31, డిసెంబర్ 2022, శనివారం

వైదిక యజ్ఞం - జీవ హింస

 వైదిక యజ్ఞం - జీవ హింస


1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది. ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. కారణమేదైనప్పటికి జంతువులను చంపడం పాపం అని తీర్మానించారు. కాబట్టి మాంసాహారాన్ని వదలి అందరూ శాఖాహారులుగా మారాలి అని చెప్పారు. అహింస, శాఖాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. 


ఆ సదస్సు ముగిసిన తరువాత థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులని పరమాచార్య స్వామి అనుమతితో వారి దర్శనానికి తీసుకుని వచ్చారు. స్వామి వారిని కలవాలని ఆ ప్రతినుధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 


శంకర మీనన్ అందరిని పేరు ఊరుతో సహా స్వామి వారికి పరిచయం చేసారు. వారిని పరిచయం చేసిన తరువాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామి వారు వారించి, “నా గురించి నువ్వు ఏమి చెప్పనవసరం లేదు. నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు” అని అన్నారు. 


కొంతమంది ప్రతినిధులు స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామి వారు దానికి అంగీకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?”


అందుకు మహాస్వామి వారు “అవును అది చేయతగినదే. అది పాపం కాదు” అని బదులిచ్చారు. ఇది వినగానె వారందరూ ఫక్కున నవ్వారు. స్వామి వారిని అవమానపరిచారు అని మీనన్ గారికి కోపం వచ్చింది. వారివైపు తిరిగి ఆవేశంతో, “నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది స్వామి వారి ఆశీస్సులకోసం. మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అని తెలిసుంటె నేను ఈ పనికి పూనుకునేవాణ్ణి కాదు” అని అరిచారు. 


స్వామివారు మీనన్ ను శాంతపరిచారు. “వాళ్ళపై కోపం పడవద్దు. వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు. జీవహింస పాపం అని అది ఏ కారణానికి అమోదయోగ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. కాని నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వారు. నన్ను అవమాన పరచలాని వాళ్ళకు ఆలోచన లేదు. మనం వారికి అర్థం అయ్యే లాగా సమాధానం చెప్పాలి” అని శాంతంగా చెప్పారు. 


మీనన్ కోపం తగ్గిన తరువాత మళ్ళా స్వామి వారు ఇలా చెప్పారు “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకణ్ణి చంపాడు. మరి అతణ్ణి కోర్టు ఉరితీయడం జీవహింస కాదా? మరి న్యాయమూర్తి చెసినది పాపం కాదా?”


స్వామి వారి మాటలు వారిని అలోచనల్లో పడేసాయి. వారు చాలా విద్యావంతులు. సత్యప్రమాణములైన మాటలు స్వామి వారు చెప్తున్నారని అర్థం చేసుకుని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూపారు. 


మరలా మహాస్వామి వారు “నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, అందరిని ఆపి ప్రాణాలు నిలబెట్టే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయనుకుందాం. అప్పుడు ముందు అగ్నిమాకప యంత్రాన్ని పంపిస్తాం. అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి. మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం, అత్యవసరంలో ఉన్న మిలటరి వ్యాను వస్తే ముందు మిలటరి వ్యానును పంపిస్తాం. కొంతమంది ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది. కాబట్టి అలాంటి సందర్భంలో దేశరక్షణ కోసం కొంతమంది ప్రాణాలను లెక్కచెయ్యము.

 

రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమందిని చంపుతాడు. ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి? కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ అన్ని సంఘటనల్లో మనం జీవహింసను అమోదిస్తాం. ఇలాంటి నియమాలణ్ణి మనం ఏర్పరుచుకున్నవే. అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.


వేదం అపౌరుషేయం. అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలకు అభేదం లేదు. వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘శాస్త్రాయ చ సుఖాయ చ’. వేదాలు, శాస్త్రాలు మంచినే బోధిస్తాయి. జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు. 


దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః 

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ


మనం యజ్ఞ యాగాదులను చేసి దేవతలను సంతృప్తి పరిస్తే, దేవతలు మనకు సకాల వర్షమును మంచి జీవితాన్ని ఇస్తారు. కాబట్టి వైదిక యజ్ఞములలో చేసే జీవహింస సరిఅయినదే. దాని వల్ల పాపము లేదు. అంతేకాదు. సనాతన ధర్మంలో యజ్ఞము చేయిట హింస, పాపము అని కూడా చెప్పబడింది కాబట్టి చేయకూడదు. కాని ఎవరు చేయుకూడదు అనే విషయం మనం తెలుసుకొని ఉండాలి. 


వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానము ఉంది. ‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి ఆచార్యకాండ యందు విపరీతమైన అభిమానం మక్కువ. కాబట్టి లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. తరువాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితి పొందిన వాడు ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞయాగాదులు చెయ్యరాదు. కాని అతనికి వాటిపైన ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు. నారదమహర్షి వచ్చి అతనికి అతనికి జ్ఞానోదయం కలిగించాడు. అప్పటినుండి అతను యజ్ఞయాగాదులు మానేసాడు. 


కాబట్టి, “ఏది హింస, ఏది కాదు, ఎవరు ఏమి చెయ్యాలి?, ఏమి చెయ్యకూడదు” అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే నువ్వు నేను కాదు. మనకు వేదమే ప్రమాణం. చట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికి తెలుసు. విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళా ఎన్నో విత్తనాలను ఇస్తుంది. కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే. కాయగూరలు, ఆకుకూరలు కూడా జీవహింస కదా. అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు. జ్ఞానులు ఎండుటాకులు, నీరు, గాలి తీసుకుని బ్రతికేవారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. 


కాబట్టి వీటన్నిటి వల్ల మనకు తెలిసేదేమంటే కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. కాబట్టి అహింస అనేది వారి వారి ఆశ్రమాన్ని బట్టి పాటించాలి. కాబట్టి గృహస్తు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే హింస పాపం కాదు. ఇది వేదప్రమాణం. కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు. 


--- థిల్లైనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4

అతడు డ్రైవరు 

అతడు డ్రైవరు 

ఒక కారు నడిపే చోదకుడిని కారు డ్రైవరు అని, ఒక లారీ నడిపే చోదకుడిని లారీ డ్రైవరు అని, అదే జీపుని నడిపే డ్రైవరుని జీపు డ్రైవరు అని పిలవటం మనం సాధారణంగా చూస్తూవుంటాము. అంతేకాదు మారుతి కారు, మహేన్ద్ర కారు, టాటా కారు అని ఇంకా కారుకు ముందు పెట్టి డ్రైవరు అని పిలుస్తారు. మారుతి కారు డ్రైవరు, మహేంద్ర కారు డ్రైవరు ఆలా ఇంకా కొన్ని సందర్భాలలో యజమాని పేరుతొ అంటే రామారావు కారు డ్రైవరు, కృష్ణారావు కారు డ్రైవరు ఇలా.  అతని ఎలా పిలిచినకాని నిజానికి ఆటను మాత్రం డ్రైవరు. 

ఒక డ్రైవరు చక్కగా తాను విధినిర్వహణ చేస్తున్న కారును చక్కగా నడిపి యజమాని అవసరానుకూలంగా అతనిని సరైన సమయానికి అతను కోరుకున్న ప్రదేశాలకు చేర్చుతూ, కారును మంచిగా చూసుకుంటూ ఉంటే ఆ డ్రైవరు ఆ యజమాని మెప్పుని పొంది అతని జీతంలో వృద్ధి మరియు ఇతర ఎలావన్సులు యజమాని నుండి పొందగలడు, అదేవిధంగా కారుని సరిగా చూసుకోక కారుకు ప్రమాదాలను కలగచేస్తూ, యజమానికి కారు ఎక్కాలంటేనే భయం వేసే విధంగా కారును నడిపితే ఆ కారు డ్రైవరు యజమాని కోపానికి గురి అయి వెంటనే ఉద్యోగంనుండి తొలగించటమే కాకుండా యజమాని అతని నుండి నష్టపరిహారం కారే విధంగాకూడా పరిస్థితులు  ఏర్పడవచ్చు. వీటన్నిటికీ కారణం డ్రైవరు తన విధులను నిర్వహించే విధానం మీద ఆధార పడివున్నదని వేరే చెప్పనవసరం లేదు.  మనం ఉపయోగించే ఏ వస్తువు అయినా మనం దానిని వాడే విధానం మీద ఆధార పడివుంటుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఇద్దరు మిత్రులు ఒకే రోజు చెరొక కారు వకే మాడలుది కొన్నారనుకోండి ఆ ఇద్దరు కారులు వకే విధంగా పనిచేయాలని లేదు.  ఒకని కారు ఎలాంటి లోపంలేకుండా చక్కగా నడవ వచ్చు ఇంకొకని కారు కొన్న మరుసటి రోజే చెడిపోయి షడ్డుకు వేళ్ళ వచ్చు. కాబట్టి దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే తయారుచేసే వాడు రెండు ఒకేమాదిరిగా చేసినా కూడా దేని మన్నిక దానిది. మానవుడు ఎంతో నయపుణ్యంతో తయారుచేసిన వస్తువు ఎలా పనిచేస్తుందో చెప్పలేము, కానీ సరిగా పనిచేయటానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు నిపుణులు తీసుకుంటారు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మిత్రమా నీవు నేను అని దేనిని అంటున్నావో అది నీ శరీరంలో అందులో వున్న నీవే నీవు అంటే అర్ధం కాలేదు కదా అదేమిటంటే నేను అనుకునే శరీరాన్ని నియంత్రించే దివ్య చెతన్యం మాత్రమే నీవు కానీ ఏరకంగా ఐతే ఒక కారు డ్రైవరు ఆ కారుతో కలిపి తన ఉనికిని చెపుతాడో అదేరకంగా నీవు నీ శరీరంతో కలిపి నీ ఉనికిని చెపుతున్నావు.  అంతవరకూ అయితే పరవాలేదు చాలామంది తమ ఉనికే శరీరం అని భావించి శరీరంలోని నిఘాడమైన దివ్యమైన, సుద్ద చేతన్యాన్ని మారుస్తున్నారు.  దానితో వారి శరీరానికి అనేక విధాలుగా బంధాలను, సుఖాలను, పొందాలని ప్రయత్నిస్తూ ఒక అసమర్ధపు కారు డ్రైవరు తానూ కారుని సరిగా నడపలేక ప్రమాదాలకు గురుచేసినట్లుగా శరీరంతో అనేక పాపకృత్యాలను  సలుపుతున్నారు. దాని ఫలితంగా బాధలను, కష్ఠాలను, ఇబ్బదులను, అనుభవిస్తున్నారు.  అదే సత్యాన్ని తెలుసుకున్న సాధకుడు తన శరీరం కేవలం శుద్ధ చెతన్యమైన తనకు ఆశ్రయమిచ్చిన ఒక కారు లాగా భావించి ఏరకంగా ఒక సమర్థుడైన కారు డ్రైవరు లాగా శరీరాన్ని నియంత్రించి పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలితాన్ని పొంది దాని వల్ల సుఖాలను, ఆనందాలను అనుభవించి చివరకు మోక్షపదాన్ని చేరుతున్నాడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

30, డిసెంబర్ 2022, శుక్రవారం

నిర్ణయింపబడి ఉంటాయి

 శ్లోకం:☝️

*ఆయుః కర్మ చ విత్తం చ*

 *విద్యా నిధనమేవ చ |*

 *పంచైతాన్యపి సృజ్యంతే*

 *గర్భస్థస్యైవ దేహినః ||*


భావం: "మనిషియెక్క ఆయుర్దాయం, జీవించటానికి చేయు వృత్తి, ధనం, విద్య, చావు అనే నిర్దిష్టములైన ఐదూ తల్లి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడి ఉంటాయి." - అని భావం.

అయితే పెద్దల ఆశీర్వచనాల వల్ల, దైవానుగ్రహం వలన, పురుష ప్రయత్నంతోను ఏమీ ఉపయోగం లేదా? అంటే ? "ఉన్నది."అని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

మార్కండేయుడు, శంకర భగవత్పాదులు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకున్నారు. హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా వరమందారు. యుద్ధంలో చనిపోయిన వానర వీరులను హనుమంతుడు సంజీవనితో బ్రతికించినట్లు, చనిపోయిన సాందీపముని యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు విన్నాం కదా!

29, డిసెంబర్ 2022, గురువారం

స్మశాన నారాయణస్వామి* *ఆలయం,*

 *స్మశాన నారాయణస్వామి* *ఆలయం,*

*ఆలంపుర్*


పితృ దోషము నుండి బయటపడే 

సులువైన పరిష్కారం..


#పితృదోషం మన తాతలు తండ్రులు 

సంపాదించిన ఆస్తిపాస్తులను 

వంశపారంపర్యంగా అనుభవించటానికి 

మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన 

పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..


మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే #పితృదోషం


ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.

అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.


ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...


🔻 చిన్న వారు అకాలమరణం పొందడం 


🔻 శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.


🔻 అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం.


🔻 మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.


🔻 మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం


ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.

స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...

అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.


1. కాశీ

2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)


అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.


విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.


స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....

పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.


ఈ ఆలయ ప్రాముఖ్యము  తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..


చేరుకొనే విధానం:


అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "


ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!


దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.


    🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏

స్పాండిలైటిస్

: స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం  ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

[29/12, 5:36 am] +91 98850 30034: వ్యాధుల నివారణ కొరకు రహస్య తాంత్రిక ప్రయోగాలు  - 1


     మనుష్యుడు యొక్క రోగాలకు ప్రధానకారణం తన అలవాట్లతోపాటు పూర్వజన్మ కర్మఫలం కూడా ఉంటుంది. మన జాతకంలో గ్రహస్థితులు కూడా మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాయి. మనిషికి సంప్రాప్తించిన రోగాలకు ఔషధాలు వాడటం మాత్రమే కాదు కొన్నిరకాల తాంత్రికపరమైన చిట్కాలు చేయడం ద్వారా కూడా సమస్య నుంచి బయటపడవచ్చు.  అనారోగ్యం వచ్చినపుడు ముందు ఔషధసేవన చేయవలెను . తగ్గనప్పుడు ఆ రోగకారణమైన గ్రహానికి జపం చేయించవలెను . మార్పు రాకున్నచో అభిషేకం ఆ తరువాత హోమం చేయించవలెను . కాని ఔషధసేవన మాత్రం విడువరాదు. పురాతన కాలము నందు వైద్యులకు వైద్యశాస్త్రముతో పాటు జ్యోతిష్యం మరియు ప్రశ్నశాస్త్రము నందు సంపూర్ణ అవగహన ఉండేది. 


                  ఈ మూడింటిని కలిపి తప్పక నేర్చుకునేవారు. " వైద్యజ్యోతిష్యము " అని ఆయుర్వేదం నందు ఒక ప్రత్యేక విభాగం ఉండేది.  అదేవిధంగా కొన్నిరకాల మంత్ర మరియు తాంత్రిక ప్రయోగ పద్ధతులను పాటించి సులభముగా అనారోగ్యము నుంచి బయటపడవచ్చు. 


      మన ప్రాచీన భారతదేశం అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు . ఆయా శాస్త్రాలలో ఎన్నొ పురాతన ప్రక్రియలు ఉన్నాయి . అటువంటి శాస్త్రాలను నేను సేకరించే పని మీద ఉన్నాను. నాకు లభ్యం అయిన అటువంటి పురాతన గ్రంథాలను చదివి అవగాహన చేసుకుని కొన్ని అనుభవ యోగాలను జోడించి నేను రెండు గ్రంథాలు రాయడం జరిగింది. ఇప్పుడు మీకు తాంత్రిక పద్దతిలో అనారోగ్యం నుంచి బయటపడుటకు కొన్ని రహస్య యోగాల గురించి వివరిస్తాను. 


 తాంత్రిక యోగాలు  - 


 *  మనశ్శాంతికి  - 


        మనశ్శాంతి లేకపోవడం వలన మనము చేసేపని మీద శ్రద్ధ పెట్టలేము . అటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు శుక్లపక్ష సోమవారం నాడు ప్రారంభించి వరుసగా ఏడు సోమవారాలు శివలింగానికి పాలు మరియు నీరు కలిపి అభిషేకం చేస్తూ " ఓం నమః శ్శివాయ " అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి . ఈ విధముగా ఏడు సోమవారాలు చేసిన మనశ్శాంతి లభించును. 


 *  గుండె దడ నివారణ కొరకు  - 


      " ఓం నమః శ్శివాయ " అనే పంచాక్షరి మంత్రం కాని " ఓం నమో నారాయణాయ నమః " అనే అష్టాక్షరీ మంత్రం జపించుచున్న గుండె దడ తగ్గును. 


 *  శరీర ఆరోగ్యానికి  - 


       శరీరంలోని అనారోగ్య భాధ ఎన్నటికీ తగ్గకున్న గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయవలెను . గంగాజలం ఎక్కువ లేకున్న  స్నానానికి సిద్ధం చేసుకున్న నీటిలో కొంచం గంగాజలం కలుపుకొని ఆ నీటితో అయినా స్నానం చేయవచ్చు . 


 *  రోగవిముక్తికి  - 


      దేవాలయంలో గుప్తదానం చేయడం రోగ నివారణకు ఫలవంతమైన ఉపాయం . 


 *  శరీరంలో కఫదోష నివారణ కొరకు  - 


      కఫదోష నివారణ కొరకు రావిచెట్టు మీద పెట్టిన తేనె తుట్టె నుంచి సేకరించిన తేనె లోపలికి  తీసుకోవలెను . సైన్ధవ లవణంతో భంగు కలిపి తీసుకోవడం వల్ల జఠరాగ్ని పెరుగును . 


 *  అనారోగ్యం తొలగి ఆరోగ్యం వృద్ధికి  - 


      వేపచెట్టు నాటాలి . తూర్పు దిక్కుకి ఎదురుగా నిలుచొని రాగిచెంబుతో నీటిని అర్పించాలి. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి ఇది బాగుగా పనిచేయును . 


 *  రోగ నివృత్తికి  - 


      ఇంట్లో ఎవరైనా రోగగ్రస్తులై ఉంటే వారిని ఇంటికి నైరుతి కోణంలో పడుకోపెట్టి ఈశాన్యకోణంలో చల్లని నీటికుండ ఉంచాలి. రోగి వాడుతున్న ఔషధాలు శక్తివంతంగా పనిచేసి రోగి అనారోగ్యం నుంచి కోలుకుంటాడు. 


 *  అనవసరపు తగువులు నుంచి రక్షణ  - 


        రాత్రిపడుకునే ముందు మంచం కింద రాగిగ్లాసులో నీరు ఉంచి ఉదయం ఆ నీటిని ఏదైనా మొక్క దగ్గర పోయాలి వ్యాధుల నుండి అనవసరపు తగువులు నుండి రక్షణ కలుగును. 


            తరవాతి పోస్టులో మరిన్ని తాంత్రిక విషయాలు వివరిస్తాను. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

అందం అంటే ఏంటి

 అందం అంటే ఏంటి నాన్నా అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే, వాళ్ళ నాన్న చెప్పిన సమాధానం.....


రోజూ లేవగానే నువ్వు నానమ్మకు గుడ్ మార్నింగ్ నానమ్మా  అని చెప్తావు చూడు..ఆ పలకరింపే అందం అంటే.


స్కూల్ కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్ లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే..


ఒకరోజు నీ ఫ్రెండ్ నీకు తెలీకుండా నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే మళ్లీ ఎప్పుడూ అలా చెయ్యకు కావాలంటే నన్నడుగు అంటూ షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అన్నావు చూడు అదే అందమంటే.


షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే .. కాస్ట్లీ అయితే వద్దు నాన్నా అంటావు చూడు అదే అందమంటే..


అమ్మకూ నాకూ గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి స్మైల్ నాన్నా అంటావు చూడు అదే అందమంటే.


నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా తీసుకో నాన్నా అన్నావు చూడు అదే అందమంటే.


అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే..


నా బాధ నీకు తెలీకుండా నీతో మాట్లాడినప్పుడు అలా ఉన్నావేంటి నాన్నా..అంతా ఓకే అవుతుందిలే అంటావు చూడు అదీ అందమంటే.


అని అనగానే..అందం అంటే హర్ట్ లో ఉంటుందా అన్న ఆయన కూతురు సమాధానం విన్న నేను ఆశ్చర్యంగా..ఆనందంగా తన వైపే చూస్తూ ఉండిపోయాను.


సేకరణ.   🌺🌺🌺

28, డిసెంబర్ 2022, బుధవారం

 భూమిని వదిలి

 భూమిని వదిలి విమానంలో కూర్చున్న ప్రయాణికుడు కూర్చున్నప్పుడు  ఒక బస్సులోనో, రైల్లోనో, కార్లోనో కూర్చున్నట్లే ఉంటుంది కానీ విమానం కదిలి అది భూమిమీద వేగాన్ని పుంజుకుంటే అప్పుడు అది ఒక రైలు, బస్సు,కారుకన్నా ఎంతో వేగంగా వెళ్ళటం గమనిస్తాము. వేగాన్ని అధికంగా పెంచి ఒక దశలో పైలట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కూర్చున్న ప్రయాణికుడికి విమానం భూమిని వదిలిన క్షణం ఏదో తెలియని అనుభూతి (feeling ) కలుగుతుంది.  నిజానికి ప్రయాణికుడు కూర్చున్న సీటుకు దాదాపు పది, పదిహేను అడుగుల క్రింద విమానపు టైర్లు ఉంటాయి అయినాకూడా విమానం భూమిని వదిలిన క్షణం ప్రతి ప్రయాణికుడు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. విమానం గాలిలో ఏటవాలుగా వెళ్లి ఒక దశలో అది చేరుకోవలసినంత ఎత్తుకు చేరుకోగానే ఇక మీరు సీటు బెల్టు తీయవచ్చు అని అనౌన్సమెంట్ వస్తుంది. మరల విమానం దిగవలసిన పట్టణంలో లాండింగ్ గేరు వేస్తె ప్రయాణికుడు ఒక జారుబండమీదనుండి క్రిందికి దిగుతున్న అనుభూతితో వినంలోంచి దిగటం మనందరికీ అనుభవమే.  ఇక్కడ కొంత సమంయం మాత్రమే ప్రయాణికుడు భూమిని వదిలి వుంటాడు. అది అతని ప్రయాణపు దురంమీద ఆధారపడి ఉంటుంది. మరల విమానం భూమిని చేరుకోవటంతో ప్రయాణికుడు విమానం దిగి భూమి మీద తన గమనం మొదలుపెడతాడు. భూమిని వదిలి మానవుని మనుగడ సాగించలేడు అదే శాస్వితంగా భూమిని వదిలితే అది ఎంతమాత్రం సాధ్యం కాదు అని ఎవరైనా అంటారు.  కానీ అది నిజంకాదు ఇంజానికి ప్రతి మానవుడు ఏదో ఒకరోజు శాస్వితంగా భూమిని వదలి వెళ్ళాలి.  కాకపొతే విమానంలో ప్రయాణించే ప్రయాణికుడు తాను (అంటే దేహం దేహి రెండూకూడా) భూమిని వదలి కొంతకాలం మాత్త్రం ఉండి గగన విహారం లోని అనుభూతిని  పొందుతాడు. కానీ తన చివరి ప్రయాణంలో మాత్రం మానవుడు తాను  ఒక్కడే భూమిని వదిలి  వెళతాడు. అంటే దేహాన్ని ఇక్కడే వదలి వెళ్లాల్సి ఉంటుంది. దానినే మరణం అని భావించి ప్రతివారు మరణాన్ని గూర్చి భయపడతారు మరి తనతో పాటు తీసుకొని వెళ్ళేది అంటే లగేజి ఏమిటి అంటే ఈ భూమి మీద నీవు సంపాదించిన సంపద అది ఎటువంటిది అయినా కూడా నీవు తీసుకొని పోవటానికి వీలు లేదు. అదే విధంగా ఇక్కడి నీ తోటి ప్రయాణికులు అదే భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఎవ్వరు కూడా నీ వెంట రారు.  మరి నీతో వచ్చే లగేజి ఏమిటంటే అది కేవలం నీవు భూమి మీద ఆచరించిన కర్మల ఫలితం మాత్రమే . నీవు సత్కర్మలు ఆచరిస్తే ఆ ఫలం పుణ్యంగా, నీవు దుష్కర్మలు ఆచరిస్తే దాని ఫలితముగా పాపం నీకూడా  వస్తాయి. తరువాత ఆ విధాత నీ ప్రారబ్దాన్ని పట్టి తిరిగి భూమిమీదకు తిరిగి పంపుతాడు.   .  కానీ నిజానికి మిత్రమా ఈ భూమిమీదికి రాకముందు నీవు ఎక్కడ వున్నావు అది నీకు తెలియదు, అలాగే నీవు భూమిని వదిలి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళతావో అది కూడా నీకు తెలియదు. దానిని తెలుసుకోవటమే బ్రహ్మ జ్ఞాన సముపార్జనగా మన మహర్షులు తెలిపారు.  బ్రహ్మ జ్ఞాని (బ్రహ్మమును  తెలుసుకున్నవాడు)మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి విడివడుతాడు. "బ్రహ్మ వేద బ్రహ్మయేవ భవత్" మానవుని జీవిత గమ్యం ఒక్కటే అది బ్రహ్మమును తెలుసుకోవటం  మాత్రమే. సాధక ఈ క్షణమే ఉద్యుక్తునివి కమ్ము బ్రహ్మ్మముని తెలుసుకో బ్రహ్మ జ్ఞానివి అయి ఈ జనన మరణ చెక్రము నుండి విడివడి ఈశ్వరుని సాన్నిధ్యాన్ని చేరుకొనే ప్రయత్నం చేయి.  

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

 

27, డిసెంబర్ 2022, మంగళవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 100 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ఏకాదశ స్కంధము – బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట


కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు ‘ఈవేళ ఇంతమంది దేవతలు వచ్చారు. ఏమిటి విశేషం' అని అడిగితే వాళ్ళు 'ఈశ్వరా! రాక్షస సంహారం చెయ్యడం కోసమని మీరు వైకుంఠంనుండి బయలుదేరి ఇక్కడకు వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికీ గొప్ప సులభుడవు అయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపాల బాలురు, గోపకాంతలు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నీవు వచ్చి నూట ఇరువది అయిదు సంవత్సరములు పూర్తి అయింది. ఇంక నీవు ఈ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరి నీ మూల స్థానమునందు ప్రవేశించవలసినది’ అని అడిగారు. భగవానుడు ‘ఓహో! నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమయినది. అవతార పరిసమాప్తి చేస్తాను. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను’ అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేశారు. ‘తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు. ఈ యాదవుల కులం అంతా కూడా తనతోపాటే నశించిపోవాలి. మొత్తం కులనాశనం జరగాలి’ అని తలంచారు. తాను నాయకత్వమునందు ఉండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవులను ఎవరూ చెణకలేరు. మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యమును ఆవిష్కరిస్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదమును తీసుకువస్తుందో చూపిస్తారు. ప్రమాదంతో కూడిన పనిని యాదవులచేత చేయించారు.


విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనమునకు వచ్చుట


ఒకరోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భ్రుగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులు అందరూ కృష్ణ పరమాత్మ దర్శనమునకు వచ్చారు. ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒకమాట. 'నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉన్నదో అది నిరర్ధక మయిన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటివైపు తిరుగుతారు. అలా తిరగడం వలన మనుష్య జన్మ నిరర్థకం అవుతుంది. ఆ తరువాత మరల ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకుని, కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖమును సుఖమనుకొని గడిపివేస్తున్నారు. ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్లి దాచుకున్నా ఇది ఉండదు వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. ఈ కాలమునందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాలబాలురతో కలిసి నువ్వు తిరిగి, కౌగలించుకొని, ఆడి పాడి ఇంతమందిని తరింపజేశావు. కృష్ణా! నీ లీలలు రాబోవుతరంలో విన్న వారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవిందనామమును పలికిన వారిని గట్టెక్కిస్తాయి. తండ్రీ! నీవు అంత గొప్ప అవతారమును స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరల దొరకదు. ఒక్కసారి నిన్ను కనులార దర్శిద్దామని వచ్చాము’. వాళ్ళకి అవతార పరిసమాప్తి అయిపోతున్నదని తెలుసు. ఈశ్వరా! నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా? అని మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయారు.


ఈ సంసారమును దాటడానికి నీ పాదములు ఆధారము. వచ్చే కష్టములు తొలగిపోవడానికి నీ పాదములు ఆధారము. వేదములను నీ పాదములు ఆభరణములు. నీ చరణారవిందములను ఈ మాంసనేత్రముతో చూడాలని వచ్చాము. మరల ఇటువంటి పాదములు మాకు దొరుకుతాయా? ఇవి ‘అంగనామంగనామంతరే మాధవం’ అని కొన్నివేలమంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాడిలా గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు. నీ పాదములను గోపాల బాలురు ‘మా కృష్ణుడు’ అని అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడని తెలియక ఆడుకున్న పాదములు. ఈ పాదములు వాళ్ళతో ఆడుకున్నపుడు వాళ్ళని తన్నిన పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేలగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాలబాలుర చేత ఒత్తబడిన పాదములు. ‘బ్రహ్మ కడిగిన పాదము’ అని బ్రహ్మగారి చేత కడిగించు కొనిన పాదములు. ఇంతమందిని తరింప జేసినా ఆ పాదములను ఒక్కసారి చూసి తరించి పోదామని వచ్చాము కృష్ణా’ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు.


కృష్ణా! నీనామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని ముప్పయిమూడుకోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. కలియుగమునకు నీ నామమే రక్ష. నీది చాలా తేలికయిన నామము. గోవింద నామము నీ అంతట నీవు కష్టపడి సంపాదించుకున్న నామము. ఏడేండ్ల బాలుడవై ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నీవు సంపాదించుకున్న నామము. స్వామీ నిన్ను మరల ఎప్పుడు చూస్తాము? ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాము’ అని స్తోత్రం చేశారు. కృష్ణపరమాత్మ నవ్వి ‘నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి కారణం ఉన్నది. మీరు నన్ను చూసి తరించారు కదా! చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. నేను నా మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళండి. నదీ స్నానం చేయండి. అవతార పరిసమాప్తికి యాదవకుల నాశనం జరగాలి’ అని చెప్పాడు. ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని భగవంతుని కథలు తలుచుకుని పొంగిపోతున్నారు.


ఋషుల శాపము


వారికి కొద్ది దూరంలో ఉన్న కొందరు యాదవులు నవ్వుతూ తుళ్ళుతూ దూరంనుండి ఆ మహర్షులను చూసారు. కృష్ణుని ప్రచోదనం చేత వాళ్ళలో ఒక చిత్రమయిన బుద్ధి పుట్టింది. సాంబుడికి చీరకట్టి ఆడదానిలా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్లు చేసి వీళ్ళు ఏపాటి పరిజ్ఞానంతో చెపుతారో చూద్దామని అతడిని మహర్షుల దగ్గరికి తీసుకువచ్చారు. వారు సాంబుడిని మహర్షుల ముందు నిలబెట్టి ‘మీరు మహాత్ములు కదా! మీకు తెలియని విషయములు ఉండవు. మీరు త్రికాలవేదులు. ఈ ఆడపిల్ల కడుపులో మగవాడు ఉన్నాడా? ఆడపిల్ల ఉన్నదా? కవలలు ఉన్నారా? ఏ విషయం మాకు చెప్పండి’ అన్నారు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీవంక చూశారు. వాళ్లకి మహా ఆగ్రహం వచ్చింది. ‘మీకు భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడు ఉన్న గడ్డమీద ఉన్న మీరు ఇటువంటి పరిహాసం చేయడానికి సిగ్గుపడడం లేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులను చూడగానే భక్తితో సేవిస్తారో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు తలమీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసివున్న మీకు ఇంతటి దుస్సాహసమా? మాతో పరిహాసమా? అని వాళ్ళు

'కొడుకూ కాదు, కూతురూ కాదు. క్షణం ఆలస్యం లేకుండా ఆమె కడుపునుంచి ముసలం ఒకటి పుడుతుంది. ఆరోకలి మీ అందరి తీట తీరుస్తుంది. దానితో మీ యదుకులం నాశనం అవుతుంది. పరిహాసం చేస్తున్న వారికి భయం వేసింది. ఇలా అన్నారేమిటని సాంబుడికి చీర విప్పారు. ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద ఇనుప రోకలి కిందపడింది. వాళ్లకి భయంవేసి ఆ రోకలి తీసుకుని పరుగుపరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి 'మేము తెలియక మహర్షులతో పరిహాసం ఆడాము. వారు శపించారు. ఈ రోకలి పుట్టింది. ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు? అని అడిగారు. కృష్ణపరమాత్మ – ఈమధ్య దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఇవి యదుకుల నాశనమును సూచిస్తున్నాయి. మీ అందరు ఆ ఇనప ముసలము చేత మరణిస్తారు. దీనిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరం మీద ఈ ఇనుప ముసలమును అరగదీసి దీనిని సముద్రంలో కలిపివెయ్యండి’ అని చెప్పాడు. వారు ఆ ముసలమును పట్టుకుని ఆ శిఖరం మీదికి వెళ్ళి ఆ ముసలమును అరగదీయడం మొదలు పెట్టారు. అది కరిగి కరిగి నల్లని తెట్టు కారుతోంది. ఆ తెట్టు తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదియ్యగా అరగదియ్యగా చివరకు చిన్న ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఆ ములుకు వల్ల ప్రమాదం ఏమీ లేదని భావించి ఆ ములుకును సముద్రంలోకి విసిరేశారు.


ఆ ములుకును ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకుందుకు సముద్రం దగ్గరకు వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడు యింటికి వెళ్ళి ఈ చేపను కోసాడు. దాని కడుపులోంచి ఆ ఇనుప ముల్లు బయట పడింది. ఆ ఇనపముల్లును తన బాణమునకు పెట్టుకుని ఆ బాణంతో దేనిని కొట్టాలా అని అడవిలో తిరుగుతున్నాడు.


కృష్ణుడు – ఉద్ధవుడు


ఈలోగా ‘అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి’ అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి ‘కృష్ణా! మేము నీతోకలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను. నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి’ అన్నాడు. కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత ఇంక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు.


‘ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను ‘వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి’ అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి ఇష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేక పోతారు. ఇంద్రియములకు వశులయిపోతారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[26/12, 6:02 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 101 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించారన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించారన్నది ప్రధానం అవుతుంది. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వారే పండితులు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి. మహా పురుషుల మూర్తులను సేవించాలి. అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకోవాలి. దీనినుంచి దాటాలని అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళాలి. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈశ్వర నామమును విడిచిపెట్టకూడదు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమయి ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా ఇంద్రియ సుఖమనుభవించవచ్చు.

సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొన్ననాడు ఇంద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని, నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.

ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు వాడు నాయందే చేరిపోతున్నాడు. ఉద్ధవా! నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.

ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది. కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుందనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు. ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయ్యాడో, ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనము ఇచ్చాయో అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ ‘హా’ అని అరిచారు. బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది. అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు. కృష్ణ పరమాత్మ ‘నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను’ అన్నారు.

దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు. కృష్ణుడు ‘నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు’ అని చెప్పారు.

యాదవుల అంతమొందుట

ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి ‘యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన ఇనప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపోయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటే వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడు గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. ‘గాండీవం ఉన్నది, పాశుపతాస్త్రం ఉన్నది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు. ధర్మరాజు గారు ‘అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.

ఫలశ్రుతి

కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. ‘ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం ఇస్తున్నాను’ అన్నారు.

అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.

నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాట ప

ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే

భ గతియు నీల వేణియు గృపారసదృష్టియు గల్గు వెన్ను డి

మ్ముగ బొడసూపు గాత గనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్.

‘ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు’ అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు

ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం

జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండునరుడు లోకులు వొగడన్.

‘ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో ఇది విన్న వాళ్ళకు, ఇది వ్రాసిన వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు’ అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.


భాగవత ప్రవచన పాఠం నేటితో సమాప్తం


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[27/12, 6:37 am] K Sudhakar Adv Br: 🙏🏻 *|| శ్రీః ||* *|| శ్రీమతే రామానుజాయ నమః ||*


*తిరుప్పావై – 11వ పాశురము*

*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*


*11వ పాశురము :-*


*కత్తు క్కఱవై క్కణంగళ్ పల కఱన్దు*

*శెతార్ తిఱ లళియ చ్చెన్రు శెరుచ్చెయ్యుమ్*

*కుత్త మొన్రిల్లాద కోవలర్దమ్ పొర్కొడియే*

*పుత్తర వల్గుల్ పునమయిలే పోదరాయ్*

*శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వన్దు నిన్*

*ముత్తమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ*

*శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ*

*ఎత్తు క్కురంగుమ్ పొరుళే లోరెమ్బావాయ్.*


*తాత్పర్యము:-*


లేగదూడలు గలవియు, దూడల వలె నున్నవియు, నగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారుతీగా ! పుట్టలోని పాము పడగవలె నన్ను నితంబప్రదేశము గలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలను మొదలుగ అందరును వచ్చిరి. నీముంగిట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామము కీర్తించుచుండిరి. కీర్తించుచున్నను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకు అర్థమేమో తెలుపుము.


🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్* 👣🪷🙏🏻🙇🏻‍♂️

[27/12, 7:39 pm] K Sudhakar Adv Br: 🙏🏻 *|| శ్రీః ||* *|| శ్రీమతే రామానుజాయ నమః ||*


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*తిరుప్పావై – 12వ పాశురము*

*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*


*12వ పాశురము :-*


*కనైత్తిళం కత్తెరుమై కన్రుక్కిరంగి*

*నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,*

*ననైత్తిల్లమ్ శేరాక్కుమ్ నర్చెల్వన్తంగాయ్*

*పనిత్తెలైవీళ నిన్వాశల్ కడైపత్తి*

*చ్చినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానై చెత్త*

*మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్*

*ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్*

*అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్*


*తాత్పర్యము:-*


’లేగదూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక తమ దూడలను తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగునుండి కారిపోవుటచే యిల్లంతయు బురద యగుచున్న యొకానొక మహైశ్వర్యసంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచి యుంటిమి. మీ యింటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణదిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి యీ గాఢనిద్ర ! ఊరివారి కందరకును నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము’ అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమునుకూడ చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్నుడగు ఒక గోపాలుని చెల్లెలిని మేల్కొలిపినారు


🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్* 👣🪷🙏🏻🙇🏻‍♂️

మదన్ మోహన్ మాలవ్యా

 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳 *నేడు బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడు స్వాతంత్ర సమరయోధులు పండిత మదనమోహన జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ*🙏🏻🙏🏻🙏🏻


మదన్ మోహన్ మాలవ్యా

భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త.

మదన్ మోహన్ మాలవ్యాా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు.ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం , ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం.ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ , టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.


పండిట్ మదన్ మోహన్ మాలవ్యా


వ్యక్తిగత వివరాలు

జననం

1861 డిసెంబరు 25

అలహాబాదు, భారతదేశం

మరణం

1946 నవంబరు 12 (వయసు 84)

బనారస్

జాతీయత

భారతీయుడు

రాజకీయ పార్టీ

భారత జాతీయ కాంగ్రెస్

వృత్తి స్వాతంత్ర్య సమరయోధుడు,విద్యావేత్త, రాజకీయ నాయకుడు

అవార్డులు: భారతరత్న 2015

మతం హిందూ

మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ , గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు.ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.


మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.


ప్రారంభ జీవితం , విద్య 


మాలవ్య 1861, డిసెంబర్ 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మూనాదేవి , బ్రిజ్ నాథ్ లు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు. అందువలన వారు "మాలవీయ"గా పిలువబడతారు. అందువల్ల వారి యింటిపేరు "వ్యాస్"గా అయింది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటిపురోహితులుగా యున్నారు. ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించేవాడు. మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు.ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు.మాలవ్యా తన విద్యాభ్యాసాన్ని హరదేవా ధర్మ జ్ఞానోపదేశ పాఠశాలలో కొనసాగించాడు. అచట ఆయన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.ఆ తరువాత ఆయన వైద వర్థిని సభ నదుపుతున్న పాఠశాలలో చేరాడు. ఆ తరువాత అలహాబాదు జిల్లా పాఠశాలలో చేరారు. అచట ఆయన "మకరంద్" అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించాడు. ఆ కవితలు వివిధ జర్నల్స్, మ్యాగజెన్లలో ప్రచురితమైనాయి.


మాలవ్యా 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది.హారిసన్ కాలేజి ప్రిన్సిపాల్ మాలవ్యాకు నెలసరి ఉపకార వేతనాన్ని అందించేవారు. మాలవ్యా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ.లో పట్టభద్రులైనారు. ఆయన సంస్కృతంలో ఎం.ఎ చేయాలనుకున్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆయన తండ్రి ఆయనను కూడా తన వృత్తిలోనికి సహాయకునిగా తీసుకుని వెళ్ళేవాడు. జూలై 1884 లో మదన్ మోహన్ మాలవ్యా తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.


బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922-23 లో హిందు మహాసభ అధ్యక్షుడుగా చేశారు


"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.

అడ్డ నామాలను, నిలువు నామాలను

🎻🌹🙏శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు..? దీని వెనుక కారణమేంటి?...!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు.. శివుడు అడ్డ నామాలు పెట్టుకుంటాడు. 

అలాగే.. విష్ణువు నిలువు నామాలు పెట్టుకుంటారు. శివ కేశవుల్లో బేధం లేనపుడు..

 ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు? ఇంతకీ శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

మానవ శరీర నిర్మాణం ప్రకారం.. కనుబొమ్మల మధ్యన షట్చక్రాలలో ఒకటైన ఆజ్ఞా చక్రము ఉంటుంది. దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు.

 ఇది బయటకు కనపడకపోయినా.. దీని ప్రభావం చాలానే ఉంటుంది. అందుకే ఇది ఉండే స్థానం లో బొట్టు పెట్టుకోవాలి అని హిందూ సాంప్రదాయం చెబుతుంది. 

ఈ స్థానాన్ని పదిలం గా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని హిందువులు నమ్ముతారు.

ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమం గా ఉంచడం కోసం, ఇక్కడ ఉండే ఇడ, పింగళ, సుషుమ్న నాడులను చల్లబరచడంకోసం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేదా విబూది లేదా కుంకుమ ధరిస్తారు. 

ఐతే హిందూ మతం లోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు. శివుడు కూడా విభూధిని మూడు అడ్డ నామాలు గా పెట్టుకుంటాడు. ఈ మూడు అడ్డ గీతాలు పెట్టుకోవడానికి కారణం ఉంది. సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక గా శివుడు అలా ధరిస్తాడట. 

అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తు గా మూడు అడ్డనామాలు ధరిస్తాడు. పరమ శివుడిని మనం కాలుడు అని పిలుస్తాం. అంటే.. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఆయన అధీనం లో ఉంటాయి కనుక వాటికి సింబాలిక్ గా ఆయన మూడు అడ్డనామాలను ధరిస్తాడు. అలానే శివ భక్తులు కూడా విబూది ని ధరిస్తూ ఉంటారు.

అలాగే వైష్ణవులు ధరించే బొట్టు వేరు గా ఉంటుంది. రెండు తెల్లని గీతలు నిలువు గా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతని ధరిస్తారు. 

ఈ రెండు తెల్ల గీతలు శ్రీ మహా విష్ణువు పాద పద్మాలుగా వైష్ణవులు భావిస్తారు. మధ్య లో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపం గా భావిస్తారు. అలా వారిద్దరిని తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు...స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

26, డిసెంబర్ 2022, సోమవారం

కషాయము

 ఆయుర్వేద ఔషధాలలోని రకాలు - 


 *  కషాయము - 


     కషాయము కాచునప్పుడు పైన మూత వేయకుండా కాయవలెను . మూసినచో కషాయము చెడిపోవును . కషాయము నందు ఉపయోగించవలసిన ద్రవ్యములు దినుసు (మూలిక) 4 తులముల చొప్పున గ్రహించి వాటిని మెత్తగా నలుగగొట్టి కొత్త కుండ యందు వేసి అందు 2 శేర్ల మంచినీటిని పోసి మందాగ్ని చేత కాచి అష్టాశముగా దింపి వడగట్టి బాలురకు పావుతులము నుంచి తులము మోతాదులో మరియు పెద్దవారికి 4 తులముల మోతాదు వరకు ఇవ్వవచ్చును . ఇందు చక్కర చేర్చవలసి వచ్చిన వాతరోగులకు 4 వ భాగము , పిత్తరోగులకు 8 వ భాగము , శ్లేష్మరోగులకు 16 వ వంతు ఇవ్వవలెను . తేనె కలుపవలసి వచ్చిన శ్లేష్మరోగులకు 4 వ వంతు , పిత్తరోగులకు 8 వ వంతు , వాతరోగులకు 16 వ వంతు చేర్చవలెను . జీలకర్ర , గుగ్గిలము , శిలాజిత్ , క్షారములు , ఇంగువ వంటివి పావుతులము కన్నా ఎక్కువ చేర్చకూడదు . 


 *  కల్కము  - 


      అల్లము తదితర శుష్కపదార్థాలను ఉదకము ( నీరు ) చే నూరి తీసేడు రసమును కల్కము అందురు . ఈ కల్కము నందు ద్రవ్యము తులప్రమాణములో ఉండవలెను . ఈ కల్కమున నెయ్యి , తేనె , నూనె కలపవలసి వచ్చినప్పుడు ఒకదాని మీద మరొకటి రెట్టింపుగాను , బెల్లము మరియు చక్కెర సమభాగాలుగా చేర్చవలెను . 


 *  చూర్ణము  - 


      ఎండిన ద్రవ్యములను మెత్తగా నూరి వస్త్రగాలితము ( మెత్తని వస్త్రము నందు నూరిన చూర్ణం వేసి జల్లెడ పట్టుట ) చేసి అరతులము నుంచి 1  తులము వరకు , చిన్నవారు ఒక మాషము ( 1 గ్రాము ) నుంచి 3 మాషములు 

(3 గ్రాములు ) వరకు దేహతత్వమును , వ్యాధి బలమును , దేశ కాలభేదములను బట్టి గుర్తెరిగి పుచ్చుకొనవలెను . 


            ఈ చూర్ణములో బెల్లము కలపవలసి వచ్చిన చూర్ణపు మోతాదుకు సమానంగా , చక్కెర కలపవలసి వచ్చిన చూర్ణముకు రెట్టింపు మోతాదులో కలపవలయును . ఇందు ఇంగువను కలపవలసి వచ్చిన ఇంగువను నేతితో పొంగించి కలుపవలెను . నెయ్యి కలపవలసి వచ్చిన ఇంగువకు రెట్టింపు  మోతాదులో , నీటిని కలపవలసి వచ్చిన చూర్ణముకు నాలుగురెట్లు చేర్చవలెను . 


                 చూర్ణము అయినను , మాత్రలు అయినను , లేహ్యమైనను , కల్కమ్ అయినను సేవించిన పిదప పాలు మొదలగువాటిని తాగవలసిన యెడల వాతరోగము నందు 12 తులములు , పైత్యరోగము నందు 8 తులములు , శ్లేష్మరోగము నందు 4 తులములు పుచ్చుకొనవలెను . 


     చూర్ణమును భావన ( నానబెట్టి ఆరబెట్టుట ) చేయవలసిన చూర్ణమును , చూర్ణం మునుగునంతవరకు రసము పోసి ఆ రసం ఇగురునంత వరకు భద్రపరచి ఉంచవలెను . ఒకసారి భావన చేయుటకు 24 గంటలు పట్టును . 


 *  ఔషధాలు పుచ్చుకొనవలసిన కాలనిర్ణయం - 


      చూర్ణరూపము , కషాయ రూపము మొదలగు ఔషధములను ఉదయము మరియు సాయంకాలము పుచ్చుకొనవలెను . ముఖ్యముగా ఉదయం ప్రాతఃకాలం అనగా సూర్యాస్తమయానికి ముందు సాయంకాలం సంధ్యాసమయం తరువాత అనగా చీకటి పడిన తరువాత పుచ్చుకొనుట ఉత్తమం . అసాధ్యరోగములకు అనేకసార్లు , వమనము , విరేచనాదులకు ప్రాతఃకాలము నందు కలికాదులకు సాయంత్రసమయం ఉత్తమం . 


    

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

తన బాధ్యతను మరువనివాడు.

 శ్లోకం:☝️

*కర్పూర ఇవ దగ్ధోపి*

 *శక్తిమాన్ యో దినే దినే l*

*నమోస్త్వవార్యవీర్యాయ*

 *తస్మై కుసుమధన్వనే ll*


భావం: పరమేశ్వరుని మూడవకంటికి ఆహుతి యగుటచే కర్పూరము వలె కాలి పోయి, మన్మధుడు అనంగుడైనా అందరి హృదయాలలో కోరికలను నింపుచునే యున్నాడు. అతను ఎంతటి బలశాలియో! శరీరమే లేకున్నా తన బాధ్యతను మరువనివాడు.

నాలుగవ పాదం *తస్మై మకరకేతవే ll* అని పాఠాంతరం ఉంది.

25, డిసెంబర్ 2022, ఆదివారం

ఆదిత్య హృదయం:


*ఆదిత్య హృదయం:   అర్ధములతో …

              ➖➖➖✍️



ఆదిత్య హృదయాన్ని ప్రతీరోజు ఉదయాన్నే మూడుసార్లు చొప్పున పఠించేవారికి దైర్యం, జ్ఞానం లాంటి దైవగుణాలు పెరుగుతాయి! శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కఠిన సమస్యలు తొలగిపోతాయి! చింతలు చికాకులు పోయి,దైవభక్తి పెరుగుతుంది!  ఇతరుల మీద ద్వేషం, అసూయ, గిట్టనితనం, మాత్సర్యం లాంటి అవగుణాలు పోయి, మనస్సు ఎప్పుడూ ఈశ్వరుడిపై లగ్నం అవుతుంది.  అన్నిటికీ మించి సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత! 


అసలు ఆదిత్యహృదయం వల్ల లాభాలు ఇంతా అంతా అని చెప్పడం కానిపని! ఆదిత్యహృదయం అంటేనే అక్షయపాత్ర! 


శ్రీరాముల వారు ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారని శ్రీమద్రామాయణం చెబుతున్నది.


ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది.


ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది, ముఖవర్చస్సు మెరుగవుతుంది.


ఆదిత్య హృదయం లోని శ్లోకాలు వాటి అర్ధములు.


1. తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 


#అర్థము: యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.


2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం

ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 


#అర్థము: యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.


3. అగస్త్య ఉవాచ:

రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 


#అర్థము : ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.


4. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం

జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 


#అర్థము : ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.


5. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం

చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 


#అర్థము : ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.


6. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 


#అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.


7. సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః

ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 


#అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.


8. ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 


#అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు 



9. పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః

వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 


#అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.


10. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 


#అర్థము : ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.


11. హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 


#అర్థము : శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.


12. హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 


#అర్థము : బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.


13. వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః

ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 


#అర్థము : ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.


14. ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 


#అర్థము : వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.


15. నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః

తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 


#అర్థము : నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.


16. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః

జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 


#అర్థము : స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


17. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 


#అర్థము : జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితిపుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


18. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 


#అర్థము : నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


19. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 


#అర్థము : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


20. తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 


#అర్థము : తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.


21. తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే

నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 


#అర్థము: బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.


22. నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 


#అర్థము: రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.


23. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 


#అర్థము: ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.


24. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 


#అర్థము : ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.


25. ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 


#అర్థము : రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.


26. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 


#అర్థము : దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.


27. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 


#అర్థము : మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.


28. ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా

ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 


#అర్థము : మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.


29. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 


#అర్థము : పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.


30. రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 


#అర్థము : మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.


X. అథ రవి రవదన్నిరీక్ష్య రామం

ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా

సురగణమధ్యగతో వచస్త్వరేతి


#అర్థము : పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికేను.


X. సూర్యోపాసనలో అత్యంత గుప్తనామం "హిరణ్యగర్భాయ" ఈ నామం అర్ధం  సృష్టి-స్థితి-లయ కర్తలయిన బ్రహ్మ-విష్ణు-రుద్ర స్వరూపం ఇతడే అని అర్ధం 


భక్తితో " భగవతే హిరణ్యగర్భాయ నమః " అని సూర్యభగవానుణ్ణి స్మరిస్తే విశేషంగా ఆ సూర్యనారాయణస్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

  A Collection from

Admin

Brahmana Samaakhya

తప్పకుండ తెలుసుకోవలసినవి🕉️

 తప్పకుండ తెలుసుకోవలసినవి🕉️*


1. లింగాలు : 3

        పుం, స్త్రీ, నపుంసక.


2. వాచకాలు : 3.

      మహద్వా, మహతీ, అమహత్తు.


3. పురుషలు : 3.

    ప్రథమ, మధ్యమ, ఉత్తమ.


4. దిక్కులు : 4.

      తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.


 5. మూలలు : 4.

         ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం, ఈశాన్యం.


6. వేదాలు : 4.

  ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.


7. ఉపవేదాలు : 4.

   ధనుర్వేదం, ఆయుర్వేదం, గంధర్వ వేదం, శిల్ప


8. పురుషార్ధాలు : 4.

   ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.


9. చతురాశ్రమాలు : 4.

     బ్రహ్మ చర్యం, గార్హస్య, వానప్రస్థం, సన్యాసం.


10. పంచభూతాలు : 5.

     గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.


 11. పంచేంద్రియాలు : 5.

        కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.


 12. భాషా భాగాలు : 5.

         నామవాచకం, సర్వనామం, విశేషణం,         

         క్రియ, అవ్యయం.


13. ప్రధాన కళలు : 5.

    కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.


14. పంచకావ్యాలు : 5.

     ఆముక్తమాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం, శృంగార నైషధం.


15. పంచగంగలు : 5.

      గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర.


16. దేవతావృక్షాలు : 5.

    మందారం, పారిజాతం, కల్పవృక్షం,సంతానం, హరిచందనం.


17. పంచోపచారాలు : 5.

      స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం.


18. పంచాగ్నులు : 5.

        బడబాగ్ని, జఠరాగ్ని, కష్టాగ్ని, వజ్రాగ్ని, సూర్యాగ్ని.


19. పంచామృతాలు : 5.

        ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె.


20. పంచలోహాలు : 5.

       బంగారం, వెండి, రాగి, సీసం, తగరం.


21. పంచారామాలు : 5.

        అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రా(ద)క్షారామం.


22. ధర్మరాజు అడిగిన ఊళ్ళు :

 1. అవిస్థల/కుశస్థల (కన్యాకుబ్జ/Kannauj)

 2. వారణావతం(ఇక్కడే లక్కఇల్లు కట్టించాడు దుర్యోధనుడు. మీరట్ నుండి 19కి.మీ. అనీ, కాదూ, ఋషీకేష్ దగ్గర శివపురి అనీ చరిత్రకారుల ప్రస్తావన)

 3. వృకస్థల(గుర్గావ్ దగ్గర, హర్యానా)

 4. మాకండి(గంగా నది ఒడ్డున ఓ పల్లెటూరు

(మరొక ఊరు కౌరవులకు ఏదనిపిస్తే ఆ ఊరు) 

23. వేదాంగాలు(స్మ్రతులు) : 6.

 శిక్ష , వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం.


24. షడ్రుచులు : 6.

     తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు.


25. అరిషడ్వర్గాలు(షడ్గుణాలు) : 6.

 *కామం* (అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే మన మనసులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడ కోరికే), 


*క్రోధం* (అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు), 


*లోభం* (అంటే తాను సంపాదించుకున్నది, పొందింది తనకే సొంతమని భావించడం. అందులో నుంచి పూచిక పుల్ల కూడా ఇతరులకు చెందకూడదని దాన, ధర్మాలు చేయకపోవడం), 


*మోహం*(లేని దానిని అనుభవించాలన్న కోరిక), 


*మదం*(అంటే కొవ్వు, పొగరు. మదం 8 రకాలు అంటే అష్టమదములు

అవి - 

1. అన్నమదం, 

2. అర్థమదం, 

3. స్త్రీ మదం

4. విద్యామదం, 

5. కులమదం, 

6. రూపమదం,

7. ఉద్యోగమదం, 

8. యౌవన మదం 


*మాత్సర్యం*(తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం)


26. ఋతువులు : 6.

   వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ఋతువు, హేమంత, శిశిర.


27. షట్చక్రాలు : 6.

        మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, 

        అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు.


28. షట్చక్రవర్తులు : 6.

     హరిశ్చంద్రుడు, నలుడు, సగరుడు, పురుకుత్సుడు, పురూరవుడు,  

కార్తవీర్యార్జునుడు.


29. సప్త ఋషులు : 7.

  కశ్యపుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, 

భరద్వాజ, జమదగ్ని, వశిష్ఠుడు.


30. సప్తగిరులు : 7.

       శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి,       

       వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.


31. కులపర్వతాలు : 7.

      మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమంతం, గంధమాధనం, 

వింధ్య, పారియాత్ర.


32. సప్త సముద్రాలు : 7.

       ఇక్షు, జల, క్షీర, లవణ, దధి, సూర, సర్పి.


33. సప్త వ్యసనాలు : 7.

      జూదం, మద్యం, దొంగతనం, వేట, 

 వ్యభిచారం, దుబార ఖర్చు, కఠినంగా మాట్లాడటం.


34. సప్త నదులు : 7.

     గంగ, యమునా, సరస్వతి, గోదావరి,            

  సింధు, నర్మద, కావేరి.


35. ఊర్ధ్వలోకాలు : 7.

      భూ, భువర్ణో, సువర్ణో, తపో, జనో, మహా, సత్య.


36. అధోః లోకాలు : 7.

      అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ.


37. జన్మలు : 8.

     దేవ, మనుష్య, రాక్షస, పిశాచి, పశు, పక్షి, జలజీవ, కీటక.


38. కర్మలు : 8.

     స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవపూజ, ఆతిథ్యం, 

 వైశ్వదేవం.


39. అష్టదిగ్గజాలు :

      ఐరావతం, పుండరీకం, కుముదం, సార్వభౌమం, అంజనం, సుప్రతీకం, 

 వామనం, పుష్పదంతం.


40. అష్టదిగ్గజకవులు : 8.

     నంది తిమ్మన, పెద్దన, ధూర్జటి, పింగళి సూరన, తెనాలి రామకృష్ణ, రామరాజభూషణుడు, 

అయ్యలరాజు రామభద్రుడు, 

మాదయగారి మల్లన.


41. శ్రీ కృష్ణుని అష్ట భార్యలు: 

       రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణ


42. అష్ట భాషలు : 8.

        సంస్కృతం, ప్రాకృత, శౌరసేని, పైశాచి, సూళికోక్తి, అపభ్రంశం, ఆంధ్రము.


43. నవధాన్యాలు : 9.

      గోధుమ, వడ్లు, పెసలు, శనగలు, కందులు, నువ్వులు, మినుములు, 

 ఉలవలు, అలసందలు.


44. నవరత్నాలు : 9.

  ముత్యం, పగడం, గోమేధికం, వజ్రం, కెంపు, నీలం, కనకపుష్యరాగం, 

పచ్చ (మరకతం), ఎరుపు (వైడూర్యం).


45. నవధాతువులు : 9.

         బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, కంచు, సీసం, తగరం, కాంత లోహం.


46. నవరసాలు : 9.

     హాస్యం, శృంగార, కరుణ, శాంత, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, వీర.


47. నవబ్రహ్మలు : 9.

     మరీచి, భరద్వాజ, అంగీరసుడు,  

  పులస్య్తుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, వామదేవుడు.


48. నవ చక్రాలు : 9.

     మూలాధార, స్వాధిష్టాన, నాభి, హృదయ, కంఠ, ఘంటికా, భ్రూవు,      

 గగన, బ్రహ్మ రంధ్రం.


49. నవదుర్గలు : 9.

         శైలపుత్రి, బ్రహ్మ చారిణి, చంద్రఘంట,  

         కూష్మాండ, స్కందమాత, కాత్యాయని,  

          కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.


50. దశ బలములు : 10.

           విద్య, స్నేహ, బుద్ధి, ధన, పరివార,  

          సత్య, సామర్ధ్య, జ్ఞాన, దైవ, కులినిత.


51. దశ సంస్కారాలు : 10.

           వివాహం, గర్భాదానం, పుంసవనం,  

           సీమంతం, జాతక కర్మ, నామకరణం,  

           అన్నప్రాశనం, చూడాకర్మ(చౌలకర్మ), 

           ఉపనయనం, సమవర్తనం.


52. దశ మహాదానాలు : 10.

       

గో, సువర్ణ, రజతం, ధాన్యం, వస్త్ర, నెయ్యి, తిల, సాలగ్రామం, లవణం, బెల్లం.


53. అర్జునుడికి గల పేర్లు: 10.

 అర్జునుడు, పార్థుడు, కిరీటి,  

 శ్వేతవాహనుడు, బీభత్సుడు, జిష్ణుడు, విజయుడు, సవ్యసాచి,  

 ధనుంజయుడు, ఫల్గుణుడు.


54. దశావతారాలు : 10.

   మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ,  

           బుద్ధ, కల్కి.


55. జ్యోతిర్లింగాలు : 12.     

             హిమలయపర్వతం:

1. కేదారేశ్వరుడు,

2.కాశీ విశ్వేశ్వరుడు,

మధ్యప్రదేశ్: 3.మహాకాళేశ్వరుడు, 4.ఓంకారేశ్వరుడు.

గుజరాత్: 5.సోమనాథుడు,   

6.నాగేశ్వరుడు.

మహారాష్ట్ర :

7. భీమశంకరుడు, 8.త్ర్యంబకేశ్వరుడు,             

9.ఘృష్ణేశ్వరుడు, 

10.వైద్యనాదేశ్వరుడు.

ఆంధ్రప్రదేశ్: 11. మల్లికార్జునుడు (శ్రీశైలం)

తమిళనాడు: 12.రామలింగేశ్వరుడు.


56. షోడశ మహాదానాలు : 16.

 గో, భూ, తిల, రత్న, హిరణ్య, విద్య, దాసి, కన్య, శయ్య, గృహ, అగ్రహార, రథ, గజ, అశ్వ, ఛాగ (మేక), మహిషి (దున్నపోతు).


57. అష్టాదశ వర్ణనలు : 18.

      నగరం, సముద్రం, ఋతువు, చంద్రోదయం, అర్కోదయం,  

 ఉద్యానము, సలిలక్రీడ, మధుపానం,  

            రథోత్సవం, విప్రలంభం, వివాహం, 

            పుత్రోత్పత్తి, మంత్రము, ద్యూతం, 

            ప్రయాణం, నాయకాభ్యుదయం, 

            శైలము, యుద్ధం.


58. అష్టాదశ పురాణాలు : 18.

              మార్కండేయ, మత్స్య, భవిష్య,         

              భాగవత, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, 

              బ్రహ్మాండ, విష్ణు, వాయు, వరాహ, 

              వామన, అగ్ని, నారద, పద్మ, లింగ, 

              గరుడ, కూర్మ, స్కాంద.


59. భారతంలో పర్వాలు : 18. ఆది,సభా,అరణ్య,విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్ర్తీ, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ.


60. సంస్కృత రామాయణంలో 

 కాండలు: 6.

బాల ,అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ.

         

61. శంఖాలు వాటి పేర్లు:

          భీముడు - పౌండ్రము

          విష్ణువు - పాంచజన్యం

          అర్జునుడు - దేవదత్తం.


62. విష్ణుమూర్తి ఆయుధాల పేర్లు:              

           ధనస్సు - శార్ఙ్గగం,

           శంఖం-పాంచజన్యం,

           ఖడ్గం- నందకం,

           చక్రం - సుదర్శనం.


63. విల్లుల పేర్లు:

               అర్జునుడు - - గాండీవం

               శివుడు - - పినాకం

               విష్ణువు - శార్ఙ్గగం


64. వీణలు--పేర్లు:

               కచ్ఛపి---సరస్వతి,

                మహతి---నారదుడు,

                కళావతి---తుంబురుడు.


65. అష్టదిక్కులు-పాలకులు-ఆయుధాలు:


తూర్పు ఇంద్రుడు వజ్రాయుధం 

పడమర వరుణుడు పాశం

ఉత్తర కుబేరుడు ఖడ్గం

దక్షిణం యముడు దండం

ఆగ్నేయం అగ్ని శక్తి 

నైఋతి నిరృతి కుంతం 

వాయువ్యం వాయువు ధ్వజం 

ఈశాన్యం ఈశానుడు త్రిశూలం.


66. మన్వంతరాలు 

విభజించబడినది.

స్వాయంభువ మన్వంతరము

స్వారోచిష మన్వంతరము

ఉత్తమ మన్వంతరము

తామస మన్వంతరము

రైవత మన్వంతరము

చాక్షుష మన్వంతరము

వైవస్వత మన్వంతరము (ప్రస్తుత)

సూర్యసావర్ణి మన్వంతరము

దక్షసావర్ణి మన్వంతరము

బ్రహ్మసావర్ణి మన్వంతరము

ధర్మసావర్ణి మన్వంతరము

భద్రసావర్ణి మన్వంతరము

దేవసావర్ణి మన్వంతరము

ఇంద్రసావర్ణి మన్వంతరము


67. సప్త స్వరాలు :

స - షడ్జమం - (నెమలిక్రేంకారం) 

రి - - రిషభం - - (ఎద్దు రంకె) 

గ - - గాంధర్వం - - (మేక అరుపు) 

మ - - మధ్యమ - - ( క్రౌంచపక్షి కూత) 

ప - - పంచమం - - (కోయిల కూత) 

ద - - దైవతం - (గుర్రం సకిలింత) 

ని - - నిషాదం - (ఏనుగు ఘీంకారం)


68. సప్త ద్వీపాలు:

జంబూద్వీపం - - అగ్నీంద్రుడు 

ప్లక్షద్వీపం - - మేధాతిధి

శాల్మలీద్వీపం - - వప్రష్మంతుడు

కుశద్వీపం - - జ్యోతిష్యంతుడు

క్రౌంచద్వీపం - - ద్యుతిమంతుడు

శాకద్వీపం - - హవ్యుడు

పుష్కరద్వీపం - - సేవకుడు


69. తెలుగు నెలలు: 12

              చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, 

              శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, 

              కార్తీకం, మార్గశిరం, పుష్యం, 

              మాఘం, ఫాల్గుణం.


 70. రాశులు :12.

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం,

సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.


71. తిథులు 15.

పాఢ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య /పౌర్ణమి.


72. నక్షత్రాలు 27.

అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాబాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి


🌹🕉️శ్రీ మాత్రే నమః🌹


🙏సర్వేజనా సుఖినోభవంతు🙏