19, ఫిబ్రవరి 2026, గురువారం

షడ్రసముల గురించి

 షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 

     

షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై ఉన్నవి . ఇప్పుడు మీకు ఒక్కోరసము యొక్క ప్రాధాన్యత వాటి గుణాలు మరియు అతిసేవనం వలన కలుగు దుష్ప్రభావాల గురించి సంపూర్ణముగా వివరించెదను . 

 

*  మధుర రసము గుణము - 

       మానవశరీరమునకు పుట్టుక నుండి మధురరసము కలగలసిపోయినది . ముందుగా తల్లిపాలు మధురంగా ఉండి త్వరగా జీర్ణం అగును . అదియే పుట్టిన బిడ్డకు ప్రాధమిక ఆహారము . ఇది ఓజోవర్ధకము అనగా రోగనిరోధకశక్తిని పెంచునది అని అర్ధము . మధురరసము సర్వ ధాతువృద్ధిని కలిగించును . శరీరముకు బలము మరియు మంచి రంగును ప్రసాదించును .దీర్గాయువుని ఇచ్చును . మనస్సుతో పాటు పంచేంద్రియాలకు ఆనందాన్ని కలిగించును . వాతాన్ని మరియు పిత్తాన్ని హరించును . విషాన్ని హరించును . దప్పికను పోగొట్టును . చర్మమును స్నిగ్ధపరుచును . వెంట్రుకలను పెంచును . కంఠస్వరం బాగు చేయును . అభిఘాతము ( దెబ్బలు ) నందు , శరీరము శుష్కించినప్పుడు ఇది మంచి రసాయనంగా పనిచేయును . 

        

         దీనిని అతిగా ఉపయోగించిన అతిస్నిగ్థత ( శరీరం జిడ్డు పట్టుట ) , సోమరితనం , శరీరము బరువు పెరుగుట , అతినిద్ర , శ్వాసము , కాసము మొదలైన వాటిని కలిగించి గ్రంథి , బోధ మున్నగు కఫవ్యాధులను కలిగించును . 


 *  ఆమ్ల రసము గుణము - 

      ఆమ్లరసము నాలుకకు తగిలిన వెంటనే నోటివెంట అధికంగా నీరుకారి దంతములు పీకునట్లు అగును . ఇది ఆకలిని వృద్ధిచేయును . ధాతువృద్ది చేసి మనస్సుకు ఉత్సాహం ఇచ్చును . ఇంద్రియాలకు బలమును ఇచ్చును . తృప్తిని కలిగించును . ఆహారమునకు స్నిగ్ధత కలిగించి జీర్ణం అగుటకు సహాయం చేయును . 

        

      దీనిని మితిమీరి ఉపయోగించిన పిత్తమును వృద్ధిచేసి రక్తమును దోషము చెందించి  విద్రది , వ్రణములను పక్వము చేయును . శరీర అవయవాలను శైధిల్యం చెందించి శోధము , కంఠము నందు మంట , రొమ్ము , హృదయము ల యందు ఇబ్బందులను కలుగచేయును . 


 *  లవణ రసము గుణము - 

      ఇది రుచిని కలుగచేయును . ఆకలిని పుట్టించును . జీర్ణమగును . వాతాన్ని నిరోధిచుటను పోగొట్టును . ఉష్ణతత్వము కలిగి ఉండును . 

      

     దీనిని అధికంగా సేవించిన పిత్తము ప్రకోపించి దప్పిక , మంట , కన్నీటిని కలిగించుటయే కాక శరీర మాంసం చెడగొట్టి కుష్ఠు వ్యాధి కలిగించును . ఇది శరీరము నందు విషమును వృద్దిచేయును . వ్రణములను పగులునట్లు చేయును . దంతములు కదులున్నట్లు చేయును . పుంసత్వము పోగొట్టును . ఇంద్రియశక్తిని తగ్గించును . శరీరకాంతిని పోగొట్టును . వెంట్రుకలు నెరియుట , బట్టతల , చర్మము నందు ముడతలు , రక్తపిత్తము , చర్మముపైన పొక్కులు వంటి సమస్యలు కలుగచేయును . 


* కటు( కారము ) రసము గుణము - 

   కటు రసము నాలుకకు తగిలినంత మాత్రమే ముక్కును కార్చును . యావత్ శరీరం కంపించును . దీనిని స్వల్పమోతాదులో ఉపయోగించినచో కొన్ని సద్గుణాలు కలవు . ముఖశుద్ధి చేయును . జఠరాగ్ని పెంపొందించును . ఆహారమును శుష్కిoపచేయును . కన్నీరు వచ్చునట్లు చేయును . కఫ సంబంధ జిగురు పోగొట్టును . శరీరవృద్ధి ( శరీరపు లావు ) తగ్గించును . క్రిములను హరించును . వ్రణములు పగులునట్లు చేయును . శ్రోతో నిరోధము ( శరీరం నుండి బయటకి వ్యర్ధాలు వెడలు మార్గములు ) పొగొట్టి విశాలము చేయును .  

         అధికంగా సేవించిన శుక్రము నశించును . మైకము కమ్మును . తల తిరుగును . కంఠము నందు , శరీరము నందు మంటలు పుట్టును . దప్పిక పుట్టి బలము నశించును . వాతరోగములు పుట్టుటకు కారణం అగును . 


 *  తిక్త ( చేదు ) రసము గుణము - 

       తిక్తరసము నాలుకకు తగిలినవెంటనే కంఠము నందు లాగుచున్నట్లు అనిపించును . ముఖము నందలి ( నోటియందలి ) జిగురు పోగొట్టి రోమాంచనం ( వెంట్రుకలు నిక్కబొడుచుకొనునట్లు ) కలుగచేయును . చేదు నాలుకకు రుచిగా అనిపించకున్నను నోటి యందలి అరుచిని పోగొట్టి ద్రవ్యములను రుచిగా ఉండునట్లు చేయును . శారీరక విషాలను హరించును . జ్వరములను హరించును . కుష్ఠు రోగము నందు ఉపయుక్తము . క్రిమి నాశకము , స్తన్యమును శుద్ధిచేయును . మాంసమును దృఢపరచును . జీర్ణకారి . శరీరం నందు ఎచ్చటి  నుండి ఐనా జలం వంటి పదార్థము వెడలుచున్న దానిని ఆపును . శరీరపు కొవ్వు , మజ్జి , వ్రణములు నుండి కారు రసి , చీము , మూత్రము వంటి జల సంబంధమైన వాటిని ఎండించును . 

     

       దీనిని అతిగా ఉపయోగించిన ధాతువులన్నినింటిని నాశనం చేయును , శరీరం నందు గరుకుతనం కలిగించును . బలం తగ్గును   శరీరం కృశించును . వాతరోగములు పెరుగును . 


  *  కషాయ( వగరు )  రసము గుణము - 

  కషాయ రసము నాలుకకు తగిలింత వెంటనే నోరు ఎండిపోయి నాలిక స్థంభించును . కంఠమును బంధించును . హృదయమును పట్టి లాగి సంకోచింపచేయును . గుండెని ఒత్తునట్టు బాధ కలుగచేయును . 

        

  ఈ వగరు రసము స్వల్పప్రమాణములో భుజించిన సద్గుణములు కలవు . కఫ, రక్త , పిత్త వికారముల యందు ఉపయుక్తము . శరీరద్రవాలను ఆర్చును . వ్రణములను పగలగొట్టును . 

      

            దీనిని అతిగా సేవించుట వలన నోటి రోగములు కలుగును . హృదయము నందు బాధ కలిగించును . ఉదరము ఉబ్బునట్లు చేయును . మలమూత్రములు వంటి వ్యర్ధాలను బయటకు పంపు మార్గాలను బంధించి శరీరముకు నలుపు తెచ్చును . శుక్రమును నాశనం చేయును ఆర్థిత వాతము , పక్షవాతము వంటి వాతరోగములను కలుగచేయును . 

       

  కావున ప్రతి రసమును మన ఆహారములో భాగము అయ్యేలా చూసుకొన్నచో మన శరీరము ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది. 

           

    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 



గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034   

 

"ఎ ఆవ్ రా బా వా

 *"ఎ ఆవ్ రా బా వా

(ఏ ఆవురా బావ అనిఅర్ధము)

"☘️*తెనాలి రామకృష్ణ కవి సమయస్ఫూర్తి


*ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు. "మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి. అంతేకాక ఆ ఐదక్షరాల పదంకూడా అర్థవంతంగా వుండాలి. దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."* 

*కవులలో కలకలం బయలుదేరింది.* 

*విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.* 

*మన తెనాలి రామకృష్ణకు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచం వేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌.*

*అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువుల శాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.మరునాడు మహారాజు సభ తీర్చాడు. "అందరూ సిద్ధంగా వున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు, కాని రామకృష్ణుడు మాత్రం లేచి "నేను సిద్ధమే" అన్నాడు.* 

*మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!* 

*రామకృష్ణుడు: " ఎ ఆవ్ రా బా వా "* 

*'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.* 

*'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.* 

*'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!* 

 *'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.* 

 *' వా' అనగా తమిళంలో 'రా' అని అర్థము.* 

*ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం "ఏ ఆవ్ రా బా వా" ఇది కూడా అర్థవంతమైన పదమే!* 

*తెనాలి రామకృష్ణుడి వివరణతో మహారాజుకు మహదానందం కలిగింది. రామకృష్ణునికి భూరి బహుమానాలు లభించాయని వేరే చెప్పాలా...!🙏*

మానవజన్మ వచ్చినందుకు

  


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


మానవజన్మ వచ్చినందుకు భగవంతుడు ఇచ్చిన మేధస్సుతో, మనం ఎందుకు జన్మిస్తున్నామో, ఎందుకు మరణిస్తున్నామో, ఆలోచించాలి, అనే

ఉద్దేశంతో శ్రీ భర్తృహరి మహాయోగి ఇలా అంటున్నారు.


శ్లో//భోగా న భుక్తా వయమేవ భుక్తాః /

తపో న తప్తం వయమేవ తప్తాః/

కాలో న యాతో వయమేవ యాతాః/

తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణాః//


(మేము భోగములను అనుభవించలేదు.

భోగములే మమ్మల్ని అనుభవించి, ఇప్పుడు ఇలా శల్యావశిష్టులను చేశాయి.

తపస్సుతో మమ్ము మేము తపింపజేసుకోలేదు.

ధనసంపాదనలో పడి,రాత్రి, పగలు తేడా లేకుండా,

ఎండా, వాన, అనకుండా తిరిగి తిరిగి, 

మమ్ము మేము తపింపజేసుకున్నాము.

కాలం ఎక్కడికీ పోవటం లేదు.

మేమే జనన మరణాలతో వస్తున్నాం, పోతున్నాం.

కాలం గడిచిన కొద్దీ అన్నీ జీర్ణావస్థ చెందుతాయి. కానీ మా ఆశ మాత్రం జీర్ణించి పోవటం లేదు.

ఆ ఆశలు తీర్చుకోవడం చేతగాని మేమే రోజు, రోజుకు, జీర్ణం అయిపోతున్నాం).


శ్లో// వయం యేభ్యో జాతా శ్చిరపరిగతా ఏవ ఖలు తే /

సమం యై స్సంవృద్ధాః స్మృతి విషయతాం తే ౽ పి గమితాః /

ఇదానీమేతే స్మః ప్రతి దివస మాసన్న పతనా /

గతా స్తుల్యావస్థాం సికతిల నదీతీర తరుభిః //


(మమ్ము గన్న తల్లిదండ్రులు గతించి చిరకాలమైనది.

ఎవరితో చిన్నప్పటినుండి కలిసి మెలిసి పెరిగామో,

 ఆ బంధుమిత్రులు స్మృతి పధంలోకి వెళ్ళిపోయారు.

ఈ వార్ధక్య దశలో ప్రతిరోజు మేము చావుకు దగ్గఱవుతున్నాము.

నదీతీరంలో, ఆ చెట్టు కూడా ప్రవాహవేగానికి కోసుకుపోతున్న ఇసుకలో, కూలిపోటానికి సిద్ధంగా ఉన్నది.

ఆ చెట్టుకు, మాకు,తేడా కనిపించటం లేదు ).


ఈ జననము, వార్ధక్యము, మరణము ఎందుకు సంభవిస్తున్నాయో విచారణచేసి, సత్యం గ్రహించడానికి మానవజన్మ వచ్చిందని తెలియజేయడమే భర్తృహరి మహాయోగి ఆశయము.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

19-2-'26.

శ్రీరామచంద్ర ప్రభువు కున్న గొప్ప గుణములు16🙏

 🙏🙏 😊

🌸శ్రీరామచంద్ర ప్రభువు కున్న గొప్ప గుణములు16🙏


కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః | విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ॥

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః | కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥

ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే.. 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.

🙏🙏🙏🙏



సేకరణ

*శ్రీ మహావిష్ణు పురాణం*

  


         *శ్రీ మహావిష్ణు పురాణం*

               *1 వ భాగం* 


ప్రారంభం - పురాణ ప్రశంస - వేదవ్యాస జననం 


          *#మొదటి భాగం#*

```

మహావిష్ణు పురాణం వ్యాసుని జన్మ వృత్తాంతం, వ్యాసుని తండ్రి అయిన పరాశర మహర్షి వృత్తాంతంతో ఆరంభంఔతుంది. వ్యాస మహర్షి మహావిష్ణు పురా ణం రచించారు. కానీ కథనం పరాశర మహర్షి తన శిష్యుడు మైత్రేయ మహర్షికి చెప్పడంతో ఆరంభమవుతుంది.


నైమిశార్యణంలో శౌనకాది మునులు యజ్ఞయాగాదులు చేస్తున్న సమయంలో సూత మహర్షి శిష్యులతో వచ్చి మునుల కోరిక పై పురాణ ప్రవచనాలు చేస్తూ వచ్చి వెళ్లుతుండేవారు. అలా ఒకసారి సూత మహర్షి వచ్చినప్పుడు శౌనకాది మునులు ఎదురేగి స్వాగత సత్కరాలు చేసి ఉచితాసనం సమర్పించి కుశల ప్రశ్నల తరువాత నమస్కరించి


"పురాణ ప్రవచనోత్తమా! మీ ద్వారా వ్యాస భగవానుడు రచించిన అనేక పురాణ ఇతి హాసాలు వినే భాగ్యం మాకు లభించింది. ఈసారి శ్రీమన్నారాయణుని దివ్య లీలలతో నిండిన "శ్రీ మహావిష్ణు పురాణం" వినాలని ఉంది. ముందు మహావిష్ణు పురాణం రచించిన వ్యాస మహర్షి గురించి తెలియచేసి పురాణాన్ని విని పించండి" అని ప్రార్ధించారు.


సూత మహర్షి సంతోషించి "మునులారా! మా గురువైన వ్యాస మహర్షిని స్మరణ చేసుకునే భాగ్యం మరోక సారి నాకు కలిగింది. వ్యాస మహర్షి పరాశర మహర్షి, మత్స్యగంధి సత్యవతికి జన్మించారు. పరాశర మహర్షి వసిష్ట మహర్షి కుమా రుడైన శక్తికి జన్మించారు. ఈవిధంగా వ్యాసుడు వసిష్ట మహర్షికి మునిమనవడు అవుతాడు. ఇరువురి జనన కథనం వినండి.


ఉపరిచర వసువు ఆకాశంలో విహారం చేస్తుంటే అతని రేతస్సు యమునా నదిలోని ఒక ఆడచేప నోటిలో పడింది. ఫలితంగా ఆ చేపకు ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల జన్మించారు. చేపలు పట్టే వృత్తి చేస్తున్న దాశరాజుకు ఆ చేప లభించి, కడుపు కోయగా ఇరువురు పిల్లలు కనిపించారు. మగ పిల్లవాడిని ఆ దేశరాజు తీసుకుని వెళ్ళి మత్స్యదేశానికి రాజుని చేశాడు, ఆడపిల్లను దాశరాజు సత్యవతి అని నామకరణం చేసి పెంచి పెద్ద చేసాడు.


తండ్రికి సహాయంగా చేపల వేటకు వెళ్లిన సత్యవతి శరీరం నుండి చేపల వాసనలు రావడం తో ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. ఒకసారి గంగానది తీరంలో సత్యవతి నావతో నదిలోకి వెళ్ళబోతుంటే పరాశర మహర్షి గంగానది దాటటానికి అక్కడకు వచ్చి సత్యవతిని నది దాటించమని అడిగాడు. మహర్షి తేజో స్వరూపము చూసి భయ పడిన సత్యవతి అంగీకరించి నావలో ఎక్కించుకుని తీసుకెళ్ల సాగింది.


నదిమధ్యలో సత్యవతి రూపం పరాశర మహర్షిని ఆకర్షించింది. ఆమె మత్స్యగంధి కాదు ఉపరి చర వసువు కుమార్తె అని గ్రహించాడు. ఈమె ద్వారా వ్యాస మహర్షి జననం జరగాలని విధి నిర్ణయం అని గ్రహించి ఆమెను తనతో దాంపత్యం చేయమని అడిగాడు. సత్యవతి "తండ్రి అనుమతి లేదని, కన్యత్వం భంగం అవుతుందని, పగటి పూట తప్పు అని, తన శరీరం నుండి చేపల వాసన వస్తుంది" అని తన సంశయాలను చెప్పింది.


పరాశర మహర్షి ఆమెతో "వేద పురాణ ఇతిహాస కర్త వ్యాసుడు తన ద్వారా సత్యవతి గర్భాన జన్మించాలని విధాత నిర్ణ యించారు. కనుక ఆమె కన్యా త్వానికి ఎటువంటి భంగం కలుగదని, ఇక నుంచి ఆమె శరీరం నుండి సుగంధ పరిమళాలు వచ్చి యోజన దూరం వరకు వ్యాపించి ఉంటా యని, ఆమెను యోజనగంధి అని పిలుస్తారని" అని వరాలు ఇచ్చి తన తపశక్తితో అక్కడ ఒక ద్వీపాన్ని సృష్టించి, పగటి వాతావరణాన్ని రాత్రి వాతావర ణంగా మార్చివేశాడు. ద్వీపంలో చక్కటి గృహం నిర్మింపచేశాడు. 


సత్యవతి అంగీకరించింది. ఇద్దరి కలయికతో వ్యాస మహర్షి జన్మించాడు. పుట్టి పుటడ్డం తోనే దండ కమండలాలు, జడలు ధరించి ఋషిగా మారాడు. పరాశర మహర్షి వెళ్లి పోయాడు. వ్యాసుడు తల్లికి నమస్కరించి "అమ్మా! నేను తపస్సుకి హిమా లయాలకు వెళుతున్నాను. అక్కడే ఉంటాను. నీకు ఆవసరమైనప్పుడు నన్ను తలచుకుంటే, నేను వచ్చి నీ సమస్యలను తీరుస్తాను" అని మాట ఇచ్చి తపస్సుకి వెళ్లి పోయాడు. నల్లని జింకలు సంచరించే ద్వీపంలో పుట్టాడు కనుక ఈయనకు "కృష్ణద్వైపా యనుడు" అని పేరు వచ్చింది. వేదాలను నాలుగు వేదాలుగా విభజించి లోకానికి అందించాడు కావున వేదవ్యాసుడు అని ప్రసిద్ది చెందాడు. వేదవ్యాసుడు అనే పేరు వెనుక గల కథ వినండి. 


మహాపురుషుల జన్మ వృత్తాం తాలు విలక్షణంగా ఉంటాయి. సాధారణ మనుష్యుల బుద్దికి అర్థం కాని అంతరార్థాలు, పర మార్థాలు అందులో ఉంటాయి. వ్యాస మహర్షి నారాయణుని అవతారము. అందుకేఆయనను వ్యాస భగవానుడు అంటారు. ద్వాపరంలో జన్మించినవ్యాసుడు మొట్టమొదటగా నారాయణునికి మానసపుత్రుడిగా అపాంతరము డు అనే పేరుతో జన్మించాడు. మనస్సు లోపల గల అజ్ఞానమనే చీకటిని తొలగించుకున్నవాడు, తొలగించేవాడిని అపాంతర ముడు అంటారు.


మహావిష్ణువు బ్రహ్మ ముఖం నుండి వెలువడిన వేదమును శ్రద్దగా విని లోకానికి అర్ధమ య్యేలా విభజించమని అపాంతరముని ఆదేశించాడు. అపాంతరముడు ఆదేశం పాటించి వేదాలను ఋగ్వే దము, యజుర్వేదము, సామ వేదము, అధర్వణ వేదము అని నాలుగు వేదాలుగా విభజించి లోకానికి అందించాడు.


బ్రహ్మ సంతోషించి అతనిని వేదవ్యాసుడు అని పిలిచి ప్రతి మన్వంతరంలో ఇలాగే జన్మించి వేద విభాగం చేస్తుండమని కోరాడు. అప్పటి నుంచి ప్రతి ద్వాపరంలోను వేద విభజన జరుగుతూ ఉంటుంది. వేదావ్యాసుడనే పేరు ఒక పదవి అయ్యింది ప్రథమ ద్వాపరంలో స్వయంభువు, రెండవ ద్వాపరంలో ప్రజాపతి, మూడవ ద్వాపరంలో శుక్రుడు, నాలుగవ ద్వాపరంలో బృహస్పతి ఈ పదవి అలంకరించారు. ప్రస్తుత ద్వాపరంలో పరాశర మహర్షి, సత్యవతిల పుత్రుడైన కృష్ణ ద్వైపా యనుడు వేదవ్యాసుడు అయ్యాడు.

```

*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం.*


*శ్రీకాంత్గంజికుంట కరణంగారి సౌజన్యంతో*

``

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యా యపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గురువారం*🌷 *🌹19ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *గురువారం*🌷

*🌹19ఫిబ్రవరి2026🌹*   

  *దృగ్గణిత పంచాంగం* 

                   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి  : విదియ* ‌మ 03.58 వరకు ఉపరి *తదియ*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా 08.52 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : సిద్ధ* రా 08.42 వరకు ఉపరి *సాధ్య*

*కరణం  : కౌలువ* సా 03.58 *తైతుల* రా 03.21 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 11.15 - 12.15 సా 04.00 - 06.00*

అమృత కాలం  :*మ 01.00 - 02.34*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.45*

*వర్జ్యం    : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 10.25 - 11.11 మ 03.05 - 03.51*

*రాహు కాలం  :మ01.49- 03.16*

గుళికకాళం      : *ఉ 09.26 - 10.54*

యమగండం    : *ఉ 06.31 - 07.59*

సూర్యరాశి : *కుంభం*                                        

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.41*  

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం        :*ఉ06.31 - 08.51*

సంగవ కాలం      :*08.51 - 11.11*

మధ్యాహ్న కాలం    :*11.11 - 01.31*

అపరాహ్న కాలం  :*మ 01.31- 03.51*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ విదియ*

సాయంకాలం      :*సా 03.51- 06.11*

ప్రదోష కాలం       :*సా 06.11- 08.39*

రాత్రి కాలం         :*రా 08.39 - 11.56*

నిశీధి కాలం       :*రా 11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.52 - 05.41*

******************************

*🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

     *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - ద్వితీయ - పూర్వాభాద్ర -‌‌ గురు వాసరే* (19.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం