2, జులై 2023, ఆదివారం

శ్రీ గోల్డెన్ పగోడా

 🕉 మన గుడి : 


⚜ అరుణాచల్ ప్రదేశ్ : నంసాయి


⚜ శ్రీ గోల్డెన్ పగోడా ( Golden Pagoda ) 



💠 అరుణాచల్ ప్రదేశ్‌లోని గమ్యస్థానాలలో మనోహరమైనది గోల్డెన్ పగోడా లేదా స్థానిక తై ఖమ్తీ భాషలో ఖోంగ్ము-ఖామ్, 

ఇది నమ్సాయిలోని పట్కై రిసార్ట్‌తో పాటుగా ఉంది.


💠 ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, సన్యాసులు మరియు బుద్ధుని అనుచరులు పగోడాకు తరలివస్తారు, ఎందుకంటే ఇది పవిత్రమైనది మరియు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.


💠 గోల్డెన్ పగోడా అనేది దాదాపు 20 హెక్టార్ల భూమిలో ఉన్న ఆలయ సముదాయం మరియు బర్మీస్ నిర్మాణ రూపకల్పనలో నిర్మించబడింది.


💠 ధ్యానం, ధర్మ చర్చలలో పాల్గొనడం మరియు అన్ని వయసుల వారికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఇతర కార్యకలాపాల వంటి ఆధ్యాత్మిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే, కొంగ్ము-ఖామ్ లేదా గోల్డెన్ పగోడాలోని ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణంలో సెలవులను ఆనందదాయకంగా మార్చడానికి రిసార్ట్ ప్రయత్నిస్తుంది.


💠 గోల్డెన్ పగోడా అరుణాచల్ ప్రదేశ్‌లోని పట్కై పర్వత శ్రేణుల తూర్పు హిమాలయాల చివరి అంచుల దిగువన ఉన్న మైదానాలకు అభిముఖంగా పీఠభూమిపై నిర్మించబడింది.


💠 ఇది బర్మీస్ నిర్మాణ రూపకల్పన మరియు శైలిలో నిర్మించబడింది. 

గోల్డెన్ పగోడా కాంప్లెక్స్ 20 హెక్టార్ల భూమిలో విస్తరించి ఉంది మరియు ప్రధాన మందిరం 4272.58 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. పగోడా ఎత్తు 17.60 మీ. పగోడాలో 12 ఉప గోపురాలు ఉన్నాయి.


💠 శిఖరం ఒక ప్రత్యేక అలంకారమైన గొడుగు ముక్కలాగా ఉంటుంది.

 పగోడా యొక్క గర్భగుడి ప్రధాన తలుపులు చెక్కతో చెక్కబడ్డాయి. 

పగోడా మొత్తం బంగారు రంగుతో , బంగారంలా మెరిసిపోతుంది కాబట్టి దీనిని 'గోల్డెన్ పగోడా' అని పిలుస్తారు. 


💠 ఈ పుణ్యక్షేత్రం లోపల, స్వచ్ఛమైన కాంస్య బుద్ధ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంచబడింది. ఈ విగ్రహాన్ని థాయ్‌లాండ్‌లోని వాట్ ఆరంజికవాస్ ఆలయ ప్రధాన సన్యాసి వెన్ ప్రఖుప భవనం విరాళంగా ఇచ్చారు. 

పూజా మందిరానికి తూర్పు, ఉత్తరం, పడమర మరియు దక్షిణ దిశలలో నాలుగు ప్రవేశాలు ఉన్నాయి.


💠 హాలు ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంది. బుద్ధుని విగ్రహం ఉత్తరం వైపు ఉంది. 

గోల్డెన్ పగోడా కాంప్లెక్స్ యొక్క ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉంది, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన దిశ. పుణ్యక్షేత్రం యొక్క నాలుగు ప్రవేశద్వారాలలో  ఒక జత సింహాల బొమ్మలు కాపలాగా ఉంటాయి. 


💠బుద్ధుని సిద్ధాంతాలు, స్వదేశీ సాంప్రదాయ  అధ్యయనాలు, వినోదం, ధ్యానం మరియు మతపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా సేవలందించడంతో పాటు సందర్శకులకు మంచి అనుభూతిని కలిగించే ప్రదేశం.

 

💠 ప్రయాణికులు అక్కడికి చేరుకోవడానికి ఉత్తమ మార్గం రోడ్డు మార్గం: 

టిన్సుకియా- దిరాక్ చెక్ గేట్ - నంసాయి - తెంగపాణి గోల్డెన్ పగోడా ఇది మొత్తం 88 కి.మీ దూరం మరియు 

సమీప రైల్ హెడ్ టిన్సుకియా జంక్షన్ 

మరియు  విమానంలో ప్రయాణించాలనుకుంటే సమీప విమానాశ్రయం. అస్సాంలోని దిబ్రూఘర్ విమానాశ్రయం.

ఒకటి అక్కడ పెట్టిపో

 *🌹రాముడు సీతనెందుకు వదిలేసాడు?🌹*


                    *తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారికి మరియు కంచి పరమాచార్యుల వారికి మధ్య జరిగిన సంభాషణ*


                *శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియ జెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.*


                *”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయించాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు.*


                  *శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడు రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా*


                   *“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగాఉండవచ్చా?” అని అడిగారు.*


             *“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు.*


              *ఈ మాటలు విని పరమాచార్యస్వామి వారు పరవశించి పోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు.*


*🌹   జయ జయ శంకర హర హర శంకర   🌹*


*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

Kalaatmakam


 

 












సంతోషం పొందే మార్గాలు

 హరిఓం  , 


*ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది! ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది!*

సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది!


*వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీ ని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి.*

*అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు!*


*తన చేతిలో చీపురు ఓ మూలన పడేసి ఆ స్త్రీ , యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది!*

*"నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు! ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను! అంతా దుఃఖం!! ఏమీ తినలేకపోయాను! ఆత్మహత్య చేసుకోవాలనిపించేది! ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేదు!*


*ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గిన్నెలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది.*

*అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది! కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది!!*


*నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.*


*ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను.* *వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను.* *ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది!*

*డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు! కాని సంతోషాన్ని కొనుక్కోలేరు!*

*అది మనకి మనం పొందాల్సి ఉంటుంది. ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది!*

*నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది!*

*నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది!*

*సంతోషం అనేది గమ్యం కాదు! అది ఒక ప్రయాణం! సంతోషం మరో రోజులో లేదు.ఇప్పుడే ఉంది!*


        🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏


కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం 


విష్ణు సహస్ర నామం


*విష్ణు సహస్ర నామం విశిష్టత ఏమిటి?*



కురుక్షేత్రం యుద్ధం తరువాత, ధర్మరాజు తన తమ్ముళ్ళతో కలిసి అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని వద్దకి వచ్చి ఎన్నో ధర్మాలు, శాస్త్రాలు తెలుసుకున్నాడు. అలా తెలుసుకుంటున్నప్పుడే, 'ఏ జీవి అయినా ఈ సంసార చక్రం నుంచీ తప్పించుకోవడానికి తెలుసుకోవాల్సిన తత్త్వం ఏది' అని భీష్ముణ్ణి ధర్మరాజు అడగగా ఆయన ఉపదేశించిన స్తోత్రమే విష్ణు సహస్రనామ స్తోత్రం. అన్ని ధర్మాలకూ మూలమైన ఆ శ్రీమహావిష్ణువుని అనంతమైన నామాలతో కీర్తిస్తే ఆయన సన్నిధికి చేరుకోవడం అతి సులభమని వివరించాడు.

శ్రీమన్నారాయణుని ద్వారా ఎన్నో గొప్ప అనుభవాలను పొందిన ఋషులు తాము దర్శించిన రూపాలను ఈ నామాలుగా గానం చేశారట. అలాంటి ఈ నామాల ద్వారా మనం కూడా ఆ శ్రీహరి అందించే కళ్యాణ గుణాలను అనుభవించవచ్చు అని పెద్దలు అంటారు.

విష్ణు సహస్ర నామ స్తోత్ర ఉత్తర పీఠికలో ఈ స్తోత్రం పఠించడం ద్వార మనం పొందే ఫలశృతిని చక్కగా వివరించారు. ఈ స్తోత్రాన్ని భక్తి, శ్రద్ధలతో నిత్యం పారాయణ చేసేవారు అధోలోకాలను దర్శించే అవసరం లేకుండా, తమ ఆత్మ ఊర్ధ్వలోకాల వైపు మళ్ళుతుందట. అలాగే ఇహము నందు ధర్మ, అర్ధ, కామములు పొంది, అంత్యమున మోక్షం పొందుతారట. రోగపీడ, భయం, బాధ, అసూయ, దురాశ, కపటం, అజ్ఞానం వంటివి దరిచేరవట. ఈ స్తోత్రాన్ని విశ్వాసంతో గానం చేసేవారికి ఎల్లప్పుడూ ఆ పర్మాత్ముని మీదే మనస్సు లగ్నమై, ఆయన మీద ఏకాగ్రత కుదురుతుంది.

ముందు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చదివిన తరువాత, ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఆ జగన్మాత ఇంకా సంతోషిస్తుంది. అలాగే ఈ స్తోత్రంలో ఒక్కో నక్షత్ర పాదంలో పుట్టినవారికి ఒక్కో శ్లోకం ఉంటుంది. దానిని మంత్రంలాగా పారాయణ చేయడం కూడా శుభ ఫలితలను ఇస్తుంది అంటారు.

ధర్మము

 .                  🕉️🕉️🕉️


                _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*పితాధర్మః పితాస్వర్గః* 

*పితా హి పరమంతపః.।*

*పితా ప్రీతి హి మాపన్నే*

*సర్వాః ప్రీయన్తి దేవతాః.॥*


తా𝕝𝕝 

తండ్రిని సేవించడమే ధర్మము......తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం.....ధర్మవర్తనుడైన తండ్రిని అనుసరించడమే తపస్సు...... తండ్రిని ప్రసన్నముగా ఉంచితే సమస్తదేవతలు మనకు ప్రసన్నులు అవుతారు.

ఈ రోజు పదమ

 208వ రోజు: (భాను వారము) 02-07-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదమ:

దత్త పుత్రుడు: కులటుడు, దత్తకుడు, దత్త్రియుడు, పోష్యపుత్రుడు, పోషయసుతుడు 


 ఈ రోజు పద్యము:


 సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ యప్రకాశమై/

యున్నపుడైన లోకులకు నొండక మేలొనరించు సత్వసం/

పన్నుడు భీము డా ద్విజులప్రాణము కావెడి ఏకచక్రమం/

దెన్నికగా బకాసురుని నేపున రూపడగించి భాస్కరా!


ఓ భాస్కరా! భీముడు బ్రాహ్మణ వేషములో అజ్ఞాతముగా గడుపవలసి వచ్చిన సమయమున కూడా ఏకచక్ర పురము నందలి బ్రాహ్మణ కుటుంబమును బకాసురుని బారి నుండి రక్షించగలిగినాడు. కనుక కార్యదక్షుడైనవాడు ఏ కారణము చేతనైననూ తన గొపుపతనము మరుగు పరచుకొనవలసి వచ్చిననూ, ఇతరులకు తనకు చేతనైనంత మేలు ఏదైననూ చేయగలడని భావము.

సంభాషణల్లో సంవత్సరాల పేర్లు

 *పండితులసంభాషణల్లో తెలుగు సంవత్సరాల పేర్లు :*


తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత … అని ఇలా 60 ఉంటాయి. పూర్వం పండితులు తమ చుట్టూ ఉన్న వారికి అర్ధం కాకుండా ఉండాలనో, అర్ధాలు తెలిస్తే చిన్నబుచ్చుకుంటారనో తెలియదు కానీ తమ సంభాషణల్లో కొన్ని పదాలకు బదులు ఆ అర్ధాలు వచ్చే సంవత్సరాల పేర్లు వాడేవారు. వాటిలో కొన్ని తిట్లూ, కొన్ని ప్రశంసలూ, అడపా దడపా విమర్శలూ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్పుకుందాం సరదాకి.


*‘ ఒరే! వాడొట్టి ఇరవై ఐదూ, ఇరవై ఆరు రా’* అన్నాడంటే ‘వాడు గాడిద కొడుకు’ అని తిడుతున్నాడని అర్ధం. 25 వ సంవత్సరం పేరు ‘ఖర’ ( అంటే గాడిద). 26 వ సంవత్సరం పేరు నందన( అంటే కొడుకు).


*‘ నీ కొడుక్కేంట్రా ‘ఇరవై తొమ్మిది’ . గొప్పింటి సంబంధాలు వస్తాయి’* అంటే మన్మధుడని. 29 వ సంవత్సరం పేరు ‘మన్మధ’ 


*‘వాడికోసారి ‘నలభై’  జరిగినా తెలిసి రాలేదు’* అంటే ‘పరాభవం జరిగినా’ అని. 40 వ సంవత్సరం ‘ పరాభవ’


*‘వాడి కూతురికి సంబంధాలు రావడం కొంచెం కష్టంరా ‘ముప్పయి’ , ‘ముప్పై మూడు’ కదా! ‘* అన్నాడంటే ‘రూపవతి కాదని’ అర్ధం. 30 వ సంవత్సరం ‘దుర్ముఖి’ 33 వ సంవత్సరం ‘వికారి’


*‘ నీ ‘నలభై ఎనిమిది’ కి కారణమేంటో తెలుసుకోవచ్చా?’* 48 వ సంవత్సరం పేరు ‘ఆనంద’


*‘ వాడితో వాదనెందుకురా వాడో ‘యాభై అయిదు’* . అంటే బుద్ధిలేనివాడని అర్ధం. 55 వ సంవత్సరం ‘దుర్మతి’


 *‘అబ్బ వాళ్ళ పిల్లలతో వేగలేమండీ! అందరూ ‘నలభై ఒకటి’  లే'* అంటే కోతులూ కప్పలూ అని అర్ధం.41 వ సంవత్సరం ‘ప్లవంగ’


*‘ వాడసలే ‘ముప్పై ఎనిమిది’ జాగ్రత్తగా మాట్లాడు.* అంటే కొంచెం కోపిష్టి అని. 38 వ సంవత్సరం పేరు  ‘క్రోధి’

 

---- 😁 మాగంటి శ్రీనివాస్

*లేట్ రిజిస్టర్

 *లేట్ రిజిస్టర్*

*-డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు*


విశ్వకార్యాలయంలో 

ఉద్యోగిస్తున్న కొందరు

ఈ మధ్య 

ఆలస్యంగా రావడం 

ఆనవాయితీ చేసుకున్నారు

సంతకం పెట్టి 

డ్యూటీ ఎగ్గొట్టడం 

హాయిగా కునుకు తీయడం  

అలవాటు చేసుకున్నారు 

 

ఏప్రిల్లో రావలసిన మండుటెండయ్య 

మేలోగానీ అడుగు పెట్టలేదు

హాజరు పట్టికలో సంతకం పెట్టగానే 

విసనకర్రతో విసురుకుంటూ 

ఎటో నిష్క్రమించాడు 


జూన్ మొదటివారం 

హాజరు వేస్కోవలసిన వానమ్మ 

నాలుగోవారంలో పలకరించింది 

తాపీగా పనిచేస్తోంది 

డ్యూటీలో చేరీ చేరగానే 

వాతావరణం చల్లగా ఉందని 

టీ తాగేందుకు బైటికెళ్ళింది 


పరుగులు పెడుతూ 

రావలసిన మబ్బయ్య 

కర్ణాటక సరిహద్దులోనే 

చాలా రోజులు 

హఠం వేసుకుని కూచున్నాడు  

పేరుకు తగ్గట్టే 

మబ్బుగా ఉన్నాడు 

మెల్లిగా నడుస్తూ వచ్చి 

హాజరు పట్టికలో 

తీరిగ్గా సంతకం పెట్టాడు 

చల్లదనం తగిలితే తప్ప 

పని చేయడం కుదరదంటున్నాడు 


గ్లోబలయ్యా! 

వీళ్ళందరికీ  

లేట్ రిజిస్టర్ పెట్టవల్సిందే!

తోక కత్తిరించి 

సమయానికి 

హాజరయ్యేలా చేయాల్సిందే!


*(2023 జూన్ 29 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం)*

పుట్టుకలేనివాడు

 శుభోదయం🙏


పుట్టుకలేనివాడు!

ఉ.

పుట్టువు లేని నీ కభవ పుట్టుట క్రీడయగాక పుట్టుటే?

యెట్టనుడున్ భవాది దశలెల్లను జీవులయందవిద్య దాఁ/

 జుట్టుచు నుండుఁ గాని నినుఁ జుట్టినదింబలెఁ బొంత నుండియుం/

జుట్టఁగలేమిఁ దత్క్రియలఁ జొక్కనియెక్కటి వౌదు వీశ్వరా!


రచన:-పోతనమహాకవి.

భాగవతం-10స్కం-90పద్యం.


పుట్టుట ఎరుగని నారాయణా! నీకు పుట్టుక అంటు వేరే లేదు. అటువంటినీవు ఇలా పుట్టడం నీకు క్రీడ లాంటిదిఅది ఎలా అంటే జన్మ , మరణం మొ/నవన్నీ మాయ కారణంగా జీవులను ఆవరిస్తు వుంటాయి. కాని నిన్ను మాత్రం ఆమాయ స్ప్రుశించలేక దూరంగా వుండిపోతుందీ కనుక ఆమాయామయమైన క్రియలు వేటిలోను చిక్కు కొనకుండా ఏకైక మూర్తిగా నిలబడి పోతావు.కనుకనే ఈజగత్తులకన్నిటికీ నీవు ఈశ్వరుడవు.

           నమో నారాయణాయ!

                        స్వస్తి!

⚜ శ్రీ మేఘనా గుహలయం

 🕉 మన గుడి : 


⚜ అరుణాచల్ ప్రదేశ్ : జిరో లోయ


⚜ శ్రీ మేఘనా గుహలయం



💠 మేఘనా గుహలయం ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ అద్భుతమైన మరియు గొప్ప వాస్తుశిల్పంతో సంస్కృత గ్రంధాల వివరణాత్మక చెక్కడం చూడవచ్చు. 


💠 అరుణాచల్ ప్రదేశ్ జిరో వ్యాలీలోని అందమైన లోయలో ఉన్న ఈ దేవాలయం తప్పక సందర్శించవలసిన ఆకర్షణ. 

ఈ పర్యాటక ప్రదేశం 5000 సంవత్సరాల నాటి పురాతన గుహ దేవాలయం మరియు ఈ గుహ దేవాలయం 1962 సంవత్సరంలో కనుగొనబడింది. 

అప్పటి నుండి, ఈ ప్రదేశంలో ప్రజలు తీర్థయాత్ర కోసం అన్ని వైపుల నుండి వస్తున్నారు.


💠 ఈ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మేఘనా గుహ దేవాలయం 300 అడుగుల ఎత్తులో ఉంది, ఇది చుట్టుపక్కల ఉన్న పర్వతాలు, దట్టమైన  హరిత అడవులు మరియు వేగంగా ప్రవహించే నదుల అద్భుతమైన వీక్షణ.

నిస్సందేహంగా అరుణాచల్ ప్రదేశ్‌లో సందర్శించడానికి ఉత్తమమైన గమ్యస్థానం, ఇది చూపరులకు పచ్చని పచ్చదనాన్ని అందిస్తుంది. నిజానికి మీరు గొప్ప పండుగను అనుభవించాలనుకుంటే, ఫిబ్రవరి నెలలో జరిగే మహా శివరాత్రి సమయంలో మీరు మేఘనా గుహ ఆలయాన్ని సందర్శించవచ్చు.


💠 మేఘనా గుహ దేవాలయం

సందర్శించడానికి ఉత్తమ సమయం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు 


💠 ఇది రెండు సొరంగాలతో కూడిన రాతి గుహ దేవాలయం. సొరంగాలు గుహ గోడ వెనుకవైపు మరియు ఎడమ వైపున ఉన్నాయి. మొదటిది గుహ వెనుక గోడ నుండి మెట్ల ద్వారా చేరుకున్న ప్లాట్‌ఫారమ్ నుండి 1.80 మీటర్ల ఎత్తులో ప్రారంభమవుతుంది. సొరంగం యొక్క ఓపెనింగ్ పెద్దది మరియు ఒంటరి వ్యక్తికి ప్రవేశించడానికి అనుకూలం.


💠 జిరో ఇటానగర్ నుండి 167 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడ నుండి మీరు జిరో చేరుకోవడానికి టాక్సీ సేవను పొందవచ్చు.

దత్త మాట.

 *దత్త మాట..*


 *కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు.*


*కర్మ రూపంలో గుర్తుచేస్తూనే ఉంటుంది..* 


*కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్షాలై నిలువునా దహించి వేస్తాయి..* 


*కళ్ళతో చూసిన నిజాలకూ చెవులతో విన్న ప్రశ్నలకూ నోటితో విసిరిన నిందలకూ తెర వెనుక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే 'కర్మ'*


*కాబట్టి కర్మ చాలా శక్తివంతమైనది. కాల గమనంలో వెంటాడుతున్నే ఉంటుంది. కర్మ బరువై కాలగర్భంలో భవిష్యత్ ని  ముంచేస్తుంది.*


*నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది.* 


*కుళ్ళు కుతంత్రాలు నుండి బయటపడి తోటివారికి స్వచ్ఛమైన సహసహకారం అందించు. దైవ చింతనతో కూడిన జీవనం మిక్కిలి ఆనందదాయకం, భావితరాలకు ఆదర్శం*

నాడి జ్ఞానం

 నాడి జ్ఞానం - మనిషి దేహమునంధలి నాడులు .


 ఈ ప్రపంచం నందు ఎన్ని విచిత్రాలు ఉన్నాయో అంతకు మించి మనిషి దేహం నందు కలవు. భగవంతుడు తన శక్తి నంతటిని మనిషి శరీరం నందు వెన్నముక క్రింద బాగం లొ వెంట్రుక వలె ఉండు కుండలినిలో దాచాడు. మీరు మీ రెండు చూపుడు వేళ్ళని రెండు చెవులలో పెట్టుకుని ప్రశాంతం గా లోపలి శబ్దాన్ని వినండి. అదే శబ్దం మీకు కరెంటు హై టెన్షన్ వైరల దగ్గర వినిపిస్తుంది . అదే సుషుమ్న నాడి. అందలి రక్త ప్రసరణ , శక్తి ఆ శబ్దం చేయును . ఒక మనిషి ఒక మంత్రమును తీసుకుని శ్రద్ధగా అదే పనిగా ఉపాసిస్తే 41 రొజులలొ శక్తివంతుడు కావొచ్చు. 


     ఈ పొస్ట్ లొ మనిషి యెక్క దేహం లొని నాడులు గురించి వివరించుతున్నాను....


  శరీరం నందలి మూలాధారం నకు మీదగా నాభి స్థానమునకు మధ్యంబున కంద స్థానం నందు సుషుమ్న అను నాడియోకటి కలదు. ఇళా , పింగళ నాడులు ఈ సుషుమ్న నాడిని చుట్టుకొని ఉంటాయి.మనుషుల దేహంబున సుక్ష్మ,, స్థూల నాడులు 3 కోట్ల 50 లక్షలు ఉన్నవి.ఈ నాడులు ములాదారమును ఆశ్రయించి కొన్ని ఊర్ధ్వ (పైకి ) భాగము, కొన్ని అధొ (క్రిన్ధ ) భాగము , మరికొన్ని తిర్యక్ భాగము గా వ్యాపించి ఉన్నాయి . మరియు పై నాడులను ఆశ్రయించి 3 కొట్ల 50 లక్షల రోమములు ఉన్నవి.ఈ రోమములే నాడులకు ముఖములు గా చెప్పబడును. వీటినుండే చెమట స్రవించ బడును. ఒక సుక్ష్మ వాయువు కలదు. అది ప్రాణాధి వాయువుల ద్వారా దేహమంతటికి వ్యాపించు చుండెను. ఈ నాడులలో 72 వేల నాడులు వాయు సంచార యొగ్యమై ఉండును. నదులు తమ జలములతో సముద్రాన్ని ఏ విదంగా సమృద్ది పరుచునో అదే విదంగా నాడులు మనిషి తీసుకున్న అన్నపానాదుల రసము చేత దేహమును వృద్ది చేయు చున్నది. అందు 1072 నాడులు స్థూల నాడులు గా ఉన్నవి. ఈ నాడులలో శబ్ద, స్పర్శ, రూప, రస, గందాత్మక , పంచేంద్రియ , గుణ గ్రాహకంబులు అగు నాడులే మిగుల శ్రేష్టముగా ఉండును. ఈ అయిదు నాడులు ములాదారమును ఆశ్రయించి నాభి చక్రమున ప్రవేశించి ఉన్నవి.పైన చెప్పిన స్థూల నాడులను ఆశ్రయించి నిర్మలమైన 700 ప్రదాన నాడులు సుక్ష్మ చిద్రములతో కూడి  యుండును . ఇవి ప్రతి దినం మనిషి భక్షించే వివిద అన్నపానదుల రసం గ్రహించుతూ శరీరాన్ని వృద్ది చేయును . 


         పైన చెప్పిన నాడులలో ఇళా , పింగళ , సుషుమ్న , సరస్వతి, వారుణి, పుషా , హస్త జిహ్వ , యశస్విని , విశ్వోదరి, కుహు, శంకిని, పయస్విని, అలుమ్బస , గాంధారి అను ఈ 14 నాడులు ముఖ్యమైనవి. ఈ పదనాలుగు నాడులలో ఇళా నాడి మొదలు చారాణా నాడి వరకు గల పది నాడులు ప్రాణాధి వాయు వాహినులు అయి ఉండును. అందువలన ఇవి ప్రదాన నాడులుగా గుర్తిన్చబడుతున్నవి . ఇళా , పింగళ , సుషుమ్న  అను ఈ 3 నాడులు శరీరం లొ పైబాగమునకు పోవును . గాంధారి, హస్తజిహ్వ, అను రెండు నాడులు చేతులు మొదలయినవి చాచుటకు , ముడుచుటకు ఉపయుక్తములు అయి ఉండును. ఆలంబుస, యశస్విని అను రెండు నాడులు దక్షినాంగమున ఉండును. కుహు, శంకిని, అను ఈ రెండు నాడులు వామబాగంబున వ్యాపించి ఉండును. మద్య బాగం నందు ఉండే పుషు అను ప్రసుతికా నాడి సమస్త కార్యంబులను చేయును .


         వామ నాసిక యందు ఇళా , దక్షిణ నాశిక యందు పింగళ , బ్రహ్మ రంద్రంబు యందు సుషుమ్న , వామ నేత్రము యందు గాంధారి, దక్షిణ నేత్రంబు యందు హస్తజిహ్వ, దక్షిణ కర్ణంబు పుషాయు , వామ కర్ణంబు యందు యశస్విని, జిహ్వయందు ఆలంబుసం , శిశ్న ములంబున కుహువు, శిరము మీద బాగమున శంఖిని . ఇలా పది నాడులు ద్వారంబులు ను ఆశ్రయించి ఉండును.


          ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, క్రుకరము , దేహ దత్తము, దనుంజయము అను ఈ పది వాయువులు దేహమంధలి సర్వ నాడులలో సంచరించును. ఇందు ధనంజయ వాయువు అనునది మనిషి మరణించాక శరీరం ఉబ్బుటకు కారణం అగును. కర్ణముల యందు వ్యాపించు ఉండు నాడులు శబ్ద గ్రాహకములు, నేత్రముల యందు ఉండేవి రూప గ్రాహకములు, నాశిక యందు ఉండేవి కంద గ్రాహకములు, జిహ్వ యందు ఉండేవి రస గ్రాహకములు, చర్మం యందు ఉండేవి స్పర్శ గ్రాహకములు, హృదయం , ముఖము నందు ఉండునవి శబ్దోచ్చారనముకు ఉపయుక్తమై ఉండును. పురీతతి అను నాడి యందు మనస్సు లీనం అయినపుడు నరునికి నిద్ర కలుగును.


  

      మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


       9885030034

ఆషాఢ మాసం

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - IV 


చాతుర్మాస దీక్ష - ఆహారం 

(డా॥పాటిల్ నారాయణరెడ్డి గారి "ఆచారాలు - శాస్త్రీయత" గ్రంథం ఆధారంగా) 


    వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలాన ఎక్కువ ఉష్ణమగు - ఉష్ణం చేసే ఆహారం వర్జించాలి. 


చాతుర్మాస్య వ్రతం పాటించే ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ 

  - మొదటి నెలలో కూరలు, 

  -  రెండవ నెలలో పెరుగు, 

  -  మూడవ నెలలో పాలు, 

  -  నాల్గవ మాసం లో ద్విదళ బీజములు (పప్పు దినుసులు) తినకూడదు.


  1. ఆషాఢ మాసాన కూరగాయలు - ఆకుకూరలు ఎక్కువగా పండి, లభిస్తాయి. ఇవి భూమియందలి ఉష్ణ సహాయంతో పెరుగుతాయి. 

    ఆషాఢ మాసానికి ముందు శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు భూమియందు ఉష్ణం ఎక్కువగా కేంద్రీకరించి ఉంటుంది. 

    వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పడు, భూమికి నీరు చేరి, లోపలి అత్యుష్ణం సస్యాల మూలకంగా విసర్జింపబడుతుంది. 

     ఈ సస్యాలనుంచీ లభించే కాయగూరలు, ఆకుకూరలు ఈ నెలలో సేవిస్తే, శరీరము నందున్న ఉష్ణము తక్కువగుటకు అవకాశము లభించదు. 

    మనం సేవించే ఆహార దోషాల మూలకంగానే అనేక రోగాలు వస్తాయి. 

    అందుచే ఈ కాలాన భూమి నుంచి బహిర్గతమయ్యే ఉష్ణం శాక పత్రాలయందు ఎక్కువగా నిక్షిప్తమై ఉండే కారణాన, ఈ కాలంలో వాటిని సేవించకూడదన్నారు. 


2.  శ్రావణ శుక్ల ఏకాదశి నుండి ఒక నెల, 

    దధి అంటే పెరుగు  తినకూడదన్నారు. 

    ఇది ఉష్ణ దీపక గుణాలు కలిగియుంది. అగ్నివర్ధకము. 

    ఈ నెలలో దీనిని వాడితే, ఉష్ణం మరింత అధికమవుతుంది. కాబట్టి దీని బదులు మజ్జిగ వాడమన్నారు. 


3. భాద్రపద శుక్ల ఏకాదశి నుంచీ ఆశ్వియుజ శుక్ల దశమి వరకూ క్షీరం అంటే పాలని సేవించవద్దన్నారు.

    వర్షఋతువున గోవులకు ముఖ్య ఆహారమైన పచ్చగడ్డి ఈ మూడవ భాగంలో ఎక్కువగా విస్తారంగా పెరుగుతుంది. 

    ఈ క్రొత్త పచ్చగడ్డి భూమిలోని వేడితో కూడి ఉంటుంది. కీటకాదులతో కూడా ఉంటుంది. 

    ఈ గడ్డి తిన్న ఆవులు ఇచ్చే పాలయందు ఉష్ణాంశం ఉంటుంది. కొన్ని రకాల పచ్చగడ్డి తిన్న ఆవుల పాలు, వాసన రావడం కూడా సాధారణం. 

    ఈ నెలలో ఇటువంటి పాలు మానవుని ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ నెలలో పాలు సేవించకూడదనే నియమం ఏర్పరచబడింది. 


4. ఆశ్వియుజ శుక్ల ఏకాదశి

 నుంచీ కార్తిక శుక్ల దశమి వరకూ ద్విదళ ధాన్యం (కంది, పెసర, సెనగ మొదలైనవి) తినకూడదన్నారు. 

    ఈ పప్పుదినుసులు కూడా ఇదే ఋతువులో ఎక్కువగా పండి, వాణిజ్యపరంగా అమ్మకానికి వస్తాయి. 


నియమాల ఏర్పాటు 


* కాలానుగుణంగా, ఏ ఏ నెలలో భూమినుండీ, ఏ ఏ పంటలు అవీ వస్తాయో, 

* వాటి ప్రభావం దేహంలో ఏ ఏ విధంగా పనిచేస్తుందో, 

* వాతావరణంలో మార్పుకి, దేహానికి సంబంధించి ఏ ఆహారం తీసుకోవాలో 

  - ఇవన్నీ ఆరోగ్యంపై ఏ విధంగా పరిణమిస్తాయో, పరీక్షించి, మన మహర్షులు, 

    ఈ నియమాలను మనకు ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. 


    ఈ నియమాలని పాటిద్దాం. 

* పెద్దలిచ్చిన ఆరోగ్య సూత్రాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. 

* చాతుర్మాస్య దీక్షలో ఒక ప్రధాన అంశమైన - ఆరోగ్య లబ్ధిని పొందుదాం. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :4/150 


ఉన్మత్తవేషఃప్రచ్ఛన్నః 

సర్వలోకప్రజాపతిః I 

మహారూపో మహాకాయో 

వృషరూపో మహాయశాః ॥  4  


* ఉన్మత్తవేషప్రచ్ఛన్నః = పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు, 

* సర్వలోకప్రజాపతిః = సమస్తలోకములందలి ప్రజలను (ప్రాణికోటిని) పాలించువాడు, 

* మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు, 

* మహాకాయః = గొప్పశరీరము కలవాడు, 

* వృషరూపః = పుణ్య (ధర్మ) స్వరూపుడు, 

* మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

అబద్దం - శిక్ష

 అబద్దం - శిక్ష


శ్రీరామ నామాన్ని ప్రచారం చెయ్యడానికి, రాసే భాగ్యం కలిగించడానికి మహాస్వామి వారు ఒక ఉపాయం అలోచించారు. దాని ప్రకారం ఒక లక్ష సార్లు రామ నామాన్ని రాసిన వారికి బంగారు నాణెం, కుంకుమ ఇచ్చేవారు. మహస్వామి వారి నుండి బంగారు నాణెం తీసుకోవడం కోసం చలా మంది రామ నామాన్ని రాసి వారికి సమర్పించేవారు. చాలా మంది భక్తులు దర్శనానికి వచ్చేటప్పుడు వారు రాసిన పుస్తకాలను తీసుకుని వచ్చి మహాస్వామి వారికి సమర్పించి, బంగారు నాణాన్ని తీసుకునేవారు. 


ఈ మంచి అలవాటు ఇంకా వ్యాప్తి చెందటం కోసం, లక్ష సార్లు రామ్ నామాన్ని రాయ్ లేని వాళ్ళు అందులో ఎనిమదవ వంతు అంటే 12,500 సార్లు రాస్తే ఒక వెండి నాణేన్ని బహూకరించేవారు. వారు అనుకున్న విధంగానే రామ నామం రాసే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరగసాగింది. 


మహాస్వామి వారి యాత్రా సమయంలో కూడా వారి పరిచారకులు కొన్ని బంగారు వెండి నాణెములను వారితో పాటుగా తీసుకువెళ్ళేవారు. అలా ఒకసారి చెన్నై యాత్రలో సంస్కృత కళాశాలలో మహాస్వామి వారు దర్శనం ఇస్తున్నప్పుడు, 

ఒక చిన్న అమ్మాయి వారి వద్దకు వచ్చి మహాస్వామి వారికి నమస్కరించి, తను రాసిన రామ నామ పుస్తకాన్ని అక్కడ ఉంచి “దయచేసి నాకు ఒక వెండి నాణెం ఇవ్వండి” అని అడిగింది. 


మహాస్వామి వారు వెండి నాణేన్ని బహూకరించి నవ్వుతూ “రామ నామాన్ని సరిగ్గా రాసావా?” అని అడిగారు. 


”అవును” అని చెప్పి ఆ అమ్మయి అక్కడినుండి పరిగెత్తింది. ఈ సంఘటన జరిగింది ఉదయం. 


మధ్యాహ్నం అదే అమ్మాయి మహాస్వామి వారి ముందు ఏదో వెతుకుతున్న దానిలా అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంది. కొద్దిసేపటి తరువాత ఆ అమ్మయి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి. 


ఇదంతా చూసి మహాస్వామి వారు ఒక పరిచారకుణ్ణి పిలిచి ఆ అమ్మాయిని పిలవమన్నారు. ఆ పిల్ల మహాస్వామి వారి వద్దకు వచ్చి కళ్ళు తుడుచుకుంటూ వారి ముందు నిలబడింది.


“బంగారు తల్లీ, ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైనా పోగొట్టుకున్నావా?” ప్రేమ పూరిత మాటలతో ఆ అమ్మయిని అడిగారు. ”అవును, మీరు నాకు ప్రసాదంగా ఇచ్చిన వేడి నాణెం పోయింది.”


“నేను నిన్నొకటి అడుగుతాను ఏమి దాచకుండా నిజం చెప్పాలి. నువ్వు ఇచ్చిన పుస్తకంలో ఎన్ని సార్లు రామ నామాన్ని రాసావు?”


“నేను ఎనిమిది వేల ఐదువందల సార్లు రాసాను” అని చెప్పింది ఆ అమ్మాయి.

“ఓ అలాగా! నీకు తెలియదా? 12,500 సార్లు రాసిన వారికే వెండి నాణెం ఇస్తానని.”

అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, “నాకు తెలుసు పెరియావ నేను మీతో అబద్దమాడాను మీరు ఇచ్చే వెండి నాణేం కోసం. నేను చేసింది తప్పే నన్ను క్షమించండి.” అని భోరున విలపించింది. 


వారి చుట్టూ ఉన్నవారు అనుకున్నరు ఇప్పుడు మహాస్వామి వారు ఆ పిల్ల తల్లి తండ్రులని పిలిచి దండించమని చెప్తారు అని. కాని ఆ అవ్యాజ కరుణా మూర్తి ఏమి చేసారో తెలుసా?


“ఈ చిన్న పిల్ల ఒక తప్పు చేసింది. దాన్ని పెద్దది చెయ్యకండి. ఇప్పుడు ఇక్కడున్న మీరందరూ ఇక్కడ కూర్చుని మిగిలిన 4000 సార్లు రామ నామాన్ని వ్రాయండి.” ఇది విన్న వెంటనే అక్కడున్న వారందరూ పులకించిపోయారు.


ఎందుకు? దానికి రెండు కారణాలు. 


ఒకటి చిన్నవారి పై మహాస్వామి వారి అపారమైన కరుణని ప్రేమని క్షమాగుణాన్ని కనులారా చూడటం. రెండవది మహాస్వామి వారి సమక్షమంలో రామ నామం రాయగలిగే అదృష్టం కలగడం. తొదరగా రాయడం పూర్తి చేసి మహాస్వామి వారికి సమర్పించారు. 


మహాస్వామి వారు ఆ పాపని పిలిచి “నేను ఇచ్చిన వెండి నాణెం పోయిందని దిగులుపడుతున్నావు కదూ. ఇప్పుడు నేను నీకు బంగారు నాణెం ఇస్తాను. జాగ్రత్తగా ఉంచుకో” అని ఆశీర్వదించి ఒక బంగారు నాణేన్ని ఇచ్చారు. ఆ అమ్మాయి చాలా సంతోషంతో దాన్ని కళ్ళకద్దుకుంది.


#KanchiParamacharyaVaibhavam #Paramacharya

ప్రశాంతంగా ఉండేందుకు

 శ్లోకం:☝️

*సుఖమాస్తే సుఖం శేతే*

 *సుఖమాయాతి యాతి చ ।*

*సుఖం వక్తి సుఖం భుంక్తే*

 *వ్యవహారోఽపి శాన్తధీః ll*

(అష్టావక్రగీత - 18/59)


అన్వయం: _యస్య మానవస్య బుద్ధిః శాన్తమయీ భవతి సః సుఖే ఉపవిశతి సుఖేన శతే సుఖేన గచ్ఛతి ఆగచ్ఛతి చ తథైవ సుఖేన వదతి తథా సుఖేన భోగాన్ అనుభవతి । అతః సదా శాన్తబుద్ధిశాలీ భవితుం ప్రయాసః కరణీయః ।_


భావం: ఎవరి మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. సుఖంగా నిద్రపోతాడు, సంతోషంగా వ్యవహరిస్తాడు, ఆనందంగా మాట్లాడతాడు మరియు సుఖంగా భోగాలను అనువిస్తాడు. అందుకే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.