*నేటి మాట*
*🪔🪔 బంధాలు-బలాలు 🪔🪔*
*🍁చరాచర జగత్తులో అన్ని జన్మల కన్నా మానవ జన్మ దుర్లభమైంది' అంటారు వేదాంతులు.*🙏🙏🙏
దానికి కారణం ఉంది. మరే ఇతర ప్రాణులకూ లేని బంధాలు, మమకారాలు, కుటుంబ వ్యవస్థ లాంటివన్నీ మనుషులకు మాత్రమే ఉన్నాయి.
వాటి ఫలితంగా ప్రతి మనిషి జీవితంలోనూ
*అమ్మ, నాన్న, అన్న, అక్క, భార్య, పిల్లలు... ఇలా ఎన్నో బంధాలు జీవితంలోని అనేక దశల్లో పెనవేసుకుని ఉంటాయి.*
వదలడానికి, మరిచిపోవడానికి, కనీసం తలవకుండా ఉండటానికి వీలు లేనంతగా వాటి ప్రభావం జీవన గమనం మీద నిరంతరం పడుతూ ఉంటుంది.. అన్నింటినీ అనుసరిస్తూనే మనిషి కుటుంబ జీవనంలో మమేకమై అహరహం జీవన గమనాన్నిసాగిస్తాడు.
*🍁రాముడి చేతిలో మరణిస్తూ రావణాసురుడు*
*'రామా! నేను వయసు, బలం, వైభవం, రాజ్య సంపద.... ఇలా అన్ని విషయాల్లో నీకంటే శ్రేష్ఠుణ్ని, గొప్పవాడినికానీ, నీకు నాకు మధ్య ఉన్న బలాల్లో పెద్ద తేడా బాంధవ్యం.*
*నీకు బాంధవ్య బలం ఉంది. నాకు అది లేదు. ఎందుకంటే దాన్ని నేను పెంచుకోలేక. పోయాను. నీ వెనక రాజ్యంలోని ప్రజలతో పాటు నీ సోదరులు, బంధుగణం అంతా అండగా ఉన్నారు. కానీ నా విషయంలో స్వయానా నా తమ్ముడే నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆ బంధాలను నిలబెట్టుకోలేక | పోయాను. అదే నా పరాజయానికి ఒక కారణం' అని చెప్పినట్లు కొన్ని పురాణ కథల ద్వారా తెలుస్తోంది.*
*🍁ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ పాండవులు అయిదుగురూ కలిసే అనుభవించారు.*
*ధర్మరాజుకు పెద్దరికం ఇచ్చి ఆయన మాటకు కట్టుబడే ఉన్నారు. జూదంలో ఓడి అరణ్యవాసానికి వెళ్ళినా, అజ్ఞాతవాసంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఒక్కతాటిపై నిలిచారు. తల్లిమాట ప్రకారం భిక్షనైనా, స్వయంవరంలో దక్కించుకున్న పడతి చెలిమినైనా అందరూ సమానంగా పంచుకున్నారు. ఆ పనులన్నీ తమ సచివుడు, స్నేహితుడు, బాంధవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ చేసిన దిశానిర్దేశాన్ని అనుసరించే చేశారు. అదే అనుబంధంలో ఉన్న గొప్పతనం.*
*🍁భార్యాభర్తల అనుబంధానికి ఆదర్శంగా సీతారామ శివపార్వతులను చెబుతారు.*
*మొదటి జంట పేరు భాషకు ఒక జాతీయంగా మారితే, రెండో జంట దేహాలు సగమై జగానికే నిండుదనాన్ని ఇచ్చింది.*🙏🙏🙏
*స్నేహ బంధానికి నిలువెత్తు విలువనిచ్చిన కర్ణుడు. ఎన్ని కష్టాలేమురైనా దుర్యోధనుడిని వీడలేదు.*
*ముక్కిపోయిన అటుకులు ఇచ్చినా బాల్యంలోని స్నేహబంధాన్ని మదిలో నిలుపుకొని కుచేలుడికి అంతులేని సంపదలనిచ్చాడు కృష్ణుడు.*
*తండ్రిమాట . కాదంటే తండ్రీబిడ్డల బంధానికి విలువ ఉండదని రాజ్యాన్ని, సంపదల్ని తృణప్రాయంగా విడిచి అడవులు బాటపట్టాడు రాముడు.*🙏🙏🙏
*🍁రాముడి కోసం జీవితాంతం వేచి ఉండి, చివరి దశలో దర్శనం పొందిన మహా భక్తురాలు శబరి.*
*రంగనాథుణ్నే తన భర్తగా భావించి అనుబంధాన్ని పెంచుకుని ఆయనలో లీనమైన కథ గోదాదేవిది.*
*మీరాబాయి, సక్కుబాయి లాంటి భక్తురాళ్లు, అనేకమంది భక్తులు రకరకాల బాంధవ్యాలతో భగవంతుడిలో ఐక్యం చెందాలని తపన పడి సాయుజ్యం పొందారు.*
*చెరసాలలో పుట్టి, యశోదమ్మ చెంతకు చేరి కుమారుడిగా అనుబంధాన్ని పెనవేసి తన బాల్య క్రీడలతో తల్లిని మురిపించాడు కృష్ణ పరమాత్మ.*🙏🙏🙏
*🍁బంధాలను నిలుపుకొంటే* *కుటుంబం మన వెంటే*
*ఉంటుంది.*
*🍁అప్పుడు ఎంత కష్టంలోనైనా ఎలాంటి యుద్ధంలోనైనా గెలుపు మనదే అవుతుంది.*
*🍁 కుటుంబం దూరమైతే ఈ విశాల ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోతారు.*
*🍁 బతుకు భారం అవుతుంది.*
*🍁బంధాలకు విలువనిచ్చి ముందుకు సాగితే ప్రపంచమే వసుధైక కుటుంబం అవుతుంది.*🙏🙏🙏
🕉 శుభమస్తు 🕉