాజీ, కాళీయ మర్థనం చేస్తున్న బాల కృష్ణుడు శిలా విగ్రహాలను ప్రతిష్టించారు. వీటికే భక్తులు భక్తీతో అభిషేకం నిర్వహిస్తారు. మణిద్వీపం’ గా ఈ దేవీ పురాన్ని శ్రీదేవీ భాగవతంలో వర్ణించిన ‘మణిద్వీపం' గా రూపొందించాలని గురూజీ (ప్రహ్లాద శాస్త్రి) ఆకాంక్ష .
సర్వేజనా సుఖినోభవంతు