20, మార్చి 2025, గురువారం

ఉచిత ప్రవేశం*

 _Forwarded message_

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                  *ఉచిత ప్రవేశం*

                   ➖➖➖✍️


 ఎవరైనా హిందూ సోదరుడు తన కుమారుడిని భోపాల్ గురుకులంలో చేర్చాలనుకుంటే, ఇంటర్వ్యూలు మార్చి 15 నుండి ఏప్రిల్ 30, 2025 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఆచార్య పాణిగ్రాహి చతుర్వేద్ సంస్కృత వేద పాఠశాలలో నిర్వహించబడతాయి.


*అర్హత:*

పిల్లవాడు 6వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.



 *సౌకర్యాలు:*


 పూర్తి ఉచిత వసతి, ఆహారం మరియు విద్య.


 నెలకు ₹1000 స్కాలర్‌షిప్ కూడా అందించబడుతుంది.



 *పాఠ్యప్రణాళిక:*


 పిల్లవాడికి వ్యాకరణం, సాహిత్యం, ఆంగ్లం మరియు ఇతర ఆధునిక విషయాలతో పాటు నాలుగు వేదాలు బోధించబడతాయి.


ఒక వేదంలో నైపుణ్యం సాధించేలా పిల్లలకు శిక్షణ ఇస్తారు.


 ఆచార్య (M.A.) స్థాయి వరకు తదుపరి విద్య కోసం మార్గదర్శకత్వం అందించబడుతుంది.



 ఈ సందేశాన్ని అన్ని హిందూ సమూహాలకు వ్యాప్తి చేయండి.


 వెంటనే సంప్రదించండి:


 ఆచార్య అవనీష్ త్రివేది: 9630966969


 ఆచార్య దినేష్ పాణిగ్రాహి: 9425371542



 ఈ సందేశం కేవలం హిందూ సోదరులకు మాత్రమే.  ప్రతి హిందువుతో షేర్ చేయండి!✍️


 జై శ్రీ రామ్!  🚩🙏🙏🙏🙏



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


ఇతరులకు ఉపయోగపడే ఇటువంటి మంచి మెసేజ్ లను

9440652774  కు పంపండి.

మన గ్రూప్ లద్వారా లక్షలాదిమందికి చేరతాయి.


*మానవ సేవయే మాధవ సేవ గదా!


                     🌷🙏🌷

భూలోకంలో అమృతం మజ్జిగ

 భూలోకంలో అమృతం మజ్జిగ*🌹🪷🌹🪷🌹🪷🌹🪷

సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు

అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్‌!

తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే!

సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకూ... తెలుగువారికీ అనుబంధం అనాదిగా ఉంది. 

క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. ‘తక్రం’ ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకూ పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్త పుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్నిపెరుగుతుంది. కొందరికి మజ్జిగంటే పడదు. దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదనీ, త్రేన్పులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు. 

ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి. ఈ ఉపయోగపడే బాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్‌ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్‌ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం. పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. 

మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లెపువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలికగా అరుగుతాయి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన మజ్జిగైతే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చెయ్యదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీదా ఔషధంగా పని చేస్తుంది.

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కోరికలు

 

కోరికలు  లేని మానవుడు ఉండడు అంటే ఆశ్చర్యం ఏమి లేదుకాకపొతే ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందమంది కోరికలు చిన్నగా ఉంటే మరికొంతమంది కోరికలు పెద్దగా ఉంటాయి. కోరికలు లేని వారు అస్సలు వుండరు అన్నది ముమ్మాటికీ నిజం. అప్పుడే పుట్టిన పిల్లవానికి కోరికలు వుండవు అని మనం అనుకోవటానికి వీలు లేదుకాకపొతే వాడికి మాట్లాడటం రాదు కాబట్టి వాడి కోరికలను మనం గుర్తించలేము. బహుశా వాడి కోరికలు ఇలా ఉండవచ్చు. నేను ఏడవకుండా మా అమ్మ నాకు పాలు ఇవ్వాలి. అలానే నేను పక్క తడిపితే కూడా ఏడవకుండా మా అమ్మ పక్క మార్చాలి. ఇంకా కొంచం పెద్ద అయిన తరువాత ఎప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకొని ఉండాలి ఇలా మనం అనుకోవచ్చు. కొంచం పెద్ద పెరిగితే కోరికలు కూడా పెద్దవి అవుతాయినాకు ఆడుకోవటానికి బొమ్మలు కావాలి నేను ఇష్టంగా తినే పండ్లు నాకు కావలి ఇలా ఉండవచ్చు. మాటలు వచ్చి విద్యాబ్యాసం మొదలు పెట్టినప్పుడు ఇక కస్టాలు మొదలవు తాయి. ఇన్ని రోజుల స్వేచ్ఛ కాస్తా హరిస్తుంది. ముందుగా తోటి పిల్లలతోటి స్పర్ధలు. వాడు నా పెన్సిలు తీసుకున్నాడు, వీడు నా నోటుబుక్కు తీసుకున్నాడు. నా టిఫిన్ బాక్సులో అమ్మ నాకు ఇష్టమైనది పెట్టలేదు ఇలా సమస్యలు పెరిగితే అవి లేకుండా ఉండాలనే కోరికలు కూడా పెరుగుతాయి.

మనిషి వయస్సు పెరిగే కొద్దీ కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. చిన్నతనంలో తన తోటివారికన్నా తనకు ఎక్కువ మార్కులు రావాలని, వాళ్లకన్నా మంచి బట్టలు కావాలని, ఇంకా ఎన్నో వస్తువులు కావాలని ఇట్లా అనేక కోరికలు పుడుతూ ఉంటాయి

యుక్త వయస్సు రాగానే స్త్రీ పురూరుష ఆకర్షణకు లోనై తదనుగుణంగా కోరికలు కలుగుతూ ఉంటాయి

చదువు అయిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మంచి ఉద్యోగం రావాలని ఎక్కువ జీతం రావాలని కోరికలు ఉంటాయి. ఉద్యోగం వచ్చి స్థిరపడిన తరువాత మంచి భార్య రావాలని కోరిక ఉంటుంది.పెళ్లి అయినతరువాత జీవితం సుఖమైయంగా ఉంటుందని సగటు మానవుడు అనుకుంటాడునిజానికి అసలు కధ అప్పుడే మొదలైతుండు. తన సంపాదన తన శ్రీమతి విలాసాలకు సరిపోక అనేక ఇక్కట్లు పడటం కొంతమందికి అనుకూలవతి అయిన స్త్రీ లభిస్తే పెండ్లి అయినా వెనువెంటనే  సంతానం కలగటం సంతానాన్ని సరిగా పెంచటానికి  ఖర్చులు పెరగటం వాళ్ళ అనారోగ్య సమస్యలు ఇలా సమస్యలు పెరిగితే సమస్యలు నివారణ అవ్వాలనే కోరిక కలగటం సామాన్యం. ఇక వాళ్ళు పెరిగి పెద్దవాళ్లయితే వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, వివాహాలు ఒకటేమిటి ప్రతి క్షణం ఒక సమస్య ఉంటుంది. సమస్యలు తీరాలనే కోరికలు ఎలాగో ఉంటాయి. ఇంతలో తానూ ముదుసలి కావటం శరీరం డస్సి పోవటం తన ఆరోగ్యం తన శ్రీమతి ఆరోగ్యం వెరసి ప్రతి దినం ఒక క్రొత్త సమస్య సమస్య తీరాలనే కోరికలు

ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి మనిషి అనుక్షణం సమస్యలు, కోరికలు రెండు జంట గుర్రాలులాగా కనపడతాయి. నిజానికి మనం ఆలోచిస్తే కోరికలు లేని మనిషి ప్రపంచంలో లేనే లేడు అంటే అతిశయోక్తి లేదు. భగవంతుడిని ఎక్కువ భక్తితో ఆరాధించే వారు ఎవరంటే వారు కేవలం తమ కోరికలు తీర్చమనె  వారే అని అనవచ్చు. మనకు తెలుసు తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ  వుంటున్నారని. దానికి కారణం ప్రతి మనిషి ఏదో ఒక కోరికతో స్వామిని   దర్శించు కొని మొక్కులు మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు

జీవితం అంటేనే కోరికల పుట్ట కోరికలు ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి మనిషి మెదడును తొలుస్తూ ఉంటాయి. కిరాయి ఇంట్లో వున్న వాడికి సొంత ఇల్లు కోరిక సొంత ఇల్లు ఉన్నవాడికి ఇంకా పెద్ద ఇల్లు కావాలనే కోరిక ఒక కోరిక తీరితే వెనువెంటనే ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోరికలకు అంతం అనేది లేనే లేదు అని చెప్పవచ్చు. మనిషి ఊపిరి పోసుకున్నప్పడినుంచి ఊపిరి ఆగే వరకు కోరికలే కోరికలు

ముందుగా ప్రతి మనిషి తన కోరికలు తీర్చమని భగవంతుని ప్రార్ధించడం అలవాటు చేసుకోవాలి. ఆలా భగవంతుని భక్తి తో మనస్సును ఊరట చెందింస్తే తరువాత తన కోరికలు నొకటొకటిగా తీరుతుంటే దైవ భక్తి పెరుగుతుంది. అంతే కాదు తదనుగుణంగా తెలియకుండానే ధర్మ ప్రవర్తన పెరుగుతుంది అంటే సాటివానికి సాయపడే తత్వము జీవుల పట్ల కారుణ్యము పెరిగి ఒక దశలో దైవ భక్తి మానసిక ప్రశాంతతను కలుగ చేస్తుంది. అప్పటినుంచి మనిషి భక్తుడుగా మారుతాడు. నిచయం దైవచింతనతో కాలం గడుపుతూ ఒక మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందుతాడు. ఎప్పుడైతే దైవచింతన మీద మనస్సు లగ్నాత చెందుతుందో అప్పుడు చక్కని సాధకుడుగా మార్తాడు. 

నిజమైన సాధకుడు సత్యాన్ని తెలుసుకొని తన రోజులో కొంత భాగం భగవంతుని కొరకు కేటాయిస్తాడు ఆలా నిత్యం సాధన చేస్తూ చేస్తూ సాధనలో పట్టు సాధించి చివరకు ఒక సద్గురువు ఆశీర్వాదంతో ముక్తిని పొందుతాడు

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ 

 

మాయను జయించడం

 3250. *మాయను జయించడం చాలా కష్టం. ఏ విభూతి వల్ల మాయ మనల్ని అంటకుండా ఉంటుంది?* *శివమహాపురాణం*

◆ శివ నిర్మాల్యం, శివుడికి సమర్పించిన బిల్వ పత్రములు (మారేడు ఆకులు), లేదా అర్జున పత్రాలు (మద్ది చెట్టు ఆకులు), ఇంకేవైనా పత్రాలు, పుష్పాలు నందీశ్వరుని శరీరానికి తగిలించి ఇంటికి తీసుకెళ్లండి, బాగా ఎండబెట్టండి. ఎక్కడైనా హోమం జరిగితే అందులో వేసి పూర్ణాహుతి అయ్యాక హోమగుండం నుండి భస్మమును తీసుకోండి. ఒకవేళ అలా భస్మం తీసుకునే అవకాశం లేనపుడు, *ఇంట్లోనే నిర్మాల్యం మీద కాస్త ఆవు నెయ్యి వేసి కాల్చగా వచ్చిన భస్మమును 40 రోజులు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ధరిస్తే పొరపాటున కూడా మాయ అంటదని పురాణములో పుష్పదంతుడి కథ ద్వారా తెలుస్తుంది, అలానే జగద్గురువులు శంకరులు, మరియు నడిచే దైవం కంచి పరమాచార్యులు చెప్పారు.*

శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః 

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ (11)


ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః 

తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః (12)


యజ్ఞయాగాలతో మీరు దేవతలను సంతృప్తి పరచండి. పాడిపంటలు లాంటి సమృద్ధులిచ్చి వారు మీకు సంతోషం కలగజేస్తారు. పరస్పర సద్భావం పరమ శ్రేయస్సు మీకు చేకూర్చుతుంది. యజ్ఞాలతో తృప్తిపడ్డ దేవతలు మీ వాంఛితాలు నెరవేరుస్తారు. దేవతలిచ్చిన సుఖభోగాలు అనుభవిస్తూ, వారికి మళ్ళీ ఆ సంపదలో కొంత కూడా అర్పించనివాడు దొంగ.

⚜ శ్రీ మలయాళప్పుళా భగవతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1055


⚜ కేరళ  : పతనంతిట్ట


⚜ శ్రీ మలయాళప్పుళా భగవతి ఆలయం



💠 మలయాళపూజ దేవి ఆలయం కేరళలోని మలయాళపుళలో ఉంది.  ఇది భగవతీ దేవికి అంకితం చేయబడింది.  ఇది కేరళలో అత్యంత ప్రసిద్ధ మరియు శక్తివంతమైన శక్తి పుణ్యక్షేత్రం.


💠 ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, కేరళ యొక్క గొప్ప సంప్రదాయాలు మరియు వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక మైలురాయి కూడా.


💠 మలయాళపుళ భగవతి ఆలయం 1,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు కేరళ యొక్క మత మరియు సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.  ఈ ఆలయం 3,000 సంవత్సరాల కాలందని కూడా గట్టిగా  నమ్ముతారు 


💠 ప్రధాన దేవత భద్ర కాళీ దేవి, శక్తి లేదా పార్వతి యొక్క భీకర రూపం కానీ ఆమె భక్తులకు దయగల తల్లిగా చెప్పబడింది.  

దేవత 5.5 అడుగుల ఎత్తు ఉంటుంది.  దేవత సాధారణంగా రాతితో చేసిన ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా ఇది అనేక పదార్థాలతో తయారు చేయబడింది.


💠 ‘కడు సర్కార యోగం’ అనే సాంకేతికతతో విగ్రహాన్ని తయారు చేశారు.  అనేక రకాల చెక్క ముక్కలు, మట్టి, ఆయుర్వేద మూలికలు, పాలు, నెయ్యి, బెల్లం, పసుపు, గంధం, కర్పూరం, బంగారం, వెండి, ఇసుక మరియు సహజ జిగురును విగ్రహం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 

ఇవన్నీ మానవ శరీరంలోని వివిధ అంశాలను సూచిస్తాయి. 

ఈ విగ్రహం ప్రాణ ప్రతిష్ట అనే తాంత్రిక కర్మ ద్వారా ప్రతిష్టించబడింది, ఇది జీవం మరియు శక్తితో నింపుతుంది.


💠 ఈ ఆలయంలో పార్వతీ దేవి తన ఒడిలో బిడ్డ గణపతిని తినిపిస్తున్న ప్రత్యేకమైన విగ్రహాన్ని కలిగి ఉంది. గర్భగుడి ప్రవేశద్వారంలో వీరభద్రుని విగ్రహం కనిపిస్తుంది. 

ఆలయంలో ఉప దేవతలు బ్రహ్మ రాక్షసులు, నాగరాజు మరియు స్వయంబు శివ లింగం.


💠 నంబూత్రి కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మూకాంబికా ఆలయంలో భద్రకాళి విగ్రహం సమక్షంలో ధ్యానం చేస్తున్నారనే కథనంతో అత్యంత తీవ్రంగా విశ్వసించబడే మూల కథ ప్రారంభమవుతుంది. 

కాసేపు ధ్యానం చేసిన తరువాత, వారికి భద్రకాళి దేవి నుండి సందేశం వచ్చింది, అక్కడ ఆమె అదే స్థితిలో తన శాశ్వత ఉనికిని ధృవీకరించింది. 


💠 భద్రకాళి దేవి ఆశీర్వాదంతో, నంబూతిరీలు వారి సన్నిధిలో విగ్రహాన్ని ఉంచుకుని తీర్థయాత్ర కొనసాగించారు. అయితే, వారు పెద్దయ్యాక, విగ్రహాన్ని కొనసాగించడం వారికి చాలా కష్టంగా మారింది. 

ఆ సమయంలో, నంబూతిరీలు చివరకు కేరళలోని మలయాళపుళకు చేరుకున్నారు, అక్కడ వారు ఆలయాన్ని నిర్మించారు.


💠 మలయాళపూజ దేవి భక్తులందరికీ శ్రేయస్సును అందించడానికి వరాలను ఇస్తుందని నమ్ముతారు.

భక్తుడిని శత్రువుల నుండి రక్షించడానికి, పెళ్లికాని అమ్మాయిలకు వివాహం చేయడానికి, నిరుద్యోగులకు ఉద్యోగం పొందడానికి మరియు వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అమ్మవారిని పూజిస్తారు. 

ఈ ప్రసిద్ధ నమ్మకం మరియు విశ్వాసం ఆలయాన్ని సుదూర ప్రాంతాల నుండి భక్తులు సందర్శించేలా చేస్తుంది. 

దేవిని ఇడతత్తిల్ భగవతి అని కూడా అంటారు


💠 ఈ ఆలయం ఉత్సాహభరితమైన ఉత్సవాలకు కేంద్రంగా ఉంది. వినాయక చతుర్థి, నవరాత్రులు మరియు శివరాత్రి వంటి ముఖ్యమైన సంఘటనలు చాలా వైభవంగా జరుపుకుంటారు. 


💠 ఆలయ వార్షిక ఉత్సవం కుంభంలో (ఫిబ్రవరి-మార్చి) తిరువతీర నక్షత్రం రోజున ప్రారంభమవుతుంది మరియు పదకొండవ రోజున ఆరాట్టు ఆచారాన్ని కలిగి ఉంటుంది, ఇందులో దేవతను ఆలయ కోనేరులో స్నానం చేయిస్తారు.


💠 భక్తులు తోనియారి పాయసం (తీపి అన్నం), నేయ్ విళక్కు (నెయ్యి దీపాలు), మరియు నిరపర (బియ్యం, వడ్లు మరియు పంచదార నైవేద్యాలు) వంటి వివిధ నైవేద్యాలు సమరిస్తారు.


💠 తెల్లటి బూడిద, గంధం, నూనె, పాలు, నెయ్యి మరియు లేత కొబ్బరి నీళ్లతో చేసే అభ్యంగన ఆరాధనలు ఇక్కడి పూజా విధానాలలో అంతర్భాగంగా ఉంటాయి, 


💠 సందర్శకులు సాంప్రదాయ ఆలయ మర్యాదలను అనుసరించి,  నిరాడంబరంగా దుస్తులు ధరించడం, ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలను తొలగించడం మరియు గౌరవప్రదమైన ప్రవర్తనను కొనసాగించడం.  

ఆచారాల విషయంలో ఆలయ అధికారులు మరియు అర్చకుల మార్గదర్శకాలను అనుసరించడం మంచిది.


💠 వార్షిక పండుగను 11 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ కుంభ మాసంలో (ఫిబ్రవరి - మార్చి) తిరువతీర నక్షత్రం నాడు ప్రారంభమవుతుంది.

 కథాకళి నాల్గవ మరియు ఐదవ రోజున నిర్వహిస్తారు.


💠 ఆలయం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది.


💠 వినాయక చతుర్థి, నవరాత్రి, శివరాత్రి మరియు ఇతర ప్రధాన పండుగలు ఘనంగా జరుపుకుంటారు. మంగళ, శుక్రవారాలు అన్ని దేవి ఆలయాలలో ముఖ్యమైన రోజులు.

 ఆ రోజుల్లో అధిక రద్దీ మిమ్మల్ని దర్శనం (వీక్షించడం) కోసం వేచి ఉండేలా చేస్తుంది.


💠 33 కి.మీ దూరంలో ఉన్న చెంగన్నూర్ రైల్వే స్టేషన్ రైలులో వచ్చే వారికి సమీపంలోని ప్రధాన స్టేషన్. 

త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం 107 కిమీ దూరం



రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం 183-*

 *తిరుమల సర్వస్వం 183-*

*సప్తగిరులు -2*

2 భవిష్యోత్తరపురాణాన్ని అనుసరించి జనకవంశపు రాజపురోహితుడైన శతానందుడు, జనకమహారాజుకు, అతని పరివారానికి వేంకటాచల మహత్యం వివరిస్తూ, వృషభాద్రి వృత్తాంతాన్ని పై విధంగా విశదీకరించారు. 


 *అంజనాచలం లేదా అంజనాద్రి* 


 వాయుదేవుని అంశతో హనుమంతుణ్ణి పుత్రునిగా పొందిన అంజనాదేవి తపస్సు గావించిన ఈ పర్వతం అంజనాద్రిగా పేరుగాంచింది.


 పూర్వజన్మ యందు అంజనాదేవి దేవలోకవాసి అయిన *'పుంజికస్థల'* అనబడే ఒక గంధర్వకన్య. 


 ఒకానొకప్పుడు తన చెలికత్తెలతో బాటుగా భూలోక విహారానికి వచ్చిన సందర్భంలో ఆమె, తాను గంధర్వకన్య ననే మిడిసిపాటుతో, తపస్సులో నిమగ్నమై ఉన్న ఒక మునిపుంగవుణ్ణి చూసి ఎగతాళి చేసింది. వానరచేష్టలతో తన తపస్సుకు భంగం కలిగించడంతో కృద్ధుడైన ఆ మునీశ్వరుడు గంధర్వకన్యను వానరరూపం ఎత్తమని శపించాడు. మహా తపస్సంపన్నుడైన ఆ జడధారి శాపవచనాల వల్ల ఆమె వానరంగా జన్మించి, *'కేసరి'* అనే పేరు గల వానరవీరుణ్ణి వివాహమాడింది. శ్రీమహావిష్ణువును ఎంతో భక్తితో ఆరాధించే ఆ దంపతులకు చాలా కాలం సంతానభాగ్యం కలుగకపోవడంతో; వారు సమీపంలోనున్న మతంగముని ఆశ్రమానికి వెళ్లి, వారిని సేవించుకుని, తమకు పుత్రసంతానం కలిగే మార్గం చెప్పవలసిందిగా వేడుకుంటారు. 


 మునివర్యుల ఆదేశాన్నఇ అనుసరించి, అంజనాదేవి- కేసరి దంపతులు శేషాచలానికేతెంచి, స్వామిపుష్కరిణిలో స్నానమాడి, ఆదివరాహుణ్ణి దర్శించుకుని, ఉత్తర దిక్కున ఉన్న 'ఆకాశగంగ' అనే తీర్థానికి చేరుకుంటారు. 

[ఈ తీర్థప్రాశస్త్యాన్ని ఇంతకు ముందే తెలుసుకున్నాం.]


 అంజనాదేవి ప్రతిదినము ఆ పవిత్రతీర్థంలో స్నానమాడి, ఆ ప్రదేశంలోనే పన్నెండు సంవత్సరాల పాటు, నిరాహారియై కఠోర సాధన చేస్తుంది.


 భగవదేచ్ఛను అననుసరించి వాయుదేవుడు ప్రతి సంవత్సరం ఆకాశగంగా తీర్థంలో అంజలి ఘటిస్తున్న అంజనాదేవి దోసిలిలో ఒక దివ్యఫలం రాలేటట్లుగా చేశాడు. అంజనాదేవి దానిని మాత్రమే ఆహారంగా స్వీకరించేది. పన్నెండవ సంవత్సరం పూర్తవగానే వాయుదేవుడు తన వీర్యంతో నింపిన ఫలాన్ని అంజనాదేవి దోసిలిలో పడేట్లు చేశాడు. యథాప్రకారం ఆ ఫలాన్ని భుజించిన అంజనాదేవి, వెంటనే గర్భం దాల్చింది. వాయుదేవుని అంశతో, అంజనాదేవి సకలసద్గుణసంపన్నుడు, పరాక్రమవంతుడు, మహాబలశాలియైన హనుమంతుణ్ణి పుత్రుడిగా పొందింది.


 అంజనాదేవి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి, హనుమను పుత్రునిగా పొందిన ప్రదేశం 'అంజనాద్రి' లేదా 'అంజనాచలం' గా పేరు గాంచింది. 


 ఇప్పుడు *'జాబాలితీర్థం'* గా పిలువబడుతున్న ప్రదేశం లోనే మతంగముని ఆశ్రమం ఉండేదని, అంజనాదేవి అక్కడే తపమాచరించిదని భక్తుల నమ్మకం. 


 *శేషాద్రి లేదా శేషాచలం* 


 ఈ శిఖరానికి శేషాద్రి లేదా శేషాచలం అనే నామధేయం రావడానికి వెనుక చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. 


 ఒకప్పుడు వైకుంఠవాసి అయిన శ్రీమహావిష్ణువు మందిరానికి ద్వారపాలకులుగా ఉండే జయ విజయులు శాపవశాత్తూ భూలోకంలో రాక్షసులుగా జన్మించినప్పుడు, ఆపద్ధర్మంగా ఆదిశేషుడు వైకుంఠద్వారానికి కాపలా కాస్తున్నాడు. శ్రీమహావిష్ణువుకు పర్యంకముగా, తల్పముగా ఛత్రముగా ఇంకా అనేక రకాలుగా యుగయుగాల నుండి సేవలందించడం వల్ల శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మి తర్వాత అత్యంత సన్నిహితంగా మెలగటం వల్ల; ప్రస్తుతం ద్వారపాలకునిగా అదనపు బాధ్యత చేపట్టడం వల్ల అతనిలో కొద్దిగా అహంకారపు ఛాయలు పొడచూపాయి. దానిని గమనించిన శ్రీమహావిష్ణువు ఆదిశేషునికి తగిన గుణపాఠం నేర్పి, సరి అయిన బాటలో పెట్టాలని తగిన అవకాశం కోసం వేచి చూస్తున్నాడు.


‌ ఇదిలా ఉండగా ఒకనాడు అష్టదిక్పాలకులలో ఒకడు, శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడు, వినయ విధేయతలతో అణిగిమణిగి ఉండే వాయుదేవుడు విష్ణుమూర్తి దర్శనార్థం వైకుంఠానికి ఏతెంచి, ద్వారపాలకునిగా ఉన్న ఆదిశేషువుతో శ్రీహరి దర్శనానికై అనుమతి కోరాడు. వాస్తవానికి దేవతల తారతమ్యంలో వాయుదేవుడు ఆదిశేషువు కంటే పై కక్ష్యలోని వాడు. కానీ, ఆదిశేషువు తరతమ బేధాలను గుర్తించకుండా వాయుదేవునికి అహంకారపూరితంగా, నిర్లక్ష్యంతో సమాధానమిచ్చాడు. అత్యవసర విషయమై శ్రీమన్నారాయణునితో సత్వరమే సమావేశమవ్వాలని తెలియపరచినప్పటికీ ఆదిశేషుడు ఏకపక్షంగా వ్యవహరించి, వాయుదేవుణ్ణి అడ్డుకుని, పరుషపదజాలాన్ని ఉపయోగించాడు. దాంతో స్వతహాగా నిగర్వి, శాంతస్వభావుడు అయినట్టి వాయుదేవుడు కూడా కోపోద్రిక్తుడై ఆదిశేషువును తూలనాడాడు. శ్రీమహావిష్ణువుకు అతి సమీపంలో తాను ఉంటానని, వారికి తాను అత్యంత ప్రీతిపాత్రుడనని ఆదిశేషుడు వాదించగా; విసుగు చెందిన వాయుదేవుడు ఇంటి యజమానికి సమీపంలోనున్నంత మాత్రాన కాపలాగా ఉంచుకున్న శునకం గొప్పదెలా అవుతుందని పరుషంగా ప్రశ్నించాడు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

15-03,04-గీతా మకరందము

 15-03,04-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అట్టి సంసారవృక్షమును అసంగమను శస్త్రముచే ఛేదించివైచి పరమాత్మ పదము నన్వేషింపవలయునని బోధించుచున్నారు-

 

న రూపమస్యేహ తథోపలభ్యతే

నాన్తో న చాదిర్న చ సమ్ప్రతిష్ఠా | 

అశ్వత్థమేనం సువిరూఢమూలం

అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్వా || 

 

తతః పదం తత్పరిమార్గితవ్యం

యస్మిన్ గతా న నివర్తన్తి భూయః | 

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే 

యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ || 


తాత్పర్యము:- ఆ సంసారవృక్షముయొక్క స్వరూపము ఆలాగున (ఇపుడు వర్ణింపబడినరీతిగా) ఈ ప్రపంచమున (సంసారాసక్తిగలవారిచేత) తెలియబడకున్నది. దాని ఆదిగాని అంతముగాని, మధ్యము (స్థితి) గాని కనబడకున్నది. గట్టిగ వేళ్ళునాటుకొనిన ఈ సంసారమను అశ్వత్థవృక్షమును అసంగమను బలమైన ఆయుధముచే నఱికివైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించినవారు మఱలవెనుకకు (సంసారమునకు) రారో, ఎవరినుండి అనాదియైన ఈ సంసారవృక్షముయొక్క ప్రవృత్తివ్యాపించెనో, (అట్టి) ఆది పురుషుడగు పరమాత్మనే శరణుబొందుచున్నాను - అనునిట్టి (భక్తి) భావముతో ఆ పరమాత్మపదమును వెదకవలయును.


వ్యాఖ్య:- క్రిందటి శ్లోకములందు వర్ణింపబడినలాగున (ఊర్ధ్వమూలముగ, అథఃశాఖగ. - ఇత్యాదిరూపముగ) ఈ సంసారవృక్ష మేల కనుపించుటలేదు? సంసారాసక్తిగల అజ్ఞానుల కట్టిరూపము తెలియబడదు. దాని ఆద్యంతమధ్యములుకూడ తెలియబడవు. ఏలయనగా వారు దానిలో మునిగియుండి సత్యమును తెలిసికొనజాలకున్నారు (చీకటిలోనున్నవారికి వస్తువులు గోచరింపనట్లు). ప్రకాశమునందు వస్తువులు తెలియునట్లు, వైరాగ్యము, ముముక్షుత్వము, ఆత్మజ్ఞానము కలవారికి దానిస్వరూపము గోచరించగలదు.

         ఈసంసారవృక్షము అనాదికాలమునుండి వర్తించుచు అతివిశాలముగ, శాఖోపశాఖలుగ వ్యాపించి, బాగుగ వేళ్ళుతన్నుకొని యున్నది. కనుకనే దానివేళ్ళను గూర్చి వర్ణించునపుడు భగవానుడు "రూఢమూలమ్” అనిగాని, "విరూఢమూలమ్” అనిగాని చెప్పక "సువిరూఢమూలమ్” అని చెప్పుటకు కారణము. దానివేళ్ళు చాలగట్టిగ పాతుకొనిపోయినవని భావము. అయితే అంతమాత్రముచేత దిగులునొందవలసిన పనిలేదు. చెట్టు ఎంతగొప్పదైనను బలమైన ఆయుధముచే నేలమట్టము కాగలదు. అట్లే ఈ సంసారవృక్షమును ఛేదించుటకు భగవానుడు చక్కని ఆయుధమును సూచించిరి. అదియే అసంగము. ప్రాపంచిక పదార్థములందు అభిమానము, ఆసక్తి గలిగియుండుటయే సంగము, అది లేకుండుటయే అసంగము. వైరాగ్యమని భావము. అయితే మందమంద వైరాగ్యభావములచేత ఈ గొప్పసంసారవృక్షచ్ఛేదనము సాధ్యపడదు. తీవ్రతర విరక్తి, పరిపూర్ణ అసంగము ఆవశ్యకమైయున్నది. కనుకనే "ధృడేన” అను పదమును భగవానుడు ప్రయోగించిరి. ఒక పెద్ద "ఫ్యాక్టరీ” లో మూలచక్రమునకుగల "బెల్టు” తెగినచో అన్నియంత్రములున్ను ఎట్లాగిపోవునో, అట్లే ఈసంసారరూప బృహద్యంత్రాంగమంతయు సంగరాహిత్యము (అసంగము)చే స్తబ్ధమైపోవును. మహనీయు లీప్రపంచమున నున్నప్పటికిని ఇట్టి అసంగభావమే గలిగియుండి సంసారబాధలెవ్వియు లేకయుందురు. అయితే ఈ అసంగము బాహ్యముననేగాక, అభ్యంతర సంకల్పములందును గలిగియుండవలెను. అపుడే ఆ అసంగము పరిపూర్ణము కాగలదు.

ఇంతటితో పని పూర్తి అయినదా? కాదు. సంసారవృక్షచ్ఛేదనము అయిన పిదప అనగా దృశ్యత్యాగము అయినపిదప దృక్ - స్వరూపమును ఆశ్రయించుట అను ముఖ్యమైనపని మఱియొకటి కలదు. అప్పు తొలగవలెను, సొంతముగ కొంత ద్రవ్యమును గలిగియుండవలెను. అపుడే మనుజుడు సుఖముగ నుండగలడు. దృశ్యభావత్యాగము అప్పుతొలగుటవంటిది. అది చాలదు. ఏలయనిన అప్పు తొలగినను, తన పోషణనిమిత్తము కొంత ద్రవ్యము లేనిచో మనుజునకు తృప్తియుండదు. అట్లే దృశ్యవిరక్తి, ఆత్మపదప్రాప్తి రెండును యున్నచో జీవునకు పరిపూర్ణసుఖమేర్పడగలదు. కనుకనే భగవానుడు సంసారవృక్షచ్ఛేదనమును గూర్చి తెలిపి, “తతః” - అటు పిమ్మట 'పరిమార్గితవ్యమ్’- "పరమాత్మపదాన్వేషణము గావింపవలెను" అని బోధించుటకు కారణమైనది.

ప్రపంచములో అనేక పదవులున్నప్పటికిని అన్నిటికంటె గొప్పది పరమాత్మ పదవియే కావున దానినే అనుసరించవలెనని, అన్వేషింపవలెనని ఇచట బోధింపబడినది. ఏలయనిన ఆ మహోన్నతపదమును బొందినవాడిక మరల ఈ దుఃఖభూయిష్ఠమగు సంసారస్థితికి దిగిరాడు. (యస్మిన్ గతా న నివర్తని భూయః). బ్రహ్మాండమునం దేలోకమునకు పోయినను తిరిగిరావలసినదే, మఱల పుట్టవలసినదే - కాని భగవంతుని పొందినవారు, ఆత్మపదవి నధిష్ఠించినవారు మఱల జన్మింపరు. అది శాశ్వతపదము. పూర్ణదుఃఖరాహిత్యము దానివలననే కలుగును. కనుకనే అన్ని పదవులలోను అది సర్వోత్కృష్టమైనది. కాబట్టి విజ్ఞులెల్లరును దానినే అనుసరించి తరించుదురుగాక!


అయితే "ఆ పరమపురుషునే శరణు బొందుచున్నాను” (తమేవ పురుషం ప్రపద్యే) అను భక్తిభావముతో, నిరహంభావనతో ఆ యాత్మపదమును అన్వేషింపవలసియున్నది. నిర్మలభక్తిగలవానికి ఆత్మజ్ఞానము త్వరలో లభించగలదు.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*322 వ రోజు*

*చతుర్ధాశ్వాసం*


అప్పటి వరకూ సంజయుని మాటలు వింటున్న ధృతరాష్ట్రుడు సంజయునితో " సంజయా! ధర్మరాజు అనుమతి తీసుకుని వెళుతున్న సాత్యకి ద్రోణుని ఎలా దాటగలిగాడు. మన సైన్యం ఎవరూ సాత్యకిని అడ్డుకొన లేదా ! సాత్యకి అర్జునుడిని కలిసాడా ! వివరంగా చెప్పు " అని అడిగాడు. సంజయుడు చెప్పసాగాడు " ధర్మరాజు ఆజ్ఞా బద్ధుడైన సాత్యకి అడ్డువచ్చిన కౌరవ సేనలను చంపుతూ ముందుకు దూసుకు వెళుతున్నాడు. తనను అడ్డుకున్న ఏడుగురిని యమపురికి పంపాడు సాత్యకి. అది చూసి ద్రోణుడు సాత్యకిని అడ్డుకుని అతిక్రూర శరములతో కొట్టాడు. సాత్యకి రధమును, సారధిని కొట్టాడు. అందుకు సాత్యకి కోపించి ద్రోణునిపై బాణములు గుప్పించాడు. ద్రోణుడు వాటిని త్రుంచి తిరిగి సాత్యకిపై బాణములు గుప్పించి " సాత్యకీ ! నా పరాక్రమముకు తట్టుకోలేక నీ గురువు అర్జునుడు నాతో యుద్ధము చేయకుండా పారి పోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు నా బాణముల రుచి చూద్దువుగాని " అన్నాడు. సాత్యకి ద్రోణునికి నమస్కరించి " ఆచార్యా! నేను అంతటి వాడిని కాను. ధర్మరాజు ఆజ్ఞ మేరకు అర్జునుడికి సాయం వెడుతున్నాను. దయ ఉంచి నన్ను విడువుము . నా వంటి పిన్నలను మన్నించుట మీ వంటి పెద్దల ధర్మము కదా ! " అన్నాడు. అయినా ద్రోణుడు సాత్యకికి దారి విడువ లేదు. సాత్యకి తనకు అడ్డుగా ఉన్న అంగ, బాహ్లిక, దాక్షిణాత్య సేన మధ్య నుండి ఆవలకు వెళ్ళాడు. ఇంతలో కృతవర్మ సాత్యకిని అడ్డుకుని ఆరు బాణములతో సాత్యకిని కొట్టాడు. నాలుగు బాణములతో సాత్యకి రథాశ్వములను కొట్టాడు. సాత్యకిని కృతవర్మ అడ్డుకొనడం చూసిన ద్రోణుడు ధర్మరాజు వైపు వెళ్ళాడు. సాత్యకి కృతవర్మను పదహారు శరములతో కొట్టాడు. అతడి సారథి చంపి, అతడి విల్లు విరిచాడు. కృతవర్మ తన రథమును తానే తోలుకుంటూ యుద్ధం చేస్తూ కృతవర్మ సాత్యకిని వదిలి భీముని వైపు పోయాడు. సాత్యకి కాంభోజుని సేనలో ప్రవేశించి అక్కడి వీరులను తనుమాడుతున్నాడు. ఇంతలో ద్రోణుడు కృతవర్మకు మరొక రథమును ఏర్పాటు చేసాడు.


కృతవర్మ పరాక్రమం*


కృతవర్మ ధర్మరాజును అతడికి సాయంగా ఉన్న వీరులను ఎదుర్కొన్నాడు. భీమసేనుడు వారికి సాయంగా వచ్చాడు. భీముడు, ధృష్టద్యుమ్నుడు మూడేసి బాణములతోను ధర్మరాజు, ద్రుపదుడు అయిదేసి బాణమలతోను విరాటరాజు పదిహేను బాణములతోను సహదేవుడు ఇరవై ఐదు బాణములతోను, శిఖండి ఇరవై బాణములతోను, ఉపపాడవులు డెబ్బై అయిదు బాణములతోను, నకులుడు నూరు బాణములతోను కృతవర్మను చుట్టుముట్టి కొట్టారు. కృతవర్మ జంకక ఒక్కొక్కరిని ఐదేసి బాణములతో కొట్టి భీమునిపై ఏడు బాణములు వేసి, భీముని విల్లు పతాకము తుంచి డెబ్బై బాణములతో భీముని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు మూర్చిల్లాడు. ఇంతలో పాండవ వీరులు ఒక్కుమ్మడిగా కృతవర్మను చుట్టుముట్టారు. ఇంతలో భీముడు తేరుకుని కృతవర్మ మీద ఉజ్వలమైన శక్తిని ప్రయోగించాడు. కృతవర్మ దానిని మూడు ముక్కలుగా కొట్టాడు. కృతవర్మ దానిని మూడు ముక్కలు చేసాడు. భీముడు కృతవర్మను నెత్తురు కారేలా కొట్టాడు. కృతవర్మ భీమునిపై మూడు బాణములు వేసాడు. పాండవ సైన్యం కృతవర్మను చుట్టుముట్టి తీవ్రమైన బాణములతో కొట్టారు. కృతవర్మ కూడా జంకక శిఖండి విల్లు తుంచి భీముని వంటి రథికులపై శరములు గుప్పించి శిఖండి పైన బాణములు గుప్పించాడు. ఆ దెబ్బకు శిఖండి రథముపై పడ్డాడు. సారథి శిఖండిని పక్కకు తీసుకు వెళ్ళాడు. శిఖండి పడిపోవడం చూసి మత్స్య, కేకయ, చేధి రాజులు ఒక్కుమ్మడిగా తమసైన్యములతో కృతవర్మను ఎదుర్కొన్నారు. కృతవర్మ వారందరిని మర్మభేది బాణములు ప్రయోగించి బాధించాడు. కృతవర్మ ధాటికి పాండవ సైన్యాలు పారి పోవడం చూసిన సాత్యకి అర్జునుడి వద్దకు పోవడం కంటే ధర్మజుని రక్షణే ముఖ్యం అని తలచి ద్రోణుని పక్క నుండి ధర్మజుని వద్దకు వచ్చి కృతవర్మను ఎదుర్కొన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

గరుడ పురాణం_*22వ

 *గరుడ పురాణం_*22వ భాగం*


_*మహాశక్తులను బీజమంత్ర యుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి.*_


ఓం రాం పద్మాయై నమః - ఆగ్నేయం


ఓం రీం దీప్తాయై నమః - నైరృత్యం


ఓం రూం సూక్ష్మాయై నమః - వాయవ్యం


ఓం రేం జయాయై నమః - ఈశాన్యం


ఓం రైం భద్రాయై నమః - తూర్పు


ఓం రోం విభూత్యై నమః - దక్షిణం


ఓం రౌం విమలాయై నమః - పశ్చిమం


ఓం రం అమోఘికాయై నమః - ఉత్తరం


ఓం రం విద్యుతాయై నమః - ఉత్తరం


ఓం రం సర్వతోముఖ్యై నమః - మండలమధ్యం


_*తరువాత శివస్వరూపమున్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి "హ్రాం హ్రూం (లేదా హ్రీం)సః" అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి.*_


'ఓం ఆం హృదర్కాయ నమః '


'ఓం భూర్భువః స్వః శిరసే స్వాహా'


'ఓం భూర్భువః స్వః శిఖాయై వౌషట్'


'ఓం హ్రం జ్వాలిన్యై నమః '


'ఓం హ్రుం కవచాయ హుం'


'ఓం హ్రూం అస్త్రాయ ఫట్'


'ఓం హ్రం ఫట్ రాజ్యై నమః '


'ఓం హ్రం ఫట్ దీక్షితాయై నమః '


_*అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువ నీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు ‘మానసీపూజ'ను సంపన్నం గావించాలి.*_


ఓం సః సూర్యాయ నమః 

ఓం సోం సోమాయ నమః 

ఓం మం మంగలాయ నమః 

ఓం బుం బుధాయ నమః 

ఓం బృం బృహస్పతయే నమః, 

ఓం భం భార్గవాయ నమః, 

ఓం శం శనైశ్చరాయ నమః, 

ఓం రం రాహవే నమః, 

ఓం కం కేతవే నమః, 

ఓం తేజశ్చండాయ నమః ।


_*ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రా లతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో కరన్యాస, అంగన్యాసాలను చేయాలి.*_


ఓం హం హృదయాయ నమః, 

ఓం హీం శిరసే స్వాహా, 

ఓం హూం శిఖాయై వౌషట్, 

ఓం హైం కవచాయ హుం, 

ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం హః అస్త్రాయ ఫట్


_*తరువాత భూతశుద్ధి గావించి మరల న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి. తరువాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. 'ఓం హౌం శివాయ నమః' అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగ, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతిలనూ తదుపరి తన గురుదేవునీ సాధకుడు అర్చించాలి.*_


_తరువాత పద్మమధ్యంలో నున్న శక్తి అనంతదేవులనూ, పద్మ పూర్వ దళంలో ధర్మాన్నీ, దక్షిణంలో జ్ఞానాన్నీ, పశ్చిమంలో వైరాగ్యాన్నీ, ఉత్తరంలో ఐశ్వర్యాన్నీ, ఆగ్నేయంలో అధర్మాన్నీ, నైరృత్యంలో అజ్ఞానాన్నీ, వాయవ్యంలో అవైరాగ్యాన్నీ, ఈశాన్యంలో అనైశ్వర్యాన్నీ పద్మకర్ణికపై వామా, జ్యేష్ఠాశక్తులనూ మరల తూర్పుతో మొదలుపెట్టి రౌద్రీ, కాలీ, శివా, అసితాది శక్తులనూ పూజించాలి._


_*తరువాత శివుని కెదురుగా నున్న పీఠంపై ప్రతిష్టింపబడిన కలవికరిణీ, బలవికరిణీ, బలప్రమథినీ, సర్వభూతదమనీ, మనోన్మనీ అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి.*_


ఓం హౌం కలవికరిణ్యై నమః, ఓం హౌం, బలవికరిణ్యై నమః, 

ఓం హౌం బల ప్రమథిన్యై నమః, 

ఓం సర్వభూత దమన్యై నమః, 

ఓం మనోన్మన్యై నమః ।


_*తరువాత సాధకుడు ఒక ఆసనం పైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి- మంథనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, "చరు" నైవేద్యాలను సమర్పించాలి.*_

_('చరు' అనగా హోమయోగ్యమైన, పక్వం చేయబడిన అన్నము.)_


_*నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్ధికై (ముఖమనగా నోరు) తాంబూలము, కరోద్వర్తనం, ఛత్రం, చామరం యజ్ఞోపవీతం, ప్రదానం చేసి "పరమీకరణ" చేయాలి.*_

_("పరమీకరణ"మనగా అర్చనీయదేవునిలో సర్వోత్కృష్టత యను భావము గట్టి పఱచుట.)_


_*పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే 'షడంగ పూజ' అని వ్యవహరిస్తారు.*_


_తరువాత దిక్పాలకులనూ, వారి మధ్యలో చండేశ్వరీ దేవిని పూజించాలి._


_*చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి.*_


_*గుహ్యాతిగుహ్యగోప్తాత్వం గృహాణా స్మత్కృతం జపం |*_

_*సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః ||*_


_*యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం !*_

_*తన్మే శివ పదస్థస్య రుద్ర క్షపయ శంకరః ॥*_


_*శివోదాతా శివోభోక్తా శివః సర్వమిదంజగత్ |*_ 

_*శివోజయతి సర్వత్రయః శివః సో హమేవచ ll*_


_*యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ |*_ 

_*త్వం త్రాతా విశ్వనేతాచనాన్యో నాథో..స్తి మే శివ ॥*_


_'హే ప్రభో! నీవు గుహ్యాతిగుహ్యమైన తత్త్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు. నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృప వల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా వుండేలా వరమియ్యి. రుద్రదేవా! శంకరా! నా పాపాలను నశింపజెయ్యి. పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్నీ వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు. సర్వభర్తవు. నా భవిష్యత్కర్మలన్నీ నీ వైపే పయనించే లాగ నన్ను దీవించు. రక్షకుడవు నీవే. విశ్వనాయకుడవు నీవే.


హే పరమశివా! నాకు వేరే దిక్కు గాని దైవంగాని లేదు' అని ఈ స్తుతి సారము._


_*ఈ రకంగా శివోపాసనచేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాతపడడు. అతి శోతోష్టాలకూ అతీతుడవుతాడు.*_

గరుడ పురాణం_*21వ భాగం*

 *గరుడ పురాణం_*21వ భాగం*



*పంచవక్త్ర పూజనం - శివార్చన విధి:-*_


_ఋషులారా! ఇపుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తినీ ముక్తినీ ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి._


_*'ఓం భూర్విష్ణవే ఆది భూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహా'*_


_తరువాత సద్యోజాత విశేషణధారియైన పరమాత్మ కళను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి._


_*'ఓం హాం సద్యోజాతాయ నమః'*_


_ఈ సద్యోజాత శక్తిలో ఎనిమిది కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి స్వధ, స్థితి. వీటన్నిటినీ, ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో 'నమః' ను చేర్చి పూజించాలి._

_(ఉదా॥ సిద్ధిని 'ఓం సిద్ద్యై నమః' అనే మంత్రంతో పూజించాలి.)_


_*తరువాత సాధకుడు "ఓం హీం వామదేవాయ నమః" (కొన్నిచోట్ల హ్రీంకి బదులు హీం వుంది)*_


_అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివ స్వరూపానికి పదమూడు కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి._


_అలాగే అఘోర స్వామికీ ఒక మంత్రమూ ఎనిమిది కళలూ వుంటాయి. (ఎందుచేతనో గాని మంత్రమూ బీజాక్షరమూ చెప్పబడలేదు) ఆ కళలు ఇవి మనోన్మనీ, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర._


_*ఈ కళలను కూడ ఓం, నమః ఆదులను చేర్చి పూజించాక శివుని నాలుగవ వక్త్ర రూపమైన తత్పురుషుని "ఓం హైం తత్పురుషాయ నమః" అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు అయిదు. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని "ఓం హౌం ఈశానాయ నమః " అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు ఆరు. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలనూ 'ఓం, షష్ఠి, నమః' లను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమౌతుంది.*_


_ఋషులారా! ఇపుడు శివార్చన విధిని వినిపిస్తాను. పన్నెండం గుళాల మేర శివమూర్తిని, బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా వుండాలి. శివుని ముఖం వైపు అయిదు బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి ఆరవబిందువూ విసర్గ వుండాలి. అది అస్త్ర (హస్తన్యాస)ము. దానితో బాటు 'హౌం' అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం. సంపూర్ణార్థ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వ భాగం నుండి చరణ పర్యంతమూ చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి._


_*అపుడు అస్త్రమంత్రం "ఓం ఫట్" నుచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ, శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి.*_


_ఇక బాహ్యపూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానము లను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి. తరువాత అగ్నిలో ఆహుతుల నివ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి వుంచడానికి ముందే 'ఓం ఫట్' అనే అస్త్ర మంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై 'ఓం హూం' అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి. అనగా నీళ్ళు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపియైన తేజాన్నీ అగ్నినీ విన్యాసం చేయాలి. (అంటే వుంచాలి) ఈ అగ్నిలో నిష్కకృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలనూ చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త అంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులివ్వాలి._


_*తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్ని కోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్ని కుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలో నున్న కమల కర్ణికపై సదాశివునికీ దిశలలో అస్త్రాలకీ పూజచేయాలి. అంతట పంచతత్త్వాలలో నుండు పృథ్వీ, జల తత్త్వ శక్తులకు విడివిడిగా వంద వంద ఆహుతులను అయిదేసిమార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారియైన శివుని ధ్యానించాలి.*_


_అనంతరం ప్రాయశ్చిత్తశుద్ధికై ఎనిమిదిమార్లు ఆహుతులివ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన 'హుంఫట్' అనే మంత్రంతో అర్పించడం శ్రేష్ఠం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు._


_*శివుని యొక్క విశేషపూజలో సాధకుడు మొదట:*_


_ఓం హాం ఆత్మ తత్త్వాయ స్వాహా_


_ఓం హీం విద్యాతత్త్వాయ స్వాహా_


_ఓం హూం శివతత్త్వాయ స్వాహా_


_*అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి.*_


_'ఓం హం ప్రపితా మహేభ్యః స్వధా,_


_'ఓం హాం మాతా మహేభ్యః స్వధా'_


_'ఓం హాం నమః సర్వ మాతృభ్యః స్వధా'_


_*ఇలాగే తన పితరులందరికీ తర్పణాలిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన, మార్జనలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి.*_


_'ఓం హాం తన్మహేశాయ విద్మహే, వాగ్విశుద్ధాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ I'_


_*పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి.*_


_ఓం హాం హీం హూం హైం హౌం హః శివ సూర్యాయ నమః |_

_ఓం హం ఖఖోల్కాయ సూర్యమూర్తయే నమః |_

_ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః ।_


_*ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి, సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి.*_


_తరువాత దండీ, పింగళాది భూత నాయకులను " ఓం దండినే నమః, ఓం పింగలాయ నమః " మున్నగు మంత్రాల ద్వారానూ, అనంతరం ఆగ్నేయాది కోణాలలో "ఓం విమలాయై నమః, ఓం ఈశానాయై నమః " అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారానూ స్థాపించి, స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలూ ప్రాప్తిస్తాయి._

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(80వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

   *వ్రేపల్లె వాసుడు శ్రీకృష్ణుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘కంసా! నన్ను వధించడం నీ తరం కాదు. నిన్ను వధించేవాడు మాత్రం పుట్టి పెరుగుతున్నాడు. అతని చేతుల్లో నీకు చావు తప్పదు.’’*


*కత్తి ఝళిపిస్తూ క్రూరంగా చూశాడు కంసుడు. అదృశ్యమయింది విష్ణుమాయ.*


*విష్ణుమాయ మాటలకు, ఆనాడు ఆకాశవాణి చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో అంతా అబద్ధం అనుకున్నాడు కంసుడు. అన్యాయంగా దేవకీవసుదేవుల్ని హింసించాననుకున్నాడు. తప్పు చేశాననుకుని, వారిని బంధవిముక్తుల్ని చేశాడు.*


*‘‘బావా! ఆకాశవాణి మాటలు నమ్మి, మీకు చేయరాని అపకారం చేశాను. మిమ్మల్ని బంధించి, మీ బిడ్డల్ని హతమార్చాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి.’’ వేడుకున్నాడు కంసుడు.*


*‘‘రాచమర్యాదలు పొందుతూ హాయిగా ఉండండి. వెళ్ళండి.’’ అని అభయాన్నిచ్చాడు కంసుడు. అక్కణ్ణుంచి నిష్క్రమించాడు.*


*యశోదానందులు:~*


*గోకులంలో నందగోపుడు ప్రముఖుడు. అతని నివాసం వ్రేపల్లె. యశోద అతని భార్య పేరు. ఈ దంపతులకు చాలా కాలంగా పిల్లలు లేరు. వయసు మీరుతున్న వేళ యశోద ఆడపిల్లను కన్నది. అయితే తాను ఆడపిల్లను కన్నట్టుగా ఆమెకు తెలియదు. విష్ణుమాయలో ఉందామె. ఆ పిల్లను వసుదేవుడు తీసుకునిపోయి, ఆ పిల్ల స్థానంలో మగబిడ్డను ఉంచిన సంగతి కూడా తెలియదామెకు. ఈ సంగతి యశోదానందులకే కాదు, వ్రేపల్లెలో ఎవరికీ తెలియదు. ఫలితంగా దేవకీ వసుదేవుల బిడ్డే తమ బిడ్డ అనుకుని, యశోదానందులూ, వ్రేపల్లెవాసులూ పొంగిపోయారు.*


*అలా కృష్ణుడు యశోదా తనయుడిగా, నందనందనుడిగా దినదినప్రవర్థమానం కాసాగాడు. కంసునికి దూరంగా గోకులంలో తమ బిడ్డ పెరుగుతున్నాడు, అదే పదివేలు అనుకున్నారు దేవకీ వసుదేవులు.*


*లేకలేక కలిగిన పుత్రుడు శ్రీకృష్ణుడు. దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశాన్ని గుర్తెరిగి, సాక్షాత్తూ భగవంతుడే తనకి జన్మించాడని ఆనందించాడు నందుడు. విష్ణుభక్తుడతను. భక్తితో పుత్రోత్సాహం చేశాడు.* 


*పూర్వజన్మలో నందుడు ఒక వసువు. అతని పేరు ద్రోణుడు. యశోద పూర్వజన్మలో కూడా అతని భార్యే! అప్పటి ఆమె పేరు ధర. వారు విష్ణుభక్తులూ, పుణ్యాత్ములూ అయిన కారణంగానే శ్రీకృష్ణుడు వారి బిడ్డ అయినాడు*


*‘‘గొప్పబిడ్డను కన్నావు తల్లీ! నీ బిడ్డ చూడముచ్చట అనిపిస్తున్నాడు. కనడం ఆలస్యమయినా బంగారంలాంటి బిడ్డని కన్నావు.’’ అన్నారు గోపకాంతలు. యశోదను అనేక విధాల అభినందించారు. కృష్ణుణ్ణి పన్నీట జలకమాడించి, జోలపాడారు. అష్టమినాడు జన్మించాడు కృష్ణుడు. గోకులంలో ఆనాడు గొప్ప పండుగ చేసుకున్నారు. అదే ‘గోకులాష్టమి’గా ప్రఖ్యాతి చెందింది.*


*బాలకృష్ణుడు ఉట్లను చేజిక్కించుకునేవాడు. అందిన వెన్నను ఆబగా తినేవాడు. పాలు తాగేవాడు. అదే తర్వాతి రోజుల్లో ‘ఉట్లపండుగ’ అయింది. రోహిణీనక్షత్రాన జన్మించిన కృష్ణుడు మేనమామ కంసుణ్ణి వధించాడు. అందుకే కాబోలు, ఈనాడు ఎవరయినా రోహిణీ నక్షత్రాన జన్మిస్తే ‘మేనమామ’ గండం అంటున్నారు.*


*కంసుడు:దురాలోచనలు:~*


*దేవకి అష్టమగర్భంలో మగపిల్లవాడు జన్మిస్తాడు. ఆ బుడతడి చేతిలోనే తను హతమవుతానని భావించిన కంసునికి దేవకి అష్టమగర్భంలో ఆడపిల్ల జన్మించడం, ఆమె నిన్ను హతమార్చేవాడు పుట్టాడు, పెరుగుతున్నాడని చెప్పడం నమ్మలేనిజాలనిపించాయి. ఆ నిజాలను ఆలోచిస్తూ నిద్రకు దూరమయ్యాడు కంసుడు. ఆహారం కూడా రుచించడం లేదతనికి. ఏం చెయ్యాలి? తనని హతమార్చేవాడు పుట్టాడన్నది విష్ణుమాయ. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరుగుతున్నాడు? వాణ్ణి తెలుసుకోవడం ఎలా? పరిపరివిధాల ఆలోచించి, ఆపై సలహాలకూ, సూచనలకూ మంత్రివర్గసమావేశాన్ని ఏర్పరిచాడు కంసుడు. మంత్రివర్గం, పరిజనులూ అతనికంటే క్రూరులు. వారంతా మరింతగా కంసుణ్ణి రెచ్చగొట్టారు. విష్ణుమూర్తిపట్ల అతనికి ఉన్న ద్వేషాన్ని పెంచి పెద్దదాన్ని చేశారు. కంస మహారాజుని చంపేవాడు యాదవకులంలోనే జన్మిస్తాడని తెలిసింది కనుక, యాదవ కులాన్నంతటినీ జల్లెడ పడితే సరి, దొరికిపోతాడన్నారు. గొల్లపల్లెలన్నీ గాలిద్దాం అన్నారు. పసిబాలుర ఉసురుతీద్దామన్నారు. ప్రతి ఊరిలోని పసిపిల్లలందరినీ చంపేద్దాం. చంపేస్తే ప్రమాదం ఇంకేముంటుంది? అన్నారు.*


*ప్రధానంగా వసుదేవుని భార్యలూ, నందగోపుడూ నివసించే గోకులాన్ని ఓ కంట కనిపెట్టుకుని ఉందామన్నారు. వారి మాటలు బాగున్నాయనిపించింది కంసునికి.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️