12, అక్టోబర్ 2020, సోమవారం

కొబ్బరికాయను (టెంకాయ) కొట్టడంలో నియమాలు

 *కొబ్బరికాయను (టెంకాయ) కొట్టడంలో నియమాలు మరియు సందేహాలు*

**************************

🙏 

        

     *ఆధ్యాత్మికం సనాతనం*

           

మన భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు. దీనిని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు. పూజలేదా వ్రతం చేసాక, దేవుడికి టెంకాయ కొట్టేసాం, నైవేద్యం పెట్టేసాం తంతు పూర్తి అయింది అని అనుకుంటాము . అంతా బాగనే ఉంది గాని, టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. అందేంటో కాస్త తెలుసుకుందాం.


టెంకాయ కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి.


1. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశం మన చేతికి లోపలి వైపు పట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది*


2. కాయ కొట్టేటప్పుడు 9 - 12 అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది


3. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు, ఇటు అయినా ఫరవాలేదుదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులు పడాల్సిన పనిలేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో “ఓం నమః శివాయ” అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది


4. టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు


5. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. ఒకవేళ ఆ తీర్థంతో అభిషేకం చేయాలనుకుంటే, వేరే పాత్రలోనికి పోసి, ఆప్పుడే కొబ్బరి తీర్థంతో అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి. 


అలాగే, కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్లిపోయి వుంటుంది. అలా జరిగితే, మంచిదా, చెడ్డదా అనేది చాలామందికి సందేహం. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ, కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ? అనర్థమా ? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ?


కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. ఈ పక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. ఇంకా కావాలంటే ఇంకొక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది


కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు.


ఇక కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో 'పువ్వు' వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు.


అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరలుగా పగులుతుంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికపరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది.


ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంటుంది. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా అలా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ, కోడలుగాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్నినింపుకుని, పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు.


వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే.. దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహానాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది.


భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా, 


*పత్రం పుష్పం ఫలం తోయం* 

*యో మే భక్త్యా ప్రయచ్ఛతి* 

*త దహం భక్త్యుపహృతమ్*

*అశ్నామి ప్రయతాత్మనః* ॥


భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు.

ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని


*

కామెంట్‌లు లేవు: