22, జూన్ 2021, మంగళవారం

మనం చెప్పుకొనే సామెత

 మనకి తెలిసిన, మనం చెప్పుకొనే సామెత :-

ఇల్లు ఇరకాటం - ఆలి మర్కటం*.

అంటే ఇల్లు ఇరుకుగా ఉండాలి. భార్య కోతిలా ఉండాలి.

ఇల్లు ఇరుకుగా ఉంటే ఎవరూ మన ఇంటికీవచ్చి, ఎక్కువ రోజులు తిష్ట వెయ్యరు. భార్య కోతిలా ఉంటే ఆమెని ఎవరూ పట్టించుకోరు.

అని ఎవరో చేతకాని వాళ్ళు అసలు సామెతకి చేతబడి చేసేసారు.

కానీ అసలు ఈ సామెత వెనకాల మన సంస్కృతీ సంప్రదాయలు నిబిడీకృతమై ఉన్నాయని ఎంత మందికి తెలుసు????

 

        అసలు సామెత :-

" ఇల్లు ఇరు కవాటం - ఆలి మరు కవాటం**. "

అనగా " ఇంటికి ముందు, వెనుక రెండు(ద్వారాలు)తలుపులుండాలి.- భార్య తలుపు చాటుగా ఉండాలి. " అని దాని అర్థం.

ఇరు = రెండు.

మరు = చాటు, వెనుక.

కవాటం =  తలుపు.

'వాస్తు రీత్యా కానీ, భద్రతా రీత్యా కానీ ప్రతీ ఇంటికీ ముందు వైపు, వెనుక వైపు కూడా ద్వారం ఉండాలి.'

  ఇంటికి అతిథి కానీ, వేెరెవరైనా కానీ వచ్చినపుడు 'ఇల్లాలు ఎపుడూ కూడా తలుపు వెనుక నుండే సంభాషించాలి.'

ఇంత అర్థ వంతమైన సామెత. దీనిని మనం ఎంత వికృతమైన అర్థం లో వాడుతున్నామో కదా! హతోస్మి

ఆదిశంకరులు కైలాసగమనం

 ఆదిశంకరులు కైలాసగమనం


జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి 


జ్యేష్ఠ శుద్ధ ద్వాదశినాడు ఆదిశంకరులు కైలాస గమనం చేసినట్లు శంకరవిజయం చెబుతోంది. అయ్య కానుకగా అయిదు చంద్రమౌళీశ్వర లింగాలను, అమ్మ కానుకగా సౌందర్యలహరిని కైలాసం నుంచే శంకరులు తీసుకువచ్చారు. పరతత్వ నిరూపణ చేస్తూ, శ్రీవిద్యా రహస్యాలను బోధించే సౌందర్య లహరి పై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. 


శంకర వాజ్మయం మధురమైనది, శక్తివంతమైనది. ఎంత మధురమైనదో అంతే గంభీరమైనది. శాశ్వతత్వాన్ని సాధించుకున్నది. మంత్ర తంత్ర యంత్ర రహస్యాలకు అటపట్టు అయినా గౌడపాదుల సుభగోదయ స్తుతి ఆధారంగా సౌందర్యలహరిని శంకరులు రచించారు. దీనిని కైలాసం నుంచి తీసుకువచ్చారని కూడా విశ్వసిస్తారు. అనేక ఉపాసనా మర్మాలు, వేదాంత రహస్యాలు సౌందర్యలహరిలో శంకరులు నిక్షిప్తం చేశారు.


అందుకే శంకరుల కవితను మార్మీ సుకవిత్వం అన్నారు. లలితా సహస్రనామానికి వ్యాఖ్యానాన్ని కవితాత్మకంగా చెప్పినదే సౌందర్యలహరీ స్తోత్రం అనిపిస్తుంది. ఇది అనుభూతి కవిత్వం. ఇక సౌందర్య లహరిలో ప్రతిపదం మంత్రమయమే. అసలు సౌందర్య లహరి అనే పేరే ఒక మంత్రం 'సౌః - లం - హ్రీం' అనేవి మూడూ అమ్మవారి బీజాక్షరాలే. అందుకే సౌందర్యలహరి అనే పేరు తలచుకుంటేనే మంత్రం జపించిన ఫలితం కలుగుతుంది. సౌందర్యలహరీ స్తోత్రాన్ని వ్యాఖ్యాతలు రెండు భాగాలుగా విభజించారు. తత్వ రహస్యాలు, కుండలినీ యోగాలు, ఉపాసన మర్మాలు కలిగిన మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అని, చివరి 59 శ్లోకాలను సౌందర్యలహరి అన్నారు. మొదటి భాగంలో 'చిదానంద లహరీం, అంటూ రెండు సార్లు లహరి శబ్దం కనిపిస్తోంది. రెండో భాగంలోనే సౌందర్యలహరి అనే మాట వస్తోంది. తొలి భాగంలో లోతైన విషయాలెన్నో ఉంటాయి. ఇవి జ్ఞానయోగాన్నిస్తాయి. రెండో భాగంలో అమ్మవారి శిరస్సు మొదలుకుని పాదాల వరకూ రూపవర్ణన చేస్తారు. ఈ రూప వర్ణన సామాన్యునికి సైతం తేటతెల్లంగా బోధపడుతుంది. ధ్యానానికి అనువుగా ఉంటుంది. చదువుతుంటే అమ్మవారి రూపం కళ్లముందు కదలాడుతుంది.


శివుడంటే ఆనందం. అమ్మంటే సౌందర్యం అంటే అందం అని అందరం చెప్పుకునే అర్థం. అందమే ఆనందం కాదు. ఆనందంగా ఉండేదంతా అందమే. "ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్" అని ఉపనిషత్తులు చెబుతాయి. శంకరులు సౌందర్యలహరిలో చేసింది కూడా అదే. ఆనందమే సౌందర్యం అయితే సౌందర్య స్వరూపం ఏమిటి? చర్మమాంస ఆస్థిమయ శరీరంతో మనం ఊహించుకునేదే సౌందర్యమా అంటే ఆధ్యాత్మిక జగత్తులో రూపం కేవలం ప్రాథమిక స్థితి. రూప సౌందర్యాన్ని మెచ్చుకునే స్థితిని దాటి సాధకుడు మంత్ర సౌందర్యం వైపు దృష్టి మార్చాలి. ఆ తరువాత తత్వ సౌందర్యం, మహిమా సౌందర్యం, లీలా సౌందర్యం వంటివెన్నో ఉన్నాయి. మొత్తం మీద ఇంద్రియాలతో అనుభవించేది జడానందం. పరతత్త్వ ఉపాసనతో పొందేది చైతన్యమయమైన ఆనందం. చైతన్యశక్తి అమ్మ. ఆమెను తెలుసుకోవడమే చిదానందం.


లహరి అంటే ప్రవాహగుణం కలది అని అర్థం. సౌందర్య లహరి అంటే ప్రవహించే సౌందర్యం అని అర్థం. సర్వ జగత్తుకీ శక్తినందించే కాంతి తత్వం అమ్మ. బ్రహ్మాండాలకు ఆవల ప్రకాశిస్తూ సకల భువనాలపై నివసిస్తున్న అందరిపై వెలుగును ప్రసరిస్తుంది.

🙏🙏🙏

సేకరణ

https://chat.whatsapp.com/J2smXvOBzztJK9Nsz8h8oi

రేడియో--ఎప్పటికీ గుర్తుంచుకుంటాం!!!!

 Whats app message:

ఉదయం ఆరింటికి 

“ఆకాశవాణి విజయవాడ కేంద్రం.." 

అనగానే లేచి కూచునేవాళ్ళం. 

గబగబా దంతధావనం కానిచ్చేసి కాసిన్ని పాలు తాగేసి హోమ్ వర్కేఁవైనా వుంటే కానిచ్చేసి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికి పుష్పాంజలి మొదలయ్యేది.


సోమవారంనాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, మంగళవారం సూపర్‌మేన్ లో “శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా" అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో “నమో నమో హనుమంతా" అన్నపాటో...ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!


స్కూలునించి మధ్యాహ్నం భోజనానికి వస్తే “ఆకాశవాణి! ఈవార్తలు ఇంతటితో సమాప్తం!" అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో..ఎవరో ఒకరు పలకరించేవారు.


 “అన్నాలకి లేవండి! మళ్ళా ఆలస్యఁవైందంటారు!" అని అమ్మ తరుముతోంటే గబగబా తింటూ కార్మికుల కార్యక్రమం వినేవాళ్ళం.

చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు.

 సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పసిడిపంటలు మొదలయ్యేది. అంతే! పరుగోపరుగు. నడిచి స్కూలుకెళ్ళడానికి ఇరవై నిమిషాలు పట్టేది.


ఎప్పుడైనా సెలవురోజు ఇంట్లోవుంటే పసిడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీరాములు....

వీళ్ళంతా అవవ్వగానే “మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు!" అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం.

 ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచిమంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించిమరీ వినేవాళ్ళం.


రెండవ్వగానే ఇంగ్లీషులో వార్తలు..ఢిల్లీనించి ప్రసారమయ్యేవి. 

ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.


ఇక చాలు ఇళ్లకు వెళ్లి పొదాము

అనే పాట వినగానే మనసుకు హాయి గ ఉండేది.


ఇప్పుడు వాట్సప్పుల్లోను, ఫేస్ బుక్కుల్లోను కనబడే ‘ హ్మ్......., లోల్....., ఆర్వోఎఫ్ఫెల్....., కె..కె...(ఓకే ఓకే కొచ్చిన తిప్పలు)..ఇవన్నీ చదువుతోంటే నవ్వు, అసహ్యం, భయం....ఈమూడురకాల భావాలు ఒకేసారి కలుగుతున్నాయి.


నిన్నొకటి చూసాను. ‘డబ్ల్యూ సి' అని రాస్తున్నారు. చాలాచోట్ల చూసాక అడిగితే అది ‘వెల్ కమ్' అని చెప్పారు మా వంశోద్ధారకులు. 

నా సందేహమేంటంటే వీళ్ళు కొన్నాళ్ళకి వెల్ కమ్ స్పెల్లింగు మర్చిపోతారేమోనని!

సర్సరే! రేడియోలో వున్నాంకదా! 

ఇక గీత్ మాల గురించి మాటల్లో చెప్పలేను. హిందీ రాకపోయినా అందమైన హుషారైన మాటల వర్ణనలు చివరికి హిందీ పాటలు నోటికి వచ్చేలా అచ్చేసాంగ్స్.


ఇక ఆదివారాలు సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు. వి.బి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఏబియస్ రామారావు, పాండురంగ విఠల్... వీరందరూ ఎక్కువగా వినబడేవారు.

వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులమైపోయేవాళ్ళం. 

అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.


ఇప్పుడు మన యాంకర్లు, టీవీ డబ్బింగ్ ఆర్టిస్టులు, దుష్టచతుష్టయపు హీరోలు...

వీరందరూ మాట్లాడుతున్న భాష వినికూడా మనం బ్రతికున్నామంటే ఏదో బలమైన కారణం, మనవల్ల ఈ సమాజానికి జరగాల్సిన మంచి వుండివుంటాయి 

ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ మంచి పాటలవీ వేస్తుండేవారు. 

అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.


రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంచుకుంటాం!!!!


🌸🙏🌼🌼🙏🌸

కూలుతున్న ఆశాసౌధం

 కూలుతున్న ఆశాసౌధం 

ఆంధ్రుల ఆశాసౌధం-విశాఖ ఉక్కు కర్మాగారం 

ఆనాడు శాస్త్రీజీ చేసిన వాగ్ధానం..విశాఖ ఉక్కు 

కార్యక్రమం రూపు దాల్చుటకు ఉదయించిన ఉక్కు ఉద్యమం..దశాబ్దకాలం నిరాటంకంగా ఉద్యమపోరాటం

విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు నినాదం

అమృత రావు ఆత్మత్యాగం, అనేక బలిదానాలు 

అనంతరం-  పంట పొలాలను పణంగా పెట్టి 

భవిష్యత్తు పై ఆశలతో అధికారపాలకులకు 

అర్పించిన వైనం- ఇందిరమ్మ వేసిన పునాది..

కార్మికుల కృషితో అంచలంచలుగా ఎదుగుతున్న వైనం

ఉత్పత్తిని జాతికి అంకితం చేసిన ప్రధాని పీ వీ

ఆనాటి వేడుకలకు కట్టిన పచ్చని తోరణాలు వాడనే లేదు

మనసు పొరల్లో ఉద్యమ కారుల ఆవేదనాసెగలు చల్లారనే లేదు

లక్షల కోట్ల ధనం- వేల వేల కార్మికులు 

నిండా ఐదుపదులు దాటని ఉక్కు కర్మాగారం 

నిరంతర కృషి, దినదినాభివృద్ధితో కార్మిక స్వేదం 

నవరత్న హోదాను బహుమతిగా తెచ్చిన ఫలితం

మన్మోహన్ గారిచే ద్వితీయ ఉత్పత్తి శాఖ

ఆవిర్భావం గర్వంగా  నిలిచింది  

నలుగురు నేతలు అభివృద్ధి కి వేసిన బాటలు 

ఉద్యోగాల వేటలో ఉద్యమబాటలో ఊరట లేనేలేదు 

కష్టాలు..కన్నీళ్ళు కార్మికులకొదిలి కట్టలవెంట 

పరుగెడుతున్న ఓ రాజకీయ వర్గమా

పాపపు కూటమా..గనులు పంచనేలేదు 

బోనస్లు,యల్ టీ సీ లు ఎపుడో రద్దయినాయి 

అయినా, ఘనత సాధించిన కార్మిక ప్రగతిని 

మరుగుపరచే అవరోధాలెన్నో-ఎన్నెన్నో 

ఆధిపత్య గర్వమణచ సింహాలై గర్జించి

పారిశ్రామికవాడ పదిలపరచ సామాన్యుడు

ఉక్కు పిడికిలి బిగించి, తిరిగి సంఘటితమైన 

ఏమగునో-ఊహించగలమా?

శ్రమకోర్చు ఉద్యోగుల రక్త బిందువులే

అధికార దుర్వినియోగానికి  చరమగీతంతో

తరిమి తరిమి కొట్టు-కార్మిక మౌనం కాదు 

చేతకాని తనం-కార్మిక సంఘాల ఆక్రోశం 

అవధులు దాటిన, ఓర్పు సహనం ఊపిరిగా

జనించిన సంస్కార  సంపన్నులు 

నేడు భద్రత లేని భవిష్యత్తుకు బాధాతప్తులు

కలిగించెను నేడు మన భవితకు వేటు 

నమ్మకద్రోహుల సమైఖ్య-వెన్నుపోటు 

కార్మిక ఐక్యతతో--కాలానికి గాలం వేసి

"విశాఖ ఉక్కు--ఆంధ్రుల హక్కు ""అని 

జాతికి తెలియజేస్తాం-విజయం సాధిస్తాం

"జై విశాఖ ఉక్కు--జై జై విజయ విశాఖ ఉక్కు "" 

అదే ఆంధ్రుల హక్కు-- శీఘ్రం మనకి విజయం దక్కు

కూలుతున్న ఆశా సౌధాన్ని నిలబెడదాం...

నింగివైపు విజయపతాకం ఎగురవేద్దాం....


డాక్టర్ దేవులపల్లి పద్మజ, విశాఖపట్నం

బ్రహ్మ తత్వము

 *బ్రహ్మ తత్వము...(ఒక వ్యాఖ్య)*


బ్రహ్మ పదార్థాన్ని ఇది బ్రహ్మము అని వాక్కు ద్వారా వర్ణించి వేదం గూడా చెప్పలేదు. ఎవరూ  మనసు ద్వారా  కూడా బ్రహ్మాన్ని,  బ్రహ్మ తత్వాన్ని ఊహించి నిర్ణయించుకో లేరు. అంటే అది ఊహకు కూడా అందని విషయము. కానీ బ్రహ్మ పదార్థాన్ని వేదం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి, మరో విధంగా తెలుసు సుకోలేము అని  వేదం చెబుతుంది. ఈ మాటలన్నీ వేదం లోనే ఉన్నాయి.  ఇవి రెండు విరుద్ధమైన విషయాలు. బ్రహ్మాన్ని గురించి స్పష్టంగా చెప్పలేని వేదం బ్రహ్మాన్ని గుర్తించడానికి  ఎలా సహాయపడుతుంది. ఇది సమస్య.   వేదం వల్ల ఉపయోగం లేదు. మరో మార్గం లేదు. మరి బ్రహ్మాన్ని తెలుసుకునేది ఎలాగా. 


*ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆదిశంకరులు ఈ విధంగా చెప్పారు.* : 


పూర్వకాలంలో చిన్నతనంలోనే పెళ్లిళ్లు అయ్యేవి. పిల్లవాడు పెళ్లి కాగానే చదువుకోవడం కోసం కాశీ కి వెళ్లే వాడు. ఆ కాలంలో ప్రయాణ సాధనాలు లేనందున కాశీకి వెళ్లి చదువుకుని రావడం దాదాపు పది పన్నెండు సంవత్సరాలు పట్టేది. అసలు తిరిగి రావడమే చాలా గొప్ప. అలా ఒక చోట ఒక పిల్లవాడు కాశీనుంచి పదేళ్లకో  15 ఏళ్లకో తిరిగి వచ్చాడు. మొదటిసారి మళ్లీ అత్తగారింటికి  వచ్చాడు. ఇలా అల్లుడు కాశీకి వెళ్లి తిరిగి వచ్చాడని అత్తగారింట్లో చాలా పెద్ద ఉత్సవం చేశారు. పిల్ల తాలూకు స్నేహితురాళ్లు కూడా చాలామంది వచ్చారు. వాళ్లకు ఈ పిల్లవాడు ఎవరో తెలీదు. అమ్మాయి ని అడిగారు. అప్పటి సాంప్రదాయాల ప్రకారం పిల్ల తన భర్తను పేరు పెట్టి పిలవకూడదు వేలుపెట్టి చూపించకూడదు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ తెల్లగా ఉంటాడు, 25 ఏళ్లు, గడ్డం ఉంటుంది వంటి కొన్ని గుర్తులు  చెప్పింది. ఈ స్నేహితురాళ్లు వాకిట్లో కూర్చున్న వాళ్లలో ఆ లక్షణాలు ఉన్న ఒక ఐదారుగురు అబ్బాయిలను చూసి అందులో ఈ పిల్ల భర్త ఎవరో తెలియక ఒక్కొక్కరిని చూపిస్తూ, మళ్లీ ఈ అమ్మాయినే అడిగారు. అందులో ఒకరిని చూపిస్తే వాడు మా పిన్ని కొడుకని, ఇంకొకరిని చూపిస్తే వాడు మేనత్త కొడుకని ఇంకొకడిని చూపిస్తే వాడు అత్తగారి వైపు బంధువని ఇలా అమ్మాయి మిగిలిన అందరినీ, కాదు కాదు అని చెప్పింది. ఆఖరకు స్నేహితురాళ్లు అసలు పిల్లవాణ్ణి చూపించినప్పుడు ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఊరుకుంది. స్నేహితురాళ్ళ కు అతడే ఈ పిల్ల భర్త అని తెలిసిపోయింది. ఈ కథలో  ప్రశ్న ఏమిటంటే ఆ అమ్మాయి తన స్నేహితురాళ్ళకు తన భర్తను పరిచయం చేసిందా లేదా? ఆ స్నేహితురాళ్లు ఆ పిల్ల భర్తను ఎవరి సహాయంతో కనిపెట్టారు?


ఆదిశంకరులు చెప్పేదేమిటంటే వేదం కూడా అచ్చంగా ఆ కథలో అమ్మాయిలాగా పరబ్రహ్మ కు సంబంధించిన కొన్ని లక్షణాలను చెబుతుంది. పరబ్రహ్మ కాని వాళ్ళు ఎవరో  చాలా స్పష్టంగా చెప్తుంది. పరబ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ చెప్పకుండా ఊరుకుంటుంది. కాబట్టి వేదం ద్వారా పరబ్రహ్మాన్ని కనిపెట్టడం వీలవుతుంది. స్పష్టంగా చెప్పడం చెప్పకపోవడం  అనే వేద వాక్యాలలో విరోధం ఏమీ లేదు అంటారు ఆయన. 


దక్షిణామూర్తి స్తోత్రం లో ఆదిశంకరులు *"మౌనవ్యాఖ్యా ప్రకటిత"* అని వర్ణించింది కూడా ఇదే. 


*ఆఖరి మెట్టు దగ్గరికి వెళ్లే టప్పటికి పరబ్రహ్మాన్ని మౌనం ద్వారానే వ్యాఖ్యా నిస్తారు. ఎంత గొప్ప గురువు కైనా ఇంకో మార్గం లేదు.*


*పవని నాగ ప్రదీప్*

Old coins




 

ఇదు రూకలు


 

కాఫీ డబ్బా మూత

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*కాఫీ డబ్బా మూత తీయమనడంలో ఎంత చక్కని విషయం చెప్పింది ఈ బామ్మ! చూడండి!*


చుట్టూ అన్నీ పళ్ళ చెట్లు పూలచెట్లు, మధ్యలో అందమైన ఇల్లు, అందులో ఇద్దరే! బామ్మ, తాతయ్య ఉన్నారు. రోజూ సంధ్యవేళ ఆరు బయట ఆ తోటలో కాఫీ తాగుతూ కాసేపు గడుపుతారు.


పక్కింటిలోకి ఓ పెళ్ళైన కొత్త జంట దిగారు. వారు ఇరువురు ఉద్యోగం చేస్తారు. వారం చివరిలో ఈ బామ్మ, తాతయ్యతో కాసేపు గడిపేవాళ్లు.


వీరికి వారం అంతా పడ్డ శ్రమ ఆ ఒక్క సాయంత్రం అక్కడ గడిపేస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు. బాగా అలవాటైంది.

బామ్మ చేతి కాఫీ కూడా అందుకు ఒక కారణం.

 

బామ్మ కాఫీ డబ్బా తీసుకొచ్చి కాస్త మూత తీసిపెట్టబ్బా అని తాతయ్యను అడగడం,

ఆయన తన మీసం మెలేసి మూతను తీసివ్వడం, బామ్మ నవ్వుతూ వెళ్ళి నలుగురికి కాఫీ కలుపుకు వచ్చి ఇవ్వడం జరిగింది.


ఇలా రెండు వారాలు చూసిన జంట బామ్మకు కాఫీ మూత సులభంగా తీయగల సాధనాన్ని తెచ్చి ఇచ్చారు.

 

అయినా కూడా బామ్మ అదే తంతు! తాతయ్య దగ్గరకు తేవడం, మూత తీసివ్వమనడం!

 

ఇది చూసిన ఆ అమ్మాయి బామ్మతో పాటు వెళ్ళి 

బామ్మా నేను ఇచ్చిన సాధనం వాడలేదా? అని అడిగింది.

అందుకు బామ్మ చెప్పిన విషయం నిజంగా అర్థం చేసుకుని నడుచుకుంటే జీవితం ఇంత ఆనందంగా గడపవచ్చా! అని అనిపిస్తుంది.


*మూత తీయడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా!*

*నేను తీయగలను కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళలో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది.*


*నా భార్యకు అన్నీ నేనే! నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది.*


వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది.

ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది.


అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను అని చెప్పింది బామ్మ.


నిజమే కదండీ! మనిషి నావల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంతవరకు సంతోషంగా ఉంచొచ్చు కదా!


వయసు మీదపడ్డవారు ఏదైనా చేస్తాను అన్నప్పుడు అడ్డుపడకండి.

మీ వల్ల కాదు అని నిరాశను వారికి ఇవ్వకండి.

క్యాన్సర్‌కు ఔషధం



బ్లడ్ క్యాన్సర్

మెదడు క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్

పెద్దప్రేగు కాన్సర్

కాలేయ క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్

ప్రోస్టేట్ క్యాన్సర్

అండాశయ క్యాన్సర్


ప్రియమైన మిత్రులారా

అనేక క్యాన్సర్‌కు ఔషధం కనుగొనబడింది! ఫార్వార్డ్ చేయకుండా దయచేసి దీన్ని తొలగించవద్దు. నేను దానిని నేను గరిష్టంగా ఫార్వార్డ్ చేస్తున్నాను. ఇది 110 కోట్ల భారతీయులకు, మిగిలినవి ఏమైనా ఉంటే చేరనివ్వండి.


*"కర్కుమినాయిడ్స్"* అనేది అనేక క్యాన్సర్లను నయం చేసే ఔషధం. ఇది *"బెంగళూరులోని క్యాన్సర్ హెర్బలిస్ట్"* వద్ద సహేతుకమైన ఖర్చుతో లభిస్తుంది. అవగాహనను సృష్టించండి. ఇది ఎవరికైనా సహాయపడవచ్చు. మీకు వీలైనన్నింటికి ఫార్వార్డ్ చేయండి, దయకు ఏమీ ఖర్చవుతుంది.


*క్యాన్సర్* *హెర్బలిస్ట్*

*చిరునామా*: 6, డివిజి రోడ్,

గాంధీ బజార్, బసవనగుడి,

బెంగళూరు - 560004.

మైలురాయి: విద్యార్తి భవన్ హోటల్ దగ్గర


ఫోన్:

080-41218877

080-26601127

8884588835

cancerherbalist @ gmail.com


Request *అభ్యర్థన*: *వీలైనన్నింటికి ఫార్వార్డ్ చేయండి*

కాంతి- మానవ జీవన మనుగడ

 కాంతి వలననే మానవ జీవన మనుగడ.దీని ప్రధాన లక్య్షంచీకటినివపోగ ట్టివమనం చేయు కర్మలను దాని ప్రతిఫలమును లోక సంరక్షణకు మాత్రమే. ఉదాహరణకు వారైతే పంట 40 బస్తాలు తను వకడే తినడానికి కాదు. అనగా అతనికి స్వార్ధం లేదు. అలాగే పంచభూతములు కూడా భూమి అంతా వ్యాప్తి చెంది యున్నవి. మనం వక కారణం మాత్రమే. 

మనం లేకపోతే మన కాలపరిమితి తరువాత కూడా వాటి పని అవి చేస్తూ మానవ వునికిని కాపాడుతున్నది. యిదే పరమాత్మ దయతత్వం. ఆదినుండి అంతము వరకూ వున్న వకే తత్వం.అది మార్పు వలననే దాని గుర్తింపు.గాలి దాని పని చేయుచున్నది. అగ్ని,దానిపని అది చేయుచున్నది. అలాగే మానవుడు కూడా చేయు కర్మ ఫలితం ఆలోచన చేయకుండా చేయాలి. అదే భగవంతుని స్వరూపం .మన పని మనం చెయ్యాలి. మన వకరి గురీంచి కాదు .విశ్వ కళ్యాణ వ్యాప్తికి  మాత్రమే మన వునికి.అదియును ధర్మ పరంగానే నీ పనిని నీవు స్వధర్మంతో పద్ధతి ప్రకారం చేయుట భగవతత్వం. కాంతి సమాంతరంగా వ్యాప్తికి పరిమితి లేనియెడల, అనగా దాని ఆబ్జెక్ట్ లేనియెడల దాని లక్షణము తెలియదు. దాని లక్షణము, పదార్ధమును ఆశ్రయించినగాని కాంతి లక్షణము పదార్ధ లక్షణము కూడా తెలియదు. కాంతి భగవత్స్వరూపం పదార్ధం దేహము. దేహమును ఆశ్రయించిన కాంతి అగ్నిరూపంలో దేహమును చేరి పరిణామం చెంది జీవునిగా మారుటయే జీవ లక్షణము. మనం ఏదీ పరిపూర్ణముగా తెలుసుకోవడం లేదు. ఎందుకనగా మనకు అంత శక్తి లేదు. దానిని తెలియుటకై సాధన. ఎన్నో కోట్ల సంవత్సరాలనుండి కలిగిన పరిణామ క్రమమును దెలియుకు ఙ్ఞానం కావలెను. పూర్ణము రెండుగా మారినది, సమాంతరంగా శక్తి ప్రయాణం చేసినది కాని దాని వస్తు లక్షణము, అది తిరిగి మూడవ సూత్రముతో త్రీణి రెండుగా మారినది. యిచ్చట పూర్ణ తత్వం నాలుగు వస్తువులుగా భ్రాంతి. కాని దానికి శక్తి రెండు సార్లు మాత్రమే క్రియా పదం. ఉదా:౦ వకసారి చైతన్యం వలన రెండుగా మారినది. విసర్గ అయినది. క్రియ వకటి రెండుగా కనబడుచున్నది పైకి. కానీ వున్నది వకటే చైతన్యం వలన రెండుగా మారినది.తిరిగి మరోమారు చైతన్యం వలన రెండుగా మారి నాలుగు వస్తువులుగా మారి భ్రాంతి గా కనబడుచున్నది.రెం౦వ సార్ చైతన్యమైన రెండును విసర్గ పదార్ధ రూపం, అచ్చటనుండి నాలుగు గా మారి, అచ్చట నుండి అనంతమైనతత్వంగా గోచరించుచున్నది. టార్చ్ లైట్ కాంతియే దానికి ఉదాహరణ భగవతత్వం దేహాశ్రయమే. వక గీత _______దానికి పరిమితి లేదు. కానీ దాని గతి మారవలెను. కోణాకృతి దాల్చవలెను. అది ఊర్ధ్వకోణం గాని అధోకోణంగాని మారిన గాని ఆబ్జెక్ట్ తెలియదు. యిదే భగతక్తవతత్త్వ.త్రికోణశక్తి మూలమైన త్రిగుణాత్మకమైన త్రిమూర్తి తత్వం. ప్రలంబ ముష్టికంచ ఏవ మత్స్యః కూర్మ వరాహ నారసింహ వామన లక్షణములుకు  కాంతియే ముఖ్యం.కాంతి పదార్ధ రూపము,లక్షణ రూపం చెంది వస్తు రూపం దాల్చి అగ్ని తత్వమై ఆపై నీటి స్వభావము వలన సృష్టి సూక్మంగా మారి తెలియుచున్నది. దీనికి మనం కర్తలు మాత్రమే కారణము శక్తి రూపంలో దేహంలో గల భగవంతుడు అని ఆత్మ యని అదియే శక్తి రూపమని ఎవరికి వారే దీనిని నిర్ణయించుటకు ప్రకృతి ద్వారానే.శక్తి వ్యాప్త సూత్రము యింత స్పష్టంగా వివరించిన తెలియడం లేదు యనగా అజ్ఞానం వలన దీని సూత్రము తెలియుట లేదు.వస్తు రూపం కనిపించుచున్నది. కాని యిది యని యితమిధ్దంగా సత్యంగా తెలియుట లేదు. తెలియుటయే ఙ్ఞానం.

సామెతలు

 దున్నపోతు మీద వర్షం కురిసినట్లు !

* దూరపు కొండలు నునుపు !

* దురాశ దుఃఖమునకు చెటు !

* ఈతకు మించిన లోతే లేదు !

* ఎవరికి వారే యమునా తీరే !

* ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు !

* గంతకు తగ్గ బొంత !

* గతి లేనమ్మకు గంజే పానకం !

* గోరు చుట్టు మీద రోకలి పోటు !

* గొంతెమ్మ కోరికలు !

* గుడ్డి కన్నా మెల్ల మేలు !

* గుడ్డి యెద్దు చేలో పడినట్లు !

* గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు !

* గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా !

* గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు !

HOME MADE HEALTH DRINK

 HOME MADE HEALTH DRINK FOR ALL

గమనిక: ఈ వ్యాసాన్ని ఏదో కధ చదివినట్లుగా చదవక పూర్తిగా చదివి ఈ పొడిని  మీ ఇంట్లో మీరే చేసుకొని ఆరోగ్యంగా వుండాలని, మన ధనాన్ని విదేశీ కంపెనీలకు పోకుండా ఉండాలని వ్రాస్తున్నాను. 

మహిళలు: అమ్మలారా ఇక్కడ వివరించే తంత్రం చాలా సులువుగా తక్కువ ఖర్చుతో కొంచం శ్రమతో చేసుకొనవచ్చు.  అనవసరంగా ధనం వృధా చేయకుండా చక్కగా మీరు మీ కుటుంబ  ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

ఇక్కడ ఒక చక్కటి ఆరోగ్యాన్నిచ్చే హెల్త్ డ్రింక్ ను పేర్కొంటున్నాను..  ఈ రోజుల్లో మనం మార్కెట్లో దొరికే హెల్త్ డ్రింకులు అదే హార్లిక్స్, BORNIVITA , , ensure, ఏదైనా కానీయండి మీకు 200 కన్నా ఎక్కువ ధరకే 450 గ్రాములు లభిస్తున్నది. ఇంకా horlics వంటి కంపెనీలు వారి ఉత్పత్తులను విరివిగా అమ్ముకోటానికి జూనియర్, సీనియర్, వుమన్ అని రకరకాలుగా మనమీద బలవంతంగా రుద్దుతున్నారు. ఇక ensure ప్రకటనలైతే వృద్దులు యువకులకు వలె శక్తిమంతులు అవుతారన్నట్లు చూపెడుతున్నారు.  20 ఏళ్ళ బాలిక కారు టైర్ మార్చటానికి horlics  తాగితే బలం వస్తుందంటే ఇప్పుడు మీరు తెలుసుకునే డ్రింక్ చేసుకొని రోజు సేవిస్తే అదే వయస్సు వున్న బాలిక లారీ టైర్ మార్చగలదు అందుకు సందేహం లేదు. మీరు మీ ఇంట్లో తయారు చేసుకోండి వాడండి మీ కుటుంబంలో అందరు శక్తి వంతులు కండి . ఇది కేవలం శాకాహార ఉత్పత్తులతో చేసింది.  అందరు చేసుకోవచ్చు. 

ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.  

కావలసిన పదార్ధాలు: 1) మినపపప్పు 2) పాలు, 3) పంచదార 

చేసుకునే విధానం.: ముందుగా చక్కగా మేనపప్పుని నీళ్లలో కడుక్కొని ఒక గిన్నెలో నీళ్లు వంపి ప్రక్కన పెట్టుకోండి. తరువాత ఒక పాత్రను తీసుకొని దానిలో సగం వరకు చిక్కటి పాలను పోయండి.  పాలను స్టౌ మీద పెట్టి సన్నపు సెగలో కాచండి. పాలు కొంత కాగిన తరువాత మీరు వేరే గిన్నెలో ఉంచిన తడి మేనపప్పుని కొద్దీ కొద్దిగా వేయండి.  బాగా ఉడకనీయండి. యెట్లా అంటే మనం అన్నం పరమాన్నం చేసే విధంగా. పూర్తిగా ఉడికిన తరువాత పాలు మొత్తం పప్పు పీల్చుకుంటుంది. . అప్పుడు స్టవ్ ఆర్పీ కొంత సమయం అయ్యిన తరువాత అట్లా ఉడికిన దానిని ఒక పట్టమీద ఎండలో ఆరపెట్టండి. ఎండకు ఎండి మినపప్పు వరుగులాగా అవుతుంది. చేతితో పట్టుకుంటే గల గల లాడుతుంది. అట్లా కాక పచ్చిగా ఉంటే మరుసటి రోజు ఎండలో పెట్టండి. పూర్తిగా ఎండిన పప్పును మిక్సీలో వేసి తగు మోతాదులో పంచదార కలిపి పిండి చేసుకోండి. ఆ పిండిని ఒక సీసాలో పోసుకొని నిలువ ఉంచుకోండి. 

వాడే విధం: ఈ పొడిని రెండు విధాలుగా వాడ వచ్చు. 1) వేడి నీటిలో ఒకటి లేక రెండు చెంచాల పొడిని వేసుకొని కలుపు కొని టీ, కాఫి లాగ తాగ వచ్చు.  2) నీళ్లకు  బదులు వేడి పాలలో కూడా కలుపు కొని తాగ వచ్చు. 

ఎవరు సేవించ వచ్చు: ఈ డ్రింకును అన్ని వయస్సుల వారు ఎటువంటి సంశయము లేకుండా సేవించ వచ్చు. ఇది మంచి పుష్టిని, దండిని కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే మీరు శ్రార్ధగా తయారుచేస్తే హార్లిక్స్ కంటేకూడా రుచిగా ఉంటుంది. 

ఈ డ్రింకు అందరు త్రాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

60 దాటాక

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          60 దాటాక అన్నీ బాధలే!

                ➖➖➖✍


60 సంవత్సరాల వయస్సు దాటిన వాడి  గోడు:


  ఏఁ రోగాలో, మాయ రోగాలు ..! 

కమ్మగా కడుపు నిండా తినడానికి లేకుండా....


ఎవరినో అనుకుని ఏఁ ప్రయోజనం? స్వయంకృతం. ముచ్చట పడి కొడుకును డాక్టరీ చదివిస్తే వాడే కొరకరాని కొయ్యాలాగా అయ్యాడు. 


'అది తినొద్దు,ఇది తినొద్దు' అంటూ ఆంక్షలు. 


అసలు కంది పొడి, ఆవకాయ కాంబినేషన్లో పేరినెయ్యి నాలుక్కి రాసుకుంటూ తింటూ ఉంటే... ఆ మాటకొస్తే గోంగూర మాత్రం తక్కువా... శాకంబరీ దేవి ప్రసాదం... ఆంధ్ర శాకం... ఇంత వెన్న ముద్ద పక్కన పెట్టుకుని 

ఓ పట్టు పడదామంటే వీడు ఒప్పుకుంటేనా? ధప్పళంలో గుమ్మడొడియాలు .... ఆయిలుంటుంది... వద్దంటాడు... 

అసలు వేడి వేడి అన్నంలో మీగడ పెరుగు వేసుకుని మాగాయ ముక్క నంజుకుంటూ తింటూ ఉంటే... సాక్షాత్తు ఘటోత్కచుల వారే వచ్చి ఆశీర్వదించి వెళ్ళరూ?


అసలు గుత్తొంకాయ పొడి పెట్టి చెయ్యి తిరిగిన వాడు చేస్తేనా... 

ఆ మాటకొస్తే మా భ్రమరాంబ వండినట్లు గుత్తొంకాయ మరెవరూ వండలేరు..!


అలాంటిది... మా కుంక నా గుత్తొంకాయను కాశీలో 

నా చేత వదిలించేద్దాఁవని కాశీకి టికెట్లు తీస్తాడా?


ఆ కాశీ విశ్వేశ్వరుడు నాయందు దయతలచి రెండు సార్లు టికెట్లు రద్దు చేయించేసాడు కాబట్టి సరిపోయింది .... 


పైగా మా కుంక అంటాడూ .... 

‘ఎవరితోనైనా గుత్తొంకాయను కాశీ పంపించెయ్యనా?’ అని. 


"ఎంథ మాత్రం వీల్లేద"ని మా బ్రహ్మ గారు చెప్పబట్టి ఆగాడు గానీ లేకుంటే నా పేరు మీద ఎవరి చేతనో వదిలించేసే వాడు.


పొద్దున లేవగానే కోడలు పిల్ల ఒక 

'పేద్ద గ్లాసు'లో ఫిల్టర్ కాఫీ ఇస్తుంది.


ఆ గ్లాసు లోపలకు తొంగి చూడాలి .... 

కాఫీ ఎక్కడుందా? అని!


'కాకి ఒకటి నీటికి కావు కావుమనుచునూ ....' అంటూ చిన్నప్పుడు పాడుకున్న పాట గుర్తొచ్చి చిన్న చిన్న రాళ్ళ కోసం వెతుకుతుంటానా .... 'కాఫీ ఎక్కువగా తాగితే gas వస్తుంది మాఁవయ్య గారూ' అంటుంది. 

అసలు gas ఎందుకొస్తుందో తెలిసేడిస్తే కదా?


'హర్రీ, వర్రీ' అన్నారు .... 'కర్రీ’ అనేది ఈ మజ్జ చేర్చారని నా అనుమానం.


నా కాఫీ బాధ చూడలేక మా ఆఁవిడ 'ఇంకో గుక్కెడు ఇద్దూ పాపం ....' అంటుంది.


ఇంకొంచెం ఇస్తుంది ఆ పిల్ల ....!


'అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం' అనుకుంటూ తీర్ధంలాగా పుచ్చుకోడఁవే ...!


వాడైతే ఇంకు పిల్లరుతో పొయ్యమంటాడేఁవో?


ఇదివరకంటే స్నానం అయ్యి పూజ్జేసుకున్నాక గానీ టిఫినీ జోలికి వెళ్ళే వాడిని కాదు ...!


ఆ మధ్య గుమ్మడి గారు పలకరించినప్పటినుండి ముందు కడుపులోకి ఏదైనా వెళ్తే గానీ కుదరదంటూ మా వాడు మొండికేయడంతో తప్పడం లేదు.


ఏదో నాలుగిడ్లీలు తింటే కొంపలంటుకు పోయినట్లు హడావిడి .... భోజనానికి ఒకటిన్నర దాకా ఆగాలా? మరి అప్పటి లోపల ఆకలేస్తే? అని ఘఠ్ఠిగా నిలదీస్తే ఇదుగో ఈమధ్యనే వేరుశనగ పప్పు ముందు రోజు నానబెట్టి, మర్నాడు ఉడకబెట్టి పెడుతున్నారు .... ఒక కేరట్టుతో సహా .... అసలా కేరట్టు మనది కాదట. విదేశాలనుండి వచ్చిందట. దానికి మన ఆచారాలు వగైరాలు ఏం తెలుసు? అంటే 'దానికి ఆచారం ఏఁవిటి నాన్న గారు' అంటాడు మా వాడు.


అసలు వీటన్నిటికి మూల కారణం అదుగో .... అప్పుడు ఆసుపత్రిలో చేరినప్పటినుండి మొదలయింది.


ఒంటి నిండా చెమటలు పట్టి, ఎడం చెయ్యి లాగేస్తుంటే గుండెపోటని ఆసుపత్రికి పట్టుకుపోయారు. 


వాళ్ళు ఓ వారం అట్టే పెట్టుకుని 'హెల్తు కార్డు' లేదని తెలిసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ చేసారు .... మందులతో నయమౌతుందని.


అదుగో ఆ డిశ్చార్జ్ సమయంలో మొదలయింది ఈ ఆంక్షల గోల .... ఇరాన్ వాడి మీద అమెరికా వాడి ఆంక్షల్లాగా ....


ఇంకో గంటలో బైటకొస్తాననగా కాస్త కాలు సాగినట్లుంటుందని రూమ్ బైటకొచ్చా.


ఎదురుగా ఓ బల్లేసుకుని ఓ అమ్మాయి 

కూర్చునుంది .... బల్ల మీద కాదు .... బల్లకెదురుగా కుర్చీలో ...!


నన్ను చూడగానే 'బాబాయి గారు, ఒకసారి ఇలా రండి' అన్నది 


'సరే కదా'ని వెళ్ళా.


"ఎవరమ్మా నువ్వు?" అని అడిగా.


"నేనిక్కడ డైటీషియన్ అండి" అన్నది.


నాకు మరోలా వినపడింది.


"బ్యూటీషియన్ కు ఆసుపత్రిలో ఏం పని?" అన్నా.


"హయ్యో, బాబాయ్ గారు, బ్యూటిషియన్ కాదు, డైటీషియన్ .... అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్న విషయాల గురించి చెబుతానన్నమాట" అన్నది.


నాకు మండదూ? "మా అమ్మ నా చిన్నప్పుడే నేర్పింది ఎలా తినాలో నాకు .... నువ్వేం చెప్పనవసరం లేదు" అన్నా.


ఇంతలో మా ఆఁవిడొచ్చి నన్ను రూమ్ లోపలకు తీసుకెళ్ళి మళ్ళీ బైటకొచ్చి ఆ డైటీషియన్ తో కాసేపు ముచ్చట్లాడి 'వచ్చే శ్రావణ మాసం నోఁవులకు తప్పకుండా రావాలమ్మాయ్' అంటూ వచ్చేసిందాఁవిడ.


ఆ పిల్ల ఏం చెప్పిందో గానీ ఆ నాటి నుండి 

నా కష్టాలు మొదలయ్యాయ్ ....


అరే .... ఓ గుత్తొంకాయ లేదు, ఓ కందా బచ్చలి లేదు, ఓ దోసావకాయ లేదు .... నెయ్యైతే దాచేసారు ....ఏఁవి తిండది?


అసలు నా చిన్నప్పుడైతే మా సత్యవతత్తయ్య రోట్లో వేసి కంది పచ్చడి రుబ్బుతుంటే అక్కడక్కడే తిరిగే వాణ్ణి .... పోనీలే చిన్న వెధవ అని ఆఁవిడ రుచికన్నట్లు పొత్రం చుట్టూ వేలు తిప్పి ఇంత పచ్చడి చేతిలో పెట్టేది .... 'ఉప్పు సరిపోయిందా?' అంటూ ....


అంతా తినేసి ఉప్పు 'సరిపోయిందత్తయ్యా, కారం సరి పోయిందో లేదో చూళ్ళేదు' అంటూ మళ్ళీ చెయ్యి చాపే వాణ్ణి.


'వెధవకు పొట్టనిండా తెలివి తేటలే' అంటూ మారు వడ్డించేది. అప్పటినుండి తెలివి తేటలు పొట్టలో ఉంటాయనుకుని ఆ పొట్టను జాగ్రత్తగా కాపాడుకుంటూ  వస్తున్నా ....


అలా కాపాడుకుంటూ వస్తున్న దాన్ని ఇవాళ ఇలా ఎండ బెట్టేస్తే నా తెలివి తేటలన్నీ ఏఁవై పోవాలి?


ఇహ భోజనాల దగ్గరకొస్తే ఆఁవిడా, కోడలు చెఱో పక్క కాపలా ....


వంద గ్రాముల కంటే ఎక్కువ తినకూడదట. 


'వంద గ్రాముల బియ్యఁవేఁవోనే?' అంటే 


'కాదు వండిందే వంద గ్రాములం'టుందాఁవిడ.


"ఐటమ్ కు వంద గ్రాములేఁవో? సరిగ్గా కనుక్కున్నావా ఆ పిల్లను?" అంటే 'అన్నిటికీ కలిపి వంద గ్రాముల'ట.


ఆ లెఖ్ఖన కూర, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు .... ఒక్కొక్క దానికి ఇరవై గ్రాములు. అంటే ఐదు వేళ్ళు పెట్టి కలిపితే వేలుకు నాలుగు గ్రాములు తేలింది. బంగారం తూకంలాగా ....


అసలలా తింటే మందులు వేసుకోడానికైనా నేనుండాలిగా? అంటే వినిపించుకోరు. 


బరువు అరవై దాటకూడదట. కొత్త రూలొహటి. అప్పటికీ నమకం, చమకం వింటూ వాకింగ్ చేస్తా. మృత్యుంజయ మంత్రం అష్టోత్తరం అయ్యేసరికి గంట పడుతుంది. ఐనా 'బరువు తగ్గాలండి' అంటే నేనిక ఏకాదశం నడవాలి.


"బతికినంత కాలం బతకనురా. కమ్మగా తిననివ్వండర్రా" అంటే ....


"ఒక్కగానొక్క నాన్నవు ...." అలా అన్నాడో లేదో


"అదేం మాటరా అప్రాచ్యుడా .... ఎంతమంది నాన్నలుంటారేఁవిటి?" అంటూ ఆఁవిడ కోప్పడేసింది వాణ్ణి .... భుజం మీదగా కొంగు కప్పుకుంటూ ....


"వాణ్ణి అపార్ధం చేసుకోకు రాజ్జం. వాడేదో తాపత్రయంలో అనేసాడు" అని సర్ది చెప్పాల్సొచ్చింది.


దంపుడు బియ్యం తిన్న శరీరఁవాయె .... ఏదో పని వత్తిడి వల్ల అలా ఆసుపత్రి వాడి పూర్వ జన్మ బాకీ చెల్లించా గానీ లేకుంటే ఇవాళ ఇంతమంది కాపలాలో జైల్లో ఖైదీ లాగా తూకం భోజనం ఏఁవిటో?✍


60 దాటాక  అన్నీ   బాధలే  😩


                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఉపోద్ఘాతం..*


శ్రీ దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర వ్రాసేటప్పుడు మా తల్లిదండ్రులు శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్ల అనుభవాలను ప్రస్తావించడం జరిగింది..నాకు శ్రీ స్వామివారితో పరిచయం ఏర్పడ్డ నాటినుంచి, శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందేదాకా..ఆ తదుపరి నేను శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి ధర్మకర్తగా బాధ్యతలు తీసుకునే దాకా..అప్పటినుండి నేటిదాకా..నా పరంగా శ్రీ స్వామివారితో గల అనుభవాలను..మా దంపతులము పొందిన అనుభూతులనూ..నేటి నుంచి ధారావాహికంగా ఈ సోషల్ మీడియా అనబడే మాధ్యమం ద్వారా అందించాలనే ప్రయత్నమిది.. ఆదరిస్తారని ఆశిస్తున్నాను..


గురువారం...1972, మే, 11 వతేదీ...


ఆరోజు ఉదయం 6.30 గంటలకు మా అమ్మా నాన్న గార్లు, (శ్రీ పవని శ్రీధర రావు, నిర్మల ప్రభావతి గార్లు) మాలకొండ వెళ్ళడానికి తయారవుతూ..అక్కడ తపస్సు చేసుకుంటున్న యోగి గురించి , వేసవి సెలవులకు మా ఊరొచ్చిన నాకూ, మా చెల్లెలు గాయత్రికీ ఎంతో గొప్పగా చెప్పారు..


ఎలాగూ గూడు బండి సిద్ధం చేసారు.. మేమూ వస్తామని చెప్పాము..వాళ్ళూ మమ్మల్ని స్వామి వద్దకు తీసుకెళ్లాలని అనుకున్నారు కనుక వెంటనే మమ్మల్నీ తయారవమని చెప్పారు..


ఇంతలో..కందుకూరు నుంచి తహసీల్దారు గారు మొగలిచెర్ల వస్తున్నారనీ, నాన్న గారిని ఇంటి వద్దే ఉండమన్నారనీ ఓ మనిషి వచ్చి చెప్పాడు..కొద్దిగా నిరాశ..రెండురోజుల్లో మళ్ళీ వెళదామని నాన్న చెప్పారు..సరే నన్నాము..


నాకెందుకో నడచి అయినా వెళ్లి చూసొద్దామని(దాదాపు 8కిలోమీటర్ల దూరం) అనిపించింది..అదే మాట నాన్నగారిని అడిగాను..నవ్వారు..నీ ఇష్టం అన్నారు..అమ్మే కోప్పడింది.."ఎండాకాలం..అంతదూరం నడిచి పోతావా..మళ్ళీ బెట్ట కొట్టి అడ్డంపడితే ఎలా" అంటూ..ఏం కాదులేవే..అని చెప్పాను..మొత్తానికి ఒప్పుకున్నది.. ఓ హార్లిక్స్ సీసా నిండా మజ్జిగ పోసిచ్చింది..


"ఇదుగో..ఆయన మౌనం లో వుంటే, నువ్వు ఏమీ మాట్లాడకు..చూసి, నమస్కారం పెట్టుకుని వచ్చేయ్.."అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్పింది..అన్నిటికీ తలూపాను..వచ్చేటప్పుడు ఎండకుపయోగపడుతుందని టవల్ కూడా తీసుకున్నాను..అమ్మకు, నాన్నకు చెప్పి ఇంట్లోనుంచి బైటకు వచ్చాను..


పక్కింట్లో ఉండే నా స్నేహితుడు, వెంకట్రాముడిని కేకేసాను..వచ్చాడు..ఇలా అని చెప్పి వస్తావా అన్నాను...వెంటనే రైటో అన్నాడు..


"బావా మళ్లీఎప్పుడొస్తాము?" అన్నాడు..


"చెప్పలేము..ఆయన కనపడే దాకా ఉండాలి కదా!" అన్నాను..(వాడు ఇప్పటికీ నన్ను బావా అంటాడు..తాగుడుతో భ్రష్టు పట్టాడు..)..


"సాయంత్రానికి గొడ్లు(పశువులు) వచ్చేలోపల తిరిగొద్దాము " అనే ఒప్పందం మీద నాతో రావడానికి తయారయ్యాడు..


అలా నడచుకుంటూ, అడవిలో కబుర్లు చెప్పుకుంటూ..ఇద్దరమూ మాలకొండ లో ఆవలి వైపున ఉండే పార్వతీ అమ్మవారి మఠానికి చేరాము..సమయం దాదాపు తొమ్మిదిన్నరయింది..తలుపులు వేసి ఉన్నాయి..ముందున్న అరుగు మీద కూర్చున్నాము..


10 నిమిషాల లోపే, తలుపుతీసుకుని, ఆరడుగుల పైనే ఎత్తుతో..తెల్లని శరీర ఛాయ తో, దిగంబరంగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు బైటకు వచ్చారు..


మమ్మల్ని చూసి...


"ఎవురు మీరు? యాడ నుండి వచ్చినారు" అంటూ పల్లెటూరి యాసతో అడిగారు..మాది మొగలిచెర్ల అనీ, శ్రీధర రావు గారి అబ్బాయిననీ, వీడు వెంకట్రాముడని నా స్నేహితుడనీ చెప్పాను..


"అమ్మా నాయనా బాగుండారా?" అని అడిగారు..తలూపాను..నాకు ఏం మాట్లాడాలో తెలీడం లేదు..ఏదో తెలియని ఆకర్షణ ఆ కళ్ళలో ఉన్నది..ముఖం స్వచ్ఛంగా ఉంది..చల్లటి చిరునవ్వు..


"నన్ను చూద్దామని వచ్చారా?"అన్నారు..ఔనన్నట్లుగా తలూపాను..


ఏం చదువుతున్నదీ, ఎక్కడ చదువుతున్నదీ అడిగారు..అమ్మా నాన్న గార్ల గురించి క్షేమ సమాచారం అడిగారు.చెప్పాను..


పార్వతీ అమ్మవారి విగ్రహం పక్కన ఉన్న కుండ లోంచి ఒక గ్లాసుతో నీళ్లిచ్చారు..తీసుకొని త్రాగాను..


"జాగ్రత్తగా వెళ్ళండి..ఎండ ఎక్కువ కాకముందే ఇల్లు చేరండి!.." అని చెప్పి..పార్వతీదేవి మఠం లోపల ఉన్న అరుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చుని కళ్ళుమూసుకున్నారు..


మేమిద్దరమూ ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని..అక్కడనుంచి బైటకు వచ్చేసాము..


శ్రీ స్వామివారి సన్నిధిలో దాదాపు ఓ అరగంట పైనే ఉన్నాము..ఒక్క క్షణం కూడా ఆయన దిగంబరి అన్న స్పృహే లేదు..అర్ధమయ్యే జ్ఞానమూ లేదు..


అదీ... మొదటి సారి  స్వామి వారితో నా అనుభవం..అప్పుడు నాకు 12 ఏళ్ళ వయసు...


మళ్ళీ నా 43 ఏళ్ళ వయసులో...ఆ స్వామి వారి మందిరానికి ధర్మకర్తగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది..ఆనాటి మా తల్లిదండ్రుల ఆశీస్సులే ఇప్పటికీ నాకు రక్షగా ఉన్నాయి...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్...శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్: 523114...సెల్..94402 66380 & 99089 73699).