20, మార్చి 2025, గురువారం

శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః 

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ (11)


ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః 

తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః (12)


యజ్ఞయాగాలతో మీరు దేవతలను సంతృప్తి పరచండి. పాడిపంటలు లాంటి సమృద్ధులిచ్చి వారు మీకు సంతోషం కలగజేస్తారు. పరస్పర సద్భావం పరమ శ్రేయస్సు మీకు చేకూర్చుతుంది. యజ్ఞాలతో తృప్తిపడ్డ దేవతలు మీ వాంఛితాలు నెరవేరుస్తారు. దేవతలిచ్చిన సుఖభోగాలు అనుభవిస్తూ, వారికి మళ్ళీ ఆ సంపదలో కొంత కూడా అర్పించనివాడు దొంగ.

కామెంట్‌లు లేవు: