భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది?
బెనారస్ హిందూ యూనివర్సిటీ!
దాన్ని ఎవరు స్థాపించారు?
మదన్ మోహన్ మాలవీయ
ఆయన దీనిని విరాళాలు సేకరించి కట్టించారు. ఆయన్ని చాలా మంది "నువ్వు మదన్ మోహన్ మాలవీయవి కావు బాబూ. నువ్వు మనీ మేకింగ్ మెషీన్ వి" అని హాస్యమాడేవారు కూడా. అంత ఓపిగ్గా, పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు.
ఇదే క్రమంలో ఆయన నిజాం నవాబు గారి దగ్గరకి వెళ్లారు.
నిజాం నవాబు గారి గూర్చి తెలియని వారు వుండరు ఆయన మహా పిసినారి. పైపెచ్చు మహా మత వాది
" నీకెంత ధైర్యం...హిందూ యూనివర్సిటీ కోసం నేను విరాళం ఇవ్వాలా" అంటూ తన చెప్పును విసిరేశాడు కోపంగా.
మాలవీయ మారు మాట్లాడలేదు. ఆ చెప్పును కళ్లకద్దుకుని "మహా ప్రసాదం" అంటూ బయటకి వచ్చేశాడు. అది చూసి నవాబుగారు వీడికి చెప్పుతో మంచిగా బుడ్డి చెప్పాను అని సంతోషించారు.
తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారుగా మదన్ మోహన్ మాలవీయ గారు ఆ చెప్పని ఏమి చేస్తారో నవాబుగారికి తెలియదు. కానీ తెలివైన మలవియ్యగారు దానిని భద్రంగా తీసుకొని వెళ్లి కోఠి సెంటర్లో
బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం గారి చెప్పుని ఉంచి, దాన్ని వేలానికి పెట్టారు. అది మామూలు చెప్పు కాదు నిజం నవాబు గారి చెప్పు కాబట్టి ప్రజలు గుమికూడి ఒకళ్ళ మించి ఇంకొకరు వేలం పాట పెంచటం మొదలు పెట్టారు. ఆ నోటా ఆ నోటా భటుల నోట్లో పడ్డది. ఒక భటుడు నవాబు గారి చెవిలో పడేసాడు. అప్పుడు వెంటనే నవాబుగారు తన మంత్రిని పిలిచి మంతనం చేశారు. ఈ విషయాన్నీ వదిలివేస్తే ప్రజలకు తానూ చేసిన పని తెలుస్తుంది. అట్లని నవాబుగారి చెప్పు తక్కువకి వేలం పోతే తనకు పరువునష్టం. ఆ చెప్పును ఏ బిచ్చగాడో వేసుకుంటే నవాబు గారి ప్రతిష్ఠ మూసీ పాలు!!
అట్లా అలోచించి మంత్రి సలహా మేరకు నిజాం ప్రభువు తన సేవకుల్ని పిలిచి "ఎంత ధరైనా ఫరవాలేదు. నా చెప్పును కొని తీసుకురండి" అని పురమాయించారు.
చివరికి భారీ ధరకు తన చెప్పును తానే కొనుక్కున్నాడు నిజాం నవాబు. నిజానికి నిజాం తన చెప్పుతో తానే కొట్టుకుకున్నట్లు అయ్యిన్ది.
మాలవీయ గారు నిజాం నవాబు గారి లాంటి వారి నుంచి కూడా హిందూ యూనివర్సిటీకి ద్రవ్యం వాసులు చేసిన ధీశాలి. "తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు" అని నిరూపించారు.
జీవితమూ నిజాం నవాబు లాంటిదే. అది ఒక చెప్పే విసిరేస్తుంది. మనమూ మదన్ మోహన్ మాలవీయ లాగా ఆ అరకొర అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవటమే ప్రజ్ఞ !!
అన్నట్టు....మన దేశపు ధ్యేయవాక్యం "సత్యమేవ జయతే"ని ఆధునిక కాలంలో మొట్టమొదటగా ఉపయోగించిందీ మదన్ మోహన్ మాలవీయ గారే..
Ravi Kumar:
మదన్ మోహన్ మాలవీయా గారు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు.. కానీ చిత్తశుద్ధితో , మొక్కవోని దీక్ష మరియు పట్టదలతో శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం స్థాపించగలిగారు..కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు. జై హింద్, జై భారత్,
wats app సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి