6, మే 2023, శనివారం

అచ్చులతో ఆధ్యాత్మికత

 *శుభోదయం* 

🙏💐🙏💐🙏


*అచ్చులతో ఆధ్యాత్మికత - అంతం నుంచి అంతం వరకు*............ 


*అం* తం (మరణం) నుంచే *ఆ* రంభమైన జీవితం (జననం)


*ఇం* టి (శరీరం) నుంచే *ఈ* శ్వరుడి (ఆత్మ)దర్శనం


*ఉ* పాసన (సాధన)తో *ఊ* డిపోయే *ఋ* ణం 

      (మోక్షం)


*ఎ* దగడమే (ఆత్మస్థితి) *ఏ* కమైన (ఒకటే) ఐశ్వర్యం  (ముక్తి)*


*ఒం* టరిపోరాటంలో (ధ్యానం)  *ఓ* రిమే (ధ్యేయమే)   *ఔ* న్నత్యం (సమాధి స్థితి)*


*అం* తం  చేస్తుంది  *అహం* కారం (నేను)

🙏🙏🙏🙏🙏

రుక్మి

 


                       *రుక్మి*

                  ➖➖➖✍️


*కురుపాండవ సంగ్రామంలో ఎవరి పక్షానా చేరకుండా ఉండిపోయింది ఇద్దరే ఇద్దరు. ఒకరు బలరాముడు, మరొకరు రుక్మి.* 


*బలరాముడికి మహాజన క్షయకరమైన కురుపాండవ యుద్ధం ఇష్టం లేదు. ఈ అభిప్రాయాన్ని ఆయన కృష్ణుడి ఎదుట చాలా సార్లు వ్యక్తం చేశాడు.* 


*బంధుమిత్రులూ, క్షత్రియులూ అందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాని తమ్ముడు ఏ పనిచేస్తే దానినే బలరాముడు అంగీకరిస్తాడు. తమ్ముడంటే ఆయనకు అంత ప్రేమ, అభిమానం, గౌరవం.     అలా అని కౌరవులు రణభూమిలో కూలిపోవడం కూడా ఆయన సహించలేడు. అన్నదమ్ములు ఒకరి నొకరు చంపుకోవాలనుకోవడం ఆయనకు బాధ కలిగించింది. అందుకే తీర్థయాత్రల పేరుతో సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోయాడు.*


*భీష్మక మహారాజు కుమారుడు ‘రుక్మి’ మహా పరాక్రమవంతుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు. ఇతన్నే …‘హిరణ్యరోముడ’ని కూడా పిలుస్తారు. రుక్మిణీదేవికి స్వయంగా అన్నగారు. గంధమాదన పర్వతం మీద వున్న ద్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల 'విజయం ' అనే దివ్య ధనస్సు సంపాదించాడు.*


*లోకంలో శ్రేష్ఠమైన దివ్య ధనస్సులు మూడే ఉన్నాయి. దేవతల ధనస్సులేవీ వాటితో సాటిరావు.* 


*వాటిలో ఒకటి విష్ణుమూర్తి శార్ఞం అనే ధనువు. శత్రువులకు దానిపేరు చెబితేనే నిద్రాహారాలుండవు. శ్రీ కృష్ణుడు దానిని ధరించాడు.* 


*మరొకటి గాండీవం. ఖాండవ వనదహన సందర్భంలో అగ్నిదేవుడు అర్జునుడికీ ధనస్సు ఇచ్చాడు.* 


*ఇక మూడోవది విజయం. ద్రుముణ్ణి ఆరాధించి రుక్మి అతని దగ్గర శస్త్రాస్త్ర విద్యలు అనేకం అభ్యసించాడు. మేఘగర్జనవలె ధ్వనించే విజయ నామక చాపాన్ని అతనినుండి సంపాదించాడు రుక్మి.* 


*రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి శ్రీ కృష్ణుడు ఆమెను రథం మీద తీసుకుపోతుంటే రుక్మి బలగర్వితుడై డాంబికాలు పలుకుతూ కృష్ణుణ్ణి ఎదిరించి నిందారోపణలు చేశాడు.* 


*తీరా కృష్ణుడు రథం నిలిపి బలాబలాలు చూసుకుందాం రమ్మని పిలిస్తే ఎదుర్కోలేక అవమానాలపాలయ్యాడు.*


*కుఱుపాండవ సంగ్రామం జరగబోతోందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల దగ్గరకు వెళ్ళాడు రుక్మి. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. అతిథి సత్కారాలు అందుకున్నాక రుక్మి అందరూ వింటూవుండగా పార్థుణ్ణి పిలిచి, "అర్జునా! రాబోయే సంగ్రామం గురించి బాధపడుతున్నావేమో! నేను నీకు అండగా ఉంటాను. నా అండదండల వల్ల నీకు విజయం తథ్యం. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు. పైగా నా దగ్గర తేజోమయమయిన ధనస్సు ఉంది. దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్యాది కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. ఈ రాజ్యం నీ వశం చేస్తాను. సరేనా" అన్నాడు.* 


*అర్జునుడు నవ్వుకున్నాడు.*

*కృష్ణుడూ, ధర్మరాజూ వుండగా ఏమిటీ బీరాలు పలకటమని అందరూ చెవులు కొరుక్కున్నారు.*


*"ఓయీ! వీరాధివీరా! మాకు సాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే కృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయంగా ఉంటాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆయన సాయం వుంటే ఇంకెవరి అండదండలూ అక్కర్లేదు మాకు. పైగా నా చేతిలో గాండీవం ఉంది. సాక్షాత్తూ ఇంద్రుడే వజ్రాయుధం ధరించి వచ్చినప్పటికీ నేను భయపడను" అన్నాడు అర్జునుడు రుక్మితో.*


*ఆ మాటలు రుక్మికి కోపం తెప్పించాయి. వెంటనే తన సైన్యాన్ని తీసుకుని సుయోధన సార్వభౌముడి దగ్గరకు వెళ్ళాడు.*

*"రాబోయే కుఱుపాండవ యుద్ధంలో నేను మీ పక్షం ఉంటాను, మీ విజయానికి నేను తోడ్పడతాను. పాండవుల పొగరు అణుద్దాం. నా చాపంతో వాళ్ళందర్నీ స్వర్గం చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను" అన్నాడు.* 


*అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతను కూడా రుక్మి సహాయం అక్కర్లేదని మంచిగా చెప్పాడు.*’


*రుక్మి సిగ్గుపడ్డాడు.*


*దుర్యోధనుడు కూడా తిరస్కరించాక వచ్చినదారినే తన నగరానికి తిరిగి వెళ్ళాడు.*

*తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్నీ, శక్తినీ తక్కువగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు.*

*రుక్మికి ఈ అలవాటు మొదటినుంచీ ఉంది. అందుకే అనేకసార్లు పరాభవాలు పొందాడు.*✍️


.                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మధుమేహ వ్యాధి వచ్చాక తీసుకోవాలిసిన జాగ్రత్త తగ్గించే ఆయుర్వేద ఔషదాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

       ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం, మధుమేహం కఫా రకానికి చెందిన రుగ్మతగా పేర్కొంటారు, 

*👉🏿ఆహార నియమాలలో మార్పులుఆయుర్వేద వైద్యశాస్త్రంలో, మధుమేహానికి చికిత్స* చేయుటకు గానూ, మొదటగా ఆహార నియమాలలో మార్పులను చేయాలి. వీటిలో చక్కెరలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాలు ప్రమదానికి గురయ్యే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు పదార్థాలు జీర్ణం అవటం కష్టం, కావున వీటిని కూడా తక్కువ స్థాయిలో తీసుకోవాలి. వీటికి బదులుగా *నారింజపండ్లు, నిమ్మరసం, చేదుగా ఉండే పండ్లు మరియు ఔషదాలను తీసుకోవటం వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.*

*👉🏿పంచకర్మ*

చాలా మంది మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ శరీరంలో ఉన్న ప్లీహ కణాలను నాశనం చేసే యాంటీ బాడీలను కలిగి ఉన్నారు. ఇలాంటి సమయంలో పంచకర్మను వాడటం వలన ఈ యాంటీబాడీలు శరీరం నుండి తొలగించబడతాయి. వీటిలో హెర్బల్ మసాజ్, హెర్బల్ స్టీమ్ మరియు శరీరాన్ని శుభ్రపరచే ఉపవాసం వంటివి కూడా ఉంటాయి. పైన తెలిపిన పద్దతుల ద్వారా కాలేయ కణాలను, ప్లీహ కణాలను, క్లోమ కణాలను శుభ్రపరుస్తాయి. కోలన్ థెరపీ ద్వారా పూర్తి జీర్ణవ్యవస్థ శుభ్రపరచపడుతుంది.

*👉🏿వ్యాయామాలు మరియు యోగా ప్రతి రోజులు చేయండి 3నెలలు లో అదుపులో ఉంటది*


భౌతిక వ్యాయామాలు, శ్వాస వ్యాయామాలు, యోగా వంటి వాటిని మధుమేహాన్ని తగ్గించటానికి గానూ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చికిత్సలుగా వాడతారు.


*👉🏿ఔషదాలు*

*వివిధ రకాల మూలికలు మరియు ఔషదాలు మధుమేహ వ్యాధిని తగ్గించటానికి వాడతారు. వీటిని కూడా ఆయుర్వేద వైద్యనిపుణుల సమక్షంలో మాత్రమే తీసుకోవాలి*. 1.-శీలజిత్, 

2.-గుడ్మార్ పసుపు, 

3.-వేప, అమాలాకి, గుగ్గుల్, మరియు 

4.-అర్జునలను, 

     మధుమేహం చికిత్స కోసం వాడే అత్యంత ముఖ్యమైన మూలికలుగా చెప్పవచ్చు. మధుమేహ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నపుడు, పసుపు మరియు కలబంద రసాన్ని వాడటం వలన శక్తివంతంగా తగ్గించవచ్చు మరియు ఈ రెండింటి మిళితం, క్లోమ గ్రంధి మరియు కాలేయ విధులను సరియగు విధంగా నిర్వహించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.


5.-కసినియా ఇండికా, 

6.-పవిత్ర తులసి, మెంతులు, మరియు 

7.-జిమ్నెమా సిల్వెస్ట్రె మరియు మూలికా సూత్రాలు అయినట్టి, ఆయుష్-82 మరియు D-400 వంటి మూలికలు గ్లూకోజ్ తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయని పరిశోధనలలో వెల్లడించబడింది.


https://fb.watch/9HmejHJJDS/


*👉🏿మధుమేహాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషదాలు*


ఇక్కడ తెలిపిన మూలికలు మరియు ఇంట్లో ఉండే ఔషదాలు మధుమేహాన్ని మరియు డయాబెటిస్ మిల్లిటస్ వంటి వ్యాధులను శక్తివంతంగా తగ్గిస్తాయి.


1.-కాకరకాయ లేదా లేదా చేదు రుచి ఉన్న నిమ్మకాయ రసాన్ని రోజు ఉదయాన ఖాళీ కడుపుతో తీసుకోవాలి.


2.-పసుపు కాప్సిల్స్: రెండు కాప్సిల్ లను ప్రతి రోజు 3 పూటలు వాడాలి.


3.-రోజు ఆపిల్ లను రెండు సార్లు తినాలి.


4.-మెంతులు, ముస్తా, అర్జున, ట్రిఫాల, అజ్వన్ , నెయ్యి లో కలిపిన హరితాకి లను రోజు తీసుకోవాలి.


5.-అమ్లాకి పొడి, హల్ది పొడి మరియు తేనె కలిపిన మిశ్రమాలను రోజు రెండు సార్లు తీసుకోవాలి.


ఈ ఔషదాలు, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మరియు ఇతర అల్లోపతి మందులు మాత్రం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

*👉🏿అటికమామిడి  అంబలిమాడు కూర* - ఆకు పూవురంగును అనుసరించి తెలుపు ఎరుపు నలుపు మూడురకాలు


గలిజేరు -  ఇదికూడా   ఆకు పూవురంగును అనుసరించి తెలుపు ఎరుపు నలుపు మూడురకాలు. దీనిని సంస్కృతంలో పునర్నవ (పునర్జీవితున్ని చేస్తుందని) అని పిలుస్తారు. దీనిని ఆయుర్వేదం బాధా నివారిణిగా ఉపయోగిస్తారు. దీని ఆకులు భారతదేశం అంతా ఆకుకూరగా ఉపయోగంలో ఉన్నవి. ఇవి కంటిచూపును బాగుచేస్తుంది, మరియు మధుమేహం వ్యాధిగ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. మూత్రపిండాల పనితీరు బాగుచేస్తుంది. లివర్ వ్యాధులను బాగుచేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో తెల్లని పూలు గలది మంచిది.


అటకమామిడి గలిజేరు ఒకేరకంగా ఉన్నా ఒకటికాదు. పరిశీలనగా చూడండి. కానీ పనర్నవకన్నా కొద్దిగా తక్కువగా పనిచేస్తుంది.


*👉🏿నాకు తెలిసిన జాగ్రత్త మీ కోసం*

ఆయుర్వేదాల ఔషదాలు, మధుమేహ వ్యాధిని ఇవి శక్తివంతంగా తగ్గిస్తాయి, కానీ, నిపుణుల సలహా లేకుండా వీటిని తీసుకోవటం వలన ఇతర ఆరోగ్య సమస్యలను కలుగచేస్తాయి. ఒకవేళ మధుమేహాన్ని తగ్గించటానికి గానూ, అల్లోపతి మందులను కూడా వాడితే, ఆయుర్వేదాలను వాడే ముందు మీ అల్లోపతి వైద్యుడిని కలిసి అతడి సలహాలను తీసుకోండి. కొన్ని రకాల అల్లోపతి మందులు, శరీరంలో ఆయుర్వేద ఔషదాలతో, ఆహార పదార్థాలతో మరియు ఆహార ఉపభాగాలతో చర్యలను కొనసాగించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కావున వీటిని వాడటానికి ముందు మీ వైద్యుడిని, సలహా మేరకు మెడిసన్ తీసుకోవాలి 

*ధన్యవాదములు 🙏*

*మీ నవీన్ నడిమింటి*  


*తాళ్ళపాక అన్నమాచార్యలు🙏*


*తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పద కవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలములోని నరసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.*


*కన్నడ వాగ్గేయకారుడు* *పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.*


*చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి. జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు,ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.*


*అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలనుపొందుపరచాడు. ఈ గ్రంథం1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.*


*నందవరీకుల గాధ*


*నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం"అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక , గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత  చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.*


*అన్నమయ్య వంశీకులు*


*భరద్వజ గోత్రులైన అన్నమయ్య పూర్వుల ప్రస్తావన నాలుగు తరాలకు సంబంధించిన వివరాలను చిన్నన్న అన్నమాచార్య ద్విపద వల్లను, అష్టమహిషి కల్యాణం వల్లను గ్రహించవచ్చును.*


భరద్వాజ ఋషి - నారాయణయ్య - విఠలయ్య - నారాయణయ్య - విఠలుడు - నారాయణుడు - నారాయణసూరి - అన్నమాచార్య


*అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య*


*కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామిల కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలజ్ఞులు. ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతి రోజూ పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామవాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్ధుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పితృ పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటూ జీవితం గడిపేవారు. ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.*


*నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ధ ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళు చేర్చికట్టి కూలద్రోయడం.*


*నారాయణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచేసినందుకు మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయణయ్య ఊటుకూరు  గ్రామశక్తి అయిన చింతలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయణుడు ఒంటరిగా గుడికి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరు నందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా, నారాయణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది. "ఎందుకుబాబూ ఈ అఘాయిత్యం? నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి? వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్థానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్ళపాక చేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి.*


*అన్నమయ్య తండ్రి - నారాయణసూరి*


*అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాదురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడపజిల్లా సిద్దపట్నం తాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.*


*అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం*


*భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం  కోసం చేయని వ్రతం లేదు , కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడ స్తంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.*


*అన్నమయ్య జననం*


*ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికి అందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.*


*లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నతదశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.*


*"అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి.*


*శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసం.*


*అన్నమయ్య బాల్యం*


*"హరి నందకాంశజుం డగుట డెందమున పరమ సుగ్యాన సంపద పొదలంగ."*


*అన్నమయ్య బోసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటిమాటికీ వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు.*


*అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు అన్నమయ్యకు.*


అహినాయకాద్రి

వెన్నుని వరముచే విద్య లన్నియును

నమితంబు లగుచు జిహ్వరంగసీమ

తము దామె సొచ్చి నర్తనమాడ దొడగె


*అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొదినది తన పదహారవ సంవత్సరంలోనే! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పష్టమవుతున్నది. అన్నమయ్య ఏక సంథాగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినవెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడేవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి "బుజ్జి కేశవా"అని పిలిచేవాడు.*


*బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు చిరునవ్వులు చిందించేవాడు.అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర పాడుతూంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడీ, తాళం వేసీ చూపేవాడు. "మీకేం తెలీదు పొ"మ్మని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో బాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో సంబరపడిపోయే వాళ్లు.*


*నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్థం లేనివి కావు. ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు. అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనే అన్నమయ్య ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరు కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. "ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీపాటా ఎవరు చూస్తారు?" అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. "గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్. "ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిగా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు.*


*అన్నమయ్యకు అడవికి వెళ్ళడం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంది.*


*’పాపవల్లరుల శ్రీపతినామహేతి నే పార దఋగు యోగీంద్రు చందమున ’*

*అంటూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్నా మనసంతా శ్రీహరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయబోతున్న అన్నమయ్య ఒక్కసారి "అమ్మా!!" అని కేక పెట్టాడు. చిటికినవేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి , భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. "అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పని లేదనుకున్నాడు.*


*"అయ్యోపోయ బ్రాయముగాలము మయ్యంచు మనసున నే మొహమతినెత్తి||*


*తగు బంధూలా తనకు దల్లులును దండ్రులును వగలబెట్టుచు దిరుగువారేకాక మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ దగిలించలేక చింతాపరుడనైతి ||*


*అని చింతించి.*


*"తల్లియుదండ్రియు దైవంబు గురువు నెల్ల సంపదలునై యెల్ల చందముల ననుబ్రోచు శెశాద్రినాధుని, గొలిచి మనియెద." అని నిర్ణయించుకొంటాడు.*


*తిరుమల పయనం*


*అదే సమయాన తిరుమల వెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలొ వున్న కొడవలిని విసిరేసాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరోకారు , సనకాదులనే భక్తబృందం. వాళ్ల వేశం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖ చక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెల మ్రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో "గోవిందా! గోవింద!"*


*"వేడ్కుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని||*

*ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు*

*తోమని పళ్యలవాడే దురితదూరుడే ||" అంటూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య.*


*తిరుపతి పొలిమేరలోకల గ్రామసక్తి తాళ్ళపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కాళెమ్మ, నేరెళ్ళమ్మ, కావమ్మ, మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వం తిరుపతికి  వచ్చే భక్తబృందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్సించే ఆచారం వుండేది. నేటికి తిరుపతిలో మే నెలలో గ్రామసఖ్తి గంగమ్మజాతర వైభవోపేతంగా జరుగుతుంది.*


*గంగమ్మని దర్సించిన అనంతరం అన్నమయ్య "అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము లందు వెలుగొంది ప్రభమీరగాను "అని తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంత్రుల మఠాలు, తపస్వుల గృహాలు, విశ్రాంత దేశాలను సందర్శిస్తాడు. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అళిపురిసింగరి, తలయేరుగుండు, పెద్దయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శిస్తాడు*.


*ఇక్కడ అళిపురిసింగరి, తలయేరుగుండు, కురువమండపం, పెద్దయెక్కుడు, కపురంపు కాలువ,మోకాళ్ళ ముడుపులను గూర్చి వివరించడం సమంజసం.*


*అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.*


*తిరుమల దర్శనం*


*ఒకనాడు (8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి , పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి  అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహస్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం  విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణ మంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతోఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు.*


*తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.*


*అన్నమయ్య చిత్రపటం తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడపసాగాడు.*


*అళిపురిసింగరి(అలిపిరి)*


*కొండ ఎక్కుటలో తొలిమెట్టుగల ప్రాంతం అళిపురి. అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు. అలిపిరి చేరాడు, అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం.*


*సంసారం, సంకీర్తనం*


*అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క , అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.*


*అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు  బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నందలూరు  సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప  వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపము నర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.*


*రాజాశ్రయం*


*విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణ దేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.*


*అంత్య కాలం* 


*రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు"అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోప తండాలుగా రాసాగారు.*


*ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే"అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే"అన్నాడట.*


*95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503 ఫిబ్రవరి 23) పరమపదించాడు. రాగి రేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ , మరణ దినాలు తెలుస్తున్నాయి.*


*ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద్ద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.*

విజ్ఞాన పెన్నిధులు




             *విజ్ఞాన పెన్నిధులు*

                  ➖➖➖✍️



*భారతీయ సనాతన సంప్రదాయానికి మూలాధారాలు- చతుర్వేదాలు. విజ్ఞాన పెన్నిధులుగా ఆర్ష ధర్మానికి ఆలంబనగా నిలిచే సమున్నత ప్రతీకలుగా వేదాలు విలసిల్లుతున్నాయి. అఖిల సృష్టిలోని జ్ఞానమంతా వేదాల్లో ప్రకటితమవుతుంది. సాధారణ పరిభాషలో ‘వేదం’ అంటే జ్ఞానం. మనసులో అలముకున్న అజ్ఞానాంధకారాన్ని పారదోలే అనంత జ్ఞాన కాంతిపుంజాలు వేదనిధులు. సృష్ట్యాదిలో సర్వశ్రేష్ఠులైన ఋషులకు భగవత్‌ చైతన్యం ద్వారా వేదవిద్య అందింది. తరవాత ఆ ఋషి పుంగవులు వేదాన్ని గానం చేస్తున్న సందర్భంలో బ్రహ్మరుషి విన్నాడంటారు. ఆ బ్రహ్మరుషి బృహస్పతికి,  బృహస్పతి ఇంద్రరుషికి, ఇంద్రరుషి భరద్వాజుడికి వేద విజ్ఞానాన్ని పంచారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలనే నాలుగు   ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన సారస్వతామృతంగా తేజరిల్లుతున్నాయి.*


*గురుశిష్యుల పఠన, పాఠన విధితోనే వేద పరంపర కొనసాగుతోంది. యుగయుగాలుగా మహర్షుల చింతన, మనన, పరిశీలన, పరిశోధన, అధ్యయనాలతో వేద విజ్ఞానం మరింతగా వెలుగు పుంజాల్ని విరజిమ్మింది. ‘విద్‌’ అంటే తెలుసుకోవడం. మహర్షులు, ఋషులు మంత్రద్రష్టలుగా వేదమంత్రాల్లోని నిగూఢ రహస్యాల్ని తెలుసుకుని, వాటి గురించి మననం చేసి, పరిశీలనాత్మక దృక్పథంతో అనుభవంలోకి ఆపాదించుకుని, ఆ జ్ఞానభాండాల్ని విశ్వానికి అమూల్యమైన కానుకలుగా అందించారు.


*ఋగ్వేదమంత్రాల్ని రుచ సముచ్ఛయంగా పేర్కొంటారు. నాలుగు పంక్తుల శ్లోకాలుగా ఉండే ఈ మంత్రాలన్నీ దేవతా స్తుతులుగా, యజ్ఞ నిర్వహణకు ఉపకరిస్తాయి. వైదిక దేవతల ప్రార్థనా పూర్వక మంత్రాల సమ్మిళితంగా ఋగ్వేదం ప్రతిఫలిస్తుంది.* 


*యజుర్వేదం గద్యరూపాత్మకమైనది. ‘యజుష్‌’ అంటే పూజ.   ప్రక్రియా పూర్వకమైన విధి విధానాలైన పూజ, ఆరాధనల మంత్రాలు యజుర్వేదంలో నిక్షిప్తమై ఉన్నాయి.* 


*వివిధ యజ్ఞాల ప్రాముఖ్యాన్ని ఆవిష్కరిస్తూ, వాటి ఆచరణ రీతుల్ని విహిత కర్మకాండల సంవిధానాల్ని యజుర్వేదం వివరిస్తుంది.*


*దేవతల్ని ఆనందపరచడానికి యజ్ఞయాగాదుల్లో, ఆరాధనా క్రతువుల్లో గానం చేసే మంత్రాల శ్రేణి- సామవేదం. స్వర, తాళయుక్తంగా ఆలపించడానికి ఆమోదయోగ్యంగా సామవేద మంత్రాలు దోహదమవుతాయి.* 


*బ్రహ్మవేదంగా పేరుపొందిన నాలుగో వేదం- అధర్వణం. తంత్రం, యంత్రం, మంత్రాల సమ్మేళనమై అధర్వణ వేదం భాసిల్లుతుంది. ఆధ్యాత్మిక చింతనాపరమైన, భగవదనుగ్రహాన్ని పొందడానికి సంబంధించిన మంత్రాలన్నీ ఈ వేదంలో నెలకొని ఉంటాయి. ‘బ్రాహ్మణి’గా వ్యవహరించే ఈ వేదానికి బ్రహ్మవిద్య అనే పేరు ఉంది.*


*చతుర్వేదాలు కేవలం పారమార్థిక విషయాల్ని మాత్రమే కాక జన బాహుళ్యానికి ఉపకరించే ఎన్నో అంశాల్ని ప్రతిబింబిస్తాయి. రాజనీతి, ఆచార వ్యవహారాలు, ఔషధాల విజ్ఞానం, గణిత, భౌతిక, రసాయనిక సూత్రాలు, ప్రజాతంత్రం, రాజ్యరక్షణ, శాసన విధానం, సంస్థల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం, వ్యవసాయం, భూగోళ, ఖగోళ విజ్ఞానాంశాలు- ఇలా వేదాలు విజ్ఞాన పెన్నిధులై పరిఢవిల్లుతున్నాయి.*


*వేదమంత్రాలన్నీ లోక కల్యాణాన్ని కాంక్షిస్తాయి. విశ్వశ్రేయస్సును కోరుకుంటాయి. అందుకే వేదాల్ని ‘విశ్వసాహిత్యం’గా వివేకానందుడు వర్ణించారు. ‘పరమపద సోపానాన్ని అధిరోహించడానికి వేద విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. వేదం జీవన నాదమై రవళిస్తుంది. ఆ నాదంతో జీవన గమనాన్ని అనుసంధానం చేసుకుంటూ మానవులు నిత్య జాగృతులు కావాలి’ అనే జగద్గురువు ఆదిశంకరుల సందేశం అనుసరణీయం.*✍️

          - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం... గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...9493906277

లింక్ పంపుతాము.🙏

ఆచార్య సద్బోధన:*

 


                *ఆచార్య సద్బోధన:*

                    ➖➖➖✍️


*మన ఆలోచనలు, ఆచరణ రెండూ సవ్యంగా ఉండాలి. వీటి యందు వక్రత ఉండరాదు.*


*శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు. అదుపు తప్పిన మనస్సు కలవారి ఇంద్రియాలు విషయాల వైపుకి పరుగుతీస్తాయి. కానీ విచక్షణతో, వివేకంతో మనస్సుని అదుపులో ఉంచినప్పుడు ఇంద్రియాలు క్రమ శిక్షణ గల గుర్రాలవలె మెలగుతూ అంతర్ముఖుని చేస్తాయి.*


*మనస్సు నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు అలజడి కలిగించేవాటిని, అవాంఛితాలని కోరుతుంది. అది సహజ స్థితి ఎంత మాత్రమూ కాదు.*


*సహజ స్థితి కాదని ఎందుకు చెబుతున్నామంటే దాని వలన కలిగే పరిణామాలు జీవుడిని బాధిస్తాయి. తనకు తాను నాశనం తెచ్చుకోకుండా ఇతరులకు హాని ఎవరూ చేయలేరు.*


*పగ, కోపం, అసూయలు మనస్సులో మొదలైతే దాని వలన ఆ వ్యక్తికి అంతర్గత హాని జరిగాకే, అవి ఇతరులను బాధిస్తాయి.*


*అందుచేత ఎప్పుడూ సద్భావనలను కలిగి ఉండాలి. అప్పుడు స్వీయహాని జరుగదు.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మహోన్నతమైనది

 *ॐశ్రీవేంకటేశాయ నమః*

💝 *జీవితాలను మనం ఎలా గడపాలి?*

💖 *~ఒక అద్భుతమైన సమాధానం - ‘‘మీరింక ఒక్క గంట మాత్రమే బతుకుతారని తెలిస్తే ఏం చేస్తారో ఆ స్థితిలో జీవించాలి’’ అని చెప్పారు.*

💓 *”మరో గంటలో మరణిస్తా” అని తెలియగానే బాహ్యమైన వ్యవహారాలు వెంటనే చక్కబెడతారు. వీలునామా రాయడం, కుటుంబ సభ్యుల్నీ, మిత్రుల్నీ పిలిచి వాళ్ళకేదయినా నష్టం కలిగించి ఉంటే క్షమించాలని అడగడం, వాళ్ళు హాని చేసి ఉంటే వాళ్ళను క్షమించడంతో పాటు మనసుకు సంబంధించిన కోరికలనూ, ప్రపంచాన్ని వదిలేస్తారు.*

💞 *ఒకేఒక్క గంట కోసం ఇదంతా చేయగలిగినప్పుడు.. "మీరు ఉన్నంతకాలం ఎందుకు ఆ పని చేయలేరూ?” అని. మహోన్నతమైనది కదా ఈ ఆలోచన?.*

💕 *శ్రీరామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి అయినా, శ్రీరమణ మహర్షి పొందిన ‘సహజస్థితి’ అయినా ఈ చట్రం లోనివే కదా.*

❤️ *నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః*

*శరీరం కేవలం కర్మ కుర్వనాప్నోతి కిల్బిషమ్‌.*

💕 *~”అంతఃకరణాన్నీ, ఇంద్రియాలనూ జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని వదిలిపెట్టినవాడూ ఆశారహితుడైన సాంఖ్యయోగి.. శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవిస్తాడు” అని  శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు.*

💖 *మన భారతీయ పౌరాణిక, ఇతిహాస గాథల్లో భోగాలను తృణప్రాయంగా త్యజించిన చక్రవర్తులు కన్పిస్తారు. రుషభుడు కేవలానందావస్థలో సర్వం త్యజించి వెళ్ళిపోయాడు. అలాగే ఎందరో మహారాజులు అధికారాలనూ, భోగాలనూ అన్నింటినీ కాలితో తన్నేసి అంతర్ముఖులై జ్ఞానులయ్యారు.*

💓 *శ్రీరమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస వంటి వాళ్ళు అతి ప్రమాదకరమైన క్యాన్సర్ రోగాన్ని కూడా లక్ష్యపెట్టకుండా అదే స్థితిలో జీవించారు. ఇంకొందరు సిద్ధ పురుషులు వాళ్ళకున్న యోగత్వాన్ని కూడా గమనించలేదు. అదొక కర్మబంధ విముక్తి. అయితే ఇక అందరూ సన్యాసం పుచ్చుకోవాల్సిందేనా*

*~అని ఎవరన్నారూ…?*

💖 *పలువురి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదకారి ఔతున్న “మనం-మన ఆధ్యాత్మికత” పేర ఉన్న సత్సంగంలో చేరాలనే జిజ్ఞాస గల వారు మెసేజ్ పెట్టండి 9966870447 కి. 💝ఈ సందేశాన్ని అన్ని గ్రూపులకూ ఫార్వార్డ్ చేయండి.*

*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి.*

💖 *నిత్యజీవనంలో ఆ స్థితిని పొంది దానిలో నిలిచి ఉండడం. అపుడు ఏమీ మనల్ని అంటుకోవు. ముక్త జీవనమంటారు దానినే.*

💞 *ఎవరైతే ప్రకృతి స్వభావంలో ఇరుక్కుని అహంకారం అనే పాశంలో బందీలు అవుతారో వారు ఎప్పుడూ అన్ని రకాల ఆధిపత్యాల కోసం జీవిస్తూ ఉంటారు.*

💓 *సర్వ భూతాంతర్గతమైన ఈశ్వర దర్శనాన్ని పొందినవారికి అన్ని జీవుల్లో ‘ఆత్మదర్శనం’ కలుగుతుంది. ఆ స్థితిని నిలకడగా నిలబెట్టుకోవడాన్నే యోగమంటాం.*

💞 *~ ఏ వయసులో, ఏ పరిస్థితుల్లో మనకు ఆ దర్శనం కలిగినా అది ధారాపాతంగా కొనసాగుతూనే ఉంటుంది.*

💖 *చమత్కారంలా కన్పించే ఈ పరమోన్నత స్థితిని చాలా మంది మరణం తర్వాత ఆశిస్తుంటారు. కానీ, దేహం ఉండగానే ముక్తిని కలిగించే ఆ స్థితి మహోన్నతమైనది.*

💕 *దాన్ని తెలుసుకుంటే చాలు “జీవితం ఎలా గడపాలి?” అనే ప్రశ్నకు సరైన సమాధానం లభిస్తుంది.*

❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*

*~

విషం.

 .

          _*సుభాషితమ్*_



శ్లో𝕝𝕝 విషం కుపఠితా విద్యా

విషం వ్యాధిరనౌషధమ్।

విషం వ్యాధిర్ద్రరిద్రస్య 

వృద్ధస్య తరుణీ విషమ్॥


తా𝕝𝕝 "సరిగా నేర్చుకొనని విద్య విషం..

ఔషధం లేని వ్యాధి విషం..

దరిద్రుడికి వ్యాధి విషం..

వృద్ధుడికి యువతి విషం."...

అందమైన సూచనలు

 తెలంగాణ లోని కోదాడ లో ఒక వివాహ బంధాన్ని ఖాయపరుచుకునే సమయంలో వరుడి డిమాండ్‌పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది.


పెళ్లికి ముందు అబ్బాయి చేసే ఈ ప్రత్యేకమైన డిమాండ్‌ల సంగతి తెలుసుకొని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు.


పెళ్లి కుమారుని డిమాండ్ల విషయమై చర్చనీయాంశంగా మారింది.


ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కావు, కానీ వివాహాన్ని జరిపే విధానం మరియు సంప్రదాయాల గురించి కావడం విశేషం..!!


*డిమాండ్లు ఇలా ఉన్నాయి*


1)ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు.


2)పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరిస్తుంది.


3)అసభ్యకరమైన చెవి-బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడుతుంది.


4)దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉంటారు.


5)వరమాల సమయంలో వధువు లేదా వరుడిని వేధించే వారు వివాహం నుండి బహిష్కరించబడతారు.


6)పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపలేరు.


7)కెమెరామేన్ దూరం నుండి ఛాయాచిత్రాలు తీస్తాడు. అవసరం మేరకు, ఎవరికీ అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని చిత్రాలు తీస్తాడు. పురోహితుడి ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు.


ఇది తమ సాక్ష్యంలో దేవుళ్ళను పిలిపించి జరిపే కళ్యాణం, సినిమా షూటింగ్ కాదు.


8)వధూవరుల ద్వారా కెమెరామేన్ ఆదేశానుసారం, నేరుగా రివర్స్‌లో పోజులు పెట్టి చిత్రాలు తీయబడవు.


9)పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి. తద్వారా మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి, అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.


ఇది కాకుండా, అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి.


10)తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని, కౌగిలించుకోవాలని అడిగితే, అట్టి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరిస్తారు.


అబ్బాయి డిమాండ్లన్నింటిని అమ్మాయిలు ఆనందంగా అంగీకరించిన సంగతి తెలిసిందే..!!


 *సమాజాన్ని బాగుచేసే అందమైన సూచనలు.! అందరికి ఆదర్శం..!!*


*🙏వివాహం అనేది ఒక పవిత్ర కార్యక్రమం.. దానిని గౌరవిద్దాం.. మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం🙏*

ఆచార్య సద్బోధన:*



                *ఆచార్య సద్బోధన:*

                    ➖➖➖✍️


*మన ఆలోచనలు, ఆచరణ రెండూ సవ్యంగా ఉండాలి. వీటి యందు వక్రత ఉండరాదు.*


*శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు. అదుపు తప్పిన మనస్సు కలవారి ఇంద్రియాలు విషయాల వైపుకి పరుగుతీస్తాయి. కానీ విచక్షణతో, వివేకంతో మనస్సుని అదుపులో ఉంచినప్పుడు ఇంద్రియాలు క్రమ శిక్షణ గల గుర్రాలవలె మెలగుతూ అంతర్ముఖుని చేస్తాయి.*


*మనస్సు నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు అలజడి కలిగించేవాటిని, అవాంఛితాలని కోరుతుంది. అది సహజ స్థితి ఎంత మాత్రమూ కాదు.*


*సహజ స్థితి కాదని ఎందుకు చెబుతున్నామంటే దాని వలన కలిగే పరిణామాలు జీవుడిని బాధిస్తాయి. తనకు తాను నాశనం తెచ్చుకోకుండా ఇతరులకు హాని ఎవరూ చేయలేరు.*


*పగ, కోపం, అసూయలు మనస్సులో మొదలైతే దాని వలన ఆ వ్యక్తికి అంతర్గత హాని జరిగాకే, అవి ఇతరులను బాధిస్తాయి.*


*అందుచేత ఎప్పుడూ సద్భావనలను కలిగి ఉండాలి. అప్పుడు స్వీయహాని జరుగదు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

[06/05, 2:55 am] +91 94939 06277: 120622A0528.  130622-7.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



             *విజ్ఞాన పెన్నిధులు*

                  ➖➖➖✍️



*భారతీయ సనాతన సంప్రదాయానికి మూలాధారాలు- చతుర్వేదాలు. విజ్ఞాన పెన్నిధులుగా ఆర్ష ధర్మానికి ఆలంబనగా నిలిచే సమున్నత ప్రతీకలుగా వేదాలు విలసిల్లుతున్నాయి. అఖిల సృష్టిలోని జ్ఞానమంతా వేదాల్లో ప్రకటితమవుతుంది. సాధారణ పరిభాషలో ‘వేదం’ అంటే జ్ఞానం. మనసులో అలముకున్న అజ్ఞానాంధకారాన్ని పారదోలే అనంత జ్ఞాన కాంతిపుంజాలు వేదనిధులు. సృష్ట్యాదిలో సర్వశ్రేష్ఠులైన ఋషులకు భగవత్‌ చైతన్యం ద్వారా వేదవిద్య అందింది. తరవాత ఆ ఋషి పుంగవులు వేదాన్ని గానం చేస్తున్న సందర్భంలో బ్రహ్మరుషి విన్నాడంటారు. ఆ బ్రహ్మరుషి బృహస్పతికి,  బృహస్పతి ఇంద్రరుషికి, ఇంద్రరుషి భరద్వాజుడికి వేద విజ్ఞానాన్ని పంచారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలనే నాలుగు   ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన సారస్వతామృతంగా తేజరిల్లుతున్నాయి.*


*గురుశిష్యుల పఠన, పాఠన విధితోనే వేద పరంపర కొనసాగుతోంది. యుగయుగాలుగా మహర్షుల చింతన, మనన, పరిశీలన, పరిశోధన, అధ్యయనాలతో వేద విజ్ఞానం మరింతగా వెలుగు పుంజాల్ని విరజిమ్మింది. ‘విద్‌’ అంటే తెలుసుకోవడం. మహర్షులు, ఋషులు మంత్రద్రష్టలుగా వేదమంత్రాల్లోని నిగూఢ రహస్యాల్ని తెలుసుకుని, వాటి గురించి మననం చేసి, పరిశీలనాత్మక దృక్పథంతో అనుభవంలోకి ఆపాదించుకుని, ఆ జ్ఞానభాండాల్ని విశ్వానికి అమూల్యమైన కానుకలుగా అందించారు.


*ఋగ్వేదమంత్రాల్ని రుచ సముచ్ఛయంగా పేర్కొంటారు. నాలుగు పంక్తుల శ్లోకాలుగా ఉండే ఈ మంత్రాలన్నీ దేవతా స్తుతులుగా, యజ్ఞ నిర్వహణకు ఉపకరిస్తాయి. వైదిక దేవతల ప్రార్థనా పూర్వక మంత్రాల సమ్మిళితంగా ఋగ్వేదం ప్రతిఫలిస్తుంది.* 


*యజుర్వేదం గద్యరూపాత్మకమైనది. ‘యజుష్‌’ అంటే పూజ.   ప్రక్రియా పూర్వకమైన విధి విధానాలైన పూజ, ఆరాధనల మంత్రాలు యజుర్వేదంలో నిక్షిప్తమై ఉన్నాయి.* 


*వివిధ యజ్ఞాల ప్రాముఖ్యాన్ని ఆవిష్కరిస్తూ, వాటి ఆచరణ రీతుల్ని విహిత కర్మకాండల సంవిధానాల్ని యజుర్వేదం వివరిస్తుంది.*


*దేవతల్ని ఆనందపరచడానికి యజ్ఞయాగాదుల్లో, ఆరాధనా క్రతువుల్లో గానం చేసే మంత్రాల శ్రేణి- సామవేదం. స్వర, తాళయుక్తంగా ఆలపించడానికి ఆమోదయోగ్యంగా సామవేద మంత్రాలు దోహదమవుతాయి.* 


*బ్రహ్మవేదంగా పేరుపొందిన నాలుగో వేదం- అధర్వణం. తంత్రం, యంత్రం, మంత్రాల సమ్మేళనమై అధర్వణ వేదం భాసిల్లుతుంది. ఆధ్యాత్మిక చింతనాపరమైన, భగవదనుగ్రహాన్ని పొందడానికి సంబంధించిన మంత్రాలన్నీ ఈ వేదంలో నెలకొని ఉంటాయి. ‘బ్రాహ్మణి’గా వ్యవహరించే ఈ వేదానికి బ్రహ్మవిద్య అనే పేరు ఉంది.*


*చతుర్వేదాలు కేవలం పారమార్థిక విషయాల్ని మాత్రమే కాక జన బాహుళ్యానికి ఉపకరించే ఎన్నో అంశాల్ని ప్రతిబింబిస్తాయి. రాజనీతి, ఆచార వ్యవహారాలు, ఔషధాల విజ్ఞానం, గణిత, భౌతిక, రసాయనిక సూత్రాలు, ప్రజాతంత్రం, రాజ్యరక్షణ, శాసన విధానం, సంస్థల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం, వ్యవసాయం, భూగోళ, ఖగోళ విజ్ఞానాంశాలు- ఇలా వేదాలు విజ్ఞాన పెన్నిధులై పరిఢవిల్లుతున్నాయి.*


*వేదమంత్రాలన్నీ లోక కల్యాణాన్ని కాంక్షిస్తాయి. విశ్వశ్రేయస్సును కోరుకుంటాయి. అందుకే వేదాల్ని ‘విశ్వసాహిత్యం’గా వివేకానందుడు వర్ణించారు. ‘పరమపద సోపానాన్ని అధిరోహించడానికి వేద విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. వేదం జీవన నాదమై రవళిస్తుంది. ఆ నాదంతో జీవన గమనాన్ని అనుసంధానం చేసుకుంటూ మానవులు నిత్య జాగృతులు కావాలి’ అనే జగద్గురువు ఆదిశంకరుల సందేశం అనుసరణీయం.*✍️

          - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం... గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...9493906277

లింక్ పంపుతాము.🙏

[06/05, 2:55 am] +91 94939 06277: *మధుమేహ వ్యాధి వచ్చాక తీసుకోవాలిసిన జాగ్రత్త తగ్గించే ఆయుర్వేద ఔషదాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

       ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం, మధుమేహం కఫా రకానికి చెందిన రుగ్మతగా పేర్కొంటారు, 

*👉🏿ఆహార నియమాలలో మార్పులుఆయుర్వేద వైద్యశాస్త్రంలో, మధుమేహానికి చికిత్స* చేయుటకు గానూ, మొదటగా ఆహార నియమాలలో మార్పులను చేయాలి. వీటిలో చక్కెరలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాలు ప్రమదానికి గురయ్యే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు పదార్థాలు జీర్ణం అవటం కష్టం, కావున వీటిని కూడా తక్కువ స్థాయిలో తీసుకోవాలి. వీటికి బదులుగా *నారింజపండ్లు, నిమ్మరసం, చేదుగా ఉండే పండ్లు మరియు ఔషదాలను తీసుకోవటం వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.*

*👉🏿పంచకర్మ*

చాలా మంది మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ శరీరంలో ఉన్న ప్లీహ కణాలను నాశనం చేసే యాంటీ బాడీలను కలిగి ఉన్నారు. ఇలాంటి సమయంలో పంచకర్మను వాడటం వలన ఈ యాంటీబాడీలు శరీరం నుండి తొలగించబడతాయి. వీటిలో హెర్బల్ మసాజ్, హెర్బల్ స్టీమ్ మరియు శరీరాన్ని శుభ్రపరచే ఉపవాసం వంటివి కూడా ఉంటాయి. పైన తెలిపిన పద్దతుల ద్వారా కాలేయ కణాలను, ప్లీహ కణాలను, క్లోమ కణాలను శుభ్రపరుస్తాయి. కోలన్ థెరపీ ద్వారా పూర్తి జీర్ణవ్యవస్థ శుభ్రపరచపడుతుంది.

*👉🏿వ్యాయామాలు మరియు యోగా ప్రతి రోజులు చేయండి 3నెలలు లో అదుపులో ఉంటది*


భౌతిక వ్యాయామాలు, శ్వాస వ్యాయామాలు, యోగా వంటి వాటిని మధుమేహాన్ని తగ్గించటానికి గానూ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చికిత్సలుగా వాడతారు.


*👉🏿ఔషదాలు*

*వివిధ రకాల మూలికలు మరియు ఔషదాలు మధుమేహ వ్యాధిని తగ్గించటానికి వాడతారు. వీటిని కూడా ఆయుర్వేద వైద్యనిపుణుల సమక్షంలో మాత్రమే తీసుకోవాలి*. 1.-శీలజిత్, 

2.-గుడ్మార్ పసుపు, 

3.-వేప, అమాలాకి, గుగ్గుల్, మరియు 

4.-అర్జునలను, 

     మధుమేహం చికిత్స కోసం వాడే అత్యంత ముఖ్యమైన మూలికలుగా చెప్పవచ్చు. మధుమేహ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నపుడు, పసుపు మరియు కలబంద రసాన్ని వాడటం వలన శక్తివంతంగా తగ్గించవచ్చు మరియు ఈ రెండింటి మిళితం, క్లోమ గ్రంధి మరియు కాలేయ విధులను సరియగు విధంగా నిర్వహించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.


5.-కసినియా ఇండికా, 

6.-పవిత్ర తులసి, మెంతులు, మరియు 

7.-జిమ్నెమా సిల్వెస్ట్రె మరియు మూలికా సూత్రాలు అయినట్టి, ఆయుష్-82 మరియు D-400 వంటి మూలికలు గ్లూకోజ్ తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయని పరిశోధనలలో వెల్లడించబడింది.


https://fb.watch/9HmejHJJDS/


*👉🏿మధుమేహాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషదాలు*


ఇక్కడ తెలిపిన మూలికలు మరియు ఇంట్లో ఉండే ఔషదాలు మధుమేహాన్ని మరియు డయాబెటిస్ మిల్లిటస్ వంటి వ్యాధులను శక్తివంతంగా తగ్గిస్తాయి.


1.-కాకరకాయ లేదా లేదా చేదు రుచి ఉన్న నిమ్మకాయ రసాన్ని రోజు ఉదయాన ఖాళీ కడుపుతో తీసుకోవాలి.


2.-పసుపు కాప్సిల్స్: రెండు కాప్సిల్ లను ప్రతి రోజు 3 పూటలు వాడాలి.


3.-రోజు ఆపిల్ లను రెండు సార్లు తినాలి.


4.-మెంతులు, ముస్తా, అర్జున, ట్రిఫాల, అజ్వన్ , నెయ్యి లో కలిపిన హరితాకి లను రోజు తీసుకోవాలి.


5.-అమ్లాకి పొడి, హల్ది పొడి మరియు తేనె కలిపిన మిశ్రమాలను రోజు రెండు సార్లు తీసుకోవాలి.


ఈ ఔషదాలు, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మరియు ఇతర అల్లోపతి మందులు మాత్రం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

*👉🏿అటికమామిడి  అంబలిమాడు కూర* - ఆకు పూవురంగును అనుసరించి తెలుపు ఎరుపు నలుపు మూడురకాలు


గలిజేరు -  ఇదికూడా   ఆకు పూవురంగును అనుసరించి తెలుపు ఎరుపు నలుపు మూడురకాలు. దీనిని సంస్కృతంలో పునర్నవ (పునర్జీవితున్ని చేస్తుందని) అని పిలుస్తారు. దీనిని ఆయుర్వేదం బాధా నివారిణిగా ఉపయోగిస్తారు. దీని ఆకులు భారతదేశం అంతా ఆకుకూరగా ఉపయోగంలో ఉన్నవి. ఇవి కంటిచూపును బాగుచేస్తుంది, మరియు మధుమేహం వ్యాధిగ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. మూత్రపిండాల పనితీరు బాగుచేస్తుంది. లివర్ వ్యాధులను బాగుచేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో తెల్లని పూలు గలది మంచిది.


అటకమామిడి గలిజేరు ఒకేరకంగా ఉన్నా ఒకటికాదు. పరిశీలనగా చూడండి. కానీ పనర్నవకన్నా కొద్దిగా తక్కువగా పనిచేస్తుంది.


*👉🏿నాకు తెలిసిన జాగ్రత్త మీ కోసం*

ఆయుర్వేదాల ఔషదాలు, మధుమేహ వ్యాధిని ఇవి శక్తివంతంగా తగ్గిస్తాయి, కానీ, నిపుణుల సలహా లేకుండా వీటిని తీసుకోవటం వలన ఇతర ఆరోగ్య సమస్యలను కలుగచేస్తాయి. ఒకవేళ మధుమేహాన్ని తగ్గించటానికి గానూ, అల్లోపతి మందులను కూడా వాడితే, ఆయుర్వేదాలను వాడే ముందు మీ అల్లోపతి వైద్యుడిని కలిసి అతడి సలహాలను తీసుకోండి. కొన్ని రకాల అల్లోపతి మందులు, శరీరంలో ఆయుర్వేద ఔషదాలతో, ఆహార పదార్థాలతో మరియు ఆహార ఉపభాగాలతో చర్యలను కొనసాగించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కావున వీటిని వాడటానికి ముందు మీ వైద్యుడిని, సలహా మేరకు మెడిసన్ తీసుకోవాలి 

*ధన్యవాదములు 🙏*

*మీ నవీన్ నడిమింటి*  


https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

[06/05, 5:54 am] +91 76590 87625: *గురుకృపా మహత్యం*

 

       *సర్వమంత్రాల కంటే గురు వాక్యమే శక్తివంతమైన ప్రేరకం. గురువు పట్ల నిజమైన భక్తి కలిగిన వారికి సర్వ సత్యములూ తమంత తామే విదితమవుతాయి. ఎవరు గురుభక్తి కలిగి, నిష్ఠ కలిగి ఉంటారో అట్టి వారు ధన్యులవుతారు. వారి జన్మ సార్థకం అవుతుంది.*


*గురు ప్రసాదతః స్వాత్మనాత్మారామ నిరీక్షణాత్‌*

 

 *సమతాముక్తి మార్గేణ స్మాత్మజ్ఞానం ప్రవర్తతే.*


         *గురువు అనుగ్రహం లేనివాడు ఆత్మతత్వాన్ని ఎరుగలేడు. తనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను గురు ప్రసాదముచే నిరీక్షించు సమత్వపరునికే ఆత్మజ్ఞానము కలుగునని పరమ శివుడు ప్రబోధించాడు. చదువురాని శిష్యుడైన తోటకాచార్యులను, ఆదిశంకరులు తన సంకల్పశక్తిచేత విద్యావంతునిగా మార్చారు. గురువును దైవంగా భావించి గురుసేవ చేసినందువల్ల తోటకాచార్యులకు గురు అనుగహ్రం లభించింది.*


         *బోధనలు, శ్రవణం, ధ్యానాదుల కన్నా ఎక్కువగా గురువు అనుగ్రహం ఫలితాన్ని ఇస్తుందని భగవాన్‌ రమణ మహర్షి అన్నారు. తత్వజ్ఞాని అయిన గురువు యొక్క తన చూపుచే కొందరిని, తన తలంపుతో కొందరిని, తన స్పర్శచే కొందరిని ముక్తులను చేస్తారు గురువులు.*


         *భిషజే భవరోగిణామ్‌*


        *అనగా ఎవరిది పరిపక్వమైన మనసో, అపరిపక్వమైన మనసో అని తెలుసుకొను భవరోగ వైద్యుడు గురువు. కనుక అన్ని ధ్యానములకంటే గురు ధ్యానమే శ్రేష్ఠం. అన్ని పూజలకంటే శ్రీ గురుపాదపూజయే అధికఫలాన్ని ఇస్తుంది.*


      *శ్రీ గురుకృపయే ముక్తికి మూలం. శ్రీరాముడు కూడా గురువైన వశిష్ఠుని శ్రద్ధా భక్తితో, ఆత్మ విశ్వాసంతో సేవించిన ఫలితంగానే గురు వశిష్ఠుల వారు యోగ వాశిష్ఠాన్ని బోధించాడు.*


        *గురుతత్వం ఆత్మతత్వంగా విశ్వమంతా వ్యాపించి ఉంది. కనుక ఆత్మానుభవం సాధించాలంటే అనుభవజ్ఞుడైన గురువును ఆశ్రయించాలి. అలాంటి పరిపూర్ణమైన గురువు మాత్రమే శిష్యజీవునిలో, అతనికి తెలియకుండా, అంతరంగంలో వున్న ఆత్మతత్వాన్ని అతడికి ఎరుకపరచి, జ్ణానామృతాన్ని, జ్ఞానధనాన్ని అందించి, ఆత్మజ్యోతిని వెలిగించే వాడే అసలైన గురువు.*

 

*కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకమ్‌*

 

 *గురుర్విశ్వేశ్వరః సాక్షాత్‌ తారకం బ్రహ్మ నిశ్చయమ్‌.*


*గురువు నివసించు స్థానమే శిష్యులకు కాశీ క్షేత్రము. గురువు చరణోదకమే పవిత్ర గంగ. ఆయనే సాక్షాత్‌ విశ్వేశ్వరుడు. గురు మహాత్ముడు తన పాదం మోపి అడుగులిడిన ప్రాంతాలే శిష్యులకు పుణ్యక్షేత్రములు. ఆయన తాకిన వస్తువులే పరమ పవిత్రములు. గురుకృపా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారముతోనే శిష్యుల అజ్ఞానాంధకారం భగ్నమై, వారి మదిలో ప్రకాశవంతమైన అఖండ జ్ణానజ్యోతులు వెలుగొందుతాయి. అటువంటి గురువు లభించడం ఆ శిష్యుల పూర్వజన్మ సుకృతం పైన ఆధారపడి ఉంటుంది....


రమణుల ఉపదేశం మార్గదర్శనం


*రమణుల ఉపదేశం, మార్గదర్శనం ఓ విధంగా చెప్పాలంటే రహస్యమైనవి. అందరికీ అందుబాటులో ఉన్నట్లే కనబడతారు. అందరి మాటలు, ప్రశ్నలు, అభ్యర్థనలు, ప్రార్థనలు విన్నట్లే కనబడతారు. కాని వారు ఎవరిని అనుగ్రహించదలిచారో వారికి మాత్రమే వారిచ్చే దీక్ష, ఉపదేశం, మార్గదర్శనం అందేవి. దీక్ష కూడా సాధకుని మనఃస్థితిని బట్టి మారుతుంటుంది. పరమహంస యోగానంద (ఒకయోగి ఆత్మకథ రచయిత) ప్రజలకు పెద్ద ఎత్తున మేలుచేయుట ఎలా అని అడిగితే, భగవాన్‌ – “అదెలా సాధ్యం? మూకుమ్మడి దీక్షలుండవు. ఉపదేశం సాధకుని పక్వత, అర్హతలపై ఆధారపడి వుంటుంది” అన్నారు.*


*రమణుల ఉపదేశదీక్షా కార్యక్రమం ఎంత క్రియాశీలకమైందో అంత గోప్యమైంది కూడా. చూసేవారికి దాని ఆనుపానులు తెలియక వారెవరికీ దీక్ష యివ్వరనీ, అసలు ఎవరినీ పట్టించుకోరన్న అపోహ కలిగేది. ఈ విషయంలో నటేశ ముదలియార్‌ను ఇదే మిషపై నిరుత్సాహపరిచాడో బ్రాహ్మణుడు. నిజానికి ఆత్మసాక్షాత్కారానికి సద్గురువు ప్రసాదించే దీక్ష, ఉపదేశం అత్యంత ఆవశ్యకం. ఈ విషయంలో భగవాన్‌ అభిప్రాయం ఇతర సంప్రదాయ గురువుల అభిప్రాయంకంటే ఏ విధంగాను భిన్నంకాదు. అందుచేత సత్య సాధకులకు రమణుల బోధనా విశిష్టత, ప్రశాంతయుతమైన వారి సన్నిధి లభిస్తే సరిపోదు. వారు తమకు దీక్షాగురువులన్న సంగతి ఏదోవిధంగా ప్రతిష్ఠమవ్వాలి.*


*గురువుకు సమర్పణ అంటే తన ఆత్మకంటే బాహ్యంగా వున్న వేరెవరికో కాదు. తన నిజతత్త్వాన్ని గుర్తించే దిశలో సహకరించేందుకు తనకు బాహ్యంగా ప్రకటమైన తనకే అని గుర్తించాలి. “గురువున్నది లోపలే. ధ్యానం చేసేది గురువు బాహ్యంగా ఉన్నాడన్న అజ్ఞానపు అపోహను తొలగించేందుకు. అతడు బాహ్యంలో తారసిల్లిన ఎవరో నూతనవ్యక్తి కాడు సుమా! అదే అయితే, ఇతరులవలె అతడూ కాలక్రమంలో అదృశ్యమై తీరుతాడు. అలాటి అశాశ్వత వ్యక్తితో ఒరిగేదేమిటి? మరి, నీవో పరిమితమైన దేహం అనుకున్నంతసేపు గురువు కూడా వేరే దేహంతోటి నీకు వెలుపల కనిపించే ఆవశ్యకత ఉంది. ‘నేను’ దేహమనే దోషభావం తొలగిపోగానే ఇంకేముంది, గురుమూర్తి నీ స్వరూపమే అయిన ఆత్మ అని గ్రహిస్తావు.*


*పూర్ణత్వంతోటి తాదాత్మ్యంలో ఉన్న గురువుకు పరిమిత అహం-గుర్తింపు లేని కారణంగా ఆ సంగతిని ప్రకటించే పనిలేదు. అలాగే ఇతరాన్ని చూడని కారణంగా తనకేదో శిష్యులున్నారనీ చెప్పుకోడు. రూపాలుంటేనే నంబంధాలు, బంధాలు కదమ్మా!*


*అయితే ఈ విషయంలో తికమక పడిపోయి, ఎటూ పాలుపోక అగమ్యగోచర స్థితిలో ఉన్న భక్తుని ఓదార్చి, సందేహాన్ని తీర్చి, నిలదొక్కుకునేలా చేయడంలో ఆయనకాయనే సాటి. 1940లో తనకట్టి అభయం ఈయబడినట్లుగా  చాడ్‌విక్‌ అనే ఇంగ్లీష్‌ భక్తుడు వ్రాసుకున్నాడు...


నీ మనసును నియంత్రించడం అంటే నీ మనస్సును నీవు సంపూర్ణంగా జయించడమే అని అర్థం. 


నీ మనస్సును నువ్వు సంపూర్ణంగా జయిస్తే ఈ ప్రపంచంలో నువ్వు అంటూ సాధించవలసినవి అంటూ ఏమి ఉండవు.


 అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించినవాడి కంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట.


 ఎందుకంటే నీ యొక్క లక్ష్యాన్ని (నీ హృదయంలో భగవంతుని దివ్య దర్శనాన్ని) దూరం చేసే మొదటి శత్రువు ఇదే కనుక. దీనిని జయిస్తే అదే నీకు మిత్రువు అవుతుంది. అదే అప్పుడు నీకు భగవంతుని దివ్య దర్శనానికి సహకరిస్తుంది.


 దీనిని బట్టి ఆలోచిస్తే మన లక్ష్య దిశగా ఆలోచిస్తే జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది.


ఈ మనస్సు గురించి రమణ మహర్షి తెలిపిన ముఖ్యమైన విషయాలు :


వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.


మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.


ఈశ్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.


మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.


వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.


లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.


 ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది


నేను – నాది అనే భావన నుంచి భయటపడాలి.


*నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది. నేను, నాది అనేవి రెండు పెద్ద ప్రమాదకారులు. అయినా జీవిత మంతా మనం వీటితోనే బతకాలి. ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది, అమ్మ ఒడిలో ఇవి ఉండవు. నేను మొదలవుతుంటే నాది అనేది. దాని వెనక తోకల్లాగవస్తుంది. స్వార్థానికి నేను-నాది’రెండు రెక్కలు. ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు. హాయిగా అహం తోటలో ఎగురుతున్నవాడిని ” ఆ రెక్కలు వదులుకోఅని చెప్పేవారూ ఉండరు. ఎందుకంటే అది వాళ్లకూ అవసరమే.*


*‘నేను-నాది’ లేకపోతే జీవితం సాగదేమో! నేను-నాది తోనే లోకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిద్రలో అవి ఉండవు.* *అప్పుడులోకం కూడా ఉండదు. ఎవరైనా మన ‘నేను’ మీద దెబ్బకొడితే విలవిల్లాడిపోతాం. ఎదుటివాడి ‘నేను’ మీద దెబ్బతీయకుండా ఉండలేం, నాదనేది ఎవరైనా లాక్కుపోతే చూస్తూ ఊరుకోం. పోరాడి, పెనుగులాడి నాది అనేదాన్ని నిలబెట్టుకుంటాం. జీవితమంతా ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది. *అసలు ఈ నేను-నాది లేని మనుషులు ఉంటారా? ఉంటారు. వాళ్లే ఆధ్యాత్మికవాదులు. తీవ్రమైన ఆధ్యాత్మిక బ్రహ్మీస్థితిలో మునిగి ఉన్నవారు. వాళ్లకు నేను-నాది యోచనలు తగ్గిపోతూ ఉంటాయి.*

*ఎలాగైనా వాటిని వదిలించుకోవటానికి ధ్యానం, పూజ, జపం, ప్రార్థన, యోగం అనే ఆయుధాలను ప్రయోగిస్తుంటారు.*


*ప్రార్ధన చేసే వ్యక్తి తాను గొప్పగా ప్రార్ధన చేస్తున్నాను అనుకున్నాడంటే నేను’ తగ్గకపోగా మరింత బలపడుతుంది. “నాకు పూజ తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు, నేను జపంలో మునిగానంటే ప్రపంచమే తెలియదు” లాంటి భావాలతో ముందుకు వెళితే నేను-నాది ఇంకా బలిష్టమవుతాయి. లక్ష్యం నెరవేరకపోగా, దానికి ఇంకా దూరమైనట్లు అవుతుంది.*


*ఈ నేను-నాది జంజాటానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది. అది భక్తి. భక్తితో ఏ పని చేసినా అది భగవదర్పణ అవుతుంది. భక్తి పారవశ్యంలో నేను-నాది అనేవి క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. భక్తుడు భగవంతుడిలో లీనమయ్యే కర్మలోనే నేను-నాది లేకుండా పోయే స్థితి వస్తుంది. అయితే అదంత సులువైన స్థితి కాదు. నేను-నాదికి బదులు మనం-మనది అనుకోవడం ఎంతో బావుంటుంది. ఇది అసలైన జ్ఞానం.*


*దీన్ని మెల్లగా మనం ఒంటపట్టించుకోవాలి. నేను-నాది చిన్నప్పటినుంచే సహజంగా వచ్చేస్తాయి. ఆ స్థానంలో మనం-మనది అభ్యాసం చెయ్యాలి. అలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. కొంచెం కష్టమైనా అది అసాధ్యం కాదు. నేను లేకపోతే బతుకు చప్పగా ఉన్నట్లనిపిస్తుంది.


 చాలామందికి నాదనేది లేకపోతే ఎందుకు మనం బతకడం అనిపిస్తుంది కూడా. కాని జంతువులకు పక్షులకు, చెట్లకు నేను-నాది ఉందా అనే భావాలు ఉన్నాయా? సహజ భావాలు వాటిని నడిపిస్తాయి. నేను లేకపోవడం వల్ల బాధనూ మరిచిపోయి అవి ఆనందంగా ఉంటాయి. మనకు భౌతిక బాధలూ మానసిక సంకటాలుగా తయారై ఏడిపించుకుతింటూ ఉంటాయి.*


*అందరూ మాయ అంటున్న ఈ ప్రపంచంబాగుంది. ఇక్కడ నేను హాయిగా ఉంటాను. ఈ రంగురంగుల పూలు, చెట్లు, పక్షులు, ఆకాశం, గాలి, ప్రకృతి నాదే. నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని. నా జన్మకు ఏదో ప్రయోజనం ఉంది. అందుకే ఈ ప్రకృతి నా తల్లి ద్వారా నన్ను భూమ్మీదకు తెచ్చింది. నేనెంతో అదృష్టవంతుణ్నీ. ఈ నేను భావనను బాగా విస్తృతపరచుకొని ‘మనంగా మార్చుకుంటాను. నాది యోచనను బాగా విశాలం చేసి మనదిగా చేసుకుంటాను. ఉన్నంతకాలం అందరికోసం ఆలోచిస్తాను. అందరితో కలిసి పనిచేస్తాను. లక్ష్యసాధనకు అవరోధంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుని నేను-నాది అనే దాన్ని మరిచిపోయి నది సముద్రంలో కలిసిపోయినట్లుగా సముద్రాకార నదిగా ఆనందం పొందుతాను అనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు. అతడే వేదాంతి, అతడే విశ్వప్రేమికుడు. అలాంటివాడినే పరమాత్మ భగవద్గీతలో పరమశ్రేష్ఠుడు అని చెప్పాడు. సమబుద్దికలవాడి కంటే మించినవాడు ఈ లోకంలోలేడు. ఈ సమత్వమే యోగం...

వైశాఖ పురాణం - 15 వ అధ్యాయము

 _*🚩వైశాఖ పురాణం - 15 వ అధ్యాయము🚩*_


🕉🍁🕉️🍁🕉️🍁🕉️🍁🕉️


*వైశాఖవ్రత మహిమ*


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ !  వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు ? రాజస , తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను.


శ్రుతదేవుడును మహారాజా ! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను , పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్విక కర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.


వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో నుత్తముడు. కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు , బ్రహ్మజ్ఞాని , అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను.


అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్ట మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను , మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను , యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను , గంధములను , ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును , సాయంకాలమున పానకమును , తాంబూలమును , కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్లనీడలయందు , ఇంటి ముంగిళ్లయందు మండపములయందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి ఇదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.


అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా ! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.


వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా ! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు , పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా ! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము , స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును . భక్తిలేని కర్మయే అధికమైనను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా ! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా ! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్వకముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.


ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహిష్కరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను , పుత్రుడైనను , భార్యయైనను , ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని సిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు , బాలురు , పురుషులు అందరును ఇహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.


ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయట కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము , ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.


_*వైశాఖపురాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం*_

            🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷


🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

శరభుడి జయంతి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🎻🌹🙏నేడు శరభుడి జయంతి

పరమశివుడి మరో అవతారం శరభుడు...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿ఇది సాధారణంగా చాలామందికి తెలీదు.  శివుడి భీకర శక్తివంతమైన రూపం.చాలా మందికి సాధారణంగా తెలీని పరమశివుని మరో అవతారం శరభుడు. 


🌸ఇది విశ్వాన్ని రక్షించ డానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపంగా భావిస్తారు. 

ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోప రూపమైన , సగం మానవుడు సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు.


🌿విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని తనకి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుడుని రాక్షసుడైన , తండ్రి అయిన హిరణ్యకశిపుడి నుంచి రక్షించడానికి నృసింహ అవతారం ఎత్తాడు. 


🌸అతన్ని చంపిన నరసింహుడిలో ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు, అదేపనిగా గాండ్రిస్తూ , ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. 


🌿దీని వల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి , ఇతర దేవతలు, అధిదేవతలు మహాదేవుడి సాయం కోరగా , ఆయన శరభుడి అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుడిని శాంతింపచేసి , మామూలు విష్ణురూపంలోకి మార్చాలని నిర్ణయించాడు.


🌷శరభుడిగా శివుడి రూపలక్షణాలు🌷


🌸శివుడి అవతారమైన శరభుడు మానవుడు, జంతువు మరియు పక్షి కలగలసిన అతిపెద్ద పరిమాణంలో ఒళ్ళంతా పొక్కులు కల రూపం. 

అనేక చేతులు, పంజాలు మరియు కాళ్ళు ఉండి దాదాపు పెద్ద డ్రాగన్ పక్షిలాగా ఉంటాడు. 


🌿అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది. 

తలపై ఒక పెద్ద జుట్టుతో నిండిన భాగం డోమ్ లాగా కన్పిస్తుంది, శరీరానికి వెనకవైపు విచ్చుకుని ఉండే పెద్ద రెక్కలు మరియు పొడవైన తోక వీపుపై ఉంటాయి. 


🌸నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు, పటిష్టమైన పంజాలు ఆ రూప ముఖ్య ఆయుధాలు. 

ఉరుములాంటి గొంతు ప్రతిద్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేము.

మూడు కళ్ళు నిప్పు కణితులవలె మండుతూ ఉంటాయి. 


🌿పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి , కన్పిస్తాయి కూడా, మొత్తంగా అన్ని సమయాల్లో భరించలేని ఒక బుసకొట్టే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది.


🌷పరమశివుని శరభావతారం కథ🌷


🌿మొదటగా శివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహుడిని శాంతించ మని కోరాడు. 

కానీ నరసింహుడు మాట వినిపించుకోలేదు. 

అందుకని ఆకారంలో , శక్తిలో నరసింహుడిని మించిన శరభావతారాన్ని శివుడు ఎత్తాల్సి వచ్చింది.


🌸శరభుడు తన పొడవైన తోకతో నరసింహుడిని ఎత్తి పడేయబోయాడు...

నరసింహుడికి విషయం అర్థమై శరభుడిని క్షమించమని ప్రార్థించాడు...


🌿ఇది పరమశివుడికి నరసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతన్ని ఇక బాధించలేదు, శివుడి ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలసి శరభేశ్వరమూర్తికి కానుకగా సమర్పించాడు,  


🌸అలా పరమశివుడి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహుడిని మామూలుగా మార్చింది, ఈ శివుడి అవతారాన్ని శరభేశ్వరుడిగా కొలుస్తారు.


🌿శివాలయాల్లో గర్భగుడికి ముందు రెండు శరభేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్టించడం కూడా చూడవచ్చు.

సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్ 🚩🌞🙏

మంచిమాట

 మంచిమాట- పద్య బాట


చేయకుము కాని కార్యము


పాయకుము మఱిన్ శుభం, బవని భోజనమున్


జేయకుము రిపు గృహంబున


గూయకు మొరుమనసు నొచ్చు గూత కుమారా!


తాత్పర్యం: సాధ్యముకాని పనిని చేయడం


ప్రయత్నించవద్దు. మంచిదానిని వదలవద్దు. పగవాని ఇంట్లో భుజించవద్దు. ఇతరులకు నొప్పికలుగునట్లు మాట్లాడవద్దు.

మూర్ఖుల లక్షణాలు.

 శ్లోకం:☝️

*అనాహూతః ప్రవిశతి*

 *అపృష్టో బహు భాషతే ।*

*అవిశ్వస్తే విశ్వసితి*

 *మూఢచేతా నరాధమః ।*


భావం: ఆహ్వానించకుండా వెళ్లడం, అడగకుండా ఎక్కువగా మాట్లాడడం, నమ్మకూడని విషయాలను లేదా వ్యక్తులను నమ్మడం మూర్ఖుల లక్షణాలు.

బొప్పాయి గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

 బొప్పాయి గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .


      ఇది పులుపు , తీపి రుచులతో ఉండి దీని రసం చల్లగా ఉంటుంది. ఇది  ఫిబ్రవరి , మార్చి నెలలో మే నుండి అక్టోబర్ నెలలో కాపుకు వస్తుంది. పండు బొప్పాయి కాయ గుండెకు మంచి ఉపయోగకరం . పైత్యాన్ని తగ్గించును . కాలేయానికి ఉపయోగకరం . ప్లీహం పెద్దది అవ్వకుండా కాపాడును . మలబద్ధకాన్ని పోగొట్టును . మూత్రవ్యాధులలో అద్భుతముగా పనిచేయును .


          బొప్పాయికాయలో దాదాపు సగం గ్లూకోజ్ , మిగతాసగం ఫ్రక్టోజ్ ఉండును. మామిడికాయ తరువాత విటమిన్ "A " ఎక్కువ మోతాదులో ఇందులోనే ఉంటుంది. ఇది పక్వానికి వచ్చేకొద్దీ ఇందులో విటమిన్ " C " పెరుగును . మే నుండి అక్టోబర్ మధ్యలో వచ్చే బొప్పాయకాయల్లో పంచదార మరియు విటమిన్ " C " అధికంగా ఉండును. బొప్పాయకాయలో విటమిన్ B1 , B2 మరియు నియాసిన్ అధికంగా ఉండును.


        పచ్చిబొప్పాయకాయ నుండి వచ్చే తెల్లటి సెక్రిపన్ , పాపాయన్ అనే జీర్ణసంబంధమైన ఎంజైము ను కలిగి ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయును . పచ్చి బొప్పాయకాయను రసం రూపంలో తీసికొనవలెను . పండిన కాయను సహజరూపంలోనే తీసుకొనవచ్చు . బొప్పాయి కాయను తీసుకోవడం వలన జీర్ణప్రదేశంలో ఉండే రౌండ్ వార్మ్స్ అనే పురుగులను బయటకి పంపును . ఈ రసం కాలేయవ్యాధులను నయం చేయును . రుతుప్రవాహం సరిగ్గా ఉండటానికి సహాయపడును. రక్తవిరేచనాలు , ఆమ్లత్వం , అజీర్ణం, మలబద్దకం వంటివాటికి చాలా మంచి ఔషధముగా పనిచేయును . రక్తహీనతకు కూడా బాగుగా పనిచేయును .


         బొప్పాయి మూత్రం ఎక్కువ అయ్యేలా చేస్తుంది . కావున ఇది మూత్రపిండాల వ్యాధులలో చాలా ఉపయోగకరం . పండిన బొప్పాయి మలబద్దకాన్ని పోగొట్టును . ఆస్తమాకు మంచి ఔషధముగా పనిచేస్తుంది . పచ్చి బొప్పాయికాయలోని తెల్లటి గుజ్జు ముఖంపైన రుద్దుట వలన మొటిమల సమస్య నివారణ అగును. ముఖానికి మంచి వెలుగు తెచ్చును. ముడతలను పోగొట్టును .


  బొప్పాయిరసం శరీరంలో వేడిని పెంచును కావున గర్భిణీలు , జ్వరం ఉన్నవారికి బొప్పాయి ఇవ్వకూడదు. బొప్పాయి ఆకులను బోదకాలు నివారణలో వాడతారు.


           మరింత విలువైన మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .