6, మే 2023, శనివారం

ఆచార్య సద్బోధన:*



                *ఆచార్య సద్బోధన:*

                    ➖➖➖✍️


*మన ఆలోచనలు, ఆచరణ రెండూ సవ్యంగా ఉండాలి. వీటి యందు వక్రత ఉండరాదు.*


*శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు. అదుపు తప్పిన మనస్సు కలవారి ఇంద్రియాలు విషయాల వైపుకి పరుగుతీస్తాయి. కానీ విచక్షణతో, వివేకంతో మనస్సుని అదుపులో ఉంచినప్పుడు ఇంద్రియాలు క్రమ శిక్షణ గల గుర్రాలవలె మెలగుతూ అంతర్ముఖుని చేస్తాయి.*


*మనస్సు నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు అలజడి కలిగించేవాటిని, అవాంఛితాలని కోరుతుంది. అది సహజ స్థితి ఎంత మాత్రమూ కాదు.*


*సహజ స్థితి కాదని ఎందుకు చెబుతున్నామంటే దాని వలన కలిగే పరిణామాలు జీవుడిని బాధిస్తాయి. తనకు తాను నాశనం తెచ్చుకోకుండా ఇతరులకు హాని ఎవరూ చేయలేరు.*


*పగ, కోపం, అసూయలు మనస్సులో మొదలైతే దాని వలన ఆ వ్యక్తికి అంతర్గత హాని జరిగాకే, అవి ఇతరులను బాధిస్తాయి.*


*అందుచేత ఎప్పుడూ సద్భావనలను కలిగి ఉండాలి. అప్పుడు స్వీయహాని జరుగదు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

[06/05, 2:55 am] +91 94939 06277: 120622A0528.  130622-7.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



             *విజ్ఞాన పెన్నిధులు*

                  ➖➖➖✍️



*భారతీయ సనాతన సంప్రదాయానికి మూలాధారాలు- చతుర్వేదాలు. విజ్ఞాన పెన్నిధులుగా ఆర్ష ధర్మానికి ఆలంబనగా నిలిచే సమున్నత ప్రతీకలుగా వేదాలు విలసిల్లుతున్నాయి. అఖిల సృష్టిలోని జ్ఞానమంతా వేదాల్లో ప్రకటితమవుతుంది. సాధారణ పరిభాషలో ‘వేదం’ అంటే జ్ఞానం. మనసులో అలముకున్న అజ్ఞానాంధకారాన్ని పారదోలే అనంత జ్ఞాన కాంతిపుంజాలు వేదనిధులు. సృష్ట్యాదిలో సర్వశ్రేష్ఠులైన ఋషులకు భగవత్‌ చైతన్యం ద్వారా వేదవిద్య అందింది. తరవాత ఆ ఋషి పుంగవులు వేదాన్ని గానం చేస్తున్న సందర్భంలో బ్రహ్మరుషి విన్నాడంటారు. ఆ బ్రహ్మరుషి బృహస్పతికి,  బృహస్పతి ఇంద్రరుషికి, ఇంద్రరుషి భరద్వాజుడికి వేద విజ్ఞానాన్ని పంచారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలనే నాలుగు   ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన సారస్వతామృతంగా తేజరిల్లుతున్నాయి.*


*గురుశిష్యుల పఠన, పాఠన విధితోనే వేద పరంపర కొనసాగుతోంది. యుగయుగాలుగా మహర్షుల చింతన, మనన, పరిశీలన, పరిశోధన, అధ్యయనాలతో వేద విజ్ఞానం మరింతగా వెలుగు పుంజాల్ని విరజిమ్మింది. ‘విద్‌’ అంటే తెలుసుకోవడం. మహర్షులు, ఋషులు మంత్రద్రష్టలుగా వేదమంత్రాల్లోని నిగూఢ రహస్యాల్ని తెలుసుకుని, వాటి గురించి మననం చేసి, పరిశీలనాత్మక దృక్పథంతో అనుభవంలోకి ఆపాదించుకుని, ఆ జ్ఞానభాండాల్ని విశ్వానికి అమూల్యమైన కానుకలుగా అందించారు.


*ఋగ్వేదమంత్రాల్ని రుచ సముచ్ఛయంగా పేర్కొంటారు. నాలుగు పంక్తుల శ్లోకాలుగా ఉండే ఈ మంత్రాలన్నీ దేవతా స్తుతులుగా, యజ్ఞ నిర్వహణకు ఉపకరిస్తాయి. వైదిక దేవతల ప్రార్థనా పూర్వక మంత్రాల సమ్మిళితంగా ఋగ్వేదం ప్రతిఫలిస్తుంది.* 


*యజుర్వేదం గద్యరూపాత్మకమైనది. ‘యజుష్‌’ అంటే పూజ.   ప్రక్రియా పూర్వకమైన విధి విధానాలైన పూజ, ఆరాధనల మంత్రాలు యజుర్వేదంలో నిక్షిప్తమై ఉన్నాయి.* 


*వివిధ యజ్ఞాల ప్రాముఖ్యాన్ని ఆవిష్కరిస్తూ, వాటి ఆచరణ రీతుల్ని విహిత కర్మకాండల సంవిధానాల్ని యజుర్వేదం వివరిస్తుంది.*


*దేవతల్ని ఆనందపరచడానికి యజ్ఞయాగాదుల్లో, ఆరాధనా క్రతువుల్లో గానం చేసే మంత్రాల శ్రేణి- సామవేదం. స్వర, తాళయుక్తంగా ఆలపించడానికి ఆమోదయోగ్యంగా సామవేద మంత్రాలు దోహదమవుతాయి.* 


*బ్రహ్మవేదంగా పేరుపొందిన నాలుగో వేదం- అధర్వణం. తంత్రం, యంత్రం, మంత్రాల సమ్మేళనమై అధర్వణ వేదం భాసిల్లుతుంది. ఆధ్యాత్మిక చింతనాపరమైన, భగవదనుగ్రహాన్ని పొందడానికి సంబంధించిన మంత్రాలన్నీ ఈ వేదంలో నెలకొని ఉంటాయి. ‘బ్రాహ్మణి’గా వ్యవహరించే ఈ వేదానికి బ్రహ్మవిద్య అనే పేరు ఉంది.*


*చతుర్వేదాలు కేవలం పారమార్థిక విషయాల్ని మాత్రమే కాక జన బాహుళ్యానికి ఉపకరించే ఎన్నో అంశాల్ని ప్రతిబింబిస్తాయి. రాజనీతి, ఆచార వ్యవహారాలు, ఔషధాల విజ్ఞానం, గణిత, భౌతిక, రసాయనిక సూత్రాలు, ప్రజాతంత్రం, రాజ్యరక్షణ, శాసన విధానం, సంస్థల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం, వ్యవసాయం, భూగోళ, ఖగోళ విజ్ఞానాంశాలు- ఇలా వేదాలు విజ్ఞాన పెన్నిధులై పరిఢవిల్లుతున్నాయి.*


*వేదమంత్రాలన్నీ లోక కల్యాణాన్ని కాంక్షిస్తాయి. విశ్వశ్రేయస్సును కోరుకుంటాయి. అందుకే వేదాల్ని ‘విశ్వసాహిత్యం’గా వివేకానందుడు వర్ణించారు. ‘పరమపద సోపానాన్ని అధిరోహించడానికి వేద విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. వేదం జీవన నాదమై రవళిస్తుంది. ఆ నాదంతో జీవన గమనాన్ని అనుసంధానం చేసుకుంటూ మానవులు నిత్య జాగృతులు కావాలి’ అనే జగద్గురువు ఆదిశంకరుల సందేశం అనుసరణీయం.*✍️

          - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం... గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...9493906277

లింక్ పంపుతాము.🙏

[06/05, 2:55 am] +91 94939 06277: *మధుమేహ వ్యాధి వచ్చాక తీసుకోవాలిసిన జాగ్రత్త తగ్గించే ఆయుర్వేద ఔషదాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

       ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం, మధుమేహం కఫా రకానికి చెందిన రుగ్మతగా పేర్కొంటారు, 

*👉🏿ఆహార నియమాలలో మార్పులుఆయుర్వేద వైద్యశాస్త్రంలో, మధుమేహానికి చికిత్స* చేయుటకు గానూ, మొదటగా ఆహార నియమాలలో మార్పులను చేయాలి. వీటిలో చక్కెరలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఆహారంలో తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాలు ప్రమదానికి గురయ్యే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు పదార్థాలు జీర్ణం అవటం కష్టం, కావున వీటిని కూడా తక్కువ స్థాయిలో తీసుకోవాలి. వీటికి బదులుగా *నారింజపండ్లు, నిమ్మరసం, చేదుగా ఉండే పండ్లు మరియు ఔషదాలను తీసుకోవటం వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.*

*👉🏿పంచకర్మ*

చాలా మంది మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ శరీరంలో ఉన్న ప్లీహ కణాలను నాశనం చేసే యాంటీ బాడీలను కలిగి ఉన్నారు. ఇలాంటి సమయంలో పంచకర్మను వాడటం వలన ఈ యాంటీబాడీలు శరీరం నుండి తొలగించబడతాయి. వీటిలో హెర్బల్ మసాజ్, హెర్బల్ స్టీమ్ మరియు శరీరాన్ని శుభ్రపరచే ఉపవాసం వంటివి కూడా ఉంటాయి. పైన తెలిపిన పద్దతుల ద్వారా కాలేయ కణాలను, ప్లీహ కణాలను, క్లోమ కణాలను శుభ్రపరుస్తాయి. కోలన్ థెరపీ ద్వారా పూర్తి జీర్ణవ్యవస్థ శుభ్రపరచపడుతుంది.

*👉🏿వ్యాయామాలు మరియు యోగా ప్రతి రోజులు చేయండి 3నెలలు లో అదుపులో ఉంటది*


భౌతిక వ్యాయామాలు, శ్వాస వ్యాయామాలు, యోగా వంటి వాటిని మధుమేహాన్ని తగ్గించటానికి గానూ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చికిత్సలుగా వాడతారు.


*👉🏿ఔషదాలు*

*వివిధ రకాల మూలికలు మరియు ఔషదాలు మధుమేహ వ్యాధిని తగ్గించటానికి వాడతారు. వీటిని కూడా ఆయుర్వేద వైద్యనిపుణుల సమక్షంలో మాత్రమే తీసుకోవాలి*. 1.-శీలజిత్, 

2.-గుడ్మార్ పసుపు, 

3.-వేప, అమాలాకి, గుగ్గుల్, మరియు 

4.-అర్జునలను, 

     మధుమేహం చికిత్స కోసం వాడే అత్యంత ముఖ్యమైన మూలికలుగా చెప్పవచ్చు. మధుమేహ వ్యాధి ప్రారంభ దశలో ఉన్నపుడు, పసుపు మరియు కలబంద రసాన్ని వాడటం వలన శక్తివంతంగా తగ్గించవచ్చు మరియు ఈ రెండింటి మిళితం, క్లోమ గ్రంధి మరియు కాలేయ విధులను సరియగు విధంగా నిర్వహించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.


5.-కసినియా ఇండికా, 

6.-పవిత్ర తులసి, మెంతులు, మరియు 

7.-జిమ్నెమా సిల్వెస్ట్రె మరియు మూలికా సూత్రాలు అయినట్టి, ఆయుష్-82 మరియు D-400 వంటి మూలికలు గ్లూకోజ్ తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయని పరిశోధనలలో వెల్లడించబడింది.


https://fb.watch/9HmejHJJDS/


*👉🏿మధుమేహాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషదాలు*


ఇక్కడ తెలిపిన మూలికలు మరియు ఇంట్లో ఉండే ఔషదాలు మధుమేహాన్ని మరియు డయాబెటిస్ మిల్లిటస్ వంటి వ్యాధులను శక్తివంతంగా తగ్గిస్తాయి.


1.-కాకరకాయ లేదా లేదా చేదు రుచి ఉన్న నిమ్మకాయ రసాన్ని రోజు ఉదయాన ఖాళీ కడుపుతో తీసుకోవాలి.


2.-పసుపు కాప్సిల్స్: రెండు కాప్సిల్ లను ప్రతి రోజు 3 పూటలు వాడాలి.


3.-రోజు ఆపిల్ లను రెండు సార్లు తినాలి.


4.-మెంతులు, ముస్తా, అర్జున, ట్రిఫాల, అజ్వన్ , నెయ్యి లో కలిపిన హరితాకి లను రోజు తీసుకోవాలి.


5.-అమ్లాకి పొడి, హల్ది పొడి మరియు తేనె కలిపిన మిశ్రమాలను రోజు రెండు సార్లు తీసుకోవాలి.


ఈ ఔషదాలు, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మరియు ఇతర అల్లోపతి మందులు మాత్రం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

*👉🏿అటికమామిడి  అంబలిమాడు కూర* - ఆకు పూవురంగును అనుసరించి తెలుపు ఎరుపు నలుపు మూడురకాలు


గలిజేరు -  ఇదికూడా   ఆకు పూవురంగును అనుసరించి తెలుపు ఎరుపు నలుపు మూడురకాలు. దీనిని సంస్కృతంలో పునర్నవ (పునర్జీవితున్ని చేస్తుందని) అని పిలుస్తారు. దీనిని ఆయుర్వేదం బాధా నివారిణిగా ఉపయోగిస్తారు. దీని ఆకులు భారతదేశం అంతా ఆకుకూరగా ఉపయోగంలో ఉన్నవి. ఇవి కంటిచూపును బాగుచేస్తుంది, మరియు మధుమేహం వ్యాధిగ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. మూత్రపిండాల పనితీరు బాగుచేస్తుంది. లివర్ వ్యాధులను బాగుచేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో తెల్లని పూలు గలది మంచిది.


అటకమామిడి గలిజేరు ఒకేరకంగా ఉన్నా ఒకటికాదు. పరిశీలనగా చూడండి. కానీ పనర్నవకన్నా కొద్దిగా తక్కువగా పనిచేస్తుంది.


*👉🏿నాకు తెలిసిన జాగ్రత్త మీ కోసం*

ఆయుర్వేదాల ఔషదాలు, మధుమేహ వ్యాధిని ఇవి శక్తివంతంగా తగ్గిస్తాయి, కానీ, నిపుణుల సలహా లేకుండా వీటిని తీసుకోవటం వలన ఇతర ఆరోగ్య సమస్యలను కలుగచేస్తాయి. ఒకవేళ మధుమేహాన్ని తగ్గించటానికి గానూ, అల్లోపతి మందులను కూడా వాడితే, ఆయుర్వేదాలను వాడే ముందు మీ అల్లోపతి వైద్యుడిని కలిసి అతడి సలహాలను తీసుకోండి. కొన్ని రకాల అల్లోపతి మందులు, శరీరంలో ఆయుర్వేద ఔషదాలతో, ఆహార పదార్థాలతో మరియు ఆహార ఉపభాగాలతో చర్యలను కొనసాగించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కావున వీటిని వాడటానికి ముందు మీ వైద్యుడిని, సలహా మేరకు మెడిసన్ తీసుకోవాలి 

*ధన్యవాదములు 🙏*

*మీ నవీన్ నడిమింటి*  


https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

[06/05, 5:54 am] +91 76590 87625: *గురుకృపా మహత్యం*

 

       *సర్వమంత్రాల కంటే గురు వాక్యమే శక్తివంతమైన ప్రేరకం. గురువు పట్ల నిజమైన భక్తి కలిగిన వారికి సర్వ సత్యములూ తమంత తామే విదితమవుతాయి. ఎవరు గురుభక్తి కలిగి, నిష్ఠ కలిగి ఉంటారో అట్టి వారు ధన్యులవుతారు. వారి జన్మ సార్థకం అవుతుంది.*


*గురు ప్రసాదతః స్వాత్మనాత్మారామ నిరీక్షణాత్‌*

 

 *సమతాముక్తి మార్గేణ స్మాత్మజ్ఞానం ప్రవర్తతే.*


         *గురువు అనుగ్రహం లేనివాడు ఆత్మతత్వాన్ని ఎరుగలేడు. తనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను గురు ప్రసాదముచే నిరీక్షించు సమత్వపరునికే ఆత్మజ్ఞానము కలుగునని పరమ శివుడు ప్రబోధించాడు. చదువురాని శిష్యుడైన తోటకాచార్యులను, ఆదిశంకరులు తన సంకల్పశక్తిచేత విద్యావంతునిగా మార్చారు. గురువును దైవంగా భావించి గురుసేవ చేసినందువల్ల తోటకాచార్యులకు గురు అనుగహ్రం లభించింది.*


         *బోధనలు, శ్రవణం, ధ్యానాదుల కన్నా ఎక్కువగా గురువు అనుగ్రహం ఫలితాన్ని ఇస్తుందని భగవాన్‌ రమణ మహర్షి అన్నారు. తత్వజ్ఞాని అయిన గురువు యొక్క తన చూపుచే కొందరిని, తన తలంపుతో కొందరిని, తన స్పర్శచే కొందరిని ముక్తులను చేస్తారు గురువులు.*


         *భిషజే భవరోగిణామ్‌*


        *అనగా ఎవరిది పరిపక్వమైన మనసో, అపరిపక్వమైన మనసో అని తెలుసుకొను భవరోగ వైద్యుడు గురువు. కనుక అన్ని ధ్యానములకంటే గురు ధ్యానమే శ్రేష్ఠం. అన్ని పూజలకంటే శ్రీ గురుపాదపూజయే అధికఫలాన్ని ఇస్తుంది.*


      *శ్రీ గురుకృపయే ముక్తికి మూలం. శ్రీరాముడు కూడా గురువైన వశిష్ఠుని శ్రద్ధా భక్తితో, ఆత్మ విశ్వాసంతో సేవించిన ఫలితంగానే గురు వశిష్ఠుల వారు యోగ వాశిష్ఠాన్ని బోధించాడు.*


        *గురుతత్వం ఆత్మతత్వంగా విశ్వమంతా వ్యాపించి ఉంది. కనుక ఆత్మానుభవం సాధించాలంటే అనుభవజ్ఞుడైన గురువును ఆశ్రయించాలి. అలాంటి పరిపూర్ణమైన గురువు మాత్రమే శిష్యజీవునిలో, అతనికి తెలియకుండా, అంతరంగంలో వున్న ఆత్మతత్వాన్ని అతడికి ఎరుకపరచి, జ్ణానామృతాన్ని, జ్ఞానధనాన్ని అందించి, ఆత్మజ్యోతిని వెలిగించే వాడే అసలైన గురువు.*

 

*కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకమ్‌*

 

 *గురుర్విశ్వేశ్వరః సాక్షాత్‌ తారకం బ్రహ్మ నిశ్చయమ్‌.*


*గురువు నివసించు స్థానమే శిష్యులకు కాశీ క్షేత్రము. గురువు చరణోదకమే పవిత్ర గంగ. ఆయనే సాక్షాత్‌ విశ్వేశ్వరుడు. గురు మహాత్ముడు తన పాదం మోపి అడుగులిడిన ప్రాంతాలే శిష్యులకు పుణ్యక్షేత్రములు. ఆయన తాకిన వస్తువులే పరమ పవిత్రములు. గురుకృపా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారముతోనే శిష్యుల అజ్ఞానాంధకారం భగ్నమై, వారి మదిలో ప్రకాశవంతమైన అఖండ జ్ణానజ్యోతులు వెలుగొందుతాయి. అటువంటి గురువు లభించడం ఆ శిష్యుల పూర్వజన్మ సుకృతం పైన ఆధారపడి ఉంటుంది....


రమణుల ఉపదేశం మార్గదర్శనం


*రమణుల ఉపదేశం, మార్గదర్శనం ఓ విధంగా చెప్పాలంటే రహస్యమైనవి. అందరికీ అందుబాటులో ఉన్నట్లే కనబడతారు. అందరి మాటలు, ప్రశ్నలు, అభ్యర్థనలు, ప్రార్థనలు విన్నట్లే కనబడతారు. కాని వారు ఎవరిని అనుగ్రహించదలిచారో వారికి మాత్రమే వారిచ్చే దీక్ష, ఉపదేశం, మార్గదర్శనం అందేవి. దీక్ష కూడా సాధకుని మనఃస్థితిని బట్టి మారుతుంటుంది. పరమహంస యోగానంద (ఒకయోగి ఆత్మకథ రచయిత) ప్రజలకు పెద్ద ఎత్తున మేలుచేయుట ఎలా అని అడిగితే, భగవాన్‌ – “అదెలా సాధ్యం? మూకుమ్మడి దీక్షలుండవు. ఉపదేశం సాధకుని పక్వత, అర్హతలపై ఆధారపడి వుంటుంది” అన్నారు.*


*రమణుల ఉపదేశదీక్షా కార్యక్రమం ఎంత క్రియాశీలకమైందో అంత గోప్యమైంది కూడా. చూసేవారికి దాని ఆనుపానులు తెలియక వారెవరికీ దీక్ష యివ్వరనీ, అసలు ఎవరినీ పట్టించుకోరన్న అపోహ కలిగేది. ఈ విషయంలో నటేశ ముదలియార్‌ను ఇదే మిషపై నిరుత్సాహపరిచాడో బ్రాహ్మణుడు. నిజానికి ఆత్మసాక్షాత్కారానికి సద్గురువు ప్రసాదించే దీక్ష, ఉపదేశం అత్యంత ఆవశ్యకం. ఈ విషయంలో భగవాన్‌ అభిప్రాయం ఇతర సంప్రదాయ గురువుల అభిప్రాయంకంటే ఏ విధంగాను భిన్నంకాదు. అందుచేత సత్య సాధకులకు రమణుల బోధనా విశిష్టత, ప్రశాంతయుతమైన వారి సన్నిధి లభిస్తే సరిపోదు. వారు తమకు దీక్షాగురువులన్న సంగతి ఏదోవిధంగా ప్రతిష్ఠమవ్వాలి.*


*గురువుకు సమర్పణ అంటే తన ఆత్మకంటే బాహ్యంగా వున్న వేరెవరికో కాదు. తన నిజతత్త్వాన్ని గుర్తించే దిశలో సహకరించేందుకు తనకు బాహ్యంగా ప్రకటమైన తనకే అని గుర్తించాలి. “గురువున్నది లోపలే. ధ్యానం చేసేది గురువు బాహ్యంగా ఉన్నాడన్న అజ్ఞానపు అపోహను తొలగించేందుకు. అతడు బాహ్యంలో తారసిల్లిన ఎవరో నూతనవ్యక్తి కాడు సుమా! అదే అయితే, ఇతరులవలె అతడూ కాలక్రమంలో అదృశ్యమై తీరుతాడు. అలాటి అశాశ్వత వ్యక్తితో ఒరిగేదేమిటి? మరి, నీవో పరిమితమైన దేహం అనుకున్నంతసేపు గురువు కూడా వేరే దేహంతోటి నీకు వెలుపల కనిపించే ఆవశ్యకత ఉంది. ‘నేను’ దేహమనే దోషభావం తొలగిపోగానే ఇంకేముంది, గురుమూర్తి నీ స్వరూపమే అయిన ఆత్మ అని గ్రహిస్తావు.*


*పూర్ణత్వంతోటి తాదాత్మ్యంలో ఉన్న గురువుకు పరిమిత అహం-గుర్తింపు లేని కారణంగా ఆ సంగతిని ప్రకటించే పనిలేదు. అలాగే ఇతరాన్ని చూడని కారణంగా తనకేదో శిష్యులున్నారనీ చెప్పుకోడు. రూపాలుంటేనే నంబంధాలు, బంధాలు కదమ్మా!*


*అయితే ఈ విషయంలో తికమక పడిపోయి, ఎటూ పాలుపోక అగమ్యగోచర స్థితిలో ఉన్న భక్తుని ఓదార్చి, సందేహాన్ని తీర్చి, నిలదొక్కుకునేలా చేయడంలో ఆయనకాయనే సాటి. 1940లో తనకట్టి అభయం ఈయబడినట్లుగా  చాడ్‌విక్‌ అనే ఇంగ్లీష్‌ భక్తుడు వ్రాసుకున్నాడు...


నీ మనసును నియంత్రించడం అంటే నీ మనస్సును నీవు సంపూర్ణంగా జయించడమే అని అర్థం. 


నీ మనస్సును నువ్వు సంపూర్ణంగా జయిస్తే ఈ ప్రపంచంలో నువ్వు అంటూ సాధించవలసినవి అంటూ ఏమి ఉండవు.


 అన్నీ కేవలం జరిగిపోవడం అన్నవి మాత్రమే ఉంటాయి. పైగా మనస్సును జయించినవాడు ఈ ప్రపంచాన్ని జయించినవాడి కంటే గొప్పవాడు అని మన పెద్దలు చెప్పిన మాట.


 ఎందుకంటే నీ యొక్క లక్ష్యాన్ని (నీ హృదయంలో భగవంతుని దివ్య దర్శనాన్ని) దూరం చేసే మొదటి శత్రువు ఇదే కనుక. దీనిని జయిస్తే అదే నీకు మిత్రువు అవుతుంది. అదే అప్పుడు నీకు భగవంతుని దివ్య దర్శనానికి సహకరిస్తుంది.


 దీనిని బట్టి ఆలోచిస్తే మన లక్ష్య దిశగా ఆలోచిస్తే జయించడం మాత్రమే ఉత్తమోత్తమమైనది.


ఈ మనస్సు గురించి రమణ మహర్షి తెలిపిన ముఖ్యమైన విషయాలు :


వృత్తులన్నీ అహం (అంటే నేను) వృత్తిపై ఆధారపడి యున్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు.


మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసేలేదని రూడి అవుతుంది. అదే సరైనదారి.


ఈశ్వరశక్తి యనెడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి.


మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ,భక్తీ,జ్ఞాన యోగ మార్గాల ఉపదేశసారం.


వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుటపడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము.


లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనసు తిరిగి జనించును. నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు.


 ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మ యనెడి ఒకేఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది


నేను – నాది అనే భావన నుంచి భయటపడాలి.


*నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది. నేను, నాది అనేవి రెండు పెద్ద ప్రమాదకారులు. అయినా జీవిత మంతా మనం వీటితోనే బతకాలి. ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది, అమ్మ ఒడిలో ఇవి ఉండవు. నేను మొదలవుతుంటే నాది అనేది. దాని వెనక తోకల్లాగవస్తుంది. స్వార్థానికి నేను-నాది’రెండు రెక్కలు. ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు. హాయిగా అహం తోటలో ఎగురుతున్నవాడిని ” ఆ రెక్కలు వదులుకోఅని చెప్పేవారూ ఉండరు. ఎందుకంటే అది వాళ్లకూ అవసరమే.*


*‘నేను-నాది’ లేకపోతే జీవితం సాగదేమో! నేను-నాది తోనే లోకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిద్రలో అవి ఉండవు.* *అప్పుడులోకం కూడా ఉండదు. ఎవరైనా మన ‘నేను’ మీద దెబ్బకొడితే విలవిల్లాడిపోతాం. ఎదుటివాడి ‘నేను’ మీద దెబ్బతీయకుండా ఉండలేం, నాదనేది ఎవరైనా లాక్కుపోతే చూస్తూ ఊరుకోం. పోరాడి, పెనుగులాడి నాది అనేదాన్ని నిలబెట్టుకుంటాం. జీవితమంతా ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది. *అసలు ఈ నేను-నాది లేని మనుషులు ఉంటారా? ఉంటారు. వాళ్లే ఆధ్యాత్మికవాదులు. తీవ్రమైన ఆధ్యాత్మిక బ్రహ్మీస్థితిలో మునిగి ఉన్నవారు. వాళ్లకు నేను-నాది యోచనలు తగ్గిపోతూ ఉంటాయి.*

*ఎలాగైనా వాటిని వదిలించుకోవటానికి ధ్యానం, పూజ, జపం, ప్రార్థన, యోగం అనే ఆయుధాలను ప్రయోగిస్తుంటారు.*


*ప్రార్ధన చేసే వ్యక్తి తాను గొప్పగా ప్రార్ధన చేస్తున్నాను అనుకున్నాడంటే నేను’ తగ్గకపోగా మరింత బలపడుతుంది. “నాకు పూజ తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు, నేను జపంలో మునిగానంటే ప్రపంచమే తెలియదు” లాంటి భావాలతో ముందుకు వెళితే నేను-నాది ఇంకా బలిష్టమవుతాయి. లక్ష్యం నెరవేరకపోగా, దానికి ఇంకా దూరమైనట్లు అవుతుంది.*


*ఈ నేను-నాది జంజాటానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది. అది భక్తి. భక్తితో ఏ పని చేసినా అది భగవదర్పణ అవుతుంది. భక్తి పారవశ్యంలో నేను-నాది అనేవి క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. భక్తుడు భగవంతుడిలో లీనమయ్యే కర్మలోనే నేను-నాది లేకుండా పోయే స్థితి వస్తుంది. అయితే అదంత సులువైన స్థితి కాదు. నేను-నాదికి బదులు మనం-మనది అనుకోవడం ఎంతో బావుంటుంది. ఇది అసలైన జ్ఞానం.*


*దీన్ని మెల్లగా మనం ఒంటపట్టించుకోవాలి. నేను-నాది చిన్నప్పటినుంచే సహజంగా వచ్చేస్తాయి. ఆ స్థానంలో మనం-మనది అభ్యాసం చెయ్యాలి. అలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. కొంచెం కష్టమైనా అది అసాధ్యం కాదు. నేను లేకపోతే బతుకు చప్పగా ఉన్నట్లనిపిస్తుంది.


 చాలామందికి నాదనేది లేకపోతే ఎందుకు మనం బతకడం అనిపిస్తుంది కూడా. కాని జంతువులకు పక్షులకు, చెట్లకు నేను-నాది ఉందా అనే భావాలు ఉన్నాయా? సహజ భావాలు వాటిని నడిపిస్తాయి. నేను లేకపోవడం వల్ల బాధనూ మరిచిపోయి అవి ఆనందంగా ఉంటాయి. మనకు భౌతిక బాధలూ మానసిక సంకటాలుగా తయారై ఏడిపించుకుతింటూ ఉంటాయి.*


*అందరూ మాయ అంటున్న ఈ ప్రపంచంబాగుంది. ఇక్కడ నేను హాయిగా ఉంటాను. ఈ రంగురంగుల పూలు, చెట్లు, పక్షులు, ఆకాశం, గాలి, ప్రకృతి నాదే. నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని. నా జన్మకు ఏదో ప్రయోజనం ఉంది. అందుకే ఈ ప్రకృతి నా తల్లి ద్వారా నన్ను భూమ్మీదకు తెచ్చింది. నేనెంతో అదృష్టవంతుణ్నీ. ఈ నేను భావనను బాగా విస్తృతపరచుకొని ‘మనంగా మార్చుకుంటాను. నాది యోచనను బాగా విశాలం చేసి మనదిగా చేసుకుంటాను. ఉన్నంతకాలం అందరికోసం ఆలోచిస్తాను. అందరితో కలిసి పనిచేస్తాను. లక్ష్యసాధనకు అవరోధంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుని నేను-నాది అనే దాన్ని మరిచిపోయి నది సముద్రంలో కలిసిపోయినట్లుగా సముద్రాకార నదిగా ఆనందం పొందుతాను అనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు. అతడే వేదాంతి, అతడే విశ్వప్రేమికుడు. అలాంటివాడినే పరమాత్మ భగవద్గీతలో పరమశ్రేష్ఠుడు అని చెప్పాడు. సమబుద్దికలవాడి కంటే మించినవాడు ఈ లోకంలోలేడు. ఈ సమత్వమే యోగం...

కామెంట్‌లు లేవు: