20, జులై 2023, గురువారం

మిత్రులను గౌరవించండి.

 డాక్టర్ :- ఇబ్బంది ఏంటి మీకు?

రమేష్ :- డాక్టర్ గారూ, 

రోజు రాత్రి పూట పడుకున్నప్పుడు మంచం కింద ఎవరో దాక్కున్నట్టు భయమేస్తుంటుంది .....

దాంతో నిద్ర రావడం లేదు.


డాక్టర్ :- దీనికి మీరు కంటిన్యూగా ఆరునెలలు వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది, తప్పకుండా ప్రతివారం రావాలి.


రమేష్ :- డాక్టర్ గారూ వారానికి ఫీజు ఎంతవుతుంది ?? 


డాక్టర్ :- మూడువేలు. 


6నెలల తరువాత రమేష్ మార్కెట్ లో డాక్టర్ కి కనిపించాడు.... 


డాక్టర్ :-  ఏమైంది రమేష్, మళ్ళీ రానేలేదు ?


రమేష్ :- డాక్టర్ గారూ, 

నా ఫ్రెండ్ ఒకతను నయం చేసాడు ₹70,000 మిగిల్చాడు నాకు!


డాక్టర్ :- ఏం వైద్యం చేసాడు ...


రమేష్ :- ఏం లేదు అతను ఎమన్నాడంటే ...


మంచం అమ్మేసి పరుపు నేల మీద వేసుకుని పడుకోమన్నాడు...!!


😫😩


Morel of story is...

డాక్టర్ దగ్గరికి వెళ్లేముందు మిత్రులను సంప్రదించండి  ...

మిత్రులు ఉన్నచోట పరిష్కారం తప్పక దొరుకుతుంది కనుక! 

 

ఎప్పుడు మిత్రులను గౌరవించండి.


😊😊😊

వానలు

 🌧️ *వానలు పలురకాలు:-*

🌳🌴🌹🌴🌳

1. గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన

2. మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన

3. మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన

4. దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన

5. సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన

6. సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన

7. బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన

8. తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన

8. సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన

10. ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన

11. మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన

12. ముంతపోతవాన = ముంతతోటి పోసినంత వాన

13. కుండపోతవాన = కుండతో కుమ్మరించినంత వాన

14. ముసురువాన = విడువకుండా కురిసే వాన

15. దరోదరివాన = ఎడతెగకుండా కురిసే వాన

16. బొయ్యబొయ్యగొట్టేవాన = హోరుగాలితో కూడిన వాన

17. రాళ్లవాన = వడగండ్ల వాన

18. కప్పదాటువాన =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన

19. తప్పడతప్పడవాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

20. దొంగవాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన

21. కోపులునిండేవాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన

22. ఏక్దారవాన = ఏకధారగా కురిసే వాన

23. మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన

24. సాలేటివాన = భూమి తడిసేంత భారీ వాన

25. సాలుపెట్టువాన = దున్నేందుకు సరిపోయేంత వాన

 *

ప్రాథమిక వ్యత్యాసo

 😅😅😅😅😅😅😅😅😅

*ఇలా కొద్దిగా నవ్వండి.  ప్లీజ్.*

----------------------------------------------


*ఒకరోజు ఒక పూల వ్యాపారి క్షౌరం కోసం క్షౌరశాల వద్దకు వెళ్లాడు.*

*కట్ తర్వాత, అతను తన బిల్లు గురించి అడిగాడు, మరియు బార్బర్ ఇలా సమాధానమిచ్చాడు,* *'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను, నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.*


*పూల వ్యాపారి సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.*


*మరుసటి రోజు ఉదయం మంగలి తన దుకాణాన్ని తెరవడానికి వెళ్లినప్పుడు, అతని కోసం ఒక 'ధన్యవాదాలు' కార్డు మరియు డజను గులాబీలు అతని కోసం వేచి ఉన్నాయి.*


*తరువాత, ఒక కిరాణా వ్యాపారి హెయిర్‌కట్ కోసం వచ్చాడు మరియు అతను తన బిల్లు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు, క్షౌరకుడు మళ్లీ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను, నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.*


*కిరాణా వ్యాపారి సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.*


*మరుసటి రోజు ఉదయం బార్బర్ తెరవడానికి వెళ్ళినప్పుడు, అతని కోసం ఒక 'ధన్యవాదాలు' కార్డు మరియు తాజా కూరగాయల సంచి అతని కోసం వేచి ఉంది.*


*అప్పుడు ఒక రాజకీయ నాయకుడు జుట్టు కత్తిరింపు కోసం వచ్చాడు, అతను తన బిల్లు చెల్లించడానికి వెళ్ళినప్పుడు, క్షౌరకుడు మళ్లీ ఇలా సమాధానమిచ్చాడు, 'నేను మీ నుండి డబ్బు తీసుకోలేను. నేను ఈ వారం సమాజ సేవ చేస్తున్నాను.*


*రాజకీయ నాయకుడు చాలా సంతోషించి దుకాణం నుండి వెళ్లిపోయాడు.*


*మరుసటి రోజు ఉదయం, బార్బర్ తెరవడానికి వెళ్ళినప్పుడు,*

*ఒక డజను మంది రాజకీయ నాయకులు ఉచిత హెయిర్‌కట్ కోసం వేచి ఉన్నారు.*


*ఇది, మన దేశ పౌరులకు మరియు సమాజాన్ని నడిపే రాజకీయ నాయకులకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని వివరిస్తుంది.*


*

Imp phone numbers




 

గణపతి విగ్రహం

 *మనిషి వలె నాడి కొట్టుకునే గణపతి విగ్రహం ఎక్కడుందో తెలుసుకుందాము...*

🔔🔔🔔 🙏🕉️🙏 🔔🔔🔔


*మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నవి. అలాంటి అద్భుత ఆలయాల్లో అరుదైన ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే వచ్చి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేయగా , ఒక సిద్ధయోగి దాన్ని రుజువు చేసి ఆ గవర్నర్ స్వయంగా వచ్చి నమస్కరించేలాగ చేసాడు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది...? ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టప్పుడు ఏం జరిగిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.*


*తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేరి జిల్లాలో కుర్తాళం ఉంది. ఇక్కడే మౌనస్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయం ఉన్నవి. ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం మాత్రమే కాదు పరిశోధనలలో రుజువు అయింది.*


*ఇక్కడ ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా క్రిందకు దూకుతుంది. ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడమే కాదు మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.*


*ఇక గణపతి ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న గణపతిని ‘నాడి గణపతి’ అని పిలుస్తారు. ఇలా నాడి గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే, మహా సిద్ధయోగి మౌనస్వామి తపస్సు చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్టించారు. ఆ తరువాత ఇక్కడ గణపతి దేవుడిని ప్రతిష్టించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని భావించగా, అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వార్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ట ఏంటి అంటూ హేళనగా అనడంతో, ఆ సిద్ద యోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పగా, అతడు వైద్యుడిని పిలిపిస్తాడు, మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పగా... అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూనే, పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్తాడు. అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా, స్టెతస్కోప్ తో పరిశీలించగా ఆ వైద్యుడిలో ఒక ఆశ్చర్యం గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుందని చెప్పాడు.*


*దీంతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు ఇంకా బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని గణపతికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లారు. ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చినది.*


*అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చినదని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కడతారు.*


*ఇలా ప్రకృతి ఒడిలో వెలసిన ఈ మహిమ గల ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి నాడి గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్దేశ్వరి పీఠాన్ని దర్శిస్తుంటారు. వీలైతే మీరు కూడా కుటుంబ సమేతంగా తప్పకుండా దర్శించి ఆ నాడీ గణపతి ఆశీస్సులు పొందండి.*

🙏🙏🪷 🍁🕉️🍁 🪷🙏🙏

శుక్లాం బరధరం విష్ణు

 శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?

శుక్ల+అంబర+ధరమ్ అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని..... (అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం) 

ఆ ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చొప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, సస్యాలు (పంటలు) మనుష్యులనేవాళ్లు వచ్చారు....

[ఆకాశాద్వాయు:వాయోరగ్ని:అగ్నేరాప:అద్భ్య:పృథివీ పృథివ్యా ఓషధయ:ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష:] 

ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇంత జీవరాశికీ ఆధారభూతుడని అర్థం.....ఇంతకీ ఈ వర్ణన.. విష్ణువు, వినాయకుడు.. ఈ ఇద్దరిలో ఎవరిదో చూద్దాం! ఇద్దరిదీ...


ఇప్పుడు ఈ నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం! కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థమేమంటే - అన్నింటికీ ఆధారం ఏ ఆకాశమో ఆ ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు, శుక్లపక్ష - కృష్ణ పక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు (జీవులకి ఆనందాన్నీ దుఃఖాలనీ కలిగిస్తూ ఉండేవాడు), ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి (శుక్ల + కృష్ణ) సంకేతంగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి (చైత్రం, వైశాఖం...) ప్రతీకగా, మరో చేయి ఈ 12 నెలలకీ (ప్రభవ, విభవ....) ప్రతీకగాను కలిగి, మనకి కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే కర్తగా ధర్తగా హర్తగా ఉన్నవాడు ఆయన.....


ప్ర: 'శుక్లాంబరధరం.....' శ్లోకంలో 'శశివర్ణం చతుర్భుజం' అనే మాట ఉంది. గణపతి వెన్నెలవంటి తెల్లని కాంతితో ఉంటాడని ఎక్కడా చెప్పబడలేదు. 'రక్తాంబరం రక్తవర్ణం...... అంటూ ఎర్రని కాంతితో, సిందూర వర్ణంతో ఉన్నట్లుగానే పురాణాలు, అథర్వ శీర్షం చెప్తున్నాయి. కనుక శశివర్ణం కలవాడు గణపతి - అనడానికి లేదు.... అని ఒక పెద్దాయన వివరించారు. నిజమేనా? శశివర్ణుడు ఎవరు? విష్ణువును భావించవచ్చా? 


జ: విష్ణువు కూడా 'శశివర్ణుడు' అని ఎక్కడా వర్ణించలేదు కదా! నీలవర్ణుడనే ప్రసిద్ధి. అయితే కొన్ని ప్రత్యేక మూర్తులుగా శశివర్ణుడు కావచ్చేమో! 


కానీ గణపతి రక్తవర్ణుడే కాక, శశివర్ణుడుగా ఉన్న మూర్తి కూడా శాస్త్ర ప్రమాణంగా ఉన్నది. సృష్ట్యాది యందు బ్రహ్మదేవునికి కనబడిన గణేశుడు 'శశివర్ణుడు'గా ఉన్నట్లుగానే *'శ్రీ గణేశ పూర్వతోపిన్యుపనిషత్తు'* స్పష్టంగా చెబుతోంది. దాని ఆధారంగానే ఈ సంప్రదాయ శ్లోకం ఏర్పడింది. విష్ణు - అంటే సర్వవ్యాపకుడు. ఆ వ్యాపక లక్షణాన్ని తెలియజేసేదే విష్ణువు - అనే నామం. గణేశుని పరమాత్మగా ఉపాసించే తత్త్వంలో ఇది సమంజసమే.


*".... సోఽపశ్చాదాత్మనాఽఽత్మానం*

*గజరూపధరం దేవం శశివర్ణం చతుర్భుజం....." (శ్రీ గణేశ పూర్వతోపిన్యుపనిషత్)*


అనేక పురాణాల్లో గణేశునికీ, విష్ణువుకీ అభిన్నత చెప్పబడింది....

ప్రత్యేకత

 ప్ర .  ఈ మధ్య ఒక ఆటోలో వెళుతూ "లలితా సహస్ర పారాయణకి గుడికి వెళ్లాలి. తొందరగా పోనీయి నీకూ పుణ్యమొస్తుంది” - అన్నాను. కానీ అతడు మతం మార్చుకున్న డ్రైవర్ కావడంతో,  "మీ పారాయణల్లో చదివేవి మీకే అర్థం కావు. మా ప్రార్ధనలు మా భాషలోనే ఉంటాయి. అర్థంకాని పారాయణ వల్ల మీకే పుణ్య మొస్తుంది? దానికోసం తొందరగా పోనిస్తే నాకేం పుణ్యమొస్తుంది?" అన్నాడు.. నేను కాస్త ఆలోచనలో పడ్డాను. అర్థంకాని సంస్కృత శ్లోకాల పఠనం కంటే , అర్థమయ్యే భాషలో ప్రార్థనలే సమంజసమంటారా?


జ:  లలితా సహస్రనామాల వంటివి మంత్రాలు. అవి మనకి అర్థం కావడం కాదు. ఆ శబ్దంలో శక్తి ఉంది. దాని ఉచ్చారణవల్ల మంత్రవాచ్యులైన దేవతలు స్పందిస్తారు. అసలు దేవత అంటేనే 'మంత్ర చైతన్యం'. ఏ మంత్రంలో, ఏ నామంలో ఏ దివ్య చైతన్యం ఉంటుందో దానిని ఆ మంత్రాధిదేవతగా పేర్కొంటారు. ఆ చైతన్యం యొక్క ప్రకటన స్వరూపమే (Manifested Form) దేవతాకారం.

ఈ విజ్ఞానం మన ధర్మంలోనే ఉంది. మంత్రం మనకి అర్థం కానక్కర్లేదు. మన అర్థానికి అందేది కాదు దేవత. అయితే అర్థం తెలిసి పఠిస్తే మంచిదే. అది మరింత బలవత్తరమవుతుంది. కానీ అనువదించి పఠించితే అంతటి శక్తి రాదు. కానీ అను వదించి చదివే తేట తెలుగు పద్యాలు, వచనాలు, కీర్తనలు మనకు కోకొల్లలు. వాటికి కూడా ప్రభావం ఉంది. వాటిని అనుకరించే ప్రయత్నాలు చేస్తూ కృత్రిమత్వం పులుముకుంటున్నా రు. ఈ మార్పిడికుట్రదార్లు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి - ఇతర మతాలలోకి మారడం వల్ల పూర్వమత దూషణ జరుగుతోందన్నది దీనిబట్టి తేలుతున్న అంశం. అసలు ఈ మతంలోనే 

పుట్టిపెరిగేవాడు అన్యమతాన్ని దూషించడం. మార్పిడితో పాటు మాతృదర్శ కూడా పుడుతోంది. ఇది క్రమంగా పరస్పర దూషణలకు, ఫలితంగా హింసకు, చీలికలకు, దేశభద్రతకు ప్రమాదకరం. ఇది దేశశాంతిని కోరుకునే ప్రతి సోదర  మతస్థుడు తెలుసుకొని, అన్ని మతాలవారు తమ మాతృమతాలతో పాటు అన్యమతాల వారిని గౌరవించడం అలవరుచుకోవాలి.

ఏ మత ప్రత్యేకత దానిదే. సంస్కృతభాషలోని పారాయణ ప్రార్ధనల వలననే అన్ని భాషల వారి సమైక్య సంస్కృతిగా భారతీయ ధార్మికత వృద్ధి చెందింది. మంత్రభాష అయిన సంస్కృత శబ్దాలలోని స్పందనశక్తి అమోఘమైనది. అయినప్పటికీ ప్రతి దేశభాషల్లోనూ ఎన్నో దివ్యగ్రంథాలు ఉన్నాయి.

పుణ్యం తేగలిగే మంత్రశక్తి కలిగిన పారాయణలు మన మతంలోనే ఉన్నాయని సగర్వంగా చెప్పి ఉండవలసింది.

నిజమైన జ్ఞాని*

 *నిజమైన జ్ఞాని*

                  ➖➖➖✍️


*వంగ  రాజ్యాన్ని   పరిపాలించే చంద్రసేనుడు తనమంత్రి సుబుద్దునితో ‘మంత్రివర్యా!  సర్వసంగ పరిత్యాగి అయిన జ్ఞానిని మేము దర్శించదలచాము,  రేపు అటువంటి వ్యక్తిని చూసే ఏర్పాట్లు చేయండి' అన్నాడు.*


*’అలాగే ప్రభూ తప్పకుండా రేపు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను' అన్నాడు.* 


*ఒక్క రాత్రిలో అటువంటి జ్ఞానిని ఎలా చూపించాలో తెలియని మంత్రి ఓ చిన్న తంత్రంతో ఆ ఆపదనుండి బైటపడే మార్గంగా,  తనకు తెలిసిన ఓ పగటివేషగాడిని కలసి 'రేపుఉదయం అడవి మొదట్లొ మర్రి చెట్టుకింద ముని వేషంలో కూర్చో!  రాజుగారు వచ్చి నిన్ను దర్శించుకుని బహుమతులు ఇవ్వబోతాడు. సర్వసంగ ‘పరిత్యాగులం మాకు ధనమెందుకు?’ అని తిరస్కరించు, అలాచేస్తే నీకు వందవరహాలు ఇస్తాను' అన్నాడు.* 


*పగటి వేషగాడు అంగీకరించి మరుదినం ఉదయాన్నే ముని వేషం ధరించి మంత్రి సూచించిన ప్రదేశంలో పద్మాసనం వేసుకుని దండం, కమండలంతో కూర్చొని జపం చేయసాగాడు.* 


*రాజుగారు రాణిగారితో కలసి మంత్రి చూపించిన జ్ఞాని పాదాలపై తమ తలలు ఆనించి నమస్కరించి, బంగారు పళ్ళెంలో వజ్రాలు, రత్నాలు బంగారునాణాలు అతని ముందు పెట్టి స్వీకరించమని వేడుకున్నారు.* 


*'సర్వసంగపరిత్యాగిని నాకు ధనం ఎందుకు? వద్దు' అన్నాడు జ్ఞాని వేషంలోని పగటివేషగాడు.* 


*అతని మాటలకు సంతోషించిన రాజు తనపరివారంతో వెళ్ళిపోయాడు.*


*’వేషం బాగా కుదిందోయ్!’  ఇంద నీకు ఇస్తాను అన్న వంద వరహాలు' అన్నాడు మంత్రి వంద వరహాలమూట ఇస్తూ.* 


*'సర్వసంగపరిత్యాగులం మాకుధనం ఎందుకు'అన్నాడు ఆ జ్ఞాని వేషధారి.* 


*'అబ్బా రాజుగారు వెళ్ళిపొయారు. ఇంక నీవు నటించనవసరంలేదు' అన్నాడు మంత్రి.* 


*'అయ్యా! కొద్దిసేపు జ్ఞానిలా నటిస్తే దేశపాలకుడు తన తలను నాపాదాలకు తాకేలా నమస్కరించి కోట్లధనం నాకు సమర్పించబోయాడు. నిజమైన జ్ఞాన సంపద ఇంత గొప్పదని తెలుసుకున్నాను. జ్ఞానసంపద తెలుకునేందుకు గురువును ఆశ్రయించబోతున్నాను సెలవు' అని మంత్రికి నమస్కరించి అడవిలోనికి వెళ్ళి పోయాడు జ్ఞాని వేషంలోని పగటివేషగాడు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀

అది నువ్వే

 

అది నువ్వే  

ఒకరోజు సాయంత్రం 7 గంటల సమయంలో సీతాదేవి తన ఇంట్లో ఏదో పాత బట్ట చేత్తో కుట్టుకుంటున్నది. దారాన్ని తెంపి కొత్తదారం సూదిలోకి ఎక్కిద్దామని ప్రయత్నిస్తుండగా కరంటు పోయింది చేతిలోంచి సూది జారీ పడింది. ఇల్లంతా చీకటి సూదిని ఎలా వెతకాలి అని ఒక కొవ్వొత్తి వెలిగించి కొవ్వొత్తి కాంతిలో వెతకటానికి  ప్రయత్నించింది. కానీ సూది ఎక్కడ పడ్డదో ఏమో ఆమెకు ఎంతవెతికిన కనిపించటం లేదుఇంతలో ఆమె భర్త రామారావు ఇంట్లోకి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా వుంది తన భార్య కొవ్వొత్తి వెలుగులో ఏదో వెతుకుతుండటం చూసి ఏమి వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె జరిగినది మొత్తం చెప్పి సూదికోసం వెతుకుతున్నాను అని అన్నది. పిచ్చిదానా ఇంత గుడ్డి వెలుతురులో నీకు సూది కనపడుతుందా ఏమిటి బైట చూడు వీధి దీపం ప్రకాశమానంగా వెలుగుతున్నది రోడ్డుమీద వెతుకుదాం పద అని ఆమెను వీధిలోకి రమ్మని పిలిచాడుఏమండీ మీకు మాతికాని పోయిందా సూది నా చెతిలొనుంచి జారీ ఇంట్లో పడ్డది  బైట వెతికితే ప్రయోజనం ఏమిటీ అని ఆమె అంటేపిచ్చిదానా బైట వెలుతురు బాగా వుంది కాబట్టి అక్కడ మనం వెతికితే వెతకటం తెలుస్తుంది తరువాత మనం అక్కడ దొరకక పొతే ఇంట్లో వెతుక్కోవచ్చు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధం అయ్యింది మీ తెలివి ఎలా పనిచేస్తున్నదో అని ఆమె అనిమీకు చాతనయితే ఒక ఎక్కువ వెలుతురు ఇచ్చే దీపాన్ని తీసుకొని రండి అప్పుడు నేను సూదిని వెతుక్కోగలనువెలుతురు బైట ఉండవచ్చు కానీ వెలుతురు కావలసింది పోయిన వస్తువు వున్నచోట మాత్రమేఇదికూడా మీకు తెలియకపొతే యెట్లా అని భర్తతో అన్నది

నిజానికి దృష్టాంతరం చదివితే హాస్యాస్పదంగా  కనపడుతుంది. కానీ ఇది మాత్రం అక్షర సత్యం. మనం దాదాపు కోఠిలో ఏవక్కరో తప్ప అందరం సూది ఇంట్లో ఉంటే వీధిలో వెతికే వారమే అంతేకాదు అక్కడ వెలుతురు ఎక్కువగా వుంది ఇక్కడ ఇంకా వెలుతురువుంది అని చెప్పే వాళ్ళ మాటలు విని అక్కడ ఇక్కడ మనం వెతుకుతూ వున్నాం కానీ సూది మాత్రం దొరకటం లేదు కేవలం కాలం గడుస్తుంది, జీవితం అయిపోతున్నది. ఇక విషయానికి వస్తే మిత్రమా 

రోజుల్లో గుడికి వెళ్ళండి, క్షేత్రానికి వెళ్ళండి అక్కడ దేవుడిని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యం ఇక్కడి క్షేత్రంలో దేవుడు చాలా శక్తివంతుడు అని మనలను తప్పు త్రోవ పట్టించే వారు సమాజంలో అనేక మంది తయారుఅవుతున్నారుదానితో సామాన్యుడు ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేక వారి మాటల గారడిలో పడి  కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పటానికి బాధపడుతున్నాను. నిజానికి గుడికి వెళ్లినా తీర్థానికి వెళ్లినా నీకు మోక్షం రాదు కేవలం నీ సాధనకు మనస్సు కొంత తోడ్పడుతుందిదానివల్ల నీకు కలిగే ప్రయోజనం చాలా తక్కువ

ఇది ఇలా ఉండగా రోజుల్లో అనేకమంది స్వామీజీలు, బాబాలు తమకు తామే దేవుళ్లమని పేర్కొనటమే కాకుండా ఇంకా కొంతమంది ఎప్పుడో గతించిన వారికి గూళ్లుకట్టి, పూజలు చేస్తూ మనలను కూడా పూజలు చేయమని ప్రోత్సహించటమే కాక నీవు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే నీతో స్పర్ధకు దిగి వారి వాదనే సరైనదని అయన ఫలానా దేవుడి అవతారం, ఈయన ఫలానా దేవుడి అవతారం అని అయన మహిమలు చూపెట్టారు, ఈయన మహిమలు చూపెట్టారని మనలని మభ్యపెడుతూ మన జీవితాలను లక్ష్యంనుంచి విముఖులను చేస్తున్నారు

మన సాంప్రదాయంలో వక్తి పూజ ఆరాధనా ఎప్పుడు  చెప్పలేదు. కేవలం అంటే కేవలం పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం సిద్ధిస్తుందని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. మానిషి కొంతకాలం తపస్సు చేస్తే కొన్ని దివ్య శక్తులు సంప్రాప్తం అవుతాయివాటిని అణువాది అష్టసిద్ధులు అంటారు అట్లా సిద్ధులను పొందినవారిని సిద్దులు  అంటారు. సిద్ధులను పొందటం అంత అసాధ్యం  ఏమీకాదు. కొంతకాలం తపస్సు చేస్తే చాలు వారు ఏవైతే మహిమలు అన్నారో అవి చాలామంది తాపసులు పొంది  వున్నారు. మీరు కూడా పొందగలరుఅది ఏమి విశేషం కాదు.

వీళ్ళు చెప్పే బాబాలు, స్వామీజీలు మన మహర్షుల ముందు చాలా స్వల్పులువాల్మీక మహర్షి ఒక దర్భను జీవమున్న బాలునిగా చేసాడు, విశ్వమిత్ర మహర్షి స్వర్గాన్నే సృష్టించగలిగాడువీళ్ళు చెప్పే బాబాలు, స్వామీజీలు అంతకన్నా గొప్పవాళ్ళా ఆలోచించండి

ఇక వారు సద్గురువులని వారిని ఆరాధిస్తే మోక్షం వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. మిత్రమా నిజానికి మోక్షాన్ని సద్గురువు కూడా యివ్వలేడు  అది సాధకుడు తనకు తానుగా కఠోర దీక్షతో సిద్దించుకోవలసినది.    నిజానికి గురువు పాత్ర చాలా చిన్నదిఒక్కమాటలో చెప్పాలంటే నీవు ఒక రోడ్డు మీద వెళుతున్నావు అడవిలో రోడ్డు రెండుగా చీలిందిఇప్పుడు నీవు రోడ్డుమీద వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ నీకు ఒక మార్గదర్శిని (బోర్డు) కనిపించింది అది రెండు రోడ్లు ఎటువైపుకు వెళతాయో చూపిస్తుందిదానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని చేరుకోవటానికి నీ కారును నీవే నడుపుకుంటూ  వెళతావు. రోడ్డు దాటిన తరువాత అక్కడి సైను బోర్డు సంగతే మరచిపోతావునీ గురువు స్థానం కూడా అటువంటిదే నీకు మార్గదర్శనం  చేస్తాడు. నీ మార్గంలో నీవే వెళ్ళాలి. ఆలా వెళ్లక గురువునే పూజిస్తూ వుంటే కాలయాపన కాక వేరొకటి కాదు.  

కాబట్టి సాధక మిత్రమా నీవు ఎవరి మాటలు వినక నీకు నీవుగా నీ మార్గాన్ని (మోక్ష మార్గాన్ని) ఎంచుకో దిశగా నీవు ప్రయత్నం చేసి నీలో నీ హృదయాంతరాలలో  నిగూఢంగా వున్న పరమాత్మను దర్శించుకో నీవు దేముడి గూర్చి గుడులకు వెళుతున్నావో దేవుడు గుడులలో కాదు నీహృదయంలోనే వున్నాడని మన వేదమంత్రాలు ఘోషిస్తున్నాయి

పైన కధలో సీతాదేవి ఇంట్లో పారేసుకున్న సూదిని వీధిలో వెతుకుదామని రామారావు చెప్పినా నిరాకరించి ఇంట్లోనే వెతకటానికి నిర్ణయించుకుంది  అదే మాదిరిగా నీవుకూడా నీలో నిఘాఢంగా నిక్షిప్తమైన  దేవుడిని వెతకటానికి ప్రయత్నించు వెలుతురు తక్కువైన వెలుతురు  ఎక్కువ చేసుకొని  ఎలా వితుకుతామో అలానే నీకు   సరిపడిన జ్ఞ్యానం లేకపోతె జ్ఞ్యానులనుండి అంటే గురువులనుండి జ్ఞ్యానాన్ని పొంది నీకు నీవుగానే నీలోని పరమాత్మను వెతుకు)

ప్రతిరోజూ అన్ని దేవాలయాలలో పఠించే మంత్రపుష్పంలోని మంత్రాలను  చుడండి 

యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః 5

మనకు కనిపించేది వినిపించేది అది యెంత సూక్ష్మమైన కానీ అది పూర్తిగా నారాయణుడితో వ్యాపించి వున్నది. అటువంటప్పుడు భగవంతుని ఒక దేవాలయానికి పరిమితం చేయటం ఎంతవరకు  సబబు. మీరే చెప్పండి. విశ్వమంతా వ్యాపించి వున్న దేవుడు దేవాలయాలలో కూడా వున్నాడు, వుండి భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. అంటే కేవలం ఐహిక వాంఛలను తీర్చుకోవటానికి మాత్రమే దేవాలయాలకు వెళ్ళాలి కానీ మోక్ష సిద్ధికి మాత్రం కాదు. ఇక బాబాలను, సాధువులను దేవుళ్లుగా కొలవటం ఎంతమాత్రం  ఔచుత్యం అనిపించుకోదు. నీవు కొలిచే ఏ బాబాకాని సాధువుగాని అమరుడు, నిత్యుడు, శాస్వితుడు కాడు.  కానీ భగవంతుడు నిత్యుడు, అనంతుడు, అచ్యుతుడు.  అటువంటి లక్షణాలు సజీవంగా వున్న లేక ఒకప్పుడు సజీవంగా ఉండివున్న మనుషులకు ఆపాదించలేము. 

మంత్ర పుష్పం లోని క్రింది మంత్రాన్ని గమనించండి.

అనన్తం అవ్యయం కవిం సముద్రేన్తం విశ్వశంభువమ్

పద్మ కోశ ప్రతీకాశం హృదయం అపి అధోముఖమ్ 6

అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్ఠతి

జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ 7

సన్తతం శిలాభిస్తు లమ్బత్యా కోశసన్నిభమ్

తస్యాన్తే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ 8

తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిః విశ్వతో ముఖః

సోఽగ్రవిభజంతిష్ఠన్ ఆహారం అజరః కవిః 9

హృదయంలో (నీ) బంగారు కాంతులు విరజిమ్ముతూ వడ్ల గింజ కొసపరిమాణంలో భగవంతుడు విసించి వున్నాడుఆయనే సర్వాంతర్యామి, అది తెలుసుకొని నీకు నీవే దేవుడవు కమ్ము

మోక్ష మార్గం యెంత కఠినమైనదో ఉపనిషత్తు తెలుపుతున్నది

 

ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా .
క్షురస్య ధార నిశితా దురత్యయా
దుర్గాం పాఠస్తత్కవయో వదంతి .. ౧౪.. 

 

14 లేవండి! మేలుకో! గొప్పవారిని సంప్రదించి నేర్చుకోండి. రేజర్ (క్షురకుని కత్తి ) యొక్క పదునైన అంచు వంటిది మార్గం, కాబట్టి తెలివైనవారు నడవడం కష్టం మరియు దాటడం కష్టం.  

ఒక రేజర్ బ్లేడు  (క్షురకుని కత్తి ) మీద నడవటం యెంత కష్టమో అంత కష్టం.  మోక్షమార్గంలో పయనించటం అని మంత్రం చెపుతున్నదికాబట్టి సాదాకా కఠినాతి కఠినమైన మోక్షమార్గాన్ని ఎంచుకొని నీ శాయశక్తులను  పణంగా పెట్టి మోక్షసిద్ది పొందు మోక్షం అంటే నిన్ను నీవు నీకుగా తెలుసుకోవటమే, అది తెలుసుకో 

 

చాందోగ్యఉపనిషత్లోని ఆరవ అధ్యాయంలో "తత్ త్వం అసి" మహావాక్యాన్ని వ్యక్తం చేసింది దీని అర్ధం ఏమిటంటే నీవు దేనినిగూర్చి వెతుకుతున్నావో అది నీవే అని తెలుసుకో

 

శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన శ్రీమత్ భగవత్గీత, ఆది శంకరులు రచించిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలూ, మన మహర్షుల నుండి ఉద్బవించిన ఉపనిషత్తులను నిత్యం చదివి ఆకళింపు చేసుకొని, అనుసరించే సాధకునికి భగవంతుని గూర్చి, మోక్షాన్ని గూర్చి నిశీత , నిశ్చిత అభిప్రాయం ఏర్పడుతుంది అప్పుడు  తెలిసి తెలియక బోధించెడి అజ్ఞ్యానుల మాటలు తేలికగా కనిపించి నిత్యము సత్యము, అనంతము అయిన పరబ్రహ్మ గూర్చి పరుగులిడతాడు.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