ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
27, ఆగస్టు 2023, ఆదివారం
⚜ శ్రీ గిరిజాబంద్ హనుమాన్ మందిర్
🕉 మన గుడి :
⚜ ఛత్తీస్‌గఢ్ : రతన్‌పూర్
⚜ శ్రీ గిరిజాబంద్ హనుమాన్ మందిర్
💠 భారతదేశంలోని ప్రతి పట్టణం లేదా గ్రామంలో ఏవో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు లేదా సాంప్రదాయేతర స్థలాలు ఉండటం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారింది.
కానీ చాలా అసాధారణమైన కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి, అవి ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తాయి.
సరే, అలాంటి ఒక ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం
💠 శ్రీ రాముడికి ప్రియ భక్తుడు, ఆ జన్మ బ్రహ్మ చారి అయిన ఆంజనేయుడు హిందువులు అందరికీ ఇష్ట దైవము.
కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడుని చూడగానే చిన్న, పెద్ద అందరిలో ఒక విధమైన ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి.
భక్తికి, సేవానిరతికి మారు పేరుగా హనుమను వర్ణిస్తారు. అలాంటి ఆంజనేయుడికి ప్రతి ఊరు లోను దేవాలయాలు ఉన్నాయి.
💠 ఆజన్మాంతం శ్రీ రాముని సేవకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి అక్కడ మాత్రం దేవతగా స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్నాడు.
*అవును, మీరు సరిగ్గానే విన్నారు.*
ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్ జిల్లాలోని గిర్జాబంధ్‌లోని ఆలయంలో హనుమంతుడు స్త్రీ రూపంలో పూజించబడతారు
ప్రపంచంలోనే ఆంజనేయుడిని స్త్రీ రూపంలో పూజించే దేవాలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జ్ బంద్ లో ఉంది.
💠 పురుషాధిక్యానికి పర్యాయపదంగా ఉన్న దేవుడిని స్త్రీగా పూజించడం ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
రతన్‌పూర్‌ను "మహామాయ నగరి" అని కూడా పిలుస్తారు..
💠 శ్రీరాముని యొక్క అతిపెద్ద భక్తుడు 'దేవత'గా పూజించబడే ప్రపంచంలోని ఏకైక దేవాలయం ఇదే కావచ్చు.
ఆసక్తికరంగా, శ్రీరామ మాత సీతను వరుసగా 'ఆమె' ఎడమ మరియు కుడి భుజాలపై మోస్తున్న ఈ హనుమాన్ విగ్రహాన్ని మనం చూడవచ్చు.
💠 ఈ హనుమంతుని విగ్రహం దక్షిణాభిముఖంగా ఉంటుంది కాబట్టి దీనిని దక్షిణామూర్తి అని కూడా అంటారు.
💠 ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన స్త్రీ రూపంలో ఉన్న హనుమాన్ జీ విగ్రహం సుమారు 10 వేల సంవత్సరాల నాటిదని నమ్ముతారు మరియు ఇక్కడ నుండి ఏ భక్తుడు నిరాశతో లేదా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళడు అని నమ్మకం.
ఇక్కడ దేవత రూపంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులు ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్మకం.
💠 ఇక్కడ రాముడు, సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్న ఆంజనేయుని విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఆంజనేయుని భక్తుడైన రతన్ పూర్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది.
💠 ఒకసారి ఆ రాజు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దానితో హనుమంతుడిని ప్రార్థించగా ఆయన తన ఆలయం నిర్మించమని కలలో ఆదేశించాడు.
హనుమ ఆదేశం మేరకు గుడి నిర్మాణం చేపట్టిన రాజుకి మళ్ళి కలలో కనిపించిన ఆంజనేయుడు మహామాయకుండ్ వద్ద ఉన్న విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ట జరపమని ఆదేశించాడు.
తరువాత రాజు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఆ గుడి పూర్తయ్యే సరికి ఆ రాజు ఆరోగ్యం కుదుట పడింది.
💠 ఇక్కడి విగ్రహమే విశిష్టమైనది.
ఇది దక్షిణాభిముఖంగా ఉన్న విగ్రహం, వానరముఖంతో మరియు తోక లేకుండా స్త్రీ రూపం.. అష్ట శృంగార హొయలతో అలంకరించబడి ఉంటుంది
💠 ఆలయం గర్భగుడి మరియు మండపాలను కలిగి ఉంటుంది.
హనుమంతుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని తన భుజాలపై మోస్తూ, అహిరావణుడుని తన పాదాల క్రింద నలిపివేయడాన్ని చూడవచ్చు.
గర్భగుడిపై ఉన్న శిఖరం ఎర్ర రాతితో చేయబడింది.
శ్రీరామ జానకి మరియు శివుని మందిరాలు కూడా చూడవచ్చు
💠 ఇక్కడి స్వామిని దర్శించుకోవాలంటే శీతాకాలం లో అక్టోబర్ నుండి మార్చ్ మధ్య కాలంలో సరైన సమయం...స్వస్తి
💠 ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు 25 కిమీ దూరంలో ఉన్న రతన్‌పూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన గిరిజాబంధ్ హనుమాన్ దేవాలయం ఉంది.
జై బజరంగబలి
💠💠💠💠💠
💠 💠💠💠💠
ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం
ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
భాగం : 2/12
-----------------------
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే పత్రంలోని ఒక అంశం)
1. చరిత్ర
చరిత్ర అనేది ఒక సంకలనం. గతంలోని వాస్తవాలని తెలియజేస్తుంది.
ప్రపంచ చరిత్రలు
భారతదేశ చరిత్ర, ఐరోపా చరిత్ర, ప్రపంచ చరిత్ర - ఇలా అనేక చరిత్రలు పాఠ్యాంశాలుగా మనం చదువుకుంటూ ఉంటాం.
అవి వివిధ కాలాలో, వివిధ ప్రాంతాలలో,
సామ్రాజ్యాలనీ, నాగరికతలనీ వివరంగా తెలుపుతాయి.
భారతదేశ చరిత్ర విషయంలో, వేదవిషయాలతోపాటుగా అనేకం, ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో, వారికనుగుణంగా చొప్పించబడ్డాయి.
ఆర్య - ద్రావిడ కృత్రిమ సృష్టియే దీనికి ప్రబల ఉదాహరణ.
తద్వారా మన అసలు చరిత్ర మారిపోయింది.
భారతీయ చరిత్ర ప్రత్యేకత - రామాయణం
పైన తెలిపిన ఆంగ్లేయులు మార్చిన వాటికి తావులేకుండా,
"ఇతిహాసమై"న శ్రీమద్వాల్మీకి రామాయణంలో అద్భుతమైన చరిత్ర మనకి కనబడుతుంది.
ఆ రామాయణాన్ని చూస్తే,
ప్రధానంగా సూర్యవంశ, నిమివంశ చరిత్రలూ, రావణ చరిత్రా కనబడతాయి.
అవి మంచీచెడులు రెండురకాలనీ తెలియజేస్తాయి.
సీతా - రాముల పూర్వుల చరిత్ర
సీతారాముల వివాహ సమయంలో
(i) దశరథుని మాటతో వశిష్ఠ మహర్షి,
బ్రహ్మతో మొదలుపెట్టి దశరథని వరకూ అయోధ్యను పాలించిన రాజుల వంశ క్రమాన్ని విశదపరుస్తూ, దశరథ సంతానం వరకూ తెలియజేశారు.
(ii) నిమి చక్రవర్తితో మొదలుపెట్టి జనకుని వరకూ జనక మహారాజే మిథిలా నగర రాజుల చరిత్ర స్వయంగా చెప్పారు.
(iii) రావణుడు బ్రహ్మ నుంచీ నాలుగో తరంగా కనబడతాడు.
భిన్న వయో ప్రమాణాలు
అయోధ్య రాజులలో అనరణ్యుని రావణుడు హింసించాడు. అనంతరం ఇరువది ఎనిమిది తరాల తరువాత శ్రీరామ జననం జరిగింది.
ఒక్కొక్క రాజు కాలం కూడ తక్కువేమీ కాదు. దశరథుడు అరవైవేల సంవత్సరాలు పరిపాలించాడు.
ఈ విషయాలు గమనిస్తే రావణుని జీవన ప్రమాణం అత్యధికమనీ, ఒకే కాలంలో గణనీయమైన వ్యత్యాసాలతో జీవనకాల ప్రమాణాలు ఉండేవనీ కూడా తెలుస్తుంది.
భిన్న నాగరికతలు - ధార్మిక ప్రమాణం
అయోధ్యని పరిపాలించిన రాజులందరూ ధర్మాచరణ పరాయణులే.
అయోధ్యలో ధార్మిక జీవనంతో కూడిన నాగరికతా,
లంకలో భౌతిక భోగలాలసతోనూ కూడిన నాగరికతా ఎంతగానో అభివృద్ధి చెందినవిగా కనిపిస్తాయి.
కానీ సత్యధర్మాల విషయంలో ఆ రెంటిమధ్య వ్యత్యాసం మనకి స్పష్టంగా కనబడుతుంది.
మొదటి మూడు తరాలూ సత్యధర్మాలు కలిగియున్నా, రావణుడు ఆ వంశధర్మాన్నీ, సంప్రదాయాన్నీ విడిచి దుష్టప్రవర్తన కలిగియున్నప్పుడు,
అతని సోదరుడైన విభీషణుడు లంకాధిపతియై ధర్మబద్ధంగా పరిపాలించాడు.
ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి.
శ్రీమద్వాల్మీకి రామాయణం రెండురకాల వాస్తవ చరిత్రలనీ తెలియజేస్తూ,
మంచీచెడుల వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతుంది.
ఒక్కొక్క రాజ చరిత్ర - అందే సందేశం
మధ్యమధ్యలో కొంతమంది రాజుల పరిపాలనలు కూడా శ్రీమద్రామాయణంలో ప్రస్తావించబడ్డాయి.
వాటిలో
ఒక్కొక్క రాజు చరిత్ర ద్వారా ఒక్కొక్క ప్రత్యేక విషయం బోధపడుతుంది.
ఉదాహరణకి
- రోమపాదుని చరిత్ర ద్వారా అనావృష్టి నివారణ,
- భగీరథుని విషయంలో, ఎన్ని అవరోధాలు వచ్చినా లక్ష్య సాధన (భగీరథ ప్రయత్నం),
- త్రిశంకు చరిత్ర ద్వారా అధర్మపరమైన వ్యక్తిగత కోర్కెలకి ఫలితాలు,
- కుశనాభుని వృత్తాంతం ద్వారా ఓర్పు కలిగియుండటం,
- నృగమహారాజు కథ ద్వారా రాజు ప్రజలకు అందుబాటులో ఉండవలసిన ఆవశ్యకత వంటి సందేశాలు మనకి అందుతాయి.
ఉపదేశం
పై అంశాలని పరిశీలిస్తే,
శ్రీమద్రామాయణంలోని చరిత్రలద్వారా,
ఈరోజు మనక్రియ రేపటికి చరిత్రగా మిగిలేందుకు,
మనం ఎలా ప్రవర్తించాలో తెలుపుతుంది.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు
40. నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు
___________________________
గురుసన్నిధిలో మనసు ప్రయత్నంగా
తాను పుట్టుచోటుకి వెళ్లిపోతుంది.
గురుసన్నిధిలో మౌనం కూడా
ప్రవక్తలా ప్రవచిస్తుంది.
గురుసన్నిధిలో దైవం కూడా
శిష్యునిలా మెలగుతుంది.
* * *
ప్రతిసారీ ఏదో ఒక సందర్భంలో గురువుగారు తరచూ చెప్పే మాటలు నాలుగున్నాయి...
1. నీ కనుచూపు పారినంతమేరకు ఉన్నదే ప్రపంచం.
2. "అందరూ" ఎక్కణ్ణుంచి వచ్చారు?
ఉండేది నీవొక్కడివే.
3. ముందు నీవు వచ్చాకే, సకలమూ వచ్చింది.
నీవు పోయాక ఇక్కడ ఉండేది కూడా ఏదీ ఉండదు.
4. జాగ్రత్-స్వప్న-సుషుప్తులు మూడూ కలిపి ఓ పెద్దకల అని ఎఱుకే 'నిజమైన మెలకువ'.
* * *
పై నాలుగు వాక్యాలను జీర్ణం చేసేసుకుంటే చాలు...
మనిషి ఋషైపోవడానికి...
ఒక్క సంకీర్తనైనా చాలు...నన్ను ఒద్దిక రక్షింపగ...
తక్కినవన్నీ భండారాన దాగీ ఉండనీ అన్నాడు అన్నమయ్య.
సద్గురు సాహిత్యం కూడా అంత పెద్ద మొత్తం మనకు అవసరం లేదు...
జ్ఞానప్రసూనాల్లో ఒక్క సూక్తి చాలు...తరించడానికి.
బట్టలషాపుకెళ్లి, మనకు సరిపోయే దుస్తులను కొనుగోలు చేసి బయటపడతాం...మిగతా దుస్తులతో మనకు పనిలేదు.
అలాంటిదే ఈ "జ్ఞానప్రసూనాలు" గ్రంథం కూడా.
మనక్కావలసిన వాక్యాన్ని తీసుకొని ఈసంసారం నుండి బయట పడాలి. మిగతా వాక్యాలతో మనకు పనిలేదు...ఎన్నైనా ఉండనీ, ఎలా అయినా ఉండనీ...ఎంత గొప్పగా ఉండనీ...
* * *
"బాబుతో ఉండు...బాబుగా ఉండొద్దు"
అన్నారు గురవుగారు నాతో ఓసారి...
ఆ ఒక్క ఉపదేశమే నా జీవితానికి సరిపోయింది.
అంటే బాబుగా ఉండొద్దు...సాక్షిగా ఉండు...
ఆ సాక్షిగా ఉన్నవాడు బాబు కాదు, బ్రహ్మమే.
ఆ బ్రహ్మమే నీవు.
అని ఆ ఉపదేశభావము.
ఆ ఉపదేశసారాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే-
"నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు".
* * *
కొంతమంది శిష్యుల ప్రోద్బలంతో మూడుసార్లు గురువుగారితో కలిసి అరుణాచలం వెళ్లే భాగ్యం కలిగింది నాకు.
అనంతనికేతన్ ఆశ్రమంలో చిలకమ్మకు అతిథులుగానే గడిపాం మూడుసార్లు...
స్వామీ...! తమరితో కలిసి అరుణాచల ప్రదక్షిణం చేయాలని ఉంది...అని పట్టెయ్య కోరినప్పుడు-
"అరుణాచలమే నా చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది...
మీరు వెళ్లి రండి..." అన్నారు.
ప్రపంచానికి అరుణాచలం కేంద్రం అయితే,
అరుణాచలానికి కేంద్రం సద్గురుదేవులే.
* * *
"తమరు టచ్ చేసిన సబ్జక్టు, రమణులు కూడా టచ్ చేయలేదు" అని బాబు అంటే,
"రమణులే నా రూపంలో టచ్ చేస్తున్నారు..."
అని ఠక్కున పలికారు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా...
అంతగా వారు ఏకాత్మవస్తువుతో మమేకం అయి వుంటారు....
తాతగారు అన్నట్టు- వారు శుభ్రమైన మణి.
* * *
ఓ గురుదేవా!
మిమ్ము స్తుతించుట యొక్క అర్థము
మౌనంగా ఉండడమే.
మిమ్ము పూజించుట యొక్క అర్థము
కర్మలు లేకుండా ఉండడమే.
మీ సాన్నిధ్యమును పొందుట యొక్క అర్థము
మీలో లీనమై శూన్యత్వమును పొందటమే.
అంటారు జ్ఞానేశ్వరులు.
* * *
కొంచెం కూడా కర్తృత్వభావం లేకపోవడమే శరణాగతి.
శరణాగతికి ఆటంకమైన అహాన్ని తొలగించేది
సద్గురు సన్నిధి.
తనను తాను పోగొట్టుకొని
తనను తాను పొందాలి.
ఇదే జీవితపరమార్థం.
అది సద్గురు సన్నిధిలో మాత్రమే నెరవేరబడుతుంది.
* * *
-జ్ఞానశిశువు-9533667918
శర్మ స్ బ్రాహ్మణ భోజనం
ఆల్ ఓవర్ ఇండియా
శర్మ స్ బ్రాహ్మణ భోజనం
మీ ఇంట జరిగే శుభకార్యాలకి అన్ని కార్యక్రమాలకి వేద పండితులకి,మడితో రుచిగా శుభ్రంగా (ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా) మీరు కోరుకున్న విధంగా బ్రాహ్మణ క్యాటరింగ్ చేయబడును దూరప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులకు,శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములకు, భవానీలకు, వేద పండితులకు కూడా భోజనం టిఫిన్స్ అందజేస్తాం దయచేసి ఒకరోజు ముందు రోజు తెలియజేయగలరు🙏 ప్రసాదాలు కూడా ఇవ్వబడును
సికింద్రాబాద్ రవి కిరణ్ శర్మ7842413139
సికింద్రాబాద్ కళ్యాణ్ శర్మ9885785556
విజయవాడ సాయిశర్మ 7396881404
విజయవాడ మధువని 9182554800
విజయవాడ పవన్ శర్మ 79896 44180
వైజాగ్ సాయి శర్మ 7032324851
బెంగళూరు బాలసుబ్రమణ్యం శర్మగారు9986119510
తిరుపతి హేమంత్ శర్మ9959859227
కాకినాడ హరి శర్మ
08142729222
సామర్లకోట శర్మ గారు
9182285617
గుంటూరు సాయి శర్మ7989585295
కడప మురళీ శర్మ
9866261232
చెన్నై శ్రీనివాస్ శర్మ7395932954
కేరళ శర్మ9447136023
ముంబై శివరామన్ శర్మ+91 74484 08447
మధురై నారాయణ శర్మ9842191826
అరుణాచలం లక్ష్మీకాంత శర్మ8870218670
శ్రీరంగం జై శర్మ+91 94871 80737
న్యూఢిల్లీ ఫణి కుమార్ శర్మ9650873730
నాగపూర్ 9505651387
వారణాసి శర్మగారు6387716431
ప్రయాణంలో మన భోజనం దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో మన బ్రాహ్మణ ఇంటి భోజనం అందించబడును నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి తప్పకుండా షేర్ చేయండి
బసవ పురాణం 15 వ భాగము....!
🎻🌹🙏 బసవ పురాణం 15 వ భాగము....!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸గొర్రెను తాకావంటే బసవేశ్వరునిమీద ఒట్టు. శరణన్న జీవిని రక్షించడం శివభక్తుల వ్రతం అన్నాడు. దానికి విటుకు కోపించి బ్రహ్మయ్య మీదికి కత్తినెత్తాడు. అది చూచి బ్రహ్మయ్య రుద్రాకారుడై ఒకే దెబ్బతో విటుణ్ణి రెండు ముక్కలు చేశాడు.
🌿మాట తప్పిన వాడి తల ఇందుండకూడదన్నట్లు ఎగిరి గుడికవతల పడింది విటుని తల. ఈ విషయం రాజుకు తెలిసింది. బిజ్జలునికి కోపం వచ్చింది. ఎవడైనా ఒక గొర్రె కోసం మనిషిని చంపుతాడా? శివభక్తులు దయాపరులని అంటూంటావే బసవయ్యా!
🌸నిరపరాధిని ఇలా చంపడమేనా భక్తి? ఈ భూమిమీద వీరు మనుషులను బ్రతుకనిచ్చేటట్లు లేదు. లేకుంటే మీకు గొర్రెతో ఏం పని?’’ అని తీవ్రంగా బసవేశ్వరుణ్ణి చూచి అన్నాడు. బసవన్న ఈ మాటలు విని చిరునవ్వు నవ్వాడు. ‘ఎందుకలా నవ్వుతావు బసవయ్యా! మీ ధర్మాలు నాకు తెలిశాయిలే!
🌿కాలదన్నడం, మాంసఖండాలు పెట్టడం, కొడుకును చంపడం, రాళ్ళతో కొట్టడం, కులభ్రష్టత్వం చెంది భుజించడం, తండ్రిని చంపడం, భార్యనివ్వడం, ఇవేగా మీ ప్రాచీన శివభక్తుల ధర్మాలు. ఈ ధర్మపరంపరకు నేడు గొర్రె కోసం మనిషిని చంపే ధర్మం కూడా వచ్చి చేరింది.
🌸ఈ రాజ్యమేలడం ఇక నావల్ల కాదు’ అని బిజ్జలుడు క్రోధంతో అన్నాడు.
అప్పుడు బసవేశ్వరుడు ‘‘ప్రభూ! మీరు తొందరడవద్దు. శివభక్తులు ఎన్నడూ ధర్మం తప్పి చరించరు.
🌿అందులోనూ కిన్నర బ్రహ్మయ్య సామాన్యుడా? సాక్షాత్తు శివస్వరూపం, ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడి ఎద్దు ఈనిందంటే గాట కట్టేయమన్నట్లు నీవు మాట్లాడుతున్నావు. న్యాయమూర్తులను పంపు ముందు. జరిగిదేమిటో పూర్తిగా విచారించు.
🌸తర్వాత ఒక నిర్ణయానికి వద్దాము’’ అన్నాడు. ‘సరే’నని బిజ్జలుడు తన ప్రధానులను గుడివద్దకు పంపాడు. వారువెళ్లి అక్కడే వున్న కిన్నర బ్రహ్మయ్యకు నమస్కరించి ..
🌿‘స్వామీ! మీ వంటి మహభక్తుడు హింసకు లోబడడానికి కారణమేమిటో మేము ఊహించలేకపోతున్నాము. లోకంలో మీకు ఎంతో అపకీర్తి వచ్చిందిప్పుడు. ఏమి జరిగిందో చెప్పండి’’ అని ప్రార్థించారు.
🌸అప్పుడు కిన్నర బ్రహ్మయ్య జరిగినదంతా వివరించి చెప్పాడు. ‘‘శరణుకోరి వచ్చిన గొర్రెను వేయి మాడలిచ్చి కొని దానికి శివలాంఛనాలు దిద్దాను. దానితో గొర్రె నంది అయినట్టే లెక్క. అట్లాంటిది మాట తప్పి ఈ విటుడు మళ్లీ వచ్చి నందీశ్వరుణ్ణి గుంజుకుపోతుంటే చంపాను.
🌿ఇందలి తప్పొప్పులకు ఈ త్రిపురాంతకుడే సాక్షి! కావాలంటే ఆయననే అడగండి. చూస్తున్నాడు మా కథనంతా గర్భగుడిలోనుండి’’ అన్నాడు బ్రహ్మయ్య.
ప్రధానులు ఈ మాటలు రాజుతో చెప్పారు.
🌸అది విని రాజు నివ్వెరపోయి ‘‘నిజంగా త్రిపురాంతకుడే స్వయంగా ఈయనకు సాక్ష్యం చెపుతాడా? ఎన్నడూ ఇలాంటిది కనీ వినీ ఎరుగమే! అదీ చూద్దాము. స్వామివారిని అలాగే సాక్ష్యం చెప్పమను’’ అన్నాడు బిజ్జలుడు.
🌿అంతా దేవాలయం వద్దకు చేరారు. ముందుగా బసవన్న కిన్నర బ్రహ్మయ్యకు పాదాభివందనం చేసి ఎన్నో విధాల ప్రస్తుతించాడు. అందరూ గుడిలోపలికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన నగర ప్రజలు కూడా గుంపులు గుంపులుగా గుడి నిండా మూగారు.
🌸గర్భగుడి అప్పుడు మూసి ఉంది. కిన్నర బ్రహ్మయ్య గుడి తలుపులవైపు ఒకసారి చిరునవ్వు నవుతూ చూచాడు. వెంటనే తాళాలు లేకుండానే తలుపులు తెరుచుకున్నాయి.
🌿అది చూచి ప్రజలంతా దిగ్భ్రాంతులైనారు.
కిన్నర బ్రహ్మయ్య గర్భగుడిలో నిలబడి ‘‘త్రిపురాంతకా’’ అని గొంతెత్తి పిలిచాడు. ‘ఓరుూ భక్తుడా!’ అని లింగం నుండి ధ్వని వచ్చింది. అది విని ప్రజలంతా గడగడా వణికిపోయారు.
🌸భూమండలం అటూ ఇటూ ఊగినట్లనిపించింది. లింగస్థులు కాని ఇతరులంతా మూర్ఛిల్లారు. అప్పుడు బసవన్న కిన్నర బ్రహ్మయ్యకు సాష్టాంగ ప్రణామం చేసి ‘బ్రహ్మయ్యా! నీవు మానవుడవు కావు.
🌿సత్యగంభీరుడవు. జగదాధారుడవు. శివ స్వరూపుడవు’’ అని స్తుతించాడు. అప్పుడు బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వి ‘త్రిపురాంతకా!’ మళ్లీ పిలిచాడు. ఆ పరమేశ్వరుడు ‘ఓరుూ!’ అని మళ్లీ బదులు పలికాడు.
🌸తల్లక్రిందులైన సృష్టి మళ్లీ యధాస్థితికి వచ్చింది. బిజ్జలునితోసహా అందరికీ మళ్లీ స్పృహ వచ్చింది. బిజ్జలుడు బ్రహ్మయ్యకు సాష్టాంగపడి ‘‘బ్రహ్మయ్యా! మేము అజ్ఞులము. మమ్ము మన్నించి కరుణించు తండ్రీ’’ అని బ్రహ్మయ్యను ప్రార్థించాడు.
🌿అప్పుడు బ్రహ్మయ్య ‘రాజా! ఒక్క శివభక్తులకు మాత్రం వెరచివుండు. చాలు. నీ రాజ్యానికి ఏమీ కష్టం కలుగదు’ అని చెప్పాడు. రాజుతో సహా అంతా త్రిపురాంతకుని గుడినుండి తిరిగి తమ తమ నివాసస్థానాలకు వెళ్లిపోయాడు.
🌷కలకౌత బ్రహ్మయ్య కథ
🌸కల్యాణ నగరంలో కలకౌత బ్రహ్మయ్య అనే శివ భక్తుడొకడు ఉన్నాడు. ఆయన ఒక చేత కొమ్ము, మరొక చేత కోల ధరించి ఇంద్రజాలికుని వేషం వేసుకొని శక్తుల ఇళ్ళకుపోయి వారిని నవ్విస్తూ జంగమకోటిని సేవిస్తూ ఉండేవాడు.
🌿ఇలా ఉండగా ఒక జంగమయ్య కిన్నర బ్రహ్మయ్యగారిని దర్శించుకొందామని ఎంతోదూరం నుండి వచ్చి వచ్చి ఇక సాగలేక కూలబడిపోయాడు.
🌸శ్రమతో అతడు అలసిపోయి పడ్డచోట కలకౌత బ్రహ్మయ్య ఉన్నాడు...సశేషం..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
దాతలు కావలెను
జంతూనాం నరజన్మ దుర్లభం అని వివేకచూడామణి లో శ్రీ ఆదిశంకరాచారులవారు వచించారు. అంటే జంతుకోటిలో అనగా 84 లక్షల జీవరాసులలో మనిషిగా పుట్టటం చాలా దుర్లభమైనది. అంతే కాకుండా ఇంకా ఆచారులవారు ఏమన్నారంటే
జన్తూనాం నరజన్మ దుర్లభమ్ అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్
వైదిక-ధర్మమార్గపరత విద్వత్త్వం అస్మాత్ పరమ
ఆత్మనాత్మవివేకనమ్ స్వనుభవో బ్రహ్మాత్మనా సస్స్థితిః
ముకీత్ర్ణో శతకోటిజన్మసు కృతైః పునైర్వినా లభ్యతే ॥
అంటే మనిషిగా పుట్టటం కన్నా పురుషునిగా పుట్టటం అందులోను బ్రాహ్మణుడుగా జన్మించి వైదిక్ ధర్మాన్ని ఆచరిస్తూ విద్యావంతుడు అయి ఆత్మాఅనాత్మ అనే వివేకముకలిగి స్వంతంగా బ్రహ్మజ్ఞ్యానం సముపార్జించటం అనేది తత్ద్వారా ముక్తిని పొందటం అనేది శతకోటి జన్మల సుకృతం కలిగి ఉంటే కానీ లభ్యం కాదు అని పేర్కొన్నారు.
ఈ రోజుల్లో మనం చాలామందిమి దైవానుగ్రహం వలన బ్రాహ్మణులుగా అందునా పురుషులుగా జన్మించినాము. నిజానికి ఇలాంటి జన్మను పొందటం మన పూర్వజన్మ సుకృతం కాక మరొకటి కాదు. ప్రతి బ్రాహ్మడు తెలుసుకోవలసినది ఏమిటంటే మనకు ఈ జన్మే ఆఖరు జన్మ కావలి అని. అది ఎట్లాగ అంటే ఈ జన్మను మనం సార్ధకత చేసుకొని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేస్తే కచ్చితంగా అవుతుంది. ఈ సత్యం తెలుసుకోనుక అనేకమంది విప్రవర్యులు ఇతరులవాలె ఐహిక వ్యామోహాలకు సాంఘిక విషయ మొహాలకు బానిసలుగా మారి తమ విద్యుత్వ కర్తవ్యాన్ని మరచిపోతున్నారు. అలాంటి మన బ్రాహ్మణ సోదరులను తట్టి లేపి వారి ఘాఢనిద్రను వదిలించి కర్తవ్యోన్ముఖులను చేయవలసిన ధర్మం, ధర్మాచరణను ఆచరిస్తున్న ప్రతి శ్రోస్త్రియ బ్రాహ్మణుడి మీద వున్నది. కాబట్టి మనమంతా ఒక సంఘటితముగా మారి ప్రతి బ్రాహ్మణుడిని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జనవైపు దృష్టిసారించే విధంగా పురిగొల్పి బ్రాహ్మణులను సత్బ్రహ్మణులుగా మార్చ ప్రయత్నం చేద్దాం. మరి అది ఎలా సాధ్యం అంటే ముందుగా ప్రతి బ్రాహ్మణుడు విధిగా " పంచ కట్టుడు పిలక పెట్టుడు చేయాలని" ఒక ఉద్యమంగా తీసుకొని అందరు బ్రాహ్మణులు పంచ కట్టటం నేర్చుకొని రోజు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి కాని పరిస్థితుల్లో సూర్యోదయ కాలంలో నయినా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గాయత్రి మంత్ర జపం చేసే విధంగా ప్రాత్సహిద్దాం.
ఇక రెండవ విషయం అందరము చక్కగా ముండనం చేసుకొని శిఖ ధారణ చేసే విధంగా ప్రాత్సహిద్దాం. ఈ రోజుల్లో చాలామంది బ్రాహ్మణులు శిఖాదారణ అటుంచి చక్కగా కేశాలకు, మీసాలకు రంగులు వేసుకొని నవ యవ్వనులుగా కనపడుటకు అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు. మిత్రమా ఇప్పుడు నీవు చేయవలసినది నీ వయస్సును కనిపించకుండా లోకానికి కనిపించటం కాదు నీవు పరిశుద్ధుడవు అయి లోకమాతకు (భవానీమాతకు) కనిపించే ప్రయత్నం చేయి. అప్పుడే ఆ తల్లి నిన్ను తన దారికి చేర్చుకొని ముక్తిని ప్రసాదిస్తుంది. దానికోసం విధిగా శిఖాదారణ చేసి నిత్యకర్మలను ఆచరించి బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేసి ముక్తికోసం ప్రయత్నం చేయాలి.
ఈ పరంపరలోనే మనలోని ఆస్తిక జిగ్న్యాసపరులు శిఖాదారణ చేసే విధంగా ప్రోత్సహించటానికిగాను పురోహితం జీవనోపాధిగా లేనటువంటి బ్రాహ్మణులకు అంటే ఇతర వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగములు చేసుకొనే వారు గతంలో శిఖాదారణ చేయనివారు ఇప్పుడు శిఖాదారణ చేయటానికి పూనుకొన్న వారికి శిఖాదారణ ప్రోత్సాహకంగా కొంత ద్రవ్యాన్ని వారికి శిఖాప్రోత్సాహకంగా ఇస్తే దానికి ఇష్టపడి వారు శిఖాదారణ చేస్తారనే భావనతో ఒక ఫౌండును ఏర్పాటు చేసి ఔత్సాహక శిఖాదారాకులకు ద్రవ్యరూపంగా ఇవ్వటం సమంజసం అని భావిస్తూ ఇది వ్రాస్తున్నాను.
విప్రులు ఈ విషయాన్ని పరిశీలించి తగువిధంగా స్పందించగలరు. అంటే కాదు ధనవంతులైన దాతలు స్పందించి భూరి విరాళాలు ఇస్తే ఔస్తాహికులైన నూతన శిఖాదారులకు ప్రత్సాహకంను ఇవ్వవచ్చు. ప్రతివారు ఈ విషయాన్ని కూలంకుషంగా విశ్లేషణ చేసి సామూహిక నిర్ణయం తీసుకుందాం.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
పంచాంగం 27.08.2023 Sunday,
ఈ రోజు పంచాంగం 27.08.2023 Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల పక్ష: ఏకాదశి తిధి భాను వాసర: మూల తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రీతి యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం.
ఏకాదశి రాత్రి 09:27 వరకు.
మూల ఉదయం 07:14 వరకు తదుపరి పూర్వాషాఢ రేపు తెల్లవారుఝామున 05:14 వరకు.
సూర్యోదయం : 06:04
సూర్యాస్తమయం : 06:31
వర్జ్యం : ఉదయం 05:43 నుండి 07:14 వరకు తిరిగి సాయంత్రం 04:02 నుండి 05:30 వరకు.
దుర్ముహూర్తం: సాయంత్రం 04:51 నుండి 05:40 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
ఛాందస్సులు అంటే ఎవరు తెలుపగలరు?
నిత్యాన్వేషణ:
ఛాందస్సులు అంటే ఎవరు తెలుపగలరు?
సూటి సమాధానం:
నియమ నిబంధనలను తు.చ. తప్పకుండ పాటించేవారు ఛాందసులు.
విశ్లేషణ + వివరణ:
ఛందస్సునకు సంబంధించినది ఛాందసము. ఛాందసమును పాటించేవారు ఛాందసులు.
ఛాందసము అంటే ఏమిటో తెలియాలంటే, ముందుగా ఛందస్సు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి.
'ఛందస్సు' అనే పదానికి చాలా అర్థాలు వున్నాయి.
* 'పద్యలక్షణము తెలిపెడి శాస్త్రము'. (ఇది మనకు బాగా తెలిసిన అర్థం). ఈ అర్థంలో ఛందస్సు అనేది వేదాంగములలో ఒకటి.
* 'ఛంద' అనే సంస్కృత మూలరూప క్రియా పదానికి అర్థాలు to spread as a cover, to protect, to be pleased with, delight in. వేదంలోని శ్లోకాలు, పద్యాలు నోటి ద్వారా ఒకరి నుండి మరొకరికి చెప్పబడేవి. అలా చెప్పినపుడు ఉచ్ఛారణ, వినికిడి, జ్ఞాపకశక్తి లోపాల వల్ల అక్షరాలు మారిపోకుండ, మారిపోయినా వాటిని సరిచెయ్యడానికి ఈ వేదాంగం ఉపయోగ పడుతుంది. అంతే కాకుండ పద్యాలకు చెవులకు ఇంపైన ఉచ్చారణ క్రమాన్ని కూడా ఇస్తుంది ఈ ఛందస్సు.
* ఛందస్సు అనే పదానికి వేద మంత్రాలని కూడా అర్థం ఉంది. వేదాంగాలలో ఒకదాని పేరు వేదాలకు కూడా ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు. వేద మంత్రాలు ఛందస్సుల చేత (పద్య లక్షణాల చేత) తమను తాము సమాహితం చేసుకోవడం వల్ల వేదం ‘‘సంహిత’’ అయింది. ఈ అర్థం ప్రకారం వేదం చదివిన వారిని కూడ ఛాందసులు అంటారు.
* ఒక నియమము లేదా సూత్రం (A rule, principle). ఇది ప్రధాన అర్థం. పై రెండు అర్థాలను ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు.
* యథేచ్ఛమైన నడవడిక.
* ఇచ్ఛ, కోరిక.
* అభిప్రాయము.
పంచాంగంలో (శాస్త్రంలో) చెప్పబడిన వైదిక ఆచారాలను ఉన్నవి ఉన్నట్లుగా నియమబద్ధంగా పాటించడాన్ని ఛాందసము అనేవారు.
పాత పద్ధతులకే కట్టుబడి, సమాజంలో వస్తున్న మార్పులను వ్యతిరేకించే వ్యక్తులను వారిలో ఉన్న 'కేవలం పుస్తకాల పురుగు యొక్క మూర్ఖత్వాన్ని' ఆసరాగా తెలివితక్కువవారిగాను, అమాయకులుగాను, లౌకిక జ్ఞానం లేకపోవడంగాను కూడ పరిగణిస్తారు. వారినే ఈ కాలంలో ఛాందాసులు అంటున్నారు.
మరువలేని మధురమైన ఉదాహరణ:
ఈ సందర్భంలో … తమను తాము ఆధునిక మేదావులుగా చెప్పుకొనేవారు సాంప్రదాయవాదులను ఛాందసులు అని ఆక్షేపణ చేసే దృశ్యం శంకరాభరణం సినిమాలో తప్పకుండా చూసితీరాలి …
- రెండవసమాధానం:
వట్టి ఛాందసులు అని వెటకారం చేస్తూ ఉంటారు కొందరు. కానీ ఈ పదాల అర్థం ఎవరికీ తెలిసి ఉండదు.
ఛందస్సు అంటే వేదం. వేదం చదివి అర్థం చేసుకొన్న వాడు అయోగ్యపు పనులు చేయడానికి ఇష్టపడడు. సందేహిస్తాడు. పాప భీతి ఒకటి పీకుతూ ఉంటుంది.
పెద్ద వాళ్లు వస్తే లేచి ఎదురుబోవాలి.
* సత్యం వద*..కాబట్టి తేలికగా అబద్దం చెప్పడానికి నోరు రాదు.
*మా గృధః కస్యస్విత్ ధనం *..వేరే వాళ్ళ డబ్బు కొట్టేయవద్దు.!!!.
" ఇలాంటివి ఈ రోజుల్లో పెట్టుకుంటే కుదరదండీ!" అని సమయానుకూలంగా అబద్ధమో సుబద్ధమో ఏదో ఒకటి చెప్పి పని జరుపుకు పోయే వాళ్ల కు — ఈ లాంటి వాళ్ల ప్రవర్తన వీళ్ళేదో కృతయుగం నాటి మనుషులు అనిపిస్తుంది. "వట్టి ఛాదస్తులు ..ఈ కాలానికి పనికి రారు" —అని బాహాటంగానే ఆక్షేపిస్తూ ఉంటారు.
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 23*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 23*
సన్యాస జీవితం కేవలం మార్గం మాత్రమే; సాధించవలసిన లక్ష్యం కాదు. గృహస్థ జీవితం నీటి ప్రవాహంతోబాటే వెళ్లడంలా భావిస్తే, సన్న్యాస జీవితం దానికి ఎదురీత లాంటిది. అర్హుడైన వ్యక్తి సహాయం లేకుండా ఇందులో విజయం సాధించడం ఎంతో అరుదు. ఆ వ్యక్తినే మన శాస్త్రాలు గురువు అని పేర్కొంటున్నాయి. ఆయన సత్యాన్ని గ్రహించిన వాడై ఉండాలి;
'సత్య సాక్షాత్కారం పొందాను' అని చెప్పగల వ్యక్తే ప్రస్తుతం నరేంద్రునికి అవసరమయ్యాడు. కనుక సర్వజ్ఞులూ, తత్త్వవేత్తలూ, మహాత్ములూ అని ఎవరిని గురించి విన్నా వారిని వెళ్లి కలుసుకొని ఈ ప్రశ్నలు అడగడం అతడికి నిత్యకృత్యమైంది.
ఈ ప్రశ్నతో నరేంద్రుడు కొట్టుమిట్టాడుతున్న సమయంలో నరేంద్రుని ప్రయత్నం ఫలించే తరుణం రానేవచ్చింది. నరేంద్రుడు అప్పుడు ఎఫ్.ఏ. చదువుతున్నాడు. ఉపాధ్యాయుడు సెలవులో ఉండడం వలన, కళాశాల అధ్యక్షుడైన విలియం హేస్టీ తీసుకొన్నాడు. వర్డ్స్ వర్త్ రచించిన Excursion అనే కవిత నాటి పాఠ్యాంశం. అందులో పార్యవశ్య స్థితిని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించడం.
హేస్టికి ఠక్కున ఒక ఆలోచన స్ఫురించింది. పారవశ్య స్థితిని ఆయన పొందకపోవడం నిజమే. కాని పారవశ్య స్థితిని పదేపదే అనుభూతం చేసుకొంటున్న ఒక వ్యక్తిని గురించి ఆయనకు తెలుసు. ఆ వ్యక్తి శ్రీరామకృష్ణ పరమ హంస. వెంటనే హేస్టీ, విద్యార్థులతో, "ఈ అనుభూతి అపూర్వమైనది, ప్రత్యేకించి ఈ ఆధునిక కాలంలో మరీ అరుదు.
మానసిక పవిత్రత, ఏకాగ్రత, దీర్ఘకాల అభ్యాస పర్యవసానంగా లభించే ఆనందానుభూతి అది. ఆ అద్భుత అనుభూతిని పొందిన ఒక వ్యక్తిని నేను చూసివున్నాను. దక్షిణేశ్వరంలో వసిస్తున్న శ్రీరామకృష్ణ పరమహంసే ఆయన! మీరు కూడా ఆయనను దర్శించుకొంటే పారవశ్యం అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు" అని చెప్పాడు.
నిజమైన ప్రయత్నం ఎన్నటికీ వృథాకాదు కదా!
తన హృదయ తంత్రులను ఎవరో మీటినట్లు నరేంద్రునికి అనిపించింది. అంధకారం ఆవరించివున్న గదిలో దిక్కుతోచని వ్యక్తికి సన్నని రంధ్రం గుండా ఒక కాంతి కిరణం ప్రసరించి దారి చూసినట్లుగా అతడికి స్ఫురించింది!🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*🌹రాశి ఫలాలు🌹ఆగస్టు 26, 2023*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*
. *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*
*ఆదివారం, ఆగస్టు 26, 2023*
*శ్రీ శాలివాహన శకం: 1945*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*
*తిధి* : *ఏకాదశి సా5.20* వరకు
. *🌹రాశి ఫలాలు🌹*
*మేషం*
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
---------------------------------------
*వృషభం*
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది.
---------------------------------------
*మిధునం*
ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఇంటా బయట మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
---------------------------------------
*కర్కాటకం*
ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వాహన సౌఖ్యం. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.
---------------------------------------
*సింహం*
ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
---------------------------------------
*కన్య*
ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.
---------------------------------------
*తుల*
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
*వృశ్చికం*
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. తన పరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
---------------------------------------
*ధనస్సు*
నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయాలు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
---------------------------------------
*మకరం*
ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది.
---------------------------------------
*కుంభం*
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.
---------------------------------------
*మీనం*
భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వాహనాలు కొలత కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*
👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻
*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻
*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻
🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
పశువు తో సమానం
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*ఉపకారాచ్చ లోకానాం*
*నిమిత్తాన్మృగపక్షిణామ్।*
*భయాల్లోభాచ్చ మూర్ఖాణాం*
*మైత్రీ స్యాద్దర్శనాత్ సతామ్॥*
𝕝𝕝తా𝕝𝕝
ఏదో ఒక కారణం ఉంటేనే స్నేహం చేయడం పశుపక్షుల లక్షణం. మనుషుల్లో కూడా కొందరు అలాగే ఉంటారు. అవతలి వ్యక్తి వల్ల ఏదన్నా ఆపద ఏర్పడుతుందనే భయంతోనో, అతని నుంచి ఏదన్నా లాభం పొందాలన్న లోభంతోనో మూర్ఖులు స్నేహం చేస్తుంటారు. ఇలాంటి మూర్ఖులు పశువు తో సమానం. సత్పురుషులతో స్నేహము దర్శనమాత్రము చేతనే ఏర్పడును.
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-30🌹*
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-30🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
స్వామివారికి ఇష్టమైన భక్తుడు తొండమాన్. శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాలను ఈయన నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి తొండమాన్ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిలగా మారాడని కూడా పురాణాల్లో ఉన్నాయి.
ఆనంద నిలయంలో శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిలు ఇద్దరు సరసల్లాపాలతో మునిగి ఉన్నారు. ఆ సమయంలో ప్రభువైన తొండమాన్ చక్రవర్తి రహస్య బిల మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామీ వేంకటేశా... భక్తవత్సలా.. కాపాడు అంటూ వేడుకొన్నాడు.
తొండమాన్ శరణుకోరగానే శ్రీవారు..తొండమాన్.. ముందు నా పాదాలను వదులు. అసలు ఏం జరిగిందో చెప్పు. నీకు ఏం భయం లేదు. ఎందుకింత ఆందోళనగా ఉన్నావు. నీ శరీరం చూడు.. ఎంత వణుకుతుందో. ముచ్చెమటలతో నీ దేహమంతా తడిసిపోయింది. ఎంత మాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెప్పారు.
ఆ తర్వాత తొండమాన్ పాదాల మీద నుంచి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొచ్చాడు. నేను ఒక ఘోరమైన పాపాన్ని చేశాను. ఆ మహాపాపాన్ని నేను తెలిసి చేశానో, తెలియక చేశానో నాకు అంతుబట్టడం లేదు. దానిని తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తున్నది స్వామి. శరణాగతవత్సులుడైన నీవు నాకు అభయ ప్రధానం చేయడం వల్ల నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుంది. నేను చేసిన ఘోరమైన పాపాన్ని వివరిస్తాను స్వామి అన్నాడు.
రెండేళ్ళకు పూర్వం ఒకరోజు కూర్ముడు అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు కాశీ క్షేత్రానికి పోతూ తన భార్యా పిల్లతో కలిసి నా దగ్గరకు వచ్చాడు.
గర్భవతి అయిన తన భార్యను ఐదేళ్ల కుమారుడిని నాకు అప్పచెబుతూ నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్యాపిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అని చెప్పాడు తొండమాన్.
ఆ తర్వాత బ్రాహ్మణుని కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలుగజేశాను. అంతేకాదు వారికి ఇతరుల వల్ల హాని కలుగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశాను. కానీ విధి బలీయము.
కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతి పూర్తిగా మరిచిపోయాను. ఇలా రెండేళ్ళు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీ యాత్రను ముగించుకుని నా దగ్గరికి వచ్చాడు. నా భార్యాపిల్లలు ఎలా ఉన్నారు. నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని అడిగాడు
నాకు ఏం చెప్పాలో అర్థం కాక. వెంటనే తాళం వేసిన భవనం వద్దకు వెళ్ళాను. గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి. బ్రాహ్మణునికి ఏం చెప్పాలో తెలియక... అన్నీ అబద్ధాలు చెప్పాను.
నీకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందరూ కలిసి మా వాళ్లతో వేంకటాచలపతి వెళ్ళారు. మరో రెండు రోజుల్లో వస్తారని చెప్పాను అని తప్పించుకుని ఇక్కడకు వచ్చానని చెప్పాడు తొండమాన్.
వెంటనే శ్రీవారు నువ్వు చేసింది మహాపాపం. నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు సాయం చేస్తున్నాను.
"నీకు బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇకముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను. ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను" అంటూ శపధం చేసి వెంటనే అస్థికలను నా దగ్గరికి తీసుకురా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలిపాడు
భగవానుడుగు శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరిణికి తూర్పునగల దివ్యసరోవరము (అస్థి తీర్థంలో) వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షించేడు. వారు ముగ్గరూ సజీవులయ్యారు. తొండమానుడు ఆనందించి వారందరనీ కూర్మునకు అప్పగించాడు.
వారందరూ ఆ అస్థితీర్థ మహాత్మ్యమును తెలసుకొన్నవారై అందులో స్నానమాడి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖముగా జీవించారు…..
ఈ విచిత్ర సంఘటనకు దేవతలు పూలవాన కురిపించారు. అప్పటి నుంచి ఆ తీర్థం అస్థితీర్థం అని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్న వారి అస్థిల్ని కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు
అప్పుడు బ్రహ్మాదిదేవతలు "బలహీనులు, అల్పాయుష్కులైన మానవులను ఉద్దరించడానికై కలియుగాంతము వరకూ ఈ వేంకటాచలంపై ఉండవలసింది" అని ప్రార్ధించారు.
అప్పుడు శ్రీనివాసుడు "దివ్యమూర్తిగా దర్శనమిస్తాను. కానీ ఎవరితోనూ మాట్లాడను. అందరి కోరికలూ తీరుస్తాను" అంటూ "కన్యామాసం, శ్రవణానక్షత్రం" రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు.
లక్ష్మి పద్మసరోవరమున అవతరించగా, శ్రీనివాసుడు ఆనంద మండపములో శిలారూపమును పొందినాడు.
వకుళాదేవి ఆ విగ్రహము మెడలో మాలగా మారిపోయినది.
శాంతాకారా గోవిందా, వైకుంఠ వాసా గోవిందా, బ్రుగుముణి పూజిత గోవిందా, రమాది రహిత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||30||
శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం..
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
నవగ్రహా పురాణం🪐* . *11వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *11వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*సూర్యగ్రహ జననం - 2*
సూర్యుడివరం ఫలవంతమయ్యే సూచనగా - అచిరకాలంలో అదితి గర్భవతి అయ్యింది. వెలుగు వేలుపుని తనలో నిక్షిప్తం చేసుకున్న ఆమె శరీరం ప్రతిఫలించే చల్లటి కాంతితో మెరిసి పోసాగింది. ఉషోదయకాంతి ఏదో ఆమె ముఖం మీద నర్తనం చేయసాగింది.5
గర్భభారం అదితి కదలికల్ని అదుపు చేసింది. కశ్యపుడు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గర్భభారంతో అలసిపోతూ , భర్త సేవలు చేస్తూనే వున్న తమ అక్క. అదితిని వినత , కద్రువ వారించారు.
*"నువ్వు విశ్రాంతి తీసుకో అక్కా ! పతిదేవుడి సేవలు మేం చేస్తాం !"* అంది వినత. *"ఆయనకు ఏలోటూ రాకుండా చూసుకుంటాంలే, అక్కా !"* అంది కద్రువ.
కశ్యపుడి బలవంతంతో అదితి అందుకు అంగీకరించింది. *"సూర్యభగవానుడిని గర్భంలో మోస్తూ నువ్వు నాకు సేవ చేయడం భావ్యం కాదు !"* అన్నాడు అదితితో కశ్యపుడు.
అదితికి విశ్రాంతి యిచ్చిన వినత , కద్రువ ప్రేమానురాగాలతో , వినయ విధేయతలతో కశ్యప ప్రజాపతికి సర్వ సపర్యలూ చేస్తున్నారు.
విసుగూ , విరామం లేకుండా తన సేవలో నిమగ్నమైన చిన్నభార్యల ప్రవర్తన కశ్యపుడికి మహదానందం కలిగిస్తోంది.
ఒకనాటి రాత్రి నిద్రకు ఉపక్రమించిన కశ్యప ప్రజాపతికి పాద సంవాహనం. చేస్తూ కూర్చున్నారు వినత , కద్రువ. కశ్యపుడు హాయిగా ఆదమరచి నిద్రపోయాడు. వేకువజామున మెలకువ వచ్చి , కళ్ళు తెరిచి చూసిన కశ్యపుడు ఆశ్యర్యపోయాడు. వినత , కద్రువ యింకా ఆయన పాదాలు నొక్కుతూ కూర్చునే వున్నారు !
*“వినతా ! ఏమిటిది ? నిద్ర పోకుండా రాత్రంతా యిలా పాద సంవాహనం చేస్తూనే వున్నారా ?!"* అన్నాడు కశ్యపుడు.
*"పతి పద సేవ సతి విధి కదా , నాథా !"* అంది కద్రువ. *“మాకు నిజమైన విశ్రాంతి లభించేది మీ సేవలోనే !"* అంది వినత.
ఆ ఇరువురి భక్తిశ్రద్ధలూ కశ్యపుడిని ఎంతగానో అలరించాయి. ప్రేమాను రాగాలతో యిద్దర్నీ చూశాడు. *"మీ శ్రద్ధా భక్తులు , మీ సేవాపరతా నన్ను అలరిస్తున్నాయి !* చెరొక వరం కోరుకోండి ! మీరు కోరిన వరాలు యిచ్చి , నేను ఆనందిస్తాను !"* అన్నాడు.
*"కద్రువా ! మన అదృష్టం పండింది ! ముందుగా నువ్వు కోరుకో !"* అంది వినత. *“నాకు... మెరిసిపోయే పొడుగాటి శరీరాలతో , ఒకే రూపంతో వుండి అందంగా ప్రాకే వేయిమంది నాగ కుమారుల్ని ప్రసాదించండి !"* అంది కద్రువ.
కద్రువ కోరిక కశ్యపుణ్ని ఆశ్చర్యంలో ముంచివేసింది. *“నేల మీద ప్రాకే నాగ కుమారుల్నా ? నీ కోరిక విచిత్రంగా , ఆందోళన కలిగించేదిగా వుంది , కద్రువా ? మరేదైనా వరం కోరుకో !"* అన్నాడు కశ్యపుడు.
*"నాకు నాగకుమారులే కావాలి ! ఇస్తే వాళ్ళనే ఇవ్వండి !”* కద్రువ మొండిగా అంది.
*"సరే. అలాగే , నీ ఇష్టం !"* కశ్యపుడు నిరుత్సాహంగా అన్నాడు. *“నువ్వు కోరుకో వినతా ! నీకేం కావాలో ?"* అన్నాడు వినత వైపు చూస్తూ.
*"రూపంలో , తేజస్సులో , శక్తిలో కద్రువ పుత్రుల్ని మించినవారూ , పరాక్రమంలో అద్వితీయులూ అయిన ఇద్దరు పుత్రుల్ని ప్రసాదించండి !"* అంది వినత.
కశ్యపుడు ఆమె కోరికను మన్నిస్తూ *“తథాస్తు”* అన్నాడు. కద్రువ కోరికతో ఆందోళన చెందిన కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళాడు. కద్రువ కోరిన విపరీత వరం గురించి వివరించి , తన భయాన్ని వ్యక్తం చేశాడు. ఇదమిత్థంగా తెలియక పోయినా ఎందుకో ఆందోళనగా వుందన్నాడు.
కశ్యపుడికి ధైర్యం చెప్తూ , బ్రహ్మ ఇలా అన్నాడు: *"కశ్యపా ! ఆందోళన అవసరం లేదు. నీ పత్నుల ద్వారా సరీసృపాలూ , పక్షిజాతులూ , గోవులూ , మృగాలు మొదలైన జీవుల ఉత్పత్తి జరగాలన్నది పరమాత్మ సంకల్పం. అందుకే నీకు పదముగ్గురు పత్నులు లభించారు ! దేవతలూ , దానవులూ , దేవ గంధర్వులూ మొదలైన వారితో బాటు ఇతర జీవులకూ నీవు తండ్రి వవుతావు !"*
కశ్యపుడు ఆశ్చర్యపోతూ విన్నాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. *"పుత్రా ! నాకు తెలుసు. నాగ కుమారులు నీకు అధికమైన ఆందోళన కలిగిస్తున్నారు. నీ ఆందోళన సహేతుకమే. నాగకుమారులు విషజీవులు. వాటి విషంతో ఇతర ప్రాణులకు అపాయం జరుగుతుంది. కద్రువకు జన్మించబోయే నాగసంతతి విషం ప్రాణాంతకం. దానికి విరుగుడుగా నేను నీకు 'విషహర' మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్ర ప్రభావంతో నువ్వు సర్పవిషాన్ని హరిస్తూ , ప్రాణిరక్షణ చేయగలవు. నిర్భయంగా వెళ్ళిరా ! సకాలంలో నీకు విషహర యోగం లభిస్తుంది !"*
కశ్యపుడు బ్రహ్మకు నమస్కరించి , సెలవు తీసుకున్నాడు.
అదితికి క్రమంగా నెలలు నిండాయి. ఉదయించబోయే సూర్యుణ్ణి తనలో దాచుకున్న పూర్వదిశా సుందరిలాగా నిండుగా వుందామె. ఒక శుభకరమైన వేకువవేళ అదితికి ప్రసవ వేదన ప్రారంభమైంది. ఓర్చుకోగలిగిన , మధురమైన వేదన అది. కశ్యప ప్రజాపతి నదిలో స్నానం చేసి , తూర్పుదిక్కుకు తిరిగి ధ్యానంలో నిమగ్నుడై వున్నాడు.
ఆశ్రమంలో అదితి పురిటి నొప్పులు పడుతూనే వుంది.
తూర్పుదిక్కున ఎర్రటి సూర్యబింబం ఉదయించింది. అదేక్షణంలో ఆశ్రమంలో అదితికి బాలుడు జన్మించాడు. శిశువు ఉదయించగానే , ఆశ్రమం అంతటా తెల్లటి స్వచ్ఛమైన కాంతి అలముకుని , అందర్నీ ఆశ్చర్య పరిచింది.
*అది విశ్వకాల విన్యాసంలో మహత్తరమైన దినం. ఆ శుభదినాన నవగ్రహాలలో ప్రథముడూ , ప్రధానుడూ అయిన సూర్యుడు పద్మ వర్ణం కలిగిన శరీరంతో అందాల బాలుడుగా అదితి గర్భాన జన్మించాడు !*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 23*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 23*
సన్యాస జీవితం కేవలం మార్గం మాత్రమే; సాధించవలసిన లక్ష్యం కాదు. గృహస్థ జీవితం నీటి ప్రవాహంతోబాటే వెళ్లడంలా భావిస్తే, సన్న్యాస జీవితం దానికి ఎదురీత లాంటిది. అర్హుడైన వ్యక్తి సహాయం లేకుండా ఇందులో విజయం సాధించడం ఎంతో అరుదు. ఆ వ్యక్తినే మన శాస్త్రాలు గురువు అని పేర్కొంటున్నాయి. ఆయన సత్యాన్ని గ్రహించిన వాడై ఉండాలి;
'సత్య సాక్షాత్కారం పొందాను' అని చెప్పగల వ్యక్తే ప్రస్తుతం నరేంద్రునికి అవసరమయ్యాడు. కనుక సర్వజ్ఞులూ, తత్త్వవేత్తలూ, మహాత్ములూ అని ఎవరిని గురించి విన్నా వారిని వెళ్లి కలుసుకొని ఈ ప్రశ్నలు అడగడం అతడికి నిత్యకృత్యమైంది.
ఈ ప్రశ్నతో నరేంద్రుడు కొట్టుమిట్టాడుతున్న సమయంలో నరేంద్రుని ప్రయత్నం ఫలించే తరుణం రానేవచ్చింది. నరేంద్రుడు అప్పుడు ఎఫ్.ఏ. చదువుతున్నాడు. ఉపాధ్యాయుడు సెలవులో ఉండడం వలన, కళాశాల అధ్యక్షుడైన విలియం హేస్టీ తీసుకొన్నాడు. వర్డ్స్ వర్త్ రచించిన Excursion అనే కవిత నాటి పాఠ్యాంశం. అందులో పార్యవశ్య స్థితిని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించడం.
హేస్టికి ఠక్కున ఒక ఆలోచన స్ఫురించింది. పారవశ్య స్థితిని ఆయన పొందకపోవడం నిజమే. కాని పారవశ్య స్థితిని పదేపదే అనుభూతం చేసుకొంటున్న ఒక వ్యక్తిని గురించి ఆయనకు తెలుసు. ఆ వ్యక్తి శ్రీరామకృష్ణ పరమ హంస. వెంటనే హేస్టీ, విద్యార్థులతో, "ఈ అనుభూతి అపూర్వమైనది, ప్రత్యేకించి ఈ ఆధునిక కాలంలో మరీ అరుదు.
మానసిక పవిత్రత, ఏకాగ్రత, దీర్ఘకాల అభ్యాస పర్యవసానంగా లభించే ఆనందానుభూతి అది. ఆ అద్భుత అనుభూతిని పొందిన ఒక వ్యక్తిని నేను చూసివున్నాను. దక్షిణేశ్వరంలో వసిస్తున్న శ్రీరామకృష్ణ పరమహంసే ఆయన! మీరు కూడా ఆయనను దర్శించుకొంటే పారవశ్యం అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు" అని చెప్పాడు.
నిజమైన ప్రయత్నం ఎన్నటికీ వృథాకాదు కదా!
తన హృదయ తంత్రులను ఎవరో మీటినట్లు నరేంద్రునికి అనిపించింది. అంధకారం ఆవరించివున్న గదిలో దిక్కుతోచని వ్యక్తికి సన్నని రంధ్రం గుండా ఒక కాంతి కిరణం ప్రసరించి దారి చూసినట్లుగా అతడికి స్ఫురించింది!🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 8*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 8*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే*
*మణిద్విపే నీపోపవనవతి చిన్తామణిగృహే |*
*శివాకారే మంచే పరమశివ పర్యఙ్క నిలయామ్*
*భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ||*
క్రిందటి శ్లోకంలో శంకరాచార్యులవారు అమ్మవారి స్ధూలరూప దర్శనం చేశారు అని చెప్పుకున్నాము.ఆ దర్శనం ఎక్కడ చేశారో ఈ శ్లోకంలో చెపుతున్నారు.
సుధా సింధోర్మధ్యే = అమృత సముద్రం మధ్యలో.
అమ్మ అమృతవతి.అమృత సముద్రమంటే అనంతమైన,శాశ్వతమైన ఆనంద సముద్రంగా భావించాలి.
సురవిటపి వాటీ పరివృతే = కల్పవృక్ష వనములతో విరాజిల్లే
మణిద్విపే = మణిద్వీపంలో
నీప ఉపవనవతి = కదంబ వృక్ష వనములో
చింతామణిగృహే = చింతామణి గృహములో
శివాకారే మంచే = శివాకారంలో ఉన్న వేదిక / మంచము పై
పరమశివ పర్యఙ్క నిలయాం = పరమశివుని ఎడమ తొడపై కూర్చున్న అమ్మవారిని భజిస్తున్నాను.
వామాంకము భార్య స్థానము.*వామాంకే జానకీ పరిలసత్ కోదండ దండంకరే* అని భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి స్తుతి.కుడి తొడ పుత్ర పుత్రికా స్థానం.
భజంతి త్వాం ధన్యాః కతిచన = ఏ కొద్దిమందో ధన్యులు నిను ఆశ్రయించి
చిదానందలహరీమ్ = సచ్చిదానంద సాగర తరంగాలలో తేలియాడుతుంటారు.
ఈ ఎనిమిదవ శ్లోకంలో లలితా సహస్రనామాలలోని
*శివ కామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా*
*చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా*
*మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసినీ*
*సుధాసాగర మధ్యస్థా* నామాలను దర్శించవచ్చు.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
గాయత్రీమాత స్తుతి
గాయత్రీమాత స్తుతి
ముక్తా విద్రుమ హేమ నీలధవళచ్ఛాయై
ర్ముఖై స్త్రీక్ష ణైః
యుక్తాం ఇన్దునిబద్ధ రత్నమకుటాం
తత్త్వార్థ వర్ణాత్మికామ్ ౹
గాయత్రీం వరదాభ యాంకుశ కశా
శ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళం
హస్తైః ర్వహంతీం భజే ౹
సీ. ముత్య విద్రుమ హేమ యత్యంత సిత నీల
పంచముఖంబులు పరిఢవిల్ల,
శిఖ యందు విధురేఖ చెలువార గల్గియు,
ఘనరత్నమకుటంబు కాంతులీన,
తత్త్వార్థ వర్ణముల్ , త్రయలోచనంబులు
ఘనవిశిష్టత తోడ కల్గియుండ,
వరదాభయములను యిరుదివ్య ఘనముద్ర ,
లరవింద యుగళంబు, నంకుశంబు,
తే. శంఖ, చక్ర , కశా, గదా, సహిత యగుచు
శుభ్రమైన కపాల, సంశోభ నున్న
మాత 'గాయత్రి' నెన్నుచు మదిని నేను
భజనఁ జేసెద నత్యంత భక్తి తోడ.
గోపాలుని మధుసూదన రావు 🙏
ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
శ్లోకం:58/150
మహాదంతో మహాదంష్ట్రో
మహాజిహ్వో మహాముఖః I
మహానఖో మహారోమా
మహాకేశో మహాజటః ॥ 58 ॥
* మహాదంతః = గొప్పవైన దంతములు కలవాడు,
* మహాదంష్ట్రః = గొప్పవైన కోరలు కలవాడు,
* మహాజిహ్వః = గొప్పదైన నాలుక కలవాడు,
* మహాముఖః = గొప్పదైన ముఖము కలవాడు,
* మహానఖః = గొప్పవైన గోళ్ళు కలవాడు,
* మహారోమాః = గొప్పవైన వెంట్రుకలు కలవాడు,
* మహాకేశః = గొప్పవైన తలవెంట్రుకలు కలవాడు,
* మహాజటః = గొప్పవైన జడలు కలవాడు.
కొనసాగింపు ...
https://youtu.be/L4DZ8-2KFH0
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం