12, అక్టోబర్ 2020, సోమవారం

ఆడవాళ్ళు

 ఒకతెకు జగములు వణకున్ 

అగడితమై ఇద్దరు కూడిన అంబులు 

ఇగురున్ము గ్గురాండ్రు కలిసిన సుగుణాకరా 

పట్టపగలె చుక్కలు రాలున్




ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి.

ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి.

ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి.


అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావము...

తల్లి గొప్పా ?? తండ్రి గొప్పా

 తల్లి గొప్పా ?? తండ్రి గొప్పా ???


ఒకరోజు ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. 

స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు.


దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో నీకు సమాధానం దొరకవచ్చు.” అని చెప్పడం ప్రారంభించాడు...


పూర్వము భంగస్వనుడు అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానము కలుగలేదు.


*అపుత్రస్య గతిర్నాస్తి*


పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే, అనే బాధతో అగ్ని దేవుడిని ప్రార్ధించి, అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు.


ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా భంగాస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్షవేసి తన అహాన్ని చల్లార్చుకోవాలి అనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు.


ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది.


వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమయిన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.


మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు.


ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పురజనులకు ఎలా ముఖము చూపించగలను? అని విచారించి...


అయినా ఇలా అడవిలో ఉండలేను కదా! అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు.


మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి, అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు.


కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు.


వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో..

        

"కుమారులారా! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి" అంది. 


స్త్రీగా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్యపాలకులుగా తండ్రిమాట పాటించి, వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు.


ఇది చూసిన ఇంద్రుడు 'నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలి’ అని సంకల్పించి,


ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి..

"రాజకుమారులారా! ఏమిటీ వెర్రి? ఎవరో ఎవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా ? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు? అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది.


ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై..


"అమ్మా నీవు ఎవరవు ఎందుకిలా రోదిస్తున్నావు?" అని అడిగాడు.


అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము, కుమారులను కనడము, అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము, మునిద్వారా కుమారులను కనడము, పూసగ్రుచ్చినట్లు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై...


"రాజా! నేను ఇంద్రుడను, నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు, నీ మీద కోపించి, ఈ కష్టాలు నీకు కలిగించాను." అని చెప్పాడు.


దానికి ఆమె "దేవా అజ్ఞానంతో తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా! కనుక నన్ను దయతో రక్షించు." అని వేడుకోగా...


ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరు కావాలో నీవే ఎంచుకో." అన్నాడు.


ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది..


ఇంద్రుడు "అదేమిటి రాజా! మిగిలిన వారు నీ కుమారులు కాదా?" అని అడిగాడు.


భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే.

వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని.

తండ్రి ప్రేమ కంటే, తల్లి ప్రేమ గొప్పది కదా!” అని చెప్పింది.


ఇంద్రుడు సంతోషంతో "రాజా! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని.


"రాజా! నీకు ఇంకొక వరము ఇస్తాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తాను" అన్నాడు.


దానికి ఆమె "మహేంద్రా! నా కుమారులను బ్రతికించావు అదే చాలు. స్త్రీగానే ఉంటాను." అంది.


ఇంద్రుడు ఆశ్చర్యంతో "అదేమిటి రాజా! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.


స్త్రీగా ఉన్న భంగస్వనుడు "మహేంద్రా! నేను స్త్రీగా (తల్లిగా) ఉండడములో ఆనంద పడుతున్నాను.

ఈ ప్రకృతిలో తల్లిని మించి ధైవం లేదని ప్రతీక. కనుక పిల్లలకు మొదటి గురువు నేనే. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో (తండ్రి తనములో) కనబడలేదు. కనుక నేను ఇలాగే ఉండిపోతాను." అంది.


దేవేంద్రుడు నవ్వి మాలాంటి దేవతలకు కూడ తల్లి విలువ చక్కగ చెప్పావు. “అలాగే అగుగాక” అని ఆశీర్వదించాడు.


అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు “యుధిష్టిరా! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం!” అని అడిగాడు.


స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.


ఒకతెకు జగములు వణకున్ అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ము గ్గురాండ్రు కలిసిన సుగుణాకరా పట్టపగలె చుక్కలు రాలున్


ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి.

ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి.

ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి.

అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావము...


                  🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

శంకర భగవాన్



 

తల్లిపాలలో దోషాలు

 తల్లిపాలలో దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు - 1


    తల్లిపాలు శిశువుకు అమృతప్రాయమైనవి. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువు యొక్క రోగనిరోధకశక్తిని పెంపొందించడం లో ప్రధానపాత్ర పోషించును . ప్రస్తుతం చాలమంది పిల్లలకు డబ్బాపాలు అలవాటు చేయడం జరుగుతుంది. దానివలన శిశువు శరీరం నందు కఫం పెరుగును . ఈ విధముగా కఫం పెరగటం వలన పాలఉబ్బసం , జీర్ణవ్యవస్థలో సమస్యలు , మలబద్ధక సమస్యలు వంటివి ఎన్నొ రోగాలు వస్తాయి.  


          ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిపాలు తాగుతున్న శిశువుకు కూడా ఎన్నొ రకాల సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం శిశువు తాగే తల్లిపాలలోని దోషాలు. మనం సమస్య ఎక్కడ ఉందో కనుగొనకుండా శిశువుకి మందుల మీద మందులు వాడి శిశువు యొక్క శరీరాన్ని మరింత బలహీనపరుస్తున్నాం. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం తల్లి తీసుకునే ఆహారం . పాతకాలంలో బాలింతకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు చాలామందికి ఏమి తినాలో తెలీదు. ఏదిపడితే అది తినటం వలన సంభవించే దోషప్రభావం చివరికి తల్లిపాల ద్వారా శిశువుకి సంప్రాప్తించి శిశువు రోగాలపాలవుతున్నాడు. 


         ప్రథమముగా తల్లిపాలలోని దోషాలను మనం తెలుసుకుని వాటిని పోగొట్టి శిశువుకు అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడవలెను . అదేవిధముగా తల్లికి ఎటువంటి ఆహారం ఇవ్వవలెనో కూడా మీకు నా తరవాతి పోస్టు నందు సంపూర్ణముగా వివరిస్తాను. 


  

     గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

శివలింగాలు

 🙏🕉శివలింగాలు🕉🙏 రేడియోధార్మికతతో_ఉంటాయా??


అవును 100% నిజం !!అదెలాగో_చూద్దాం..


 భారతదేశం యొక్క రేడియో కార్యాచరణ పటాన్ని తీయండి, మీరు ఆశ్చర్యపోతారు! భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా, అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది.


శివ లింగం అణు రియాక్టర్లు తప్ప మరొకటి కాదు,అందుకోసం మాత్రమే లింగాలకు నీరు అందించబడుతుంది, తద్వారా అవి ప్రశాంతంగా ఉంటాయి.


#బిల్దేవా, 

#అక్మద్, 

#ధాతురా, 

#గుధల్ వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలన్నీ అణుశక్తి శోషకాలు.


****ఎందుకంటే శివలింగం పై పొసే నీరు కూడా రియాక్టివ్‌గా మారుతుంది, అందుకే డ్రైనేజ్ ట్యూబ్ దాటదు.


భాభా అణు రియాక్టర్ రూపకల్పన కూడా శివ లింగం మాదిరిగానే ఉంటుంది. 


నదిలో ప్రవహించే నీటితో కలిపినప్పుడు లింగం మీద పోసిన నీరు ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది.


****మన పూర్వీకులు మహాదేవ్ శివశంకర్‌కు కోపం వస్తే హోలోకాస్ట్ వస్తుందని మాకు చెప్పేవారు.


మన సంప్రదాయాల వెనుక #సైన్స్_ఎంత_లోతుగా దాగి ఉందో గమనించండి.


కేదార్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖలో నిర్మించిన ఇంత ముఖ్యమైన శివాలయాలు భారతదేశంలో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మన పూర్వీకులు ఈ రోజు వరకు మనకు అర్థం చేసుకోలేని శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారా? #ఉత్తరాఖండ్‌లోని_కేదార్‌నాథ్, 

#తెలంగాణలోని_కాలేశ్వరం, 

#ఆంధ్రప్రదేశ్‌లోని_కాళహస్తి, 

#ఏకాంబరేశ్వర్_లోని_చిదంబరం, 

#తమిళనాడులోని_రామేశ్వరం 

ఆలయాలు భౌగోళిక సరళ రేఖలో 79 ° E 41’54 ”రేఖాంశంలో నిర్మించబడ్డాయి.


ఈ దేవాలయాలన్నీ ప్రకృతి యొక్క 5 అంశాలలో లింగ వ్యక్తీకరణను సూచిస్తాయి, వీటిని మనం సాధారణ భాషలో పంచభూత అని పిలుస్తాము. పంచభూట్ అనగా భూమి, నీరు, అగ్ని, గాలి మరియు అంతరిక్షం. ఈ ఐదు అంశాల ఆధారంగా, ఈ ఐదు శివలింగాలు భర్తీ చేయబడ్డాయి.


 1)#తిరువనకవల్(జంబుకేశ్వర)ఆలయంలో నీరు ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని జల లింగం అంటారు

2)#తిరువన్నమలైలో (అరుణాచలేశ్వర)అగ్ని ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని అగ్నిలింగం అంటారు.

3)వాయువు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక #కాళహస్తి లింగాన్ని వాయులింగం అని అంటారు.

4) భూమి ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక దానిని #కాంచీపురంలో #పృథ్వి_లింగం అని అంటారు.

5)#చిదంబరం ఆలయంలో ఆకాశం ప్రాతినిధ్యం వహిస్తుంది!అందుకే దానిని ఆకాశ లింగం అంటారు.


 ఈ ఐదు దేవాలయాలు వాస్తు-విజ్ఞాన-వేదం యొక్క అద్భుతమైన అంతరాన్ని ప్రతిబింబిస్తాయి.


ఈ దేవాలయాలలో భౌగోళిక లక్షణాలు కూడా కనిపిస్తాయి.ఈ ఐదు దేవాలయాలు యోగ విజ్ఞానం ప్రకారం నిర్మించబడ్డాయి మరియు ఒకదానితో ఒకటి ఒక నిర్దిష్ట భౌగోళిక అమరికలో ఉంచబడ్డాయి. దీని వెనుక ఖచ్చితంగా కొంత శాస్త్రం ఉంటుంది, ఇది మానవ శరీరంపై ప్రభావం చూపుతుంది.


ఈ దేవాలయాలు #ఐదువేల_సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి, ఆ ప్రదేశాల అక్షాంశం మరియు రేఖాంశాలను కొలవడానికి అప్పట్లో ఉపగ్రహ సాంకేతికత అందుబాటులో లేదు అయినప్పటికీ ఐదు దేవాలయాలు ఇంత ఖచ్చితంగా ఎలా స్థాపించబడ్డాయి?భగవంతుడికి మాత్రమే తెలుసు.


కేదార్‌నాథ్ మరియు రామేశ్వరం మధ్య 2383 కి.మీ దూరం ఉంది. కానీ ఈ దేవాలయాలన్నీ దాదాపు ఒకే సమాంతర రేఖలో వస్తాయి. ఏ టెక్నిక్‌ను సమాంతర రేఖలో నిర్మించారు, ఏ టెక్నిక్‌ను ఉపయోగించి వేల సంవత్సరాల క్రితం నిర్మించారు అనేది ఈనాటికీ మిస్టరీగా మిగిలిపోయింది.


 శ్రీకాళహస్తి ఆలయంలో #మెరుస్తున్న_దీపం అది వాయు లింగమని చూపిస్తుంది.

 తిరువానిక్క ఆలయం లోపలి #పీఠభూమిలోని నీటి బుగ్గ అది జల లింగం అని సూచిస్తుంది.

 అన్నామలై కొండపై ఉన్న భారీ దీపం అది అగ్ని లింగమని చూపిస్తుంది.

 కాంచీపురం ఇసుక యొక్క స్వయం ప్రకటిత లింగా అది భూమి లింగా అని చూపిస్తుంది

 చిదంబరం యొక్క నిరాకార స్థితి నుండి, భగవంతుని యొక్క నిరాకారత అంటే ఆకాశ మూలకం అంటారు.


ఇప్పుడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విశ్వంలోని ఐదు అంశాలను సూచించే ఐదు లింగాలు శతాబ్దాల క్రితం ఒకే వరుసలో పొందుపరచబడ్డాయి. మన పూర్వీకుల విజ్ఞానం మరియు జ్ఞానం గురించి మనం గర్వపడాలి, అలాంటి విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా గుర్తించలేకపోయాయి. ఈ ఐదు దేవాలయాలు మాత్రమే కాదు, ఈ వరుసలో కేదార్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు సరళ రేఖలో పడే అనేక దేవాలయాలు ఉంటాయని నమ్ముతారు. ఈ పంక్తిని "శివశక్తి ఆకాష్ రేఖ" అని కూడా పిలుస్తారు. బహుశా ఈ దేవాలయాలన్నీ 81.3119 ° E లో పడే కైలాష్‌ పర్వతంను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడ్డాయి.

అది ఆ ఈశ్వరుడికే తెలియాలి.


 "#మహాకాళేశ్వర్" నుండి శివ #జ్యోతిర్లింగాల మధ్య సంబంధాన్ని చూడటం ఆశ్చర్యంగా ఉంది.


 ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య దూరం కూడా ఆసక్తికరంగా ఉంటుంది-


ఉజ్జయిని నుండి సోమనాథ్ - 777 కి.మీ.


ఉజ్జయిని నుండి ఓంకరేశ్వర్ - 111 కి.మీ.


ఉజ్జయిని నుండి భీమాశంకర్ - 666 కి.మీ.


ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ - 999 కి.మీ.


ఉజ్జయిని నుండి మల్లికార్జున్ - 999 కి.మీ.


ఉజ్జయిని నుండి కేదార్‌నాథ్ - 888 కి.మీ.


ఉజ్జయిని త్రయంబకేశ్వర్ - 555 కి.మీ.


 ఉజ్జయిని నుండి బైజ్నాథ్ - 999 కి.మీ.


 ఉజ్జయిని టు రామేశ్వరం - 1999 కి.మీ.


 ఉజ్జయిని ఘ్రితేనేశ్వర్ - 555 కి.మీ.


హిందూ ధర్మంలో, కారణం లేకుండా ఏమీ జరగదు


 వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా పరిగణించబడుతుంది.అందువల్ల, సుమారు 2050 సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు జ్యోతిషశాస్త్రం యొక్క లెక్కింపు కోసం ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు తయారు చేయబడ్డాయి.


 సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ శాస్త్రవేత్త ఊహాత్మక రేఖ ను సృష్టించినప్పుడు, అతనికి మధ్య భాగం ఉజ్జయిని అని తేలింది.నేటికీ #శాస్త్రవేత్తలు #ఉజ్జయినికి_సూర్యుడు మరియు #అంతరిక్షం గురించి #సమాచారం కోసం వస్తారు.


 ఓం హర్ హర్ మహాదేవ్


ఒక మిత్రుని నుండి సేకరణ:

పంచక రహితం

 ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.

అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.

2 అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి. 

4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు. 

6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.

8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.

కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.

అయితే తప్పని సరి పరిస్థితులలో .....

చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ

అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్

అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.

మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు.

బ్రాహ్మణుల పేర్లు

 *బ్రాహ్మణుల పేర్లు*


 *ఆంధ్రప్రదేశ్ ANDHRA* 


శర్మ SARMA

శాస్త్రి SASTRI

సోమయాజులు SOMAYAJULU

దేష్ ముఖ్ Deshmukh

   

 *బెంగాల్ BENGAL* 


బెనర్జి BANARJEE

భట్టాచార్య BHATTACHARYA

ఛటర్జీ CHATTERJEE

గంగూలి GANGULI

ముఖర్జీ MUKHERJEE

   

*బీహార్ BIHAR* 


ఝా JHA

మిశ్రా MISHRA

   

 *గుజరాత్ GUJARAT* 


భట్నాగర్ BHATNAGAR

పాండ్య PANDYA

త్రివేది TRIVEDI

తివారి TIWARI

   

 *జమ్ము అండ్ కాశ్మీర్ JAMMU AND KASHMIR* 


కర్ KAR

పండిత్ PANDIT

శర్మ SHARMA

   

 *కర్నాటక KARNATAKA* 


ఆడిగ ADIGA

ఐథల్ AITHAL

భట్ BHAT

దేశ్ పాండె DESHPANDE

హెబ్బార్ HEBBAR

అయ్యర్ IYER

అయ్యంగార్ IYENGAR

కరంథ్ KARANTH

సోమయాజులు SOMAYAJI

శర్మ SHARMA

శాస్త్రి SHASTRI

బింద్రె BENDRE

   

 *కేరళ KERALA* 


నంబూద్రి NAMBOODARI

   

 *మహారాష్ట్ర MAHARASHTRA* 


అథవాలె ATHAVALE

భట్ BHAT

భావే BHAVE

దతర్ DATAR

దాతయ్ DATEY

దేశ్ పాండె DESHPANDE

దీక్షిత్ DIXIT

గోఖలే GOKHALE

జోషి JOSHI

పండిత్ PANDIT

పట్వర్దన్ PATWARDHAN

   

 *ఒడిషా ODISHA* 


కనుంగొ KANUNGO

కర్ KAR

మిశ్రా MISHRA

సత్పతి SATPATI

   

 *పంజాబ్ PUNJAB* 


శర్మ SHARMA

   

రాజస్థాన్ RAJASTHAN


శర్మ SHARMA

వ్యాస్ VYAS

   

 *తమిళనాడు TAMILNADU* 


అయ్యర్ IYER

అయ్యంగార్ IYENGAR

   

 *ఉత్తర ప్రదేశ్ UTTAR PRADESH* 


చతుర్వేది CHATURVEDI

ద్వివేది DWIVEDI

జోషి JOSHI

మిశ్రా MISHRA

శర్మ SHARMA

త్రిపాఠి TRIPATHI

వాజపేయి VAJAPAYEE

AM మరియు PM సంస్కృత పదాలు!

 *మీకు తెలుసా*


 *AM మరియు PM సంస్కృత పదాలు!*


 కానీ మనందరికీ నేర్పించబడింది?

 AM: యాంటే మెరిడియం,

 PM: పోస్ట్ మెరిడియం.

ఇవి లాటిన్ భాష లోకి మన నుండి copy కొట్టారు.


 ఎందుకంటే ఇది దొంగిలించబడిన పదం యొక్క చిన్న రూపం.

మధ్యాహ్నము నకు ముందు మధ్యాహ్నం తరువాత అని అర్థం వల్ల

గందరగోళం కూడా తలెత్తుతుంది. ఎందుకంటే ఈ లాటిన్ పదాలు వాస్తవంగా ఉన్న సంస్కృతం యొక్క 'అర్ధాన్ని' సూచించవు!

మన ప్రాచీన సంస్కృత భాషలో స్పష్టంగా తెలుస్తుంది. చూడండి ...


 *AM: అరోహనం మార్తాండస్య*

 *PM: పతనమ్ మార్తాండస్య*

  

 *అరోహనం మార్తాండస్య*

 అంటే సూర్యుని ఆరోహణ.

పగలు పన్నెండు గంటలకు ముందు. అరోహనం మార్తాండస్య (AM)


 పగలు పన్నెండు తరువాత సూర్యుని పతనం వల్ల

*పతనమ్ మార్తాండస్య* (PM)

అని అర్థములు.


  *జయతు సంస్కృతం, జయతు భారతం ...*

వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను

 శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవం అనే అంటారు, సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటున్నారు, భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్లిపోయారు.. అప్పుడు మొదలు అవుతుంది ఆత్మ గోష నా భార్య నా పిల్లలు నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు అతను ఎవరికీ కనిపించడు వినిపించడు ఇది నా ఇల్లు నా వస్తువులు నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్లలేకపోయానే.. వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను.. అని ఏడుపు మొదలు అవుతుంది.. 


గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఎదో సాకుతో సాదించాను కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది ఇప్పుడు ఓడార్చే శక్తి కూడా లేదు..అని అప్పుడు అనిపిస్తుంది కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పోరాబాట్లు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నిదగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ గోషిస్తుంది, చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషం గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 


ఎక్కడైతే వదిలేసారో అదే స్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవ గానే ఓ స్వరం వినిపిస్తుంది నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను బయపడకు అని ,ఎవ్వరూ రాని చోటికి ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు అప్పుడు కనిపిస్తాడు దేవుడు.  


అప్పటివరకు ఆత్మ గోషతో రోదిస్తున్న ఆత్మ ఏమైయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను..ఎంత మొక్కి ఉంటాను ఏనాడైన ఇలా వెంటనే పలికావా ఇప్పుడు మటుకు ప్రత్యక్షం ఐయ్యావు అని అడుగుతాది ఆత్మ , శివయ్య అంటాడు నేను నువ్వు పిలిచిన ప్రతి సారి పలుకుతూనే ఉన్నాను కానీ నువ్వు వినలేక పోయావు నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను అది నీకు వినపడాలి అని కానీ నువ్వు బతికి ఉన్నంత కాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు.. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు.. స్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను నీ ప్రతి కష్టంలోనూ తొడుగానే ఉన్నాను దాటిస్తూనే ఉన్నాను కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేక పోయావు.. నువ్వు వచ్చే టప్పుడు నువ్వు పోయే టప్పుడు నీ తో వస్తున్నది నీ కర్మ మటుకే ఇంక ఏదీ నీతో రాదు అని శివయ్య చెప్పాక.. ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణ బంధం ఉన్నంత వరకే ఈ జీవితం.. దేహం తట్టుకునే వరకే ప్రాణం తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం ఇంకో కొత్త దేహాన్ని వెతుకుంటుంది ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంక ఋణ బంధాలు ఎలా ఉంటుంది ఆలోచించండి.


🌷హర హర మహాదేవ🌷

మజ్జన్మన:

 మజ్జన్మన: ఫలమిదం మధుకైటభారే

మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ!

త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య

భృత్య ఇతి మాం స్మర లోకనాథ!🌹



తాంబూల విశేషాలు

   - 

తాంబూల విశేషాలు

 * తాంబూలమును భుజించిన తరువాత వేసుకొనవలెను . భోజనమునకు తరువాత మూడు నాలుగుసార్లు ఒక వక్క , నాలుగు ఆకులు , సున్నము వేసుకొని సేవించవలెను . 


 * వక్కకు , ఆకులకు సరిపోవునట్లు సున్నము రాచుకొని కషాయ రసం లేక కొంచము కారము ఉండునట్లు చూచుకొని తాంబూలము వేసుకొనవలెను . 


 * భొజనమునకు ముందు తాంబులం వేయకూడదు . తాంబూలం పిప్పిని మింగకుండా ఉమ్మివేయవలెను . 


 * తాంబులం వేసుకొనుటకు ముందు నోటిని శుభ్రముగా పుక్కిలించి తాంబులం వేసుకొన్నచో నోటికి రుచిని చేకూర్చి మంగళకరముగా ఉండును. 


 * తాంబులం నోటిలో వేసుకున్న తరువాత మొదటిసారిగా వచ్చిన తాంబూల రసము మింగిన విషసమానముగా ఉండును. రెండొవసారి వచ్చినది విరోచనకారి . ఆ తరువాత వచ్చు రసము అమృతతుల్యమైనది. చక్కగా జీర్ణం చేయును . రసాయనం . 


 * పాలు తాగిన వెంటనే తాంబులం వేసుకొన్నయెడల కుష్ఠు రోగము గాని ప్రమేహరోగము గాని , మూత్రరోగము గాని కలుగును.


 * పాలు , వెలగపండు , పనస , మామిడి , అరటి , చెరకుగడ , మద్యము , మాంస రసము , కషాయము , నెయ్యి , తేనె , కొబ్బరి నీరు వాడిన ఒక గంట వరకు తాంబులం వేసుకొనిన విషముగా పరిణమించును. 


 * నేత్రవ్యాధి , క్షయ , పాండువు , భ్రమ , మద్యపానం చేయుట వలన జబ్బు పడినవారు , అపస్మారము , శ్వాస , గుండెజబ్బు , రక్తపైత్యము , గ్రహణి , అతిసారం వంటి సమస్యలతో ఇబ్బందిపడువారు తాంబూల సేవన చేయరాదు . 


 * దెబ్బలు తగిలినవారు , పిత్తరోగము , రక్తవ్యాధులు కలిగినవారు , వేడిశరీరం కలిగినవారు , మూర్చ , క్షయరోగము కలిగినవారికి తాంబులం నిషిద్దం . సంధ్యాసమయం నందు తాంబూలసేవన చేయరాదు . 


 * తమలపాకు తొడిమ వ్యాధికారకము , చివర భాగము మంచిది . సున్నము నందు ఉంచిన ఆకు ఆయుక్షీణము . ఈనెలు బుద్దిని చెడగొట్టును . కావున ఆకుల యొక్క తొడిమలు , చివరలు , ఈనెలు వదిలి సున్నము పెట్టిన ఆకును పారవేచి తాంబూల సేవన చేయుట మంచిది . 


 * సున్నము పెట్టిన ఆకు చూర్ణపర్ణం అనబడును . పురుగులచే కొట్టబడి , రుచిలేనిది అయ్యి నల్లనిరంగు కలిగిన ఆకులు మంచివి కావు . రాళ్లు కలిగి , తెల్లగా ఉండక , ఎండిపోయిన పొడి సున్నము మంచిది కాదు . 


 * తాంబులం నందు వేయు పోకకాయ మంచి ప్రదేశము నందు పుట్టినది , గట్టిది , బరువు గలది , చిక్కనిది , పగలగొట్టినచో కుందేలు మాంసపు వర్ణము కలది మంచిది . 


 * తమలపాకును మాలిన్యము లేకుండా వస్త్రముతో తుడిచి ఈనె చీల్చి , సున్నము రాచి రెండువేళ్ళ పొడుగునా పార్శ్వములు మడిచి చుట్టి తీసికొనవలెను . 


 * పోకలు కషాయ , మధురరసములు కలవిగా ఉండును. ఋక్షగుణము కలవి . త్రిదోషములను పోగొట్టును . బాగుగా వండినది త్రిదోష హరము . వండని పచ్చి వక్క దోషములను ప్రకోపింపచేయను . కారముగా ఉండు తమలపాకు మంచిది . పండిన తమలపాకు సర్వదోషములను హరించును . విశేషముగా కఫవాతములను హరించి దోషములను బేధించి అగ్నిదీప్తిని కలిగించును. క్రిమిదోషములను పోగొట్టును . 


 * కర్పూర మిశ్రితమైన తాంబూలము మనస్సుకు సంతోషమును , మిక్కిలి సంభోగ శక్తిని , మదమును కలిగించును. ముఖరోగములను , క్రిమిరోగములను పోగొట్టును . కాచుతో కూడిన తాంబూల సేవన వలన ముఖరోగములు , క్రిమిరోగములు పోవుటయే కాక దంతములకు పటుత్వంను కలిగించును. నోటి దుర్గన్ధమ్ పోవును . వాతమును , శ్లేష్మమును హరించి దోషములను చేధించి రక్తమును , పైత్యమును పెంపొందించును . 



         పైన చెప్పినవే కాకుండగా మరెన్నో అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి . వాటి గురించి నా గ్రంథాలలో సంపూర్ణముగా వివరించాను . 


  

   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

*వనదేవత వరం

  *వనదేవత వరం - సంయుక్త అక్షరాలు లేని కథ* - పునః కథనం - డా.ఎం.హరికిషన్ - 9441032212 - కర్నూలు

      ఒక ఊరిలో ఒక రైతు వుండేవాడు. ఆయన చాలా పేదవాడు. మంచాలు చేసి బతికేవాడు. అతను పచ్చని చెట్టును కొట్టేవాడు కాదు. కేవలం ఎండిపోయిన చెట్టును కొట్టి ఆ చెక్కతో మంచాలు చేసేవాడు. ఎండిపోయిన చెట్టు కనబడకపోతే కడుపుకు అన్నం లేకపొయినా అలాగే ఉండేవాడే గానీ నియమం తప్పేవాడు గాదు. ఒకసారి అడవిలో ఎంతదూరం పోయినా ఒక్కటి గూడా ఎండిపోయిన చెట్టు కనబడలేదు. తిరిగి తిరిగీ బాగా అలసిపోయాడు. అలా మూడు రోజులు గడచిపోయాయి. కానీ ఎక్కడా ఎండిన చెట్టు కనబల్లేదు. మూడు రోజులనుండీ తిండి తినక పోవడంతో ఆకలితో అలాగే ఒకచోట పడిపోయాడు.


వనదేవత అది చూసింది. “చావడానికయినా సిద్ధపడుతున్నాడు గానీ, పచ్చని చెట్టు కొట్టడం లేదు. మనిషంటే ఇలా వుండాలి. ఇలాంటోళ్ళకు సాయం చేయని బతుకు బతుకే గాదు” అనుకొంది. వెంటనే పైనుండి రైతు ముందుకు దిగి వచ్చింది. వెంటనే రైతు మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలా అయిపోయాడు.


వనదేవత అతనికి ఒక చెట్టును చూపించి “అదిగో ఆ చెట్టును కొట్టి మంచం చేయి. ఎవరడిగినా “పదివేల వరహాలు చేతిలో పెట్టి తీసుకుపోండి. లేదంటే లేదు” అని చెప్పు. అలా ఇచ్చేటోనికే అమ్ము" అని చెప్పి మాయమైపోయింది.


రైతు వనదేవత చెప్పినట్టే ఆ చెట్టు కొట్టి ఒక అపురూపమయిన, అందమయిన మంచం తయారు చేసి బజారుకు తీసుకోని పోయాడు.


జనాలు ఆ మంచాన్ని చూసి 'ఎంత' అని అడిగితే “పదివేల బంగారు వరహాలు" అని చెప్పసాగాడు. అది విని జనం “నీకేమయినా పిచ్చి పట్టిందా... మంచమేంది... పదివేల బంగారు వరహాలేంది.... ఎవరయినా వింటే నవ్విపోతారు” అంటూ వెళ్ళిపోసాగారు.


రోజులు వారాలై, వారాలు నెలలైనాయి. కానీ మంచం ఎవరూ కొనలేదు. ఐనా రైతు కొంచంగూడా పట్టు విడవకుండా అలాగే ధర చెప్పసాగాడు. ఒకరోజు ఆ ఊరి రాజు వచ్చాడు. రైతు చెప్పిన ధర విని “ఎందుకింత ఎక్కువ చెబుతున్నావు” అని అడిగాడు. దానికి ఆ రైతు “దీని మీద ఒక్కరోజు పండుకోని చూడండి. మీకే తెలిసిపోతుంది” అన్నాడు.


"సరే" అని రాజు ఆ రైతు అడిగిన డబ్బులిచ్చి ఆ మంచం తీసుకొని పోయి దాని మీద పండుకున్నాడు. తెల్లవారే ముందు ఏవో మాటలు వినబడితే లేవకుండానే కళ్ళు తెరిచాడు. మంచం నాలుగు కోళ్ళు మాటలాడు కొంటున్నాయి.



ఒక కోడు "నేను తూరుపు దిక్కుకు పోయాను. కొందరు దొంగలు నగల అంగళ్ళలో పడి దొంగతనం చేసి ఆ నగలన్నీ వూరి బైట మర్రిచెట్టు కింద దాచి పెట్టారు” అని చెప్పింది.


రెండో మంచంకోడు "నేను పడమర దిక్కుకు పోయాను. అక్కడ ఒక పంచాయితీ జరుగుతూ వుంది. ఆ ఊరి అధికారి లంచం తీసుకోని ఒక యువకున్ని తప్పు చేయకున్నా జైలుపాలు చేశాడు” అని చెప్పింది.


మూడో మంచంకోడు “నేను ఉత్తరం దిక్కుకు పోయాను. కోటకు కాపలా కాయవలసిన సైనికులు కాపలా కాయకుండా నిదుర పోతావున్నారు. ఎవరయినా దాడి జరిపితే తట్టుకోవడం చాలా ఇబ్బందే" అని చెప్పింది.


నాలుగో మంచంకోడు "నేను దక్షిణం దిక్కుకు పోయాను. అక్కడ ఒక గొప్ప సంగీతకారున్ని చూచాను. అతనిలాగా పాటలు పాడేవారు ఎవరూ లేరు. కానీ అతను పేదవాడు కావడంతో రాజు దగ్గరికి రాకుండా మిగతా పండితులు అడ్డం పడుతున్నారు” అని చెప్పింది.


రాజు అవి చెప్పుకొనేవన్నీ విన్నాడు. తెల్లవారగానే ఆ మంచంకోళ్ళు మట్టసంగా ఎక్కడివక్కడ మాములుగా వుండిపోయాయి.


రాజు సైనికులను తీసుకోని పోయి తూరుపు దిక్కున మర్రిచెట్టు కింద తవ్వించాడు. నగలన్నీ బైటపడ్డాయి.


పడమర దిక్కుకు పోయాడు. ఒక యువకున్ని కారాగారంలో బంధించి వుంచడం కనబడింది. వాన్ని విడిపించి లంచం తీసుకొన్న అధికారిని కొరడాలతో కొట్టించి జైలులో వేయించాడు.


దక్షిణం దిక్కుకు పోయాడు. పాటగాన్ని కలసి, సభకు తీసుకొని వచ్చి అందరి ముందు పాట పాడమన్నాడు. అతని పాట విని జనాలంతా ఆనందంతో జేజేలు పలికారు.. రాజు అతనికి మోయలేనంత బంగారమిచ్చి, అతనికి తన సభలో సంగీతకారుని పదవి ఇచ్చాడు.


తరువాత ఉత్తరం దిక్కుకు పోయాడు. సైనికులు కాపలా కాయకుండా పడుకోని కనిపించారు. వాళ్ళందరినీ కొరడాలతో కొట్టించి జైలులో వేయించాడు.


తరువాత రైతు దగ్గరికి పోయాడు. “నువ్వు చెప్పినట్టు పదివేలు కాదు. ఎంత ఇచ్చినా ఆ మంచానికి తక్కువే” అంటూ రైతును మెచ్చుకోని మరలా లక్ష బంగారు వరహాలు ఇచ్చి, ఒక పెద్ద మేడ కట్టిచ్చి ఇచ్చాడు.


దాంతో రైతుకు ఆరోజు నుండీ బాధలన్నీ తొలగిపోయాయి. హాయిగా పెళ్ళి చేసుకోని, పిల్లాపాపలతో, పేదవారిని అవసరానికి అదుకుంటూ ఆనందంగా జీవించసాగాడు.

**********************

డా.ఎం.హరికిషన్ - కర్నూలు

ఆనందం ఖరీదు-ఆలోచన:*

 ఆనందం ఖరీదు-ఆలోచన:*        

         (గొల్లపూడి మారుతిరావు)


      చాలామంది ఆనందానికీ, ఖరీదుకీ లంకె వుంటుంది. ఖరీదైన కారూ, ఖరీ దయిన సూటూ, ఖరీదయిన భోజనం, ఖరీదైన పరుపూ... మీ యిష్టం -ఏదైనా దాని చివరవున్న చీటీనిబట్టి మనసులో ఆనందానికి తూకం వుంటుంది.    

   మాఆవిడ షాపులోచీరెల రంగులూ, నాణ్యాన్ని చూసే ముందు ధరని చూస్తుంది. ధర నాలుగంకెల్లో వున్నాక ఆమెకి మెల్లగా చీరె నచ్చడం ప్రారంభి స్తుంది. ఆ తరువాతే రంగు, మన్నికా వగైరా. ఓ సారి నేను తెచ్చిన చీరెని ఆనందంగా అందుకుంది. తృప్తిగా కట్టుకుంది. ఖరీదుని దాచి నెలరోజుల తర్వాత చెప్పాను- ఫలానా మార్కెట్లో చౌకగా తీసుకున్నానని! ఆ క్షణం నుంచీ ఆ చీరెమీద ఆమెకి మక్కువ పోయింది!


        మా పెద్దబ్బాయి అన్నిటా వాళ్ళమ్మ పోలిక! ఓసారి వాడి బూట్లు దరిద్రంగా వున్నాయన్నాను. నన్ను జాలిగా చూసి-అవి ఫలానా బ్రాండువి- యింగ్లండులో ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ లో వెయ్యి రూపాయలకి కొన్నానని గర్వపడ్డాడు. మొన్న స్విట్జ- ర్లాండు నుంచి వస్తూనే ఓ కళ్ళజోడు చూపించాడు. “దీని ఖరీదు చెప్పు?” అన్నాడు- కంటి మీద అటూ యిటూ తిప్పుతూ. మా ఆవిడ సంగతి తెలిసిన వాడిని కనుక 10వేల దగ్గర మొదలెట్టా. మా వాడు తప్పిపోయిన అనాధని చూస్తున్నట్టు నన్ను క్షమిస్తూ నవ్వాడు. ఇది ఫలానా వీధిలో ఫలానా షాపులో కొన్నానన్నాడు. దాని ఖరీదు 75వేల రూపాయలు. బ్రిటిష్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ దగ్గర్నుంచి మెడోన్నా దాకా అంతా అక్కడే కళ్ళజోళ్ళు కొంటారట! అసలు స్విట్జర్లాండు నుంచి తిరిగి వస్తూ లండన్ లో ఆగడానికి కారణం- ఆ కళ్ళజోడుని ఖరీదు చెయ్యడం!


        ఓసారి బదరీనాధ్ నుంచి కారులో ఢిల్లీ చేరాం. ఉదయం చెన్నై విమానం! ఆ రాత్రి మా అబ్బాయితో ఐదు నక్షత్రాల హొటల్లో వున్నాను. రాత్రి 11 గంటలకి కేవలంపెరుగుఅన్నంతెప్పించుకున్నానుదాని బిల్లు చూశాక అన్నం నోట్లోకి పోలేదు. బిల్లు 750 రూపాయలు! ఐతే- ఆ మాట విన్నాక మావాడికి ఆ హోటల్ మీద మోజు పెరిగింది. 

 

       చాలామందికి అనుభవించే ప్రతి వస్తువూముందు అనందాన్ని పంచాలి!ఏ ఖరీదూ అక్కరలేని చందమామ వెన్నెల బొత్తిగా చవకగా వుంటుంది. 


        ఆల్ఫ్స్ ని చూస్తూ-డాలర్ల ఖర్చుతో హోటల్ గది వరండాలోకి తొంగిచూసే వెన్నెలకి మాత్రమే ఆ రుచి వుంటుంది.


      నేనూ ఏ వస్తువయినా కొనేముందు ధరని చూస్తాను- అర్ధంలేని ఖరీదునీ, అవసరంలేనిస్థాయినీ మించిపోతుం దేమోనని! 10 వేల రూపాయల లండన్ బూట్లు నా కాళ్ళను కరుస్తాయి. అంత కంటె వెయ్యిరూపాయల విశాఖపట్నం బూట్లు నమ్మకంగా నాకు సుఖాన్నిపంచి నాలుగుసార్లు కొత్తవి కొనుక్కునే వనర్లని జేబులో మిగులుస్తాయి.


          కొందరు విమానాల్లొ క్లబ్ క్లాసుల్లో ప్రయాణాలు చేస్తారు. నేను ప్రయత్నించి మరీ “ఎకానమీ” లో కూర్చుంటాను. సుఖం కంటె తన అంతస్థు “లేబుల్” వారిని ఆనందపరుస్తుంది. అంతకంటె గర్వపరుస్తుంది.


       ఉపాధికీ, పట్టెడన్నానికీ నోచుకోలేని కోట్లాదిమంది వున్న మన సమాజంలో- ఈ ’లేబుల్’ కాస్త ఎబ్బెట్టుగా, హాస్యాస్ప దంగా వుంటుంది. అయితే చాలా మందికి సుఖం అన్నది వస్తువు చివర అంటించిన ధర చీటీ. అవసరాన్ని తీరిస్తే చాలదు. తమ అతిశయాన్ని రెచ్చగొట్టగలగాలి.


         విచిత్రమేమిటంటే- ఒక్క భారత దేశంలోనే పేదరికానికి చాలా సంపన్న మైన అర్ధం వుంది. డబ్బు లేకపోవడం అంటే మరే దేశంలోనయినా దరిద్రానికి గుర్తే. కాని ఒక్క భారతదేశంలోనే దాని అర్ధం వేరు! ఇక్కడ ’లేమి’కి అర్ధం వైభవం. 

         ఆ వైభవం స్థాయి-ఆ వ్యక్తి స్థాయి, సంస్కారం, మానసిక పరిపక్వతని బట్టి పెరుగుతుంది.పరమాచార్య వంటిమీద బట్టఖరీదు పట్టుమని పదిరూపాయలు ఉండదు. 

      భగవాన్ రమణ మహర్షి – 'మనిషికీ పశువుకీ తేడాని తెలిపే చిన్నఆఛ్ఛాదన - కౌపీనం చాలు'నని తను జీవించి నిరూపించారు.


    అడవిలో,ఆశ్రమంలోకందమూలాలు తిని తపస్సు చేసుకునే భరద్వాజ ముని శ్రీరాముని రాజ్యానికి ఆహ్వానించడానికి భరతుడు సైన్యంతో తరలివచ్చినప్పుడు అందరికీ మృష్టాన్నభోజనంతోవిందుని ఏర్పాటు చేశాడు. కందమూలాలు తిని బతికే బైరాగి చేసిన ఘనమైన విందు ’భరద్వాజ విందు’గా పురాణాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. 

కోరుకుంటే తను ప్రతీ రోజూ ఆ స్థాయిలో విందుని అనుభవించ వచ్చుకదా? 

ఆ అవసరం- ఆ పరిపక్వదశలో... ఆ ఋషికి అనవసరం! కాని దేశాన్ని పాలించే మహారాజుకీ,ఆయన పరివారా నికీ అది మర్యాద.!


ఆస్థి, అంతస్థు, అర్ధంలేని కీర్తి, సౌఖ్యం అన్నీ పతనానికి దారితీస్తాయి. మార్లిన్ మన్రో దగ్గర్నుంచి నిన్న మొన్నటి మైకేల్ జాక్సన్ దాకా ఎన్నైనా ఉదాహరణలు ఉన్నాయి. అందుకే టాటాలూ, బిర్లాలూ గుడులు కట్టించీ, ట్రస్టులు నెలకొల్పీ ఎప్పటికప్పుడు తమ తమ దృక్పధాన్ని సంస్కరించుకుంటూంటారు.


     చూపు బేధం లోనే ఆనందపు రహస్యం వుంది. కాలికి తొడుక్కునే లండన్ బూట్లలో కాదు!     

   అమెరికాలో పీటర్సన్ అనే వ్యాపారికి నడమంత్రపు సిరి ఎత్తుకుని కోట్లు సంపాదించాడు.ఆయన ఈమధ్య ప్రజా సేవకి బిలియన్ డాలర్ల ట్రస్టుని ఏర్పాటు చేశాడు. ఆయన ఎప్పుడూ ఆనందంగా తృప్తిగా కనిపించే తన డ్రైవర్ని అడిగాడట:

         “ఎప్పుడూ ఆడిటర్లతో, పన్నుల ధ్యాసతో, బాంకు చెక్కుబుక్కులతో నేను సతమతమవుతూంటాను. నువ్వు ఆనందంగా ఎలా వుండగలుగుతున్నా

వని?"

          డ్రైవరు నవ్వి అన్నాడట:”మీకు లేనిది- ఒకదాన్ని నేను సమృద్ధిగా సంపాదించుకున్నాను సార్,” అని!

     “ఏమిటది?”

      “ఇంక చాలు అనే ఆలోచనని!" అన్నాడట.

          ఆనందాన్నీ, తృప్తినీ, సుఖాన్నీ ఆలోచనలో ఎంత గొప్పస్థాయిలోనైనా నిలుపుకోవచ్చు. దానికి భగవాన్ రమణ మహర్షి, పీటర్సన్ డ్రైవరూ- యిద్దరూ రెండు రకాలయిన ఉదాహరణలు!✍️️

                ( గొల్లపూడి మారుతీరావు 

                        జీవన కాలమ్ నుండి ) సేకరణ 

*ధ్యానానికి* *మించిన* *తీర్ధయాత్ర* *లేదు* !!

  *ధ్యానానికి* *మించిన* *తీర్ధయాత్ర* *లేదు* !!

వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపు వాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలు పెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.

మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. 

పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.' అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.

అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

'అదేంటి బావా? ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.

దానికి కృష్ణుడు నవ్వి.' బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.

ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.

మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు. అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు. *తపస్సు అంటేనే ధ్యానం* . ధ్యానం ద్వారానే జ్ఞానసిద్ధిని పొందారు.

**అద్వైత వేదాంత పరిచయం**

 **అద్వైత వేదాంత పరిచయం**

2.4 పురాణాలు :

 నాలుగో స్థాయి పురాణాలు. అవి స్మృతికన్నా మరింత వివరంగా ఉంటాయి. పురాణం అంటే అది ప్రాచీన గ్రంధం అయినా, ఇప్పటికీ వర్తిస్తుంది. పురా అపి నవ: ప్రాచీనమే కాని ఆధునికంలో కూడా తాజాగా ఉంటుంది. ఇవి కూడా పద్యరూపంలో ఉంటాయి. ఇవి కూడా వేదాల్లోని అంశాలని క్రోఢీకరించి, స్పష్టత చేకూర్చి, ఉన్నతంగా చూపిస్తాయి. 

ఇంకో ప్రత్యేకత - అంతకు ముందు గ్రంధాల్లో చెప్పిన ధర్మాలకి కథలు 

ఉంటాయి. ఈ ధర్మాలని పాటించటం ఎంత కష్టమో చూపిస్తూ, అయినా వీటికి కట్టుబడి ఉన్నవాళ్ళ కథలు వివరిస్తాయి. స్మృతిలో కొన్ని వేల శ్లోకాలుంటే, ఒక్కొక్క పురాణంలో 15000 నుంచి 80,000 శ్లోకాలుంటాయి. కేవలం ఒక్క వేదమంత్రం సత్యం వద (సత్యమే పలుకు)కి పురాణంలో మొత్తం హరిశ్చంద్రుని కథ ఉంది.అలాగే పితృదేవోభవకి రాముడు లేదా శ్రవణకుమారుని కథలున్నాయి.కామ, క్రోథ, అహంకారం లాంటి భావాలకి రూపునిచ్చాయి రాక్షసుల రూపంలో.

 మనకి 18పురాణాలు,18 ఉపపురాణాలూ ఉన్నాయి. వ్యాసాచార్యుడు రచించినవే అవి. అన్నిటిలోకి ప్రముఖమైనది భాగవత పురాణం లేదా భాగవతం.ఈ రోజుకి కూడా ఈ పురాణాలు ఆబాలగోపాలాన్నీ ఆకర్షిస్తాయి. పిల్లలకి కావల్సిన మాయలు ఉంటాయి, మనిషి రాయిగా లేదా జంతువుగా మారటం వగైరా. పెద్దలకి కావల్సిన సిద్ధాంతంతో బాటు నైతిక విలువలు, సాంఘికనియమాలు, మానసిక విశ్లేషణలాంటివెన్నో ఉంటాయి.

శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము*

 *ఓం నమః శివాయ:*

*శ్రీ ఆదిశంకరాచార్యుల విరచితం శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము*

ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి


*1.విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతంయధానిద్రయా యస్సాక్షాత్కురుతేప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*2.బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*3.యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీగురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*4.నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్ తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*5.దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది. మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*6.రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

*🌟రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకు ముందు నిద్రలో యున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*7.బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వా స్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతంసదా స్వాత్మానం ప్రకటికరోతిభజతాంయోముద్రయా భద్రయా తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 

*🌟ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*

*8.విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*

ఫోటో పద్యం

 




చిట్టితల్లివీవు చేటంత లేవాయె 

బియ్యమేల చెరుగ పిన్నవాయె 

భవితలోన నీవు బాగ చదువు నేర్చి 

చెరుగవలసి యుండె చెడుగునంత. 


శ్రీశర్మద 9110380150

శంకర



 

శివ


 

ప్రవచనములు


 

రాజేంద్ర చోళుడు1

 మన మహారాజులు - 8

(రాజేంద్ర చోళుడు1)


చోళవంశంలో రాజరాజచోళుని తరువాత అంతటి శక్తిమంతుడు మొదటి రాజేంద్ర చోళుడు. రాజరాజచోళుడు మరియు తిరుభువనదేవియార్ దంపతులకు జన్మించాడు రాజేంద్రచోళుడు. మేనత్త ముత్తవ్వ సెంబియన్ మహాదేవి మేనత్త కుందవై పెంపకంలో బాల్యమంతా పాలైరాయిలో గడిపాడు. 1012లో తండ్రి పాలనలో రాజప్రతినిధిగా నియమింపబడ్డాడు.


ఆ తరువాత 1014లో అధికారికంగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. తండ్రి రాజరాజచోళుడు సంపాదించి పెట్టిన సామ్రాజ్యాన్ని పరిరక్షిస్తూ చక్కగా పాలిస్తూనే మరింత విస్తరించాడీయన. తండ్రి శ్రీలంకలోని సగభాగాన్ని జయించగా ఈయన పూర్తి శ్రీలంకంను జయించినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటి మలేషియా, అప్పుడు బౌద్ధ రాజ్యాలుగా ఉన్న థాయ్ లాండ్, కాంబోడియా, అలాగే సింగపూర్ మొదలైన చాలా రాజ్యాలను జయించి తన సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు. రాజేంద్ర చోళుని వల్లనే సింగపూరు నేడు తమిళ దేశంగా చలామణీలో ఉన్నదని భావించవచ్చు.


తండ్రి వలెనే ఇతని నావికా సైన్యం మహా శక్తిమంతం. భరతఖండంలో బెంగాల్ బీహార్ కళింగ దేశాలను కూడా జయించి గంగానది దాటి వెళ్ళి మరీ అక్కడి రాజులను జయించాడు. దానికి గుర్తుగా గంగై కొండ బిరుదును పొందాడు. తన పేరుతోనే గంగై కొం చోళ పురం నగరాన్ని నిర్మించి తండ్రి నిర్మించిన బృహదీశ్వరాలయం లాగానే మరొక అద్భుతమైన శివాలయాన్ని నిర్మించాడు. ఈయన పాలనలో చోళసామ్రాజ్యం సర్వతోముఖాభివృద్ధి సాధించింది.


ఈయన చేసిన పనులలో అతిగొప్పది అంటే దేశంలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సును నిర్మించడం. పదహారు మైళ్ళ పొడవూ నాలుగు మైళ్ళ వెడల్పూ కలిగిన పెద్ద సరస్సును ఈయన రైతులకై నిర్మించాడు. ఇది మానవ నిర్మితమైన అతిపెద్ద సరస్సు.


ఈయన మరణానంతరం చోళసామ్రాజ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. గొప్పవారైన భారతీయ రాజుల్లో ఈయన కూడా ఒకడని చెప్పడం అతిశయోక్తి కాదు.

* త్వమేవాహమ్‌*

 * త్వమేవాహమ్‌*


కన్నతల్లి కడుపులోంచి బయటపడి......

తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......

పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......

ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 

సాగే ప్రస్థానం.......

పేరే......


             *నేను =I*


*ఈ "నేను"* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!


*ఊపిరి ఉన్నంతదాకా "నేను"* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....


*జననమరణాల మధ్యకాలంలో* సాగే జీవనస్రవంతిలో ...ఈ 

*"నేను"* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...


*ఈ "నేను"* లోంచే 

*నాది* అనే భావన పుడుతుంది!


*ఈ *నాది* లోంచే....


1.నా వాళ్ళు, 

2.నా భార్య,

3.నా పిల్లలు,

4.నా కుటుంబం,

5.నా ఆస్తి,

6.నా ప్రతిభ, 

7.నా ప్రజ్ఞ, 

8.నా గొప్ప... 


అనేవి పుట్టుకొచ్చి....


చివరికి ఈ *"నేను"* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,

ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


              *EGO అహం* 


అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *”నేను"*, *”నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.


*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.*


1. పంతాలతో 

2. పట్టింపులతో, 

3. పగలతో, 

4. ప్రతీకారాలతో...... 


తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.


1 .బాల్య, 

2.కౌమార, 

3.యౌవన, 

4.వార్ధక్య,  


దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ

*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.


*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.*


 *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.*


 *సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.


*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*


 *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*


*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*


*1.నేనే* శాసన కర్తను, 


 *2.నేనే* ఈ సమస్త భూమండలానికి అధిపతిని, 


*3.నేనే* జగజ్జేతను... 


అని మహోన్నతంగా భావించిన ఈ *నేను* 

లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా

రోజు మారుతుంది.


*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’* కథ అలా సమాప్తమవుతుంది.


*అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”*

గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”


*చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే!


   *అది శాశ్వతం కానే కాదు*


ఈ *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన 

*”వైరాగ్యస్థితి”* అభిలాషికి సాధ్యమవుతుంది.


*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. 

*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం*.


*స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.*


*మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం*


*అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.*


*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం*.


1. నిజాయితీగా,

2. నిస్వార్థంగా, 

3.సద్ప్రవర్తనతో,

4. సచ్ఛీలతతో, 

5.భగవత్‌ ధ్యానం 


తో జీవించమనేదే

*వేదాంతసారం*.


*అహం బ్రహ్మాస్మి* అంటే 

*అన్నీ నేనే* అనే స్థితి నుంచి

*త్వమేవాహమ్‌* అంటే *నువ్వేనేను* అని 

భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే


*మానవ జన్మకు సార్థకత*

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 25 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘నవవిద్రుమబింబశ్రీఃన్యక్కారిదశనచ్ఛదా’


శాస్త్ర ప్రకారము అమ్మ పెదవుల గురించి మాట్లాడకూడదు. ఇక్కడ సాధారణ స్త్రీ పెదవుల గురించి చెప్పడము లేదు. అమ్మ పెదవుల గురించి మాట్లాడటము, అమ్మని మనసులో భావన చేసి ధ్యానము చెయ్యడము ఉన్నతికి హేతువవుతుంది. ఎట్టి పరిస్థితులలో ఏవిధమైన ఉపద్రవము ఉండదు. శ్రీ అంటే ప్రకాశము. సమస్తలోకములకు సమస్త మంగళములకు ఏది హేతువో దానిని శ్రీ అని పిలుస్తారు. అమ్మవారి పెదవుల కాంతి ఎలా ఉన్నదనగా ‘నవవిద్రుమబింబ’ – విద్రుమ అంటే అది మసకబారిపోయినా, సాన పట్టకపోయినా దానిలో ఉండే ఎరుపు శోభించదు. అమ్మవారి పెదవులు సానపట్టిన కొత్తపగడము అంత కాంతి కలిగినవి. బింబ అనగా దొండపండు. అమ్మవారి పెదవులు ‘నవవిద్రుమ’ - పగడము చేత, ‘బింబ’ - దొండపండు చేత, ‘శ్రీ’ - కాంతిని ఓడించకలిగినవి. ‘రదనచ్ఛద’ – అనగా సంస్కృతములో తెర అర్థము. అమ్మవారి రెండుపెదవులు తెరయి పోల్చబడిన వస్తువుల కాంతిని తిరస్కరిస్తున్నాయి. మూసుకుని ఉన్న ఆ పెదవుల ఎరుపులో కాంతి ఉన్నది. పెదవులు తెర వలె ఉంటే మూసిన ఆ తెరవెనక ఏమున్నదో తెలియదు. అద్వైత సంప్రదాయములో అమ్మవారే ఒక తెర. శ్రీవిద్యా సంప్రదాయములో ఆవిడ పరిపాలకురాలు శ్రీమహారాజ్ఞి. ఆవిడ అనుగ్రహము కలిగితే ఆవిడ కాంతిని ఉపాసన లభిస్తే ‘మాయ’ అన్న తెరను పైకి ఎత్తితే పరబ్రహ్మములో కలసిపోవడమే. వశిన్యాది దేవతలు అటువంటి శక్తి ఇవ్వకలిగిన అమ్మ పెదవులను స్తోత్రం చేస్తున్నాము అంటున్నారు. ఇంకా చెప్పవలసి వస్తే అమ్మవారి పెదవులకు ఉపమానము లేదు. అమ్మవారి పెదవులను వక్రదృష్టితో చూడరాదు. ఒకసారి కుబేరుడు అలా చూస్తే ఆయన కన్ను మెల్లకన్ను అయింది. అవి అమ్మ పెదవులన్న దృష్టితో ధ్యానం చెయ్యాలి. ఆ పెదవులు పెరిగి పెద్దవడానికి అడ్డువచ్చిన వాటిని తొలగదోసిన హేతువులు. అనారోగ్యముతో పుట్టిన పిల్లవాడు అమ్మకి బరువు కాదు. అమ్మఅమ్మే బిడ్డబిడ్డే. అమ్మ పెదవుల ముద్రలు పిల్లవాడి మీద ఎన్నిసార్లు పడ్డాయో అవి వాడి వృద్ధికి ఆశీర్వచనములు పడినట్టు భావించాలి. మమ్ములను పోషించినదని ఆ అమ్మవారి పెదవులు కదా! అని స్మరించుకుని నమస్కరించు కోవడము అభివృద్ధికి హేతువు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/

చిన్న వెండి చెంబు.

 చిన్న వెండి చెంబు..


"స్వామివారి అభిషేకానికి అన్ని వస్తువులూ సమకూరాయా?" అంటూ మా అర్చకస్వాములు వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు..


ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ద్వారాలు అర్చకస్వాములు తెరుస్తారు..ఆ తరువాత స్వామివారి సమాధి మందిరం శుభ్రం చేసుకుంటారు..స్వామివారి ఉత్సవ విగ్రహం ప్రక్కనే పళ్లెం లో ఉన్న గణపతికి ప్రధమ పూజ చేసి..అక్కడే ఉన్న శివలింగానికి ఏక రుద్రం తో అభిషేకము నిర్వహిస్తారు..ఆ తరువాత స్వామివారి పాదుకులను తలపై పెట్టుకొని..మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణాలు చేసి..ఆ పాదుకులను యథా స్థానానికి చేర్చి..ఆ తరువాత స్వామివారి సమాధికి అభిషేకము నిర్వహిస్తారు..అభిషేకము నిర్వహించే క్రమం లో స్వామివారి సమాధి ని పాలతో కూడా అభిషేకించడం ఆనవాయితీ గా వస్తున్న ఆచారం..అభిషేకానికి ఉపయోగించే పాల కొరకు ఇత్తడి తో చేసిన చిన్న చెంబును ఉపయోగిస్తున్నారు..


రెండువారాల క్రితం ఆదివారం ఉదయం స్వామివారి సమాధి అభిషేకము కొరకు అర్చకస్వాములు సమాయత్తంగా ఉన్న సమయంలో.."స్వామివారి అభిషేకానికి ఉపయోగించే పాల చెంబు వెండి తో తయారు చేయించి పెడదాము..ఈ ఇత్తడి చెంబు బాగా పాతదై పోయింది..అలాగే నీళ్ల బిందె , సమాధిని అభిషేకించిన నీటిని నిల్వచేసే ఇత్తడి పళ్ళెము..అన్నింటినీ వెండివి సమకూర్చుకుందాము.." అని అన్నాను.."అలాగే నయ్యా..మాకూ ఆ ఆలోచన వచ్చింది.. కానీ..మీతో చెప్పుకోవడానికి సందేహించాము..ముందుగా ఈ పాల చెంబు మారుద్దాము.." అన్నారు..అలాగే అని ఆ తరువాత కార్యక్రమాల లో మునిగిపోయాము..


ఆరోజు మధ్యాహ్నం తరువాత..మళ్లీ పాల చెంబు గురించి మనసులో మెదిలింది..నిజానికి స్వామివారి వద్దకు వచ్చే భక్తులలో ఎవరిని అడిగినా తీసుకొచ్చి ఇస్తారు..ఎందుకనో నేను ఎవ్వరినీ అడగలేదు..లోలోపల రెండు మూడు సార్లు అనుకున్నాను..ఆరోజు సాయంత్రం మా దంపతులము స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చిన తరువాత..మళ్లీ ఆ పాల చెంబు గుర్తుకు వచ్చింది.."వచ్చేవారం మన దగ్గర అర్చకుడిగా ఉన్న రామబ్రహ్మాచారి కి చెపుదాము..ఆ తరువాతి వారానికి అతను తయారు చేయించి తీసుకొస్తాడు.." అని మా ఆవిడ నాతో చెప్పింది..నిజమే..రామబ్రహ్మాచారి స్వర్ణకారుడు కనుక..తయారు చేయించి తెస్తాడు..అని నేనూ సమాధాన పడ్డాను.


మొన్న శనివారం సాయంత్రం స్వామివారి పల్లకీసేవ ఏర్పాట్లలో వున్నాము..దూరప్రాంతం నుంచి వచ్చిన కొందరు భక్తుల తో మాట్లాడుతూ వున్నాను..వాళ్ళందరి వెనకాల ఒక యువకుడు, అతని భార్యా, తల్లిదండ్రులు నిలబడి వున్నారు..అతను నాకు తెలుసు..హైదరాబాద్ లో మేస్త్రీ గా ఇళ్ళు కట్టే పనిలో ఉంటాడు..ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి వస్తూవుంటాడు..నాతో ఏదో మాట్లాడాలని నిలబడి ఉన్నాడు..అతని పేరు మందయ్య.. గుడ్లూరు మండలం తెట్టు గ్రామ నివాసి.


అతనిని దగ్గరకు రమ్మన్నాను.."అయ్యగారూ..మీతో ఒక విషయం చెప్పుకోవాలి.." అన్నాడు..అతని కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.."పోయిన వారం స్వామి నాకు కలలో కనబడ్డాడయ్యా..సత్యప్రమాణం గా చెపుతున్నానయ్యా..స్వామి కల్లో కనబడి.."వెండి చెంబు " తీసుకొని నా దగ్గరకు రా..అని చెప్పాడయ్యా..ఆ తరువాత మెలుకువ వచ్చింది.. స్వామి స్వయంగా చెప్పిన తరువాత ఆలస్యం చేయకూడదని..నిన్న బజారు కెళ్ళి చిన్న వెండి చెంబు కొన్నాను.. మా దంపతులము స్వామికి ముడుపు కట్టుకున్నామయ్యా..అందులో లెక్కబెడితే పదిహేడువేలు ఉన్నాయి..బజారు కెళ్ళి చెంబు ఖరీదు విచారిస్తే..సరిగ్గా పదిహేడు వేలు అన్నారయ్యా..ఒక్క పైసా కూడా ఎక్కువ తక్కువ కాలేదు..స్వామి ముడుపు స్వామికి చెల్లించినట్లు అయింది..ఈ చెంబు స్వామివారికి ఇద్దామని అనుకోని..వెంటనే బయలుదేరి వచ్చాము.." అంటూ..సంచీ లోంచి..వెండి చెంబు ను తీసి..నా ముందు బల్ల మీద పెట్టాడు..సరిగ్గా మేము అనుకుంటున్న పరిమాణం లోనే ఉంది..


ఆ వెండి చెంబు కోసం మేము మరో వారం పాటు ఆగుదామని అనుకున్నాము..కానీ..స్వామివారు ఆగలేదు..ఆ చిన్న వెండి చెంబు ఇంకొక ధనవంతుడైన భక్తుడి చేత తెప్పించడమో..లేదా..మేమే తయారు చేయించడమో పెద్ద విషయం కాదు..కానీ..తననే త్రికరణ శుద్ధిగా నమ్మిన ఒక భక్తుడికి..స్వామివారే స్వయంగా అవకాశం కల్పించారు..అతను తనకోసం ఎత్తిపెట్టిన ధనం లోనుంచే తనకు కావాల్సిన వస్తువు తీసుకున్నారు..


 ఆ ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధి వద్ద అభిషేకము కొరకు ఈ వెండి చెంబు లోని పాలతో చేసాము..మందయ్య భక్తిగా స్వామివారికి తన తలనీలాలు సమర్పించి..భార్యా పిల్లలతో కలిసి పొంగలి నైవేద్యం గా పెట్టుకొని..స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నాడు.."నువ్వు తెచ్చిన చెంబుతోనే ఈరోజు పాలు స్వామివారి కి అభిషేకము చేసాము.." అని మా అర్చకస్వాములు అతనికి చెప్పారు..


ఒక చిన్న వెండి చెంబు మాకు పెద్ద పాఠాన్ని నేర్పింది..స్వామివారి సేవ చేయడం వరకే మావంతు..అది కూడా ప్రతిక్షణం "నేను కర్తను కాను.." అనే స్పృహ తోనే చేయాలి..ఏమాత్రం అహంకరించినా..తగిన పాఠాన్ని స్వామివారు సున్నితంగా నేర్పుతారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..వయా కందుకూరు..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

కాల్ సెంటర్

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో ఓ పది నిముషాలు:


గుడ్ మార్నింగ్ సార్, బజాజ్ ఫైనాన్స్ నుండి రాజేష్ మాట్లాడుతున్నాను సార్. సుదర్శన్ గారేనా మాట్లాడుతున్నది?

అవును చెప్పండి. 

సార్ బజాజ్ ఫైనాన్స్ నుండి 4 in 1 సూపర్ కార్డు మీకు approve అయ్యింది సార్. ఈ కార్డు స్పెషాలిటీ, దీన్ని మీరు EMI కార్డ్, లోన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గా వాడుకోవచ్చు సార్. 4 ఇన్ 1 కార్డ్!


OK రాజేష్....?!


అంతే కాదు సార్ ఈ కార్డు ఉపయోగించి మీరు అవసరానికి క్యాష్ తీసుకోవచ్చు సార్. అలా తీసుకున్న క్యాష్ కు వడ్డీ ఉండదు సార్. ఇంట్రెస్ట్ ఫ్రీ!


ఒకే...?!


సార్ మీ కార్డ్ లిమిట్ 2 లక్షలు సార్ అందులో 28 % మీరు క్యాష్ తీసుకోవచ్చు సార్. మీరు ఒకే అంటే మీ కన్ఫర్మేషన్ నోట్ చేసుకొని ఈ కార్డు మా ఫైనాన్స్ ఆఫీసర్ మీకు అందిస్తారు సార్.


రాజేష్ నేను ఎంత క్యాష్ తీసుకోవచ్చు? 


28% సార్, ఒక్క నిముషం సార్. Calculate చేసి చెబుతాను సార్. 


28 శాతం అంటే, 56 వేలు రాజేష్ దానికి క్యాలుకులేటర్ ఎందుకులే. 


ఒక్క నిముషం సార్....ఆ... అవును సార్ 56 వేలు. సార్ ఒకే చేసేయ్యమంటారా?


ఒకే చేసే ముందు కొన్ని డీటెయిల్స్ కావాలి రాజేష్. ఇప్పుడు ఈ 56 వేలకి చార్జెస్ ఎంత? 


Upto 50 days no ఇంటరెస్ట్ సార్... ఇట్ ఇస్ టోటలీ ఇంట్రెస్ట్ ఫ్రీ సార్. 


50 రోజుల తర్వాత ఇంట్రెస్ట్ ఎంత? 


Only 4% సార్!


ఓన్లీ 4%, per month or per year?


Per month sir!


Mr రాజేష్, నెలకు 4% అంటే సంవత్సరానికి ఎంతో తెలుసుగా...


ఒక్క నిముషం సార్, calculate చేసి చెబుతాను సార్!


అవసరం లేదు ఇది చిన్న లెక్క. 48 శాతం! అంటే 56 వేలకి ఎంతవుతుందో తెలుసా?!


ఒక్క నిముషం సార్ చూసి చెబుతాను సార్. 


చూడవలసిన అవసరం లేదు... సంవత్సరానికి 28 వేలకి కొంచెం తక్కువ!


ఒక్క నిమిషం సార్...26 వేలా 880 సార్. 


రాజేష్ ఇది ఒక సంవత్సరానికి. రెండు సంవత్సరాలకి దాదాపు 55 వేలు. అయినా 56 వేల క్యాష్ తీసుకొని 27 వేలు వడ్డీ కడితే వాడు బాగుపడతాడా?!


కానీ సార్ 50 రోజులు దాటితేనే వడ్డీ సార్, 50 రోజుల వరకూ ఇంట్రెస్ట్ ఫ్రీ సార్!


కానీ రాజేష్, ఈ 50 రోజులవరకు దీనికి ప్రాసెసింగ్ ఫీ ఎంత?


జీరో ప్రాసెస్సింగ్ ఫీ సార్. Also ఇంట్రెస్ట్ ఫ్రీ సార్.


రాజేష్... దీనికి ఎదో ఒక ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ ఎంతో చెప్పు.


సార్ పూర్తిగా ఫ్రీ సార్. 


లేదు రాజేష్, తప్పకుండా ఎదో ఒకటి ఉంటుంది...సర్వీస్ ఛార్జ్, transaction చార్జీ, one time ఫీ లాంటి ఎదో పేరుతో ఉంటుంది. అదేంటో కాస్త ఓపెన్ గా చెప్పండి!


సార్ అవేమీ లేవు సార్. ఇంట్రెస్ట్ ఫ్రీ సర్. 


అయితే నాకు ఈ కార్డు వద్దు రాజేష్. థాంక్యూ. 


సార్ ఎందుకు సార్...మంచి ఆఫర్ సార్... తీసుకోండి సార్. 


లేదు రాజేష్ ఎదో దాచిపెట్టే వాళ్ళతో నేను డీల్ చెయ్యను. మీరు ఎదో దాస్తున్నారు కాబట్టి నేను మీ కంపెనీతో డీల్ చెయ్యను.


మీరన్న చార్జీలు ఏవీ లేవు సార్. ఒకే ఒక onetime handling ఛార్జ్ ఉంది సార్, అది కూడా కేవలం 2.5% సార్. 


Hmmmm. ఈ కార్డ్ కు annual ఫీ ఎంత?


ఓన్లీ 499 per year సార్. 


ప్లస్ సర్వీస్ టాక్స్?


యెస్ సార్. 499 ప్లస్ సర్వీస్ టాక్స్. 


అంటే నేను 56 వేలు డబ్బు తీసుకొంటే 50 రోజుల్లో దాదాపు 2 వేలు ముందుగా కట్టాలి. 


ఒక్క నిముషం సార్ చూసి చెబుతాను....


అవసరం లేదు రాజేష్. 2.5%+499+సర్వీస్ టాక్స్ అంత వస్తుంది. 


అవును సార్. 


రాజేష్ ఓ విషయం చెప్పనా...మీ మాటల్ని బట్టి మీరు కనీసం ఎంబీఏ చేసుంటారు లేదా పీజీ చేసుంటారు. 


అవును సార్.


ఎంబీఏ చదివి మీరు చేస్తున్నదేంటో తెలుసా...పచ్చి మోసం, దగా! నేను సేల్స్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేసిన తర్వాత మీరు ఆ రెండు వేల విషయం చెప్పారు. అదే ఏ రైతుకో లేక ఏదో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగికో ఈ కార్డు అంటగట్టేటప్పుడు మీరు ఇలాగే విషయాన్ని దాచిపెట్టి వాళ్లకు కార్డు అమ్మేస్తుంటారు. వాళ్ళు కూడా కార్డు ఉంది కదా అని వచ్చే దసరాకో, లేదు పంటకు ఎరువుల కోసమో డబ్బు తీసుకొని దానికి వడ్డీ కట్టడానికి తన 6 నెలల పంట ఆదాయం, చిరు ఉద్యోగి అయితే తన ఒకనెల జీతం మీకు కట్టి, తన ఇల్లు గడవడానికి ఇంకో చోట అప్పు చేసి అలా అలా అప్పుల్లో కూరుకుపోతాడు. 


*ఇదంతా ఎందుకు కేవలం మీరు మీ టార్గెట్లు పూర్తిచేయడానికి. అంటే 100 కార్డులు టార్గెట్ అయితే నెలకు దాదాపు 90 కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నారు.*  


అదేం లేదు సార్. కార్డు డెలివర్ చేసేటప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఈ చార్జీల గురించి కస్టమర్లకు చెబుతారు సార్. 


రాజేష్, కస్టమర్ అంటే ఎవరో తెలుసా.. *Customer is the one who keeps the custom. Custom is the traditional and acceptable behaviour in society. So customer is keeping acceptable behaviour but is our behaviour as sales person socially acceptable ?*


 నాకు తెలిసి బజాజ్ ఫైనాన్స్ గత సంవత్సరం 43వేల కోట్ల లాభం ఆర్జించింది. ఈ 48% వడ్డీ, ఇంకొన్ని కొత్త ప్రొడక్ట్స్ తో ఈ సంవత్సరం 86 వేల కోట్లు సంపాదిస్తుంది 2020లో 2లక్షల కోట్లు ఆర్జిస్తుంది. ఇది ఒక్క బజాజ్ మాత్రమే తకాదు, icici అయినా, hdfc అయినా, kotak అయినా అందరూ అంతే. *ఎవణ్ణో కోటీశ్వరుని చేయడానికి మనం...మనలాంటి చదువుకున్నోళ్లు ఎంతమందిని మోసం చేస్తాం...మన చదువులకు అర్థముందా?!*


 10వ తరగతి వరకూ రోజూ ప్రేయర్లో నిలబడి.. భారతదేశం నా మాతృభూమి, భారతీయయులందరూ నా సహోదరులు... అని ప్రతిజ్ఞ చేసాం. ఇదేనా మనం మన తోటి భారతీయ్యునికి చేస్తున్నది? ఇదే ఓ మాల్యా, నీరవ్ మోడీ చేస్తే వాళ్ళను దేశద్రోహులంటాము. మనం చేస్తే టార్గెట్ achievement అని స్టయిల్ గా ఇంగ్లీష్ లో కాలరేగరేస్తాం. నేను గత 25 సం గా సేల్స్ లో ఉన్నాను. మొదట చాలా అబద్దాలు చెప్పేవాణ్ణి కానీ త్వరలోనే నాకర్థమయ్యింది ఏంటంటే...సేల్స్ లో రాణించడానికి అబద్దాలు చెప్పవలసిన అవసరం లేదు. ఓ తప్పుడు ప్రొడక్ట్ అమ్మవల్సిన పని లేదు. పూర్తి నిజాయితీతో ఎవ్వరినీ నొప్పించకుండా కూడా టార్గెట్లు achieve చెయ్యొచ్చు. 


సార్ మీరు ఏమి అనుకోనంటే ఓ ప్రశ్న అడగనా?


అడుగు రాజేష్...


ఈ 4 ఇన్ 1 కార్డు అమ్మడం నా ఉద్యోగం. 48% వడ్డీ ఛార్జ్ చేసే కార్డు నిజం చెబితే ఎవరు కొంటారు సార్?


రాజేష్ సింపుల్....మొదట ఇలా ప్రజలను దోచుకొనే బజాజ్, icici, kotak లాంటి కంపెనీలలో పనిచేయడం అవసరమా అని ఆలోచించుకోండి. అనివార్యమైతే ఇదే కార్డును ఇంకోలా అమ్మోచ్చు. దీన్ని 4 ఇన్ 1 సూపర్ ఎమర్జెన్సీ కార్డు అని చెప్పండి. మనలో ఎవరికైనా...ఎక్కడైనా ఎమర్జెన్సీ రావచ్చు. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు, వేరే ఊళ్ళో వెళ్ళినప్పుడు పర్సు దొంగతనం అవ్వొచ్చు, మన పిల్లలకు ఏదైనా అవసరం రావచ్చు. అత్యవసరంలో ప్రైవేటు వడ్డీవ్యాపారులు 5 రూపాయల వడ్డీ అంటే 60 శాతం వడ్డీ అడుగుతారు కానీ బజాజ్ maximum 48% తీసుకొంటుంది. ఆ లోన్ కు మీరు ఏమీ తాకట్టు పెట్టనవసరం లేదు. కేవలం 10 నిముషాల్లో డబ్బు మీ చేతిలో ఉంటుంది. అదే 50 రోజుల్లో కట్టేస్తే కేవలం 18 శాతం వడ్డీ. ఈ ఎమెర్జెన్సీకోసం మీరు కట్టవలసిందల్లా కార్డు ఫీ సంవత్సరానికి కేవలం 499 రూపాయలు+GST అంతే. 


(అటువైపు నుండి పూర్తి నిశ్శబ్దం. ఆలోచిస్తున్నాడని అర్థమయ్యింది). 


ఆలోచించండి Mr Rajesh కేవలం ఉద్యోగంలో ఎదగడానికి మన విలువలన్నీ గాలికి వదలి కొన్ని వేల కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టవలసిన అవసరం లేదు. బ్రతకడానికి ఉద్యోగం కావాలి, ఉద్యోగమే బ్రతుకు కాకూడదు. Anyways sorry am not able to take this card but I sincerely wish you great success in your profession.    


Forwarded from one of my friend’s Whatsapp.

రమణ మహర్షి సూచనలు :

 మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు :


భక్తుడు : స్వామి, కళ్ళు మూసి ఉంచి ధ్యానములో కూర్చుంటే పర్వాలేదు కాని, అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏమి చెయ్యమంటారు?

రమణ మహర్షి: కళ్ళు తెరచి ఉంచినంత మాత్రాన ఏమి అవుతుంది? ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరచుకుని నిద్రపోతావో అలాగే మనసును నిద్ర పోయేలా చెయ్యగలిగితే కళ్ళు తెరచి ఉంచినా ఇబ్బంది ఉండదు.

భక్తుడు: మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా, దానిని నియంత్రించుట మాకు సాధ్యపడడం లేదు స్వామి.

రమణ మహర్షి:అవును అది నిజమే. ఎలాగయితే చిన్న పిల్లవాడు తన నీడను తానూ పట్టుకోవాలని పరిగెడుతూ, పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుందో, అదే విధముగా మనము కూడా మన మనస్సు ఎటూ వెళ్ళకుండా అడ్డుకోవాలి.

భక్తుడు : ఎలా అడ్డుకోగలం స్వామి?

రమణ మహర్షి : వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానము చేయుట ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు.

భక్తుడు: అంటే మనము బాహ్య సుఖాలను వదిలి పెట్టి , ఆత్మానందమును అనుభవించాలి అనా స్వామి?

రమణ మహర్షి : ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందము మన స్వభావము. దాని కోసము మనము ఎక్కడ వెతకక్కరలేదు.

భక్తుడు: అది అంతా సరే స్వామి, కాని మేము ఎంత కృషి చేసినా మా మనస్సును అదుపులో పెట్టడం మా వాళ్ళ కావటం లేదు. ఏమి చెయ్యమంటారు?


రమణ మహర్షి : నవ్వుతూ...తన చేతి వేలిని కంటిపై పెట్టుకుని, " చూడండి. ఈ చిన్న చేతి వేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడ కుండా చేస్తోంది. అలాగే ఈ చిన్ని మనస్సు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మ జ్ఞానమునకు అడ్డు పడుతుంది. చూడండి అది ఎంత సక్తివంతమైనదో ."

ఉపాసన అంటే ఏమిటి?*

 *ఉపాసన అంటే ఏమిటి?*


ఉపాసన అనే పదం మనం చాలా చోట్ల ఆధ్యాత్మిక సాధనలకు సంబంధించి వింటూంటాం. సాధనలో పై స్థాయి వారిని చూసి అదిగో వారు ఫలానా ఉపాసకులు అని చెప్పుకోవడం కద్దు, అలాగే కొందరు పెద్దలు పిన్నలు, శిష్యులకు మీరు ఈ ఉపాసన చేయండి అని చెప్పడమూ బహు సామాన్యం.


ఈ ఉపాసన అంటే ఏమిటి? అని విచారిస్తే!

ఆర్షప్రోక్తములైన శాస్త్రగ్రంథములలో చెప్పబడిన ఉపాస్య వస్తువు (ఏది ఉపాసింపదగిన వస్తువు/రూపము/నామము)గా నిర్ణయింపబడిన వస్తువును, ఆ ఉపాస్య వస్తువును ఏ విధముగా యే యే పద్ధతులలో ఉపాసించాలో తెలుసుకొని శాస్త్రముననుసరించి దానిని తన బుద్ధికి విషయంగా అందించి, ఆతత్వమును తెలుసుకొని బుద్ధిచేత ఆ ఉపాస్య వస్తువుయొక్క తత్త్వమును పట్టుకొని సంతత తైల ధారలాగా సమానమైన చిత్తవృత్తుల ప్రవాహముతో అత్యధిక సమయము/చాలాకాలము వరకు ఆ ఉపాస్య వస్తువు యందు అదే స్థితిలో నిలిపి ఉండగలరో ఆ నిలిచి ఉండే స్థితిని ఉపాసన అంటారు.

దీనిలో ఉండేవి మూడు


ఉపాస్య వస్తువు - ఆర్షప్రోక్తములైన శాస్త్రగ్రంథములలో చెప్పబడినవి

ఉపాసకుడు - శాస్త్రము మీద నమ్మకముతో, శాస్త్రములో చెప్పబడిన విధముగా, ఆయా పద్ధతులను గురువుద్వారా తెలుసుకొని అనుసరించేవాడు

ఉపాసన - ఆర్షప్రోక్తమైన శాస్త్రగ్రంథములలోని ఉపాస్యవస్తువును గురువు యొక్క అనుగ్రహముతో శాస్త్రవిహితమైన పద్ధతులద్వారా చిరకాలము బుద్ధికి చేర్చి సమాన వృత్తులద్వారా నిలిపి ఉంచే ప్రక్రియ లేదా స్థితి.


దీని వలన తెలిసేదేమి, ఆర్ష ప్రోక్తముకాని ఉపాస్య వస్తువు వర్జింపవలసినది, అది లోక హితము కానేరదు. అలాగే, చిరకాలము సంతత తైలధారలాగా ఉపాసన కొనసాగలవసి ఉంది తప్ప స్వల్ప కాలికము కాదు. వర్జింపవలసిన వస్తువును గానీ ఉపాసిస్తే, ఉపాసకునికి, ఆ ఉపాసకునితోపాటు లోకమునకు ఖేదం కలగగలదు. కారణం శాస్త్రవ్యతిరిక్తమేదైనా అది ధర్మవ్యతిరిక్తమే, అంటే అధర్మమే. అధర్మం ప్రబలినపుడు, ధర్మానికి గ్లాని కలిగినపుడు లోక క్షేమము దెబ్బతింటుంది. అందువల్ల శాస్త్రమును మీరక మనకు ఋషులేమి చెప్పారో వారు మనకేమి అందించారో దానిని వారిచ్చిన పద్ధతులలో ఉపాసించడం సర్వదా శ్రేయస్కరం.🙏

ఆధార్ కార్డు

 *ఆధార్ కార్డు వలన భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి. ఇది తప్పకుండా అందరికి షేర్ చేయండి.*


ఒక కస్టమర్ హోటల్ కి ఫోన్ చేసి బిర్యాని ఆర్డర్ ఇస్తున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ చూడండి. 


*ఆపరేటర్* : హలో… ప్యారడైజ్ హోటల్ …

*కస్టమర్*: ఒక ఆర్డర్ తీసుకోండి ప్లీజ్..?

*ఆపరేటర్*: మొదట మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్

*కస్టమర్*:  ఒక నిమిషం… నా ఆధార్ నెంబర్ "1234 5678 9012 "

*ఆపరేటర్*: ఓకే మీ పేరు శ్రీకాంత్ .. నెంబర్ 17, గాంధీ రోడ్, శ్రీనగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నారు. మీ ఇంటి ఫోన్ నెంబర్ 408423666, ఆఫీస్ నెంబర్ 76452302, మొబైల్ నెంబర్ 0142662566. ఇప్పుడు మీరు మీ మొబైల్ నుండి మాకు కాల్ చేశారు…

*కస్టమర్*: వావ్.. ఇన్ని నెంబర్లు ఎలా సార్ తెలుసుకున్నారు..?

*ఆపరేటర్*: కేవలం ఒక్క ఆధార్ నంబర్ తో మీ డిటైల్స్ అన్ని తెలిసిపోతాయి sir

*కస్టమర్*: గుడ్.. నాకు ఒక చికెన్ ఫ్రై బిర్యాని ఆర్డర్ తీసుకుంటారా..?

*ఆపరేటర్*: సార్ .. నాకు తెలిసినంత వరకు అది వద్దనే చెప్తాను సార్..

*కస్టమర్*: ఏ.. ఎందుకు ?

*ఆపరేటర్*: మీ మెడికల్ రిపోర్ట్స్ ని బట్టి మీకు కొలెస్ట్రాల్ లెవల్ ఎక్కువగా ఉంది..

*కస్టమర్*: What..? అప్పుడు నేను ఏమి తినాలి..?

*ఆపరేటర్*: మా దగ్గర ఉండే Low fat వెజిటబుల్ బిర్యాని ట్రై చేసి చూడండి సార్.. అది బాగా నచ్చుతుంది..

*కస్టమర్*: నాకు నచ్చుతుంది అని మీకు ఎలా తెలుసు..

*ఆపరేటర్*: పోయిన వారం మీరు బాబాయ్ హోటల్ లో వెజిటబుల్ బిర్యాని తిన్నారు సార్..

*కస్టమర్*: మై గాడ్.. చాలు సామీ చాలు.. మీరు చెప్పిన వెజిటబుల్ బిర్యాని ఫ్యామిలీ సైజ్ లో ఇవ్వండి..

*ఆపరేటర్*: ఖచ్చితంగా సార్… పది మంది ఉన్న మీ కుటుంబానికి అది ఖచ్చితంగా సరిపోతుంది. బిల్ అమౌంటు 2350 రూపాయలు సార్..

*కస్టమర్*: నేను నా క్రెడిట్ కార్డ్ లో నేను pay చేయచ్చా..?

*ఆపరేటర్*: లేదు సార్.. మీరు క్యాష్ రూపంలోనే చెల్లించాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎప్పుడో అయిపోయింది. అదీకాకుండా జనవరిలో మీరు 1,50,648 రూపాయలు క్రెడిట్ కార్డ్ బాకీ పెట్టి ఉన్నారు.

*కస్టమర్*: నేను ఎలాగైనా క్యాష్ రెడీ చేస్తాను. మీరు బిర్యాని పంపండి. ఎంత టైం పడుతుంది..?

*ఆపరేటర్*: 45 నిమిషాలు పడుతుంది సార్.. అంతసేపు మీరు వెయిట్ చేయలేకపోతే మీ బైక్ లో వచ్చి మీరే తీసుకెళ్ళచ్చు సార్..

*కస్టమర్*: What.?

*ఆపరేటర్*: మీ ఆధార్ కార్డు ప్రకారం మీ దగ్గర ఒక బైక్ ఉంది. దాని నెంబరు 1122.

*కస్టమర్*: మీరు ప్రకటన లో చెప్పిన విధంగా ఆ మూడు ఫ్రీ కోక్ బాటిల్స్ కలిపి పంపండి.

*ఆపరేటర్*: బిర్యాని మాత్రమే పంపిస్తాం సార్ మీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం మీ ఆరోగ్యాన్ని దృష్ఠిలో ఉంచుకుని మీకు ఆ కోక్ ని ఇవ్వలేం సార్..

*కస్టమర్*: ***%&$%%### You $##$%%@!))) (ఇక్కడ రాయలేని బూతులు)

*ఆపరేటర్*: సార్ .. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి సార్.. ఇలానే ఒక పోలీస్ దగ్గర బూతులు తిట్టినందుకు కోర్టు మీకు రెండు నెలల జైలు శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించింది మర్చిపోయారా?

*కస్టమర్*:  ఢాం అని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.


*చదివేటపుడు చూసేటపుడు ఇది సరదాగానే ఉంటుంది కానీ ప్రభుత్వం ప్రతీ దానికి ఆధార్ కార్డ్ ను లింక్ పెడుతుంది దీని కోసమే. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి. ఇది తప్పకుండా అందరికి షేర్ చేయండి.*

హిందూ ధర్మం - 63

 హిందూ ధర్మం - 63


విశ్వామిత్రుని మాటలను విన్న వశిష్టమహర్షి శాంతంగా 'రాజా! లక్ష ఆవులు ఇచ్చినా, కోటి ఆవులు ఇచ్చినా, వెండి వస్తువులు సమర్పించినా, నేను ఈ శబలను ఇవ్వలేను. ఈ శబలను నేను విడిచిపెట్టడం శబలకు మనచిది కాదు. మీరు నా నుంచి బలవంతంగా కూడా ఈ శబలను తీసుకోలేరు. ఎందుకంటే ఈ శబల శాశ్వతంగా నాది, నా నుంచి దాన్ని వేరుగా చూడలేను. వ్యక్తి నుంచి వ్యక్తి ఆత్మ గౌరవాన్ని వేరు చెయలేనట్లుగానే ఈ శబలను కూడా వేరు చేయలేరు. ఈ శబల చేత నా జీవితం సులభంగా సాగుతోంది. దేవతలకు హవ్యం, పితృదేవతలకు కవ్యం, నిత్యం చేసే అగ్నిహోత్రం, హోమం, బలి (జంతువులను చంపడం కాదు) మొదలైన అన్ని కార్యాలకు ఈ శబలే ఆధారం. నా ఆశ్రమంలో అగ్నికార్యాలకు, వేదాధ్యయనానికి, విద్య మొదలైన అన్నిటికి మూలం శబలే అన్న విషయంలో సందేహంలేదు. నిజం చెప్పాలంటే శబలనే నాకు అన్నీ, దానికి చాలా కారణాలు ఉన్నాయి, కనుక ఓ రాజా! నీకు ఈ శబలను నేను ఇవ్వలేను' అన్నారు.


మాట్లాడటంలో చతురుడైన విశ్వామిత్రుడు వశిష్టుడిన ఒప్పించే విధంగా పలుకుతూనే, వాదించడం మొదలుపెట్టాడు. అందంగా అలకరించబడిన తల్లని నాలుగు గుర్రాల లాగబడే 800 బంగారు రధాలను ఇస్తాను, మంచి జాతికి చెందిన బలిష్ఠమన 11,000 గుర్రాలను, ఎన్నో రకరాకాల రంగులు కలిగిన కోటి ఆవులను ఇస్తాను, అందులో ఏ ఒక్క ఆవుకి మిగిలిన వాటితో పోలిక ఉండదు, మంచి పాలు ఇస్తాయి, మీకు నచ్చితే వజ్రవైఢూర్యాలను, బంగారాన్ని మీరు అడినంత ఇస్తాను కానీ నాకు ఈ శబలను ఇవ్వండి అన్నాడు. దానికి బదులిస్తూ వశిష్టమహర్షి 'మీరు నాకు ఏది ఇస్తారన్నది ముఖ్యం కాదు, నేను శబలను ఇచ్చేదే లేదు. నా దగ్గరున్న ఈ శబల పెద్ద రత్నం వంటింది, కనుక నాకు ఇతర రత్నాల అవసరంలేదు, ఇది నాకున్న సంపద, నాకు రధాలు, గుర్రాలు, ఏనుగులు అవసరంలేదు, ఇదే నాకు సర్వస్వం, నిజానికి ఇదే నా జీవితం, నువ్వు నన్ను నా జీవితం నుంచి వేరు చేయలేవు. ఇదే నాకు దర్శపూర్ణమాసాలతో సమానం, ఇదే దక్షిణతో కూడిన వైదిక క్రతువు వంటిది, నేను చేసే సేవలన్నిటికి ఇదే ప్రధానం. నేను చేసే అన్ని పనులు ఈ శబలతో ముడిపడి ఉన్న కారణం చేత, దీని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. అయినా దీని కోసం ఇంత బేరం అవసరంలేదు' అన్నారు.


వశిష్టుడు ఇవ్వడంలేదని విశ్వామిత్రుడికి కోపం వచ్చి కామధేనువును బలవంతంగా లాక్కుని వెళ్ళడం ప్రారంభించాడు.


తరువాయి భాగం రేపు..........

హిందూ ధర్మం - 23

 **దశిక రాము**


హిందూ ధర్మం - 23


మనసును పాప కార్యాల నుంచి, శాస్త్రవిరుద్ధమైన జీవనం నుంచి, నిషిద్ధకర్మల నుంచి వెనక్కు మళ్ళించడం, నిగ్రహించడం, నిరోధించడం దమము. దమం గురించి అర్ధమవ్వాలంటే, ధర్మంలో వెరొక లక్షణమైన ఇంద్రియ నిగ్రహం గురించి తెలిసి ఉండాలి.


4. ఇంద్రియ నిగ్రహం:


 ఇంద్రియాలను అదుపు చేసుకోవడం. ఇంద్రియాలంటే మనసుకు, బయట ప్రకృతికి/ప్రపంచానికి వారధి వంటివి. మనకు మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని రెండుగా విభజించారు.


మొదటి 5 జ్ఞానేంద్రియాలు :

శ్రోత్రం (చెవులు) - వినికిడి కోసం,

త్వక్ (చర్మం) - స్పర్శకు కారణం అయింది

చక్షుః (కళ్ళు) - ప్రపంచాన్ని చూస్తుంది,

రసన (నాలుక) - రుచి చూస్తుంది,

ఘ్రాణ (ముక్కు) - వాసన పీల్చడం ద్వారా మెదడుకు సంకేతాలు పంపిస్తుంది


తరువాతివి కర్మేంద్రియాలు.

వాక్కు (నోరు)- మాటలను బయటకు పంపుతుంది,

పాణి (చేతులు) - అనేక పనులు ఉపయోగ పడతాయి,

పాదం (కాళ్ళు) - మనిషి యొక్క కదిలికల కోసం,

పాయువు (మలద్వారము) - శరిరంలో మలాన్ని విసర్జిస్తుంది (బయటకు పంపుతుంది),

ఉపస్థ (మూత్రద్వారము) - సంతానానికి కారణమవుతుంది   


ఈ పదింటిని దశ ఇంద్రియాలంటారు. 

వీటి గురించి వివరంగా చెప్పుకుందాం.


తరువాయి భాగం 


🙏🙏🙏

సేకరణ


**

కలిపురుష ప్రభావం

 # కలియుగం వల్ల నష్టాలు - కలిపురుష ప్రభావం వల్ల


1) మనస్సును నియంత్రించడం చాలా కష్టం

2) చెడు అలవాట్ల వైపు సులభంగా ఆకర్షిస్తారు

3) ప్రజలు దేవుణ్ణి మరచిపోతారు 

4) ధర్మం అనుసరించడానికి ఇష్టపడరు

5) దేవుని నామాన్ని ఉచ్చరించడానికి అవకాశం ఉండదు.

6) ప్రజలు తమ నాలుకను & కోరికలను నియంత్రించలేరు

(ఆహారం , రుచి - చెడు & కఠినమైన పదాలు) 


# కలియుగం వల్ల లాభాలు 


1) పెద్ద పెద్ద పూజలు / యజ్ఞాలు / యగాలు చేయడం అవసరం లేదు 

2) భగవంతుని ధ్యానం చేస్తే చాలు

3) దేవుని నామం చెప్పడం చాలు - అద్భుతంగా పనిచేస్తుంది 

4) మనసులో సంకల్పం ద్వారా మనం పుణ్యం చేయవచ్చు 

5) శారీరకంగా చేయవలసిన అవసరం లేదు (ఆర్థిక శక్తి లేకపోతే) 

6) డబ్బు & శారీరక శక్తి ఉంటే, శారీరకంగా పుణ్యం చేయాలి.🙏🚩

చదివింది గుర్తు పెట్టుకోవాలంటే..?

