6, నవంబర్ 2020, శుక్రవారం

సమయం -లెక్కలు

 సమయం -లెక్కలు


🍁🍁🍁🍁


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


🍁🍁🍁

గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము -

 గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము - 



       క్యారెట్ మెత్తగా దంచి రసము తీసి , 50 రసము నందు 20 గ్రాముల పటికబెల్లం చూర్ణము కలిపి పూటకు ఒక మోతాదు చొప్పున ఉదయము మరియు సాయంత్రం రెండు పూటలా తాగుచున్న గుండె దడ , నీరసం , నిస్సత్తువ హరించును . 


       పైన చెప్పిన సులభ యోగము వలే మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 


  

   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

గురువు స్థానం... గ్రేట్!

 *గురువు స్థానం... గ్రేట్!

               

 ఒకప్పుడు హెడ్ మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది...


ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ.


ఒక రోజు ఆయనకి రాజుగారినుండి ఒక ఉత్తరం వచ్చింది.


తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం....


హెడ్ మాస్టర్ తిరుగు టపాలో రాజు గారిని రావద్దని జవాబు రాశారు.


సర్వంసహా రాజ్యాధికారి, తన రాజ్యంలోని   పాఠశాలని చూడాలని కోరుతూ ఉత్తరం రాస్తే (పైగా అది ప్రభుత్వ పాఠశాల) *రావద్దనేంత దమ్ముందా ? హెడ్మాస్టారుకి ?


ఆ దమ్ము ఉన్నవాడు కాబట్టే అలా రాసాడు. కారణం కూడా చెప్పాడు...


 ”మా ప్రభువు అయిన మీరు, వస్తే గౌరవ సూచకంగా నా తలపై ఉన్న టోపీని తీయాలి. ఇప్పటివరకు నా దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు నాకన్నా అధికుడు లేడని భావిస్తున్నారు. నాకన్నా పై అధికారి ఒకడు ఉన్నాడని, ఆయన వద్ద నేను ఒదిగి ఒదిగి ఉంటానని గుర్తించిన క్షణం, వారికి నాపై గౌరవ భావం తగ్గుతుంది... క్రమశిక్షణలో మార్పు వస్తుంది. దాని ఫలితం విద్యాభ్యాసం పై పడుతుంది., ఇది మీరు అర్ధం చేసుకోగలరని ప్రార్ధిస్తున్నాను. ఒకవేళ మీ రాక తప్పనిసరి అయితే నేను రాజీనామా చేయవలసి ఉంటుంది.”


హెడ్మాస్టరుగారి ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకొని, ఆయన “తన సమక్షంలో రాచరిక మర్యాదలు పాటించనక్కరలేదని, తానే టోపీ తీసి హెడ్మాస్టారుని గౌరవిస్తానని” జవాబిచ్చాడు రాజు. 


అలాగే చేసాడు కూడా... గ్రేట్... కింగ్!


శ్రీ తెన్నేటి కోదండరామయ్య గారి *'మా బడి' పుస్తకంలో  శ్రీ రవికృష్ణ గారు రాసిన మనవి మాటలు' నుండి సేకరణ.


 ఎక్కడైతే... గురువులు పూజింపబడతారో... అక్కడ   ఉన్నత విద్యా ప్రమాణాలు పరిఢవిల్లి - దేశం సుభిక్షంగా ఉంటుంది!

                       

                 గురు బ్రహ్మ, 

                 గురుర్విష్ణుః, 

          గురుర్దేవో మహేశ్వరహః

         గురు సాక్షాత్ పరబ్రహ్మ!

           తస్మై శ్రీగురవే నమః

భగవంతుడు

 


ఎంతో హృద్యంగా పాడిన ఈ భజన్ వినండి


      మనసు పారవశ్యంలో తేలి పోతుంది.


            ఎవరన్నారు భగవంతుడు


రాలేదని


             మనం మీరాలా పిలవడంలేదు.


     ఎవరన్నారు భగవంతుడు తినడని


     మనం శబరిలా తినిపించడం లేదు


           ఎవరన్నారు భగవంతుడు నర్తించడని


        మనం గోపికలలా నర్తింప చేయడంలేదు  


                  ఇలా సాగుతుంది.......

నరకానికి వెళ్లకుండా ఉండాలంటే....

 *నరకానికి వెళ్లకుండా ఉండాలంటే....*


శాస్త్రాల ప్రకారం మానవుని సగటు ఆయుఃప్రమాణం వందేళ్లు. 


అయితే ప్రస్తుత యాంత్రిక యుగంలో మారిన జీవనశైలి ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 


దీనికి మన స్వయంకృత అపరాధమే కారణం. 


మారుతున్న జీవనశైలితో నేరుగా నరకానికి చేరుకుంటున్నారు. 


అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని మహాభారతం లో విదురుడు పేర్కొన్నాడు....


ఈ క్రింది లక్షణాలుంటే నేరుగా నరకానికి పోతారు


తను తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్లు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు.


అతిగా మాట్లాడేవాళ్లు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది.


తన కోపమే తన శత్రువు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు నేరుగా నరకానికే పోతారట.


ఇతరులకు సేవ చేయనివారు, సహాయపడనివారు కూడా నేరుగా నరకానికి పోతారట. ఎదుటివాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట.


ధర్మ శాస్త్రం ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి.


మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది.


పై లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు.


జీవితంలో మార్పు కోరుకుంటే 

డబ్బు శాశ్వతం కాదని గుర్తించండి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు.


ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోడానికి ప్రయత్నించండి. నేర్చుకునే వాటితో తృప్తి చెందకండి. ఒక నిర్దిష్ట ప్రదేశంలో సౌకర్యంగా ఉంటే, అక్కడ నుంచి మీరు నిష్క్రమించడానికి సంకేతమని తెలుసుకోండి. జీవితంలో మార్పు సహజం.


జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు.


మీకు మీరు నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోండి. ఇతరులకు చెప్పేముందు ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. ఆత్మ ప్రబోధానికి మించింది లేదు.

సాధన ఆరాధన









 

Ar


 

💫 మనో గమనము

 _*💫 మనో గమనము 🌛*_


_*వ్యవహారికంలో సర్వమూ మనస్సే. మనసు అనేది తడిసిన వస్త్రం లాంటిది. దానికి ఎరుపురంగు అద్దితే ఎరుపుగాను, నీలం రంగు అద్దితే నీలం గాను మారుతుంది. ఏ రంగు అద్దితే ఆ రంగు సంతరించు కుంటుంది. జ్ఞానము, అజ్ఞానము మనస్సు లోనిదే !*_  

            

_*ఫలానా వ్యక్తి మంచివాడు కాదు అన్నావంటే అతని మనసుకు నీచత్వం అనే రంగు వేయబడినది అని అర్థము.*_  


_*ఫలానా వ్యక్తి మంచివాడు అని అన్నాము అంటే అతని మనస్సుకు మంచితనం అనే రంగు వేయబడింది అని అర్థము.*_


_*అందుకే మంచి మనసు ఉన్న మనుషులతో సత్సంగం చేస్తే మంచి మనుషులుగా మారుతారు. అందుకే అంటారు పెద్దలు ఈ విధంగా...*_


             _*సత్సంగత్వే నిస్సంగత్వం !*_  

          

           _*నిస్సంగత్వే నిర్మోహత్వం !*_

     

              _*నిర్మోహత్వే నిశ్చలతత్వం !*_

           

           _*నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః !!*_


_*మనస్సు పాల వంటిది ఈ మనసును సంసారమనే నీటిలో కలిపితే పాలు నీరు కలిసిపోతాయి. అంటే మనసు సంసారంతో ఐక్యమైపోతుంది. ప్రపంచమనెడి సంసారంలో లీనమై పోతుంది.*_


_*అందుచేత పాలను ఒక పక్కన ఉంచి పెరుగు తోడుకున్నాక చిలికి వెన్న తీయాలి. ఏకాంతవాసంలో సాధనలు చేసి మనసు అనే పాల నుంచి జ్ఞానం, భక్తి అనే వెన్నను తీసినప్పుడు ఆ వెన్నను సంసారమనే నీటిలో ఉంచిన ఎప్పటికీ కలిసిపోదు. సంసార జలధిపై నిర్లిప్తంగా తేలుతుంది.*_


_*జీవన్ముక్తులు ఇదేవిధంగా ప్రపంచములో ఉన్నా "తామరాకు మీద నీటి బిందువు" లాగ వారికి ఏమీ అంటకుండా బ్రహ్మములో రమిస్తూ ఉంటారు.*_


_*అందుచేత మనస్సును గమనిస్తూ మనో లయము చేసి ఋషులు చెప్పిన మార్గంలో పయనించి బ్రహ్మమును పొందుదాము.*_


🙏🇮🇳😷🌞🌏🤺🥀🚩

శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి చరిత్ర🕉️*

 *🕉️మద్దిమడుగు శ్రీ  పబ్బతి ఆంజనేయ స్వామి వారి చరిత్ర🕉️*


*నల్లమల కీర్తికిరీటంగా వెలుగొందుతున్న అమ్రాబాద్ మండలం మద్దిమడుగు గ్రామంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో పిలిస్తే పలికే దైవంగా మద్దిమడుగు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు . నల్లమల కొండల్లో కృష్ణానది ఉత్తర వాహినిగా ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది . ఈ నదికి పడమర నుంచి దుందుభి నది కలిసేచోట దుందుభేశ్వరం అనే పురాణ క్షేత్రం వెలసింది . ఈ క్షేత్రానికి పడమరన 12 కిలోమీటర్ల దూరములో మద్దిమడుగు అనే రేవు పట్టణం క్రీస్తుశకం మూడో శతాబ్ది కాలంలో ఒక పెద్ద కోటను నిర్మించారు . కోట నాలుగు మూలల యందు నాలుగు బురుజులు , దక్షిణాన ఒక బురుజు , నైరుతిన ఎత్తైన ప్రాకారం , పైన రాజు ఉండే నివాసం నిర్మాణమై ఉంది . ఇది వాస్తు నిర్మాణంలో ఉంది . కోటలో స్వామి వారు ఈశాన్య ప్రాంతంలో వెలసి పుట్ట నుంచి బయటకు వచ్చినట్లు ఉ న్నాడు . చుట్టూ నాలుగు అడుగులు , ఒక గజం ఎత్తు కలిగిన ప్రాకారపు గోడలు చిన్న ఆలయంంలో వెలసి మద్దిమడుగు క్షేత్రపాలకునిగా ఉన్నాడు . స్వామి తన మహిమలతో భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు . కాలగర్భంలో అనేక ఏళ్ళు గడిచిన తదుపరి మద్దిమడుగు రేవుపట్టణంగా రూపొందింది . రాజుల కాలంలో వర్తక వ్యాపారాలు కొనసాగాయి . అనేక మార్పులు చెంది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది . రాజుల రాజ్యాలు పతనమైపోయినా నాటి అవశేశాలు నేటికి మద్దిమడుగు పడమర భాగాన నాలుగు కిలోమీటర్ల పొడవున పాతరాతి కట్టడాలు కనిపిస్తున్నాయి . స్వామివారి మూల విరాట్టు విగ్రహం మూడవ శతాబ్ది కాలం నాటిదని చారిత్రక పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు . నల్లమల అడవి ప్రాంతంలో ఉండే చెంచులు పండ్లు , పాలు , తేనె నైవేద్యంగా సమర్పించుకొని అనునిత్యం స్వామిని ఆరాధించేవారు . నల్లమల అడవుల్లో వుండే పశువుల కాపరులు స్వామిని ఆరాధించడం ప్రారంభిచారు . పశు వుల కాపరులు స్వామిని ఆవు పాలతో అభిషేకించి రొట్టెలు , బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టి భక్తి ప్రపత్తులతో ఆరాధించేవారు .*


        *నేడు కూడ భక్తులు తేనె ,   ఆవుపాలు , పొంగళితో నైవేద్యం , గోధుమ రొట్టెలు , బెల్లం కలిపి సమర్పించు కుంటున్నారు . స్వామివారి గర్భాలయం ఎదురుగా రాజులకాలం నాటి నుంచి అగ్నిహోమం నిరంతరం వెలుగుతుంది . కోట ఈశాన్యం బురుజుకు కోటమైసమ్మ అనే దేవత వెలసి ఉన్నది . ఆమెను భక్తులు ప్రతి ఆదివారం దర్శించి పూజలు చేస్తారు . శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామివారి మాలధారణ 1992 కార్తీక మాసంలో శ్రీ కె . జయరాం , గురుస్వామి ఆధ్వర్యంలో 15 మందితో మొదటిసారిగా ప్రారంభమైంది . ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎదిగింది . స్వామి వారి సంకల్పం మేరకు శ్రీ కె . జయరాం గురుస్వామి మరియు వారి శిష్యులు గురుస్వాములైన వారు పల్లె నుండి పట్టణం దాకా మద్దిమడుగు అంజన్న మాలల మహత్మ్యం సాక్ష్యాధారలతో ఋజువు పరిచారు . మహబూబ్ నగర్ , నల్లగొండ , రంగారెడ్డి , గుంటూరు , ప్రకాశం , కర్నూలు , హైదరాబాదు జిల్లాల నుండి వేలాది మంది స్వాములు మాల ధరించి మద్దిమడుగు వస్తున్నారు .*


           *1998 లో శ్రీ జయరాం గురుస్వామి ఆదేశం మేరకు డి . నరసింహులు , తెల పండితుల దర్శకత్వంలో దీక్షా స్వాములే స్వయంగా పాడిన " మద్దిమడుగు ఆంజనేయ స్వామి భక్తి గీతాలు " పాటల క్యాసెట్ ప్రప్రథమంగా తెలుగు మరియు లంబాడా భాషలలో కమల్ ఆడియో ద్వారా నిర్మించబడి ప్రస్తుతం సూర్యపేట సత్యం క్యాసెట్ సెంటర్ లాంటివారు ఎన్నెన్నో ఆడియో , వీడియో క్యాసెట్లు విడుదలచేసి స్వామి వైభవాన్ని దశదిశల చాటుతున్నారు .*


          *శ్రీ ఆంజనేయ ఆవేశితుడైన శ్రీ జయరాం గురుస్వామి నేతృత్వంలో సుమారు 15సం || ల నుండి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి మాలాధారణ వైశాఖ బహుళ దశిమి హనుమాన్ జయంతి సందర్భంగా ఏదుల ఏర్రగట్టు వీరాంజనేయ స్వామి మాలాధారణ కార్యక్రమాలు కూడ అత్యంత వైభవోపేతంగా జరుగుచున్నవి . మద్ది మడుగు మాలాధారణయే వీటికి ప్రేరణగా చెప్పవచ్చును .*


               *గత ముప్పై సంవత్సరాల నుండి ఆంజనేయ స్వామి సేవలో తరించి , ఎందరికో తరుణోపాయం చెప్పి గురుస్వాములకే గురుస్వామియైన శ్రీ జయరాం గురుస్వామి గారు హైదరాబాదుకు సమీపాన లక్ష్మీనగర్ కాలనీలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయము మరియు హనుమాన్ దీక్ష గురు పీఠము స్థాపించారు . ప్రతి శనివారం అచ్చంపేట స్వగృహం నందు , ప్రతి మంగళవారము హైదరాబాదు పీఠము నందు భక్తులకు , సందర్శకులకు అందుబాటులో ఉంటున్నారు . మిగతా రోజులలో దేశాటనము చేస్తూ హనుమాన్ భక్తి మహాత్మ్యాలను తెలియజేస్తున్నారు . మద్దిమడుగు ఆంజనేయ స్వామి తన సేవకై జయరాం స్వామిని పూర్తికాలం వినియోగించుకోవడం విశేషం . శ్రీ ఆంజనేయస్వామి సేవా సమితి , రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రాధ్యక్షులుగా స్వామి వారి శిష్యులు పేస్ బుక్ హనుమాన్ దీక్ష గురు పీఠం హనుమాన్ శక్తి య్యూటుబ్ చానల్ తో సేవలందించటం మరీ విశేషం !*


           *1993-94 సం || లో దేవాదాయ ధర్మాయ శాఖ ఈ ఆలయాన్ని గుర్తించి తన ఆధీనంలో చేర్చుకుంది . రూ || 13 లక్షలు వెచ్చించి స్వామి వారి గర్భాలయం , ముఖ మండపం , శివాలయం , శిఖరాల నిర్మాణం చేశారు . ప్రతి శుక్ర , శని , ఆది , మంగళ వారాలలో భక్తులు వేల సంఖ్యలో దర్శించుకొని ముక్తి పొందుతున్నారు .*

సార్ధకత

 సార్ధకత



మనం ధారతో కలిసి ప్రవహిస్తుంటే మనకి ఎలాంటి బాధ ఉండదు. కానీ మనం ఎదురీదే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం లో అహంకారం నిర్మితమౌతుంది. కానీ కాల ప్రవాహానికి ఎదురు వెళ్లలేము. ఆ ప్రవాహం వెనుక ఏమీ ఉండదు. అది విలీనమైపోతూ ఉంటుంది. అందుకని జీవితం ఏది తీసుకువచ్చినా దాన్ని పరమానందంతో స్వీకరించాలి. వాటియందు కొంచెం కూడా స్వీకరించక పోవడం అనే భావన ఉండకూడదు. జీవితానికి సబంధించిన ఫిర్యాదులు లేని వాడే ధార్మికుడు.


మనం ఒక ఎండిన ఆకులా ఉండాలి. ఎండిన ఆకుకి తన ఇష్టం అనేది ఏదీ ప్రత్యేకంగా ఉండదు. ఎలాంటి ఆకాంక్ష ఉండదు. తాను ఎక్కడకు వెడుతున్నాను అనేది తెలియదు. ఎక్కడకు వెళ్ళాలో అనేది కూడా తెలియదు. గాలి ఎక్కడికి తీసుకువెడుతుందో అక్కడకు వెడుతుంది.


 ఎండుటాకు తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. మన వాసనలే మన అస్థిత్వము. జనన మరణాలు మన చేతుల్లో లేవు అనే విషయం గ్రహించిన నాడు, నీవు నిమిత్తమాత్రుడుగా వుండగలవు.


ఎవరు జీవితం యొక్క సార్ధకతని తెలుసుకుని, జీవన ఆనందాన్ని పొందుతారో, వారు మృత్యువు వలన వేదనకు గురైన దాఖలాలు లేవు.


 అయ్యో! ఈ జీవితం వ్యర్థం అయిపోయిందే అనే బాధ మరణించేటప్పుడు కలుగుతుంది. ఆ బాధ మృత్యువుకి సంబంధించినది కాదు, జీవితానికి సంబంధించినది.

గురువంటేఎవరు

 గురువంటేఎవరు? ఎవరిని గురువుగా భావించాలి???


🌷🕉🌷🕉🌷🕉🌷


ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైన సమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిoచబూనటం సాధ్యం కాదు...


కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎఅవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి...


1 సర్వజ్ఞత :- ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.

2 సర్వ వ్యాపకత :- ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించలి...


3 సర్వ సమర్ధత :- తాను సిశ్యున్ని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాడ నియమాలను సహితం మార్చగలిగేంతగా.

ఇటువంటి వారిని మనము పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.

అటువంటివారిని పరిశీలించి,పరీక్షించిమరీ ఆశ్రయించాలేతప్ప కేవలం భావావేశముతో గురువు...గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికo గా పతన హేతువవుతుంది...


శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్దకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టెరయా అని తాతగారు[వీరబ్రహ్మేంద్ర] స్వాములవారు చెప్పి వున్నారు.

కనుక గురువు అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.

మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా ? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా?

గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.

గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది...


గురుచరిత్ర పారాయణము చేస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి,మన మనోభావాలు శుధ్ధపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవ్ంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు. అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు. గురుచరుత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు అలానే వివరించారు....


కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి...


గురువాక్యం శిరోధార్యం :

రామునివల్ల ఉత్తమగతి పొందిన కబంధుడు తాను పొందిన సాయానికి కృతజ్ఞత చూపిస్తూ ‘‘రామా! సుగ్రీవుని వద్దకు వెడితే నీకు ఉపకారం జరుగుతుంది. దారిలో మతంగ ముని ఆశ్రమం ఉంటుంది. అక్కడకు తప్పకుండా వెళ్ళు. అక్కడ నీకోసం శబరి ఎదురు చూస్తోంది, ఆమెకు నీ దర్శనభాగ్యాన్ని కలిగించు. ఆమె చేసే సేవలను అందుకుని ఆమెను తరింపజెయ్యి...


నీకు మంచి జరుగుతుంది’’ అని చెప్పి అదృశ్యమైపోయాడు.

పంపా సరస్సు సమీపంలో ఉన్న మతంగ మహర్షికి శిష్యురాలు శబరి. గురువును సేవించడమే తన జీవితానికి ధన్యత్వంగా భావిస్తూ, సేవ చేసింది. కొంతకాలం తరువాత మతంగుడు యోగం ద్వారా తన భౌతిక శరీరాన్ని విడిచి, పుణ్యలోకాలకు వెళ్ళాలనుకొన్నాడు. తనను కూడా తీసుకుపొమ్మంది శబరి. ‘‘నువ్వు ఇంకా కొంతకాలం ఈలోకంలోనే ఉండాలి. దైవసేవ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండు...


 శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి ఒకనాడు ఇక్కడికి వస్తారు. ఆయనను సేవించు. ఆ పుణ్యం వల్ల నీకు మోక్షం లభిస్తుంది’’ అని చెప్పి, గురువు సిద్ధిని పొందాడు. రాముడు ఎవరో తనకు తెలీదు...


ఎందుకు వస్తాడో తెలీదు. తనకు ఏ సంబంధమూ లేని వ్యక్తికోసం తాను ఎందుకు ఎదురు చూడాలని అడగలేదు. గురువు వాక్యం శిరోధార్యం అనుకుని, అలాగే ఎదురుచూస్తోంది.

క్రమక్రమంగా వయసు మీదపడుతోంది. శరీరానికి పటుత్వం తప్పుతోంది. వార్ధక్యం బాధిస్తోంది. జరాదుఃఖాన్ని భరిస్తోంది...


 తలచుకుంటే గురుసేవ వలన తనకు లభించిన యోగవిద్య ద్వారా శరీరాన్ని విడిచిపెట్టగలదు శబరి. కాని గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పోనీ ఇంతకాలానికి వస్తాడని ఒక స్పష్టమైన సమయాన్నైనా గురువుగారు చెప్పలేదు. చెప్పమని శబరి అడుగనూ లేదు. గురువు చెప్పింది వినడమే తప్ప, ఎదురుప్రశ్నలు వేసే అలవాటు, తిరస్కరించే నైజం లేదు...


అందుకని రాముని రాకకోసం ఎదురు చూస్తోంది.

శబరి చూపులు ఫలించాయి. రాముడు రానే వచ్చాడు. అవధి లేని ఆనందంతో గబగబ ఎదురేగింది. సాదరంగా ఆహ్వానించింది. పాద్యం, అర్ఘ్యం ఇచ్చింది. కూర్చోవడానికి ఆసనాన్ని సిద్ధం చేసింది. ఆ అడవిలో దొరికే మధురమైన ఆహారాన్ని తెచ్చి ఇచ్చింది. ఆయన రాక వల్ల తనకు విముక్తి కలిగిందని కాకుండా గురువాజ్ఞను పాటించేందుకు ఇన్నాళ్


అమర చైతన్యం"*

 *"అమర చైతన్యం"* 

*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*



*ప్రశ్న: 'దయ' గురువిచ్చే బహుమానమా...*


*జవాబు: భగవంతుడు, దయ, గురువు ఇవన్నీ సమానర్ధకములు. అసలు అది లోపలే వున్నది, మరియు సర్వవ్యాపకమైనది. ఆత్మ లోపల లేదా. గురువేమైనా తన చూపుతో దానిని (ఆత్మను) అనుగ్రహిస్తాడా.. అలా అనుకునే వ్యక్తి గురువు కాడు. దీక్షలు చాలా రకములు. హస్త దీక్ష, స్పర్శ దీక్ష, చక్షు దీక్ష.  గురువేదో మంత్రాలతో, నీళ్ళతో, అగ్నితో ఏదో తతంగం నిర్వహిస్తే దానిని దీక్ష అంటారు. ఆ దీక్షలతో శిష్యుడు పరిణితి చెందుతాడని భావిస్తారు. వ్యక్తిత్వమంటూ (అహం) ఏమీ లేని వ్యక్తియే గురువు. దక్షిణామూర్తి అలాంటి వాడే.. ఆయన ఏమి చేసాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. శిష్యులు ఆయన ముందు ఉండినారు. ఆయన మౌనాన్నే కొనసాగించినాడు. శిష్యులు సందేహాలు (సందేహించేవాడు - అహం) పోయినవి. నిజమైన గురువు ఆయనే. ఆయన చేసినదే దీక్ష (మౌన దీక్ష). అదియే జ్ఞానము. మాటలు సముదాయము కాదు. మౌనమే ఎక్కువ శక్తివంతమైనది. శాస్త్రాలు ఎంత విస్తారంగా ఉన్నా, ఎంత స్పష్టంగా చెప్పినా, అవి ఈ పని చేయలేవు. అంత సమర్థులూ గాదు. గురువు మౌనంగానే ఉంటాడు. ఆయన మౌనంలోనే ఎంతో శక్తి ప్రశాంతత వుంటుంది. అది శాస్త్రాలన్నింటికన్నా శక్తివంతమైనది. జ్ఞానులతో సహవాసమే జ్ఞానప్రాప్తికి దోహదం చేస్తుంది. ఎంతో దీర్ఘకాలం చేస్తేనే కాని, ఎంతో శ్రవణం చేస్తేనే గాని, ఎంతో కష్టపడితే గాని జ్ణానమును నేను పొందలేదు అనునటువంటి మాటలవల్ల ఇటువంటి సందేహాలు (ప్రశ్నను గమనించండి) వస్తాయి. లోపల జరిగేపని బయటకు కనిపించేది కాదు. నిజానికి గురువు లోపలనే ఉన్నాడు.* 


*తాయుమానవర్ ఇలా అన్నారు :*

*"ఓ భగవంతుడా.. నీవు అనేక జన్మలు నాతోనే వుండి, నన్ను వదలకుండా చివరకు నన్ను రక్షించావు. అదే సాక్షాత్కారము".*


*భాగవతంలో కూడా ఇలాగే వున్నది. మనమిద్దరమూ (భగవంతుడు, జీవుడు) ఇపుడే కాదు ఎపుడూ కలిసే వున్నాము. గురువు యొక్క అనుగ్రహము శాస్త్రాధ్యయనము, ధ్యానము కన్నా ఎక్కువ శక్తివంతమైనది. ఇదే ప్రధానమైనది. మిగిలినవన్నీ తరువాతవే.. తక్కువవే..*

అరుణాచల శివ

 అరుణాచల శివ 




మనం మాట్లాడకుండా ఉండటమే మౌనం అనుకుంటున్నాం.. ..


నోటితో మాట్లాడకపోయినా లోపల మనసు మాట్లాడుతూ ఉంటే అది మౌనం ఎలా అవుతుంది.. ???



 మహర్షి ఇలా చెప్పారు.. రేడియో శబ్దాన్ని ఎంత తగ్గించినా పూర్తిగా కట్టేసే వరకు అందులోని బ్యాటరీ ఖర్చు అవుతూనే ఉంటుంది. అలాగే మాట్లాడ కుండా ఉన్నా ఆలోచనలతో మన మనోశక్తి ఖర్చు అవుతూనే ఉంటుంది.


 మనసు ఒక బ్రహ్మరాక్షసి.


 దానికి ఏదొక పని లేకపోతే అది అశాంతికి గురిచేస్తుంది.


 అందుకే నిరంతరం నామం, ధ్యానం, సత్సంగంతో ఉంటే మనసు అదుపులో ఉంటుంది.


 మనం నేర్చుకున్నదంతా విన్నదే.మనం సొంతంగా తెలుసుకున్నదే మనకు బలం.


 మనశ్శాంతి కోసం చేసుకునే ఆధ్యాత్మిక సాధనలో కేవలం విన్నదానితో వాదులాడుకోవటం వృధా. 


అందుకే శ్రీ రమణ మహర్షి '' తెలియని దైవం గురించి తెలుసుకునే ముందు అసలు 'నేను ' అంటే ఏమిటో తెలుసుకో.. అన్నారు. 


మనం ఏమిటో మనకి తెలిసిన రోజున దైవం ఏమిటో అనుభవంలోకి వస్తుంది..

రామాయణాన్ని ఆదికావ్యం

 #జై_శ్రీ_రామ్ 


రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు.

 

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ 

బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.


ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.


రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.


అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దగ్గర, సోదరుల దగ్గర , గురువుల దగ్గర , భార్య దగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి. 


రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.


కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్


రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సహాయం

 🌹🌹 *సహాయం* 🌹🌹


ఒక ఆశ్రమంలో ముసలి సన్యాసి ఒకాయన ఉండేవాడు. ఆయనకు ఉన్న అద్భుత శక్తులలో ఒకటి, మానవుల తలరాతను చూడగలగటం.


ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఎనిమిదేళ్ళ పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు. 


ఒక రోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసీ చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది: పిల్లవాడి ఆయుష్యు అయిపోవచ్చింది.. కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు!


గురువు గారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి దండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది.


 అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచి, "నాయనా! నువ్వు కొంతకాలంపాటు శలవు తీసుకొని, మీ యింటికి వెళ్ళు. వీలైనన్ని రోజులు మీ‌తల్లిదండ్రులతో‌ సంతోషంగా గడుపు. వెనక్కి తిరిగి రావాలని తొందర పడకు" అని చెప్పి, ఇంటికి పంపించాడు.


మూడు నెలలు గడిచాయి. ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నారు గురువుగారు. అయితే ఒక రోజున, గురువుగారు కొండ మీద కూర్చొని క్రిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు- 


ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు! అతని ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంత వరకూ జీవిస్తాడని అర్థమైంది!


"ఏమి చేయటం వల్ల, అతని రాత ఇంతగా మారింది?” అని గురువుగారికి ఆశ్చర్యం‌ వేసింది. "నువ్వు ఇక్కడినుండి వెళ్ళావు కదా, ఆరోజునుండీ ఏమేం జరిగాయో మొత్తం చెప్పు" అన్నారు శిష్యుడితో.


పిల్లవాడు తను ఇంటికి ఎలా చేరుకున్నాడో‌చెప్పాడు; మధ్య దారిలో తను చూసిని ఊళ్ళను గురించీ, తను దాటిన పట్టణాలను గురించీ చెప్పాడు; తను ఎక్కిన కొండల గురించీ, తను దాటిన నదుల గురించీ‌ చెప్పాడు. "ఇంకా ఏమేమి విశేషాలున్నై?" అడిగారు గురువుగారు.


శిష్యుడు కొంచెం గుర్తుచేసుకొని చెప్పాడు: "ఒకసారి నేనొక వాగును దాటాల్సి వచ్చింది. వరద వచ్చి ఉన్నది- ఉధృతంగా ప్రవహిస్తున్నది, ఆ వాగు. వాగు మధ్యలో ఒక చిన్న మట్టి కుప్ప నిలచి ఉన్నది, ద్వీపం లాగా.


 ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు- ఎటు పోయేందుకూ వీలుకాక, ప్రాణభయంతో‌ కొట్టు మిట్టాడుతున్నది. కొద్ది సేపట్లో‌ ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది- చీమలన్నీ‌ నీటి పాలౌతాయి. 


నాకు వాటిని చూసి జాలి వేసింది. ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదికి వంచి, పట్టుకొని నిలబడ్డాను. చీమలు ఒక్కటొక్కటిగా ఆ కొమ్మమీదికి ఎక్కేసాయి. అవన్నీ భద్రంగా ఒడ్డెక్కేంత వరకూ నేను కొమ్మను అట్లాగే పట్టుకొని నిల్చున్నాను.


 ఆ తర్వాత నాదారిన నేను వెళ్ళాను. ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది" అని.


"ఓహో, అదన్నమాట, కారణం! దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట!" అనుకున్నారు గురువుగారు.


దయతోటీ, ప్రేమతోటీ‌ మనం చేసే పనులు మన రాతనే మార్చగలవు. నిజంగానే మన రాత మన చేతల్లో ఉంది!

       

*సేకరణ


ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻

సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏

.

ఆకలి విలువ.*.

 🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛

          *ఆకలి విలువ.*. 

🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛

*విజయవాడ , బంధువుల పెళ్లి కని బయల్దేరాము. బాగా ఆకలి వేస్తే ఒకచోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక్కో ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత, బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరు..*


*టిఫిన్ సగం తిని, సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్లి చేతులు కడిగేసారు. మిగిలి పోయిన టిఫిన్ చూసి నా మనసులో కళుక్కుమంది. ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా మొత్తం తింటారనుకున్నగాని ఇలా వదిలేస్తారనుకోలేదు.*


*దారి మధ్యలో ఒకదగ్గర పుచ్చకాయముక్కలు కోసి ఐస్ పైనపెట్టి ఒకప్లాస్టిక్ ప్లేటులో ఆ ముక్కలు ఉంచి, వాటిమీద ఉప్పు చల్లి అమ్ముతున్నారు. అవి తిందామని బతిమాలి కారు ఆపించారు. ఇక్కడా అదే తంతు. అందరం తిన్నతరువాత మరో ప్లేటు ఆర్డర్ చేసి, సగం తిని సగం వదిలేసారు. ఈ సారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది. మరోసారి బాధపడి, నోరుచేసుకోకుండా ఊరుకున్నాను. వద్దని వారిస్తే పిసినారి పైసా పోనియడు, తాను తినడు, తినేవారిని తిననియడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను.* *అంగరంగవైభవంగా అలంకరించిన వేదిక. వచ్చి పోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతుంది.* *వేదికముందు కుర్చీలలో కూర్చున్నవారికి కూల్ డ్రింకులు అందిస్తున్నారు.* 


*కూల్ డ్రింక్ తాగిన వారిలో చాలా మంది సగం వదిలేశారు. పెళ్ళి వారిని పలకరించి, భోజనాలవైపు బయలుదేరాము.* *ఎన్నిరకాల వంటకాలు పెట్టారో, లెక్కపెట్టడానికే పదినిమిషాలు పడుతుంది. నాకైతే చూసాకే సగం కడుపు నిండిపోయింది. భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే కరువు ప్రాంతాలనుండి వచ్చిన వారిలాగా ఎగబడుతున్నారు.*


*జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు ,తినలేదు ,ఇప్పుడు తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంతఇదిగా ఎగబడ్డారు.. ఎంత వడ్డించుకుంటున్నారో,ఎంతతింటున్నారో, ఎంతవదిలేస్తున్నారో వారికే తెలియడంలేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది. అక్కడ జరుగుతున్న తతంగమంత గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి పిలిచింది భోజనానికి. చేతిలో పళ్లెంతో దానినిండా పదార్థాలు.* *కలుపుకోవడానికి కూడా చోటులేదు. అది చూసి అన్నం తినబుద్దికాలేదు. నాకు ఆకలిగాలేదు మీరు తినండి అని వారిని పురామయించి, ఓ పక్కన కూలబడిపోయాను.*


*అక్కడినుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లాలలలో వదిలేసిన భోజనాన్ని డేగిసలో నింపి గోడవతల విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను. నోరెళ్ళబెట్టి చూసారు, కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు,కాలికింద నేల కదిలిపోయినట్లు అనిపించింది.* *తిరుగుప్రయణంలో, నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది. ముభావంగా ఉండిపోయాను. ఆరుగాలం వ్యవసాయం చేసిన మానాన్నగారు తన ప్రాణ సమానంగా చూసుకునే కాడి ఎడ్లను నిమురుతూ చెప్పిన మాటలు "అన్నం పరబ్రహ్మ స్వరూపం. నేల తల్లి ఇచ్చిన ఫలాన్ని మనతోపాటూ పది మందికీ వృధా చేయకుండా పెడితేనే మన శ్రమకు సార్దకత. " అన్న మాటలు పదేపదే గర్తుకు వచ్చాయి*


*ఏమైంది నాన్నా?*


*పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకుని, ఒక్కక్షణం ఆగి, జేబులోనుండి వందరూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను. అకస్మాత్తుగా నేనలా చెప్పేసరికి విస్తుపోయి చూసింది. నేను కల్పించుకుని, నువ్వు విన్నది నిజమే వందరూపాయల నోటు బయటపడేయమన్నాను. మరోసారి చెప్పాను.* *ఎమ్మాట్లాడుతున్నారండి మీరు. భోజనాల దగ్గరనుండి చూస్తున్నాను. ముభావంగా ఉంటున్నారు.*


*ఏమిమాట్లాడటంలేదు, ఏమైందని పలకరిస్తే, వందరూపాయలు బయటపాడేయమంటారా?*


*గాలిగాని సోకిందా, విసురుగా చూసింది.*


*ఒకవంద రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంతకోపం వచ్చింది కదా....? పొద్దున్నుండి మీరు హోటల్లో టిఫిన్, పుచ్చకాయముక్కలు, పెళ్లిభోజనాల దగ్గరకూరలు. దిలేసిన వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా? మీ ముగ్గురివి కలిపి దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు వేయి రూపాయలు బయటపడేసారు.నేను వందరూపాయల నోటు విసిరేయడం పిచ్చయితే మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకుని, వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ్ స్వరూపమన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా?వృధాగా పడేసే అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయక పోతే ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క. నేను ఆవేశంగా చెబుతున్నమాటల్ని అడ్డుకుంటు .... మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ, అడిగింది మా అమ్మాయి. అవునమ్మా చిన్నచిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి.*

*ఒక్కొక్కనీటిచుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది. వేల మైళ్ళ గమ్యమైన ఒక్కఅడుగుతోనే మొదలవుతుంది. చెప్పడం ఆపేసాను.*

*అందరూ ఆలోచనల్లో పడిపోయారు. "మార్పు కి బీజం పడినట్లే.......*

*ఎందుకంటే ఆలోచిస్తే మనం కూడా ఆ కోవకి వస్తామా అనిపిస్తుంది..*.

*ఇకనుండి నేను ఆహారాన్ని వృధాకానివ్వను ...అని మనస్సులో నిర్ణయించుకున్నాను..*

*మరి మీరో....!!*

🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛

*ఆకలి విలువ తెలిసినవారు, ఆహారాన్ని వృధాచేయరు. అలా చేస్తే ఆరుగాలం శ్రమించిన రైతు కష్టాన్ని, భూమాతను అవమానించినట్లే*

*గొప్పల కోసం, స్థాయిని, స్టేటస్ చూపించుకోవడం కోసం వందల రకాలు వండి వార్చి ఆహారం వృధాచేయకండి. కనీసం ఆ ఖర్చుతో వందల మంది అనాధల, పేదల, అన్నార్తుల కడుపులు నింపవచ్చు. వారు తృప్తిగా తిని చేసిన ఆశీర్వచనమే మన పిల్లలకు శ్రీరామరక్ష. అవసరానికి మించి ఎప్పుడూ వడ్డించుకోవద్దు. తినేటప్పుడు పావు వంతు పొట్టలో పావు శాతం ఖాళీగా ఉంచడం ఆరోగ్యకరం.*


*సర్వేజనా సుఖినోభవంతు*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

_*దయచేసి పై మెసేజ్ ను ఎడిట్ చేయకుండా అందరికీ పంచండి.*_

ధార్మికగీత - 65*

 *ధార్మికగీత - 65*

                                  


      *శ్లో:- శబ్దాదిభిః పంచభి రేవ పంచ ౹*

             *పంచత్వ మాపు: స్వగుణేన బద్ధా:౹*

             *కురంగ మాతంగ పతంగ మీన ౹*

            *భృంగా నరః పంచభి రంచితం కిమ్?*



శబ్దాదిగానుండి శాసించుచుండెడి 

            పంచేంద్రియంబులు బలయుతములు 

శబ్దంబులోనున్న శ్రావ్యత వినియును 

            వేట గానికి జిక్కి వీగు లేడి 

మగకరి కడనుండు మదగంధమును బీల్చి

            కరి పడిపోవును కందకమున 

కాంతిరూపము జూచి కడువడి దూకియు 

           మ్రగ్గును శలభమ్ము మంటలందు 

రుచికి తా  లొంగి  నెరుగక యెర యనుచు 

            గాలమ్మునకు జిక్కి గడచు చేప 

వాసనభ్రమకును వశ్యమై తుమ్మెద 

           అరయ కుసుమమందె యంతమౌను 

ఇటుల లేడి గజము మిడుతయు  మీనమ్ము

భృంగముల్  సుదూర దృష్టి లేక 

యాశతోడ తుదకు యంతమ్ము వొందును

మనుజు డట్లు నుంట మాన్య తగునె ?


✍️ గోపాలుని మధుసూదన రావు

బహుమతి

 మీకో  బహుమతి 


మీరొక బహుమతి గెలుచుకున్నారు అనుకోండి. 


దాని ప్రకారం మీకు మీ బాంక్ వారు  మీ అకౌంట్ లో  ₹ 86,400 వేస్తారు కానీ కొన్ని షరతులకు లోబడి ఈ బహుమతి ఉంటుంది. 


ఆ షరతులు ఏమిటంటే 


ఒకటి : మీరు రోజు ఖర్చుపెట్టలేనిదంతా మీ ఖాతానుండి తీసేస్తారు.


రెండు :  మీరు మరొకరి అకౌంట్ కు  డబ్బు బదలాయించ కూడదు.


మూడు : మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. 


నాలుగు :  మీరు ఉదయం లేవగానే, మీ బాంక్ అకౌంట్ ₹ 86,400 తో మొదలవుతుంది. ఆరోజు వరకే .


ఐదు  :  ఏ రోజు అయినా, మీ బాంక్ " బహుమతి ఆట అయిపోయింది. మీ ఖాతా ముగిస్తున్నాము. మీకు మరో ఖాతా మేము తెరువలేము" అనవచ్చు. 


అలాంటి పరిస్థితులలో మీరు వ్యక్తిగతంగా ఏమి చేస్తారు అన్నదే ప్రశ్న.


మీరు మీకు కావలసినవన్నీ కొనుక్కుంటారు, అవునా ? 


మీ కోసమే కాదు. మీరు ప్రేమించే వారి కొసం. అంతేకాదు. మీకు తెలియని వారికోసం కూడా, ఎందుకంటే, రోజు వచ్చి పడే అంత సొమ్ము మీరు మీ కోసం ఖర్చు చేయలేరు. 


ఎందుకంటే, ఉదయం కాగానే నిన్నటి బాలన్సు  డబ్బు మీ ఖాతాలో ఉండదు కదా ! అందుకని ఈ రోజే అంతా ఖర్చు చేయాలనుకుంటారు. అవునా ? 


ప్రతి రూపాయి ఖర్చు చేయలని ప్రయత్నిస్తారు. ఔనా ? కాదా ? 


ఇది బహుమతి ఆట కాదు. వాస్తవం. 


ఆశ్చర్యపోకండి. నిజం ఇది వాస్తవం. 


మనలో ప్రతి ఒక్కరం ఈ బహుమతి గెలుచుకునే ఉన్నాము. కానీ అది మనం చూడటం లేదు. 


ఏమిటా బహుమతి అంటారా ?  " సమయం "  సమయం ! 


    ప్రతిరోజు లేవగానే మనకు 86,400 సెకన్లు  జీవితంలోకి  బహుమానంగా వస్తున్నాయి. 


    మనం రాత్రి నిద్రపోయినప్పుడు, మిగిలిపోయిన "సమయం" మన ఖాతాలో ఉండదు. 


   మనం ఏ సమయం అయితే పోగొట్టుకున్నామో, అది మళ్ళీ మన జీవితం లోకి తిరిగి రాదు కదా !


      "నిన్న" అనేది శాశ్వతంగా పోయింది. 

   

         ప్రతి రోజు ఉదయం మీ ఖాతా మళ్ళీ 86,400 సెకన్లతో నింపబడుతుంది. కానీ భగవంతుడనే ఆ బాంక్ మీ ఖాతాని చెప్పా పెట్టకుండా ఎప్పుడైనా మూసివేయవచ్చును. ఔనా ! 


   కాబట్టి, ఓరి పిచ్చితండ్రీ / తల్లీ, మీరు మీకు రోజు వచ్చే 86,400 సెకన్లతో ఏం చేస్తారు అనేది ముఖ్యం.


ఈ సెకన్లు ఎంతో విలువైనవి కదా ! ఇవి రూపాయలతో సమానం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి, సమయాన్ని  సరిగా ఖర్చు పెట్టాలి కదా ! 


ప్రతి సెకను మీరు మనస్సును  ప్రేమతో నింపి  భగవంతుని ఆరాధనతో , పరవశించి పోయారు అనుకోండి, సమయం ఎంత వేగంగా పరిగెత్తినా, మీరు ఏమీ పోగొట్టుకోరు. 


ఎందుకంటే  మీ చుట్టూ,  భగవతుంతుని ఆరాధిస్తూ,  మీ సమయం తో  ఒక  కోట నిర్మించుకున్నారన్నమాట.  ఆ కోటలోకి కోపం,   దు:ఖం, ద్వేషం, అసూయ, పగ, అనేవి ఏవీ దండయాత్ర చేయలేవు.  


 కాబట్టి,    మీ " సమయం " భగవంతుని ఆరాధనలో కొంచమైనా ఖర్చు చేయండి. 


మీకు శుభం కలుగుతుంది. 


🚩🚩జై శ్రీరామ్🚩🚩.....సత్య🙏🙏

అవకాశం

 ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజుని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, వెంటనే యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముని కానీ నీవు తాగడానికి నాకు నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని , యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు. నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అది జరుగుతుంది కానీ గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. మొదటిపేజీలోనిది చదివాడు అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు, "తన స్నేహితుడు ఎన్నికలలో గెలిచి మంత్రి పదవి రాబోతోంది " అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసుకుని నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలో సమయం వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టు కున్నావు నీ యొక్క మృత్యువు నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు . ఆ వ్యక్తి చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు.


 ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది.


ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి "మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి "అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పర చింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాని మనమే వంచన చేసుకుంటున్నాం...

జనం












 

వినాయకుడు

























 

రక్తదోషము

 రక్తదోషము నివారించి రక్తశుద్దిని కలిగించు దేశివాళి  టీపొడి తయారీ విధానం  - 


    నీడలో ఎండించిన పుదీనా ఆకు 200 గ్రాములు , మంజిష్ట చూర్ణం 50 గ్రాములు , మిరియాల చూర్ణం 10 గ్రాములు మోతాదులో సేకరించి వీటన్నింటిని కచ్చాపచ్చాగా చూర్ణం చేసుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకుని ఈ చూర్ణమును ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు 5 గ్రాముల మోతాదులో తీసుకుని పావులీటరు నీటిలో మరిగించి వడపోసి దానియందు తగుమాత్రము పాలు , పంచదార కలిపి టీకి బదులుగా ఈ పానీయం సేవించుచుండిన రక్తము శుభ్రపడి దుష్టరక్తము వలన కలుగు వ్యాధులు సమూలంగా అంతరించును. ముఖ్యముగా చర్మవ్యాధుల వారికి బాగా ఉపయోగపడును. 


           పైన చెప్పిన దేశివాళి టీపొడి తయారుచేసుకొని మామూలు టీ పొడి బదులు వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మహాలక్ష్మీ_ఆహ్వానం

 ఖవ్వం_సవ్వడి మహాలక్ష్మీ_ఆహ్వానం 🙏


 పూజగదిలో ఈ వస్తువు కనుక ఉందీ అంటే ఆ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు అని పెద్దలు చెబుతూఉంటారు.  అంత అత్యత్భుతమైనటువంటి సిరిసంపదలను కలిగించేటటువంటి ఆ వస్తువు ఏమిటంటే  *ఖవ్వం.* అందుకే మీరు గమనిస్తూ ఉంటే గృహప్రవేశం సమయంలో కొత్తగా ఇంట్లోకి వెళ్ళేటటువంటివారు ఖవ్వాన్ని కూడా పూజాసామగ్రితో పాటుగా తీసుకుని వెళుతూ ఉంటారు. "ఖవ్వానికి అధిపతి లక్ష్మీదేవి". ఏ ఇంట్లో అయితే ఖవ్వం ఉందో... ఆ ఇంట్లో పెరుగు ఉందీ అని అర్ధం. ఎందుకంటే ఖవ్వం ఉన్నది పెరుగు చిలకటానికే కాబట్టి. పెరుగు ఉందీ అంటే పాలు ఉన్నాయి అని అర్ధం. పాలు ఉన్నాయీ అంటే ఆ ఇంట్లో పశుధనం ఉందీ అని అర్ధం. పశుధనం ఉందీ అంటే వారికి పొలం ఉందీ అని అర్ధం. పొలం ఉందీ అంటే వారికి సిరిసంపదలు ఉన్నాయీ అని అర్ధం. ఎందుకంటే పాలు, పెరుగు,సిరిసంపదలు ఏమిలేనివారికి ఖవ్వంతో పనిఏమీ ఉండదు కాబట్టి, ఖవ్వం ఇంత విశేషమైనటువంటి లాభాన్ని మీకు కలిగిస్తుంది. అందుకని ఒక చక్క ఖవ్వాన్ని మీరు పూజగదిలో పెట్టుకోండి. పూజగదిలో ఎట్టి పరిస్థితిలోనూ కూడా స్టీలుఖవ్వన్నీ, ఇనుపఖవ్వలూ మరియు అల్ల్యుమినియం ఖవ్వాలను అస్సలు పెట్టకూడదు. ఒక చక్క_ఖవ్వాన్ని కొనుక్కుని దానికి కొంచం గంధము,కుంకుమ బొట్టుపెట్టి మీ పూజగదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. ఈ రోజుల్లో ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బ్యాంకుబాలన్సు ఉంది అనేదాన్ని బట్టి శ్రీమంతుడు ఎవరు అని చెబుతున్నారు. కాని పూర్వకాలంలో మాత్రం ఇంటి ముందు, ఎంత పశుసంపద ఉంటే వారు అంత శ్రీమంతుడు అని గుర్తు. అంటే వారికి అన్నీ పొలాలు ఉన్నాయి, అన్నీ ఎకరాలు ఉన్నాయి అని గుర్తు. కాబట్టి ఆ ఇంట్లో పాడిపంటలు, సుభి పశుసంపద ఉంది అని గుర్తు. లక్ష్మీదేవి ఆ ఖవ్వం రూపంలో వారి ఇంట్లో ఉందీ అంటే వారికి సిరిసంపదలు కలిగి తీరుతాయని గుర్తు. కాబట్టి ఖచ్చితంగా మీ పూజగదిలో ఆ ఖవ్వాన్ని ఉంచండి. అదేవిధంగా వీలైతే ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా ఆ చక్క ఖవ్వంతో పెరుగును చిలకండి. ఏ ఇంట్లో అయితే పెరుగు చిలకబడుతుందో, ఏ ఇంట్లో అయితే ఆ ఖవ్వం పెరుగులో తిరుగుతూ తిరుగుతూ శబ్దం వస్తుందో, ఆ శబ్దం లక్ష్మీదేవి యొక్క ఆహ్వానానికి సంగీత సంకేతమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవిని ఖవ్వంతో మీ ఇంట్లోకి ఆవాహం చేసుకోండి. లక్ష్మీ అనుగ్రహం పొందండి.


“సర్వేజనా సుఖినోభవంతు”🙏

ఒత్తిడి

 "S T R E A S H" ( ఒత్తిడి).   (సమర్పణ & సేకరణ: మజుందార్, బెంగళూర్)           దీనిని మనము ఆహ్వానిస్తే "సమస్య"  ఇది నేడు సాధారణముగా ప్రతి ఒక్కరికి ఉండి తీరుతుంది, ఏ మాత్రం సందేహము వలదు.    ఇంటిలో వారికి డాక్టర్లకు కూడా ఉంటుంది.  ఈ ఒత్తిడి లేదు అంటే వాడు  "కోమా"  లో ఉన్నట్టు లెక్క. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, నేర్చుకోవటం, సర్దుకుపోవడం, రిటైర్ అయినాక మరి కొన్ని రకాల ఒత్తిడులు, రాజకీయ నాయకులకు, సీటు కొరకు ఒత్తిడి, ఆ తరువాత గెలుపు కొరకు ఒత్తిడి, ఆ తరువాత పదవికోసం ఒత్తిడి, తరువాత సేవచేయుటకు ఒత్తిడి, చెప్పలేని విధమైనటువంటి సంపాదించినది దాచుకునే ప్రయత్నం లో ఒత్తిడి,  ఇలా ఈ క్రింది విధంగా "ఒత్తిడి" బాధ పెడుతుంది కదూ!         ఆ,.  --. అలసట.         ఆ" , -- ఆరోగ్య సమస్యలు(బీపీ, షుగరు, గుండె జబ్బులకు. )     "ఇ" --ఇల్లు సంపాదన. (ఇల్లు మెయింటెయిన్ చేయుటలో కోరికలు గుర్రాలు అయిన పక్షంలో)          "ఈ" -- ఈర్ష ద్వేషాలు,.(మనకు ఇష్టం లేని నచ్చని వ్యక్తి కనిపించినా )   "ఉ" ---. ఉద్యోగము వ్యాపార సమస్యలు.  (లాభనష్టాల గురించి, పని వారి గురించి)        "ఊ" --- ఊహించుకున్న భయాలు (అపోహలు, అపార్థాలు).                , "బౌతిక.  సమస్యలతో ఒత్తిడి":- "శ్వాసకోస సంబంధించిన, అజీర్ణం, కడుపులో మంట, చర్మ వ్యాధులు, బి.పి, గుండెల్లో అలజడి, గోళ్ళు కొరకటం, నత్తి, నిద్ర పట్టక పోవుట,  సహజముగా ఇవన్నియు అపోహ వల్ల ఎటువంటి స్థితికి మిమ్ములను తీసుకుని వెళుతుందో ఆలోచించండి.            "మానసిక సమస్యలు  ,"బద్ధకం, భయం, వాయిదా వేసే గుణం, ఆందోళన ,టెన్షన్, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఈ జబ్బులకు  మానసిక ఒత్తిడి కారణం.           , "ప్రవర్తన దోషాల వల్ల".  :-పిచ్చి, కోపం, వస్తువులు విసురుట (వంట సామాను విసురుట),(సెల్ ఫోను లాంటివి) పగలగొట్టుట, మణికట్టుపై కత్తితో కోసుకో నుట, మత్తు పదార్థాలకు అలవాటు పడుట, తల దువ్వుకునే అలవాటు లేకపోవడం,  శుచిగ స్నానము  చేయకపోవటం, బెదిరింపు ధోరణులు, చేసేవారికి ఎటువంటి ఒత్తిడి కారణం.                "ఒత్తిడి కూడా ఒక వరం లాంటిదే" :- విద్యార్థికి- పరీక్షల ఒత్తిడి;.    టీచర్లకు --. సిలబస్ ఒత్తిడి,.      నాయకుడు కు -- పరిపాలన పట్ల, తన సీటు పదవి పట్ల, సొంత ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం;.      డాక్టర్--.  ఆపరేషన్/ఒ.పి లు చూచుటకు,.               ."ఒత్తిడి అనేది ఒక పులి లాంటిది".  పట్టుకుంటే భయభ్రాంతులను చేస్తుంది,. నిలబడితే స్నేహపూర్వక వచ్చి ఒళ్ళు కూర్చుంటుంది, మరి కుక్క లేనా అంతే పరిగెత్తి పోతే వెంటపడతాయి.  అదే నిమిరితే తోక ఊపుతుంది.             ,"ఒత్తిడి తగ్గించుకొనుటకు గల చిట్కాలు".  :- 1)" మీ యొక్క పని ప్రణాళిక బద్దం గా ఉండాలి.     2)"మీకు నెగిటివ్ మనుషులు గుర్తించిన వారిని దూరంగా పెట్టండి.       3)"మీ ఓటమి విషయాలు పూర్తిగా మర్చిపోండి.    4)"సరదాగా నవ్వుతూ ఉండండి (లాఫింగ్ థెరఫీ చెయ్యండి).       5)"దేవుడి భజన కార్యక్రమాలు, సత్ సంఘాలలో పాల్గొనండి.      6) "ధ్యానం, ప్రాణాయామం, సూర్య నమస్కారములు చెయ్యండి.  (సశేషం)

*శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము

 


*శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము*


*కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|*


*కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్*


*మొదటి అధ్యాయము - రెండవ భాగము*


*దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట*


*ఈ లోకమునందు గాజు తునక ఎక్కడ? అమూల్యమైన మణి ఎక్కడ? అలాగే అమృతము ఎక్కడ? శ్రీకృష్ణావతార విశేషభరిత శ్రీమద్భాగవతకథామృతము యెక్కడ? వీటి మధ్యన పొంతన ఏమిటి?* అని తలపోసిన శుకమహర్షి దేవతలను పరిహసించెను. ఆ దేవతలు కథాశ్రవణమునకు అధికారులు కాని భక్తిశూన్యులు అని గ్రహించి,వారికి (దేవతలకు) శ్రీమద్భాగవత కథామృతమును ఆయన అనుగ్రహించలేదు. కావున శ్రీమద్భాగవత కథామృతము దేవతలకు దుర్లభమాయెను. పూర్వకాలమునందు శ్రీమద్భాగవతము సప్తాహ ప్రవచన రూపములో శ్రీశుకుని ముఖమనుండి వినుటచే పరీక్షిన్మహారాజునకు ముక్తి లభించినది. ఒక్క మాటలో చెప్పవలెనన్న శ్రీమద్భాగవత సప్తాహమనెడి పుణ్యకర్మ నాటినుండియే ప్రారంభమైనది. ఈ విషయము తెలిసిన బ్రహ్మదేవునకు కూడ ఆశ్చర్యము కలిగినది. ఆయన తన సత్యలోకమునందు ఒక ధర్మ కాటాను (త్రాసు) తెప్పించి దానియందు ఒక వైపు సమస్త సాధనములను మరియొక వైపు శ్రీమద్భాగవతమును ఉంచి పరిశీలించగా సమస్త సాధనములు ప్రక్క తేలికయై పైకిలేచెను. శ్రీమద్భాగవతకథామృతము ఉన్న దిశలో అత్యంత భారము కన్పట్టెను. అది గాంచిన ఋషులందరికిని మిక్కిలి అబ్బుర మాయెను. ఆ విధముగా కలియుగమునందు శ్రీమద్భాగవతము ఒక మోక్షశాస్త్రముగా, భక్తిశాస్త్రముగా, తత్త్వశాస్త్రముగా, ధర్మశాస్త్రముగా సాక్షాత్తు గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుని స్వరూపముగా అవగతమయ్యెను. ఇట్టి శాస్త్రమును చదువుట వలన అప్పటికప్పుడే మోక్షార్హత, పుణ్యలోక  ప్రాప్త్యర్హత లభించగలదని విశ్వసించిరి. సప్తాహ విధానముగా ఏడురోజులు వినుట వలన పుత్రసంతానము లేనివారు, ఉండికూడ సత్కర్మలాచరించని  పుత్రులగుటచేతను, పుత్రులుండి కూడ అనాథలుగా  జీవనము సాగించువారికి బ్రతికినంత కాలము పవిత్రులుగాను, అంత్యకాలమందు భగవత్సానిధ్యము లభింపగలదనుట నిజమనియు పలికిరి. పూర్వము సనకాది ఋషులు దేవర్షియగు నారదునికి ఈ భాగవత శాస్త్ర ప్రవచనమను వినిపించిరి. అంతకు పూర్వమే నారదుడు బ్రహ్మముఖమునుండి కూడ వినియుండెను.  ఐనను దీనికి సప్తాహ శ్రవణ విధానమున్నదని దానిని గూర్చి సనకాది మహామునులు నారదునకు వివరించి చెప్పిరి.


శౌనక మహర్షి ఇలా అడిగెను: *ప్రాపంచిక వ్యవహారములనుండి విమక్తుడైన నారదమహర్షికి సనకాది మునీంద్రులు ఎచట కలిసిరి? భాగవత కథాశ్రవణమును గురించిన విధివిధానమును వినవలెననెడి శ్రద్ధ అతనికి ఎట్లు కలిగెను?*


అంత సూతముని ఇట్లు చెప్పెను: *ఇప్పుడు నేను మీకు భక్తితో నిండిన ఆ కథను వినిపించెదను. శ్రీశుక దేవులు నన్ను తన ప్రధాన శిష్యునిగా చేసికొని, శ్రీమద్భాగవత కథను నాకు ఏకాంతమునందు వినిపించెను*


*శ్రీమద్భాగవత మహాత్మ్యము* తరువాయి భాగము రేపు మధ్యాహ్మము....


*🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏*


*వీలయినంత మందికి పంపండి*


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కాషాయం


 

నరాల బలహీనతకు

 "నరాల బలహీనతకు". సీడ్ లెస్ కిస్మిస్ ను 30 గ్రాములు, ఒక కప్పులో వేసి, మునిగే వరకు నీళ్ళు పోయండి. ఒక నిమ్మకాయ చెక్క ను దానిలో పిండండి. 15 గంటల సమయం నాన పెట్టి మరుసటి దినము ముఖము కడుక్కొని తర్వాత , నీళ్లు వంపి సదర్ కిస్మిస్ ద్రాక్ష పండ్లను ఆస్వాదిస్తూ నములుతూ తినండి. గ్యాస్ ట్రబుల్ లేనివారు, మీరు కూడా త్రాగవచ్చు. మరియు ఉదయము, సూర్యోదయము లో సాయంత్రపు, సూర్యుడు అస్తమించు సమయం లో 1/2 గంట సమయము వాక్ చేయండి, సూర్యకిరణాలు పడుతూ ఉండగా "డి" విటమిను సహజ సిద్ధముగా లభించును.

ప్రయత్నం

 ప్రయత్నం 


ఒకరోజు ఒక ఆటో ప్రమాదవ శాత్తూ రోడ్డు

ప్రక్కన ఉన్న ఒక దిగుడు బావిలోకి

పడిపోయింది... ఆటోలో ఉన్న ముగ్గురు బావిలో పడిపోయారు...

ఈ ప్రమాదాన్ని గమనించిన జనం బావి చుట్టూ మూనిగి లోపల ఉన్న వ్యక్తుల పరిస్థితిని గమనించసాగారు.. ముగ్గురిలో ఒక వ్యక్తి ఈతరాక వెంటనే మునిగిపొయాడు..

మిగిలిన ఇద్దరు ఎక్కాలని చాలా ప్రయత్నం

చేయసాగారు... చుట్టూ ఉన్న గోడలన్నీ నున్నగా జారుడుగా ఉండడం వలన ఎంతకూ పైకి ఎక్కలేక పోతున్నారు...

వారి అవస్థను చూస్తున్న జనం నిస్పృహగా మీరు ఇంతే చని పోవడం ఖాయం అంటూ

అరవ సాగారు... ఈ మాటలు విన్న ఇద్దరిలో ఒక మనిషి నిరుత్సాహంలో మునిగిపొయి చని పోతాడు..

కానీ మూడవ వ్యక్తి మాత్రం వారు నిరుత్సాహ పరిచే కొద్దీ ఉత్సాహం తెచ్చుకుని ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేయసాగాడు.. చివరికి ఒక గంట తర్వాత ఫైరింజన్ సర్వీసు వారు వచ్చి బావిలోపలికి నిచ్చెన వేసి ఆ వ్యక్తిని పైకి లాగుతారు...

పైకి వచ్చిన ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అందరూ

అభినందిస్తూ... ఇంత మంది నిన్ను నిరుత్సాహ పరచినా ఎలా నిలవగలిగావు అని అడుగుతారు..

అందుకు ఆ వ్యక్తి... బాబూ నాకు బ్రహ్మ చెవుడు.. మీరు మాట్లాడేదేదీ నాకు వినపడదు.. కానీ మీరంతా నన్ను ఉత్సాహపరుస్తున్నారనే ఉద్దేశ్యం నాకు .అర్థమయింది.. అందుకే నిరుత్సాహపడే ప్రతిసారి మీ కేకలు నన్ను ఉత్సాహ పరచాయి.. మీకందరికీ

ధన్యవాదములు.. అని చుట్టూ ఉన్న వారికి

చేతులు జోడించి నమస్కరిస్తాడు...


మనం ఎన్ని కష్టాలలో ఉన్నా సరే...

చుట్టూ ఉన్న సంఘం వ్యతిరేకంగా ఉన్నా సరే.. మన ప్రయత్నం మనం చేస్తున్నపుడు.. ఎవరో ఒకరు మనను ఆదుకునే అవకాశం ఉంది.. చివరి వరకు నిరుత్సాహ పడక... ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి...

జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం

దొరకదన్నంత వరకు పోరాడు... లేకపోతే మళ్ళీ పోరాడే అవకాశం రాకపోవచ్చు.. ఆశను విడవకూడదు....

చివరిక్షణంలో ఏదైనా అద్భుతం జరగవచ్చు...

స్నేహం

 


🌳 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.  


🌴 ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. 


🏝 కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు


🌿 కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 


👦 బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 


🌳 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది. 


🍎 బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 


🌴 క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది 


🏕 "నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు. 


🌿 "నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 


🌴 అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది. 


🌴 బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు


🌴 నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 


🌴 అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 


🌴 చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. 

నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 

ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు.. 


🌴 చెట్ట: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 

ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు .. 


🌴 నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. 


🌴 నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు. 


🌴 వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు. 


🌴 ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 


🌴 కొంచెం పెద్దగయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. 


🌴 చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.


👥 మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది. 


💘 ఈ కథలోని నీతి.. 


💗 మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది. 


💖 మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. 

మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది

మానసిక ఒత్తిడి

 మానసిక ఒత్తిడి.

జీవితంలో మన సమస్యలనుపరిష్కరించుకోకపోతే,మనపై ఒత్తిడికలుగుతుంది.

జీవితంలో కష్టాలు,నష్టాలు వుంటాయి.సుఖాలు,సంతోషాలు వుంటాయి .దుఃఖాలు వుంటాయి.

జీవితంలో వీటినే లో ups and downs అంటారు.(ఆటూ,పోటూ) అంటారు. మనసు పై ఒత్తిడికలుగుతుంది. వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలితద్వారా మనసు పై ఒత్తిడికలుగుతుంది.

ఈ ఒత్తిడిని దూరంగా వుంచ వచ్చు.

1.కష్టాలనుండి బయట పడలేక,భయం,ఆందోళన ,ఒత్తిడికి గురై,ఆత్మహత్య చేసుకోవడం.హా!మనం సమాజంలో చూస్తున్నాం.చదువులో వెనుక పడుతుంటే,తండ్రి తిట్టాడని,ప్రేమించిన అమ్మాయి,తిరస్కరించిందని,మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్నారు.


2.జీవితంలో రాజీపడి,కష్టాలు,సమస్యలనే ఊబి నుండి బయట పడలేక,జీవచ్ఛవాలుగా బ్రతికేయడం.తద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు,అనవసరంగా పిల్లలను కొట్టడం,బంధువులు,స్నేహితులతో ఘర్షణలు పడటం,త్రాగుడు,జూదంకు బానిస అవడం చూస్తున్నాము.


3.కష్టాలను,సమస్యలను మనోధైర్యంతో ,ఎదుర్కొని,మరిన్ని మంచి పరిష్కార మార్గాలకోసం దీర్ఘంగా ఆలోచించడం,పరిస్థితులను బాగా అవగాహన చేసుకోవడం అవసరం.కృషి చేయడం.ఏకాగ్రతతో ,దుర్భర పరిస్థితులను అధిగమించడం.ప్రగతి శీలకమైన ఆలోచనా సరళితో ,సమయాన్ని సద్వినియోగం చేసుకుని,పోగొట్టుకున్న దాన్ని వెదకి స్వంతం చేసుకుని ,విజయం సాధించడం.మన్ననలను పొందడం ,తన ఔన్నత్యాన్ని సమాజం ముందువుంచి మెప్పుపొందడం.అవసరమైనంత రిస్క్,(సాహసం) చేసి కష్టాలనుండి బయటపడి తమ ఔన్నత్యాన్ని నిరూపించుకుని మెప్పుపొందడం.


అలాంటి ప్రముఖు వ్యక్తులలో అబ్దుల్ కలాం గారు ముఖ్యులు.వారు యువతకు ఆదర్శప్రాయులు.

కలాంగారికి మంచి ఆశయం(ambition) వుండేది.కనుక ఆయన విజ్ఞానం కోసం కృషి చేసి సఫలీకృతులయ్యారు.మిసైల్ మేన్ గా గుర్తింపు పొందారు.దేశ అంబుల పధిని బలపరిచి ,దేశభక్తిని చాటుకున్నారు.దేశ ప్రధమ పౌరునిగా ఎదిగారు.గౌరవించ బడ్డారు.దేశ విద్యార్ధులకు చాలా అంశాలపై  క్లారిటీ (స్పష్టత) నిచ్చారు.లక్ష్యాలను (targets) నిర్దేశించారు,లాజికల్ గా ఆలోచించడం నేర్పారు.దేశం మరువలేని సేవలు చేస్తూ ,విద్యార్ధుల మధ్యన ,వారికి స్పూర్తినిస్తూ స్వర్గస్థులైనారు.

ఆయనఆదర్శాలను స్పూర్తిగా ,యువత స్వీకరిస్తే ,విజయం సాధించడం జరుగుతుంది.యువతలో ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా వుంటూ,క్రమశిక్షణతో విజయపథం లో ముందుకు సాగుతారు.

హిందూ ధర్మం - 38**

 **దశిక రాము**


**హిందూ ధర్మం - 38**


వేదం చెప్పినదానికి విరుద్ధంగా చెప్పడం, జనాన్ని తప్పు త్రోవ పట్టించడం, నమ్మించి మోసగించడం, వెన్నుపోటు పొడవడం వంటివి స్తేయం క్రిందికి వస్తాయి. వీటికి దూరంగా బ్రతకడం అస్తేయం.


ఇక అస్తేయం అన్నది కూడా త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అంటే మనసులో కూడా మనది కానీ వస్తువులను దక్కించుకోవాలని కానీ, పొందాలనీ కానీ, అనుభవించాలని కానీ అనుకోకూడదు. అట్లాగే మాటల్లో కూడా. నాకు అది వచ్చి ఉంటే బాగుండేదండీ, వాడికి అంత ఆస్తి ఎందుకు, నాకు అందులో కాస్త ఇవచ్చు కదా, ఇలా మనం మనవి కాని వాటి గురించి బోలెడు మాటలు మాట్లాడుతాం. అవన్నీ మాట్లాడకపోవడం అస్తేయం. ఇక చేతల్లో. మనం దాని గురించి ముందే చెప్పుకున్నాం. ఒకరిని మోసగించాలనుకోవడం, ఒక వస్తువును దొంగిలించాలన్న ఆలోచన మనసులో చేసినా, అది దొంగతనం క్రిందకే వస్తుంది. కేవలము బాహ్యప్రవర్తనే కాదు, ఆలోచనలు కూడా అదుపులు చేసుకోవాలని ధర్మం చెప్తుంది.


ఒకరికి సంబంధిచిన వస్తువు మీకు కావాలనీ మీ మనసు కోరగానే దాన్ని నిలువరించండి. నువ్వు చేస్తున్నది తప్పు. ఇతరుల వస్తువులను ఆశించకూడదు, అది పాపం, అవసరమైతే మనం సంపాదించుకోవాలి అని చెప్పండి. ఈ అస్తేయం అన్న గుణం హిందువులకు ఉన్నది కనుక చరిత్రలో హిందూదేశం ఏనాడూ ఇతర దేశాలపై దండయాత్ర చేయలేదు, ఒకరి సంపదను కొల్లగొట్టలేదు.


తదుపరి లక్షణం శౌచం.


తరువాయి భాగం రేపు.......

🙏🙏🙏

సేకరణ



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://chat.whatsapp.com/Hdv5PrMFoxX3I2TsoVErae


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://chat.whatsapp.com/BX9q7cjvzxzLGb99dapVRi

హిందూ ధర్మం - 78**

 **దశిక రాము**


**హిందూ ధర్మం - 78**


(మేనక ఆగమనం )


విశ్వామిత్రుడి కన్నులు కోపంతో ఎరుపెక్కి శపించడం మొదలుపెట్టాడు. మీరు నా మాటను అతిక్రమించడమే కాకుండా, నాకు పరుషంగా సమాధానమిచ్చారు. మీరు కూడా వశిష్టపుత్రులు పుట్టిన జాతిలోనే జన్మించి వేయి సంవత్సరాల పాటు భూమి అంతటా తిరుగుతూ కుక్కమాంసం తిని జీవిస్తారు అన్నాడు. అటు తర్వాత దయతో శునఃశ్శేపుడి వైపు తిరిగి రక్షణ కొరకు వేదమంత్రాలు చదివి ఆశీర్వదించాడు. 'నిన్ను పాశాలతో బంధించి, నీకు ఎర్రటి రంగును పూసి, మెడలో ఎరపు రంగు పూలహారం వేసి, విష్ణు సమానుడైన అగ్నిహోత్రునకు అర్పించే ముందు, నేను ఇప్పుడు నీకు చెప్పబోయే వేదంలోని సూక్తాలు చదువు. నేను చెప్పిన రెండు సూక్తాలు చదువగానే నీ కోరిక నెరవేరుతుంది' అని చెప్పి, ఆ పిల్లవానికి విశ్వామిత్రుడు వాటిని ఉపదేశించాడు. వాటిని జాగ్రత్తగా గ్రహించిన శునఃశ్శేపుడు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళి రాజా! త్వరగా యాగశాలకు వెళదాం రండి అన్నాడు. నన్ను యజ్ఞపశువుగా అర్పించి, మీరు మీ ప్రతిజ్ఞను, యాగాన్ని పూర్తి చేయండి అన్నాడు. ఇది విన్న అంబరీషుడు త్వరగా యాగశాలకు చేరుకున్నాడు.


రాజు పురోహితుల అనుమతి తీసుకుని పిల్లవానికి పవిత్రమైన ఎరుపు రంగు బట్టలు కట్టి, యాగపశువుగా తయారు చేసి, అక్కడున్న స్థంభానికి బందించాడు. వెంటనే శునఃశ్శేపుడు ఇంద్రుడిని, ఉపేంద్రుడిని విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన రహస్య సూక్తాల ద్వారా ప్రార్ధించాడు. అతని ప్రార్ధనకు మెచ్చి, సహస్రాక్షుడైన (వేయి కన్నులు కలవడు) ఇంద్రుడు ధీర్ఘాయువును ప్రసాదించాడు. అంబరీషునిపై కూడా తన అనుగ్రహాన్ని వర్షించాడు. అందువల్ల అంబరీషుడు చేసిన యాగానికి అనేక రెట్ల ఫలం కలిగింది.


తన పుత్రలను శపించడం వలన విశ్వామిత్రునకు తపోశక్తి వృధా అయ్యింది. అందువల్ల విశ్వామిత్రుడు ఆ పవిత్ర సరోవరం వద్దనే కూర్చుని ఇంకో వెయ్యేళ్ళు తపస్సు చేశాడు. వేయి సంవత్సరాలు పూరతైన తర్వాత విశ్వామిత్రుడు వ్రతస్నానం చేశాడు. అది ముగియగానే విశ్వామిత్రుని ముందు దేవతలందరూ అతని తపోఫలాన్ని ప్రసాదించడానికి ప్రత్యక్షమయ్యారు. ఇప్పటి వరకు నీవు చేసిన తపస్సు కారణంగా రాజర్షివి అయినావు. నీకు శుభం కలుగుగాకా అని బ్రహ్మదేవుడు పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు (రాజైన నీవు ఇప్పటి వరకు చేసిన తపస్సు కారణంగా రాజర్షి మాత్రమే కాగలిగావు కానీ బ్రహ్మర్షి కాలేకపోయావు. బ్రహ్మర్షి స్థానం చాలా గొప్పది. బ్రహ్మర్షి అవ్వాలంటే కోపం, కుళ్ళు, పగ, కొరిక మొదలైన దుర్గుణాలన్నీ విడిచిపెట్టాలి). విశ్వామిత్రుడు తిరిగి తపస్సు మొదలుపెట్టాడు.


చాలా కాలం గడిచాకా, ఒకానొక కాలంలో దేవలోకపు అప్సరస అయిన మేనక ఆ సరోవరంలో స్నానం చేసి, జలకాలాడుతోంది. మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు సరోవరంలో ఈసుతున్న మేనకను చూశాడు. మేనక అందం సాటిలేనిది. దట్టంగా కమ్మిన మబ్బుల మధ్య కనిపించే మెరుపులా ఉంది మేనక.


తరువాయి భాగం రేపు...


🙏🙏🙏

సేకరణ

బ్రాహ్మణ వివాహ వేదిక*

 *06/12/2020 న దక్షిణ భారత దేశంలో అతి పెద్ద బ్రాహ్మణ వివాహ వేదిక*

*గత 4 నెలల కాలం లో సుమారుగా 500 పైగా వివాహాలు కుదిర్చిన ఏకైక సంస్థ*


*బ్రాహ్మణ సేవా లో బాగంగా వచ్చే నెల అనగా 06/12/2020 ఆదివారం నాడు morning 9.00 Am నుంచి సాయంత్రం 4 pm వరకు  ద్వారా online వివాహ వేదిక నిర్వహించును ప్రతి ఒక్కరు దీనిని ఉపయోగించ ప్రార్థన* 


*WWW.BSMATRIMONY.COM software లో profile update చేసుకోన గలరు, ఆ రోజు వరకు రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరకి PDF File పంపబడును*


*ప్రతి శనివారం & ఆదివారం మేము ఉచితంగా నిర్వహించు online వివాహ వేదికలో పాల్గొన గలరు* 


*NRI & Dr కోసం మరియు late marriage వారి కోసం ప్రత్యేక సంచిక*


*మాటలో కాదు చేతలో చూపిస్తాము*

*-ఇట్లు - ఉన్నవ శ్రీధర్ బాబు - 9000966999 /9000800233*


*Note: ఈ యొక్క మెసేజ్ ని మరొక్క ఇద్దరికి పంపి ఒక వివాహ బంధముకు కారకులుకాగలరు*

*జ్ఞాన వార్ధక్యం

 *జ్ఞాన వార్ధక్యం*

https://t.me/Teluguvelugu2/35

వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు. సాధారణంగా జీవితమంతా ఆర్జించిన అనుభవాలు వార్ధక్యజ్ఞానంగా పరిణతి చెందుతాయి.


అనుభవజ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. అష్టావక్రుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడే, తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తిచూపి శాపగ్రస్తుడయ్యాడని కథ.


జ్ఞానం దైవప్రసాదం. వేదవ్యాసుడు సద్యోగర్భజనితుడు (ఆ క్షణంలోనే జన్మించినవాడు). ఆయనకు కృష్ణద్వైపాయనుడనే పేరు కూడా ఉంది. పద్దెనిమిది పురాణాలు, మహాభారతం, భాగవతం వంటి దివ్యరచనలు చేసిన వ్యాసుడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన విష్ణురూపుడు. మరణం లేని కాలాతీతుడు. త్రికాలవేది. జగద్గురువుల్లో ప్రసిద్ధుడు. ఆయన ఎవరి దగ్గరా శిష్యరికం చెయ్యని జన్మజ్ఞాని. దత్తాత్రేయ అవతారాలన్నీ ఇలాంటివే.


కొందరు ఏకసంథాగ్రాహులుగా ఉంటారు. వారు అల్పకాలంలోనే అనల్పజ్ఞానం ఆర్జిస్తారు. గురువులను మించిపోతారు. గురు నానక్‌ దేవ్‌ అలాంటి అసమాన జ్ఞాని. సిక్కులు ఆయనను గురుపరమాత్మగా ఆరాధిస్తారు.


మనలో కొందరు బాలమేధావు లుంటారు. సంగీతం, నృత్యం వంటి కళారంగాల్లో వారు ప్రసిద్ధులు.కానీ, వారి ప్రావీణ్యం ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం వృద్ధుల చేత గుర్తింపు పొంది, గౌరవానికి నోచుకుంటుందో, వారు వయసులో చిన్నవారైనా జ్ఞాన వృద్ధులుగా పేరొందుతారు.


ప్రపంచ సంపదలకు హెచ్చుతగ్గు లుంటాయి. జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది. విదురుడు కారణజన్ముడు. జ్ఞాన వృద్ధుడిగా చెప్పదగిన వాడు. ధృతరాష్ట్రుడు వంటివారికి నీతి బోధ చేసినవాడు. ‘మహాత్మా’ అనిపించుకున్న యోగ్యుడు. అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు. ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం.


జ్ఞానం ఆనందకారకం. హయగ్రీవస్వామిని, దక్షిణామూర్తిని జ్ఞానానంద స్వరూపులుగా చెబుతారు. దక్షిణామూర్తిని దీక్షగా చూస్తే చాలు... జ్ఞానప్రసారం జరుగుతుందన్న కథ ఉంది.


ఏది అజ్ఞానమో తెలిపేది జ్ఞానం. అలౌకికమైన జ్ఞానమే ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనం. వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే వివేకం. క్షణభంగురమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమించక, సద్వినియోగం చేసుకోవడమే మనిషి కర్తవ్యం.


ఆదిశంకరులు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నప్పుడు ఒక చోట వృద్ధుడు వ్యాకరణం వల్లె వేస్తుంటాడు. ఆ క్షణంలోనే ఆయన భజగోవింద శ్లోకాలు ఆశువుగా చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. ఆ వృద్ధవిద్యార్థితో ఆదిశంకరులు- ‘ఓ మూఢుడా! మృత్యుముఖంలో ఉన్నప్పుడు ఈ వ్యాకరణసూత్రాలు నీకు అక్కరకు రావు. గోవిందుణ్ని భజించు. నీకు మోక్షం లభిస్తుంది’ అంటారు


భగవంతుడి సన్నిధికి చేర్చేది భక్తి మార్గమే... శాస్త్ర జ్ఞానం కాదు. జ్ఞాన వృద్ధులు బాల్యం నుంచే భక్తిమార్గంలో స్థిరచిత్తులైై ఉంటారు.


భగవంతుడి గురించి సుబోధకం చేసేదే జ్ఞానం. అలాంటి జ్ఞాని ప్రపంచ మాయలో చిక్కుకోడు!

(ఈనాడు అంతర్యామి)

✍🏻కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

భాగవతము

 ⇠🙏🌺 భాగవతము    ఏకవింశత్యవతారములు⇢🌺🌺

1-69-మ.మత్తేభ విక్రీడితము🌺🙏


భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం

తవిధింజేయు మునుంగఁడందు; బహుభూతవ్రాతమం దాత్మతం

త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్

దివిభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్.


🙏భావం🙏

ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.

teaching of India.

 Trump or Biden, both are Americans and their National Interest are of utmost priority than any religion. Promoting Christianity is an hidden agenda. This is evident from foreign funds pumped through several NGOs in India for conversion and Hillary Clinton tried to project Hinduism in poor light. At the same time they never helped islamists. Presently Americans are turning towards ancient Indian texts which are written several thousands of years. This is also because NASA is concurring with the findings of the Ancient Vedas and Rishi's of India. Indians in general and Hindus and Sikhs in particular are known for dedication and hard work and are considered more trustworthy, as they never posed any danger to the nation they are in and contribute to Nation building not by pushing religion but by excelling in the field they are employed for, unlike Muslims from places other than India, who are not welcome for they expect importance based only on their religion and demand special status and have thirst to dominate and make the entire world Islamic and openly show disregard / hate towards other religions. Either it be Trump or Biden , BJP or Non BJP, war will be pushed in this world in few months, and every nation will be forced to take some side or other. For example if jihadis by their actions disturb other nations, all affected nations will come to one side, and Americans will be forced to take stand against Jihadi culture. Unfortunately, foolish actions of ceratain group of Jihadi elements, instead of bringing better status to Muslims are indirectly making their lives miserable, especially if they are staying in non Islamic nation. Citizens of non Islamic nation take out their frustration on all those sporting beards, thinking they are all jihadis. This is evident from the attack on Sikhs in other nations thinking them to be jihadis. In future after war, all nations after losing heavily will realise the futility of religious war And there will emerge a new Religion of Humanity with love for each other, which again was the ancient teaching of India.

జ్ఞాపక శక్తిని ప్రసాదించు శ్రీ శారదా స్తోత్రం.👍💐

 జ్ఞాపక శక్తిని ప్రసాదించు శ్రీ శారదా స్తోత్రం.👍💐


చదువులో పిల్లలకు జ్ఞాపక శక్తి ని పెంచాలి అంటే శ్రీ శారదా స్తోత్రం తెల్లవారు జామున 5 గంటల సమయంలో శుచిగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో జపించవలెను. శారదా స్తోత్ర మంత్ర పఠన మీలో శక్తిని, బలాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది.


 శారదా స్తోత్ర మంత్రాలలో ఉండే అక్షరాలు కలిగించే ప్రతి ధ్వని మానవుల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి.మంత్రోచ్ఛారణ ద్వారా వచ్చే ధ్వని మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.


శారదా స్తోత్ర మంత్రాలను చదవడం వల్ల మనలోనున్న చైతన్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి.


నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని | 

త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే 


యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా | 

భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ || 


నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్ | 

భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ || 


భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః | 

వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ || 


బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ | 

సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః || 


యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్ | 

జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః || 


యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా 

యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః ||

నువ్వు అచరించే ధర్మం*

🍂🍃🍂🍃🍂🍃🍂


*నువ్వు అచరించే ధర్మం* 


*నువ్వు కట్టుకున్న వస్త్రాం , నువ్వు తిరిగే వాహనం, నువ్వు అనుకున్నే  నీ శరీర అందం,* 


 *ఇవి అన్నీ ఏదోఒక రోజు ఉండకపోవచ్చు కానీ, నువ్వు ఆచరించే ధర్మం , భగవంతుడి పట్ల* 

 *ఎల్లపుడూ నీకు ఉన్న భక్తి , నీ సత్బుద్ధి ,* 


 *నీ సత్ప్రవర్తన , నీ నిజాయితీ ,ప్రతీ ప్రాణిలో భగవంతుని చూసే నీ గుణం, ప్రతీ స్త్రీ లోని* 


 *అమ్మవారి చూడగలగడం. ఈ గుణాలు అన్నీ* 

 *కలగడం నిజంగా మహా మనిషిని చేస్తాయి,అది అసలైన మనిషికి అందం , అభరణం. అంతేకానీ నువ్వు కంటితో చూసేది కాదు అందం,హోదా, అంటే ... ఇంకా ఎన్ని రోజులు లౌకికవాటి పట్ల ఆకర్షణతో, మోహాలతో, వెంపర్లలాడుతూ      తిరిగుతావు............* 

      

*దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.            శరీరపటుత్వం, ఆరోగ్యం, ఓపిక , బలం , ఉండగానే, ఈ మానవజన్మ , ఈ చక్కటి శరీరం నీకు ప్రాసాదించినందుకు భగవంతుడి పట్ల కృతఙ్ఙతతో , భక్తిశ్రద్ధలతో ,ఇష్టాతో ఎంతో, విధేయుడై ఉండి జీవితాని *సార్ధక్యం చేసూకో................* 


🍂🍃🍂🍃🍂🍃🍂

VivekaVani

 *VivekaVani - Voice of Vivekananda*


🌅 *1000 Best Images of Swami Vivekananda :*

https://photos.app.goo.gl/1sXNuPb8tnAcBN257


📚 *eBooks Free Download:*

https://drive.google.com/drive/folders/1mY9ud81Nw03B9WE2G_7qFCzCIjVd2cKa?usp=sharing


🔻*YouTube*

https://www.youtube.com/c/VivekaVani


🔻*Instagram*

https://www.instagram.com/vivekavani/


🔻*WhatsApp*

 To Subscribe Send ‘Yes’ on WhatsApp: 9640003646


🔻*Facebook*

   https://www.facebook.com/VivekaVani/


🔻*Telegram*

   https://t.me/vivekavani   ( If the link doesn’t work, please  search ’@vivekavani‘ on Telegram )


🔻*Google Podcasts*

   bit.ly/VivekaVani


*Please share this with your friends !*

విజ్ఞానము సంబంధ 58 పుస్తకాలు

 *విజ్ఞానము సంబంధ 58 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


58 పుస్తకాలు ఒకేచోట! https://www.freegurukul.org/blog/vignanam-pdf/


               (OR)


నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం www.freegurukul.org/g/Vignanam-1


మీకు తెలుసా? www.freegurukul.org/g/Vignanam-2


నిత్య జీవితంలో సైన్స్ www.freegurukul.org/g/Vignanam-3


అతీత శక్తులు-అద్బుత వాస్తవాలు www.freegurukul.org/g/Vignanam-4


సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము www.freegurukul.org/g/Vignanam-5


స్కూల్ విద్యార్ధులకు కంప్యూటర్ www.freegurukul.org/g/Vignanam-6


సర్వే గణిత చంద్రిక www.freegurukul.org/g/Vignanam-7


గృహ విజ్ఞాన శాస్త్రం-ఆహార పదార్ధాలు పోషణ www.freegurukul.org/g/Vignanam-8


ఓషధి శాస్త్రము www.freegurukul.org/g/Vignanam-9


కోళ్ళ పెంపకం www.freegurukul.org/g/Vignanam-10


శాస్త్రజ్ఞుడివి అవుతావా ? www.freegurukul.org/g/Vignanam-11


శాస్త్ర పరిశోదనలు www.freegurukul.org/g/Vignanam-12


ఓషధీ భూజములు www.freegurukul.org/g/Vignanam-13


వ్యవసాయ శాస్త్రము www.freegurukul.org/g/Vignanam-14


వింత ప్రపంచం www.freegurukul.org/g/Vignanam-15


భవన నిర్మాణ కోర్స్ www.freegurukul.org/g/Vignanam-16


రహస్య దర్పణము www.freegurukul.org/g/Vignanam-17


వృక్ష శాస్త్రము www.freegurukul.org/g/Vignanam-18


బాలల విజ్ఞాన సర్వస్వము www.freegurukul.org/g/Vignanam-19


విజ్ఞాన దీపిక-1,2 www.freegurukul.org/g/Vignanam-20


వ్యాస వాణి www.freegurukul.org/g/Vignanam-21


విద్యా సూత్రములు www.freegurukul.org/g/Vignanam-22


వ్యాపారము-సామాజిక బాధ్యతలు www.freegurukul.org/g/Vignanam-23


వేతనముల చెల్లింపు చట్టము www.freegurukul.org/g/Vignanam-24


సామాన్య విజ్ఞానం www.freegurukul.org/g/Vignanam-25


వ్యాసావళి www.freegurukul.org/g/Vignanam-26


బాధ్యులు ఎవరు www.freegurukul.org/g/Vignanam-27


వామన వృక్షాలు www.freegurukul.org/g/Vignanam-28


రోబోట్స్, రోబోటిక్స్ www.freegurukul.org/g/Vignanam-29


సహదేవ పశువైధ్యము www.freegurukul.org/g/Vignanam-30


శాస్త్రీయ పద్ధతి అంటే ? www.freegurukul.org/g/Vignanam-31


వృక్షోత్పత్తులు www.freegurukul.org/g/Vignanam-32


పరమాణువు దాని కథ www.freegurukul.org/g/Vignanam-33


వ్యావసాయిక ఆర్దికములు www.freegurukul.org/g/Vignanam-34


బాల విజ్ఞాన సర్వస్వము www.freegurukul.org/g/Vignanam-35


విజ్ఞాన తరంగాలు - ఎందుకు? www.freegurukul.org/g/Vignanam-36


విజ్ఞాన సర్వస్వం-4 www.freegurukul.org/g/Vignanam-37


ప్రపంచరాజ్య సర్వస్వము www.freegurukul.org/g/Vignanam-38


శంకరీయం-ఆటలు www.freegurukul.org/g/Vignanam-39


సృష్టి కథ www.freegurukul.org/g/Vignanam-40


విద్యార్దులారా www.freegurukul.org/g/Vignanam-41


పిల్లల చేతుల్లో పెన్నిధి ప్రపంచ వారసత్వం www.freegurukul.org/g/Vignanam-42


స్పటిక శాస్త్రము www.freegurukul.org/g/Vignanam-43


విచిత్ర ప్రకృతి www.freegurukul.org/g/Vignanam-44


జీవ శాస్త్ర సంగ్రహము www.freegurukul.org/g/Vignanam-45


విజ్ఞాన ప్రశ్నావళి www.freegurukul.org/g/Vignanam-46


విజ్ఞాన తరంగాలు - ఏమిటి ? www.freegurukul.org/g/Vignanam-47


కాలుష్యం www.freegurukul.org/g/Vignanam-48


భారతదేశపు బౌతిక భూగోళం www.freegurukul.org/g/Vignanam-49


వెలుగు www.freegurukul.org/g/Vignanam-50


శాస్త్రము - యుద్ధము www.freegurukul.org/g/Vignanam-51


సస్య రక్షణ www.freegurukul.org/g/Vignanam-52


అణుశక్తి www.freegurukul.org/g/Vignanam-53


వినువీధి www.freegurukul.org/g/Vignanam-54


సామాన్య వృక్షాలు www.freegurukul.org/g/Vignanam-55


మీ రేడియో www.freegurukul.org/g/Vignanam-56


దస్తావేజుల మతలబు www.freegurukul.org/g/Vignanam-57


మన రాజ్యాంగం www.freegurukul.org/g/Vignanam-58


విజ్ఞానము పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link www.freegurukul.org/join

సాధన