29, జనవరి 2021, శుక్రవారం

స్వగృహ

 S A V Foods

స్వగృహ ఆకెళ్ల  ఊరగాయలు 


ఉసిరికాయ

చింతకాయ 

పండుమిర్చి

మామిడి తొక్కుపచ్చళ్ళు 

మామిడి ముక్కల పచ్చడి    

మెంతికాయ

ఆవకాయ 

మాగాయ

గోంగూర 

టమాటో 

నిమ్మకాయ

వంగపండు ఊరగాయ 

కొత్తిమీర ఊరగాయ  

ఉసిరి ఆవకాయ 


పుట్నాల  పొడి

కందిపొడి

ఇడ్లి కారంపొడి 

కరివేపాకు కారం పొడి 

వెల్లుల్లి కారంపొడి 

పల్లీలపొడి 

కూరపొడి 


అన్ని రకాల ఊరగాయ పచ్చళ్ళు, పొడులు ఆర్డరుపైచేసి ఇవ్వబడును కావలసిన వారు సంప్రదించగలరు.

Phone no. 9441593152

Akella Savithri 

Malkajgiri

Hyderabad

ఋచీక మహర్షి

 మన మహర్షులు -8



 ఋచీక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మహానుభావుడైన ఔర్వుని కుమారుడే   మన ఋచీక మహర్షి.


ఋచీక మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు. 


ఒకనాడు గాధి అనే రాజు కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాధి రాజు దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు.


పాపం గాధిరాజు గారికి ఋచీక మహర్షికి తన కూతురు సత్యవతినిచ్చి పెళ్ళి చేయ్యాలంటే బాధగా అనిపించింది. కాని ఏం చేస్తాడు? మహర్షి అడగడానికి వచ్చాడంటే అదేదో భగవంతుడే సంకల్పించి వుంటాడనుకుని ఎందుకయినా మంచిదని ఒక షరతు పెట్టాడు మహర్షీ ! నువ్వు వాయువేగంతో సమానమైన వేగం వున్నవి, నల్లని చెవులు

తెల్లని శరీరాలు వున్న వెయ్యి గుర్రాలు తీసుకురా, అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఋచీక మహర్షి సరేనని వెళ్ళిపోయాడు.


ఋచీక మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి, తిరిగి అవి వరుణదేవుడి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాడు.


 వెంటనే తన తపశ్శక్తితో వరుణలోకానికి వెళ్ళి వరుణుడికి వచ్చిన విషయం చెప్పాడు. 


వరుణదేవుడు ఋచీక మహర్షికి నమస్కారం చేసి, కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదా! అని చెప్పి 'తురంగ తీర్థం'లో స్నానం

చేయించి వెయ్యి గుర్రాలు ఇచ్చి పంపాడు. 


వెయ్యి గుర్రాలను తీసుకుని గాధి మహారాజుకిచ్చి అతని కూతురు సత్యవతిని వివాహం చేసుకున్నాడు ఋచీక మహర్షి.


ఋచీక మహర్షి భార్యను తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేదమంత్రాలతో అగ్ని దేవుడికి ఆహుతి చెయ్యడానికి తయారు చేసిన అన్నం భార్యచేత తినిపించాలనుకున్నాడు


స్వామీ! నా తల్లికి కూడ ఒక కొడుకుని ప్రసాదించండి అంది సత్యవతి. ఈ అన్నం మేమిద్దరం తింటాము అని చెప్పింది.


 ఋచీక మహర్షి ఇద్దరికి విడి విడిగా పెట్టి పండ్లు మొదలయినవి తెచ్చుకోడానికి అడవికి వెళ్ళాడు.


ఆయన వచ్చేలోపు హడావిడి గా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆ హావిర్భాగం తినేశారు... ఆ తొందరలో ఒకరిది మరొకరు తీసికొన్నారు..


ఋచీక మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకుని భార్యని పిలిచి మంత్రజలం చల్లిన అన్నాన్ని, నేను చెప్పినట్లు కాకుండ మార్చుకుని తిన్నారు. నీకు క్షత్రియ థర్నాలున్న కొడుకు, నీ తల్లికి వేదాంతవేది, మహాతపస్సంపన్నుడు అయిన కొడుకు పుడతారు అన్నాడు.


 సత్యవతి భయపడి క్షమించమని భర్తని వేడుకుంది.


 ఋచీక మహర్షి జరగవల్సింది

జరిగిపోయింది. ఇది దైవ నిర్ణయం ఇంక చెయ్యగలిగింది ఏమీ లేదు అన్నాడు


కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు, ఆమె తల్లికి విశ్వామిత్రుడు అనే కొడుకు పుట్టారు. 


 ఋచీక మహర్షి సంసారం వదిలి పెట్టేసి భగవంతుడిలో చేరిపోవడానికి బయలుదేరాడు. 


వెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నదీరూపంలో ఉండేలా వరం ఇచ్చాడు.


 ఆ నదే కౌశికీ నది. గొప్ప పుణ్య తీర్థంగా పేరు పొందింది


చదివేశారా... ఋచీక మహర్షి గురించి!


చూసారా మరి  పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఎన్ని అనర్ధాలు జరిగిపోతాయో ..


అందుకే చక్కగా పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలన్న మాట....


