14, డిసెంబర్ 2024, శనివారం

దాసుని తప్పునకు దండాలు

 శు భో ద యం🙏


దాసుని తప్పునకు దండాలు తప్పవేమో?


శా: ఆమందాకిని మౌళిఁ బూని నను నర్ధాంగీకృతం జేసి 'తౌ

నౌ మేల్మే' లని యార్య యల్గఁ ,బ్రణతుండై ,తత్పదాంభోజ యో

గా మర్షంబున గంగయు న్మొరయఁ జూడాభోగ సమ్యక్క్రియా

సామర్ధ్యంబున వేఁడు శంభుఁడు కృతిస్వామిం గృపన్ బ్రోవుతన్.


వసుచరిత్రము- అవతారిక- రామరాజ భూషణకవి !


ఇది రామరాజ భూషణ కవి రచించిన వసుచరిత్రలోని పద్యం. కృతిపతికి పరమశివుని ఆశీర్వాద మందజేసేపద్యం.

బలే చమత్కారాన్ని రంగరించాడుకవి. ఇద్దరు పెళ్ళాలమొగుఁడు యిరుకున బడక తప్పదేమో? వెనక పారిజాతాపహరణంలో ఆదెబ్బ యెలా ఉంటుందో ముక్కుతిమ్మన గారు మనకు రుచి చూపించారు. సత్య కాలితాపుకి కృష్ణుని తలబొప్పి గట్టింది. దాసుని తప్పు దండంతోసరియని యామె కాళ్ళకు మొక్కి యెలాగో బయట పడ్డాడు.


ఇపుడా సౌభాగ్యం శాంపిల్గా శంకరునకు చవిచూపుతున్నారు మనకవిగారు యీపద్యంలో. వినండి!


" పార్వతి పరమేశ్వరునిపై కోపించిందట. అవును కోపంరాదామరి. తానుండగానే గంగమ్మను తెచ్చి నెత్తిన బెట్టుకుని

ఊరేగుతున్నాడాయె! అందుకే పరమేశ్వరుణ్ణి నిలదీసి గట్టిగా అడిగేసింది. కాదుకాదు మాటలతో కడిగేసింది ' ఆగంగను నెత్తిని బెట్టుకొని ఊరేగుతూ దానిని కప్పిబుచ్చుట కోసమేగదా నన్ను అర్ధనారిగా (సగము ఆడది ) జేసినావు. ఆహా !నీయుక్తి తెలిసినదిలే!

ఎంత మోసకారివి. నిన్ను నమ్మి మోసపోతినిగదా " యని తన యాగ్రహమును ప్రకటింప, వేరుదారిలేక శంకరుడు క్రిందకు తలవంచి యామె పాదములను తాకినాడట! శ్రీకృష్ణుని వలెనే దాసునితప్పు దండముతో సరిపెట్టజూచెనన్నమాట. ఏమైన నేమి శంకరుడు తలవంచ శిరసున నున్న గంగా జలములు ఆమెపాదములను ప్రక్షాళణమొనరించినవి. అనగా గంగకూడ సవతిని పూజించినట్లయినది.మెడలోనున్నపాములుబుసబుసలతోక్షమింపబ్రతిమాలినవి.యిలాచాలాతెలివిగా, శంకరుడు పాదాభివందనము చేయుటతో,ఇటు సవతి పరిచర్యల నొనరించుటతో నామెకోపము పటాపంచెలయినదట. శంకరుడు సవతికయ్యపు గండమునుండి క్షేమముగా బయటపడినాడట. అట్టి శంకరుడు కృతిభర్తను బ్రోచుగాత! యని యాశీస్సు.


కవి పార్వతిని అర్ధనారీశ్వరిగా నొనర్చుటకు ఒక కారణమును జెప్పినాడు. అట్లు చేయుట వలన నామె సగము

ఆడదియై సంతానమును పొందుటకు అనర్హ యైనదట! సంతానమే స్త్రీజన్మకు సాఫల్యము.గదా! గొడ్రాలును ఉపేక్షించి సంతానము కొరకై మగవాడు మరల పెండ్లియాడుట లోకరీతి. భార్య యుండగా పునర్వివాహ మేల ?యని యడుగు వారికి సమాధానము చెప్పుట సులభమగునుగదా, అదిగో ఆలోకరీతిని అడ్డు జేసికొనుటకై నన్ను అర్ధనారిని జేసి దీనిని నెత్తి కెక్కించు కొన్నావని పార్వతి వాదన! ఆహా! కవికెంత గొప్పయూహ!


అందుకే కిమ్మనకుండా శంకరుడు పార్వతికి మొక్కినాడు.గంగమ్మచేత కాళ్ళుకడిగించినాడు. ఇది చాలా తెలివైన పనిగదా , సరి . ఆమె కోపము పోయినది . శంకరుడు ప్రసన్నత నొందినాడు.


ప్రబంధకవులలో సవతి కయ్యములను ప్రస్తావించిన కవులిద్దరు.తిమ్మన సుదీర్ఘముగా వర్ణించి దానికొరకొక కావ్యమునే(పారిజాతాపహరణము)

వ్రాయగా, రామరాజ భూషణుడు ఒకే ఒక పద్యంతో సరిపెట్టినాడు మిక్కిలి చమత్కారంగా!


                స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌷🕉️🌷🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

దత్త క్షేత్రములు

 🙏🪷🙏🪷🙏

మన భారత దేశంలో 

దత్త క్షేత్రములు.


దత్తావతారం.

1.పిఠాపురం.

దత్తుని ప్రదమ దత్తావతారం  శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది.


2.కురువపురం.

ప్రదమ దత్తావతారులైన శ్రీపాదవల్లబులు తపసు చేసిన స్థలం.

ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.


3.గోకర్ణము.

ప్రదమ దత్తావతారు లైన శ్రీపాద వల్లబులు తపసు చేసిన స్థలం. ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.

                         

4.కరంజా

రెండవ దత్త అవతారం,

 నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం ఇది.. మహరాష్ట్రఅమరావతి జిల్లాలో ఉన్నది.


5.నర్సో బావాడి

శ్రీ గురుడు 12 సం||తపసుచేసిన స్థలం,... 

ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది.


6.గాణగా పూర్.

 శ్రీ గురుడు 23 సం. నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీ గురుని నిజపాదుకలు కలవు, చూడవలసి స్థలం, బీమా అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.


7.ఔదుంబర్.

శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడా మహరాష్ట్రులో ఉన్నది.

"చూడవలస స్థలం," బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.


8. మీరజ్.

ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం కొల్హపూరు రూటులో  జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు. 

      

9.శ్రీశైలం

శ్రీ గురుడు అంతర్ధానమైన ప్రదేశం.

ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంట..  దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు.

ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.


10.మూడవ దత్తావతారం.

మాణిక్య ప్రభువులు.


మాణిక్య నగర్ .. మూడవ దత్తావతారం, శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాది, ప్రభువుల వారి సంస్థానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.

తప్పక చూడవలసిన క్షేత్రము.


 11.అక్కల్ కోట.

నాలుగవ దత్తావతారం,


 స్వామిసమర్ద (అక్కల్ కోటస్వామి ) సమాది మందిరం ఇది చెన్నయి - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు.

తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.


12 ఏక ముఖ దత్తుని ఆలయం


ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు.


13. నాసిక్

ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది.


🌷ప్రముఖ దత్త క్షేత్రములు.🌷


14. గిరినార్

ఇచ్చట దత్తపాదుకలు కలవు

ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.

ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది, ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లబిస్తుందని భక్తుల నమ్మకం.


15. షేగాం

ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాది మందిరం ఇది నాగపూర్ పట్టణం నకు దగ్గరలో కలదు ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.


16.  ఖేడ్గవ్

సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు. ఇది పూనా వద్ద కలదు.


17ఖాండ్వా

శ్రీ దున వాలా దాదా వారి సమాదిమందిరం ఉంది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.


18 మాన్ గవ్

శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలోఉంది

ఇది చూడదగ్గ క్షేత్రం.


19. గరుడేశ్వర్

శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాది మందిరం కలదు గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది ఇది తప్పక చూడవలసిన క్షేత్రం


20. మౌంటు అబూ.

ఇచట దత్త శిఖరము కలదు. రాజస్తాన్ రాష్ట్రములో కలదు..


 పైన తెలుపబడిన దత్త అవతారముల అయిదు క్షేత్రములు మరియు ఈ 1.నుండి 14 వరకు గల క్షేత్రములు దర్శించిన దత్త  అనుగ్రహం తప్పక ఉండను.

 అవకాశము ఉన్నవారు మొత్తము చూడవచ్చను.


దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభా దిగంబర 

🙏🙏🙏🙏🙏

సమస్య పూరణ.


*నీవిడినట్టి భిక్షయిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్*

ఈ సమస్యకు నాపూరణ. 


కావర యీశ్వరా! శరణు! కారణ మీవుర కార్యమీవెరా!


స్థావర జంగమాదులును సాగును నీ కనుసన్నలందునన్


నీ వరముల్ ప్రసాదమయి నిర్మల భక్తికి నూతమాయెలే


నీవిడినట్టి భిక్షయిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

[14/12, 8:25 am] +91 95504 67431: *అనలము నుండి లేచి హిమ మంబర మెల్లను గ్రప్పె వింతగన్*

ఈ సమస్యకు నాపూరణ.


కనలెను నగ్ని జానకిని కాల్చగ లేకను చల్లసేయుచున్ 


"దినకర వంశమున్ వెలుగు దివ్యచరిత్ర పునీత సీతయే


వినుమిదె రామచంద్ర!" యనె విశ్వము నంతయు హర్ష మొందగా


అనలము నుండి లేచి హిమ మంబర మెల్లను గ్రప్పె వింతగన్. 



అల్వాల లక్ష్మణ మూర్తి.

అపరిమితార్థ సేకరణ ఆప్తుల

 చ.అపరిమితార్థ సేకరణ ఆప్తుల కెన్నుచు హాని గూర్చు వే

షపు వికటంపు చేతల నశాంతి యొనర్చుట, దైవ దూషణం

బపరిచితాళి చెప్పెడు భయమ్మును గొల్పెడు శుష్క భాషణ 

మ్మెపుడు నమాయికత్వము వహించుచు నమ్ముట మోసమౌ జుమీ! !౹ 73



ఉ.ఎప్పటికేది ప్రస్తుతమొ ఎంపిక చేసి వివేకశీలురై

చొప్పడకున్నచో ఫలము శూన్యము గాన  వృథా ప్రయాసతో

నెప్పటికో ఒనర్ప జయమెందును గల్గదు? కార్య సాధన 

మ్మప్పరమేశ్వరుండు సదయాస్పదుడైన శుభమ్ము లబ్బెడున్౹౹ 74

14, డిసెంబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🍁 *శనివారం*🍁

🌹 *14, డిసెంబర్, 2024*🌹  

       *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్లపక్షం*


*తిథి     : చతుర్దశి* సా 04.58 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే )

*నక్షత్రం  : రోహిణి* రా 03.54 తె  వరకు ఉపరి *మృగశిర*


*యోగం  : సిద్ధ* ఉ 08.27 వరకు ఉపరి *సాధ్య* 

*కరణం  : వణజి* సా 04.58  *భద్ర* రా 03.42 తె వరకు ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 10.30 - 01.00  సా 03.30 - 05.00*

అమృత కాలం  : *రా 12.57 - 02.26*

అభిజిత్ కాలం  :  *ప 11.40 - 12.25*


*వర్జ్యం         : రా  08.32 - 10.01*

*దుర్ముహూర్తం : ఉ 06.28 - 07.57*

*రాహు కాలం   : ఉ 09.15 - 10.39*

గుళికకాళం     : *ఉ 06.28 - 07.51*

యమగండం    : *మ 01.26 - 02.50*

సూర్యరాశి : *వృశ్చికం* 

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.28* 

సూర్యాస్తమయం :*సా 05.37*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 06.28 - 08.41*

సంగవ కాలం    :*08.41 - 10.55*

మధ్యాహ్న కాలం :*10.55 - 01.09*

అపరాహ్న కాలం  : *మ 01.09 - 03.23*

*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ చతుర్దశి*

సాయంకాలం   :  *సా 03.23 - 05.37*

ప్రదోష కాలం      :  *సా 05.37 - 08.11*

రాత్రి కాలం         :  *రా 08.11 - 11.37*

నిశీధి కాలం        :*రా 11.37 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.45 - 05.37*

________________________________

         🌷 *ప్రతినిత్యం*🌷     

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం.....!!*


శ్రీవేంకటేశ-పదపంకజ-షట్పదేన

శ్రీమన్నృసింహయతినా రచితం జగత్యామ్ 

యే తత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య

తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః


        🙏 *ఓం నమో వెంకటేశాయ*🙏

******************************

        🍁 *జై  హనుమాన్*🍁

🌹 *శ్రీహనుమత్ - పంచరత్న స్తోత్రం*🙏


*శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామజయం*


*వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం*

*సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం*


Continues next Saturday.....


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మన అమ్మ'లకి

 ఈ ప్రపంచంలో లెక్కలు (Mathamatics) రానిది ఎవరికో తెలుసా?


'మన అమ్మ'లకి 

ఎలాగంటే!..


ఆకలి అవుతోంది... 2 చపాతీలు పెట్టమంటే..నాలుగు పెడుతుంది.


పొద్దున్నే 7 గంటలకు లేపి..పది అయ్యిందిరా అంటూంది.


స్కూల్ పరీక్షల్లో నూటికి 30 మార్కులొస్తే..


పక్కింటి పిన్ని అడిగితే మావాడికి యాభై పైనే వచ్చాయని చెప్తుంది


బయటకు వెళ్ళాలి ఖర్చులకు ..ఓ యాభైరూపాయలు ఇవ్వమంటే..


పోపులడబ్బా నుండి వందరూపాయలు తీసి ఇస్తుంది.


 దొంగచాటుగా సెంకడ్ షోకి వెళ్ళి రాత్రి ఒంటిగంటకొచ్చి పడుకుంటే...


పొద్దున్నే నాన్నకి తెలిసి కేకలేస్తే రాత్రి పదింటికే పడుకున్నాడని కవర్ చేస్తుంది.


అమ్మకి నిజంగా లెక్కలు తెలియవు.. ఒక్క ప్రేమ తప్ప!


ఎందుకంటే!..


వాళ్ళు చదివింది..

B'Comలో Physics కాదు..

వాళ్ళు చదివింది.. Life లో Ethics.

❤️💕❤️

⚜ శ్రీ అంబలప్పుజ కృష్ణ ఆలయం

 🕉 మన గుడి : నెం 959


⚜ కేరళ : అంబలప్పుజ  : అలెప్పి


⚜ శ్రీ అంబలప్పుజ కృష్ణ ఆలయం



💠 అలప్పుళలోని అనేక అందమైన దేవాలయాలలో, అంబలప్పుజలోని శ్రీ కృష్ణ స్వామి ఆలయం వివిధ కారణాల వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది. 

ట్రావెన్‌కోర్‌లోని ఏడు గొప్ప వైష్ణవ దేవాలయాలలో ఒకటైన ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో స్థానిక పాలకుడు చెంబకస్సేరి పూరదం తిరునాల్-దేవనారాయణన్ తంపురన్ నిర్మించారని నమ్ముతారు.

ఈ పవిత్ర పుణ్యక్షేత్రం అలప్పుజా జిల్లాలో ఉంది మరియు మహాభారత ఇతిహాసం నుండి అర్జునుడి రథసారథి అయిన పార్థసారథి వేషంలో శ్రీమహావిష్ణువు ఇక్కడ కనిపిస్తాడు. 


💠 ప్రతి కృష్ణ భక్తుడు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా అంబలప్పుళ శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు.

అంబలపుజ శ్రీకృష్ణ దేవాలయాన్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు.


💠 శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నికన్నన్ (బాల కృష్ణుడు)గా ప్రసిద్ధి చెందాడు.  

ఇక్కడ కృష్ణుని విగ్రహం అతని కుడి చేతిలో కొరడా మరియు ఎడమ వైపున శంఖం పట్టుకొని నల్లరాయితో చెక్కబడింది.


🔆 చరిత్ర


💠 ఒకరోజు పూరడం తిరునాళ్ తంపురన్  విల్వమంగళం స్వామియార్ బ్యాక్ వాటర్స్ వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు వేణువు నుండి శ్రావ్యమైన ధ్వని వినిపించింది.

కృష్ణుని యొక్క అమిత భక్తుడైన విల్వమంగళం స్వామియార్‌కు మర్రిచెట్టుపై వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుని దర్శనం లభించింది. 

ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.


🔆 స్థలపురాణం


💠 పురాణాల ప్రకారం, ఈ ప్రాంతాన్ని పాలించే రాజు ఆస్థానంలో కృష్ణుడు ఒకసారి ఋషి రూపంలో కనిపించాడు మరియు చదరంగం ఆట కోసం అతన్ని సవాలు చేశాడు. 

రాజు స్వయంగా చదరంగంలో ఔత్సాహికుడు కావడంతో ఆ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఆటకు ముందే బహుమతిని నిర్ణయించాలి మరియు అతను గెలిస్తే తన బహుమతిని ఎన్నుకోమని రాజు ఋషిని కోరాడు. తనకు చాలా నిరాడంబరమైన కోరిక ఉందని మరియు కొన్ని భౌతిక అవసరాలు ఉన్న వ్యక్తి కాబట్టి, అతను కోరుకునేది కొన్ని బియ్యం గింజలు మాత్రమేనని ఋషి రాజుతో చెప్పాడు.

 

💠 ఈ క్రింది పద్ధతిలో చదరంగం బోర్డుని ఉపయోగించి బియ్యం మొత్తం నిర్ణయించబడుతుంది . 

మొదటి గడిలో ఒక బియ్యపు గింజలు, 

రెండవ గడిలో రెండు గింజలు, 

మూడవ గడిలో నాలుగు, 

నాల్గవ గడిలో ఎనిమిది, 

ఐదవ గడిలో పదహారు గింజలు వగైరా ఉంచాలి. 

ప్రతి గడిలో దాని మునుపటి కంటే రెట్టింపు ఉంటుంది. 


💠 రాజు ఆటలో ఓడిపోయాడు మరియు ఋషి అంగీకరించిన బహుమతిని కోరాడు. అతను చదరంగం బోర్డులో బియ్యపు గింజలను జోడించడం ప్రారంభించాడు, రాజు త్వరలోనే ఋషి యొక్క కోరిక యొక్క నిజమైన స్వరూపాన్ని గ్రహించాడు. 

రాచరికపు ధాన్యాగారంలో వెంటనే బియ్యం గింజలు అయిపోయాయి. రేఖాగణిత పురోగమనంలో గింజల సంఖ్య పెరుగుతోంది మరియు 64-చదరపు చదరంగం బోర్డుకి అవసరమైన మొత్తం బియ్యం మొత్తం 18,446,744,073,709,551,615 గింజలు, వాగ్దానం చేసిన ప్రతిఫలాన్ని తాను ఎప్పటికీ నెరవేర్చలేనని రాజు గ్రహించాడు.


💠 ఈ సందిగ్ధతను చూసిన ఋషి తన నిజరూపంలో రాజుకు కనిపించి, వెంటనే అప్పు చెల్లించాల్సిన అవసరం లేదని, కాలక్రమేణా తీర్చుకోవచ్చని రాజుతో చెప్పాడు. 

అప్పు తీరేంత వరకు రాజు ప్రతిరోజూ యాత్రికులకు ఆలయంలో పాల పాయసం ఉచితంగా వడ్డించేవాడు


💠 అంబలప్పుళ శ్రీ కృష్ణ దేవాలయానికి ప్రసిద్ధ గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. 

గురువాయూర్ ఆలయం నుండి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని 1789 లో టిప్పు సుల్తాన్ దాడుల సమయంలో అంబలప్పుళ ఆలయానికి తీసుకువచ్చి దాదాపు 12 సంవత్సరాలు ఈ పవిత్ర స్థలంలో ఉంచారు. 


🔆 అంబలప్పుజ పాల పాయసం.


💠 ఈ ఆలయంలో పాలు, పంచదార మరియు బియ్యంతో చేసిన తీపి గంజిని అంబలపూజ పాల పాయసం అని పిలుస్తారు.

అంబలపూజ పాల్పాయసం కేవలం తీపి వంటకం కంటే ఎక్కువ-ఇది శతాబ్దాల సంప్రదాయం మరియు భక్తితో నిండిన నైవేద్యం.  


💠 అన్నం, పాలు మరియు పంచదారతో తయారు చేయబడిన ఈ రుచికరమైన పాయసం 15వ శతాబ్దంలో ఆలయం ప్రారంభమైనప్పటి నుండి దేవుడికి వడ్డించబడుతుందని చెబుతారు.  

పురాణాల ప్రకారం, ఈ దివ్యమైన పాయసం ఆస్వాదించడానికి శ్రీకృష్ణుడు స్వయంగా పిల్లవాడి  రూపంలో ఇక్కడికి వస్తాడు అని నమ్మకం.


🔆 పండుగలు


💠 మలయాళ నెల మీనం (మార్చి-ఏప్రిల్)లో 10 రోజుల పాటు ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ అంబలపుజ ఆరట్టు.


ఆలయ ఉత్సవాల్లో ముఖ్యమైన లక్షణం వెలకళి - ఆలయ ఉత్సవాల్లో ప్రదర్శించబడే ఒక ప్రత్యేకమైన యుద్ధ నృత్యం.


అంబలపుజ మూల కజ్చా అనేది మలయాళ నెల మిథునంలో మూలం నక్షత్రం (మూల్ నక్షత్రం) నాడు ఆలయంలో జరిగే మరొక ముఖ్యమైన ఆచారం.


చంపకుళం బోట్ రేస్ ఆలయంలోని అంబలపుజ శ్రీకృష్ణన్ విగ్రహ ప్రతిష్ఠాపన రోజు జరుగుతుంది.


మలయాళ మాసం మకరం మొదటి రోజు నుండి ప్రారంభమయ్యే 12 రోజుల పండుగ పంత్రండు కలభ మహోత్సవం కూడా ఒక ముఖ్యమైన పండుగ.



💠 అంబలపుజా అనేది అలప్పుజా పట్టణం నుండి NH 47 పక్కన 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం. 


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -87*

 *తిరుమల సర్వస్వం -87* 

*శ్రీ భగవద్రామానుజాచార్యులు-4*

విమానప్రదక్షిణ మార్గంలో ఈశాన్యదిక్కున యోగానరసింహస్వామి విగ్రహప్రతిష్ట చేయించి, నిత్యపూజా నివేదన కట్టడి చేశారు. వ్యాఖ్యానముద్రలో ఉన్న తన శిలావిగ్రహాన్ని స్వయంగా ఆలింగనం చేసుకొని, దానిని అనంతాళ్వార్ కు బహూకరించారు. ఈ విగ్రహం విమాన ప్రాకారంలోనే ఉన్న భాష్యకార్లసన్నిధిలో ప్రతిష్ఠించబడింది. ఈ మందిరంలో ఉన్న రామానుజులవారి పాదుకలు కల్గిన "శెఠారి" కి తన పేరు పెట్టుకొని రామానుజుల పట్ల తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నాడు ధన్యజీవి "అనంతాళ్వార్". 

*ఇతర సాంప్రదాయాలు* 

నమ్మాళ్వార్ విరచిత పాశురాల ద్వారా స్వామివారు పుష్పప్రియుడని తెలుసుకుని, తన శిష్యుడైన అనంతాళ్వార్ ను ప్రేరేపించి తిరుమలలో పుష్పకైంకర్యం కొనసాగింపు చేశారు. పుష్పమండపంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రంలో పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనే మహత్తరలక్ష్యంతో, కొండపై ఎవ్వరూ పువ్వులు ధరింపరాదని, పూజానంతరం కూడా ఆ నిర్మాల్యాన్ని ఎవ్వరికి ప్రసాదించకుండా, పూలబావిలో నిక్షిప్తమైవున్న భూదేవికి సమర్పించాలనే కట్టడి చేశారు. శ్రీవారి మరోభక్తుడు తిరుమలనంబిని శ్రీనివాసుడు *"తాతా"* అని పిలిచిన రోజుకు గుర్తుగా, ప్రతిసంవత్సరం జరిగే *"తన్నీరుముదు”* ఉత్సవానికి కూడా రామానుజులవారే శ్రీకారం చుట్టారు. ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా *"తిరుప్పావై"* పఠనాన్ని, తోమాలసేవలో *"దివ్యప్రబంధ"* పారాయణాన్ని, ఇతర ఉత్సవ సమయాల్లో *"శాత్తుమురై"* గానాన్ని సైతం రామానుజులవారే ప్రవేశపెట్టారు.


అంతకు పూర్వం, బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగేవి కాదు. మొదటి రోజు ధ్వజారోహణ మాత్రం తిరుమలలో జరిపి, మిగతా ఉత్సవాలన్నీ తిరుచానూరులో జరిపించేవారు. కీకారణ్యంతో కూడుకున్న తిరుమలలో ఆ ఉత్సవాలకు కావలసిన సాధన-సంపత్తులు, వసతులు లేకపోవడమే దానికి కారణం. స్వామివారికి చెందిన ఉత్సవాలన్నీ తిరుమలలోనే జరగాలనే లక్ష్యంతో తిరుమల మాడవీధులను విశాలంగా తీర్చిదిద్ది, అర్చకులకు, జియ్యంగార్లకు ఆలయసమీపంలోనే నివాసగృహాలు ఏర్పరిచి, అప్పటినుండి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలన్నీ జరిగేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల క్షేత్రం అంతా పూదోటలు ఏర్పాటుచేసి స్వామివారి నిత్యకైంకర్యాలకు పూలను విరివిగా ఉపయోగించే సాంప్రదాయాన్ని అమల్లోకి తెచ్చారు. ఆలయనిర్వహణ, కైంకర్యాదులు సజావుగా సాగడం కోసం రామానుజులవారు ప్రవేశపెట్టిన ఏకాంగివ్యవస్థ గురించి, తదనంతర కాలంలో అదే జియ్యంగార్ల వ్యవస్థగా మార్పు చెందటం గురించి ఇంతకుముందే తెలుసుకున్నాం. 

*రామానుజుల పేరిట ఉత్సవాలు* 

శ్రీనివాసునికి, ఆనందనిలయానికి, తిరుమల క్షేత్రానికి రామానుజుల వారందించిన అనిర్వచనీయమైన సేవలకు గుర్తుగా, ఈనాటికీ ఆనందనిలయంలో రామానుజుల వారి పేరున కొన్ని ఉత్సవాలు జరుగుతాయి. రామానుజుల జన్మనక్షత్రమైన "ఆర్ధ్రానక్షత్రం" నాడు జరిగే మాసోత్సవం గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. వైశాఖమాసంలో శ్రీరామానుజ జయంతి సందర్భంగా జరిగే పదిరోజుల ఉత్సవాల యందు, భాష్యకార్లసన్నిధిలో ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. స్వామివారి శేషహారతి, తీర్థ-చందనాలు రామానుజులవారికి ప్రసాదిస్తారు. 

*సంస్కరణలు* 

‌ అప్పట్లో కొందరికి మాత్రమే పరిమితమై ఉన్న వైష్ణవమతాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేస్తూ, సమాజంలోని అత్యున్నతస్థాయి నుండి అట్టడుగున ఉన్న వారందరికీ వైష్ణవమతాన్ని స్వీకరించే అర్హత కల్పించారు. హైందవ సంస్కృతికి గుళ్ళూ గోపురాలు ఆయువుపట్లని విశ్వసించిన శ్రీరామానుజులు, దేశం నలుమూలలా సంచరించి ఎన్నో వైష్ణవాలయాలను పునరుద్ధరించి వాటిలో నిత్యకైంకర్యాలకు శాశ్వత ఏర్పాట్లు చేశారు. అప్పటివరకు అస్తవ్యస్తంగా ఉన్న అర్చారీతులన్నింటినీ తీర్చిదిద్ది సక్రమమైన ఆలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటువంటి క్షేత్రాల్లో శ్రీవేంకటాచలక్షేత్రం ప్రధానమైనది. 

మధ్వాచార్యులు ద్వైతమతానికి, ఆదిశంకరులు అద్వైతమతానికి కృషి చేసినట్లే, విశిష్టాద్వైత వ్యాప్తికి ఎంతగానో కృషి చేసిన రామానుజాచార్యులు, అనేకానేక ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా రచించారు. వాటిలో *శ్రీభాష్యం, గీతా భాష్యం, వేదాంతదీపం, వేదాంతసారం, శ్రీరంగగద్యం, శరణాగతిగద్యం, వైకుంఠగద్యం* ముఖ్యమైనవి. 

కలియుగ సంవత్సరం 4118, పింగళవర్షం, చైత్రమాసం, ఆర్ధానక్షత్రం, శుక్లపంచమి తిథి నాడు (ఏప్రిల్ 13, 1017 సం.), తమిళనాడులోని భూతపురంలో (నేటి శ్రీపెరంబుదూరు), ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి పుణ్యదంపతులకు జన్మించిన శ్రీమద్రామానుజులు, 120 వసంతాలు జీవించి; 1237 సం. లో, శ్రీరంగం నందు తుదిశ్వాస విడిచారు. (ఈ లెక్క ప్రకారం, క్రీ. పూ. 3101 సం. లో కలియుగం ప్రారంభమైనట్లు). అన్నమయ్య, రామానుజులను *"పలికేదైవం"* గా కీర్తించాడు: *గతులన్ని ఖిలమైన కలియుగమందును* *గతి యితడే చూపె ఘన గురు దైవము.* *వెలయించె నీతడె కా వేదపురహస్యము* *చలిమి నీతడే చూపె శరణాగతి* *నిలిపి నా డీతడె కా నిజముద్రాధారణము* *మలసి రామానుజులే మాటలాడే దైవము.*

 [ రేపటి భాగంలో... *పద్మావతీ - శ్రీనివాసుల పరిణయం* గురించి తెలుసుకుందాం] 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

11-01-గీతా మకరందము

 11-01-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


శ్రీ భగవద్గీత 

అథ ఏకాదశోఽధ్యాయః 

పదునొకండవ అధ్యాయము 

విశ్వరూపసందర్శనయోగః

విశ్వరూపసందర్శనయోగము 


అర్జున ఉవాచ :-

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంఙ్ఞితం | 

యత్త్వ యోక్తం వచస్తేన 

మోహోఽయం విగతో మమ || 

 

తా:- అర్జునుడు చెప్పెను - (శ్రీకృష్ణమూర్తీ !) నన్ననుగ్రహించుటకొఱకై సర్వోత్తమమై, రహస్యమై అధ్యాత్మమను పేరుగలదైనట్టి ఏ వాక్యమును (బోధను) మీరు చెప్పితిరో, దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది. 

   

వ్యాఖ్య:- శ్రీకృష్ణభగవాను డింతవఱకు అర్జునునకు గావించిన ఆధ్యాత్మిక హితబోధచే అర్జునుని మోహము (అజ్ఞానము) తొలగిపోయినది. ఏ అవివేకమువలన మొట్టమొదట ఈ దృశ్యజగత్తు నిత్యమని, ‘ఈ బంధువులు నావారని’ ‘ఈ దేహము నేన’ని అర్జునుడు తలంచుచు తత్ఫలితముగ దుఃఖమునొందుచుండెనో ఆ అవివేకమిపుడు భగవానుని అధ్యాత్మప్రసంగమువలన తొలగిపోయినది. గీతాబోధ యింకను పూర్తి కాలేదు. 10 అధ్యాయములు మాత్ర మైనది. ఇంకను 8 అధ్యాయములు బాకీయున్నవి. అయినను ఇంతమాత్రపు బోధచేతనే అర్జునునకు చిత్తోపరతి, జ్ఞానప్రాప్తి, తత్ఫలితముగ మోహోపశమనము సంభవించినది. ఈ విషయమును అర్జునుడు ‘మోహోఽయం విగతోమమ’ (నా అజ్ఞానము అంతరించినది) - అను వాక్యముద్వారా స్పష్టముగ ఒప్పుకొనెను. 

      అర్జునుడు భవరోగముచే పీడితుడగుచుండెను. శ్రీకృష్ణపరమాత్మయను వైద్యుడు గీతామృతమను ఔషధము నొసంగిరి. అద్దాని నొకింతమాత్రమే అర్జునుడు సేవించెను. పూర్తిగాకాదు. అయినను ఆ రవ్వంతమందుతోనే అర్జునుని రోగము (మోహమను వ్యాధి) పూర్తిగ నయమయ్యెను. దీనినిబట్టి ఆ వైద్యుడెంతగొప్పవాడో, ఆతడిచ్చిన ఆ మందు ఎంతపటుతరమైనదో స్పష్టమగుచున్నది. ఔషధముయొక్క శ్రేష్ఠత్వము వ్యాధినివారణపై ఆధారపడియుండును. వ్యాధి తొలగనిచో ఆ ఔషధము శ్రేష్ఠమైనది కాదని యర్థము. ఇచట గీతామృతభేషజమును దాదాపు సగముసేవించినంతనే ఫలితము వెంటనే అర్జునునియందు కానబడినది. ఆతని అజ్ఞానరోగము, భవరోగము పటాపంచలైపోయినది. శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యులుకారు. యోగిరాట్, యోగీశ్వరులు. వారు బోధించిన అధ్యాత్మబోధయు సామాన్యమైనదికాదు. అది 

(1)మహాశ్రేష్ఠమైనది (పరమం),

(2) అతిరహస్యమైనది (గుహ్యమ్) - అని అర్జును డిచట దానిని గూర్చి పలికెను. ఏలయనగా అద్దాని ప్రభావముచే ఆతని హృదయమందు ప్రత్యక్ష ఫలితము కానుపించినది. అంధకారము తొలగినది. ప్రకాశమావిర్భవించినది. 

      ప్రపంచములో ఎన్నియో విద్యలు కలవు. కాని అవియన్నియు హృదయాంధకారవినాశమందు సమర్థములుకావు. భవరోగనివారణమందు శక్తివంతములు కావు. కాని ఈ అధ్యాత్మబోధ అట్టిది కాదు. ఇది జననమరణ దుఃఖప్రవాహము నుండి జీవుని ఉద్ధరించి దరికి జేర్చునది. కనుకనే అర్జును డిద్దానిని ‘పరమమ్’ (మిగుల శ్రేష్ఠమైనది) అనియు,‘గుహ్యమ్’ (అతిరహస్యమైనది) అనియు పేర్కొనెను. అయితే యిట్టి మహత్తరమైన విద్యను గురువులు అందఱికిని చెప్పరు. ఎవరు అధికారులో,అర్హులో, ఎవరియందు వారికి అనుగ్రహము కలుగునో (‘మదనుగ్రహాయ’), ఎవరు నిర్మలభక్తితో గూడియుందురో- అట్టివారికి మాత్రమే గురువులు బోధించుదురు. ఇట అర్జునుడట్టి యోగ్యతలు గలిగియుండెను. కావున ఆతనిపై భగవానునకు అనుగ్రహముగలిగి అతనికీ పరమపావనమగు అధ్యాత్మవిద్యను ఉపదేశించిరి. ‘మదనుగ్రహాయ’ అను పదముచే అధ్యాత్మవిద్యాపరిగ్రహణమున గురువుయొక్క అనుగ్రహము శిష్యునకు అత్యావశ్యకమని తేలుచున్నది. 

        భుజించువానికి త్రేపువచ్చినచో కడుపునిండినట్లు గ్రహించుకొనవచ్చును. అనగా అతనికి తృప్తికలిగినదని యర్థము. అదియే దానికి గురుతు. అర్జునుడు గీతామృతమును తనివితీర పానము చేయుచుండెను. 10 అధ్యాయములు వినినంతనే అతనికొక త్రేపువచ్చెను. “మోహోఽయం విగతోమమ” (నా అజ్ఞానము శమించినది) అను వాక్యమే ఆ త్రేపు. మఱల 18వ అధ్యాయమున ‘నష్టోమోహః స్మృతిర్లబ్ధా’ అను వాక్యమును పలుకుటద్వారా తన పరిపూర్ణసంతృప్తిని ఈ ప్రకారమే మఱియొకసారి వెల్లడింపగలడు. 

           

ప్ర:- అధ్యాత్మవిద్య యెట్టిది?

ఉ:- (1) సర్వోత్కృష్టమైనది 

(2) అతిరహస్యమైనది. 

ప్ర:- దాని ప్రభావమెట్టిది?

ఉ:- అది జీవుల అజ్ఞానమును, సంసారవ్యామోహమును నశింపజేయును. 

ప్ర:- శ్రీకృష్ణమూర్తి అద్దానిని అర్జునుని కేల బోధించెను?

ఉ:- అతడు సర్వవిధముల తచ్ఛ్రవణమునకు భక్త్యాదులచే యోగ్యతను బడసెను. కనుక అతనిపై అనుగ్రహముకలిగి దానిని బోధించెను.  

ప్ర:- ఆ బోధ అర్జునునకు ఫలించెననుట గురుతేమి?  

ఉ:- దానిని వినిన వెంటనే ‘నా అజ్ఞానము శమించినది’ అని యతడు పలికెను.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*225 వ రోజు*

ధృతరాష్టుడు సంజయుని జయాపజయాలు వివరించమని కోరుట

ఆ పై ధృతరాష్ట్రుడు " సభ ముగించాడు. అందరూ వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న సంజయుని చూసి ధృతరాష్ట్రుడు " సంజయా ! నీకు ఇరు పక్షాలలో ఉన్న వీరు లందరూ తెలుసు. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో చెప్పగలవా " అని అడిగాడు. సంజయుడు " దేవా! ఈ విషయం నన్ను అడగడం కన్నా గాంధారిని, మీ తండ్రి వ్యాసుని పిలిపించి అడగడం మంచిది " అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు " తన తండ్రి వ్యాసుని ధ్యానించాడు. గాంధారిని పిలిపించాడు. వ్యాసుడు సంజయుని ఛూసి " సంజయా! నీకు అన్నీ తెలుసు. నేను వినేలా ధృతరాష్టుని ప్రశ్నకు సమాధానం చెప్పు " అన్నాడు. సంజయుడు " ధృతరాష్టా ! నీవు కౌరవ పండవ సేనకు కల తారతమ్యం గురించి అడిగావు. పాండవ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు. మీ పక్షాన ఎవరున్నారు చెప్పు. పాండవుల బలం శ్రీకృష్ణుడే . సమస్త లోకాలు ఒక పక్కన శ్రీకృష్ణుడు ఒక పక్కన నిలిచినా శ్రీకృష్ణుడు గెలుస్తాడు. సత్యం, ధర్మం, న్యాయం ఎక్కడ ఉన్నాయో శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారికి జయం తప్పదు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " సంజయా! కృష్ణుని గురించి నాకు తెలియక పోవడానికి నీకు తెలియడానికి ఏమి కారణం " అన్నాడు. సంజయుడు " లోకంలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి. అవిద్యతో అలమటిస్తున్న వారు తమో గుణంతో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని తెలుసుకో లేరు. విద్యా వినయ భూషితుడు తెలుసు కొనగలడు. ధృతరాష్ట్రుడు " విద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి వివరించు " అన్నాడు. సంజయుడు " దేవా ! ప్రతి మనిషికి సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. నేను వాటికి లోబడక పక్షపాత రహితంగా నిర్వికారంగా ఉండి పవిత్ర భావంతో ధర్మంగా ఉంటాను. అందువలన నేను విష్ణువును తెలుసు కున్నాను. నీకు గాని వేరెవరికైనా విష్ణువును తెసుకోవడానికి ఇది తక్క వేరు మార్గం లేదు. ఇందుకు భిన్నమైన దానిని అవిద్య అంటారు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " పక్కనే ఉన్న సుయోధనుని చూసి " నాయనా సుయోధనా ! సంజయుడు మన శ్రేయోభిలాషి. అతని మాట విని శ్రీకృష్ణుని ఆశ్రయించి నీవు నీ తమ్ములతో క్షేమంగా ఉండండి " అన్నాడు. సుయోధనుడు " తండ్రీ ! ఈ లోకాలు సర్వ నాశనం అయినా నేను ధైర్యం వదలను శ్రీకృష్ణుని శరణు వేడను " అన్నాడు. ధృతరాష్ట్రుడు నిర్వేదంగా " గాంధారి ! విన్నావా నీ కుమారుని మాటలు. వీడు దుర్మార్గుడు, నీతి బాహ్యుడు, గర్విష్టి, అసూయాద్వేహాలు కలవాడు నా మాట వినడు. వీడు చెడి పోతాడు. వీడికిక బ్రతుకు లేదు " అన్నాడు. గాంధారి " సుయోధనునితో " కుమారా సుయోధనా ! ఈ ఐశ్వర్యం, సంపద, రాజ్యం, నీ ఆయుషు ఎందుకు వదులు కుంటావు. దైవం భీముని రూపంలో నిన్ను చంపుతుంది. నీ లాంటి అవినీతిపరుడు ఎక్కడైనా ఉంటాడా ? " అన్నది. వ్యాసుడు " ధృతరాష్టు నితో " నీకు శ్రీకృష్ణుడంటే భక్తి అందుకే సంజయుని రాయబారిగా పంపావు. సంజయుని మాట విని శ్రీకృషుని ఆశ్రయించు. రాగ ద్వేషాలు వదిలి ఏకాగ్రతతో ఆరాధించిన వారికి శ్రీకృష్ణుడు చేరువ ఔతాడు. కామక్రోధాలతో అలమటించే వారికి అతను దూరంగా ఉంటాడు.అన్నాడు. ధృతరాష్ట్రుడు " మీరు చెప్పినట్లే చేస్తాను " అన్నాడు. ధృతరాష్ట్రుడు " శ్రీకృష్ణునికి వాసు దేవుడనే పేరు ఎలా వచ్చింది. సంజయుడు " శ్రీకృష్ణుడు అంతటా ఉంటాడు. సకల జగము అతనిలో ఉంటాయి కనుక అతనిని వాసుదే వుడంటారు. ఇందియ నిగ్రహంతో అతనిని ధ్యానిస్తే అతని వశం ఔతాడు. నీవు కూడా అన్ని చింతలు వదిలి అతనిని ధ్యానించు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " వ్యాసమహర్షీ ! నేను శ్రీకృష్ణుని శరణు వేడుతాను . శ్రీకృష్ణుని దివ్య మంగళ రూపాన్ని దర్శింప లేను. నిరంతరం కృష్ణుని సన్నిధిలో ఉండే వారు ఎంతటి పుణ్యాత్ములో కదా " అని విచారించాడు. అంతట వ్యాసుడు నిష్క్రమించాడు. దుర్యోధనుడు, గాంధారి, సంజయుడు తమ తమ నివాసములకు వెళ్ళారు.

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము సమాప్తం*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      శ్లో 𝕝𝕝 *యౌవనం జీవనం చిత్తం*

              *ఛాయా లక్ష్మీశ్చ స్వామితా|*

              *చంచలాని షడేతాని*

              *జ్ఞాత్వా ధర్మరతో భవేత్‌||*

                       *_(శుక్రనీతి 1-138)_*


తా𝕝𝕝 *యౌవనము, జీవనము, చిత్తము, ఛాయ, లక్ష్మీ, ప్రభుత్వము - ఈ యాఱును చంచలములు*.... *ఈ విషయము గుర్తించి మనుష్యుడు ధర్మరతుడు కావలెను....*

       

✍️🌺🌷🌹🙏

పన్నియూర్ శ్రీ వరాహమూర్తి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 530*


⚜ *కేరళ  : పట్టాoభి - పాలక్కాడ్*


⚜  *పన్నియూర్ శ్రీ వరాహమూర్తి ఆలయం*



💠 శ్రీ విష్ణువు యొక్క ' వరాహ ' అవతారాన్ని పూజించే దేవాలయాలు కేరళలో చాలా తక్కువ . 

ఈ ఆలయంలో శ్రీ శివుడు ('వడకోవిల్'), శ్రీ అయ్యప్ప , శ్రీ దుర్గాభగవతి , 

శ్రీ గణపతి , శ్రీ సుబ్రమణ్య మరియు 

శ్రీ లక్ష్మీ నారాయణుడు వంటి ఉపదేవతలను కూడా ఆరాధిస్తారు . 

ఈ ఆలయానికి చిత్రగుప్తుడు మరియు యక్షి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతారు . 


 💠 పన్నీర్ శ్రీ వరాహమూర్తి ఆలయం భారతదేశంలోని కేరళలోని పాలక్కాడ్ జిల్లా, పట్టంబి తాలూకాలోని కుంబిడి వద్ద ఉన్న పురాతన హిందూ దేవాలయ సముదాయం.  

ఈ ఆలయం దాదాపు 4000 సంవత్సరాల క్రితం పరశురామునిచే ప్రతిష్టించబడిన కేరళలో మొట్టమొదటి ఆలయంగా నమ్ముతారు.  


💠 ఈ ఆలయంలో హిరణ్యాక్షుడిని చంపిన తర్వాత భూదేవితో ఉన్న విష్ణువు యొక్క మూడవ అవతారం అయిన వరాహమూర్తి ఉన్నాడు.


💠 పూర్వం 800 (బ్రాహ్మణుల కుటుంబాలు కేరళను పాలించినప్పుడు)  సుమారుగా 1300 సంవత్సరాల పాటు కేరళలోని ప్రఖ్యాత గ్రామమైన పన్నియూర్‌ను పరిపాలించిన దేవుడైన శ్రీ వరాహ మూర్తిని పూజించారని కూడా చెబుతారు.


 🔆 ఆలయ చరిత్ర 

 


💠 క్షత్రియులపై విజయం సాధించిన తరువాత, పరశురాముడు తాను గెలిచినదంతా కశ్యపునికి దానం చేశాడు.  

అతను తన ధ్యానాన్ని కొనసాగించడానికి ఒక భూమిని కోరుకున్నాడు మరియు దాని కోసం అతను సముద్రం నుండి ఒక చిన్న భాగాన్ని బయటకు తీశాడు.  

ఈ చిన్న చిన్న భూభాగమే ఇప్పుడు కేరళగా ఉందని చరిత్ర చెబుతోంది. 


💠  పరశురాముని భూభాగం పెరగడం మరియు విస్తరించడం ప్రారంభించింది.  కలవరపడిన పరశురాముడు నారదుని సహాయం కోరాడు.  

విష్ణువును ప్రార్థించమని నారదుడు అతనికి సలహా ఇచ్చాడు.  

కాబట్టి పరశురాముడు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తన ధ్యానాన్ని ప్రారంభించాడు.  


💠  విష్ణువు అతని ముందు ప్రత్యక్షమై, "ఒకసారి నేను ప్రపంచాన్ని రక్షించడానికి వరాహమూర్తిగా అవతరించాను. 

నా రూపాన్ని ఆరాధించండి మరియు ఈ ప్రదేశంలో 'త్రిమూర్తి' అనుగ్రహం లభిస్తుంది" అని చెప్పాడు.


💠 విష్ణువు సలహాను అనుసరించి, పరశురాముడు తన భూభాగం మధ్యలో శ్రీ వరాహమూర్తిని స్థాపించాడు మరియు దానిని ఉంచడానికి ఒక ఆలయాన్ని నిర్మించాడు.  

అతను అక్కడ అన్ని పూజా కార్యక్రమాలను సక్రమంగా ప్రారంభించాడు. 

 ఆ దివ్య దేవాలయమే నేటి పన్నియూర్ మహాక్షేత్రం.


💠 మహాపండిత్ అప్పత్ అదీరి 600 సంవత్సరాల క్రితం రాగి ముక్కలపై తన ఆత్మకథను వ్రాసాడు, అందులో అతను భవిష్యత్తు కోసం తన అంచనాలను రూపొందించాడు.  

ఈ ముక్కలు ఇటీవల కనుగొనబడ్డాయి మరియు గ్రంథాలు మలయాళంలోకి అనువదించబడ్డాయి.  

పన్నియూర్ మహాక్షేత్రం కోల్పోయిన వైభవాన్ని మరియు కీర్తిని ఖచ్చితంగా తిరిగి పొందుతుందని మహాపుండిత్ అంచనా వేశారు.  

అతను తన రచనలలో సూచించిన సమయం ఇప్పుడు పండింది.  


💠 శుభదినం వచ్చినప్పుడు, శ్రీ వరాహమూర్తిని విశ్వసించే ప్రతి ఒక్కరికీ 'అభీష్ట కార్య సిద్ధి' (అనగా తాను ప్రార్థించిన ప్రతి విషయం యొక్క సాక్షాత్కారం) దీవించబడుతుందని అతను ముందే చెప్పాడు.  

ఆపదలో ఉన్నప్పుడు 'వరాహమూర్తి రక్షకణే' (నన్ను రక్షించు, వరాహమూర్తి) అనే పదాన్ని మూడుసార్లు ఉచ్ఛరిస్తే,

 శ్రీ వరాహమూర్తి రాబోయే అన్ని ఆపదల నుండి  రక్షిస్తాడని భక్తుల నమ్మకం.


🔅 దేవప్రశ్నంగల్ 


💠 1983 నుండి ఇక్కడ జరుగుతున్న 'దేవప్రశ్నంగల్' లో ఈ ఆలయం గురువాయూర్ మరియు శబరిమల వంటి గొప్ప దేవాలయాలతో సమానంగా ప్రతిష్ట మరియు ప్రాముఖ్యతను పెంచుతుందని సూచిస్తుంది.  

ప్రతి ఒక్కరినీ అనుగ్రహించడానికి శ్రీ వరాహమూర్తి ఈ ఆలయంలో ఉన్నటు స్పష్టమవుతుంది. 


💠 శ్రీ వరాహమూర్తి యొక్క ఆశీర్వాదం మరియు మహిమాన్వితమైన ఉనికిని అనుభవించినట్లు చాలా మంది భక్తులు పేర్కొన్నారు.  

శ్రీ వరాహమూర్తి భక్తులందరికీ 'అభీష్ట కార్య సిద్ధి' అనుగ్రహించబడుతుందని చెప్పబడింది.  

దీంతో శ్రీ వరాహమూర్తి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.


💠 ఇక్కడ నిర్వహించబడే వివిధ పూజలలో అత్యంత ముఖ్యమైనది 'అభీష్ట సిద్ధి పూజ'.  

ఈ పూజ ఖర్చు రూ.101/- మరియు 'అభీష్ట కార్య సిద్ధి'కి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతారు.


💠 శ్రీ వరాహమూర్తి అనుగ్రహం పొందడానికి 'సంధ్య దీపారాధన' అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది.  

గంధపు చెక్కతో కప్పబడి, మెరిసే ఆభరణాలతో అలంకరించబడిన శ్రీ వరాహమూర్తి యొక్క దివ్య రూపం ప్రతి మనస్సును ఆలింగనం చేసుకోవడానికి మరియు సాంత్వన పొందేలా ఉంది.


💠 ఎలా చేరుకోవాలి ? 

సమీప రైల్వే స్టేషన్ కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుట్టిప్పురం వద్ద ఉంది.

 ప్రసిద్ధ గురువాయూర్ దేవాలయం కేవలం 33 కి.మీ దూరంలో ఉంది.