10, జులై 2020, శుక్రవారం

శ్రీ చక్రరాజనిలయా శ్రీమత్సింహాసనేశ్వరి

ఓం నమః శివాయ:

*బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ
మన్వస్రనాగదళ షోడశపత్రయుక్తమ్||*
*వృత్తత్రయం చ ధరణీ నత్రయంచ
శ్రీ చక్రరాజ ఉదితః పరదేవతాయా||*
ఓం నమః శివాయ:
శ్రీ చక్రరాజనిలయా శ్రీమత్సింహాసనేశ్వరి
ఓంశ్రీమాత్రే నమః
అద్వైత చైతన్య జాగృతి
*చక్రరాజ రథారూఢ సర్వాయుధ 
పరిష్కృతా*

          చక్రరాజము అను పేరుగల రథములో ఉంచబడిన సమస్తమైన ఆయుధములచేఅలంకరింపబడిన తల్లికి నమస్కారము ( శ్రీ చక్రమునకు కూడా  చక్రరాజము అను పేరు ఉన్నది.) .

                చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా

అన్నిరకాలయిన ఆయుధములతోనూ అలంకరించబడిన 'చక్రరాజము” అనేరథాన్ని
పరమేశ్వరి అధిరోహించింది. రథాలలో కూడా రకాలున్నాయి అని రథశాస్త్రము చెబుతోంది.
అందులో ముఖ్యంగా మూడురకాలున్నాయి. 
1. చక్రరాజము. 
2 గేయచక్రము
3. కిరిచక్రము. 
లలితోపాఖ్యానంలో ఈ విషయాన్ని వివరిస్తూ...


ఆనందధ్వజసంయుకో నవభిః పర్వభి ర్యుతః

దశయోజన మున్నమః చతుర్యోజన విస్తృతః

మహారాజ్ఞాశ్చక్రరాజరథేంద్రః ప్రచలన్‌బభౌ ॥

ఆనందధ్వజముతో కూడినది. తొమ్మిది పర్వముల (ఆవరణలు)తో కూడినది.
పదియోజనాలఎత్తు నాలుగుయోజనాల వెడల్పు గలిగినటువంటిది దేదీప్యయమానముగా ప్రకాశించునది అయిన చక్రరాజము అను రథమును పరమేశ్వరి అధిరోహించెను. ఈచక్రరాజరథమే శ్రీచక్రము.


శ్రీచక్రము అంటే చరాచరజగత్తే కాని వేరు కాదు. అందుకే భైరవయామళంలో

శ్రీచక్రాన్ని గురించి పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరిస్తూ

శ్రీచక్రంత్రిపురసుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ ।

పంచభూతాత్మకంచైవ తన్మాత్రాత్మక మేవ చ॥

ఇంద్రియాత్మక మేవం చ మన స్తత్వాత్మకం తథా ।

మాయాదితత్త్వరూపం చ తత్వాతీతం చ బైందవమ్‌ ॥

ఓ పరమేశ్వరీ ! శ్రీచక్రము అంటే సామాన్యమైనటువంటి ఒక చిన్న యంత్రం
కాదు. అది ఈ బ్రహ్మాండం మొత్తానికి ప్రతీక. ఏరకంగా అంటే...


సృష్టికి కారణం పంచభూతాలు, తన్మాత్రలు, సృష్టి ఆరంభంలో మొట్టమొదటగా
తన్మాత్రలు ఏర్పడ్డాయి. అవే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఆ తరువాత తన్మాత్రల
స్థూలరూపాలయిన పంచభూతాలు ఏర్పడ్డాయి. అవి పృథివి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము.


ఇవన్నీ పంచీకరణం చెందినాయి. అప్పుడు పంచభూతాలు, తన్మాత్రలు విడివిడిగా 15
భాగాలయినాయి. ఆ తరువాత ఇవి గుణత్రయంతో కలిసాయి. అప్పుడు ఈ సృష్టి
జరిగింది. కాబట్టి సృష్టికి మూలమైనటువంటివి పంచభూతాలు, తన్మాత్రలు. అవి రెండూ
శ్రీచక్రంలోనే ఉన్నాయి. అంటే పంచభూతాల, తన్మాత్రలతత్వాలు శ్రీచక్రంలో ఉన్నాయన్న
మాట. కాబట్టి శ్రీచక్రమే చరాచరజగత్తుకు ప్రతీక. అందుచేతనే శ్రీచక్రాన్ని అర్చించినటైతే
చరాచరజగత్తును అర్చించినట్లే. జగత్తు అంటే కేవలము అడవులు, కొండలు, చెట్లు,
పుట్టలతో కూడిన భూమి మాత్రమే కాదు. దానిమీద ఉండే జీవజాలము కూడా. శ్రీచక్రంలో
ఇంద్రియాలున్నాయి అన్నారు. అని రెండు రకాలు. 1. జ్ఞానేంద్రియాలు. 2. కర్మేంద్రియాలు.
ఈ ఇంద్రియాలు ప్రతిపాణికీ ఉంటాయి. అందుచేతనే ఆహారనిద్రా మైధునాలు అన్ని
జీవులకు సామాన్యము అని చెప్పబడుతోంది. ఈ రకంగా దశేంద్రియాల తత్వాలు
శ్రీచక్రంలో ఉన్నాయి కాబట్టి శ్రీచక్రం చరాచరజగత్తులోని జీవరాశి కంతటికీ ప్రతీక.
అయితే ఈ జీవరాశిలో మానవుడున్నాడా ? అన్నదే ప్రశ్న మిగిలిన జీవరాశికి లేనిది,
మానవుడికి ఉన్నది ఒక్కటే. అదే మనస్సు. సంకల్పవికల్పాలకు కారణమైంది మనస్సు.
దీనికారణంగానే మానవుడికి యుక్తాయుక్తవిచక్షణాజ్ఞానం కలుగుతోంది. ధర్మాధర్మాలను
విచారించగలుగుతున్నాడు. మరి ఆ మనస్సు యొక్క తత్త్వము కూడా శ్రీచక్రంలోనే ఉన్నది. కాబట్టి శ్రీచక్రము జగత్తులోని మానవాలికంతటికీ ప్రతీక. అందుచేతనే శ్రీచక్రానికి
అంత గొప్పతనం ఉన్నది. శ్రీచక్రాన్ని గనక పూజించినట్లైతే చరాచరజగత్తునూ అర్చించినట్లే.
విశ్వమానవాళినంతటినీ సేవించినట్లే. శ్రీచక్రపూజచెయ్యటమంటే తనను తాను
గౌరవించుకోవటం తప్ప వేరుకాదు.


ఈ జగత్తుకు అధిపతి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు ? అని అడిగితే - జగత్తులోని ప్రతి వస్తువునందు ఉంటాడు. చరాచరజగత్తంతా పరమేశ్వరమయం ఈ జగత్తే శ్రీచక్రం అయినప్పుడు మరి ఆ పరమేశ్వరి శ్రీచక్రంలోనే కదా నివశించేది.
అందుచేతనే చక్రరాజము అనే రథాన్ని అధిరోహించింది పరమేశ్వరి.


ఇక మంత్రశాస్త్రంలోకి వెడితే ప్రపంచసార సంగ్రహంలో

బిందుత్రికోణ కాష్టావతారయుగ లోకకోణవృత్తయుతమ్‌

వసుదళవృత్త కళాదళవృత్త త్రిమహీగృహం భజే చక్రమ్‌!!


బిందువు, త్రికోణము, అష్టకోణము, పదికోణములుగల చక్రములు రెండు, పధ్నాలుగుకోణములుగల చక్రము. వృత్తము, అష్టదళము, వృత్తము, షోడశదళము,
వృత్తము, భూగృహము అనే ఆవరణలున్నాయి.


బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ

మన్వశ్రదళ సంయుత షోడశారమ్‌ ॥

వృత్తత్రి భూపుర యుతం పరితశ్చతుర్ద్వాః

శ్రీచక్ర మేత దుదితం పరదేవతాయాః ॥

ఈ రకంగా శ్రీచక్రంలో ఉండే ఆవరణలు అనేకచోట్ల చెప్పబడ్డాయి.


అయితే శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలున్నాయి. వాటన్నింటికీ కూడా విడివిడిగా
పేర్లున్నాయి. రత్నాయరుషి వ్రాసిన ఆవరణ దేవతాస్తుతిలో వాటిని వివరించటం జరిగింది.

త్రైలోక్యమోహనం వందే సర్వాశాపరిపూరకమ్‌

సర్వసంక్షోభణం చక

్రం సర్వసౌభాగ్యదాయకమ్‌ ॥

సర్వార్థసాధకం చక్రం సర్వరక్షాకరం పరమ్‌

సర్వరోగహరం చక్రం సర్వసిద్ధిప్రదాయకమ్‌

సర్వానందమయం చక్రం ఇతి చక్రక్రమంభజే

1. ప్రధమావరణ భూపురము త్రైలోక్యమోహనచక్

రము

2. ద్వితీయావరణ షోడశదళము - సర్వాశాపరిపూరకచక్రము
3. తృతీయావరణ అష్టదళము - సర్వసంక్షోభణచక్రము

4. చతుర్థావరణ చతుర్దశారము - సర్వసౌభాగ్యదాయక చక్రము
5. పంచమావరణ బహిర్దశారము - సర్వార్ధసాధకచక్రము

6. షష్టావరణ అంతర్జశారము - సర్వరక్షాకరచక్రము

7. సప్తమావరణ అష్టకోణము - సర్వరోగహరచక్రము

8. అష్టమావరణ త్రికోణము - సర్వసిద్ధిప్రదచక్రము

9. నవమావరణ బిందువు - సర్వానందమయచక్రము

ఈ రకంగా నవావరణలున్నాయి. వీటిలో వృత్తత్రయం మాత్రం లేదు అని గుర్తించాలి. ఏ సంప్రదాయంలోనూ కూడా వృత్తత్రయానికి పూజలేదు.


భండాసురుని యొక్క వేదవిద్యలకు విరుద్ధమైన చర్యలకు పరమేశ్వరి ఆచరించే
దండనలే ప్రతి క్రియలు. అవి ప్రకృతులు, పరివారదేవతలు ఆవరణదేవతలు,
ఆయుధదేవతలుగా చెప్పబడుతున్నారు.


శ్రీచక్రంలో ఉన్న తొమ్మిదిఆవరణలే, దేవికూర్చునే రథానికి పర్యములుగా ఉన్నాయి.
ఈ ఆవరణలలో ఒక్కొక్క ఆవరణకు కొంతమంది దేవతలున్నారు. వారే ఆవరణ దేవతలు.


1. మొదటి ఆవరణ : ఇది భూపురము. త్రైలోక్యమోహనచక్రము. ఇందులో మూడు
రేఖలున్నాయి. ఈ మూడు రేఖలు భూలోక భువర్లోక సువర్లోకాలకు ప్రతీక. ఈ ఆవరణలో
ఉండే దేవతలవివరాలు.


ప్రధమరేఖలో అష్టసిద్ధులు ఉంటాయి.

1. అణిమాసిద్ధి 4. మహిమాసిద్ధి 7. ప్రాకామ్యసిద్ధి
2. లఘిమాసిద్ధి 5. ఈశిత్వసిద్ధి 8. ప్రాప్తిసిద్ధి
3. గరిమాసిద్ధి    6. వశిిత్వసిద్ధి 9. సర్వకామసిద్ధి.
రెండవరేఖలో అష్టమాత్రుకలు ఉంటాయి.

1. బ్రాహ్మి        4. వైష్ణవీ     7. చాముండా
2. మాహేశ్వరి 5. వారాహీ  8. శ్రీమహాలక్ష్మి
3. కౌమారీ      6. మాహేంద్రి


మూడవరేఖలో ముద్రాశక్తులు ఉంటాయి.

1.సర్వసంక్షోభిణీ   
2.సర్వవిద్రావిణీ         
3.సర్వాకర్షిణీ    
4. సర్వవశంకరీ    
5. సర్వోన్మాదినీ
6.సర్వమహాంకుశా
7. సర్వఖేచరీ
8.సర్వబీజా
9.సర్వయోనిః

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా. ఇక్కడ ఉండే యోగిని పేరుప్రకటయోగిని.


2. రెండవ ఆవరణ : ఇది షోడశదళపద్మము. అనగా 16 దళాలు ఉన్నటువంటి పద్మము. చంద్రకళాస్వరూపము. ఈ పదహారుదళాలలోను చంద్రుని యొక్క పదహారు
కళలు ఉంటాయి. ఆ కళలన్నీ ఆకర్షణ దేవతల రూపంలో ఉంటాయి. అవి

1.కామాకర్షిణి                
2.బుద్ధ్యాకర్షిని          
3.అహంకారాకర్షిణి్      
4.శబ్దాకర్షిణి.           
5.అమృతాకర్షిణి . 
6.రూపాకర్షిణి 
7. రసాకర్షిణి
8. గంధాకర్షిణి   
9. చిత్తాకర్షిణి 
10.స్పర్శాకర్షిణి
11. స్మృత్యాకర్షిణి
12.శరీరాకర్షిణి
13. బీజాకర్షిణి
14. ఆత్మాకర్షిణి
15. ధైర్యాకర్షిణి 

12. నామాకర్షిణి
ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశి. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తయోగిని.


౩. మూడవ ఆవరణ : ఇది సర్వసంక్షోభణ చక్రము. 
8 దళాలు గల పద్మము.

అష్టమూర్వాత్మకము. దీని ఎనిమిది దళాలలోను విడివిడిగా ఉండే దేవతలు.
ప్టమూర్యాత్మ!

1.అనంగకుసుమా        
2అనంగమేఖలా  
3అనంగమదనా 
4.అనంగమదనాతురా
5. అనంగరేఖా
6. అనంగనవేగినీ
7.అనంగాంకుశా
8. అనంగమాలినీ

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురసుందరి. ఇక్కడ ఉండే యోగిని పేరు

గుప్తతరయోగిని.


4, నాల్గవ ఆవరణ: ఇది సర్వసౌభాగ్యదాయకచక్రము. చతుర్దశారము. అంటే 14

కోణాలుగల పద్మము ఇందులోని 14 కోణాలు 14 లోకాలకు ప్రతీక. ఇక ఇక్కడ ఉండే
దేవతల వివరాలు.

1.సర్వ సంక్షోభిణీ
2.సర్వవిద్రావిణీ 
౩. సర్వాకర్షిణీ
4. సర్వాహ్లాదినీ
5. సర్వసమ్మోహినీ
6.సర్వస్తంభినీ

7.సర్వజృంభిణీ  
8.సర్వమంత్రమయీ
9 సర్వవశంకరీ  
10 సర్వద్వంద్వక్షయంకరీ
11. సర్వార్థసాధినీ
12. సర్వసంపత్తిపూరిణీ
13. సర్వరంజనీ
14.సర్వోన్మాదిని

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురవాసిని. ఇక్కడ ఉండే యోగిని పేరు

సంప్రదాయయోగిని.


5. ఐదవ ఆవరణ : ఇది సర్వార్ధసాధక చక్రము. 10 కోణాలు గల పద్మము. దీన్ని

బహిర్దశారము అంటారు. దీనిలోని పదికోణాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలకు
ప్రతీక. ఇందులో ఉండే దేవతలు.

1.సర్వసిద్ధిప్రద  
2.సర్వసంపత్రద  
3.సర్వసౌభాగ్యదాయిని
4.సర్వపియంకరి 
5. సర్వకామప్రద
6. సర్వదుఃఖవిమోచని
7. సర్వమృత్యుప్రశమని 
8. సర్వవిఘ్ననివారిణి
9. సర్వాంగసుందరి
10.సర్వమంగళకారిణి

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాశ్రీ. ఇక్కడ ఉండే యోగిని పేరు కుళోతీర్ధయోగిని.


6. ఆరవ ఆవరణ : ఇది సర్వరక్షాకరచక్రము. పదికోణములుగల పద్మము. దీన్ని

అంతర్జశారము అంటారు. ఇందులోని కోణాలు అగ్నికళలకు ప్రతీక. ఇక్కడ ఉండే

దేవతలు.

1. సర్వజ్ఞా  
2. సర్వశక్తిః 
3.సర్వరక్షాస్వరూపిణీ 
4. సర్వజ్ఞానమయి
5. సర్వవ్యాధివినాశిని
6. సర్వాధారస్వరూప
7. సర్వపాపహరా
8. సర్వైశ్వర్యప్రదాయిని 
9. సర్వానందమయీ
10. సర్వేస్సితఫలప్రద

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురమాలిని. ఇక్కడ ఉండే యోగిని పేరు నిగర్భయోగిని,


7. ఏడవ ఆవరణ : ఇది సర్వరోగహరచక్రము. అష్టకోణము. దీని కోణాలలో

అష్టవసువులు వాగ్దేవతలరూపంలో ఉంటారు.

1వశిని  
2 కామేశ్వరి  
3 మోదిని 
4. విమల
5. అరుణ
6. జయ
7. సర్వేశ్వరి
8. కౌళిని

ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా సిద్ధాంబ

. ఇక్కడ ఉండే యోగిని పేరు
రహస్యయోగిని.


8. ఎనిమిదవ ఆవరణ : ఇది సర్వసిద్ధిప్రద చక్రము. త్రికోణము. త్రిగుణాత్మకము.
ఇందులో కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని అనే ముగ్గురు దేవతలు ఆయుధబీజసంయు

తులై
ఉంటారు.
ఇక్కడ త్రికోణము యొక్క మూడు కోణాలయందు.

1.త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు రుద్రుడు
2.త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి
3.సృష్టి స్థితి లయాలు
4.వామజ్యేష్టరౌద్రి
5.ఇచ్చాజ్ఞానక్రియాశక్తులు
6.జ్ఞాత జ్ఞానము జ్షేయము
7.అ నుంచి స వరకు 48 అక్షరాలు

ఉంటాయి. అసలు సృష్టి అంతా ఇక్కడి నుంచే జరిగింది. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాంబ. ఇక్కడ ఉండే యోగిని పేరు అతి రహస్యయోగిని.


9. తొమ్మిదవ ఆవరణ : ఇది సర్వానందమయ చక్రము. బిందురూపము. అదే పరబ్రహ్మస్వరూపము. ఈ ఆవరణకు అధిదేవత మహాత్రిపురసుందరి. ఇక్కడ ఉండే యోగిని పేరు పరాపర రహస్యయోగిని.


ఈ రకంగా తొమ్మిది ఆవరణలు గల శ్రీచక్రంలోని సర్వానందమయచక్రంలో పరమేశ్వరి ఉన్నది.

శ్రీచక్రము మీద మరిన్ని వివరాలకు 996వ నామం చూడండి.

శ్రీచక్రము అంటే కేవలము పూజామందిరంలో ఉంచి పూజించే ఒక యంత్రం మాత్రమే కాదు. చరాచరజగత్తే శ్రీచక్రము అని లోగడ చెప్పాం. అది ఎలా అంటే...
శ్రీచక్రంలోని వివిధ ఆవరణలను భావనోపనిషత్తు వివరిస్తోంది.


1. మొదటి ఆవరణలోని మొదటిరేఖలో సాధకుని శరీరంలోని నవరసాలే ఇక్కడ
సిద్ధిదేవతలు. నవరసాలు అంటే -

శృంగారరసము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయము, భీభత్సము,
అద్భుతము, శాంతము.


రెండవరేఖలో సాధకుని శరీరంలోని మనోవికారాలే ఇక్కడ అష్టమాత్రుకలు.
మనోవికారాలంటే -


కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, పుణ్య పాపములు.


మూడవరేఖలో సాధకుని శరీరంలోని మూలాధారం నుండి ద్వాదశాంతం వరకు ఉండే స్థానాలే. ముద్రాశక్తులు. ఆ స్థానాలవివరాలు.


మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధచక్రము,
లంబికాగ్రము, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ద్వాదశాంతము.


2. రెండవ ఆవరణలో చంద్రకళలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,
మనస్సు, పంచభూతాలు.


3. మూడవ ఆవరణలో ఇక్కడ అష్టమూర్తులు అంటే సాధకుని శరీరంలోని
ఇంద్రియధర్మాలు. అవి వచన, దాన, గమన, విసర్ద, సంభోగ, ప్రవృతి, నివృత్తి, ఉపేక్ష


4. నాల్గవవ ఆవరణలో చతుర్దశభువనాలు అంటే సాధకుని శరీరంలోని ముఖ్యమైన
నాడులే అవి.

అలంబుసా, కుహూ, విశ్వోదరి, వరుణా, హస్తిజిహ్వ, యశస్వని, అశ్వని, గాంధారి,
పూషా, శంఖినీ, సరస్వతీ, ఇడా, పింగళా, సుషుమ్నా.


5. ఐదవ ఆవరణలో సాధకుని శరీరంలోని ప్రధాన వాయువులు, ఉపవాయువులే
దశావతారాలు. ఆ వాయువుల వివరాలు.

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములు.


6. ఆరవ ఆవరణలోని అగ్నికళలు దశవాయువులగుణాలు. చతుర్విదాన్నములను
పచనముచేయు శక్తులు. అవి

దశవిధవాయువులగుణాలు : రేచకము, పూరకము, శోషకము, దాహకము, ప్లావకము.

వివిధాన్నములు : భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోప్యము, పేయము.


7. ఏడవ ఆవరణలోని అష్టవసువులు సాధకుని శరీరంలోగల లక్షణాలు అవి
శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, ఇచ్చ, సత్వగుణము, రజోగుణము, తమోగుణము.


8. ఎనిమిదవ ఆవరణలోని త్రిశక్తులు పాడ్యమి నుంచి పూర్ణిమలేక అమావాస్య వరకుగల తిథులు.


9. తొమ్మిదవ ఆవరణలో కామేశ్వరీ కామేశ్వరులుంటారు. సాధకుని ఆత్మయే
కామేశ్వరి. బుద్ధికామేశ్వరుడు. ఈ రెండూ ఒకటైతే సాదకుడు బ్రహ్మెక్యానుసంధానం పొందుతాడు. అదే జీవన్ముక్తి.


కాబట్టి చక్రరాజరధములోని తొమ్మిదవ పర్వములో ఆ పరమేశ్వరి ఉన్నది అని చెప్పాలి.

అసలు మానవశరీరమే శ్రీచక్రము. శ్రీచక్రంలోని వివిధ ఆవరణలు మానవదేహంలోని వివిధ భాగాలు.


బైందవమ్‌ బ్రహ్మరంధ్రం చ । మస్తకం చ త్రికోణకమ్‌ ।

లలాటే ప్టారకంపత్రం భృవోర్మధ్యే దశారకమ్‌

బహి ర్దశారం కంఠే తు! మన్వశ్రంహృదయం భవేత్‌

నాభౌ చ వసుపత్రం చ ॥ కట్యాం షోడశపత్రకమ్‌

వృత్తత్రయం చ ఊరుభ్యాం ! పద్భ్యాం భూపురత్రయమ్‌ ॥॥

బిందువు నా బ్రహ్మరంధ్రము
త్రికోణము నా తలముందు భాగము
అష్టకోణము గా లలాటము
అంతర్జశారము గా భ్రూమధ్యము
బహిర్దశారము గా కంఠము
చతుర్దశారము గా హృదయము
అష్టదళము గా నాభి
షోడశదళము గా కటి ప్రదేశము
వృత్తత్రయము గా ఊరువులు
భూపురము గా పాదాలు.

 మానవదేహమనే శ్రీచక్రంలో మొదటి ఆవరణ అయిన పాదాల దగ్గరనుండి బయలుదేరి పైకి వెళ్ళగా బ్రహ్మరంధ్రమే బిందుస్థానము. అదే తొమ్మిదవ ఆవరణ.


ఆధారచక్రంలో నిద్రుస్తున్న కుండలినీ శక్తిని జాగృతంచేసి సహప్రారానికి చేర్చినట్లేతే,అజ్ఞాని అయిన సాధకుడికి భగవసాక్షాత్కారం కలుగుతుంది. కాగా జ్ఞానికి
ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది. అంటే పరబ్రహ్మస్వరూపమైన పరమేశ్వరి సాధకుని
దేహమనే శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణ అయిన సర్వానందమయ చక్రమనే బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నది.


ఇప్పుడు అజ్ఞాని అయిన భండాసురునికి జ్ఞానాన్ని ప్రసాదించటానికి ఆ దేవి అతడితో యుద్ధానికి సమాయత్తమవుతున్నది. శ్రీచక్రరథమును సిద్ధిపొందినవాడు అనగా శ్రీవిద్యలో సిద్ధిపొందినవాడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. అతడికి సాయుజ్యం లభిస్తుంది.

ఓం శ్రీమాత్రే నమః

నమస్కారం

నమస్కారం కేవలం సమస్కారం మాత్రమే కాదు అంతకు మించి మన ఆరోగ్య సూత్రం అని నిరూపితం అయింది.

సాధారణంగా మనం పెద్దలను, గురువులనూ, అధికారులనూ కల్సినపుడు, దేవాలయాలకు వెళ్ళినపుడూ రెండుచేతులూ జోడించి నమస్కరిస్తాం.

 ఇలా చేతులు జోడించడంలోని అంతరార్ధం ఏంటీ?

 చేతులు జోడించినపుడు రెండు అరచేతులూ కలిపినపుడు పదివేళ్ళూ కలుసుకుంటాయి కదా...ఇవి ఐదు ఙ్ఞానేంద్రియాలకు ఐదుకర్మేంద్రియాలకూ సంకేతం.

 ఈ పదివేళ్ళనూ కలపడం అంటే ఙ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ దైవంవైపు మరల్చి శరణాగత భావంతో అర్పణ చేయటమే!

 న+మమ, నాది అనేది ఏమీలేదు. అంతా నీదే! స్వీకరించు పరమాత్మా! అనే అర్పణ  భావనను కలిగి ఉండటం. 

ఇంతేకాక నమస్కారం ‘ తత్వమసి ‘ అనే నిత్య సత్యాన్ని గుర్తుచేస్తుంది. 

కుడి అరచేయి మనకు కనపడని ‘తత్‌ ’ ను సూచిస్తుంది. ఎడమ అరచేయి వ్యక్తికి ప్రతీక .రెండూ కలిసినపుడు –– తత్వమసి అవుతుంది. ఉన్నది ఒక్కడే రెండవది లేదనే భావనే! ఇది శాస్త్రీయమైన,

 సంప్రదాయమైన కారణమైతే, దీనివెనక ఎంతో సైన్స్‌ విజ్ఞానం దాగి ఉంది. అదేమిటో చూద్దాం...

నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు, చెవులు, మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది. దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది.

నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు.

 కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి ఈ నమస్కారం దోహదం చేస్తుంది.

అంటే మాటలతో అవసరం లేకుండా.. ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుందనేది నమస్కారం వెనక ఉన్న రహస్యం.

సైంటిఫిక్‌ రీజన్‌ ఏమిటో మరోసారి చూద్దాం...

 నమస్కారం పెట్టే సమయంలో అరచేతులని దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ఇలా చేయడం వల్ల జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతుంది. అవతలి వారికి సదభిప్రాయం కలుగుతుంది. అలా అవతలి వ్యక్తిని మనతో సహకరించే జీవిగా చేసుకుంటామన్నమాట.

యోగ లో దినకి ఏంతో ప్రాధాన్యత ఉన్నది.
దిని నేడు యావత్ ప్రపంచం గుర్తించింది.

నమస్కారం కేవలం సంస్కారం మాత్రమే కాదు మన ఆరోగ్య సూత్రం కూడా. ఏదుటి వారిని 
నమస్కరిద్దాం మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం.

శ్రీ కృష్ణుడు నేర్పిన గుణపాఠం


ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో
‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్యకదా! 
ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ 
అని అడిగింది. 

ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు
‘ప్రభూ, 
నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’ 
అన్నాడు.

పక్కనే ఉన్న సుదర్శనుడు
(సుదర్శన చక్రం) 
కూడా.. ‘పరంధామా, 
అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.
నాతో సరి తూగు వారెవరు స్వామి’
అన్నది.

ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.

దీర్ఘంగా ఆలోచించి..

‘సత్యా, నువ్వు సీతగా మారిపో.
నేను రాముణ్నవు తాను.
గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.

చక్రమా, 
నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’ 
అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు. 

గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. 
సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. 

హనుమ ఆనందంతో పుల కించిపోతూ..
‘నేను నీ వెనుకే వస్తాను. 
నువ్వు పద’ 
అని గరుత్మంతు ని సాగ నంపుతాడు. 

ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా అను కుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు. 
కానీ.. 
ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతు నికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.

ఇంతలో..
‘హనుమా’
అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. 
‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’
అని అడగ్గా..
హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ
‘ప్రభూ, 
ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.
ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’
అన్నాడు సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు. 

ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ 
పై పడి 
‘స్వామీ, 
మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! 
ఎవ రీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది. 
అలా కృష్ణపర మాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలు వేమిటో తెలియ చెప్పాడు.

*చిట్టి తంత్రాలు*

👉 ఎప్పుడైనా మీకు అకారణంగా భయం కలిగినప్పుడు శనివారం రోజు బ్రాహ్మణుడికి కిలోంపావు దోసకాయలు దానం చేయాలి త్వరగా వాటి నుంచి బయట పడవచ్చు.

👉 రాత్రి వేళల్లో తరుచుగా పీడకలలు వస్తూ ఉంటే రావి ఆకు మీద మధ్యలో సింధూరం తో బొట్టు పెట్టి తొమ్మిది రోజుల పాటు పారుతున్న నీటిలో విడిచిపెట్టాలి ... పీడకలలు రావు .. వచ్చిన కూడా అవి ఫలించవు .

👉 *స్ర్తీలు కుటుంబ పరంగా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే కొంతకాలం పాటు మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయం ఉన్నా సాయంత్రం పూట కసువు ఊడ్చీ కళ్ళాపు చల్లి 21 చుక్కలతో ముగ్గును వేయడం అలవాటు చేసుకోవాలి అన్నీ విధాలా కుటుంబ సమస్యలు సర్దుకోగలవు .

👉 *సంతానం లేని స్త్రీ* ఆకుపచ్చ , ఎరుపు కలిసిన దుస్తులు గానీ , గాజులు గానీ , హేయిర్ బ్యాండ్స్ గానీ ధరించకండి .. ఇందువల్ల సంతానం కలగటం ఆలస్యం అవుతుంది .

👉 రెండు పేర్లు కలిసి ఒక పేరుగా ఉన్న స్ర్తీ గానీ పురుషులు గానీ స్వార్థ స్వభావం కలిగి ఉంటారు ..అదే విధంగా లోకవ్యవహార జ్ఞానం కలిగి ఉంటారు ... దీనితోపాటు ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించే స్వభావం వీరిలో కాస్త ఎక్కువగా ఉంటుంది.

👉 గృహ బలం సంపూర్ణంగా ఉండాలంటే వాస్తు దోషాలను సరిచేసుకోవడంతోపాటు జాతకరీత్యా ఉన్న గ్రహ దోషములకు పరిహారాలు చేయించుకోవడం ఉత్తమం .

👉స్ర్తీలు ప్రతీ నిత్యం కుంకుమను ధరించి సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని పఠించడం వల్ల చిరకాలం సౌభాగ్యం తో వర్థిల్లుతారు .

*శ్లో* *మంగళం మంగళాధారే*
*మాంగళ్యే మంగళప్రదేః*
*మంగళార్థం మంగళకేశి*
*మాంగళ్యం దేహిమే సదా*

👉 ఒక మండలము పాటు ఏకభుక్తం స్వీకరిస్తూ ప్రవాహ నీటిలో మెడ వరకు నీళ్ళలో ఉండి అఘమార్ష సూక్తం పఠిస్తూ ఉంటే సకల దోషాలు , పాపాలు నాశనం అవుతాయి .

👉 వేదపండితునికి శాస్త్రోక్తంగా కపిల గోవును దానం చేస్తే సకల దోషాలు నాశనం అవుతాయి , ఈతి బాధలు తొలగిపోతాయి .

👉 ఏ దేవతా ఉపాసన చేసే వారు అయినా ఆ దేవతకు ప్రీతికరం కానీ భక్ష్యాలను విడిచి పెట్టడం వల్ల అత్యంత తొందరగా ఆ దేవత అనుగ్రహం పొందగలుగుతారు .

👉 స్ర్తీలు వంటికి నలుగు పెట్టుకొని స్నానం ఆచరించేటప్పడు చిన్న ముద్దను చేసి ప్రక్కన పెట్టి స్నానం చేయడం పూర్తయిన తర్వాత ఆ ఉండను పచ్చని చెట్ల మెదలులో వేసి నమస్కరించి ఒక గ్లాసు నీళ్ళు పోయడం శుభకరం . *సౌభాగ్యం* *విఘ్ననాశనం*  *అభయం* *ఐశ్వర్యం* పొందుతారు .

👉 ప్రతీ రోజూ ఈ క్రింది తైలాలను కలుపుకుని పూజామందిరము లో సింహాద్వారం దగ్గర దీపారాధన చేయడం వలన సకల దోషాలు నాశనం అయి ఐశ్వర్యం కలుగుతుంది .

🤘వెపనూనె 
🤘 చందనపు తైలం 
🤘 ఇప్పనూనె 
🤘 సంపెంగ నూనె
🤘నువ్వులనూనే 
🤘మల్లెనూనె 
ఈ తైలాలను సమభాగాలుగా కలిపి ఆరువత్తులు వెసి దీపారాధన చేయడం శుభప్రదం.

శుభం 
రా శర్మ .
9666496357

అక్షర శక్తి పూర్వం

S అనే ఆంగ్ల అక్షర శక్తి పూర్వం ౦ నుండి విభజించబడింది యిది ముందు రెండు గా మారి రెండు అరసున్నలు గా మారినది. పూర్వమునుండి వేదం సత్ ఆకారము లేనిది రెండుగా మారిన తరువాతనే దాని లక్షణం తెలిసినది. అది శి శివ తత్వం గా మారి యున్నది అది వ్యాప్తి చెందిన ఆశక్తి అనంతమైన విషు విష్ణు వ్యాప్తి చెందవలెనన్న దాని మూల ప్రకృతి గోళాకార కారము అనంతమైదిగా మారినది. సత్ శివగా మారి ప్రకృతి గా ప్రకాశించిన దినమున. దీనినే వేదిక్ గణిత ముతో అన్వయించి sin, cos, tan  గా మారినది. ఎస్ అనే తత్వం టి అనే శక్తివలన చైతన్య మైన కాస్ గా కాస్మిక్ రూపంలో కనిపించు విషు విష్ణు శక్తి అనంతము. C విభజించు టలో రెండు రూపములుగా మారినది. అదే ఎస్ అనే రాహు శక్తి కేతువుగాను మారి జీవునిగా తెలియుట. ఎక్స్, అనే ఆంగ్ల పదం వై అనే శక్తిచేత అనగా పూర్ణమైన శక్తిని  త్రిశూలం శక్తిచేత అనగా వై త్రిశూలం చిహ్నంగా మనకు తెలియుచున్నది. యిదే సృష్టియెుక్సృష్టియెుక్క సమస్త ప్రకృతికి మూలముగా పార్వతీ పరమేశ్వర తత్వ మైన అణువు రూప ఆత్మ తత్వం అది భూగోళం సమస్తం వ్యాప్తి యొక్క యొక్క కాలమున కు మూలముగా యున్నది. ఆంత్యమందు కాశీ పట్టణమును త్రిశూలముచే కాపాడునని సృష్టి ముందు కూడా యిట్లే ఆరంభమైనదని తెలియుచున్నది. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే ఉందాం.

*పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయా!*

మీరు ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా చూసారా.  వివిధ ఆలయాల్లో అర్చకులు దేముడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు గమనించారా. ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్ళతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు.  అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ఠ స్థానం ఉంది.  యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వెయ్యటం మనం చూస్తూ ఉంటాం.

మన పురాతన వైదిక సాంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు ఎంతో సులువుగా అర్ధమయ్యేది ఏంటో తెలుసా? మన చేతి వేళ్ళల్లోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి అని.  మనకే తెలియని శక్తి మన చేతి వేళ్ళలో దాగి ఉంది.  బొటను వేలిలో అగ్ని, చూపుడు వేలిలో గాలి, మధ్య వేలిలో ఆకాశం, ఉంగరం వేలిలో భూమి, చిటికిన వేలిలో నీరు ఉంటాయట.  మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియట్లేదు. చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది.  అలాగే మెడ నుంచి నరాల ద్వారా వేళ్ళల్లోకి ప్రసరిస్తుంది. అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్ద పీట వేశాం. పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి  కలిపిన అక్షింతలకు అంటి మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది.
 
అలా పంచభూతాలు మన అరచేతిలోనే  ఉండటం వల్ల  మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకుని పోతుంది.  చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు.  అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేత్తో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి.  మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా.  మన  శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణులకి ఆకర్షించబడి మనం చెంచాలతో (స్పూన్స్) తినటం అలవాటు చేసుకుంటున్నాం.  అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు.
 
అంతేకాదు, మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మనం చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు, కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు.  అలాగే మనం నిశితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది.  అలాగే కర్ర కాసేపు పట్టుకుని ఉంటే దానితో దేనినైనా కొట్టాలని అనిపిస్తుంది.  అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చెయ్యాలనిపిస్తుంది లేదా దేనినైనా పొడవాలనిపించి ఆఖరికి కూరగాయలని అటు ఇటు గాట్లు పెడతాం.  ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి.  ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది.  అందుకే హస్తసాముద్రికంలో మన చేతిలోని రేఖలని చూసి మన జాతకం చెపుతారు.  ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్ళను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది.  అంత శక్తి ఉన్న చేతులు మనకి ఉన్నాయని గుర్తించకపోవటం మన తప్పే.  ఇలా పంచాభూతలనే మన చేతిలో పెట్టిన దేముడికి ఎన్నిసార్లయినా చేతులెత్తి మొక్కవచ్చు.
👆 *వాట్సాప్ లో నాకు వచ్చినది* .

జపం, జపమాలలు - ఫలితాలు

జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు. 
జపమాలలు 3 రకాలు
1. కరమాల
అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.

2. అక్షమాల
‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా  ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.

3. మణిమాలలు
రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.

ఫలితములు
రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.

జపం 3 విధాలుగా ఉంటుంది

1. వాచింకం
మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.

2. ఉపాంశువు
తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.

3. మానసికం
మనస్సులోనే మంత్రాన్ని జపించడం.
వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.

ఎలా చేయాలి..?
తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.

త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే

అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.

దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.

గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. 

జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరి పీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-7*

 *భార్యావియోగపు బాధతో విష్ణుమూర్తి శేషాద్రి ప్రయాణము* 

లక్ష్మీదేవి విడిచిన వైకుంఠము శ్రీ మహావిష్ణువునకు పాడుపడిన బీడువలెనున్నది. ఒక కళ లేకుండెను. దిగాలుపడి విష్ణుమూర్తి నింరతరము భార్యను గూర్చి ఆలోచించుచుండెను.

 పూవుల ప్రోవువంటి నా లక్ష్మి ఎచ్చటనున్నదో కదా! సుకుమార శరీర లావణ్య శోభితయగు నా రమాదేవి ఎక్కడ ఏ యిడుములబడుచున్నదో గదా? అని శ్రీమన్నారాయణుడు పదే పదే విలపించుచుండెను. 

ఇప్పుడాయనకు ఏ భక్తుల ఆర్తనాదములున్నూవినబడుటలేదు, ఇప్పుడాయన ఏ మునీశ్వరునికి తన దివ్యసుందర విగ్రహ దర్శన భాగ్యము కలుగజేయుటలేదు, తన తలంపులు లక్ష్మిని గూర్చి తన కన్నులు ఆమెను చూచుటకు నిరీక్షించుచుండెను. 

తన చెవులు ఆమె యొక్క ‘నాథా’ అను శుభకర శబ్ద శ్రవణమున కాతృత చెందుచున్నవి. లక్ష్మీదేవి వైకుంఠమున నివసించుకుండుట నారాయణునకు దుర్భరముగానుండెను. 

ఓదార్చువారు ఓదార్చుచునే యున్నారు. కానీ లాభము లేకుండెను. ఎప్పుడునూ విచారించని వారొక్కమారు విచారించిన అదిమేవో చాలా లోతైన బాధ అయి యుండుట సహజము గదా! దాని నాపజూపుట విఫలమగు ప్రయత్నము మాత్రమే అగును.

తన నిజసతిని వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుట ప్రారంభించినాడు.

ప్రపంచస్థితికి కారకుడయిన శ్రీమహావిష్ణువు యొక్క ఆ స్థితికి లక్ష్మీదేవి కారకురాలయినది. మండుటెండలలో మహావర్షధారలలో ఆయన అడవులందు, కొండలందు, కోనలందు, విచార వదనముతో తిరుగసాగెను. 

రమాదేవికై విలపించసాగెను. రాత్రియనక, పగలనక కాలగణన మనునది లేక తన నిజసతిని గూర్చి అన్వేషణ సాగించుచునే వుండెను. 

మతి భ్రమించినవానివలె తిరుగుచూ వృక్షముల చెంతకు వెడలి ఓ వృక్షములారా! నా ప్రియసతి ఇటు వచ్చుట చూచినారా!’ అనీ, శిలలు వద్దకు వెడలి, ఓ శిలలారా!మీ పక్ర్కల నుండి నా లక్ష్మీదేవి వెడలుట చూచినారా?’ అని అడుగుచుండెను. ఆకలిలేదు, నిద్రలేదు. విశ్రాంతి అనునది అసలు లేనేలేదు. అన్వేషణా ప్రయాణమే పని! రమారమా అని అరచుచూ శుష్కించిన శరీరముతో శేషాద్రికి చేరినాడు.

 *మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా* 
 *వరాహ నరసింహ గోవిందా* *వామన భృగురామ గోవిందా* 
 *బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా* 
 *వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా* 
 *గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా* 

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం🙏

🌸 *జై శ్రీమన్నారాయణ* 🌸
*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-8* 

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *శేషాద్రి యొక్క పుట్టు పూర్వోత్తరములు* 


వాయుదేవుడు ఏ వస్తువు నయిననూ అవలీలగా కదలించగల శక్తి సంపన్నుడు.

 ఆదిశేషుని యొక్క శక్తికి అవధియే లేదు కదా! శక్తిసంపన్నులయిన వీరికి పూర్వము తగవు యేర్పడింది.
.
 ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు

‘‘ఆనంద పర్వతమొక్కటి యున్నదని మీకు తెలిసియేయున్నది కదా! ఆ యానందపర్వతము మేరు పర్వతము నుండి పుట్టినది. అది చాలా గొప్ప కొండ, దానిని కదలించుట మహాశక్తి సంపన్నులకు గానీ సాధ్యము కాదు. 


మీలో ఎవ్వరకు దానిని కదలింపగలరో, వారే అధికశక్తి కలవారనీ తెలియుటకు వీలుండును. ఈపరీక్షకు మీరంగీకరింతురా?’’ అనెను వారు వెంటనే, ‘‘అంగీకరించినాము’’ అని బలదర్పములతో పలికి, ఆనందపర్వతము వద్దకు వెళ్ళారు.

 ఆదిశేషుడు ఆనందపర్వతాన్ని గట్టిగా చుట్టాడు. పుంజుకున్న బలముతో దానిని కదుప జూచినాడు. 

ఎంత ప్రయత్నించిననూ ఫలితము శూన్యమైనది. ఆశ్చర్యము? సమస్త భారమును వహింపగల ఆదిశేషుడు ఆనంద పర్వతమును ఇసుమంతయినా కదపలేక పోయాడు, 

మరియొక ఆశ్చర్యము! సుడిగాలిగాను తుఫానుగాను వచ్చి, ఎంతటి బలవత్తరమయిన వస్తువునైనను చలింపజేయగల వాయుదేవుని ప్రయత్నములు కూడా వమ్మయిపోయినవి. 

ఆదిశేషుడు, వాయుదేవుడు ఇద్దరునూ వారి వారి బలములను జూపి ఆనంద పర్వతమును కదలించవలెనని చివరవరకూ చాలా ప్రయత్నించారు కాని, యే మాత్రమూ లాభము లేకపోయినది.

వారిద్దరి పట్టుదలల వలన ఆనంద పర్వతము మీద నివసించు వాయుదేవుని మహోన్నత విజ్ఞంభణ శక్తికి లోకములోనే అలజడి ప్రారంభమయి హెచ్చసాగినది. 

సర్వప్రాణులకు వాయువు ముఖ్యము కదా! ఇంద్రుడు ఆదిగా గల దేవతలు దీనికి ఒక పరిష్కార మత్యంతావశ్యకమని అనుకున్నారు. వారు ఆదిశేషుని వద్దకు బయలుదేరి వెళ్ళారు.

 వినయముగా ఆదిశేషునకు నమస్కరించి యీ విధముగా అన్నారు. ‘‘స్వామీ ఇవి ఏమి మీ పట్టుదలలు? యుక్తాయుక్త విచక్షణలు తెలిసిన మీరే యీ విధముగా ఇతర ప్రాణులకు భీతిగొలుపు విధముగా వ్యవహరంచుట ధర్మమా? 

మీ నుండి గదా ధర్మాధర్మములు మేము నేర్చుకొనవలసియున్నది! ఆ వాయుదేవుని భయకర విజ్ఞంభణమునకు లోకము లల్లాడిపోవుచున్నవి. మీరు భూతహితైక దృష్టిని పూర్తిగా యోచించి, యీ ఆనంద పర్వత చాలాన ఘనకార్య జనితోపద్రవమును తప్పించవలసియున్నది.

 ఇందులకు మీరే సహస్ర విధముల నర్హులు, మా యెడల కరుణాదృష్టి గలిగి మీరైన పట్టు సడలించగోరుచున్నాము.’’

ఆదిశేషుని యొక్క హృదయము ప్రాణికోటి యెడల చల్లబడినది. వారల మొరవిని, యాతడు తన పట్టుదలను కొంచెము సడలించెను. పట్టును ఎప్పుడయితే ఆదిశేషుడు సడలించాడో, వాయుదేవునికి పనే సులవయ్యెను. వెనువెంటనే వాయుదేవుడు ఆనంద పర్వతమును ఆకాశమార్గమునకు ఎగర గొట్టినాడు.

ఎగరగొట్టబడిన ఆ పర్వతము వెళ్ళి భూలోకము నుండి వరాహక్షేత్రములో  స్వర్ణముఖీ నదీ తీరానబడినది. 

శేషుని కారణముగానే భూలోకమునకు ఆ పర్వతము వచ్చినది. 

ఆ కారణముగానే ఆ పర్వతానికి శేషాద్రియను పేరు వచ్చినది. శేషాద్రిని దర్శించిన మాత్రముననే సర్వపాపములూ పటాపంచలగుననుట సందేహము లేని విషయము.

 *బలరామానుజ గోవిందా, భౌద్ధకల్కి గోవిందా,* *వేణుగానలోల గోవిందా, వేంకటరమణా గోవిందా; |* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||8* ||
శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం

🌸 *జై శ్రీమన్నారాయణ*

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏంచేయాలి

“ హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, 
చందురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి, 
తామరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, 
భాసురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్ ! ”
.
సంపదలకు అధినేత్రి శ్రీ మ‌హాల‌క్ష్మి. 
ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. 
సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. 

సాగరమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు. 
ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం. 
శుచి, శుభ్రత, నిజాయతీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. 
శ్రీమహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు..హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు. 

హనుమంతుడికి భవిష్యత్‌ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం. 
.
గృహంలో ప్రశాంతత, 
మహిళలను గౌరవించడం, 
తెల్లవారుఝామునే లేవడం, 
పూజాధికాలను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. 
ఇంటికి సిరి ఇల్లాలు.
ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. 
ఆమె కంట తడి పెడితే ల‌క్ష్మి వెళ్లిపోతుంది. 

అమ్మ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, 
ఆదిశంకరాచార్యులు ఐదేళ్ల వయస్సులో పఠించిన కనకధార స్తోత్రాం, 
లక్ష్మీదేవి అష్టోత్తరాలను ప్రార్థన చేయాలి. 
మనకున్న దానిలో దానం చేయాలి.
ఇలా చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.
.
రోజూ ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె లేదా 
ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. 
ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తోలిగిపోతుంది.
.
లక్షి దేవిని ఎప్పుడు‌ గణపతితో, 
శ్రీ మహావిష్ణువుతో పూజించాలి. 
ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది.
.
ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు కచ్చితంగా ఉండాలి. 
తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు.
.
ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతున్న వేళ నోరులేని మూగ జీవాలకు రోజు ఏదోక ఆహారం పెట్టాలి. 
ముఖ్యంగా ఆవు లేదా పాలు ఇచ్చే పాడి పశువులు, కుక్కలకి ఇలా మూగ జీవాలకి తిండి పెడితే చాలు మహాలక్ష్మి త్వరగా అనుగ్రహిస్తుంది.
.
గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. 
అలాగే ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి. 
ఇలా చేస్తే శ్రీమహాలక్ష్మి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది.

శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే
(సేకరణ)

సర్ప దోషము

ప్రియ బంధువులారా, సర్ప దోషమును  గురించి చర్చిస్తూ ఉన్నాము, కురు వంశము పై రాహుకేతువుల ప్రభావం, ధర్మరాజు పై రాహుకేతువుల ప్రభావం చర్చించాము, భారత దేశము రాహుకేతువుల ప్రభావం, నిన్ననే తెలియజేశాను, ఈరోజు పాండవ మధ్యముడు, అర్జున్ పై రాహుకేతువుల ప్రభావము తెలుసుకుందాము,. అందరూ పోస్ట్ చదవండి, పోస్ట్ మీద అభిప్రాయం కూడా చెప్పండి, మీకు ఎంత అర్థం అయిందో నాకు తెలియాలి, 

 పాండవ మధ్యముడు అర్జునుడిపై, 
 రాహు కేతువు ల ప్రభావం, 

 ఉత్తర ఫల్గుణి నక్షత్రము నందు జన్మించిన పాండవ మధ్యముడు అర్జునుడు, మహా పరాక్రమవంతుడు, సవ్యసాచి గా ప్రసిద్ధి చెందాడు. ఇట్టి మహావీరుని జాతక నందు కేతువుఅవ. యోగకారకుడు, మరణ దుఃఖ కారకుడు, బహు పుత్ర కారకుడైన రాహువు కూడా అవే యోగకారకుడు, అభిమన్యుని వీరమరణం వల్ల, గర్భశోకం అనుభవించాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మీకు తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి, ఇప్పుడు వాటిని వివరిస్తాను చూడండి, 

 అభిమన్యుని కుమారుడైన పరిక్షిత్తు. తక్షకుడు అనే సర్పం వల్ల మరణించాడు. రాహుకేతువుల అవయోగం స్థితి కారణంగానే, అర్జునుడు కూడా సర్ప ఆ గ్రహానికి గురయ్యాడు, 
 ఖాండవ వన దహన సమయంలో సమస్త జీవులు నిహతం కాగా, ఖాండవ వన దహన అగ్ని జ్వాలలకు, అశ్వసేనుడుఅను  సర్పము, తన తల్లి వడిని పట్టుకుని భయకంపితులై నాడు, అశ్వ సేనుని రక్షించే ప్రయత్నంలో, ఆ సర్పం మాత అశ్వసేనుని తో సహా ఆకాశములో, పారి పోవుచుండగా అర్జునుడు తన అ స్త్రముతో, సర్ప మాత, రెక్కలను ముక్కలు చేసి, శరీరమును  ఖండితము చేయగా, సర్ప మాతా ఖాండవ దహన, జ్వాలలో, కూలి నది, అర్జునుడి శరాఘాతములు బాధింప గా, అశ్వసేనుడు తప్పించుకొని, అర్జున నీ పై పగ సాధించుటకు వేచి ఉన్నాడు, ( గ్రహం -సర్పం- గ్రహం భవేత్) సర్పమునకు రూపాంతరం చెందే  శక్తి కలదు, ఇది సంశయము లేక నిశ్చయమైన అంశము, అస్త్రంగా మారిన, అశ్వ సేనుడు, కర్ణుని అంబులపొది లో, అర్జునుని కొరకు  వేచి ఉన్నాడు, గ్రహములకుల  నిర్ణయంలో. రాహుకేతువులు తక్కువ కులస్తులుగా నిర్ణయింపబడినారు. తక్కువ కులస్తుల తోటే, అర్జునునకు వైరము- పోటి- అవమానం జరిగినాయి, (ఉదాహరణకు ఏకలవ్యునితో ) కేతువు నపుంసక గ్రహం, మధ్యంతర నపుంస కత్వం  కలిగిన, అర్జునిని జాతకమునందు కేతువు తిరుగులేని నియంత్రణ కలిగి ఉన్నాడు, ( బృహన్నల)  నపుంసకత్వము పరిస్థితుల ప్రభావం వల్ల, వరంగా కూడా మారవచ్చు, ఉదాహరణకు తీసుకున్నట్లయితే, కరోనా సమయము నందు, ఎందరో పేదలకు సహాయం చేశారు, ఇది కూడా వరంగానే భావించవచ్చు, అది వేరు సంగతి, గ్రహం ఇచ్చేటువంటి కారకత్వము మాత్రమే ఇక్కడ ప్రస్తావన, ఇట్టి మధ్యంతర నపుంసకత్వం వచ్చిన సమయము నందు, మహావీరుడైన టువంటి అర్జునుడు ఉత్తర కుమారునికి, సారధి గా మారి నాడు, ఇది ఒక చారిత్రాత్మక అంశము, 

 కురుక్షేత్ర సంగ్రామము నందు, అతి ముఖ్య ఘట్టం లలో ఒకటి కర్ణ అర్జున యుద్ధం, కౌరవ పక్షంలోని ఎందరో మహావీరులు, అర్జునుడి పై ఎన్నో అస్త్రాలను ప్రయోగించారు. కర్ణుడు మహా పరాక్రమవంతుడై, విజృంభించి, అనేకములైన, దివ్య అస్త్రములు అర్జునుడిపై సంధించాడు, ప్రయోగించాడు, బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రం, వారునాస్త్రము, ప్రయోగించినా ఫలితము శూన్యము, అశ్వత్థామ ప్రయోగించిన, నారాయణాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, కూడా అర్జునుని  ఏమీ చేయలేకపోయాయి, కానీ ఇట్టి సమయమున, కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రం, అర్జునుని మృత్యుముఖం వరకు తీసుకువెళ్లిన ది, బ్రహ్మ వరప్రసాదంగా, దేవేంద్రుని ద్వారా సంప్రాప్త మైన, అత్యుత్తమ కిరీటం ధరించి కిరిటీగా  పేరుగాంచిన, అర్జునుడు కిరీటము కోల్పోయినాడు ఇది అవమానమే, సాక్షాత్తూ దేవదేవుడైన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడు పూనుకొని, రధాన్ని భూమిలోకి కుంగ  కొట్టడం వల్ల. నాగాస్త్ర ప్రభావం కిరీటం వరకు పరిమితమైనది, నాగాస్త్ర ప్రభావముతో, అర్జునుని  పని అయిపోయింది అని కర్ణుని తో సహా అందరూ అనుకున్నారు,, గర్భవిచ్ఛిత్తి గర్భస్రావానికిహేతువైన  గ్రహము కేతువు, ఉత్తర గర్భము నందున్న పిండమును అశ్వద్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం తో విచ్ఛిన్నం చేయగా, శ్రీ కృష్ణ పరమాత్మ మరల  గర్భస్థ పిండమును జీవము పోసి నాడు, అతడే పరీక్షిత్తు మహారాజు- పరిపాలన సాగిస్తూ తక్షకుడు ను సర్పం వల్ల మరణించాడు, రాహు కేతువు ల ప్రభావం, సర్ప దోషము వంశానుగత మైనదని మరోసారి మనవి చేస్తున్నాను, అర్జున్ నేను దంతము చూసినా ఈ విషయం తేటతెల్లమైంది పోవుచున్నది, మాతా మహా,  పితామహ, సంబంధాలు saaranga ఫలితాలు జాతకునికి సంప్రాప్తిస్తాయి, ఇది కాదనలేని సత్యం, 

 రాహు కేతువుల వల్ల, సంప్రాప్త మైన, అవ్వ యోగాలను శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల, అర్జునుడు అధిగమించాడు, అంతటి ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహం అందరికీ లభించునా, అంతటి మహోన్నతమైన భాగ్యశాలి మహావీరుని ముప్పతిప్పలు పెట్టిన, రాహుకేతువుల దుర్యో యోగము అధిగమించుట సామాన్యులకు సాధ్యం ఆలోచించండి, శ్రీ కృష్ణ పరమాత్మ అండదండలు లేని సమయము నందు అర్జునుడు, సాధారణ రాహు గ్రహ కారకత్వం అయిన అడవి దొంగల చేతిలో అర్జునుడు, శృంగభంగం చెందాడు, శ్రీ కృష్ణ పరమాత్మ అండదండల మాత్రమే,  అర్జునిని రక్షించాయి, రాహు కేతువు ల బారిన పడ్డాను తప్పించుకోగలిగారు, అంతటి ప్రత్యేక నారాయణుని అండదండలు, అనుగ్రహం నిరంతరం ఉండే గ్రహస్థితి జాతకంలో ఉన్న ఎడల, రాహుకేతువుల అవయోగం నుండి బయట పడవచ్చు, రాహుకేతువుల దుర్వినియోగం లో ఉన్న ప్రతి వారు,  అర్జునుని అంతటి అదృష్టవంతులు కాగలరా. అది ఆ పరమేశ్వరునికే ఎరుక, 
 నా జాతకము విషయమునకు వస్తే, సర్ప దోషము నుండి తప్పించులేకపోయినాను... 

 మరి సర్ప దోష పరిహారములు, ఎలా ఏవిధంగా నివారించుకోవచ్చు ను, రేపటినుండి తెలియజేస్తాను, 

 సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు, 

 మీకోసం మీ ప్రత్తిపాటి,  రామలింగ వరప్రసాద్, 
 ఖమ్మంలో నివాసము, 
 ఫోన్ నెంబర్, 9966456118.

వేదాలకు ప్రథమ ప్రత్యర్థిగా నిలిచిన సాంఖ్యం

            సాంఖ్య సూత్రాలను కపిలుడు ప్రవేశపెట్టాడు. ఇతను క్రీ.పూ. 400కాలం నాటివాడని, బుద్ధుని తర్వాత కాలంనాటి వాడని పలువురి అభిప్రాయం. ప్రకృతి నిత్యమైనది. సమస్త చరాచరా సృష్టింతా దాని రూపాంతరాలే' అని ఆయన ప్రతిపాదించాడు. మొత్తం 25 పదార్థాలతో సృష్టి కార్యం జరుగుందని కపిలుడు విశ్లేషించాడు. భౌతిక పదార్థం ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుందని వీరు చెప్పినారు. వేదాంతదర్శనానికి సాంఖ్యదర్శనం ప్రథమ ప్రత్యర్థిగా నిలిచింది. 
            బ్రహ్మ సూత్రాల్లో సాంఖ్య సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించారు. సాంఖ్య సిద్ధాంతంలోకి పురుషున్నిప్రవేశపెట్టారు. పురుషుని కోసం ప్రకృతి వుంది.పురుషుని కైవల్యసాధనే అంతిమ లక్ష్యమనిసాంఖ్యం  చెప్పడంతో అది రెండు విరుద్ధ భావాల్లోకి పోయి అంతిమంగా భావవాదంలోకి కూరుకుపోయింది.
            న్యాయ వైశేషిక దర్శనాల్లో అన్నంభట్టు అనే దార్శనికుడు పృధ్వి అణువులచేత నిర్మితమైన మన శరీరాలు భూలోకంలో వున్నాయన్నాడు. జల అణువులచేత నిర్మితమైనవి వాయులోకంలోనూ,అగ్ని అణువుల చేత నిర్మితమైనవి ఆదిత్యలోకంలో వుంటాయన్నాడు. అయితే ఇతను తన పాత నమ్మకాలను వదలలేదు. సృష్టివాదాన్ని నమ్ముతూనే భౌతిక వాదాన్ని ప్రవేశపెట్టారు.
              ఒక సత్యాన్ని లేదా దోషాన్ని నిర్ధారించడానికి న్యాయవైశేషికులు విప్లవాత్మకమైన పద్ధతి ప్రవేశపెట్టారు. దీనికి వారు చెప్పింది ఆచరణే సత్యానికి సరైనదారని.ఆచరణలో పెట్టినపుడు అది సత్యమైనదా కాదా తెలుస్తుందన్నారు. ఆచరణలో మంచి ఫలితాలు వస్తే సత్యమని లేకుంటే అది దోషమని చెప్పినారు. 
ఆధునిక కాలంలో ఇదే వైజ్ఞానిక పద్ధతిని పాటిస్తున్నారు. న్యాయ వైశేషికులు అణువుల కలయిక వలన పదార్థంలోని భాగాలు ఏర్పడతాయని భావించారు. అయితే అట్లా కలవడానికి ఒక కర్త కావాలని వీరు భావించారు. కుండలోని భాగాలను కలవడానికికుమ్మరి ఏ విధంగా అవసరమో ఆవిధంగా అణు సమూహాల కలయికకు ఒక కర్త అవసరమన్నారు. ఆవిధంగా వీరి  అణు సిద్ధాంతంలోకి భగవంతుని ప్రవేశపెట్టారు. అంతేగాక వీరు ఆత్మను అంగీకరించారు. శరీరంతో సంబంధం కలిగినపుడు ఆత్మ చైతన్యవంతంగా వుంటుందన్నారు. ఆత్మను
అంగీకరించడంతో మోక్షం మొదలైన వేదాంత భావాలు ఈ దర్శనంలోకి చొరబడినాయి.
          బుద్ధుని(క్రీ. పూ. 563-463) సమకాలీనుడైన అసిత కేశకంబరుడు భౌతికవాది. ఆయన ప్రకారం పంచభూతాల కలయికవలన మనిషి ఏర్పడుతున్నాడు. మనిషి చనిపోగానే భూమి అంశం భూమిలోనూ, నీటి అంశం నీటిలోనూ, అగ్ని అంశం అగ్నిలోనూ, వాయువు అంశం వాయువులోనూ,ఇంద్రియాలు ఆకాశంలోనూ కలిసిపోతాయన్నాడు.