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

యజ్ఞోపవీతం

 *యజ్ఞోపవీతం* 


*యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని అంటారు.*


*దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.*


*’సూచనాత్ బ్రహ్మతత్త్వ స్య వేదతత్త్వస్య సూచనా త్  తత్సూత్ర ముపవీతత్వాత్, బ్రహ్మ సూత్రమితి స్మృతమ్’!!*


*బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేద తత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మ సూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి.*


 *ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.*


*యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి.*


*యజ్ఞోపవీతం పరమ పవిత్ర మైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.*


*యజ్ఞోపవీతాన్ని నవ తంతువు లతో (తొమ్మిది దారపు పోగులతో) నిర్మించాలి.*


*ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -*


*‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయే హోగ్నిస్థథైవ చ తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా పంచమే పితృ దైవత్యం షష్ఠేచైవ ప్రజా పతిః సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ సర్వే దేవాస్తు నవమే ఇత్యే తాస్తంతు దేవతాః’!!*


*మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువు లో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగ దేవత, నాలుగవ తంతువు లో సోమదేవుత, ఐదవ తంతువులో పితృ దేవత లు, ఆరవ తంతువు లో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయు దేవుడు, ఎనిమిదవ తంతువు లో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.*


*‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేద ఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.*


*’తిథివారం చ నక్షత్రం తత్త్వ వేదగుణాన్వితమ్ కాల త్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’*


*ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది.*


*తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాల లోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాల లోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.*


*‘యజ్ఞోపవీతం’ తొంభై యారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠ స్మృతి’ చెబుతోంది.*


*’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతి కాక్షరీ తస్మాచ్చ తుర్గుణం కృత్వా బ్రహ్మతంతు ముదీరయేత్’*


*నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలు గానే ఉపదేశించబడింది.*


*అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం.*


*గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.*


*యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.*


*’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్, తద్ధార్యముపవీతం స్యాత్, నాతిలంబం నచోచ్చ్రితమ్, ఆయుర్హ రత్యతిహ్రస్వం అతి దీర్ఘం తపోహరమ్, యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!*


*అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.*


*బ్రహ్మచారి ఒక యజ్ఞోప వీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి.*


*వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.*


*యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాల ను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీత ధారణ, విసర్జనలు పనికి రావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోప వీతాలను మార్చుకోవాలి.*


*యజ్ఞోపవీతం ధారణ మంత్రం:-*


*“ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః”.*

*ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి.*


*యజ్ఞోపవీతం విసర్జన మంత్రం:-*

*ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మ వర్భో దీర్ఘాయు రస్తుమే*

------------------------^--------

*ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.*


*తీసివేసేటప్పుడు పాదాలకు తగలకుండా నడుము నుంచి క్రిందకు తీసివేసి ఇంటి చూరుపై గాని చెట్లపై గాని ఎవరూ త్రొక్కకుండా ఉండే విధంగా కానీ లేక ఏదైనా నదిలో గాని విసర్జన చేయాలి.*


*యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి.*


*ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే!*


*వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి.*


*యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సు కోసం ఉపయోగ పడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు.

🙏🙏🙏#సర్వంశివసంకల్పం🙏🙏🙏

సుభాషితమ్

 🙏 *శుభోదయమ్*🙏

🌸 *సుభాషితమ్* 🌸 


శ్లో||  రోగార్దతా నఫలాన్యాద్రయన్తే

నవై లభన్తేవిషయేషు తత్త్వమ్

దుఃఖోపేతా రోగిణో నిత్యమేవ

నబుధ్యన్తే ధనభోగాన్నసౌఖ్యమ్!!


*విదురనీతి*


తా|| రోగపీడితులు ఫలములుతిని ఆనందింపలేరు...... 

విషయములలోని సారము పొందలేరు...... 

రోగము కలవారు నిత్యము దుఃఖించుచున్నవారై ధనభోగములు, అన్నము వీటి సౌఖ్యముననుభవింపజాలరు....... 

🙏💖🌷

మూర్తీభవించిన దత్త స్వరూపం..*

 *మూర్తీభవించిన దత్త స్వరూపం..*


"మీ గురించి లోకం ఏమని అనుకుంటున్నదో ఒక్కసారన్నా పట్టించుకున్నారా?..ఎవడో దారినపొయ్యే దిగంబరుణ్ణి "స్వామీ..స్వామీ.." అనుకుంటూ పిచ్చి లో పడ్డారని..మీ మొహాన ఆ మాయగాడు ఏదో మత్తు మందు చల్లాడనీ..లంకెబిందెలు అప్పనంగా మీకు దొరుకుతాయని  మీరిద్దరూ అతని చుట్టూ భజన చేస్తున్నారని లోకం కోడై కూస్తున్నది..ఇప్పటికైనా నా మాట వినండి..వాడి మాయలో పడకండి.." అంటూ ఆ వచ్చినావిడ మా తల్లిదండ్రులకు శతవిధాలా నూరిపోస్తున్నది..మా అమ్మా నాన్న శాంతంగా వున్నారు..ఇంత ఉపోద్ఘాతామూ ఎందుకంటే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారిని మా అమ్మానాన్న సాక్షాత్తూ దత్తావతారంగా నమ్మి..ఆయనకు ఆశ్రయం కల్పించే ఆలోచనలో ఉన్నందుకు ఆరోజుల్లో మా బంధువుల్లో ఏర్పడిన అభిప్రాయం తెలియచేసేటందుకు..


శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసుకునే రోజుల్లో మా తల్లిదండ్రులకు (శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్లే మా తల్లిదండ్రులని నేను పదే పదే చెప్పనక్కరలేదు..పాఠకులకు ఆ విషయం తెలుసు..) పరిచయం అయిన క్షణం నుంచే ..స్వామివారు సాధారణ మానవ మాత్రుడు కాదనీ..ఒకానొక సిద్ధపురుషుడో..లేక ఆ త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడో..ఈ రూపంలో అవతరించాడనీ..ప్రఘాడంగా విశ్వసించారు..క్రమంగా శ్రీ స్వామివారితో వీళ్ళిద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడటం..స్వామివారు తన తపోసాధనకు ఆశ్రమం అవసరమని తలచి..అందుకు కావాల్సిన భూమిని మా తల్లిదండ్రులను అడగటం..వారూ సంతోషంగా స్వామివారు కోరినంత భూమిని విరాళంగా ఇవ్వడం..అందులోనే శ్రీ స్వామివారి ఆదేశం మేరకు శ్రీ మీరాశెట్టి గారు ఆశ్రమం నిర్మించి ఇవ్వడం వంటి పరిణామాలు జరిగిపోయాయి..


శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణానికి ముందుగా కొద్దిరోజుల పాటు మా ఇంట్లో విడిది చేసిన విషయం పాఠకులకు గుర్తు వుండే ఉంటుంది..సరిగ్గా ఆ సమయం లోనే..మా ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన మా బంధువుల ఆవిడ పై విధంగా వ్యాఖ్యానించింది..ఆవిడ మా ఇంటికి రాత్రికి వచ్చే ఆఖరి బస్సులో వచ్చింది..ఆ సమయానికి స్వామివారు తాను ఉంటున్న గది లోకి వెళ్లి ధ్యానం చేసుకోసాగారు..అందువల్ల స్వామివారిని చూసే అవకాశం ఆవిడకు కలుగలేదు..కానీ తాను అనదల్చుకున్న మాటలన్నింటినీ..ఆ రాత్రివేళే..తాను నిద్ర పోకుండా..మా అమ్మానాన్న లను నిద్ర పోనివ్వకుండా..మళ్లీ తానెక్కడ మర్చిపోతానో అన్నట్లుగా గబ గబా చెప్పేసింది..


"అమ్మా..నువ్వు ఇంక పడుకో..మేమూ పడుకుంటాము..రేపుదయం పెందలాడే లేచి పనులు చేసుకోవాలి.." అని మా నాన్నగారు కొద్దిగా విసుగ్గా చెప్పిన తరువాత ఆవిడ నిద్ర పోయారు..


ఉదయం నాలుగు గంటల వేళ..శ్రీస్వామివారు గది నుంచి బైటకు వచ్చారు..గది ముందున్న పారిజాతం చెట్టు వద్ద పది నిమిషాలు నిలబడ్డారు..శీతాకాలంలో పారిజాత పుష్పాలు బాగా పూస్తాయి..పైగా వెన్నెల రోజులు..ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి..మెల్లిగా నడుచుకుంటూ ఆవరణ అంతా తిరుగసాగారు..మొగలిచెర్ల లోని  మా ఇంటి వద్ద స్వామివారు ఉన్న ఇరవై రోజుల్లో..కనీసం పది పన్నెండు సార్లు ఈ దృశ్యాన్ని మా అమ్మా నాన్న గార్లతో పాటు పిల్లలం మేమూ చూసివున్నాము..స్వామివారు మా ఇంటి ఆవరణలో తిరిగే సమయం లో ఏదో ఒక స్తోత్రాన్ని..అది విష్ణు సహస్రనామం కావొచ్చు..లలితా సహస్ర నామాలు కావొచ్చు..మధురమైన కంఠంతో ఆలపిస్తూ తిరిగేవారు..అదొక అద్భుత స్వరం..మళ్లీ మళ్లీ వినాలనిపించే గాత్రం..ఆ ప్రభాత వేళ..ఒకరకమైన భక్తి భావం తరంగాల్లా మా యింటి ఆవరణ అంతా వ్యాపించి పోయేది..


అలా స్వామివారు ఆవరణ అంతా తిరిగి తన గదికి పోయేముందు..మా ఇంటి ముందు నిలబడ్డారు..అప్పటికి చీకట్లు తొలగి..వెలుతురు మెల్లిగా వస్తోంది...సరిగ్గా ఆసమయం లోనే..రాత్రి వచ్చినావిడ నిద్ర లేచి..బావి వద్దకు వెళ్లాలని..బైటకు వచ్చింది..స్వామివారు ఎదురుగ్గా నిలబడి వున్నారు..ఆయన ముఖం చిరునవ్వు తో ఉంది..దిగంబరంగా తన కెదురుగ్గా నిలబడి ఉన్న స్వామివారిని చూసినావిడ..ఒక్కక్షణం నిర్ఘాంత పోయింది..అప్రయత్నంగా చేతులు రెండూ జోడించి నమస్కారం చేసింది..ఒక్కసారి కూలబడి నట్లు..నేలమీద కూర్చుని..తన చేతులతో స్వామివారి పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకున్నది.."స్వామీ..స్వామీ.." అనే రెండక్షరాల పదం తప్ప మరో మాట మాట్లాడలేకుండా ఉన్నది..స్వామివారు తన కుడిచేతిని ఆమె నెత్తిన పెట్టి.."పెద్దదానివి అయ్యావు..దైవాన్ని తలుచుకో..నామ జపం చెయ్యి.." అని చెప్పి..వెనక్కు తిరిగి తన గది కి వెళ్లిపోయారు..


మరో రెండు నిమిషాలకు ఆవిడ తెరుకున్నది..వెంటనే మా అమ్మ దగ్గరకు పరుగులాంటి నడకతో వచ్చి.."ప్రభావతీ..స్వామివారు నా నెత్తిన చెయ్యి పెట్టి నామ జపం చేసుకో అని చెప్పారు..మహానుభావుడి దర్శనం పొద్దునే అయింది..గొప్ప యోగి పుంగవుడు మీ ఇంట్లో కాలుమోపాడు..మీ దంపతులు చేసుకున్న పుణ్యం..నా నోటికొచ్చినట్లు వాగాను..తప్పు తల్లీ..మీ నమ్మకమే నిజం..ఆయన దిగంబరుడు కాదమ్మా..సాక్షాత్తూ దత్తాత్రేయుడే..నాకు అలానే కనిపించాడు..దత్తస్వరూపమే మీ ఇంట్లో ఉంది.." అని కన్నీళ్ల పర్యంతం అవుతూ చెప్పింది..


ముందురోజు రాత్రి ఆవిడ మాట్లాడిన మాటలకు..అత్యంత సులభంగా స్వామివారు తానెవరో ఆమెకు నిరూపించి..ఆవిడ వాచాలత్వాన్ని శాశ్వతంగా ఆపడమే కాకుండా..ఆవిడకు మోక్ష మార్గాన్ని కూడా చూపారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా ఆవిడ మొగలిచెర్ల కు వచ్చి స్వామివారి సమాధి వద్ద నిలబడి..తన నెత్తిమీద చేయిపెట్టి..స్వామివారు చెప్పిన మాటలను మననం చేసుకునేది..ఆవిడ జీవించి ఉన్నంత కాలమూ స్వామివారిని తలుచుకుంటూనే ఉండేది..స్వామివారి నే స్మరిస్తూ తన అరవయ్యో ఏట పరమపదించారు ఆవిడ..ద్వేషం నిండిన మనసులో భక్తిని స్థిరపరచారు స్వామివారు.. 


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ప్రశాంతతకి లాజిక్కు*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

😘 *ప్రశాంతతకి లాజిక్కు*


గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు పంప్ చేస్తుంది. మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది.


ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది.


గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం వ్యాకోచించటానికి (అంటే రిలాక్స్ కావటానికి). ఈ 0.5 సెకన్ల రిలాక్స్ టైమ్ లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి శుభ్రపడుతుంది. ఈ రిలాక్స్ టైమ్ తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు.


*మీరు టెన్షన్ లో గానీ కోపంతో గానీ ఉంటే ఏమవుతుంది? మీ మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకన్ల టైమ్ రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్ కి 0.8 కి బదులు 0.3 + 0.4 = 0.7 టైమ్ మాత్రమే తీసుకుంటుంది. నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి (రిలాక్సేషన్) 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది*.


ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని మీ శరీర అవయవాలని సరిగా శుభ్రపరచలేకపోతుంది.


*కనుక కోపపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఇతరులమీద కోపం, ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 సార్లు కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది*.


ఇంతే. 

*గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది*


☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️

మోక్షం

 🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️                        

మోక్షం 

   మోక్షం సాధించి పొందేది కాదు . ఉన్నదాన్ని తెలుసుకోవడమే . నీవు శరీరం కాదు . నీవు మనస్సు  కాదు . 

నీవు ఆత్మవు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మోక్షం . ఆత్మను తెలుసుకోవడానికి  ఊరక  

ఉండటం తప్ప ఏమీ చేయనక్కర లేదు . నామ రూప గుణాలు అనే వేషం వేసుకొని జీవునిగా ఉన్నది బ్రహ్మమే 

అని గుర్తించు . నేనే బ్రహ్మమును . బ్రహ్మమే నేను అని జీవించు . యిదే మోక్షము . 

    ఎంతకాలము నీ మనస్సు పనిచేస్తుందో అంతకాలం నీవు భగవంతుని చేరలేవు . మనస్సును ఖాళీ చేసి 

అన్నింటినీ సాక్షిగా చూడు . దేహ తాదాప్యం చెందినవాడికే బంధం . మనస్సులో ఉన్న భావాలకే  బంధం  . 

మనస్సులో ఏ భావాలు లేకపోతె , బంధం లేదు . బంధం లో ఉన్నాను అనుకునేవాడు మోక్షం కోసం ప్రయత్నం 

చేస్తాడు . బంధం లేకపోతె మోక్షం లేదు  . బంధముక్తులకు అతీతంగా ఉండేదే నీ నిజ స్థితి . ఇదె  జీవన్ముక్త స్థితి . 

     పూర్వ జన్మలో అజ్ఞానం తో చేసిన కర్మలకు ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తూ ఉన్నాము . ఈ జన్మలో 

ఆత్మజ్ఞానం తెలుసుకొన్నావు . తెలుసుకొన్న ఆత్మజ్ఞానాన్ని త్రికరణ శుద్ధి గా ఆచరించు . యిదే నీకు ఆఖరి జన్మ 

అవుతుంది . 

    బంధ మోక్షాలు రెండు అబద్ధాలే . మనస్సు చేత కల్పించబడ్డాయి . నీకు పుట్టుక లేదు చావు లేదు . నీకు 

పరమాత్మకు భేదమే లేదు . అజ్ఞానం ముడి విడిపోవడమే మోక్షం . జ్ఞానం తో కూడిన నిర్మల చిత్తమే మోక్షం . 

మనో నాశనమే నిజమైన స్వేచ్ఛ . బ్రతికి ఉండగా , మనస్సు లోని స్థితిలో ఎవరు ఉంటారో వారికే మోక్షం . 

" మోక్షం కావలి " అన్న సంకల్పం కూడా బంధమే . మనస్సును 100% ఖాళీ చేసి , బ్రహ్మనిష్ఠ యందు ఉండుటే 

మోక్షం. 

 🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️

ధార్మికగీత -125*

 ☘☘☘☘☘☘☘☘☘☘☘☘

                  *ధార్మికగీత -125*

                     **************

   *శ్లో:- అత్యల్ప మపి సాధునాం ౹*

         *శిలా     లేఖేవ      తిష్ఠతి ౹*

         *జల   లేఖేవ   నీచానామ్౹*

         *యత్ కృతం తత్ వినశ్యతి౹౹*

                         *****

*భా:-  సత్పురుషులు చేసేది కొంచె మైనప్పటికిని, అది శిలాక్షరాల వలె శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కాని నీచులు చేసేది నీటి వ్రాత వలె ఎప్పటి కప్పుడే చెరిగిపోతుంది.*


☘☘☘☘☘☘☘☘☘☘☘☘

చీమ మిడత కథ

 చీమ మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది .


ఒరిజినల్ కథ :


ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .


ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :


చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .

మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది . 

NDTV , CNN IBN , Times Now , India Today, tv 9 , మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని , అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది . 

విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .

రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు . 

ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .

.

.

జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .

.

.

.

కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .

.

.

.ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .

.

.

.

మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు

ఉదంక మహర్షి ఆశ్రమానికి

 ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకానగరానికి వెడుతూ ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఉదంక మహర్షి ఆయన్ని పూజించి స్వామి! నువ్వు సంధి చెయ్యకలిగి కూడ కౌరవులకీ, పాండవులకీ యుద్ధం జరిగేలా ఎందుకు చేశావు ? అని అడిగాడు


శ్రీకృష్ణుడు ఉదంక మహర్షితో సత్త్వ, రజ, తమోగుణాలు నావశంలో ఉంటాయి మరుత్తులు, వసువులు అందరూ నాలోంచే పుట్టారు. ఓంకారంతో ఉన్న వేదాలు నేనే నాలుగు ఆశ్రమాలు, అన్ని కర్మలు, అన్ని మోక్షాలు నావశంలో ఉంటాయి. మనస్సు చేసే ధర్మాలన్నింటికి కారణం నేనే. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఈ మూడూ నేనే. లోక రక్షణకోసం అధర్మాన్ని జయించి ధర్మాన్ని కాపాడతాను. కౌరవులు అధర్మం గల పన్లే చేశారు, వాళ్ళని చంపడం కోసమే యుద్ధం జరిగేలా చేశానని చెప్పాడు.


అప్పుడు ఉదంక మహర్షి విశ్వరూపం చూపించమని అడిగి విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆయన రూపాన్ని చూసి నా జన్మ ధన్యమైందని ఆనందించాడు.


శ్రీకృష్ణుడు  ఉదంకుడుకి బ్రతికినంత కాలం నువ్వు తల్చుకోగానే వర్షాలు పడతాయని వరమిచ్చాడు

ఆ మేఘాన్ని 'ఉదంకమేఘం' అంటారు


ఉదంకుడు బ్రతికినంతకాలం లోకాన్ని ఉద్ధరించడానికే బ్రతికి చివరకి మోక్షం పొందాడు.


ఉదంక మహర్షి మనం గురుభక్తితో, స్వార్ధం లేకుండ అందరి కోసం మంచి పనులు

చెయ్యడం ఎలాగో తెలియచెప్పాడన్నమాట.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

మన మహర్షులు - 7

 మన మహర్షులు - 7


ఉదంక మహర్షి

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ఉదంక మహర్షి భృగువంశంలో పుట్టాడు. గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు. 


చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఉదంక మహర్షి చదువయిపోయిందని గౌతమ

మహర్షి చెప్పలేదు. ఉదంకుడు కూడ అలా సేవ చేస్తూనే ఉండిపోయాడు. 


ఒకసారి అడవినుంచి కట్టెల మోపు తీసికొచ్చి కిందపడేసినప్పుడు ఉదంకుడి జుట్టు దాంట్లో చిక్కుకుని కట్టె పుల్లలతో పాటు ఊడి వచ్చేసింది. ఆ ఊడిపోయిన జుట్టు తెల్లగా ఉండడం చూసి ఉదంకుడు అయ్యో! నా బాల్యం, యౌవనం అంతా ఇక్కడే గడిచిపోయింది. నా చదువు ముసలితనం వచ్చినా పూర్తవలేదని బాధపడ్డాడు.


గౌతమ మహర్షి ఉదంకుణ్ణి పిలిచి నాయనా ! బాధపడకు నీ గురుభక్తిని పరీక్షించాను నీ ముసలితనం పోయేలా చేస్తాను. అని చెప్పి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు.


మన ఉదంకుడు అంతటితో ఊరుకున్నాడా.... స్వామీ ! మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. గౌతమ మహర్షి నీ గురుభక్తియే నాకు గురుదక్షిణ. ఇంకేమీ వద్దు నాయనా ! అన్నాడు. 


ఉదంకుడు గురువుగారి భార్యను అడిగాడు.... మిత్రసహుడు అనే మహారాజు భార్యకి కుండలాలు ఉన్నాయి, అవి నాకు కావాలి అనడిగింది ఆవిడ.


ఉదంకుడు బయలుదేరి మిత్రసహుడనే రాజు దగ్గరకి వచ్చాడు.


ఉదంకుడు మహారాజా ! నీ భార్య కుండలాలు నాకు ఇప్పించు. అవి నా గురువుగారి భార్యకి ఇవ్వాలి .అని అడిగాడు..


పరససాధ్వి అయిన రాణి ఉదంకుడు శుచియై వచ్చిన తర్వాత మాత్రమే దర్శనమిచ్చి ఆనందం గా తన కుండా లాలను తీసి ఇస్తుంది.


మిత్రసహమహారాజు ఉదంక మహర్షిని మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. భోజనం చేస్తుండగా అన్నంలో తలవెంట్రుకలు వచ్చాయి. 


ఉదంక మహర్షి రాజుని గుడ్డివాడయిపోతావని శపించాడు. రాజు తిరిగి ఉదంక మహర్షిని శపించాడు. ఉదంక మహర్షి రాజుకిచ్చిన శాపం ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు. 


ఉదంక మహర్షి కుండలాల్ని ఒక పట్టుబట్టలో చుట్టుకొని తీసికెడుతున్నాడు. మధ్యలో ఆకలికి ఆగలేక ఒక చెట్టెక్కి ఆ మూటని ఒక కొమ్మ మీద పెట్టి పండ్లు కోసుకుంటున్నాడు ఆ మూట క్రింద పడిపోయింది


ఆ మూటని ఒక నాగరాజు తీసికుని పుట్టలోంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఉదంక మహర్షి ఆ పుట్టిని తవ్వడం మొదలెట్టాడు. ఇది చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఉదంకా ఆ కుండలాలు పాతాళలోకంలో ఉన్నాయి. నువ్వు పడుతున్నది అనవసర శ్రమన్నాడు. ఉదంకుడు ఎక్కడ ఉన్నా సరే అవి నా గురువుగారి భార్యకివ్వాల్సిందే అని మళ్ళీ తవ్వడం మొదలు పెట్టాడు.


అప్పుడు ఇంద్రుడు ఉదంకుడు ఉపయోగిస్తున్న కర్రకి వజ్రాయుధానికి వున్నంత శక్తినిచ్చాడు. అలా తవ్వుతుంటే భూదేవి భయపడిపోయి పాతాళానికి దారిచ్చేసింది. పాతాళ లోకంలో కుండలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఉదంకుడు నాగుల్ని ప్రార్థించాడు.


ఉదంకుడు నలుపు తెలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళనీ, చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులనీ, పెద్ద గుఱ్ఱమెక్కి ఉన్న ఒక గొప్ప పురుషుణ్ణి చూసి స్తోత్రం చేశాడు. వాళ్ళు నీకేం కావాలో అడగమన్నారు


ఉదంక మహర్షి ఈ నాగులన్నీ నాకు వశమయిపోవాలన్నాడు. అయితే నువ్వు ఈ గుఱ్బం చెవిలో ఊదమన్నాడు ఆ మహాపురుషుడు. ఉదంకుడు అలా చెయ్యగానే పాతాళలోకమంతా కూడ మంటలు వచ్చేశాయి. తక్షకుడు అనే పాము తక్షణమే కుండలాలు తెచ్చి ఉదంకుడకి ఇచ్చేసింది.


 ఉదంకుడు దివ్యాశ్వం  మీద కూర్చుని గౌతమ మహర్షి ఇంటికి వచ్చాడు. గురుపత్ని అహల్య కుండలాలు ధరించి పూజ పూర్తిచేసుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టింది.


ఉదంక మహర్షి గురువుగార్ని దివ్యపురుషుడు, ఆరుగురు కుమారులు, తెలుపు నలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు స్త్రీలు వీళ్ళందరూ ఎవరు స్వామీ? అని అడిగాడు గౌతమ మహర్షి నాయనా ! ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు, ఆరుగురు


కుమారులున్నారే వాళ్ళు ఆరు ఋతువులు, ఆడవాళ్ళని ఇద్దర్ని చూశావు కదా! అది రాత్రి పగలు, ద్వాదశ చక్రం చూశావు కదా అది పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం ఇంద్రుడికి స్నేహితుడున్నాడే పర్జన్యుడు అతడే ఆ గజ్జం. ఇవన్నీ చూడగలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. 

ఇంక నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమన్నాడు.


ఆ తర్వాత కాలం లో ఉదంకుడు జనమేజయ మహారాజుతో సర్పయాగం చేయించాడు. అస్తీక మహర్షి వచ్చి ఆ యాగం ఆపించి నాగుల్ని రక్షించాడు.


ఉదంక మహర్షి శివుడ్ని గురించి గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నువ్వు లోకం కోసం మంచి పనులు చేస్తూ జీవించు అని దీవించాడు ఉదంకుణ్ణి.


ఆ కాలంలో  ధుంధుడు అనే రాక్షసుడు   బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం తీసుకుని దేవతల్ని, గంధర్వుల్ని., రాక్షసుల్ని అందర్నీ చంపేస్తున్నాడు. సముద్రం దగ్గర పెద్ద గొయ్యి చేసుకుని దాంట్లో పడుకుంటూ వుండేవాడు. వాడు విడిచిన గాలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చి పెద్దగాలి దుమారం లేపేది. అది వచ్చినప్పుడు ఏడు రోజులదాకా చెట్లు ఊగుతూనే ఉండేవి. అందరూ చాలా భయపడ్తున్నారని ఉదంక మహర్షి బృహదశ్వుడు అనే రాజుకి చెప్పి ఆ రాక్షసుణ్ణి చంపించమని అడిగాడు. బృహదశ్వుడి కొడుకు కువలాశ్వుడు తండ్రి మాట ప్రకారం ఆ రాక్షసుణ్ణి చంపేశాడు

సూర్యోదయం


 

Painting


 

పశుసంబంధమైన ధర్మసూత్రములు -

 పశుసంబంధమైన ధర్మసూత్రములు  -


 *  పశువుల కాపరికి యజమాని కూలి ఇవ్వనిచో యజమానికి పది ఆవుల పాలు పిండి ఇచ్చి తానొక్క ఆవుపాలు కూలికింద తీసుకొనవచ్చు . జీతము లేనప్పడుదియే కూలి .


 *  కంటికి కనపడనిది , పురుగులచే , కుక్కలచే తినబడినది , పల్లపు గుంటలు మొదలగు వానిలో పడి చచ్చినది , కాపరి లేనప్పుడు పారిపోయినది అయిన పశువులకు పశుకాపరిదే భాద్యత. కాపరి తెచ్చి ఇవ్వవలెను.


 *  దొంగలు దొమ్మిచేసి పశువులను అపహరించుకు పోయిన విషయము కాపరి వెంటనే యజమానికి దగ్గరలో ఉన్నప్పుడే చెప్పినచో కాపరి యజమానికి పశువులను ఇచ్చుకోవాల్సిన బాధ్యత లేదు .


 *  చచ్చిన పశువు చెవులు , చర్మం , తోక , వెంట్రుకలు , గోరోచనము వీటిని యజమానికి ఇవ్వవలెను. తక్కిన గిట్టలు , కొమ్ములు మున్నగునవి అన్నియు యజమానికి చూపించి మరలా తాను తీసికొనవలెను.


 *  దారిలోను , బూడిదలోను , గోవుల మందలోను మలమూత్రాలను విసర్జించరాదు . గోవుకి ఎదురుగా మలమూత్రాలను విసర్జించరాదు.


 *  నీరు తాగుచున్న ఆవును గాని , పాలు తాగుచున్న దూడను గాని నివారించరాదు. పాలు తీయునప్పుడు మూత్రం పోయుటను నివారించవచ్చు. ఇతరుల దూడలు పాలు తాగుచున్నప్పుడు వారికి చెప్పకూడదు. ఇంద్రధనుస్సును ఆకాశమున చూచి ఆ దోషమును ఎరిగిన వాడై ఉండి ఇతరులకు చూపరాదు.


 *  తుంటరివి , ఆకలిరోగములు గలవి , కొమ్ములు లేనివి , గుడ్డివి , గిట్టలు లేనివి , తోకలేనివి అగు వృషభములను కట్టిన బండ్లలో ప్రయాణం చేయరాదు .


 *  మచ్చికపడినవి , వడిగా నడుచునవి , శుభలక్షణాలు కలిగినవి , వన్నెయు , ఆకారం కలిగి ఉండునవి అగు ఎద్దులను గట్టిన బండ్లలో మునికోలతో పొడవవలెను.


 *  చతుష్పాద జంతువు విషయమై అపద్ధం చెప్పినవాడు అయిదుగురు బంధువులను , గోవు విషయమై అపద్ధం చెప్పినవాడు పదిమందిని, గుఱ్ఱముల విషయమై అపద్ధం చెప్పినవాడు వంద మందిని , మానవుల విషయమై అపద్ధం చెప్పినవాడు వెయ్యిమంది బంధువులకు చంపిన పాపమును పొంది నరకమునకు పోవును .


 *  ఈని పది దినములు గూడ గడవని గోవులను , చక్రము , శూలము మొదలగు గుర్తులు వేసి విడిచిన ఎద్దులను , హరిహరాదుల ముద్రలు వేసి ఉన్న ఎద్దులను , కాపరులతో ఉన్నను లేక పొలము నందు ప్రవేశించి నస్యములను తినుచున్నను వానిని దండింపరాదు.


 *  గోవుల పైన కూర్చుని స్వారి చేయరాదు . కాని బండికి కట్టవచ్చు.


 *  ఎవడు జంతువులను కట్టుట, చంపుట, వంచుట చేయుటకు ఇష్టపడడో అతడు సకల భూతములకు హితము గోరువాడు ఎల్లప్పుడూ తరగని మోక్షరూపం అగు ఆనందమును పొందును.


 *  బ్రాహ్మణుల గోవులను అపహరించినప్పుడు , గొడ్డుటావులతో బరువులు మోయించుటకై ముక్కుత్రాడు వేసినప్పుడు , యాగముల కొరకు పశువులను అపహరించినప్పుడు వెంటనే అపహరించినవాని కాలు సగము నరికివేయవలెను .


 *  మార్గములో గ్రామ సమీపేతర ప్రదేశమునందలి పొలములలో గోవులు మేసినచో  కాపరి కి జరిమానా వేయవలెను . తరువాత గోవులు తినిన మేతఫలమును కాపరి గాని , యజమానిగాని పొలము యజమాని కి ఇవ్వవలెను.


 *  వెంటనే ఊడ్చుట, గోమయముతో అలుకుట , గోమూత్రము మున్నగునవి చల్లుట , పైమట్టి ఎత్తి తవ్వి ఎత్తిపోయుట , గోవుని ఒక రాత్రి , ఒక పగలు కట్టివేయుట  ఈ అయిదింటిచేత భూమి పరిశుద్ధతనొందును.


 *  వర్షం కురియుట వలన నేలను చేరునవి , పశువుల తాగగానే దప్పిక తీరునవి , గంధము , రసము , రంగు వానితో కూడిన ఉదకములు అనగా నీళ్లు పరిశుద్ధములు.


 *  సకల జంతువుల ప్రాణ సంరక్షణార్థమై రాత్రిగాని , పగలుగాని ఎల్లప్పుడూ తన శరీరముకు కష్టం కలిగినను భూమిని చూచుచు  నడవవలెను .


 *  ఒక గ్రామము చుట్టును నూరు ధనువులంతా ( ధనువు అనగా నాలుగు మూరలు ) ప్రదేశము పశువుల మేతకును , గాలి మొదలగు వీచుటకు భూమి బీడుగా వదలవలెను. పట్టణం అయినచో దీనికి మూడురెట్లు ప్రదేశం బీడుగా వదలవలెను .


 *  పైన చెప్పిన బీడు భూమి చుట్టూ ఆవరణ లేక పైరు సరిగ్గా లేని స్థలము నందు గోవు మేసిన యెడల ఆ కాపరిని గాని , యజమానిని గాని దండించరాదు.


 *  పశువుల మేయు బీడు భూమి చుట్టు నుండు ఆవరణ ఒంటెలు తలయెత్తి చూచిన లోపలి ప్రదేశము కనపడని యంతఎత్తున చుట్టూ రక్షణ ఏర్పరచవలెను . కుక్కలు , పందులు లోపల దూరకుండా కిందవైపు సందులను మూయవలెను .


 *  గ్రామసమీపాన దారికి దగ్గరగా ఉండు చుట్టూ వేసిన ఆవరణలో గోవులు దూరి మేసినచో ఆ గోవుని దండింపక గోపాలకునికి జరిమానా విధించవలెను .


 *  ఎండకాయుచున్నను , వర్షం కురియుచున్నను , ముందుగా శక్తికొలది గోవులను సంరక్షించిన తరువాతయే తన్ను రక్షించుకొనవలెను .


 *  గోవును దర్భ తాళ్లతో , రెల్లు తాళ్లతో దక్షిణాభిముఖముగా కట్టివేయవలెను . ఈ తాళ్లకు నిప్పు అంటుకొని కాలిపోయినను గోవు చిన్న గాయాలతో బయటపడును . కట్టివేసినప్పుడు గోవు అగ్నిచేత దగ్ధం అయినపుడు ప్రాయశ్చిత్తం ఏమియును లేదు .


 *  రాజ్యము నందు గోవులు దీనంగా ఉన్నయెడల రాజులకు అశుభం. కాళ్లతో భూమిని గోకిన రోగములు సంభవించును . కనుల నుంచి నీరు కార్చుచున్న మృత్యువు కలుగును. యజమాని చూచి భయపడి అరిచినచో దొంగలు వస్తారు.


 *  కారణం లేకుండా గోవు అరుచుచున్న అనర్థం కలుగును. రాత్రివేళ అయినచో భయం కొరకగును. ఎద్దు అరిచినచొ శుభం కలుగును. ఈగలచే గాని , కుక్కలచేగాని మిక్కిలి విరుద్ధమై అరిచినచో వెంటనే వర్షం కురియును.


 *  గోవులు అంబా అనుచూ ఇంటికి వచ్చిన గోశాల వృద్ది అగును. గోవులను సేవించుచూ వచ్చిననను గోశాల వృద్ది అగును. తడిసిన అవయవములతో గాని , నిక్కబొడిచిన వెంట్రుకలతో గాని సంతసించుచూ వచ్చిన గోవులు మంచివి. ఈ రీతినే గేదెలు కూడా ఉండును .


 *  చూలుతో ఉన్నట్టియు, తగిన వెలకు దొరికినట్టియు , దానము వలన దొరికినట్టియు , కూలి సొమ్ముల వలన దొరికినట్టియు , యుద్ధాదులలో గెలిచి తెచ్చినవియు , ఇంటబుట్టినవియు , ఏదేని వ్యాధిచే యజమాని వలన విడకాబడినవియు , తానుపోషించునవియగు గోవులు మిక్కిలి మంచివి.


 *  దూడలేని ఆవుపాలు , గర్భముతో ఉన్న గోవుని పితకరాదు. ఈనిన పది దినముల వరకు పాలు పితికినవాడు నరకమునకు పోవును .


 *  బలం లేనిదియు , వ్యాధిగ్రస్తం అయినదియు , పొర్లినదియు , కవల దూడలు పెట్టినదియు అగు గోవు పాలు పితకరాదు .


 *  పుట్టిన రెండు నెలల వరకు దూడను తీయకుండానే పాలు పితకవలెను . మూడొవ నెలలో రెండు చన్నులు దూడకు వదిలి రెండు చన్నులు పితకవలెను. నాలుగొవ నెలలో మూఁడు భాగములు యజమాని తీసుకుని ఒక భాగము దూడకు విడిచిపెట్టవలెను . అటు తరువాత పశువు యొక్క బలాబలాలను బట్టి పాలు తీసుకొనుట మంచిది .


 *  ఆషాడ పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి, పుష్యపౌర్ణమి , మాఘపౌర్ణముల యందు పాలు పితకక దూడలకు వదలవలెను .


                              సమాప్తం 


 


   గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రామాయణమ్ 200

 రామాయణమ్ 200

...........................

రామాసకలసద్గుణాభిరాముడవు ,

మహాదైశ్వర్యవంతుడవు !నీతో స్నేహము నా అదృష్టము .

.

రఘుకులతిలకుడవు నీతో స్నేహము నా బందువులందిరలో నన్ను గొప్పగా నిలబెట్టును.

 అది నాకు గర్వకారణము .

.

రామా! నేను కూడా నీకు తగిన స్నేహితుడనే .

నా గుణగణముల గురించి నేనుగా నీకు చెప్పజాలను నీవే ముందుముందు తెలుసుకొనగలవు .

.

రామా ,మనస్సును సదా అదుపులో ఉంచుకొన్న నీ వంటి మహాత్ముల ప్రేమ ,ధైర్యము,కూడా స్థిరముగానే యుండును .

.

రామా ,ధనికుడైనా ,దరిద్రుడైనా ,సుఖాలలో ఉన్నాదుఖాలలోఉన్నా , ఎన్నిదోషములున్నప్పటికీ స్నేహితుడే ఉత్తమమైన గతి .

.

రామా స్నేహమనగా ఇట్టిది అని తెలిసిన వారు తన ధన ,ప్రాణములు స్నేహితునికోరకు త్యజించుటకు కూడా వెనుకాడరు.ఇదినాది, ఇది నీది అను భేద భావము వారిరువురి మధ్య పొడసూపదు.

.

అని అంటున్న సుగ్రీవుని మాటలకు అవును నిజమన్నట్లుగా రాఘవుడు తల ఊపాడు .

.

రామా నా అన్నతో నాకు కలిగిన వైరకారణము చేత . నా ఈ నలుగురు సహచరులతో నేను ఇచ్చట నివసించుంటిని. నా ప్రాణములు తీయించ వలెనని నా అన్న ఎన్నో సార్లు ప్రయత్నించినాడు .

.

మా అన్న పంపిన వారినందరినీ యమసదనమునకు పంపినాను . 

.

మా అన్నయ్య నా భయమునకు హేతువు! అందు వలననే మీరు కనపడినప్పుడు వాలి పంపిన వారేమోనని భయపడినాను .

.

భయమునకు కారణ మున్నప్పుడు భయపడుట సహజముకదా.

.

రామా నేను శోకాక్రాంతుడనై ఉన్నాను. స్నేహితుడవు కనుక నా కష్టములు నీ ముందు వెల్లడించు చున్నాను .

.

అని అత్యంత దీనముగా ,బాధ తో పలికిన సుగ్రీవుని మాటలు విని రాముడు ,

అసలు నీకు మీ అన్నకు వైరము ఏర్పడుటకు గల కారణమేమి అని ప్రశ్నించాడు .

.

వూటుకూరు జానకిరామారావు