శుభోదయం🙏
శు భో ద యం🙏🙏
నన్నయగారి నాటకీయత !
ఉ: ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణఁ జూచి ,రం
భోరు నిజోరుదేశమున నుండగఁ బల్చిన నిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
ఘ్నోరుతరోరుఁ జేసెద ,సుయోధను నుగ్ర రణాంతరంబునన్ !
ఆం:మ: భారతము--సభాపర్వము-- నన్నయ భట్టారకుఁడు.
ఇది నన్నయగారి పద్యరత్నం. మాయాజూదంలో పాండవుల నోడించి వారిధర్మపత్ని పాంచాలి ని వస్త్రాపహరణోద్యోగమునపరాభవింప
ప్య
యత్నించు నపుడామె "నన్ను రక్షింపగలవారెవ్వరు సభలోలేరా" యనివిలపిం ప సాగినది. ఆయదనున సుయోధనుడు తనయూరువుల
నధిష్ఠింపుమని ద్రౌపదికి సైగచేసెను. అదిజూచి మహా కృధ్ధు డై భీముడు పైవిధముగా ప్రతిజ్ఙయొనరించెను.
భావము: రాజ్య సంపద మదంతో ఉచితానుచితములెరుంగక అసహాయురాలగు ద్రౌపదిని తనతొడపై కూర్చుండుటకు ఆహ్వానించిన దుర్మార్గుడైన యీదుర్యోధనుణ్ణి రాబోయే భారతయుద్దంలో ప్రచండమైన నాగదాభిఘాతములతో
తొడలు ముక్కలగునట్లుసేతునుగాక! అని భీకరమైన ప్రతిజ్ఙచేసెను.
పైపద్యము వీర రౌద్ర భయానక రసములకు ప్రతీకయై భీముని కోపావేగమునకు అద్దముపట్టినది.
నాటకము దృశ్యప్రబంధము పాత్రచిత్రణము ,వాచకము ఆహార్యము అభినయములు నాటకీయతలోని భాగములు. భీముని మహారౌద్రమూర్తిగా చిత్రించి , ఆవెనుక నాతనికి తగిన మాటలను ఆరభటీవృత్తిలో సమకూర్చి, గదత్రిప్పుట,మొన్నగు(కన్నులెర్రబడుట కటములదరుట :మొ ) అభినయమును సమకూర్చి," దుర్వార మొదలుగా దీర్ఘసమాస ఘటనముచే రసానుకూలమును రాగానుకూలముగను (మారు నట్లు) రచించి నాటకీయతకు ప్రాణముపోసెను. నిపుణుడైన నటునిచే
నీపద్యమును జదివించిన చక్కగా రంగస్ధలపద్యమువలె రాణింపక మానదు.
ఈవిధముగ యెడ నెడ నన్నయగారుకూడ తనభారతమున నాటకీయతకు స్థానమును కల్పించి తన రచనా
సామర్ధ్యమును అభివ్యక్త మొనరించెను.
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి