ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, ఏప్రిల్ 2024, శనివారం
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శ్రేయస్కరము.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శ్రేయస్కరము. అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్ఠము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:
1. విద్యాభివృద్ధికి:
(14)
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||
2. ఉదర రోగ నివృత్తికి:
(16)
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||
3. ఉత్సాహమునకు:
(18)
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||
4. మేధాసంపత్తికి:
(19)
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||
5. కంటి చూపునకు:
(24)
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్
||
6. కోరికలిరేడుటకు:
(27)
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||
7. వివాహ ప్రాప్తికి:
(32)
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||
8. అభివృద్ధికి:
(42)
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||
9. మరణ భీతి తొలగుటకు:
(44)
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||
10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:
(46)
విస్తారః స్థావర స్స్టాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||
11. జ్ఞానాభివ్రుద్ధికి:
(48)
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||
12. క్షేమభివ్రుధ్ధికి:
(64)
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||
13. నిరంతర దైవ చింతనకు:
(65)
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||
14. దుఃఖ నివారణకు:
(67)
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||
15. జన్మ రాహిత్యమునకు:
(75)
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||
16. శత్రువుల జయించుటకు:
(88)
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||
17. భయ నాశనమునకు:
(89)
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||
18. మంగళ ప్రాప్తికి:
(96)
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||
19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:
(97 & 98)
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||
20. దుస్వప్న నాసనమునకు:
(99)
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||
21. పాపక్షయమునకు:
(106)
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్తా క్షితీశః పాపనాసనః ||
శ్రీరస్తు --- శుభమస్తు --- విజయోస్తు
ఓం అసతోమా సద్గమయ
ఓం తమసోమ జ్యోతిర్గమయ
ఓం మృత్యోర్మా అమ్రుతంగమయా
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః
పంచాయతనం
పంచాయతనం:
అనేక విధాలుగా ఉన్న మన ఆరాధనా పద్ధతులను అధ్యయనం చేసిన ఆదిశంకరులు ‘పంచ దేవతారాధన’ ను పునరుద్ధరించారు.
"ఆయతనం" అంటే ఆకారం.
‘పంచాయతనం’ అనగా అయిదు ఆకారాలు గల పరమాత్మ.
ఆ పరమాత్మ పేరు పంచాతనుడు.
ఆయన పూజ పంచాయతన పూజ.
ఆదిత్యం అంబికామ్ విష్ణుం గణనాథం మహేశ్వరం
పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం
ఆదిత్యం – సూర్యుడు,
అంబికా – అమ్మవారు,
విష్ణుం – మహావిష్ణువు
గణనాథం – గణపతి
మహేశ్వరం – ఈశ్వరుడు
ఈ ఐదుగురినీ పంచాయతన దేవతలని అంటారు. హిందూ ధర్మశాస్త్రాలు వీరిని ప్రధాన దేవతలుగా పేర్కొన్నాయి.
"ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్” అన్నారు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. కర్మ సాక్షి. యావత్ సృష్టికీ శక్తిని ప్రసాదించగల మహా తేజస్వి, ఓజస్వి. ఆయనను ఆరాధించడం ద్వారా ధృఢ ఆయురా రోగ్యాలను పొందుతారు.
సాహిశ్రీరమృతాసతాం* – అమ్మ వారిని మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ రూపములైన లలితాంబికగా ఆరాధించాలి. అమ్మవారి ఆరాధన వలన అఖండమైన వాక్ శుద్ధి, సంపద, భాగ్యం, త్రికాల దర్శనం, దివ్యదృష్టి వంటి అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి. వీటన్నింటి కన్నా అంతఃకరణ శుద్ధి కలిగి మానసిక పరిణతి పొందుతారు.
"మోక్షమిచ్చేత్ జనార్ధనాత్"అన్నారు
మొక్షాన్నిచ్చే వాడు మహావిష్ణువు. విష్ణువు యొక్క దశావతారాలలో ప్రధానమైన మరియు సంపూర్ణావతారమైన శ్రీకృష్ణా వతారం. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అని అంటారు. ఆయన ఆవిర్భావం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం.
అనగా, శిష్టులను రక్షించడం అంటే కేవలం దుష్టుల నుండి కాపాడడమే కాక పతనమయ్యే మార్గం నుంచి వారిని రక్షించి మోక్షమార్గాన్ని ఉపదేశించే భగవద్గీతా శాస్త్రాన్ని మానవ జాతికి ప్రసాదించాడు.
"ఆద్యౌపూజ్యో గణాధిప"అన్నారు
ఏ కార్యమును ప్రారంభించినా మొదటగా పూజించబడేది గణపతే. మహా గణపతి యొక్క ఆరాధన ప్రధానంగా యోగసాధనకు ఉపకరిస్తుంది. దీనివలన సాధనలో ప్రతిబంధకములు తొలగడమే కాకుండా ఐహిక, ఆముష్మిక వాంచలు కూడా నెరవేరుతాయి.
"ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్"అన్నారు.
ఈశ్వరానుగ్రహం వలన ఆయుష్షు వృద్ధి పొంది, సకలైశ్వర్యాలూ సంప్రాప్త మౌతాయి. రుద్రాభిషేకాలు, రుద్రజపం మొదలగు వాటి వాళ్ళ సమస్త దుఃఖాలు నివారణ కలిగి, గ్రహ బాధలు తొలగి స్వాంతన, ఐశ్వర్యసిద్ధి, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.
ఈ పంచాయతనంలో ఏయే దేవతలు ఏయే దిశల్లో ఉండాలంటే ఈశాన్యంలో, విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యుడు(అగ్ని), నైరుతిలో గణపతి, వాయువ్యంలో అంబికను(అమ్మవారిని) ఉంచి, మధ్యలో శివుడిని ఉంచి చేసే పూజకి "శివ పంచాయతనం " అని పేరు.
ఇంకా వివరంగా చెప్పాలంటే, ఈ అయిదుగురి దేవతలలోను, ఏ దేవతని మధ్యలో ప్రధానంగా ఉంచి పూజ చేస్తారో, దానికి ఆ దేవత పేరిట పంచాయతనంగా వ్యవహరిస్తారు. అనగా, మధ్యలో గణపతిని ఉంచితే గణపతి పంచాయతనం గా వ్యవహరిస్తారు. విష్ణుమూర్తిని ఉంచితే విష్ణు పంచాయతనం అని, అలాగే మిగతావారిని వారి పేర్లతో పంచాయతనాన్ని వ్యవహరిస్తారు.
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం - ఇవి పంచ భూతాలు. ఈ పంచ భూతాలకు ప్రతీకలే మనం పైన చెప్పుకున్న దేవతలు. అందువలన, ఆ
దేవతలను పూజిస్తే పంచభూతాలను అర్చించిన ఫలం దక్కుతుంది.
ముఖ్యంగా గమనించినట్లయితే ఆకాశమ్నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీరునుండి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుండి ఆహారం, ఆహారం వలన ప్రాణికోటి, జంతుజాలం ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయం భగవద్గీతలో గీతాచార్యుడు ఉద్భోదించడమేకాక, అధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. అనగా శివుడు ఆకాశ తత్వాన్ని, అమ్మవారు వాయుతత్వాన్ని, సూర్యుడు అగ్నితత్వాన్నీ, విష్ణుమూర్తీ జల తత్వాన్ని, గణపతి పృద్వీ తత్వాన్నీ కలిగిఉంటారని పండితుల ఉవాచ.
ఇంక - నాదం శబ్ధప్రధానం. ఆకాశానిది శబ్ధ గుణం. అందుకే శివుణ్ణి ఆకాశ తత్వానికి ప్రతీకగా అభివర్ణించారు.
వాయువుకు ప్రాణాన్ని ప్రసాదించే శక్తి ఉంది. అమ్మవారు "ప్రాణధాత్రి " కదా. అందుకే అమ్మవారికి వాయుతత్వం ఉందంటారు.
సూర్య అష్టోత్తర శతనామాల్లో "అగ్నిహోత్రాయ నమః" అని అన్నారు. కనుకనే సూర్యుడు అగ్నికి ప్రతీక.
విష్ణువు జల సంభూతుడు. "నారం" అంటే జలం. నారం నుంచి ఆవిర్భవించినవాడు కాబట్టే ఆయనని "నారాయణుడు" అంటున్నాము.
గణపతి మూలాధార చక్రాధిదేవత. అంటే మూలాధారమన్నది, పృద్వీ తత్వం. అందుచేతనే గణపతిని "మట్టితో " చేసి పూజిస్తారు. మట్టి గణపతి మహత్తు చాలా అద్భుతమైనది.
ఇంట్లో నిత్యం చేసే దేవతార్చనలో పంచాయతన పూజా విధానాన్ని తప్పకుండా అనుసరించాలని పెద్దల సూచన.
షోణ నదిలో దొరికే షోణ భద్రం శిలను గణపతి అనీ, గండకీ నదిలో దొరికే శిలను విష్ణువు అనీ, నర్మదా నదిలో దొరికే బాణలింగ శిలను శివుడు అనీ, స్వర్ణముఖిలోను, అలాగే ఖనులలో దొరికే హేమాక్షకం అనే శిలను అమ్మవారు అనీ, యమునా నదిలోను ముఖ్య పర్వత ప్రాంతంలోను లభించే స్పటిక శిలను సూర్యుడు అనీ భావించి వాటిని అరాధిస్తారు.
ఇంక పంచాయతనార్చన చేసేముందు ప్రాతః సంధ్యావందనం విధిగా ఆచరించాలన్నది శాస్త్రవచనం. ఏ పూజకైనా, సంధ్యావదనం గాయత్రీ మంత్ర జపం చేసి చేస్తేనే ఉత్తమం.
సర్వే జనాః సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని సంతు
ఎముకలు తొందరగా అతుకుటకు
విరిగిన ఎముకలు తొందరగా అతుకుటకు సులభ యోగం -
గోధుమలను ఒక మూకుడులో వేసి మాడ్చి చూర్ణం చేసి పూటకు పది గ్రాముల చొప్పున రోజు రెండుపూటలా తేనెతో కలుపుకుని తినుచుండిన అతి త్వరగా ఎముకలు అతుక్కోనును .
గమనిక -
గోధుమలను వేయించు సమయమున నూనె కాని నీరు కాని వాడకూడదు .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
ముందుకు వెయ్యలేదు.* 🌺✍🏽
*సుభాషితం*
*--------------*
🌺 *యోజనానాం సహస్రంతు*
*శనైర్యాతి పిపిలికా౹*
*అగచ్ఛన్ వైనతేయోsపి*
*పదమేకం న గచ్ఛతి౹౹.* 🌺
*భావం. ముందుకు నెమ్మదిగా వెళ్లే చీమ వెయ్యి మైళ్ళు అయినా అలా వెళుతుంది. అయితే గరుడ పక్షి ముందుకు వెళ్లాలని అనుకోకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు.*
🌺✍🏽
తెలుగు యుగాది సంll.ల పేర్లు
*తెలుగు యుగాది సంll.ల పేర్లు ఎలా వచ్చాయి,వాటి అర్థాలు...*
ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ
తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికీ కూడా మనం పిలుస్తున్నాము.
తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారమే కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు ఇవే.
తెలుగు ఉగాది 60 సంవత్సరాల పేర్లు:
*1.ప్రభవ-* యజ్ఞాలు అధికంగా జరుగుతాయి
*2.విభవ-* సుఖంగా జీవిస్తారు
*3.శుక్ల-* సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు
*4.ప్రమోద్యుత-* అందరికీ ఆనందాన్ని ఇస్తుంది
*5.ప్రజోత్పత్తి-* అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది
*6.అంగీరస-* భోగాలు కలుగుతాయి
*7.శ్రీముఖ-* వనరులు సమృద్ధిగా ఉంటాయి
*8.భావ-* ఉన్నత భావాలు కలిగి ఉంటారు
*9.యువ-* వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి
*10.ధాత-* అనారోగ్య బాధలు తగ్గుతాయి
*11.ఈశ్వర-* క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది
*12.బహుధాన్య-* దేశం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది
*13.ప్రమాది-* వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి
*14.విక్రమ-* పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు
*15.వృష-* వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి
*16.చిత్రభాను-* అద్భుతమైన ఫలితాలు పొందుతారు
*17.స్వభాను-* క్షేమము, ఆరోగ్యం
*18.తారణ-* మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి
*19.పార్థివ-* ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి
*20.వ్యయ-* అతివృష్టి, అనవసర ఖర్చులు
*21.సర్వజిత్తు-* సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి
*22.సర్వదారి-* సుభిక్షంగా ఉంటారు
*23.విరోధి-* వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం
*24.వికృతి-* ఈ సమయం భయంకరంగా ఉంటుంది
*25.ఖర-* పరిస్థితులు సాధారణంగా ఉంటాయి
*26.నందన-* ప్రజలకు ఆనందం కలుగుతుంది
*27.విజయ-* శత్రువులను జయిస్తారు
*28.జయ-* లాభాలు, విజయం సాధిస్తారు
*29.మన్మధ-* జ్వరాది బాధలు తొలగిపోతాయి
*30.దుర్ముఖి-* ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు
*31.హేవళంబి-* ప్రజలు సంతోషంగా ఉంటారు
*32.విళంబి-* సుభిక్షంగా ఉంటారు
*33.వికారి-* ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది
*34.శార్వరి-* పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది
*35.ఫ్లవ-* నీరు సమృద్ధిగా ఉంటుంది
*36.శుభకృత-* శుభాలు కలిగిస్తుంది
*37.శోభకృత్-* లాభాలు ఇస్తుంది
*38.క్రోధి-* కోపం కలిగిస్తుంది
*39.విశ్వావసు-* ధనం సమృద్ధిగా ఉంటుంది
*40.పరాభవ-* ప్రజల పరాభవాలకు గురవుతారు
*41.ఫ్లవంగ-* నీరు సమృద్ధిగా ఉంటుంది
*42.కీలక-* పంటలు బాగా పండుతాయి
*43.సౌమ్య-* శుభ ఫలితాలు అధికం
*44.సాధారణ-* సాధారణ పరిస్థితులు ఉంటాయి
*45.విరోధికృత్-* ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది
*46.పరీధావి-* ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది
*47.ప్రమాదీచ-* ప్రమాదాలు ఎక్కువ
*48.ఆనంద-* ఆనందంగా ఉంటారు
*49.రాక్షస-* కఠిన హృదయం కలిగి ఉంటారు
*50.నల-* పంటలు బాగా పండుతాయి
*51.పింగళ-* సామాన్య ఫలితాలు కలుగుతాయి
*52.కాళయుక్తి-* కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి
*53.సిద్ధార్థి-* కార్య సిద్ధి
*54.రౌద్రి-* ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి
*55.దుర్మతి-* వర్షాలు సామాన్యంగా ఉంటాయి
*56.దుందుభి-* క్షేమం, ధ్యానం
*57.రుధిరోద్గారి-* ప్రమాదాలు ఎక్కువ
*58.రక్తాక్షి-* అశుభాలు కలుగుతాయి
*59.క్రోధన-* విజయాలు సిద్ధిస్తాయి
*60.అక్షయ-* తరగని సంపద
ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సర పేర్లు వచ్చాయి...🙏
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
బెత్తం
*బెత్తం*
మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కు కున్నాడు. రాయుడు. రాయుడికి మంత్రి పదవి లభించింది.
.కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య
హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బంది తో సహా వెళ్ళాడు.అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు.రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది చాలా కార్లు నిలిచి వున్నాయి అక్కడ.జనం కూడా చాలా మందే వున్నారు.
30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రామ ఉపాధ్యాయుడు నడిపేవాడు.అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు.రెండుకూరలు,రెండు పచ్చళ్ళు,పప్పు పులుసు అన్నీ ఉండేవి మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు.గడ్డ పెరుగు కూడా వేసేవాడు..హాయిగా తినండి.నిదానంగా
తినండి తొందరేమీ లేదు అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు.ఎంత కావాలో
అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చెయ్యకండి అని హెచ్చరిస్తూ .తిరిగేవాడు.ఎవరైనా పారేస్తే చెయ్యి .
చాపమని బెత్తం తో కొట్టేవాడు.ఎంత పెద్దవాళ్ళయినా,చిన్నవాళ్ళయినా పారేస్తే దెబ్బలు తినాల్సిందే.
బళ్ళో పిల్లలు తప్పు చేస్తే ఎలా కొట్టే వాడో ఇక్కడా అంతే.అక్కడ వేరే మంచి హోటల్ లేకపోవడం తో.అక్కడ పదార్థాలు చాలా రుచిగా వుండడంతో అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు.అందరూ అతన్ని తిక్కశంకరయ్య అని పిలిచేవారు.
రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు.పెద్ద వ్యాపార వేత్తగా డబ్బు బాగానే గడించాడు.
అప్పట్లో తనకు వ్యాపారం లో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీది హనుమ ను దర్శించుకుంటానని
మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండమీది స్వామిని దర్శించుకొని ఆ హోటల్ లో భోజనం చేద్దామని వచ్చాడు.
శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వెయ్యండి యిది వెయ్యండి. అని అన్నీ వేయించుకొని తిన్నంతా తిని సగం పారవేసి చెయ్యి కడుక్కున్నాడు.అది చూసి శంకరయ్యకు కోపం నసాళానికి అంటింది
బెత్తం పట్టుకొని రాయుడి దగ్గరకు వచ్చి చేయి చాచమన్నాడు.చుట్టూ వున్నవాళ్ళు అతనె వరనుకున్నావు? పెద్ద జమీందారు అయినా డబ్బు చెల్లిస్తున్నాం మా యిష్ట మొచ్చినంత తింటాం పారేస్తాం నీకేమిటి?అన్నారు అతని వెంట వచ్చినవాళ్ళు. .మీరు డబ్బు చెల్లించినా సరే పారెయ్యడానికి మీకు హక్కు లేదు.ఎన్ని కోట్లు డబ్బు వున్నా ఆకలేస్తే డబ్బు తింటారా?మీకందరికీ కూడా సామాజిక బాధ్యత వుండాలి బరువూ బాధ్యత తెలుసుకొని నడుచుకోవాలి అన్నాన్ని పారేస్తే మీకు ఎప్పుడయినా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు.అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని వృధా చెయ్యకూడదు.యిలా వ్యర్థం చేస్తే మీ తరువాతి తరాలవారికి తినడానికి తిండి దొరకదు.అన్నాడు.రాయుడు నవ్వుతూ చెయ్యి జాచాడు.శంకరయ్య బెత్తం తో గట్టిగా కొట్టాడు.అప్పటి సంగతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఎమ్.ఎల్.ఏ గా నిలబడి గెలిచాడు.ఇప్పుడు మంత్రి పదవి లభించింది.
ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆ హోటల్ లో ప్రవేశించాడు.తన అనుచరులతో పాటు.
శంకరయ్య చనిపోయినట్టున్నాడు,అతని ఫోటో అక్కడ బల్ల మీద పెట్టివుంది పూలమాల వేసి.ఆ ఫోటో వెనక అతని బెత్తం కూడా వుంది బూజు పట్టి. మంత్రిగారు వచ్చారని అక్కడి యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య
పరిగెత్తు కుంటూ వచ్చి తెగ హడావుడి చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను
వద్దంటున్నా వినకుండా వేయించాడు.అందరూ తినలేక చాలా పారవేశారు.అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది.తట్టుకోలేక పోయాడు.శంకరయ్య ఫోటో వెనక వున్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు .కోపంగా విఘ్నేశ్వ రయ్య దగ్గరికి వెళ్లి యింత అతి మర్యాద చేసే అవసరం లేదు.ముందు నీ బాధ్యత తెలుసుకో ఎంత భోజనం వృధా అయింది చూడు.అని అతన్ని చెయ్యి చాచమని చితక బాదాడు.ఆ బూజు పట్టిన బెత్తాన్నిముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు..
ఈ కాలం లో అటువంటి నేతలు వున్నారా?వుంటే వారికి పాద నమస్కారం చెయ్యాల్సిందే.మనమంతా కూడా ఎక్కడయినా సరే తినే పదార్థాలను వృధా చెయ్యకూడదు.ఇప్పటికీ మా యింట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తాము.
(నవ్య వార పత్రిక సౌజన్యం తో)
.
అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని పారవేస్తే మరుజన్మలో మనకు అన్నమో రామచంద్రా అని ఏడ్చే గతి పడుతుందని పెద్దలు చెప్తారు.(తినే పదార్ధం ఏదైనా అన్నమే)
రసజ్ఞభారతి సౌజన్యంతో
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
*13-04-2024 / శనివారం / రాశిఫలాలు*
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.
---------------------------------------
వృషభం
సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
మిధునం
ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
---------------------------------------
కర్కాటకం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
---------------------------------------
సింహం
సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
---------------------------------------
కన్య
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాల అందుకుంటారు.ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
---------------------------------------
తుల
చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖులు నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
---------------------------------------
వృశ్చికం
పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు.
---------------------------------------
ధనస్సు
వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
---------------------------------------
మకరం
గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
---------------------------------------
కుంభం
ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృత మవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
---------------------------------------
మీనం
దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🍁 *శుభం భూయాత్* 🍀
దురాత్ములకు
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝
*అకరుణత్వమకారణవిగ్రహః*
*పరధనే పరయోషితి చ స్పృహా*
*సుజనబంధుజనేష్వసహిష్ణుతా*
*ప్రకృతిసిద్ధమిదంహి దురాత్మనామ్*
*-- _భర్తృహరి - నీతి శాస్త్రం_ --*
తా𝕝𝕝
దయ లేకుండా వుండడం, నిష్కారణంగా కలహించే గుణం, పరధన, పరస్త్రీల యందు ఆశ, మంచి వారి యందు, ఆత్మీయుల యందు అకారణ ద్వేషం, ఇవి దురాత్ములకు సహజ సిద్ధంగా వుండే గుణాలు.