11, డిసెంబర్ 2021, శనివారం

సైన్ధవ లవణం యొక్క ఉపయోగాలు -

 సైన్ధవ లవణం యొక్క ఉపయోగాలు - 


 * ఈ సైన్ధవ లవణం కొంచం మధురంగా ఉండును. 


 * శుక్రాన్ని వృద్దిచేయును .


 * హృదయముకు బలమును ఇచ్చును. 


 * శరీరం నందు వాత,పిత్త,కఫ దోషములను పొగొట్టును.


 * శరీరం నందు కొంచం ఉష్ణం కలుగచేయును .


 * నేత్రములకు మంచి ఉపకారం చేయును . 


 * శరీరం నందు జీర్ణశక్తిని వృద్దిచేయును .


 * వాతాన్ని హరించును .


 * వ్రణాలను తగ్గించును . 


 * శరీరం నందు పైత్యం హరించును . 


 * దీనిని వాడటం వలన మలబద్దకం హరించును . 


 * గ్యాస్ పట్టినప్పుడు దీనిని గోరువెచ్చటి నీటిలో కలిపి త్రాగించి వాంతి చేయించిన ఉదరం శుభ్రపడును . 


 * ఒక చెంచా చనుబాలలో చిటికెలో పావు వంతు సైన్ధవ లవణం కలిపి కంటిలో 2 చుక్కలచొప్పున వేయుచుండిన కంటి సమస్యలు నివారణ అగును. 


  గమనిక - 


      దీనిని అమితముగా పుచ్చుకున్న పైత్యం చేయును . అతిసార వ్యాధిని కలుగచేయును .


                       అతిత్వరలో నా మూడోవ గ్రంధం 

" సర్వ మూలికా చింతామణి " ప్రధమ భాగం రాబోతుంది. ఈ గ్రంధంలో అత్యంత రహస్య మూలికా యోగాల గురించి మరియు ప్రతి ఔషధ మొక్క గురించి అత్యంత విపులంగా రాయడం జరిగింది. ఆ సర్వేశ్వరుడి కృప వలన అతి త్వరలో మీకు అందచేస్తాను . ఈ గ్రంథంలో ఔషధ మొక్కల రంగుల చిత్రాలతోపాటు అత్యంత నాణ్యతతో వస్తుంది . 


              కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                   9885030034

మల్లెచెట్టు మహావృక్షమైతుందా !

 మల్లెచెట్టు మహావృక్షమైతుందా !

.....................................................................


సోమన దాక్షారామ సమీపంలోని వేములవాడ అగ్రహారంలో జీవించేవాడు. ఇతను సకలశాస్త్రపారంగతుడు, పండితుడు కాని పూటగడవని నిరుపేద. అతనిభార్య ఉత్తమఇల్లాలు భారతరామాయణాలు శివపురాణాలు చదువుకొంది.ఈమెకు సంగీతంలో ప్రవేశంవుంది. విధిబలీయమైనది.సంతానయోగం లేకనే చిన్నవయసులోనే సోమన అనారోగ్యంపాలై మరణించాడు.భర్త మరణాంతరం భార్య ఉదరపోషణార్థం సాటిబ్రాహ్మణులలో ఇండ్లలో పిల్లలకు రామాయణభారతభాగవత శివపురాణ ఇతిహాసాలను చెప్పుకొంటూ వారికి పాటలు పద్యాలు నేర్పిస్తూ వుండేది.


ఒకసారి శివరాత్రిపర్వదినాన వేములవాడ గ్రామమహిళలు కొందరు దాక్షారామంలోని భీమేశ్వరస్వామిని దర్శించుకోటానికి వెళ్ళారు.సోమన భార్య కూడా వారితోపాటు భీమేశ్వరదర్శనానికి వెళ్లింది. ముత్తయిదువులలో కొందరు సోమనభార్య వయసువారు, కాని నిస్సంతులు తమకు సంతానం కలగాలని వారు పార్వతీనాథుని వేడుకొన్నారు. సోమనభార్యను చూచి నువ్వు కూడా ఏదైనా వరం కోరుకోమని సరదాగా ఆటపట్టించారు. నాక్కూడా కడుపుపండితే పుట్టెడు నీళ్ళతో దీపారాధాన చేయిస్తానని మొక్కుకొంది. ఆమె కోరిక విని భర్తలేని నీకు పిల్లలెలా కలుగుతారని అందరూ పక్కున నవ్వారు. సోమనభార్య కూడా నవ్వింది. ఊరికి వెళ్లిన తరువాత ఎవరి సంసారంలో వారు పడి తాము భీమేశ్వరదేవుని కోరిన కోర్కెలు మరచిపోయారు.


కాని దేవుడి మహిమలు విచిత్రమైనవి. కొన్నాళ్ళకు సోమనభార్యకు చూలు నిలిచింది. ముండ యాగటైందని ఇంట్లోవారు ఊర్లోవారు బుగ్గలు నొక్కుకున్నారు. ఆమెమాత్రం వేములవాడ భీమలింగేశ్వరుని మీద భారంవేసి ఏం జరిగితే అదే జరగనీ అని ఊరకనే వుండిపోయింది. ఒక శుభముహుర్తాన పండంటి మగబిడ్దకు జన్మనిచ్చింది.దాంతో అగ్రహారీకులలో కొందరు ఆమెను దూరం పెట్టేశారు. అయినా ఆమె వెరవక బాలుడిని పెంచసాగింది.వేములవాడ భీమేశ్వరదేవర వరప్రసాదం కాబట్టి బాలునికి భీమన అనేపేరు పెట్టింది.


బాలుడు పెరిగి పెద్దవాడు కాసాగాడు. తల్లి దగ్గరే విద్యాబుద్ధులు నేర్చుకోసాగాడు. భీమన ఒకరోజున తోటి పిల్లలతో ఆడుకొనేటందుకు వీధిలోకి వెళ్ళాడు. నీకు నాన్నలేడు నువ్ ముండకొడుకంటూ భీమనను ఎగతాళిచేశారు. భీమనకు ఏడుపొచ్చింది, తండ్రెవరో తెలుసుకోవాలని తల్లిదగ్గరకు పరుగిడిపోయాడు. తన తండ్రెవరంటూ తల్లిని నిలదీశాడు.


తల్లికి ఏం చెప్పాలో తోచక, వేములవాడ భీమేశ్వర నీతండ్రని చెప్పింది. భీమన క్షణం ఆలస్యం చేయకుండా భీమేశ్వరాలయం చేరి, శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని నాన్నానాన్నా అంటూ గట్టిగా పిలవసాగాడు. అలా ఎంతసేపు పిలిచాడో కాని భక్తవరశంకరుడు బాలుని ముందు ప్రత్యక్షమై నాయనా నీవు నా వరప్రసాదవి. ఈ సంగతి అందరికి చెప్పు ఇకనుండి నిన్ను ఎవరు అనరు. నీకు చక్కని నోటివాక్కును ప్రసాదిస్తున్న నిన్ను ఎగతాళి చేసిన వారిపట్ల నువ్ ఏమంటే అది ఫలిస్తుందంటూ చెప్పి, అంతేకాదు ఇకనుండి నువ్వాడిందే ఆట నువ్ పాడిందేపాట ఆవుతుందంటూఆశీర్వదించాడు. భీమన నాటినుండి భీమేశ్వరుడిగా మారిపోయాడు.


బాలుడు సంతోషంతో ఊరిని చేరుకొన్నాడు. ఊర్లో బ్రాహ్మణ అన్నసంతర్పణ జరుగుతోంది. ఆకలిగా వుంటే వెళ్ళి బంతిలో కూచోబోయాడు. వడ్డించేవారు ఛీదరించుకొని విధవ కొడుకును ఎవడ్రా లోపలికి రానించిందంటూ కేకలు వేశారు.భీమనకు కోపం వచ్చింది, పందిరిలోని అన్నమంతా సున్నం, అప్పాలు - కప్పలు కావాలంటూ శపించాడు. అంతే విస్తరాకులలోని అన్నం సున్నంగాను అత్తిరసాలు/అప్పాలు కప్పలుగాను మారిపోయాయి. అన్నసంతర్పణ నిర్వాహంకులు లబోదిబోమన్నారు. భీమనతో క్షమాపణలు అడిగారు, భీమన శాంతించి సున్నమంతా అన్నంగాను, కప్పలన్ని అప్పాలుగాను మారాలని కోరుకొన్నాడు. అవన్ని అంతలోనే అన్నంగాను అప్పాలుగా మారిపోయాయి. వారా బాలుడిని అన్నబంతిలో కూర్చోబెట్టి అతనికేమేమి కావాలో అన్ని దగ్గరుండి వడ్డించారు.


ఆ బాలుడు పెరిగిపెద్దవాడైనాడు, తండ్రిలాగా సకలశాస్త్రాలు నేర్చి సంస్కృతాంధ్రభాషలలో గొప్పకవిగా రాణించాడు. నోటి వాక్కుతో ఎన్నో అద్భుతాలు చూపాడు.


ఒకసారి భీమలింగకవి రాజైన చొక్కభూపాలుని అస్థానానికి వెళ్ళాడు. రాజుతోపాటుగా ఉద్యానవనంలో విహరించాడు. రాజు ఒక తిన్నెపై కూర్చుని ఒక కాలును మల్లెచెట్టు కొమ్మపై వుంచి కూర్చున్నాడు. మహాకవి నీ నోటిమాట ఫలిస్తుందని అందరూ అంటారుగా ఏది ఈ మల్లెచెట్టును మహావృక్షంగా మార్చుచూద్దామన్నాడు. రాజు తనను తనను పరీక్షించాలని అనుకొంటున్నాడని భీమలింగకవి కింది పద్యాన్ని ఆశువుగా చెప్పాడు.


శా॥ ఆనీతాభ్యుపదానళృంఖలపదాభ్యాలంబితస్తంభమా !

నేనే వేములవాడ భీమకవినేనిజిత్రకూటంబులో

భూనవ్యాపితపల్లవోద్భవమహాపష్పోపగుచ్చంబులన్

నానాపక్వఫలప్రదాయి వగుమా నాకల్పవృక్షాకృతిన్.


అంతే చూస్తుండగానే ఆ మల్లెచెట్టు శాఖోపశాఖలుగా పెరిగి, మహవృక్షమైపోయింది. ఆ చెట్టు మొదట్లో రాజు కాలు ఇరుక్కుపోయింది. రాజు బాధతో అల్లాడిపోయి, ఆ పెద్దచెట్టును మామూలు మల్లెచెట్టుగా చేయమని కవిని ప్రార్థించాడు.


భీమకవి చిరునవ్వుతో కింది పద్యం చెప్పాడు.


ఉ॥

శంభువరప్రసాదకవిసంఘవరేణ్యుఁడ నైన నావచో

గుంభన చేయ నెంతొ యనుకూలత నొంది తనూనభావనన్

గుంభినజొక్క నామనృపకుంజరుపందిటిమల్లెసాలకున్

స్తంభమురీతి నీతనువుఁ దాలిచి యెప్పటియట్ల యుండుమా!


అశ్ఛర్యంగా అంత పెద్దచెట్టు పద్యం పూర్తైయ్యేలోపుగా పూర్వపు మల్లెచెట్టుగా మారిపోయింది. రాజు బ్రతుకు జీవుడా అంటూ మల్లెపొదలోనుండి కాలును బయటకు తీసేసుకొని కవికి నమస్కరించాడు.

.................................................................................. జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కాశీ.

 కాశీ.....🛕🙏💐


కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం...


కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. 


విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న 

ప్రత్యేక స్థలం.


ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. 

ప్రపంచ సాంస్కృతిక నగరం.

స్వయంగా శివుడు నివాసముండె నగరం.


ప్రళయ కాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 


కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.


కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, 

కాలభైరవ దర్శనము 

అతి ముఖ్యం....


ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.


కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...


కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.


కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.


అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.


గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.


శివుని కాశీలోని కొన్ని వింతలు.

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. 


అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి, అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు 

అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు, కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.


విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.


ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి... ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి 

ఎన్నో వున్నాయి. 


అందులో కొన్ని.....


1) దశాశ్వమేధ ఘాట్...


బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్...


ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్...


చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్...


సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్...


పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్...


ఇది కాశీలో మొట్ట మొదటిది. 

దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు.

ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. 

ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్...


ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. 

ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


😎 పంచ గంగా ఘాట్...


ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్...


గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్...


తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్...


ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్...


పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్...


సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...


14) మానస సరోవర్ ఘాట్...


ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.


15) నారద ఘాట్.. 


నారదుడు లింగం స్థాపించాడు.


16) చౌతస్సి ఘాట్...


ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 

64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... 

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 

64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.


17) రానా మహల్ ఘాట్...


ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.


18) అహిల్యా బాయి ఘాట్...


ఈమె కారణంగానే మనం ఈరోజు 

కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. 


కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.


పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.


కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. 


నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, 

మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.


కాశీ స్మరణం మోక్షకారకం...🙏


|| ఓం నమః శివాయ ||