 చదివింది గుర్తు పెట్టుకోవాలంటే..?


ఏరోజు పాఠం ఆరోజు చదువుకున్న విద్యార్థికి పరీక్ష తేదీనాటికి ఎలాంటి భయాలూ ఉండవు. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. కొన్ని అంశాలు తరగతి గదిలో నేర్చుకోనివి కూడా ఉంటాయి. పత్రికల్లో చదివినవి, లైబ్రరీ పుస్తకంలో చదివినవి ఉంటాయి.

పుస్తకంలో చదివిన ప్రతి అంశానికీ నోట్సు రాసుకోవడం మంచి లక్షణం. పత్రికల క్లిప్పింగులను నోట్సులో అతికించుకోవచ్చు. విద్యాసంవత్సరం మొదలైన నాటి నుంచి, పరీక్ష తేదీ సమీపించే వరకూ విస్తృతమైన సమాచారం మన వద్ద ఉంటుంది. అదంతా మొదటినుంచీ క్రమపద్ధతిలో నోట్సు రూపంలో భద్రపరచుకున్నవారికి పరవాలేదు. అప్పుడప్పుడూ పునశ్చరణ చేసినవారికి పరవాలేదు. పరీక్షల ముందు హడావుడిగా పుస్తకాలు దులిపేవారికే వస్తుంది తంటా.

మానవ మేధస్సులో లక్షలకొద్దీ పదాలతో కూడిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అయితే అదంతా ఒక క్రమపద్ధతిలో ఉండాలని లేదు. దాన్ని మనకు కావలసిన సమయంలో కావలసిన రూపంలో బయటకు తీసుకురాలేం. అందుకే పునశ్చరణ అవసరం.

పునశ్చరణ మొదటిసారి చేయడానికీ, రెండోసారి చేయడానికీ మధ్య తేడా ఉంటుంది. పాఠం అంతా కూలంకషంగా చదివిన కొద్దిరోజుల తర్వాత మొదటిసారి పునశ్చరణ చేస్తాం. రెండోసారి నుంచి పాఠం అంతటినీ చదవాల్సిన పనిలేదు. ముఖ్యమైన, సాంకేతికమైన పదాలను మాత్రమే వల్లెవేసుకుంటే సరిపోతుంది.

పక్కాగా రాసుకోవడం ద్వారా వేగంగా పునశ్చరణ చేయవచ్చు.

ప్రతి పాఠ్యాంశాన్నీ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చొప్పున పునశ్చరణ చేయడానికి ప్రయత్నించండి.

ప్రతిరోజూ చదువుకునే సమయంలో మొదటి లేదా చివరి పావుగంటను పునశ్చరణకు కేటాయించండి.

కొండలా కోర్సులు పెరిగిపోయి, ఎంతకీ తరగకపోవడం ఎంతటివారికైనా ఎప్పుడో ఒకసారి అనుభవమే. అయితే మూలకారణాన్ని కనుగొనండి. కారణాలు బహుశా ఇలా ఉంటాయి. తొందరగా చదవడం మొదలు పెట్టకపోవడం వల్ల.. ఫలానా సబ్జెక్టులో మనకు అభిరుచి లేకపోవడం వల్ల.. అనవసరమైన విషయలపై సమయాన్ని వృథా చేసుకోవడం వల్ల. ఇది కాకుండా మిమ్మల్ని చదువు జోలికి పోనివ్వకుండా ఆపుతున్న బలమైన కారణం.

వీటిలో మూలకారణమేదో గ్రహించండి. అక్కడినుంచి నరుక్కురండి. మీ ప్రస్తుత సమస్యకు కారణమైన అంశాన్నీ మీరు ఎలా అధిగమించగలరో మీ దగ్గర ఉపాయాలన్నింటినీ ఆలోచించండి. పాత సిలబస్ అంతటినీ మీరు ఎన్నిరోజుల్లో, ఏవిధంగా చదివి పూర్తి చేయాలనుకుంటున్నారో ఒకకాగితంపై రాయండి. మంచి పరిష్కార మార్గాన్ని ఎంపిక చేసుకోండి. ఆ మార్గాన్ని ఒక ప్లకార్డుపై రాసి మీ చదువుల బల్లపై ఉంచుకోండి. దాన్ని నిజాయతీగా పాటించండి.

చదవకుండా, పునశ్చరణ చేయకుండా విడిచిపెట్టిన పాత సిలబస్‌కు సరైన సమయాన్ని కేటాయించండి. 

వేగవంతమైన పునశ్చరణకు మ్యాపింగ్ విధానాన్ని పాటించండి. గుర్తుంచుకోవాల్సిన సాంకేతిక పదాలను అధ్యాయాల వారీగా ఒక్కో కాగితంపై రాసుకుని మననం చేయండి. సాగుతున్నన్ని రోజులూ ఆ కాగితాన్ని మీ జేబులో ఉంచుకోండి.

కఠినంగా అనిపించే అధ్యాయాలను గట్టిగా చదవండి. ఆడియో ఫైల్‌గా భద్రపరచండి. కళ్లు మూసుకుని చక్కగా వినండి.

వేసవి సెలవుల్లో కొన్ని శిక్షణాలయాలు పునశ్చరణ తరగతులను నిర్వహిస్తాయి. పై తరగతుల్లో మీరు చదవబోయే వాటికి ఇక్కడ నేర్చుకునే కోర్సులు దోహదం చేస్తాయి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

Any how best of luck...... 

                 Alpha Olympiad School... Pamur

మహాభారతము ' ...48.

 మహాభారతము ' ...48. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


రాజసూయ యాగంలోని అంతిమ ఘట్టమైన అగ్రపూజ సందర్భంలో, శ్రీకృష్ణునికి అగ్రాసనమిచ్చి నిండుసభలో పాండునందనులు సత్కరిస్తుండగా, శిశుపాలుడు, ఓక్క వుదుటున లేచి నిలబడి ' ధర్మరాజా ! నేను చూస్తున్నది నిజమేనా ! సభలో యింత మంది యోగ్యులు, మహానుభావులు, వీరులు వుండగా, నీవు యీ కృష్ణునికి అగ్రస్థానం యివ్వడం, యాగానికి వచ్చినవారినందరినీ, పరిహాసం చేస్తున్నట్లు వున్నది. '


' సరే ! మీకైతే, వయసు పరిణితి చెందలేదు, యుక్తాయుక్తాలు తెలియవు. భీష్మ పితామహా ! నీ బుద్ధి ఏమైనదయ్యా ? మీరు వృద్ద్ధులైనందున, మీరుసరిగా నిర్ణయించలేక పోయినట్లున్నారు. నాలాంటి విజ్ఞులు యీసభలో యెందరోవున్నారు. వారిని సంప్రదించి వుండవచ్చు కదా ! ఈ కృష్ణునిలో యేమి ఉత్కృష్టమైన గుణాలుచూసి, పరమపూజ్యుడిగా మీరు నిర్ణయించారు ? '


' వయసులో పెద్దవాడా ? వయసే కొలమానం అయితే, ఆతని తండ్రి వసుదేవునికి అగ్రస్థానం యివ్వవచ్చుకదా ! పోనీ, ఆప్తబంధువా ? ద్రుపదునికంటే, ఆత్మబంధువులు, శ్రేయోభిలాషులు అయి వుండడు కదా ! గురుతుల్యుడా ? మరి ద్రోణుని సంగతేమిటి ? వేదవేద్యుడా ? సభలో వున్న వేదవ్యాసునికంటే ఘనుడా ! '


' ఇది మేము చేస్తున్నపూజ, మా యిష్టంవచ్చినవారికి అగ్రస్థానం యిస్తాము అంటారా ? అది మీ వ్యక్తిగతం. కానీ, యిది నిండు పేరోలగం. మీ చర్య,యెందరో పెద్దలను అవమాన పరుస్తున్నది. అట్టిపూజలు మీగృహంలో నిరభ్యంతరంగా చేసుకోండి. '


అని ప్రేలాపనలు చేస్తూ శిశుపాలుడు సభికులనుద్దేశించి ' మహావీరులారా ! ఈతడు ధర్మరాజని, మనం అభిమానంతో కానుకలు తెచ్చి, కప్పాలు గట్టి, యాగదర్శనకు వచ్చాము. ఇప్పుడు తెలిసిపోయింది. ఈతడు అధర్మరాజని. లేవండి ! మీ విముఖత కూడా తెలియజేయండి. ' అని నాలుగువైపులా చూస్తూ అన్నాడు. అయితే, సభికులలో యెవరూ, శిశుపాలునితో ఏకిభవించలేదు. మౌనంగా, తమ పెద్దరికం నిలుపుకుని సభా మర్యాద కాపాడారు. ఎవరో ఒకరిద్దరు శిశుపాలుని జతగాళ్ళు, లేచీ లేవనట్లు లేచి నిల్చున్నారు.


అయినా, శిశుపాలునికి తాను చేస్తున్న ప్రేలాపనలో తప్పు తెలియలేదు. ఇంకా తన వాచాలత్వం కొనసాగిస్తూ ' ధర్మరాజు అతని సోదరులు, నీకు బంధువులు, నీకన్నా చిన్నవారు. వారి అమాయకత్వంతో నీకు అగ్రస్థానం యిస్తేమటుకు, తగుదునమ్మా అని నీవెట్లా అంగీకరించావు ? ' అని కృష్ణుని పలురకాల దుర్భాషలాడుతూ, తనకు వంతపాడే బహుకొద్దిమంది రాజులతో సహా పైకి లేచాడు, సభ ముగియకుండానే, వెళ్ళడానికి ఉద్యుక్తుడై, సభామర్యాద అంటే తెలియని శిశుపాలుడు.


ఇంత జరిగినా, ధర్మరాజు శాంతంగా ' శిశుపాలా ! ఇతరులను కఠినవచనాలతో దూషించడం, అకారణంగా ఆక్షేపించడం, విజ్ఞులుచేసే పనికాదు. అందునా, శ్రీకృష్ణుని ఔన్నత్యం తెలియక, నీవిట్లు మాట్లాడడం నీకే మంచిది కాదు. భీష్ముని కూడా తూలనాడావు. తోటిరాజులు అనేకమంది వున్న సభలో, వారు మౌనంగా వున్నా రెచ్చకొట్టి సభను కలుషితం చేయవలెనని చూడడం నీకున్యాయమా ? దయచేసి శాంతించు. సభాగౌరవాన్ని కాపాడి, సభ ముగిసేవరకు వుండి, మాసపర్యలు స్వీకరించు. ఇది మా పాండునందనుల అందరి విన్నపం. ' అని అన్నాడు.


ఆసమయంలో భీష్ముడు కూడా కలిపించుకుని, ' ధర్మనందనా ! అనవసర వాద ప్రతివాదాలకు యిది సమయంకాదు. అగ్రపూజ అందుకుంటున్న శ్రీకృష్ణునకు, యిది ఇబ్బందికరంగా కాకూడదు. సభ నడిపించి, అర్ఘ్యతాంబూలాలు, అగ్రపూజ అందుకుంటున్న ఆ పరమాత్మకు అందజెయ్యి. ' అని సూచించాడు. శిశుపాలుని వైపు తిరిగి, ' శిశుపాలా నీవు చేసినది యుక్తమైన పనికాదు. నీ నడవడి మార్చుకో. శ్రీకృష్ణుడు పురుషోత్తముడు. ఆయన సూర్యుడు. మిగిలినవారు యెంతటివారైనా దివిటీల లాంటి వారు మాత్రమే. నీ ఆగ్రహం చాలించి, ఆశీనుడవు కమ్ము. ఇది నా సలహా ! ' అని స్పష్టం చేశాడు భీష్ముడు. 


ఇక యెప్పుడూ పరమశాంతంగా అన్నల వెనుకవుండే సహదేవుడైతే, ' శ్రీకృషుని గురించి పరుషంగా యింకొక్కమాట యెవరైనా మాట్లాడితే, వారి శిరస్సును నా యెడమకాలి క్రింద వేసి తొక్కేస్తాను. ' అని అన్నాడు. అతని మాటలను సభికులంతా హర్షధ్వానాలు చేశారు. ఒక్కరూ వ్యతిరేకించలేదు. పైనుండి యాగం వీక్షిస్తున్న దేవతలుకూడా ' భళా ' అంటూ సహదేవునిపై పుష్పవృష్టి కురిపించారు.        


అంతవరకు, మౌనంగా వున్న నారదముని లేచి, ' శ్రీకృష్ణుని దేవుడని తెలుసుకోనివారు, ఆయనని అర్చించకపోగా, విమర్శించేవారు, జీవన్మృత్యులు. అనగా బ్రతికివుండీ మరణించినవారిలో సమానం. ' అని మాత్రం చెప్పి కూర్చున్నాడు.


పాండుకుమారులు తిరిగి కృష్ణుని పూజకు వుపక్రమించగా, యింతమంది యిన్నిరకాలుగా చెప్పినా కూడా, చెవికెక్కని శిశుపాలుడు రోషంతో, కళ్లెర్రజేసి, కొందరు రాజులను కూడగట్టుకుని, ' పాండవులను వధిస్తాను ' అంటూ వారిపైకి రాసాగాడు.


జగడం అనివార్యమయ్యేటట్లున్నదని ఆందోళనగా ధర్మరాజు బీష్ముని వైపు చూడగా ' ధర్మరాజా ! భయపడకు. సింహాన్ని చూసి కుక్కలు మొరగడం తెలియని విషయం కాదు. కానీ అవి సింహాన్ని యెదుర్కొనలేవు కదా ! ఆ యదుసింహం మౌనంగా వీని తప్పులులెక్కిస్తూ సహిస్తున్నాడు. తనపంజా విసిరేదాకానే ఈఅరుపులు. నీవు నిశ్చింతగా నీ కార్యక్రమం కానీ ! ' అన్నాడు భీష్ముడు.  


భీష్ముని మాటలు విని శిశుపాలుడు మరింత రెచ్చిపోయాడు. మళ్ళీ మళ్ళీ కృష్ణుని, పాండవులను తూలనాడసాగాడు. అది సహించలేని భీముడు ఒక్కసారిగా, దూరంగా వున్న గదను విసురుగా తీసుకుని, ప్రళయకాల రుద్రుని వలే శిశుపాలుని మీదకు లంఘించబోయాడు. సభ రసాభాస అవుతుందని, భీష్ముడు వారించాడు. వారిస్తున్న భీష్మునికూడా నిందించి శిశుపాలుడు యేమాత్రమూ జంకకుండా, శ్రీకృష్ణునికూడా తనతో యద్ధం చెయ్యమని కవ్వించాడు. ' వినాశకాలే విపరీత బుద్ధి : '


అప్పుడు లేచాడు శ్రీకృష్ణుడు, తనకు పూజ చేయుచున్న పాండునందనులను, ఒకింత ఆగమని చెప్పి, తన ఆసనం నుండి పైకిలేచాడు. . 


పాండునందనులూ, భీష్ముడు మొదలైన పెద్దలు, దివినుండి దేవతలు విభ్రమంగా చూస్తున్నారు, శ్రీకృష్ణుని వైపు. .  


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత

 రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం

హిందూపురం.

9989692844

నిజమైన స్నేహితుడు.*

 ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి,ఒక జాబితా ఇచ్చి " నాన్నా,ఈ జాబితాలో ఉన్న యాభై మంది నా స్నేహితులు. వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను" అని చెప్పాడు.అప్పుడు తండ్రి "సరే, ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరికీ నేను పిలుస్తాను. నువ్వు మిగిలిన పనులు చూసుకో" అని చెప్పాడు.పెళ్లి ముహూర్తం సమీపించింది.పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు పదిమంది మాత్రమే కనిపించారు.వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి" నాన్నా నేను నీకు యాభై మంది జాబితా ఇచ్చాను కదా,మరి పదిమంది మాత్రమే ఉన్నారు,మిగిలిన వారిని మీరు పిలవలేదా" అని అడిగాడు. అప్పుడు తండ్రి "నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను.కాని నీ పెళ్ళి అని చెప్పలేదు.నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు,దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చెయ్యదలచుకుంటే, ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చెయ్యండి అని చెప్పాను.ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు.మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు.పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ స్నేహితులుగా భావించకు" అని చెప్పాడు.


*✍️నీతి : - మనం ఆనందంలో ఉన్నప్పుడు మన పక్కన లేకపోయినా పరవాలేదు,కాని మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం నేనున్నాను అని భరోసా కలిగించిన వాడే నిజమైన స్నేహితుడు.*

ఆదివారం నాడు ఏం చేయకూడదో

 *ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం.....*


అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | 

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||


తాత్పర్యం: 


మాంసం తినడం, 

మద్యం తాగడం, 

స్త్రీతో సాంగత్యం, 

తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు ఇలా చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించెయి దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా


అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.


 ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి

ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రపాలు చేశారు.


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వన్నీ తెలిపేది మన హైందవ సంస్కృతి.


అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాడు(Thomas Babington Macaulay ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు.


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు మద్యాన్ని తాగే వారు కాదు

కానీ ఇప్పుడు సీన్అంతా రివర్స్ అయ్యింది.


🙏🏻🌷🙏🏻

ధర్మ సందేహాలు

 *ధర్మ సందేహాలు(Q&A) సంబంధ 29 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


29 పుస్తకాలు ఒకేచోట! https://www.freegurukul.org/blog/dharmasandehalu-pdf


               (OR)


గోపురం www.freegurukul.org/g/DharmaSandehalu-1


సందేహాలు www.freegurukul.org/g/DharmaSandehalu-2


స్నానము-భోజనము-తాంబూలము www.freegurukul.org/g/DharmaSandehalu-3


ప్రశ్నోత్తర రత్నమాలిక www.freegurukul.org/g/DharmaSandehalu-4


దైవీశక్తి www.freegurukul.org/g/DharmaSandehalu-5


ధర్మ సందేహాలు www.freegurukul.org/g/DharmaSandehalu-6


అపర సిద్ధాంతము www.freegurukul.org/g/DharmaSandehalu-7


సనత్సు జాతీయము www.freegurukul.org/g/DharmaSandehalu-8


కామము,ప్రేమ,పరివారము www.freegurukul.org/g/DharmaSandehalu-9


స్పందన-1 www.freegurukul.org/g/DharmaSandehalu-10


సందేహాలు - సమాధానాలు www.freegurukul.org/g/DharmaSandehalu-11


మహా దార్శనికుడు ఖలీల్ జిబ్రాన్ www.freegurukul.org/g/DharmaSandehalu-12


హిందూ లా www.freegurukul.org/g/DharmaSandehalu-13


పరిపూర్ణ రాజయోగ సిద్ధాంత శిరోభూషణము-1 www.freegurukul.org/g/DharmaSandehalu-14


సమాధాన వేదిక www.freegurukul.org/g/DharmaSandehalu-15


సంభాషణలు-సమన్వయాలు www.freegurukul.org/g/DharmaSandehalu-16


మాటలు - మంత్రాలు-1 www.freegurukul.org/g/DharmaSandehalu-17


మాటలు - మంత్రాలు-2 www.freegurukul.org/g/DharmaSandehalu-18


ధర్మ దీపికలు www.freegurukul.org/g/DharmaSandehalu-19


షా తత్త్వము www.freegurukul.org/g/DharmaSandehalu-20


విజ్ఞాన వీచికలు-ఆధ్యాత్మికతరంగాలు www.freegurukul.org/g/DharmaSandehalu-21


సంస్కృతి - సంప్రదాయం www.freegurukul.org/g/DharmaSandehalu-22


సాంఖ్యం www.freegurukul.org/g/DharmaSandehalu-23


జన్మరాహిత్య ప్రభోదిని www.freegurukul.org/g/DharmaSandehalu-24


దేవుడు - మానవుడు www.freegurukul.org/g/DharmaSandehalu-25


విజ్ఞాన కాంతి పుంజములు www.freegurukul.org/g/DharmaSandehalu-26


వేదుల శకుంతల కృష్ణా తరంగిణి www.freegurukul.org/g/DharmaSandehalu-27


వివేకరత్న www.freegurukul.org/g/DharmaSandehalu-28


వేదాంత చూర్ణిక-2 www.freegurukul.org/g/DharmaSandehalu-29


ధర్మసందేహాలు గురించి తెలుసుకోవడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి ߙϮ


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link www.freegurukul.org/join

ఈశ్వర







 

నవవిద్రుమబింబశ్రీఃన్యక్కారిదశనచ్ఛదా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 25 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘నవవిద్రుమబింబశ్రీఃన్యక్కారిదశనచ్ఛదా’


శాస్త్ర ప్రకారము అమ్మ పెదవుల గురించి మాట్లాడకూడదు. ఇక్కడ సాధారణ స్త్రీ పెదవుల గురించి చెప్పడము లేదు. అమ్మ పెదవుల గురించి మాట్లాడటము, అమ్మని మనసులో భావన చేసి ధ్యానము చెయ్యడము ఉన్నతికి హేతువవుతుంది. ఎట్టి పరిస్థితులలో ఏవిధమైన ఉపద్రవము ఉండదు. శ్రీ అంటే ప్రకాశము. సమస్తలోకములకు సమస్త మంగళములకు ఏది హేతువో దానిని శ్రీ అని పిలుస్తారు. అమ్మవారి పెదవుల కాంతి ఎలా ఉన్నదనగా ‘నవవిద్రుమబింబ’ – విద్రుమ అంటే అది మసకబారిపోయినా, సాన పట్టకపోయినా దానిలో ఉండే ఎరుపు శోభించదు. అమ్మవారి పెదవులు సానపట్టిన కొత్తపగడము అంత కాంతి కలిగినవి. బింబ అనగా దొండపండు. అమ్మవారి పెదవులు ‘నవవిద్రుమ’ - పగడము చేత, ‘బింబ’ - దొండపండు చేత, ‘శ్రీ’ - కాంతిని ఓడించకలిగినవి. ‘రదనచ్ఛద’ – అనగా సంస్కృతములో తెర అర్థము. అమ్మవారి రెండుపెదవులు తెరయి పోల్చబడిన వస్తువుల కాంతిని తిరస్కరిస్తున్నాయి. మూసుకుని ఉన్న ఆ పెదవుల ఎరుపులో కాంతి ఉన్నది. పెదవులు తెర వలె ఉంటే మూసిన ఆ తెరవెనక ఏమున్నదో తెలియదు. అద్వైత సంప్రదాయములో అమ్మవారే ఒక తెర. శ్రీవిద్యా సంప్రదాయములో ఆవిడ పరిపాలకురాలు శ్రీమహారాజ్ఞి. ఆవిడ అనుగ్రహము కలిగితే ఆవిడ కాంతిని ఉపాసన లభిస్తే ‘మాయ’ అన్న తెరను పైకి ఎత్తితే పరబ్రహ్మములో కలసిపోవడమే. వశిన్యాది దేవతలు అటువంటి శక్తి ఇవ్వకలిగిన అమ్మ పెదవులను స్తోత్రం చేస్తున్నాము అంటున్నారు. ఇంకా చెప్పవలసి వస్తే అమ్మవారి పెదవులకు ఉపమానము లేదు. అమ్మవారి పెదవులను వక్రదృష్టితో చూడరాదు. ఒకసారి కుబేరుడు అలా చూస్తే ఆయన కన్ను మెల్లకన్ను అయింది. అవి అమ్మ పెదవులన్న దృష్టితో ధ్యానం చెయ్యాలి. ఆ పెదవులు పెరిగి పెద్దవడానికి అడ్డువచ్చిన వాటిని తొలగదోసిన హేతువులు. అనారోగ్యముతో పుట్టిన పిల్లవాడు అమ్మకి బరువు కాదు. అమ్మఅమ్మే బిడ్డబిడ్డే. అమ్మ పెదవుల ముద్రలు పిల్లవాడి మీద ఎన్నిసార్లు పడ్డాయో అవి వాడి వృద్ధికి ఆశీర్వచనములు పడినట్టు భావించాలి. మమ్ములను పోషించినదని ఆ అమ్మవారి పెదవులు కదా! అని స్మరించుకుని నమస్కరించు కోవడము అభివృద్ధికి హేతువు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/

నవరాత్రులు - నవదుర్గలు

 *🌹నవరాత్రులు - నవదుర్గలు🌹*


*ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిదిరోజులు శరన్నవరాత్రులుగా వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలోని అమ్మవారిని మొదటి మూడు రాత్రులు దుర్గగా, తర్వాతి మూడురాత్రులు లక్ష్మిగా, చివరి మూడు రాత్రులు సరస్వతిగా పూజిస్తారు. శుభ, నిశుంభ, మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి అవతరించిన దుర్గాదేవి తొమ్మిదిరోజులు వేర్వేరు రూపాలు ధరించింది. అందుకే ఈ నవరాత్రులలో ఆలయాలలో అమ్మవారికి ప్రతీరోజు ఒక్కో అలంకారం చేస్తారు. అలాగే రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.*


*వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్*


*వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్*


*1. శైలపుత్రి: నవరాత్రులలో మొదటిరోజు పాడ్యమినాడు అమ్మవారిది శైలపుత్రి అవతారం. పర్వతరాజు పుత్రిక పార్వతిగా జన్మించిన సతీదేవి శంకరుడిని సేవించి వరిస్తుంది. శైలపుత్రి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించి ఎద్దుపై స్వారీ చేస్తూ ఉంటుంది. పాడ్యమినాడు పెసరపప్పు, జీలకర్ర, మిరియాలతో చేసే పులగం లేదా కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పిస్తాతారు.*


*దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా*


*దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా*


*2. బ్రహ్మచారిణీ: రెండవరోజు విదియనాడు అమ్మవారిది బ్రహ్మచారిణిగా అవతారం. బ్రహ్మచారిణి అంటే తపమాచరించినదని అర్ధం. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించిన ఈ తల్లి ఉమ, తపచారిణిగా కూడా పిలువబడుతుంది. విదియనాడు పెరుగుతో చేసిన దద్ధ్యోజనం నైవేద్యం చేస్తారు.*


*పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా*


*ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా*


*3. చంద్రఘంట: దుర్గాదేవి మూడో అవతారం చంద్రఘంట.. తన నుదుటిపై అర్ధచంద్రుడిని ఘంటాకారంగా కలిగి ఉంటుంది కాబట్టి చంద్రఘంటగా పిలువబడుతుంది. పది చేతులతో, మూడు కన్నులతో పులిని అధిష్టించిన అమ్మవారు ఎనిమిది చేతులలో జపమాల, బాణం, ఖడ్గం, శ్వేతపద్మం, కమండలం, త్రిశూలం, ధనుస్సు, గద ధరిస్తే, మిగిలిన రెండు చేతులు వరాలిచ్చే, చెడును ఆపే ముద్రలతో ఉంటాయి. ఈ రోజు బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా పెడతారు.*


*'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ*


*దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '*


*4. కూష్మాంఢ : నాలుగవ రోజైన చవితినాడు అమ్మవారిని కూష్మాండగా అలంకరిస్తారు. అష్టభుజాలతో అలరారే ఈ తల్లి కమలం, ధనుస్సు, బాణం, కమండలం, కలశం, జపమాల, గద, చక్రం మొదలైనవి ధరించి సింహవాహినిగా ఉంటుంది. అంధకారంలో మునిగిపోయిన విశ్వాన్ని తన వెలుగుతో సూర్యకిరణాలవలే ఎల్లెడలా కాంతిని నింపింది కూష్మాండ దేవి. ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు.*


*సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా*


*శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '*


*5. స్కంద : ఐదవ రోజైన పంచమినాడు అమ్మవారు స్కందాదేవిగా సాక్షాత్కరిస్తుంది. దేవతల సైన్యాధిపతియైన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లవాడిగా తన ఒడిలో ఉంచుకుంటుంది. సింహాన్ని స్వారీ చేస్తూ, నాలుగు చేతులు, మూడు కళ్లు కలిగిన తల్లి రెండు చేతులలో కమలాలను , మరో రెండు చేతులు అభయం, రక్షణ ఇస్తున్నట్టుగా ఉంటాయి. స్కందమాతను పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహా పండితుడు అవుతాడంట. మహా కవి కాళిదాసు స్కందమాత ఆశీస్సులతోనే రఘువంశ మహా కావ్యం, మేఘదూతం రచించాడు. పంచమినాడు పాలు, బియ్యం కలిపి చేసిన పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.*


*'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా*


*కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '*


*6. కాత్యాయిని : ఆరవరోజైన షష్టినాడు అమ్మవారు కాత్యాయినిగా కొలువై ఉంటుంది. కాత్యాయన మహారుషి జగన్మాతను తన కూతురిగా పొందాలని తపస్సు ఆచరించాడు . అతని భక్తికి మెచ్చిన దుర్గామాత యమునా నదీ తీరాన అతని కుమార్తె కాత్యాయినిగా జన్మిస్తుంది. నాలుగు చేతులు, మూడు కళ్లతో ఉండే కాత్యాయిని ఒక చేత ఖడ్గం, ఒకచేత కమలం, రెండు చేతులతో అభయముద్ర కలిగి సింహాన్ని అధిష్టించి ఉంటుంది. షష్టినాడు పులిహార నైవేద్యంగా సమర్పిస్తారు.*


*'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా*


*లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ*


*వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా*


*వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '*


*7. ఏడవరోజు దుర్గామాత కాళరాత్రిగా రూపం దాల్చి ఉంటుంది. కాళరాత్రివలె నల్లగా ఉండి, అస్తవ్యస్తమైన కురులతో, మెరుపుతీగను హారంగా ధరించి భయంకరంగా ఉంటుంది . నాలుగు చేతులు, మూడు కళ్ళు కలిగి రెండు చేతులలో ఆయుధాలు, మిగిలిన రెండు చేతులతో అభయం, రక్షణ ఇస్తూ నాసికాలనుండి అగ్నిజ్వాలలను వెదజల్లుతూ ఉంటుంది. గాడిదను వాహనంగా కలిగిన ఈ తల్లి తనను శరణువేడినవారికి అభయాన్నిస్తూ శుభంకరి అని కూడా పిలువబడుతుంది. సప్తమినాడు పులిహోర, పాయసం నైవేద్యంగా సమరిపిస్తారు.*


*'శ్వేతే వృషే సమా


రూఢా శ్వేతంబరధరా శుచిః*


*మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'*


*8. ఎనిమిదవ రోజైన అష్టమినాడు దుర్గాదేవి మహాగౌరీగా పూజింపబడుతుంది. అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయను మార్చుకుని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి. తెల్లని చంద్రకాంతితో విరాజిల్లే ఈ తల్లి నాలుగు చేతులు కలిగి ఉంటుంది. ఒక చేత త్రిశూలం, ఒక చేత కమండలం, ఒక చేత అభయం, ఒకచేత రక్షణ ఇచ్చే ముద్రలు కలిగి ఎద్దుపై స్వారీ చేస్తుంది. సప్తమినాడు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.*


*'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి*


*సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ*


*9. తొమ్మిదవ రోజైన నవమి నాడు అమ్మవారిని సిద్ధిధాత్రిగా అలంకరిస్తారు.. అష్ట సిద్ధులతోపాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మరూపం ‘సిద్ధిధాత్రి’. పరమశివుడు మహాశక్తిని పూజించి అష్టసిద్ధులను పొందాడని దేవీ పురాణం చెబుతుంది. ఆ శక్తి అతని శరీరంలో సగభాగమై అర్ధనారీశ్వరుడిని చేసింది. చతుర్భుజాలతో భక్తుల పూజలందుకుంటుంది. ఈమె కమలాసనయై. మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. రుషులు, మునులు, సిద్ధులు, దేవతలు కూడా సిద్ధిధాత్రిని పూజిస్తారు. నవమి నాడు బెల్లంతో చేసిన పరమాన్నం, దధ్యోదనం, పాయసం, పులిహోర చేసి నైవేద్యంగా సమర్పిస్తారు*